రాజమండ్రి ఓటర్ల లిస్టులో కాజల్‌ అగర్వాల్‌

actress Kajal agarwal photo in Rajamundry rural voters list - Sakshi

సాక్షి, రాజమండ్రి : ప్రముఖ హీరోయిన్‌ కాజల్‌ అగర్వాల్‌ స్వస్థలం ఏంటో తెలుసా తూర్పు గోదావరి జిల్లా. అంతేకాదండోయ్‌ ఆమె పేరు కూడా మార్చుకున్నారు... దీపికా పదుకొనెగా. కాజల్‌..ఊరు, పేరు మారటం ఏంటా అని అనుకుంటున్నారా?. ఇంతకీ అసలు విషయం ఏంటంటే... రాజమండ్రి రూరల్‌ నియోజవర్గ ఓటర్ల జాబితాలో దీపికా పదుకొనె పేరుతో కాజల్‌ అగర్వాల్‌ ఫోటో ప్రత్యక్షమైంది. మరో విచిత్రం ఏంటంటే ఆమె తండ్రి పేరు రమేష్‌ కొండా, వయసు 22 అని ఉంది. ఇందుకు సంబంధించిన ఫోటో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది. దీనిపై పలువురు నెటిజన్లు స్పందిస్తూ ఇది మన ఎన్నికల అధికారుల చిత్తశుద్ది అంటూ కామెంట్లు పెడుతున్నారు. 

గతంలో ఉత్తర ప్రదేశ్‌లోని భల్లిలా నియోజకవర్గంలో  51 ఏళ్ల  ‘దుర్గావతి సింగ్’  పేరుతో సన్నిలియోన్ ఫోటోతో వున్న ఓటర్ల జాబితాను విడుదల చేసి ఎలక్షన్ కమిషన్ పరువు పోగోట్టుకున్న విషయం తెలిసిందే. అంతేకాకుండా ఆ జాబితాలో  చాలామందికి వాళ్ల ఫోటోలకు బదులు ఏనుగు, పావురం, జింక బొమ్మలు వుండటం గమనార్హం.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter


Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top