చంద్రబాబు సింగపూర్ పర్యటన రద్దు | ap cm chandra babu naidu singapore tour cancelled | Sakshi
Sakshi News home page

చంద్రబాబు సింగపూర్ పర్యటన రద్దు

Mar 25 2015 4:40 PM | Updated on May 29 2019 3:19 PM

చంద్రబాబు సింగపూర్ పర్యటన రద్దు - Sakshi

చంద్రబాబు సింగపూర్ పర్యటన రద్దు

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సింగపూర్ పర్యటన రద్దయింది.

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సింగపూర్ పర్యటన రద్దయింది. ఇదే సమయంలో ప్రధాని నరేంద్రమోదీ కూడా సింగపూర్ పర్యటనకు వెళ్తున్నందున.. చంద్రబాబు పర్యటనకు అనుమతి ఇవ్వలేమని కేంద్ర విదేశాంగ శాఖ తెలిపింది.  దాంతో బాబు పర్యటన రద్దయింది.

ఆధునిక సింగపూర్ వ్యవస్ధాపక ప్రధాని, పితామహుడు లీ క్వాన్ యూ మరణించడంతో.. ఆయన అంత్యక్రియలకు హాజరయ్యేందుకు చంద్రబాబు నాయుడు సింగపూర్ వెళ్లాలని తలపెట్టిన విషయం తెలిసిందే. సీఎం వెంట రాష్ట్ర ప్రభుత్వ సమాచార సలహాదారు డాక్టర్ పరకాల ప్రభాకర్, సీఎం కార్యాలయ ముఖ్య కార్యదర్శి సతీష్‌చంద్ర కూడా సింగపూర్‌కు వెళ్లాలనుకున్నారు. అయితే.. విదేశాంగ శాఖ అనుమతి ఇవ్వకపోవడంతో ఇప్పుడు పర్యటన రద్దయింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement