breaking news
-
రూ.70వేల కోట్ల అప్పు ఏం చేశారు ?: బొత్స సత్యనారాయణ
సాక్షి,విశాఖపట్నం:కూటమి ప్రభుత్వం వచ్చి ఏడు నెలలయిందని, ఎన్నికల్లో హామీలేవీ నెరవేర్చలేదని మండలి ప్రతిపక్షనేత, మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ విమర్శించారు. మాజీ మంత్రులు కారుమూరి నాగేశ్వరరావు,గుడివాడ అమర్నాథ్,మాజీ ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీతో కలిసి విశాఖపట్నంలో బొత్స సోమవారం(డిసెంబర్2) మీడియాతో మాట్లాడారు.‘ఎన్నికల హామీలు నెరవేర్చాల్సిన బాధ్యత ప్రభుత్వానికుంది. ఎన్నికల హామీలకు బడ్జెట్లో కేటాయించిన నిధులకు పొంతన లేదు.హామీలు నెరవేర్చకపోగా ప్రజలపై విద్యుత్ ఛార్జీల భారం మోపారు.యూనిట్‌కు 1రూపాయి20పైసలు పెంచారు.ప్రజలపై మొత్తం రూ.15 వేల కోట్ల భారం మోపారు. అప్పుల భారం పెంచుతున్నారని వైఎస్సార్సీపీ ప్రభుత్వంపై దుష్ప్రచారం చేశారు.మరి కూటమి ప్రభుత్వం అప్పులెందుకు చేస్తోంది. ఆరు నెలల్లో చేసిన రూ.70 వేల కోట్ల అప్పు ఎక్కడికి పోయిందో చెప్పాలి. ఎన్నికల్లో ఇచ్చిన హామీలు ఎప్పుడు అమలు చేస్తారో చెప్పాలి’అని బొత్స సత్యనారాయణ డిమాండ్ చేశారు. బొత్స ఇంకా ఏమన్నారంటే..ఎన్నికల్లో ఇచ్చిన హామీలు నెరవేర్చాల్సిన బాధ్యత ప్రభుత్వానిది.ఎన్నికల్లో ఇచ్చిన హామీలకు బడ్జెట్ లో చోటు లేదు.హామీలకు బడ్జెట్ లెక్కలకు పొంతన లేదు.ఎన్నికలకు ముందు కూటమి నేతలు నిత్యావసర వస్తులు పెంచమని చెప్పారు.చంద్రబాబు, పవన్ కళ్యాణ్ కూడా ధరలు పెంచమని పదే పదే చెప్పారు.యూనిట్ విద్యుత్ ధర 1.20 రూపాయలు పెరిగింది.రూ. 15 వేల కోట్ల విద్యుత్ బారాన్ని ప్రజలపై ఈ ప్రభుత్వం మోపుతుంది.విద్యుత్ చార్జీలు పెంచడం ఎంతవరకు సమంజసంఅన్ని పరిణామాలు ఆలోచించే కదా ఎన్నికల్లో చంద్రబాబు విద్యుత్ చార్జీలు పెంచమని చెప్పారు.రూ. 15 వేల కోట్ల బారాన్ని ప్రభుత్వమే భరించాలిప్రభుత్వమే డిస్కంలకు చెల్లించాలని డిమాండ్ చేస్తున్నాంరూ 67 వేల 237 కోట్లు అప్పు చేసింది కూటమి ప్రభుత్వంఈ మంగళవారం మళ్ళీ రూ. 4 వేల కోట్లు అప్పు చేయబోతున్నారు.మొత్తం అప్పు రూ. 70 వేల కోట్లకు చేరుతుంది.గతంలో మా ప్రభుత్వం డిస్కంలకు డబ్బులు చెల్లించాం.పెన్షన్ తప్ప ఒక్క పథకం కూడా ఈ ప్రభుత్వం ఇవ్వలేదు.వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఉంటే ఈ ఆరు నెలల్లో రూ.18 వేల కోట్ల పేద ప్రజల ఖాతల్లో వేసేవాళ్ళం.గత సంవత్సరం ఇదే సమయానికి అమ్మఒడి,వసతి దీవెన,విద్యా దీవెన,రైతు భరోసా,సున్నా వడ్డీ,మత్స్యకార భరోసా,ఈబీసీ నేస్తం నిధులు ప్రజలకు ఇచ్చాంఈరోజుకి గత సంవత్సరంలో రూ. 18 వేల 200 కోట్లు ఇచ్చాంప్రజలకు పథకాలు ఇవ్వడం ఈ ప్రభుత్వం ప్రయారిటీ కాదుపేద ప్రజలకు పథకాలు ఎప్పటి నుంచి ఇస్తారురూ. 67 వేల కోట్లు అప్పు తెచ్చి దేనికి ఖర్చు చేశారుప్రజల తరఫున ఈ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నాంపథకాలు ఇవ్వడం లేదు సరి కదా విద్యుత్ చార్జీల మోత మోగించి ప్రజల నడ్డి విరుస్తున్నారుమా ప్రభుత్వం ఉన్నప్పుడు అప్పులు చేశామని గగ్గోలు పెట్టారు.. ఇప్పుడు అప్పులు చేసి మీరేం చేస్తున్నారుమీ సోకులకు వాడుకుంటున్నారా..?గతంలో కూడా చంద్రబాబు అప్పులు చేసి వెళ్తే మేం కూడా ఆ అప్పులు చెల్లించాంప్రజల్లో కొనుగోలు శక్తి పడిపోయిందిగతంలో పథకాలు అందడం వలన మార్కెట్ మంచిగా ఉండేదిజీఎస్టీ తగ్గిపోతోంది..చాలా ఆందోళనగా ఉంది..వ్యాపారాలు ఏమి జరగడం లేదువాటాల కోసం ఎమ్మెల్యేలు తన్నుకుంటున్నారుదానికి సీఎం చంద్రబాబు పంచాయితీ ఏమిటిప్రభుత్వం అంటే భయం, భక్తి ఉండాలి.. ఏది లేకపోతే ఎలా..?నూతన మద్యం పాలసీ వచ్చాక బెల్టు షాపులు ఎక్కువయ్యాయిబెల్టు షాపులకు బహిరంగ వేలం వేస్తున్నారుమా సమీప గ్రామంలో బెల్టు షాపు రూ. 50 లక్షలకు వేలం వేశారుఇంతకన్నా దారుణం ఏమైనా ఉంటుందా..?ఈనాడు, జ్యోతి కథనాలనే నేను చెప్తున్నానుపవన్ కాకినాడ పర్యటన..గబ్బర్ సింగ్-3పవన్ కాకినాడ పర్యటన.. గబ్బర్ సింగ్..3ని తలపించిందిపీడీఎస్ బియ్యం అక్రమ రవాణా తప్పే.. చర్యలు తీసుకోండిఎమ్మెల్యేని కాంప్రమైస్ అయ్యావా..? అని పవన్ అడుగుతున్నారుపక్కన ఉన్న మీ మంత్రి మాటేంటి..?ఆయన చేతకాని వాడా..?పోర్టులో అక్రమాలు జరిగితే చర్యలు తీసుకోండిరెడ్డి, చౌదరి ఎవ్వరైనా తప్పు చేస్తే ఒకేలా స్పందించాలిబియ్యం అక్రమ రవాణాపై బీజేపీ నేతలు ఢిల్లీ వెళ్లి అనుమతులు ఇప్పించారునిజమా కాదా..? గుండెల మీద చెయ్యి వేసుకొని ఆలోచించుకోండి.. -
పవన్ చేష్ట.. ఓవరాక్షనా? కక్ష సాధింపా? అనుభవ రాహిత్యమా?
సినిమాల్లో హీరో ఎన్ని విన్యాసాలైనా చేయవచ్చు కానీ.. నిజజీవితంలో మాత్రం అలా చేయడం సాధ్యం కాదు. అయితే ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్‌కు సినిమా, నిజజీవితాల మధ్య తేడా పెద్దగా తెలిసినట్లు కనిపించడం లేదు. లేదంటే అతడిది ఓవర్‌యాక్షన్ అయినా అయిఉండాలి. కాదంటే అనుభవ రాహిత్యమా? కక్ష సాధింపా? ఈ మాటలన్నీ అనాల్సి వచ్చేందుకు కారణం.. పవన్‌కళ్యాణ్ ఇటీవలి ఢిల్లీ పర్యటన! ఇందులో ఆయన ప్రధాని నరేంద్రమోడీతోపాటు పలువురు కేంద్ర మంత్రులను కలిశారు. మర్యాదపూర్వకంగానో.. తాను నిర్వహిస్తున్న మంత్రిత్వ శాఖకు సంబంధించిన వారితోనో కలిస్తే సమస్య లేదు. కానీ రాజకీయ విశ్లేషకులు ఒకింత ఆశ్చర్యానికి గురయ్యేలా ఆయన ఎవరెవరినో కలిసివచ్చారు. పవన్ తన ఢిల్లీ పర్యటన ద్వారా తానూ చంద్రబాబు ఒకటేనని చెప్పదలచినట్టుగా కనిపిస్తోంది. ఢిల్లో బాబు కంటే తనమాటకే ఎక్కువ విలువ, పలుకుబడి ఉన్నట్లు కలరింగ్ ఇచ్చే ప్రయత్నమూ జరిగిందని విశ్లేషకులు అంటున్నారు. ఢిల్లీ నుంచి వచ్చిన వెంటనే కాకినాడ పోర్టును సందర్శించిన వైనం, అక్కడ ఆయన చేసిన షో కూడా అందులో ఒక భాగం కావచ్చు. బీజేపీ పెద్దలు చేసిన సూచనల మేరకే పవన్ కళ్యాణ్ తనకు పవర్ ఉందని ప్రజలను నమ్మించేందుకు పోర్టు వద్దకు వెళ్లారని, అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేసి, తనకంటే సీనియర్ అయిన టీడీపీ ఎమ్మెల్యే వనమాడి వెంకటేశ్వరరావును కూడా కొంత కించపరిచేలా వ్యవహరించారని కొందరు అభిప్రాయపడుతున్నారు.ఈ క్రమంలోనే ఆయన ఏపీలో కూటమి ప్రభుత్వ వైఫల్యాలను ఆయన చెప్పకనే చెప్పేశారు కూడా. ఆ రకంగా చంద్రబాబు ప్రభుత్వాన్ని గబ్బు పట్టిస్తూనే, మరో వైపు ఆ గబ్బుతో తనకు సంబంధం లేదన్నట్లుగా పవన్ నటిస్తున్నారా అన్న సందేహం వస్తోంది. చంద్రబాబు సమక్షంలో అతి వినయం, అతి విధేయత చూపుతూ, అవసరానికి మించి ఆయనను పొగిడే పవన్ కళ్యాణ్ బయట మాత్రం తానే సూపర్ సీఎం అనిపించుకోవాలని తాపత్రయపడుతున్నారా అన్న సంశయం వస్తోంది. చంద్రబాబు కుమారుడు మంత్రి లోకేష్ ప్రభుత్వంలో మొత్తం పెత్తనం చేస్తున్నారని అంతా అనుకుంటున్న సమయంలో తనకు కూడా పవర్ ఉందని చెప్పుకోవడానికి పవన్ తంటాలు పడ్డారా అన్న ప్రశ్న వస్తుది. మరో సంగతి కూడా చెబుతున్నారు. పోర్టు యాజమన్యంపై ఉన్న కక్ష తీర్చుకోవడానికి అక్కడకు వెళ్లి ఉండవచ్చని అంటున్నారు. మరుసటి రోజు పోర్టును నిర్వహిస్తున్న అరబిందో సంస్థపై మంత్రి నాదెండ్ల మనోహర్ ఆరోపణలు చేయడమే ఇందుకు నిదర్శనం. కాకినాడ పోర్టు వద్ద సుమారు 640 టన్నుల రేషన్ బియ్యం అక్రమ రవాణా అవుతోందని జిల్లా కలెక్టర్ గుర్తించి స్వాధీనం చేసుకుంటే, వపన్ కళ్యాణ్ వెళ్లాక మళ్లీ సీజ్ చేసినట్లు చూపే యత్నం చేశారట. జనసేనకే చెందిన మంత్రి నాదెండ్ల మనోహర్ అక్కడ పవన్ కళ్యాణ్ నటన చూసి బిత్తరపోవడం మినహా ఏమీ చేయలేక పోయారు. నిజానికి పవన్ కన్నా రాజకీయాలలో మనోహర్‌కు చాలా అనుభవం ఉంది. రాజకీయ కుటుంబం నుంచి వచ్చిన మనోహర్ 2004లోనే ఎమ్మెల్యే. ఆ తర్వాత ఉప సభాపతిగా, సభాపతిగా బాధ్యతలు నిర్వహించారు. అనూహ్య పరిణామాలలో జనసేనలో చేరారు. ఇప్పుడు మంత్రి అయ్యారు. కానీ పవన్ తీరుతో ఆయన బిక్కచచ్చినట్లు నిలబడిపోయారా అన్న భావన కలుగుతోంది. మనోహర్ ఇప్పటికి పలుమార్లు కాకినాడ వెళ్లి పోర్టు ద్వారా అక్రమంగా ఎగుమతి అయ్యే రేషన్ బియ్యం గురించి పలుమార్లు మాట్లాడారు. అధికారులను అప్రమత్తం చేశారు. ఎంత మంత్రి ఆదేశాలు ఇచ్చినా, ఇలాంటివి కొన్ని జరుగుతూనే ఉంటాయి. వాటిని కట్టడి చేయడానికి చర్యలు తీసుకుంటూనే ఉండాలి. ఇది నిరంతర ప్రక్రియ.పవన్ పౌరసరఫరాల శాఖలో వేలుపెట్టి ఇలా కెలకడం అంటే నాదెండ్లను ఒకరకంగా అవమానించినట్లే అవుతుందేమో! వైసీపీ మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డిపై ఉన్న ద్వేషంతో కూడా పవన్ కళ్యాణ్ ఇదంతా చేస్తున్నారని అందరికి తెలుసు. పవన్ ఈగోని సంతృప్తిపరచడానికి మంత్రి మనోహర్ తన వంతు ప్రయత్నం చేశారు.కాని ద్వారంపూడి అసలు బియ్యం ఎగుమతి వ్యాపారం నుంచే తప్పుకోవడంతో వీరికి దొరకడం లేదని అంటారు. ఆ ఫ్రస్టేషన్ లో నేరుగా ఆ విషయం చెప్పలేక పవన్ ఇష్టం వచ్చినట్లు మాట్లాడినట్లు అనిపిస్తుంది. కాకినాడ పోర్టులో కొన్ని దశాబ్దాలుగా కార్యకలాపాలు సాగుతున్నాయి. అక్కడ ఎప్పుడూ తీవ్రమైన నేరాలు జరిగిన ఫిర్యాదులు లేవు. ఆ మాటకు వస్తే విశాఖ ఓడరేవుకు శాసనసభ ఎన్నికలకు ముందు పాతిక వేల క్వింటాళ్ల మేర మాదకద్రవ్యాలు వచ్చాయన్న వార్త పెద్ద కలకలం రేపింది. ఆ కేసును సీబీఐ టేకప్ చేస్తుందని అన్నారు. ఆ కేసు ఏమైందో తెలియదు. దీనిపై పవన్ ఎన్నడూ నోరు విప్పలేదు. అక్కడకు వెళ్లలేదు.ప్రశాంతంగా ఉండే కాకినాడ వెళ్లి రచ్చ చేసి వచ్చారు. తత్ఫలితంగా కాకినాడ పవన్ ఓడరేవు విశ్వసనీయతను దెబ్బతీశారు. తిరుమల లడ్డూపై చంద్రబాబుతో పాటు పవన్ కళ్యాణ్ పిచ్చి ఆరోపణలు చేసి ఆ దేవాలయం పవిత్రతను దెబ్బతీశారన్న విమర్శలు ఇప్పటికే ఉన్నాయి.ఇప్పుడు కాకినాడ ఓడరేవు వంతు వచ్చింది. పవన్.. కాకినాడ పోర్టు స్మగ్లర్ల అడ్డాగా ఉందని, బియ్యం తరలించిన మార్గంలో ఆయుధాలు తేలేరా? అంటూ అనుచిత వ్యాఖ్యలు చేశారు. ఉగ్రవాదులు చొరబడితే పరిస్థితి ఏమిటి అని ఆయన ప్రశ్నించారు. ఈ విషయాన్ని కేంద్ర హోంమంత్రి, ప్రధాని కార్యాలయ దృష్టికి తీసుకెళతానని చెప్పారు ఆయన. కీలకమైన సమాచారం ఏదైనా ఉంటే నేరుగా కేంద్రానికి తెలియచేసి చర్యలు తీసుకోవాలి తప్ప, ఇలా బాధ్యత లేకుండా మాట్లాడడం ఏమిటో? అని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. పోర్టుల్లో కేంద్ర ప్రభుత్వానికి చెందిన సెక్యూరిటీ దళాలు సముద్రంలో నిరంతరం కాపలా కాస్తుంటాయి. ఈ విషయం పవన్‌కు తెలియదా? బియ్యం లేదా మరో సామగ్రి అక్రమంగా ఎగుమతి అవడం వేరు.. ఏకంగా ఆయుధాలు రావడం, ఉగ్రవాదులు చొరబడడం వేరు. ఈ సంగతులు ఏమీ కేంద్రానికి తెలియవన్నట్లుగా పవన్ మాట్లాడి, ప్రధాని మోడీ, హోం మంత్రి అమిత్ షా, రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌ల పరువు తీసినట్లు అనిపిస్తుంది. ఓడరేవులలో కొన్ని అక్రమ కార్యకలాపాలు జరుగుతుండవచ్చు.నిర్దిష్ట సమాచారంతో సంబంధిత నేరగాళ్లను పట్టుకుంటారు. ఉదాహరణకు గుజరాత్ లోని ముంద్రా రేవులో పలుమార్లు డ్రగ్స్ పట్టుబడ్డాయి. కస్టమ్స్ సిబ్బంది పట్టుకున్నారు. ఆ మాటకు వస్తే దేశంలోని పలు విమానాశ్రయాలలో కూడా బంగారం, ఇతర వస్తువులు కొన్ని అక్రమంగా దిగుమతి అవుతుంటే అధికారులు పట్టుకుంటుంటారు. అయినా జాగ్రత్తలు చెప్పడం వేరు. మన ప్రతిష్టను మనమే దెబ్బ తీసుకోవడం వేరు. పవన్ చెప్పింది ఎలా ఉందంటే కాకినాడ వద్ద అంతా ఫ్రీ గా ఉనట్లు, రక్షణే లేనట్లు ,ఉగ్రవాదులు ఎవరైనా చొరబడే అవకాశం ఉందన్న సమాచారం ఇచ్చినట్లు ఉంది. ఇలా మాట్లాడడం అంత తెలివైన చర్య కాదని చెప్పాలి. ఆర్డీఎక్స్ వంటివి కూడా దిగుమతి కావచ్చని చెప్పడం అంటే ఇదంతా కేంద్ర ప్రభుత్వ శాఖల సమర్థతను డైరెక్టుగా అనుమానించడమే.ఎన్నికల ముందు ఏపీలో 31వేల మంది మహిళలు మిస్ అయ్యారంటూ అబద్దపు ఆరోపణ చేసి, ఆ తర్వాత దాని గురించే మాట్లాడకుండా పవన్ తన నిజస్వరూపం తెలియచేశారు. ఇప్పుడు కూడా అలాగే వ్యవహరిస్తున్నారా? లారీల ద్వారా అక్రమ బియ్యం కాకినాడ పోర్టుకు చేరుతున్నదంటే ఏమిటి దాని అర్థం? రాష్ట్రంలోని ఆయా రహదారులలో ఉండే సివిల్ సప్లై చెక్ పోస్టులు లేదా వాణిజ్య పన్నుల శాఖ చెక్ పోస్టులు సరిగా పనిచేయడం లేదనే కదా! అధికారులు నిద్రపోతున్నట్లో, లేక కుమ్మక్కు అయినట్లు చెప్పడమే కదా! కూటమి ప్రభుత్వం వచ్చాక అసలు బియ్యం స్మగ్లింగ్ జరగబోదని చెప్పినా, ఇలా ఎందుకు జరుగుతోంది.అంటే చంద్రబాబు ప్రభుత్వం, మంత్రి నాదెండ్ల మనోహర్, పోలీసు శాఖ విఫలం అయిందని పవన్ ఒప్పుకున్నట్లేనా? జిల్లా మంత్రిగా ఉన్న ఆయన కూడా విఫలమైనట్లేనా? తను వస్తున్నానని తెలిసి ఎస్పీ సెలవు పెట్టి వెళ్లారని పవన్ అన్నారట. ఆయన ఎందుకు అలా చేశారో తెలుసుకోవాలి. ఏదైనా సొంత పని ఉండి వెళ్లారా? లేక తెలిసి, తెలియక పవన్ మాట్లాడే వాటికి సమాధానం ఇవ్వడం కష్టం అని వెళ్లారో చూడాలి. ఏపీలో సాగుతున్న విధ్వంసకాండ, హత్యలు, అత్యాచారాలపై స్పందించలేని పవన్ కళ్యాణ్, పోర్టులో ఏదో జరిగిపోతుందని మాట్లాడడం విడ్డూరమే. తాడిపత్రి, జమ్మలమడుగు కూటమి నేతలు చేస్తున్న బూడిద దందా గురించి కూడా మాట్లాడితే బాగుంటుంది కదా! కొద్ది కాలం క్రితం ప్రజలు ప్రభుత్వాన్ని బూతులు తిడుతున్నారని, హోం మంత్రి అనిత ఏమి చేస్తున్నారని అడుగుతూ, తానే ఆ శాఖ తీసుకుంటానని చెప్పిన పవన్ కళ్యాణ్ ఆ తర్వాత ఎలా మాట మార్చేసింది చూశాం. ఇప్పుడు టీడీపీ ఎమ్మెల్యే వనమాడి వెంకటేశ్వరరావును అధికారుల సమక్షంలోనే మందలించినట్లు మాట్లాడి చిన్నబుచ్చారు. వీటన్నిటి ద్వారా తాను చంద్రబాబు సమానమే అన్నట్లుగా పవన్ ప్రవర్తిస్తున్నారు. నిజంగా ఆ ధైర్యం ఉంటే మంచిదే. తప్పు లేదు. కానీ ఆ వెంటనే చంద్రబాబు దగ్గకు వెళ్లగానే జారిపోతున్నారు. అది అసలు సమస్య. ప్రభుత్వ వైఫల్యాలతో తనకు నిమిత్తం లేనట్లుగా, సూపర్ సిక్స్ హామీల ఊసే ఎత్తకుండా కథ నడుపుతూ ప్రజలను మభ్య పెట్టడానికి ఇలాంటి వేషాలన్నీ వేస్తే సరిపోతుందా? అక్రమాలు ఎక్కడా జరిగినా నిరోధించాల్సిందే. కానీ పవన్ ఒక్క కాకినాడ పోర్టులోనే అంతా జరిగిపోతున్నట్లు మాట్లాడి రాష్ట్రం పరువును, ముఖ్యంగా కాకినాడ ప్రతిష్టను దెబ్బతీయడం అభ్యంతరకరం.- కొమ్మినేని శ్రీనివాస రావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత. -
ప్రజలపై పెనుభారం మోపుతారా!
అనంతపురం (కార్పొరేషన్): విద్యుత్ చార్జీలు పెంచి పేద, మధ్య తరగతి ప్రజలపై సీఎం చంద్రబాబు ఐదున్నర నెలల్లో రూ.15,485 కోట్ల పెనుభారం మోపారని.. తిరిగి మరోసారి విద్యుత్ చార్జీలు పెంచేందుకు నిర్ణయించడం దుర్మార్గమని వైఎస్సార్సీపీ అనంతపురం జిల్లా అధ్యక్షుడు అనంత వెంకటరామిరెడ్డి విమర్శించారు. ఆదివారం పార్టీ స్థానిక కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ.. అధికారంలోకి వస్తే విద్యుత్ చార్జీలు పెంచబోమని చెప్పిన చంద్రబాబు ఐదున్నర నెలల్లోనే మాట తప్పారని ధ్వజమెత్తారు.ఇప్పటికే నిత్యావసర సరుకుల ధరలు పెరిగి ప్రజలు అవస్థలు పడుతున్నారని, ఇప్పుడు విద్యుత్ చార్జీల పెంపుతో మరింత ఇబ్బంది పడే దుస్థితి నెలకొందన్నారు. తాము అధికారంలోకి వస్తే విద్యుత్ చార్జీలు పెంచబోమని ఎన్నికల ముందు హామీ ఇచి్చన చంద్రబాబు మాట తప్పారన్నారు. ఆ హామీని నిలబెట్టుకోవాలని డిమాండ్ చేశారు. పెంచిన విద్యుత్ చార్జీలను తగ్గించకపోతే ప్రజల పక్షాన ఉద్యమిస్తామని హెచ్చరించారు. బెల్టు తీసినంత సులభం కాదు.. బెల్టు షాపుల మాఫియాను అరికట్టడం బెల్టు తీసినంత సులభం కాదని చంద్రబాబుకు అనంత చురకలంటించారు. రాష్ట్రంలో విచ్చలవిడిగా బెల్టు షాపులు పెట్టడానికి కారణం చంద్రబాబే అన్నారు. వేలం పాట వేసి మరీ బెల్టు షాపులను తన కార్యకర్తలకు కట్టబెడుతున్నారన్నారు. ఇప్పుడేమో బెల్టు తీస్తా అని తనకేమీ తెలియనట్టు మాట్లాడుతున్నారని ధ్వజమెత్తారు. బూడిద కోసం రెండు జిల్లాల పోలీసులను సరిహద్దుల్లో బందోబస్తు పెట్టడం, ఈ విషయంపై సీఎం చంద్రబాబు పంచాయితీ పెట్టడం చూస్తుంటే ఇంతకన్నా సిగ్గు చేటు మరొకటి లేదని మండిపడ్డారు. -
చంద్రబాబును చూసి టీడీపీ సీనియర్లలో జాలి!
‘అనగనగా ఒక ఊరిలో ఒక నాగుపాము ఉండేది. తనకు ఎవరు కనిపిస్తే వారిని కాటేసి చంపేసేది. లేదా, చిన్న జీవులైతే తినేసేది. అదంటే అందరికీ చాలా భయం. కొన్నాళ్లకు ఆ నాగుపాము బాగా ముసలిది అయిపోయింది. ఈలోగా ఒక వేటగాడు దానిని పట్టుకుని కోరలు పీకి మళ్లీ అడవిలో వదిలేశాడు. ఇక కదలలేని పరిస్థితి వచ్చింది. జనం గానీ, మిగిలిన జీవులు గానీ దాన్ని పట్టించుకోవడమే మానేశాయి. దానికి పొట్టగడవడం కూడా కష్టమైపోయింది. ఇలాంటి పరిస్థితుల్లో ఒకరోజు ఆ దారిలో ఒక సన్యాసి వెళుతూ ఉంటే ఆయనను తనకో దారి చూపించమని ప్రాధేయపడింది. ఆయన దానితో.. ‘నువ్వు కదలలేని, కరవలేని ముసలి పామువి అయిపోయావు గానీ కనీసం బుసకొట్టగలవు కదా.. కాబట్టి బుస కొడుతూ ఉండు.. అందరూ నిన్ను చూసి భయపడతారు’ అని సలహా చెప్పి వెళ్లాడు.ఈ ఐడియా భలే ఉందని ఆ పాముకు అనిపించింది. అప్పటి నుంచి బుస కొట్టడం ప్రారంభించింది. కొన్ని జీవులు భయపడేవి కూడా! కొన్నాళ్లకు వాటన్నింటికీ అసలు విషయం అర్థమైంది. ‘ఈ పాము బుసకొడుతుందే తప్ప.. కాటు వేయలేదు’ అని తెలుసుకున్నాయి. పిల్లి గుడ్డిదైతే ఎలుక దాని ఎదుట బ్రేక్ డ్యాన్స్ చేసినట్టుగా.. చిట్టెలుకలు, చిట్టి కుందేళ్లు కూడా ఆ పాము ఎదుట డిస్కో డ్యాన్స్ చేయడం మొదలుపెట్టాయి. ఆ పాము గట్టిగా బుస కొడుతుంది. కానీ మిగిలిన జీవులు కనీసంగా కూడా పట్టించుకోవడం మానేశాయి. పాపం.. ఆ పాము ముసలి బతుకు అలాగే గడిచిపోయింది’ ఇదీ కథ.ఈ కథకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని రాజకీయాలకు చిన్న సామ్యం ఉంది. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు తానంటే అందరికీ హడల్ అని, తనను చూసి అందరూ జడుసుకుంటూ ఉంటారని అనుకుంటూ ఉంటారు. తాను రంకె వేస్తే భూకంపం వస్తుందని కూడా అనుకుంటూ ఉంటారు. కానీ ప్రస్తుతం ఆయన పార్టీలోని సీనియర్లలోనే చంద్రబాబు పట్ల భయం కాదు కదా.. జాలి కలుగుతోంది.దేశంలోనే నన్ను మించిన సీనియారిటీ ఉన్న నాయకుడు లేరని ఆయన చెప్పుకుంటూ ఉంటారు. నాలుగు సార్లు ముఖ్యమంత్రిగా తనను మించిన మహానుభావులు లేరని కూడా అనుకుంటూ ఉంటారు. కానీ, సొంత పార్టీలో ఆయనకు ఒకప్పుడు ఉన్నంత విలువ, గౌరవం, ఆయన పట్ల భయం ఇప్పుడు లేవు. తాజాగా ఆర్టీపీపీ తడి బూడిద గొడవ ఇందుకు పెద్ద ఉదాహరణ.ఆర్టీపీపీ నుంచి వచ్చే తడి బూడిదను అమ్ముకోవడంలో రోజుకు దాదాపుగా రెండు లక్షల రూపాయల దందా తెలుగుదేశం నేతలు సాగిస్తున్నట్టుగా గుసగుసలున్నాయి. దీనికోసం కూటమి పార్టీల నాయకులే కొట్టుకుంటున్నారు. లోకల్ టీడీపీ భూపేష్ రెడ్డి, బీజేపీ ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి, తాడిపత్రి టీడీపీ నేత జేసీ ప్రభాకరరెడ్డి మధ్య తగాదాలు ముదిరాయి. మంత్రి గొట్టిపాటి రవికుమార్, నారా లోకేష్ రాజీ చర్చలు చేసినా.. వారు దిగిరాలేదు. అప్పుడు బుస కొట్టడానికి చంద్రబాబు స్వయంగా రంగంలోకి దిగారు. అందరినీ తన ఎదుట హాజరుకావాలని పురమాయించారు.ఆయన మాటలను జేసీ ప్రభాకర రెడ్డి బేఖాతర్ అన్నారు. బీజేపీ ఆదినారాయణ రెడ్డి వచ్చి తన వాదన చెప్పుకుని వెళ్లిపోయారు. బాబు ‘బుస’లను సొంత పార్టీ వారు కూడా పట్టించుకోవడం లేదు. సొంత పార్టీలోని సీనియర్లు మాత్రమే కాదు, పార్టీలో బొడ్డూడని నాయకులు, తొలిసారి ఎమ్మెల్యే అయిన అప్రెంటిసులు కూడా చంద్రబాబు బుసలను పట్టించుకోవడం లేదు. లోకల్‌గా నియోజకవర్గాల్లో ఎమ్మెల్యే దందాలు విచ్చలవిడిగా సాగుతున్నాయి. దందాలు చేస్తే తాటతీస్తా అని చంద్రబాబు హెచ్చరిస్తుంటారు. బహుశా ఈ అప్రెంటిస్ ఎమ్మెల్యేలు కూడా చంద్రబాబు హూంకరింపులు చూసి జాలిగా నవ్వుకుంటూ ఉంటారేమో! ఒకప్పట్లో ఎడాపెడా పార్టీ నేతల మీద చర్యలు తీసుకుంటూ మీడియాలో ప్రచారం కోరుకుంటూ తమ మీద రెచ్చిపోతూ వచ్చిన చంద్రబాబునాయుడు.. ఇప్పుడు అప్రెంటీసులకు కూడా లెక్కలేకుండా అయిపోయారని ఇప్పుడు సీనియర్లు బాబు పరిస్థితి మీద జాలిపడుతున్నారు.-ఎం.రాజేశ్వరి -
బాబూ.. ఛార్జీలు పెంచడం సంపద సృష్టా?: వరుదు కల్యాణి
సాక్షి, విశాఖ: ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు మోసానికే బ్రాండ్ అంబాసిడర్ అంటూ ఎమ్మెల్సీ వరుదు కళ్యాణి మండిపడ్డారు. కొండనాలిక మందేస్తే ఉన్న ఉన్న నాలుక ఊడినట్లు ప్రజల పరిస్థితి తయారైందని ఆవేదన వ్యక్తం చేశారు. సంపద సృష్టిస్తామని చెప్పి విద్యుత్ చార్జీలు పెంచడం దారుణమన్నారు.వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీ వరుదు కల్యాణి తాజాగా మీడియాతో మాట్లాడుతూ..‘విద్యుత్ ఛార్జీల పెంపుదల నిర్ణయాన్ని వెంటనే వెనక్కి తీసుకోవాలి. ప్రజలపై భారం మోపితే చూస్తూ ఊరుకోం. ప్రజల తరఫున పోరాటానికి మేము సిద్ధంగా ఉన్నాం. ఇప్పటికే నిత్యవసర ధరలు పెరిగి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఎన్నికల ముందు విద్యుత్ ఛార్జీలు పెంచమని చెప్పి.. ఇప్పుడు ప్రజలపై భారం మోపడం దుర్మార్గం. సంపద సృష్టిస్తామని చెప్పి విద్యుత్ చార్జీలు పెంచి సంపద సృష్టిస్తున్నారు. ఆర్థికంగా రాష్ట్ర అభివృద్ధి చేస్తామని చెప్పి చంద్రబాబు కరెంట్ చార్జీల పేరుతో రూ.15 వేల కోట్ల రూపాయలను ప్రజలపై భారం మోపారు’ అని మండిపడ్డారు. -
దక్షిణాదిలో పార్లమెంట్ సమావేశాలు.. ప్రధానికి ఎంపీ గురుమూర్తి లేఖ
సాక్షి, ఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోదీకి వైఎస్సార్సీపీ ఎంపీ గురుమూర్తి లేఖ రాశారు. ఈ క్రమంలో దక్షిణ భారత్‌లో పార్లమెంట్ సమావేశాలు నిర్వహించాలని లేఖలో డిమాండ్ చేశారు. దేశ ప్రయోజనాల దృష్ట్యా ఈ ఈ డిమాండ్‌కు అందరూ సహకరించాలి ఆయన కోరారు.వైఎస్సార్సీపీ ఎంపీ గురుమూర్తి తాజాగా ప్రధాని మోదీకి లేఖ రాశారు. ఈ లేఖలో గురుమూర్తి..‘దక్షిణ భారత్‌లో పార్లమెంట్ సమావేశాలు నిర్వహించాలని డిమాండ్ చేశారు. అలాగే, ఏడాదికి కనీసం రెండు పార్లమెంట్ సెషన్స్ దక్షిణ భారత రాష్ట్రాల్లో నిర్వహించాలి కోరారు. జాతీయ సమగ్రత దృష్ట్యా దక్షిణ భారత రాష్ట్రాల్లో పార్లమెంటు సమావేశాలు నిర్వహించడం మంచిదన్నారు.ఇదే సమయంలో రాజ్యాంగ నిర్మాత డాక్టర్ అంబేద్కర్ సైతం ఈ అంశాలను భాషా పాలిత రాష్ట్రాలు అనే పుస్తకంలో ప్రస్తావించారని గుర్తు చేశారు. దక్షిణాది రాష్ట్రాల్లో పార్లమెంట్ సమావేశాలు నిర్వహించే అంశంపై విశాల దృక్పథంతో ఉండాలని నాటి ప్రధాని వాజ్‌పేయ్ కూడా చెప్పినట్టు తెలిపారు. దేశ ప్రయోజనాల దృష్ట్యా ఈ డిమాండ్‌కు అందరూ సహకరించాలని కోరారు. -
‘ఏపీలో బాబు ష్యూరిటీ.. బాదుడు గ్యారంటీ’
సాక్షి, పార్వతీపురం మన్యం: ఏపీలో కూటమి నేతలది దగా ప్రభుత్వం, మోసపూరిత సర్కార్ అని మండిపడ్డారు మాజీ మంత్రి పాముల పుష్పశ్రీవాణి. ఈ కూటమి ప్రభుత్వంలో విద్యుత్ చార్జీల పేరిట 15,845 కోట్లు ప్రజలపై భారం మోపారని ఆగ్రహం వ్యక్తం చేశారు. హామీలు నెరవేరుస్తారని ఆశపడి ప్రజలు ఓటు వేస్తే నట్టేట ముంచారని ఘాటు విమర్శలు చేశారు.మాజీ మంత్రి పాముల పుష్పశ్రీవాణి తాజాగా మీడియాతో మాట్లాడుతూ..‘విద్యుత్ చార్జీలు పెంచడంపై కూటమి ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నాం. ఎన్నికలకు ముందు బాబు షూరిటీ.. భవిష్యత్తు గ్యారంటీ అన్న మాటలు ఆచరణలో లేకుండా బాబు ష్యూరిటీ.. బాదుడు గ్యారంటీ అనేటట్టు ఉంది. విద్యుత్ చార్జీలు పెంచమని ఎన్నికల ముందు చెప్పిన మాట ఏమైంది?. 2023 సభలో చంద్రబాబు ఏం మాట్లాడారు. ఈ కూటమి ప్రభుత్వంలో విద్యుత్ చార్జీల పేరిట 15,845 కోట్లు ప్రజలపై భారం మోపారు. యూనిట్‌పై జనవరి నుండి 2.19 పైసలు ఎక్కువ వసూలు చేయబోతున్నారు. ఎన్నికల ముందు బాదుడే బాదుడు అని తిరిగారు.. కానీ ఇప్పుడు కరెంటు, నిత్యవసర సరుకులు, మద్యం ధరలు ఈ ప్రభుత్వంలో బాదుడే బాదుడు మొదలైంది.కూటమి ప్రభుత్వంలో తల్లికి వందనం, శ్రీ శక్తి ఏమైంది?. మహిళల కోసం ఈ ప్రభుత్వంలో ఏం ఖర్చు చేశారో చెప్పాలి. ఉచిత గ్యాస్ పెద్ద మోసం. ఎన్నికల ముందు ఇచ్చిన హామీలు అన్ని అబద్ధమే. పథకాల రూపంలో ఒక్క రూపాయి కూడా రాకపోవడంతో ప్రజలు అష్ట కష్టాలు, అప్పుల బారిన పడుతున్నారు. ఆరు నెలల్లో 15,845 కోట్లు విద్యుత్ చార్జీల భారం మోపిన ముఖ్యమంత్రి ఎవరైనా ఉన్నారంటే అది చంద్రబాబు మాత్రమే. హామీలు నెరవేరుస్తారని ఆశపడి ప్రజలు ఓటు వేస్తే నట్టేట ముంచారు.సెకీ ఒప్పందాలపై పేపర్లలో తప్పుడు రాతలు రాసి పైశాచిక ఆనందం పొందుతున్నారు. ప్రభుత్వం డైవర్షన్ పాలిటిక్స్ చేసి పబ్బం గడుపుతోంది. గతంలో చంద్రబాబు దిగేపోయే సమయానికి విద్యుత్ రంగంలో 86 వేల కోట్లు అప్పులు చేసింది. గత ప్రభుత్వం చేసిన పీపీఏలు రద్దు చేసే దమ్ము కూటమికి ఉందా?. మద్యం దుకాణాల యజమానులను కూటమి నేతలు బ్లాక్ మెయిల్ చేస్తున్నారు. ఇంజనీరింగ్, మెడికల్ కాలేజీలు పనులు నిలిచిపోయాయి. కూటమి ప్రభుత్వం వచ్చాక 20 లక్షల ఉద్యోగాలు ఇస్తామన్నారు. ఇవ్వడం పోయి రాజకీయ కక్షలతో ఉద్యోగాలు తీస్తున్నారు’ అంటూ కామెంట్స్ చేశారు. -
విద్యుత్ ఛార్జీలు పెంచి సంపద సృష్టిస్తున్నారా?: వైఎస్సార్సీపీ
సాక్షి, పశ్చిమగోదావరి జిల్లా: చంద్రబాబు అన్నీ అబద్ధాలే చెప్తారంటూ మాజీమంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావు మండిపడ్డారు. విద్యుత్ ఛార్జీల మోతతో ప్రజలపై రూ.15వేల కోట్ల భారం మోపారని ధ్వజమెత్తారు. సామాన్య, మధ్య తరగతి ప్రజలు ఎలా బతకాలంటూ ఆయన ప్రశ్నించారు. పేదవాడిని లక్షాధికారి చేస్తానని ఇప్పుడు చేస్తున్నదేంటీ? ఇలా బాదుడు బాధితే లక్షాధికారి భిక్షాధికారి అవుతాడంటూ ఆయన వ్యాఖ్యానించారు.విద్యుత్ ఛార్జీల పెంపు నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలి: వరుదు కళ్యాణివిశాఖ: చంద్రబాబు మోసానికే బ్రాండ్ అంబాసిడర్ అంటూ ఎమ్మెల్సీ వరుదు కళ్యాణి ఎద్దేవా చేశారు. కొండనాలిక మందేస్తే ఉన్న ఉన్న నాలుక ఊడినట్లు ప్రజల పరిస్థితి తయారైందన్నారు. ‘‘విద్యుత్ ఛార్జీల పెంపుదల నిర్ణయాన్ని వెంటనే వెనక్కి తీసుకోవాలి. ప్రజలపై భారం మోపితే చూస్తూ ఊరుకొం. ప్రజల తరఫున పోరాటానికి మేము సిద్ధంగా ఉన్నాం. ఇప్పటికే నిత్యవసర ధరలు పెరిగి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఎన్నికల ముందు విద్యుత్ ఛార్జీలు పెంచమని చెప్పి.. ఇప్పుడు ప్రజలపై భారం మోపడం దుర్మార్గం’’ వరుదు కళ్యాణి మండిపడ్డారు.సంపద సృష్టిస్తామని చెప్పి విద్యుత్ చార్జీలు పెంచి సంపద సృష్టిస్తున్నారని వైఎస్సార్సీపీ కర్నూలు జిల్లా అధ్యక్షుడు ఎస్వీ మోహన్ రెడ్డి మండిపడ్డారు. ఆర్థికంగా రాష్ట్ర అభివృద్ధి చేస్తామని చెప్పి చంద్రబాబు కరెంట్ చార్జీల పేరుతో రూ.15 వేల కోట్ల రూపాయలను ప్రజలపై భారం మోపారని ధ్వజమెత్తారు.ప్రజలపై భారం: ఎస్వీ మోహన్రెడ్డితాజాగా రూ. 9 వేల కోట్ల రూపాయలు విద్యుత్ భారం మోపి ఇంట్లో కరెంటు స్వీచ్ వేయాలంటే భయపడేవిధంగా చేస్తున్నారన్నారు. ఒక్క సంక్షేమ పథకం కూడా అమలు చేయకుండా విద్యుత్ చార్జీల పేరుతో 15 వేల కోట్ల రూపాయలను ప్రజలపై భారం వేశారు. సెకి పేరుతో విద్యుత్ ఒప్పందంలో ఏదో జరిగిందని మాజీ సీఎం వైఎస్ జగన్‌పై ఎల్లో మీడియా, టీడీపీ నేతలు అసత్య ఆరోపణలు చేస్తున్నారు. మాజీ సీఎం వైఎస్ జగన్ హయాంలో తక్కువ ధరకే విద్యుత్ ఒప్పందం కుదిరింది’’ అని ఎస్వీ మోహన్‌రెడ్డి చెప్పారు. -
టీడీపీ నేతల దౌర్జన్యం.. వైఎస్సార్సీపీ నాయకుడి ప్రహారీ గోడ కూల్చివేత
సాక్షి, అనంతపురం: ఏపీలో కూటమి ప్రభుత్వంలో టీడీపీ నేతలు రెచ్చిపోతున్నారు. వైఎస్సార్సీపీ నేతలు, కార్యకర్తలే లక్ష్యంగా దాడులకు తెగబడుతున్నారు. తాజాగా అనంతరంలో టీడీపీ నేతలు దౌర్జన్యానికి పాల్పడ్డారు. ఈ సందర్భంగా అక్కడే ఉన్న పోలీసులు.. ప్రేక్షక పాత్ర వహించారు.వివరాల ప్రకారం.. అనంతపురం జిల్లాలోని శింగనమల నియోజకవర్గంలో టీడీపీ నేతలు బరితెగింపు చర్యలకు పాల్పడ్డారు. వైఎస్సార్సీపీ నేత నారాయణరెడ్డికి చెందిన ప్రవారీ గోడను పట్టపగలే ధ్వంసం చేశారు. బుక్కరాయసముద్రం మండలం వెంకటాపురం గ్రామంలో ఈ ఘటన వెలుగుచూసింది.అయితే, ఈ భూ వివాదంపై ఇప్పటికే హైకోర్టు స్టే విధించింది. అయినప్పటికీ కోర్టు ఉత్తర్వులు ధిక్కరించి టీడీపీ నేతలు ప్రహరీ గోడను ధ్వంసం చేశారు. ఇక, ఇదంతా జరుగుతున్నా ఘటనా స్థలంలోనే ఉన్న పోలీసులు.. ప్రేక్షక పాత్ర వహించారు. టీడీపీ నేతలను అడ్డుకునే ప్రయత్నం ఏ మాత్రం చేయలేదు. దీంతో, పోలీసుల తీరు చూసి స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. -
వక్ఫ్ బోర్డు కమిటీ రద్దు దుర్మార్గం: అంజాద్ బాషా
సాక్షి, వైఎస్సార్ జిల్లా: కూటమి ప్రభుత్వం ఏర్పాటైన ఆరు నెలల్లో ప్రజలకిచ్చిన హామీలు తుంగలో తొక్కారంటూ మాజీ డిప్యూటీ సీఎం అంజాద్ బాషా మండిపడ్డారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, కేవలం కక్ష సాధింపు చర్యలు మాత్రమే చంద్రబాబు సర్కార్‌లో కనిపిస్తోందని.. ఒక్క హామీ కూడా నెరవేర్చలేదని ధ్వజమెత్తారు.‘‘నిధులు లేవంటూ వైఎస్ జగన్‌పై నిందలు వేస్తూ కాలయాపన చేస్తున్నారు. తమ వైఫల్యాలను కప్పి పుచుకునేందుకు డైవర్షన్ పాలిటిక్స్ చేస్తోంది. రాజ్యాంగబద్ధంగా 2023లో జీవో 47 కింద వక్ఫ్ బోర్డు నియామకం చేశాం. దాన్ని నిన్న ఆ జీవోను ఉపసంహరించుకోవడం దుర్మార్గం. పూర్తి నిబంధనల మేరకు వక్ఫ్ బోర్డు నియామకం జరిపాం. ఎమ్మెల్యేలు, ముత్తవలీలు, స్థానికసంస్థలు.. ఇలా అన్ని కేటగిరీలో నియామకాలు జరిగాయి. బోర్డు సభ్యులు చైర్మన్ ఎన్నిక చేసుకుంటే ఆనాడు టీడీపీ వారు కోర్టులో కేసు వేసి నిలుపుదల చేశారు. చైర్మన్ ఎన్నిక కాకుండా ఆనాడు నాలుగు పిటిషన్లు వేశారు. ఈ అంశం ఇంకా కోర్టులోనే ఉంది.. మరి కమిటీని ఎలా రద్దు చేస్తారు..?’’ అంటూ ప్రశ్నించారు.‘‘కేవలం టీడీపీ వారిని నియమించుకుని వక్ఫ్ ఆస్తులకు దురాక్రమణ చేయాలనే ఆ జీవో రద్దు చేశారు. బోర్డు చాలా కాలంగా పని చేయడం లేదంటూ రద్దు చేశామని చెప్తున్నారు. కోర్టులో కేసులు వేసి పని చేయకుండా చేసింది మీ టీడీపీ వారు కాదా..?. నిజంగా మీకు చిత్తశుద్ధి ఉంటే కోర్టులో రిట్లను ఉపసంహరించుకోవాలి.. కానీ బోర్డు రద్దు చేయడం ఏమిటి..?..2014-19 మధ్యలో చంద్రబాబు అసలు వక్ఫ్ బోర్డు వేయనే లేదు. 2018లో చంద్రబాబు కమిటీ వేస్తే దాని కాలం 2023 వరకూ ఉంది. మేము అధికారంలోకి వచ్చాకా చంద్రబాబులా ఆ బోర్డును మేము రద్దు చేయలేదు.. ఆ రోజు జలీల్ ఖాన్, అమీర్ బాబు వంటి వారు రాజీనామా చేసి వెళ్లిపోయారు. ఆ బోర్డు కాలపరిమితి ముగిసిన తర్వాత మాత్రమే మేం కొత్త బోర్డు వేశాం. కానీ మీరు మేము వేసిన బోర్డు కాలపరిమితి ముగియకముందే రద్దు చేయడం దుర్మార్గం. కేంద్ర ప్రభుత్వం వక్ఫ్ సవరణ చట్టాన్ని తెచ్చింది.. దాన్ని ముస్లింలంతా అంతా వ్యతిరేకిస్తున్నారువైఎస్ జగన్ ఆదేశాలతో పార్లమెంటులో వైఎస్సార్సీపీ వ్యతిరేకించింది. వక్ఫ్ ఆస్తులకు అన్యాక్రాంతం చేసేందుకే ఈ చట్టం తెస్తున్నారు. దీనివల్ల ముస్లింల హక్కులు దెబ్బతింటున్నాయి.. అందుకే వైఎస్సార్సీపీ ఈ బిల్లుకు వ్యతిరేకంగా ఉంది. జమాతే ముస్లిం నేతలు కూడా జగన్‌కు కృతజ్ఞతలు తెలిపారు. జీవో 47 రద్దుపై మేము కచ్చితంగా చట్టప్రకారం పోరాడతాం. మైనారిటీలకు ఎక్కడ అన్యాయం జరిగినా వైఎస్సార్సీపీ తరపున పోరాడతాం’’ అని అంజాద్ బాషా స్పష్టం చేశారు. -
సంక్రాంతి నుంచి జనంలోకి జగన్
అయిపొయింది.. కూటమి సర్కారు హనీమూన్ టైం ముగిసింది ... తమను ఎలా మోసం చేస్తున్నదీ ప్రజలకు సైతం అర్థం అవుతోంది. సూపర్ సిక్స్ .. భవిష్యత్తుకు గ్యారెంటీ అన్నారు .. మంచి ప్రభుత్వం అన్నారు.. చాలా చాలా అన్నారు కానీ అధికారం ఇచ్చి చూడు ఒక నాయకుని నిజరూపం తెలుస్తుంది అన్నారు అబ్రహం లింకన్. చంద్రబాబు సైతం ఎప్పుడూ ప్రతిపక్షంలో ఉన్నపుడు చెప్పే మాట అధికారంలోకి వచ్చాక పాటించలేదు. నాలుగుసార్లు సీఎం అయిన చంద్రబాబును ప్రతిసారీ గెలిచాక మాట తప్పడం అయన అలవాటుగా మారింది. ఇప్పుడు కూడా చంద్రబాబు గెలిచీగెలవగానే తన నిజరూపం చూపుతున్నారు. విద్యుత్ చార్జీల భారం మోపడం మొదలైంది. ఇచ్చిన హామీలేవీ అమలు కావడం లేదు.వైఎస్ జగన్ హయాంలో అమలయ్యే ఏ సంక్షేమ పథకమూ ఇప్పుడు ఇవ్వడం లేదు. అన్నిటికీ మించి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల మీద... ముఖ్యంగా టీడీపీ తప్పిదాలు.. మోసాల మీద సోషల్ మీడియాలో ప్రశ్నిస్తున్న వైసిపి సోషల్ మీడియా కార్యకర్తలను వెంటాడి . ఎక్కడా లేని సెక్షన్ల కింద కేసులు పెట్టడం రాష్టాన్ని కుదిపేసింది. ఇక ఇన్నాల్లమాదిరిగా తాడేపల్లి క్యాంప్ కార్యాలయంలో కూర్చుంటే కుదరదు .. జనంలోకి వెళ్లాల్సిందే.. చంద్రబాబు తీరును ఎండగట్టాల్సిందే అని నిర్ణయించుకున్న వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఇక ఉపేక్షించరాదని నిర్ణయించుకున్నారు. చంద్రబాబ చేస్తున్న తప్పిదాలు.. దాష్టీకాలను ప్రజలముందు నిలబెట్టాలని నిర్ణయించుకున్నారు.గత ఆర్నెళ్లుగా చంద్రబాబు అమలు చేసిన సొంత ఎజెండా.. లోకేష్ అమలు చేసిన వ్యక్తిగత రెడ్ బుక్ ఎజెండాలను ప్రజలముందు పెట్టి క్యాడర్ కు భరోసా ఇవ్వాలని జగన్ భావించడం పార్టీ వర్గాల్లో హుషారును రేకెత్తిస్తోంది. వాస్తవానికి వైఎస్ రాజశేఖర రెడ్డి.. జగన్ మోహన రెడ్డి అంటేనే ప్రజలు.. ఆ కుటుంబం అంటేనే జనం.. అలాంటిది ప్రతిపక్షంలోకి వచ్చాక జగన్ జనానికి.. పార్టీ కార్యకర్తలకు దూరం అయ్యారన్న భిప్రాయాలు వ్యక్తమవుతున్న తరుణంలో అయన ఇకముందు జనంలోనే ఉండాలని నిర్ణయించుకోవడం పార్టీ క్యాడర్లో కొత్త ఉత్సాహాన్ని నింపుతోంది. ఏడాదిన్నర తరువాత జరిగే పంచాయతీ.. మున్సిపల్ ఎన్నికలకు క్యాడరును సిద్ధం చేసేందుకు సైతం జగన్ పర్యటనలు ఎంతగానో ఉపయోగపడుతుందని భావిస్తున్నారు. వాస్తవానికి ఎన్నికల్లో ఘోరపరాభవం ఎదురైనా వైఎస్ఆర్ కాంగ్రెస్ కు ప్రజల్లో నిక్కచ్చిగా 40 శాతం ఓటు బ్యాంకు ఉంది. అటు కూటమి పార్టీలన్నీ కలిస్తే తప్ప జగన్‌ను ఓడించలేని పరిస్థితి అన్నది అందరికి తెలిసిందే.. ఇలాంటి తరుణంలో జగన్ మళ్ళీ ప్రజల్లోకి వెళ్లి ఆ 40 శాతం ప్రజలతోబాటు తెలుగుదేశం పాలనపట్ల పెద్దగా ఆసక్తిలేని వారిని సైతంఆకట్ట్టుకునే పనిలో ఉంటారని క్యాడర్ భావిస్తోంది. ఆయన జిల్లాలకు వచ్చినట్లయితే.. అక్కడే బస చేస్తారు.. ఆ సందర్భంగా సర్పంచ్ స్థాయి నుంచి జడ్పి చైర్మన్ వరకు వివిధ స్థాయిల్లోని నాయకులూ.. కార్యకర్తలు ఆయన్ను కలిసి క్షేత్ర స్థాయిలో పార్టీ పరిస్థితిని వివరించే అవకాశాలు మోసం ఎదురుచూస్తున్నారు. స్థానికంగా ఉన్న విభేదాలు.. అక్కడక్కడా ఎదురవుతున్న చిక్కులన్నీ జగన్ దృష్టికి వెళతాయి. దీంతో అయన వర్దిని అక్కడికక్కడే సరిదిద్ది పార్టీకి దిశానిర్దేశం చేయనున్నారు. జగన్ ప్రజల్లోకి వెళ్లాలన్న అటు టీడీపీకి ప్రాణసంకటంగా మారగా ఇటు వైసిపి క్యాడర్ కు సంతోషాన్ని పంచుతోంది.వాస్తవానికి జగన్ ఎన్నికల ఫలితాల తరువాత గుంటూరు.. పులివెందులతోబాటు డయేరియా బాధితులను పరామర్శించేందుకు విజయనగరం జిల్లా గుర్ల వచ్చారు. ఆ సందర్భాంగా ఎలాంటి జనసమీకరణ చేయకపోయినా ప్రజలు అధికసంఖ్యలో వచ్చారు. ఆయన్ను అభిమానంతో ఆదరించారు. ఇదే సందర్భంగా జగన్ ఉంటే తమకు మరింత బాగుండేదని.. పేదలకు పథకాలు వచ్చేవని .. స్కూళ్ళు.. ఆస్పత్రులు బాగుండేవని.. అమ్మ ఒడి అందేదని ప్రజలు బహిరంగంగానే చర్చించుకోవడం జగన్ పట్ల ప్రజల్లో ఉన్న ఆదరణను స్పష్టం చేస్తోంది. ఆ ఆదరణను మరింత ప్రోది చేసుకునే క్రమంలో జగన్ జనంలోకి వస్తున్నట్లు తెలుస్తోంది..-సిమ్మాదిరప్పన్న -
కేసే పెట్టలేదు.. పోలీసులే సంతకాలు పెట్టించుకున్నారు: బాధితురాలి తండ్రి
సాక్షి, తిరుపతి జిల్లా: యలమంద ఘటన బాలిక తండ్రి మీడియా ముందుకు వచ్చారు. తాను ఎవరి మీద కేసు పెట్టలేదని స్పష్టం చేశారు. తమ కుమార్తెపై దాడి జరిగిందని మేమే స్వయంగా చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డిని పిలిచామని.. ఆయనపై కేసు పెట్టాలని పోలీసులకు తాను చెప్పలేదంటూ బాధితురాలి తండ్రి స్పష్టం చేశారు. నా బిడ్డకు సాయం చేయడానికి వచ్చినవారిపై ఎలా కేసు పెడతాను.? చిన్నారిపై దాడి చేసిన వారికి శిక్ష పడాలి కోరాను. నేను చదువుకోలేదు.. పోలీసులు చెప్పిన చోట సంతకం మాత్రమే చేశా’ అని బాలిక తండ్రి తెలిపారు. మా బిడ్డపై అన్యాయం జరిగిందని సహాయం చేయడానికి వచ్చిన వారిపై నేను ఎలా కేసు పెడుతానంటూ బాలిక తండ్రి ప్రశ్నించారు.ప్రతిపక్షాల గొంతు నొక్కుతున్నారు: భూమనరాష్ట్రంలో పరిస్థితులు ఎంత దుర్భరంగా ఉన్నాయో యలమంద ఘటన నిదర్శనం. ప్రతి పక్ష పార్టీ నేతల గొంతు నొక్కే ప్రయత్నం చేస్తున్నారు. వైఎస్సార్సీపీ నేతలు, కార్యకర్తలను టార్గెట్ చేస్తున్నారు. వ్యక్తుల్ని, వ్యవస్థల్ని భయబ్రాంతులకు గురి చేసే యత్నం చేస్తున్నారు బాధిత కుటుంబానికి రక్షణగా వెళ్లిన వారిని ఇబ్బందులు పెట్టాలని చూస్తున్నారు. ఎవరిపై కక్ష సాధింపు చర్యలకు దిగుతున్నారనేది స్పష్టమైంది. బాధిత కుటుంబం పిలిస్తే వెళ్లిన వారిపై తప్పుడు కేసులు పెడుతున్నారుటీడీపీ అనుకూల కిరణ్ పత్రికలో లైంగికదాడి జరిగిందని ప్రచురించారు, వారి మీద ఎందుకు కేసు పెట్టలేదు. కేవలం వైఎస్ఆర్ కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలపై పోక్సో, అట్రాసిటీ మరో 11 కేసులు పెట్టారు. సీఎం చంద్రబాబు తప్పు చేసిన వారిని విడిచి పెట్టి.. తప్పు చేయని వారిని శిక్షిస్తున్నారు. ఈ ఒక్క ఘటనతో రాష్ట్రానికి ఏ సందేశం ఇవ్వదలచుకున్నారు’’ అంటూ చంద్రబాబును భూమన కరుణాకర్‌రెడ్డి ప్రశ్నించారు.ఇదీ చదవండి: పరామర్శకు వెళితే.. చెవిరెడ్డిపై పోక్సో కేసు -
వైఎస్సార్సీపీ నేతలే టార్గెట్‌గా తప్పుడు కేసులు: భూమన
సాక్షి, తిరుపతి: వైఎస్సార్సీపీ నేతలే లక్ష్యంగా తప్పుడు కేసులు బనాయిస్తున్నారని వైఎస్సార్సీపీ నేత, టీటీడీ మాజీ ఛైర్మన్ భూమన కరుణాకర్‌రెడ్డి మండిపడ్డారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, బాధితుడి విజ్ఞప్తి మేరకే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి పరామర్శించారని తెలిపారు. బాధితురాలిని పరామర్శిస్తే చెవిరెడ్డిపై ప్రభుత్వం కేసు పెట్టింది. కూటమి ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతుందని ఆయన మండిపడ్డారు.ఆపదలో ఉంటే చెవిరెడ్డే ఆదుకున్నారు: బాధితురాలి తండ్రి మేము చెవిరెడ్డిపై ఎలాంటి పోక్సో, ఎస్సీ,ఎస్టీ కేసు పెట్టలేదని.. తనకు చదువు రాదని కాగితాలపై పోలీసులే సంతకాలు పెట్టించుకున్నారని బాధితురాలి తండ్రి తెలిపారు.ఆపదలో ఉంటే చెవిరెడ్డే మమ్మల్ని ఆదుకున్నారని ఆయన చెప్పారు. ఆదుకున్నవారిపై మేము కేసు పెడితే మహాపాపం అని బాధితురాలి తండ్రి అన్నారు. -
ఐఏఎస్ కృష్ణబాబును టార్గెట్ చేసిన అయ్యన్నపాత్రుడు కుమారుడు
సాక్షి, అమరావతి: సీనియర్ ఐఏఎస్ కృష్ణబాబును స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు కుమారుడు విజయ్ టార్గెట్ చేశారు. కృష్ణబాబుపై సోషల్ మీడియాలో వ్యతిరేక పోస్ట్ పెట్టిన విజయ్.. పులివెందుల కాంట్రాక్టర్ల బిల్లులు క్లియర్ చేశారంటూ ఆరోపించారు. గత ప్రభుత్వంలో కీలక పోస్టుల్లో కృష్ణబాబు పని చేశారంటూ పోస్ట్ పెట్టారు. విజయ్ బహిరంగ ఆరోపణలతో ఐఏఎస్ అధికారి కృష్ణబాబు మనస్తాపం చెందారు. ఎన్నికల తర్వాత బిల్లులు చెల్లించలేదంటున్న కృష్ణబాబు.. ఫేజ్-2 మెడికల్ కాలేజీలకు ఫలితాల ముందు రూ. 125 కోట్లు చెల్లించామని.. అందులో పులివెందుల కాలేజీకి రూ.25 కోట్లు చెల్లించామని కృష్ణబాబు స్పష్టం చేశారు. విజయ్ తప్పుడు ఆరోపణలపై కృష్ణబాబు సీఎంకు ఫిర్యాదు చేయనున్నట్లు సమాచారం. -
ఈనాడు, ఆంధ్రజ్యోతిలకు వైఎస్ జగన్ లీగల్ నోటీసులు
సాక్షి, అమరావతి: రాష్ట్ర చరిత్రలో అత్యంత చౌకగా యూనిట్ రూ.2.49 చొప్పున కేంద్రంతో విద్యుత్ కొనుగోలు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం చేసుకున్న ఒప్పందంపై నిరాధార ఆరోపణలతో దుష్ప్రచారం చేస్తూ కథనాలు ప్రచురించిన ఈనాడు, ఆంధ్రజ్యోతి పత్రికలకు వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి తరఫు న్యాయవాదులు శనివారం లీగల్ నోటీసులు జారీ చేశారు. ఇది కేంద్ర ప్రభుత్వానికి, రాష్ట్ర ప్రభుత్వానికి మధ్య జరిగిన ఒప్పందం అని, థర్డ్ పార్టీకి ఎలాంటి పాత్ర లేదని ఆది నుంచి తమ క్లయింట్ స్పష్టం చేస్తున్నారని పేర్కొన్నారు. సెకీ ఐఎస్టీఎస్ (అంతర్రాష్ట్ర సరఫరా) చార్జీలు మినహాయింపు ఇచ్చిందని.. ఆ మేరకు ఒప్పంద పత్రాలు, సెకీ రాసిన లేఖ ప్రతులను చూపిస్తున్నా సరే ఆ పత్రికలు పట్టించుకోకుండా నిరాధారంగా తమ క్లయింట్ గౌరవ ప్రతిష్టలను దెబ్బ తీస్తూ, ఉద్దేశ పూర్వకంగా తప్పుడు కథనాలు ప్రచురించాయని చెప్పారు. కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వం, డిస్కంల మధ్య అత్యంత పారదర్శకంగా జరిగిన ఈ ఒప్పందంపై తప్పుడు కథనాలు ప్రచురించినందుకు బేషరతుగా క్షమాపణలు చెప్పాలని, దానిని ప్రముఖంగా మొదటి పేజీలో ప్రచురించాలని నోటీసుల్లో పేర్కొన్నారు. ఈ కథనాల వల్ల తమ క్లయింటు ప్రతిష్ట దెబ్బ తింటుందని ముందే తెలిసి, అందుకు అనుగుణంగా తప్పుడు ఆరోపణలతో కథనాలు ప్రచురించారని తెలిపారు. ఈ మేరకు ఉషోదయ ఎంటర్ ప్రైజెస్ ప్రైవేట్ లిమిటెడ్ పబ్లిషర్‌తో పాటు ఈనాడు ఎడిటర్ ఎం.నాగేశ్వరరావుకు, ఆమోద పబ్లికేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ పబ్లిషర్‌తో పాటు ఆంధ్రజ్యోతి ఎడిటర్ ఎన్.రాహుల్ కుమార్‌లకు వైఎస్ జగన్ తరఫు న్యాయవాదులు లీగల్ నోటీసు పంపారు.ఇదీ చదవండి: సెకితో ఒప్పందం.. ఏం జరిగిందో పూసగుచ్చినట్లు చెప్పిన వైఎస్ జగన్ -
‘కలెక్టర్ వెళ్లిన షిప్‌లోకి పవన్‌ను ఎందుకు వెళ్లనివ్వలేదు?’
సాక్షి, కాకినాడ జిల్లా: దొంగ సొత్తు దొరికినప్పుడు ఎందుకు ఆపలేదు?.. సీజ్ చేసిన బియ్యాన్నే మళ్లీ ఎందుకు రిలీజ్ చేశారంటూ కూటమి సర్కార్‌ను మాజీ మంత్రి కురసాల కన్నబాబు ప్రశ్నించారు. శనివారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు.‘‘పవన్ ఆవేదన గమనించాను. ప్రభుత్వం వచ్చి ఆరు నెలలు అవుతోంది. పోర్టుకు వస్తానంటే ఆరు నెలలు నుంచి ఆపేస్తున్నారని చెప్పారు. కూటమి ప్రభుత్వం వచ్చాక బియ్యం ఎగుమతులపై దృష్టి పెట్టారు. సివిల్ సప్లయి శాఖ మంత్రి తనిఖీలు చేసి పీడీఎస్ బియ్యాన్ని సీజ్ చేసినట్లు చెప్పారు...సివిల్ సప్లయి శాఖ నుండి పోర్డు వద్ద రెండు చెక్ పోస్టులు పెట్టారు. సివిల్ సప్లయి ఛైర్మన్ తోట సుధీర్ కూడా రేషన్ బియ్యం లారీలను పట్టుకున్నట్లు చూశాను. గతంలో మంత్రి మనోహర్ పట్టుకున్న బియ్యమే.. మళ్లీ బిజీ ఇచ్చి బియ్యాన్ని విడుదల చేశారు. బియ్యాన్ని విడుదల చేసినప్పుడు సివిల్ సప్లయి శాఖ షరతులు ఏంటి అని అడుగుతున్నాను. సివిల్ సప్లయి చెక్ పోస్టులు దాటి ఈ బియ్యం పోర్టులోకి ఎలా వెళ్లాయి’’ అంటూ కన్నబాబు నిలదీశారు.‘‘బియ్యం ఉన్న షిప్‌లోకి వెళ్తానంటే నన్ను వెళ్ళనీయడం లేదని పవన్ అంటున్నారు. డిప్యూటీ సీఎం హోదాలో ఉన్న పవన్‌ను ఎవరూ ఆపి ఉంటారని సామాన్యులలో ప్రశ్నలు తలెత్తున్నాయి. డిప్యూటీ సీఎం పై స్ధాయిలో వ్యక్తే పవన్‌ను షిప్పులోకి ఎక్కకుండా ఆపారా?. అక్రమాలు జరుగుతున్న పోర్టు రాష్ట్ర ప్రభుత్వం ఆధీనంలోనిదే?. కాకినాడ పోర్టు దేశ భద్రతకు ముప్పు ఉందని పవన్ ఆందోళన చెందారు. ఒకవేళ కసాబ్ లాంటి వాళ్లు వస్తే తప్పు రాష్ట్ర ప్రభుత్వానిదే కదా?’’ అంటూ కన్నబాబు దుయ్యబట్టారు.‘‘కలెక్టర్ వెళ్లిన షిప్పులోకి డిప్యూటీ సీఎంను ఎందుకు ఆపారు? ఎవరూ ఆదేశాల మేరకు ఆపి ఉంటారు. ఇప్పటీకి రేషన్ బియ్యం దందా జరుగుతుందని ఎల్లో మీడియాలోనే వస్తుంది? దానిని అడ్డుకోవాలి. సిస్టమ్‌లో ఉన్న లోపాలను సరిచేయడానికి రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి, పవన్ ప్రశ్నకు రాష్ట్ర ప్రభుత్వమే బాధ్యత వహించాలి. పవన్ దేశ భద్రత కోసం మాట్లాడారు.. దానికి రాష్ట్ర ప్రభుత్వమే సమాధానం చెప్పాలి. దీనికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలే బాధ్యత వహించాలి. సివిల్ సప్లయి శాఖ చాలా పటిష్టం అవ్వాల్సిన అవసరం ఉంది. ..ఇవాళ పేపర్ చూస్తే షాక్ కొట్టింది.. బాబు ష్యూరిటీ.. బాదుడు గ్యారెంటీ. విద్యుత్ ఛార్జీలతో చంద్రబాబు ప్రజలను బాదేశారు. యూనిట్ మీద రూ.2.19 పైసలు అదనపు భారాన్ని వేశారు. సంపద సృష్టిస్తానని చంద్రబాబు చెప్పారు. ప్రజల మీద భారం వేసి జగన్ సంపద సృష్టించలేదు. విద్యుత్ ఛార్జీలు పెంచమని ఎన్నికలకు మందు అనేక సభల్లో చంద్రబాబు చెప్పారు. ఇది చంద్రబాబు పర్మినెట్ స్టేట్మెంట్. ఐదు నెలల్లో మాట మార్చేశారు’’ అని కురసాల కన్నబాబు మండిపడ్డారు. -
