అనంతపురంలో రాజధాని రాదు: జేసీ | anantapur will not be the capital, says jc diwakar reddy | Sakshi
Sakshi News home page

అనంతపురంలో రాజధాని రాదు: జేసీ

Jul 26 2014 2:43 PM | Updated on Jun 1 2018 8:39 PM

అనంతపురంలో రాజధాని రాదు: జేసీ - Sakshi

అనంతపురంలో రాజధాని రాదు: జేసీ

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని నగరం అనంతపురంలో ఏర్పాటు కాదని అనంతపురం ఎంపీ జేసీ దివాకర్రెడ్డి వ్యాఖ్యానించారు.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని నగరం అనంతపురంలో ఏర్పాటు కాదని అనంతపురం ఎంపీ జేసీ దివాకర్రెడ్డి వ్యాఖ్యానించారు. కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి వెంకయ్యనాయుడు ఆశీస్సులతో ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి సాధ్యం అవుతుందని, కేంద్రం సహకారంతో అనంతపురం జిల్లాలో పరిశ్రమలు ఏర్పాటవుతాయని ఆయన అన్నారు.

జిల్లా పర్యాటక రంగం అభివృద్ధికి కేంద్రం నుంచి 11 కోట్ల రూపాయల నిధులు మంజూరైనట్లు జేసీ దివాకర్ రెడ్డి తెలిపారు. రాష్ట్ర రాజధాని నగరం గురించిన శివరామకృష్ణన్ కమిటీతో ఓవైపు రాష్ట్ర మంత్రి నారాయణ తదితరులు సమావేశం అవుతున్న నేపథ్యంలో జేసీ దివాకర్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement