breaking news
-
సత్యవర్థన్ ఉపసంహరించుకున్న కేసులో వంశీ అరెస్ట్ ఏంటి?: జూపూడి
సాక్షి, తాడేపల్లి: కూటమి ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోందని వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జూపూడి ప్రభాకర్ మండిపడ్డారు. గురువారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ, వంశీపై అక్రమ కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారని.. చట్టం మీ చుట్టం అనుకుంటున్నారా? అంటూ ధ్వజమెత్తారు.వైఎస్సార్సీపీ నేతలపై అక్రమ కేసులు బనాయిస్తున్నారు. అక్రమ కేసులు, బెదిరింపులతో వైఎస్సార్సీపీ నేతలను భయపెట్టలేరు. వంశీ 24 గంటల్లో బయటకు వస్తారు. కుట్రలతో చేస్తున్న మీ చర్యలు ప్రజాస్వామ్యానికి మంచిదికాదు. టీడీపీ నేతలు గూండాల్లా బరి తెగిస్తున్నారు. వైఎస్సార్పీ కేడర్‌ను భయపెట్టాలని చూస్తున్నారు. సత్యవర్థన్ నిజం చెప్పినా తప్పుడు కేసులు పెడుతున్నారు. సత్యవర్థన్ ఉపసంహరించుకున్న కేసులో వంశీ అరెస్ట్ ఏంటి?’’ అంటూ జూపూడి ప్రభాకర్ ప్రశ్నించారు.‘‘తనతో తప్పుడు కేసు పెట్టించారని సత్యవర్ధన్ కోర్టులో జడ్జి ముందే చెప్పాడు. రాష్ట్రంలో రాతియుగం నాటి పాలన సాగుతోంది. కోర్టులు, చట్టాలు అంటే కూటమి ప్రభుత్వానికి లెక్కలేదు. కొందరు పోలీసులు చట్ట వ్యతిరేకంగా పని చేస్తున్నారు. మానవ హక్కులను కాలరాస్తున్నారు. వంశీ అరెస్టు అన్యాయం, అక్రమం. టీడీపీ ఆఫీసుపై దాడి చేసింది వారి పార్టీ కార్యకర్తలే. కానీ వైఎస్సార్సీపీ కార్యకర్తలు, నేతలపై అక్రమ కేసులు పెట్టారు. సత్యవర్ధన్ ఎస్సీ అని ఆయన్ను వేధిస్తున్నారు. ప్రజాస్వామ్యాన్ని రక్షించటానికి వెయ్యి గొంతులు బయటకు వస్తాయి. అరెస్టులతో వైఎస్సార్సీపీ భయపెట్టలేరు. పాలకులు చట్టబద్దంగా వ్యవహరిస్తే మంచిది. అధికార దుర్వినియోగం చేస్తే కోర్టులు చూస్తూ ఊరుకోవు. చట్టమే ఉరితాడుగా మారి మీ గొంతులకు బిగిస్తుంది జాగ్రత్త. వంశీతో అరెస్టుతో కూటమి ప్రభుత్వం అధ:పాతాళానికి పోయింది. సుప్రీంకోర్టులో ఉన్న కేసు అంటే కూడా పోలీసులకు లెక్క లేకుండా పోయింది. బాధితుల మీదనే తిరిగి కేసులు పెట్టే దారుణమైన పరిస్థితి ఏర్పడిందిఅధికారం లేనందున వైఎస్సార్సీపీ నేతలంతా లొంగిపోతారనుకోవటం అవివేకం. అక్రమ కేసులు పెట్టటం నుండి సాక్ష్యం చెప్పించే వరకు ఎవరెవరు ఏ పని చేయాలో కూడా పోలీసులే నిర్ధారిస్తున్నారు. ప్రశాతంగా ఉన్న రాష్ట్రాన్ని నాశనం చేయొద్దు. చట్టాలు, రాజ్యాంగాన్ని గౌరవించండి’’ అని జూపూడి ప్రభాకర్ హితవు పలికారు. -
HYD to Vjy: వల్లభనేని వంశీ అరెస్ట్.. అసలేం జరిగిందంటే?
సాక్షి, విజయవాడ: ఏపీలో కూటమి సర్కార్ పాలనలో కక్ష సాధింపు చర్యలు పీక్ స్టేజ్‌కు చేరుకున్నారు. వైఎస్సార్సీపీ నేతలను టార్గెట్ చేస్తూ అక్రమ కేసులు పెడుతున్నారు. ఈ క్రమంలో గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీపై అక్రమ పెట్టి ఆయనను హైదరాబాద్‌లో అరెస్ట్ చేశారు. ఈ సందర్భంగా బీఎన్ఎస్ సెక్షన్ 140(1), 308, 351(3) రెడ్‌విత్ 3(5) కింద కేసులు నమోదు చేసినట్టు పోలీసులు తెలిపారు.అలాగే, వంశీపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు సైతం పోలీసులు నమోదు చేశారు. ఇదే సమయంలో కిడ్నాప్, దాడి, ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసుల్లో అరెస్ట్ చేస్తున్నట్టు వంశీ భార్యకు పోలీసులు నోటీసుల్లో తెలిపారు. అనంతరం, వంశీని అరెస్ట్ చేసి విజయవాడకు తరలించారు.వంశీ అరెస్ట్.. ఆపై ఇలా..5 AM: గచ్చిబౌలిలోని వంశీకి ఇంటికి చేరుకున్న పటమట పోలీసులు.5:15 AM: వంశీకి అరెస్ట్ నోటీసులు ఇచ్చిన పోలీసులు.6 AM: వంశీని అరెస్ట్ చేసి ఆయన భార్యకు నోటీసులు ఇచ్చిన పోలీసులు.7 AM: గచ్చిబౌలి నుంచి వల్లభనేని వంశీ విజయవాడకు తరలింపు. 10:45 AM: సూర్యాపేట వద్ద బ్రేక్‌ఫాస్ట్11:45 AM: నందిగామ దగ్గర వంశీ భార్య పంకజ శ్రీని అడ్డుకున్న పోలీసులు.12:30 PM: విజయవాడకు వంశీ తరలింపు. ఈ సందర్భంగా నగరంలో సెక్షన్ 144 విధింపు.12:45 PM: భవానీపురం పీఎస్‌లో వాహనం మార్పు.1:10 PM: కృష్ణలంక పీఎస్‌కు వంశీని తరలించిన పోలీసులు. పీఎస్‌లో వంశీని పోలీసులు ప్రశ్నిస్తున్నారు. -
నచ్చినట్లు పాలిస్తే.. ఎవరికి నష్టం?
ఆంధ్రప్రదేలో కూటమి సర్కార్ ప్రాధాన్యతలు స్పష్టంగా తెలిసిపోతున్నాయి. ప్రభుత్వ నిధులను తమకిష్టమైన వారికి పందేరం పెట్టేందుకు టీడీపీ, జనసేనలు తామిచ్చిన హామీను కూడా పక్కనబెట్టేస్తున్నాయి. దీనికి మంత్రివర్గ ఆమోద ముద్ర కూడా పడింది. అమరావతి పేరుతో రియల్ ఎస్టేట్ కోసం అప్పులు చేసి మరీ వేల కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్న సంగతి తెలిసిందే. అదేకాకుండా నీరు-చెట్టు స్కీమ్ పెండింగ్ బకాయిల పేరుతో ప్రభుత్వం నిధుల గోల్‌మాల్‌కు పాల్పడతున్నట్లు విమర్శలు వస్తున్నాయి. పైగా అప్పట్లో జరిగిన భారీ అక్రమాలపై విజిలెన్స్ అధికారులు పెట్టిన కేసులను సైతం ఎత్తివేయడానికి చంద్రబాబు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందంటే, అవినీతికి ఏ స్థాయిలో మద్దతు ఇస్తున్నది అర్థమవుతుంది. 2014-19లో చంద్రబాబు ప్రభుత్వం చేపట్టిన నీరు-చెట్టు కార్యక్రమంలో అవినీతి పెద్ద ఎత్తున జరిగినట్లు ఆరోపణలున్నాయి. టీడీపీ కార్యకర్తలు, నేతలు పనులు చేయకుండానే పెద్ద ఎత్తున బిల్లులు క్లెయిమ్ చేశారని అంచనా. అప్పట్లో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడుగా ఉన్న సోము వీర్రాజు కూడా ఈ పథకంలోనే రూ.13 వేల కోట్ల కుంభకోణం జరిగిందని ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వం స్వచ్ఛ భారత్ ప్రోగ్రాంలో భాగంగా మరుగుదొడ్ల నిర్మాణానికి ఇచ్చిన నిధులను కూడా టీడీపీ వారు కైంకర్యం చేసేశారని కూడా ఆయన విమర్శించారు. నీరు-చెట్టు కింద ఆ స్థాయిలో అవినీతి జరిగితే ఇప్పుడు ఆ స్కీమ్ లో ఖర్చు చేశామని చెబుతూ వచ్చిన బిల్లులన్నిటిని చెల్లించాలని నిర్ణయించారట. సుమారు రూ.900 కోట్ల బిల్లులు ఇచ్చేస్తున్నారట. వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఈ పథకంలో అవినీతిని నిగ్గుతేల్చి పనులు చేసిన వారికే నిధులు చెల్లించాలని స్పష్టమైన ఆదేశాలు జారీ చేయగా.. విజిలెన్స్ శాఖ అవినీతిపై నివేదికలు సిద్ధం చేశారు. కొందరిపై కేసులూ పెట్టారు. అప్పట్లో కొంత మంది తమకు చెల్లించాల్సిన బిల్లులపై కోర్టుకెల్లి సానుకూల తీర్పులు పొందగలిగారు. ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో నీరు-చెట్టు పథకం కాంట్రాక్టులు పొందిన వారి పంట పండింది. గత ప్రభుత్వపు విజిలెన్స్ నివేదికలు కూడా పక్కనబెట్ట కేసులన్నిటిని ఎత్తివేసి మరీ బిల్లులు చెల్లించాలని చంద్రబాబు అధ్యక్షతన జరిగిన మంత్రివర్గ సమావేశం నిర్ణయించింది. చంద్రబాబు ప్రభుత్వం రెడ్‌బుక్ పేరుతో విపక్ష వైఎస్సార్ కాంగ్రెస్ కేడర్, నేతలు, అప్పట్లో పనులు చేసిన వారిపై కక్ష కట్టి వేధిస్తోంది. బిల్లులు నిలిపి వేస్తోంది. టీడీపీ, జనసేన ,బీజేపీలకు చెందిన వారిపై మాత్రం ఎన్ని అవకతవకలు జరిగినా అవాజ్య ప్రేమ కనబరుస్తోంది. సూపర్ సిక్స్ హామీలకు డబ్బులు లేవని చెప్పే ఈ ప్రభుత్వం టీడీపీ కార్యకర్తల బిల్లులకు మాత్రం వందల కోట్లు చెల్లించడానికి సిద్దమైన తీరు ‘ఔరా’ అనిపిస్తోంది. జనం ఏమైపోయినా ఫర్వాలేదు..తమ కార్యకర్తలు ఆర్థికంగా పరిపుష్టంగా ఉంటే చాలన్నట్లుగా కూటమి ప్రభుత్వ ప్రాధాన్యత ఉందని చెప్పాలి. ఆ రోజుల్లో విజిలెన్స్ అధికారులు కేసులు పెడితే అక్రమం అని అంటున్న కూటమి నేతలు, ఇప్పుడు YSRCP వారిపై పెడుతున్న విజిలెన్స్, ఇతర శాఖల కేసులు మాత్రం సక్రమమని చెబుతోంది. ఇప్పటికే అధికార యంత్రాంగాన్ని సైతం వేధిస్తూ నిర్వీర్యం చేస్తున్న చంద్రబాబు ప్రభుత్వం తాజా చర్యతో ఎవరిపైన అయినా కేసులు పెట్టాలంటే భయపడే పరిస్థితిని తెచ్చారు. ఇప్పుడు కక్షపూరితంగా పెడుతున్న కేసులను ఒకవేళ మళ్లీ వైఎస్సార్సీపీ ప్రభుత్వం వస్తే ఎత్తివేయదా? అనే ప్రశ్న సహజంగానే వస్తుంది. జగన్ టైమ్‌లో గ్రామాలలో నిర్మాణమైన అనేక భవనాలకు బిల్లులు పెండింగులో ఉన్న వాటిని మంజూరు చేయడం లేదని చెబుతున్నారు. YSRCP వారు ఎవరైనా పార్టీ మారి కూటమికి మద్దతు ఇచ్చి, ఎవరైనా కూటమి ఎమ్మెల్యేనో, లేక మంత్రినో ప్రసన్నం చేసుకుంటేనే అవి వచ్చే పరిస్థితి ఉందని అంటున్నారు. ఎదురుగా కనబడుతున్న పనులకు బిల్లులు ఇవ్వకుండా, అసలు జరిగాయో లేదో తెలియని, కనిపించని నీరు చెట్టు పనులకు మాత్రం కోట్లు విడుదల చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇంకో సంగతి చెప్పాలి. ఏపీ ప్రభుత్వంలో కోటి రూపాయల మించి జరిగే పనులకు సంబంధించి కాంట్రాక్టర్లకు పది శాతం మొబిలైజేషన్ అడ్వాన్స్ ఇవ్వాలని నిర్ణయించారట. గతంలో ఇరిగేషన్ ప్రాజెక్టులకు మొబిలైజేషన్ అడ్వాన్స్ ఇవ్వాలని వైఎస్ ప్రభుత్వం నిర్ణయిస్తే తీవ్ర స్థాయిలో తప్పు పట్టిన చంద్రబాబు, తెలుగుదేశం ఇతర నాయకులు, ఇప్పుడు ఏకంగా కోటి రూపాయలకు పైగా పనులు చేపడితే చాలు.. అడ్వాన్స్ మొత్తం పొందవచ్చు. నిధులు తీసుకున్న తర్వాత ఎంతమేర కాంట్రాక్టులు సజావుగా జరుగుతాయో తెలియదు. ఆ రోజుల్లో భారీ ప్రాజెక్టులను ఈపీసీ (ఎస్టిమేషన్ ,ప్రొక్యూర్ మెంట్, కనస్ట్రక్షన్ ) పద్ధతిలో నిర్మించడం కోసం అడ్బాన్స్ లు ఇవ్వాలని తలపెట్టారని, ఇప్పుడు అన్ని పనులకు ఇలా చేస్తే పెద్ద ఎత్తున నిధులు దుర్వినియోగం అయ్యే అవకాశం ఉందని రిటైర్డ్ ఛీఫ్ ఇంజనీర్ ఒకరు అన్నారు. సూపర్ సిక్స్ అమలుకు డబ్బులు లేవని చెప్పే ప్రభుత్వం,ఇలా నీరు-చెట్టు స్కీమ్ బకాయిలు, మొబిలైజేషన్ అడ్వాన్స్ లకు మాత్రం ఉదారంగా డబ్బులు ఇస్తుందన్న విమర్శలు వస్తున్నాయి. ఇలా ఒక విషయంలో కాదు.. అనేక అంశాలలో ప్రభుత్వ తీరు ఇలాగే ఉంది. మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి కేసులో చూడండి.. రాజకీయంగా తమకు సవాల్ విసురుతున్న ప్రముఖులను ఆ కేసులో ఎలాగొలా ఇరికించాలని టీడీపీ నేతలు విశ్వయత్నం చేస్తున్నారు. అందులో భాగంగా తానే వివేకాను హత్య చేశానని అంగీకరించిన దస్తగిరి అనే నిందితుడిని అడ్డం పెట్టుకుని రకరకాల పన్నాగాలు చేస్తున్నారు. ఈ కేసును సీబీఐ చేపట్టి దర్యాప్తు చేస్తున్నా, కొత్త కేసులు పెట్టి వైఎస్సార్సీపీ అధినేత జగన్ బంధువులు, సన్నిహితులు కొందరిని ఇరికించడానికి కుట్ర జరుగుతున్నట్లుగా ఉంది. తను జైలులో ఉన్నప్పుడు దేవిరెడ్డి శివశంకరరెడ్డి కుమారుడు చైతన్యరెడ్డి ఇరవై కోట్లు తెచ్చి ప్రలోభపెట్టాడని దస్తగిరి గతంలో ఆరోపించారు. దీనిపై కేసు కూడా నమోదు చేసి విచారణ చేసి, అలాంటిది ఏమీ జరగలేదని గత నవంబర్‌లో అధికారులు తేల్చారు. దానిని కోర్టు కూడా ఓకే చేసింది. అయినా చంద్రబాబు ప్రభుత్వం సంతృప్తి చెందలేదు. మరోసారి కేసు నమోదు చేసి విచారణకు ఆదేశించిందన్న వార్త చూస్తే రెడ్ బుక్ పాలన ఇలా ఉంటుందన్న మాట అనిపిస్తుంది. తెలంగాణ హైకోర్టు మాత్రం నిందితుడైన దస్తగిరిని సాక్షిగా ఎలా మార్చారని సీబీఐ ప్రశ్నించడం గమనార్హం. మరో వైపు సోషల్ మీడియా కార్యకర్తలపై వేధింపులు కొనసాగుతున్నాయి. ప్రముఖ దర్శకుడు, సినీ నిర్మాత రాంగోపాల్ వర్మను ఒంగోలు పోలీసులు తొమ్మిది గంటలపాటు విచారించిన తీరు కూడా రెడ్ బుక్ వ్యవహారంగానే కనిపిస్తుంది. ఎప్పుడో ఐదేళ్ల క్రితం తీసిన ఒక సినిమాలో చంద్రబాబు, పవన్ కల్యాణ్ లపై అనుచితంగా సన్నివేశాలు పెట్టారని, మార్పింగ్ జరిగిందని అందువల్ల తమ మనోభావాలు గాయపడ్డాయని ఇప్పుడు ఒక టీడీపీ కార్యకర్త కేసు పెట్టారు.అంతే! పోలీసులు వాయు వేగంతో స్పందించి వర్మను విచారణకు పిలిచారు. మరో కేసులో ఆయనను అరెస్టు చేయాలని ప్రయత్నించారు కానీ హైకోర్టు బెయిల్ ఇవ్వడంతో ఆ పని చేయలేక పోయారు. అయినా రెడ్ బుక్ వేధింపుల పర్వంలో భాగంగా ఆయనను అన్ని గంటలు ప్రశ్నించారు. రఘురామకృష్ణరాజు తనను పోలీసులు హింసించారని ఆరోపిస్తూ చేసిన ఫిర్యాదుపై కూడా విచారణ సాగిస్తున్నారు.. ఆయనపై హింస జరగలేదని నివేదిక ఇచ్చిన ప్రభుత్వ డాక్టర్ ప్రభావతిని కూడా తొమ్మిది గంటలు ప్రశ్నించారట. ఆమె కూడా ముందస్తు బెయిల్ సుప్రీంకోర్టుకు వెళ్లాల్సి వచ్చింది. విశేషం ఏమిటంటే కులాలు, మతాల మధ్య ద్వేషపూరిత ప్రసంగాలు చేశారంటూ పెట్టిన కేసేమో పక్కకు పోయింది. ఆయన తనను హింసించారంటూ చేసిన ఫిర్యాదుకేమో హడావుడి చేస్తున్నారు. గన్నవరంలో టీడీపీ ఆఫీస్‌పై దాడి జరిగిన కేసు అంటూ అనేకమంది వైఎస్సార్సీపీ వారిని అరెస్టు చేశారు. తనతో బలవంతంగా కేసు పెట్టించారని పిటిషన్ దారుడు ఉపసంహరించుకోవడం సంచలమైంది. అయినా మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీపై ఏదోరకంగా రెడ్ బుక్ ప్రయోగించాలని నిర్ణయించుకుని అరెస్టు చేశారు. తమకు కావల్సినవారు నేరాలు చేసినా కేసులు ఎత్తివేయడం, తమ ప్రత్యర్థులు నేరాలు చేసినా, చేయకపోయినా, ఏదో ఒక సాకు చూపుతూ కేసులు పెట్టడం, పోలీస్ స్టేషన్ ల చుట్టూ తిప్పడం చేస్తున్నారు. నిజంగానే రెడ్ బుక్కు పిచ్చి కుక్క మాదిరి వాడుతున్నారన్న వైఎస్సార్సీపీ నేతల వ్యాఖ్య మాదిరిగానే పరిస్థితి ఉన్నట్లు కనిపిస్తుంది. భారత రాజ్యాంగం బదులు రెడ్ బుక్ పాలనను కూటమి ప్రభుత్వం సాగిస్తున్న వైనం ఏపీకి తీరని నష్టం చేస్తోంది. :::కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత -
బాబూ.. ఇంకెన్ని రోజులు వైఎస్సార్సీపీ పేరు చెప్పుకుంటారు?: బొత్స
సాక్షి, విశాఖపట్నం: ఏపీలో కూటమి పాలనలో ఇష్టారీతిన అక్రమ కేసులు పెడుతున్నారని ఆరోపించారు వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ. ఇదే సమయంలో వల్లభనేని వంశీ అరెస్ట్‌ను ఖండిస్తున్నట్టు తెలిపారు. అలాగే, కూటమి సర్కార్ పాలనపై సెటైర్లు వేశారు. ప్రభుత్వం గురించి ఎల్లో మీడియాలో గొప్పగా రాయడం తప్ప ఇంకేమీ లేదని ఎద్దేవా చేశారు.ఎమ్మెల్సీ బొత్స(Botsa Satyanarayana) విశాఖలో మీడియాతో మాట్లాడుతూ..‘కూటమి పాలనలో సమీక్షలు తప్ప క్షేత్రస్థాయిలో హామీలు అమలు కావడం లేదు. ప్రచారం చేసిన స్థాయిలో పనులు చేయడం లేదు. నిత్యవసర వస్తువుల ధరలు ఆకాశాన్ని అంటాయి. కరెంట్ చార్జీలు విపరీతంగా పెరిగాయి. ఒకొక్క డిపార్ట్మెంట్లో వేల సంఖ్యలో ఫైల్స్ పెండింగ్‌లో ఉన్నాయి. అధికారులు ప్రజా ప్రతినిధులు మధ్య సమన్వయం లేదు. ఇచ్చిన వాగ్దానాలను అమలు చేయడం లేదు. విద్యార్థులు తల్లిదండ్రులు, రైతులు తీవ్రంగా నష్టపోయారు. ఎన్నికల సందర్బంగా ఇచ్చిన సూపర్ సిక్స్ హామీలపై శాసన మండలిలో నిలదీస్తాం.వైఎస్సార్సీపీ హయాంలో చిత్తశుద్ధితో హామీలు అమలు చేశాం. వైఎస్ జగన్ మాటలతో పరిపాలన చేయలేదు. చేతలతో పరిపాలన చేశారు. కరోనా సమయంలో సంక్షేమ పథకాలు అందించారు. ఇంకెన్ని రోజులు వైఎస్సార్సీపీ పేరు చెప్పి బతుకుతారు. కూటమి పాలనలో ఏ తప్పు జరిగినా వైఎస్సార్సీపీపై తోసేస్తున్నారు. ఇష్టారీతిన అక్రమ కేసులు పెట్టి వేధిస్తున్నారు. హైకోర్టు కూడా పోలీసుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేసింది. గత టీడీపీ, వైఎస్సార్సీపీ ప్రభుత్వం హయాంలో వేసిన సీట్ నివేదికను విడుదల చేయాలి. ఫ్రీ హోల్డ్ భూముల్లో అవకతవకలు జరిగాయన్న కూటమి నేతలు ఎప్పుడు వాటిని బయటపెడతారు. మద్యం ధరలు తగ్గిస్తామని చెప్పి ధరలు పెంచుతున్నారు. కూటమి సర్కార్ పాలనలో ఎవరూ సంతోషంగా లేరు’ అంటూ కామెంట్స్ చేశారు. -
పవన్.. కల్తీ మీ బుర్రలో జరిగింది: భూమన
తిరుపతి, సాక్షి: సనాతన ధర్మంకు విఘాతం కలిగితే తాను ముందు ఉంటానని చెప్పిన పవన్ కల్యాణ్ ఇప్పుడు ఎక్కడ ఉన్నారని వైఎస్సార్సీపీ నేత, టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకరరెడ్డి ప్రశ్నించారు. తిరుమలలో ఓ ప్రైవేట్ హోటల్‌కు అనుమతులివ్వడంపై హిందూ సంఘాలు పోరాటం చేస్తున్నా.. పవన్ మౌనంగా ఉండడంపై భూమన మండిపడ్డారు. అలాగే కేరళలో తిరుమల లడ్డూపై పవన్ చేసిన వ్యాఖ్యలపైనా అభ్యంతరాలు వ్యక్తం చేశారాయన. తిరుపతిలో గురువారం ఉదయం భూమన మీడియాతో మాట్లాడుతూ.. ‘‘ కిందటి ఏడాది సెప్టెంబర్ 20 తేదీన తిరుమలడ్డూ ప్రసాదంలో వాడే నెయ్యిలో ఆవు కొవ్వు, పంది కొవ్వు కలిసిందని సీఎం చంద్రబాబు వ్యాఖ్యలు చేశారు. అయితే.. నిర్ధారణ కాకుండా ఇలాంటి అనుచిత వ్యాఖ్యలు చేయడంపై సుప్రీం కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. సుప్రీం కోర్టు నియమించిన సీబీఐ సిట్ రిపోర్ట్‌లో ఎక్కడా ‘నిర్ధారణ’ అనే విషయం ప్రస్తావించలేదు. .. తిరుమల పవిత్రతకు భంగం కలిగింది ఆనాడు వైఎస్సార్సీపీ ప్రభుత్వంపై చంద్రబాబు ఆరోపణలు చేశారు. మరి ఇప్పుడు ఇదే చంద్రబాబు ముంతాజ్ హోటల్‌కు అనుమతులు ఇచ్చారు. సనాతన ధర్మంకు విఘాతం కలిగిన ముందు ఉంటాను అని చెప్పిన పవన్ ఇప్పుడు ఎక్కడ ఉన్నారు?. ఆధ్యాత్మిక పర్యటనలో ఉన్న పవన్.. అది వ్యక్తిగతం, రాజకీయాలతో సంబంధం లేదని చెబుతున్నారు. మరి అలాంటప్పుడు ఆ పర్యటనల్లో రాజకీయ విమర్శలు ఎలా చేస్తారు?కేరళకు వెళ్లి.. తిరుమల లడ్డూ గురించి తప్పుగా మాట్లాడారు. ఇది మాపై వేస్తున్న నింద కాదు.. స్వయంగా వెంకటేశ్వర స్వామి మీద వేస్తున్న నింద. మా హయాంలో అయోధ్యకు పంపిన లక్ష లడ్డూలు కల్తీ నెయ్యితో చేసినవని పవన్ అన్నారు. లడ్డూలో కాదు.. కల్తీ మీ బుర్రలో జరిగింది. సౌరవ్ బోరా అనే ప్రస్తుత పాలక మండలి సభ్యుడు రూ. 30 లక్షలు ఖర్చు చేసి లక్ష లడ్డూలు తయారు చేయించారు. ఇప్పుడు ఆయన్ని కూడా అరెస్టు చేయించండి. .. పవన్ ఒకప్పుడు సూడో హిందువును, నేను బాప్టిజం తీసుకున్నా అన్నారు.. తన భార్య క్రిస్టియన్ , పిల్లలు క్రిస్టియన్ అన్నారు. ఆపై కాషాయం కట్టి సనాతన ధర్మం అంటూ ఊగిపోయారు. సనాతన ముసుగులో రాజకీయం చేసి, ప్రత్యర్థులు పార్టీలను నాశనం చేయాలని చూస్తున్నారు. ఆ ముసుగులోనే తిరుమల పవిత్రతను పవన్ దిగజార్చుతున్నారు అని భూమన మండిపడ్డారు. తిరుపతిలో ఎన్నో దారుణాలు జరుగుతున్నాయి. మీరు రావాలని హిందూ సంఘాలు పిలుస్తున్నాయి. తిరుపతిలో జరుగుతున్న స్వామీజీ అమరణ నిరాహార దీక్ష కు మద్దతు ఇవ్వండి అని పవన్‌కు భూమన సూచించారు. -
‘చంద్రబాబు, లోకేష్ ప్రతీకారంలో భాగమే వంశీ అరెస్ట్’
సాక్షి, తాడేపల్లి: కూటమి సర్కార్ పాలనలో ప్రతీకారంతోనే వైఎస్సార్సీపీ నేతలను అరెస్ట్ చేస్తున్నారని పార్టీ నాయకులు మండిపడ్డారు. ఈ క్రమంలోనే గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ అరెస్ట్‌ను వైఎస్సార్సీపీ నేతలు ఖండించారు. ఈ సందర్భంగా పార్టీ కార్యకర్తలు సంయమనంతో ఉండాలని కోరారు. మరోవైపు.. ఏపీలో వైఎస్సార్సీపీ నేతలను పోలీసులు హౌస్ అరెస్ట్ చేస్తున్నారు. నేతల ఇళ్ల వద్ద భారీగా పోలీసులు మోహరించారు. విశాఖ: వల్లభనేని వంశీ అరెస్ట్‌పై బొత్స స్పందించారు. ఈ క్రమంలో బొత్స..‘వంశీ అరెస్టును ఖండిస్తున్నాము. ఉప సంహరించుకున్న కేసుపై అరెస్టు ఏమిటి?. కక్షపూరిత రాజకీయాలు ఉండకూడదు. ఇటువంటి రాజకీయాలు మంచిది కాదు. మరోసారి పునరావృతం కాకూడదు’ అంటూ హెచ్చరించారు.తిరుపతి: వంశీ అరెస్ట్‌పై టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి స్పందించారు. ఈ క్రమంలో ఆయన మాట్లాడుతూ..‘వల్లభనేని వంశీ అరెస్టును ఖండిస్తున్నా. కక్ష సాధింపులో భాగంగానే అరెస్ట్ చేశారు. చంద్రబాబు, లోకేష్ ప్రతీకారంతోనే అరెస్ట్‌లు చేస్తున్నారు. వంశీ మీద ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులు పెట్టి సంతోషపడుతున్నారు. వైఎస్సార్సీపీ నేతలందరిపై ప్రతీకార చర్యలకు దిగుతున్నారు. కార్యకర్తలు అందరూ సంయమనంతో ఉండాలని కోరారు.తాడేపల్లి: మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు మాట్లాడుతూ.. వంశీపై అక్రమ కేసులు బనాయిస్తున్నారు. అన్యాయంగా అరెస్టు చేశారు. దీనిని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. 30 మంది పోలీసులు ఇంటికెళ్లి మరీ బెదిరించారు. చట్టాన్ని చేతిలో తీసుకుని తప్పుడు కేసులు పెట్టిస్తున్నారు. రెడ్‌బుక్ రాజ్యాంగానికి అనుగుణంగా పోలీస్ వ్యవస్థ పనిచేస్తోంది. పౌర హక్కులను హరిస్తూ అక్రమ కేసులు పెడుతున్నారు. ఫిర్యాదు చేసిన వ్యక్తే విత్ డ్రా చేసుకుంటే మళ్లీ కేసు పెట్టడమేంటి?. అసలు ఏపీలో ఏం జరుగుతోంది?. న్యాయవ్యవస్థను కూడా తప్పుదోవ పట్టిస్తున్నారు. తప్పుడు కేసులు పెడితే భవిష్యత్తులో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటారు. అధికారం ఎప్పుడూ ఒకరి చేతిలో ఉండదని పోలీసు అధికారులు గుర్తించాలి. డీజీపీని కోర్టుకు పిలిపిస్తామని హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసిందంటేనే వారి పనితీరు ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. మానవ హక్కులను పోలీసులను ఉల్లంఘిస్తున్నారు. విశాఖ: కరణం ధర్మశ్రీ మాట్లాడుతూ.. వంశీ అరెస్ట్‌ను ఖండిస్తున్నాం. కూటమి ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతుంది. కూటమి ప్రభుత్వం ఇప్పటికైనా ప్రజా సమస్యలపై దృష్టి పెట్టాలి. కక్ష సాధింపు చర్యలు మంచి పద్ధతి కాదు. కేసు విత్ డ్రా చేసుకున్న తరవాత అరెస్టులు చేయడమేంటి?.విశాఖ: ఎమ్మెల్సీ కుంభ రవిబాబు మాట్లాడుతూ.. వంశీ అరెస్టు అనాగిరిక చర్య. రాష్ట్రంలో రెడ్‌బుక్ రాజ్యాంగం అమలవుతోంది. వంశీ అరెస్టును తీవ్రంగా ఖండిస్తున్నాం. బెయిల్‌పై ఉన్న వ్యక్తిని ఏ విధంగా అరెస్టు చేస్తారు?. వైఎస్సార్సీపీ నేతలను భయభ్రాంతులకు గురిచేయాలని చంద్రబాబు సర్కార్ చూస్తోంది.చిత్తూరు: చిత్తూరు వైఎస్సార్సీపీ ఇంచార్జ్ విజయనందరెడ్డి మాట్లాడుతూ..‘గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ అరెస్టు ఖండిస్తున్నా. వంశీ అరెస్టు అప్రజాస్వామికం, రాష్ట్రంలో లోకేష్ రెడ్ బుక్ రాజ్యాంగము అమలు చేస్తున్నారు. వైఎస్సార్సీపీ నేతలను అరెస్ట్ చేసి కక్ష సాధింపు చర్యలకు దిగుతున్నారు.విజయవాడ: దేవినేని అవినాష్ మాట్లాడుతూ.. కక్షపూరితంగా వంశీని అరెస్ట్ చేశారు. రాష్ట్రంలో రెడ్‌బుక్ రాజ్యాంగం నడుస్తోంది. కోర్టు వ్యాఖ్యలను కూడా కూటమి సర్కార్ పట్టించుకోవడం లేదు. కేవలం కక్ష సాధింపు కోసమే ఇలా ఇబ్బందులు పెడుతున్నారు. తప్పుడు కేసులపై కోర్టులు న్యాయం చేయాలి. భవిష్యత్ కాలంలో వైఎస్సార్సీపీ ప్రభుత్వం వచ్చాక ఇప్పుడు ఎవరైన తప్పుడు కేసులు పెట్టారో వారిపై చట్టపరంగా ముందుకు వెళ్లడం జరుగుతుంది. వారికి శిక్ష తప్పదు అంటూ హెచ్చరించారు. -
కార్యకర్తలకు అన్నలా ఉంటా..: వైఎస్ జగన్
సాక్షి, అమరావతి: ‘ప్రతి వైఎస్సార్సీపీ కార్యకర్త తరపున చంద్రబాబుకు చెబుతున్నా... మళ్లీ వచ్చేది జగన్ 2.0 పాలన. అన్యాయాలు చేసే వారెవరినీ వదిలిపెట్టేది లేదు. తప్పు చేసిన వారిని చట్టం ముుందు నిలబెడతాం. కార్యకర్తలకు అన్నలా ఉంటా..’ అని వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి(YS Jagan Mohan Reddy) భరోసానిచ్చారు. బుధవారం ఉమ్మడి గుంటూరు జిల్లాకు చెందిన పార్టీ ప్రజాప్రతినిధులు, నేతలతో సమావేశం సందర్భంగా ఆయన ఏమన్నారంటే..ప్రజలకు తోడుగా.. కార్యకర్తలకు అండగాజగన్ 1.0 పాలనలో అధికారంలోకి వచ్చిన 9 నెలలు కాకమునుపే ఎప్పుడూ చూడని విధంగా కోవిడ్ పరిస్థితుల మధ్యే కాలం గడిపాం. తర్వాత రెండున్నర సంవత్సరాలు కోవిడ్ మధ్యే ఉన్నాం. ఆ టైంలో ప్రజలకు ఎలా తోడుగా ఉండాలనే తపనతో అడుగులు వేశాం. అందుకే కార్యకర్తలకు చేయదగినంత చేయలేకపోయాం. ఈసారి జగన్ 2.0లో ప్రజలకు తోడుగా ఉంటూ.. కార్యకర్తలకు అండగా, వారి ఇంటికి అన్నలా ఉంటా. మార్చి నాటికి స్థానిక సంస్థలకు నాలుగేళ్ల పదవీ కాలం ముగియబోతుంది. తమ వాళ్లను పదవుల్లో కూర్చోబెట్టడానికి ప్రభుత్వంలో ఉన్నవాళ్లు ప్రయత్నిస్తారు. మన వాళ్లను భయపెట్టడానికి, లొంగదీసుకోవడానికి, ప్రలోభపెట్టడానికి ప్రయత్నిస్తారు. ఇవన్నీ ఉన్నా మనం ధైర్యంగా ఉండాలి. ఎల్లకాలం ఇలా ఉండదు. చీకటి తర్వాత వెలుతురు రాక మానదు. రానున్న మూడు సంవత్సరాలు మన క్యారెక్టర్‌ను కాపాడుకుందాం. మన విలువలు కాపాడుకుందాం. ఆ తర్వాత రాబోయే మన ప్రభుత్వంలో అందరికీ దగ్గరుండి మేలు చేస్తాం.ఉప ఎన్నికల్లో ప్రజాస్వామ్యం ఖూనీ..ఈ ప్రభుత్వంలో ఏ మాదిరిగా పాలన చేస్తున్నారో చూస్తున్నాం. మొన్న స్థానిక సంస్థల ఉప ఎన్నికల్లో ప్రజాస్వామ్యం ఖూనీ అయింది. టీడీపీకి ఏమాత్రం సంఖ్యాబలం లేకపోయినా దాడులు చేసి భయపెట్టారు, ప్రలోభపెట్టారు. అన్యాయాలు చేసి గెలిచామంటూ గొప్పగా చెప్పుకుంటున్నారు. తిరుపతి కార్పొరేషన్లో 49 స్థానాలుంటే వైఎస్సార్సీపీ 48 గెలిచింది. టీడీపీ ఒకే ఒక్కటి గెలిచింది. ఒక్కటే గెలిచిన చోట డిప్యూటీ మేయర్ వాళ్ల మనిషి అని గొప్పగా చెప్పుకుంటున్నారు. వైఎస్సార్సీపీ కార్పొరేటర్లు ప్రయాణిస్తున్న బస్సును పోలీసుల ద్వారా వాళ్లే అడ్డుకుంటారు. వాళ్లే పోలీసుల ఆధ్వర్యంలో కార్పొరేటర్లను కిడ్నాప్ చేస్తారు. మళ్లీ ఎన్నికల్లో మావాడు గెలిచాడని నిస్సిగ్గుగా చెప్పుకుంటారు. ఇక ఏలూరు కార్పొరేషన్లో 50 డివిజన్లు ఉంటే అందులో 47 వైఎస్సార్సీపీకి రాగా టీడీపీకి వచ్చింది కేవలం 3 మాత్రమే. నెల్లూరు కార్పొరేషన్లో 54 డివిజన్లు ఉంటే 54 వైఎస్సార్‌సీపీవే. ఇక హిందూపురం మున్సిపాల్టీలో 38 డివిజన్లు ఉంటే వైఎస్సార్సీపీకి 29 వచ్చాయి. టీడీపీకి 6 మాత్రమే వస్తే చంద్రబాబు బావమరిది బాలకృష్ణ అక్కడ తమకు పీఠం దక్కిందని అదో ఘనకార్యంలా చెప్పుకుంటున్నారు. పాలకొండలో 20 స్థానాలకు 17 వైఎస్సార్‌సీపీవే. టీడీపీకి మూడు మాత్రమే ఉన్నాయి. అక్కడ వైఎస్సార్సీపీ వాళ్లను లాక్కోలేక ఎన్నిక వాయిదా వేశారు. తునిలో టీడీపీకి ఒక్కరూ లేరు. అక్కడ ఉద్రిక్త పరిస్థితుల మధ్య ఎన్నికలు వాయిదా అంటారు. పిడుగురాళ్ల మున్సిపాల్టీలో 33కు 33 వైఎస్సార్‌సీపీవే. దీంతో అక్కడ కూడా ఎన్నికలు వాయిదా అన్నారు. నూజివీడులో 32 ఉంటే 25 వైఎస్సార్సీపీ, ఏడు టీడీపీవి. నందిగామ మున్సిపాల్టీలో కూడా వైఎస్సార్సీపీదే మెజార్టీ. చివరికి గుంటూరులో కూడా 57లో 46 స్థానాలు వైఎస్సార్‌సీపీవే. అవిశ్వాసం పెట్టి మేయర్‌ను దించేస్తామని చెబుతున్నారు. ఇక ప్రజాస్వామ్యం ఎక్కడుంది? మన ప్రభుత్వం ఏర్పడిన మూడు సంవత్సరాల తర్వాత స్థానిక సంస్థల ఎన్నికలు జరిగాయి. ప్రజలు ఆ ఎన్నికల్లో భారీ మెజార్టీతో వైఎస్సార్సీపీకి పట్టం కట్టారు. ఆ రోజు తాడిపత్రి, దర్శి రెండు మున్సిపాల్టీలే పోయాయి. తాడిపత్రిలో 20 స్థానాలు వాళ్లకు... 18 స్థానాలు మనకు వచ్చాయి. ఆ రోజు నేను గట్టిగా తుమ్మి ఉంటే ఆ రెండూ కూడా వాళ్లకు వచ్చి ఉండేవి కావు. ప్రజాస్వామం గెలవాలి... ఈరోజు టీడీపీ చేస్తున్నదేమిటి? ఇదా ప్రజాస్వామ్యం? అని అందరూ ఆలోచన చేయాలి. ఇలాంటి రాజ్యం పోవాలి. ప్రజాస్వామ్యం నిలవాలి. విలువలు, వ్యక్తిత్వంతో కూడిన రాజకీయాలు అవసరం. కార్యకర్తలు ఫలానా వాడు మా నాయకుడు అని కాలర్ ఎగరేసుకుని తిరగాలి. ప్రజలు గొప్పగా చెప్పుకునేలా నాయకత్వం ఉండాలి. ఇదే వైఎస్సార్సీపీ సిద్ధాంతం.స్కాములు మినహా పాలన ఏది?స్కాములు మినహా ఈ ప్రభుత్వంలో ఏమీ జరగడం లేదు. ముఖ్యమంత్రిగా పాలన సాగించేటప్పుడు ఆ పార్టీకి సంబంధించిన ప్రతి కార్యకర్త ఫలానా వ్యక్తి మా నాయకుడు అని కాలర్ ఎగరేసుకుని చెప్పుకునేలా ఉండాలని అనుకుంటారు. కానీ ఇవాళ పరిస్థితి చూస్తే... చంద్రబాబు, కూటమి నేతలు అధికారంలో ఉంటూ దోచుకోవడం, దోచుకున్నది పంచుకుని తినడం మాత్రమే జరుగుతోంది. రాష్ట్రంలో ఎక్కడ చూసినా మద్యం స్కామ్, ఇసుక స్కామ్. ఓ నియోజకవర్గంలో మైనింగ్ జరగాలన్నా, ఫ్యాక్టరీ నడపాలన్నా ఎమ్మెల్యేకు ఇంత ఇవ్వాలి.. ఆయన చంద్రబాబుకి ఇంత ఇవ్వాలి! ప్రతి నియోజకర్గంలోనూ యథేచ్ఛగా పేకాట క్లబ్బులు నిర్వహిస్తున్నారు. ఎవరైనా ప్రశ్నిస్తారేమోనని చిన్న పిల్లలని కూడా చూడకుండా 111 సెక్షన్ కేసులు పెడుతున్నారు. తమ తప్పులను సోషల్ మీడియాలో ప్రశ్నించి పోస్టింగులు పెట్టేవారిపై టెర్రరిస్టుల మాదిరిగా వ్యవస్థీకృత నేర చట్టాల కింద కేసులు బనాయించి జైల్లో పెడుతున్నారు. వివిధ స్టేషన్లు, జిల్లాల చుట్టూ తిప్పుతున్నారు. కానీ చంద్రబాబు మర్చిపోతున్న విషయం ఏమిటంటే... ఇలాంటి అన్యాయాలు చేస్తే ప్రజలు గుణపాఠం చెప్పడం ఖాయం. -
చంద్రబాబు చీటర్ కాదా?: వైఎస్ జగన్
ఇవాళ ఈ ప్రభుత్వ హయాంలో ఒకవైపు సూపర్ సిక్స్, సూపర్ సెవెన్ గాలికి ఎగిరిపోయాయి. ఎన్నికలప్పుడు చెప్పిన మేనిఫెస్టో చెత్తబుట్టలోకి వెళ్లిపోయింది. ప్రజలకిచ్చిన మాటలు మోసాలుగా తేలిపోయాయి. మరోవైపు విద్య, వైద్యం, వ్యవసాయం, గవర్నెన్స్.. ఇలా అన్ని వ్యవస్ధలూ తిరోగమనంలో కనిపిస్తున్నాయి. కేవలం.. ముఖ్యమంత్రి మారాడు..! వైఎస్సార్సీపీ పక్కకు వెళ్లి టీడీపీ వచ్చింది..! అంతే తేడా...! ఈ ప్రభుత్వంలో ప్రతి వ్యవస్థ తిరోగమనంలోకి పోయింది. వైఎస్సార్సీపీ హయాంలో ఇచ్చిన ప్రతి పథకాన్ని రద్దు చేశారు. చంద్రబాబు అమలు చేస్తామన్న ప్రతి పథకం మోసం.. అబద్ధం! కేవలం 9 నెలల కాలంలోనే కనిపిస్తున్న మోసాలివి.– వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్సాక్షి, అమరావతి: ‘ఎన్నికల ప్రచారంలో.. ముసలమ్మ కూడా బటన్ నొక్కుతుంది అని చంద్రబాబు చెప్పారు. మరి ఇప్పుడు ప్రతి గ్రామంలోనూ, ప్రతి వ్యక్తీ ఎందుకు బటన్ నొక్కలేదని చంద్రబాబును అడుగుతున్నారు. చంద్రబాబు ఇప్పుడు బటన్ ఎలా నొక్కాలో తన చెవిలో చెప్పమంటున్నారు. మొహమాటం లేకుండా నిస్సిగ్గుగా మాట్లాడుతున్నారు. మరి ఈ వ్యక్తి చీటర్ కాదా?.. ప్రజలను మోసం చేసిన వ్యక్తిపై 420 కేసు పెట్టకూడదా..?’ అని వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ధ్వజమెత్తారు. ‘మీరూ, మేమూ.. మనందరం కలిసికట్టుగా నిలబడి ఈ అరాచక ప్రభుత్వాన్ని బంగాళాఖాతంలో కలిపే పరిస్థితిలోకి తీసుకెళదాం..’ అని పార్టీ నేతలకు, శ్రేణులకు పిలుపునిచ్చారు. బుధవారం తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ఉమ్మడి గుంటూరు జిల్లాకు చెందిన వైఎస్సార్సీపీ ఎంపీటీసీలు, జడ్పీటీసీలు, మున్సిపల్ చైర్ పర్సన్లు, మేయర్, ఇతర స్థానిక సంస్థల ప్రజా ప్రజాప్రతినిధులు, పార్టీ నేతలతో జగన్ సమావేశమయ్యారు. రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలు.. నెలకొన్న పరిస్థితులపై చర్చించారు. పార్టీని మరింత బలోపేతం చేసేందుకు తీసుకోవాల్సిన చర్యలపై దిశానిర్దేశం చేశారు. ఈ సమావేశంలో వైఎస్ జగన్ ఏమన్నారంటే..సమావేశానికి హాజరైన ఉమ్మడి గుంటూరు జిల్లా వైఎస్సార్సీపీ ముఖ్య నేతలు చరిత్రను మార్చిన జగన్ 1.0 పాలన..2019–2024 మధ్య జగన్ 1.0 ప్రభుత్వం నడిచింది. చరిత్రలో ఎప్పుడూ చూడని విధంగా, చరిత్రను మార్చిన పాలన వైఎస్సార్సీపీ హయాంలోనే జరిగింది. మన ప్రభుత్వం రాకమునుపు మేనిఫెస్టో అంటే.. చక్కటి అబద్ధాలను రంగు రంగుల కాగితాల్లో ముద్రించి ఎన్నికల్లో పంచడం..! ఎన్నికలు అయినపోయిన తర్వాత ఆ మేనిఫెస్టోను చెత్తబుట్టలో వేయడం..! అలాంటి పరిస్థితుల నుంచి పాలనలో తులసి మొక్కలా వ్యవస్థను మార్చిన పాలన కేవలం వైఎస్సార్సీపీ హయాంలోనే జరిగింది. చరిత్రలో మునుపెన్నడూ లేనివిధంగా మేనిఫెస్టోను కేవలం రెండు పేజీలకు కుదించి.. అది మాకు భగవద్గీత, బైబిల్, ఖురాన్ లాంటిదని చెప్పి ఎన్నికలు అయిపోయిన తర్వాత ప్రభుత్వ కార్యాలయం, సీఎంవో, ప్రతి మంత్రి కార్యాలయంలో, ప్రతి కలెక్టర్ కార్యాలయంలోనూ కనిపించేలా ఏర్పాటు చేశాం.బడ్జెట్‌తోపాటే సంక్షేమ క్యాలెండర్..సంక్షేమ క్యాలండర్‌ను కూడా బడ్జెట్‌తోపాటు ప్రవేశపెట్టి ఏ నెలలో ఏ పథకం అమలవుతుందో చెప్పి.. అలా చెప్పిన తేదీకి బటన్ నొక్కి నేరుగా అక్కచెల్లెమ్మల ఖాతాల్లో డబ్బులు జమ చేసిన చరిత్ర రాష్ట్రంలోనే కాకుండా దేశంలో మన పార్టీ హయాంలోనే జరిగింది. అంతగా వ్యవస్థలో మార్పులు చేశాం. గతంలో ప్రభుత్వ సొమ్ము రూపాయి ఇస్తే... 15 పైసలు మాత్రమే ప్రజలకు చేరుతుందన్న నానుడిని మార్చి.. లంచాలు, వివక్ష లేకుండా ఏకంగా రూ.2.73 లక్షల కోట్లు బటన్ నొక్కి ప్రజలకు ఇచ్చింది కూడా వైఎస్సార్సీపీ ప్రభుత్వమే. ఒకవైపు కోవిడ్ ఉన్నా.. రాష్ట్రం అతలాకుతలం అవుతున్న పరిస్థితులు కనిపిస్తున్నా.. ఆదాయాలు తగ్గినా.. అనుకోని ఖర్చులు పెరిగినా ఏ రోజూ సాకులు వెతకలేదు. ప్రజలకు చెప్పిన ప్రతి మాటను నెరవేర్చాం. హామీల అమలుతో పాటు అభివృద్ధి..ఒకవైపు చెప్పిన ప్రతి మాటనూ నెరవేర్చి ప్రజల జీవితాల్లో వెలుగులు నింపుతూ మరోవైపు రాష్ట్రంలో కనీవినీ ఎరుగని అభివృద్ధి కూడా చేశాం. ప్రభుత్వ బడుల రూపురేఖలు మారాయి. నాడు – నేడు అనే ఉజ్వల కార్యక్రమం ప్రభుత్వ పాఠశాలల్లో మొదలైంది. ఇంగ్లీషు మీడియం, సీబీఎస్ఈ నుంచి ఐబీ వరకు ప్రభుత్వ స్కూళ్ల ప్రయాణం మొదలైంది. మూడో తరగతి నుంచి టోఫెల్ శిక్షణ క్లాసులు మొదలయ్యాయి. మొట్టమొదటిసారిగా పిల్లల చేతుల్లో బైలింగ్యువల్ పాఠ్య పుస్తకాలు అందుబాటులోకి వచ్చాయి. ఆరో తరగతి నుంచి డిజిటల్ బోధన అందించాం. ఎనిమిదో తరగతికి వచ్చేసరికి పిల్లలకు ట్యాబులు అందచేశాం. ఇవన్నీ రావడంతో ప్రైవేట్ స్కూళ్లు.. ప్రభుత్వ బడులతో పోటీ పడాల్సి వచ్చింది. ఒకవైపు తల్లులను ప్రోత్సహిస్తూ అమ్మఒడి ఇస్తూ.. మరోవైపు ఆ పిల్లలు ప్రపంచంతో పోటీ పడేలా చదువుల్లో విప్లవాత్మక మార్పులు తెచ్చాం.వైద్యంలోనూ ఊహకందని మార్పులు..తొలిసారిగా గ్రామాల్లో విలేజ్ క్లినిక్‌లు, ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్‌లు అందుబాటులోకి తెచ్చాం. ప్రభుత్వ ఆసుపత్రుల్లో వైద్యుల కొరత లేకుండా చేశాం. దేశం మొత్తంమీద గవర్నమెంటు ఆసుపత్రుల్లో స్పెషలిస్టు డాక్టర్ల కొరత 61 శాతం ఉంటే ఏపీలో మాత్రం స్పెషలిస్టు డాక్టర్ల కొరత కేవలం 4 శాతం మాత్రమే నమోదైంది. జీరో వేకెన్సీ పాలసీ తీసుకొచ్చాం. ప్రభుత్వ ఆసుపత్రులను నాడు నేడు ద్వారా బలోపేతం చేశాం. డబ్ల్యూహెచ్‌వో, జీఎంపీ ప్రమాణాలు గల ఔషధాలను మాత్రమే ప్రభుత్వ ఆసుపత్రులలో అందుబాటులోకి తెచ్చాం. దేశంలో ఎక్కడా జరగని విధంగా ఏకంగా 17 మెడికల్ కాలేజీలను మన హయాంలోనే కట్టడం ప్రారంభించాం. పేదవాడికి ఉచితంగా వైద్యం అందిస్తూ ప్రొసీజర్లను వెయ్యి నుంచి ఏకంగా 3,300 వరకు తీసుకెళ్లడంతోపాటు రూ.25 లక్షల వరకు ఆరోగ్యశ్రీ పరిధిని విస్తరించాం.రాజకీయాల్లో విలువలు, విశ్వసనీయత ముఖ్యం..గతంలో మనకు 50 శాతం ఓటు షేర్ వచ్చింది. ఈ ఎన్నికల్లో మన ఓటు షేర్ 40 శాతం ఉంది. 10 శాతం ఓట్లు తగ్గాయి. కారణం.. మీ జగన్ ఆ రోజు వారిలా అబద్ధాలు చెప్పలేకపోవడమే. కానీ అధికారానికి దూరమైనా మీ జగన్ లీడర్ అంటే ఇలా ఉండాలని మీ గుండెల్లో ముద్ర వేయగలిగాడు. మీ జగన్ మరో 30 సంవత్సరాలు రాజకీయాల్లో ఉంటాడు. 2019–24 మధ్య మన పాలనను ప్రజలు చూశారు. ఇవాళ చంద్రబాబు పాలన కూడా ప్రజలు చూస్తున్నారు. మనం ప్రజల కోసం ఇన్ని బటన్లు నొక్కినా అబద్ధాలు చెప్పలేక ప్రతిపక్షంలో ఉన్నప్పుడు.. మరి ఇన్ని మోసాలు చేసిన, ఇన్ని అబద్ధాలు చెప్పిన వ్యక్తి పరిస్థితి ఏమవుతుందో ఆలోచించండి. ఇచ్చిన మాటను గాలికొదిలేసిన ఈ పార్టీలు, ప్రభుత్వం ప్రజల ఓటుతో బంగాళాఖాతంలోకో ఇంకా అథఃపాతాళానికో పోతారు. ఎన్నికల తర్వాత కూడా వైఎస్సార్సీపీ కార్యకర్త సగర్వంగా ప్రతి ఇంటికి వెళ్లగలుగుతాడు. చెప్పిన ప్రతి మాటా నెరవేర్చిన ప్రభుత్వం మాది అని గర్వంగా చెప్పగలుగుతారు. కానీ ఈ రోజు టీడీపీ కార్యకర్తలు, నాయకులు ఏ ఒక్కరూ, ఏ ఇంటికీ వెళ్లే పరిస్థితి లేదు. వాళ్లు ఏ ఇంటికి వెళ్లినా... చిన్నపిల్లలు తల్లికి వందనం కింద ఇవ్వాల్సిన నా రూ.15 వేలు ఏమయ్యాయని అడుగుతారు. ఆ పిల్లల తల్లులు ఆడబిడ్డ నిధి కింద తమకు ఇవ్వాల్సిన రూ.18 వేలు ఏమయ్యాయని నిలదీస్తారు. ఆ అమ్మల అత్తలు, అమ్మలు మాకు 50 ఏళ్ల వచ్చాయి.. మరి మా రూ.48 వేలు పెన్షన్ డబ్బులు ఎక్కడని ప్రశ్నిస్తారు. ఆ ఇంట్లో రైతులు అన్నదాతా సుఖీభవ కింద తమకు ఇవ్వాల్సిన రూ.20 వేలు ఏమయ్యాయని అడుగుతారు. ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్న యువకుడు నిరుద్యోగ భృతి కింద ఇవ్వాల్సిన నా రూ.36 వేలు ఏమయ్యాయని ప్రశ్నిస్తాడు.రైతును చేయి పట్టుకుని నడిపిస్తూ ఆర్బీకేలు..గ్రామాల్లో ఆర్బీకేల వ్యవస్థను ఏర్పాటు చేసి ఊరు దాటాల్సిన అవసరం లేకుండా రైతన్నలకు తోడుగా నిలిచాం. అగ్రికల్చర్ గ్రాడ్యుయేట్‌ను అసిస్టెంట్‌గా నియమించి రైతులను చేయి పట్టుకుని నడిపించేలా చర్యలు తీసుకున్నాం. తొలిసారిగా ఇ–క్రాప్ ద్వారా ప్రతి రైతు ఎన్ని ఎకరాల్లో ఏ పంట వేశాడో నమోదు చేశాం. రైతులందరికీ ఉచిత పంటల బీమా, గిట్టుబాటు ధర దక్కేలా ఆర్బీకేల ద్వారా కొనుగోలు చేయడంతోపాటు దళారీ వ్యవస్థను తొలగించాం. ఇవన్నీ వైఎస్సార్ సీపీ హయాంలోనే జరిగాయి. అంతేకాకుండా ప్రతి గ్రామంలోనూ సచివాలయాన్ని ఏర్పాటు చేశాం. అదే సచివాలయంలో మన ఊరి పిల్లలే సేవలందిస్తూ కనిపిస్తారు. ప్రతి 60–70 ఇళ్లకు ఒక వలంటీర్ ఇంటికే వచ్చి పారదర్శకంగా సేవలు అందించారు.బాబు ష్యూరిటీ.. మోసం గ్యారంటీఎన్నికల్లో చంద్రబాబు నాయుడు, కూటమి నేతలు గ్రామాల్లో ఇళ్లకు వెళ్లినప్పుడు తాము సూపర్ సిక్స్, సూపర్ సెవెన్ ఇవ్వలేకపోతే కాలర్ పట్టుకోమని చెప్పారు. బాండ్లు కూడా రాసిచ్చారు. బాబు ష్యూరిటీ.. భవిష్యత్తుకు గ్యారంటీ అని రాసిచ్చారు. ఇవాళ బాబు ష్యూరిటీ.. మోసం గ్యారంటీ అని రుజువు అయింది. ఇప్పుడు ప్రజలు ప్రశ్నించడం మొదలు పెట్టారు. త్వరలోనే కాలర్ పట్టుకుని నిలదీసే రోజులు కూడా రానున్నాయి. అన్ని రకాలుగా ఈ ప్రభుత్వం విఫలమైంది. -
‘రాష్ట్రంలో శాంతి భద్రతలు ఎక్కడున్నాయ్’
సాక్షి, తాడేపల్లి : ప్రజాప్రతినిధులు రాజ్యాంగాన్ని పట్టుకుని తిరుగుతారు. కానీ చంద్రబాబు పాలనలో ప్రజా ప్రతినిధులు రెడ్‌బుక్ రాజ్యాంగాన్ని పట్టుకుని తిరుగుతున్నారు. ఇలాంటి ప్రజా ప్రతినిధిని ప్రజలే తరిమికొట్టే రోజులు దగ్గరలోనే ఉన్నాయని వైఎస్సార్సీపీ అధికార ప్రతినిధి గోరంట్ల మాధవ్ చంద్రబాబుపై ఆగ్రహం వ్యక్తం చేశారు.రామగిరి పాకిస్తాన్ బోర్డర్లో ఉందా?. పర్మిషన్ లేకుండా అక్కడకు వెళ్లటానికి వీల్లేదని పోలీసులు అంటున్నారు. పల్నాడులో పోలీసుల సమక్షంలోనే ఇళ్లను కూల్చేశారు. మద్దెకెరలో ఫీల్డ్ అసిస్టెంట్లు ప్రాణాలు తీశారు. ఏపీలో శాంతి భద్రతలు లోపించాయి. శాంతి భద్రతలు లేకపోతే అభివృద్ధి ఆగిపోతుంది. పెదబాబు, చిన్నబాబు రూ.30 కోట్లు ఖర్చుతో దావోస్ వెళ్లినా ఒక్క పరిశ్రమ కూడా రాలేదు.ముస్సోరీ, గడాఫీకి పట్టిన గతే త్వరలోనే చంద్రబాబుకు పడుతుంది. ప్రజలు చంద్రబాబును తరిమికొట్టే రోజు దగ్గర్లోనే ఉంది. సోషల్ మీడియా కార్యకర్తలపై 20, 30 కేసులు చొప్పున పెట్టి వేధించారు. ప్రజా ప్రతినిధులు రాజ్యాంగాన్ని చేతిలో పెట్టుకుని తిరుగుతారు. కానీ చంద్రబాబు పాలనలో రెడ్ బుక్ రాజ్యాంగాన్ని పట్టుకుని తిరుగుతున్నారు. 30 వేల మంది ఆడపిల్లలు మిస్ అయ్యారని గతంలో పవన్ కళ్యాణ్ అన్నారు. మరి మీ పాలనలో ఒక్కరినైనా వెనక్కు తెచ్చారా?’ అని ప్రశ్నించారు. -
మీ డ్రామాల్ని కట్టిపెట్టండి.. పవన్,చిరంజీవికి కేఏపాల్ చురకలు
సాక్షి,అమరావతి : ప్రజా రాజ్యమే జనసేనగా ఆవిర్భవించిందన్న చిరంజీవి పూటకో స్టేట్మెంట్ ఇస్తున్నారని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు డాక్టర్ కేఏపాల్ ఆరోపించారు. తెలుగు రాష్ట్రాల్లో వరుస రాజకీయ పరిణామలపై ఆయన మీడియాతో మాట్లాడారు. ‘మెగాస్టార్ చిరంజీవి రాజకీయాలకు గుడ్ బై చెప్పారు. 70 ఏళ్ల వయస్సున్న చిరంజీవి మతి తప్పిందా. కొత్త వేషమా. ప్రజా రాజ్యమే జనసేనగా ఆవిర్భవించిందన్న చిరంజీవి పూటకో స్టేట్మెంట్ ఇస్తున్నారు. పవన్ కళ్యాణ్ డ్రామాలో చంద్రబాబు మోసపోయారు. పవన్‌ను నమ్మి కుమారుడికే అన్యాయం చేస్తున్నారు చంద్రబాబు. వాళ్ళకి ఓటు బ్యాంక్ లేదన్న వాస్తవం మీకు తెలియదా. న్యాయ వ్యవస్థల్ని వీళ్ళు ఎలా మేనేజ్ చేస్తున్నారో ఆధారాలు సరైన టైంలో బయటపెడతా.చిరంజీవి, పవన్ కళ్యాణ్ డ్రామాని సీరియస్‌గా తీసుకోకండి. వాళ్ళ పదవుల విషయంలో డీల్ కుదరక ఈ డ్రామాలు. సనాతన ధర్మం టూర్ చేసే ముందు మీ భార్య కన్నీళ్లు పెడుతుంది గుర్తు చేసుకో. పవన్ మిమ్మల్ని వదిలేయక ముందే.. చంద్రబాబు తెలివిగా ఆలోచించి నిర్ణయం తీసుకోండి. హామీలు అమలు చేయకుండా చంద్రబాబు చేతులెత్తేస్తాడని, రేవంత్ రెడ్డి మోసాల గురించి నాకు ఎప్పుడో తెలుసు. ఆమ్ ఆద్మీ పార్టీ ఓడిపోలేదు..నేను సుప్రీం కోర్టులో కేసు వేస్తున్నా. దమ్ముంటే ఈవీఎం ఎన్నికలు కాకుండా బ్యాలెట్ ఎలెక్షన్స్ పెట్టండి’అని కేఏపాల్ డిమాండ్ చేశారు. -
జనసేన కిరణ్ రాయల్‌పై చర్యలేవి?: వరుదు కళ్యాణి
సాక్షి, విశాఖపట్నం: రాష్ట్రంలో మహిళల వేదన అరణ్య రోదనగా మారిందని వైఎస్సార్సీపీ రాష్ట్ర మహిళా విభాగం అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ వరుదు కళ్యాణి ఆగ్రహం వ్యక్తం చేశారు. విశాఖపట్నంలోని పార్టీ కార్యాలయంలో బుధవారం మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలో మహిళలు, బాలికలపై వరుసగా జరుగుతున్న దారుణాలే దీనికి నిదర్శనం అని మండిపడ్డారు. హోంమంత్రి సొంత జిల్లా విశాఖలోనే ఇప్పటి వరకు 20 మందిపై అత్యాచారాలు జరిగాయంటే రాష్ట్రంలో మహిళా భద్రతకు ఈ ప్రభుత్వం ఇస్తున్న ప్రాధాన్యత ఏమిటో అర్థమవుతుందని అన్నారుకూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మహిళల మీద దాడులు, అఘాయిత్యాలు నిత్యకృత్యమైపోయాయి. మహిళా హోంమంత్రి ఉండి కూడా మహిళల మీద అత్యాచారాలు జరుగుతుంటే ఆమెకు చీమకుట్టినట్టయినా లేదు. మహిళలకు అన్యాయం చేస్తే తాటతీస్తా, తొక్కి పెట్టి నార తీస్తానన్న కూటమి నేతలు ఇప్పుడు ఎందుకు నోరు మెదపడం లేదు? ఆడబిడ్డకు అన్యాయం చేస్తే వారికి అదే ఆఖరి రోజు అవుతుందని చెప్పిన చంద్రబాబు మహిళల భద్రత గురించి ఈ 9 నెలల్లో ఒక్కసారి కూడా సమీక్ష నిర్వహించలేదు.ప్రజలకు రక్షణ కల్పించడంలో పోలీస్ శాఖ విఫలమైందనే విషయం సాక్షాత్తు సీఎం పోలీస్ వ్యవస్థపై నిర్వహించిన సర్వేలో వచ్చిన ఫలితాలను చూస్తే అర్థమవుతోంది. 20 శాఖల మీద సీఎం చంద్రబాబు నిర్వహించిన సర్వేలో పోలీస్ శాఖ 18వ స్థానానికి పడిపోయిందంటే ఇంతకన్నా సిగ్గుచేటైన విషయం ఇంకోటి ఉంటుందా? దీన్ని బట్టి శాంతి భద్రతల విభాగాన్ని చూసే ముఖ్యమంత్రి, హోంమంత్రి ఇద్దరూ విఫలమైనట్టే. పోలీస్ వ్యవస్థను శాంతి భద్రతల పరిరక్షణ కోసం కాకుండా రెడ్ బుక్ రాజ్యాంగం అమలు చేయడానికి వాడుకోవడం వల్లే ఇలాంటి దుస్థితి నెలకొంది.తిరుపతిలో జనసేన నాయకుడు కిరణ్ రాయల్ వేధింపులకు లక్ష్మి అనే మహిళ బలైంది. తనను మోసగించడంతో పాటు కోటిన్నర నగదు, 25 తులాల బంగారం తీసుకుని ఇవ్వకుండా వేధించాడని గోడును వెళ్లబోసుకున్నా కూటమి నాయకులు ఆమెకు న్యాయం చేయలేదు. ఆమె ధైర్యం చేసి కేసు పెట్టినా పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేయలేదు, విచారణ లేదు. పైగా ఆమెపైనే కేసులు పెట్టి జైలు పాలుజేశారు. ఎక్కడైనా బాధితులు కేసులు పెడితే నిందితుల మీద చర్యలు తీసుకుంటారు.కానీ ఏపీలో మాత్రం పూర్తి విరుద్ధమైన రెడ్ బుక్ రాజ్యాంగంలో పాలన నడుస్తోంది. బాధితులపైన నిందితులే కేసులు పెట్టి వేధిస్తున్నారు. గతంలో టీడీపీ ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం ఒక మహిళను వేధిస్తే.. ఇక్కడ న్యాయం జరగదని భావించి కర్నాటకలో కేసు నమోదు చేసింది. తిరువూరు టీడీపీ ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాస్ వేధింపులకు ఒక మహిళ ఆత్మహత్యాయత్నం చేశారు. కాకినాడ రూరల్ జనసేన ఎమ్మెల్యే పంతం నానాజీ దళిత ప్రొఫెసర్‌ను దారుణంగా దూషించారు. ఈ వరుస ఘటనల్లో నో పోలీస్...నో కేస్... ఏ ఒక్కరికీ శిక్షపడకుండా బాధితులనే వేధించడం చూస్తుంటే ముఖ్యమంత్రి చంద్రబాబుకి, హోంమంత్రి అనితకి రాష్ట్రంలో మహిళలంటే ఇంత చులకనభావనా అని వరుదు కళ్యాణి ఆవేదన వ్యక్తం చేశారు. -
‘సిట్ రిపోర్ట్‌లో నెయ్యిలో కల్తీ జరిగినట్లు ఎక్కడా చెప్పలేదు’
సాక్షి, తాడేపల్లిగూడెం: టీటీడీ టెండర్లలో ఉల్లంఘనలకు పాల్పడ్డారంటూ నలుగురిని సిట్ అరెస్ట్ చేసిన ఘటనను శ్రీవారి లడ్డూకి వాడే నెయ్యిలో కల్తీ ఆరోపణలకు ముడిపెట్టడం ఒక్క చంద్రబాబుకు మాత్రమే సాధ్యమని మాజీ మంత్రి, వైఎస్సార్సీపీ నేత కొట్టు సత్యనారాయణ మండిపడ్డారు. తాడేపల్లిగూడెంలో ఆయన బుధవారం మీడియాతో మాట్లాడుతూ.. శ్రీవారి లడ్డూలో కల్తీనెయ్యి వినియోగించారంటూ ఎటువంటి ఆధారాలు లేని ఆరోపణలు చేయడంపై సుప్రీంకోర్టు మొట్టికాయలు వేసినా చంద్రబాబులో మాత్రం మార్పు రాలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.కోట్లాది మంది భక్తుల మనోభావాలకు సంబంధించిన ఈ అంశంలో నిర్ధిష్టమైన ఆధారాలు లేకుండానే ఇష్టారాజ్యంగా చంద్రబాబు, ఆయనకు నిత్యం భజన చేసే ఎల్లో మీడియా తప్పడు ప్రచారాలతో రాజకీయ లబ్ధికి ప్రయత్నిస్తున్నారని ఆక్షేపించారు. ఇంకా ఆయన ఏమన్నారంటే..కూటమి ప్రభుత్వం వంద రోజుల వైఫల్యాలను వైఎస్సార్సీపీ బయటపెడుతుందనే భయంతో చంద్రబాబు గత ఏడాది సెప్టెంబర్ నెలలో ప్రపంచ వ్యాప్తంగా శ్రీవారి భక్తులు తల్లడిల్లేలా తప్పుడు ఆరోపణలు చేశారు. తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదంలో పందికొవ్వు, గొడ్డు కొవ్వు కలిసాయంటూ ఒక పథకం ప్రకారం ముఖ్యమంత్రి హోదాలో ఉన్న చంద్రబాబు సెప్టెంబర్ 18వ తేదీన ప్రకటించారు. తరువాత సెప్టెంబర్ 25న కేసు నమోదు చేశారు. 26వ తేదీన రాష్ట్రప్రభుత్వం సిట్ ఏర్పాటు చేసింది. తరువాత దీనిపై సుప్రీంకోర్ట్ లో వ్యాజ్యం దాఖలైన నేపథ్యంలో సీబీఐ నేతృత్వంలో సిట్ ను ఏర్పాటయ్యింది.టెండర్లలో ఉల్లంఘనలను మాత్రమే గుర్తించిన సిట్ నెయ్యిలో కల్తీ జరిగిందా లేదా అనే అంశంపై విచారణకు వచ్చిన సిట్ ముందుగా టీటీడీ నిర్వహిస్తున్న టెండర్లను పరిశీలించింది. దీనిలో నిబంధనల ఉల్లంఘన జరిగిందని గుర్తించి, దానికి కారణమైన నలుగురిపై కేసు నమోదు చేసి వారిని అరెస్ట్ చేసింది. ఈ అంశాన్ని మరోసారి చంద్రబాబు, ఆయనకు వంతపాడే ఎల్లో మీడియా మరోసారి వక్రీకరిస్తూ తప్పుడు ప్రచారానికి తెగబడ్డారు. నెయ్యిలో కల్తీ జరిగిపోయిందని, ఈ కల్తీ నెయ్యి విషయంలోనే నలుగురి అరెస్ట్ జరిగిందంటూ అసత్య ప్రచారానికి తెర తీశారు. నెయ్యిలో కల్తీ జరిగిందనే అంశాన్ని సిట్ నిర్ధారించక ముందే ముఖ్యమంత్రిగా చంద్రబాబు, ఆయనకు నిత్యం భజన చేసే ఎల్లో మీడియా నిర్ధారించి తీర్పులు కూడా చెప్పేయడం దుర్మార్గం.ఆది నుంచి చంద్రబాబు ప్రతి అంశాన్ని తనకు అనుకూలంగా వాడుకోవడం, వైఎస్సార్సీపీపై బురద చల్లడమే పనిగా పెట్టుకున్నారు. శ్రీవారి ప్రసాదంలో జంతువుల కొవ్వు కలిసిందంటూ మొదట్లో తప్పుడు ప్రచారం చేశారు. నీచమైన రాజకీయాలకు పవిత్రమైన శ్రీవారి ప్రసాదాన్ని అడ్డం పెట్టుకోవడం అత్యంత దుర్మార్గం. చంద్రబాబు తన స్వార్థం కోసం ఏఅంశాని అయినా సరే వాడుకోగల ఘనుడు. నిత్యం అబద్ధాలతోనే రాజకీయాలు చేసే చంద్రబాబుకు ఎల్లో మీడియా అండగా నిలుస్తోంది. చంద్రబాబు చెప్పే ప్రతి దుర్మార్గమైన మాటను విస్తృతంగా ప్రచారం చేస్తూ ప్రపంచంలోని కోట్లాది మంది శ్రీవారి భక్తుల మనోభావాలను దెబ్బతీశారు.నెయ్యిలో నాణ్యతా ప్రమాణాలను గుర్తించే ల్యాబ్‌లు టీటీడీకి ఉన్నాయి. 2024 జూన్ 12, 20, 25, జూలై 4వ తేదీల్లో లడ్డూ ప్రసాదం తయారీ కోసం టీటీడీకి సరఫరా అయిన నెయ్యి ట్యాంకర్ల నుంచి నెయ్యి శాంపిళ్లను తీసి టీటీడీ ల్యాబ్‌లో పరిశీలించారు. ప్రమాణాలకు అనుగుణంగానే ఈ శాంపిళ్లు ఉన్నాయని నిర్థారించడం కూడా జరిగింది. అంటే లడ్డూ తయారీకి వస్తున్న నెయ్యిని పూర్తి స్థాయిలో పరిశీలించే ల్యాబ్‌లు, మెకానిజం టీటీడీకి ఉంది. ఈ పరిశీలనలో ఏ మాత్రం నాణ్యాతా ప్రమాణాలు తక్కువగా ఉన్నట్లు తేలినా ఆ నెయ్యి ట్యాంకర్లను వెనక్కి పంపిస్తారు.ఈ విషయాన్ని మొదటి నుంచి వైఎస్సార్సీపీ చెబుతూనే ఉంది. కానీ చంద్రబాబుకు, ఎల్లో మీడియాకు వాస్తవాలు అక్కరలేదు. ఏదో ఒక రకంగా చంద్రబాబు వైఫల్యాలను ప్రజలు మరిచిపోయేలా చేయాలంటే ఒక బలమైన అంశంతో ప్రజలను డైవర్ట్ చేయాలన్నదే వారి లక్ష్యం. హిందూధర్మాన్ని అనుసరించే భక్తులు శ్రీవారి లడ్డూలో పందికొవ్వు, గొడ్డు కొవ్వు కలిసిందని ఉచ్ఛరించడానికే ఇష్టపడరు. అలాంటిది దుర్మార్గమైన కుట్రకు చంద్రబాబు పాల్పడ్డారు.వెనక్కి పంపిన ఆ నాలుగు ట్యాంకర్ల నెయ్యిని ఎలా వినియోగిస్తారు?గత ఏడాది జూలై 6, 12వ తేదీల్లో నాలుగు ట్యాంకర్ల ద్వారా కల్తీ నెయ్యి తిరుమలకు వచ్చిందనే ఆరోపణలు వచ్చాయి. వీటి నుంచి ఎన్డీడీపీకి టెస్ట్ కోసం నెయ్యి శాంపిళ్ళను పంపించారు. ఇదే అంశాన్ని రిమాండ్ రిపోర్ట్‌లో రాశారు. దీనిలో కూడా ఈ నెయ్యిలో కల్తీ జరిగినట్లు ఎక్కడా లేదు. ఎన్డీడీపీ తన నివేదికలో ఈ నెయ్యిలో వనస్పతి కలిసి ఉండే అవకాశం ఉందని, మా నివేదిక తప్పు కూడా అయ్యేందుకు అవకాశం ఉందని కూడా చెప్పింది. ఇదే విషయాన్ని సాక్షాత్తు సుప్రీంకోర్టు కూడా ప్రశ్నించింది.ఇదీ చదవండి: మళ్లీ అధికారంలోకి వస్తాం.. అందరి లెక్కలు తేలుస్తాం: వైఎస్ జగన్అదే విధంగా జూలై 23నే టీటీడీ ఈవో శ్యామలరావు మాట్లాడుతూ ఈ నాలుగు ట్యాంకర్ల ద్వారా వచ్చిన నెయ్యిని వెనక్కి పంపించేశామని, ప్రసాదంలో ఉపయోగించలేదని కూడా ప్రకటించారు. ఈ నాలుగు ట్యాంకర్ల నెయ్యిని వాడకపోయినా రెండు నెలల తరువాత అంటే సెప్టెంబర్ 18న చంద్రబాబు ఆ నెయ్యిని వాడినట్లు ప్రకటించడం రాజకీయ దురుద్దేశంతో కాదా? ఆరోపణలు ఎదుర్కొంటున్న ఏఆర్ డెయిరీ నుంచి నెయ్యి చంద్రబాబు అధికారంలోకి వచ్చిన నాటి నుంచే సరఫరా ప్రారంభించారు. దీనిని సీబీఐ కూడా గుర్తించింది. సీఎం చంద్రబాబు లడ్డూ కల్తీపై మాట్లాడేప్పుడు ఏ ఆధారాలతో నెయ్యిలో జంతువుల కొవ్వు కలిసినట్లు ఆరోపించారని సుప్రీంకోర్టు ప్రశ్నించడంతో పాటు తప్ప పట్టింది. దీనికి చంద్రబాబు ఎటువంటి సమాధానం చెప్పలేదు. -
చంద్రబాబుది రాజకీయం కాదు.. బ్రోకరిజం: లక్ష్మీపార్వతి
సాక్షి, తాడేపల్లి: చంద్రబాబు చేసేది రాజకీయం కాదని.. బ్రోకరిజం అంటూ వైఎస్సార్సీపీ ప్రధాన కార్యదర్శి లక్ష్మీపార్వతి మండిపడ్డారు. ఆడపిల్లల కన్నీళ్లు ఈ ప్రభుత్వానికి కనపఢం లేదని దుయ్యబట్టారు. బుధవారం ఆమె మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. చంద్రబాబుని మనిషిగా కూడా తాను గుర్తించటం లేదని ధ్వజమెత్తారు. చంద్రబాబు వలన ఎల్లో మీడియా.. ఎల్లో మీడియా వలన చంద్రబాబు బతుకుతున్నారు. వీరి వలన ప్రజలకు ఎలాంటి మేలు జరగదంటూ ఆమె వ్యాఖ్యానించారు.‘‘చంద్రబాబుకు తన పాలన మీద నమ్మకం ఉంటే అసెంబ్లీ రద్దు చేసి ఎన్నికలకు వెళ్లాలి. జనం ఎవరికి ఓట్లు వేస్తారో తేలుతుంది. లక్షన్నర కోట్లు అప్పులు చేసి ఏం చేశారు?. మీ జేబుల్లోకి వెళ్లాయా?. ప్రజలను పూర్తిగా మద్యం మత్తులోకి నెట్టేశారు, జనాన్ని మత్తులో పెట్టి పరిపాలన చేస్తున్నారు. రేషన్ డిపోలను టీడీపీ ఆఫీసుల్లో నిర్వహించటం ఈ పాలనలోనే చూస్తున్నాం. చంద్రబాబు పాలనలో రేపిస్టులు, దొంగలు కాలర్ ఎగురవేసుకుని తిరుగుతున్నారు. తిరుపతి లక్ష్మికి ఒక న్యాయం, ముంబాయి నటి జత్వానీకి ఇంకో న్యాయమా?’’ అంటూ లక్ష్మీపార్వతి నిలదీశారు.‘‘పరిపాలన చేసే అర్హత చంద్రబాబుకు లేదు. తిరుపతి లక్ష్మీ విషయంలో ప్రత్యేక కమిటీతో విచారణ జరపాలి. ఏబీ వెంకటేశ్వరరావు వంటి వ్యక్తి చేతిలో పెట్టి పోలీసు వ్యవస్థను నడపటం దారుణం. కులాల గురించి భయంకరంగా మాట్లాడిన వ్యక్తి ఏబీ వెంకటేశ్వరరావు. రాష్ట్రంలో రెడ్‌బుక్ రాజ్యాంగం అమలు చేయటం ఏంటి?. పిచ్చోడి చేతిలో రాయిలాగ ప్రభుత్వ పనితీరు మారింది. ఎన్టీఆర్ మంచిపాలనే ఇప్పటికీ ప్రజల్లో ఆయన ఉండటానికి కారణం. మరి చెప్పుకోవడానికి చంద్రబాబు ఏం పాలన చేస్తున్నారు. జీవిత చరమాంకంలో ఉన్న చంద్రబాబు ఇకనైనా మారాలి’’ అని లక్ష్మీ పార్వతి హితవు పలికారు.ఇదీ చదవండి: ఈ చంద్రబాబు ఛీటర్ కాదా?: వైఎస్ జగన్అధికారం కోసం చంద్రబాబు చేయని నీచపు పనలు లేవు. అబద్దాల కోటలో బతుకుతున్నాడు. తిరుపతి లడ్డూ నుంచి ప్రతి విషయంలోనూ అబద్ధాలే. లోకేష్ అవినీతి, అరాచకాలు విపరీతంగా ఉన్నాయి. నారావారి సంప్రదాయంలో చెడు మాత్రమే మిగిలింది. కన్నతండ్రిగా చంద్రబాబు లోకేష్‌ని కట్టడి చేయాలి. సనాతన ధర్మం అనే పవన్ కళ్యాణ్ ఏం చేస్తున్నారు?. మహిళలపై అరాచకాలు జరుగుతుంటే ఎందుకు ప్రశ్నించటంలేదు?. తిరుపతిలో లక్ష్మిని కరిణ్రాయల్ అనేవాడు మోసం చేశాడు. తప్పు చేసిన వాడు రోడ్డు మీద తిరుగుతున్నాడు. బాధితురాలు జైలు పాలైంది. మిర్చి రైతులు ధరల్లేక అల్లాడిపోతుండే చంద్రబాబు ఏమాత్రం పట్టించుకోవడం లేదు. ప్రజలంటే చంద్రబాబుకు గౌరవం లేదు’’ అని లక్ష్మీపార్వతి మండిపడ్డారు. -
ఆ దమ్ము సోమిరెడ్డికి ఉందా?.. కాకాణి సవాల్
సాక్షి, నెల్లూరు: సోమిరెడ్డి ఎమ్మెల్సీగా ఉన్న సమయంలో రామదాసు కండ్రిగలోని పేదల దగ్గర భూములు తక్కువకు కొనుగోలు చేసాడని.. ప్రభుత్వం నుంచి వచ్చిన పరిహారాన్ని కొట్టేశారంటూ మాజీ మంత్రి కాకాణి గోవర్థన్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి, ఎల్లో మీడియాపై వైఎస్సార్సీపీ నేత, మాజీ మంత్రి కాకాణి గోవర్థన్‌రెడ్డి అగ్రహం వ్యక్తం చేశారు.‘‘ఈ భూములపై సీబీసీఐడీ అధికారులు చేత విచారణ జరిపించే దమ్ము సోమిరెడ్డికి ఉందా? నాఫై సోమిరెడ్డి 17 విజిలెన్స్ ఎంక్వరీ చేయించాడు.. తప్పుడు కేసులు పెట్టేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. క్రిభో పరిశ్రమ వెళ్లిపోవడానికి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డే కారణం...కమిషన్ల కోసం సోమిరెడ్డి పరిశ్రమలు రాకుండా అడ్డుకుంటున్నాడు. ఉద్యోగుల బదిలీల్లో కూడా సోమిరెడ్డి లక్షల రూపాయలు దండుకుంటున్నాడు. టీడీపీ హయాంలోనే రామదాస్ కండ్రిగ భూముల్లో అవినీతి జరిగింది.. దానిపై విచారణ జరిపే దమ్ము సీఎం చంద్రబాబుకి కూడా లేదు. కుటుంబాల్లో కలతలు వచ్చేలా ఎల్లో మీడియా వార్తలు రాస్తోంది. ఈ భూముల విలువల్లో 10 శాతం ఇప్పించగలిగితే వచ్చే ఎన్నికల్లో పోటీ చేయను’’ అని కాకాణి సవాల్ విసిరారు. -
చంద్రబాబు కొత్తరాగం.. మర్మం ఇదేనా?
ఢిల్లీలో భారతీయ జనతా పార్టీ విజయానికి, ఆమ్ ఆద్మీ పార్టీ ఓటమికి కారణాలు ఏమిటి? ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఢిల్లీ ఎన్నికల పలితాలను తనకు అనుగుణంగా మార్చుకోవడానికి చేసిన ప్రయత్నాలను జనం నమ్ముతారా? ఢిల్లీ, ఏపీ మోడళ్లు ఫెయిల్ అని చంద్రబాబు చెప్పడంలో ఆంతర్యం ఏమిటి? ఈ అంశాలను పరిశీలిస్తే అనేక వాస్తవాలు బోధపడతాయి. ఏ పరిస్థితిని అయినా తనకు అనుకూలంగా మలచుకుని ప్రచారం చేసుకోవడంలో చంద్రబాబు నాయుడు దిట్ట. నిజాలకు పాతరేసి, తనకు కావాల్సిన వాదనను తెరపైకి తెస్తుంటారు. దీన్ని ప్రచారం చేసేందుకు ఎల్లో మీడియా ఎప్పుడూ సిద్ధంగానే ఉంటుంది. ఢిల్లీలో ఆమ్ ఆద్మీ పార్టీని ఎలాగైనా ఓడించాలని బీజేపీ కంకణం కట్టుకుని అనేక వ్యూహాలను పన్నింది. కేంద్రంలోని తన ప్రభుత్వాన్ని పూర్తిగా వాడుకుంది. ఆప్ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ ప్రభుత్వం చేసిన కొన్ని తప్పులూ తోడు కావడంతో ఆ పార్టీ ఓడిపోయింది. లిక్కర్ స్కామ్ పేరుతో కేజ్రీవాల్ బృందాన్ని బదనాం చేయడంలో బీజేపీ సఫలం అయింది. దీంతో అవినీతికి వ్యతిరేకంగా ఏర్పడిన ఆప్‌పై మరక పడింది. విశేషం ఏమిటంటే ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో వాస్తవంగా ఎంత నష్టం జరిగిందన్నది ఇప్పటికీ మిథ్యే. అయినా కేజ్రీవాల్‌తో సహా ఆప్ నేతలు పలువురు మాత్రం నెలల తరబడి జైలులో ఉండవలసి వచ్చింది. అయినా బీజేపీకి తన విజయంపై నమ్మకం కలగలేదు.అందుకే తన ఎన్నికల మానిఫెస్టోలో అనేక ప్రజాకర్షక హామీలను ప్రకటించింది. అన్నిటికి మించి పిభ్రవరి ఒకటో తేదీన ప్రకటించిన బడ్జెట్లో.. పన్నెండు లక్షల రూపాయల ఆదాయం వరకు పన్ను మినహాయింపు ఇవ్వడం మాస్టర్ స్ట్రోక్ అని చెప్పాలి. ఎన్నికల కమిషన్ ఫిబ్రవరి ఐదున పోలింగ్ తేదీని ప్రకటించడంలోని ఆంతర్యం కూడా ఇదే అయి ఉండవచ్చన్న సందేహం కలుగుతుంది. ఢిల్లీలో అత్యధిక సంఖ్యలో ఉద్యోగవర్గాలు, మధ్యతరగతి వారు ఉంటారు. వారందరికి ఇన్ కమ్ టాక్స్ రాయితీ ద్వారా గణనీయమైన ఆర్థిక ప్రయోజనం కలిగింది. ఒకరకంగా చెప్పాలంటే డిల్లీ ఎన్నికల పుణ్యమా అని దేశవ్యాప్తంగా ఆదాయ పన్ను మదింపుదారులకు ఊరట కలిగిందని అనుకోవచ్చు. అంతేకాదు. ఒకప్పుడు ఉచిత పథకాలకు తాము వ్యతిరేకం అని చెప్పుకున్న భారతీయ జనతా పార్టీ ఇప్పుడు ఆ ముసుగు తొలగించింది. ఆప్ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలను మించి కొత్త వాగ్దానాలు చేసింది. వాటిలో ప్రధానమైనది పేద మహిళలకు నెలకు రూ.2,500 చొప్పున ఇస్తామని ప్రకటించింది. ఇది కర్ణాటక, తెలంగాణలలో కాంగ్రెస్ ఇచ్చిన హామీ వంటిది. ఏపీలో తన భాగస్వామి టీడీపీ రూ.1500 చొప్పున ఇస్తామని చేసిన వాగ్దానం వంటిది. ఈ మూడు రాష్ట్రాలలో ఈ హామీని ఎలా అమలు చేయాలో తెలియక ఆ పార్టీల ప్రభుత్వాలు సతమతమవుతున్నాయి. ఆ తరుణంలో బీజేపీ ఇలాంటి హామీ ఇచ్చింది. ఆప్ నెలకు రూ.2,100 రూపాయలు ఇస్తామని చెబితే బీజేపీ అంతకన్నా ఎక్కువ ఇస్తామని ప్రజలను, ముఖ్యంగా మహిళలను ఊరించింది. ఆప్ ప్రభుత్వం అమలు చేస్తున్న అన్ని స్కీములను కొనసాగిస్తూ కొత్తవాటిని ఇస్తామని బీజేపీ తెలిపింది. ప్రతి గర్భిణీకి రూ.21 వేలు ఇస్తామని, ఐదు రూపాయలకే భోజనం పెట్టే అటల్ క్యాంటీన్లు నెలకొల్పుతామని, పేదలకు రూ.500లకే గ్యాస్ సిలిండర్లు అందిస్తామని హామీలిచ్చింది. ఆప్ ప్రభుత్వం ఇప్పటికే విద్యుత్తు, నీరు ఉచితంగా అందిస్తూండటం గమనార్హం. బీజేపీ ఇంకా పలు హామీలు ఇచ్చిన విషయాన్ని చంద్రబాబు విస్మరించి, బీజేపీ అభివృద్ది మోడల్‌తో గెలిచిందని సత్యదూరమైన ప్రకటన చేశారు. నిజంగానే కేవలం అభివృద్ది ఆధారంగానే ఎన్నికల ప్రణాళిక ప్రకటించి ఉంటే, ఆప్ అమలు చేస్తున్న సంక్షేమ స్కీములను తాము కొనసాగిస్తామని బీజేపీ ఎందుకు చెబుతుంది? దీనర్థం ఆప్ మోడల్ ఢిల్లీలో సఫలమైంది కనుక దానిని అనుసరిస్తామని చెప్పడమే కదా! ఆప్‌ను దెబ్బతీయడానికి అంతకన్నా ఎక్కువ హమీలు ఇవ్వాలని అనుకోవడంలో అభివృద్ది మోడల్ ఏమి ఉంటుంది? ఢిల్లీ పూర్తి స్థాయి రాష్ట్రం కాకపోవడంతో కేంద్రం పెత్తనం అధికంగా ఉంటుంది. లెఫ్టినెంట్ గవర్నర్ ద్వారా ఆప్‌ను ఎన్ని ఇబ్బందులు పెట్టాలో అన్ని పెట్టారనే చెప్పాలి. ఆప్ వైపు నుంచి కొన్ని తప్పులు ఉన్నాయి. కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకుని ఉంటే పరిస్థితి మరోలా ఉండే అవకాశం ఉండేది. ఆప్, కాంగ్రెస్‌కు కలిసి సుమారు 49 శాతం ఓట్లు వస్తే బీజేపీకి 45 శాతం ఓట్లు వచ్చాయి. మరీ ముఖ్యంగా.. కాంగ్రెస్‌కు వచ్చిన ఆరుశాతం ఓట్లు ఆప్‌ను దెబ్బకొట్టినట్లు అనిపిస్తుంది. కేజ్రీవాల్ తాము గెలుస్తామనే ధీమాతో ఒంటరిగా ఎన్నికలకు వెళ్లి బోల్తా పడ్డారన్న విశ్లేషణలు ఉన్నాయి. ఆప్ ప్రభుత్వం స్కూళ్లు మెరుగుపరచింది. ప్రైవేటు స్కూళ్లకు పోటీగా ప్రభుత్వ స్కూళ్లకు అక్కడ డిమాండ్ వచ్చేలా చేసిందన్నది వాస్తవం. అలాగే ప్రజలకు వైద్యాన్ని అందుబాటులోకి తెచ్చింది.చంద్రబాబు ఈ రెండు పాయింట్లను సైతం విమర్శించారు. స్కూళ్లు బాగు చేశామంటున్నారు కాని కాలేజీలు పెట్టలేదని, ప్రజల ఇళ్లవద్దకు డాక్టర్లను పంపించారని ఒప్పుకుంటూనే సూపర్ స్పెషాలిటి ఆస్పత్రులు నెలకొల్పలేదని అన్నారు. ఢిల్లిలో లిక్కర్ స్కామ్ గురించి కూడా ప్రస్తావించిన చంద్రబాబు అదే స్కామ్‌లో అభియోగానికి గురైన మాగుంట శ్రీనివాసులరెడ్డికి ఎందుకు ఎంపీ టిక్కెట్ ఇచ్చారో చెప్పరు. ఢిల్లీ ఆప్ ఓటమిని ఏపీలో వైఎస్సార్సీపీ పరాజయానికి పోల్చుతూ తాము కూటమి పక్షాన ఇచ్చిన వాగ్దానాలను ఎగవేయడానికి చంద్రబాబు ప్లాన్ చేస్తున్నట్లు అనిపిస్తుంది. సంక్షేమం కాదని అభివృద్ధి ముఖ్యమని ఢిల్లీ ఓటర్లు అభిప్రాయపడ్డట్లుగా ఆయన అంటున్నారు. దీనిని ఏపీకి వర్తింపచేసే యత్నం చేశారు. నిజంగానే ఏపీలో YSRCP ప్రభుత్వం అమలు చేసిన మోడల్ సక్సెస్ అయిందన్న భావన.. భయం చంద్రబాబు, పవన్ కల్యాణ్‌కు లేకుంటే జగన్ స్కీములన్నిటిని కొనసాగిస్తామని ఎందుకు ప్రకటించారో వివరించాలి కదా!. అమ్మ ఒడి కింద జగన్ ప్రభుత్వం తల్లికి రూ.15 వేలు చొప్పున ఇస్తుంటే, తాము అధికారంలోకి రాగానే ప్రతి బిడ్డకు రూ.15 వేలు ఇస్తామని ఎందుకు చంద్రబాబు హామీ ఇచ్చారు? సూపర్ సిక్స్ అంటూ ఎందుకు ఊదరగొట్టారు? నిరుద్యోగ భృతి కింద రూ.మూడు వేలు, మహిళలకు నెల నెలా రూ.1500, బలహీన వర్గాలకు 50 ఏళ్లకే ఫించన్, రైతులకు రూ.20 వేల చొప్పున ఇస్తామని ఎలా ప్రకటించారు?. ఏపీలో జగన్ టైమ్‌లో స్కూళ్లు, ఆస్పత్రులు బాగుపడితే అది అభివృద్ది కాదట. పోనీ చంద్రబాబు 15 ఏళ్లు ఇప్పటికే సీఎంగా పని చేశారు కదా! ఎందుకు స్కూళ్లను బాగు చేసి పేదలకు మంచి విద్య అందించలేదు. అసలు విద్య అనేది ప్రైవేటు రంగ బాధ్యత అని గతంలో అనేవారే! చంద్రబాబు తన పాలనలో ఒక్క సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రిని ఏర్పాటు చేయలేపోయారు. జగన్ 17 మెడికల్ కాలేజీలు తెస్తే అభివృద్ధి కాదట. నాలుగు పోర్టులు నిర్మించడం అభివృద్ది కాదట. వచ్చిన మెడికల్ సీట్లను వెనక్కి ఇవ్వాలని చంద్రబాబు కేంద్రానికి లేఖ రాయడం అభివృద్ది మోడల్ అట. పోర్టులను ప్రవేటు పరం చేయాలని యోచించడం ప్రగతి అట. జగన్ ఎన్నికల మానిఫెస్టోని చిత్తశుద్దితో అమలు చేస్తే, చంద్రబాబు అండ్ కో ప్రజలను మాయ చేయడానికి వాడుకున్నారు. గెలిచిన తర్వాత సంక్షేమం కాదు.. అభివృద్ది అంటూ కొత్తరాగం తీస్తున్నారు. ఇక్కడ ఇంకో సంగతి చెప్పాలి. 2019 లో టీడీపీకి మద్దతుగా కేజ్రీవాల్ ఏపీలో ప్రచారం చేశారు. అప్పుడు ఆయన చాలా గొప్ప వ్యక్తిగా, ఢిల్లీ అభివృద్ది ప్రదాతగా, పాలనదక్షుడిగా చంద్రబాబుకు కనిపించారు. ఇప్పుడేమో అదే కేజ్రీవాల్‌ను రాజకీయ కాలుష్యం సృష్టించిన వ్యక్తిగా అభివర్ణిస్తున్నారు. 2019 ఎన్నికల సమయంలో ప్రధాని నరేంద్ర మోదీ దేశంలోనే ఉండడానికి అనర్హుడుగా, టెర్రరిస్టుగా, భార్యనే ఏలుకో లేని వ్యక్తిగా చంద్రబాబు ప్రచారం చేశారు. ఇప్పుడేమో మోదీది అభివృద్ది మోడల్ అని చెబుతున్నారు. చంద్రబాబు ఢిల్లీ ఫలితాలను విశ్లేషిస్తూ మీడియా తో మాట్లాడుతున్నప్పుడు ఎవరైనా మీడియా ప్రతినిధి ఈ విషయాలు అడుగుతారేమోనని అనుకుంటే అలా జరిగినట్లు లేదు. ఆ ప్రశ్నలే రాకుండా ఆయన జాగ్రత్త పడతారేమో తెలియదు. చంద్రబాబు ఏది చెబితే అదే కరెక్ట్ అని మీడియా ప్రచారం చేయాలి. అదే ఆయన వ్యూహం కూడా. ఏది ఏమైనా ఢిల్లీ ఫలితాల పేరుతో సూపర్ సిక్స్ హామీలకు చంద్రబాబు మంగళం పలకడానికి రంగం సిద్దం చేసుకుంటున్నారనే భావన కలుగుతుంది. ఈ నేపథ్యంలోనే చంద్రబాబుది చీటింగ్ మోడల్ అని ఆయన ప్రత్యర్థులు వ్యాఖ్యానిస్తుంటారు. మాటలు మార్చడంలో సిద్ధహస్తుడైన చంద్రబాబును మించి రాజకీయ కాలుష్య కాసారాన్ని సృష్టించగల నేత ఇంకెవరైనా ఉన్నారా?..:::కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత. -
‘తాట తీస్తానన్న పవన్ ఎక్కడ?’
సాక్షి,విశాఖ : రాష్ట్రంలో మహిళలకు అన్యాయం జరిగితే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ (pawan kalyan) తాట తీస్తానని అన్నారు. కిరణ్ రాయల్(Kiran Royal )తాట ఎంత వరకు తీశారు’ అని వైఎస్ఆర్సీపీ మహిళా విభాగం అధ్యక్షురాలు వరుదు కళ్యాణి (varudu kalyani) ప్రశ్నల వర్షం కురిపించారు. రాష్ట్రంలో మహిళలపై కూటమి నేతలు చేస్తున్న దారుణాలపై వరుదు కళ్యాణి మీడియాతో మాట్లాడారు.మహిళల భద్రతను కూటమి ప్రభుత్వం గాలికి వదిలేసింది. ప్రతి రోజు మహిళలపై దారుణాలు జరుగుతున్నాయి. జనసేన నేత కిరణ్ రాయల్ వల్ల లక్ష్మి అనే మహిళకు అన్యాయం జరిగింది. లక్ష్మికి న్యాయం జరిగిందా. మహిళకు అన్యాయం జరిగితే తాట తీస్తామని పవన్ చెప్పారు. లక్ష్మి అనే మహిళకు అన్యాయం జరిగితే ఏమి చేశారు. తిరిగి బాధితులు మీద కేసులు పెడుతున్నారు.ఎమ్మెల్యే అదిమూలం మహిళను వేధిస్తే పక్క రాష్ట్రం వెళ్లి మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఎంఎల్ఏ కొలికిపూడి శ్రీనివాస్ రావు వేధింపులు తాళలేక మహిళ ఆత్మహత్య ప్రయత్నం చేసింది. మహిళలు తమ మానాలను పణంగా పెడితేనే సంక్షేమ పథకాలు అందుతున్నాయి. పోలీసులకు హైకోర్టు చివాట్లు పెట్టిందంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. హోం మంత్రి జిల్లాలో మహిళకు రక్షణ లేదు. సీఎం చంద్రబాబు మహిళా రక్షణ కోసం కనీసం ఒక సమీక్ష నిర్వహించారా?ప్రజలకు రక్షణ కల్పించడంలో విఫలమయ్యారని మీ సొంత సర్వేలోనే తేలింది’ అని వ్యాఖ్యానించారు. 👉చదవండి : జనసేన కిరణ్ రాయల్‌కు షాక్ -
‘పవన్.. హామీల అమలు నీ బాధ్యత కాదా?’
