ఉగాది నాటికి 25 లక్షల మందికి ఇళ్లపట్టాలు

సాక్షి, అమరావతి : రాష్ట్ర వ్యాప్తంగా పేదలకు ఇళ్ల పట్టాలు అందించేందుకు ఉద్దేశించిన విధానంపై కమిటీని ప్రభుత్వం ఏర్పాటు చేసింది. రెవెన్యూశాఖ ప్రధాన కార్యదర్శి నేతృత్వంలోని అధికారులతో ఈ కమిటీ ఏర్పాటు చేశారు. ఇందులో ఆర్థిక, సామాజిక సంక్షేమ శాఖ, గృహ నిర్మాణ శాఖ కార్యదర్శులు సభ్యులుగా నియమించారు. భూపరిపాలనా శాఖ ప్రత్యేక కమిషనర్‌ను కన్వీనర్‌గా నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. వచ్చే ఉగాది నాటికి 25 లక్షలమందికి ఇళ్ల పట్టాలు ఇవ్వాలని నిర్ణయించింది
*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి