‘సాక్షి’పై రాష్ర్టప్రభుత్వ కక్షసాధింపు ఆగలేదు. గతనెలలో కాపు ఉద్యమనేత ముద్రగడ పద్మనాభం దీక్ష సమయంలో ఎంఎస్‌వోలపై
రాజమహేంద్రవరంలో కేసులు
సాక్షి, రాజమహేంద్రవరం : ‘సాక్షి’పై రాష్ర్టప్రభుత్వ కక్షసాధింపు ఆగలేదు. గతనెలలో కాపు ఉద్యమనేత ముద్రగడ పద్మనాభం దీక్ష సమయంలో ఎంఎస్‌వోలపై ఒత్తిడి తీసుకొచ్చి రాష్ర్టవ్యాప్తంగా సాక్షి చానల్ ప్రసారాలను నిలిపివేయించిన రాష్ర్టప్రభుత్వం ఇపుడు సాక్షి దినపత్రికపై కక్షసాధింపు చర్యలు మొదలుపెట్టింది. గతనెల 9 నుంచి 22 వరకు ముద్రగడ దీక్ష, ఆయన ఆరోగ్యంపై రాసిన వార్తలు ప్రజలను రెచ్చగొట్టే విధంగా ఉన్నాయని, కొన్ని కులాల మధ్య గొడవలు పెట్టే విధంగా ఉన్నాయంటూ తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం 3టౌన్ పోలీస్ స్టేషన్‌లో కేసులు నమోదు చేశారు. సెక్షన్ 155(ఎ), 505 రెడ్‌విత్ 34(ఎ) కింద సాక్షి ఎడిటోరియల్ డెరైక్టర్ కె.రామచంద్రమూర్తి, ఎడిటర్ వి.మురళి, రిపోర్టర్లపై కేసులు నమోదు చేశారు.
ముద్రగడ నిరాహార దీక్ష వార్తలు ప్రసారం కాకుండా ఉండటం కోసం మీడియాను నియంత్రించిన రాష్ర్ట ప్రభుత్వం ఇపుడు ‘సాక్షి’ దినపత్రికపై కేసులు బనాయించడం విశేషం. జూన్ 9న కిర్లంపూడిలోని తన నివాసంలో నిరాహార దీక్ష చేస్తున్న సందర్భంగా జిల్లా పోలీసులు ముద్రగడను రాజమహేంద్రవరం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించా రు. ప్రతి రోజు ఆసుపత్రి వద్ద ఏర్పాటు చేసిన మీడియా పాయింట్ వద్దకు వచ్చి ముద్రగడ ఆరోగ్య వివరాలతో కూడిన బులిటెన్‌ను వైద్యులు ప్రకటించేవారు. ఇవే వివరాలు సాక్షితోపాటు మిగిలిన పత్రికలు ప్రచురించారుు. కానీ సాక్షి పత్రికపై కక్ష సాధింపుగా కేసులు నమోదు చేయడం గమనార్హం.