సత్తాచాటిన తెలుగు టైటాన్స్ | Capabilities catina Telugu taitansa | Sakshi
Sakshi News home page

సత్తాచాటిన తెలుగు టైటాన్స్

Aug 20 2014 12:19 AM | Updated on Sep 17 2018 5:17 PM

సత్తాచాటిన తెలుగు టైటాన్స్ - Sakshi

సత్తాచాటిన తెలుగు టైటాన్స్

ప్రో కబడ్డీ విశాఖ అభిమానులకు మధురానుభూతిని పంచింది. విశాఖ వేదికగా నాలుగు రోజుల పాటు సాగిన హోమ్ ఫ్రాంచైజీ పోటీల్లో స్థానిక జట్టు తెలుగు టైటాన్స్‌కు అభిమానులు నీరాజనం పట్టారు.

  • ఉత్సాహంగా ముగిసిన ‘ప్రో’ కబడ్డీ పోటీలు
  • విశాఖపట్నం : ప్రో కబడ్డీ విశాఖ అభిమానులకు మధురానుభూతిని పంచింది. విశాఖ వేదికగా నాలుగు రోజుల పాటు సాగిన హోమ్ ఫ్రాంచైజీ పోటీల్లో స్థానిక జట్టు తెలుగు టైటాన్స్‌కు అభిమానులు నీరాజనం పట్టారు. రాజకీయనేతలు, టాలీవుడ్ తారలు పోటీలను ఆస్వాదించారు.  అందుకు తగ్గట్టుగానే తెలుగు టైటాన్స్ అద్భుతమైన ఆటతీరును కనబరిచారు.

    అప్పటికే టైటాన్స్ నాలుగు వేదికల్లో ఆడి రెండే విజ యాలు సాధించినా...హోమ్ టౌన్‌లో ఏకంగా నాలుగో స్థానంలోకే దూసుకెళ్లారు. ఆడిన నాలుగు మ్యాచ్‌ల్లో తొలి మ్యాచ్ డ్రాగా ముగించినా స్థానిక అభిమానుల ముందు మిగిలిన మూడు మ్యాచ్‌ల్లోనూ టైటాన్స్ చెడుగుడు ఆడేశా రు. ఇక్కడి పోర్ట్ స్టేడియంలో దబాంగ్ ఢిల్లీతో తొలి పదినిమిషాల ఆటలోనే రెట్టింపు స్కోర్‌తో చెలరేగిపోయిన తెలుగు టైటాన్స్ తొలి అర్ధభాగాన్ని 20-12తో అధిక్యంలోకి తీసుకెళ్లారు.  ఏకంగా ప్రత్యర్థి జట్టును మూడుసార్లు ఆలౌట్ చేసి ఆరుపాయింట్లు సాధించారు.  చివరికి 45-26తో మ్యాచ్‌ను ముగించి హ్యాట్రిక్ విజయాన్ని సొంతం చేసుకున్నారు.
     
    పాయింట్లు ఇలా... : టైటాన్స్ రైడింగ్ ద్వారా 26 పాయింట్లు సాధిస్తే టేక్లింగ్‌తో 10, ఆలౌట్‌చేసి ఆరు, ఎక్సట్రాలుగా మూడు పాయింట్లుతో విజయం సాధించారు. దబాంగ్ రైడింగ్‌తో 20 పాయింట్లు సాధించగలిగినా మిగిలిన అంశాల్లో రాణించలేక పరాజయంపాలైంది. డిఫెన్స్‌లో రాజగురు, గోపు, సచిన్ రాణిం చగా, రైడింగ్‌లో రాహుల్,సుఖేష్, విజేంద్ర రెచ్చిపోగా దీపక్ ఆల్‌రౌండ్ ప్రతిభతో హ్యాట్రిక్ నమోదు చేశారు. ఈఎన్‌సీ చీఫ్ సతీష్ సోనీ, వీపీటీ చైర్మన్ ఎం.టి.కృష్ణబాబు, సినీ నటి మంచు లక్ష్మి బెస్ట్‌లకు బహుమతులందించారు. నటుడు సుమంత్ ప్రారంభంలో విశాఖవాసులకు అభివాదం చేశాడు.
     

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement