నష్ట పోయిన తెలంగాణకే ప్యాకేజీ ఇవ్వాలి: నాగం | BJP will not change its stand on Telangana, says nagam janardhan reddy | Sakshi
Sakshi News home page

నష్ట పోయిన తెలంగాణకే ప్యాకేజీ ఇవ్వాలి: నాగం

Nov 10 2013 4:21 PM | Updated on Mar 29 2019 9:18 PM

ప్రత్యేక ప్యాకేజీలాంటివి ఏమైనా ఇస్తే నష్ట పోయిన తెలంగాణకే ఇవ్వాలని బీజేపీ నేత నాగం జనార్థనరెడ్డి తెలిపారు.

హైదరాబాద్: ప్రత్యేక ప్యాకేజీలాంటివి ఏమైనా ఇస్తే నష్ట పోయిన తెలంగాణకే ఇవ్వాలని బీజేపీ నేత నాగం జనార్థనరెడ్డి తెలిపారు. సీమాంధ్రకు నష్టం జరిగిందని చెప్పుకుంటున్న నేతలు ఏ నష్టం జరిగిందో చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ రోజు మీడియాతో మాట్లాడిన నాగం..తెలంగాణపై బీజేపీ స్పష్టమైన వైఖరితోనే ఉందని తెలిపారు. తెలంగాణపై ఇంచు కూడా బీజేపీ వెనక్కి జరగదని ఆయన స్పష్టం చేశారు. సీమాంధ్రకు ఎలాంటి నష్టం జరగలేదని నాగం తెలిపారు.

 

హైదరాబాద్‌తో కూడిన తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేయాలని, విభజనతోనే రెండు ప్రాంతాలవారికి సమన్యాయం జరుగుతుందని బీజేపీ నేత, నాగర్ కర్నూల్ ఎమ్మెల్యే నాగం జనార్దన్‌రెడ్డి  గతంలొ స్పష్టంచేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement