breaking news
-
‘అసలు ఎవరి ప్రయోజనాల కోసం ప్రభుత్వం పని చేస్తోంది?’
తాడేపల్లి : ఏపీలో కూటమి ప్రభుత్వం ఎవరి ప్రయోజనాల కోసం పని చేస్తోందో తెలియడం లేదన్నారు ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి. ధరలు లేక మిర్చి రైతులు అల్లాడిపోతుంటే.. నేటికి ఏపీ ప్రభుత్వం నిధులు విడుదల చేయకపోవడం దారణుమన్నారు. తాడేపల్లి వైఎస్సార్ సీపీ ప్రధాన కార్యాలయం నుంచి మాట్లాడిన లేళ్ల అప్పిరెడ్డి.. ‘ మిర్చి రైతుల కష్టాలు దారుణంగా ఉన్నాయి. ధరల్లేక మిర్చి రైతులు అల్లాడిపోతున్నారు. వైఎస్ జగన్ గత నెలలో మిర్చి యార్డును సందర్శించారు. రైతుల కష్టాలు తెలుసుకుని చలించిపోయారు. జగన్ వెళ్లాకనే ప్రభుత్వం సమీక్షలు చేసింది. రూ. 11,781లకు తగ్గితే కొనుగోలు చేస్తామని ప్రభుత్వం ప్రకటించింది. కానీ నేటికీ ఒక్క రూపాయి కూడా విడుదల చేయలేదు. అసలు ఆ స్కీం ఉందో లేదో కూడా తెలియదు. ఈక్రాప్, చెక్‌పోస్టు, యార్డులోనూ రైతుల పంటల వివరాలు తెలుస్తాయి కదా?, ఐనా సరే ఎందుకని మిర్చి కొనుగోళ్లలో జాప్యం చేస్తున్నారు?, రైతుల పంట వ్యాపారుల చేతుల్లోకి వెళ్లాకనే ప్రభుత్వం కొనుగోలు చేస్తుందా?, అసలు ఎవరి ప్రయోజనాల కోసం ప్రభుత్వం పని చేస్తోంది? , 150 కోల్డు స్టోరేజీల్లో కోటిన్నర మిర్చి బస్తాలు ఉన్నాయి. మిర్చిని అమ్ముకోలేక రైతులు అల్లాడిపోతున్నారు. మిర్చి రైతుల కష్టాల మీద చర్చించాలని మండలిలో వాయిదా తీర్మానం ఇచ్చాం. ప్రభుత్వం దాన్ని కూడా రాజకీయ కోణంలోనే చూడటం సిగ్గుచేటు. ప్రభుత్వం వాస్తవ పరిస్థితులు ఆలోచింవి రైతులను ఆదుకోవాలి’ అని డిమాండ్ చేశారు లేళ్ల అప్పిరెడ్డి. -
చంద్రబాబు మీది మంచి ప్రభుత్వం కాదు.. ముంచే ప్రభుత్వం
తిరుపతి జిల్లా: చంద్రబాబు రాష్ట్రానికి ముఖ్యమంత్రా? టీడీపీకి ముఖ్యమంత్రా? అని మాజీ మంత్రి ఆర్కే రోజా ప్రశ్నించారు. సోమవారం సత్యవేడు సబ్ జైల్లో ఉన్న తడకుపేట దళితులను ఆమె పరామర్శించారు. అనంతరం, ఆమె మీడియాతో మాట్లాడారు. ‘ఆరేళ్ల క్రితం మాట్లాడితే ఇప్పుడు మనోభావాలు దెబ్బతున్నాయని పోసాని కృష్ణ మురళిని అరెస్ట్ చేయడం దారుణం. అక్రమంగా 111 కేసు పెట్టి ,అక్రమంగా ఇరికించారు. ప్రధాని నరేంద్ర మోదీని చంద్రబాబు, లోకేష్, బాలకృష్ణ వ్యక్తిత్వాన్ని హననం చేస్తూ దారుణంగా మాట్లాడలేదా? వాళ్లపై ఇదే దేశద్రోహం సెక్షన్లు కింద కేసు నమోదు చేయగలరా? అని ప్రశ్నించారు. వైఎస్సార్సీపీ సానుభూతిపరులకు ఎటువంటి సహాయం చేయొద్దని చంద్రబాబు చెప్పడం హేయమైన చర్య. వైఎస్సార్సీపీ శ్రేణులు కట్టే పన్నులను ప్రభుత్వం తీసుకోవడం లేదా? వైఎస్సార్సీపీకి ఓట్లు వేసిన వాళ్లపై అక్రమ కేసులు పెట్టి జైళ్లలో వేస్తున్నారు. చంద్రబాబుకు ఎదురు మాట్లాడినా, ఆయన చేసిన తప్పును ఎత్తి చూపినా సహించలేకపోతున్నారు. చంద్రబాబు ఎన్నికల్లో ఇచ్చిన ఒక్క హామీని నెరవేర్చలేదు. మంచి ప్రభుత్వమని స్టిక్కర్లేసుకోవడం తప్ప, మొన్న పెట్టిన బడ్జెట్‌తో ఇది మంచి ప్రభుత్వం కాదు.. ముంచే ప్రభుత్వమని రాష్ట్ర ప్రజలకు అర్థమైంది. రెడ్‌బుక్ రాజ్యాంగంపై పెట్టిన శ్రద్ధ,మేనిఫెస్టో పైన ఎందుకు పెట్టడం లేదు? బటన్ నొక్కడానికి వైఎస్ జగన్ అవసరం లేదన్నారు. అదే బటన్‌ను చంద్రబాబు ఎందుకు నొక్కడం లేదు. చంద్రబాబు ఒక్క హామీని అమలు చేయలేదు. వైఎస్ జగన్ చేసిన ఏ ఒక్క హామీని ప్రజలకు చేరవేయడం లేదురెడ్బుక్ రాజ్యాంగంతో వైఎస్సార్సీపీ వాళ్లపై దాడులు చేయడం, అక్రమ కేసులతో రాష్ట్రాన్ని పాలిస్తామనుకుంటే రేపు అదే రిపీట్ అవుతుంది. వైఎస్ జగన్ వడ్డీతో సహా తిరిగిచ్చేస్తారు. వైఎస్సార్సీపీకి సహాయం చేయొద్దన్నారంటే ఆయన ఎంత దారుణమైన స్థితిలో ఉన్నారు అర్థం చేసుకోవచ్చు. చంద్రబాబు తెలుగుదేశం పార్టీకి ముఖ్యమంత్రా? రాష్ట్రానికి ముఖ్యమంత్రా?చంద్రబాబుకు నొప్పి వస్తే పరిగెత్తే ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, రాష్ట్రాన్ని అప్పుల్లో ముంచేస్తుంటే నోరెందుకు మెదపలేదు. గతంలో పవన్ కళ్యాణ్ మాట్లాడిన వీడియోలు చూడండి. వైఎస్సార్సీపీ హాయంలో 30 వేల మహిళలు మాయమయ్యారన్న పవన్ కళ్యాణ్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక్కరినైనా తీసుకొచ్చారా? దానికోసం బడ్జెట్లో నిధులు కేటాయించి ఆ విధంగా ప్రయత్నం చేయొచ్చు కదా?’అని మాజీ మంత్రి ఆర్కే రోజా వ్యాఖ్యానించారు. -
దోపిడీ జరిగిందన్నారు.. మరి బిల్లులెందుకు చెల్లించారు?: బొత్స
అమరావతి, సాక్షి: రుషికొండ భవనాలపై ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో రచ్చ రేగింది. నిర్మాణాలపై అడ్డగోలు ప్రచారాలు చేసిన కూటమి ప్రభుత్వం.. ఆపై కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లించింది. ఈ పరిణామంపై వైఎస్సార్సీపీ సీనియర్ నేత, మండలిలో విపక్ష నేత బొత్స సత్యనారాయణ కూటమిని నిలదీశారు. రుషికొండ భవనాలు వాడుకోకపోవటం ప్రభుత్వం చేతకానితనం. రుషికొండ భవన నిర్మాణాల్లో అవకతవకలు జరిగాయని ఆరోపించారు. నిజంగా అవకతవకలు జరిగి ఉంటే రూ. 80 కోట్ల రూపాయల బిల్లులు ఎందుకు చెల్లించారు?. తప్పు జరిగిందని చెప్పినప్పుడు చెల్లింపులు చేయడం ఎందుకు? అని బొత్స ప్రశ్నించారు. రుషికొండ భవన నిర్మాణాల్లో అవకతవకలు జరిగుంటే విచారణకు చేయించండి. తప్పు జరిగినపుడు ఎందుకు విచారణకు జంకుతున్నారు. మేం సభలో ఎవరినీ వ్యక్తిగతంగా విమర్శించలేదు. మేము ఏదైతే మాట్లాడతామో దానికే కట్టుబడి ఉంటాం అని అన్నారాయన. అయితే.. బొత్స ప్రశ్నకు మంత్రి అచ్చెన్నాయుడు సమాధానం ఇచ్చారు. కాంట్రాక్టర్‌కు బిల్లు చెల్లించింది రుషికొండ నిర్మాణాలకు కాదని, వేరే పనులకు అని చెప్పారు. ఈ క్రమంలో గత ఐదేళ్లలో టీడీపీ నేతలు చేసిన పనులకు ఒక్క బిల్లు కూడా చెల్లించలేదని ఆరోపించారాయన. -
రెడ్‌బుక్ దౌర్జన్యకాండ.. అబ్బయ్య చౌదరి ఇంటిపై దాడి!
సాక్షి, ఏలూరు: ఏపీలో రెడ్‌బుక్ రాజ్యాంగం దర్జాగా అమలు చేస్తున్నారు కూటమి నేతలు. దెందులూరులో టీడీపీ నాయకుడు చింతమనేని కనుసన్నల్లో రెడ్‌బుక్ అమలు జరుగుతోంది. తాజాగా మాజీ ఎమ్మెల్యే అబ్బయ్య చౌదరి ఇంటి టీడీపీ శ్రేణులు మూకుమ్మడి దాడికి చేశాయి. దాడికి సంబంధించిన దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డు అయ్యింది.దెందులూరులో చింతమనేని కనుసన్నల్లో రెడ్‌బుక్ రాజ్యాంగం అమలు చేస్తున్నారు. వైఎస్సార్సీపీ నేతలను టార్గెట్ చేసి కూటమి నేతలు దాడులకు పాల్పడుతున్నారు. తాజాగా వైఎస్సార్సీపీ మాజీ ఎమ్మెల్యే అబ్బయ్య చౌదరి నివాసంపై టీడీపీ మూకలు దూసుకెళ్లారు. అంతేకాకుండా అబ్బయ్య చౌదరికి చెందిన చేనులో పామాయిల్ గెలలు కోస్తుండగా టీడీపీ శ్రేణులు అడ్డుకున్నారు. ఈ క్రమంలో వైఎస్సార్సీపీ శ్రేణులు వారిని ప్రశ్నించగా దాడికి దిగారు. దాడిలో వైఎస్సార్సీపీ కార్యకర్తలు గాయపడ్డారు. -
వైఎస్ జగన్ ఆ మాట ఏనాడూ చెప్పలేదు: బొత్స
అమరావతి, సాక్షి: శాసన మండలిలో ఏపీ మంత్రి అచ్చెన్నాయుడు(Atchannaidu) అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారు. వ్యక్తిగతంగా కించపరిచేలా మాట్లాడడంతో వైఎస్సార్సీపీ సీనియర్ నేత, విపక్ష నేత బొత్స సత్యనారాయణ మండిపడ్డారు. సోమవారం అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో ఈ పరిణామం చోటు చేసుకుంది.‘‘మంత్రి అచ్చెన్నాయుడు నేను ఒకే ప్రాంతం నుంచి వచ్చాం. సుదీర్ఘ రాజకీయాలు చేసిన అనుభవం నాకు ఉందని అచ్చెన్నాయుడికి తెలుసు. మేం గాలికి వచ్చామని మంత్రి చేసిన వ్యాఖ్యలు అభ్యంతరకరం. ఆయన తన వ్యాఖ్యలు విత్ డ్రా చేసుకోవాలి. .. మేం ఎవరిని వ్యక్తిగతంగా కించపరిచేలా మాట్లాడటం లేదు. వ్యక్తిగతంగా నాపై మాట్లాడటం ఇద్దరికీ గౌరవంగా ఉండదు. మేమంతా రాజకీయంగా పోరాటాలు చేసే ఇక్కడకు వచ్చాం’’ అని బొత్స, అచ్చెన్నకు హితవు పలికారు. ఇదిలా ఉంటే.. సాక్షి టీవీ సహా నాలుగు ఛానెల్స్‌కు మండలి లైవ్ ప్రసారాలను సమాచార శాఖ నిలిపివేయడం గమనార్హం.మండలిలో అచ్చెన్న vs బొత్సమంత్రి అచ్చెన్నాయుడు👇2014-19 ఎన్టీఆర్ గృహ నిర్మాణం కింద పేదలకు ప్రభుత్వం ఇళ్లు కట్టించి ఇచ్చిందిగత ప్రభుత్వం ఒక్క ఇల్లు కూడా కట్టలేదుకట్టిన ఇళ్లకు ఒక్క పైసా కూడా ఇవ్వలేదు.జగనన్న కాలనీలు అన్నారు.. దాని గురించి నేను ఏమీ మాట్లాడాల్సిన పనిలేదు.. ఏం జరిగిందో అందరికీ తెలుసు..కేంద్రం డబ్బులతోనే కథ నడిపారురాష్ట్ర ప్రభుత్వం ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదుమేము పేదలకు ఇళ్లు కట్టించి ఇవ్వాలని ఒక మంచి ఆలోచనతో ముందుకు వెళ్తున్నాం.మీరు ఎంత ఖర్చు చేశారో సమాధానం చెప్పాలి?విపక్ష నేత బొత్స సత్యనారాయణ👉🏼.. 2014 - 19 ఇళ్లు కట్టిన వారికి మా ప్రభుత్వ హయాంలో బిల్లులు ఇవ్వలేదనడం అవాస్తవం. అర్హులైన లబ్ధిదారులకు అందరికీ బిల్లులు ఇచ్చాం. అర్హత లేకుండా కట్టుకుని బిల్లులు కావాలన్న వారికి మాత్రమే ఇవ్వలేదు. కేవలం రాజకీయ ఆరోపణలు చేస్తున్నారు. ప్రభుత్వం రాజకీయ కక్షతో ఇవ్వలేదని చెప్పటం సరికాదు. గత ప్రభుత్వం అర్హులైన ప్రతీ ఒక్కరికీ అన్నీ పథకాలు ఇచ్చింది. మా పార్టీ వాళ్ళకే పనులు, పథకాలు ఇవ్వాలని మా అధినేత వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి ఎప్పుడూ చెప్పలేదు. .. రాజ్యాంగ బద్ధమైన పదవిలో ఉన్న చంద్రబాబు పథకాల పై చేసిన వ్యాఖ్యలు కరెక్ట్ కాదు. ముఖ్యమంత్రి పదవిలో ఉండి చంద్రబాబు ఇలా మాట్లాడటానికి సిగ్గుపడాలి. లబ్ధిదారులకు పార్టీలు అంట గడతారా?. .. అర్హులైన లబ్ధిదారులకు పథకాలు ఇవ్వాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఉంది. ప్రమాణం చేసి పదవులు తీసుకున్న వ్యక్తులు ఇలాంటి మాటలు మాట్లాడతారా?.. కేవలం కార్యకర్తలకు ఇవ్వమనటానికి ఇదేమైనా మీ సొంత ఆస్తి అనుకుంటున్నారా?. మా ప్రభుత్వంలో గత ఐదేళ్లలో అర్హులైన ప్రతీ ఒక్కరికీ పథకాలు ఇచ్చాం. -
అరరే కేశవా.. ఎన్టీఆర్, బాబులను బద్నాం చేస్తే ఎలా?
గాలి కబుర్లు...సోది లెక్కలు ఎలా ఉంటాయో తెలుసుకోవాలని ఉందా? ఆంధ్రప్రదేశ్ ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ ప్రవేశపెట్టిన బడ్జెట్ చూడండి! ముఖ్యమంత్రి చంద్రబాబును పొగిడేందుకు.. షాడో సీఎం లోకేష్‌ను సంతోషపెట్టేందుకు మంత్రిగారు రాష్ట్ర ఇమేజీని దెబ్బతీసేందుకూ వెనుకాడలేదు.. అబద్ధాలు చెప్పడానికి సిగ్గుపడలేదు! బడ్జెట్ ప్రసంగం మొత్తం మ్మీద వైఎస్సార్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి, గత ప్రభుత్వం అంటూ పదే పదే ప్రస్తావించి కేశవ్ తన లోపలి భయాన్ని బయటపెట్టేసుకున్నట్లు అనిపించింది. కాకపోతే ఈ క్రమంలో ఆయన పార్టీ వ్యవస్థాపకుడు ఎన్టీఆర్ పాలనను కూడా విధ్వంసంతో పోల్చేశారు. ఒకపక్క రాష్ట్రానికి రుణాలు వచ్చే అవకాశం సున్నా అంటూనే.. ఇంకోపక్క లక్ష కోట్ల రూపాయల రుణం తీసుకోబోతున్నామని చెప్పడం తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి ప్రభుత్వానికే చెల్లింది. రాజధాని అమరావతి కోసం ప్రభుత్వ ధనం ఒక్క రూపాయి అవసరం లేదంటూనే బడ్జెట్ ద్వారా రూ.ఆరు వేల కోట్లు వ్యయం చేయబోతున్నామని అంటారు. అంతేకాదు.. రూ.31 వేల కోట్ల అప్పు తీసుకువస్తూ ఆ మాటను ధైర్యంగా చెప్పలేని దుస్థితి కేశవ్‌ది. 👉సాధారణంగా ఎవరైనా తమ రాష్ట్రం అభివృద్ది పథంలో ఉంది. గొప్పగా పని చేస్తున్నామని చెప్పుకుంటారు. కూటమి ప్రభుత్వం మాత్రం రివర్స్‌లో నడుస్తోంది. రాష్ట్రం నాశనమైపోయిందని, విధ్వంసమైందని.. రెండో ప్రపంచయుద్ధంలో అణుబాంబు దాడికి బుగ్గయిన హిరోషిమాతో పోల్చడం ఎంత దుర్మార్గం!. ఆంధ్రప్రదేశ్‌పై ప్రేమాభిమానాలు ఉన్నవారు ఎవరైనా ఇలాంటి దిక్కుమాలిన పోలికలు చేస్తారా?. ఇది ఆంధ్రప్రదేశ్ ప్రజలను అవమానించడం కాదా! ఈ మాటలను సీరియస్‌గా తీసుకుంటే ఎవరైనా పెట్టుబడులు పెట్టడానికి ముందుకు వస్తారా?. అంతేకాదు.. 👉ఏకంగా ఏపీకి రుణం తీసుకునే సామర్ధ్యం సున్నా అని రాశారంటే ఏమనుకోవాలి? అది నిజమే అయితే కొత్త బడ్జెట్లో రూ.1.03 లక్షల కోట్ల రుణం తెచ్చుకుంటామని ఎలా చెప్పారు? ఈ ఆర్థిక సంవత్సరంలో ఇప్పటికే రూ.1.31 లక్షల కోట్ల రుణం ఎలా తీసుకువచ్చారు? ఎవరినో మాయ చేయాలన్న ఉద్దేశంతో ఇలాంటి వ్యాఖ్యలు చేస్తే ఎవరికి ప్రయోజనం. సంపద సృష్టిస్తామని ఊదరగొట్టిన వీరు.. YSRCP ప్రభుత్వ హయాంలో వచ్చినదానికంటే తక్కువ ఆదాయం వచ్చిన దానిపై మాత్రం కిమ్మనరు! రుణాలే సంపద అనుకోవాలనా?. ప్రతి వైఫల్యాన్ని గత జగన్ ప్రభుత్వంపై నెట్టేస్తే.. ప్రజలకు వచ్చే లాభం ఏమిటి? ఇప్పుడు చేస్తున్న విమర్శలన్నీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చేసినవే కదా! అయినా జగన్ కంటే మూడు రెట్లు అధికంగా హామీలు ఎలా ఇచ్చారంటే జవాబు చెప్పరు. ఇప్పుడు ఆ సూపర్ సిక్స్, తదితర హామీలన్నీ ఎగవేయడానికి వైఎస్సార్సీపీ ఆరోపణలు చేసి ప్రజలను పిచ్చోళ్లను చేస్తారా?. ఇదేమైనా ధర్మమేనా!. అదే సమయంలో చంద్రబాబును పొగడడం కోసం ఎన్టీఆర్‌ను సైతం భ్రష్టు పట్టించేశారు. 1995లో ఎన్టీఆర్‌ను పదవి నుంచి చంద్రబాబు ముఖ్యమంత్రి అయ్యే సమయానికి ఉద్యోగులకు జీతాలిచ్చే పరిస్థితి కూడా లేదట. దానికి కారణం ఒక్క ఎన్టీఆరేనా? ఆయన తీసుకొచ్చిన పథకాలేనా? అలాంటప్పుడు అదే ఎన్టీఆర్ ప్రభుత్వంలో ఆర్థిక, రెవెన్యూ శాఖల మంత్రిగా ఉన్నదెవరు? చంద్రబాబే కదా?. పయ్యావుల కేశవ్‌కు ఎన్టీఆర్‌పై ఉన్న గౌరవం ఏమిటో ఈ బడ్జెట్ ప్రసంగంతో తేలిపోయింది. గత ఏడాది బడ్జెట్ లో ఏమి చెప్పాం..ఏమి చేశాం..అన్నదానితో నిమిత్తం లేకుండా ఒక ఉపన్యాసం తయారు చేసుకుని శాసనసభలో చదివితే సరిపోతుందా?. విచిత్రం ఏమిటంటే.. 2024-25 బడ్జెట్‌ను రూ.2.94 లక్షల కోట్లతో ప్రవేశపెట్టినా అందులో ఎంత శాతం అమలైందన్నది ప్రశ్నార్థకం. ఎందుకంటే రెండు లక్షల కోట్ల రూపాయల ఆదాయం వస్తుందన్న అంచనాతో వేసిన బడ్జెట్ అది. అయితే జనవరి నాటికి వచ్ని ఆదాయం కేవలం ఒక లక్ష ఒక వెయ్యి కోట్లు మాత్రమే. అంటే సగం ఆదాయం కూడా లేకుండా పోయిందన్నమాట. పరిస్థితి ఇలా ఉంటే.. తాజా బడ్జెట్ కేటాయింపులు ఎకాఎకిన రూ.3.22 లక్షల కోట్లు అని ఎలా చెప్పారో అర్థం కాదు. కేవలం కాకి లెక్కలతో పుస్తకాలు నింపేసి ప్రజలను మభ్యపెట్టడం కాకపోతే? ఒకవైపు రాష్ట్రం ఆర్ధికంగా విధ్వంసమైందంటూనే.. మరోపక్క ఆదాయం పెరుగుతుందని ఎలా అంటారు?. సూపర్ సిక్స్ వంటి ఆచరణ కాని హామీలు ఇవ్వడం, వాటిని అమలు చేయకుండా ప్రజలను మోసం చేయడం ఎలా అనేదానిపైనే అధికంగా దృష్టి పెట్టారన్న విమర్శలు వస్తున్నాయి. ధైర్యం ఉంటే టీడీపీ, జనసేన కూటమి ఇచ్చిన హామీలు ఏమిటి? వాటి అమలుకు బడ్జెట్లో జరిపిన కేటాయింపులు ఎంత? కేటాయించకపోతే ఎందుకు చేయలేకపోయారు అన్నవి మాటమాత్రం మాట్లడకుండా ఊకదంపుడు కబుర్లు చెబితే ఏమి ఉపయోగం?. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో తల్లికి వందనం పథకం కోసం రూ.ఆరు వేల కోట్లు కేటాయించి ఒక్క రూపాయి వ్యయం చేయలేదు. అలాగే.. అన్నదాత సుఖీభవ కింద రూ.వెయ్యి కోట్లు కేటాయించి రైతుకు నయాపైసా ఇవ్వలేదు. అంటే..పేరుకు కేటాయింపులు జరపడం.. ఆ తర్వాత గాలికి వదలి వేయడం అనేకదా! ఆడపడుచుకుల నెలకు రూ.1,500 ఆడబిడ్డ నిధి పేరిట సాయంమహిళలందరికీ ఉచిత బస్సు ప్రయాణం బీసీలకు యాభై ఏళ్లకే ఫించన్.. వీటి ఊసే లేదు. అలాగే వలంటీర్ వ్యవస్థకు మంగళం పాడేశారు. 👉అమరావతి కోసం రూ.ఆరు వేల కోట్లు కేటాయించారు కానీ.. అంతా ఖర్చు చేస్తే చేయవచ్చు. ఎందుకంటే రాష్ట్రం ఏమైపోయినా అమరావతిలో రియల్ ఎస్టేట్ వ్యాపారం బాగుంటే చాలన్నట్లుగా ఈ ప్రభుత్వం వ్యవహరిస్తోందన్న భావన నెలకొంది. అంతేకాదు. రూ.31 వేల కోట్ల అప్పు తీసుకు వస్తున్న విషయాన్నీ నిజాయితీగా ఒప్పుకోకపోవడం గమనార్హం. అదేదో కేంద్రం ఊరికే ఇస్తున్న డబ్బు అన్నట్లు పిక్చర్ ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు.ఇదంతా ఏపీలో అన్ని ప్రాంతాల ప్రజలపై పడే భారమే అవుతుంది.వారు చెల్లించే పన్నులనే వాడుకోవాలి. ఇక్కడ మరో మాట చెప్పాలి. జగన్ ప్రభుత్వం విద్యకు అత్యంత ప్రాధాన్యత ఇచ్చి స్కూళ్లు బాగు చేసి అనేక సంస్కరణలు తీసుకువస్తే కేశవ్ తన ప్రసంగంలో గత ప్రభుత్వం విద్యా వ్యవస్థను నాశనం చేసిందని దుర్మార్గంగా వ్యాఖ్యానించారు. లోకేష్‌ను ప్రసన్నం చేసుకోవడానికి ఇంతలా దిగజారవలసిన అవసరం లేదు. చంద్రబాబు వస్తే రియల్ ఎస్టేట్ వ్యాపారం పెరిగిపోతుందని ఎన్నికల సమయంలో ఊదరగొట్టారు. కాని తీరా చూస్తే జగన్ టైమ్‌లో రిజిస్ట్రేషన్ల శాఖ ద్వారా సుమారు రూ.13 వేల కోట్ల ఆదాయం వస్తే, చంద్రబాబు సర్కార్ పది నెలల పాలనలో అది రూ. తొమ్మిది వేల కోట్లకు కూడా చేరలేదు!. కేటాయింపుల గురించి చూస్తే ఫించన్లకు రూ.33 వేల కోట్లు అవసరమని గవర్నర్ ప్రసంగంలో చెబుతారు. బడ్జెట్లో మాత్రం రూ.27 వేల కోట్లే చూపుతారు. అన్నదాత సుఖీభవ కింద కేంద్రం ఇచ్చేదానితో సంబంధం లేకుండా ప్రతి రైతుకు రూ.20 వేలు ఇస్తామన్న ఎన్నికల హామీపై మాటమార్చిన చంద్రబాబు ఒక ఏడాది ఎగ్గొటడమే కాకుండా.. తాజా బడ్జెట్లో సరిపడా కేటాయింపులూ చేయలేదు. తల్లికి వందనం కింద విద్యార్ధులు ఒకొక్కరికి రూ.15 వేల చొప్పున ఇచ్చేందుకు రూ.12 వేల కోట్లు అవసరం కాగా.. కేటాయించింది రూ. ఎనిమిది వేల కోట్లే. పైగా స్పీచ్ లో ఎక్కడా ప్రతి విద్యార్థికీ అని చెప్పకుండా ప్రతి తల్లికీ అని తెలివిగా చెప్పారు. దీనిపై వివరణ ఇస్తారేమో చూడాలి. కేశవ్ బడ్జెట్ ప్రసంగం మొత్తమ్మీద 22 సార్లు విమర్శలు చేయడం ద్వారా జగన్‌కు లభిస్తున్న ప్రజాదరణను చూసి కూటమి సర్కారు ఎంత భయపడుతున్నది బయటపెట్టుకున్నారు. మొత్తం మీద బడ్జెట్ ద్వారా ప్రజలను మళ్లీ మభ్య పెట్టే యత్నం చేసే క్రమంలో వారి డొల్లతనాన్ని వారే బయట పెట్టుకున్నారు. కాకపోతే ఈనాడు ,ఆంధ్రజ్యోతి తదితర ఎల్లో మీడియాకు మాత్రం ఇది బాహుబలిగా.. పండంటి ప్రగతికి పది సూత్రాలుగా కనిపించవచ్చు. ఎందుకంటే ప్రజలకంటే ఈ ఎల్లో మీడియా వారికే వారికే ఈ ప్రభుత్వం వల్ల అధిక గిట్టుబాటు కనుక.:::కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత. -
పోసానిపై కేసు.. బయటపడ్డ మరో కుట్ర
అన్నమయ్య జిల్లా, సాక్షి: ప్రముఖ సినీ నటుడు పోసాని కృష్ణమురళి(Posani KrishnaMurali)పై కూటమి కుట్ర ఎఫ్ఐఆర్ సాక్షిగా బయటపడింది. పల్నాడు జిల్లా నరసరావుపేట(Narasaraopeta) టూటౌన్ పోలీసులు.. ఈ ఉదయం రాజంపేట సబ్ జైలు నుంచి ఆయన్ని తీసుకెళ్లిన సంగతి తెలిసిందే. అయితే ఆయనపై అక్కడ నమోదైన ఎఫ్ఐఆర్లో ఆసక్తికరమైన విషయాలు వెలుగుచూశాయి. టీడీపీ ప్రధాన కార్యదర్శి కొట్టు కిరణ్ ఈ ఫిర్యాదు చేశారు. 2022లో తమ నేతలు చంద్రబాబు నాయుడు, పవన్ కల్యాణ్(అప్పటికీ ఇంకా పొత్తులో లేరు), నారా లోకేష్‌లపై పోసాని అసభ్యపదజాలంతో పోస్టులు పెట్టారని, అవహేళనగా మాట్లాడారని.. కాబట్టి చర్యలు తీసుకోవాలని కిరణ్ కోరారు. అయితే.. 2024 నవంబర్ 13వ తేదీనే ఆయన ఫిర్యాదు చేయగా.. ఆ మరుసటిరోజే ఎఫ్ఐఆర్ ఫైల్ చేశారు. అదీ బీఎన్ఎస్ సెక్షన్ల మీద కాకుండా.. ఐపీసీ సెక్షన్ల కింద. ఇక.. అరెస్ట్ మాత్రం రెండు నెలల తర్వాతే చేశారు. అదీ మరో కేసులో అరెస్టైన టైం చూసుకుని మరీ. మరోపక్క.. కూటమి అధికారంలోకి వచ్చాక రాష్ట్రవ్యాప్తంగా పోసానిపై 30 ఫిర్యాదులకుగానూ.. 16 కేసులు నమోదయ్యాయి. అన్నమయ్య జిల్లా జనసేన నేత మణి ఫిర్యాదు మేరకు ఓబులవారీ పోలీసులు కేసు నమోదు చేసుకుని మరీ ఆయన్ని హైదరాబాద్‌లో అరెస్ట్ చేశారు. రాజకీయాలకు దూరంగా ఉంటున్న పోసాని విషయంలో కూటమి పెద్దలు ఇంత కక్ష పూరితంగా వ్యవహరిస్తారని ఎవరూ ఊహించలేరు. గుండె సమస్యలు, ఇతర ఆరోగ్య సమస్యలున్న ఆయన్ని కావాలనే పీఎస్‌లకు తిప్పుతున్నారనే వాదన వినిపిస్తోంది. అదే టైంలో.. మిగతా చోట్ల పోలీసులు వారెంట్లను సిద్ధం చేస్తున్నారు. ఇది ఉద్దేశపూర్వక చర్య కాకుంటే మరేమిటి? అని ప్రజాస్వామ్యవాదులు ప్రశ్నిస్తున్నారు. ఇవాళ పోసాని బెయిల్ పిటిషన్ అంశం చర్చకు రావడం.. మరోవైపు వైఎస్సార్సీపీ నేతలు ములాఖత్‌కు దరఖాస్తు చేసుకున్నందునే ఇలా మరో కేసుతో ఆయన్ని జిల్లా తరలించారనే చర్చ నడుస్తోందక్కడ. మార్చి 5వ తేదీకి కడప కోర్టు ఆయన బెయిల్ పిటిషన్‌పై విచారణ వాయిదా వేసింది. ఈలోపు ఆయన్ని మరింత ఇబ్బంది పెట్టడమే కూటమి ప్రభుత్వ లక్ష్యంగా కనిపిస్తోంది.పోలీసుల పోటీ.. అవసరమా?నరసరావుపేటకు పోసానిని తరలించే ముందు రాజంపేట సబ్ జైలులో పోలీసుల హైడ్రామా నడిచింది. నరసరావుపేటతో పాటు అల్లూరి జిల్లా, అనంతపురం రూరల్ పోలీసులు ఒకేసారి జైలు వద్దకు చేరుకున్నారు. పోసానిపై నమోదైన కేసులకు సంబంధించి పీటీ వారెంట్లు జైలు అధికారులకు సమర్పించారు. ‘మేం కోర్టు అనుమతి తీసుకున్నాం.. ముందుగా మాకే పోసానిని అప్పగించాలి..’ అని కోరారు. దీంతో ఉన్నతాధికారులతో మాట్లాడిన అనంతరం నరసరావుపేట పోలీసులకు అనుమతి ఇచ్చారు. తనకు ఛాతీలో నొప్పిగా ఉందంటూ పోసాని చెబుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇవాళ మరోసారి ప్రభుత్వ వైద్యులతో పరీక్షలు చేయించారు. 👉పోసానిపై అక్రమ కేసులు బనాయిస్తూ కూటమి ప్రభుత్వం కక్షపూరితంగా వ్యవహరిస్తోందని వైఎస్సార్సీపీ మొదటి నుంచి మండిపడుతున్న సంగతి తెలిసిందే. అనారోగ్యం గురించి పట్టించుకోగా.. పోసానిని అపహాస్యం చేసేలా మీడియా ముందు మాట్లాడుతున్నారు. అయితే కూటమి ప్రభుత్వ పెద్దల(Kutami Peddalu) డైరెక్షన్లోనే ఇలా పోలీసులు వ్యవహరిస్తున్నారని ఇటు వైఎస్సార్సీపీ నేతలు, అటు కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. -
లోకేశ్ లెక్కలతో టీడీపీలో తికమక!
సాక్షి, అమరావతి: ఎమ్మెల్యేల కోటాలో ఖాళీ అవుతున్న ఐదు ఎమ్మెల్సీ స్థానాలకు ఈ నెలలోనే ఎన్నికలు జరగనుండటంతో వాటి కోసం కూటమి పార్టీల్లో తీవ్ర పోటీ నెలకొంది. సంఖ్యా బలం ప్రకారం ఈ ఐదు స్థానాలు కూటమి ఖాతాలోకే వెళ్లే పరిస్థితి ఉండడం, సీఎం తనయుడు లోకేశ్ వాటిని ఎవరికివ్వాలో నిర్దేశించే స్థితిలో ఉండడంతో ఆశావహులు తీవ్ర ఆందోళనకు గురవుతూ తెర వెనుక విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ స్థానాల సిట్టింగ్ నేతలైన యనమల రామకృష్ణుడు, దువ్వారపు రామారావు, బీటీ నాయుడు, పి అశోక్‌బాబు, జంగా కృష్ణమూర్తిలకు మళ్లీ అవకాశం దక్కడం కష్టమేనని టీడీపీ నేతలు చెబుతున్నారు.యనమల రామకృష్ణుడికి దాదాపు తలుపులు మూసుకుపోయాయి. ఆయన కూతురు ఎమ్మెల్యేగా, అల్లుడు ఎంపీగా ఉండడంతోపాటు ఇటీవల అధిష్టానంతో తేడా రావడమే ఇందుకు కారణాలుగా చెబుతున్నారు. మిగిలిన నలుగురిలో ఏ ఒక్కరికీ మళ్లీ ఎమ్మెల్సీగా అవకాశం ఇచ్చే అవకాశాలు కనిపించడం లేదు. ఎన్నికల్లో ఎమ్మెల్యే సీట్ల కేటాయింపు తర్వాత మంత్రివర్గం కూర్పు, రాజ్యసభ సభ్యుల నియామకం, నామినేటెడ్ పదవులు, అధికారుల పోస్టింగ్లన్నింటినీ సీఎం కుమారుడిగా మంత్రి లోకేశ్ నిర్ణయించిన విషయం తెలిసిందే. తన కోటరీలో ఉన్న వారికి, ధనబలం ఉన్న వారికి మాత్రమే ఆయన అవకాశం ఇస్తున్నారు. అందుకే పార్టీలో సీనియర్లు తమకు ప్రాధాన్యత దక్కడం లేదని రగిలిపోతున్నారు.మమ్మల్ని పట్టించుకోండి మహాప్రబో..ఎన్నికల్లో సీట్లు దక్కించుకోలేని ఎస్వీఎస్ఎన్ వర్మ, దేవినేని ఉమామహేశ్వరరావు, ప్రభాకర్ చౌదరి, కర్రి బంగార్రాజు, కేఎస్ జవహర్, హనుమంతరాయ చౌదరి, రమే‹Ùరెడ్డి, అప్పలనాయుడు వంటి నేతలు తమకు ఎమ్మెల్సీ అవకాశం ఇవ్వాలని ప్రాధేయ పడుతున్నారు. బుద్దా వెంకన్న, పీతల సుజాత, వర్ల రామయ్య, అశోక్‌బాబు వంటి నేతలు కూడా తమకు ఆ పదవి కేటాయించాలని కోరుతున్నారు. ఇలాంటి ఆశావహుల జాబితా టీడీపీలో చాలా పెద్దగానే ఉంది. వారంతా చంద్రబాబును కలుస్తున్నా, ఆయన చినబాబును కలవాలని చెబుతున్నారు.పార్టీ కోసం ఎవరు బాగా పని చేశారో, ఎవరి అవసరం పార్టీకి ఉందో సర్వే చేయిస్తున్నామని, దాని ప్రకారం స్థానాలు కేటాయిస్తామని చెబుతున్నారు. దీంతో పార్టీ సీనియర్ నాయకులు, ఆశావహులు లోకేశ్‌ను కలవడం కోసం తెగ పాట్లు పడుతున్నారు. ఎన్నికల సమయంలో పిఠాపురం స్థానాన్ని పవన్ కళ్యాణ్ కోసం వదులుకున్న ఎస్వీఎస్ఎన్ వర్మను అధికారంలోకి వచ్చిన తర్వాత పట్టించుకోవడం లేదనే వాదన వినిపిస్తోంది. వాస్తవానికి అధికారంలోకి వచ్చాక సముచిత ప్రాధాన్యం ఇస్తామని చెప్పి ఎన్నికల్లో పవన్ కోసం పని చేయించారు.ఆ తర్వాత పట్టించుకోకపోవడంతో ఆయన ఆగ్రహంగా ఉన్నట్లు టీడీపీ నేతలు చెబుతున్నారు. గతంలో టీడీపీలో చక్రం తిప్పిన దేవినేని ఉమామహేశ్వరరావు ఇప్పుడు పార్టీలో కరివేపాకులా మారిపోయారు. ఎమ్మెల్సీ ఇచ్చి తన పరువు కాపాడాలని ఆయన చంద్రబాబును, లోకేశ్‌ను వేడుకుంటున్నారు. అయితే అది ఎంత వరకు ఫలిస్తుందో వేచి చూడాల్సిందే. బుద్దా వెంకన్న వంటి వారైతే జగన్‌ను తిట్టడంలో ఛాంపియన్ అనిపించుకుని ఎమ్మెల్సీ పదవి కొట్టేయాలని ప్రయత్నిస్తున్నా, అది అంతగా ఫలించక పోవచ్చని ఆ పార్టీ నేతలే చెబుతున్నారు. లోకేశ్ మనసులో వేరే వారు ఉన్నారని, ఆయన లెక్కలు వేరని పార్టీ నేతలు చర్చించుకుంటున్నారు. నాగబాబుకు పక్కా.. మరోవైపు ఐదు స్థానాల్లో ఒక స్థానాన్ని జనసేన తరఫున పవన్ కళ్యాణ్ సోదరుడు నాగబాబుకు ఇవ్వడం ఖాయమని కూటమిలోని ఒక సీనియర్ నేత తెలిపారు. త్వరలో ఆయన్ను మంత్రివర్గంలోకి తీసుకుంటామని ఇటీవల సీఎం ప్రకటించిన విషయం తెలిసిందే. మార్చిలో ఎమ్మెల్సీగా ఎన్నికైన తర్వాత తన అన్న మంత్రివర్గంలోకి వస్తారని పవన్ కళ్యాణ్ కూడా చెప్పారు. ఈ నేపథ్యంలో నాగబాబుకు ఎమ్మెల్సీ పదవి లాంఛనమేనని చెబుతున్నారు. మరోవైపు బీజేపీ కూడా ఒక స్థానాన్ని కేటాయించాలని ఒత్తిడి తెస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. రాజ్యసభ స్థానాల్లో ఇప్పటికే బీజేపీకి ఎక్కువ అవకాశం కల్పించామని, ఈసారికి ఇవ్వలేమని టీడీపీ పైకి చెబుతున్నా, అగ్ర నేతలు జోక్యం చేసుకుంటే ఒకటి బీజేపీ ఖాతాలో పడే అవకాశం ఉంది. -
చంద్రబాబూ.. ఇంత బరితెగింపా?: ఎమ్మెల్యే చంద్రశేఖర్
సాక్షి, తాడేపల్లి: చంద్రబాబు విజన్ ఉన్న నాయకుడు కాదని.. విషం చిమ్మే నాయకుడంటూ వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్ మండిపడ్డారు. చంద్రబాబు బరితెగించి మాట్లాడుతున్నారని.. ఆయనకు ఎందుకింత కక్ష అంటూ ధ్వజమెత్తారు. ఆదివారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. ‘‘చంద్రబాబు చేసింది విద్వేషపూరిత వ్యాఖ్యలు.. మేం తలుచుకుంటే వైఎస్సార్సీపీ నేతలు రోడ్లపై తిరగలేరని హోంమంత్రి మాట్లాడుతున్నారు’’ అని చంద్రశేఖర్ ఆగ్రహం వ్యక్తం చేశారు.‘‘చంద్రబాబుకి ముఖ్యమంత్రిగా కొనసాగే అవకాశం ఉందా?. పచ్చబిళ్ల పెట్టుకున్న వాళ్ల పనులు చేసిపెట్టమన్న అచ్చెన్నాయుడి వ్యాఖ్యలకు కొనసాగింపే చంద్రబాబు వ్యాఖ్యలు. రాగ ద్వేషాలతో సీఎం, హోంమంత్రి మాట్లాడుతున్నారు. వైఎస్సార్సీపీ నేతలు మాట్లాడితే అక్రమంగా కేసులు పెడుతున్నారు. దాడులు చేస్తున్నారు. అనారోగ్యంతో ఉన్నా క్రూరంగా వ్యవహరిస్తున్నారు. ముఖ్యమంత్రి కేవలం టీడీపీ నేతల కోసం పనిచేస్తారా.. లేక ప్రజలందరి కోసం పనిచేస్తారా?’’ అంటూ చంద్రశేఖర్ నిలదీశారు.‘‘తన కొడుకును సీఎం చేసుకోవటానికి లోకేష్ నియోజకవర్గానికి నిధులు మళ్లిస్తున్నారు. ప్రశ్నించిన వైఎస్సార్సీపీ నాయకులపై అక్రమ కేసులు పెట్టి జైళ్లకు పంపిస్తున్నారు. కులం, మతం చూడకుండా జగన్ పాలన చేశారు. ప్రస్తుత కూటమి పాలనలో అంతా వివక్షే. రెడ్డి సామాజికవర్గంపై కక్ష సాధిస్తున్నారు. దళిత ఆఫీసర్లను ఇబ్బందులు పెడుతున్నారు. తన వ్యాఖ్యలపై చంద్రబాబు తక్షణమే క్షమాపణ చెప్పాలి. చంద్రబాబు వ్యాఖ్యలపై గవర్నర్, కేంద్రం స్పందించాలి’’ అని చంద్రశేఖర్ డిమాండ్ చేశారు.‘‘గుక్కెడు నీటి కోసం ఇబ్బంది పడే పశ్చిమ ప్రకాశంపై ఎందుకు మీకింత పగ?. వెలిగొండ ప్రాజెక్ట్‌పై నిజాలు మాట్లాడే దమ్ముందా?. మంత్రి నిమ్మల రామానాయుడు వెలిగొండ ప్రాజెక్టు ఆర్అండ్ఆర్ ప్యాకేజ్‌కు నిధులు కేటాయించకుండా మాటలు చెబుతున్నారు. వెలిగొండ కోసం త్వరలో పాదయాత్ర చేపట్టబోతున్నాం. ఎర్రగొండపాలెనికి మీ శాఖ ద్వారా ఏం చేశారో పవన్ కళ్యాణ్ సమాధానం చెప్పాలి. వెలిగొండను సందర్శించి పవన్ కళ్యాణ్ వాస్తవాలు తెలుసుకోవాలి’’ అని చంద్రశేఖర్ హితవు పలికారు. -
చంద్రబాబు వ్యాఖ్యలు రాజ్యాంగ విరుద్దం: శైలజానాథ్
అనంతపురం: ఏపీలో టీడీపీ కూటమికి చట్టం చుట్టామా అని అన్నారు. మాజీ మంత్రి శైలజానాథ్. ముఖ్యమంత్రి చంద్రబాబు వ్యాఖ్యలు రాజ్యాంగ విరుద్ధం అంటూ మండిపడ్డారు. రాష్ట్రంలో వైఎస్సార్సీపీ కార్యకర్తలకు సంక్షేమం, అభివృద్ధి అందకూడదు అంటే ఎలా? అని చంద్రబాబును సూటిగా ప్రశ్నించారు.వైఎస్సార్సీపీ నాయకులు శైలజానాథ్ తాజాగా మీడియాతో మాట్లాడుతూ..‘ముఖ్యమంత్రి చంద్రబాబు తన స్థాయిని దిగజార్చుకున్నారు. ఆయన వ్యాఖ్యలు రాజ్యాంగ విరుద్ధం. చేసిన ప్రమాణానికి విరుద్ధంగా చంద్రబాబు వ్యవహార శైలి ఉంది. అంతఃకరణ శుద్ధితో పనిచేయాలని భారత రాజ్యాంగం చెబుతోంది. సీఎం, మంత్రులు రాగద్వేషాలకు అతీతంగా పనిచేయాలి. రాష్ట్రంలో వైఎస్సార్సీపీ కార్యకర్తలకు సంక్షేమం, అభివృద్ధి అందకూడదు అంటే ఎలా?.రాష్ట్రంలో కులాలు, మతాలకు అతీతంగా వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ సంక్షేమ ఫలాలు అందించారు. వైఎస్ జగన్‌ను చూసి చంద్రబాబు పాలన నేర్చుకోవాలి. వైఎస్ జగన్, ఆయన కుటుంబ సభ్యులపై అసభ్య పదజాలంతో టీడీపీ కూటమి నేతలు పోస్టింగ్స్ పెడుతున్నారు. టీడీపీ కూటమికి చట్టం చుట్టమా?. వారు ఎన్ని తప్పులు చేసినా ఎక్కడా పోలీసులు చర్యలు తీసుకోవడం లేదు ఎందుకు?’ అని ప్రశ్నించారు.రెడ్‌బుక్ పేరుతో లోకేష్ అరాచకలు..మరోవైపు, మాజీ ఎమ్మెల్యే అనంత వెంకటరామిరెడ్డి మాట్లాడుతూ..‘ముఖ్యమంత్రి చంద్రబాబు వ్యాఖ్యలు దుర్మార్గం. వైఎస్సార్సీపీ నేతలపై చంద్రబాబు వ్యాఖ్యలు అప్రజాస్వామికం. ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న ప్రజలందరికీ బాధ్యుడిగా ఉండాలి. చంద్రబాబు తన వ్యాఖ్యలను వెంటనే ఉప సంహరించుకోవాలి. లేకపోతే ముఖ్యమంత్రి పదవికి చంద్రబాబు అనర్హుడు అని భావిస్తాం. రెడ్‌బుక్ రాజ్యాంగం పేరుతో నారా లోకేష్ అరాచకాలు చేస్తున్నారు. బాలకృష్ణ ఇంట్లో కాల్పులు జరిగితే సీఎం హోదాలో ఉన్న వైఎస్సార్ రాజకీయాలు చూడలేదు. కులాలు, పార్టీలకు అతీతంగా సంక్షేమ పథకాలు అందించిన ఘనత వైఎస్ జగన్‌దే’ అని తెలిపారు. -
పోసాని ఆరోగ్యంపై విషపు రాతలు.. పచ్చ మీడియా సిగ్గుపడాలి: భూమన
సాక్షి, తిరుపతి: సూపర్ సిక్స్ హామీలు అమలు చేయలేని వ్యక్తి చంద్రబాబు అని ఆరోపించారు వైఎస్సార్సీపీ నాయకులు భూమక కరుణాకర్ రెడ్డి. అలాగే, సంపద సృష్టించలేకపోతున్నా అంటూ చంద్రబాబు అబద్ధపు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. ఇక, పోసాని ఆరోగ్యంపై విషపు రాతలు రాస్తున్న ఎల్లో మీడియా సిగ్గు పడాలని చురకలు అంటించారు.చిత్తూరు జిల్లా వైఎస్సార్సీపీ అధ్యక్షుడు భూమన కరుణాకర్ రెడ్డి తిరుపతిలో మీడియాతో మాట్లాడుతూ.. ఎన్నికల్లో అబద్దపు హామీలు ఇచ్చి కూటమి నేతలు ప్రజలను మోసం చేశారు. అధికారంలోకి వచ్చాక చంద్రబాబు ఏ ఒక్క హామీని అమలు చేయడం లేదు. తల్లికి వందనం, అన్నదాత సుఖీభవలో కోతలు పెట్టారు. బడ్జెట్లో నిరుద్యోగ భృతి ఊసే లేదు. హామీలను గాలికి వదిలేశారు. అధికారంలోకి వచ్చి తొమ్మిది నెలలు అయినప్పటికీ ప్రజలకు చేసిందేమీ లేదు. సంక్షేమం పట్టించుకోవడం లేదు.. అభివృద్ధి ఎక్కడా కనిపించడం లేదు. మీరు ప్రజల్లోకి వెళ్తే పేదలు కష్టాలు తెలుస్తాయి.ఎన్నికల్లో ఇచ్చిన ఏ ఒక్క హామీ అమలు చేయని వ్యక్తి చంద్రబాబు. 2లక్షల కోట్లు పేదలకు పంచిన వ్యక్తి వైఎస్ జగన్. పేదలకు మంచి చేశారు కాబట్టే వైఎస్ జగన్‌కు 40 శాతం ఓట్లు వచ్చాయి. మంచి చేశాం కాబట్టే వైఎస్సార్సీపీ పట్ల ప్రజల్లో సానుభూతి వ్యక్తమవుతోంది. సోషల్ మీడియాలో వైఎస్సార్సీపీ బలంగా ఉంది అంటూ పచ్చమీడియాలో వార్తలు రాస్తున్నారు. వాస్తవానికి ప్రభుత్వం పట్ల టీడీపీ సానుభూతిపరుల్లోనే వ్యతిరేకత ఉంది. కూటమికి ప్రజలు తగిన బుద్ధి చెప్పేందుకు సిద్ధంగా ఉన్నారు. వైఎస్సార్సీపీ పాలన కోసం ప్రజలు ఎదురుచూస్తున్నారు.కుట్రలతో పోసాని కృష్ణమురళిపై అక్రమ కేసులు పెట్టారు. ప్రతీకార కక్షతో చంద్రబాబు కుట్రలు చేస్తున్నారు. పోసాని ఆరోగ్య పరిస్థితిపై నాటకాలు అంటూ విష ప్రచారం చేస్తున్న పచ్చ పత్రికలు సిగ్గుపడాలి. ఆయన ఆసుపత్రిలో ఉన్నా బెయిల్ వచ్చే పరిస్థితి లేదు. ఆయనపై ఎల్లో మీడియా ఎందుకు విషపు రాతలు రాస్తోంది. పోసానికి వచ్చిన పరిస్థితి మీకు ఎదురైతే ఇలానే ఆలోచిస్తారా? అని ప్రశ్నించారు. -
లోకేష్‌ను అదుపు చేయకపోతే బాబుకు కష్టాలు తప్పవు: లక్ష్మీపార్వతి
సాక్షి, హైదరాబాద్: ఏపీలో కూటమి సర్కార్.. వైఎస్సార్సీపీ నేతలను టార్గెట్ చేయడమే లక్ష్యంగా పెట్టుకుందన్నారు వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కారదర్శి లక్ష్మీపార్వతి. ఇదే సమయంలో నారా లోకేష్‌ను అదుపులో పెట్టకపోతే రానున్న రోజుల్లో చంద్రబాబు తప్పకుండా తగిన మూల్యం చెల్లించుకుంటారని తెలిపారు.నటుడు పోసాని కృష్ణమురళి అరెస్ట్‌పై వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కారదర్శి నందమూరి లక్ష్మీపార్వతి స్పందించారు. ఈ సందర్బంగా ఆమె మీడియాతో మాట్లాడుతూ..‘అనారోగ్యంతో బాధ పడుతున్న పోసానిని ఇబ్బంది పెడుతున్నారు. తనకు వచ్చిన అవార్డును పోసాని తిరస్కరించారు. ఆయన అవార్డు తిరస్కరించారని కక్ష గట్టి కేసులు పెట్టారు. నారా లోకేష్‌ను అదుపులో పెట్టకపోతే రానున్న కాలంలో చంద్రబాబుకు కష్టాలు తప్పవు. మీరంతా రాక్షస జాతిలో పుట్టారా?. పురాణాల్లో చదువుకున్నాం. ఇప్పుడు చూస్తున్నాం అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.పోసానికి అస్వస్థత..ఇదిలా ఉండగా.. పోసాని కృష్ణమురళిని అక్రమ కేసులో ఇరికించి, అరెస్టు చేయడమే కాకుండా, ఆయన ఆరోగ్యం పట్ల కూడా ప్రభుత్వం కుట్రపూరితంగానే వ్యవహరించింది. బుధవారం రాత్రి హైదరాబాద్‌లో అరెస్టు చేసిన పోసాని మురళిని గురువారం రాత్రి కోర్టులో హాజరుపరిచి, శుక్రవారం రాజంపేట సబ్‌జైలుకు తీసుకెళ్లారు. అక్కడ విరేచనాలు అయినట్లు కుటుంబ సభ్యులకు పోసాని తెలిపారు. శనివారం గుండెల్లో, కడుపులో నొప్పిగా ఉందని చెప్పడంతో ముందుగా అక్కడి పీహెచ్‌సీకి తరలించారు. అక్కడ ప్రాథమికంగా పరీక్షలు చేయించి, వైద్యుల సూచన మేరకు కడపలోని రిమ్స్‌కు తరలించారు. ఇక్కడ కూడా ఆయన పట్ల ప్రభుత్వం, పోలీసులు అత్యంత క్రూరంగా వ్యవహరించారు. గుండెల్లో, కడుపు నొప్పితో బాధపడుతున్నా అంబులెన్సులో కాకుండా పోలీసు వాహనంలోనే తీసుకెళ్లడం క్రూరత్వమే.పైగా, ఆయనది అనారోగ్యం కాదని, నటన అంటూ రైల్వే కోడూరు రూరల్ సీఐ వెంకటేశ్వర్లు రిమ్స్ ఆవరణలోనే మీడియాతో మాట్లాడుతూ చెప్పడం అందరినీ విస్మయపరిచింది. 67 ఏళ్ల వయస్సులో ఉన్న ఓ ప్రముఖుడు, సీనియర్ సిటిజన్ పట్ల ఓ సీఐ ఇంత దారుణంగా మాట్లాడటం ప్రభుత్వ కర్కశత్వానికి నిదర్శనమని పలువురు మండిపడుతున్నారు. ఇదే తరుణంలో పోసానికి ఏదైనా జరగరానిది జరిగితే బాధ్యత ఎవరిదంటూ ఆయన అభిమానులు ప్రశ్నిస్తున్నారు. -
ఇంత దా‘రుణమా’?
సాక్షి, అమరావతి: ‘‘టీడీపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక 2024 నవంబరులో ప్రవేశపెట్టిన తొలి బడ్జెట్(AP Budget)లో రాష్ట్ర అప్పులను రూ.6.46 లక్షల కోట్లుగా చూపారు. ఇందులో 2019లో వైఎస్సార్సీపీ ప్రభుత్వం(YSRCP Govt) వచ్చే నాటికి ఉన్న రాష్ట్ర అప్పు రూ.3.10 లక్షల కోట్లు. 2024లో వైఎస్సార్సీపీ ప్రభుత్వం దిగిపోయే నాటికి ఉన్న అప్పులు రూ.6.46 లక్షల కోట్లు. అందులో టీడీపీ ప్రభుత్వం 2019లో దిగిపోయేనాటికి రూ.3.10 లక్షల కోట్ల అప్పులు కూడా ఉన్నాయి.ఇవన్నీ మీరు మీ తొలి బడ్జెట్లో చూపినవే. అయినా సరే రుణాలపై మళ్లీ అసత్య ప్రచారం చేస్తారా..?’’ అంటూ సీఎం చంద్రబాబును ఆర్థిక శాఖ మాజీ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్(Buggana Rajendranath) నిలదీశారు. ‘‘మీ వైఫల్యాల నుంచి ప్రజల దృష్టిని మళ్లించడానికి పదేపదే అసత్యాలు వల్లె వేస్తారా? బడ్జెట్ వాల్యూమ్–6 (బడ్జెట్ ఇన్ బ్రీఫ్)లో రాష్ట్ర అప్పుల వివరాలను ముద్రించడం ఆనవాయితీగా వస్తోంది.ప్రస్తుత బడ్జెట్లో ఆ వివరాలను ఎందుకు ముద్రించలేదు? అప్పులపై వాస్తవాలు బహిర్గతమవుతాయనే ఆ వివరాలను మీరు ముద్రించలేదన్నది వాస్తవం కాదా?’’ అని బుగ్గన నిలదీశారు. ప్రజలకు వాస్తవాలు తెలియాలంటే తక్షణమే బడ్జెట్ వాల్యూమ్–6లో రాష్ట్ర అప్పుల వివరాలను ముద్రించాలని డిమాండ్ చేస్తూ శనివారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. ఆ ప్రకటనలో బుగ్గన ఇంకా ఏమన్నారంటే..⇒ రాష్ట్ర అప్పులపై టీడీపీ(TDP) కూటమి అదే పనిగా వైఎస్సార్సీపీ ప్రభుత్వంపై దుష్ప్రచారం చేస్తోంది. ఇష్టానుసారం మాట్లాడుతూ వైఎస్సార్సీపీ హయాంలో రాష్ట్ర అప్పులు రూ.14 లక్షల కోట్లకు చేరాయంటూ, పచ్చి అబద్ధాలు ప్రచారం చేశారు. శనివారం కూడా చిత్తూరు జిల్లా పర్యటనలో సీఎం చంద్రబాబు గత పాలకులు రాష్ట్రాన్ని అడవి పందుల్లా దోచుకు తిన్నారని, రూ.10 లక్షల కోట్ల అప్పుల భారం ప్రజలపై మోపారని నిందిస్తూ, వైఎస్సార్సీపీ ప్రభుత్వంపై నిందలేశారు.⇒ నిజానికి ఏనాడూ రాష్ట్ర అప్పులు ఆ స్థాయిలో లేవు. ఎవరి హయాంలో అప్పులు పెరిగాయి? అనేది ఆధారాలతో సహా మేం చాలాసార్లు మాట్లాడాం. స్పష్టంగా చూపాం. 2014–19 మధ్య చంద్రబాబు పాలనలో అప్పుల పెరుగుదల కాంపౌండ్ యాన్యువల్ గ్రోత్ రేట్ (సీఏజీఆర్) 19.54 శాతం కాగా, 2019–24 మధ్య వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో అప్పుల పెరుగుదల సీఏజీఆర్ 15.61 శాతం మాత్రమే.వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో రెండేళ్లు కోవిడ్ వల్ల రాష్ట్ర ఆదాయం పడిపోయి, ఖర్చులు పెరిగినా కూడా, అప్పుల పెరుగుదల తక్కువే. అవన్నీ గణాంకాలతో సహా చెప్పాం. కానీ, చంద్రబాబు ఏనాడూ దానికి సమాధానం ఇవ్వలేదు. ఎందుకంటే, అవన్నీ వాస్తవాలు కాబట్టి. మరి అలాంటప్పుడు మళ్లీ వైఎస్సార్సీపీ ప్రభుత్వం రూ.10 లక్షల కోట్ల అప్పుల భారం మోపిందని అంత అన్యాయంగా ఎలా మాట్లాడారు చంద్రబాబూ?.⇒ ఇక ఈ ఏడాది బడ్జెట్లో చంద్రబాబు సర్కార్ అప్పులు చూపలేదు. బడ్జెట్ వాల్యూమ్–6లో రాష్ట్ర రుణాలపై అన్ని వివరాలు చూపడం ఎప్పటినుంచో వస్తున్న ఆనవాయితీ, సంప్రదాయం. కానీ, సీఎం చంద్రబాబు దాన్ని కాలరాసి, ఈ ఏడాది బడ్జెట్లో రాష్ట్ర అప్పులను చూపలేదు. వాటి వివరాలు వెల్లడించలేదు. దీన్నిబట్టి ఆయన ఉద్దేశం ఏమిటన్నది ప్రజలు అర్ధం చేసుకోవాలి.⇒ బడ్జెట్ వాల్యూమ్–6లో రాష్ట్ర రుణాల వివరాలు ప్రకటిస్తే, వాస్తవాలన్నీ వెలుగులోకి వస్తాయి. ఎవరి హయాంలో ఎంత అప్పు చేశారన్నది తెలుస్తుంది. చంద్రబాబు అసత్య ప్రచారం బయటపడుతుందని అర్ధమవుతుంది. ఈ ఉద్దేశంతోనే బడ్జెట్లో అప్పుల వివరాలు వెల్లడించకుండా, యథావిథిగా వైఎస్సార్సీపీ ప్రభుత్వంపై నిందలు వేస్తూ, పచ్చి అసత్యాలు ప్రచారం చేస్తున్నారు. ప్రజలను మభ్యపెట్టాలని చూస్తున్నారు.కానీ, కాగ్ నివేదిక ఆధారంగా ప్రజలకు ఎలాగూ రాబోయే కాలంలో నిజం తెలుస్తుంది.⇒ బాధ్యతాయుతమైన పదవిలో ఉండి కూడా.. రాష్ట్రాన్ని అడవి పందుల్లా దోచుకుతిన్నారని, రూ.10 లక్షల కోట్ల అప్పుల భారం ప్రజలపై మోపారని పచ్చి అసత్యాలతో నిందించడం మీ స్థాయికి భావ్యమా చంద్రబాబూ?. మీ వైఫల్యాల నుంచి ప్రజల దృష్టి మళ్లించేందుకు చేస్తున్న ఈ దుష్ప్రచారాన్ని వెంటనే ఆపాలి.⇒ మీకు నిజంగా ప్రజలకు వాస్తవాలు తెలియాలని ఉంటే వాల్యూమ్–6లో ఆనవాయితీగా, సంప్రదాయబద్ధంగా దశాబ్దాల నుంచి వచ్చే పద్ధతిలో అన్ని వివరాలతో అప్పుల వివరాలు ప్రింట్ చేయండి చంద్రబాబూ? అప్పుడు నిజమేదో బయట పడుతుంది. -
‘చంద్రబాబు లక్ష 20 వేల కోట్లు అప్పు చేస్తే గొప్పగా రాస్తున్నారు’
విశాఖ: కూటమి ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ తో నవ్వాలో జాలి పడాలో తెలియని పరిస్థితి కనిపిస్తోందని వైఎస్సార్ సీపీ ఉత్తరాంధ్ర రీజినల్ కో ఆర్డినేటర్ కురసాల కన్నబాబు విమర్శించారు. కూటమి ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ తో వైఎస్ జగన్ మరో 10 మెట్లు పైకి ఎక్కారన్నారు కురసాల. బడ్జెట్ ప్రసంగమంతా చంద్రబాబు లోకేష్ పొగడ్తలకే సరిపోయిందని, బడ్జెట్ ను మసి పూసి మారేడు కాయ చేశారన్నారు.బడ్జెట్ గురించి ఎల్లో మీడియాలో రాసుకోవడానికి తప్ప ఎందుకు పనికిరాదని ధ్వజమెత్తారు. తల్లికి వందనం, అన్నదాత సుఖీభవ పథకాలకు అరకొరగా నిధులు కేటాయించారు. వైఎస్ జగన్ కరోనా సమయంలో అప్పు చేస్తే రాష్ట్రం దివాలా అని వార్తల రాశారు. చంద్రబాబు లక్ష 20 వేల కోట్లు అప్పు చేస్తే గొప్పగా రాస్తున్నారు’ అని మండిపడ్డారు. పోసాని అరెస్టు ద్వారా కొత్త సంస్కృతికి తెర తీశారు. ఆరోగ్యం బాగో లేకపోయినా జైల్లో పెట్టారు. అసెంబ్లీ వేదికగా వైఎస్ జగన్ పై, వైఎస్సార్ సీపీ నేతలపై దారుణంగా మాట్లాడుతున్నారు. మీరు ఇదే సాంస్కృతిని కొనసాగిస్తే వచ్చే ప్రభుత్వం ఈ సంస్కృతిని కొనసాగించదా? అని కురసాల కన్నబాబు హెచ్చరించారు. -
వైఎస్సార్సీపీ శ్రేణులే లక్ష్యంగా చంద్రబాబు కక్షపూరిత వ్యాఖ్యలు
విజయవాడ: ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కక్ష సాధింపు చర్యలు ఒక్కోక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. వైఎస్సార్సీపీ శ్రేణులే లక్ష్యంగా ఇప్పటికే కుట్ర పూరిత రాజకీయాలు చేస్తున్న చంద్రబాబు.. ఈసారి ఏకంగా ఆ పార్టీకి చెందిన వారికి ఏ పనులు చేయొద్దంటూ వ్యాఖ్యానించడం తీవ్ర దుమారం రేపుతోంది. వైఎస్సార్ సీపీకి చెందిన వారికి ఎటువంటి పనులు చేయొద్దని చంద్రబాబు బహిరంగంగానే వ్యాఖ్యానించారు. డైరెక్ట్ గా, ఇండైరెక్ట్ గా వైఎస్సార్ సీపీ శ్రేణులకు ఏ పనులు చేయకండని, అన్ని స్థాయిల్లోనూ ఇది వర్తిస్తుందని వ్యాఖ్యానించారు. తన సొంత జిల్లా(చిత్తూరు జిల్లా) పర్యటనలో భాగంగా ప్రజా వేదిక పేరుతో ఏర్పాటు చేసిన సభలో సీఎం చంద్రబాబు ఈ రకంగా కక్ష పూరిత వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు వ్యాఖ్యలపై విమర్శలుముఖ్యమంత్రి స్థానంలో ఉన్న చంద్రబాబు ఈ తరహా కక్ష సాధింపు వ్యాఖ్యలు చేయడంపై విమర్శలు వస్తున్నాయి. గతంలో పార్టీ రహితంగా మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ పాలన అందిస్తే, ఇప్పుడు చంద్రబాబు ఇలా వ్యాఖ్యానించడం కక్ష పూరిత రాజకీయం కాకపోతే ఏంటని రాజకీయ విమర్శకులు ప్రశ్నిస్తున్నారు. సీఎంగా ప్రమాణం చేసే సమయంలో రాజ్యాంగాన్ని గౌరవిస్తానంటూ చంద్రబాబు చేసిన ప్రమాణం ఏమైందని మండిపడుతున్నారు. ఇది రాజ్యాంగానికి, సీఎం ప్రమాణానికి విరుద్ధమంటూ విమర్శలు వ్యక్తమవుతున్నాయి. -
‘మేం చర్చకు సిద్ధం ...మీరు సిద్ధమా?’
విజయవాడ: గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వంలో పాలన, ప్రస్తుత కూటమి ప్రభుత్వంలో పాలనపై చర్చకు సిద్ధమా అంటూ ఎన్టీఆర్ జిల్లా వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు దేవినేని అవినాష్ సవాల్ విసిరారు. కూటమి అధికారంలోకి వచ్చి ఏడాది గడుస్తున్నా వైఎస్సార్ సీపీపై ఆరోపణలు చేస్తూ జగన్ పాలన పై కూటమి నేతలు విమర్శలు చేస్తున్నారని మండిపడ్డ అవినాష్.. ఇరు ప్రభుత్వాల పాలనపై చర్చకు సిద్ధమా అంటూ కూటమి ప్రభుత్వాన్ని సవాల్ చేశారు.ఇచ్చిన హామీల గురించి పవన్ కళ్యాణ్ ఎందుకు మాట్లాడటం లేదు. కూటమి ప్రభుత్వం బడ్జెట్ తో అందరినీ మోసం చేసింది. ఈ బడ్జెట్ చూసి రాష్ట్రంలోని ప్రతీ ఒక్కరూ బాధ పడుతున్నారు. చంద్రబాబు, పవన్ కళ్యాణ్ లు కలిసి ప్రజలను మోసం చేశారు. ఇచ్చిన హామీల గురించి పవన్ కళ్యాణ్ ఎందుకు మాట్లాడటం లేదు. రైతులను,విద్యార్థులను, నిరుద్యోగులను, మహిళల్ని మోసం చేశారు. జగన్ ఇచ్చిన మాటకు కట్టుబడి పాలన చేశారు. గ్రూప్ 2 కి ప్రిపేర్ అయిన వారిని అనేక ఇబ్బందులు పెట్టారు. రాష్ట్రంలో టార్గెట్ చేసి వైఎస్సార్ సీపీ నాయకులు హింసిస్తున్నారు. వైఎస్సార్ సీపీ నేతలను ఇబ్బంది పెడితే పార్టీ అండగా ఉంటుంది’ అని దేవినేని అవినాష్ స్పష్టం చేశారు. -
పోసానిపై సీఐ స్టేట్మెంట్ ఇవ్వడమేంటి?.. ప్రకటనపై అనుమానాలు!
సాక్షి, వైఎస్సార్ జిల్లా: అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న పోసాని కృష్ణమురళిపై పోలీసులు మానవత్వం లేకుండా ప్రవర్తిస్తున్నారు. జ్యూడీషియల్ కస్టడీలో ఉన్న పోసానిపై నాటకాలాడుతున్నారంటూ రైల్వే కోడూరు సీఐ వెంకటేశ్వర్లు చేసిన ప్రకటనపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. డాక్టర్లు ప్రకటన విడుదల చేయకుండా ముందుగానే సీఐ మాట్లాడటంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మరోవైపు, పోసాని భద్రతపై ఆయన కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారు. పోసాని ఆరోగ్యంపై పోలీసులు స్టేట్మెంట్ ఇవ్వడమేంటని పలువురు ప్రశ్నిస్తున్నారు. కనీసం మానవత్వం లేకుండా పోలీసులు స్టేట్మెంట్లు ఇస్తున్నారు.గత రాత్రి నుంచి ఛాతి నొప్పితో బాధపడుతున్న పోసాని.. కొంతకాలంగా కడుపులో ఇన్ఫెక్షన్తో బాధపడుతున్నారు. ఎడమ భుజం నొప్పితో ఇబ్బందిపడుతున్నారు. తీవ్రమైన గొంతునొప్పితో కూడా బాధపడుతున్న పోసాని.. మాట్లాడానికి కూడా ఇబ్బందిపడుతున్నారు. పోసాని తీవ్రమైన గ్యాస్టిక్ సమస్యతో బాధపడుతున్నారు. అబ్డామిన్ హెర్నియా సర్జరీలో ఇన్ఫెక్షన్ వల్ల పోసానికి తీవ్రమైన సమస్య ఉంది.హెర్నియా సర్జరీ తర్వాత నెలరోజులు ఆస్పత్రిలోనే పోసాని చికిత్స తీసుకున్నారు తీవ్రమైన వెన్నునొప్పితో మూడుసార్లు వోకల్ కార్డు సర్జరీ జరిగింది. కొద్ది రోజుల క్రితం పోసానికి గుండెకు సంబంధించిన చికిత్స జరగగా, హార్ట్ సర్జరీ చేసిన స్టంట్ వేశారు వైద్యులు. హార్ట్ సర్జరీ తర్వాత ఛాతిలో నొప్పితో పోసాని బాధపడుతున్నారు. -
ఏపీ బడ్జెట్లో ఉద్యోగులకు తీరని అన్యాయం: చంద్రశేఖర్‌రెడ్డి
సాక్షి, తాడేపల్లి: రాష్ట్ర బడ్జెట్లో ఉద్యోగులకు తీరని అన్యాయం జరిగిందని వైఎస్సార్సీపీ ఎంప్లాయిస్ అండ్ పెన్షనర్స్ వింగ్ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.చంద్రశేఖర్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. తాడేపల్లి వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో శనివారం మీడియాతో మాట్లాడుతూ.. ఉద్యోగులకు చెల్లించాల్సిన రూ.30,000 కోట్ల బకాయిలపై బడ్జెట్లో ఎక్కడా కేటాయింపులు లేకపోవడం దుర్మార్గమని మండిపడ్డారు. ఎన్నికలకు ముందు ఉద్యోగులు, పెన్షనర్లకు ఇచ్చిన హామీలపై బడ్జెట్లో ప్రస్తావనే లేకపోవడం నిరాశను మిగిల్చిందని ధ్వజమెత్తారు. ఇంకా ఆయన ఏమన్నారంటే..ఉద్యోగులకు ఇచ్చిన హామీలను విస్మరించారుఉద్యోగులకు మెరుగైన పీఆర్సీని ఇస్తామని ఎన్నికలకు ముందు హామీ ఇచ్చారు. అధికారలోకి వచ్చి తొమ్మిది నెలలు అయినా కూడా ఇప్పటి వరకు పే రివిజన్ కమిషన్ ఏర్పాటే చేయలేదు. బడ్జెట్ లో పీఆర్సీ గురించి ఎక్కడా మాట్లాడలేదు. అసలు ఉద్యోగులకు పీఆర్సీ ఇచ్చే ఉద్దేశమే ఈ ప్రభుత్వానికి లేదని తెలుస్తోంది. ప్రభుత్వం రాగానే మధ్యంతర భృతి ఇస్తామని హామీ ఇచ్చారు. ఇప్పటి వరకు దీని గురించి మాట్లాడేవారే లేరు. బడ్జెట్లో దీనికి ఒక్క రూపాయి కూడా దీనికి కేటాయించలేదు. గతంలో వైఎస్ జగన్ మా ప్రభుత్వం వస్తే ఉద్యోగులకు 27 శాతం ఐఆర్ ఇస్తామని హామీ ఇచ్చారు.ఒకటో తేదీనే ఉద్యోగులకు జీతాలు, పెన్షన్లు ఇస్తామని హామీ ఇచ్చి, కేవలం ఒక్క నెలలో మాత్రమే దానిని కార్యరూపంలో చూపించారు. గత ఎనిమిది నెలల నుంచి ఏ తేదీన జీతాలు, పెన్షన్లు ఇస్తారో తెలియడం లేదు. ఉద్యోగులకు సంబంధించి దాదాపు రూ.30 వేల కోట్లు బకాయిలు ఇవ్వాల్సి ఉంది. గ్రాట్యుటీ, మెడికల్ రీయింబర్స్ మెంట్, సరెండర్ లీవులు, పీఆర్సీ, డీఏ ఎరియర్స్ ఉన్నాయి. వాటన్నింటినీ సకాలంలో ఇవ్వాల్సని బాధ్యత ప్రభుత్వానికి లేదా? ఈ బకాయిలను ఎగ్గొట్టేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోందా? ఈ బకాయిల చెల్లింపుల కోసం ఎంత కేటాయిస్తున్నారో బడ్జెట్ లో ఎక్కడా చెప్పలేదు.తాత్కాలిక ఉద్యోగులను మోసం చేశారుఅవుట్ సోర్సింగ్, కాంట్రాక్ట్ ఉద్యోగులకు ప్రభుత్వ పథకాలను వర్తింప చేస్తామని హామీని నేటికీ నెరవేర్చలేదు. వాలంటీర్ వ్యవస్థను కొనసాగిస్తాం, మా ప్రభుత్వం రాగానే అయిదు నుంచి పదివేల రూపాయలు ఇస్తామని హామీ ఇచ్చారు. వాలంటీర్లను ఇప్పుడు రోడ్డుమీద పడేశారు. ఎక్సైజ్ డిపార్ట్ మెంట్ కింద పనిచేస్తున్న పదివేల మంది కాంట్రాక్ట్ ఉద్యోగులను వీధుల్లోకి తీసుకువచ్చారు. వారికి కనీస ఉద్యోగ భద్రత కల్పించలేదు. కాంట్రాక్ట్ ఉద్యోగుల రెగ్యులరైజేషన్ను రూల్ ఆఫ్ రిజర్వేషన్ ప్రకారం భర్తీ చేయాల్సీ ఉంది. గత ప్రభుత్వంలో పదివేల మందిని గుర్తించి, వారిలో మూడు వేల మందికి అపాయింట్ మెంట్ ఆర్డర్లు కూడా ఇవ్వడం జరిగింది. మిగిలిన ఏడు వేల మందికి ఇప్పటి వరకు అపాయింట్ మెంట్ ఇవ్వకుండా ఇబ్బంది పెడుతున్నారు. గ్రామసచివాలయాల్లో పదిహేను వేలు, రైతుభరోసా కేంద్రాల్లో ఆరువేల ఉద్యోగాలు భర్తీ చేయాల్సి ఉంది. వీటి గురించి బడ్జెట్ లో ఎక్కడా ప్రస్తావించకపోవడం దారుణం.మెగా డీఎస్సీ పేరుతో ప్రభుత్వ దగాకూటమి ప్రభుత్వం ఏర్పాటైన తరువాత మెగా డీఎస్సీని నిర్వహించి ఉద్యోగాలు కల్పిస్తామని హామీ ఇచ్చారు. మొదటి ఫైల్‌గా దీనిపైనే సంతకం చేశారు. కానీ నోటిఫికేషన్ షెడ్యూల్, ఉద్యోగాల భర్తీ ప్రక్రియ మాత్రం మొదలు పెట్టలేదు. ఇవ్వేవీ చేయకుండా బడ్జెట్లో డీఎస్సీ కింద 16,347 టీచర్ ఉద్యోగాల భర్తీకి శ్రీకారం చుట్టామంటూ గొప్పగా చెప్పుకున్నారు. అంటే వచ్చే అయిదేళ్ల పాటు ఇదే చెప్పుకుంటూ పోతారా? ఏపీలో కూటమి ప్రభుత్వం వచ్చిన తరువాత నాలుగు లక్షల ఉద్యోగాలను కల్పించామని గవర్నర్ ప్రసంగంలో అబద్దాలు చెప్పారు.అంగన్వాడీలకు గ్రాట్యూటీ చెల్లిస్తున్నామంటూ బడ్జెట్ లో పేర్కొనడం ఆశ్చర్యంగా ఉంది. ఇప్పటి వరకు దీనిపై ఎటువంటి అధికారిక ఉత్తర్వులు లేకుండానే అమలు జరిగిపోతోందోని చెప్పడం ఎంత వరకు సమంజసం? పోలీస్ విభాగంలో ఉద్యోగులకు చెల్లించాల్సిన బకాయిలు రూ.920 కోట్లు ఉంటే, దానిలో రూ.250 కోట్లు చెల్లించామని చెప్పుకున్నారు. మిగిలిన బకాయిల విషయం ఏమిటనే దానిపై స్పష్టత లేదు.ఇప్పటి వరకు రాష్ట్రంలో మూడు డీఏలు బకాయి పెట్టారు. ధరలు పెరుగుతుండటం వల్ల ఉద్యోగులకు ఇబ్బంది ఉండకూడదనే డీఏ ఇస్తుంటారు. దానిని కూడా మూడు విడతలు బకాయి పెట్టడం దారుణం. నిరుద్యోగభృతి అమలుకు కేటాయింపులు లేవు. కొత్త ఉద్యోగాల భర్తీకి గానూ ప్రకటిస్తామన్న జాబ్ క్యాలెండర్ ఏదీ? అవుట్ సోర్సింగ్ ఉద్యోగులకు సకాలంలో జీతాలు చెల్లించేందుకు గత ప్రభుత్వం అప్కాస్ ను తీసుకువచ్చింది. దానిని నిర్వీర్యం చేస్తూ కూటమి ప్రభుత్వం దళారీల వ్యవస్థను ప్రోత్సహిస్తోంది. ఉద్యోగుల ఆరోగ్యభద్రతకు సంబంధించిన హెల్త్ కార్డ్ లకు ఉద్యోగులు, పెన్షనర్లు తమ వాటాను వారు చెల్లిస్తున్నా, ప్రభుత్వం చెల్లించాల్సిన వాటాను సకాలంలో చెల్లించడం లేదు. దీనివల్ల ఉద్యోగులకు వైద్యం చేసేందుకు ఆసుపత్రులు నిరాకరిస్తున్నాయి. -
అబద్ధాల కుప్పగా ఏపీ బడ్జెట్: మార్గాని భరత్
సాక్షి, తూర్పుగోదావరి: కూటమి ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ అబద్ధాల కుప్పగా, చంద్రబాబు మోసాలకు ప్రతిరూపంగా ఉందని వైఎస్సార్సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి, మాజీ ఎంపీ మార్గాని భరత్ ఆక్షేపించారు. ఎన్నికల ముందు చంద్రబాబు చెప్పిన మాటలకు, ఇప్పుడు కేటాయింపులకు పొంతన లేకుండా బడ్జెట్ రూపొందించారని, ఇదంతా సూపర్ సిక్స్ పథకాల అమల్లో ప్రజలను మోసం చేయడంలో భాగమే అని ఆయన ఆరోపించారు. తల్లికి వందనం, అన్నదాత సుఖీభవ పథకాలకు అరకొర నిధులు కేటాయించడం చూశాక వాటిని కూడా సక్రమంగా అమలు చేయరన్నది స్పష్టమవుతోందని రాజమహేంద్రవరంలో మీడియాతో మాట్లాడిన మార్గాని భరత్ చెప్పారు.మార్గాని భరత్ ఇంకా ఏమన్నారంటే..:ఎవరు కౌటిల్యుడు? ఎవరు చంద్రగుప్తుడు?:అసెంబ్లీలో బడ్జెట్ ప్రవేశపెడుతున్న సందర్భంగా పయ్యావుల కేశవ్ తనను తాను కౌటిల్యుడిగా, చంద్రబాబును చంద్రగుప్త మౌర్యుడిగా పోల్చాడు. సామాన్యుడి సంక్షేమమే తన సంక్షేమంగా భావించి ప్రజలకు మేలు చేసిన చంద్రగుప్త మౌర్యుడితో చంద్రబాబును పోల్చడం విడ్డూరంగా ఉంది. సూపర్ సిక్స్ హామీలకు సంబంధించిన బడ్జెట్లో నిధులు కేటాయించకుండా గొప్పలు చెప్పుకోవడం కన్నా దౌర్భాగ్యం ఇంకోటి ఉంటుందా?. ఇప్పటికే కూటమి ప్రభుత్వం దాదాపు రూ.1.40 లక్షల కోట్ల అప్పు చేసింది. మరోవైపు బడ్జెట్ ప్రసంగంలో భారతదేశంలో అప్పు తీసుకునే శక్తి లేని రాష్ట్రంగా ఏపీ తయారైందని ఆర్థిక మంత్రి పచ్చి అబద్ధాలు చెప్పారు. ప్రభుత్వం ప్రతిపాదించిన రూ.3.22 లక్షల కోట్ల బడ్జెట్లో ఆదాయం కింద రూ.2.17 లక్షల కోట్లు వస్తుందని అంచనా వేశారు. ఇందులో రూ. 1.04 లక్షల కోట్లు అప్పు కింద సమీకరిస్తున్నామని వారే చెప్పారు.మాటలకు చేతలకు పొంతన లేదు:అభివృద్ధి, సంక్షేమాన్ని సమానంగా తీసుకెళ్తామని ప్రకటించిన కూటమి ప్రభుత్వం రెవెన్యూ వ్యయం కింద రూ.2.51 లక్షల కోట్లు కేటాయించి, మూలధన వ్యయం కింద కేవలం రూ.40 వేల కోట్లు కేటాయించింది. అంటే వారు చెప్పే మాటలకు చేసే పనులకు పొంతన లేదని అర్థమవుతుంది. 1995లో ఉమ్మడి రాష్ట్రంలో తొలిసారి సీఎం అయిన చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేసే నాటికి ప్రభుత్వం జీతాలివ్వలేని స్థితిలో ఉందని చెప్పి, అంతకు ముందు పాలించిన ఎన్టీఆర్‌ను ఘోరంగా అవమానించారు. వాస్తవానికి ఆ రోజుల్లో మిగులు బడ్జెట్ ఉంటే ప్రజలకు పచ్చి అబద్ధాలు చెప్పారు. చంద్రబాబు సీఎం అయ్యాకే రాష్ట్రం అప్పులపాలైంది. సీనియర్ నాయకుడు అయి ఉండి కూడా బడ్జెట్ ప్రసంగంలో పయ్యావుల కేశవ్ తన మంత్రి పదవి కాపాడుకోవడానికి నారా లోకేష్‌ను, సీఎం చంద్రబాబును పొగిడే దుస్థితికి దిగజారిపోయారు.పారిశ్రామికవేత్తలను తరిమేస్తున్నారు:పెయిడ్ ఆర్టిస్టును అడ్డం పెట్టి చంద్రబాబు ప్రభుత్వం సజ్జన్ జిందాల్‌ను వేధించి ఏపీ నుంచి తరిమేస్తే ఆయన కంపెనీ జేఎస్‌డబ్ల్యూ మహారాష్ట్రలో రూ.3 లక్షల కోట్లు పెట్టుబడులు పెడుతోంది. ఇలాంటోళ్లు జగన్ పారిశ్రామికవేత్తలను తరిమేశాడని తప్పుడు ప్రచారం చేశారు. పొరుగునే ఉన్న తెలంగాణ, కర్నాటక, మహారాష్ట్ర వంటి రాష్ట్రాలు దావోస్‌లో లక్షల కోట్లు ఒప్పందాలు చేసుకుంటే.. రాష్ట్ర యువతకు ఏడాదికి 4 లక్షల ఉద్యోగాలిస్తామన్న తండ్రీ కొడుకులు చంద్రబాబు, లోకేష్ ఉత్త చేతులతో తిరిగొచ్చారు. ఉద్యోగాలివ్వలేని పక్షంలో నెలకు రూ.3 వేలు నిరుద్యోగ భృతి ఇస్తామని ఎన్నికల్లో హామీ ఇచ్చిన చంద్రబాబు, ఆ పథకానికి బడ్జెట్లో రూపాయి కూడా కేటాయించకుండా 20 లక్షల మంది నిరుద్యోగ యువతను నిలువునా మోసగించాడు.పథకాలన్నీ నిర్వీర్యం:ఎన్టీఆర్ వైద్య సేవ అని పేరు మార్చి ఆరోగ్యశ్రీ పథకాన్ని పూర్తిగా నిర్వీర్యం చేశారు. ట్రస్టు మోడల్ నుంచి ఇన్సూరెన్స్ మోడల్‌కి మార్చేసి పేదలకు ఉచిత వైద్యం అందని ద్రాక్షగా మార్చేశారు. గతేడాది బడ్జెట్లో సూపర్ సిక్స్‌లో ఏ ఒక్క హామీని అమలు చేయకపోగా, ఈ ఏడాది బడ్జెట్లో కూడా ఫ్రీ బస్, ఆడబిడ్డ నిధి, నిరుద్యోగ భృతి వంటి పథకాలకు ఒక్క రూపాయి కూడా కేటాయించకపోగా, తల్లికి వందనం, అన్నదాత సుఖీభవ పథకాలకు అరకొర నిధులు కేటయించి అమలు చేయడంపైనా ప్రజల్లో అనుమానాలు రేకెత్తిస్తున్నారు. 50 ఏళ్లు దాటిన బీసీలకు పింఛన్ ఇస్తామని మాట తప్పారు. అందుకే చంద్రబాబును నమ్మితే పులి నోట్లో తల పెట్టడమేనని, ఎన్నికల ముందు జగన్ చెప్పిన మాటలు ఇప్పుడు నిజమవుతున్నాయని మార్గాని భరత్ గుర్తు చేశారు. -
కోతల బడ్జెట్ ఇది.. మూడు సిక్స్‌లు ఎగిరిపోయాయి: బీవీ రాఘవులు
సాక్షి, విజయవాడ: ఏపీలో కూటమి ప్రభుత్వ బడ్జెట్.. కోతల బడ్జెట్ అంటూ ఎద్దేవా చేశారు సీపీఎం పొలిట్‌బ్యూరో సభ్యులు బీవీ రాఘవులు. అభివృద్ధి, సంక్షేమం ఊసే లేని బడ్జెట్ ఇది. మహిళలు, నిరుద్యోగులకు మొండి చేయి చూపారని ఆరోపించారు. బడ్జెట్లో సమగ్రత లేదు అంటూ వ్యాఖ్యానించారు.సీపీఎం పొలిట్‌బ్యూరో సభ్యులు బీవీ రాఘవులు విజయవాడలో మీడియాతో మాట్లాడుతూ.. ఇది కోతల బడ్జెట్ మాత్రమే. ఆదాయాన్ని పెంచుకునే అంకెలు అన్నీ మోసపూరితమైనవి. సొంత పన్నులు 15వేల కోట్లు పెరుగుతాయని చెప్పారు. ఎలా పెరుగుతాయి చెప్పాలి. రెవెన్యూ ఎస్టిమేషన్, ఖర్చుల ఎస్టిమేషన్ కోత పడబోతుంది. ఎర్ర చందనం అమ్మకం ద్వారా తీసుకొస్తారా? లేక మద్యం తాగించి వసూళ్లు చేస్తారా?. బడ్జెట్లో సమగ్రతే లేదు. అభివృద్ధి, సంక్షేమం ఊసే లేని బడ్జెట్ ఇది. కేంద్రం వాటాపై ఒక మాట కూడా మాట్లాడలేదు.ప్రభుత్వం ప్రారంభంలోనే సూపర్ సిక్స్ల్లో మూడు సిక్స్‌లు ఎగిరిపోయాయి. మిగిలినవి కూడా సంఖ్యల తగ్గిస్తారు. మహిళలు, నిరుద్యోగులకు మొండి చేయి చూపారు. వర్గీకరణ చేసిన తర్వాత డీఎస్సీ ఇస్తామని ఉద్యోగాలు ఎగ్గొట్టె ప్రయత్నం చేస్తోంది. వ్యవసాయశాఖ అంకెలు చూస్తే కడుపు తరుక్కుపోతోంది. ఇరిగేషన్‌పై ఖర్చు తగ్గించారు. 54 మండలాలు ఇప్పటికే కరువు మండలుగా ప్రకటించారు. తక్కువ ఖర్చుతో పూర్తి చేసే ప్రాజెక్టులు పూర్తి చేయాలి. మూలధనం వ్యయం 40వేల కోట్లు.. రెవెన్యూ వ్యయం లక్ష కోట్లుగా ఉంది అంటూ చెప్పుకొచ్చారు. -
పోసాని ఆరోగ్యం బాగోలేదు: ఎమ్మెల్యే ఆకేపాటి
అన్నమయ్య, సాక్షి: కూటమి కుట్రలతో జైలు పాలైన ప్రముఖ సినీ నటుడు పోసాని కృష్ణమురళిని వైఎస్సార్సీపీ నేతలు శనివారం పరామర్శించారు. అయితే ములాఖత్ సందర్భంగా పోలీసులు వ్యవహరించిన తీరుపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తున్నాయి. డిప్యూటీ సీఎం పవన్, మంత్రి నారా లోకేష్‌పై గతంలో పోసాని అనుచిత వ్యాఖ్యలు చేశారని.. సినీ పరిశ్రమలో కులాల పేరుతో చిచ్చు పెట్టేలా మాట్లాడారని కేసులు నమోదైన సంగతి తెలిసిందే. ఈ కేసుల్లో అరెస్టైన పోసాని.. రిమాండ్‌లో ఉన్నారు. పోసానిపై కూటమి ప్రభుత్వం కక్ష గట్టిందని.. ఆయనకు వైఎస్సార్సీపీ అన్నివిధాల అండగా ఉంటుందని పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి ప్రకటించారు. ఈ క్రమంలో.. రాజంపేట సబ్ జైలులో ఉన్న పోసాని కృష్ణమురళితో స్థానిక వైఎస్సార్సీపీ నేతలు ములాఖత్ అయ్యారు. అనంతరం ఎమ్మెల్యే ఆకేపాటి అమర్నాథ్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. పోసాని అనారోగ్యంతో బాధపడుతున్నారని వెల్లడించారు. మరోవైపు.. ములాఖత్ కోసం రైల్వే కోడూరు మాజీ MLA కొరముట్ల శ్రీనివాసులు పెట్టుకున్న విజ్ఞప్తిని జైలు అధికారులు తిరస్కరించారు. దీంతో సబ్ జైలర్ మల్ రెడ్డిపై కొరముట్ల తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. ఇదిలా ఉంటే.. పోసాని బెయిల్ పిటిషన్ సోమవారం విచారణకు వచ్చే అవకాశం ఉంది. -
‘పవన్, బాబు.. ఉచిత బస్సుకు నిధులేవీ?’
