బాబూ.. జాబేదీ! | Chandrababu Naidu come job out | Sakshi
Sakshi News home page

బాబూ.. జాబేదీ!

Jul 16 2014 2:18 AM | Updated on Aug 10 2018 8:08 PM

బాబూ.. జాబేదీ! - Sakshi

బాబూ.. జాబేదీ!

బాబు వస్తే.. జాబొచ్చినట్లే... ఇంటికో ఉద్యోగం.. అర్హులైన నిరుద్యోగులందరికీ భృతి. ఇవన్నీ ఎన్నికల సమయంలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు

 భీమవరం అర్బన్ : బాబు వస్తే.. జాబొచ్చినట్లే... ఇంటికో ఉద్యోగం.. అర్హులైన నిరుద్యోగులందరికీ భృతి. ఇవన్నీ ఎన్నికల సమయంలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు యువతకు ఇచ్చిన హామీలు. బాబు వచ్చారు.. కానీ హామీల ఊసు ఎత్తడం లేదు. ఇప్పటికే ఇచ్చిన హామీలు ఒక్కొక్కటిగా కొండెక్కిపోతుంటే.. నిరుద్యోగులు మాత్రం నోటిఫికేషన్ల కోసం ఆశగా ఎదురుచూస్తున్నారు. ప్రభుత్వం ఏర్పడి నెలరోజులు దాటిపోయినా ఇప్పటివరకు ప్రభుత్వ ఉద్యోగాలకు నోటిఫికేషన్ల జారీ ప్రక్రియ ముందుకు సాగకపోవడంతో ఇంకా ఎంతకాలం వేచి చూడాలో అర్థం కావడం లేదని నిరుద్యోగులు వాపోతున్నారు.
 
 జిల్లాలో వివిధ ఉద్యోగాలకు సంబంధించి పోటీ పరీక్షలకు సుమారు లక్షకు పైగా నిరుద్యోగులు సిద్ధమవుతున్నారు. 2011లో రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వం ప్రకటించిన గ్రూప్-1, గ్రూప్-2, గ్రూప్-4 వంటి నోటిఫికేషన్ల తప్ప ఇప్పటివరకు ఎటువంటి నియామకాలు చేపట్టలేదు. సుమారు మూడేళ్లుగా నోటిఫికేషన్ల కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగుల్లో చాలామందికి వయోపరిమితి దాటిపోతోంది. దీంతో వారు ఉద్యోగం కోసం సిద్ధపడాలా? లేక నిరుద్యోగిగానే మిగిలిపోవాలా అని ఆందోళన చెందుతున్నారు. ఉద్యోగుల పదవీ విరమణ వయసు పెంపు విషయంలో చూపించిన శ్రద్ధ, ఉద్యోగ ప్రకటనల జారీలో చూపించాలని నిరుద్యోగులు కోరుతున్నారు.
 
 నిరుద్యోగ భృతికి ప్రామాణికం ఏదీ
 నిరుద్యోగులకు నెలనెలా ఇస్తామన్న భృతికి ప్రామాణికం ఏమిటనేది ఆసక్తిగా మారింది. ఇప్పటికే రైతు రుణమాఫీకి ఒక విధమైన ప్రామాణికం లేనట్లుగానే నిరుద్యోగ భృతి కూడా ఎలా చెల్లిస్తారో తెలియని పరిస్థితి ఏర్పడింది. ప్రస్తు తం రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాలకు వయోపరిమితి 34 సంవత్సరాలుగా ఉంది.  దీనిని పొడిగించి 40 సంవత్సరాలుగా నిర్ణయించి, నిరుద్యోగ భృతిని కొనసాగించాల్సి ఉంది. అప్పుడే నిరుద్యోగులకు మేలు కలుగుతుంది.
 
 వయోపరిమితి పెంచాలి
 ప్రభుత్వ ఉద్యోగాలకు వయోపరిమితి పెంచాలి. ఇప్పటికే ఉద్యోగుల పదవీ విరమణ వయసును 58 సంవత్సరాల నుంచి 60కి పెంచారు. అదేవిధంగా కొత్తగా ఇచ్చే ఉద్యోగాలకు వయోపరిమితిని 34 నుంచి 40 సంవత్సరాలకు పెంచాలి. ఉద్యోగాల విషయంలో ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను నెరవేర్చాలి                  - మెల్లా రాంబాబు, పోటీ పరీక్షదారుడు

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement