పార్టీ మారితే అనర్హత వేటు: సంపత్ | Anti defection law applies to registered party too, says VS Sampath | Sakshi
Sakshi News home page

పార్టీ మారితే అనర్హత వేటు: సంపత్

May 25 2014 2:08 PM | Updated on Aug 14 2018 4:32 PM

పార్టీ మారితే అనర్హత వేటు: సంపత్ - Sakshi

పార్టీ మారితే అనర్హత వేటు: సంపత్

రాజకీయపార్టీ గుర్తింపుతో సంబంధం లేకుండా అనర్హత వేటు వర్తిస్తుందని చీఫ్ ఎలక్షన్ కమిషనర్ సంపత్‌ స్పష్టం చేశారు.

న్యూఢిల్లీ: రాజకీయపార్టీ గుర్తింపుతో సంబంధం లేకుండా అనర్హత వేటు వర్తిస్తుందని చీఫ్ ఎలక్షన్ కమిషనర్ సంపత్‌ స్పష్టం చేశారు. ఒక రాజకీయ పార్టీ గుర్తుతో గెలిచి పార్టీ మారితే అనర్హత వేటు వర్తిస్తుందన్నారు. రాజకీయ పార్టీకి గుర్తింపు ఉందా, లేదా అనే అంశంతో సంబంధంలేకుండా అనర్హత వేటు పడుతుందని ఆయన అన్నారు. 
 
రాజ్యాంగంలోని 10వ షెడ్యూల్‌ ప్రకారం ఒక గుర్తుపై గెలిచి మరొక పార్టీలోకి వెళ్తే పార్టీ ఫిరాయింపు నిరోధక చట్టం వర్తిస్తుందని చీఫ్ ఎలక్షన్ కమిషనర్ సంపత్‌ తెలిపారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచిన నంద్యాల ఎంపీ ఎస్పీవై రెడ్డి టీడీపీలో చేరిన నేపథ్యంలో చీఫ్ ఎలక్షన్ కమిషనర్ సంపత్ వ్యాఖ్యలు అత్యంత ప్రాధాన్యతను సంతరించుకున్నాయి. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement