నేటి వారధికి..సారథి ఆయనే..

Chinagollapalem Island Bridge Construction Credit Goes To YS Rajashekar Reddy - Sakshi

సాక్షి, పెడన : కడలి సుడులలో కొట్టుకుంటూ బాహ్య ప్రపంచంతో బంధం లేని దీవికి వారధి రూపంలో దారి కల్పించిన దేవుడు వైఎస్‌ రాజశేఖరరెడ్డి. ఇసుక తిన్నెలనే రహదారిగా చేసుకుని అలసిన పాదాల కష్టాలకు విరామాన్నిస్తూ సొగసైన రహదారి నిర్మాణం ఆయన సొంతం. గుక్కెడు నీటి కోసం అలమటించి పోతున్న వేల గొంతుల దాహం తీర్చే ఆలోచన చేసిన అపరభగీరథుడు. రెండు జిల్లాలను వంతెనతో అనుసంధానం చేసిన మహోన్నతుడు.

అభివృద్ధికి ఆయన చిరునామా..పేదవాడి కష్టం తెలిసిన ప్రేమమూర్తి దివంగత మహానేత వైఎస్‌.రాజశేఖరరెడ్డి. పెడన నియోజకవర్గంలోనే అరుదైన అభివృద్ధి సొంతం చేసుకున్న ఘనత ఆయనది. తీరప్రాంతమే కాక జిల్లాకు శివారునున్న కృత్తివెన్ను మండలానికి 2007 సంవత్సరంలో నాటి ముఖ్యమంత్రి వైఎస్సార్‌ రాకతో అభివృద్ధికి బీజం పడింది. నాడు కృష్ణా, పశ్చిమ గోదావరి జిల్లాలను కలుపుతూ ఉప్పుటేరుపై నిర్మించిన వంతెన ప్రారంభోత్సవానికి వైఎస్సార్‌ వచ్చారు.  బాహ్య ప్రపంచంతో రవాణా సంబంధం లేని చినగొల్లపాలెం దీవి వంతెనకు శంకుస్థాపన చేశారు.

దీవిలో దారి..
ఇసుక తిన్నెలపై ప్రయాణంతో నిత్యం ప్రత్యక్ష నరకం చూస్తున్న దీవి వాసుల కోసం ఎంతో వ్యయ ప్రయాసలైన పడవలపై ఇసుక, కంకర తరలించి  రహదారి నిర్మాణానికి కృషి చేసిన ఘనత ఆయనదే. 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top