మరో 10 రోజుల్లో హైదరాబాద్‌లోని ఏపీ శాసనసభ, శాసన మండలి అమరావతికి తరలివస్తాయని శాసన మండలి డిప్యూటీ చైర్మన్ సతీష్‌రెడ్డి చెప్పారు.
శాసన మండలి డిప్యూటీ చైర్మన్ సతీష్‌రెడ్డి
బి.కొత్తకోట: మరో 10 రోజుల్లో హైదరాబాద్‌లోని ఏపీ శాసనసభ, శాసన మండలి అమరావతికి తరలివస్తాయని శాసన మండలి డిప్యూటీ చైర్మన్ సతీష్‌రెడ్డి చెప్పారు. ఆదివారం ఆయన చిత్తూరు జిల్లా బి.కొత్తకోట మండలంలో విలేకరులతో మాట్లాడారు. వీటి తరలింపుతోనే ఈ రెండిటికీ చెందిన అధికారులు, ఉద్యోగులు, సిబ్బంది కూడా తరలి వస్తారని తెలిపారు.
హైకోర్టు, కొన్ని కార్పొరేషన్ల విభజన జరగాల్సివుందని, దీనిపై రెండు ప్రభుత్వాల తరపున చర్చలు సాగుతున్నాయని చెప్పారు. దీంతో రాష్ట్రపాలన పూర్తిస్థాయిలో అమరావతి నుంచే సాగుతుందని చెప్పారు.