సింహపురిలో అనూ సందడి

Anu Emmanuel Launch Kanchi Lalitha Silks Showroom Nellore - Sakshi

నెల్లూరు(బృందావనం): ‘నా పేరు సూర్య’.. ‘మజ్ఞు’.. ‘అజ్ఞాతవాసి’, తదితర సినిమాల్లో హీరోయిన్‌గా నటించిన అనూ ఇమాన్యుయెల్‌ శుక్రవారం నగరంలో సందడి చేశారు. నగరంలోని మాగుంట లేఅవుట్లో గల కంచి లలిత శిల్క్స్‌ వంద రోజుల వేడుకల్లో భాగంగా చేపట్టిన కాస్ట్‌ టు కాస్ట్‌ సేల్‌ అమ్మకాలను ముఖ్యఅతిథిగా హాజరైన ఆమె ప్రారంభించారు. ఈ సందర్భంగా షోరూమ్‌ అధినేత సంగటి రామచంద్రారెడ్డి మాట్లాడారు. ఈ నెల 23 వరకు తమ కంచి లలిత శిల్క్స్‌కు చెందిన  సొంతమగ్గాలపై తయారైన వస్త్రాలను ఉత్పత్తి ధరలకే కస్టమర్లకు విక్రయించనున్నామని తెలిపారు. సొంత మగ్గాలపై పట్టుతో నేయించిన చీరలను చాలెంజ్‌ ధరలకు విక్రయిస్తున్నామని వివరించారు. నెల్లూరు మహిళా లోకం, యువతులు మెచ్చే పలు రకాల డిజైన్లతో వస్త్రాలను విక్రయిస్తున్నామని తెలిపారు. కంచి లలిత శిల్క్స్‌ మేనేజర్‌ సత్యనారాయణరాజు పాల్గొన్నారు.

పట్టు చీరలకు పెట్టింది పేరు కంచి లలిత శిల్క్స్‌
మేలిమి పట్టుతో నేసిన కంచి పట్టు చీరలకు నెల్లూరు కంచి లలిత శిల్క్స్‌ పేరుగాంచిందని అనూ ఇమ్మానుయెల్‌ తెలిపారు. కంచిపట్టు చీరలను ధరించి ముసిముసి నవ్వులతో అభిమానుల కేరింతల నడుమ ఫొటోలకు పోజులిచ్చారు. నెల్లూరు అంటేనే తనకు ఎంతో అభిమానమని, నెల్లూరు రుచులు మరవలేనివన్నారు. నెల్లూరు బిరియానీ, చేపల పులుసును తాను ఎంతో ఇష్టపడతానని, నగరానికి రావడం ఇది రెండో సారని చెప్పారు. అనూ ఇమ్మానుయెల్‌ను చూసేందుకు తరలివచ్చిన అభిమానులతో మాగుంటలేవుట్లో కోలాహలం నెలకొంది. కొందరు ఆమెతో సెల్ఫీలు దిగేందుకు పోటీపడ్డారు.

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top