ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈనెల 6న జిల్లాకు రానున్నారు. నీరు-చెట్టు కార్యక్రమంలో భాగంగా జిల్లాలో పర్యటించనున్న సీఎం,
విజయనగరం కంటోన్మెంట్, గరుగుబిల్లి: ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈనెల 6న జిల్లాకు రానున్నారు. నీరు-చెట్టు కార్యక్రమంలో భాగంగా జిల్లాలో పర్యటించనున్న సీఎం, తోటపల్లి ప్రాజెక్టు పనులకు కూడా పరిశీలిస్తారు. బుధవారం ఉదయం 10.30 గంటలకు హెలికాఫ్టర్‌లో విజయనగరం చేరుకుని, తోటపల్లి ప్రాజెక్ట్ సందర్శనకు వెళ్తారు. తోటపల్లి ప్రాజెక్టు ద్వారా లక్షా 20వేల ఎకరాలకు సాగునీటిని ఈ ఖరీఫ్ నాటికే ఇస్తామని ఇప్పటికే చంద్రబాబు ప్రకటించారు. దీనిపై పలు వీడియో కాన్ఫరెన్సుల ద్వారా స్పష్టం చేశారు. ఈ ప్రాజెక్టు పనులు శరవేగంగా చేయాలని, త్వరలోనే ఈ ప్రాజెక్టుపనులను పరిశీలిస్తానని కూడా చంద్రబాబు ఇటీవలే అన్నారు.
ఈ నేపథ్యంలో ఆయన పర్యటనకు రానున్నారు. ఈమేర కు సోమవారం సాయంత్రం కలెక్టర్ ఎంఎం. నాయక్‌తోపాటు పార్వతీపురం ఎమ్మెల్యే బి.చిరంజీవులు,డుమా పీడీ పి.ప్రశాంతి, ఏఎస్‌పీ రాహుల్‌దేవ్ శర్మ, ఐటీడీఏ పీఓ శ్రీకేష్ లట్కర్,ఆర్‌డీఓ ఆర్.గోవింధరావు, ఏడిషనల్ పీడీ అప్పల నాయుడు,ఎస్‌ఈ డి.తిరుమల రావు,ఈఈ హెచ్.మన్మధరావు తదితరులు తోటపల్లి ప్రాజెక్టు పనులను పరిశీలించారు. సీఎం చంద్రబాబుకు ఏయే పనులను చూపించాలి తదితర అంశాలపై చర్చించారు. కాగా సీఎం చంద్రబాబు పర్యటన ఉండటంతో రాష్ట్రనీటిపారుదల శాఖ ప్రధానకార్యదర్శి ఆదిత్యనాథ్ దాస్ తోటపల్లిప్రాజెక్టు పనులను పరిశీలించేం దుకు మంగళవారం రానున్నారని సమా చారం.