గుంటూరు జిల్లా నర్సారావుపేట సమీపంలో శనివారం తెల్లవారుజామున జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు విద్యార్థులు మృతి చెందారు.
నర్సారావుపేట టౌన్: గుంటూరు జిల్లా నర్సారావుపేట సమీపంలో శనివారం తెల్లవారుజామున జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు విద్యార్థులు మృతి చెందారు. పాత పశువులసంత వైపు నుంచి స్కూటీపై ముగ్గురు ఎన్‌ఆర్‌టీ సెంటర్ వైపు వస్తుండగా మూలమలుపు వద్ద లారీ ఢీకొంది. దీంతో స్కూటీ నడుపుతున్న పాలిటెక్నిక్ విద్యార్థి రాజ్‌కుమార్ (19), ఏడవ తరగతి విద్యార్థి కె.వాసుదేవనాయక్ (14) తీవ్రంగా గాయపడి మృతి చెందారు. ఖాజా (14) అనే మరో విద్యార్థి స్వల్ప గాయలతో ప్రమాదం నుంచి బయటపడ్డాడు. అతడ్ని నర్సారావుపేట ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.