ముఖ్యమంత్రి ఎన్.చంద్రబాబునాయుడు ఈ నెల 8 లేదా 9 తేదీల్లో జిల్లా పర్యటనకు వచ్చే అవకాశం ఉంది. నీరు-చెట్టు కార్యక్రమంలో
ఏలూరు: ముఖ్యమంత్రి ఎన్.చంద్రబాబునాయుడు ఈ నెల 8 లేదా 9 తేదీల్లో జిల్లా పర్యటనకు వచ్చే అవకాశం ఉంది. నీరు-చెట్టు కార్యక్రమంలో భాగంగా ఆయన ప్రతి జిల్లాలో పర్యటిస్తున్న నేపథ్యంలో ఆయన ‘పశ్చిమ’కు వస్తారని సమాచారం. పోలవరం ప్రాజెక్టు ప్రాంతంలో రాత్రి బస చేసే అవకాశం ఉంటుందంటున్నారు. ప్రాజెక్ట్ నిర్వాసితులకు అందుతున్న పరిహారంపై నిర్వాసితులను ఆరా తీసే అవకాశం ఉందని పార్టీ వర్గాల భోగట్టా. అధికారికంగా సీఎం పర్యటన ఖరారు కాలేదు.
టీడీపీ జిల్లా కార్యవర్గ ఎన్నిక 13 తర్వాతే
ఏలూరులో ఈ నెల 10న జరగాల్సిన జిల్లా టీడీపీ నూతన కార్యవర్గ ఎన్నికను వాయిదా వేశారు. ఈనెల 13వ తేదీ తర్వాత జరపాలని నిర్ణయించారు. సీఎం జిల్లా పర్యటనలు చేస్తున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం. పార్టీ జిల్లా అధ్యక్షురాలిగా కొనసాగుతున్న తోట సీతారామలక్ష్మిని అదే పదవిలో కొనసాగించి కార్యదర్శులు, ఉపాధ్యక్ష పదవుల్లో మార్పులు చేసే అవకాశం ఉందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.