ఏపీ అంతటా కొత్తగా ఎల్ఎం ట్యాక్స్! లేకుంటే పని జరగదు!!: అంబటి
గుంటూరు, సాక్షి: రాష్ట్రంలో దారుణమైన పరిస్థితులు ఉన్నాయని, అవినీతి, దోపిడీలపైనే కూటమి నేతలంతా దృష్టి పెడుతున్నారని వైఎస్సార్సీపీ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబు అన్నారు. తాజా పరిణామాలపై శనివారం సాయంత్రం గుంటూరు కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. ‘‘సంపద సృష్టించడం కంటే సంపద సృష్టించుకుంటాం.. అంతా మేమే దోచుకుంటాం’’ అన్నట్లుంది వాళ్ల తీరు ఉందని సెటైర్లు వేశారు. ఈ క్రమంలో పవన్ కాకినాడ పోర్టు పర్యటనపైనా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రవ్యాప్తంగా మద్యం షాపులు వచ్చాయి. మద్యం షాపులకు లాటరీలు పెట్టారు. కానీ, మద్యం షాపులు దక్కించుకున్న వారిని బెదిరించి వాటాలు తీసుకుంటున్నారు. రాష్ట్రంలో ఉచిత ఇసుక పాలసీ లేదు. కూటమి నేతలు ఇసుకను దోచుకుంటున్నారు. చివరకు బూడిద కోసం కూడా కొట్టుకుంటున్నారు. ఆది నారాయణ రెడ్డి, జేసీ ప్రభాకర్‌రెడ్డి బూడిద కోసం కొట్టుకుంటున్నారు. అక్రమార్జన కోసం టీడీపీ నేతలు వెంప్లరాడుతున్నారు. అవినీతి చేయడానికి కూటమి నేతలు పోటీ పడుతున్నారు. నియోజకవర్గాల్లో ఎల్ఎం (లోకల్ ఎమ్మెల్యే) ట్యాక్స్ నడుస్తోంది. ప్రతీదానికి లోకల్ఎమ్మెల్యే ట్యాక్స్ వసూలు చేస్తున్నారు. ఎవరైనా వ్యాపారం చేయాలన్నా.. ఏ పని జరగాలన్నా ట్యాక్స్ కట్టాల్సిందే. చివరకు.. కూటమి నేతలు అరాచకాలు చేస్తుంటే.. చంద్రబాబు పంచాయితీ పెట్టే స్థాయికి దిగజారారు. ఇన్నీ పాపాలు చేసే మీరు మళ్ళీ అధికారంలోకి వచ్చేది లేదు.పవన్ కల్యాణ్ కాకినాడ పోర్టు పర్యటనపై అంబటి సెటైర్లు సంధించారు. ఆల్రెడీ కలెక్టర్ పట్టుకున్న రేషన్ బియ్యంను చూడడానికి పవన్ సాహసోపేతంగా వెళ్లారు. తీరా ఒడ్డుకు వచ్చాక విచిత్రమైన ఆరోపణలు చేశారు. రెండు నెలల నుంచి ఆయన అక్కడికి వెళ్తానంటే అధికారులు అడ్డుపడుతున్నారంట. అధికారులు సహకరించలేదు అంట. ఆయన అసలు ప్రభుత్వంలో ఉన్నారో లేదంటే ప్రశ్నించే పక్షంలో ఉన్నారో అర్థం కావడం లేదు. కాకినాడ పోర్టుకు పొరుగు రాష్ట్రాల నుంచి కూడా ఎగుమతులు అవుతాయి. అందులో బియ్యం కూడా ఉంటుంది. అయితే ఆ బియ్యంలో పీడీఎస్ రైస్ కలిపి పంపించడమే స్కాం ఎప్పటి నుంచో నడుస్తోంది. గత ప్రభుత్వాలు కూడా కట్టడి చేసే ప్రయత్నాలు జరిగాయి. మరి అరికడతామని చెప్పిన పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్.. ఇప్పుడు ఆ బాధ్యత తీసుకుంటారా?. బియ్యం అక్రమ రవాణా అడ్డుకునే చిత్తశుద్ధి లేదు. ఇక.. అధికారులు తనను అడ్డుకుంటున్నారని పవన్ అంటున్నారు. బహుశా.. చంద్రబాబు, లోకేష్ చెబితేనే అధికారులు అలా చేశారేమో అనే అనుమానం కలుగుతోంది. అసలు డిప్యూటీ సీఎంకు అంతలా ప్రాధాన్యం ఇవ్వొద్దనే అధికారులు అలా ప్రవర్తించారేమో. ఇక్కడ ఇంకో విషయం.. కూటమి నేతల సహకారంతోనే ఈ స్కాం నడుస్తోంది. ఎమ్మెల్యే కొండ బాబుకు మామూళ్ళు లేకుండానే ఇదంతా జరుగుతుందా?. బియ్యం అక్రమ రవాణాకు బాధ్యత వహిస్తూ నాదెండ్ల మనోహర్, ఆ తర్వాత పవన్ ఇద్దరూ రాజీనామా చేయాలి. అంతేకాదు.. .. పవన్‌కు తన డైలాగ్‌కు తగ్గట్లే.. లెక్కలేనంత తిక్క ఉంది. అందుకే.. కాకినాడ పోర్టు నుంచి ఆర్డీఎక్స్ రావొచ్చని, కసబ్ లాంటోళ్లు వస్తారని, హోం మంత్రి అమిత్ షాకు లేఖ రాస్తానని ఇష్టానుసారం మాట్లాడుతున్నారు. పవన్ కళ్యాణ్ ప్రభుత్వంలో ఉన్నారా ఇంకా ప్రశ్నించే ధోరణిలో ఉన్నారా?. పవన్ కల్యాణ్ పెద్ద అసమర్థుడు అని అర్థం అవుతుంది అని అంబటి చురకలంటించారు. -
కోనసీమలో టీడీపీ Vs జనసేన.. ఫోన్ సంభాషణ వైరల్
సాక్షి, కోనసీమ జిల్లా: కోనసీమలో కూటమి నేతల మధ్య విభేదాలు బయటపడ్డాయి. టీడీపీ నేతలు తమను గుర్తించకపోవడంపై జనసేన కార్యకర్తలు అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు. కాంట్రాక్ట్ పనులు సైతం టీడీపీ నేతలే సర్దుకుంటున్నారంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.మలికిపురం మండలం గూడపల్లి గ్రామంలో రోడ్ల కాంట్రాక్టుల విషయమై ఓ టీడీపీ నేతకు జనసేన కార్యకర్త ఫోన్ చేసి నిలదీశారు. జనసేన- టీడీపీ నాయకుల సంభాషణ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఉచిత ఇసుక పేరుతో కూటమి ప్రభుత్వం రాజోలు ప్రజలను అన్యాయం చేసిందంటూ సోషల్ మీడియాలో జనసేన కార్యకర్త పెట్టిన పోస్ట్ హల్చల్ చేస్తోంది. -
ఎల్లో మీడియాకు ఇవి కనిపించడం లేదా?: కాకాణి
సాక్షి, నెల్లూరు: విద్యుత్ ఛార్జీలు పెంచి.. తమపై నిందలు మోపడం దారుణమంటూ కూటమి సర్కార్ తీరుపై మాజీ మంత్రి కాకాణి గోవర్థన్‌రెడ్డి మండిపడ్డారు. శనివారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ, ఎన్నికల ప్రచారంలో కరెంట్ ఛార్జీలు పెంచనని చెప్పి.. రెండోసారి కూడా పెంచుతున్నారంటూ దుయ్యబట్టారు. 9,400 కోట్ల రూపాయల అదనపు భారాన్ని ప్రజలపై మోపుతున్నారు. విద్యుత్ రంగం సంక్షోభంలో కురుకుపోవడానికి చంద్రబాబే ప్రధాన కారణం. 2014-19 మధ్య సోలార్, విండ్ పవర్‌ను సగటున 5.10 పైసలు పైనే చంద్రబాబు ఒప్పందం కుదుర్చుకున్నారు. వైఎస్ జగన్ నిర్ణయం వల్ల రాష్టానికి లక్షా పది వేల కోట్లు ఆదాయం వస్తే.. చంద్రబాబు హయాంలో 90 వేల కోట్ల రూపాయలు ప్రజలపై భారం పడింది. చంద్రబాబు దిగిపోయే సరికి రూ.86,215 కోట్ల రూపాయల అప్పుల ఊబిలోకి డిస్కమ్‌లు వెళ్లిపోయాయి’’ అని కాకాణి వివరించారు.సూపర్ సిక్స్ హామీలు ఎగ్గొట్టినా.. కరెంట్ ఛార్జీలు పెంచినా.. ఎల్లో మీడియాకు కనిపించడం లేదు. నిత్యావసర వస్తువులు నుంచి.. మద్యం దాకా అన్నీ రేట్లు పెరిగాయి. సంపద సృష్టిస్తామని చెప్పిన చంద్రబాబు.. ప్రజల సంపదను ఆవిరి చేస్తున్నారు. సంక్షేమ పథకాలు రాకపోవడంతో.. కుటుంబ ఆదాయం పడిపోయింది.. అప్పులు పెరగడంతో కాల్ మనీ గ్యాంగ్‌లు హాల్ చల్ చేస్తున్నాయి. ప్రజల దగ్గర నుంచి డబ్బులు లాక్కోవాలని చూస్తున్నారు.. అందుకే రెండోసారి కరెంట్ ఛార్జీలు పెంచుతున్నారు.’’ అని కాకాణి ఆగ్రహం వ్యక్తం చేశారు.దీన్ని వైస్సార్సీపీ ఖండిస్తుంది..మంత్రి నారాయణ వర్సెస్ కోటంరెడ్డి వ్యవహారంపై కాకాణి స్పందిస్తూ.. ప్రతి జిల్లాలో మంత్రులు, ఎమ్మెల్యేల మధ్య అవినీతిలో విభేదాలు వస్తున్నాయి. రాయలసీమలో అది నారాయణ రెడ్డి, జేసీ మధ్య రాజకీయ వివాదం రచ్చకెక్కింది. నేతల మధ్య సమన్వయం ఉండటం లేదు.. పాలన సరిగా లేదనడానికి నిదర్శనం.. కూటమి నేతల మధ్య బయటపడుతున్న విభేదాలే స్పష్టం చేస్తున్నాయి’’ అని కాకాణి గోవర్థన్‌రెడ్డి చెప్పారు. -
‘గుర్తుంచుకో చంద్రబాబూ.. అధికారం ఎల్లకాలం ఉండదు’
సాక్షి, కృష్ణా జిల్లా: రాష్ట్రంలో శాంతిభద్రతలను చంద్రబాబు సర్కార్ గాలికొదిలేసిందని.. ప్రభుత్వాన్ని ప్రశ్నించే వైఎస్సార్సీపీ నేతలు, కార్యకర్తలను టార్గెట్ చేయడమే పనిగా పెట్టుకుందంటూ మాజీ మంత్రి పేర్ని నాని మండిపడ్డారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, తప్పుడు కేసులతో వైఎస్సార్సీపీ శ్రేణులను వేధించడానికే పోలీసులను వాడుతున్నారంటూ ధ్వజమెత్తారు.‘‘పాత కేసులను తిరగదోడి.. తప్పుడు కేసులు పెడుతున్నారు. గన్నవరంలో 8 మంది వైఎస్సార్సీపీ నేతలను అక్రమంగా కేసుల్లో ఇరికించారు. న్యాయమూర్తి 307 కేసును తొలగించారు. కానీ బెయిల్ విషయంలో పబ్లిక్ ప్రాసిక్యూటర్ పచ్చ చొక్కాల ఒత్తిడికి లొంగిపోయారు. కుంటిసాకులతో రెండురోజుల పాటు కాలయాపన చేసి పోలీస్ కస్టడీ కోరారు. రెండు సార్లు విచారణ అయ్యాక ఏముందని పోలీస్ కస్టడీకి కోరుతున్నారు’’ అని పేర్ని నాని ప్రశ్నించారు...అమాయకులను తెచ్చి ముద్దాయిలను చేశారు. వైఎస్సార్సీపీ జెండా, జగన్ బొమ్మ పెట్టుకుని తిరగకుండా చేయాలని చూస్తున్నారు. అడ్డగోలుగా పోలీసులను వాడుతున్నారు. పాతకేసులను తిరగదోడుతున్నందుకు డీజీపీకి మా సూటిప్రశ్న. పాతకేసులకు సంబంధించి ఎస్సై, సీఐలను సస్పెండ్ చేశారా?. తప్పుడు ఉద్యోగం చేశావని ఒక్కరిపైనైనా చర్యలు తీసుకున్నారా?. చేసేవి దొంగ పనులు కాబట్టి చర్యలు తీసుకోలేకపోతున్నారు. ఒక్కొక్కరి పై 10, 20 కేసులు పెడుతున్నారు.తమతో పాపాలు చేయిస్తున్నారని కొందరు పోలీసు అధికారులు బాధపడుతున్నారు. ఖాకీ యూనిఫాం వేసుకుని తప్పుడు కేసులు పెట్టి పాపాలకు పాల్పడుతున్నారు. చంద్రబాబు ఎల్లకాలం సీఎంగా ఉండడు. ప్రభుత్వాలు శాశ్వతం కాదు. ఈ రోజు పసుపు చొక్కేలేసుకుని అక్రమంగా వ్యవహరిస్తున్న అధికారులు తప్పకుండా చర్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది’’ అని పేర్ని నాని హెచ్చరించారు. -
‘బుడమేరు వరద సాయం ఇదేనా బాబూ?’
విజయవాడ, సాక్షి: ఏపీలో చంద్రబాబు పాలన ఎంత అధ్వానంగా ఉందో చెప్పే పరిస్థితి ఇది. విజయవాడ ఎంపీతో పాటు కూటమి ఎమ్మెల్యేలు బహిరంగంగా ప్రభుత్వంపై తమ అసంతృప్తిని వ్యక్తం చేశారు. బుడమేరు వరద సాయం ఇంకా పూర్తి స్థాయిలో అందలేదంటూ బహిరంగంగానే పెదవి విరిచారు. ఈ క్రమంలో.. ఇవాళ జరిగిన తొలి డీఆర్సీ సమావేశంలో సమస్యలను ఏకరువు పెట్టారు వాళ్లు.బుడమేరు వరద సాయం ఇంకా చాలామందికి అందలేదంటూ డీఆర్సీలో ఎంపీ కేశినేని శివనాధ్(చిన్ని),ఎమ్మెల్యేలు నిజాలు ఒప్పుకున్నారు. బుడమేరు వరద ముంపు బాధితుల్లో బాధితులకు ఇంకా నష్టపరిహారం అందలేదు. మరోమారు ఎన్యుమరేషన్ చేయాలి అని ఎంపీ కేశినేని శివనాధ్(చిన్ని) అన్నారు. కొండచరియలు విరిగిపడి చనిపోయిన వారికి పరిహారం ఇవ్వలేదు. కొండ ప్రాంత ప్రజలను ఆదుకోవాలి అని ఈస్ట్ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ అన్నారు.వరద బాధితులను ఇంకా కొంత మందికి నగదు అందలేదు. మేము బయటకు వస్తుంటే ప్రజలు అడుగుతున్నారు. అన్ని ప్రాంతాల్లో వాటర్ డ్యామేజ్ జరిగింది. బుడమేరు డైవర్షన్ చర్యలు తీసుకోవాలి. పట్టి సీమ నీళ్లు వదిలినప్పుడు బుడమేరులోకి వస్తున్నాయి. బుడమేరు వల్ల మైలవరం నియోజకవర్గం పూర్తిగా దెబ్బతింది. జి.కొండూరులో 13,800 ఎకరాల రైతులు ఇబ్బది పడుతున్నారు. 1 కోటి 20 లక్షల మోటార్లు రిపేర్లు ఉన్నాయి అని మైలవరం ఎమ్మెల్యే,వసంత కృష్ణప్రసాద్ అన్నారు.నందిగామ ఎమ్మెల్యే,తంగిరాల సౌమ్య మాట్లాడుతూ.. నందిగామలో పంట పూర్తిగా దెబ్బతింది. రైతులకు నష్ట పరిహారం అందించాలని అన్నారు.గన్నవరం ఎమ్మెల్యే,యార్లగడ్డ వెంకట్రావు మాట్లాడుతూ.. విజయవాడ, అంబాపురం , గన్నవరంలో 200 కోట్లు అభివృద్ధి పనులు చేయాలి. అభివృద్ధి పనులకు నిధులు కేటాయంచాలి. విజయవాడ రూరల్ మండలంలో అభివృద్ధి చేయాలి అని అన్నారు.ఇక జగ్గయ్యపేట ఎమ్మెల్యే,శ్రీరామ్ రాజగోపాల్ మాట్లాడుతూ.. త్రాగునీరు విషయంలో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, ఆ సమస్యను తక్షణమే పరిష్కరించాలని అన్నారు.ధాన్యం కనుగోలు విషయంలో రైతులు ఇబ్బందులు పడుతున్నారని తిరువూరు,ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు అన్నారు. ధాన్యం కొనుగోలు విషయంలో ఆలోచన చేయాలి. తిరువూరులో పత్తి పంట కొనేవారు లేదు. పత్తి పండుతున్నా ఇక్కడ కొనుగోలు కేంద్రం లేదు..గుంటూరులో ఉంది అని గుర్త చేశారాయన.ఇక.. పీడీఎఫ్ ఎమ్మెల్సీ కె.ఎస్.లక్ష్మణరావు మాట్లాడుతూ.. కండ్రిక, జక్కంపూడి ప్రాంతంలో ఇంకా ఆటో డ్రైవర్లకు పరిహారం అందలేదన్నారు. అలాగే.. ప్రభుత్వ పాఠశాలలు పూర్తిగా దెబ్బతిన్నాయని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు. -
బూడిద పంచాయతీ కూడా సీఎంవోలో చర్చించే దుస్థితి: రవీంద్రనాథ్ రెడ్డి
సాక్షి, వైఎస్సార్ జిల్లా: సాక్షి, వైఎస్సార్ జిల్లా: కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఆరు,ఏడు నెలలు అవుతున్నా ఇచ్చిన హామీలు ఒక్కటీ అమలు చేయకుండా చవట ప్రభుత్వంలా మారిందని ధ్వజమెత్తారు వైఎస్సార్సీపీ వైఎస్సార్ జిల్లా అధ్యక్షుడు పీ రవీంద్రనాథ్ రెడ్డి. ఈ చేతగానితనాన్ని కప్పి పుచ్చుకునేందుకు వైఎస్సార్సీపీని టార్గెట్ చేసి వేధింపులకు గురిచేస్తుందని మండిపడ్డారు. సోషల్ మీడియా, వైఎస్సార్సీపీ కార్యకర్తలను వేధిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.టీడీపీ ప్రభుత్వంలో బూడిద పంచాయతీ కూడా ముఖ్యమంత్రి స్థాయిలో పంచాయితీ చేయాల్సిన దుస్థితి తలెత్తిందన్నారు. సీఎం స్ధాయిలో సీఎంవోలో బూడిద పంచాయితీలు చేస్తున్నారని, ఇంతకంటే దారుణం ఉంటుందా అని ప్రశ్నించారు.వైఎస్సార్ జిల్లా ఆర్టీపీపీ బూడిదను కూడా కూటమి నాయకులు దోచుకుంటున్నారని, దీని పంచాయితీని సీఎం చంద్రబాబు సెటిల్ చేస్తున్నారని విమర్శలు గుప్పించారు. ఐదారు రోజులుగా బూడిద పంచాయతీ కోసం పోలీసులంతా ఆర్టీపీపీ వద్ద కాపలా కాస్తున్నారని.. వేరే జిల్లా నుంచి దండయాత్రకు వస్తుంటే లా అండ్ ఆర్డర్‌ను కంట్రోల్ చేయలేకపోతున్నారని ఆరోపించారు. స్థానిక నాయకులను కూడా అదుపు చేయలేకపోతున్నారని అన్నారు.ఇదే కాదు మట్టి, ఇసుక, లిక్కర్ ఇలా ప్రతీది దోచుకోవడమే, దోచుకోవడంలో పోటీ లేకుండా ఉండేందుకు సెటిల్మెంట్లు చేస్తున్నారు, జిల్లాలోని పోలీస్ యంత్రాంగం అంతా బూడిద కాపలాకు వినియోగిస్తున్నారు. లా అండ్ ఆర్డర్ ఏమవుతుంది, ప్రజా సమస్యలు గాలికొదిలేసి ఇలా వీటిపై దృష్టిపెట్టడం ఎంతవరకు సమంజసం?. అన్ని ప్రభుత్వ శాఖల్లో ఒక్క పనీ జరగడం లేదు. ఇంత దారుణమైన పాలన ఉంటుందని ఏ ఒక్కరూ అనుకుని ఉండరు. పాలన మొత్తం నిర్వీర్యమైంది. అసలు రాష్ట్రంలో పాలన వ్యవస్థ అనేది ఉందా.రైతుల సమస్యలు పట్టించుకోవడం లేదు. రైతాంగం తీవ్ర ఇబ్బందుల్లో ఉంది. విత్తనాలు, ఎరువులు లేక అవస్ధలు పడుతున్నారు. శ్రీశైలం నుంచి విద్యుత్ ఉత్పత్తి కోసం నీటిని అంతా దిగువకు వదిలేస్తున్నారు. 215 టీఎంసీలకు గాను శ్రీశైలంలో 124 టీఎంసీల నీరు మాత్రమే ఉంది. రబీకి అవసరమైన నీటిని నిల్వ చేస్తున్నారా అంటే అదీ లేదు. రిజర్వాయర్లు ఖాళీ అవుతున్నాయి.కేఆర్ఎంబీ వారు గుర్తించి చెబితే కానీ ఏపీ ప్రభుత్వానికి చలనం లేదు. ఏపీ ప్రభుత్వానికి దున్నపోతు మీద వానకురిసిన చందంగా మారింది. అన్ని ప్రభుత్వ శాఖల్లో దోచుకోవడమే లక్ష్యంగా పాలన సాగుతోంది. దీనిని వైఎస్సార్సీపీ తీవ్రంగా ఖండిస్తుంది, ప్రజలు అన్నీ గమనిస్తున్నారు. ఇది చేతగాని ప్రభుత్వంగా మారింది, ప్రజలే బుద్దిచెప్పే రోజు త్వరలో వస్తుంది’ అని రవీంద్రనాథ్ రెడ్డి మండిపడ్డారు. -
తమ్ముడి రాజకీయ భవిష్యత్తు కోసమేనా..?
రాజకీయ ఉద్ధండులకు, వ్యూహ ప్రతివ్యూహాలకు పెట్టిన పేరు సింహపురి. అలాంటి జిల్లాలో ప్రస్తుతం నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి హాట్‌టాపిక్‌గా మారారు. తాజాగా అధికార పక్షంలో ఉంటూ రాజకీయ చర్చకు, రచ్చకు తెరలేపుతున్నారు. నూతన ప్రభుత్వం ఏర్పడి ఆర్నెల్లు కాలేదు. అప్పుడే నయా పాలి‘ట్రిక్స్’తో ముందుకు ఉరుకుతున్నారు. మంత్రి పదవి ఆశించి భంగపడిన కోటంరెడ్డి భవిష్యత్తు ప్రణాళికలకు సిద్ధమవుతున్నారని కొందరు భావిస్తుంటే.. తన సోదరుడి రాజకీయ భవిష్యత్తుకు లైన్ క్లియర్ చేస్తున్నారని మరికొందరు అంటున్నారు.సాక్షి ప్రతినిధి, నెల్లూరు: నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి సోదరుడు గిరిధర్‌రెడ్డి వచ్చే నెల నుంచి నియోజకవర్గంలో గడప గడపకు కార్యక్రమాన్ని నిర్వహించేందుకు సిద్ధమవుతున్నారు. అధికార పార్టీలో ఉన్న గిరిధర్‌రెడ్డికి పార్టీ పరంగా ఎలాంటి పదవులు దక్కలేదు. కొత్త ప్రభుత్వం ఏర్పడి ఆర్నెల్లు కూడా గడవలేదు. ఎన్నికలకు ఎంతో గడువున్నా, అప్పుడే ప్రజల్లోకి వెళ్లే కార్యక్రమానికి గిరిధర్‌రెడ్డి శ్రీకారం చుట్టడం వెను క రాజకీయ వ్యూహంతో పాటు సంకేతాలూ ఉన్నా యనే అంశం తెలుస్తోంది. అధికార పార్టీ అను మతి లేకుండానే గిరిధర్‌రెడ్డి ఈ కార్యక్రమాన్ని నిర్వహించే యత్నంలో గల ఆంతర్య మేమిటనే ఆసక్తికర చర్చ రాజకీయ వర్గాల్లో నడుస్తోంది. తమ్ముడి రాజకీయ భవిష్యత్తు కోసమేనా..? ఇప్పటి వరకు ఎమ్మెల్యే కార్యాలయ ఇన్చార్జిగా తెరవెనుక రాజకీయ వ్యవహారాలు నడిపిన గిరిధర్‌రెడ్డి ఇక తెరపైకి రావడం వెనుక ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి రాజకీయ వ్యూహం ఉందనే ప్రచారం జరుగుతోంది. ‘గడప గడపకు గిరిధర్‌రెడ్డి’ కార్యక్రమాన్ని డిసెంబర్ 4 నుంచి నిర్వహించేందుకు కోటంరెడ్డే రూపకల్పన చేశారని తెలుస్తోంది. టీడీపీలో కార్యకర్తగా ఉన్న గిరిధర్‌రెడ్డి ఆ పార్టీ అధిష్టాన అనుమతి లేకుండానే కార్యక్రమాన్ని చేపడుతున్నారు. రాజకీయంగా ఎలాంటి హోదా లేకుండానే ఆయన ప్రజల్లోకి ఎలా వెళ్తారనే ప్రశ్న ఆ పార్టీ వర్గాల్లో వినిపిస్తోంది. ఇప్పటి వరకు తన సోదరుడితో కలిసి గిరిధర్‌రెడ్డి అధికార కార్యక్రమాల్లో పాల్గొంటూ ఎమ్మెల్యే హోదాను అనధికారికంగా అనుభవిస్తున్నారు. ఎమ్మెల్యే తరహాలో అధికార కార్యక్రమాల్లో పాలుపంచుకోవడం, సమీక్షలు నిర్వహించడం, మంత్రులు నిర్వహించే సమీక్షల్లోనూ పాల్గొంటున్నారు. జమిలి ఎన్నికల ప్రచార నేపథ్యంలో..ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి తన సోదరుడ్ని ప్రజల్లోకి తీసుకెళ్లడాన్ని బట్టి జమిలి ఎన్నికలు వచ్చే అవకాశం ఉందనే సంకేతాలున్నాయని ఆయన అభిమానులు భావిస్తున్నారు. 2026లో నియోజకవర్గాల పునరి్వభజన ఉంటుందని, మరుసటి ఏడాదిలోనే జమిలి ఎన్నికలు జరుగుతాయనే ప్రచార నేపథ్యంలో ఇప్పటి నుంచే తానే ఎమ్మెల్యే అభ్యర్థనని చెప్పుకొనేందుకు గిరిధర్‌రెడ్డి ఈ కార్యక్రమానికి రూపకల్పన చేశారని తెలుస్తోంది.మంత్రి పదవి దక్కలేదనేనా..? రాజకీయ నాయకులు ఎన్నికలకు ఏడాది ముందు నుంచి హడావుడి చేయడం సహజం. అయితే ఎన్నికలు పూర్తయి ఆర్నెల్లు గడవకముందే నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి సరికొత్త రాజకీయ వ్యూహా నికి తెరతీశారు. వైఎస్సార్సీపీ నుంచి రెండుసార్లు ఎమ్మెల్యేగా విజయం సాధించిన ఆయన మంత్రి పదవిపై ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. అది దక్కకపోవడంతో అసంతృప్తికి గురయ్యారు. టీడీపీలో చేరితే అధికారంలోకి వచ్చాక మంత్రి పదవి ఇస్తామనే హామీతో ఎన్నికలకు ఏడాదిన్నర క్రితం ఆ పారీ్టలో చేరి హ్యాట్రిక్ ఎమ్మెల్యేగా విజయం సాధించారు. అయితే కోటంరెడ్డికి తన చిరకాల వాంఛగా ఉన్న మంత్రి పదవి కోసం లోకేశ్ కోటరీ ద్వారా ఎన్నో ప్రయత్నాలు చేసినా ఫలితం దక్కలేదు. తనను నమ్మించి వంచించారనే మనస్తాపంతో ఉన్న ఎమ్మెల్యే వైరాగ్యంలో కూరుకుపోయారు. జిల్లాకు చెందిన ఇద్దరు మంత్రులతో సాన్నిహిత్యంగా ఉన్నా, ప్రస్తుతం వారితో పొసగడం లేదు. నెల్లూరు రూరల్ నియోజకవర్గానికి ఆయువుపట్టుగా ఉన్న నగర కార్పొరేషన్లో మంత్రి నారాయణ పెత్తనంతో కోటంరెడ్డికి ప్రాధాన్యం తగ్గింది. ఈ పరిణామాలూ ఆయనకు రుచించడం లేదు. వైఎస్సార్సీపీలో ఉన్న స్వేచ్ఛా వాతావరణం టీడీపీలో లేకపోవడంతో ఆయన మానసిక సంఘర్షణకు గురవుతున్నారనే ప్రచారం జరుగుతోంది. భవిష్యత్తులో చేపట్టే మంత్రివర్గ విస్తరణలోనైనా అవకాశం లభిస్తుందనే యత్నంలో భాగంగానే తన సోదరుడితో నయా పాలి‘ట్రిక్స్’ సాగిస్తున్నారనే చర్చ రాజకీయ వర్గాల్లో నడుస్తోంది. అది సాధ్యం కానప్పుడు తన సోదరుడి రాజకీయ భవిష్యత్తుకు మార్గాన్ని సుగమం చేసేందుకు.. ప్రజల్లో పరపతిని పెంచే యత్నం కావొచ్చని రాజకీయ పండితులు అభిప్రాయపడుతున్నారు. అధిష్టానం అనుమతి లేకున్నా.. కూటమి ప్రభుత్వం పూర్తి స్థాయిలో కుదురుకోలేదు. ఎన్నికల హామీలను నెరవేర్చలేక ప్రజాగ్రహానికి గురవుతోంది. ఈ నేపథ్యంలో ఎమ్మెల్యే కోటంరెడ్డి తన సోదరుడ్ని ప్రజల్లోకి పంపే కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నారు. అధికార పార్టీ ఎమ్మెల్యే ప్రతినిధిగా వ్యవహరిస్తున్న గిరిధర్‌రెడ్డి ఈ సమయంలో ప్రజల్లోకి వెళ్తే కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలు నెరవేర్చలేదని వారి నుంచి వ్యతిరేకత ఎదురయ్యే అవకాశం ఉంది. ఈ పరిణామాలు రాష్ట్రం మొత్తంలో చర్చకు దారి తీసే అవకాశం ఉంది. ఒకవేళ ఇదే జరిగితే కూటమి ప్రభుత్వానికి గడ్డు పరిస్థితులు ఎదురుకానున్నాయి. ఈ పరిస్థితుల్లో గిరిధర్‌రెడ్డి కార్యక్రమానికి అనుమతి ఇచ్చే సాహసాన్ని పార్టీ అధిష్టానం చేయకపోవచ్చు. పార్టీ అనుమతి చ్చినా.. ఇవ్వకపోయినా.. గిరిధర్‌రెడ్డి ఈ కార్యక్రమానికి సిద్ధమైతే పరిస్థితులు, పరిణామాలు ఒక్కసారిగా మారే అవకాశం ఉంది. -
టీడీపీ తీరుతో మోదీకి మకిలి!
ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి జగన్‌పై టీడీపీ అధినేత, ప్రస్తుత సీఎం చంద్రబాబుతోపాటు ఎల్లోమీడియా మొత్తానికి అక్కసు ఉందన్నది జగమెరిగిన సత్యం. అయితే ఈ అక్కసు, ద్వేషాల్లో వారు ప్రధాని మోదీని భ్రష్టుపట్టించేందుకూ వెనుకాడటం లేదు. ఎలాగంటారా? అదానీపై అమెరికా కోర్టు పెట్టిన ముడుపుల కేసే ఉదాహరణ. ఒకపక్క చంద్రబాబేమో ఈ కేసులు ఆంధ్రప్రదేశ్‌కు అప్రతిష్ట తీసకొచ్చాయని వ్యాఖ్యానిస్తే.. కాంగ్రెస్ పార్టీ జాతీయ స్థాయిలో మోదీని నిందిస్తోంది. ఎన్డీయే కూటమిలో భాగస్వామి అయిన టీడీపీ కూడా కాంగ్రెస్ మాటలకు వత్తాసు పలుకుతున్నట్లుగా జగన్‌పై ఆరోపణలు గుప్పించడం మోదీని భ్రష్టుపట్టించడమే అవుతుంది. అదానీపై వచ్చిన ఆరోపణలలో నిజమని నమ్మితే చంద్రబాబు కూడా మోదీని నేరుగా తప్పు పట్టాలి కదా! ఎన్డీయే నుంచి బయటకు వస్తున్నట్లు చెప్పాలి కదా! అలా కాకుండా జగన్‌పై విమర్శలు చేస్తూ మోదీకి చికాకు కలిగించారు. ఈ విషయం కేంద్రంలోని బీజేపీ పెద్దలకు అర్థమవుతోందో లేదో!ఆంధ్రప్రదేశ్‌లో అప్పటి జగన్ ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వానికి చెందిన సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాతో (సెకి) చేసుకున్న ఒప్పందానికి సంబంధించి అవినీతి జరిగిందన్నది టీడీపీ, ఎల్లో మీడియా ఆరోపణ. తన సోలార్ పవర్‌కు ఆర్డర్లు పొందడానికి అదానీ ఆయా రాష్ట్రాలలో లంచాలు ఇచ్చారని అమెరికా పోలీసులు పెట్టిన అభియోగాల ఆధారంగా వీరు ఈ ఆరోపణలు చేస్తున్నారు. అమెరికా పోలీసులు దీనికి సంబంధించి ఎలాంటి ఆధారాలు చూపినట్లు కనిపించలేదు.ప్రముఖ న్యాయ కోవిదులు ముకుల్ రోహ్తగి, మహేష్ జెఠ్మలానీలు ఇదే వ్యాఖ్య చేశారు. అదే టైమ్ లో ఐదు రాష్ట్రాలు సెకీతో ఒప్పందం కుదుర్చుకుని విద్యుత్ తీసుకోవడానికి సిద్ధపడితే, ఆ రాష్ట్రాలలో కూడా ముడుపులు ఇచ్చారని అంటూనే అమెరికా పోలీసులు ఒక్క ఏపీ పేరునే ప్రస్తావించడం అనుమానాస్పదంగా ఉంది. ఈ రాష్ట్రాలు అసలు అదానీతో ఒప్పందమే చేసుకోలేదు. ఏపీకి సంబంధించిన జగన్ ప్రత్యర్థులు ఎవరైనా అమెరికా పోలీసులను కూడా ప్రభావితం చేశారా అన్న సందేహం వస్తుంది. అదానీ ప్రధాని మోదీకి సన్నిహితుడు కావడంంతో అంతర్జాతీయ సంస్థలు ఏమైనా దేశాన్ని అప్రతిష్ట పాలు చేయడానికి ఇలాంటి కుట్రలు చేశాయా? అన్న డౌటు కొందరు వ్యక్తం చేస్తున్నారు.జగన్‌పై విమర్శలు చేస్తే అవి మోదీకి, అదానీకి తగులుతాయన్న సంగతి చంద్రబాబు నాయుడు తెలియదా! సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఏమైనా ప్రైవేటు సంస్థా? కాదు కదా! కేంద్రానిది. వారు దానీ కంపెనీ నుంచో, మరో కంపెనీ నుంచో పవర్ కొని ఆయా రాష్ట్రాలకు సరఫరా చేస్తే వీరికి వచ్చిన కష్టం ఏమిటి? రాష్ట్రానికి విద్యుత్ యూనిట్ రూ.2.49లకే రావడం మేలా? కాదా? అన్నది చెప్పకుండా జగన్ పై బురద వేయడం వల్ల అది ఆయనపైనే పడుతుందా? ఆటోమాటిక్ గా అదానీతోపాటు, మోదీపై కూడా పడుతుంది కదా! చంద్రబాబు ఉద్దేశం అదే అయినా, లేదా ఈనాడు, ఆంధ్రజ్యోతి వంటి ఎల్లోమీడియా భావన అదే అయినా, ధైర్యంగా నేరుగానే ఆ మాట చెప్పి ఉండవచ్చు. జగన్‌తోపాటు వారిద్దరిపై కూడా ధ్వజమెత్తి ఉండవచ్చు.అలా ఎందుకు చేయడం లేదు? ఈ నేపథ్యంలో జగన్ ఈనాడు, ఆంధ్రజ్యోతిలకు క్షమాపణ డిమాండ్‌తో రూ.వంద కోట్ల పరువు నష్టం పరిహారం కోరుతూ నోటీసు పంపించారు. అయినా ఈ మీడియా అడ్డగోలు కథనాలు ఆపకపోవడం గమనార్హం. ప్రస్తుతం థేపీలో పెరుగుతున్న విద్యుత్ ఛార్జీల నుంచి ప్రజల దృష్టి మళ్లించడానికి ఇవి ఈ యాగీ చేస్తున్నాయి. తన ప్రభుత్వం చేసుకున్న ఒప్పందం వల్ల ఏడాదికి రూ.నాలుగు వేల కోట్ల చొప్పున పాతికేళ్లకు ఏపీకి రూ.లక్ష కోట్లు ఆదా అయిందని, అదంతా సంపదేనని జగన్ అన్నారు. గత చంద్రబాబు ప్రభుత్వం రూ.ఐదు నుంచి రూ.ఆరులకు సౌర, పవన విద్యుత్తును కొనుగోలు చేస్తామని ఒప్పందాలు చేసుకోవడం వల్ల ఏపీకి రూ.85 వేల కోట్ల భారం పడిందని జగన్ చెప్పారు.ఈ విషయాలకు ఈనాడు నేరుగా సమాధానం ఇవ్వకుండా చంద్రబాబు టైమ్ లో చేసిన ఒప్పందాలను ఈ ఒప్పందంతో పోల్చరాదనే పిచ్చి వాదన చేసింది. ఇందులోనే వారి డొల్లతనం బయటపడింది. అంత అధిక ధరలకు చంద్రబాబు ప్రభుత్వం పాతికేళ్లకు ఒప్పందాలు చేసుకోవాల్సిన అవసరం ఏమిటి? భవిష్యత్తులో ధరలు తగ్గుతాయని ఈనాడు రామోజీరావుకు తెలుసు కదా! అయినా అప్పట్లో ఈనాడు ఎందుకు ఆ ఒప్పందాలను వ్యతిరేకించలేదు.రూ.2.49లకే యూనిట్ విద్యుత్ కొంటేనే రూ.1750 కోట్ల లంచం ఇచ్చే అవకాశం ఉంటే అంతకు రెట్టింపు ధరకు పాతికేళ్లపాటు చంద్రబాబు ప్రభుత్వం ఒప్పందం చేసుకుని ఉంటే ఇంకెంత ముడుపులకు అవకాశం ఉండి ఉండాలి? పైగా జగన్ ప్రభుత్వం ఆ పీపీఏలను రద్దు చేయాలని తలపెడితే అప్పుడు ఇదే ఎల్లో మీడియా, చంద్రబాబు రద్దు చేయరాదని, పెట్టుబడులు రావంటూ ఎందుకు వాదించారు? దీంట్లో వారి ఇంటరెస్టు ఏమిటి? వారు ప్రచారం చేసినదాని ప్రకారం సెకీతో జగన్ ప్రభుత్వం ఒప్పందం వల్ల లక్ష కోట్ల భారం పడాలి.అది నిజమే అనుకుంటే అది ఎవరు చేస్తున్నట్లు. కేంద్ర ప్రభుత్వమే కదా! అంటే మోదీ ప్రభుత్వ చర్య వల్ల ఏపీకి లక్ష కోట్ల నష్టం వస్తోందని ఎందుకు రాయలేదు! సెకీ అంతర్రాష్ట్ర విద్యుత్ పంపిణీ ఛార్జీలను రద్దు చేసినట్లు రాష్ట్ర ప్రభుత్వానికి రాసిన లేఖ గురించి ఎందుకు ఈనాడు మీడియా సమాధానం ఇవ్వలేకపోయింది. అది నిజమా? కాదా? దానివల్ల ఎన్నడూ లేని విధంగా అతి తక్కువ ధరకు కేంద్రం ఏపీకి విద్యుత్ సరఫరా చేయడానికి ముందుకు వచ్చిందన్న వాస్తవాన్ని ఎందుకు కప్పిపుచ్చారు. అలాగే గుజరాత్లో రూ.1.99లకే యూనిట్ విద్యుత్ వస్తోందని ఈనాడు ప్రచారం చేసింది.ఇక్కడ మాత్రం అతి తెలివిగా అక్కడ నుంచి ఏపీకి తరలించడానికి అయ్యే వీలింగ్ ఛార్జీల ఖర్చు మరో రెండు రూపాయల గురించి మాత్రం కప్పిపుచ్చింది. ఇది వీళ్ల దిక్కుమాలిన జర్నలిజం. మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి చెప్పారనో, లేక తానే కనిపెట్టినట్లో ఏడు గంటలలోనే సెకీతో ఒప్పందం చేసుకున్నారని ఈనాడు పచ్చి అబద్దం ప్రచారం చేసినట్లు జగన్ డాక్యుమెంట్ల సహితంగా వివరిస్తే, దాని మీద తేలుకట్టిన దొంగ మాదిరి వ్యవహరించింది. తమిళనాడు, ఒడిషా, చత్తీస్గడ్, జమ్ము-కశ్మీర్ రాష్ట్రాలు సెకి నుంచి రూ.2.61లకు కొనుగోలు చేస్తే, దానిని ఎందుకు ఈ మీడియా చెప్పడం లేదు! పోనీ సెకితో కాకుండా అదానితో జగన్ ప్రభుత్వం నేరుగా ఒప్పందం చేసుకుందని చంద్రబాబు కాని, ఎల్లో మీడియా కాని ఆధారాలతో చూపించాయా? తాజాగా వచ్చిన ఒక సమాచారం ప్రకారం సెకీతో ఒప్పందాన్ని రద్దు చేసుకుంటే కేంద్రం నుంచి వచ్చే రూ.2800 కోట్ల ప్రోత్సహానికి గండి పడుతుందట. ఈ విషయాన్ని విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవి చెప్పారని ఒక ఆంగ్ల పత్రిక కథనాన్ని ఇచ్చింది. అంటే ఈ ఒప్పందం మంచిది అనే కదా!తమ చేతిలో మీడియా ఉంది కదా అని ఇష్టం వచ్చినట్లు రాసేసి బురద చల్లితే సరిపోతుందని అనుకుంటే సరిపోదు. వీరు జగన్ మీద బురద చల్లామని అనుకుంటున్నారు కాని, అది పడుతోంది మోదీపైన.ఎల్లో మీడియా కాని, టీడీపీ నేతలు పార్టీ ఆపీస్లో కూర్చుని ఎలాంటి వికృత ప్రచారం చేశారు! అమెరికా కేసులో జగన్ పేరు ఉన్నట్లు, ఆ పోలీసులు ఇండియాకు వచ్చి అరెస్టు చేసేస్తున్నట్లు, చివరికి అక్కడ జైలు కూడా రెడీ చేసినట్లు ఎంత దుర్మార్గంగా ప్రచారం చేశారు. ఇలా చేసినందుకు వారు సిగ్గు పడడం లేదు.అందులో ఏమాత్రం నిజం ఉన్నా అదానీ ముందుగా జైలుకు వెళతారని కదా? అని టీడీపీ వారు చెప్పాల్సింది.విచిత్రం ఏమిటంటే ఏపీ బీజేపీ నేతలు కొందరు చంద్రబాబుకే ప్రధాన్యత ఇస్తూ, మోదీపై బురద వేస్తున్నా కనీసం ఖండించ లేదు. గతంలో జగన్ పై సీబీఐ అక్రమ కేసులు పెట్టినట్లుగానే ఇప్పుడు అమెరికాలో కూడా పోలీసులు పిచ్చి అభియోగాలు మోపారా అన్న సందేహాన్ని న్యాయ నిపుణులు వ్యక్తం చేస్తున్నారు. అప్పట్లో సిమెంట్ కంపెనీకి నీరు ఇస్తే అది క్విడ్ ప్రోకో అని, పరిశ్రమకు భూమి ఇస్తే, అందులో నేరం ఉందని.. ఇలా జగన్ పై తప్పుడు కేసులు పెట్టారు.ఆ కేసుల వల్ల ఎపికి తీరని నష్టం జరిగింది. కొత్త పరిశ్రమలు రాకుండా పోయాయి.సోనియా గాంధీ, చంద్రబాబులతో పాటు అప్పటి సీబీఐ అధికారులు దీనికి కారణం అని భావిస్తారు. ఇప్పుడు కూడా సెకీ ఒప్పందంపై అనవసర వివాదం సృష్టించి దేశానికి, అందులోను ఏపీకి నష్టం చేస్తున్నట్లుగా కనిపిస్తుంది. ఒప్పందాన్ని రద్దు చేసి, కేంద్ర ప్రభుత్వ సంస్థ అయిన సెకీపై కేసు పెట్టే ధైర్యం చంద్రబాబు ప్రభుత్వం చేయవచ్చు కదా!అలా ఎందుకు చేయడం లేదు. పరోక్షంగా మోదీని గబ్బు పట్టిస్తూ, ఇంకో వైపు ఆ అగ్రిమెంట్ ను ఎందుకు కొనసాగిస్తున్నారన్న దానికి సమాధానం దొరకదు. ఈనాడు అధినేత దివంగత రామోజీకి పద్మ విభూషణ్ బిరుదు ఇప్పిస్తే, దానికి రిటర్న్ గిఫ్ట్ గా ప్రధాని మోదీకి ఆయన కుమారుడు కిరణ్ బురద రాస్తున్నట్లు అనిపిస్తుంది.- కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత