breaking news
-
అదేమైనా మీ బాబుగారి సొమ్మా?: వైఎస్ జగన్
గుంటూరు, సాక్షి: వైఎస్సార్సీపీ వాళ్లకు పథకాలు ఇవ్వకూడదని, వాళ్లకు ఇస్తే పాముకు పాలు పోసిట్లేనని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేసిన వ్యాఖ్యలపై మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి మండిపడ్డారు. బుధవారం తాడేపల్లిలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఈ అంశంపై ఆయన మాట్లాడారు.వైఎస్సార్సీపీ(YSRCP) వాళ్లకు సంక్షేమ పథకాలు ఇవ్వకూడదని, ఎలాంటి సాయం చేయకూడదని చంద్రబాబు ప్రకటన చేశారు. ఇవ్వకపోవడానికి అదేమైనా మీ బాబుగారి సొమ్మా?. అది ప్రజల సొమ్ము. ప్రజల సొమ్ముతో ప్రభుత్వం నడుస్తోంది. పక్షపాతానికి, రాగద్వేషాలకు అతీతంగా పాలన చేస్తానని రాజ్యాంగబద్ధంగా ప్రమాణం చేసిన చంద్రబాబు.. ఇలా బహిరంగంగా, నిసిగ్గుగా మాట్లాడతారా?. జడ్జిలుగానీ, గవర్నర్‌గానీ చంద్రబాబు(Chandrababu) లేదంటే నా ఈ వ్యాఖ్యలైనా ఒకసారి చూడాలి. ఇలాంటి వ్యక్తి సీఎంగా అర్హుడేనా?.. ఇలాంటి సీఎం ఏ రాష్ట్రానికైనా శ్రేయస్కరమా?. ఇలాంటి వ్యక్తిని సీఎం స్థానంలో కొనసాగించడం ధర్మమేనా? అని జగన్ ప్రశ్నించారు. -
ఉచిత బస్సు కోసం ఆడబిడ్డలు ఎదురుచూస్తున్నారు: వైఎస్ జగన్
సాక్షి, తాడేపల్లి: హామీల పేరుతో ప్రజలను మోసం చేయడమే చంద్రబాబు నైజమని చెప్పారు వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్. సూపర్ సిక్స్ ఇస్తామని ఒక్క హామీని కూడా నెరవేర్చని వ్యక్తి చంద్రబాబు. చిన్న పథకం మహిళలకు ఉచిత బస్సు కూడా అమలు చేయడం లేదని తెలిపారు.వైఎస్ జగన్ తాడేపల్లిలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. ‘ఉచిత బస్సు కోసం మహిళలంతా ఎదురు చూస్తున్నారు. ఉచిత ప్రయాణాలు ఎప్పుడెప్పుడు చేస్తామా? అని ఆశగా చూస్తున్నారు. రాయలసీమ ఆడబిడ్డలంతా విశాఖ పోదామని అనుకుంటున్నారు. ప్రకాశం, విజయనగరం, శ్రీకాకుళం ఆడబిడ్డలంతా అమరావతి ఎలా కడుతున్నారు? ఎలా ఉందని చూడాలనుకుంటున్నారు. ఎప్పటి నుంచి ఉచిత బస్సు అమలు చేస్తారు. ఇది చిన్న పథకం. అది ఇవ్వడానికి కూడా సాకులు చెబుతున్నారు. ఉచిత బస్సు రూపేణ రూ.7వేల కోట్లు ఎగరగొట్టారు. ఇంతకంటే దారుణం ఉంటుందా? అని ప్రశ్నించారు.అలాగే, రాష్ట్రంలో 18 నుంచి 60 ఏళ్ల మహిళకు సంవత్సరానికి రూ.18 వేలు ఆడబిడ్డ నిధి అన్నారు. దానికి ఎగనామం పెట్టారు. మహిళల సంక్షేమం పేరిట ఈ హామీతో రూ.7 వేల కోట్లు ఎగ్గొట్టారు. స్కూల్‌కి వెళ్లే ప్రతి విద్యార్థికి రూ.15 వేల సాయం అన్నారు. ఎంత మంది ఉంటే అంత మందికి ఇస్తామని అన్నారు. తల్లికి వందనం కోసం మొదటి బడ్జెట్లో రూ. 5,386 కోట్లు కేటాయింపులు చేశారు. ఈసారి నెంబర్ మోసంతో ప్రజలను మభ్య పెడుతున్నారు. ఎలాగూ మోసం చేసేది కదా అని ఇలా చేస్తున్నారు. చివరికి చిన్న పిల్లాడికి కూడా బకాయిలు పెడుతూ.. ఎగనామం పెడుతున్నారు’ అని అన్నారు. -
బాబు పాలన.. ప్రతీ నిరుద్యోగికి 72,000 ఎగనామం: వైఎస్ జగన్
సాక్షి, తాడేపల్లి: ఎన్నికల ముందు చెప్పినట్టుగా బాబు ష్యూరిటీ,, మోసం గ్యారెంటీ అన్నట్టుగా కూటమి సర్కార్ పాలన సాగుతోందన్నారు వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్. బడ్జెట్లో సూపర్ సిక్స్ పథకాలకు అరకొర కేటాయింపులే చేశారు. ప్రతి నిరుద్యోగికి ఇప్పటికే రూ.72వేలు ఎగనామం పెట్టారని చెప్పుకొచ్చారు.వైఎస్ జగన్ తాడేపల్లిలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ..‘ఎన్నికల సమయంలో చంద్రబాబు నిరుద్యోగులకు రూ.3వేలు నిరుద్యోగ భృతి ఇస్తామని చెప్పారు. అధికారంలోకి వచ్చాక దానికి ఎగనామం పెట్టారు. నాలుగు లక్షల ఉద్యోగాలు ఇచ్చేశామని గవర్నర్ స్పీచ్‌లో అబద్దాలు చెప్పించారు. బడ్జెట్లో ప్రతిపాదించకుండా లక్షల ఉద్యోగాలు ఎలా ఇచ్చారు. ఉద్యోగాలు ఎక్కడ ఇచ్చారు?. 2024-25 సోషియో ఎకనమిక్ సర్వేలో ఎంఎస్ఎంఈ సెక్టార్లో 27 లక్షల ఉద్యోగాలు ఇచ్చినట్టు అబద్దాలు చెప్పారు. ఇవ్వన్నీ ఎక్కడ ఇచ్చారు?. ప్రతి నిరుద్యోగికి ఇప్పటికే రూ.72వేలు ఎగనామం పెట్టారు. వైఎస్సార్సీపీ హయాంలో ప్రభుత్వ, ప్రైవేటు విభాగాల్లో 40 లక్షలకు పైగా ఉద్యోగాలు ఇచ్చాం. లెక్కలు, ఆధార్ కార్డులతో సహా మా దగ్గర ఆధారాలు ఉన్నాయి. మరి మీరు ఇచ్చిన ఉద్యోగులు, ఉద్యోగాలు ఎక్కడ?. చంద్రబాబు అనే వ్యక్తి చేసేదంతా మోసమే.. చెప్పేవన్నీ అబద్దాలే’ అని తెలిపారు. -
మోసాల బడ్జెట్.. బాహుబలి అంటూ బిల్డప్‌లు: వైఎస్ జగన్
గుంటూరు, సాక్షి: కూటమి ప్రభుత్వ పాలనలో సంక్షేమం పేరుతో ప్రతీ వర్గాన్ని చంద్రబాబు మోసం చేశారని, బడ్జెట్ గారడీతో అది బయటపడిందని వైఎస్సార్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి(YS Jagan Mohan Reddy) అన్నారు. తాడేపల్లిలోని కేంద్ర కార్యాలయంలో ఆయన చంద్రబాబు చేస్తున్న దగాను వివరించారు.ప్రెస్మీట్లో వైఎస్ జగన్ మాట్లాడుతూ.. 👉అసెంబ్లీలో ప్రతిపక్షం చెబుతున్న మాటలు వినడం లేదు. అందుకే మీడియా ముందుకు వచ్చాం. చంద్రబాబు నాయుడు ప్రభుత్వం రెండు బడ్జెట్లు ప్రవేశపెట్టింది. సూపర్ సిక్స్, 143 హామీల కోసం అరకోర కేటాయింపులు చేశారు. అన్నిరకాలుగా మోసం చేసిన తీరు తేటతెల్లంగా కనిపిస్తోంది.👉బాబు ష్యూరిటీ.. భవిష్యత్తు గ్యారెంటీ కాస్త బాబు ష్యూరిటీ.. మోసం గ్యారెంటీ అయ్యింది. ఎన్నికలకు ముందు సూపర్ సిక్స్, సెవెన్ అంటూ ఊదరగొట్టారు. చంద్రబాబు దత్తపుత్రుడు కలిసి మేనిఫెస్టో రిలీజ్ చేశారు. ప్రతీ ఇంటికి బాండ్లు పంచారు. 20 లక్షల ఉద్యోగాలు,. రూ.3 వేల నిరుద్యోగ భృతి సాయం అన్నారు. 👉ఇప్పుడు హామీలపై అడిగితే సమాధానం లేదు. రెండు బడ్జెట్లలోనూ నిధులు కేటాయించలేదు. ప్రజలను మోసం చేసిన తీరు స్పష్టంగా కనిపిస్తోంది. తొమ్మిది నెలల్లోనే 4 లక్షల ఉద్యోగాలు ఇచ్చేశామని చెప్పారు . గవర్నర్‌తో అబద్ధాలు చెప్పించారు. 👉ఆత్మస్తుతి పరనింద అన్నట్లుగా చంద్రబాబు బడ్జెట్ ప్రసంగం ఉంది. తొలిబడ్జెట్‌లో కేటాయిచింది బోడి సున్నా. ఈ ఏడాది కూడా నిరుద్యోగ భృతి ఇవ్వలేదు. ప్రతి నిరుద్యోగి భృతి రూ.72 వేలు ఎగనామం పెట్టారు. 2024-25 సోషియో ఎకనమిక్ సర్వేలో ఎంఎస్ఎంఈ సెక్టార్లో 27 లక్షల ఉద్యోగాలిచ్చామని చెప్పారు. బడ్జెట్లో ప్రతిపాదించకుండా లక్షల ఉద్యోగాలు ఎలా ఇచ్చారు?👉జగన్ చెప్పినదానికంటే ఎక్కువ ఇస్తున్నామని ఫోజులు కొడుతున్నారు. ఉద్యోగాలు ఇవ్వకపోగా.. ఉన్న ఉద్యోగాలను పీకేస్తున్నారు. పారిశ్రామిక వేత్తలను బెదిరిస్తున్నారు. ఏపీ రావాలంటే కంపెనీలు భయపడుతున్నాయి👉చంద్రబాబు ఏది చెప్పినా అబద్ధం.. మోసం. చంద్రబాబు చేసేది.. దగా .. వంచన👉వైఎస్సార్సీపీ హయాంలో వివిధ సెక్టార్లో ప్రభుత్వ ఉద్యోగాల సంఖ్య 6 లక్షలు. మొత్తం మా పాలనలో అన్నీ రంగాలకు కలిపి 40 లక్షల పైచిలుకు ఉద్యోగాలిచ్చాం. ఆధార్ కార్డులతో సహా ఆ వివరాలు చెప్పగలం. ఇది ఎవరూ కాదనలేని సత్యాలివి👉18 నుంచి 60 ఏళ్ల మహిళకు సంవత్సరానికి రూ.18 వేలు ఆడబిడ్డ నిధి అన్నారు. దానికి ఎగనామం పెట్టారు. ఉచిత బస్సు కోసం మహిళలంతా ఎదురు చూస్తున్నారు. ఉచిత ప్రయాణాలు ఎప్పుడెప్పుడు చేస్తామా? అని ఆశగా చూస్తున్నారు. మహిళల సంక్షేమం పేరిట ఈ హామీతో రూ.7 వేల కోట్లు ఎగ్గొట్టారు. 👉స్కూల్‌కి వెళ్లే ప్రతి విద్యార్థికి రూ.15 వేల సాయం అన్నారు. ఎంత మంది ఉంటే అంత మందికి ఇస్తామని అన్నారు. తల్లికి వందనం కోసం మొదటి బడ్జెట్లో రూ. 5, 386 కోట్లు కేటాయింపులు చేశారు. ఈసారి నెంబర్ మోసంతో ప్రజలను మభ్య పెడుతున్నారు. ఎలాగూ మోసం చేసేది కదా అని ఇలా చేస్తున్నారు. చివరికి చిన్న పిల్లాడికి కూడా బకాయిలు పెడుతూ.. ఎగనామం పెడుతున్నారు. 👉అఫ్కోర్స్.. చంద్రబాబుకి రైతులను మోసం చేయడం కొత్తేం కాదు రైతు భరోసా పేరిట రైతన్నలను గతంలోనే కాదు.. ఇప్పుడూ మోసం చేస్తున్నారు. అన్నదాత సుఖీభవ పథకం కింద రూ.20 వేల సాయం అందిస్తామన్నారు. కిందటి ఏడాది ఎగ్గొట్టారు. ఈసారి కూడా ఆ పని చేస్తే.. రెండు బడ్జెట్లకు కలిపి రూ.40 వేలు ఎగనామం పెట్టినట్లు అవుతుంది. 👉 దీపం పథకం కింద మరో మోసానికి దిగారు. ఎలాగూ ఎగనామం పెట్టేదే కదా.. మోసమే కదా అని కేటాయింపులు చేసుకుంటూ పోయారు.👉 చంద్రబాబు ఇచ్చిన హామీ ప్రకారం.. 50 ఏళ్లు నిండిన వాళ్లకు పెన్షన్ల విషయంలో మరో 20 లక్షల మంది జత కావాల్సి ఉంది. రెండేళ్లలో రూ.96 వేల చొప్పున మోసం చేశారు. 👉 సూపర్ సిక్స్.. సెవెన్ కింద అన్ని పథకాలకు కలిపి మొత్తం.. దాదాపు రూ.80 వేల కోట్లు(రూ.79,867 కోట్లు) కావాలి. కిందటి ఏడాది రూ.7 వేల కోట్లు పెడితే.. రూ.800 కోట్లు మాత్రమే ఖర్చు పెట్టారు. ఈసారి బడ్జెట్ కేటాయింపులే రూ.17, 179 కోట్లు మాత్రమే. బాబు షూరిటీ.. మోగ్యారెంటీకి ఇదే నిదర్శనం. 👉వైఎస్సార్సీపీ వాళ్లకు పథకాలు ఇవ్వకూడదని, ఎలాంటి సాయం చేయకూడదని చంద్రబాబు అన్నారు. ఇవ్వకపోవడానికి అదేమైనా మీ బాబుగారి సొమ్మా?. అది ప్రజల సొమ్ము. ప్రజల సొమ్ముతో ప్రభుత్వం నడుస్తోంది. పక్షపాతానికి, రాగద్వేషాలకు అతీతంగా పాలన చేస్తానని రాజ్యాంగబద్ధంగా ప్రమాణం చేసి ఇలా.. బహిరంగంగా మాట్లాడతారా?. ఇలాంటి వ్యక్తి సీఎంగా అర్హుడేనా?.. ఇలాంటి సీఎం ఏ రాష్ట్రానికైనా శ్రేయస్కరమా?. ఇలాంటిక్తిని సీఎం స్థానంలో కొనసాగించడం ధర్మమేనా?. చంద్రబాబు చేసిన ఇంట్రెస్టింగ్ కామెంట్స్ అందరూ చూడాలిఎన్నికల టైంలో చంద్రబాబు: జగన్ ఇప్పించిన సంక్షేమం ఆగదు. 143 హామీలు కాకుండా.. మరింత సంక్షేమం ఇస్తాంఅసెంబ్లీలో సీఎంగా చంద్రబాబు: మనం హామీలు ఇచ్చాం. సూపర్ సిక్స్ ఇచ్చాం. చూస్తే భయం వేస్తోంది. ముందుకు కదల్లేకపోతున్నాం. ఈ విషయాలు రాష్ట్ర ప్రజానీకం ఆలోచించాలి.👉సంక్షేమానికి కేరాఫ్‌గా నిలిచాం. మా హయాంలో 4 పోర్టులకు శ్రీకారం చుట్టాం. రాష్ట్రానికి 17 మెడికల్ కాలేజీలు తీసుకొచ్చాం. 10 పిషింగ్ హార్బర్ల నిర్మాణం చేపట్టాం. విద్యారంగంలో కీలక సంస్కరణలు తెచ్చాం. CBSE నుంచి IB వరకు బాటలు వేశాం. నాడు-నేడు కింద స్కూళ్ల రూపురేఖలు మార్చేశాం. చంద్రబాబు హయాంలో విద్యా వ్యవస్థ పూర్తిగా నాశనం అయ్యింది👉మా హయాంలో 66 లక్షల మందికి పెన్షన్లు అందించాం. బాబు పాలనలో 62 లక్షల మందికి పెన్షన్ ఇస్తున్నారు. కొత్తగా ఎవరిని చేర్చకపోగా.. ఉన్నవాళ్లలో 4 లక్షల మంది లబ్ధిదారులను తొలగించారు. బడ్జెట్ కేటాయింపుల్లోనూ పెన్షన్ నిధులు తగ్గించేశారు👉రూ.15 వేలు ఇస్తామని వాహనమిత్రకు ఎగనామం పెట్టారు. ముస్లింలకు మైనారిటీ కార్పొరేషన్ ద్వారా రూ.5 లక్షలు ఇస్తామని మోసం చేశారు. 👉దేశంలో ఎక్కడా లేని విధంగా సంక్షేమ క్యాలెండర్ అమలు చేశాం. మా హయాంలో అక్కాచెల్లెళ్లకు భరోసా ఉండేది. తమ కాళ్లపై నిలబడేలా అడుగులు ముందుకు వేశాం. 👉ఇప్పుడు అమ్మ ఒడి, విద్యాదీవెన, వసతి పథకాలు లేవు. విద్యాదీవెన పథకానికి నిధులు ఇవ్వలేదు. ఫీజులు కట్టలేక పిల్లలు చదువులు వదిలేసే పరిస్థితికి వచ్చారు. ఈ పరిస్థితిపై వైఎస్సార్సీపీ పోరాటం చేయనుంది. మార్చి 12న విద్యార్థులు, తల్లిదండ్రుల సమన్వయంతో వైఎస్సార్సీపీ ఫీజు పోరు ఉంటుంది👉కూటమి ప్రభుత్వంలో.. వ్యవసాయం, వైద్యం, ఆరోగ్యం, విద్య ఇలా అన్ని రంగాలను నాశనం చేశారు. అన్ని వ్యవస్థలను ధ్వంసం చేశారు. మేం తెచ్చిన విప్లవాత్మక మార్పులను.. నిర్వీర్యం చేశారు. మిర్చి రైతులను దారుణంగా మోసం చేశారు. సమస్య పరిష్కరించామని అసెంబ్లీలో అబద్ధాలు చెబున్నారను. కేజీ మిర్చి కూడా కొనలేదు.👉ఉద్యోగులను చంద్రబాబు దారుణంగా మోసం చేశారు. కోవిడ్‌లాంటి మహమ్మారి టైంలోనూ మెరుగైన జీతాలు.. అదీ సకాలంలో మేం చెల్లించాం. ఇవాళ జీతాల కోసం ఎదురు చూడాల్సిన పరిస్థితి. ఏటా ఇచ్చే ఇంక్రిమెంట్లను ఎగ్గొట్టారు. ఐఆర్, పీఆర్సీ, పెండింగ్బకాయిలు ఇవన్నీ ఇవ్వబోమని చంద్రబాబు ప్రభుత్వం చెబుతోంది.👉అయ్యా.. పయ్యావులగారూ.. కరోనా టైంలోనూ సాకులు చెప్పకుండా మేం అన్నీ సక్రమంగా నడిపించాం. ఇప్పుడు మీరు ఎగ్గొటడానికి సాకులు వెతుకుతున్నారు.అప్పులపై.. తప్పులు👉2014-19కి రూ.4 లక్షల కోట్ల అప్పులు ఉంటే.. 2024 నాటికిరూ.6 లక్షల కోట్ల అప్పు ఉంది. కాగ్ లెక్కలు కూడా ఇదే స్పష్టం చేశాయి. కానీ, రూ. 10 లక్షల కోట్ల అప్పు ఉందని ప్రచారం చేశారు. గవర్నర్ ప్రసంగంలోనూ అబద్ధాలు చెప్పించారు. 👉సాధారణంగా.. బడ్జెట్ గ్లాన్స్‌లో పదేళ్ల కిందట అప్పుల లెక్కలు ఉంటాయి. కానీ, లెక్కలు చూపిస్తే ఎక్కడ దొరికిపోతామోనని మొన్నటి బడ్జెట్లో అది చూపించలేదు. అంత దుర్మార్గంగా వ్యవహరించారు చంద్రబాబు.👉ఎందుకింత అబద్ధాలు.. ఎందుకింత మోసాలు?. చంద్రబాబు విచ్చలవిడిగా అప్పులు చేస్తున్నారు. ఇప్పుడు అమరావతి పేరు మీద అప్పులు చేస్తున్నారు. 👉రాష్ట్రానికి ఆదాయం రావట్లేదు. చంద్రబాబు, ఆయన మనుషుల జేబుళ్లోకి డబ్బులు వెళ్తున్నాయి. ఆర్థికవేత్తల అంచనాకి కూడా అందకుండా చంద్రబాబు ప్రజలపై బాదుడు బాదబోతున్నారు. అయ్యా స్వామీ.. ఏంది ఈ మోసాలు?.. బడ్జెట్ అంతా అంకెల గారడీ.. దీనిని పట్టుకుని బాహుబలి బడ్జెట్ అనడం వాళ్లకు మాత్రమే చెల్లుతుంది👉ఇదీ వాస్తవం. ఇబ్బడిముబ్బిడిగా అప్పు. గత మా ప్రభుత్వంలో కన్నా, ఇప్పుడు ఇబ్బడిముబ్బిడిగా చంద్రబాబు అప్పులు చేస్తున్నారు. మా హయాంలో 2023–24లో మేము రూ.62,207 కోట్లు చేస్తే, చంద్రబాబు 2024–25లో చేసిన అప్పు రూ,73,362 కోట్లు. నిజానికి అది ఇంకా ఎక్కువే ఉంది. ఇంకా అమరావతి కోసం చేసిన, చేస్తున్న అప్పులు వేరుగా ఉన్నాయి.ఇబ్బడిముబ్బిడిగా అప్పులు చేస్తున్నారు. మాట్లాడితే, అమరావతి సెల్ఫ్ ఫైనాన్సింగ్ మోడల్ అంటాడు. కానీ, బడ్జెట్లోని డిమాండ్, గ్రాంట్స్ చూస్తే.. రూ.6 వేల కోట్లు అమరావతి నిర్మాణం కోసమని చూపారు. మరి అలాంటప్పుడు అమరావతి సెల్ఫ్ ఫైనాన్సింగ్ మోడల్ అని ఎందుకు చెప్పాలి?👉రాష్ట్ర ప్రభుత్వ సొంత ఆదాయం (ఎస్ఓఆర్): 2023–24తో 2024–25ను పోలిస్తే రాష్ట్ర సొంత ఆదాయం ఏకంగా 9.5 శాతం పెరిగిందని చంద్రబాబు చెబుతున్నారు. ఎస్ఓఆర్ 2023–24లో రూ.93,084 కోట్ల నుంచి రూ.1,01,985 కోట్లకు పెరిగిందని చంద్రబాబు చెబుతున్నారు. కానీ, కాగ్ నివేదిక చూస్తే.. ఎస్ఓఆర్ తగ్గింది. 2025–26లో 37 శాతం పెరుగుదలతో రూ.1,27 లక్షల కోట్లకు ఎస్ఓఆర్ చేరుతాయంటున్నారు. ఇది మరో పచ్చి అబద్ధం. నిజానికి రాష్ట్ర ఆదాయం పెరగడం లేదు. కేవలం చంద్రబాబు, ఆయన మనుషులకే ఆదాయం వస్తోంది. ఖజానాకు సున్నా.👉నాన్ టాక్స్ రెవెన్యూ: 2024–25లో మిస్లీనియస్ జనరల్ సర్వీసెస్ కింద రూ.7,916 కోట్లు ఆదాయం చూపుతున్నారు. ల్యాండ్ రెవెన్యూ కింద రివైజ్డ్ అంచనా మేరకు రూ.1341 కోట్లు అని చూపుతున్నారు. కానీ, నిజానికి ఈ 10 నెలల్లో వచ్చింది కేవలం రూ.196 కోట్లు మాత్రమే. మరి ఏ రకంగా ఆ ఆదాయం పొందబోతున్నారు?👉మూల ధన వ్యయం: 2023–24లో 10 నెలల్లో మూలధన వ్యయం కింద మేము రూ.20,942 కోట్లు ఖర్చు చేస్తే, అదే చంద్రబాబు హయాంలో 2024–25లో తొలి 10 నెలల్లో చేసిన వ్యయం కేవలం రూ.10,854 కోట్లు అంటే మైనస్ 48 శాతం. ఇది వాస్తవం. కానీ రివైజ్డ్ అంచనాలో మరో రూ.15 వేల కోట్లు ఖర్చు చేస్తున్నట్లు చూపారు.👉ఈ బడ్జెట్ అంకెల గారడీ కాదా?: చంద్రబాబు వచ్చాక ఆదాయం తగ్గింది. రాష్ట్ర సొంత ఆదాయం ఎస్ఓఆర్ పెరగలేదు. అది పెరగకపోగా, చాలా తగ్గింది. మూల ధన వ్యయం కూడా దారుణంగా తగ్గింది. ఇలాంటి పరిస్థితులున్నా, చంద్రబాబు ఏమంటున్నాడు. జీఎస్డీపీ 12.94 శాతం నమోదు అవుతుందని చెబుతున్నాడు. ఎలా సాధ్యం?. వాస్తవాలు ఇలా ఉంటే, ఈ ఏడాది బడ్జెట్ రూ.3,22,359 కోట్లు ఎలా సాధ్యం? ఇది అంకెల గారడీ కాదా?. పైగా దీన్ని బాహుభళీ బడ్జెట్ అనడం మీకే చెల్లింది. 👉ప్రతిపక్షం ఈ మేర చెప్పలేకపోతే.. ఎలా?. ప్రతిపక్షంలో ఉన్న వారిని అధికారంలో ఉన్నవారు గుర్తించకపోతే.. ఏం సాధించడం కోసం అసెంబ్లీ నడపడం👉ఇంత ప్రసంగంలోనూ నేను ఎవరినీ తిట్టలేదు. లెక్కలతో సహా చూపించాం. మరి సమాధానాలు చెబుతారా? చూద్దాం👉ఎమ్మెల్సీ ఫలితాలపై..ఎమ్మెల్సీ విజయంతో ప్రజల్లో తమకు సానుకూలత ఉందన్న కూటమి ప్రభుత్వ వాదనపై జగన్ స్పందించారు. ప్రపంచ చరిత్రలో ఎమ్మెల్సీ ఫలితాల్లో రిగ్గింగ్ చేసేవాళ్లను ఎక్కడా చూడలేదు. ఫస్ట్ టైం ఇక్కడే చూశా. అయినా ఉత్తరాంధ్ర స్థానంలో టీచర్లు కూటమికి బాగా బుద్ధి చెప్పారు. అక్కడ రిగ్గింగ్ కుదరదు కాబట్టి ఓడిపోయారు👉అసెంబ్లీలో రెండే పక్షాలు ఉన్నాయి.. ఒకటి అధికారం.. మరొకటి ప్రతిపక్షం . ప్రధాన ప్రతిపక్ష హోదా మాకు కాకుంటే ఇంకెవరికి ఇస్తారు? . రెండు వైపులా మీరే కొడతామంటే.. ఇదేమైనా డబుల్ యాక్షన్ సినిమానా?👉గతంలో టీడీపీ నుంచి ఐదుగురు మా వైపు వచ్చారు. మరో పది మందిని లాగుదామంటే నేనే వద్దన్నా.. ఏం మాట్లాడతావో మాట్లాడు.. నేను వింటా అని చంద్రబాబుకి ప్రతిపక్ష హోదా ఇచ్చా. ఇదే ఆయనకు నాకు తేడా👉మైక్ ఇస్తేనే ప్రజలకు వాస్తవాలు తెలుస్తాయి. అది ఇవట్లేదు కాబట్టే ఇలా మీడియా ముందుకు రావాల్సి వస్తోందిపవన్పై సెటైర్లు..👉టీడీపీ తర్వాత జనసేన అతిపెద్ద పార్టీ అని.. కాబట్టి తాము ఉండగా ఈ ఐదేళ్లు వైఎస్సార్సీపీకి ప్రధాన ప్రతిపక్ష హోదా రాదని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అన్నారని మీడియా ప్రతినిధులు జగన్ వద్ద ప్రస్తావించారు. పవన్ కల్యాణ్ అనే వ్యక్తి కార్పొరేటర్‌కు ఎక్కువ.. ఎమ్మెల్యేకు తక్కువ. జీవిత కాలంలో ఒక్కసారి ఆయన ఎమ్మెల్యే అయ్యారు అని జగన్ సెటైర్ వేశారు. -
మా దగ్గర మంత్రదండం లేదు
సాక్షి, అమరావతి: ‘నేనేమి ఆర్థిక శాస్త్రవేత్తను కాను. నా దగ్గర మంత్ర దండం ఏమీ లేదు. రాత్రికి రాత్రే ఏవో అద్భుతాలు జరిగిపోతాయని చెప్పడం లేదు. మా కాళ్లకు సంకెళ్లు వేశారు. మా చేతులు కట్టేశారు. అయినప్పటికీ ఎన్ని ఇబ్బందులు ఉన్నా సూపర్ సిక్స్‌తో సహా ఇచ్చిన ప్రతి హామీని అమలు చేసే దిశగా ముందుకెళ్తున్నాం. అందుబాటులో ఉన్న ఆర్థిక వనరులతోనే మెరుగైన కేటాయింపులతో బడ్జెట్‌ను రూపొందించాం. అయినా ముఖ్యమంత్రి చంద్రబాబును బ్లైండ్(గుడ్డిగా)గా నమ్మితే చాలు.. రాష్ట్రం రూపు రేఖలే మార్చేస్తారు’ అని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ అన్నారు. శాసనసభలో బడ్జెట్‌పై జరిగిన చర్చకు ఆయన బదులిస్తూ.. గాడి తప్పిన రాష్ట్రాన్ని గాడిలో పెట్టేందుకు బ్రాండ్ చంద్రబాబు ఒక్కరు చాలన్నారు. తెలంగాణలో 2023–24లో రూ.1,73,389 కోట్ల ఆదాయం వస్తే, ఏపీలో రూ.1,01,985 కోట్ల ఆదాయం వచ్చిందని, జీతాల కోసం తెలంగాణ కేవలం రూ.51,682 కోట్లు (ఆదాయంలో 30 శాతం) ఖర్చు చేస్తుంటే, మనం రూ.89,008 కోట్లు (90శాతం) ఖర్చు చేస్తున్నామన్నారు. అప్పులకుతెలంగాణ ఏటా వడ్డీల రూపంలో రూ.52,080 కోట్లు చెల్లిస్తుంటే, ఏపీలో రూ.65,962 కోట్లు చెల్లించాల్సి వస్తోందన్నారు. ఈ ఏడాది కేంద్ర పన్నుల వాటాతో కలిపి రాష్ట్రానికి రూ.1.54,065 కోట్ల ఆదాయం వస్తే.. జీత భత్యాలు, వడ్డీల రూపంలో చెల్లించాల్సిన మొత్తం రూ.1,54,971 కోట్లుందన్నారు. 2014–19లో వ్యవసాయంలో 16 శాతం, సేవల రంగంలో 11.9శాతం వృద్ధి రేటు నమోదైతే, 2019–24 మధ్య 10.3 శాతం, 9.9 శాతంగా నమోదైనట్లు తెలిపారు. అంటే 2014–19తో పోలిస్తే వైఎస్సార్సీపీ పాలనలో వృద్ధి రేటు 3 శాతం పడిపోయిందన్నారు. ఫలితంగా రూ.76,195 కోట్లు అదనంగా అప్పు చేసే అవకాశం లేకుండా పోయిందని చెప్పారు. జీఎస్డీపీ, జీడీపీ పెరిగితేనే అప్పులు పుడతాయని, అందుకోసమే నిత్యం తపన పడుతున్నామని తెలిపారు. ఆర్థిక పరిస్థితి తెలిసే హామీలిచ్చాం..రాష్ట్ర ఆర్థిక పరిస్థితి తెలిసి కూడా తాము సూపర్ సిక్స్ హామీలిచ్చామని, సంపద సృష్టి ద్వారా వాటిని అమలు చేసి తీరతామని మంత్రి కేశవ్ తెలిపారు. ఇప్పటికే పెన్షన్ల పెంపు కోసం ఏటా రూ.32,520 కోట్లు ఖర్చు చేస్తున్నామని తెలిపారు. తల్లికి వందనం ద్వారా 72 లక్షల మంది పిల్లలకు రూ.15 వేల చొప్పున జమ చేసేందుకు రూ.9,407 కోట్లు, అన్నదాత సుఖీభవ కోసం ప్రతీ రైతుకు రూ.20 వేల చొప్పున ఆర్థిక సాయం చేసేందుకు రూ.6,300 కోట్లు కేటాయించామన్నారు. ధరల స్థిరీకరణ నిధి కింద వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఏటా రూ.500 కోట్లు కేటాయిస్తే, తాము రూ.300 కోట్లు మాత్రమే కేటాయించినట్లు ఒప్పుకున్నారు. -
ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఆలపాటి, పేరాబత్తుల, గాదె గెలుపు
సాక్షి, అమరావతి/సాక్షి ప్రతినిధి, ఏలూరు: రెండు పట్టభద్రుల నియోజకవర్గాల ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్ మంగళవారం ముగిసింది. ఉభయ గోదావరి జిల్లాల పట్టభద్రుల నియోజకవర్గం నుంచి టీడీపీ మద్దతు తెలిపిన పేరాబత్తుల రాజశేఖరం, ఉమ్మడి కృష్ణా–గుంటూరు పట్టభద్రుల నియోజకవర్గం నుంచి ఆలపాటి రాజేంద్రప్రసాద్ విజయం సాధించారు. ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ నియోజకవర్గం నుంచి స్వతంత్ర అభ్యర్థి గాదె శ్రీనివాసులు నాయుడు గెలుపొందిన విషయం తెలిసిందే. రెండు పట్టభద్రుల నియోజకవర్గాలు, ఒక ఉపాధ్యాయ నియోజకవర్గం ఎమ్మెల్సీ స్థానాల ఓట్ల లెక్కింపు ప్రక్రియ పూర్తికావడంతో ఆయా జిల్లాల్లో ఎన్నికల కోడ్‌ను ఎత్తేస్తున్నట్లు ఎన్నికల సంఘం ప్రకటించింది. ఆ మేరకు ఆయా జిల్లాల కలెక్టర్లు చర్యలు తీసుకోవాలని సూచించింది. కాగా, ఎమ్మెల్యే కోటా కింద ఎన్నికలు జరుగుతున్న 5 ఎమ్మెల్సీ స్థానాలకు రెండో రోజు మంగళవారం కూడా ఒక్క నామినేషన్ దాఖలు కాలేదు. -
ఇవిగో ఆధారాలు.. విచారణకు ఆదేశించండి
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత విశ్వవిద్యాలయాల వైస్ చాన్సలర్ల మూకుమ్మడి రాజీనామాలపై శాసన మండలి మరోసారి అట్టుడుకింది. వీసీల రాజీనామాలపై విచారణకు మండలిలో వైఎస్సార్సీపీ డిమాండ్ చేయడంతో ఆధారాలిస్తే విచారణ జరిపిస్తామని ఇటీవల విద్యా శాఖ మంత్రి లోకేశ్ చెప్పారు. బెదిరింపులు, మౌఖిక ఆదేశాలతోనే వీసీలు రాజీనామా చేశారని వైఎస్సార్సీపీ మంగళవారం సభలో ఆధారాలు సమర్పించి.. ‘ఇవిగో ఆధారాలు.. చిత్తుశుద్ధి, ధైర్యం ఉంటే నిష్పాక్షిక విచారణకు ఆదేశించాలి’ అని డిమాండ్ చేయడంతో అధికారపక్షం కంగుతింది. మండలిలో ప్రశ్నోత్తరాల అనంతరం ప్రతిపక్ష నాయకుడు బొత్స సత్యనారాయణ మాట్లాడుతూ ‘వీసీలను ఉన్నత విద్యా మండలి నుంచి బెదిరించి రాజీనామా చేయమని చెప్పారనడానికి ఆధారాలిస్తున్నాం. వీసీల కార్యాలయాలకు వెళ్లి ఎలా దౌర్జన్యం చేశారో వీడియోలు కూడా ఇస్తున్నాం. మంత్రికి చిత్తశుద్ధి ఉంటే.. వారు తప్పు చేయలేదని అనుకుంటే విచారణకు ఆదేశించాలి. కథలు చెప్పి తప్పించుకొనే ప్రయత్నం చేయొద్దు’ అని సూటిగా డిమాండ్ చేశారు. దీనికి మంత్రి లోకేశ్ స్పందిస్తూ.. బెదిరించి, భయపెట్టి రాజీనామాలు చేయించినట్టు ఎక్కడా వీసీల రాజీనామా పత్రాల్లో లేదని చెప్పారు. ప్రతిపక్ష సభ్యుల ఆరోపణలపై తాము ప్రవేశపెడుతున్న ప్రివిలేజ్ మోషన్‌ను స్వీకరించాలని మండలి చైర్మన్‌ను కోరారు. గత ప్రభుత్వంలోనూ వీసీలు రాజీనామా చేశారంటూ తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేశారు. తాము ఉన్నత విద్యావంతులను వీసీలుగా నియమించామని, అంతర్జాతీయ వర్సిటీల నుంచి కూడా ఏపీ వర్సిటీల్లో వీసీల పోస్టులకు క్యూ కడుతున్నారంటూ గొప్పలు చెప్పుకొన్నారు. గత ప్రభుత్వంలో విద్యాశాఖను ఏటీఎంగా వాడుకున్నారని లోకేశ్ అనడంతో బొత్స సత్యనారాయణ తీవ్ర అభ్యంతరం తెలిపారు. ఉన్నత విద్యా మండలి అధికారుల నుంచి మౌఖిక ఆదేశాలతోనే వీసీలు రాజీనామాలు చేసినట్టు తామూ చెప్పామని, అందుకే విచారణ అడుగుతున్నామని బొత్స అన్నారు. దేశ చరిత్రలో ఇలాంటిది జరగలేదని చెప్పారు. వారు చెబుతున్నట్టుగానే 2014 నుంచి వీసీల రాజీమాలపై విచారణ చేయాలని బొత్స డిమాండ్ చేశారు.మీ నియామకాల్లో తప్పులతోనే రాజీనామా!2014–19 మధ్య టీడీపీ ప్రభుత్వం వీసీల నియామకాల్లో తప్పులు చేసిందని, వాటిని కోర్టులు తప్పుపట్టాయని ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డి అన్నారు. 2019 జూలై 15న కోర్టు ఆదేశాలివ్వడంతో కొందరు వీసీలు రాజీనామా చేశారని, మరికొందరు చేయలేదని వివరించారు. ఇందులో ప్రభుత్వ ప్రమేయం లేదన్నారు. కానీ, కూటమి ప్రభుత్వం వచ్చాక గవర్నర్ నియమించిన వీసీలను రాజీనామా చేయమని చెప్పే హక్కును ఉన్నత విద్యా మండలి అధికారులకు ఎవరిచ్చారని ప్రశ్నించారు. 4 రోజుల్లోనే 17 మంది వీసీలు మూకుమ్మడిగా రాజీనామా చేస్తే ఎందుకు విచారణ చేయలేకపోతున్నారని నిలదీశారు.లోకేశ్ నోటి దురుసు!వీసీల రాజీనామాలపై ప్రతిపక్ష సభ్యుల ప్రశ్నలకు సమాధానం చెప్పలేక మంత్రి లోకేశ్ తీవ్ర ఒత్తిడికి లోనయ్యారు. వ్యక్తిగత విమర్శలు, సభలో లేని మాజీ సీఎం జగన్‌పై అనుచిత వ్యాఖ్యలకు దిగారు. ‘సాక్షి’లో వచ్చిన వార్తల ఆధారంగా ఎలా విచారణ చేస్తామని బుకాయించారు. ఇంగ్లిష్ రాని వారిని వీసీలుగా నియమించారని హేళన చేశారు. చివరికి మంత్రి లోకేశ్ సమాధానం చెప్పకుండానే చైర్మన్ సభను బుధవారానికి వాయిదా వేశారు.విచారణపై ప్రభుత్వం తోకముడిచింది: బొత్స రాష్ట్రంలో విశ్వవిద్యాలయాల వైస్ ఛాన్సలర్ల బలవంతపు రాజీనామాలపై విచారణ జరిపిస్తామని సవాల్ చేసిన ప్రభుత్వం.. మండలిలో తాము ఆధారాలు చూపగానే తోక ముడిచిందని బొత్స సత్యనారాయణ చెప్పారు. సభ వాయిదా అనంతరం వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీలతో కలిసి ఆయన అసెంబ్లీ బయట మాట్లాడుతూ.. ఆధారాలు చూపిస్తే విచారణకు సిద్ధమంటూ సవాల్ చేసిన విద్యా శాఖ మంత్రి నారా లోకేశ్ ఇప్పుడెందుకు వెనక్కి వెళ్లారో చెప్పాలని డిమాండ్ చేశారు. గవర్నర్ నియమించిన వీసీలను రాజీనామా చేయాలని ఉన్నత విద్యా శాఖ మండలి చైర్మన్, కార్యదర్శులు ఎలా ఆదేశిస్తారని ప్రశ్నించారు. తాము సభలో సమర్పించిన ఆధారాలకు సమాధానం చెప్పలేక లోకేశ్ దబాయింపులు, బుకాయింపులు, దూషణలకు తెగబడ్డాని చెప్పారు. న్యాయ విచారణపై ఎందుకంత భయమని అన్నారు. వీసీలతో బలవంతంగా రాజీనామాలు చేయించడం మొత్తం విద్యా వ్యవస్థకే కళంకమని చెప్పారు. -
‘చంద్రబాబు మీద కూడా అవే సెక్షన్లు పెట్టవచ్చు’
తాడేపల్లి: ఉత్తారంధ్ర టీచర్స్ ఎమ్మెల్నీ ఎన్నికల్లో కూటమి అభ్యర్థి రఘువర్మ ఓటమికి ప్రభుత్వ పనితీరే నిదర్శనమన్నారు , వైఎస్సార్ సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎస్వీ సతీష్ రెడ్డి,. తాడేపల్లిలోని వైఎస్సార్ సీపీ ప్రధాన కార్యాలయం నుంచి ప్రెస్ మీట్ నిర్వహించిన సతీష్ రెడ్డి.. కూటమి సానుకూలే వర్గాలే ఆ పార్టీని ఓడించాయన్నారు. అవతల వాళ్ల మీది బురదజల్లడం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి వెన్నతో పెట్టిన విద్య అని, వాటిని అవతల వాళ్లు కడుక్కునే లోపేలే నీవు చేసే పనులు నువ్వు తెలివిగా చక్కబెట్టుకుంటావంటూ సతీస్ రెడ్డి మండిపడ్డారు.చంద్రబాబుపై అనర్హత వేటు వేయాలని ఫిర్యాదు చేస్తాం‘చంద్రబాబు రాజ్యాంగాన్ని ఉల్లంఘించారు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 14, 15, 21 ని వయిలెట్ చేశారు. ఆయనపై అనర్హతా వేటు వేయాలని గవర్నరుని కోరతాం. త్వరలోనే గవర్నరుని కలుస్తాం. గవర్నరు న్యాయం చేయకపోతే కోర్టుకు వెళతాం. చంద్రబాబు సీఎం పదవికి అనర్హుడు. సీఎం గా ఉన్న వ్యక్తి హేట్ స్పీచ్ చేయటం కరెక్టు కాదు. పోసాని మీద పెట్టిన సెక్షన్లే చంద్రబాబు మీద కూడా పెట్టవచ్చు. దాని ప్రకారం చంద్రబాబుపై అనర్హతా వేటు చేయవచ్చు. చంద్రబాబుపై అనర్హతా వేటు వేయాలని కోర్టులో పిటిషన్ వేస్తాం.అప్పుడు వారి వల్లే గెలిచారు.. ఇప్పుడు వారి వల్లే ఓడిపోయారు..2024లో ఉద్యోగుల మద్దతుతో కూటమి గెలిచింది. కానీ అదే ఉద్యోగుల చేతిలో 9 నెలలకే కూటమి ఘోరంగా ఓడిపోయింది. ఐఆర్, పిఆర్సీతో సహా ఏ సమస్యను కూడా ప్రభుత్వం పరిష్కరించలేదు. పిఆర్సీ కమీషన్ ని కూడా వేయలేదంటే ఉద్యోగులపై ప్రభుత్వానికి ఏం ప్రేమ ఉన్నట్టు?, ఉత్తరాంధ్ర టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నిక ప్రభుత్వానికి కనువిప్పు కావాలి. తెలంగాణ నుండి అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీని తీసుకురాలేకపోయారు.ఈ సంవత్సరం ఒక్క అడ్మిషన్ ని కూడా ఏపీ నుంచి అంబేద్కర్ యూనివర్సిటీ తీసుకోలేదు. దీంతో 33 వేలమంది విద్యార్థులకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఏ సమస్య అడిగినా తప్పించుకునేలా ప్రభుత్వం మాటలు చెప్తోంది. రాష్ట్రంలో ఎప్పుడు ఎన్నికలు వచ్చినా కూటమికి జనం వాతలు పెట్టే పరిస్థితి ఉంది. సీఎం చంద్రబాబు వైసీపి మీద చేసిన వ్యాఖ్యలు సిగ్గుచేటు. రాగద్వేషం, పక్షపాతం లేకుండా పరిపాలన చేస్తానని చేసిన ప్రతిజ్ఞ ఏం అయింది. వైఎస్సార్ సీపీ వారికి పనులు చేయొద్దని ఎలా మాట్లాడతారు?, నీ 40 ఏళ్ల అనుభవం ఇదేనా?పోసాని మీద పెట్టిన సెక్షన్లే చంద్రబాబు మీద కూడా పెట్టవచ్చుపోసాని మీద పెట్టిన సెక్షన్లే చంద్రబాబు మీద కూడా పెట్టవచ్చు. చంద్రబాబు వేసిన విషబీజం ఆయన కార్యకర్తలకు నష్టం చేస్తుంది. రేపు అధికారం కోల్పోతే మీవారి పరిస్థితి ఏంటో అర్థం చేసుకోవాలి. ప్రపంచంలో ఏం గొప్ప జరిగినా అదేనని చెప్పుకోవటం చంద్రబాబు నైజం. విధ్వంసం అనే చంద్రబాబు స్కూళ్లను జగన్ బాగుచేయటం విధ్వంసంలాగా కనిపిస్తుందా?, వైద్యాన్ని ఇంటి దగ్గరే చేయించటం విధ్వంసమా?, చంద్రబాబు చేసే హేట్ స్పీచ్ వలన విధ్వంసం జరుగుతోంది. పోసాని కృష్ణమురళి మాటల వలన రాష్ట్రంలో గొడవలు జరిగాయని కేసులు పెట్టారు. మరి అవే మాటలు మాట్లాడిన చంద్రబాబు మీద ఎందుకు కేసులు పెట్టటం లేదు? -
అక్రమ కేసులు.. కుట్ర రాజకీయాలు.. కూటమి నేతలపై రోజా ఫైర్
సాక్షి, చిత్తూరు జిల్లా: చిత్తూరు సబ్ జైలులో ఉన్న నగరి మండలం దేసురు అగరం టీడీపీ నాయకుల అక్రమ కేసులో అరెస్టయి రిమాండ్‌లో ఉన్న వైఎస్సార్సీపీ నేతలను మాజీ మంత్రి ఆర్కే రోజా పరామర్శించారు. అనంతరం ఆమె మీడియాతో మాట్లాడుతూ.. ఏపీలో రెడ్ బుక్ రాజ్యాంగం అమలు చేస్తూ రాజ్యాంగ విరుద్ధంగా తప్పుడు కేసులు పెడుతున్నారని మండిపడ్డారు. వైఎస్సార్సీపీ నేతలు, కార్యకర్తలపై అక్రమ కేసులు పెట్టి కూటమి ప్రభుత్వం కుట్ర రాజకీయాలు చేస్తోందన్నారు. ‘‘వైఎస్సార్సీపీ నాయకులకు బెయిల్ వచ్చే లోపే.. మరో కేసు పెట్టి ఇబ్బందులు పెడుతున్నారు. సుప్రీంకోర్టు మార్గదర్శకాలు పక్కన పెట్టి పీటీ వారెంట్, కేసులు అన్ని ఒకే చోట విచారించాలని చెప్తున్నా పట్టించుకోవడం లేదు. అధికారులు.. కూటమి నేతలు చెప్పినట్లు ప్రవర్తిస్తే కచ్చితంగా తగిన మూల్యం చెల్లించక తప్పదు. రానున్న రోజుల్లో వైఎస్సార్సీపీ అధికారంలో వస్తుంది. 9 నెలల్లోనే కూటమి ప్రభుత్వం చేతకాని ప్రభుత్వంగా మారిపోయింది’’ అని రోజా దుయ్యబట్టారు.‘‘ఉత్తరాంధ్రలో ఉద్యోగ ఉపాధ్యాయులు కూటమి ప్రభుత్వం అభ్యర్ధిని ఓడించారు. రాష్ట్రంలో ఎక్కడ చూసినా మద్యం, వీధి వీధిలో బెల్ట్ షాపులు ఎక్కువై పోయాయి. సీఎం చంద్రబాబు ప్రాతినిధ్యం వహిస్తున్న కుప్పంలో గంజాయి సాగు చేస్తుంటే నిద్ర పోతున్నారా అని అడుగుతున్నా. హోం మంత్రి ఇంటికి సమీపంలో గంజాయి సాగు చేస్తున్నారు. రాష్ట్రం గంజాయి, డ్రగ్స్‌కు అడ్డాగా మారిపోయింది’’ అని రోజా ఆగ్రహం వ్యక్తం చేశారు. -
ఆధారాలు ఇచ్చాం.. ‘కూటమి’ తోక ముడిచింది: బొత్స
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ల బలవంతపు రాజీనామాలపై విచారణకు సవాల్ చేసిన ప్రభుత్వం తీరా మండలిలో ఆధారాలు చూపగానే తోకముడిచిందని శాసనమండలి ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ అన్నారు. అసెంబ్లీ బయట మీడియా పాయింట్లో వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీలతో కలిసి ఆయన మాట్లాడుతూ వీసీలతో బలవతంగా రాజీనామాలు చేయించారనే ఆరోపణలపై విచారణకు సిద్దమంటూ సవాల్ చేసిన విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ఆధారాలు చూపగానే ఎందుకు వెనక్కివెళ్ళారో చెప్పాలని డిమాండ్ చేశారు. దేశంలో స్వాతంత్రం వచ్చిన తరువాత ఎక్కడా, ఎప్పుడూ ఇలా వీసీలను బెదిరించి రాజీనామాలు చేయించిన ఘటనలు లేవని అన్నారు.బొత్స ఇంకా ఆయన ఏమన్నారంటే..గవర్నర్ నియమించిన విసిలని ఉన్నత విద్యా శాఖ మండలి చైర్మన్, కార్యదర్శులు ఏ విధంగా రాజీనామాలు చేయమని ఆదేశిస్తారు? ఒకేసారి 17 మంది వీసీలు రాజీనామా చేయడంపై జ్యుడీషియల్ విచారణ జరపాలని కోరాం. దీనిపై విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ఆధారాలు చూపాలంటూ సవాల్ విసిరారు. తీరా సభలో అన్ని వివరాలను ముందుంచడంతో, దానిపై సమాధానం చెప్పలేక దబాయింపులు, బుకాయింపులకు దిగారు. పరుష పదజాలంతో దూషణలకు తెగబడ్డారు. వీసీలు తప్పు చేస్తే విచారించండి, వారిపై చర్యలు తీసుకోండి, ఎవరికీ అభ్యంతరం లేదు. కానీ ప్రభుత్వం మారగానే వైస్ ఛాన్సలర్లతో బలవంతంగా రాజీనామాలు చేయించడం దారుణం. ఇది మొత్తం విద్యా వ్యవస్థకే కళంకంపోలవరం ఎత్తు తగ్గింపుపై వివరణ ఇవ్వాలిపోలవరం ప్రాజెక్ట్ అనేది ఈ రాష్ట్రానికి జీవనాడి. ఈ ప్రాజెక్ట్ పేరు చెప్పగానే వైఎస్సార్ గుర్తుకు వస్తారు. ఈ ప్రాజెక్ట్‌ను 45.72 మీటర్లతో నిర్మించిప్పుడే విద్యుత్ ఉత్పత్తి, విశాఖ స్టీల్ ప్లాంట్‌కు నీరు, ఉత్తరాంధ్రకు తాగునీరు అందుతాయి. కానీ ప్రభుత్వం పోలవరం ఎత్తును 41.15 మీటర్లకే పరిమితం చేస్తోంది. పోలవరం ప్రాజెక్ట్‌ను కేంద్రమే నిర్మించి ఇవ్వాలి. కానీ చంద్రబాబు మాత్రం తన స్వలాభం కోసం కాంట్రాక్టర్ల కోసం తామే నిర్మిస్తామని బాధ్యత తీసుకున్నారు. చివరికి పోలవరం ఎత్తుపైన కూడా చంద్రబాబు రాజీ పడుతున్నారు. రికార్డులను పరిశీలిస్తే ఇందులో వాస్తవాలు బయటపడతాయి. దీనిపై వివరణ ఇవ్వాలని మండలిలో ప్రభుత్వాన్ని నిలదీశాం. కానీ ప్రభుత్వం నుంచి దీనిపై సూటిగా సమాధానం రాలేదు. పోలవరం ఎత్తును తగ్గించేందుకు కూటమి ప్రభుత్వం సిద్ధమైందని అర్థమవుతోంది. వైఎస్సార్సీపీగా దీనిని ఎట్టి పరిస్థితుల్లోనూ అంగీకరించం.చేనేత కార్మికులను మోసం చేస్తున్నారుకూటమి ప్రభుత్వం ఏర్పడిన తరువాత రాష్ట్రంలో చేనేత కార్మికులను గాలికి వదిలేసింది. దీనిపై మండలిలో ప్రశ్నిస్తే శవాల మీద పేలాలు ఏరుకుంటున్నారంటూ మాపై ప్రభుత్వం ఎదురుదాడి చేస్తోంది. బీసీల గురించి మాట్లాడితే ఇలాంటి నీచమైన వ్యాఖ్యలు చేస్తారా? చేనేత కార్మికుల కోసం రూ.వెయ్యి కోట్ల నిధిని పెడతానని మోసం చేసిన ఘనత చంద్రబాబుది. 2019-24 మధ్య వైయస్ఆర్ నేతన్న నేస్తం కింద రూ.960 కోట్లు నేతన్నలకు ఇచ్చాం. రూ.1396 కోట్లు వారి పెన్షన్ల కోసం ఖర్చు చేశాం. కానీ కూటమి ప్రభుత్వం చేనేత కార్మికుల సంక్షేమం కోసం అంటూ అంకెల గారడీతో ప్రచారం చేసుకుంటోంది. తమకు అనుకూలమైన మాధ్యమాల్లో లేనిది ఉన్నట్లుగా చాటుకుంటోంది. బలహీనవర్గాల విషయంలో న్యాయం చేయకపోగా వారిని కించపరిచేలా మాట్లాడుతున్నారు.మీడియా ప్రశ్నలకు బదులిస్తూ..సంక్షోభంలో ఉన్న విద్యుత్ డిస్కామ్ లు వాటిని కాపాడటానికి వైఎస్సార్సీపీ ప్రభుత్వం రూ. 47వేల కోట్లు ఖర్చు పెట్టింది. ట్రూఅప్ చార్జీల పేరుతో కూటమి ప్రభుత్వం ప్రజలపై వేసిన రూ.15 వేల కోట్ల ప్రభారాన్ని ప్రభుత్వమే భరించాలి. 2014-19 లో తెలుగుదేశం ప్రభుత్వం చేసిన అప్పుల్లో కనీసం మూడోవంతు కూడా మా హయాంలో చేయలేదు. రాష్ట్రంలో జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎక్కడా మా పార్టీ అభ్యర్థులు పోటీ చేయలేదు. కూటమి నిలబెట్టిన అభ్యర్ధులకు మేం వ్యతిరేకమని మాత్రమే చెప్పాం. ఎవరికీ మద్దతు ప్రకటించలేదు. రిగ్గింగ్‌లు, డబ్బు పంపిణీ, అధికార దుర్వినియోగంతో కూటమి అభ్యర్ధులు ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలిచారు. ఉత్తరాంధ్రలో రఘువర్మ తమ అభ్యర్థి అంటూ కూటమి నేతలు ప్రచారం చేసుకున్నారు. ఇప్పుడు ఆయనక బదులు గెలిచిన శ్రీనివాసులు నాయుడిని తమ అభ్యర్థి అంటూ చెప్పుకోవడం దారుణం. ఎవరికో పుట్టిన పిల్లవాడిని తమ కొడుకు అని చెప్పుకుంటున్నట్లుగా ఉంది. -
పవన్ ఆఫీస్ నుంచి ఫోన్లు వస్తున్నాయ్: లక్ష్మి
తిరుపతి, సాక్షి: జనసేన నేత కిరణ్ రాయల్(Kiran Royal) తనకు ఇవ్వాల్సిన నగదు మొత్తం ఇచ్చేదాకా పోరాడుతూనే ఉంటానని బాధితురాలు లక్ష్మి(Laxmi) అంటున్నారు. తనకు ఎలాంటి రాజకీయ పార్టీ మద్దతు లేదని స్పష్టం చేసిన ఆమె.. కాంప్రమైజ్‌కు రావాలని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఆఫీస్ నుంచి ఫోన్లు వస్తున్నాయని చెబుతున్నారామె. కిరణ్ రాయల్‌తో జరిగిన ఆర్థిక లావాదేవీలు అన్నింటికీ ఆధారాలు ఉన్నాయి. స్థానిక సీఐ నాకు సెటిల్మెంట్ చేయిస్తానని హామీ ఇచ్చారు. మొదటి నుంచి చెబుతున్నట్లు నాకు ఈ పోరాటంలో ఏ పార్టీ మద్దతు లేదు. నా ఆరోగ్యం బాగోలేకున్నా.. నా పిల్లలు వద్దని చెప్పినా.న్యాయ పోరాటం చేస్తున్నా. నన్ను రకాలుగా ట్రోల్ చేస్తున్నారు. అయినా నా పోరాటం ఆపను. నేను విడుదల చేసిన వీడియోలు,ఫోటోలు అన్ని వాస్తవాలు. వాటన్నింటిని ఏడాది క్రితమే జనసేన పార్టీ జిల్లా అధ్యక్షుడు తీసుకున్నారు. ఇంతకాలం సైలెంట్‌గా ఉండి ఇప్పుడేమో.. కాంప్రమైజ్ కోసం ప్రయత్నిస్తున్నారు. విజయవాడ వచ్చి కలవాలని పవన్ కల్యాణ్(Pawan Kalyan) పీఏ దగ్గరి నుంచి నాకు ఫోన్లు వస్తున్నాయి. కానీ, నా పిల్లల భవిష్యత్ కోసం నేను వెళ్లవద్దని అనుకుంటున్న అని లక్ష్మి చెబుతున్నారు. -
మండలిలో లోకేష్‌ను ఏకిపారేసిన బొత్స
సాక్షి, అమరావతి: ఏపీ శాసనమండలిలో మంత్రి నారా లోకేష్‌కు మండలి ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ చుక్కలు చూపించారు. ఏపీలో 17 మంది యూనివర్శిటీల వీసీల బలవంతపు రాజీనామాలపై సభలో చర్చ సందర్భంగా ఇద్దరు నేతల మధ్య వాడీవేడి చర్చ జరిగింది. వీసీల బలవంతపు రాజీనామాలపై ఆధారాలతో సహా ప్రశ్నించడంతో మంత్రి లోకేష్ సైలెంట్ అయ్యారు. శాసనమండలి వేదికగా ఏపీలో 17 మంది యూనివర్శిటీల వీసీల బలవంతపు రాజీనామాలపై నేడు సభలో చర్చ జరిగింది. ఈ సందర్బంగా వీసీల బలవంతపు రాజీనామాలకు సంబంధించిన ఆధారాలను ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ సమర్పించారు. ఈ సందర్బంగా బొత్స మాట్లాడుతూ..‘వీసీల రాజీనామాలపై ప్రభుత్వం తప్పు లేకపోతే విచారణ జరిపించండి. 17 మంది వీసాలతో బలవంతంగా రాజీనామా చేయించారు. వీసీలను గవర్నర్ నియమిస్తే ప్రభుత్వం ఎలా జోక్యం చేసుకుంటుందని ప్రశ్నించారు.మరోవైపు.. ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డి మాట్లాడుతూ..‘మూకుమ్మడిగా నాలుగు రోజుల్లో 17 మంది ఎందుకు రాజీనామా చేశారు. ఒకే సారి అంత మంది రాజీనామా చేస్తే ఎందుకు ప్రభుత్వం అంగీకరించింది. దీనికి ప్రభుత్వం ఎందుకు విచారణ చేపట్టలేదు. వీసీల విషయంలో ప్రభుత్వం జోక్యం ఎందుకు? అని ప్రశ్నల వర్షం కురిపించారు.ఈ క్రమంలో వైఎస్సార్సీపీ సభ్యులు ప్రశ్నలకు సమాధానం చెప్పలేక మంత్రి నారా లోకేష్ ఎదురుదాడికి దిగారు. దీంతో, మండలి చైర్మన్ సభకు కొద్దిసేపు విరామం ప్రకటించారు. -
తల్లికి వందనంపై పచ్చి దగా.. అడ్డంగా దొరికిపోయిన లోకేష్
అమరావతి, సాక్షి: బడి పిల్లలను, వాళ్ల తల్లులను భరోసా పేరిట వంచించాలనుకుంటున్న కూటమి ప్రభుత్వ ప్రయత్నం.. శాసన మండలి సాక్షిగా బయటపడింది. వైఎస్సార్సీపీ సభ్యుల ప్రశ్నతో తల్లికి వందనం(Thalliki Vandanam)పై మంత్రి నారా లోకేష్ తప్పుడు లెక్కలు విడుదల చేసి అడ్డంగా దొరికిపోయారు. అధికారంలోకి వచ్చి తొమ్మిది నెలలు గడుస్తున్నా.. తల్లికి వందనంపై కూటమి ప్రభుత్వం అడుగు ముందుకు పడడం లేదు. పైగా కిందటి ఏడాది బడ్జెట్లో నిధులు కేటాయించినా.. అమలు మాత్రం చేయలేదు. విచిత్రంగా.. ఈ ఏడాది మే నెల నుంచి స్కీమ్ అమలు చేస్తామని ప్రకటించింది. ఈ నేపథ్యంలో.. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో భాగంగా శాసన మండలిలో ఇవాళ.. ‘‘ఈ ఏడాది తల్లికి వందనం ఎంతమందికి ఇస్తారు?’’ అని విపక్ష వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీలు ప్రశ్నించారు. అయితే.. తల్లికి వందనం పథకం లబ్ధిదారుల సంఖ్య చెప్పని మంత్రి నారా లోకేష్.. నిధుల లెక్కలు చూపించాలంటూ అధికారులను పురమాయించారు. ప్రజలను, సభను మభ్యపెట్టేలా విద్యాశాఖ లిఖితపూర్వక సమాధానం ఇప్పించారు. అందులో రూ.9,400 కోట్లు కేటాయించామంటూ బడ్జెట్ లెక్కలు చెప్పారు. కానీ, ఇది వచ్చే ఏడాది పథకం తాలుకా నిధుల లెక్కకు సంబంధించింది. ఏపీలో పేద విద్యార్థులకు గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం అమ్మఒడి పేరుతో ఆర్థిక సాయం అందించింది. అయితే.. అదే పథకాన్ని తల్లికి వందనం పేరుతో మార్చేసిన చంద్రబాబు.. అధికారంలోకి రాగానే ఏడాదికి రూ.15 వేల చొప్పున అందిస్తామని ప్రకటించారు. కూటమి నేతలైన పవన్, నారా లోకేష్ కూడా ఈ విషయాన్నేన్నికల ప్రచారంలో నొక్కి మరీ చెప్పారు. పైగా ఇంట్లో ఎంత మంది ఉంటే(విద్యార్థులు) .. అంత మందికీ వర్తింజేస్తామని ప్రకటించారు. దీనిపై ప్రస్తుత మంత్రి నిమ్మల రామానాయుడుకు సంబంధించిన వీడియో ఒకటి ఎంతగా వైరల్ అయ్యిందో తెలియంది కాదు. తీరా అధికారంలోకి వచ్చాక.. మార్గదర్శకాల పేరుతో హడావిడి చేశారే తప్ప పైసా విదిల్చింది లేదు. ఈ నేపథ్యంలో తాజా ప్రకటనతో.. 2024-25 విద్యా సంవత్సరానికి తల్లికి వందనానికి ఎగనామం పెడుతూ .. 80 లక్షల పిల్లలు, వారి తల్లులను చంద్రబాబు సర్కార్ ప్రభుత్వం మోసం చేసినట్లయ్యింది. -
ఫార్టీ ఇయర్స్ ఇండస్ట్రీతో ఇలాగే ఉంటుంది మరి!
ముఖ్యమంత్రి పదవిలో ఉన్న వారు పార్టీలకు అతీతంగా వ్యవహరించాలి. అందరికీ ఉపయోగపడే పనులు చేయాలి. ఎన్నికలు ముగిసిన తరువాత రాజకీయాల వద్దని, అందరూ సమానమేనని అనాలి. కానీ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చేస్తున్నదేమిటి? సీఎం హోదాలో ఉంటూనే.. వైఎస్సార్సీపీ వారికి ఎలాంటి పనులూ చేయవద్దని చెబుతున్నారంటే.. ఏంటి అర్థం?. ఈ రకమైన వ్యాఖ్యలకు బాధ పడాల్సింది... సిగ్గుపడాల్సింది వైఎస్సార్సీపీ(YSRCP) వాళ్లు కాదు.. టీడీపీ మిత్రపక్షాల వారే. భవిష్యత్తులో ఏ కారణం వల్లనైనా బాబుతో పొత్తు లేకుండా పోతే.. ఆయన వ్యవహారశైలి ఎలా ఉంటుందో ఈ తాజా వ్యాఖ్యలను బట్టి అర్థం చేసుకోవచ్చు. గతంలో.. ముఖ్యమంత్రి హోదాలో వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి కులాలు, మతాలకు, ప్రాంతాలకు అతీతంగా సంక్షేమ అమలు గురించి బహిరంగంగానే ప్రకటించారు. కానీ చంద్రబాబు మాత్రం గద్దెనెక్కిందే తడవు.. తమది రాజకీయ పాలనేనని నిస్సిగ్గుగా చెప్పుకున్నారు. ఆపై రాక్షస పాలనకు శ్రీకారం చుట్టారు. చివరకు ఇందుకు ఆయన తన కుమారుడు లోకేష్ తాలూకూ రెడ్‌బుక్ రాజ్యాంగాన్ని ప్రాతిపదికగా తీసుకోవడం బాబుకొచ్చిన దుస్థితి అని అనుకోవాల్సిందే. అధికారులైనా.. పార్టీ నాయకులైనా సరే.. వైఎస్సార్సీపీ కార్యకర్తలకు వీసమెత్తు పని చేసినా ఊరుకోనని చంద్రబాబు హూంకరిస్తున్నారు. ఒకవేళ అలా చేస్తే పాముకు పాలు పోసినట్లేనని ఆయన దుర్మార్గంగా, బహిరంగంగా మాట్లాడుతున్నారు. మాటల విషం కక్కుతూ YSRCP వాళ్లను పాములతో పోల్చుతున్నారు. ఎన్నికలతోనే రాజకీయాలు మరచిపోవాలన్నది చాలామంది చెప్పే మాట. కానీ చంద్రబాబులా(Chandrababu) ఎవరూ ఇంత బరితెగించి మాట్లాడరు. సీఎం చెప్పినదాని ప్రకారం ఇకపై అధికారులు తమ వద్దకు వచ్చేవారు టీడీపీ వారా? లేక వైఎస్సార్సీపీ వారా? అన్నది తెలుసుకుని పనులు చేయాలా? చంద్రబాబు ఈ వ్యాఖ్యలు చేసిన తర్వాత.. అంతా ఒకసారి గత ముఖ్యమంత్రుల గొప్పతనాన్ని గుర్తు చేసుకుంటున్నారు. ఉదాహరణకు వైఎస్ రాజశేఖరరెడ్డి(YS Rajasekhar Reddy) ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు టీడీపీ ఎమ్మెల్యే ఎర్రబెల్లి దయాకరరావు, ప్రస్తుత ఏపీ ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ వంటి వారు వైఎస్‌ను కలిసి నియోజకవర్గాలకు సంబంధించి పనులకు నిధులు పెద్ద ఎత్తున తెచ్చుకున్న సందర్భాలు ఉన్నాయి. సీపీఎం నేత నోముల నరసింహయ్య ఒకసారి అసెంబ్లీలో వైఎస్‌ను తీవ్రంగా విమర్శించారు. ఆ తర్వాత నియోజకవర్గ పనులపై వైఎస్‌ను కలిశారు. ఆ సందర్భంలో అసెంబ్లీ చర్చను నోముల ప్రస్తావించినా, అదేమీ తప్పు కాదని చెప్పడమే కాకుండా ఆయన కోరినట్లు నిధులు మంజూరు చేసి పంపించారు. ఆ రకంగా వైఎస్సార్ పేరు తెచ్చుకుంటే, ఆయన కుమారుడు జగన్ ముఖ్యమంత్రి అయ్యాక పార్టీలు, కులాలు, మతాలు వంటివాటి జోలికి వెళ్లకుండా తనకు ఓటు వేయని వారికి సైతం పనులు చేయాలని పథకాలు అమలు చేయాలని అధికార యంత్రాంగాన్ని ఆదేశించి మరింత మంచి ఖ్యాతి సాధించారు. చంద్రబాబు ఈ వ్యాఖ్యలు చేయడానికి కారణాలపై కూడా చర్చలు జరుగుతున్నాయి. వైఎస్సార్సీపీలో ఉండడానికి భయం కల్పించి, టీడీపీలోకి వారిని లాక్కొవడానికి చేస్తున్న కుట్రలలో ఇదొకటని తెలుస్తూనే ఉంది. అంతమాత్రాన వైఎస్సార్సీపీ వారంతా భయపడరని పలు అనుభవాలు చెబుతున్నాయి. చివరికి బంధువులు, స్నేహితుల మధ్య కూడా విభేదాలు సృష్టించి రాజకీయ లబ్ది పొందాలన్న యావకు వెళ్లినట్లు అనిపిస్తుంది. గతంలో చంద్రబాబు నాయుడు మాట వరసకు ఒకటి చెప్పేవారు. ‘‘ఎన్నికలయ్యాక రాజకీయాలు ఉండవద్దు.. అంతా అభివృద్దే ఉండాలి’’ అని సుద్దులు చెప్పేవారు. కాని చేసేది చేసేవారు. 2014 టర్మ్‌లో తన పార్టీలో చేరితేనే పనులు చేస్తానని బెదిరించి, ఇతర ప్రలోభాలు పెట్టి 23 మంది ఎమ్మెల్యేలను తీసుకున్నారు. ఇప్పుడు మరీ ఓపెన్ అయి ఇలా మాట్లాడారు కాని, ఆయన అసలు తత్వం అదేనని అంటారు. తెలుగుదేశం పార్టీని ఒక వ్యాపార సంస్థగా మార్చారన్న విమర్శను ఎప్పటినుంచో ఎదుర్కొంటున్నారు. చంద్రబాబు ఎప్పుడూ ప్రజలను నమ్ముకుని రాజకీయాలు చేయలేదనే చెప్పాలి. వ్యూహాలు పన్నడం, వర్గాలు, ఎమ్మెల్యేలు, కార్యకర్తలకు ఆర్థిక ప్రయోజనాలు కల్పించడం ద్వారానే రాజకీయాలు సాగించారన్న భావన ఉంది.పైకి మాత్రం ప్రజల కోసం పని చేస్తున్నట్లుగా ప్రచారం చేసుకునేవారు. కాకపోతే ఈసారి మరీ బహిరంగం అయిపోయారు. 1978లో చంద్రబాబు ఎమ్మెల్యే అయ్యాక కాంగ్రెస్‌లో గ్రూపులు నడిపారు. ఒకసారి పార్టీ నుంచి సస్పెండ్ కూడా అయినట్లు గుర్తు. 1983లో ఓటమి తర్వాత మామ ఎన్టీఆర్ వద్దకు వెళ్లి పార్టీలో చేరిపోయారు. తదుపరి మళ్లీ వర్గ రాజకీయాలను జోరుగా నడిపారు. మామను మాయ చేసి కర్షక పరిషత్ చైర్మన్ పదవి తీసుకున్నారు. విశేషం ఏమిటంటే కర్షక పరిషత్ చైర్మన్ పదవి అంటే అదేదో సూపర్ సీఎం మాదిరి ఆయా శాఖల మంత్రులకన్నా తానే పవర్ పుల్ గా కనిపించే యత్నం చేసేవారు. తన తోడల్లుడు దగ్గుబాటి వెంకటేశ్వరరావు ప్రాబల్యాన్ని తగ్గించడానికి అన్ని వ్యూహాలు అమలు చేసేవారు. ట్విస్టు ఏమిటంటే దగ్గుబాటి వెంకటేశ్వర రావును కూడా అలాగే ప్రలోభపెట్టి తనవైపు లాక్కుని మామ ఎన్.టి.రామారావునే శంకరగిరి మాన్యాలు పట్టించగలిగారు. ఆ తర్వాత కొంతకాలం దగ్గుబాటి కుటుంబాన్ని దగ్గరకు కూడా రానివ్వలేదు. ఇప్పుడు మళ్లీ పరిస్థితి మారింది. చంద్రబాబును విమర్శిస్తూ అనేక సంచలన విషయాలను బయటపెట్టిన దగ్గుబాటి తాజాగా ఆయన ఇంటికి వెళ్లి తన మరో పుస్తకావిష్కరణ సభకు రావాలని ఆహ్వానించడం విశేషం. అది వేరే సంగతి.చంద్రబాబు నాయుడు(Chandrababu Naidu) తొలిసారి ముఖ్యమంత్రి అవ్వడానికి కారణం ప్రజలు కాదు. ఎమ్మెల్యేలలో తెచ్చిన చీలిక. అప్పట్లో ఎవరైనా ఎన్టీఆర్ వర్గంలో ఎమ్మెల్యేలు ఉంటే వారిని రకరకాలుగా ప్రలోభాలు పెట్టేవారని వార్తలు వచ్చేవి. లొంగకపోతే ఇతర మార్గాలు ఎటూ ఉంటాయి. పోలీసు వ్యవస్థతో బెదిరించడం, పనులు చేయకపోవడం వంటివి చేస్తుంటారు. అప్పటి నుంచే ఆయనకు ఈ వ్యూహం తెలుసు. టీడీపీ వారికే పనులు అయ్యేలా జాగ్రత్త పడేవారు. కొంతమంది కాంట్రాక్టర్లను కూడా తనతో ఉండేలా చేసుకునేవారు. వారికి ముఖ్యమైన కాంట్రాక్టులు ఇచ్చి పార్టీకి ఆర్థికంగాఅండగా ఉండేలా చేసుకుంటారు. 2004 ఎన్నికలకు ముందు కేంద్రం నుంచి ఏభైలక్షల టన్నుల బియ్యాన్ని పనికి ఆహారం పథకం కింద తీసుకు వచ్చారు. దానిలో అధిక భాగం టీడీపీ కార్యకర్తలే అమ్ముకున్నారన్న విమర్శలను అప్పటి ప్రతిపక్ష కాంగ్రెస్ చేసేది. దాని ప్రభావం కూడా ఎన్నికలలో కనిపించింది. చంద్రబాబు ప్రభుత్వంపై పెరిగిన అసంతృప్తితోపాటు, కార్యకర్తల దోపిడీని కూడా భరించలేక 2004లో టీడీపీని ఇంటికి పంపించారు. జన్మభూమి కమటీల వ్యవస్థను చంద్రబాబు తీసుకు వచ్చారు. మొదట అదేదో మంచి కార్యక్రమమేమో అనే భావన కల్పించారు. ఈనాడు వంటి ఎల్లో మీడియా అచ్చంగా అదే పనిలో ఉండేది. 2014-19 టర్మ్‌లో ప్రజలు దాని విశ్వరూపాన్ని చూడవలసి వచ్చింది. ప్రజలకు ఏ అవసరం ఉన్నా, ఏ స్కీమ్ కావాలన్నా ఆ కమిటీలలో ఉన్న టీడీపీ కార్యకర్తలకు లంచాలు ఇవ్వాల్సి వచ్చేదని చెబుతారు. చంద్రబాబు ఇచ్చిన రుణమాఫీ తదితర వందలాది హామీలుకు నోచుకోకపోవడం, టీడీపీ కార్యకర్తల ఆగడాలతో జనంలో విపరీతమైన వ్యతిరేకత ఏర్పడింది. అంతేకాదు. కార్యకర్తల ఆర్థిక పుష్టి కోసమే కొన్ని స్కీములను వాడుతుంటారన్న ఆరోపణలు ఉన్నాయి. ఉదాహరణకు చెట్టు-నీరు పధకం కింద సుమారు రూ.13 వేల కోట్లు టీడీపీ కార్యకర్తలు దోచేశారని అప్పట్లో బీజేపీ అధ్యక్షుడుగా ఉన్న సోము వీర్రాజు ఆరోపించారు. 2019లో అధికారంలోకి వచ్చిన జగన్ ప్రభుత్వం విజిలెన్స్ విచారణ చేసి పలువురిపై కేసులు పెట్టడం, బిల్లులు నిలుపుదల చేసింది. ఈసారి అధికారంలోకి వచ్చాక వారి బిల్లలుకు ఈ మధ్యే రూ.900 కోట్లు విడుదల చేసేయడమే కాకుండా, కేసులు కూడా ఎత్తేవేయాలని నిర్ణయించినట్లు సమాచారం. ఆచరణ సాధ్యం కాని హామీలు ఇవ్వడం, నానా పాట్లు పడి ప్రధాని నరేంద్ర మోదీని ప్రసన్నం చేసుకోవడం, పవన్ కల్యాణ్ ద్వారా ఒక సామాజికవర్గ ఓట్లుకు గాలమేసే ప్రయత్నం చేయడం.. ఈవీఎంల ప్రభావం తదితర కారణాలతో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి 2024లో అధికారంలోకి వచ్చింది. మళ్లీ యథా ప్రకారం ఆయన పాత పాట మొదలు పెట్టారు. లోకేష్ రెడ్ బుక్ పేరుతో వైఎస్సార్సీపీ కార్యకర్తలను, హామీల అమలును ప్రశ్నించే సోషల్ మీడియా వారిని వేధిస్తుండడం ఒక సమస్యగా ఉంటే, ఇంకోవైపు చంద్రబాబు అసలు వైఎస్సార్సీపీ వారికి ఏ పని చేయవద్దని చెబుతున్నారు. ఇంతలా రాజ్యాంగ ఉల్లంఘనకు పాల్పడుతున్న ప్రభుత్వం దేశ చరిత్రలో మరొకటి ఉండకపోవచ్చు. అయినా వివిధ వ్యవస్థలను మేనేజ్ చేయడంలో సిద్దహస్తుడుగా పేరొందిన చంద్రబాబు జోలికి ఎవరు వెళ్లినా ఏమీ కాదనే ధైర్యం టీడీపీలో ఉందని చెబుతారు. ఈ నేపథ్యంలో యథేచ్ఛగా కార్యకర్తల అడ్డగోలు దోపిడీకి పచ్చజెండా ఊపారన్న భావన ఉంది. ఇప్పటికే ఇసుక దందాతో లక్షల రూపాయలు ఆర్జిస్తున్నారు. మద్యం షాపులన్నీ తన వారికే కట్టబెట్టారు. జగన్ టైమ్ లో ఆయన వీటిని ప్రభుత్వపరం చేసి ఆదాయం పెంచడానికి ప్రయత్నించారు. దాంతో కార్యకర్తలకు పెద్దగా ఆదాయ వనరు లేకుండా పోయిందని భావిస్తారు. అలాగే జగన్ సర్కార్ వలంటీర్ల వ్యవస్థ ద్వారా పార్టీలకు అతీతంగా స్కీములు, వివిధ సేవలను అందించడంతో కార్యకర్తలు, వైసీపీ నేతలకు పెద్దగా పని లేకుండా పోయింది. వలంటీర్ తెలిస్తే చాలు..వైసీపీ వారితో పని లేదన్నట్లుగా పరిస్థితి ఏర్పడింది. పైగా టీడీపీ వారికి కూడా అన్ని సదుపాయాలు సమకూరాయి. చంద్రబాబేమో కార్యకర్తల ఆర్జనకు అన్ని అవకాశాలు కల్పించి, ఆ తర్వాత వారితో ఎన్నికలలో ఖర్చు పెట్టించే వ్యూహంతో పని చేయిస్తుంటారని చెబుతారు. అంటే టీడీపీని గెలిపిస్తే, పెత్తనంతోపాటు తాము ఇష్టారాజ్యంగా సంపాదించుకోవచ్చనే ధైర్యాన్ని వారికి కల్పించారన్నమాట. టీడీపీ విజయానికి కార్యకర్తల దోపిడీ తోడ్పడదని పలుమార్లు రుజువైంది. టీడీపీ కార్యకర్తల వేధింపులు, ధనార్జనను భరించలేక ప్రజలంతా ఒక్కటై టీడీపీని పలుమార్లు ఓడించారు. ప్రస్తుతం కూడా రెడ్ బుక్ పేరుతో పోలీసులతో వైఎస్సార్సీపీ వారిని వేధిస్తుంటే, మరో వైపు టీడీపీ కార్యకర్తల దౌర్జన్యాలు, అరాచకాలు, అడ్డగోలు సంపాదనకు అదుపు, ఆపు లేకుండా పోయింది. ఈ దశలో ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబే వారి అవినీతికి లైసెన్స్ ఇచ్చేసినట్లు, వైసీపీ వారిని వేధించండని పిలుపు ఇచ్చినట్లు మాట్లాడితే జనం వారికి గుణపాఠం చెప్పకుండా ఉంటారా?:::కొమ్మినేని శ్రీనివాస రావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత. -
ఓటమిని ఒప్పుకోండి.. గెలిచిన వ్యక్తి కూటమి సభ్యుడా?: అమర్నాథ్
సాక్షి, విశాఖ: ఏపీలో ఎమ్మెల్సీ ఫలితాల తర్వాత మాట మార్చడానికి కూటమి నేతలకు సిగ్గులేదా అని ఎద్దేవా చేశారు మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్. రాష్ట్రంలో ఉద్యోగుల కడుపు మంటకు నిన్నటి ఎన్నికల ఫలితాలే నిదర్శనమని తెలిపారు. ఓటమిని హుందాగా ఒప్పుకోండి. ఎవరు గెలిస్తే వారే మా అభ్యర్థి అని చెప్పడం ఎంత దారుణం అంటూ ఘాటు విమర్శలు చేశారు.మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ విశాఖలో మీడియాతో మాట్లాడుతూ.. ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాల తరువాత టీడీపీ మంత్రులు, నేతల ప్రకటనలు చూసి ఆశ్చర్యం వేసింది. రఘు వర్మ ఓటమి తరువాత మాకు సంబంధం లేదని అచ్చెన్నాయుడు చెబుతున్నారు. కూటమి నేతలకు మాట మార్చడానికి సిగ్గు లేదా?. ప్రభుత్వ పని తీరుకు ఎమ్మెల్సీ ఎన్నిక ఫలితం నిదర్శనం. విద్యాశాఖకు మంత్రిగా సీఎం కుమారుడు లోకేష్ ఉన్నారు. ఉద్యోగులకు పీఆర్సీ ఇస్తామని మోసం చేశారు. ఏనాడు జీతాలు సరిగా ఇవ్వలేదు.ఉద్యోగుల కడుపు మంటకు నిన్నటి ఫలితాలు నిదర్శనం. రిగ్గింగ్‌కు పాల్పడి పట్టభద్రుల ఎన్నికల్లో విజయం సాధించారు. ఓటమిని హుందాగా ఒప్పుకోండి. ఎవరు గెలిస్తే వారే మా అభ్యర్థి అని చెప్పడం ఎంత దారుణం. కూటమి తరపున మా అభ్యర్థి రఘు వర్మ అని అనేక సార్లు కూటమి నేతలు చెప్పారు. ఎన్నికల్లో ఎప్పుడూ శ్రీనివాసుల నాయుడు తమ అభ్యర్థి అని కూటమి నేతలు ప్రకటించలేదు. శ్రీనివాసుల నాయుడు కూడా కూటమి తనకు మద్దతు ప్రకటించలేదని స్పష్టం చేశారు. బాబాయి ఏమో.. శ్రీనివాసుల నాయుడు అంటున్నారు.. అబ్బాయి ఏమో.. రఘు వర్మ అంటున్నారు. అచ్చెన్నాయుడు, రామ్మోహన్ నాయుడు చెప్పిన దాంట్లో ఎవరి మాట నిజం. ఎవరికో పుట్టిన బిడ్డకు మీరు పేరు పెట్టవద్దు.కూటమి పాలనలో రిషికొండ బీచ్‌కు అన్యాయం జరిగింది. ప్రభుత్వ నిర్వాకం వల్ల బ్లూప్లాగ్ను బీచ్‌లో నుంచి తొలగించారు. ప్రభుత్వం చేతగాని చర్యలు వలన ఉత్తరాంధ్ర జిల్లాలు నష్టపోతున్నాయి. ఎమ్మెల్సీ ఎన్నికలకు వైఎస్సార్సీపీ దూరంగా ఉంది అని చెప్పుకొచ్చారు. -
AP Assembly: పోలవరంపై చర్చ.. టీడీపీ నేతల ఓవరాక్షన్
సాక్షి, అమరావతి: ఏపీ అసెంబ్లీ సమావేశాలు కొనసాగుతున్నాయి. ఈరోజు సమావేశాల్లో భాగంగా శాసనమండలిలో పోలవరంపై చర్చ జరిగింది. పోలవరం ఎత్తును తగ్గిస్తున్నారా? లేదా? అని శాసనమండలి విపక్ష నేత బొత్స సత్యనారాయణ ప్రశ్నించారు.మండలిలో బొత్స సత్యనారాయణ మాట్లాడుతూ.. ‘సభలో ప్రశ్నలకు సమాధానాలు చెప్పకుండా వాళ్ల(కూటమి నేతలు) గొప్పలు చెప్పుకుంటున్నారు. వాళ్లే సమాధానాలు చెప్తున్నారు. పోలవరం ఎత్తు తగ్గిస్తున్నారా లేదా? మాకు స్పష్టమైన సమాధానం చెప్పండి. మీరు చెప్పే సమాధానాల్నే మేము ప్రశ్నిస్తున్నాం. పోలవరం అంటే గుర్తుకు వచ్చేది వైఎస్ రాజశేఖర్ రెడ్డి. పోలవరం గురించి మాట్లాడాలంటే వైఎస్సార్సీపీనే మాట్లాడాలన్నారు. దీనికి సమాధానం చెప్పలేక టీడీపీ సభ్యులు ఎదురుదాడికి దిగారు. -
జగన్‌ది ప్రగతి రథం.. బాబుదే విధ్వంసం
సాక్షి, అమరావతి : టీడీపీ కూటమి ప్రభుత్వం ప్రతి సందర్భంలోను గత ప్రభుత్వ విధ్వంసం అంటూ ప్రజల మనస్సుల్లో కాలకూట విషం నింపే ప్రయత్నం చేస్తోందని.. ఎవరిది విధ్వంసం అనేది ప్రజలకు తెలుసునని వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీ కుంభ రవిబాబు నిప్పులు చెరిగారు. బడ్జెట్‌పై మండలిలో చర్చ సందర్భంగా సోమవారం ఆయన మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న దు్రష్పచారాలను తూర్పారబట్టారు. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం రాష్ట్రంలో సాధించిన ప్రగతిని అంకెలు, రుజువులతో సహా వివరించారు. రవిబాబు ఏమన్నారంటే.. అసెంబ్లీ సాక్షిగా ప్రభుత్వం అబద్ధాలు చెబుతోంది. ఎన్నికల ముందు చంద్రబాబు, కూటమి నేతలు కలిసి రాష్ట్ర ప్రజలకు సూపర్ సిక్స్‌తోపాటు అనేక హామీలు గుప్పించారు. అధికారంలోకి వచ్చాక చంద్రబాబు ఎప్పటిలాగే తన మేనిఫెస్టోను ఏ చెత్తబుట్టలో వేశారో ప్రజలు గమనిస్తున్నారు.విశాల తీర ప్రాంతాన్ని వినియోగించుకుని ఏడు పోర్టులు నిర్మించి రాష్ట్రానికి ఆదాయాన్ని పెంచే ప్రయత్నం చేయడం విధ్వంసమా? ఒకేసారి 17 మెడికల్ కాలేజీల నిర్మాణం చేపట్టి రాష్ట్ర ప్రజల ఆరోగ్యాన్ని కాపాడేందుకు విప్లవాత్మక చర్యలు తీసుకోవడమే విధ్వంసమా? ఇక కనీవినీ ఎరుగని రీతిలో ఏకంగా రూ.32వేల కోట్లు ఖర్చుపెట్టి ప్రాథమిక విద్యలో మౌలిక వసతులు కల్పించడం విధ్వంసమా? నవరత్నాల ద్వారా డీబీటీ పద్ధతిలో రూ.2.70 లక్షల కోట్లకు పైగా ప్రజల ఖాతాలకు నేరుగా జమ చేయడం విధ్వంసమా? ఆర్బీకేల ద్వారా రైతులకు విత్తనం నుంచి ధాన్యం సేకరణ వరకు సేవలు అందించడం విధ్వంసమా?ఏకంగా 31 లక్షలకు పైగా ఇళ్ల స్థలాలిచ్చి, ఇళ్లు నిర్మాణం చేపట్టడం విధ్వంసమా? 2.36 లక్షల మంది వలంటీర్ల ద్వారా ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజల గడప వద్దకే అందించడం విధ్వంసమా?.. లేక ఇచ్చిన హామీలు అమలు చేయకుండా బడ్జెట్లో కోతలు పెట్టిన చంద్రబాబు విధ్వంసకారుడా? ఎవరు విధ్వంసకారుడు? ఎవరు విధ్వంసం సృష్టిస్తున్నారో అనేది ప్రజలు ఇప్పటికే గుర్తించారు. సమీక్షలకు ఐదేసి గంటలు పడుతోందిటీడీపీ విప్ పంచుమర్తి అనురాధ మాట్లాడుతూ.. 2019 నుంచి 2024 వరకు వైఎస్ జగన్ ఆర్థిక అరాచకాన్ని సృష్టిస్తే.. అందులోంచి బయటకు రావడానికి చంద్రబాబు అధ్యక్షతన ఆర్థికమంత్రి పయ్యావుల కేశవ్ రాష్ట్ర వ్యవస్థను గాడిలో పెట్టేలా రూ.3,22,359 కోట్లతో బడ్జెట్ పెట్టారన్నారు. మూడు రాజధానుల పేరుతో అమరావతిని విధ్వంసం చేశారని ఆరోపించారు. గత ప్రభుత్వ అరాచకాలను సరిదిద్దడానికి చంద్రబాబు సమీక్షలు పెడితే ఐదేసి గంటలు పడుతోందన్నారు. -
అవి సీఎం పదవిలో ఉన్న వారు మాట్లాడే మాటలేనా?
సాక్షి, అమరావతి: రెండ్రోజుల క్రితం సీఎం చంద్రబాబు చిత్తూరు జిల్లా గంగాధరనెల్లూరు పర్యటనలో మాట్లాడిన మాటలు సోమవారం శాసనమండలిలో తీవ్ర చర్చకు దారితీశాయి. రాజ్యాంగబద్ధ పదవిలో ఉన్న ముఖ్యమంత్రి మాట్లాడిన మాటలు చూస్తే వ్యవస్థలే సిగ్గుపడాలి అంటూ శాసనమండలి ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ‘వైఎస్సార్సీపీ కార్యకర్తలకు చిన్న పనిచేసి పెట్టినా ఊరుకునేది లేదు. అది అధికారులైన సరే ప్రజాప్రతినిధులైన సరే. వైఎస్సార్సీపీ వాళ్లకు ప్రత్యక్షంగాగానీ, పరోక్షంగాగానీ ఏ ఉపకారమూ చెయ్యొద్దు.వాళ్లకు ఉపకారం చేస్తే పాముకు పాలుపోసినట్లే..’ అంటూ చంద్రబాబు వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. ‘మండలి’లో సోమవారం ప్రశ్నోత్తరాల కార్యక్రమంలో మంత్రి అచ్చెన్నాయుడు గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంపై చేసిన విమర్శలను తిప్పికొడుతున్న సమయంలో చంద్రబాబు వ్యాఖ్యలపై బొత్స ఘాటుగా స్పందించారు. ‘మా ప్రభుత్వంలో మా సీఎం ఎప్పుడు మా పార్టీ వాడికే సహాయం చేయమని ఎప్పుడూ చెప్పలేదు. కానీ, ఇప్పుడు రాజ్యాంగబద్ధ పదవిలో ఉన్న ముఖ్యమంత్రి మాట్లాడిన మాటలు చూస్తే ఈ వ్యవస్థ సిగ్గుపడాలి.లబ్ధిదారులకు పార్టీలు అంటగడతారా? అర్హులందరికీ ప్రతి పథకం దక్కేలా చూడాల్సిన బాధ్యత గలవారు.. రాజ్యాంగబద్ధంగా, రాగద్వేషాలకు, పార్టీలకతీతంగా, కార్యక్రమాలు చేస్తామని చెప్పాల్సిన వారు మాట్లాడే మాటలేనా ఇవి? పార్టీ మీటింగ్‌లో సీఎం మాటలు వైరల్ అవుతుంటే ముఖ్యమంత్రి కార్యాలయం వివరణ ఇవ్వాల్సిన అవసరంలేదా. మంత్రిని (అచ్చెన్నాయుడ్ని ఉద్దేశించి) కోరుతున్నా.. లబ్ధిదారుల విషయంలో రాజకీయాలు ఉండకూడదని చెప్పండి. ఇదేమన్నా మన సొంత ఆస్థా? ప్రజల డబ్బు, వారి మద్దతుతో ప్రభుత్వాలను నడుపుతున్నాం. సీఎం ఆ మాటలు ఎలా మాట్లాడతారు? గత ఐదేళ్లూ రాగద్వేషాలకు అతీతంగా, పార్టీలతో సంబంధంలేకుండా, అర్హులందరికీ సాయం చేశాం.అంతేగానీ.. పార్టీల గురించి ఆలోచించలేదు’ అంటూ బొత్స మాట్లాడారు. బొత్స వ్యాఖ్యలపై మంత్రి అచ్చెన్నాయుడు స్పందిస్తూ.. తమ ప్రభుత్వానికి పేదలే ప్రాతిపదిక అని చెప్పారు. అర్హులెవరికైనా పథకాలు అందకపోతే, అది తమ దృష్టికి తీసుకొస్తే వారికీ ఇస్తామన్నారు. బొత్స మళ్లీ జోక్యం చేసుకుంటూ.. మంత్రి అచ్చెన్నాయుడు చెప్పిన మాటలు వారి మాటలా? లేక పార్టీ తరఫున లేదా సీఎం తరఫున మాట్లాడుతున్నారా స్పష్టం చేయాలన్నారు.దీనిపై అచ్చెన్నాయుడు మళ్లీ వివరణ ఇస్తూ.. తాను చెప్పింది అచ్చెన్నాయుడుగా కాదు.. టీడీపీ తరఫున కాదు.. ఎన్డీయే ప్రభుత్వం తరఫున తెలియజేస్తున్నా అని చెప్పగా బొత్స మళ్లీ స్పందిస్తూ.. అయితే, సీఎం మాటలు అబద్ధమా అని ప్రశ్నించారు. ఇంతలో మండలి చైర్మన్ మరో మంత్రి పార్థసారథికి అవకాశం ఇవ్వడంతో ఈ అంశానికి అక్కడితో బ్రేక్ పడింది. అనంతరం.. మీడియా పాయింట్ వద్ద కూడా బొత్స మాట్లాడారు.అమరావతిపై ఒక విధానం లేదుఅమరావతి రాజధాని విషయంలో టీడీపీ కూటమి ప్రభుత్వానికి ఒక విధానమంటూ లేదని, 2014–19 మధ్య ఇదే టీడీపీ హయాంలో రాజధాని నిర్మాణానికి రూ.లక్ష కోట్లకు పైగా అవుతుందని చెప్పి కేవలం రూ.6వేల కోట్లే ఖర్చుచేసిందని.. పైగా అవి తాత్కాలిక భవనాలని చెప్పారని, ఇప్పుడు శాశ్వత భవనాలంటూ టెండర్లు పిలిచారని శాసనమండలిలో వైఎస్సార్సీపీ పక్ష నేత బొత్స సత్యనారాయణ మండిపడ్డారు.బడ్జెట్‌పై చర్చ సందర్భంగా సోమవారం ‘మండలి’లో టీడీపీ విప్ పంచుమర్తి అనురాధ మాట్లాడుతూ.. గత ప్రభుత్వంలో బొత్స మంత్రిగా ఉన్నప్పుడు అమరావతిని స్మశానం అన్నారంటూ విమర్శించారు. దీనిపై బొత్స స్పందిస్తూ.. తాను మంత్రిగా ఉన్నప్పుడు రాజధానిని చూడటానికి రావాలని కొందరు కోరడంతో.. అమరావతి నిర్మాణానికి నాటి టీడీపీ ప్రభుత్వం రూ.లక్ష కోట్లకు పైగా ఖర్చవుతుందని చెప్పి కేవలం రూ.6వేల కోట్లతో భవనాలు కట్టారని, అంతకుమించి అక్కడ చూడడానికి ఏం అభివృద్ధి జరిగిందని మాత్రమే అన్నానని బదులిచ్చారు.వాస్తవానికి.. అమరావతిలో కట్టింది తాత్కాలిక భవనాలేనని అప్పటి టీడీపీ ప్రభుత్వమే స్వయంగా ప్రకటించిందని, పైగా దానికి కూడా ఏకంగా అడుగుకి ఏకంగా రూ.10,500 వెచ్చించారన్నారు. ఇప్పుడు మళ్లీ శాశ్వత భవనాల నిర్మాణానికి టెండర్లు పిలిచారని, ఇది చిన్న ఇల్లు, పెద్ద ఇల్లు తంతు కాదు కదా అని బొత్స ఎద్దేవా చేశారు. అవి తాత్కాలికమని చెప్పలేదుమంత్రి అచ్చెన్నాయుడు జోక్యం చేసుకుని.. ఇవి తాత్కాలిక భవనాలు అని తామెక్కడా చెప్పలేదని, కొత్తగా శాశ్వత భవనాలు కట్టేవరకు వీటిని వాడుకుంటామని మాత్రమే చెప్పామన్నారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వం వచ్చాక అమరావతిని వదిలేశారని, విశాఖ రుషికొండ నిర్మాణాల్లో ఎంతో దుర్వినియోగం జరిగిందని ఆరోపించారు. రుషికొండ కాంట్రాక్టర్‌కు వేరే పనులకు సంబంధించిన బిల్లులు ఇచ్చామన్నారు.ఈ వ్యాఖ్యలపై బొత్స స్పందిస్తూ.. అప్పట్లో మూడు రాజధానులనేది తమ ప్రభుత్వ విధానంగా తీసుకున్నామని.. శాసన రాజధానిగా అమరావతిని అభివృద్ధి చేస్తామని చెప్పామన్నారు. వాస్తవాలను మరుగుపరిచి మంత్రి అచ్చెన్న మాట్లాడుతున్నారని విమర్శించారు. రుషికొండలో నిర్మించిన భవనాలు ఎవరివని.. ప్రభుత్వానికి ఆ భవనాలను వాడుకోవడం చేతగాక విమర్శలు ఎందుకని బొత్స ప్రశ్నించారు.రుషికొండలో టూరిజానికి చెందిన పాత భవనాల స్థానంలో కొత్త భవనాలు నిర్మించామని, అందులో అవినీతి, అక్రమాలు అంటూ గగ్గోలు పెట్టిన ఇప్పుడా కాంట్రాక్టర్‌కు బిల్లులు ఎలా చెల్లించారని కూడా ఆయన నిలదీశారు. ఇదే విషయం వారి గెజిట్ వచ్చిందని.. అంటే రుషికొండ నిర్మాణాలు సక్రమమే కదా అని అన్నారు. ఏ విచారణకైనా తాము సిద్ధమని, తప్పు చేయనప్పుడు ఎందుకు భయపడతామని బొత్స ఘాటుగా బదులిచ్చారు. -
గెలిచినోడే... మా వాడు!
శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం ఉపాధ్యాయ, అధ్యాపక ఆచార్య మిత్రులకు విజ్ఞప్తి అంటూ.. తెలుగుదేశం, జనసేన బలపరిచిన ఏపీటీఎఫ్ అభ్యర్థి పాకలపాటి రఘువర్మను గెలిపించాలంటూ ఈ నెల 26వ తేదీన అంటే పోలింగ్‌కు ముందు రోజున ఈనాడు దినపత్రిక మొదటి పేజీలో చంద్రబాబు, పవన్‌తో పాటు లోకేశ్, పల్లా శ్రీనివాసరావు ఫోటోలు... ఆ పార్టీల గుర్తులతో భారీ ప్రకటనలు!!పాకలపాటిని గెలిపించండి అంటూ విశాఖ పార్లమెంటు టీడీపీ అధ్యక్షుడు గండి బాబ్జీ, ఎమ్మెల్సీ చిరంజీవిలతో కలిసి టీడీపీ ఎమ్మెల్యే గంటా స్పష్టంగా ఆ పార్టీ నగర కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో మాట్లాడారు.‘రఘువర్మకే కూటమి మద్దతు’ అని విశాఖ టీడీపీ కార్యాలయంలో ఫిబ్రవరి 19వ తేదీన నిర్వహించిన సమావేశంలో ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు స్వయంగా చెప్పారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, విద్యాశాఖ మంత్రి లోకేశ్ ఆదేశాలతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన స్పష్టంగా ప్రకటించారు. సమావేశంలో ఎంపీ భరత్, ఎమ్మెల్యే వెలగపూడి, ఎమ్మెల్సీ చిరంజీవి కూడా పాల్గొన్నారు.ఇవే కాదు.. ఎమ్మెల్సీ ఎన్నికల నోటిఫికేషన్ వెలువడిన తర్వాత అటు టీడీపీ, ఇటు జనసేన నేతలు అధికారికంగా రఘువర్మకు మద్దతు ఇస్తున్నట్టు చెప్పటమే కాకుండా ప్రత్యక్షంగా ప్రచారంలో పాల్గొన్నారు. నియోజకవర్గాల వారీగా ఎమ్మెల్యేలపై ఒత్తిడి తెచ్చి సమావేశాలు ఏర్పాటు చేశారు. తీరా ఎన్నికల ఫలితాల తర్వాత ఆ పార్టీ మంత్రి అచ్చెన్న కొత్త రాగం అందుకున్నారు. ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో తాము రఘువర్మ, గాదె శ్రీనివాసులునాయుడుకు మద్దతు ఇచ్చామన్నట్టు మాట్లాడారు. ‘‘మూడు జిల్లాల కార్యకర్తలందరికీ టెలీకాన్ఫరెన్స్ నిర్వహించి.... స్పష్టంగా మొదటి ప్రాధాన్యత, రెండో ప్రాధాన్యత ఓట్లు శ్రీనివాసులు నాయుడుకు వేయమని చెప్పారు. ఎవరు గెలిచినా మన వాళ్లేనని అన్నారు. ఇప్పుడు టీచర్ ఎమ్మెల్సీలో టీడీపీ ఓడిపోయిందని తప్పుడు ప్రచారం చేస్తున్నారు’ అంటూ గెలుపును తమ ఖాతాలో వేసుకునేందుకు అచ్చెన్న ప్రయత్నం మొదలు పెట్టారు.బుట్టలో వేసుకునే యత్నం...!వాస్తవానికి ఎన్నికల కౌంటింగ్ ప్రారంభం నుంచీ గాదె శ్రీనివాసులు నాయుడుకే మెజార్టీ ఓట్లు పోలయ్యాయి. ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూటమి పార్టీలకు ఉపాధ్యాయులు బుద్ది చెప్పారన్న అభిప్రాయం రాష్ట్రవ్యాప్తంగా స్పష్టంగా వ్యక్తమవుతోంది. అటు సోషల్ మీడియాలోనూ, ఇటు సామాజిక మాధ్యమాల్లోనూ తెలుగుదేశం, జనసేన పార్టీల తీరును ప్రజలు గట్టిగా వ్యతిరేకించారనే విషయం సర్వత్రా చర్చనీయాంశమయ్యింది. ఈ నేపథ్యంలో దీనిని డైవర్ట్ చేసే ప్రణాళికలు వేసినట్టు తెలుస్తోంది. ఇందులో భాగంగా గాదె గెలుపు దిశగా వెళుతున్న సమయంలో ... నేరుగా ముఖ్యమంత్రి ఫోన్లో మాట్లాడినట్టు తెలుస్తోంది. అక్కడ విధులు నిర్వర్తిస్తున్న ఒక పోలీసు అధికారి ఫోన్ ద్వారా గాదెతో మాట్లాడినట్టు చెబుతున్నారు. రఘువర్మ విజయానికి పనిచేయాలని పిలుపునిస్తున్న మంత్రి శ్రీనివాస్, టీడీపీ ఎంపీ అప్పలనాయుడు, టీడీపీ ఎమ్మెల్యే అదితి తదితరులు రఘువర్మకు అధికారికంగా మద్దతు ఇచ్చినప్పటికీ... మీకు రెండో ప్రాధాన్యత ఓటు వేయమని ఆదేశించామని... గాదె కూడా మనవాడే అని పార్టీ నేతలతో తాను చెప్పినట్టు సీఎం చంద్రబాబు వివరించే ప్రయత్నం చేసినట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో మంత్రి అచ్చెన్న గాదె తమ వాడేనని.... గెలిచిన తర్వాత ఆయన ఏం మాట్లాడతారో చూడాలంటూ వ్యాఖ్యలు చేసినట్లు చెబుతున్నారు. -
బాబు ప్రజా కంటక పాలనకు టీచర్ల చెంపదెబ్బ..‘మాస్టర్’ స్ట్రోక్!
సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం: సూపర్ సిక్స్ హామీలను ఎగ్గొట్టి.. పది నెలలుగా ప్రజా కంటక పాలనతో ప్రజాస్వామ్యాన్ని కాలరాస్తున్న టీడీపీ, జనసేన కూటమి పార్టీలకు ఏడాదిలోపే చావుదెబ్బ తగిలింది! అధికార మదంతో విర్రవీగుతున్న కూటమి నేతలకు విజ్ఞులైన ఉపాధ్యాయులు బెత్తంతో బడిత పూజ చేశారు! ప్రజాస్వామ్య విలువలను చాటిచెబుతూ.. కూటమి మోసాలను తిప్పికొడుతూ గుణపాఠం లాంటి తీర్పు ఇచ్చారు. పట్టుమని పది నెలల్లోనే టీడీపీ కూటమి సర్కారుపై వెల్లువెత్తుతున్న ప్రజా వ్యతిరేకతకు ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలు అద్దం పట్టాయి. సీఎం చంద్రబాబు అనుసరిస్తున్న రెడ్‌బుక్ పాలన, ప్రజా కంటక విధానాలకు ఉపాధ్యాయులు చెంపపెట్టు లాంటి తీర్పు ఇచ్చారు. మొత్తం యంత్రాంగాన్ని మోహరించి అధికార బలాన్ని ప్రయోగించినా కూటమి సర్కారు పాచికలు పారలేదు. ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూటమి పార్టీలు అధికారికంగా తమ అభ్యర్ధిగా ప్రకటించిన రఘువర్మ పరాజయం పాలయ్యారు. ప్రతి నియోజకవర్గంలో అధికార పార్టీ తన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలతో బలాన్ని ప్రయోగించినా.. ఓటుకు నోట్లు ఎరవేసినా ఈ సర్కారు పట్ల తమ వ్యతిరేకతను ఉపాధ్యాయులు స్పష్టంగా ఓటు రూపంలో వ్యక్తం చేశారు. ఉత్తరాంధ్ర జిల్లాల టీచర్లు ఎన్నికల్లో పాల్గొన్న తీరు, ఫలితం.. ఈ ప్రభుత్వం పట్ల ప్రజల్లో ఎంత వ్యతిరేకత నెలకొందో స్పష్టం చేస్తున్నాయి. ఎన్నికల్లో హామీలిచ్చి ఓట్లేయించుకుని అధికారంలోకి వచ్చాక చంద్రబాబు ప్రభుత్వం అన్ని వర్గాలను మోసగించిందని మండిపడుతున్నారు. కూటమి అభ్యర్థి రఘువర్మ గెలుపు కోసం కృషి చేయాలంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు వెబెక్స్ ద్వారా స్వయంగా ఆదేశాలు జారీ చేస్తూ వచ్చినా భంగపాటు తప్పలేదు. ఉపాధ్యాయ సంఘాలన్నీ కలిసికట్టుగా తమ అభ్యర్ధిగా ప్రకటించిన గాదె శ్రీనివాసులు నాయుడును గెలిపించి కూటమి సర్కారుపై తమ ఆగ్రహాన్ని చాటుకున్నాయి. తమ ఓటు కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకమని స్పష్టంగా తేల్చి చెప్పారు. కాగా తమ అభ్యర్థి ఓడిపోవడంతో కూటమి నేతలు ఒక్కసారిగా ప్లేటు ఫిరాయించారు. పోలింగ్ రోజు వరకూ తమ అభ్యర్థి రఘువర్మను గెలిపించాలంటూ ప్రచారం నిర్వహించి అనుకూల మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం చేసిన టీడీపీ నేతలు ఆయన ఓడిపోవడంతో.. గెలిచిన గాదె శ్రీనివాసులు కూడా తమవారేనంటూ కొత్త పల్లవి అందుకోవడం టీడీపీ దిగజారుడు రాజకీయాలకు పరాకాష్ట. ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆదేశాలతోనే రఘువర్మను తమ అభ్యర్థిగా ప్రకటిస్తున్నట్లు టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు స్వయంగా ప్రకటించారు. ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో గట్టి షాక్ తగలడంతో సీఎం చంద్రబాబు నేరుగా రంగంలోకి దిగారు. దీని నుంచి బయటపడేందుకు పోలీస్ కమిషనర్ ఫోన్ ద్వారా గెలిచిన అభ్యర్థి గాదెతో ఆయన స్వయంగా ఫోన్లో మాట్లాడారంటే టీడీపీని పరాజయం ఏ స్థాయిలో వణికించిందో అర్థం అవుతోంది. సజావుగా జరిగి ఉంటే.. ఆ రెండు చోట్ల కూడా! కృష్ణా, గుంటూరు జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో అధికారపార్టీ నేతలు భారీగా నగదు పంపిణీతో పాటు పీడీఎఫ్ అభ్యర్థి కుటుంబ సభ్యులు, ఏజెంట్లపై దాడులకు దిగి బీభత్సం సృష్టించారు. దొంగ ఓట్లను నమోదు చేసి... ఏకంగా రిగ్గింగుకు కూడా తెగబడ్డారు. స్వయంగా అధికార పార్టీ నేతలే విచ్చలవిడిగా డబ్బులను పంపిణీ చేశారు. ఎన్నికలు సజావుగా జరిగి ఉంటే ఇక్కడ కూడా అధికార కూటమికి కచ్చితంగా ఓటమి ఎదురయ్యేదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. రెండో స్థానం కోసం పోటాపోటీ... ఉత్తరాంధ్ర ఎమ్మెల్సీ ఎన్నికల్లో పీఆర్టీయూ నుంచి బరిలో నిలిచిన గాదె శ్రీనివాసులు నాయుడు ప్రతి రౌండ్లోనూ స్పష్టమైన ఆధిక్యతను కనబరిచారు. ఏ రౌండ్లో కూడా కూటమి అభ్యర్థి రఘువర్మకు మెజార్టీ రాకపోవటాన్ని గమనిస్తే టీడీపీ సర్కారుపై ఉపాధ్యాయుల్లో ఎంత వ్యతిరేకత ఉందో తేటతెల్లమవుతోంది. పైగా పీడీఎఫ్ నుంచి బరిలో నిలిచిన విజయగౌరి నుంచి రెండో స్థానం కోసం కొన్ని రౌండ్లల్లో రఘువర్మ పోటీని ఎదుర్కొన్నారు. ఒక దశలో పీడీఎఫ్ అభ్యర్థికి, కూటమి అభ్యర్థి రఘువర్మకు మధ్య పెద్దగా తేడా లేకపోవడంతో మూడో స్థానానికి పడిపోతారా? అనే ఆందోళన కూటమి నేతల్లో గుబులు రేపింది. ప్రధానంగా అధికార టీడీపీ, జనసేన పట్ల తమ వ్యతిరేకతను ఉపాధ్యాయులు ఓట్ల ద్వారా చాటిచెప్పారు. రాజకీయ జోక్యంతో...! టీడీపీ, జనసేన అధికారికంగా రఘువర్మను తమ అభ్యర్థిగా ప్రకటించాయి. గెలుపు కోసం అధికారపార్టీ ఎమ్మెల్యేలు విశ్వ ప్రయత్నాలు చేశారు. కూటమి పార్టీల తరపున బరిలో నిలిచిన ఉపాధ్యాయ ఎమ్మెల్సీని గెలిపించాలంటూ టీచర్లపై ఒత్తిళ్లు తెచ్చారు. ప్రధానంగా ప్రైవేటు టీచర్లను బెదిరించే ధోరణిలో వ్యవహరించారు. ఎంత చేసినా ప్రజా వ్యతిరేకతను తప్పించుకోలేకపోయారు. అధికార పార్టీకి చెందిన విద్యాలయాల్లో పని చేసే ప్రైవేట్ టీచర్లు సైతం కూటమి అభ్యర్ధికి వ్యతిరేకంగా ఓటేశారంటే ఈ ప్రభుత్వంపై ఎంత వ్యతిరేకత నెలకొందో ఊహించవచ్చు. కూటమికి చెంపదెబ్బ: బొత్ససాక్షి, విశాఖపట్నం: ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలు కూటమి ప్రభుత్వానికి చెంప దెబ్బ లాంటివని శాసనమండలిలో విపక్షనేత బొత్స సత్యన్నారాయణ వ్యాఖ్యానించారు. ఎన్నికల్లో అబద్ధాలతో అధికారంలోకి వచ్చిన టీడీపీ, జనసేన కూటమి పార్టీలకు ఏడాదిలోపే చావుదెబ్బ తగిలిందన్నారు. అధికారం ఉందనే అహంకారంతో అరాచకాలు చేస్తున్న టీడీపీ, జనసేన పార్టీలకు విజ్ఞులైన ఉత్తరాంధ్ర ఉపాధ్యాయులు బెత్తంతో కొట్టి మరీ గట్టిగా గుణపాఠం చెప్పారన్నారు. ఫలితాలపై సోమవారం ఆయన ‘సాక్షి’తో మాట్లాడారు. ‘ఈ ఎన్నికల ద్వారా ఉపాధ్యాయులు ప్రజాస్వామ్య విలువలను మరోసారి చాటిచెప్పారు. కూటమి ప్రభుత్వ మోసాలను తిప్పికొడుతూ గట్టి తీర్పు ఇచ్చారు. ఉత్తరాంధ్ర జిల్లాల టీచర్లు ఎన్నికల్లో పాల్గొన్న తీరు, వచ్చిన ఫలితం.. ఈ ప్రభుత్వం పట్ల ప్రజల్లో ఎంతటి వ్యతిరేకత ఉందో తేటతెల్లం చేస్తున్నాయి. ఎన్నికల్లో హామీలిచ్చి ఓట్లేయించుకుని అధికారంలోకి వచ్చాక చంద్రబాబు ప్రభుత్వం అన్ని వర్గాలను మోసగించింది. ఉద్యోగులకు ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా దగా చేసింది. ఇప్పటికైనా ఎన్నికల హామీలను అమలు చేయాలి. లేదంటే స్థానిక ఎన్నికల నుంచి సార్వత్రిక ఎన్నికల వరకూ కూటమి ప్రభుత్వానికి గుణపాఠం చెప్పడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు’ అని బొత్స పేర్కొన్నారు.విశాఖ ఏయూలోని కౌంటింగ్ కేంద్రంలో బ్యాలెట్ పత్రాల్ని లెక్కిస్తున్న పోలింగ్ సిబ్బంది అవునా.. అచ్చెన్న మద్దతిచ్చారా! : గాదెతమ ఫొటోలు పెట్టుకొని గెలిచారని మంత్రి అచ్చెన్నాయుడు చేసిన వ్యాఖ్యలపై స్పందించాలని మీడియా ప్రతినిధులు గాదె శ్రీనివాసులు నాయుడును కోరగా.. అవునా..! అచ్చెన్న మద్దతిచ్చారా.. దానిపై నాకు అవగాహన లేదంటూ బదులిచ్చారు. ‘ఫొటోల వల్ల కాదు.. ఉపాధ్యాయ సంఘాల మద్దతుతో మాత్రమే గెలిచా’ అని పేర్కొన్నారు. కూటమికి కౌంట్‌డౌన్ : ధర్మాన కృష్ణదాస్నరసన్నపేట: ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ కూటమి అభ్యర్ధికి ఉపాధ్యాయులు తగిన బుద్ధి చెప్పారని, కూటమికి కౌంట్‌డౌన్ మొదలైందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు, మాజీ డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్ పేర్కొన్నారు. విజయం సాధించిన గాదె శ్రీనివాసులు నాయుడికి అభినందనలు తెలిపారు. కూటమి బలపరిచిన అభ్యర్థి ఓటమికి కారణం ప్రభుత్వం పట్ల వ్యతిరేకతేనన్నారు. అధికారం కోసం అలవికాని హామీలు ఇచ్చి కూటమి నాయకులు ప్రజల్ని మభ్య పెట్టారన్నారు. తొమ్మిది నెలల్లోనే కూటమి పాలనపై అన్ని వర్గాల ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత కనిపిస్తోందన్నారు. ప్రభుత్వ వ్యతిరేకతకు నిదర్శనం ఉత్తరాంధ్ర ఫలితంఉత్తరాంధ్ర ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూటమి బలపరిచిన అభ్యర్థిని ఘోరంగా ఓడించి తొమ్మిది నెలల ప్రభుత్వ పాలనపై ఉపాధ్యాయులు ఎంత వ్యతిరేకంగా ఉన్నారో చూపించారని వైఎస్సార్ టీచర్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శి అశోక్ కుమార్ రెడ్డి, గడ్డం సు«దీర్ ఓ ప్రకటనలో పేర్కొన్నారు. ఆదర్శ పాఠశాలల ఏర్పాటుపై ఒత్తిడి తగదు ఆదర్శ పాఠశాలల ఏర్పాటుకు గ్రామస్తులను ఒప్పించాలని విద్యాశాఖ ఉన్నతాధికారులు ఉపాధ్యాయులపై ఒత్తిడి చేయొద్దని వైఎస్సార్ టీచర్స్ అసోసియేషన్ ఓ ప్రకటనలో విజ్ఞప్తి చేసింది.ఆధిక్యంలో ఆలపాటిగుంటూరు ఎడ్యుకేషన్: ఉమ్మడి కృష్ణా – గుంటూరు జిల్లా పట్టభద్రుల నియోజకవర్గ ఎమ్మెల్సీ ఎన్నికల్లో అర్ధరాత్రి 12 గంటలకు ఐదో రౌండు ఓట్ల లెక్కింపు పూర్తయ్యే సరికి టీడీపీ అభ్యర్థి ఆలపాటి రాజేంద్రప్రసాద్ 47,872 ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు. మొత్తం పోలైన ఓట్లు 1,40,297 కాగా చెల్లని ఓట్లు 14,888 ఉన్నాయి. పోలైన ఓట్లలో ఆలపాటి రాజేంద్రప్రసాద్‌కు 84,595, పీడీఎఫ్ అభ్యర్థి కేఎస్ లక్ష్మణరావుకు 36,723 వచ్చాయి. కౌంటింగ్ ప్రక్రియ కొనసాగుతోంది. ఉభయ గోదావరి తొలిరౌండ్ ఫలితాల వెల్లడిసాక్షి ప్రతినిధి, ఏలూరు: ఉభయ గోదావరి జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియలో తొలి రౌండ్ పూర్తయింది. మొదటి రౌండులో కూటమి అభ్యర్థి పేరాబత్తుల రాజశేఖర్‌కు 16,520 ఓట్లు, స్వతంత్ర అభ్యర్థి దిడ్ల వీర రాఘవులుకు 5,815 ఓట్లు, జీవీ సుందర్‌కు 1,968 ఓట్లు వచ్చాయి. 2,416 చెల్లని ఓట్లుగా గుర్తించారు. ప్రతి రౌండ్‌కూ 28 వేల ఓట్ల చొప్పున 9 నుంచి 10 రౌండ్లలో ఓట్ల లెక్కింపు పూర్తయ్యేలా అధికారులు కౌంటింగ్‌లో మార్పులు చేశారు. ఇకనైనా సమస్యలపై దృష్టి సారించాలి ఉపాధ్యాయుల సమస్యలపై ప్రభుత్వం వెంటనే దృష్టి సారించాలి. గత తొమ్మిది నెలలుగా ఈ ప్రభుత్వ పాలనలో తమ సమస్యలు ఏవీ పరిష్కారం కాలేదన్న విషయాన్ని ఈ ఫలితం ద్వారా చాటారు. ఉపాధ్యాయుల సరెండర్ లీవ్స్, సీఎఫ్ఎంఎస్లో పెండింగ్‌లో ఉన్న బిల్లులను వెంటనే చెల్లించాలి. డీఏ బకాయిలను చెల్లించడంతో పాటు పీఆర్సీని వెంటనే ఏర్పాటు చేయాలి. – డాక్టర్ కరుణానిధి మూర్తి, రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్, పీఆర్టీయూపాలక పార్టీల ఓటమికి నిదర్శనం.. ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో తెలుగుదేశం, జనసేన పార్టీలు ఒక అభ్యర్ధికి మద్దతు ప్రకటించి ప్రచారం చేశాయి. అధికార పార్టీ నేతలు ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారంపై దృష్టి సారించకుండా అధికారాన్ని ఉపయోగించి ఎన్నికల్లో గెలిచేందుకు ప్రయత్నించారు. ఒకటో తేదీనే జీతాలు అని హామీ ఇచ్చినా ఆలస్యం అవుతున్నాయి. డీఏ బకాయిలు చెల్లించలేదు. పీఆర్సీ కమిటీని నియమించలేదు. బకాయిల విషయంలో స్పష్టత లేదు. ముఖ్యమంత్రి ఇప్పటివరకు ఒక్కసారి కూడా సమస్యల పరిష్కారం కోసం ఉపాధ్యాయ సంఘాలతో సమావేశాన్ని నిర్వహించలేదు. ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో గాదె శ్రీనివాసులు నాయుడు విజయం సాధించడం పాలక పార్టీల ఓటమికి నిదర్శనం. – హృదయరాజు, ఏపీటీఎఫ్ (1938) రాష్ట్ర అధ్యక్షుడుకూటమి పార్టీలు – ఉపాధ్యాయ సంఘాల మధ్య పోటీ.. రాజకీయ పార్టీల కూటమి.. ఉపాధ్యాయ సంఘాల మధ్య జరిగిన పోటీ ఇది. ఈ ఎన్నికల్లో ఉపాధ్యాయ సంఘాల కూటమి విజయం సాధించింది. ఉపాధ్యాయ సంఘాలు సమస్యలపై పోరాడి సాధించుకోవాలి. ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల విషయంలో రాజకీయ పార్టీలు జోక్యం చేసుకోవడం సరికాదు. ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో పార్టీలు అభ్యర్థి రఘువర్మకు మద్దతుగా నిలిచాయి. ఉపాధ్యాయ సంఘాలన్నీ కలిసి అభ్యర్థి గాదె శ్రీనివాసులు నాయుడును బరిలో నిలిపి గెలిపించుకున్నాయి. – పైడి రాజు, విశాఖ జిల్లా ప్రధాన కార్యదర్శి, ఎస్టీయూప్రభుత్వంపై సామ దాన భేద దండోపాయాలకు సిద్ధంఈవిజయం ఉత్తరాంధ్ర ఉపాధ్యాయులందరిదీ. నా గెలుపు కోసం మద్దతు ఇచ్చిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు. ప్రభుత్వ, ప్రైవేట్ ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారమే ధ్యేయంగా పనిచేస్తా. ఈ విజయంతో నాకు కీలక బాధ్యతలు అప్పగించారు. నా విజయానికి ఏ పార్టీతోనూ సంబంధం లేదు. ఉపాధ్యాయ సంఘాల మద్దతుతోనే నేను గెలుపొందా. నా గెలుపును రాజకీయాలతో ముడిపెట్టొద్దు. ఉపాధ్యాయుల రుణం తీర్చుకుంటా. నా పనితీరును బట్టి నన్ను గెలిపించారు. 2007 నుంచి ఉపాధ్యాయ ఎమ్మెల్సీగా రాజకీయాలకు అతీతంగానే పనిచేశా. ఉపాధ్యాయుల సమస్యలపై ప్రభుత్వంతో చర్చించి పరిష్కరిస్తా. అవసరమైతే ప్రభుత్వంపై సామ దాన బేధ దండోపాయాలకు సిద్ధంగా ఉన్నా. – గాదె శ్రీనివాసులునాయుడు, ఉత్తరాంధ్ర టీచర్స్ ఎమ్మెల్సీ విజేత -
కూటమి ప్రభుత్వానికి ప్రభుత్వ టీచర్లు బాగా బుద్ది చెప్పారు: బొత్స
సాక్షి, అమరావతి : ఉత్తరాంధ్ర టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికలలో కూటమి ప్రభుత్వానికి భారీ షాక్ తగిలింది. టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో పీఆర్టీయూ అభ్యర్థి శ్రీనివాసుల నాయుడు గెలుపొందారు. కూటమి అభ్యర్థి పాకలపాటి రఘువర్మ ఓడిపోయారు.కూటమి ప్రభుత్వ ఓటమిపై వైఎస్సార్సీపీ సీనియర్ నేత, మండలిలో విపక్ష నేత బొత్స సత్యనారాయణ స్పందించారు.ఉత్తరాంధ్ర టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటమి టీడీపీ, జనసేన,బీజేపీ కూటమికి చెంపదెబ్బ. టీడీపీ,జనసేన కూటమి పార్టీలకు చావుదెబ్బ తగిలింది. ఎల్లవేళలా మోసం పనిచేయదని తేలిపోయింది. అధికారం ఉందనే అహంకారంతో అరాచకాలు చేస్తున్న టీడీపీ, జనసేన,బీజేపీ సహా కూటమి పార్టీలకు విజ్ఞులైన ఉత్తరాంధ్ర ఉపాధ్యాయులు గట్టి గుణపాఠం చెప్పారు. ప్రజాస్వామ్య విలువలను మరోసారి చాటిచెప్పారు.ఎన్నికల్లో హామీలిచ్చి ఓట్లేయించుకుని తీరా అధికారంలోకి వచ్చిన తర్వాత చంద్రబాబు నేతృత్వంలోని ప్రభుత్వం నిలువునా మోసం చేసింది. ఉద్యోగులకు ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా వారిని మోసం చేశారు. చంద్రబాబు చేసిన మోసాలను తిప్పికొడుతూ ఇవాళ గట్టి తీర్పు ఇచ్చారు. ఈ ఎన్నికల్లో ఉమ్మడి విజయనగరం, ఉమ్మడి శ్రీకాకుళం, ఉమ్మడి విశాఖపట్నం..మూడు జిల్లాల నుంచి టీచర్లు పాల్గొన్న తీరు, వచ్చిన ఫలితం.. ప్రభుత్వం పట్ల ప్రజల్లో ఎంతటి వ్యతిరేకత ఉందో తేటతెల్లం చేసింది’అని వ్యాఖ్యానించారు. -
ఓడిపోతే మా అభ్యర్థి కాదు.. గెలిస్తేనే మా అభ్యర్థి..!
విజయవాడ: టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ గట్టి షాక్ తగిలింది. ఉత్తరాంధ్ర టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం బలపరిచిన పాకలపాటు రఘువర్మ ఓడిపోయారు. రఘువర్మపై పీఆర్టీయూ అభ్యర్థి శ్రీనివాసుల నాయుడు గెలుపొందారు. అయితే తమ అభ్యర్థి ఓడిపోగానే టీడీపీ యూటర్న్ తీసుకుంది. అసలు తాము అక్కడ అభ్యర్థినే పెట్టలేదంటూ కొత్త పల్లవి అందుకుంది. ఇక శ్రీనివాసుల నాయుడు గెలుపును కూటమి ఖాతాలో వేసుకునే యత్నం చేస్తోంది టీడీపీ. తమ మద్దతుతోనే శ్రీనివాసుల నాయుడు గెలిచాడని మంత్రి అచ్చెన్నాయుడు వింత ప్రకటన చేశారు.ఓడిపోయిన రఘువర్మ తమ అధికారిక అభ్యర్థి కాదని కొత్త రాగంఅందుకుంది. ఎన్నికల ముందు రఘువర్మని తమ అభ్యర్థి అని ప్రకటించిన టీడీపీ, జనసేనలు.. ఓడిపోగానే మాట మార్చేశారు. కూటమి పార్టీల మద్దతు తోనే విజయం సాధించామని ప్రకటన చెయ్యాలని గాదె శ్రీనివాసులు నాయుడుపై అచ్చెన్ననాయుడు ఒత్తిడి తెస్తున్నారు. ఓడిపోతే తమ అభ్యర్థి కాదని, గెలిస్తేనే తమ అభ్యర్థిని చెప్పుకుంటున్న టీడీపీ వైఖరి చూసి జనం విస్తుపోతున్నారు.ప్రభుత్వంపై ప్రభుత్వ టీచర్ల వ్యతిరేకతఉత్తరాంధ్ర టీచర్ ఎన్నికల ఫలితాలతో 9 నెలలకే ప్రభుత్వంపై టీచర్ల వ్యతిరేకత సుస్పష్టమైంది. ప్రభుత్వంపై ఉపాధ్యాయులు తిరుగుబాటు ప్రకటించారు. అందుకు ఊతం ఇచ్చేలా ఉత్తరాంధ్ర టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ప్రభుత్వ టీచర్లు కూటమికి ఓటమి రుచి చూపించారు. టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూటమి అభ్యర్థి పాకలపాటి రఘు వర్మను ఓడించారు. పీఆర్టీయూ అభ్యర్థి గాదె శ్రీనివాసులు నాయుడిని గెలిపించారు. చంద్రబాబుకు ఓటమి రుచి చూపించిన ప్రభుత్వ టీచర్లురఘువర్మను కూటమి అభ్యర్థిగా టీడీపీ, జనసేన,బీజేపీలు పోటీకి పెట్టాయి. తొలి ప్రాధాన్యత, రెండో ప్రాధాన్యతలోనూ కూటమి అభ్యర్థి వెనకపడ్డారు. బ్యాలెట్ ఓటింగ్‌లో కూటమి పార్టీ అభ్యర్థికి భంగపాటు ఎదురైంది. దీంతో చరిత్రలో ఏ ప్రభుత్వానికి ఎదురుకాని చేదు అనుభవం కూటమి ప్రభుత్వానికి ఎదురైంది. ఎన్నికల్లో గెలిచాక ఉద్యోగులు, ఉపాధ్యాయులను ప్రభుత్వం మోసం చేసింది. ఉద్యోగులకు కనీసం ఒక్క డీఏ ఇవ్వలేదు. ఉద్యోగులకు ఐఆర్, పీఆర్సీ ఊసెత్తలేదు. దీంతో ప్రభుత్వ టీచర్లలో చంద్రబాబు ప్రభుత్వంపై వ్యతిరేకత ఏర్పడింది. ఫలితంగా ఉత్తరాంధ్ర టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూటమి అభ్యర్థి పాకలపాటి రఘువర్మకు ఓటమి అనివార్యమైంది. -
కూటమి ప్రభుత్వానికి షాక్.. టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూటమి ప్రభుత్వ అభ్యర్థి ఓటమి
సాక్షి, అమరావతి : ఉత్తరాంధ్ర టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికలలో కూటమి ప్రభుత్వానికి భారీ షాక్ తగిలింది. టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో పీఆర్టీయూ అభ్యర్థి శ్రీనివాసుల నాయుడు గెలుపొందారు. కూటమి అభ్యర్థి పాకలపాటి రఘువర్మ ఓడిపోయారు. దీంతో ఓటమిని అంగీకరిస్తూ రఘువర్మ కౌంటింగ్ కేంద్రం నుంచి బయటకు వచ్చేశారు. ఓడిపోయినప్పటికీ టీచర్లకు అండగా ఉంటామని హామీ ఇచ్చారు. ప్రభుత్వంపై ప్రభుత్వ టీచర్ల వ్యతిరేకతఉత్తరాంధ్ర టీచర్ ఎన్నికల ఫలితాలతో 9 నెలలకే ప్రభుత్వంపై టీచర్ల వ్యతిరేకత సుస్పష్టమైంది. ప్రభుత్వంపై ఉపాధ్యాయులు తిరుగుబాటు ప్రకటించారు. అందుకు ఊతం ఇచ్చేలా ఉత్తరాంధ్ర టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ప్రభుత్వ టీచర్లు కూటమికి ఓటమి రుచి చూపించారు. టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూటమి అభ్యర్థి పాకలపాటి రఘు వర్మను ఓడించారు. పీఆర్టీయూ అభ్యర్థి గాదె శ్రీనివాసులు నాయుడిని గెలిపించారు. చంద్రబాబుకు ఓటమి రుచి చూపించిన ప్రభుత్వ టీచర్లురఘువర్మను కూటమి అభ్యర్థిగా టీడీపీ, జనసేన,బీజేపీలు పోటీకి పెట్టాయి. తొలి ప్రాధాన్యత, రెండో ప్రాధాన్యతలోనూ కూటమి అభ్యర్థి వెనకపడ్డారు. బ్యాలెట్ ఓటింగ్‌లో కూటమి పార్టీ అభ్యర్థికి భంగపాటు ఎదురైంది. దీంతో చరిత్రలో ఏ ప్రభుత్వానికి ఎదురుకాని చేదు అనుభవం కూటమి ప్రభుత్వానికి ఎదురైంది. ఎన్నికల్లో గెలిచాక ఉద్యోగులు, ఉపాధ్యాయులను ప్రభుత్వం మోసం చేసింది. ఉద్యోగులకు కనీసం ఒక్క డీఏ ఇవ్వలేదు. ఉద్యోగులకు ఐఆర్, పీఆర్సీ ఊసెత్తలేదు. దీంతో ప్రభుత్వ టీచర్లలో చంద్రబాబు ప్రభుత్వంపై వ్యతిరేకత ఏర్పడింది. ఫలితంగా ఉత్తరాంధ్ర టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూటమి అభ్యర్థి పాకలపాటి రఘువర్మకు ఓటమి అనివార్యమైంది. -
సుగాలి ప్రీతి కేసును వాడుకుని పవన్ రాజకీయంగా బాగుపడ్డారు : జడ శ్రావణ్‌కుమార్
సాక్షి,విజయవాడ: సుగాలి ప్రీతి కేసును వాడుకుని రాజకీయంగా బాగుపడ్డారని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌పై జై భీమ్ రావు భారత్ పార్టీ వ్యవస్థాపకులు జడ శ్రావణ్ కుమార్ ఫైరయ్యారు. సుగాలి ప్రీతి కుటుంబ సభ్యుల మనోవేదనపై న్యూ హోప్ ఫౌండేషన్ పాటను రూపొందించింది. ఆ పాట పోస్టర్‌ను జడ శ్రావణ్ కుమార్ ఆవిష్కరించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. పవన్‌కు నిబద్ధత,నిలకడలేదు. రాజకీయాల కోసమే సుగాలిప్రీతి కేసును వాడుకున్నారు. సుగాలిప్రీతి కుటుంబానికి న్యాయం చేస్తామన్నాడు.. ఏమైంది?. సుగాలి ప్రీతి కుటుంబానికి వైఎస్ జగన్ ప్రభుత్వం ఉద్యోగం ఇచ్చింది. వైఎస్ జగన్ హయాంలో ఐదెకరాల పొలం కూడా ఇచ్చారు. సీబీఐ విచారణకు జగన్ ప్రభుత్వం ఆదేశించింది.పవన్ సుగాలి ప్రీతి గురించి ఒక వెయ్యి వీడియోల్లోనైనా మాట్లాడారు. సినిమాలో డైలాగ్ లు మర్చిపోయినట్లు .. సుగాలి ప్రీతి కేసును పవన్ మర్చిపోయినట్లున్నారు. సుగాలి ప్రీతికి న్యాయం కోసం పోరాడింది నేను. నన్ను తప్పుపట్టే విధంగా జనసేన కార్యకర్తలు సీన్ క్రియేట్ చేశారు. పవన్ కళ్యాణ్ ఆదేశాలతో జనసేన కార్యకర్తలు కేసులో ఎంటరయ్యారు. సుగాలి ప్రీతి కేసును వాడుకుని పవన్ రాజకీయంగా బాగుపడ్డాడు.పవన్‌ను తిట్టిన వారిని అరెస్టులు చేయించారు. పవన్ కళ్యాణ్ ప్రజల సమస్యలపై స్పందించేందుకు సిద్ధంగా లేడు. తాను హామీ ఇచ్చిన సుగాలి ప్రీతి కుటుంబానికి న్యాయం చేయలేకపోయారు. పవన్‌కు నిబద్ధత..నిలకడ లేదు.సుగాలి ప్రీతి కుటుంబం పవన్‌పై నమ్మకం ఇంకా ఎన్నాళ్లు పెట్టుకుంటారో వాళ్ల విజ్ఞతకే వదిలేస్తున్నా. సుగాలి ప్రీతి కేసును రాజకీయాల కోసం పవన్ వాడుకున్నాడు. పవన్‌ను నమ్ముకుంటే 2029లో మళ్లీ సుగాలి ప్రీతి హత్యకేసు ప్రచారాస్త్రంగా మారండం ఖాయమని’మండిపడ్డారు. -
‘అసలు ఎవరి ప్రయోజనాల కోసం ప్రభుత్వం పని చేస్తోంది?’
తాడేపల్లి : ఏపీలో కూటమి ప్రభుత్వం ఎవరి ప్రయోజనాల కోసం పని చేస్తోందో తెలియడం లేదన్నారు ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి. ధరలు లేక మిర్చి రైతులు అల్లాడిపోతుంటే.. నేటికి ఏపీ ప్రభుత్వం నిధులు విడుదల చేయకపోవడం దారణుమన్నారు. తాడేపల్లి వైఎస్సార్ సీపీ ప్రధాన కార్యాలయం నుంచి మాట్లాడిన లేళ్ల అప్పిరెడ్డి.. ‘ మిర్చి రైతుల కష్టాలు దారుణంగా ఉన్నాయి. ధరల్లేక మిర్చి రైతులు అల్లాడిపోతున్నారు. వైఎస్ జగన్ గత నెలలో మిర్చి యార్డును సందర్శించారు. రైతుల కష్టాలు తెలుసుకుని చలించిపోయారు. జగన్ వెళ్లాకనే ప్రభుత్వం సమీక్షలు చేసింది. రూ. 11,781లకు తగ్గితే కొనుగోలు చేస్తామని ప్రభుత్వం ప్రకటించింది. కానీ నేటికీ ఒక్క రూపాయి కూడా విడుదల చేయలేదు. అసలు ఆ స్కీం ఉందో లేదో కూడా తెలియదు. ఈక్రాప్, చెక్‌పోస్టు, యార్డులోనూ రైతుల పంటల వివరాలు తెలుస్తాయి కదా?, ఐనా సరే ఎందుకని మిర్చి కొనుగోళ్లలో జాప్యం చేస్తున్నారు?, రైతుల పంట వ్యాపారుల చేతుల్లోకి వెళ్లాకనే ప్రభుత్వం కొనుగోలు చేస్తుందా?, అసలు ఎవరి ప్రయోజనాల కోసం ప్రభుత్వం పని చేస్తోంది? , 150 కోల్డు స్టోరేజీల్లో కోటిన్నర మిర్చి బస్తాలు ఉన్నాయి. మిర్చిని అమ్ముకోలేక రైతులు అల్లాడిపోతున్నారు. మిర్చి రైతుల కష్టాల మీద చర్చించాలని మండలిలో వాయిదా తీర్మానం ఇచ్చాం. ప్రభుత్వం దాన్ని కూడా రాజకీయ కోణంలోనే చూడటం సిగ్గుచేటు. ప్రభుత్వం వాస్తవ పరిస్థితులు ఆలోచింవి రైతులను ఆదుకోవాలి’ అని డిమాండ్ చేశారు లేళ్ల అప్పిరెడ్డి.