సాక్షి, వైఎస్సార్: ఏపీ బడ్జెట్ చూస్తే చంద్రబాబు ఇచ్చిన హామీలకు కేటాయింపులకు పొంతన లేదన్నారు వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎస్వీ సతీష్ కుమార్ రెడ్డి. నిరుద్యోగ భృతికి ఒక్క రూపాయి అయినా కేటాయించావా చంద్రబాబు?. ఉచిత బస్సుకు నిధులేవీ? అని ప్రశ్నించారు. చంద్రబాబుకు సంపద సృష్టించే సత్తా ఉంటే ఎందుకు వ్యాపారాలు తగ్గిపోతున్నాయి? అని వ్యాఖ్యలు చేశారు.వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎస్వీ సతీష్ కుమార్ రెడ్డి తాజాగా మీడియాతో మాట్లాడుతూ.. ఎన్నికల్లో అధికారంలోకి వచ్చేందుకు ఎన్నో హామీలు ఇచ్చారు. ఇచ్చిన హామీల అమలుకు మాత్రం బడ్జెట్లో కేటాయింపులు లేవు. సూపర్ సిక్స్ అందించే ఉద్దేశ్యం ఉందా? లేదా?. నిరుద్యోగ భృతికి ఒక్క రూపాయి అయినా కేటాయించావా చంద్రబాబు?. స్త్రీ నిధి పేరుతో ప్రతీ మహిళకు నెలకు 1500 అన్నావు.. బడ్జెట్లో ఎక్కడ?. ఉచిత బస్సు ఎక్కడ?. తల్లికి వందనం 12వేల కోట్లు అవసరమైతే 9వేల కోట్లు ఇచ్చారు. దీపం పథకం 60 శాతం మందికి అందడం లేదు. మీరు గ్రామాలకు వచ్చి వాకబు చేసే ధైర్యం ఉందా?. అన్నదాత సుఖీభవకి కూడా అరకొర నిధులు కేటాయించావు. హామీలు నెరవేర్చకపోతే చొక్కా పట్టుకుని అడగమన్నాడు లోకేష్.. ఇప్పుడు ఏం చేయాలి?అదేమంటే సంపద సృష్టిస్తాను అన్నావు.. ఆ సంపద సృష్టి ఎక్కడ?. ఇప్పటి వరకు లక్ష కోట్ల అప్పులు తెచ్చావు. ఆ నిధులన్నీ ఎక్కడికి వెళ్లాయి?. గతంలో పెట్రోల్ రేట్లు పెరిగాయి.. అధిక పన్నులు వేస్తున్నారని అన్నావ్. మరి మీరేం తగ్గించారు?. అభివృద్ధి ఎక్కడ జరిగింది?. వైఎస్సార్సీపీ హయాంలో ప్రతీ కుటుంబానికి లక్ష వరకూ డీబీటీ ఇచ్చాం. కడప ఉక్కు కోసం జిందాల్ సంస్టను తెచ్చాం.. ఈరోజు ఎందుకు ముందుకు పోవడం లేదు?. వైద్య విద్యలో మాకు సీట్లు కావాలని రాష్ట్రాలు పోటీ పడతాయి. వైఎస్ జగన్ తెచ్చిన సీట్లు వెనక్కు పంపిన ఘనత చంద్రబాబుదే.మీపై మాట్లాడారని పోసానిని అరెస్ట్ చేశారు. లోకేష్, పవన్‌లు వైఎస్ జగన్‌ను ఎన్నెన్ని మాటలు అన్నారు. చంద్రబాబుపై కేసు పెట్టేందుకు నేను సిద్ధం. పోలీసులు మీ లిమిట్స్ దాటకండి. తప్పు చేస్తే ఇరు పక్షాల వారిపై చర్యలు తీసుకోండి. చంద్రబాబు మాటలపై విశ్వసనీయత లేదని పవన్‌తో అబద్ధాలు చెప్పించాడు. పవన్.. ఇచ్చిన ప్రతీ హామీకి నువ్వే బాధ్యత తీసుకుని నెరవేర్చు. రెడ్‌బుక్‌లో మా హక్కులు కాలరాస్తామంటే చూస్తూ ఊరుకునేది లేదు. ఈ రాష్ట్రం చంద్రబాబు, లోకేష్ జాగీరు ఏమీ కాదు. మాకు కూడా రాజ్యాంగ హక్కులు ఉన్నాయి. సీజ్ ద షిప్ ఏమైంది?.. తిరుపతి లడ్డూ ఏమైంది?. అబద్దాలు చెప్పడం కాదు.. కొన్ని పనులు చేసైనా నిరూపించుకోండి’ అని హితవు పలికారు. -
పవనూ.. మరీ ఇంతకు దిగజారాలా!
జనసేన అధినేత, ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్(Pawan Kalyan) ఏపీ అసెంబ్లీలో చేసిన కొన్ని వ్యాఖ్యలు తమాషాగా ఉన్నాయి. ‘‘కింద పడతాం.. మీద పడతాం.. అవి మా ఇంటి విషయాలు.. కూటమి విషయాలు. ఒక మాట అనవచ్చు. నాకేం అభ్యంతరం లేదు. కానీ గవర్నర్‌కు గౌరవం ఇవ్వని పార్టీ సభలో అడుగు పెట్టకూడదు’’ అంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు పొంతన లేని అంశాలను బలవంతంగా అతికినట్టుగా అనిపిస్తుంది. ‘‘ఇది తన గురించో, చంద్రబాబుల గురించి కాదని, ప్రజల కోసం నిలబడి ఉన్నామని, కలిసి ఉండకపోతే ప్రజలకు ద్రోహం చేసినవాళ్లం అవుతామని, అందుకే మాటిస్తున్నానని అంటూ, ఎన్ని ఇబ్బందులు వచ్చినా వాటిని అధిగమనించి మరో పదిహేనేళ్లు కలిసి ఉంటాము’’ అని పవన్ అనడం దేనికి సంకేతం?.. తెలుగుదేశంతో పొత్తు పుణ్యమా అని పవన్ కల్యాణ్ ఎలాగోలా శాసనసభలోకి అడుగుపెట్టి డిప్యూటీ సీఎం కూడా అయిపోయారు. అభిమానులకు, జనసేన కార్యకర్తలకు అది సంతోషమే. కానీ ఆయన సమస్యలపై ప్రశ్నించకుండా.. ప్రభుత్వంలో జరిగే తప్పులపై గొంతెత్తకుండా ఆత్మపరిశీలన చేసుకోకుండా, చేసిన బాసలను గాలికి వదలి పలాయన వాదంతో ప్రవర్తిస్తున్నారని చెప్పడానికి ఈ వ్యాఖ్యల కన్నా ఉదాహరణ అవసరం లేదేమో!.👉ఇంతకీ పవన్ చేసిన ఆ వ్యాఖ్యల సారాంశం ఏమిటి? తమలో తాము ఎన్ని గొడవలు పడ్డా కలిసే ఉంటామని చెప్పడమే కదా! ఈ మాట అంటున్నారంటేనే ప్రజలకు ద్రోహం చేయడం అవుతుంది. ప్రభుత్వం సమర్థంగా పని చేస్తుందని హామీ ఇవ్వకుండా వీరిద్దరూ తిట్టుకుంటే ఎవరికి కావాలి? కిందపడితే ఏంటి? మీద పడితే ఎవరికి ఆసక్తి? ఆయన అన్నట్టే అది వారి అంతర్గత వ్యవహారం. ప్రజలకు సంబంధించిన అంశం కాదు. అయితే... శాసనసభ ఎన్నికలకు ముందు ఆయన చెప్పిన మాటలేమిటి? చేసిన వాగ్దానాలేమిటి? ఇప్పుడు వాటిని గాలికి వదిలేసిన వైనం ఏమిటి? వీటిని ప్రశ్నించకుండా ఎవరూనా ఎలా ఉండగలరు? సుగాలి ప్రీతి మృతి కేసు నుంచి 31 వేల మంది మహిళలు మిస్సింగ్ అయ్యారంటూ సంచలనం కోసం పిచ్చి ఆరోపణలు చేసిన పవన్ కల్యాణ్.. తీరా పదవి వచ్చాక వాటి గురించి ఎందుకు మాట్లాడడం లేదు? ఈ మధ్య కాలంలో జరిగిన వివిధ పరిణామాలలో పవన్ పలు అవమానాలకు గురయ్యారని జనసేన కార్యకర్తలు బాధ పడ్డారు. కానీ పవన్ తన మాటల ద్వారా ఆ అవమానాలను పట్టించుకోబోనని చెప్పినట్లు అయ్యింది. ఎంత పదవిలో ఉంటే మాత్రం పవన్ టీడీపీకి ఇంతగా లొంగి ఉండాలా అన్నది జనసేన కార్యకర్తల ఆవేదన. తిరుపతి తొక్కిసలాట ఘటన(Tirumala Stampede Incident) తర్వాత పవన్ కల్యాణ్ ఓవరాక్షన్ చేశారని టీడీపీ ముఖ్యనేతలే వ్యాఖ్యానించిన సంగతిని ఆయన పట్టించుకోకపోవచ్చు. కానీ ఆత్మాభిమానం కలిగిన జనసేన క్యాడర్ సహించలేక సోషల్ మీడియాలో టీడీపీ వారికి పోటీగా ఎలా పోస్టులు పెట్టిందో తెలియదా! ఇవన్ని ఎవరి ఇంటి విషయాలు..? అంటే జనసేన కూడా టీడీపీలో భాగమని చెబుతున్నారా? కూటమి విషయాలైతే ఎన్నడైనా చర్చించుకున్నారా? అంత దాకా ఎందుకు.. పిఠాపురంలో పోలీసులు తన మాట వినడం లేదని ఎందుకు చెప్పారు? నెల రోజుల పాటు ఎవరి మీద అలిగి ఫైళ్ల జోలికి వెళ్లకుండా ఉన్నారు? ఇది ఎవరి ప్రయోజనం కోసం? సనాతని వేషధారణ వేసుకున్నాక, ధర్మ బద్దంగా ఉండాలి కదా! అసత్య వచనాలు పలకరాదని కదా ఆ ధర్మం చెబుతోంది. ఇచ్చిన మాటకు కట్టుబడి ఉండాలని కదా ఏ ధర్మం అయినా చెప్పేది. కాని పవన్ కల్యాణ్ వాటిని పాటిస్తున్నారా?. తిరుమల లడ్డూ విషయంలో(Tirumala Laddu Row) ఆయన చేసిన వ్యాఖ్యలు హిందూ ధర్మానికి అపచారం కాదా? వలంటీర్ల పొట్టకొట్టబోనని పవన్ హామీ ఇచ్చారా? లేదా? అధికారం ఎంజాయ్ చేస్తూ వారి గురించి మాట్లాడకపోగా.. అసలు వలంటీర్లు ఎక్కడ ఉన్నారని వ్యాఖ్యానించడం పొట్ట కొట్టడం అవుతుందా? లేదా? ఇదేనా సనాతన ధర్మం చెప్పేది? శాసనసభలో ఆయన మాట్లాడిన విషయాలలో సత్యదూరమైనవి ఎన్ని ఉన్నాయి? వైఎస్సార్సీపీ(YSRCP) వాళ్లు నినాదాలు చేసినందుకే... గవర్నర్‌కు గౌరవం ఇవ్వని పార్టీ సభలోకి అడుగు పెట్టకూడదని ఆయన కొత్త సూత్రం చెబుతున్నారే..! మరి గవర్నర్ వ్యవస్థే వద్దన్న టీడీపీతో పొత్తు ఎలా పెట్టుకున్నారు? గతంలో గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ ప్రసంగిస్తుంటే.. తెలుగుదేశం సభ్యులు ఆయన కుర్చీని కూడా లాగి పారేశారు. అలా చేసిన వారిలో ఒకరైనా రేవంత్ రెడ్డి ఇప్పుడు తెలంగాణ ముఖ్యమంత్రి అయ్యారు. గత టర్మ్‌లో గవర్నర్ హరిచందన్ స్పీచ్ సమయంలో కానీ, స్పీకర్ పై కానీ టీడీపీ సభ్యులు ఎన్ని అల్లర్లు చేశారో ఒకసారి రికార్డులు తిరగేస్తే తెలుస్తుంది. తన సహ నటుడు, ఎమ్మెల్యే బాలకృష్ణ ఒక విజిల్ పట్టుకువచ్చి సభలో ఈల వేస్తూ తిరిగారే. మిగిలిన టీడీపీ ఎమ్మెల్యేలు కాగితాలు చింపి, స్పీకర్ తమ్మినేని సీతారామ్‌ను బెదిరించేవారే! కొందరు టీడీపీ నేతలు ఎలా దూషించారో ఆయనకు గుర్తు ఉండకపోవచ్చు. ఇవన్ని మంచి పద్దతులేనా? అలాంటి పార్టీతో కలిసి అధికారంలోకి వచ్చాక సుద్దులు చెబితే సరిపోతుందా?. ఏమిటో కొత్తగా స్టేట్ రికన్సిలియేషన్ కేబినెట్ (Reconciliation Cabinet) అని అంటున్నారు. స్వాతంత్రం వచ్చాక ఎన్నికలకు ముందు ఏదో జరిగిందని, ఇప్పుడు కూడా అలాగే ఉందని అనడం ఏమిటో?. బాబూ రాజేంద్ర ప్రసాద్ కూడా నెహ్రూ కేబినెట్ లో ఉన్నా ఆయా అంశాలపై విబేధించేవారని అన్నారు. అంటే ఏపీలో కూడా అలాగే చంద్రబాబును నిలదీస్తారా? ఆ ధైర్యం పవన్‌కు నిజంగా ఉందా? అలా ఉంటే ఇప్పటివరకు జరిగిన అనేక పరిణామాలలో ఒక్కసారైనా ప్రజల పక్షాన మాట్లాడారా? శాంతిభద్రతల విషయంలో మాట్లాడినట్లే మాట్లాడి వెంటనే ఎందుకు జారిపోయారు? ప్రతిపక్షం ముఖం చాటేస్తే తామే ఆ బాధ్యత నిర్వహిస్తామని అన్నారు. 