సాక్షి, అనంతపురం: ఏపీలో కూటమి సర్కార్ హామీల అమలుకు పవన్ కళ్యాణ్ ఎందుకు బాధ్యత తీసుకోరు అని ప్రశ్నించారు వైఎస్సార్సీపీ నాయకులు. సనాతన ధర్మం అంటున్న పవన్ కళ్యాణ్ ఇచ్చిన హామీలను అమలు చేయరా?. శాంతి భద్రతల నిర్వహణలో చంద్రబాబు సర్కార్ విఫలమైందన్నారు. అలాగే, కక్ష సాధింపు చర్యలను మానుకుని హామీలను అమలు చేయాలని కూటమి నేతలకు హితవు పలికారు.అనంతరంలో వైఎస్సార్సీపీ నాయకులు చంద్రబాబు పాలనలో ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్బంగా మాజీ మంత్రి, వైఎస్సార్సీపీ నేత సాకే శైలజానాథ్ మాట్లాడుతూ..‘ఎన్నికల్లో ఇచ్చిన హామీల అమలుకు పవన్ కళ్యాణ్ ఎందుకు బాధ్యత తీసుకోరు?. సనాతన ధర్మం అంటున్న పవన్ కళ్యాణ్ ఇచ్చిన హామీలను అమలు చేయరా?. టీడీపీ కూటమి.. ప్రజల నమ్మకాన్ని వమ్ము చేసింది. ఎన్నికలకు ముందు సూపర్ సిక్స్ హామీలు ఇచ్చారు. అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగా లేదంటూ చంద్రబాబు జారుకునే యత్నం చేస్తున్నారు. 40 ఏళ్ల రాజకీయ అనుభవం ఉన్న చంద్రబాబుకు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి తెలియలేదా? అని ప్రశ్నించారు.వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే అనంతవెంకటరామిరెడ్డి మాట్లాడుతూ..‘పోలవరం ప్రాజెక్టు ఎత్తు తగ్గింపు తగదు. ప్రజా సమస్యలపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పోరుబాట కొనసాగిస్తుంది. శాంతి భద్రతల నిర్వహణలో చంద్రబాబు సర్కార్ విఫలమైంది. ప్రజల గొంతుకను అణచివేసేందుకు పోలీసులను ఉపయోగించుకుంటున్నారు. వైఎస్సార్సీపీ నేతలు, కార్యకర్తలపై అక్రమ కేసులు పెడుతూ వేధింపులకు గురి చేస్తున్నారు. కక్షసాధింపు చర్యలు మానుకుని ఇచ్చిన హామీలను అమలు చేయండి అని హితవు పలికారు.వైఎస్సార్సీపీ నేత, ప్రభుత్వ విద్యా మాజీ సలహాదారు ఆలూరు సాంబశివారెడ్డి మాట్లాడుతూ.. విలువలు, విశ్వసనీయతకు మారుపేరు వైఎస్ జగన్. ఇచ్చిన అన్ని హామీలను అమలు చేసిన ఘనత వైఎస్ జగన్‌కే దక్కుతుంది. హామీల అమలులో చంద్రబాబు, పవన్‌కు చిత్తశుద్ధి లేదు. వైఎస్ జగన్ మళ్ళీ ముఖ్యమంత్రి అయితేనే పేద ప్రజలకు న్యాయం జరుగుతుంది. టీడీపీ కూటమి అరాచకాలపై నిత్యం పోరాటాలు చేస్తూనే ఉంటాం అని తెలిపారు. -
మళ్లీ అధికారంలోకి వస్తాం.. అందరి లెక్కలు తేలుస్తాం: వైఎస్ జగన్
గుంటూరు, సాక్షి: ప్రజలకు ఇచ్చిన మాటను గాలికి వదిలేసిన చంద్రబాబు ప్రభుత్వానికి రాబోయే రోజుల్లో దారుణమైన పరిస్థితులు తప్పవని వైఎస్సార్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అన్నారు. బుధవారం ఉమ్మడి గుంటూరు జిల్లా వైఎస్సార్సీపీ నేతలతో జరిగిన భేటీలో ఆయన ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ‘‘2019-24 మధ్య జగన్ 1.0 ప్రభుత్వం నడిచింది. ఆ టైంలో చరిత్రలో ఎప్పుడూ చూడని విధంగా పాలన నడిచింది. లంచాలకు తావు లేకుండా రూ. 2.71 లక్షల కోట్లు డీబీటీ చేశాం. కోవిడ్ వల్ల ఆదాయం తగ్గినా హామీలు అమలు చేశాం. ప్రజల జీవితాల్లో వెలుగులు నింపాం. కనివినీ ఎరుగని రీతిలో అభివృద్ధి చేశాం. మనం చేసిన అభివృద్ధి ప్రజల కళ్ల ముందే ఉంది.ఇప్పుడు చంద్రబాబు ఇచ్చిన హామీలను ఎగ్గొట్టారు. బాబు మేనిఫెస్టోను చెత్తబుట్టలో వేశారు. రాష్ట్రంలో విద్య, వైద్యం, పారిశ్రామిక రంగాలు తిరోగమనంలో ఉన్నాయి. మన హయాంలోని పథకాలన్నీ రద్దు చేశారు. చంద్రబాబు చెప్పిన ప్రతి పథకం.. అబద్ధం, మోసం. మొన్నటి ఎన్నికల్లో 40 శాతం ఓట్లు వచ్చాయి. కూటమి కంటే మనకు 10 శాతం ఓట్లు మాత్రమే తగ్గాయి. కారణం.. వారిలా నేను అబద్ధాలు చెప్పలేకోవడం, కానీ, జగన్.. కార్యర్తలు, ప్రజలందరి మనసులో ఉన్నాడు. రాజకీయాల్లో విలువలు, విశ్వసనీత ఉండాలి. మీ జగన్ మరో 25-30 సంవత్సరాలు రాజకీయాల్లో ఉంటాడు. మనం ఇచ్చిన ప్రతీ హామీని నెరవేర్చాం. ప్రజల కోసం ఇన్ని బటన్లు నొక్కిన మనకే ఈ పరిస్థితి ఉంటే.. రేపు ఇచ్చిన హామీలను గాలికొదిలేసిన ఈ సర్కార్ పరిస్థితి ఏంటి?. .. టీడీపీ నేతలు ఇప్పుడు గ్రామాల్లోకి వెళ్లే పరిస్థితులు లేవు. హామీలు నెరవేర్చుకుంటే కాలర్ పట్టుకోవాలని వాళ్లే అన్నారు. బాబు ష్యూరీటీ.. భవిష్యత్తు గ్యారెంటీ అన్నారు. ఇప్పుడు ఆ ష్యూరిటీ కాస్త మోసం అయ్యింది. ప్రజలు వాళ్ల కాలర్ పట్టుకునే పరిస్థితి వచ్చింది. రాష్ట్రంలో ఇసుక, మద్యం, పేకాట మాఫియాలు నడుస్తున్నాయి. స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేశారు. ముసలమ్మ కూడా బటన్ నొక్కుతుందని చంద్రబాబు అన్నారు. ఇప్పుడు ఎలా చేయాలో చెవిలో చెప్పాలని అంటున్నారు. ఇలాంటి వ్యక్తిని ఛీటర్ అనకూడదా?. ప్రజలను మోసం చేసిన చంద్రబాబుపై 420 కేసు పెట్టకూడదా?. రాష్ట్రంలో స్కాంలు తప్ప ఏం జరగడం లేదు. దోచుకోవడం, పంచుకోవడమే జరుగుతోంది. ప్రశ్నిస్తున్నవారిపై 111 సెక్షన్ కేసులు పెడుతున్నారు. తీవ్రవాదులపై పెట్టే కేసులతో వేధించి జైళ్లలో పెడుతున్నారు. వైఎస్సార్సీపీ కేడర్ అరెస్టులకు భయపడొద్దు. మంచి పాలన చేస్తే ప్రజలు ఆదరిస్తారు. ఇలాంటి అన్యాయాలు చేస్తే ప్రజలే గుణపాఠం చెప్తారు.రాబోయేది జగన్ 2.0 పాలన. మళ్లీ అధికారంలోకి వస్తాం. అందరి లెక్కలు తేలుస్తాం. అన్యాయాలు ఎవరు చేసిననా వదిలిపెట్టం. తప్పు చేసిన వారిని చట్టం ముందు నిలబెడతాం. మన పాలనలో రెండున్నరేళ్లు కోవిడ్ ఉంది అందుకే కార్యకర్తలకు చేయాల్సింది చేయలేకపోయాం. జగన్ 2.0లో ప్రతీ కార్యకర్తకు తోడుంటాం. వాళ్ల ఇంటి పెద్దన్నగా వారికి తోడుగా ఉంటా’’ అని వైఎస్ జగన్ మరోసారి ఉద్ఘాటించారు. ఈ భేటీకి హాజరైన మాజీ మంత్రులు అంబటి రాంబాబు, మేరుగ నాగార్జున, విడదల రజని, ఎంపీ అయోధ్య రామిరెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు పిన్నెళ్లి, కాసు, బొల్లా సహా నియోజకవర్గాల సమన్వయ కర్తలు తదితరులు హాజరయ్యారు. అలాగే.. ఎంపీపీలు, జడ్పీటీసీలు, మున్సిపల్ చైర్ పర్సన్లు కూడా ఈ సమావేశంలో పాల్గొన్నారు. -
బాబు ఫోన్‌కు స్పందించని పవన్!
అమరావతి, సాక్షి: కూటమిలో డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ పంచాయితీ నడుస్తోంది. అనారోగ్యంతో ఇంతకాలం కీలక సమావేశాలకు దూరంగా ఉన్న పవన్.. ఇప్పుడు ప్రభుత్వ పెద్దలకు సమాచారం అందించకుండానే తీర్థయాత్రలకు వెళ్లడం చర్చనీయాంశంగా మారింది. ఈ క్రమంలో చంద్రబాబు ఫోన్‌కు సైతం ఆయన స్పందించడం లేదని సమాచారం. ఈ 6వ తేదీన కేబినెట్ సమావేశానికి పవన్ కల్యాణ్(Pawan kalyan) హాజరు కాలేదు. ఆ వెంటనే మంత్రులు, సెక్రటరీలతో జరిపిన కీలక సమావేశానికి పవన్ డుమ్మా కొట్టారు. దీంతో పవన్ ఎక్కడా? అనే చర్చ మొదలైంది. ఈలోపు ఆయన అనారోగ్యం బారిన పడ్డారని తెలియడంతో.. అందుకే రాలేదేమోననే చర్చ నడిచింది. అయితే.. ఆ వెంటనే ఆయన మూడు రాష్ట్రాల పుణ్యక్షేత్రాల సందర్శనకు వెళ్లడం ఒక్కసారిగా హాట్ టాపిక్ అయ్యింది. పవన్‌తో ఫోన్లో మాట్లాడేందుకు సీఎం చంద్రబాబు ప్రయత్నించగా అందుబాటులోకి రాలేదని తెలుస్తోంది. ఈ విషయమై ఆయన జనసేన సీనియర్ నేత, మంత్రి నాదెండ్ల మనోహర్‌ను చంద్రబాబు సంప్రదించినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. ఫోన్లో పవన్ అందుబాటులోకి రావట్లేదని చంద్రబాబు చెప్పగా.. పవన్ నడుం నొప్పితో బాధపడుతున్నారని చెప్పారు. ఈ లోపు.. ఇవాళ పవన్ కేరళ కొచ్చి ఎయిర్‌పోర్టులో దిగి భేషుగ్గా నడుచుకుంటూ వెళ్తున్న చిత్రాలు వైరల్ అయ్యాయి. దీంతో పవన్ మ్యాటర్ కవర్ చేసేందుకు మనోహర్ చేసిన ప్రయత్నాలు ఫలించలేదని తెలుస్తోంది. లోకేష్ డిప్యూటీ సీఎం విషయంలో.. పవన్ తీవ్ర మనస్థాపం చెందారనే ఆ మధ్య చర్చ నడిచింది. అయితే ఆ విబేధాలు తారాస్థాయికి చేరాయనే చర్చ ఇప్పుడు కూటమి పార్టీల మధ్య నడుస్తొంది. దీనిపై ఇరు పార్టీలు ఏమైనా స్పష్టత ఇస్తాయో చూడాలి. -
కిరణ్‌రాయల్‌ను తొక్కి నార ఎప్పుడు తీస్తారు: శ్యామల
సాక్షి,తాడేపల్లి: రాష్ట్రంలో మహిళలకు భయం తప్ప భరోసా లేదని వైఎస్సార్సీపీ అధికార ప్రతినిధి శ్యామల అన్నారు. మంగళవారం(ఫిబ్రవరి11) తాడేపల్లి వైఎస్సార్సీపీ ప్రధాన కార్యాలయంలో ఆమె మీడియాతో మాట్లాడారు. ‘వైఎస్ జగన్ ప్రభుత్వంలో అన్నా అని పిలిస్తే ఆదుకునే పరిస్థితి ఉండేది. ఇప్పుడు అన్నా అని కేకలు పెట్టినా ఎవరూ పట్టించుకోవడం లేదు.తిరుపతిలో లక్ష్మి అనే మహిళకు తీరని అన్యాయం జరిగింది. జనసేన నేత కిరణ్ రాయల్‌ను నమ్మి డబ్బులు ఇస్తే చివరికి ఆమెనే అరెస్టు చేయించారు. అన్యాయానికి గురయ్యాయని లక్ష్మి గోడు వెల్లబోసుకున్నా పట్టించుకోవడం లేదు. చివరికి పోలీసులకు ఫిర్యాదు చేసినా కేసు నమోదు చేయలేదు.ఏపీలో మహిళలు భయంభయంగా బతకాల్సిన పరిస్థితి ఏర్పడింది.ఈ అన్యాయాలపై కూటమి నేతలు ఎందుకు మాట్లాడటం లేదు? ఆడపిల్లకు అన్యాయం చేస్తే అదే చివరి రోజు అని చంద్రబాబు చిలుక పలుకులు పలికారు. తొక్కి పట్టి నార తీస్తాం అని చెప్పిన పవన్ కళ్యాణ్ ఇప్పుడు ఏం చేస్తున్నారు? వైఎస్ జగన్ హయాంలో ఆడపిల్లల జోలికి రావాలంటే భయపడేవారు.ఈరోజు నేరస్తులు కాలర్ ఎగరేసుకుని తిరుగుతున్నారు. లక్ష్మిని జైపూర్ పోలీసులు వచ్చి అరెస్టు చేస్తారని మూడు రోజుల ముందే కిరణ్‌రాయల్ ఎలా చెప్పాడు? అసలు ఆ పోలీసులను పిలిపించింది ఎవరు? బాధితులనే అరెస్టు చేయడం ఒక్క ఏపీలోనే జరుగుతోంది. ప్రశ్నించే గొంతులను నులిమేయటమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం పని చేస్తోంది.అణచి వేయాలని చూస్తే అంతకుఅంతగా ఎదుగుతారని గుర్తుంచుకోండి.పవన్ కళ్యాణ్ సిద్దాంతం ప్రకారం..కిరణ్ రాయల్‌ను తొక్కిపట్టి నార ఎందుకు తీయలేదు? అదేమంటే డైవర్షన్ పాలిటిక్స్ చేస్తూ కాలం గడుపుతున్నారు. ప్రజలకు పోలీసులు ఏమాత్రం రక్షణ కల్పించలేక పోతున్నారు. ఆడపిల్లల కన్నీటి చుక్కలకు కూటమి ప్రభుత్వమే సమాధానం చెప్పాలి.సినిమా ఫంక్షన్లలో కొందరు అనవసర వాగుడు వాగుతున్నారు. వారి వలన సినిమా చచ్చిపోతుంది.సినిమా బతకాలి,దాని ద్వారా వందల కుటుంబాలు బతుకుతున్నాయి.నేను చాలా ఈవెంట్లకు హోస్ట్ చేశాను. కానీ ఎప్పుడూ 23 అనే మాట మాట్లాడలేదు’అని శ్యామల గుర్తుచేశారు. -
‘చెల్లెల్ని చూసి నేర్చుకో’.. కేటీఆర్‌కు కొండా సురేఖ కౌంటర్
సాక్షి, హైదరాబాద్ : సమగ్ర కుటుంబ ఇంటింటి సర్వేపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వ్యాఖ్యలకు మంత్రి కొండా సురేఖ కౌంటర్ ఇచ్చారు. రీ సర్వే చేయాలంటే.. కేటీఆర్, ఆయన కుటుంబం దరఖాస్తు చేసుకోవాలి. సర్వే అంటున్న కేటీఆర్.. చెల్లి కవితను చూసి నేర్చుకోవాలి. సర్వే, ప్రొఫార్మాలో ఎక్కడ తప్పులు జరిగాయో కేటీఆర్ చెప్పాలి. ఎమ్మెల్యేలలో అసంతృప్తి అనేది నాకు తెలీదు..నేను ఎవరిని ఎంకరేజ్ చేయడంలేదు.దేవాదాయ శాఖలో ఉద్యోగుల కొరత ఉంది.అడ్మినిస్ట్రేషన్‌కు ఇబ్బంది అవుతుంది. రెవెన్యూ నుంచి ఉద్యోగులను తీసుకోవడం ఇప్పుడు కొత్తేమీ కాదు. లీగల్ లిటికేషన్స్లో లేని వాటిని మొదటి దశలో సర్వే చేయాలని అదేశించాం. రాష్ట్రంలో ఎక్కడెక్కడ కుంభాభిషేకాలు చేయాలో లిస్ట్ సిద్ధం చేయాలని ఆదేశాలు ఇచ్చాం.కాళేశ్వరంలో కుంభాభిషేకం చేయక 42 ఏళ్లు అవుతుంది. ఫారెస్ట్‌లలో సర్వేయర్ల ప్రొటెక్షన్‌పై ఎలాంటి ఫిర్యాదులు లేవు. గత పదేళ్ళలో దేవాదాయ శాఖ భూములు కబ్జా అయ్యాయి. గత ప్రభుత్వంలో నాయకులే ఎక్కువగా ఉన్నట్లు సమాచారం. ఈటెల రాజేందర్‌పై త్వరలోనే విచారణ జరుగుతుంది. బీసీ రిజర్వేషన్ల సర్వేతో మాకు పేరు వస్తుందనే విమర్శలు. బీసీ రిజర్వేషన్ల వ్యాల్యూ ఇప్పుడే అర్థం కాదు. ఉద్యోగాలు,ఇతర అంశాల్లో బీసీలకు న్యాయం జరుగుతుంది’ అని హామీ ఇచ్చారు. -
ఏపీ ప్రయోజనాలు వదిలేశారు: వైఎస్సార్సీపీ ఎంపీలు
సాక్షి,న్యూఢిల్లీ: పోలవరం ఏపీకి జీవనాడి అని,పోలవరం ఎత్తు తగ్గించడం వల్ల స్టోరేజ్ కెపాసిటీ తగ్గిపోతుంని వైఎస్సార్సీపీ పార్లమెంటరీ పార్టీ నేత వైవీ సుబ్బారెడ్డి అన్నారు. ఎంపీలు మిథున్‌రెడ్డి, వైఎస్ అవినాష్‌రెడ్డి, పిల్లి సుభాష్‌చంద్రబోస్, గురుమూర్తి, గొల్ల బాబూరావు, మేడ రఘునాథ్‌రెడ్డితో కలిసి వైవీ సుబ్బారెడ్డి మంగళవారం(ఫిబ్రవరి11) మీడియాతో మాట్లాడారు.‘150 టీఎంసీల సామర్థ్యం 115 టీఎంసీలకు పడిపోతుంది.ఈ అంశంపై కేంద్ర ప్రభుత్వంపైన దృష్టికి తీసుకెళ్లి పోరాటం చేస్తాం. విశాఖ స్టీల్ ప్లాంట్ ఉద్యోగులకు జీతాలు ఇవ్వడం లేదు.ఉద్యోగస్తులందరికీ వెంటనే జీతాలు చెల్లించాలి. స్టీల్ ప్లాంట్‌కు ప్లాంటుకు అవసరమైన గనులు కేటాయించాలి.స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ చేయడం లేదని కేంద్ర ప్రభుత్వం ప్రకటించాలి. రాష్ట్ర ప్రయోజనాలపై టీడీపీ ఎంపీలు మాట్లాడాలి. వ్యక్తిగతంగా మా పైన, మా పార్టీ అధ్యక్షుడిపైన మాట్లాడడం మానుకోవాలి. మిర్చి రైతులకు మద్దతు ధర లేకుండా పోయింది. మిర్చి రైతులు నానా కష్టాలు పడుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం మద్దతు ధర ఇవ్వడం లేదు. వైఎస్ జగన్ హయాంలో మేము మార్కెట్ జోక్యం ద్వారా రైతులను ఆదుకున్నాం’అని వైవీసుబ్బారెడ్డి తెలిపారు.ఎత్తు తగ్గిస్తే బనకచర్లకు నీళ్లు సాధ్యం కాదు: మిథున్రెడ్డిపోలవరం ప్రాజెక్టుకు రూ. 60 వేల కోట్ల ఖర్చు అవుతుందికానీ కేవలం రూ. 30,000 కోట్లతో ముగించాలని చూస్తున్నారుపోలవరం ఎత్తు తగ్గించడం వల్ల బనకచర్లకు నీళ్లు తరలించడం సాధ్యం కాదుఏపీ విభజన చట్టం ప్రకారం పోలవరం 45 మీటర్ల ఎత్తు ఉండాలిరాష్ట్రం నష్టపోతుంటే, టీడీపీ ఎంపీలు చూస్తూ కూర్చుంటున్నారురాష్ట్రంలో మెడికల్ సీట్లను సరెండర్ చేసేలా చంద్రబాబు ప్రభుత్వం పని చేస్తోందివ్యక్తిగత ఆరోపణలకు పార్లమెంటును వేదికగా మార్చుకోవద్దు సీఎం రమేష్‌పై మిథున్‌రెడ్డి ఫైర్ మద్యం విషయంలో తనపై సీఎం రమేష్ చేసిన ఆరోపణల్లో నిజం లేదని వైఎస్సార్సీపీ ఎంపీ మిథున్‌రెడ్డి మంగళవారం(ఫిబ్రవరి11) లోక్‌సభలో అన్నారు. సీఎం రమేష్‌కు కాంట్రాక్టులు కావాలంటే చంద్రబాబు దగ్గరికి వెళ్లి మాట్లాడుకోవాలని చురకంటించారు. మార్గదర్శి కుంభకోణాన్ని బయటపెట్టినందుకే తమపై సీఎం రమేష్ తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని విమర్శించారు. మార్గదర్శి కుంభకోణం అతిపెద్ద స్కామ్ అని, ఈ స్కామ్‌పై విచారణ జరగాల్సిందేనని మిథున్‌రెడ్డి డిమాండ్ చేశారు.ఏపీపై కేంద్రం చిన్నచూపు: పిల్లి సుభాష్చంద్రబోస్బీహార్కు ఇచ్చిన ప్రాధాన్యత ఏపీక ఇవ్వడం లేదుటీడీపీ ఎంపీలు రాజకీయ ద్వేషంతో చేసే వ్యక్తిగత విమర్శల వల్ల ఉపయోగం లేదుపార్లమెంటును రాష్ట్ర ప్రయోజనాల కాపాడేందుకు సద్వినియోగం చేసుకోవాలిటీడీపీ ఎంపీలు పార్లమెంటును దుర్వినియోగం చేస్తున్నారుమేము మాట్లాడుతుంటే అడ్డుకోవడం మంచి సంప్రదాయం కాదుపోలవరం ఎత్తు తగ్గింపు రైల్వే జోను ఇతర అంశాలపై ఐక్యంగా పోరాడుదాంఏపీలో వ్యవసాయం సంక్షోభంలో పడిందిరైతులను ఆదుకోవాలని మేము అడుగుతుంటే టీడీపీ వారు సభలో అడ్డుకుంటున్నారురైతులను గతంలో వైఎస్ జగన్ ప్రభుత్వం ఆదుకుంది ఏపీకి ప్రత్యేక హోదాపై చంద్రబాబు రాజీ పడ్డారు: వైఎస్ అవినాష్రెడ్డివిభజన సమయంలో ఏపీకి ఇచ్చిన వాగ్దానాన్ని అమలు చేయించడం చంద్రబాబు రాజీ పడ్డారు25 వేలకోట్ల అప్పు కోసం ప్రత్యేక హోదాను వదిలేశారుపోలవరం ఎత్తును కుదిస్తే రాష్ట్ర ప్రభుత్వం దానికి అంగీకరించిందిరూ. 57 వేలకోట్లకుగాను 30 వేలకోట్ల రూపాయలకు పోలవరాన్ని పరిమితం చేశారు 27 వేల కోట్ల గ్రాంట్ వదిలేశారు ఫలితంగా అమరావతికి 15000 కోట్ల అప్పు సాధించారు పోలవరం ఎత్తును, కెపాసిటీ తగ్గించి రాష్ట్రాన్ని చంద్రబాబు మోసం చేస్తున్నారు16 మంది ఎంపీల మద్దతు కేంద్ర ప్రభుత్వాన్ని నిలబెడుతున్న చంద్రబాబు, రాష్ట్ర ప్రయోజనాలను ఎందుకు కాపాడడం లేదు చంద్రబాబు రాష్ట్రానికి తీరని ద్రోహం చేస్తున్నారుమేము ఎవరిపైనా వ్యక్తిగత విమర్శలు చేయడం లేదు కడపలో స్టీల్ ప్లాంట్ కోసం జిందాల్‌ను తీసుకొస్తే చంద్రబాబు తప్పుడు కేసులు పెట్టించారుదాని ఫలితంగా ఆయన మహారాష్ట్రకు వెళ్లిపోయి మూడు వేల కోట్ల రూపాయల పెట్టుబడులకు ఒప్పందాలు చేసుకున్నారుచంద్రబాబు చర్యల వల్ల యువత రైతులు నష్టపోయారు 9 నెలల్లో లక్ష కోట్లకు పైగా అప్పులు చేశారు ఏ వ్యక్తిగత అవసరాల కోసం చంద్రబాబు రాజీపడుతున్నారుకూటమి ప్రభుత్వం శిఖండి రాజకీయాలను మానుకోవాలి:గురుమూర్తితిరుపతి డిప్యూటీ మేయర్ ఎన్నికల్లో నాపై దాడికి పాల్పడ్డారుప్రజాస్వామ్యాన్ని నడిరోడ్డులో ఖూనీ చేశారూఒక్కరే సభ్యులు ఉన్న టీడీపీ అప్రజాస్వామికంగా వ్యవహరించింది పార్లమెంట్లో రాష్ట్రం పరువు తీయొద్దుశిఖండి తరహా రాజకీయాలకు పాల్పడవద్దుమాపై బురదజల్లే కార్యక్రమాలకు పాల్పడుతున్నారుసంపద సృష్టిస్తానని హామీ ఇచ్చి అప్పులు చేస్తున్నారు:గొల్లబాబూరావుసూపర్ సిక్స్ పేరుతో జనం చెవులలో ఊదరగొట్టారుఒక్క హామీ కూడా అమలు చేయక ప్రజలను మోసం చేస్తున్నారుచంద్రబాబు వల్ల మోసపోయామని జనం అంటున్నారువైఎస్ జగన్ మాటిస్తే వెనక్కి పోరురాష్ట్ర ప్రయోజనాలపై మేము టీడీపీతో కలిసి వస్తాంతమిళనాడు కర్ణాటక ఎంపీల తరహాలో రాష్ట్ర ప్రయోజనాలను కాపాడాలిఏపీకి న్యాయం జరగాలనే మా పోరాటం: మేడ రఘునాథ్రెడ్డితిరుపతి ఐఐటీకి అదనపు నిధులు కావాలితిరుపతిని నూతన రైల్వే డివిజన్ చేయాలని సభలో కోరాపార్లమెంటులో ఏపీ పరువు తీయొద్దుసాధ్యమైనంత ఎక్కువగా ఏపీకి నిధులు వెళ్లేలా మేమే చొరవ తీసుకుంటున్నాంవ్యక్తిగత విమర్శలుమాని, రాష్ట్ర అభివృద్ధి కోసం టీడీపీ ఎంపీలు పనిచేయాలి -
వైఎస్ జగన్‌తోనే నా ప్రయాణం: మంత్రాలయం ఎమ్మెల్యే
సాక్షి,కర్నూలుజిల్లా: తాను పార్టీ మారుతున్నట్లు జరుగుతున్న ప్రచారం నిజం కాదని మంత్రాలయం వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే బాలనాగిరెడ్డి స్పష్టం చేశారు. తనపై జరుగుతున్న అసత్య ప్రచారాన్ని ఆయన ఖండించారు. ఈ మేరకు మంగళవారం(ఫిబ్రవరి11)బాలనాగిరెడ్డి క్లారిటీ ఇచ్చారు. తాను ఎప్పటికీ వైఎస్సార్సీపీలోనే ఉంటానని, వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ వెంటే నడుస్తానని బాలనాగిరెడ్డి స్పష్టం చేశారు. వ్యక్తిగత సమస్యల వల్ల పార్టీ కార్యక్రమాలకు కొంత దూరంగా ఉన్నానని,అంతేకానీ పార్టీ మారే ఆలోచన లేదని చెప్పారు. తనతో పాటు తన కుటుంబ సభ్యులు, మండల నాయకుల ఆధ్వర్యంలో పార్టీ కార్యక్రమాలు కొనసాగిస్తామని బాలనాగిరెడ్డి తెలిపారు. -
Kiran Royal: ‘మరీ ఇంత అన్యాయమా?’
తిరుపతి, సాక్షి: కూటమి నేతలకు పోలీసులు తలొగ్గుతున్నారని, జనసేన పార్టీ తిరుపతి ఇన్చార్జి కిరణ్ రాయల్‌పై ఫిర్యాదు చేసినా ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని ఐద్వా మహిళలు ఆరోపిస్తున్నారు. ఈ క్రమంలో.. తిరుపతి ఎస్పీని కలిసి స్పందన ద్వారా మరోసారి ఫిర్యాదు చేశారు.ఒక మహిళ తనకు జరిగిన అన్యాయంపై ప్రత్యక్షంగా.. ఆధారాలతో సహా మీడియా ముందుకు వచ్చింది. అయినా పోలీసులు ఎందుకు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. నిందితుడికే అండగా ఎందుకు నిలబడుతున్నారు?. కూటమి నేతలు ఒత్తిళ్లకు తలొగ్గుతున్నారా? ఇదెక్కడి న్యాయం? అని ఐద్వా మహిళలు ఏపీ ప్రభుత్వాన్ని నిలదీస్తున్నారు. తక్షణమే కిరణ్ రాయల్‌పై చర్యలు తీసుకోవాలని, అతన్ని అరెస్ట్ చేయాలని ఐద్వా నాయకురాలుసాయిలక్ష్మి డిమాండ్ చేస్తున్నారు.పవన్‌కు అత్యంత సన్నిహితుడు, తిరుపతి జనసేన ఇంఛార్జి అయిన కిరణ్‌రాయల్.. తన నుంచి రూ.1.20 కోట్ల నగదు, 25 సవర్ల బంగారం తీసుకుని ఇవ్వకపోగా, పైగా ఇబ్బందులకు గురిచేస్తున్నారని, అందుకే తాను ఆత్మహత్య చేసుకుంటున్నానంటూ లక్ష్మి అనే మహిళా ఓ సెల్ఫీ వీడియో విడుదల చేయడం కలకలం రేపింది. అయితే ఆస్పత్రి నుంచి నివాసానికి చేరుకున్న వెంటనే కిరణ్‌రాయల్ జనసేన శ్రేణుల ద్వారా బెదిరింపులకు దిగడంతో లక్ష్మి సోమవారం తిరుపతి ప్రెస్‌క్లబ్‌లో తనకు జరిగిన అన్యాయాన్ని వివరించారు. ప్రెస్‌మీట్ ముగిసిన వెంటనే.. నాటకీయ పరిణామాల నడుమ జైపూర్ పోలీసులు ఆమెను అరెస్టు చేయడం తీవ్ర చర్చనీయాంశమైంది. ఈ క్రమంలో కిరణ్‌రాయల్‌కు సంబంధించిన వీడియోలు నెట్టింట హల్ చల్ చేస్తున్నాయి.ఇదీ చదవండి: కిరణ్ రాయల్‌కు ముందే ఎలా తెలుసు? -
చంద్రబాబు, లోకేష్‌లతో విభేదాలు!.. కీలక సమీక్షకు పవన్ డుమ్మా
సాక్షి, విజయవాడ: కీలక సమీక్షకు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గైర్హాజరయ్యారు. సీఎం చంద్రబాబు ఉన్నతస్థాయి సమీక్షకు పవన్ హాజరుకాకపోవడం చర్చాంశనీయంగా మారింది. అన్ని శాఖల మంత్రులు హాజరైనా పవన్ మాత్రం గైర్హాజరయ్యారు. సీఎం పక్కన పవన్‌కి కుర్చీ కూడా వేయని అధికారులు.. ఆయన స్థానంలో నారా లోకేష్‌కి కుర్చీ వేశారు. ఇటీవల కేబినెట్ సమావేశానికి కూడా పవన్ కల్యాణ్ హాజరుకాలేదు.ప్రతీ శాఖ మంత్రి, కార్యదర్శులు హాజరుకావాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేయగా.. చంద్రబాబు, లోకేష్‌లతో విభేదాలు కారణంగానే పవన్ కల్యాణ్ గైర్హాజరైనట్లు సమాచారం. 15 రోజులుగా అన్ని ప్రభుత్వ కార్యక్రమాలకు పవన్ కల్యాణ్ దూరంగా ఉంటున్నారు. నారా లోకేష్‌తో డిప్యూటీ సీఎం పదవి విషయంలో చిచ్చు రగులుతోంది. నారా లోకేష్ సోషల్ మీడియా.. పవన్‌ని టార్గెట్ చేసి విమర్శలు చేసింది. ఢిల్లీ ఎన్నికల ప్రచారానికి కూడా పవన్ దూరంగా ఉన్నారు.నారా లోకేష్‌ను ప్రమోట్ చేస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు.. మరో వైపు పవన్ కళ్యాణ్ స్థాయిని తగ్గిస్తూ వ్యూహం అమలు చేస్తున్నారు. రేపటి నుండి దక్షిణ భారత దేశ పుణ్యక్షేత్రాల యాత్రకి వెళ్లనున్న పవన్ కళ్యాణ్.. ఇవాళ షెడ్యూల్ ఖాళీగా ఉన్నా కానీ.. కీలక సమీక్షకి కూడా హాజరు కాలేదు.