
సాక్షి, అమరావతి : తెలుగు రాష్ట్రాల్లోని ప్రాజెక్టులు జలకళను సంతరించుకోవటంతో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. ఈ మేరకు ఆయన ట్విటర్‌లో ఓ సందేశాన్ని పోస్ట్ చేశారు. అన్నదాత ముఖాల్లో ఆనందాలు నింపేలా ప్రకృతి సహకరించడం శుభసూచకమని అన్నారు. శ్రీశైలం, నాగార్జున సాగర్ జలాశయాలు పూర్తి స్థాయి నీటి నిల్వ సామర్థ్యాన్ని చేరుకుంటున్నాయని తెలిపారు. దిగువ ప్రాంతాల ఆయకట్టును తడిపేందుకు కృష్ణమ్మ పరవళ్లు తొక్కుతోందని సీఎం వైఎస్ జగన్ పేర్కొన్నారు.
శ్రీశైలం, నాగార్జున సాగర్ జలాశయాలు పూర్తిస్థాయి నీటినిల్వ సామర్ధ్యాన్ని చేరుకుంటున్నాయి. దిగువ ప్రాంతాల ఆయకట్టును తడిపేందుకు కృష్ణమ్మ పరవళ్లు తొక్కుతోంది. అన్నదాతల ముఖాల్లో ఆనందాలు నింపేలా ప్రకృతి సహకరించడం రైతన్నలకు శుభసూచకం.
— YS Jagan Mohan Reddy (@ysjagan) August 12, 2019