👉పవన్ ఆ పని చేసినా, చేయకపోయినా, ముందుగా సూపర్ సిక్స్ గురించి చంద్రబాబును ప్రశ్నించి ఉంటే, తన బాధ్యత ఏమిటో చెప్పి ఉంటే అప్పుడు ఆయన ఏమి చెప్పినా జనం నమ్మవచ్చు. తన శాఖకు సంబంధించి ఆయన గ్రామ సభలు, గోకులాలు అంటూ ఏవేవో చెప్పుకున్నారు. కాని వాటిని టీడీసీ వారే ఎవరూ పట్టించుకోవడం లేదన్న సంగతి ఆయనకు కూడా తెలిసి ఉండాలి. ఆంధ్రులకు కుల భావన ఉందని శాసనసభలో బాధ పడినట్లు నటించారు. మరీ ఇదే పవన్ కల్యాణ్ గతంలో కనీసం కుల భావన అయినా తెచ్చుకోండని అన్నారే! తనకైనా ఫలానా కులం వారు ఓట్లు వేయాలని అన్నది వాస్తవం కాదా! దీనికి సంబంధించి అప్పట్లో వీడియోలు వచ్చాయే! ఎవరిని మభ్య పెట్టడానికి ఈ మాటలు?. 👉విశాఖ స్టీల్ ప్రైవేటీకరణ ఆగిందని అంటున్నారు. సంతోషమే కానీ.. భవిష్యత్తులో కూడా జరగదని చెప్పగలిగితే బాగుంటుంది. ఒకపక్క అక్కడ అనేక మందిని ఉద్యోగాలనుంచి తొలగిస్తుంటే, మరోపక్క పవన్ ఇలా మాట్లాడుతున్నారు. బూతులు ఎవరు మాట్లాడినా తప్పే. కాని టీడీపీ, జనసేనల దూషణలకు, పెట్టిన బూతు పోస్టింగ్‌లకు ఆయన ఎలా మద్దతు ఇస్తున్నారు?. తిరుపతిలో కిరణ్ రాయల్ అనే స్థానిక నేతపై మహిళల వేధింపు ఆరోపణలు వస్తే కనీసం పార్టీ నుంచి సస్సెండ్ కూడా చేయలేక పోయారే! ఆ మాటకు వస్తే ఎన్నికల సమయంలో పవన్ ఎన్ని దూషణలకు పాల్పడింది ఆధార సహితంగా ఉన్నాయి కదా! 2009లోనే యువరాజ్యం అధ్యక్షుడుగా ఉండి కాంగ్రెస్ వాళ్ల పంచెలు ఊడగొడతానని అన్నది ఈయనే గదా అని పలువురు గుర్తు చేసుకుంటున్నారు. చంద్రబాబును జైలులో ఎందుకు పెట్టింది తెలియదా? స్కిల్ స్కామ్‌లో తొలుత కేసు పెట్టింది ఈడి కాదా? గతంలో కులాలు, మతాల మధ్య గొడవలు వచ్చేలా రోజుల తరబడి మీడియా సమావేశాలు పెట్టి లైవ్ లో మాట్లాడిన ఒక నేతను ఇప్పుడు పెద్ద పదవిలో కూటమి కూర్చోపెట్టుకుందే!. చంద్రబాబు, లోకేష్‌లతో ఏదో జిగిరి దోస్తి ఉన్నట్లు ఇప్పుడు చెబుతున్నారు కాని, 2018లో ఇదే పవన్ వారిని ఉద్దేశించి ఎన్ని తీవ్రమైన అవినీతి ఆరోపణలు చేసింది తెలియదా? రాజకీయాలలోకి వచ్చి చెగువేరా అన్నారు. ఆ తర్వాత చంద్రబాబు, మోదీ అన్నారు. తదుపరి వారిని కాదని బీఎస్పీ అధినేత్రి మాయావతి, వామపక్షాలతో కలిసి జట్టుకట్టారు. ఆ తర్వాత మళ్లీ మోదీ, చంద్రబాబు అన్నారు. .. భవిష్యత్తులో ఏమి జరుగుతుందో ఎవరు చెబుతారు? నిజంగానే కిందా, మీద పడి పదవిలోకి వచ్చిన పవన్.. ఆ పదవి మీద మోజు పెంచుకోవడం తప్పు కాదు. కానీ అదే ప్రధానమన్నట్లుగా వ్యవహన్నారనే భావన ఏర్పడుతోంది. ప్రజల కోసం నిలబడకుండా చంద్రబాబు, లోకేష్ ల మెప్పు కోసం పనిచేస్తూ, సనాతని వేషం ధరించి కూడా అబద్దాలు, అర్ధ సత్యాలు చెప్పడం ఏ ధర్మం అవుతుందో ఆయనకే తెలియాలి!. :::కొమ్మినేని శ్రీనివాస రావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత -
బడ్జెట్ ప్రసంగం కాదు.. లోకేష్‌ను పొగిడే కార్యక్రమం: అమర్నాథ్
సాక్షి, విశాఖపట్నం: ఏపీలో కూటమి ప్రభుత్వం ప్రజలను నమ్మించి మోసం చేసిందన్నారు మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్. చంద్రబాబు సర్కార్‌కు హామీలు అమలు చేసే సత్తా లేదన్నారు. బడ్జెట్ ప్రసంగంలో వైఎస్ జగన్‌ను విమర్శించడం.. నారా లోకేష్‌ను పొగడటమే పనిగా పెట్టుకున్నారని చెప్పుకొచ్చారు.మాజీ మంత్రి అమర్నాథ్ విశాఖలో మీడియాతో మాట్లాడుతూ..‘ఎన్నికల్లో ఇచ్చిన హామీలను వైఎస్ జగన్ నెరవేర్చారు. కోవిడ్ సమయంలో కూడా వైఎస్ జగన్ సంక్షేమ పథకాలను అందించారు. బడ్జెట్ ప్రసంగంలో కూటమి ప్రభుత్వం వైఎస్ జగన్ జపం చేసింది. చంద్రబాబు ప్రభుత్వ బడ్జెట్ రాష్ట్ర ప్రజలను నిరాశ పరిచింది. కూటమి నేతలు ఎన్నికల్లో ఇచ్చిన హామీలను విస్మరించారు.హలో ఏపీ.. కూటమి పెట్టింది టోపీ.. అనే విధంగా ప్రజలు భావిస్తున్నారు. రాష్ట్ర బడ్జెట్‌పై ప్రజలు ఎంతో ఆశగా ఎదురు చూశారు. కేటాయింపుల ద్వారా తమ జీవితాలు మారుతాయని ఆశ పడ్డారు. బడ్జెట్ ద్వారా ప్రజలకు నిరాశే మిగిలింది. వైఎస్ జగన్ కంటే ఎక్కువ పథకాలు ఇస్తారని ప్రజలు భావించారు. చంద్రబాబు అంటే మోసమని మరోసారి రుజువైంది. కూటమి ప్రభుత్వం ప్రజలను నమ్మించి మోసం చేసింది. తల్లికి వందనం, అన్నదాత సుఖీభవకు నిధుల్లో కోత పెట్టారు. తల్లికివందనం పథకానికి రూ.13,113 కోట్లు అవసరమైతే రూ.9,407 కోట్లు మాత్రమే కేటాయించారు. ఆడపిల్లకు వందనం, ఉచిత బస్సు, నిరుద్యోగ భృతికి అసలు నిధులే కేటాయించలేదు. వైఎస్ జగన్ విలువ ఇప్పుడు అందరికీ తెలుస్తుంది. బడ్జెట్లో నిరుద్యోగులకు నిరుద్యోగ భృతి కేటాయించలేదు. నిరుద్యోగులకు ఏడాదికి 7000 కోట్లు ఇవ్వాలి. 18 ఏళ్లు దాటిన మహిళకు 27000 కోట్లు ఇవ్వాలి. హామీలు దసరా, దీపావళికి అమలు చేస్తామన్నారు.. వాయిదా వేశారు. సంక్రాంతికి వస్తామన్నారు, సినిమా వచ్చింది కానీ చంద్రబాబు రాలేదు. తొలి సంతకం డీఎస్సీకి దిక్కుమొక్కు లేదు. షుగర్ ఫ్యాక్టరీ రైతులు రోడ్డుక్కె పరిస్థితి ఏర్పడింది. కూటమి పాలనపై ప్రజలు తిరగబడే పరిస్థితి వచ్చింది. వెనుకబడిన ఉత్తరాంధ్ర, రాయలసీమకు నిధులు ఎందుకు కేటాయించలేదు?. సంపద సృష్టి అనేది అమరావతి కోసమేనా?. మెట్రో రైలు, ఉత్తరాంధ్ర సృజల స్రవంతి పరిస్థితి ఏమిటి? అని ప్రశ్నించారు. కూటమి ప్రభుత్వం హామీలు అమలు చేసే వరకు వైఎస్సార్సీపీ పోరాటం చేస్తుంది’ అని తెలిపారు. -
‘మోసం, వంచనకు ఈ బడ్జెట్ నిలువుటద్దం’
తాడేపల్లి : ఏపీ అసెంబ్లీ సమావేశాల్లో శుక్రవారం ప్రవేశపెట్టిన రాష్ట్ర బడ్జెట్ పై మాజీ మంత్రి, వైఎస్సార్ సీపీ నేత కాకాని గోవర్థన్ ధ్వజమెత్తారు. గతం మోసం, వర్తమానం మోసం.. భవిష్యత్ కూడా మోసమేనని చంద్రబాబు మళ్లీ రుజువు చేశారని కాకాని మండిపడ్డారు. తాడేపల్లి వైఎస్సార్ సీపీ కేంద్ర కార్యాలయం నుంచి మాట్లాడిన ఆయన.. ‘రైతులను మోసం చేసిన దగా బడ్జెట్ ఇది. ఈరోజు రాష్ట్ర రైతులకు బ్లాక్ డే . బాబు ష్యూరిటీకి నో గ్యారెంటీ అని రైతులు చర్చించుకుంటున్నారు. చట్టసభల సాక్షిగా తన నిజాయితీ నిరూపించుకోలేకపోయారు. జగన్‌ని దూషిస్తూ, చంద్రబాబును కీర్తిస్తూ బడ్జెట్ ప్రసంగాన్ని మంత్రి చదివారు. ఈ బడ్జెట్ ప్రజల ఆశలు, ఆకాంక్షలు తీర్చేలా కనపడలేదు. లోకేష్ కు భజన చేయటమే ఆర్థికమంత్రి పనిగా పెట్టుకున్నారు. మోసం, వంచనకు ఈ బడ్జెట్ నిలువుటద్దంగా మారింది. అన్ని వర్గాల ప్రజలను నిలువునా ముంచారు. చంద్రబాబు వచ్చాడు, వ్యవసాయాన్ని దండగ చేశాడు అనే పేరును మళ్ళీ గుర్తు చేశారు. చంద్రబాబు రెండు నాలుకలతో కాదు రెండు వందల నాలుకలతో అబద్దాలు చెప్పారు. రైతులకు రూ.20 వేలు ఇస్తామని చంద్రబాబు చెప్పారు. ఇప్పుడు కేంద్రం ఇచ్చే నిధులతో కలిపి ఇస్తానని మాట మార్చారు. ధరల స్థిరీకరణ నిధి కింద కేవలం రూ.300 కోట్లు ఇస్తానంటున్నారు. ఆ అరకొర నిధులు అసలు ఏ మూలకు వస్తాయి? , చంద్రబాబు అధికారంలోకి వచ్చిన ప్రతిసారీ రైతు అన్యాయానికి గురవుతారు. జగన్ మిర్చి యార్డుకు వెళ్తే తప్ప దానిపై చంద్రబాబు స్పందించలేదు. ఇంతకంటే సిగ్గుచేటు, దౌర్భాగ్యం మరొకటి లేదు. ఆర్బీకేలను నిర్వీర్యం చేశారు. ఆ వ్యవస్థ లేకుండా అసలు రైతులకు ఎలా మేలు చేస్తారు? , స్మార్ట్ అగ్రికల్చరల్ అంటూ కొత్తకొత్త పదాలు వాడటం తప్ప ఇంకేమీ లేదు. వ్యవసాయ మంత్రి బరువుకు తగ్గట్టుగానైనా రైతుల కోసం బడ్జెట్లో నిధులు కేటాయిస్తారనుకున్నాం. జగన్ రూ.3 వేల కోట్లతో ధరల స్థిరీకరణ నిధి ఏర్పాటు చేస్తే చంద్రబాబు కేవలం రూ. 3 వందల కోట్లే కేటాయించారు. జగన్ ఉచితంగా బోర్లు వేయించారు. ఉచిత విద్యుత్ ని ఎగ్గొట్టటానికే సోలార్ విద్యుత్ ని తెరమీదకు తెచ్చారు. అంకెల గారడీ, అభూత కల్పనల బడ్జెట్ ఇది. ఇది రైతులను ముంచే ప్రభుత్వం అని తేలి పోయింది. ఎక్కడా మిషన్, మీనింగ్ లేదు, మాయాజాలం మాత్రమే ఉంది. ప్రాజెక్టులకు కూడా ఆశాజనకంగా నిధుల కేటాయింపు జరగలేదు’ అని కాకాని స్పష్టం చేశారు.