ఆదివారం ఉదయం...సుమారు 9 గంటల సమయం... పట్టణమంతా ప్రశాంతంగా ఉంది. ఇంతలో టెక్కలి ఆర్టీసీ కాంప్లెక్స్ సమీపంలో
టెక్కలి రూరల్ : ఆదివారం ఉదయం...సుమారు 9 గంటల సమయం... పట్టణమంతా ప్రశాంతంగా ఉంది. ఇంతలో టెక్కలి ఆర్టీసీ కాంప్లెక్స్ సమీపంలో ఎదో అలికిడి. ఏమిటాని ఆరా తీస్తే.. అక్కడికి సమీపంలో నిరుపయోగంగా ఉన్న బావిలో ఓ పసికందు మృతదేహం కనిపించడం చర్చనీయాంశమై.. కలకలం రేగింది. స్థానికులు కొంతమంది ఆ ప్రాంతం వైపు బహిర్భూమికి వెళ్లి బావిలో చూడగా పసికందు మృతదేహం కనిపించడంతో వెంటనే పోలీసులకు సమాచారం అందజేశారు. నెలలు నిండినట్టుగానే ఉన్న ఈ పసికందు మృతదేహాన్ని చూసిన స్థానికులు పలు అనుమానాలు వ్యక్తం చేశారు. ఆ ‘కన్న’తల్లి ఎవరోగాని.. ఏ కష్టమొచ్చిందో.. ఎలాంటి పరిస్థితుల్లో ఇలా పొత్తిళ్లలోని పసిగుడ్డును పాడుబడిన బావిలో పడేసిందంటూ విచారం వ్యక్తం చేశారు. విషయం తెలిసుకున్న ఎస్‌ఐ పి.న ర్సింహమూర్తి సంఘటన స్థలానికి చేరుకుని మృతి చెందిన పసికందు ఆడ లేక మగ అనే వివరాలు సేకరించి దర్యాప్తు చేస్తున్నారు.