'చేనేత కార్మికులకు వెంటనే రుణమాఫీ చేయాలి' | AP Handloom weavers leader Pola Ramanjaneyulu press meet | Sakshi
Sakshi News home page

'చేనేత కార్మికులకు వెంటనే రుణమాఫీ చేయాలి'

Jul 23 2015 4:49 PM | Updated on Jun 1 2018 8:36 PM

ప్రభుత్వం ఎన్నికల హామీల్లో చేనేత కార్మికుల రుణాలు మాఫీ చేస్తామని చెప్పి ఇంతవరకూ ఒక్క పైసా కూడా రుణమాఫీ చేయలేదని చేనేత కార్మికుల మండలి రాష్ట్ర అధ్యక్షులు పోలా రామాంజనేయులు పేర్కొన్నారు.

గార్లదిన్నె (అనంతపురం) : ప్రభుత్వం ఎన్నికల హామీల్లో చేనేత కార్మికుల రుణాలు మాఫీ చేస్తామని చెప్పి ఇంతవరకూ ఒక్క పైసా కూడా రుణమాఫీ చేయలేదని చేనేత కార్మికుల మండలి రాష్ట్ర అధ్యక్షులు పోలా రామాంజనేయులు పేర్కొన్నారు. గురువారం మండల కేంద్రంలో విలేకరులతో మాట్లాడుతూ.. చాలామంది కుటుంబాలు చేనేత(మగ్గం) పని చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారన్నారు. అలాగే ప్రభుత్వం చేనేత కార్మికులకు ప్రతి నెలా ముడిసరుకుల కోసం రూ.600లు ఇచ్చేదన్నారు. కానీ మార్చి నెల నుండి సబ్సిడీ కూడా ఇవ్వలేదన్నారు. అదేవిధంగా ప్రస్తుతం ప్రభుత్వం అదించే సబ్సిడీ రూ.1500 లకు పెంచాలని డిమాండ్ చేశారు. అలాగే వివిధ బ్యాంకుల్లో చేనేత కార్మికులకు తీసుకున్నపాత రుణాలన్నీ మాఫీ చేయాలన్నారు. బ్యాంకుల్లో వెంటనే లక్ష రూపాయుల లోను ఇవ్వాలన్నారు.

చేనేత రుణాలు మాఫీ కాకపోవడం, మార్కెట్‌లో గిట్టుబాటు ధర లేకపోవడంతో చేనేత కార్మికులు తీవ్ర ఇబ్బందులు పడుతూ మరింత అప్పుల ఊబిలో కూరుకుపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అలాగే రుణ మాఫీ కోసం ప్రభుత్వం వివరాలను బ్యాంకుల వారీగా అడిగితే కేవలం గార్లదిన్నె మండలంలోని బ్యాంకులు మాత్రం చేనేత వివరాలు పంపకపోవడం దారుణమన్నారు.ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి వెంటనే చేనేత రుణాలు మాఫీ చేసి చేనేత కార్మికులను ఆదుకోవాలన్నారు. అనంతరం డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని తహశీల్దార్ నాగరాజుకు, కెనరా బ్యాంకు మేనేజర్‌కు అందజేశారు. ఈ కార్యక్రమంలో చేనేత కార్మికుల మండలి ఉపాధ్యక్షులు అక్బర్, మహమ్మద్ రఫీ, ఆదినారాయణ, నాగరాజు,యల్లప్ప,గౌస్ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement