'దిక్కుతోచని స్థితిలో రైతన్న' | Akepati Amarnathareddy fires on TDP Govt | Sakshi
Sakshi News home page

'దిక్కుతోచని స్థితిలో రైతన్న'

Aug 24 2018 12:47 PM | Updated on Aug 24 2018 12:51 PM

Akepati Amarnathareddy fires on TDP Govt - Sakshi

వైఎస్ఆర్ జిల్లా: రాష్ట్రంలో రైతాంగం పరిస్థితి చాలా అధ్వాన్నంగా తయారయిందని రాజంపేట వైఎస్సార్‌సీపీ పార్లమెంటరీ అధ్యక్షులు ఆకేపాటి అమర్నాథరెడ్డి అన్నారు. దిక్కుతోచని పరిస్థితిలో రైతు ఉ‍న్నారని తెలిపారు. పడకేసిన ప్రాజెక్టు పనులు వెంటనే పూర్తి చేయాలని డిమాండ్‌ చేశారు. లేదంటే రైతాంగం సాగు, తాగునీరు లేక విలవిలలాడిపోయే పరిస్థితులు తలెత్తే అవకాశం ఉందని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. గతంలో దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి రైతాంగం కోసం 90 శాతం ప్రాజెక్టు పనులు  పూర్తి చేస్తే, మిగిలిన 10% పనులు పూర్తి చేయలేని స్థితిలో సీఎం చంద్రబాబు నాయడు పాలన కొనసాగుతుందని పేర్కొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement