గుండెపోటుతో ‘అగ్రిగోల్డ్‌’ బాధితుడి మృతి | Agrigold victim died | Sakshi
Sakshi News home page

గుండెపోటుతో ‘అగ్రిగోల్డ్‌’ బాధితుడి మృతి

Mar 26 2017 2:41 AM | Updated on May 28 2018 3:04 PM

గుండెపోటుతో ‘అగ్రిగోల్డ్‌’ బాధితుడి మృతి - Sakshi

గుండెపోటుతో ‘అగ్రిగోల్డ్‌’ బాధితుడి మృతి

మరో ‘అగ్రిగోల్డ్‌’ బాధితుడి గుండె ఆగింది. విశాఖ జిల్లా పద్మనాభం మండలం రౌతులపాలేనికి చెందిన కోన శ్రీను (42) అనే వ్యక్తి గుండెపోటుతో మృతిచెందాడు.

పద్మనాభం (భీమిలి): మరో ‘అగ్రిగోల్డ్‌’ బాధితుడి గుండె ఆగింది. విశాఖ జిల్లా పద్మనాభం మండలం రౌతులపాలేనికి చెందిన కోన శ్రీను (42) అనే వ్యక్తి గుండెపోటుతో మృతిచెందాడు. అతడు అగ్రిగోల్డ్‌లో 2014 మే నెలలో రూ.50 వేలు డిపాజిట్‌ చేశాడు. ఇది కాకుండా 2013 జనవరి నుంచి నెలకు రూ.600 చొప్పున ఆ సంస్థకు చెల్లించాడు. లారీ డ్రైవర్‌గా పనిచేస్తూ కుటుంబాన్ని నెట్టుకొస్తున్నాడు. 

అగ్రిగోల్డ్‌ వ్యవహారంతో కట్టిన డబ్బులు తిరిగి రాక కూతురి వివాహం చేయడానికి చేతిలో డబ్బులు లేక శ్రీను తీవ్ర మనోవేదనకు గురైనట్లు కుటుంబసభ్యులు తెలిపారు. తీవ్ర ఒత్తిడితో  శుక్రవారం రాత్రి ఇంటి వద్ద గుండె పోటుకు గురై మృతి చెందాడని చెప్పారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement