ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గం సోమవారం ఉదయం 10 గంటలకు సమావేశం కానుంది. ఈ సందర్భంగా పలు కీలక అంశాలపై నిర్ణయం తీసుకోనుంది.
	హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గం సోమవారం ఉదయం 10 గంటలకు సమావేశం కానుంది. ఈ సందర్భంగా పలు కీలక అంశాలపై నిర్ణయం తీసుకోనుంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన సచివాలయంలో జరిగే ఈ భేటీలో రాజధాని భూసేకరణపై మంత్రివర్గం చర్చించనుంది. ఆర్థికాభివృద్ధి మండలి ఏర్పాటు, రెండంకెల వృద్ధి సాధన తదితర అంశాలపైనా చర్చించనున్నట్లు సమాచారం.
	
	అలాగే విజయవాడ, విశాఖ మెట్రో ప్రాజెక్ట్కు కేబినెట్ ఆమోదం  తెలపనుంది. విజయనగరం జిల్లా భోగాపురం ఎయిర్పోర్ట్ భూసేకరణ ప్రతిపాదనలపైనా చర్చించనుంది. టీటీడీ బోర్డులో తుడా ఛైర్మన్ సభ్యత్వాన్ని రద్దు చేస్తూ మంత్రివర్గం నిర్ణయం తీసుకోనుంది. ఇక జూన్ 2న రాష్ట్ర అవతరణ వేడుకలు, జూన్ 8న  నిర్వహించే పునరంకిత సభలపై కూడా కేబినెట్ సమావేశంలో చర్చకు రానున్నాయి.

 
  
                                                     
                                                     
                                                     
                                                     
                                                     
                         
                         
                         
                         
                        
