
2029 నాటికి 50 శాతం పచ్చదనం
రాష్ట్రంలోని మైదాన ప్రాంతంలో 2029 సంవత్సరం నాటికి 50 శాతం పచ్చదనం నింపుతామని ముఖ్యమంత్రి చంద్రబాబు పేర్కొన్నారు.
సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఆర్.కె.అగర్వాల్ మాట్లాడుతూ పర్యావరణాన్ని పరిరక్షించే అధికారాలు రాష్ట్రాలవేనని, ఆ మేరకు సమగ్ర ప్రణాళికలు రూపొందించి అమలు చేయాల్సిన బాధ్యత వాటిపైనే ఉందని స్పష్టం చేశారు.జాతీయ గ్రీన్ ట్రిబ్యునల్ చైర్‌పర్సన్ జస్టిస్ స్వతంతర్ కుమార్ మాట్లాడుతూ పర్యావరణానికి విఘాతం కలిగిస్తున్న ప్లాస్టిక్‌ను పూర్తిగా నిషేధించాలని ప్రభుత్వాలకు సూచించారు.