సెల్‌ఫోన్ దొంగతనం కేసులో చర్లపల్లి జైలులో శిక్ష అనుభవిస్తున్న ఖైదీ గురువారం సాయంత్రం గాంధీ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందాడు.
హైదరాబాద్ : సెల్‌ఫోన్ దొంగతనం కేసులో చర్లపల్లి జైలులో శిక్ష అనుభవిస్తున్న ఖైదీ గురువారం సాయంత్రం గాంధీ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందాడు. వివరాల్లోకి వెళ్తే... హైదరాబాద్కు చెందిన శ్రీనివాస్(35) అనే వ్యక్తి చిన్న చిన్న దొంగతనాలు చేస్తూ జీవనం సాగిస్తుండేవాడు. ఈ క్రమంలో గతవారం సెల్‌ఫోన్ చోరీ కింద పోలీసులు అరెస్ట్ చేసి జైలుకు పంపారు. కాగా.. గురువారం అతని ఆరోగ్యం బాలేకపోవడంతో గాంధీ ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ సాయంత్రం మృతిచెందాడు.