భద్రాచలం తెలంగాణదే: జైపాల్ రెడ్డి | Bhadrachalam is a part of Telangana, says Jaipal reddy | Sakshi
Sakshi News home page

భద్రాచలం తెలంగాణదే: జైపాల్ రెడ్డి

Nov 11 2013 3:15 PM | Updated on Sep 2 2017 12:31 AM

భద్రాచలం తెలంగాణదే: జైపాల్ రెడ్డి

భద్రాచలం తెలంగాణదే: జైపాల్ రెడ్డి

భద్రాచలం డివిజన్ తెలంగాణలో భాగమేనని కేంద్రమంత్రి జైపాల్ రెడ్డి స్పష్టం చేశారు.

హైదరాబాద్ : భద్రాచలం డివిజన్ తెలంగాణలో భాగమేనని కేంద్రమంత్రి జైపాల్ రెడ్డి స్పష్టం చేశారు.  తెలంగాణ ప్రాంత నేతలు సోమవారం మంత్రి జానారెడ్డి నివాసంలో భేటీ అయ్యారు. సమావేశం అనంతరం జైపాల్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ హైదరాబాద్‌ను కేంద్రపాలిత ప్రాంతం చేయడం.. భద్రాచలంను సీమాంధ్రలో కలుపడమనేది కొందరి అభిప్రాయం మాత్రమేనని దానిపై  అధికారిక వివరాలు లేవన్నారు.  అఖిలపక్ష  సమావేశంలో తెలంగాణ ప్రాంత వివరాలను అధిష్టానం పెద్దలకు వివరిస్తామని జైపాల్ రెడ్డి తెలిపారు.

ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్‌ను.. రెవెన్యూ జిల్లా వరకే పరిమితం చేయాలని జైపాల్ రెడ్డి అభిప్రాయపడ్డారు. ఉమ్మడి రాజధాని పదేళ్లే కదా అని హైదరాబాద్పై భారం వేస్తామంటే అంగీకరించేది లేదని ఆయన అన్నారు.  అఖిలపక్షంలో తెలంగాణ ప్రాంత అభిప్రాయాలను..
డిప్యూటీ సీఎం దామోదర రాజనర్సింహ వివరిస్తారన్నారు. కాగా   విలేకరులు అడిగిన కొన్ని  ప్రశ్నలకు జైపాల్ రెడ్డి సూటిగా  సమాధానం చెప్పకుండా  ..భవిష్యత్తును చెప్పేంత జ్యోతిష్కులం కాదని అన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement