విద్యార్థులపైకి దూసుకెళ్లిన ఆటో... ఇద్దరి మృతి | 2 died, 3 injured in road accident at chittur distirict | Sakshi
Sakshi News home page

విద్యార్థులపైకి దూసుకెళ్లిన ఆటో... ఇద్దరి మృతి

Mar 4 2015 7:24 PM | Updated on Mar 9 2019 4:28 PM

ఓ ఆటో అదుపుతప్పి రోడ్డుపై వెళుతున్నవారిపైకి దూసుకెళ్లడంతో ఇద్దరు విద్యార్థులు దుర్మరణం పాలయ్యారు.

చిత్తూరు: ఓ ఆటో అదుపుతప్పి రోడ్డుపై వెళుతున్నవారిపైకి దూసుకెళ్లడంతో ఇద్దరు విద్యార్థులు దుర్మరణం పాలయ్యారు. మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. ఈ సంఘటన చిత్తూరు నగరంలో బుధవారం సాయంత్రం ఈ ప్రమాదం జరిగింది. విజ్ఞానసౌద కాలేజీకి చెందిన విద్యార్థులు ఇంటికి వెళుతున్నసమయంలో వేగంగా దూసుకువచ్చిన టాటాఏస్ వాహనం ముందున్న ఓ ఆటోను ఢీకొట్టి దారిన వెళుతున్నవారిపైకి దూసుకుపోయింది.

ఈ ఘటనలో ఎంబీయే విద్యార్థిని హంస(21), అక్కడికక్కడే మృతి చెందగా... తీవ్ర గాయాలైన మరో విద్యార్థి అజయ్(21)ను ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గ మధ్యంలో ప్రాణాలు కోల్పోయాడు. ఇదే కాలేజీకి చెందిన వేదవతి, కల్పనతో పాటు రాజేశ్వరి అనే మరో మహిళకు గాయాలు కాగా, వారిని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. సంఘటనపై  పోలీసులు కేసు నమోదు చేసి, మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement