మరో డీఈ ఔట్ | Cable scam involving another officer to fire | Sakshi
Sakshi News home page

మరో డీఈ ఔట్

Aug 15 2013 4:07 AM | Updated on Sep 1 2017 9:50 PM

కేబుల్ కుంభకోణం లో మరో అధికారిపై వేటు పడింది. ఇప్పటికే ఇద్దరు డీఈలను సరెండర్ చేయగా..

వరంగల్, న్యూస్‌లైన్ : కేబుల్ కుంభకోణం లో మరో అధికారిపై వేటు పడింది. ఇప్పటికే ఇద్దరు డీఈలను సరెండర్ చేయగా.. మరో డీఈని సరెండర్ చేస్తూ ఎన్పీడీసీఎల్ సీఎండీ కార్తికేయ మిశ్రా ఉత్తర్వులు జారీ చేశారు. ప్రస్తుతం సరెండర్ చేసిన నిజామాబాద్ డీఈ సదానందం కేబుల్ కొనుగోలు సమయంలో ప్రధాన పాత్ర పోషించారు. 11 కేబీ ఏబీ కేబుల్ వినియోగం, కొనుగోలుపై విచారణ జరుగుతున్న విషయం విదితమే. శాంపి ల్ టెస్టింగ్ వెళ్లిన ముగ్గురు ఇంజినీర్లలో సదానందం కూడా ఒకరు. టెస్టింగ్, స్టోర్‌లో డం పింగ్ సమయంలోనే కేబుల్ నాణ్యతపై అనుమానాలు వ్యక్తమయ్యాయి.

ఈ తతంగంపై విచారణ సాగుతుండగానే ముగ్గురు డీఈలపై వేటు పడింది. గతంలో కేబుల్ కుం భకోణం విషయంలో బయటకు లీకు చేశారంటూ పలు యూనియన్లు గొడవకు దిగడంతో మనస్తాపానికి గురైన కంపెనీ డెరైక్టర్ రాజేశ్వర్‌రావు రాజీనామా చేశారు.  రాజీనా మా ఆమోదించడంతో పాటు కొత్త డెరైక్టర్‌గా జి.సుదర్శన్‌ను నియమించారు. ఇదే వివాదంలో కరీంనగర్ కన్‌స్ట్రక్షన్ డీఈ గూడూర్ సమ్మిరెడ్డిని అక్కడ నుంచి బదిలీ చేశారు.

ఆయనకు ఎక్కడా పోస్టింగ్ ఇవ్వకుండా ఎన్పీడీసీఎల్ కార్పొరేట్ కార్యాలయంలో సరెండర్ చేస్తూ ఆదేశాలిచ్చారు. అంతేకాకుండా జిల్లా డీఈని గతంలోనే బదిలీ చేశా రు. తాజాగా నిజామాబాద్ కన్‌స్ట్రక్షన్ డీఈ సదానందంను సరెండర్ చేస్తూ బుధవారం సీఎండీ ఉత్తర్వులు జారీ చేశారు. కేబుల్‌ను పరిశీలించకుండా.. నాణ్యత లేకుండా వచ్చి న కేబుల్ వినియోగించినట్లు రూఢీ కావడం తో కరీంనగర్, వరంగల్, నిజామాబాద్ కన్‌స్ట్రక్షన్ డీఈలపై వేటు వేశారు.  
 
కుదిపేస్తున్న కుంభకోణం
 కేబుల్ కుంభకోణం ఎన్పీడీసీఎల్‌ను కుదిపేస్తోంది. కేబుల్ కొనుగోళ్లలో రూ.15 కోట్ల మేర నష్టం వాటిల్లినట్టు భావిస్తున్నారు. పర్చేజ్, కన్‌స్ట్రక్షన్ విభాగాల పాత్రపై విచారణ సాగుతోంది. ఇప్పటికే జిల్లాలో విచారణ ముగియ గా.. ఓ డీఈపై వేటు వేశారు. కరీంనగర్‌లో కూడా ముందుగా ఈ కేబుల్ ఫెయిల్ కావడంపై విచారణ చేపట్టారు. రామగుండం, గోదావరిఖనిలో వేసిన ఈ కేబుల్ విద్యుత్ సరఫరా చేయగానే కాలిపోయింది. ఈ వ్యవహారం ఎన్పీడీసీఎల్‌లో కలకలం రేపింది. ఇప్పటికే నాసిరకం కేబుల్‌ను కొనుగోలు చేసినట్లు, కన్‌స్ట్రక్షన్ అధికారులు ఈ విషయంలో నోరుమెదపలేదనే ఆరోపణలున్నాయి.

కరీంనగర్ జిల్లాలో విచారణ చేసిన అధికారులు రిపోర్టును సీఎండీకి అప్పగించారు. దీంతో ముందుగా అక్కడి కన్‌స్ట్రక్షన్ డీఈ సమ్మిరెడ్డిని బదిలీ చేశారు. అన్ని జిల్లాల్లో విచారణ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో నిజామాబాద్ జిల్లా కన్‌స్ట్రక్షన్ డీఈ సదానందంను కార్పొరేట్ కార్యాలయంలో సరెండర్ చేశారు. దీంతో ముగ్గురు డీఈలపై వేటు పడినట్లైంది. మరో రెండు జిల్లాల్లో ఇంకా విచారణ సాగుతోంది. అయితే డీఈ సదానందం సరెండర్‌లో ఉన్నతాధికారుల మధ్య విభేదాలే కారణమనే ప్రచారం కూడా జరుగుతోంది. అక్కడ కన్‌స్ట్రక్షన్ విభాగం కింద చేస్తున్న పనుల్లో నాణ్యత ఉన్నప్పటికీ... ఆ జిల్లాలో ఇద్దరు ఉన్నతాధికారుల మధ్య గ్రూపు రాజకీయాల కారణంగానే సదానందంపై వేటు పడిందని ఎన్పీడీసీఎల్‌లో ప్రచారం జరుగుతోంది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement