breaking news
-
మళ్లీ వచ్చే మంగళవారం చంద్రబాబు సర్కారు అప్పు రూ.4,237 కోట్లు
సాక్షి, అమరావతి : సంపద సృష్టించడం అంటే ప్రజలపై ఆర్థిక భారం మోపడం, అప్పులు చేయడమే లక్ష్యంగా సీఎం చంద్రబాబు పాలన సాగుతోంది. చంద్రబాబు ప్రభుత్వం వచ్చే మంగళవారం మళ్లీ రూ.4,237 కోట్లు అప్పు చేయనుంది. పదేళ్ల వ్యవధిలో రూ.1,237 కోట్లు, 14 సంవత్సరాల వ్యవధిలో రూ.1,500 కోట్లు, 15 సంవత్సరాల వ్యవధిలో రూ.1,500 కోట్లు అప్పు చేయనుంది. ఈ మేరకు ఆర్బీఐ శుక్రవారం నోటిఫై చేసింది. వచ్చే మంగళవారం సెక్యురిటీల వేలం ద్వారా ఆర్బీఐ ఈ రుణాన్ని రాష్ట్ర ప్రభుత్వానికి సమీకరించనుంది. గత మంగళవారమే 7.18 శాతం వడ్డీకి రూ.2000 కోట్లు అప్పు చేసిన విషయం తెలిసిందే.. దీంతో చంద్రబాబు ప్రబుత్వం ఇప్పటి వరకు చేసిన అప్పులు రూ.67,237 కోట్లకు చేరనున్నాయి. -
పవన్ ‘న్యూట్రల్’ గేర్!
సాక్షి ప్రతినిధి, కాకినాడ: రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలు.. సూపర్ సిక్స్ హామీల అమలులో విఫలం కావడం.. వరుసగా చిన్నారులపై అఘాయిత్యాలు, మహిళలపై హత్యాచారాల ఘటనల సమయంలో ఉలకని పలకని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ టీడీపీ పెద్దలు ఇరకాటంలో పడ్డప్పుడల్లా రంగంలోకి దిగుతున్నారు. కూటమి సర్కారు వైఫల్యాలకు బాధ్యత వహించకుండా.. తాను ప్రభుత్వంలో భాగం కాదనే రీతిలో తమపై విమర్శలకు దిగడంపై అధికార యంత్రాంగం విస్తుపోతోంది. శాంతి భద్రతల అంశం నేరుగా ముఖ్యమంత్రి చేతిలోనే ఉందన్న విషయం పవన్‌కు తెలియదా? అని ప్రశ్నిస్తున్నారు. ఇదంతా పవన్ తాను తటస్థుడినని చిత్రీకరించుకుంటూ ప్రత్యేకత చాటుకునే యత్నాల్లో భాగమని పేర్కొంటున్నారు. బియ్యాన్ని చూపించకుండా తనను ఓడ చుట్టూ తిప్పారని.. అధికారుల నుంచి సహాయ నిరాకరణ ఎదురవుతోందని.. కాకినాడ పోర్టు కార్యకలాపాల వెనుక పెద్ద స్మగ్లింగ్, మాఫియానే నడుస్తోందని పవన్ వ్యాఖ్యలు చేయడం పవన్ ‘న్యూట్రల్ గేర్’లో భాగమేనని పేర్కొంటున్నారు. తాజాగా కాకినాడ పోర్టులో పర్యటన సందర్భంగా ఎస్పీ, ఇతర ఉన్నతాధికారులు అక్కడ లేకపోవడంపై పవన్ మండిపడ్డారు. ఏదైనా సమస్య ఉంటే తన పార్టీకే చెందిన మంత్రి మనోహర్‌తో చర్చించకుండా.. ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ అమలులో ఉన్న సమయంలో అక్కడకు వెళ్లి హడావిడి చేయాల్సిన అవసరం ఏముందనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. అక్కడ ఆయన పార్టీకి చెందిన ఎంపీ, ఎమ్మెల్యేలే ప్రాతినిధ్యం వహిస్తున్నారని గుర్తు చేస్తున్నారు.ఇటీవల హోంమంత్రి అనితను లక్ష్యంగా చేసుకుని ఆయన విమర్శలు చేయటాన్ని గుర్తు చేస్తున్నారు. తాను తటస్థుడిననే ముద్ర కోసం తాపత్రయపడుతున్నట్టు కలరింగ్ ఇవ్వడంతో పాటు.. రాష్ట్రంలో జరిగే సంఘటనల్లో తన పాత్ర లేదని చెప్పుకోవడానికి ఇలా హైడ్రామాలకు తెరలేపారనే చర్చ జరుగుతోంది.సీజ్ చేసి విడుదల చేసిన పీడీఎస్ బియ్యమే!కాకినాడ జిల్లా కలెక్టర్ షాన్మోహన్ సగిలి రెండు రోజుల క్రితం కాకినాడ యాంకరేజ్ పోర్టు నుంచి విదేశాలకు స్టెల్లా ఎల్ పనామా నౌకలో ఎగుమతికి సిద్ధం చేసిన 640 టన్నుల బియ్యాన్ని పీడీఎస్‌గా గుర్తించినట్లు వెల్లడించారు. నౌకలోని ఐదు హేచర్లకు 52 వేల టన్నుల బియ్యం లోడింగ్ సామర్థ్యం ఉండగా 38 వేల టన్నులు లోడింగ్ చేశారు. ఇందులో బాయిల్ రైస్‌తో పాటు 640 టన్నులు పీడీఎస్ ఉన్నట్లు కలెక్టర్ ప్రకటించారు. పౌరసరఫరాల శాఖా మంత్రి నాదెండ్ల మనోహర్ రెండు నెలల క్రితం సీజ్ చేసిన పీడీఎస్ బియ్యాన్ని బ్యాంక్ గ్యారెంటీ తీసుకుని కొంత విడుదల చేశారు. అలా విడుదల చేసిన పీడీఎస్ బియ్యమే కలెక్టర్ నిర్వహించిన ఆకస్మిక తనిఖీలో స్టెల్లా ఎల్ పనామా నౌకలో ఉండటం గమనార్హం. పౌరసరఫరాల అధికారి సరెండర్ ఉత్తర్వులుకాకినాడ జిల్లా పౌరసరఫరాల అధికారి ఎంవీ ప్రసాద్‌ను సరెండర్ చేస్తూ శుక్రవారం ఉత్తర్వులు వెలువడ్డాయి. పీడీఎస్ బియ్యం వ్యవహారాన్ని సక్రమంగా నిర్వహించనందున ఆయన పౌరసరఫరాలశాఖ కమిషనరేట్‌లో రిపోర్టు చేయాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. సాక్షి కథనంతో కలకలం..కలెక్టర్ స్వయంగా పోర్టుకు వెళ్లి పరిశీలించాక అదే బియ్యాన్ని ఉప ముఖ్యమంత్రి పవన్ కూడా తాజాగా కాకినాడ పోర్టుకు వెళ్లి పరిశీలించారు. తన వెంట ఉన్న కాకినాడ సిటీ టీడీపీ ఎమ్మెల్యే వనమాడి వెంకటేశ్వరరావు (కొండబాబు)పై పవన్ అసహనం వ్యక్తం చేయడం గమనార్హం. కస్టమ్ మిల్లింగ్ రైస్ (సీఎంఆర్) చేసిన మిల్లర్లకు ప్రభుత్వం ఇటీవల రూ.200 కోట్లు బకాయిలు విడుదల చేసింది. ఈ బకాయిలు విడుదల చేసినందుకు కూటమికి చెందిన ఒక నేతకు 8 శాతం కమీషన్లు ముట్టినట్లు చెబుతున్నారు. ఈ వ్యవహారంపై ‘కమీషన్ల కోసం కపట నాటకం’ శీర్షికన ఈ నెల 27న ‘సాక్షి’ ప్రధాన సంచికలో కథనం వెలువడటం రాష్ట్ర స్థాయిలో చర్చనీయాంశమైంది. -
అసలు జరిగింది ఇదే.. జాతీయ మీడియాతో వైఎస్ జగన్
సాక్షి, తాడేపల్లి: సెకీతో ఒప్పందం వల్ల రాష్ట్రానికి ఎంతో డబ్బు ఆదా అవుతుందని.. తక్కువ రేటు కోసమే తాము టెండర్లు పిలిచామని వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి అన్నారు. ఎన్డీటీవీ ప్రతినిధితో ఆయన మాట్లాడుతూ, ‘‘మా ప్రభుత్వం ఉద్దేశం తక్కువ ధరకు విద్యుత్ సేకరించడమేనని.. సాధారణంగా విద్యుత్ సేకరణ ఛార్జీ రూ.5.10గా ఉంది. సెకీతో ఒప్పందంతో రాష్ట్రానికి ఎంతో ఖర్చు తగ్గింది’’ అని వివరించారు.‘‘మేం ముందుగా 6,400 మెగావాట్ల విద్యుత్‌కు టెండర్లు పిలిచాం. కొందరి కారణంగా అది కోర్టు వివాదాల్లో చిక్కుకుంది. దాదాపు 10 నెలల తర్వాత సెకీ నుంచి మాకు లేఖ వచ్చింది. ఆ టెండర్లలో కోట్ చేసిన అమౌంట్‌కే విద్యుత్ ఇచ్చేందుకు సెకీ ఒప్పుకుంది. రూ.2.49కే యూనిట్ విద్యుత్ సఫ్లై చేసేందుకు అంగీకరించింది. అంతేకాదు స్పెషల్ ఇంటెన్సివ్ కూడా ఇచ్చేందుకు ఒప్పుకుంది. ఇంటర్ స్టేట్ ట్రాన్స్మిషన్ ఛార్జీలు లేకుండా విద్యుత్ ఇచ్చేందుకు సెకీ అంగీకరించింది.’’ అని వైఎస్ జగన్ చెప్పారు. ‘‘ఆంధ్రప్రదేశ్‌లో ఇంత తక్కువ రేటుకు విద్యుత్ కొనుగోలు చేయడం ఇదే ప్రథమం.. అంత మంచి మంచి అవకాశాన్ని ఏ ప్రభుత్వమైనా వదులుకుంటుందా?. కేంద్ర ఆధీనంలో సెకీ ఇచ్చిన ఆఫర్‌ను అంగీకరించాం. పెట్టుబడి పెట్టాలనుకునే ఎవరైనా సరే సీఎంను కలుస్తారు కదా.. ఇలాంటి విషయాల్లో సీఎం ముందుకు రాకపోతే పెట్టుబడులు పెట్టేందుకు ఎవరూ ముందుకు రారు...2019 నుంచి నా పదవీ కాలం ముగిసే వరకు నేను గౌతమ్ అదానీని ఐదారు సార్లు కలిశా. కేవలం ఆగస్టులో కలిసిన విషయాన్ని ఎందుకు ప్రస్తావిస్తున్నారు. ఆగస్టు తర్వాత అంతకుముందు కూడా చాలాసార్లు కలిశా. ఆయన్నే కాదు.. చాలామంది వ్యాపారవేత్తలతో భేటీ అయ్యాను. సీఎంగా అది నా బాధ్యత.. విధుల్లో ఒక భాగం’’ అని వైఎస్ జగన్ చెప్పారు. -
టీడీపీ అసభ్యకరమైన పోస్ట్.. అంబటి వార్నింగ్
గుంటూరు, సాక్షి: సోషల్ మీడియాలో కూటమి ప్రభుత్వాన్ని నిలదీసినా.. తప్పులను ఎత్తి చూపినా.. అణచివేసే కార్యక్రమం ఏపీలో కొనసాగుతోంది. తప్పుడు కేసుల బనాయింపు.. అక్రమ నిర్బంధాలతో వేధిస్తోంది. అయితే గురివింద గింజ సామెతలాగా.. వాళ్లు మాత్రం ఇష్టానుసారం రెచ్చిపోతున్నారు. తాజాగా..ఈ మధ్యకాలంలో తెలుగు దేశం అఫీషియల్ ఎక్స్ హ్యాండిల్ మరీ శ్రుతి మించిపోతోంది. మాజీ సీఎం వైఎస్ జగన్ తాజా ప్రెస్‌మీట్‌ను ఉద్దేశించి.. ఓ అసభ్యకరమైన పోస్టు ఉంచింది. ఆ పోస్టుపై వైఎస్సార్సీపీ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబు తీవ్రంగా స్పందించారు.మా నాయకుడిపై(వైఎస్ జగన్) ఇలాంటి మార్ఫింగ్ పోస్టులు పెడుతూ.. నీతులు చెబుతూ.. కేసులు పెడుతున్నారంటూ మండిపడ్డారాయన. తామూ అలా చేయగలమని, తక్షణమే డిలీట్ చేయకపోతే చట్టపరమైన చర్యలకు ఉపక్రమిస్తామని హెచ్చరించారాయన. ఈ క్రమంలో ఏపీ పోలీసులను ట్యాగ్ చేశారాయన. ఈ విధంగా మార్ఫింగ్ చేసి మా నాయకుడిపై పోస్టులు పెడుతూ మాకు నీతులు చెప్తారు కేసులు పెడతారుమేము కూడా @ncbn @naralokesh నీ మార్ఫింగ్ చేసి ఫోటోలు పెట్టలేమా ?ఈ అసభ్యకర పోస్టుని తక్షణమే డిలీట్ చేయండి,లేదంటే చట్టపరమైన చర్యలకువెళ్తాం జాగ్రత్త ! @iTDP_Official @APPOLICE100 https://t.co/H1tG1NnswB— Ambati Rambabu (@AmbatiRambabu) November 29, 2024 -
వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలు లేకుండా సభా సంఘం ఏర్పాటు
సాక్షి, విజయవాడ: విశాఖ డైరీ అవినీతి విచారణకు ప్రత్యేక హౌస్ కమిటీ ఏర్పాటు చేయగా, ప్రతిపక్ష సభ్యులు లేకుండానే అసెంబ్లీ సభా సంఘం ఏర్పాటు చేయడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. శాసనసభ తీర్మానం మేరకు సభా సంఘం ఏర్పాటు చేయగా, కేవలం అధికార టీడీపీ, జనసేన ఎమ్మెల్యేలతోనే సభా సంఘం ఏర్పాటైంది. గతంలో ఎన్నడూ లేని విధంగా ప్రతిపక్ష సభ్యులు లేకుండా సభా సంఘం ఏర్పాటు చేశారు. సభా సంఘం చైర్మన్‌గా టీడీపీ ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ, సభ్యులుగా బొండ ఉమామహేశ్వరరావు, వెలగపూడి రామకృష్ణ బాబు, పళ్లా శ్రీనివాసరావు, గౌతు శిరీష , ఆర్.వి.ఎస్.కే.కె.రంగా రావు, దాట్ల సుబ్బరాజులను నియమించారు. రెండు నెలల్లోగా నివేదిక సమర్పించాలని కమిటీకి స్పీకర్ ఆదేశాలు జారీ చేశారు. -
కష్టమొచ్చినప్పుడు నన్ను గుర్తు తెచ్చుకోండి: వైఎస్ జగన్
సాక్షి, గుంటూరు: తాను మీ అందరినీ కోరేది ఒక్కటే.. మన పోరాట పటిమ సన్నగిల్లకూడదంటూ వైఎస్సార్సీపీ నేతలు, కార్యకర్తలకు ఆ పార్టీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి పిలుపునిచ్చారు. శుక్రవారం ఆయన తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో మాట్లాడుతూ, ప్రతిపక్షంలో ఉన్నాం కాబట్టి కష్ట,నష్టాలుంటాయి. కష్టకాలంలో ఉన్నప్పుడే మనకు అదొక పరీక్ష. కష్టమొచ్చినప్పుడు అందరూ నన్ను గుర్తు తెచ్చుకోండి’’ అని వైఎస్ జగన్ పేర్కొన్నారు.‘‘16 నెలలు నన్ను జైల్లో పెట్టారు. బెయిల్ కూడా ఇవ్వలేదు. అయినా ప్రజల అండతో ముఖ్యమంత్రి అయ్యాను. ఈ సంక్రాంతి తర్వాత జిల్లాల్లో పర్యటిస్తా. ప్రతి బుధవారం, గురువారం జిల్లాల్లోనే ఉంటా. రెండు రోజుల పాటు కార్యకర్తలతో మమేకం అవుతా.. ‘కార్యకర్తలతో జగనన్న, పార్టీ బలోపేతానికి దిశానిర్దేశం’ అనే పేరుతో కార్యక్రమాన్ని నిర్వహిస్తాం’’ అని వైఎస్ జగన్ వెల్లడించారు.‘‘ప్రతిపక్షంలో ఉంటూ రాష్ట్రంలోనూ, దేశంలోనూ కాంగ్రెస్‌తో యుద్ధం చేశాను. తెలుగుదేశం పార్టీ, కాంగ్రెస్ పార్టీ ఇద్దరూ నా మీద పిటిషన్లు వేశారు. ఇంత మందితో యుద్ధం చేస్తున్నా... నేను బెయిల్ పిటిషన్ వేసినప్పుడల్లా అన్న మాటేమిటంటే.. నేను బయటకు వస్తే ఇన్ప్లూయన్స్ చేస్తానని చెప్పేవారు. కేంద్రంలోనూ, రాష్ట్రంలోనూ మీ ప్రభుత్వాలే అయినా నేను ప్రభావితం చేస్తానని బెయిల్ తిరస్కరించారు. ఇలా 16 నెలలు చేసారు. కానీ ఏమైంది.. ఆ తర్వాత బయటకు వచ్చి.. ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసి పరిపాలన చేశాం.ఇదీ చదవండి: ఈ దెబ్బకు చంద్రబాబు సింగిల్ డిజిట్‌కు వెళ్లాల్సిందే: వైఎస్ జగన్..అలానే కష్టాలు ఎల్లకాలం ఉండవు. చీకటి తర్వాత పగలు రాక తప్పదు. ఇది సృష్టి నేర్పిన రహస్యం. కాబట్టి ఇది కచ్చితంగా గుర్తుపెట్టుకొండి. కష్టాల్లో ఉన్నప్పుడు పోరాటం చేయగలిగితే మనం తిరిగి నిలబడగలుగుతాం. కాలం గడిచే కొద్దీ ఈ భయాలు పోతాయి. మరో రెండు మూడు నెలల్లో అందరూ దైర్యంగా రోడ్డు మీదకు వస్తారు. అందరిలో ఈ ధైర్యం రావాలి. ఎందుకంటే ప్రజల తరపున, ప్రజా సమస్యల మీద పోరాటం చేయాలి. ప్రజా వ్యతిరేక పెరుగుతోంది. ప్రజల తరపున వారికి అండగా నిలవగలిగితే... ప్రజలు మనతో పాటు నడుస్తారు. మీరందరూ ఎంపీపీ, జడ్పీటీసీ వంటి మండలస్ధాయి నాయకులు.. మీరు ఇంకా ఎదగాలంటే.. ప్రతిపక్షంలో మీరు ఏ రకమైన పాత్ర పోషిస్తున్నారు అన్నదే నిర్ణయిస్తుంది.’’ అని వైఎస్ జగన్ చెప్పారు. -
‘ఇంగ్లీష్ అర్థం కాదా?’.. షర్మిలకు స్ట్రాంగ్ కౌంటర్
తిరుపతి, సాక్షి: ఉద్దేశపూర్వకంగానే వైఎస్ జగన్మోహన్రెడ్డిపై విమర్శలు గుప్పిస్తున్న ఏపీ పీసీసీ చీఫ్ షర్మిలకు స్ట్రాంగ్ కౌంటర్ పడింది. టీడీపీ అనుకూల మీడియా ఆంధ్రజ్యోతి కథనం ఆధారంగా షర్మిల చేసిన వితండ వాదనను మాజీ మంత్రి ఆర్కే రోజా ఖండించారు.షర్మిల చేస్తున్న రాజకీయాలు, వాదనలు, ఎత్తుగడలు, విమర్శలు.. అన్నింటిని లక్ష్యం ఒక్కటేనని, కానీ, ఎట్టి పరిస్థితుల్లో జరగదని అన్నారామె. అలాగే.. జగన్ రాజకీయ పతనం గురించి ఎవరు ఎంత కోరుకున్నా.. ప్రజలు మాత్రం ఆయనకు అండగా ఉంటారని రోజా చెప్పారు. ఈ క్రమంలో.. సెకి ఒప్పందం గురించి వైఎస్ జగన్ నిర్వహించిన మీడియా సమావేశం తాలుకా సారాంశాన్ని రోజా తన సోషల్ మీడియా ఖాతాలో పోస్ట్ చేశారు.@realyssharmila గారూ.. మీకు తెలుగు అర్థం కాదా? ఇంగ్లీష్ అర్థం కాదా? నిన్న మీ అన్న గారు రెండు భాషల్లో సెకీతో ఒప్పందం అంశానికి సంబంధించి ఆధారాలతో సహా పూర్తి వివరాలు ఇచ్చారు. అయినా సరే ఆంధ్రజ్యోతి రాసిన స్టోరీలో పాయింట్లు పట్టుకుని మీరు మళ్లీ ఒక వితండవాదనతో తిరిగి జగన్…— Roja Selvamani (@RojaSelvamaniRK) November 29, 2024సెకితో ఒప్పందం గురించి టీడీపీ అనుకూల మీడియా ఈనాడు, ఆంధ్రజ్యోతి చేస్తున్న రాద్ధాంతం తెలిసిందే. ఈ క్రమంలో వైఎస్ జగన్ మీడియా సమావేశం నిర్వహించి మరీ ఆ ఒప్పందం గొప్పతనాన్ని అందరికీ అర్థమయ్యేలా వివరించారు. అదే సమయంలో తనపై వస్తున్న ఆరోపణలకు ధీటుగా బదులిచ్చారు. అంతేకాదు.. క్షమాపణలు చెప్పని తరుణంలో ఈనాడు, ఆంధ్రజ్యోతిపై రూ.100 కోట్లకు పరువు నష్టం దావా వేస్తానని హెచ్చరించారు కూడా. -
చంద్రబాబు వద్ద ‘బూడిద’ పంచాయితీలో ట్విస్ట్
సాక్షి, గుంటూరు: టీడీపీ నేత జేసీ ప్రభాకర్‌రెడ్డి, బీజేపీ ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి మధ్య బూడిద గొడవ చివరికి చంద్రబాబు వద్దకు చేరింది. ఆదినారాయణరెడ్డికి వ్యతిరేకంగా ఎస్పీకి జేసీ ఘాటు లేఖ రాసిన సంగతి తెలిసిందే. జేసీ లేఖ నేపథ్యంలో కూటమిలో ప్రకంపనలు సృష్టించగా.. పంచాయితీ తేల్చడానికి ఆదినారాయణరెడ్డిని చంద్రబాబు పిలిపించారు. అయితే, చంద్రబాబుతో భేటీ తర్వాత జేసీ ప్రభాకర్ రెడ్డి పై ఆదినారాయణరెడ్డి తీవ్ర విమర్శలు చేశారు.‘‘వెట్ డ్రై యాష్ అనేది ఉచితం. పీఎంఈజీపీలో తీసుకుపోతామని అంటాం. ఈ మాత్రం దానికే జేసీ ప్రభాకర్‌రెడ్డి పెద్ద లేఖ రాశారు. లెటర్ రాసిన వాడు స్వయంగా రావాలి కదా? ఎందుకు రాలేదు. జ్వరమో.. ఇంకేదో నాకు తెలియదు...బీజేపీ, టీడీపీ సమస్య కాదు ఇది. స్థానికత సమస్య ఇక్కడ ఉంది. అల్ట్రా టెక్ సిమెంట్ ఫ్యాక్టరీ తన ఏరియాలో ఉంది కనుక జెసీ ప్రభాకర్‌రెడ్డి అడుగుతున్నాడు. సీఎం నిర్ణయం తీసుకుంటారు. ఆయన చెప్పినట్లు వింటాం. జేసీ దివాకర్‌రెడ్డిది ఏమైనా రాజరికమా?. కాంగ్రెస్ నుంచి ఆయన టీడీపీకి వచ్చాడు.. నేను టీడీపీ నుంచి బీజేపీకి వచ్చా.. కూటమిలో ఉంటూ కూటమిని విమర్శించడం సరికాదు’’ అని ఆదినారాయణరెడ్డి పేర్కొన్నారు.ఇదీ చదవండి: అటు ఆది.. ఇటు జేసీ ‘బూడిద’ రగడ! -
ఈ దెబ్బకు చంద్రబాబు సింగిల్ డిజిట్‌కే: వైఎస్ జగన్
గుంటూరు, సాక్షి: రాష్ట్రంలో చంద్రబాబు పాలనలో ఒక క్రమపద్ధతిలో వ్యవస్థల నిర్వీర్యం జరుగుతోందని వైఎస్సార్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అన్నారు. మోసమే పరమావధిగా ఉన్న వాళ్లను ప్రజలు ఏం చేస్తారో మనం వచ్చే ఎన్నికల్లో చూస్తామని అన్నారాయన. తాడేపల్లిలో ఉమ్మడి కృష్ణా నేతలతో తాజా రాజకీయాలు, పార్టీ బలోపేతంపై దిశానిర్దేశం చేయశారాయన.రాష్ట్రంలో రెడ్ బుడ్ రాజ్యాంగం నడుస్తోంది. వ్యవస్ధలన్నీ కూప్పకూలిపోయిన పరిస్దితి కనిపిస్తోంది. దొంగకేసులు పెడుతున్నారు. ప్రభుత్వాన్ని ఎవరైనా విమర్శిస్తూ పోస్టింగులు పెట్టినా, ఫార్వార్డ్ చేసినా కూడా కేసులు పెడుతున్నారు. ప్రశ్నించే గొంతులను అణిచివేయాలని చూస్తున్నారు.మనకు అబద్దాలు చెప్పడం చేతగాదు. మన పాలనలో చక్కగా బటన్లు నొక్కాం. కాబట్టి చంద్రబాబు కూడా చేస్తాడేమోనని ప్రజలు ఆశపడ్డారు. కానీ ఆరునెలలు తిరక్కమునుపే వాస్తవం అర్ధమయింది.మన ప్రభుత్వానికి, చంద్రబాబునాయుడు ప్రభుత్వానికి ప్రజలు పోల్చి చూస్తున్నారు. ప్రతి ఇంట్లో దీనిపై చర్చ జరుగుతోంది.నేను మీ అందరికీ కోరేది ఒక్కటే. మనలో పోరాట పటిమ సన్నగిల్లగూడదు. ప్రతిపక్షంలో ఉన్నాం కాబట్టి కష్టాలుంటాయి, నష్టాలుంటాయి. కష్టకాలంలో ఉన్నప్పుడే మనకు అదొక పరీక్ష. కష్టమొచ్చినప్పుడు అందరూ నన్ను గుర్తు తెచ్చుకొండి. 16 నెలలు నన్ను జైల్లో పెట్టారు. బెయిల్ కూడా ఇవ్వలేదు. అయినా ప్రజల అండతో ముఖ్యమంత్రి అయ్యాను.ఈ సంక్రాంతి తర్వాత పార్లమెంటు యూనిట్‌గా జిల్లాల్లో పర్యటిస్తాను. ప్రతి బుధవారం, గురువారం జిల్లాల్లోనే ఉంటాను. రెండు రోజుల పాటు కార్యకర్తలతో మమేకం అవుతాను. పూర్తిగా కార్యకర్తలకే కేటాయిస్తాను. కార్యకర్తలతో జగనన్న, పార్టీ బలోపేతానికి దిశా నిర్దేశం అనే పేరుతో కార్యక్రమాన్ని నిర్వహిస్తాం.జనవరిలోగా పార్టీలోని వివిధ విభాగాల నియామకాలు పూర్తి చేయాలి. జిల్లాస్ధాయి నుంచి మండల స్ధాయి వరకు పూర్తవ్వాలి. ఆ తర్వాత బూత్ కమిటీలు, గ్రామ కమిటీలు ఏర్పాటు జరగాలి. గ్రామస్ధాయి నుంచి ఎమ్మెల్యే, ఎంపీ వరకు ప్రతి ఒక్కరికీ ఫేస్ బుక్, ఇన్‌స్టా, వాట్సప్ ఉండాలి. ఎక్కడ ఏ అన్యాయం జరిగినా దాన్ని వీడియో తీసి అప్ లోడ్ చేయాలి. ప్రతి గ్రామంలో తెలుగుదేశం పార్టీని, చంద్రబాబును ప్రశ్నించాలి. సూపర్ సిక్స్ ఏమైంది? ఏమైంది సూపర్ సెవన్? అని నిలదీయాలి.ఇంకా ఆయన ఏమన్నారంటే..‘‘ఉమ్మడి కృష్ణా జిల్లాకు సంబంధించిన ఎంపీపీలు, జడ్పీటీసీలు, మున్సిపల్ చైర్ పర్సన్లు, మేయర్లందరితో సమావేశం జరుపుకోవడం సంతోషంగా ఉంది. రాష్ట్రంలో పరిస్థితులు ఎలా ఉన్నాయన్నది మీ అందరికీ తెలిసిన విషయమే. ఎంపీపీలపరంగానూ, జడ్పీటీసీలపరంగానూ, మేయర్ల పరంగా జరిగిన స్ధానిక సంస్దలకు సంబందించిన ఎన్నికల్లో మన వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ క్లీన్ స్వీప్ చేసింది. 46 చోట్ల ఎన్నికలు జరిగితే 44 జడ్పీటీసీ స్ధానాల్లో మన పార్టీ గెలిచింది. ఎంపీపీలు, ఎంపీటీసీల స్ధానాల్లో కూడా దేవుడి దయతో గొప్ప విజయాన్ని అందుకున్నాం. ఇవాళ స్ధానిక సంస్ధల్లో ఎక్కడ చూసినా మనమేం కనిపిస్తాం. అయినా జనరల్ బాడీ మీటింగ్ ఎక్కడ జరిగినా మనకు దక్కాల్సిన గౌరవం దక్కడం లేదు.మనం చెడు చేసి ప్రతిపక్షంలో కూర్చోలేదు. మీరంతా ప్రజాప్రతినిధులగా ఎన్నికలప్పుడు తిరిగినవాళ్లే. ప్రతి ఇంటికి, గడప గడపకూ మనం వెళ్లినప్పుడు ఏ ఇంటికి వెళ్లినా చిక్కటి చిరునవ్వుతోనే ప్రజలు అక్కున చేర్చుకున్నారు. కారణాలు ఏమైనా కానీ ఎన్నికలకు వచ్చేసరికి మనం అనుకున్న ఫలితాలు రాలేదు. మనందరికి తెలిసిన విషయం ఏమిటంటే... జగన్ కుటుంబానికి అంతా మేలు చేశాడు. కానీ చంద్రబాబునాయుడు మాత్రం ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరికీ మేలు చేస్తానని చెప్పాడు. కాబట్టి ఆ ప్రలోభాలకు మొగ్గు చూపిన పరిస్థితులు మనం చూశాం. చాలా మంది నాతో కూడా చెప్పారు. మనం కుటుంబం మొత్తాన్ని ఒకటిగా చేసి మంచి చేశాం. మనం అబద్దాలు చెప్పలేదు. మనం చేయగలిగింది మాత్రమే చెప్పాం.వాళ్లు మాత్రం ప్రతి ఇంటికి వెళ్లి ఇంట్లో ఎవరు కనిపించినా అబద్దపు హామీలు చెప్పారు. ఇద్దరు పిల్లలు కనిపిస్తే... నీకు రూ.15వేలు, నీకు రూ.15వేలు అని, తల్లులు కనిపిస్తే నీకు రూ.18వేలు అనే మాటలు, కాస్త పెద్ద వయస్సులో 50 ఏళ్లు దాటిన అమ్మలు, అత్తలు కనిపిస్తే నీకు రూ.48వేలు అని, ఆ ఇంట్లోంచి ఉద్యోగం వెతుక్కుంటున్న 20 ఏళ్ల పిల్లవాడు కనిపిస్తే నీకు రూ.36వేలు అని, అదే ఇంట్లోంచి రైతు బయటకు వస్తే నీకు రూ.20వేలు అని చెప్పే పరిస్థితి చూశాం. ప్రతి ఇంటికి వెళ్లి చంద్రబాబు ముఖ్యమంత్రి అయితే ఇవన్నీ జరగబోతున్నాయని ప్రలోభాలు పెట్టిన నేపధ్యంలో ప్రస్పుటంగా కనిపిస్తున్న పరిస్దితులు. సాధ్యం కాని హామీలని, అవి సాధ్యం కాదని తెలిసినా హామీలిస్తూ తెలుగుదేశం పార్టీ వాళ్లు ప్రచారం చేస్తున్నారు, ప్రతి ఒక్కరినీ చెడగొట్టే కార్యక్రమం చేస్తున్నారని నా దగ్గరకు వచ్చి చాలా మంది చెప్పారు. అబద్దాలు చెప్పడం మనకు చేతగాదు. అతి నిజాయితీ, అతి మంచితనం మనకున్న సమస్యలు... కానీ ఇదే రేపు మళ్లీ మనల్ని అధికారంలోకి తీసుకొస్తుంది. కారణం జగన్ ఇవన్నీ చేయగలిగాడు.. చంద్రబాబునాయుడు వీటికన్నా ఓ రెండుమూడింతలు ఎక్కువ చెబుతున్నాడు, అదీ మోదీగారితో కలిసి వస్తున్నాడు చేయగలుగుతాడేమోనని ఆశపడ్డారు. మన పరిపాలనకాలంలో మనం ఇంత చక్కగా బటన్లు నొక్కాం కాబట్టి చంద్రబాబు కూడా చేస్తాడేమోనన్న అన్నఆశ ప్రజలకు కలిగింది. దానివల్ల 10శాతం మన ఓటు బ్యాంకు తగ్గింది. కానీ ఆరునెలలు తిరక్కమునుపే ఇవాళ పరిస్థితి చూస్తే.. ప్రతి ఇంట్లో ఒకటే చర్చ జరుగుతోంది. జగన్ కనీసం పలావు అన్నా పెట్టేవాడు. చంద్రబాబునాయుడు బిర్యానీ పెడతానన్నాడు. తీరా చూస్తే పలావు పోయింది, బిర్యానీ పోయిందనే పరిస్థితి చర్చ జరుగుతోంది. పథకాలమీద చర్చ ఇలా ఉంటే.. మరోవైపున ప్రతి వ్యవస్ధ కుప్పకూలిపోతుంది.ఫీజులు ఇవ్వక పిల్లలు కాలేజీలకు వెళ్లలేని పరిస్థితుల్లో ఉన్నారు. జనవరి నుంచి ఫీజులు పెండింగ్. మన హయాంలో ప్రతి త్రైమాసికం అయిన వెంటనే ఒక నెల ఇన్సె్ఫక్షన్ కి తావుచ్చి.. మరసటి నెల ఇచ్చే పరిస్థితి. అంటే జనవరి, పిబ్రవరి, మార్చికి సంబంధించిన ఫీజులు ఏఫ్రిల్‌లో వెరిఫికేషన్ చేసి మే నెలలో మన హయాంలో ఇచ్చాం. కానీ ఇవాల చూస్తే జనవరి, పిబ్రవరి, మార్చి క్వార్టర్, ఏప్రిల్, మే, జూన్ క్వార్టర్, జూలై, ఆగష్టు, సెప్టెంబరు క్వార్టర్ ఇక అక్టోబరు, నవంబరు, డిసెంబరు ఈ జనవరి నాటికి సంవత్సరం ఫీజులు పిల్లలకు ఇవ్వని పరిస్థితి కనిపిస్తోంది. ఒక్క ఫీజు రీయింబర్స్ మెంట్ బకాయిలే రూ.2,800 కోట్లు. మన హయాంలో ప్రతి ఏప్రిల్‌లో వసతి దీవెన రూ.1100 కోట్లు ఇచ్చేవాళ్లం. అది కూడా బకాయిలు.వ్యవస్ధని నడిపించే ఈ కార్యక్రమాలు కుప్పకూలుతున్న పరిస్థితి. దాదాపు రూ.3,900 కోట్లు కేవలం పిల్లల చదువులకు సంబంధించిన బకాయిలు ఉన్నాయి. ఆరోగ్యశ్రీకి సంబందించిన మార్చి నుంచి నెట్ వర్క్ ఆసుపత్రులకు రూ.2,200 కోట్లు పెండింగ్ లో ఉన్నాయి. ఇవాళ పేదవాడు ఆసుపత్రి గడప ఎక్కాలంటే, డాక్టర్లు ఉచితంగా వైద్యం అందిస్తారన్న నమ్మకం సన్నగిల్లంది. ఇక ఆరోగ్య ఆసరా గురించి చెప్పాల్సిన అవసరం లేదు. అది ఎక్కడుంది అనుకునే పరిస్థితికి ప్రజలు వచ్చారు. 108, 104 డయల్ చేసినా ఆంబులెన్స్ వస్తుందన్న పరిస్థితి లేదు. వాళ్లు స్ట్రైక్ లు, ధర్నాలు చేస్తున్నారు. విద్య, వైద్యంతో పాటు చివరకు ధాన్యం కొనుగోలు పరిస్థితి దయనీయంగా ఉంది. దళారీలు కొనేదాకా ప్రభుత్వం అడుగు ముందుకు వేయడానికి సిద్ధంగా లేదు. ధాన్యం కొనుగోలుకు ఎంఎస్పీ రూ.1720 అయితే రైతులు కృష్ణా జిల్లాలోనే రూ.300 తక్కువకు అమ్ముకుంటున్నారు. ఆర్బీకేల ద్వారా దళారీల వ్యవస్ధను తీసేసి, ఇ–క్రాప్ చేసి పారదర్శకంగా మనం కొనుగోలు చేసినట్టు.. ఈ ప్రభుత్వం కొనాల్సిన సమయంలో కొనుగోలు చేస్తే.. రైతులకు గిట్టుబాటు ధర వస్తుంది. కానీ ఈ ప్రభుత్వం అలా చేయకపోవడం వల్ల రైతులు గిట్టుబాటు ధర రాని పరిస్థితుల్లోకి వెళ్లిపోయారు. ఇలా ప్రతి వ్యవస్ధ పూర్తిగా దిగజారిపోయిన పరిస్ధతిలున్నాయి.మరోవైపు రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తోంది. దొంగకేసులు పెడుతున్నారు. ప్రభుత్వాన్ని ఎవరైనా విమర్శిస్తూ పోస్టింగులు చేసినా, ఫార్వార్డ్ చేసినా కూడా కేసులు పెట్టే అధ్వాన్నపరిస్దితులు చూస్తున్నాం. ఒకవైపు మంచి చేయకపోగా.. మరోవైపు ప్రశ్నించే గొంతులను అణిచివేయాలని చూస్తున్నారు. మామూలుగా ఆరునెలలకు ఊహించినదానికన్నా అధ్వాన్నంగా ప్రభుత్వ వ్యతిరేకత పెరిగింది. ఈ ప్రభుత్వం వచ్చి కూడా ఆర్నెల్లు ఇట్టే గడిచిపోయాయి. ఎన్నికలు ఎప్పుడు వచ్చినా మంచిదే.వీళ్లు ఈ మాదిరిగా ఇన్నిన్ని అబద్దాలు ఆడి, ఇన్ని మోసాలు చేసిన వీళ్ల పరిస్థితి రేపు ఎన్నికల్లో ఎలా ఉంటుంది అన్నది నేను చెప్పాల్సిన పనిలేదు. ఎవరికైనా అర్ధం అవుతుంది. నేను మీ అందరికీ కోరేది ఒక్కటే. ఈ రోజు నుంచి ఎన్నికలు అయ్యే వరకు అది మూడేళ్లైనా, రెండేళ్లైనా నేను మిమ్నల్ని కోరేది ఒక్కటే. మనలో పోరాట పటిమ సన్నగిల్లగూడదు. ప్రతిపక్షంలో ఉన్నాం కాబట్టి కష్టాలుంటాయి, నష్టాలుంటాయి. రాజకీయాల్లో ఉన్నప్పుడు ఎల్లకాలం అధికారంలోనే ఉండం. కానీ కష్టకాలంలో ఉన్నప్పుడు మనం ఎలా ఉన్నాం, ఎలా ప్రవర్తించాం అన్నది మాత్రమే మనల్ని పైకి తీసుకువస్తుంది. అది కచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. కేరెక్టర్, క్రెడిబులిటీ మనం పడేస్తే మరలా ఏరుకోవడం కష్టం. కష్టకాలంలో ఉన్నప్పుడే మనకు అదొక పరీక్ష.కష్టమొచ్చినప్పుడు అందరూ నన్ను గుర్తు తెచ్చుకొండి. కష్టాలు రాకుండా పోవు. 16 నెలలు నన్ను జైల్లో పెట్టారు. పలుమార్లు బెయిల్ పిటిషన్ వేస్తే... రిజెక్ట్ అయ్యేది. ప్రతిపక్షంలో ఉంటూ రాష్ట్రంలోనూ, దేశంలోనూ కాంగ్రెస్‌తో యుద్ధం చేశాను. తెలుగుదేశం పార్టీ, కాంగ్రెస్ పార్టీ ఇద్దరూ నా మీద పిటిషన్లు వేశారు. ఇంత మందితో యుద్ధం చేస్తున్నా... నేను బెయిల్ పిటిషన్ వేసినప్పుడల్లా అన్న మాటేమిటంటే.. నేను బయటకు వస్తే ఇన్ప్లూయన్స్ చేస్తానని చెప్పేవారు. కేంద్రంలోనూ, రాష్ట్రంలోనూ మీ ప్రభుత్వాలే అయినా నేను ప్రభావితం చేస్తానని బెయిల్ తిరస్కరించారు. ఇలా 16 నెలలు చేసారు. కానీ ఏమైంది.. ఆ తర్వాత బయటకు వచ్చి.. ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసి పరిపాలన చేశాం.అలానే కష్టాలు ఎల్లకాలం ఉండవు. చీకటి తర్వాత పగలు రాక తప్పదు. ఇది సృష్టి నేర్పిన రహస్యం. కాబట్టి ఇది కచ్చితంగా గుర్తుపెట్టుకొండి. కష్టాల్లో ఉన్నప్పుడు పోరాటం చేయగలిగితే మనం తిరిగి నిలబడగలుగుతాం. కాలం గడిచే కొద్దీ ఈ భయాలు పోతాయి. మరో రెండు మూడు నెలల్లో అందరూ దైర్యంగా రోడ్డు మీదకు వస్తారు. అందరిలో ఈ ధైర్యం రావాలి. ఎందుకంటే ప్రజల తరపున, ప్రజా సమస్యల మీద పోరాటం చేయాలి. ప్రజా వ్యతిరేక పెరుగుతోంది. ప్రజల తరపున వారికి అండగా నిలవగలిగితే... ప్రజలు మనతో పాటు నడుస్తారు. మీరందరూ ఎంపీపీ, జడ్పీటీసీ వంటి మండలస్ధాయి నాయకులు.. మీరు ఇంకా ఎదగాలంటే.. ప్రతిపక్షంలో మీరు ఏ రకమైన పాత్ర పోషిస్తున్నారు అన్నదే నిర్ణయిస్తుంది.ఈ సంక్రాంతి తర్వాత నేను కూడా పార్లమెంటు యూనిట్‌గా జిల్లాల బాట పడతాను. దాదాపుగా జనవరి నెలాఖరునుంచి మొదలుపెడతాను. ప్రతి బుధవారం, గురువారం జిల్లాల్లోనే ఉంటాను. ప్రతి పార్లమెంటును ఒక యూనిట్‌గా తీసుకుని నేను అక్కడకి వచ్చి బస చేస్తాను. బుధవారం మూడు నియోజకవర్గాల కార్యకర్తలతోనూ, గురువారం మరో నాలుగు నియోజకవర్గాల కార్యకర్తలతోనూ మమేకం అవుతాను. పూర్తిగా కార్యకర్తలకే కేటాయిస్తాం. అక్కడే ఉంటూ వారితో మమేకమవుతూ, వారికి తోడుగా ఉంటూ వారికి దగ్గరయ్యే కార్యక్రమం చేస్తాం. కార్యకర్తలతో జగనన్న, పార్టీ బలోపేతానికి దిశా నిర్దేశం అనే పేరుతో కార్యక్రమాన్ని నిర్వహిస్తాం.ఈలోగా జిల్లా స్ధాయి, నియోజకవర్గస్దాయి నుంచి మండలస్ధాయి వరకు వివిధ విబాగాలకు సంబంధించిన అధ్యక్షులు, అన్ని కమిటీలు పూర్తి చేయాలని జిల్లా అధ్యక్షులకు ఇప్పటికే చెప్పాం. నా కార్యక్రమం మొదలైన తర్వాత మండలస్ధాయి నుంచి గ్రామస్ధాయి వరకు పార్టీ వ్యవస్ధను బలోపేతం చేసే కార్యక్రమం చేస్తాం. ఆ తర్వాత బూత్ కమిటీల నుంచి గ్రామ కమిటీల ఏర్పాటు చేసే కార్యక్రమం కూడా చేపడతాం. ఇది ఎంతవరకు వెళ్లాలంటే.. గ్రామస్ధాయిలో కార్యకర్త నుంచి ఎమ్మెల్యే, ఎంపీ వరకు ప్రతి ఒక్కరికీ ఒక ఫేస్ బుక్, ఇన్‌స్టా, వాట్సప్ ఉండాలి. ఎక్కడ ఏ అన్యాయం జరిగినా దాన్ని వీడియో తీసి అప్ లోడ్ చేయాలి. యూట్యూబ్‌లో కూడా పోస్ట్ చేయాలి. సంవత్సరం పూర్తయ్యే సరికి గ్రామంలో తెలుగుదేశం పార్టీని, చంద్రబాబును ప్రశ్నిస్తూ ప్రతి ఇంట్లోంచి వాయిస్ రావాలి. అది మనం చేస్తూ, మన కార్యకర్తలతో చేయించాలి. సూపర్ సిక్స్ ఏమైంది? ఏమైంది సూపర్ సెవన్? మాకు చెప్పిన మాటలు ఏమయ్యాయి? అన్న దగ్గర నుంచి మొదలైన ప్రశ్నల వర్షం... ఏమైంది మా స్కూల్? ఏమైంది మా హాస్పిటల్? ఏమైంది మా పంటల కొనుగోలు పరిస్థితి? ఏమైంది మా ఆర్బీకే అన్నవరకు ప్రశ్నలు లేవాలి. ఆ దిశగా అడుగులు ముందుకు పడాలి. ఇది జరగాలంటే మండల, మున్సిపాల్టీ వార్డు స్ధాయిలో మీరు చాలా కీలకమైన పాత్ర పోషించాలి. మండలస్దాయి వరకు బలోపేతం చేసే దిశగా మీరంతా అడుగులు వేయాలి. నా కార్యక్రమం మొదలైన తర్వాత మండల స్ధాయి నుంచి గ్రామ స్దాయి వరకు నాతో పాటు మీరూ, నేనూ ఇద్దరం కలిసి పార్టీని బలోపేతం చేసే కార్యక్రమం చేయాలి. ఇది మన ఎజెండా. గతంలో మనకు 151 స్ధానాలు వచ్చాయి. ఈసారి తెలుగుదేశం పార్టీని సింగిల్ డిజిట్‌కు పరిమితం చేయాలి. కచ్చితంగా దేవుడు ఈ పనిచేయిస్తాడన్న నమ్మకం ఉంది. ఏ మంచీ చేయకుండా కేవలం అబద్దాలు, మోసం చేసినప్పుడు అది కోపం కింద మారుతుంది. ప్రజల్లో ఆ కోపం రెట్టింపు అవుతుంది. మన మీద ప్రేమ పెరుగుతుంది. ఆరోజు మనం చూస్తాం. మోసమే పరమావధిగా ఉన్న వాళ్లను ప్రజలు ఏం చేస్తారో మనం చూస్తాం’’ అని జగన్ అన్నారు. -
సంక్రాంతి తర్వాత.. కార్యకర్తలతో జగనన్న
గుంటూరు, సాక్షి: వైఎస్సార్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి కీలక నిర్ణయం ప్రకటించారు. క్షేత్రస్థాయిలోకి వెళ్లే క్రమంలో.. జిల్లాల్లో పర్యటించాలని నిర్ణయించుకున్నారాయన. సంక్రాంతి తర్వాత ఈ పర్యటనలు ప్రారంభం కానున్నట్లు తెలిపారాయన.తాడేపల్లిలో ఉమ్మడి కృష్ణా నేతలతో ఇవాళ వైఎస్ జగన్ సమావేశం అయ్యారు. ఈ భేటీలోనే ఆయన జిల్లాల పర్యటనపై ఒక స్పష్టమైన ప్రకటన చేశారు. ‘‘కార్యకర్తలతో జగనన్న, పార్టీ బలోపేతానికి దిశా నిర్దేశం’’ కార్యక్రమం పేరిట జిల్లాలకు జగన్ వెళ్లనున్నారు. ఈ పర్యటనల్లో నేరుగా పార్టీ కార్యకర్తలతో వైఎస్ జగన్ భేటీ కానున్నారు. ప్రతీ బుధ,గురువారాల్లో పూర్తిగా వాళ్లతోనే ఉండనున్నారు. వాళ్ల నుంచి పార్టీ బలోపేతానికి సలహాలు తీసుకోనున్నారు. ఇందుకోసం రోజూ 3 నుంచి 4 అసెంబ్లీ నియోజకవర్గాల్లో పర్యటించనున్నారు. అలాగే ప్రతీ పార్లమెంట్ నియోజక వర్గంలో సమీక్షలు జరపనున్నారు. వైఎస్ జగన్ జిల్లాల పర్యటనలకు సంబంధించి పార్టీ ఒక అధికారిక ప్రకటన చేసే అవకాశం ఉంది. -
కూటమి సర్కార్ అక్రమ కేసులు.. ముగ్గురు సోషల్ మీడియా కార్యకర్తలకు బెయిల్
సాక్షి, గుంటూరు: చిలకలూరిపేట నియోజకవర్గ సోషల్ మీడియా యాక్టివిస్టులు పెద్దిరెడ్డి సుధారాణి దంపతులకు గుంటూరు కోర్టు బెయిల్ మంజూరు చేసింది. సోషల్ మీడియాలో సుధారాణి దంపతులు పోస్ట్ పెట్టారంటూ నగరంపాలెం పోలీసులు కేసు నమోదు చేశారు. నరసరావుపేట సబ్ జైల్లో ఉన్న సుధారాణి దంపతులను పిటి వారెంట్ ద్వారా గుంటూరు కోర్టులో పోలీసులు ప్రవేశపెట్టగా, సుధారాణి దంపతులకు బెయిల్ మంజూరైంది.వైజాగ్ సోషల్ మీడియా యాక్టివిస్టు బోడి వెంకటేశ్వర్లుకు కూడా గుంటూరు కోర్టు బెయిల్ మంజూరు చేసింది. సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టాడంటూ పట్టాభిపురం పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. ఒంగోలు జైలు నుంచి పిటి వారెంట్ ద్వారా గుంటూరు కోర్టులో ప్రవేశపెట్టగా, ఆయనుకు గుంటూరు కోర్టు బెయిల్ మంజూరు చేసింది.కాగా, సోషల్ మీడియా యాక్టివిస్ట్ పెద్దిరెడ్డి సుధారాణి పట్ల మహిళ అని కూడా చూడకుండా పోలీసులు అత్యంత క్రూరంగా వ్యవహరించారని, రోజులతరబడి ఆమెపైన, ఆమె భర్తపై థర్డ్ డిగ్రీ ప్రయోగించి శారీరకంగా, మానసికంగా వేధించారనే ఆరోపణలున్నాయి.తెలంగాణలో గుడికి వెళ్లిన సుధారాణిని ఆమె భర్త, పిల్లలతో సహా పోలీసులు అదుపులోకి తీసుకొని చిలకలూరిపేటకు తీసుకొచ్చారు. 41 ఏ నోటీసులు ఇచ్చి వదిలి పెట్టాల్సింది పోయి వారి నిర్బంధంలోనే ఉంచుకొని, చిత్ర హింసలకు గురి చేశారు. ఆమెపై 6 అక్రమ కేసులు బనాయించారు. పోలీసులు శారీరకంగా వేధించి, గాయపర్చినట్లు ఆమె కోర్టుకు తెలిపారు. తనను, భర్త వెంకటరెడ్డిని, పిల్లలను చిలకలూరిపేటకు తీసుకెళ్లారని, పిల్లలను వేరు చేసి భర్తతో పాటు తనను ఒంగోలు వన్‌టౌన్ పీఎస్‌కు తరలించినట్టు ఆమె కోర్టుకు చెప్పారు. -
వీఎంసీ కౌన్సిల్ సమావేశం రచ్చ రచ్చ.. వరద సాయంపై మాటల యుద్ధం
సాక్షి, విజయవాడ: వీఎంసీ కౌన్సిల్ సమావేశం రచ్చ రచ్చగా మారింది. టీడీపీ, వైఎస్సార్సీపీ కార్పొరేటర్ల మధ్య మాటల యుద్ధం సాగింది. వరద సాయం అందలేదని కౌన్సిల్ దృష్టికి వైఎస్సార్సీపీ కార్పొరేటర్లు తీసుకొచ్చారు. దీంతో టీడీపీ కార్పొరేటర్లు వాగ్వాదానికి దిగారు. వరద నష్టంపై ప్రశ్నించిన వైఎస్సార్సీపీ మహిళా కార్పొరేటర్ జమల పూర్ణమ్మపై టీడీపీ కార్పొరేటర్ ముమ్మినేని వెంకట ప్రసాద్ నోరుపారేసుకున్నారు.ముమ్మినేని వెంకట ప్రసాద్‌పై వైఎస్సార్సీపీ కార్పొరేటర్లు మండిపడ్డారు. కౌన్సిల్ నుంచి టీడీపీ కార్పొరేటర్‌ను సస్పెండ్ చేయాలని వైఎస్సార్సీపీ పట్టుబట్టింది. దీంతో ముమ్మినేని వెంకట ప్రసాద్‌ను మేయర్ రాయన భాగ్యలక్ష్మి కౌన్సిల్ నుంచి సస్పెండ్ చేశారు. సస్పెండ్ చేసినా బయటికి వెళ్లకుండా మేయర్‌తో టీడీపీ కార్పొరేటర్లు వాగ్వాదానికి దిగారు.టీడీపీ కార్పొరేటర్‌ను బయటికి పంపించాలని మార్షల్స్‌ను మేయర్ ఆదేశించగా, మార్షల్స్‌పై కేసులు పెడతామంటూ టీడీపీ కార్పొరేటర్లు బెదిరించారు. టీడీపీ వార్నింగ్‌లతో మార్షల్స్ వెనక్కితగ్గారు. టీడీపీ కార్పొరేటర్ల తీరుపై మేయర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. అనంతరం కౌన్సిల్‌ను కొద్దిసేపు వాయిదా వేసిన మేయర్.. క్షమాపణ చెబితేనే భోజన విరామం తర్వాత సభలోకి అనుమతిస్తామని టీడీపీ కార్పొరేటర్లను హెచ్చరించారు. -
ఏపీ సచివాలయంలో రగడ.. వెంకట్రామిరెడ్డి ప్రెస్‌మీట్ అడ్డగింత
సాక్షి, గుంటూరు: తమను వేధించడమే చంద్రబాబు సర్కార్ పనిగా పెట్టుకుందని సచివాలయ ఉద్యోగులు మండిపడుతున్నారు. ఉద్యోగుల సంఘం కార్యాలయంలో పోలీసుల హడావుడితో రగడ చోటుచేసుకుంది. ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు వెంకట్రామిరెడ్డి మీడియా సమావేశాన్ని అడ్డుకోవడానికి పోలీసులు రావడంతో వారికి, ఉద్యోగుల సంఘం నాయకులకు మధ్య వాగ్వాదం జరిగింది. నిన్న(గురువారం) ఉద్యోగుల డిన్నర్ సమావేశంపై కూడా పోలీసులు దాడులు చేశారు. దీంతో ఉద్యోగుల్లో తీవ్ర దుమారం రేగింది. నేడు వెంకట్రామిరెడ్డి ప్రెస్ మీట్ జరగకుండా పోలీసులు అడ్డుకోవడంతో ఉద్యోగులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.నిన్న ఏం జరిగిందంటే..రాష్ట్ర సచివాలయ ఉద్యోగులపై పోలీసులు కర్కశంగా ప్రవర్తించారు. ఉద్యోగుల డిన్నర్ సమావేశంపై పోలీసులు దాడి చేసి కేసు నమోదు చేశారు. వారిని ఇబ్బందులకు గురిచేశారు. డిన్నర్ చేస్తున్న సమయంలో 50 మంది వరకు పోలీసులు.. ఉద్యోగులను చుట్టుముట్టారు. ప్లాన్ ప్రకారం డిన్నర్ పార్టీపై ఏడు పోలీసు స్టేషన్ల సిబ్బంది దాడులు చేశారు. అంతటితో ఆగకుండా అక్కడ మద్యం బాటిళ్లు ఉన్నాయంటూ ఉద్యోగులపై కేసులు పెట్టారు.అనంతరం ఉద్యోగులను పోలీసు స్టేషన్‌కు తరలించారు. గురువారం అర్ధరాత్రి వరకు వారిని పీఎస్‌లోనే ఉంచారు. 50 ఏళ్లలో ఎన్నడూ లేని విధంగా ఉద్యోగులను వేధిస్తున్నారని వెంకట్రామిరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. -
కోమటికుంట్లలో హైటెన్షన్.. పెద్దారెడ్డిపై దాడులకు టీడీపీ స్కెచ్
సాక్షి, అనంతపురం: శింగనమల నియోజకవర్గం పుట్లూరు మండలం కోమటికుంట్లలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. వైఎస్సార్సీపీ నేత, తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డిపై దాడికి టీడీపీ నేతలు స్కెచ్ వేశారు. కోమటికుంట్లలో ఉన్న పెద్దారెడ్డిపై దాడి చేయాలని టీడీపీ నేత జేసీ ప్రభాకర్ రెడ్డి పిలుపునిచ్చారు.ఈ క్రమంలో వ్యవసాయ క్షేత్రంలో ఉన్న పెద్దారెడ్డిపై దాడి చేయాలని టీడీపీ నేతలతో జేసీ ప్లాన్ చేయించారు. కోమటికుంట్ల గ్రామానికి వెళ్లేందుకు టీడీపీ నేతలు, కార్యకర్తల యత్నించగా, పోలీసులు అడ్డుకున్నారు. జేసీ వర్గీయుల అరాచకాలను ప్రజాస్వామ్య బద్ధంగా ఎదుర్కొనేందుకు కేతిరెడ్డి పెద్దారెడ్డి సిద్ధమయ్యారు.ఇదీ చదవండి: అటు ఆది.. ఇటు జేసీ ‘బూడిద’ రగడ! -
కాకినాడ పోర్టులో పవన్ చిందులు
కాకినాడ, సాక్షి: ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ తన కాకినాడ పోర్టు పర్యటనలో చిందులు తొక్కుతూ కనిపించారు. టీడీపీ ఎమ్మెల్యే కొండబాబుతో (వనమాడి వెంకటేశ్వరరావు)పాటు అధికారులపైనా ఆయన సీరియస్ అయ్యారు. రేషన్ బియ్యం అక్రమ తరలింపు అంశాన్ని ప్రస్తావిస్తూ.. అందరికీ చురకలు అంటించారు. శుక్రవారం ఉదయం కాకినాడ పోర్టులో డిప్యూటీ సీఎం పవన్ తనిఖీలు నిర్వహించారు. ఆ టైంలో పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ వెంట ఉన్నారు. అక్రమంగా తరలిస్తున్న రేషన్ బియ్యాన్ని ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా.. రేషన్ బియ్యం విషయంలో కాంప్రమైజ్ అయ్యారా? అంటూ ఎమ్మెల్యే కొండబాబును పవన్ ప్రశ్నించారు. ఇంత భారీగా బియ్యం దేశం దాటి వెళ్తుంటే.. ఏం చేస్తున్నారు?. ప్రతీసారి మాలాంటి వాళ్లు వచ్చిన ఆపితేగానీ.. ఇలాంటి అక్రమ రవాణా ఆపలేరా?. మీరు సరిగా ఉంటే పోర్టులోకి రేషన్ బియ్యం ఎలా వస్తాయి? అంటూ ఆయన అధికారులపై మండిపడ్డారు. ఆ టైంలో ఎమ్మెల్యే కొండబాబు వివరణ ఇచ్చే ప్రయత్నం చేయబోగా.. పవన్ పట్టించుకోలేదు. దీంతో ఆ ఎమ్మెల్యే నీళ్లు నములుతూ కనిపించారు. పశ్చిమాఫిక్రా దేశాలకు అక్రమంగా ఈ బియ్యాన్ని తరలించే ప్రయత్నం చేస్తుండగా.. అధికారులే స్వయంగా ఛేజ్ చేసి పట్టుకున్నట్లు అధికార వర్గాలు ప్రకటించున్నాయి.కాస్త గ్యాప్‌తో మరోసారి.. అయితే.. ఆ పరిణామం జరిగిన కాసేపటికే మరోసారి కొండబాబును పవన్ టార్గెట్ చేశారు. ఈసారి టగ్గులో వెళ్తూ ఆయనపై మండిపడ్డారు. బిజినెస్ అంటే స్మగ్లర్ ను అనుమతించడం కాదు కదా అనడంతో కొండబాబు కంగుతిన్నారు. మనం ఏమీ చెయ్యకపోతే రేషన్ మాఫియాలో మన హస్తం ఉన్నట్లు ఉంటుందని పవన్ అన్నారు. దానికి.. రేషన్ బియ్యంపై విజిలెన్స్ ఎంక్వెయిరీ జరుగుతోందని చెప్పే ప్రయత్నం చేశారు కొండబాబు. అయినా కూడా ఆ మాటలు పట్టించుకోకుండా.. కాకినాడ పోర్టు నుండి రేషన్ బియ్యం అక్రమ రవాణాపై హోం మంత్రికి, పీఎంవోలకు లేఖ రాస్తానని పవన్ అన్నారు. ఇక.. రేషన్ బియ్యం పట్టుబడిన స్టెల్లా ఎల్ నౌక వద్దకు సముద్రంలో ప్రత్యేక బోట్ లో వెళ్లి మరీ పవన్ పరిశీలించడం గమనార్హం. తిరిగి సముద్రం నుంచి పోర్టుకు చేరకున్నాక.. ‘‘ఎస్పీ ఎందుకు నిపించడం లేదు. నేను వచ్చే టైంకి ఎందుకు సెలవు తీసుకున్నారు. ఇదంతా చాలా బాగుంది’’ అంటూ పవన్ వ్యాఖ్యానించారు. ఇదీ చదవండి: ఎల్లోమీడియాకు మెగా బ్రదర్ కౌంటర్ -
నేతదేమో రెడ్‌బుక్.. ఎమ్మెల్యేలదేమో సొంత రాజ్యాంగం!
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కొన్ని రోజుల క్రితం కూటమి ఎమ్మెల్యేల సమావేశంలో ఏమన్నారు? ‘‘ప్రజలు గమనిస్తున్నారు.. జాగ్రత్త’’ అని! ప్రజలు మాత్రం కూటమి ఎమ్మెల్యేలు కొందరు చేస్తున్న అరాచకాలతోపాటు వారిపై ఎలాంటి చర్యలు తీసుకోని చంద్రబాబు వైఖరిని కూడా జాగ్రత్తగా గమనిస్తూనే ఉన్నారు. వైఎస్సార్సీపీ సోషల్ మీడియా కార్యకర్తలపై కఠినమైన చట్టాల కింద తప్పుడు నేరాలు మోపడం మొదలుకొని రెడ్‌బుక్ రాజ్యాంగం పేరుతో పోలీసుల వేధింపులు, కూటమి నేతల జోలికి అస్సలు వెళ్లని వైనం.. అక్రమార్కులకు రక్షణ కల్పిస్తూండటం వంటి వన్నీ ప్రజల దృష్టిని మీరి పోలేదు. అనంతపురం జిల్లా తాడిపత్రి, కడప జిల్లా జమ్మలమడుగుల్లో కూటమి నేతలు సృష్టించిన రభస ఇంకో ప్రత్యక్ష నిదర్శనం.వైఎస్ జగన్ పాలనలో చీమ చిటుక్కుమన్నా భూతద్దంలో చూపిస్తూ అభూత కల్పనలు ప్రచారం చేసిన ఎల్లో మీడియా, కూటమి నేతల ఆగడాల విషయానికి వచ్చేసరికి.. వీలైనంత కప్పిపెట్టేందుకే ప్రయత్నిస్తోంది. అక్కడితో ఆగకుండా చంద్రబాబు పేరు వాడుకుంటూ ఆయన ఆగ్రహం చెందారన్న లీకులిస్తూ ప్రజలను మభ్యపెట్టేందుకు ప్రయత్నిస్తున్నాయి ఇవి. రాయలసీమ ధర్మల్ పవర్ ప్లాంట్ నుంచి వెలువడే ఫ్లైయాష్ రవాణాకు సంబంధించి జమ్మలమడుగు బీజేపీ ఎమ్మెల్యే అదినారాయణ రెడ్డి, తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే, ప్రస్తుత ఎమ్మెల్యే అస్మిత్ రెడ్డి తండ్రి, మున్సిపల్ ఛైర్మన్ జెసి ప్రభాకరరెడ్డిల మధ్య వివాదం ఏర్పడింది.సిమెంట్ కంపెనీలు వాడే ఆ బూడిదను రవాణా చేసే వ్యాపారం ఎవరిదన్న అంశంపై గొడవ. ప్లాంట్‌లో రోజూ ఉత్పత్తి అయ్యే నాలుగువేల టన్నుల ఫ్లైయాష్ రవాణా తమకే ఉండాలని ఇద్దరు నాయకులు బహిరంగంగానే బాహాబాహీకి దిగాయి. ఆదినారాయణరెడ్డి వర్గం తమ వాహనాలను అడ్డుకుంటోందని, దాన్ని సహించేది లేదని జేసీ ప్రభాకరరెడ్డి హెచ్చరిస్తున్నారు. ఇదే విషయంపై కడప ఎస్పీకి ఫిర్యాదు కూడా చేశారు. అవసరమైతే తానే రంగంలో దిగుతానని కూడా ఆయన బెదిరించారు. మరోవైపు థర్మల్ ప్లాంట్ తమ నియోజకవర్గంలో ఉన్నందున ఫ్లైయాష్ రవాణా తమ కనుసన్నలలోనే జరగాలని, ఆ వ్యాపారం తనవారికే దక్కాలన్నది ఆదినారాయణ రెడ్డి పట్టుదల.ఎన్నికలలో కూటమి అధికారంలోకి రావడంంతోనే ఈ వివాదం మొదలైంది. ఇందులో పవర్ ప్లాంట్ అధికారుల పాత్ర ఏమిటో తెలియదు. ఇద్దరు నేతల మధ్య సతమతమవుతున్నారు. ఇరువర్గాలను బుజ్జగించడానికి పోలీసు అధికారులు కూడా నానా తంటాలూ పడుతున్నారు. ఈ నేపథ్యంలోనే వీరిపై టీడీపీ అధినేత, ముఖ్యమంత్రి చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేసినట్లు లీకు వార్తలు ఎల్లోమీడియాలో ప్రత్యక్షమయ్యాయి. ఈ నేతలకు చంద్రబాబు అంటే నిజంగానే భయం ఉంటే.. బహిరంగంగా రచ్చ చేస్తారా? అన్నది అసలు ప్రశ్న.నిజానికి దౌర్జన్యం చేసేవారు ఎవరైనా సరే.. వారిపై పోలీసులు కేసులు పెట్టాలి. శాంతి భద్రతల పరిరక్షణకు అన్ని చర్యలూ తీసుకోవాలి. కానీ.. కేవలం నిషేధాజ్ఞలు విధించి.. పోలీసు బలగాలను మోహరించి.. ఇరువురు నేతలు ఎప్పుడు రాజీపడతారా? అన్నట్టుగా పోలీసులు ఎదురు చూస్తున్నట్లు కనిపిస్తోంది. గొడవలకు కారణమైన వారిపై మాత్రం కేసులు పెట్టడం లేదు. ఫ్లైయాష్ రవాణా వ్యాపారాన్ని చెరిసగం పంచుకోవాలని కొందరు సూచిస్తున్నట్లు సమాచారం.శాంతి భద్రతలు లేకపోతే రాష్ట్రానికి పెట్టుబడులు రావని ఒకపక్క సుద్దులు చెబుతూ ఇంకోపక్క వర్గపోరుకు దిగుతున్న నేతలపై కేసులూ పెట్టకపోవడం కూటమి ప్రభుత్వపు ద్వంద్వవైఖరికి నిదర్శనంగా కనిపిస్తోంది. ఫ్లైయాష్ రవాణాలో కోట్ల రూపాయల సంపాదన కోసమే నేతలు దీనిపై ఇంత రాద్ధాంతం చేస్తున్నారన్నది బహిరంగ రహస్యమే. కూటమి ప్రభుత్వం పోలీసులను కేవలం ప్రతిపక్షాలను అణచివేసేందుకు మినహా ఇలాంటి ముఠాల నియంత్రణకు మాత్రం ఉపయోగించడం లేదు. గతంలో ఇదే జమ్మలమడుగు ప్రాంతంలో మరో గొడవ జరిగింది. అదానీ కంపెనీ ఇక్కడ పంప్డ్ స్టోరేజీ ప్లాంట్ నిర్మిస్తోంది.ఈ ప్రాజెక్టు కాంట్రాక్ట్ బీజేపీ ఎంపీ సీఎం రమేశ్‌కు చెందిన రిత్విక్ సంస్థ దక్కించుకుంది. అయితే తమకు వాటా ఇవ్వలేదన్న కోపంతో ఆదినారాయణ రెడ్డి వర్గానికి చెందిన వారు అదానీ సంస్థ సిబ్బందిపై దాడికి దిగారు. సి.ఎం. రమేశ్ వర్గం దీనిపై ఈనాడు మీడియాలో ఒక వార్త రాయించింది. దీన్నిబట్టే అక్కడ పరిస్థితులు ఏమిటన్నది అర్థమవుతాయి. ఇద్దరూ బీజేపీ వారే అయినా.. ఎవరి గ్రూపు వారిదే అన్నమాట. తాజాగా ఆదినారాయణ వర్గం జేసీ ప్రభాకరరెడ్డి తో గొడవకు దిగింది.ఈ నేపథ్యంలో తాను అదానీలా ఊరుకోబనని హెచ్చరించడం ఎస్పీకి రాసిన లేఖలోనూ లోడింగ్‌కు పంపుతున్న తన లారీలను అడ్డుకోండి చూద్దామంటూ సవాలు కూడా విసిరారు. ఎస్పీకే ధైర్యంగా తాను హింసకు దిగుతానని పరోక్షంగా హెచ్చరించారంటే జేసీ ఎంతకు తెగించారో... చంద్రబాబుపై వీరికి ఎంతమాత్రం భయం ఉందో అర్థం కావడం లేదా? ఈ ఘటనలో ఎస్పీ ఏమైనా ఇరు వర్గాలను పిలిచి చర్చించడం కానీ.. శాంతి భద్రతల పరిరక్షణ కసం వార్నింగ్ ఇవ్వడం కానీ చేయకపోవడం ఇంకో విశేషం. పైగా వీరి మధ్య రాజీ కుదర్చడానికి ప్రయత్నాలు సాగాయి.ఈ పద్దతి అనుసరించడం చంద్రబాబుకు కొత్తకాదు.గతంలో జమ్మలమడుగు లో ఆదినారాయణ రెడ్డి వర్గం, ఆయన ప్రత్యర్ధి వర్గం కాంట్రాక్టు పనులను ఎలా పంచుకోవాలో చెబుతూ ఆనాటి జిల్లా కలెక్టర్‌తోనే పంచాయితీ చేయించిన చరిత్ర ఉంది. ఆది నారాయణ రెడ్డి, జేసీల మధ్య ప్రస్తుతానికి రాజీ కుదరకపోవడంతో ప్రభాకరరెడ్డికి చెందిన ఆరు లారీలను పోలీసులు అడ్డుకున్నారట. జేసీ స్వయంగా అక్కడకు రాకపోవడంతో పోలీసులు ఊపిరి పీల్చుకున్నారట. ఇలా ఉంది ఏపీలో పోలీసుల దయనీయ పరిస్థతి.చట్టం ప్రకారం అయితే ఏమి చేయాలో పోలీసులకు తెలియదా! ఇప్పుడు జేసీ లారీలను అనుమతించాలంటే, ఎల్.అండ్ టి సిమెంట్ ప్లాంట్ నుంచి ఫ్లైయాష్ సరఫరాకు సంబంధించిన బకాయిలతో పాటు, యాభై శాతం వాటా ఇవ్వాలని ఆది వర్గం డిమాండ్ చేస్తోందట. ఈ సిమెంట్ ఫ్యాక్టరీ తాడిపత్రిలో ఉంది. అక్కడ పెత్తనం అంతా జేసీదే. కావడంతో ఆది వర్గం మండిపడుతోంది. ఆది నారాయణరెడ్డి వర్గీయులు జమ్మలమడుగులో జేసీ వర్గీయుల వాహనాలను అడ్డుకుంటే, తాడిపత్రిలో ఆదినారాయణ రెడ్డి వర్గం లారీలను తిరగనివ్వబోమని చెబుతున్నారు. ఈ రకంగా నియోజకవర్గాలలో ఎమ్మెల్యేలు, టీడీపీ నేతలు సామంత రాజులుగా వ్యవహరిస్తున్న తీరు ఆందోళన కలిగిస్తున్నాయి.2014-19 టరమ్ లో వైఎస్సార్సీపీ పక్షాన ఎన్నికై, ఆ తర్వాత టీడీపీలో చేరి కొంతకాలం మంత్రిగా పనిచేసిన ఆదినారాయణ రెడ్డి 2019లో ఓటమి తర్వాత బీజేపీలో చేరారు. ఈసారి ఆ పార్టీ పక్షాన పోటీచేసి గెలుపొందారు. ఈ కారణంగానే ఆది నారాయణ రెడ్డిని పిరికివాడని కూడా జేసీ ధ్వజమెత్తారు. ఓడిపోగానే టీడీపీ నుంచి బీజేపీకి పారిపోయారని ఎద్దేవా చేశారు. అలాగే ఒకప్పుడు వీర కాంగ్రెస్ నేతలుగా ఉన్న జేసీ సోదరులు తదనంతర పరిణామాలలో టీడీపీలో చేరారు. జేసీ ప్రభాకరరెడ్డి 2014లో తాడిపత్రి నుంచి టీడీపీ పక్షాన విజయం సాధించారు. 2019లో ఆయన కుమారుడు అస్మిత్ రెడ్డి ఓడిపోయారు. ఆ తర్వాత వచ్చిన మున్సిపల్ ఎన్నికలలో ప్రభాకరరెడ్డి గెలిచి మున్సిపల్ ఛైర్మన్ అయ్యారు. 2024లో అస్మిత్ రెడ్డి ఎమ్మెల్యేగా గెలుపొందారు. అయితే అస్మిత్ రెడ్డి పేరుకే ఎమ్మెల్యే. రాజకీయం, పెత్తనం మొత్తం ప్రభాకరరెడ్డిదే. వైఎస్సార్సీపీ మాజీ ఎమ్మెల్యే తాడిపత్రిలోకి రానివ్వకుండా పోలీసులను ప్రయోగించగలుగుతున్నారు. ఇసుక గొడవలో అస్మిత్ రెడ్డి ఒక పోలీసు అధికారిని దూషించిన ఘటన కలకలం రేపింది. తాడిపత్రిలో మద్యం షాపులు పొందినవారు కచ్చితంగా తమకు ఇరవై శాతం కమిషన్ చెల్లించాలని ప్రభాకర్ రెడ్డి డిమాండ్ చేశారు. రాష్ట్రంలో ఒకవైపు లోకేష్ రెడ్ బుక్ రాజ్యాంగం అమలు చేస్తూ అరాచకాలకు పాల్పడుతుంటే, జమ్మలమడుగు, తాడిపత్రిలలో మాత్రం ఆది, జేసీలు సొంత రాజ్యాంగం అమలు చేస్తామని ప్రజలను భయపెడుతున్నారు. చంద్రబాబు ప్రభుత్వం ఎంత సమర్థంగా.. - కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత -
కూటమి ప్రభుత్వంలో రైతులకు కన్నీళ్లే: కారుమూరి
సాక్షి,తాడేపల్లి: రాష్ట్రంలో రైతుల పరిస్థితి దారుణంగా ఉందని, ధాన్యం కొనుగోలును గాలికి వదిలేశారని మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు అన్నారు. తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ ప్రధానకార్యాలయంలో శుక్రవారం(నవంబర్29) కారుమూరి మీడియాతో మాట్లాడారు.‘రైతులు కన్నీళ్లు పెట్టుకుంటున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. ధాన్యం రైతుల అవస్థలపై ఎల్లోమీడియాలో కూడా వార్తలు వచ్చాయి. రైతులకు ప్రభుత్వం గోతాలు కూడా ఇవ్వడం లేదు. వైఎస్ జగన్ హయాంలో 35 లక్షల మంది రైతుల నుంచి ధాన్యం కొనుగోలు చేశాం.నేరుగా రైతుల ఖాతాలోనే నగదు వేశాం. మధ్యలో దళారుల ప్రమేయమే లేదు. ఇప్పుడు మళ్ళీ దళారులు,మిల్లర్లు సిండికేట్ అయి దోచుకుంటున్నారు.అసలు రైతుల నుంచి ధాన్యం కొనుగోలు చేయడానికి ప్రభుత్వం ఏం చర్యలు చేపట్టింది? ఏ ఒక్క అధికారి పట్టించుకోవడం లేదు.ఈక్రాప్,ఇన్సూరెన్స్ అనేవి లేనే లేవు.ఎక్కడ చూసినా రోడ్ల పక్కన గుట్టలు గుట్టలుగా ధాన్యం కనపడుతోంది.మా హయాంలో జియోట్యాగ్ చేసి ధాన్యం లారీ ఎటు వెళ్తుందో గమనించేవాళ్లం.ఇప్పుడు ఆ జియోట్యాగ్ తీసేయటం వెనుక ఉద్దేశం ఏంటి?టీవీల్లో షోలు చేయటం తప్ప రైతులకు ఎలాంటి మేలు చేయడం లేదు.ప్రభుత్వం కనీసం ఒక్క మీటింగ్ కూడా రైతుల కోసం పెట్టలేదు.ఇదేనా రైతుల మీద ఉన్న ప్రేమ? జగన్ హయాంలో రైతు భరోసా కింద రూ.13,500 అందేవి.ఇన్పుట్ సబ్సిడీ అందేది.ఇప్పుడు ఏ ఒక్క పథకమూ అందడం లేదు.రేషన్ బియ్యం ఇతర దేశాలకు అక్రమ రవాణా చేస్తున్నారు.రేషన్ మాఫియా మళ్ళీ రెచ్చిపోతోంది.షిప్పులలో పెద్ద ఎత్తున బియ్యం అక్రమ రవాణా జరుగుతుంటే ప్రభుత్వం ఏం చేస్తోంది?చౌకడిపోల ద్వారా మా హయాంలో చాలా రకాల సరుకులు అందించాం.ఇప్పుడు బియ్యం,పంచదార తప్ప మరేమీ ఇవ్వడం లేదు.ఇప్పటికైనా ప్రభుత్వం రైతుల నుంచి ధాన్యం కొనుగోలు చేయాలి’అని కారుమూరి డిమాండ్ చేశారు. -
ఎల్లోమీడియాకు నాగబాబు కౌంటర్
సాక్షి,హైదరాబాద్: జనసేన అధినేత పవన్‌కల్యాణ్ సోదరుడు నాగబాబు ఎల్లోమీడియాకు గట్టి కౌంటర్ ఇచ్చారు. ఈ మేరకు నాగబాబు తన ఎక్స్(ట్విటర్)ఖాతాలో శుక్రవారం(నవంబర్ 29) ఒక పోస్టు చేశారు. తనకు రాజకీయ పదవులపై ఆసక్తి లేదని నాగబాబు కుండబద్దలు కొట్టారు. పవన్ ఢిల్లీ పర్యటనపై కొన్ని రోజులుగా ఏదేదో ప్రచారం చేస్తున్న ఎల్లోమీడియాకు తన ట్వీట్‌తో తాజాగా షాకిచ్చారు నాగబాబు. పవన్ ఢిల్లీ పర్యటన నాగబాబు కోసమేనని ఎల్లోమీడియా ఊదరగొడుతున్న విషయం తెలిసిందే. నాగబాబుకు రాజ్యసభ సీటు కావాలని పవన్ తన టూర్లో బీజేపీ పెద్దలను కోరినట్టు ఎల్లోమీడియా వార్తలు ప్రసారం చేసింది. ఈ ప్రచారంపై నాగబాబుకు ఆగ్రహం తెప్పించినట్లు తెలుస్తోంది. ఇందుకే ఆయన ఎక్స్‌లో క్లారిటీ ఇచ్చినట్లు సమాచారం. -
ఎల్లో మీడియాపై గుడివాడ అమర్నాథ్ ఆగ్రహం
సాక్షి,విశాఖ : ముఖ్యమంత్రిగా తన హయాంలో వైఎస్ జగన్మోహన్రెడ్డి చేసిన అభివృద్ధి ఎల్లోమీడియాకు కనిపించడం లేదా అని మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ మండిపడ్డారు. కేంద్ర ప్రభుత్వ సంస్థ సెకీతో వైఎస్ జగన్ హయాంలో జరిగిన విద్యుత్ ఒప్పందాలపై ఎల్లో మీడియా, కూటమి ప్రభుత్వం చేస్తున్న అసత్య ప్రచారాల్ని ఖండించారు. ఈ మేరకు విశాఖపట్నంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో గుడివాడ అమర్నాథ్ మాట్లాడారు. మీడియా సమావేశంలో గుడివాడ అమర్నాథ్ మాట్లాడుతూ.. ‘వైఎస్ జగన్‌పై గత 15 ఏళ్లుగా చంద్రబాబు తప్పుడు ప్రచారం చేస్తునే ఉన్నారు. ఆదానీ దగ్గర లంచం తీసుకున్నారని దుష్ప్రచారం చేస్తున్నారు. ఈ ప్రచారం ఆపకపోతే ఈనాడు ఆంధ్రజ్యోతి పై 100 కోట్లు పరువు నష్టం దావా వేస్తానని జగన్ ప్రకటించారు. టీడీపీ గెజిట్ పేపర్లు ఈనాడు, ఆంధ్రజ్యోతి అదే పనిగా తప్పుడు రాతలు రాస్తున్నారు. విద్యుత్ కొనుగోలు విషయంలో రాష్ట్ర ప్రభుత్వం సెకీ మధ్య ఒప్పందం కుదిరింది..కేబినెట్లో చర్చిన తరువాత సైకీతో ఒప్పందం రాష్ట్ర ప్రభుత్వం చేసుకుంది. సైకీతో ఒప్పందం కోసం ఒక కమిటీని ఏర్పాటు చేశారు. కమిటీ అధ్యయనం చేసిన 45 రోజులు తరువాత ఒప్పదం చేసుకున్నాము. కేంద్ర ప్రభుత్వ సంస్థ సైకీని దళారి సంస్థ అని ఎలా రాస్తారు. విజనరీ అని చెప్పుకొనే చంద్రబాబు 5 రూపాయలకు యూనిట్ విద్యుత్ కంటే వైఎస్ జగన్ 2.49 పైసలకు కొన్నారు..ఎవరి హయాంలో సంపద సృష్టి జరిగింది? ..వైఎస్ జగన్‌ను అదానీ కలిస్తే తప్పు. అదానీ జగన్‌ను కలిస్తే లంచాలు ఇవ్వడానికి వచ్చినట్లు. చంద్రబాబును అదానీ కలిస్తే అది గొప్పగా చెపుతారు. సెకీతో అనేక రాష్ట్రాలు ఒప్పందం చేసుకున్నాయి. అన్ని రాష్ట్రాల కంటే తక్కువ రేటుకు ఒప్పదం చేసుకున్నది మన రాష్ట్రమే. వైఎస్ జగన్ చేసుకున్న ఒప్పందం తప్పయితే రద్దు చేయొచ్చుగా. రూ.2.49 కంటే తక్కువ రేటుకు ఒప్పందం చేసుకోవచ్చుగా. అధికమొత్తంలో కరెంట్‌ను కొనుగోలు చేసి రూ.86 వేల కోట్లు బారం వేసిన చంద్రబాబు గొప్పనా.. రాష్ట్రానికి లక్షా పది వేల కోట్లు మిగిల్చిన వైఎస్ జగన్ గొప్పనా...ఎన్నికల ముందు విద్యుత్ చార్జీలు తగ్గిస్తామని చెప్పారు. ఇప్పుడు రూ.20 వేల కోట్లు బారం ప్రజలపై వేస్తున్నారు.. ఇచ్చిన మాటను చంద్రబాబు నిలబెట్టుకోవాలి. లేదా ప్రజల పక్షాన నిలబడి పోరాటం చేస్తాము’ అని గుడివాడ అమర్నాథ్ కూటమి ప్రభుత్వానికి హెచ్చరికలు జారీ చేశారు. -
చారిత్రక నిర్ణయాలతో.. సంపద సృష్టించాం: వైఎస్ జగన్
కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ సెకీ.. ఏపీ ప్రభుత్వం, డిస్కంల మధ్య ఒప్పందం జరిగితే.. ఇక్కడ థర్డ్ పార్టీకి ఎక్కడ చోటు ఉంది? రేపు అమెరికా కంపెనీ వ్యాపారం చేయడానికి రాష్ట్రానికి వచ్చిందనుకుందాం. ప్రభుత్వం భూములు, సౌకర్యాలు కల్పిస్తుంది. జీఎస్టీ మినహాయింపులు, ప్రోత్సాహకాలు ఇస్తుంది. అలాగని అమెరికా అధ్యక్షుడు బైడెన్.. రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రభావితం చేసి ప్రోత్సాహకాలు ఇప్పించారని అంటారా? అలా అనొచ్చా? వాస్తవాలు తెలియకుండా దారుణమైన ఆరోపణలు చేస్తున్నారు. వీటికి ముగింపు ఉండట్లేదు. – మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డివైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంతో పోల్చితే ఇప్పుడు వ్యవస్థలన్నీ వెనక్కిపోయిన పరిస్థితులు ఒకవైపు కనిపిస్తుంటే.. మరో వైపు చంద్రబాబు సంపద సృష్టి అంటున్నారు.రాష్ట్రానికి అదనపు ఆదాయం వచ్చేలా ప్రభుత్వం ఏవైనా కార్యక్రమాలు చేయగలిగితే దానిని సంపద సృష్టి అంటారు. రాష్ట్ర పురోగతిని మనసులో పెట్టుకుని, రాష్ట్రం భవిష్యత్తులో ఇంకా ఎక్కువ డబ్బులు సంపాదించే మార్గాలు ఎక్కడ ఉన్నాయని ఆలోచించి, ఆచరణలో పెట్టింది వైఎస్సార్సీపీ హయాంలోనే. మూడు కొత్త పోర్టులు, 17 కొత్త మెడికల్ కాలేజీల నిర్మాణానికి శ్రీకారం చుట్టాం. వీటి వల్ల జీఎస్డీపీ పెరుగుతుంది. ఉద్యోగాలొస్తాయి. అభివృద్ధి కనిపిస్తుంది. దీనినే సంపద సృష్టి అంటారు. ఈ పోర్టులు, మెడికల్ కాలేజీలు రేపు రూ.లక్షల కోట్ల విలువ చేస్తాయి.అంతర్రాష్ట్ర ట్రాన్స్‌విుషన్ చార్జీలు (ఐఎస్టీఎస్) నుంచి మినహాయింపుతో అత్యంత చౌకగా యూనిట్ రూ.2.49 చొప్పున 25 ఏళ్లపాటు సౌర విద్యుత్ కొనుగోలుకు కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ సెకీ(సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా)తో ఒప్పందం చేసుకున్నాం. రాష్ట్ర చరిత్రలో ఇంత తక్కువ ధరకు విద్యుత్ కొనుగోలు చేసిన దాఖలాలు లేవు. ఇదో చరిత్రాత్మక ఒప్పందం.. చారిత్రక ఘట్టం గతంలో రాష్టంలో సగటు విద్యుత్ కొనుగోలు ధర యూనిట్‌కు రూ.5.10 కాగా మేం దాని కంటే యూనిట్ రూ.2.61 తక్కువకు కొనుగోలు చేశాం. దీనివల్ల ఏడాదికి రూ.4,400 కోట్లు ప్రభుత్వ ఖజానాకు ఆదా అవుతుంది. ఈ లెక్కన 25 ఏళ్లకు రూ.1.10 లక్షల కోట్లు ఆదా అవుతుంది. సంపద సృష్టించడమంటే ఇదీ చంద్రబాబు హయాంలో 2014–19 మధ్య సౌర విద్యుత్ యూనిట్ సగటున రూ.5.90 చొప్పున కొనుగోలు చేస్తూ విద్యుత్ కొనుగోలు ఒప్పందాలు(పీపీఏలు) చేసుకున్నారు. మేం సెకీ నుంచి కొనుగోలు చేసిన దానికంటే యూనిట్ రూ.3.41 అధికంగా కొన్నారు. దీనివల్ల ఏడాదికి రూ.3,500 కోట్లు చొప్పున 25 ఏళ్లలో రూ.87,500 కోట్ల భారం ప్రభుత్వ ఖజానాపై పడుతుంది. మరి 25 ఏళ్లకు రూ.1.10 లక్షల కోట్లను ఖజానాకు ఆదా చేసి సంపద సృష్టించిన వైఎస్ జగన్ గొప్పా..? లేక రూ.87,500 కోట్లు ఖజానాపై భారం వేసి సంపదను ఆవిరి చేసిన చంద్రబాబు గొప్పా?– వైఎస్ జగన్సాక్షి, అమరావతి: రాష్ట్రంలో సంపద సృష్టిలో భాగంగా విప్లవాత్మక అడుగులు వేశామని మాజీ సీఎం, వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి తెలిపారు. నిజమైన సంపద సృష్టి జరిగింది, రాష్ట్రానికి అదనపు ఆదాయాలు పెరిగింది, అదనపు ఆస్తులు సమకూరింది వైఎస్సార్ సీపీ హయాంలోనేనని స్పష్టం చేశారు. కేంద్ర ప్రభుత్వ సంస్థ సెకీతో కారుచౌకగా యూనిట్ రూ.2.49కే సౌర విద్యుత్తు కొనుగోలు ఒప్పందం కుదుర్చుకోవడం రూ.1.10 లక్షల కోట్లను ఆదా చేసి సంపద సృష్టించామన్నారు. అధిక ధరలతో పీపీఏల ఒప్పందాల గుదిబండ వల్ల సీఎం చంద్రబాబు రూ.87,500 కోట్లు ఆవిరి చేశారని ధ్వజమెత్తారు. ప్రభుత్వ ఆధ్వర్యంలో 17 కొత్త మెడికల్ కాలేజీలకు శ్రీకారం చుట్టడంతోపాటు దాదాపు రూ.13 వేల కోట్లతో మూడు కొత్త పోర్టుల నిర్మాణాన్ని చేపట్టామని.. వైద్య కళాశాలలు, పోర్టులు భవిష్యత్తులో రాష్ట్రానికి రూ.లక్షల కోట్ల సంపద సృష్టించే ఆస్తులుగా మిగులుతాయని పేర్కొన్నారు. గురువారం తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో వైఎస్ జగన్ మీడియాతో మాట్లాడారు.చరిత్రలో నిలిచే ఒప్పందం..సుస్థిర వ్యవసాయాభివృద్ధే లక్ష్యంగా, రైతుల జీవనోపాధులు పెంచడమే ధ్యేయంగా వ్యవసాయ పంపుసెట్లకు పగటి పూట 9 గంటలు నాణ్యమైన ఉచిత విద్యుత్ సరఫరా చేయాలన్న మా ప్రభుత్వ ఆశయాన్ని కేంద్రం సైతం అభినందించింది. రైతులకు మంచి చేస్తూ మీరు తలపెట్టిన ఈ గొప్ప కార్యక్రమానికి మా వంతు తోడ్పాటు అందిస్తామని చెప్పింది. ఐఎస్టీఎస్ చార్జీల నుంచి మినహాయింపు ఇస్తూ యూనిట్ విద్యుత్ అత్యంత చౌకగా రూ.2.49కే సరఫరా చేస్తామంటూ రాష్ట్ర ప్రభుత్వానికి ప్రతిపాదిస్తూ కేంద్ర సంస్థ సెకీ లేఖ రాసింది. నాడు ఆ ప్రతిపాదనకు నేను ఒప్పుకోకుండా ఉంటే ఇదే చంద్రబాబు, ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ5తో కూడిన ఎల్లో బ్యాచ్ నాపై ఏరకంగా దుమ్మెత్తిపోసేవారో అందరూ ఒక్కసారి ఆలోచించండి. చంద్రబాబు, ఈనాడు, ఆంధ్రజ్యోతి నాపై ఇలా దుష్ఫ్రచారం చేయడం ధర్మమేనా? ఇంత తక్కువ ధరకు ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఏ ముఖ్యమంత్రి, ఏ ప్రభుత్వం కొనుగోలు చేయలేదు. ఏ ఒక్కరూ చేయలేనిదాన్ని, వైఎస్సార్సీపీ ప్రభుత్వం చేయగలిగింది. ఒక చరిత్ర సృష్టించాం. చరిత్రలో నిలిచిపోయే ఒప్పందం ఇది.రైతులకు హక్కుగా ఉచిత విద్యుత్ లక్ష్యంగా..రాష్ట్ర ప్రభుత్వం, డిస్కంల మీద భారం పడకుండా.. మరో 25 ఏళ్ల పాటు రైతన్నలకు ఢోకా లేకుండా ఉచిత విద్యుత్తు అందించడంలో భాగంగా గతంలో ఎప్పుడూ చేయని విధంగా ఆలోచన చేశాం. 2020 నవంబర్‌లో 6,400 మెగావాట్లకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ గ్రీన్ ఎనర్జీ కార్పొరేషన్ లిమిటెడ్(ఏపీజీఈసీఎల్) ఆధ్వర్యంలో సోలార్ పార్కులు రాష్ట్రంలో నెలకొల్పేందుకు టెండర్లు పిలిచాం. రూ.2.49 నుంచి రూ.2.58 చొప్పున విద్యుత్ సరఫరా చేయడానికి ఎన్టీపీసీ లాంటి పెద్ద పెద్ద సంస్థలు అందులో పాల్గొన్నాయి. దాదాపు 24 బిడ్లు దాఖలయ్యాయి. అయితే చంద్రబాబు అనే చంద్రగ్రహణం కారణంగా న్యాయ వివాదాలు తలెత్తి ఈ ప్రక్రియ ఆగిపోయింది.మేం సంపద సృష్టించాం.. ఆవిరి చేసింది చంద్రబాబేమాట్లాడితే సంపద సృష్టిస్తానంటూ ప్రచారం చేసుకునే చంద్రబాబు తన హయాంలో సంపద ఏ విధంగా ఆవిరి చేశాడో ఒక్కసారి మీరే చూడండి. 2,500 మెగావాట్ల సోలార్ పవర్,, 3,494 మెగావాట్ల విండ్ పవర్ కోసం చేసుకున్న పీపీఏలను.. మా హయాంలో యూనిట్ రూ.2.49కే సరఫరా చేసేందుకు చేసుకున్న పీపీఏతో పోల్చి చూస్తే ఎవరు సంపద సృష్టించారన్నది అందరికీ అర్థమవుతుంది. సాధారణంగా విద్యుత్ కొనుగోలు ఒప్పందాల వల్ల 25 ఏళ్ల పాటు రాష్ట్ర ప్రభుత్వాలపై భారం పడుతుంది. చంద్రబాబు హయాంలో 3,494 మెగావాట్ల పవన విద్యుత్ కోసం చేసుకున్న పీపీఏలను పరిశీలిస్తే సగటున యూనిట్ రూ.4.84 చొప్పున చేసుకున్నారు. మా హయాంలో అదే విద్యుత్ యూనిట్ రూ.2.49కే వచ్చింది. మా హయాంతో పోలిస్తే బాబు హయాంలో చేసుకున్న ఒప్పందాల వలన రూ.2.35 అదనంగా భారం పడుతుంది. 3,494 మెగావాట్లు అంటే 9 వేల మిలియన్ యూనిట్లు! యూనిట్ రూ.2.35 చొప్పున చూస్తే ఏడాదికి రూ.2 వేల కోట్లు అదనపు భారం పడింది. ఆ లెక్కన 25 ఏళ్లకు అక్షరాల రూ.50వేల కోట్ల భారం ప్రభుత్వంపై పడుతుంది. ఇక 2,500 మెగావాట్ల సోలార్ పవర్ కోసం చేసుకున్న పీపీఏలను పరిశీలిస్తే.. సగటున యూనిట్ విద్యుత్ రూ.5.90 చొప్పున కొనేందుకు ఒప్పందాలు చేసుకున్నారు. 2,500 మెగావాట్లు అంటే 4,200 మిలియన్ యూనిట్లు. మన హయాంలో చేసుకున్న పీపీఏల ప్రకారం యూనిట్ రూ.2.49లతో పోల్చి చూస్తే.. చంద్రబాబు హయాంలో సోలార్ పవర్ యూనిట్ విద్యుత్ రూ.3.41 పైసల చొప్పున అదనంగా చెల్లించేందుకు ఒప్పందం చేసుకున్నారు. అంటే ఏడాదికి రూ.1,500 కోట్ల చొప్పున 25 ఏళ్లలో రూ.37,500 కోట్ల అదనపు భారం పడుతుంది. చరిత్రలో ఎన్నడూ లేని విధంగా అత్యంత చౌకగా యూనిట్ రూ.2.49 చొప్పున కొనుగోలు చేయడం వలన రాష్ట్ర ప్రభుత్వానికి 25 ఏళ్లలో రూ.1.10 లక్షల కోట్లను ఆదా చేయడం ద్వారా ఆ మేరకు నేను సంపద సృష్టిస్తే.. అదే చంద్రబాబు హయాంలో చేసుకున్న సోలార్, విండ్ పీపీఏల వల్ల 25 ఏళ్లలో రాష్ట్ర ప్రభుత్వంపై అదనంగా రూ.87,500 కోట్ల భారం పడటం వల్ల ఆ మేరకు సంపద ఆవిరి అయిపోతుంది. ఈ తేడా గమనించాలని అందరినీ కోరుతున్నా.అభినందించాల్సింది పోయి నిందలేస్తారా?కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య ఒక చరిత్రాత్మక ఒప్పందం జరిగితే.. యూనిట్ రూ.2.49కే రాష్ట్రానికి విద్యుత్ దొరుకుతుంటే.. పైగా స్పెషల్ ఇన్సెంటివ్‌గా అంతర్రాష్ట్ర ట్రాన్స్ విుషన్ ఛార్జీల నుంచి మినహాయింపు కల్పించడం ద్వారా యూనిట్‌కు మరో రూ.1.98 ఆదా అవుతుంటే.. ఇంత మంచి ప్రతిపాదన రాష్ట్రానికి వస్తే ఎవరైనా క్షణం ఆలోచించకుండా ముందుకెళ్తారు. మేం కూడా అదే చేశాం. ఈ ఒప్పందం ద్వారా 25 ఏళ్లలో రూ.1.10 లక్షల కోట్లు ఆదా చేయడం వలన సంపద సృష్టించాం. నిజంగా ఇదొక రోల్ మోడల్ కేసు. ఇంత మంచి చేస్తే నాపై రాళ్లేస్తారా? ఇంకా ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే. ఆత్మనిర్భర్ ప్యాకేజ్ కింద తమిళనాడు, ఒడిశా, చత్తీస్‌గఢ్‌లకు సెకి ఎంతకు అమ్మిందో తెలుసా? ఆ మూడు రాష్ట్రాలకు యూనిట్ రూ.2.61 చొప్పున సరఫరా చేశారు. అంటే వాళ్లకంటే రూ.0.12 తక్కువకే విద్యుత్ తీసుకొచ్చిన నన్ను అభినందించి శాలువా కప్పి ప్రశంసించాల్సిందిపోయి బురదజల్లుతారా? ఇష్టమొచ్చినట్టు ఆరోపణలు చేయడం సమంజసమేనా? సంపద సృష్టించింది నేనా? చంద్రబాబా ? మీరే ఆలోచించండి. నేను సంపద సృష్టిస్తే.. చంద్రబాబు సంపద ఆవిరి చేశాడు. ధర్మం..న్యాయమనేది ఉండాలి కదా..! మంచి చేసిన వాడిపై రాళ్లు వేయడమే ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ 5తో పాటు చంద్రబాబుకు చెందిన ఎల్లో గ్యాంగ్ పనిగా పెట్టుకుంది. వీళ్లు తానా అంటే తందానా అనే ఇతర పార్టీల్లో ఉండే టీడీపీ సభ్యులు, మిడిమిడి జ్ఞానంతో సగం తెలిసి సగం తెలియక..చంద్రబాబును మోయాలన్న తపన, తాపత్రయంతో, జగన్‌పై బురద చల్లాలి అనే యావతో నోటికొచ్చినట్టు ఆరోపణలు గుప్పించడం ఎంతవరకు సమంజసం?అడ్డగోలు రాతలు.. వక్రీకరణలువాస్తవాలు తెలుసుకోకుండా అడ్డగోలుగా రాయడం వక్రీకరణ కాదా? ఐఎస్టీఎస్ చార్జీలు లేకుండా యూనిట్ రూ.2.49కే అత్యంత చౌకగా కొంటున్నప్పుడు ఇదే ఈనాడు రూ.5.73కు కొంటున్నామని ఎలా రాస్తారు. ఇది అబద్ధం కాదా? వక్రీకరణ కాదా? మనం యూనిట్ రూ.2.49కే కొనుగోలు ఒప్పందం చేసుకున్నాం. అది కూడా కోవిడ్ సమయంలో. ఈ ఏడాది మార్చిలో గుజరాత్లో సెకీ టెండర్లు పిలిస్తే యూనిట్ రూ.2.62 నుంచి రూ.2.67 చొప్పున ఖరారయ్యాయి. గుజరాత్లో ఉత్పత్తయ్యే విద్యుత్‌ను గుజరాత్‌లోనే సరఫరా చేసేందుకు ఈ ధర నిర్ణయించారు. టీవీ మోడల్ రేట్లు తగ్గినట్టుగా పవర్ ఉత్పత్తి రేట్లు కూడా తగ్గాలి అంటూ మరో వక్రీకరణ చేశారు. 55 అంగుళాల టీవీ గతంలో రూ.2 లక్షలు ఉంటే.. ఇప్పుడు రూ.55 వేలకే వస్తుంది కదా..! ఆ లెక్కన విద్యుత్ ధర కూడా ఇప్పుడు తగ్గాలి అంటూ వాదిస్తున్నారు. ఈనాడు వాదన ప్రకారమైతే.. ఇదే సోలార్ పవర్‌ను మా హయాంలో రూ.2.49 చొప్పున కొనుగోలు చేశాం. అంటే ఇప్పుడు అది రూ.1.50కే రావాలి కదా..? మరి గుజరాత్లో రూ.2.67 చొప్పున ఎందుకు కొనుగోలు చేస్తున్నారు? వాస్తవాలను వక్రీకరించి ఏ విధంగా అడ్డగోలుగా అబద్ధాలు అచ్చేస్తారో.. మాట్లాడుతున్నారో చెప్పేందుకు ఇదో ఉదాహరణ!!తియ్యటి కబురుతో కేంద్రం లేఖ..చంద్రగ్రహణం పట్టిన సోలార్ బిడ్ల వ్యవహారంపై దాదాపు 10 నెలలు కోర్టుల్లో పోరాటాలు చేస్తుండగా.. 2021 సెప్టెంబర్ 15న రాష్ట్ర ప్రభుత్వానికి తియ్యటి కబురు మాదిరిగా సెకీ నుంచి లేఖ వచ్చింది. రైతులకు పగటి పూటే ఉచితంగా 9 గంటలపాటు విద్యుత్ సరఫరా చేయాలన్న రాష్ట్ర ప్రభుత్వ చర్యలను అభినందించింది.సెకీ రాసిన ఆ లేఖలో యూనిట్ రూ.2.49 కే ట్రేడింగ్ మార్జిన్‌తో కలిపి ఇస్తామని ఉంది. రైతుల జీవన ప్రమాణాలను మెరుగుపరిచే మీ ఉద్దేశాన్ని అభినందిస్తూ ఈ ప్రతిపాదన చేస్తున్నామని ఆ లేఖలో సెకీ పేర్కొంది. కేంద్ర ప్రభుత్వం స్పెషల్ ఇన్సెంటివ్ కింద ఇంటర్ స్టేట్ ట్రాన్స్‌విుషన్ సిస్టం(ఐఎస్టీఎస్) చార్జీలు 25 ఏళ్ల పాటు మాఫీ అవుతాయని లేఖలో పేర్కొన్నారు. 2024 సెప్టెంబర్‌లో 3 వేల మెగావాట్లు, 2025 సెప్టెంబర్‌లో 3 వేల మెగావాట్లు, 2026 సెప్టెంబర్‌లో 3 వేల మెగావాట్లు చొప్పున మొత్తంగా 9 వేల మెగావాట్లు సౌర విద్యుత్ ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నామని సెకీ తెలిపింది. తమ ప్రతిపాదనపై సాధ్యమైనంత త్వరగా స్పందన తెలియచేయాలని సెకీ లేఖలో కోరింది.డిస్కంలను బాబు సంక్షోభంలోకి నెడితే.. మేం నిలబెట్టాం..రైతన్నలకు దాదాపుగా 18 లక్షల వ్యవసాయ పంపు సెట్ కనెక్షన్లు ఉన్నాయి. ఉచిత విద్యుత్‌ను రైతన్నలకు ఇచ్చేందుకు ఏటా దాదాపు రూ.9 వేల కోట్లు రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు పెడుతోంది. పెట్టుబడి ఖర్చు తగ్గించగలిగితే రైతన్న ఆదాయాలు పెరుగుతాయి. అందులో ఉచిత విద్యుత్ ప్రధాన భూమిక పోషిస్తుంది. దీనివల్ల ప్రతి రైతన్నకు ఏటా దాదాపు రూ.40 వేల నుంచి రూ.45 వేలు ప్రయోజనం చేకూరుతుంది. డిస్కంల పరిస్థితి చూస్తే చంద్రబాబు అధికారంలోకి రాకముందు అంటే 2014 నాటికి రూ.29 వేల కోట్లు అప్పులు, బకాయిలు ఉండగా ఆయన దిగిపోయే నాటికి అంటే 2019కి ఏకంగా రూ.86 వేల కోట్లకు ఎగబాకాయి. దాదాపుగా 23.88 శాతం వార్షిక అప్పు పెరుగుదల (సీఏజీఆర్)తో చంద్రబాబు హయాంలో డిస్కంల పరిస్థితి దయనీయంగా ఉంది. డిస్కంలను ఆదుకునేందుకు ఆయన చేసిన సాయం రూ.13,255 కోట్లు మాత్రమే. అదే వైఎస్సార్సీపీ హయాంలో రూ.47,800 కోట్లు డిస్కంలకు అందించి ఆదుకున్నాం.రూ.6.99కు కొన్న బాబు గొప్పా..? రూ.2.49కు నేను కొంటే తప్పా?చంద్రబాబు హయాంలో పవన విద్యుత్(విండ్ పవర్)కు సంబంధించి 2014–19 మధ్య 3,494 మెగావాట్ల విద్యుత్ కోసం 133 పీపీఏలు చేసుకున్నారు. సగటున యూనిట్ రూ.4.84 చొప్పున కొనుగోలు చేసుకునేందుకు ఒప్పందాలు చేసుకున్నారు. 2014లో మాత్రం రూ.4.70 చొప్పున కొన్నారు. సోలార్ విద్యుత్ సంబంధించి 2014–19 మధ్య 2,500 మెగావాట్ల విద్యుత్ కొనుగోలు కోసం 35 పీపీఏలు చంద్రబాబు చేసుకున్నారు. యూనిట్ రూ.5.25 నుంచి రూ.6.99 చొప్పున కొనుగోలు చేసుకునేందుకు ఒప్పందాలు చేసుకున్నారు. 2014లో 649 మెగావాట్ల కోసం 30 పీపీఏలు చేసుకోగా యూనిట్ రూ.6.49కు కొన్నారు. 2015లో రూ.5.96కు, 2016లో వరుసగా యూనిట్ రూ.6.80కు, రూ.5.99, రూ.4.61,రూ.4.50 చొప్పున కొనుగోలు చేసేందుకు ఒప్పందాలు చేసుకున్నారు. అంటే చంద్రబాబు హయాంలో సోలార్ విద్యుత్‌ను సగటున యూనిట్ రూ.5.90 చొప్పున కొన్నారు. 2019–20లో ఏపీఈఆర్సీ టారిఫ్ ఆర్డర్ చూస్తే విండ్ పవర్ సగటు ధర యూనిట్ రూ.4.63, సోలార్ పవర్ సగటు ధర యూనిట్ రూ.5.90కు కొనేందుకు అనుమతినిస్తే.. మా హయాంలో రూ.2.49 చొప్పున అత్యంత చౌక ధరకు 7 వేల మెగావాట్లు సౌర విద్యుత్ కొనుగోలుకు ఒప్పందాలు చేసుకుంటే నాపై బురద జల్లడం ఎంతవరకు సమంజసం? ఆత్మనిర్భర్ కింద సోలార్ ప్యానళ్ల తయారీని ప్రోత్సహించేందుకు దేశంలో ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్ కింద కేంద్రం గొప్ప అడుగు వేసింది. రాష్ట్రానికి మంచి చేయాలన్న తపనతో చరిత్రలో ముందెన్నడూ లేనంత చౌక ధరకు విద్యుత్ కొనుగోలు కోసం సెకీతో ఒప్పందం చేసుకున్న నేను మంచోడినా? లేక అంత దిక్కుమాలిన రేట్లకు పీపీఏలు చేసుకున్న చంద్రబాబు మంచోడా?సమగ్ర అధ్యయనం తర్వాతే ఒప్పందంయూనిట్ రూ.2.49కే యూనిట్ చొప్పున విద్యుత్ సరఫరా చేస్తామని 2021 సెప్టెంబర్ 15న సెకీ నుంచి లెటర్ వచ్చింది. ముందే నిర్ణయించిన షెడ్యూలు ప్రకారం సెప్టెంబర్ 16న కేబినెట్ మీటింగ్ ఉన్నందున సెకీ ప్రతిపాదనను టేబుల్ అజెండాగా చేర్చి మంత్రివర్గ సహచరులతో చర్చించాం. అయితే ఆ కేబినెట్ మీటింగ్‌లో నిర్ణయాలేమీ తీసుకోలేదు. ఆమోదాలు తెలపలేదు. కేవలం సెకీ నుంచి వచ్చిన లెటర్లో పేర్కొన్న అంశాలపై లోతుపాతులను అధ్యయనం చేసి వచ్చే కేబినెట్ నాటికి ప్రతిపాదనలు సిద్దం చేయాలని ఆదేశాలిచ్చాం. దీనిపై విద్యుత్ శాఖ అధికారుల కమిటీ ఏకంగాæ 40 రోజుల పాటు అధ్యయనం చేసిన అనంతరం 2021 అక్టోబర్ 25వ తేదీన నివేదిక సమర్పించింది. అక్టోబర్ 28న కేబినెట్ దీనిపై సుదీర్ఘంగా చర్చించిన అనంతరం ఏపీఈఆర్సీ నుంచి కూడా ఆమోదం తీసుకోవాలని సూచిస్తూ తీర్మానం చేసింది. ఐఎస్టీఎస్ చార్జీలు, ఆ విధమైన ఇతర చార్జీలు ఏవీ కూడా వర్తించవంటూ సెకీ, రాష్ట్ర ప్రభుత్వం మధ్య ఒప్పంద పత్రంలో స్పష్టంగా పేర్కొన్న భాగం నవంబర్ 11న ఏపీఈఆర్సీ గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. దీంతో డిసెంబర్ 1వ తేదీన సెకీతో ఒప్పందంపై ఆంధప్రదేశ్ ప్రభుత్వం, డిస్కమ్‌లు సంతకాలు చేశాయి. ఎక్కడా థర్డ్ పార్టీ ఎవరూ లేరు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య జరిగిన పవర్ సేల్ అగ్రిమెంట్ ఇది. ఈ అగ్రిమెంట్ 3.2 క్లాజ్‌లో 25 ఏళ్లపాటు అంతర్రాష్ట్ర ట్రాన్స్మిషన్ ఛార్జీలు నుంచి మినహాయింపు ఇస్తామని స్పష్టంగా పేర్కొంది.గుజరాత్, రాజస్థాన్‌లలో పీఎల్ఎఫ్ అధికంచంద్రబాబు ఎల్లో గ్యాంగ్ సభ్యులు ఓ విచిత్రమైన లాజిక్ తీసుకొచ్చారు. గుజరాత్లో రూ.1.99 విద్యుత్ వస్తుంటే... సెకీతో రూ.2.49కు ఎందుకు ఒప్పందం చేసుకున్నారని అడు గుతున్నారు. అయ్యా చంద్రబాబూ..! గుజరాత్, రాజస్థాన్ ఎడారి ప్రాంతాలు. అక్కడ ప్లాంట్ లోడ్ ఫ్యాక్టర్స్(పీఎల్ఎఫ్) 23.5 శాతం నమోదైతే, మన రాష్ట్రంలో 17–18 శాతం దగ్గర నమోదవుతాయి. ఏపీ, కర్నాటక, తమిళనాడు రాష్ట్రాలతో పోలిస్తే, గుజరాత్, రాజస్థాన్‌లో సోలార్ పవర్ ఉత్పత్తి చేసే వాళ్లకు యూనిట్‌కు రూ.0.50 అడ్వంటేజ్ (తక్కువ) ఉంటుంది. దీనిపై మాట్లాడుతున్న వీళ్లు ట్రాన్స్మిషన్ వ్యయంపై ఎందుకు మాట్లాడడం లేదో తెలియడం లేదు. ఐఎస్టీఎస్ ధర ప్రతీ యూనిట్‌కు దాదాపు రూ.2 అదనంగా పడుతుందన్న విషయాన్ని కప్పిపుచ్చుతున్నారు. -
మంచి చేసినోడిపై రాళ్లు వేస్తారా?: వైఎస్ జగన్
సాక్షి, గుంటూరు: తాను సంపద సృష్టి చేస్తే.. చంద్రబాబు ఆవిరి చేస్తున్నారంటూ వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి మండిపడ్డారు. గురువారం తాడేపల్లి వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. మంచి చేసినోడిపై రాళ్లు వేస్తున్నారంటూ మండిపడ్డారు.‘‘డిసెంబర్ 1న సెకీ, ప్రభుత్వం మధ్య ఒప్పందం జరిగింది. పవర్ సేల్ అగ్రిమెంట్ జరిగింది. ఒప్పందంలో సెకీ, ఏపీ ప్రభుత్వం, డిస్కమ్‌ల సంతకాలు చేశాయి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య జరిగిన ఒప్పందంలో థర్డ్ పార్టీ ఎక్కడుంది?. ఇంటర్ స్టేట్ ట్రాన్స్మిషన్ ఛార్జెస్ మినహాయిస్తూ ఒప్పందంలో స్పష్టంగా ఉంది. గుజరాత్, రాజస్థాన్‌లో పవర్ జనరేషన్ కాస్ట్ గురించే మాట్లాడుతున్నారు. ట్రాన్స్ మిషన్ కాస్ట్ గురించి ఎందుకు మాట్లాడటం లేదు?. ధర్మం లేదు.. న్యాయం లేదు.. మంచి చేసిన వాళ్లపై బండలు వేయడమే పని’’ అంటూ చందబాబు, ఎల్లో మీడియాపై వైఎస్ జగన్ ఆగ్రహం వ్యక్తం చేశారు.చంద్రబాబు, ఆయన సోషల్ మీడియా నాపై బురద చల్లడమే పనిగా పెట్టుకున్నారు. ఛత్తీస్‌గఢ్, ఒడిశా, తమిళనాడు కంటే ఏపీకి తక్కువ రేటుకే విద్యుత్ వచ్చింది. తక్కువ రేటుకు విద్యుత్ తీసుకొస్తే సన్మానించాల్సింది పోయి.. మాటలంటున్నారు. సంపద సృష్టి నేను చేస్తే.. బాబు ఆవిరి చేస్తున్నారు. ఈనాడు, ఆంధ్రజ్యోతి వక్రీకరణ చేసి రాస్తున్నాయి. చంద్రబాబు, ఎల్లో మీడియా వక్రీకరించి మాట్లాడటం ధర్మమేనా?. ఈ ప్రతిపాదన అక్టోబర్ 28న కేబినెట్ ముందుకు ఎజెండా ఐటమ్ కింద వచ్చింది. టీవీ రేట్లు తగ్గినట్లు కరెంటు రేట్లు తగ్గాలని ఈనాడు రాసింది. వక్రీకరణలు ఏ స్థాయిలో ఉంటాయో చెప్పడానికి ఇవే ఉదాహరణలు’’ అంటూ వైఎస్ జగన్ వివరించారు. -
ఈనాడు, ఆంధ్రజ్యోతిపై పరువు నష్టం దావా వేస్తున్నాం: వైఎస్ జగన్
గుంటూరు, సాక్షి: ప్రముఖ వ్యాపారవేత్త గౌతమ్ అదానీపై అమెరికాలో నమోదైన కేసులో.. తన పేరు ఉందన్న ప్రచారంపైనా మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి స్పందించారు. ఆ ఆరోపణల్లో తన పేరు ఎక్కడా లేదని, అది ఉత్త మూర్ఖపు ప్రచారమేనని, కొంతమంది కావాలని చేస్తున్న రాద్ధాంతమని కుండబద్ధలు కొట్టారాయన. అలాగే తనపై తప్పుడు రాతలు రాస్తున్న ఈనాడు, ఆంధ్రజ్యోతికి డెడ్‌లైన్ విధించారాయన.‘‘సీఎంలు పారిశ్రామిక వేత్తలను కలుస్తారు. నేను ఐదేళ్ల కాలంలో అదానీని కలిశాను. వాటికి విద్యుత్ ఒప్పందాలకు ముడిపెట్టి నాపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారు. ఇందులో థర్డ్ పార్టీ ఎవరూ లేరు. ఇది ఏపీ ప్రభుత్వానికి, డిస్కంలకు, కేంద్ర ప్రభుత్వానికి(సెకి) మధ్య జరిగిన ఒప్పందం. నాపై తప్పుడు ప్రచారం చేస్తున్న వాళ్లపై పరువు నష్టం దావా వేస్తా. .. ఈనాడు, ఆంధ్రజ్యోతి.. టీడీపీ కోసం పని చేసే మీడియా సంస్థలు. వాస్తవాల్ని వకక్రీకరించి పదే పదే అబద్ధాలు రాస్తున్నాయి. ఆ కేసులో నా పేరు ఎక్కడా లేదు. కానీ, ఆ రెండు మీడియా సంస్థలు నా పరువు ప్రతిష్టలు దెబ్బ తీసేలా అబద్ధాలతో ప్రచారం చేస్తున్నాయి. వాటికి లీగల్ నోటీసులు పంపిస్తా. వాటికి 48 గంటల ఇస్తున్నా. ఆ లోపు క్షమాపణలు చెప్పకపోతే.. రూ.100 కోట్లకు పరువు నష్టం దావా వేస్తా’’ అని వైఎస్ జగన్ హెచ్చరించారు.ఇదీ చదవండి: సంపద సృష్టించిన జగన్.. ఆవిరి చేస్తున్న చంద్రబాబు! ఎలాగంటే.. -
సెకి ఒప్పందం.. ఏం జరిగిందో పూసగుచ్చినట్టు చెప్పిన వైఎస్ జగన్
గుంటూరు, సాక్షి: విద్యుత్ కొనుగోలు ఒప్పందాల విషయంలో గత వైఎస్సార్సీపీ ప్రభుత్వాన్ని బద్నాం చేసేందుకు జరుగుతున్న కుట్రలను.. మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎండగట్టారు. ఒప్పందం జరిగింది కేంద్ర ప్రభుత్వం(సెకి), రాష్ట్ర ప్రభుత్వానికి మాత్రమేనని.. ఏపీ చరిత్రలోనే నిలిచిపోయే అత్యంత చవకైన ఈ ఒప్పందంపై బురద జల్లుతూ రాతలు రాయడం ఆశ్చర్యం కలిగిస్తోందని అన్నారాయన. తాడేపల్లిలో మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ..‘‘రైతులకు ఉచిత కరెంట్ అనేది ఒక కల. దీనివల్ల రైతుల పెట్టుబడి ఖర్చులు తగ్గుతాయి. బాబు హయాంలో డిస్కంల పరిస్థితి దయనీయంగా మారింది. డిస్కంలను నిర్వీర్యం చేశారాయన. చంద్రబాబు చేసిన సోలార్ పవర్ ఒప్పందాలు రూ.5.90తో చేసుకున్నారు. డిస్కంల అప్పులను 86 వేల కోట్లకు పెంచారు. మా హయాంలో డిస్కంలను నిలబెట్టే ప్రయత్నం చేశాం. పగటి పూటే రైతులకు 9 గంటల కరెంట్ ఇవ్వగలిగాం. ఉచిత కరెంట్ కోసం రూ.9 వేల కోట్లు ఖర్చు చేశాం. ఆ టైంలో యూనిట్‌ను 2.40 నుంచి 2.50 రూ. చొప్పున సప్లై సేందుకు 24 బిడ్లు వచ్చాయి. కానీ, చంద్రగ్రహణం(చంద్రబాబును ఉద్దేశించి).. ఆ ప్రక్రియకు అడ్డం పడింది. కోర్టుల ద్వారా అడ్డుకునే ప్రయత్నం చేశారు. దీనికోసం మేం వివిధ కోర్టులో పోరాడాల్సి వచ్చింది. అలాంటి టైంలో.... 2021 సెప్టెంబర్ 15వ తేదీన కేంద్ర ప్రభుత్వం (సెకి) నుంచి తియ్యటి కబురుతో ఓ లేఖ వచ్చింది. రాష్ట్ర ప్రభుత్వ చర్యలను పొగుడుతూ.. రైతుల పట్ల ప్రదర్శిస్తున్న ప్రత్యేక శ్రద్ధను సెకి అభినందించింది. యూనిట్‌కు రూ.2.49కే.. మొత్తంగా 9 వేల మెగా వాట్ల పవర్‌ను అందుబాటులోకి ఇస్తాం అంటూ పేర్కొంది. ఇందులో 2024 సెప్టెంబర్‌లో 3 వేల మెగా వాట్ల విద్యుత్ అందుబాటులోకి వస్తుందని చెప్పింది. ఇది ఏపీ చరిత్రలోనే అతితక్కువ ధరకు అందించిన పవర్ ఆఫర్ ఇది... కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేస్తున్న మంచిని ప్రశంసిస్తూ.. ఆ సంకల్పానికి తోడుగా ఉంటామని లేఖ రాసింది. మేమే పవర్ సప్లై చేస్తామని చెప్పింది. ఇక్కడ మూడో పార్టీ ఎక్కడుంది?. రెండోది.. రూ.2.49కి అందుబాటులోకి ఇస్తాం అంటూ పేర్కొంది. ఇది ఏపీ చరిత్రలోనే అతితక్కువ ధరకు అందించే ఒప్పందం. ఐఎస్టీఎస్ (ఇంటర్ స్టేట్ ట్రాన్స్మిషన్ ఛార్జీలు) ఛార్జీలు లేకుండా(యూనిట్‌కు రూ.1.98పైసా చొప్పున).. స్పెషల్ ఇంటెన్సివ్ ఇస్తానంది. ఇక్కడ.. యూనిట్ రూ.2.61 మనకు కలిసి వస్తుంది. ఏడాది 4,400 కోట్లు కలిసి వస్తాయి. ఒప్పందం ప్రకారం పాతికేళ్లకు.. లక్షల కోట్లు కలిసి వచ్చేవి... ఏపీ చరిత్రలోనే అత్యంత చవకైన విద్యుత్ కొనుగోలు ఒప్పందం ఇది. లక్షల కోట్లు ఆదాయం ఆదా కావడం సంపద సృష్టి కాదా?. ఇది చరిత్రలో నిలిచిపోయే ఒప్పందం. ఇలాంటి ఒప్పందానికి స్పందించకున్నా.. చంద్రబాబు, ఆయన అనుకూల మీడియా ఊరుకునేవా?. నన్ను ఏమనేవారు.ఇంకా జగన్ ఏమన్నారంటే.. 👉ఆరోజుల్లో దాదాపు 18 లక్షల పంప్సెట్లు. దానికి ఉచిత కరెంటు కోసం దాదాపు రూ.9 వేల కోట్ల ఖర్చు.అలాంటి పరిస్థితుల్లో.. చంద్రబాబు 5 ఏళ్ల పాలన చూస్తే.. విద్యుత్ రంగం దారుణం. డిస్కమ్‌లు పూర్తిగా నష్టాల్లో కూరుకుపోయాయి. డిస్కమ్‌ల పరిస్థితి చూస్తే, చంద్రబాబు రాకముందు రూ.29 వేల కోట్ల అప్పులు, బకాయిలు ఉంటే, ఆయన దిగిపోయేనాటికి అవి ఏకంగా రూ.86 వేల కోట్లకు ఎగబాకాయి. దాదాపు 23.88 శాతం సీఏజీఆర్. డిస్కమ్‌ల నష్ట పరిస్థితి.ప్రభుత్వం నుంచి డిస్కమ్‌లకు సపోర్టు చూస్తే.. రూ.13255 కోట్లు మాత్రమే చేయగా, మా ప్రభుత్వ హయాంలో రూ.47,800 కోట్లు. ఆ విద్యుత్‌ను 20 ఏళ్లపాటు ఉచితంగా ఇచ్చేలా, ప్రభుత్వం ఒక ఆలోచన చేసింది.👉టెండర్లు. చంద్రగ్రహణం2020 నవంబర్ లో 6,400 మెగావాట్లకు సంబంధించి టెండర్లు. ఏపీ గ్రీన్ ఎనర్జీ కార్పొరేషన్ లిమిటెడ్ ఆధ్వర్యంలో, సోలార్ పార్కులు రాష్ట్రంలో పెట్టాలని టెండర్లు పిలిచాం. ఆ టెండర్లలో రూ.2.49 నుంచి రూ.2.58 చొప్పున సరఫరాకు ఎన్టీపీసీ వంటి పెద్ద సంస్థలన్నీ పాల్గొన్నాయి. దాదాపు 24 బిడ్లు దాఖలయ్యాయి. కానీ దురదృష్టవశాత్తూ మనం ఈ ప్రాజెక్టులు స్టార్ట్ చేయాలంటే చంద్రబాబు అనే చంద్రగ్రహణం కూడా మనకు ఉంది కాబట్టి, రకరకాల పద్ధతుల్లో కోర్టుల్లో ఈ ప్రక్రియ అంతా ఆపేసే కార్యక్రమం జరిగింది. కోర్టుల ద్వారా ఆగిపోయిన పరిస్థితులు కనిపించాయి.2020 నవంబరులో ఆ కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రభుత్వం సంకల్పించి, ఆ తర్వాత వివిధ కోర్టుల్లో దీని కోసం పోరాటం చేయాల్సిన పరిస్థితి వచ్చింది.👉సెకి లేఖ రాక. తీపి కబురు2021, సెప్టెంబరు 15న, రాష్ట్ర ప్రభుత్వానికి తీయటి కబురు వచ్చింది. కేంద్ర ప్రభుత్వ సంస్థ సెకి నుంచి లేఖ వచ్చింది. సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (సెకి) నుంచి వచ్చిన లేఖ సారాంశం చూస్తే..6400 మెగావాట్ల సోలార్ విద్యుత్ సరఫరా చేయడానికి సిద్ధమని ప్రకటించింది. ప్రభుత్వానికి వచ్చిన అతి తక్కువ ధర రూ.2.49 చూశాం. మీరు రైతులపై చూపుతున్న శ్రద్ధను అభినందిస్తున్నాం. డిస్కమ్‌ల మీద భారం తగ్గిస్తూ, రైతులను ఆదుకుంటున్న విధానాన్ని, వారికి ఉచిత విద్యుత్ ఇవ్వడాన్ని ప్రశంసిస్తూ, ఆ విద్యుత్‌ను తామే రూ.2.49కే ఇస్తామని సెకి వెల్లడించింది.అంతే కాకుండా, వారు చెప్పిన ఇంకో ముఖ్య విషయం ఏమిటంటే.. ఒక స్పెషల్ ఇన్సెంటివ్‌గా.. ఐఎస్టీఎస్ (ఇంటర్‌స్టేట్ ట్రాన్స్మిషన్ ఛార్జెస్)ను 25 ఏళ్లపాటు రద్దు చేస్తామని వెల్లడించారు.అలా 2026 నాటికి మొత్తం మీద 9 వేల మెగావాట్ల సౌర విద్యుత్ సరఫరా చేస్తామని సెకి వివరించింది.👉నేను ఒక్కటే అడుగుతున్నాను. ఆ లెటర్లో టేక్ ఎవేస్ చూస్తే..కేంద్ర సంస్థ సెకితో ప్రభుత్వం నేరుగా జరిపిన లావాదేవీ ఇది. ఇక్కడ మూడో వ్యక్తి ఎవరూ లేరు. ఇంకా చెప్పాలంటే, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వం మధ్య విషయం.యూనిట్ రూ.2.49కే. ఇది రాష్ట్ర చరిత్రలో అతి తక్కువ ఖర్చుతో వచ్చే విద్యుత్.ఈ ప్రాజెక్టుకు మాత్రమే ఐఎస్టీఎస్ (ఇంటర్‌స్టేట్ ట్రాన్స్మిషన్ ఛార్జెస్) ఉండదు. ఇది స్పెషల్ ఇన్సెంటివ్‌గా ఇస్తున్నామని చెప్పడం. 👉సంపద సృష్టి అంటే ఏమిటి? మీరే చెప్పండి:గతంలో రాష్ట్రంలో సగటు విద్యుత్ కొనుగోలు ధర రూ.5.10. అదే మనకు 17 వేల మిలియన్ యూనిట్లు కేవలం రూ.2.49కే ఇవ్వడానికి కేంద్ర సంస్థ ముందుకు వచ్చింది.అంటే ఒక్కో యూనిట్ ధర ఇక్కడ రూ.2.60 తగ్గింది. దీని వల్ల ఏటా రూ.4400 కోట్లు. 25 ఏళ్లలో ఆ మొత్తం దాదాపు రూ.1.10 లక్షల కోట్లు. మరి అది సంపద సృష్టి కాదా?👉అలాంటి ఆఫర్ కాదంటే.. కేంద్రం నుంచి ఇలాంటి ఆఫర్ వస్తే.. అతి తక్కువ ధరకు విద్యుత్. ఐఎస్టీఎస్ మాఫీ. 25 ఏళ్లలో మీకు లక్ష కోట్లకు పైగా ఆదా. రైతులకు మంచి చేసేందుకు మీతో కలిసి వస్తామని అంటే..అలాంటి లెటర్‌ను పక్కన పెడితే, మీరంతా నన్ను ఏమనేవారు? ఇదే ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ5 ఏమని విమర్శించేవారు. ఆలోచన చేయమని కోరుతున్నాను. రాష్ట్రానికి మంచి చేయాలని నేను అడుగులు ముందుకు వేస్తే, బురద చల్లుతున్నారు. వారు చేస్తోంది ధర్మమేనా? మనమంతా అడగాలి. చంద్రబాబుకు అన్నీ తెలుసు. అయినా ఆయనే ఆ నింద వేస్తున్నారు.రూ.2.49కే యూనిట్ పవర్. ఇది ఒక చరిత్ర. కేవలం మా ప్రభుత్వం వల్లనే సా«ధ్యమైంది. అది చరిత్రాత్మక ఒప్పందం. అలాంటి ఒప్పందాన్ని తప్పుబడుతున్నారు. ఆరోపణలు చేస్తున్నారు.👉చంద్రబాబు హయాంలో విద్యుత్ కొనుగోళ్లుచంద్రబాబు ప్రభుత్వ హయాంలో 2014ృ19 మధ్య 3494 మెగావాట్లకు సంబంధించి 133 పీపీఏలు చేసుకున్నారు. ఆ పీపీఏలు గమనిస్తే.. రూ.4.84 నుంచి రూ.4.83 వరకు ఉన్నాయి. 2014లో మాత్రం రూ.4.70కి వచ్చింది. సోలార్ కు సంబంధించి.. 2500 మెగావాట్లకు ఆయన పీపీఏ చేసుకున్నారు. 2014లో 650 మెగావాట్లు సగటున రూ 6.49కు కొనుగోలుకు చంద్రబాబు ఒప్పందం చేసుకున్నారు. రూ.5.25 నుంచి 6.99 మధ్య ఒప్పందం చేసుకున్నారు.2015లో రూ.5.96 కు మరో 250 మెగావాట్లకు ఒప్పందం. 2016లో రూ.6.80, రూ.5.99, రూ.4.61, రూ.4.50 కి కొనుగోలు చేశారు. ఆయన సోలార్ ఎనర్జీని యావరేజ్ గా రూ.5.90కి కొనుగోలు చేశారు.👉అతి తక్కువ రేట్‌కు పీపీఏ చేయడం తప్పా?: చంద్రబాబు హయాంలో విండ్ పవర్ యావరేజ్ యూనిట్ ప్రైస్ రూ.4.63 అయితే.. సోలార్ యూనిట్ రూ.5.90. మరి నేను రూ.2.49కు అంటే చంద్రబాబు పెట్టిన దానిలో సగం రేటుకు కొనుగోలు చేస్తే.. చీపెస్ట్ రేట్ కి పవర్ సరఫరా చేస్తామని కేంద్ర ప్రభుత్వం నాకు లేఖ రాస్తే.. ఐఎస్ టీ ఎస్ చార్జెస్ మాఫీ చేస్తామని చెబితే.. నేను స్పందించకపోయి ఉంటే నన్ను మీరేమని ఏమనేవారు?.స్పందించిన నేను మంచి వాడినా.. అంత దిక్కుమాలిన రేట్లకు పీపీఏలు చేసుకున్న చంద్రబాబు మంచి వాడా?👉ఎవరికి సంపద సృష్టి. ఎవరికి ఆవిరి?:చంద్రబాబు హయాంలో సంపద ఎలా ఎరోడ్ (ఆవిరైపోయిందో) అయిందో చెబుతాను.చంద్రబాబు సోలార్, విండ్ పీపీఏలను వైయస్సార్ సీపీ చేసుకున్న సోలార్ ఒప్పందంతో పోలిస్తే.. అవన్నీ 25 ఏళ్ల పాటు రాష్ట్ర ప్రభుత్వంపై మోపుతున్న భారం.. రాష్ట్ర ప్రభుత్వం మోయాల్సిన భారం ఇది. ఇదే మాదిరిగా చూస్తే.. 3500 విండ్ పీపీఏలకు సంబంధించి ఆయన చేసుకున్న రూ.4.84లు మైనస్ మనం చేసుకున్న రూ.2.49. అంటే రూ.2.35 రాష్ట్ర ప్రభుత్వం అదనంగా కట్టాల్సి వస్తుంది. ఇంటూ 3500 మెగావాట్లు అంటే 9000 మిలియన్ యూనిట్లు..అంటే రూ.2.35 ఇంటూ 9000 మిలియన్ సంవత్సరానికి రూ.2వేల కోట్లు.. 25 ఏళ్లలో రూ.50 వేల కోట్లు కేవలం చంద్రబాబు చేసుకున్న విండ్ యూనిట్ల వల్ల రాష్ట్ర ప్రభుత్వంపై భారం.సోలార్ ఎనర్జీ ఒప్పందాలు చూస్తే.. చంద్రబాబు 2400 మెగావాట్లు ఆయన చేసుకున్న ఒప్పందం.. యావరేజ్ ప్రైస్ రూ.5.90.అదే మేము ఒప్పందం చేసుకున్నది రూ.2.49. అంటే రూ.3.41 ఆయన చేసుకున్న పీపీఏల వల్ల రాష్ట ప్రభుత్వం అదనంగా కట్టాలి కదా? 2400 మెగావాట్లు అంటే.. 4200 మిలియన్ యూనిట్లు ఇంటూ రూ.3.41. ఏడాదికి 1500 కోట్లు సంవత్సరానికి భారం పడుతుంది. 1500 కోట్లు ఇంటూ 25 ఏళ్లు అంటే.. 37500 కోట్లు.. జగన్ ప్రభుత్వం చేసుకున్న విద్యుత్ ఒప్పందం వల్ల 25 ఏళ్లలో రూ.1.10 లక్షల కోట్ల సంపద సృష్టి జరుగుతుంటే.. చంద్రబాబు చేసుకున్న సోలార్, విండ్ ఒప్పందాల వల్ల.. 25 ఏళ్లలో రూ.87,500 కోట్ల సంపద ఆవిరవుతుంది. తేడా గమనించండి.👉సెకి లేఖ. పరిణామాలు. ఒప్పందం:సెకి నుంచి 2021, సెప్టెంబరు 15న లేఖ రాగా, ఇటువంటి మంచి ఆఫర్ రావడంతో, ఆ మర్నాడే క్యాబినెట్ మీటింగ్ ఉండగా, దాన్ని టేబుల్ ఐటెం కింద పెట్టాం. అంటే సెప్టెంబరు 16న క్యాబినెట్లో చర్చించాం. ృ ఎనర్జీ శాఖ అన్నీ అధ్యయనం చేసి వచ్చే క్యాబినెట్ నాటికి నివేదిక ఇవ్వాలని ఆదేశించారు. దాదాపు 40 రోజుల పాటు అన్నీ అధ్యయనం చేసిన ఇంధనశాఖ కమిటీ, 2021, అక్టోబరు 25న నివేదిక సమర్పించారు.ఆ తర్వాత అక్టోబరు 28న క్యాబినెట్ జరగ్గా, ఆ నివేదికను క్యాబినెట్ ముందు ఉంచడం జరిగింది. అన్నీ చర్చించిన తర్వాత క్యాబినెట్ ఏం చెప్పిందంటే, ఏపీఈఆర్సీ అనుమతి కూడా తీసుకోవాలని నిర్దేశించి, ఆమోదం తెలిపింది.ఆ తర్వాత నవంబరు 11న ఏపీఈఆర్సీ క్లియరెన్స్ ఇచ్చింది. ఆ క్రమంలో డిసెంబరు 1, 2021న ప్రభుత్వం, సెకి మధ్య పవర్సేల్ అగ్రిమెంట్ జరిగింది.దాంట్లో ఎవరెవరు సైన్ చేశారంటే.. సెకి, రాష్ట్ర ప్రభుత్వం, నాలుగు డిస్కమ్‌లు సంతకాలు చేశారు. ఇక్కడ ఎక్కడా థర్డ్ పార్టీ లేదు.స్పష్టంగా చెప్పాలంటే.. అది సెకి, రాష్ట్ర ప్రభుత్వం, డిస్కమ్‌ల మధ్య జరిగిన ఒప్పందం. దానికి కేంద్ర ప్రభుత్వ అనుమతి కూడా ముందే ఇచ్చింది.👉ఆ ఒప్పందం కనుక చేసుకోకపోయి ఉంటే..:ఒక చరిత్రాత్మక ఘట్టం చోటు చేసుకుంటే.. రూ.2.49కే విద్యుత్ మన రాష్ట్రానికి దొరుకుతుంటే, ఇంకా స్పెషల్ ఇన్సెంటివ్‌గా ఐఎస్టీఎస్ మాఫీ. అదెంతో తెలుసా? ఒక్కో యూనిట్‌కు రూ.2. అంటే ఒక్కో మెగావాట్‌కు నెలకు దాదాపు రూ.4 లక్షలు. అంటే ఏడాదికి దాదాపు రూ.50 లక్షలు అన్నమాట. అంత తక్కువ ధరకు మనకు సోలార్ విద్యుత్ వచ్చింది. ఆత్మ నిర్బల్ భారత్ కింద, సౌర విద్యుత్‌ను ప్రోత్సహిస్తూ, కేంద్రం మనకు ఆ ఇన్సెంటివ్ ఇచ్చింది.అంత మంచి ఆఫర్‌ను నేను పక్కనపడేసి ఉంటే, అదే మీరు ఏమనేవారు? 25 ఏళ్లలో దాదాపు రూ.1.10 లక్షల కోట్లు ఆదా. అంటే అది సంపద సృష్టి కాదా? నిజానికి అది ఒక రోల్‌మోడల్ కేసు.అప్పుడు కూడా ఇతర రాష్ట్రాల్లో ఎక్కువ ధర:ఇక్కడ మరో ఆశ్చర్యకరమైన విషయం తెలుసా? ఇదే సెకి, అదే ఆత్మ నిర్బల్ భారత్ కింద.. తమిళనాడుకు కూడా విద్యుత్ సరఫరా చేసింది.చత్తీస్గడ్ రూ.2.61. ఒడిషా రూ.2.61. తమిళనాడు రూ.2.61అదే మన రాష్ట్రానికి 12 పైసలు తక్కువగా రూ.2.49కే తెస్తే, నన్ను సన్మానించాల్సింది పోయి, ఏం విమర్శలు చేస్తున్నారు.చంద్రబాబు సంపద ఆవిరి చేస్తే, నేను సృష్టించాను. మరి ధర్మం, న్యాయం ఎక్కడుంది?ఎల్లో మీడియా పిచ్చి రాతలు:ఇక ఎల్లో మీడియా రాతలు. వారికి తోడు తానా అంటే తందానా అంటూ, చంద్రబాబు, ఆయన పార్టీ నేతలు, ఇతర పార్టీల్లో ఉన్న ఆయన మనుషులు, హాఫ్ బేక్డ్ నాలెడ్జ్ ఉన్న వాళ్ల పిచ్చి విమర్శలు. గుజరాత్లో రూ.1.99కే విద్యుత్ ఉత్పత్తి చేస్తుంటే, మనం రూ.2.49కి ఎందుకు కొన్నామని అంటున్నారు.అక్కడి పరిస్థితులు వేరు. ఇర్రేడియేషన్ స్థితి. ఎడారి ప్రాంతాల్లో ఉత్పత్తి వ్యయం తక్కువ.కానీ, చంద్రబాబు, ఎల్లో మీడియా అతి తెలివి ప్రదర్శిస్తూ.. గుజరాత్, రాజస్థాన్‌లో ఉత్పత్తి వ్యయం గురించి మాట్లాడుతున్నారు. కానీ, ఆయా రాష్ట్రాల్లో ట్రాన్స్మిషన్ ఛార్జీలు ఎంతో తెలుసా? యూనిట్‌కు రూ.1.98.మరి ఈనాడు గుజరాత్ గురించి రాశారు. అక్కడ యూనిట్ ఉత్పత్తి వ్యయం రూ.1.99 అంటున్నారు. మరి ఎక్కడ ఉత్పత్తి? ఎక్కడ వినియోగం? చూడాలి కదా?అంటే గుజరాత్‌లోనే ఉత్పత్తి చేసి, ఆ రాష్ట్రంలోనే సరఫరా చేస్తున్నారు. అంటే మొత్తం అంతా రాష్ట్రంలోనే. అందుకే వారికి ఆ రేట్లు వర్తిస్తున్నాయి.వారికి అక్కడ ఇర్రేడియేషన్ లెవెల్ వల్ల విద్యుత్ ఉత్పత్తి వ్యయం రూ.1.99.రాజస్థాన్‌లో చూస్తే, అదే స్థితి. ఉత్పత్తి, సరఫరా అంతా ఒకే రాష్ట్రంలో. అయినా ఈనాడులో అది రాయరు. కేవలం ఉత్పత్తి వ్యయం తక్కువ అని మాత్రమే చెబుతారు. అక్కడ కూడా ఇంటర్ స్టేట్ ట్రాన్స్మిషన్ ఛార్జీలు లేవు. మరి అలా రాయడం వక్రీకరణ కాదా?👉కోవిడ్ తర్వాత, తాజాగా గుజరాత్లో సెకి టెండర్లు చూస్తే.. 2024, మార్చి 15న టెండర్ల బిడ్లు చూస్తే, రూ.2.62 నుంచి రూ.2.67 వరకు ధర. అంటే గుజరాత్‌లోనే ఉత్పత్తి. ధర.రాజస్థాన్‌లో కూడా బిడ్లు చూస్తే.. దాదాపు అవే ధరలు. అంటే ప్రస్తుత రెన్యూవబుల్ ఎనర్జీ రేట్లు ఇలా ఉన్నాయి.👉ఆ లెక్కన రూ.1.50కే రావాలి కదా?:మనకు అక్కడి జనరేషన్ కాస్ట్ కంటే తక్కువకు రూ.2.49కే వచ్చాయని సంతోషపడాలి.ఈనాడులో ఏం రాశారు? ఏళ్లు గడుస్తున్న కొద్దీ కొత్త మోడళ్ల టీవీల ధరలు తగ్గుతాయి. అలాగే విద్యుత్ ఛార్జీలు కూడా టెక్నాలజీ పెరిగిన తర్వాత తగ్గాలి కదా? అంటున్నారు.ఆ ప్రకారం, ఈనాడు థియరీ ప్రకారం చూస్తే.. అదే గుజరాత్లో సోలార్ పవర్ ఇవాళ రూ.1.50కే రావాలి కదా? మరి రూ.2.67 వరకు ఎందుకు పోయింది? అంటే ఏ స్థాయిలో అబద్ధాలు చెబుతున్నారనే దానికి ఇవన్నీ ఉదాహరణలు.👉మీడియా ప్రశ్నలకు సమాధానంగా..చంద్రబాబు ఆ ఒప్పందాలు రద్దు చేసుకుంటే..ఎవరూ అంత తెలివి తక్కువగా ఆ పని చేయరు. అంత తక్కువ ధరకు విద్యుత్ దొరకదు. పైగా 25 ఏళ్లలో లక్ష కోట్లకు పైగా ఆదా. 2009 నుంచి చూస్తే.. రూ.3.70 మొదలు చంద్రబాబు హయాంలో రూ.6.99 వరకు చేరింది.మా హయాంలో ఒకే అగ్రిమెంట్. యూనిట్ ధర రూ.2.49.అంత తక్కువ ధరకు ఎవరూ కొనుగోలు చేయలేరు. ఇది వాస్తవం.ఇంకా చెప్పాలంటే చరిత్రాత్మకం. డిస్కమ్‌లు కరెంటు కొంటున్నాయి. సెకి సరఫరా చేస్తోంది. మేము యూనిట్‌కు రూ.2.49 చొప్పున సెకికి చెల్లిస్తున్నాం. అది అప్పట్లో చాలా తక్కువ ధర. పైగా ఇంటర్ స్టేట్ ట్రాన్స్మిషన్ ఛార్జీల మాఫీ. అంత మంచి ఆఫర్ ఎవరైనా వదులుకుంటారా? మీరే చెప్పండి. దాని వల్ల ఏటా రూ.4400 కోట్లు ఆదా. అంటే 25 ఏళ్లలో రూ.1.10 లక్షల కోట్లు ఆదా. ఇది ముమ్మాటికీ సంపద సృష్టే.సెకితో ఏపీ ప్రభుత్వ ఒప్పందం.. చరిత్రలో నిలిచిపోయే ఘట్టం. ఇంత మంచి చేసిన నన్ను అభినందించి సత్కరించాల్సింది పోయి.. రాళ్లు వేస్తునన్నారు. అయినా.. చంద్రబాబు, ఆయన సోషల్ మీడియా ఇంతలా వక్రీకరించి మాట్లాడడం ధర్మమేనా?. ఈనాడు, ఆంధ్రజ్యోతి.. ఇంతలా వకక్రీకరించాలా?. టీవీ రేట్లు తగగ్గినట్లు కరెంట్ రేట్లు తగ్గాలని ఈనాడు రాసింది. ఇక్కడే వక్రీకరణ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు అని జగన్ అన్నారు.