breaking news
-
AP Budget 2025: చంద్రబాబు సంపద సృష్టిపై బుగ్గన సెటైర్లు
సాక్షి,తాడేపల్లి : ఏపీ బడ్జెట్ బుక్‌లో కలర్ ఎక్కువ.. కంటెంట్ తక్కువ అని మాజీ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ సెటైర్లు వేశారు. అప్పుల లెక్కలపై మీరు కరెక్టా.. కాగ్ కరెక్టా? కూటమి నేతలు చెప్పాలని డిమాండ్ చేశారు. కూటమి ప్రభుత్వం అసెంబ్లీలో ప్రవేశ పెట్టిన బడ్జెట్‌పై తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో బుగ్గన మీడియాతో మాట్లాడారు. అప్పుల లెక్కలపై కూటమి సర్కార్ చేస్తున్న సర్కస్ చూస్తుంటే ఆశ్చర్యం వేస్తోందన్నారు. కూటమి సర్కార్ బడ్జెట్‌ను మసిపూసి మారేడుకాయ చేసింది. బడ్జెట్లో అప్పుల లెక్కలు మాయం చేశారు. 9నెలల్లోనే రికార్డ్ స్థాయిలో లక్షా 30వేల కోట్లకుపైగా అప్పులు ఉన్నాయని ఆరోపించారు. చంద్రబాబు ఎప్పుడు పీఠం ఎక్కినా రెవెన్యూ లోటు ఉంటుంది. సూపర్ సిక్స్‌లో ఒక్క పథకాన్ని కూడా అమలు చేయలేదు. సంపద ఎక్కడ సృష్టించారో నిజాయితీగా చెప్పగలరా? సంపద సృష్టి అంటే ఇదేనా. స్థూల ఉత్పత్తిపై కూటమి సర్కార్ పచ్చి అబద్ధాలు చెప్పింది. గత బడ్జెట్లో కేటాయించిన నిధులకే దిక్కులేదు.గతేడాది అన్నదాత సుఖీభవకు రూ.4,500కోట్లు కేటాయించారు.గతేడాది అన్నదాత సుఖీభవ ఎవరికైనా వచ్చిందా? రెండేళ్లు అన్నదాత సుఖీభవకు రూ.21వేల కోట్లు అవసరం. అన్నదాత సుఖీభవకు కేటాయించింది రూ.6300కోట్లే. హామీల అమలుకు టైమ్ టేబులంటూ ఏమీలేదు. రాష్ట్ర బడ్జెట్ కలర్ ఎక్కువ, కంటెంట్ తక్కువ అన్నట్టుగా ఉంది. బడ్జెట్ ప్రసంగం నెగటివ్ మాటలతో మాట్లాడారు. అరాచకం, విధ్వంసం అంటూ మొత్తం 35 సార్లు అన్నారు.సూపర్ సిక్స్ పేరుతో ఎన్నికలకు ముందు తెగ హడావుడి చేశారు. ఇప్పటికీ ఒక్క పథకాన్ని కూడా అమలు చేయలేదు. వైఎస్సార్సీపీ అధినేత,మాజీ సీఎం వైఎస్ జగన్మోన్రెడ్డి తన హయాంలో కేలండర్ పెట్టి మరీ సంక్షేమ పథకాలు ఇచ్చారు చంద్రబాబు ఎక్కువ ఇస్తాననేసరికి జనం నమ్మారు. కానీ చంద్రబాబు మళ్ళీ జనాన్ని మోసం చేశారు. సంవత్సరం కాకముందే లక్షన్నర కోట్లు అప్పు చేశారు. ప్రజల మీద ఎక్కువ పన్నుల భారం వేయకూడదని చాణక్యుడు చెప్పాడు. కానీ చంద్రబాబు అధిక భారాలు వేస్తూ చాణక్యుడి పేరు వాడటం హాస్యాస్పదం. మా ప్రభుత్వాన్ని హేళన చేస్తూ మాట్లాడారు.మధ్యలో దళారులు లేకుండా సంక్షేమం అందిస్తే బటన్ నొక్కుడు అంటూ హేళన చేశారు. రాష్ట్రం శ్రీలంక అవుతుందంటూ ప్రచారం చేశారు. ఎన్నికల టైం వచ్చేసరికి మా కంటే మూడు రెట్లు ఎక్కువగా ఇస్తామని చంద్రబాబు హామీలు ఇచ్చారు. తీరా అధకారంలోకి వచ్చాక ఏదీ అమలు చేయటం లేదు.కూటమి ప్రభుత్వంలో పెట్టే కేసులు పెరిగాయి. ప్రజల్లో అసంతృప్తులు బాగా పెరిగాయి. గ్రామాల్లో ప్రజలు అప్పుల పాలయ్యారు. ఎన్నికలకు ముందు సూపర్ సిక్స్ అన్నారు. అధికారంలోకి వచ్చాక సంపద సృష్టి తర్వాతనే ఇస్తామంటున్నారు.రూ.4,500 కోట్లు అన్నదాత సుఖీభవ కింద ఇవ్వకుండానే ఇచ్చేసినట్టు చెప్పారు. ఏ రైతుకైనా అన్నదాత సుఖీభవ డబ్బులు ఇచ్చారా?. కార్పోరేషన్ల అప్పుల్లో కూడా తప్పడు లెక్కలు చూపెట్టారు. వస్తుందో రాదో తెలియని ఆదాయాన్ని ఇప్పుడు లెక్కల్లో చూపించి ఖర్చు పెడతామంటున్నారు.ఒక విధానం, ఒక టైంటేబుల్ అనేదే లేదు. ఎవరో రాసిచ్చిన లెక్కలు చదవటం తప్ప బడ్జెట్లో ఇంకేం లేదు. రాష్ట్ర అభివృద్ధిని దేశ అభివృద్ధితో పోల్చాలేగానీ, గత ప్రభుత్వాలతో పోల్చుతారా?. అసెంబ్లీలో ఉత్సాహం, ఊపు ఎవరిలోనూ కనపడలేదు.గత బడ్జెట్లో పెట్టి కూడా ఇప్పటివరకు నిధులు ఇవ్వలేదు. ఉచిత బస్సు, ఉచిత గ్యాసు ఊసేలేదు.తల్లికివందనం కింద ఎంతమందికి ఇచ్చేదీ క్లారిటీ లేదు. 55 లక్షల మంది పిల్లలకి మాత్రమే ఇచ్చేలా బుక్‌లో రాశారు. అంటే మిగతావారి పరిస్థితి ఏంటి?.గవర్నర్ ప్రసంగంలో సూపర్ సిక్స్ ప్రస్తావనే లేదు.రైతుల పరిస్థితి దారుణంగా ఉంది. ప్రభుత్వ కొనుగోళ్ళు లేక ప్రయివేటు వారికి అమ్ముకునే పరిస్థితి వచ్చింది. పత్తి, మిర్చి, కంది, మినుముల ధర మా హయాంతో పోల్చితే ఇప్పుడు సగానికి సగం తగ్గింది. ఉద్యోగుల పరిస్థితి దారుణంగా తయారయింది.ఈ ప్రభుత్వంలో కనీసం వారి సమస్యలు వినే పరిస్థితే లేదు. మా హయాంలో ప్రభుత్వ, ప్రయివేటు ఉద్యోగాలు 31 లక్షల మందికి ఇచ్చాం.ఈ ప్రభుత్వం ఇప్పటికి ఒక్క ఉద్యోగం కూడా ఇవ్వకపోగా, ఉన్నవి తొలగిస్తున్నారు.అమరావతి కోసం రూ.76 వేల కోట్లు అప్పు చేశారు.మేము చేస్తే అప్పు, మీరు చేస్తే నిప్పా?. స్థూల ఉత్పత్తి బాగుంటే రాష్ట్ర ఆదాయం పెరగాలి కదా?. మరి ఆ పెరిగిన ఆదాయం ఎందుకు కనపడటం లేదు?. సంపద సృష్టిస్తామనే వారు మా హయాంలో కంటే తక్కువ ఆదాయాన్నే రాష్ట్రానికి సమకూర్చారు. మీది P4 ఐతే మాది W4. అంటే సంక్షేమం. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సా? లేక ఇంటిలిజెన్స్ ఆర్టిఫిషియలో అర్థం కావటం లేదు. ప్రతిపక్షం లేని ప్రజాస్వామ్యం ఉంటుందా? -
వంశీని మెంటల్‌గా డిప్రెషన్‌కు గురిచేస్తున్నారు: పంకజశ్రీ
సాక్షి, విజయవాడ: జైల్లో వల్లభనేని వంశీతో వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్, పెనమలూరు వైఎస్సార్సీపీ ఇంఛార్జ్ దేవభక్తుని చక్రవర్తి, వంశీ సతీమణి పంకజశ్రీ ములాఖత్ అయ్యారు. అనంతరం మీడియాతో పంకజశ్రీ మాట్లాడుతూ.. వంశీకి ఆస్తమా ఉందని.. నిన్న కోర్టుకి వచ్చినపుడు కూడా నీరసంగా ఉన్నారన్నారు.‘‘ఆయనకు కనీసం కూర్చోటానికి ఒక చైర్ కూడా ఇవ్వటం లేదు. మనిషికి కావాల్సిన మినిమం బేసిక్స్ ప్రొవైడ్ చేయాలి. వంశీని మెంటల్‌గా డిప్రెషన్‌కు గురిచేయాలనుకుంటున్నారు. ఇలా చేయటం తప్పు కాదా?. వంశీ మీద రూల్స్ ప్రకారం ఒక్క కేసు లేదు, ఎందుకు ఈ కక్ష సాధింపు. అన్ని రకాలుగా ఇబ్బంది పెట్టడం సరికాదు. అధికారంలో ఉంటే ఏమైనా చేయవచ్చా. వంశీని ఇబ్బందులు పడుతున్నారు’ అని పంకజశ్రీ ఆవేదన వ్యక్తంచేశారు.చంద్రబాబు కుటిల రాజకీయం: ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్చంద్రబాబు కుటిల రాజకీయం ప్రజలకు అర్థమైంది. చంద్రబాబు సూపర్ సిక్స్ పథకాలను అమలు చేయలేక నీచ రాజకీయాలు చేస్తున్నాడు. సత్యవర్ధన్ కిడ్నాప్ జరగలేదు. సత్యవర్ధన్ వాంగ్మూలంలో వంశీకి ఎటువంటి సంబంధం లేదని తేలిపోయింది. 10 తేదీన జడ్జి ముందు వాంగ్మూలం ఇస్తే. 11వ తేదీన కిడ్నాప్ చేశారని వీడియో విడుదల చేశారు. 2004లో గన్నవరానికి వంశీ రాకముందున్న కేసులు కూడా వంశీకి చంద్రబాబు ఆపాదించారు. ఒక సూట్ పెండింగ్ ఉండి, ఒక కుటుంబానికి సంబంధించిన కేసు, వంశీకి ఎటువంటి సంబంధం లేని కేసులో వంశీని ప్రథమ ముద్దాయిగా పెట్టారు. 21 సంవత్సరాల తర్వాత క్రిమినల్ కేసు పెట్టారు. ఇది తప్పుడు సంస్కృతిఒక టీడీపీ నాయకుడు గన్నవరం వద్ద కెనాల్ ప్రాంతాన్ని ఆక్రమిస్తే లా అండ్ ఆర్డర్ సమస్య రాకుండా ఆ నిర్మాణాన్ని తొలగించారు. కలెక్టర్ లెటర్ ఇచ్చినా దానిని తప్పు దోవ పట్టించి... వంశీ పై కేసు పెట్టారు. మల్లవల్లి ఇండస్ట్రియల్ క్వారీ ఎవరు పెట్టారు?. 2015లో టీడీపీ ప్రభుత్వంలో ఆ క్వారీ పెట్టారు. క్వారీ ల్యాండ్‌ను జియోకాన్ కంపెనీకి కట్టబెట్టారు. అప్పుడు కేసులు చంద్రబాబు మీద పెట్టాలి. ఈ కేసులన్నీ చూస్తే కేవలం వంశీని ఇబ్బంది పెట్టాలని చేసిన ప్రయత్నమే. తాటికాయంత అక్షరాలతో పచ్చ మీడియా నీతులు వల్లించే కార్యక్రమం చేస్తుందిహోమ్ మినిస్టర్ అనిత ఆడబిడ్డలను అమ్మ అని పిలిస్తే వారి భర్తలు ఏం అవుతారు...అని బూతులు అర్థం వచ్చే మాటలు మాట్లాడుతున్నారు. స్పీకర్ అయ్యన్నపాత్రుడు మాట్లాడే మాటలు బూతులు కాదా?. కూన రవికుమార్, అచ్చెన్నాయుడు, రాయపాటి అరుణ, గాయత్రీ వీరందరి మాటలు బూతులు కాదా?. జబర్దస్త్ నటులతో డిబేట్లు పెట్టి బూతులు తిట్టించారు. వంశీ భార్య గురించి బూతులు మాట్లాడారు.. వీరు మాట్లాడేవన్నీ బూతులు.. చేసే పనులన్నీ దుర్మార్గాలు. పవన్ కల్యాణ్ కొడుకులు అంటే బూతు కాదా?.. లోకేష్ బూతులు మాట్లాడితే నీతులుగా కనిపిస్తున్నాయా..?.కమ్మ సామాజిక వర్గంలో బలమైన గొంతు గల నాయకుడిగా లోకేష్‌ను పైకి తేవాలంటే అదే సామాజిక వర్గంలో ఉన్న వేరే నాయకుడిని తొక్కేయాలని చూస్తున్నారు. పోలీసులు వీరికి భాగస్వాములుగా చేస్తున్న కుట్రలపై న్యాయపరంగా పోరాడుతున్నాం. కూటమిలో పైన పొత్తులు లోపల కత్తులు పెట్టుకొని ఒకరికి ఒకరికి పడక లోకేష్ ను పైకి తేవాలి, సూపర్ సిక్స్ హామీలు తప్పించుకోవాలని చూస్తున్నారు. వంశీకి వైఎస్సార్‌షీపీ పార్టీ అండగా ఉంటుంది. వంశీ అనారోగ్య సమస్యతో బాధపడుతున్నారు. -
ఆ మాటలు నిజంగా మనసులోంచే వచ్చాయా?
కన్విన్స్ చేయలేకపోతే కన్ఫ్యూజ్ చేయాలన్నది ఒక థియరీ. దీన్ని బాగా వంటబట్టించుకున్న వాళ్లలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ముందువరుసలో ఉంటారు. రాజకీయ చరిత్ర మొత్తం ప్రజలను గందరగోళం పరచడం ద్వారా లేదంటే మాయ చేయడం ద్వారానే సాగిందని ఇట్టే అర్థమైపోతుంది. ఈ కారణం వల్లనే ప్రజలకు ఆయనపై అంత విశ్వాసలేమి!. కొన్ని ఇతర కారణాల వల్ల ఆయన నాలుగుసార్లు ముఖ్యమంత్రి స్థానాన్నైతే సంపాదించుకోగలిగారు. కానీ ఆ స్థాయిలోనే ప్రజల నుంచి గౌరవం, ఆదరణ, మన్నన పొందుతున్నారా? సందేహమే. ఈ చర్చ ఇప్పుడెందుకు వస్తోందంటే.. తాజాగా ఆయన గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే సందర్భంగా చేసిన వ్యాఖ్యలు. అవి నిజంగానే చంద్రబాబు(Chandrababu) మనసులోంచి వచ్చాయా? లేక ఇంకోసారి మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నారా? అంటే బదులుండదు. పరస్పర విరుద్ధమైన వ్యాఖ్యలు చేయడంలోనూ బాబు గారు దిట్టే. తద్వారా పరిస్థితి ఏదైనా క్రెడిట్ మాత్రం తన ఖాతాలోనే పడేలా వ్యవహరిస్తూంటారు. సూపర్ సిక్స్ పేరుతో ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీలనే తీసుకుందాం.. అధికారంలోకి వచ్చి నెలలు గడుస్తున్నా వాటి అమలు ఊసేలేదు. కానీ మాటలు మాత్రం బోలెడన్నిసార్లు మార్చేశారు. ఒకసారేమో.. బటన్ నొక్కితే సరిపోతుందా? అంటారు.. ఇంకోసారి సూపర్ సిక్స్ అమలు చేస్తామని అంటారు. మరోపక్క ఢిల్లీలో కేజ్రీవాల్, ఏపీలో జగన్ మోడల్ సంక్షేమం విఫలమయ్యాయి అనేస్తారు. అలాగే.. సంపద సృష్టించకుండా ప్రజలకు డబ్బు పంచే హక్కు రాజకీయ నేతలకు ఎక్కడ? అని ప్రశ్నిస్తారు!. ఎన్నికల ముందు సంపద తాను సృష్టించగలనని గంభీర ఉపన్యాసాలు చేసేదీ ఈయనే.. అధికారంలోకి వచ్చాక సంపద ఎలా సృష్టించాలో తన చెవిలో చెప్పండని జనాన్ని అడిగేదీ ఈయనే కావడం ప్రజలు గమనిస్తూనే ఉన్నారు. ఇటీవలి అసెంబ్లీ సమావేశాల ప్రారంభం సందర్భంగా గవర్నర్ చేసిన ప్రసంగంలో చంద్రబాబు ఒక మాట చెప్పించారు. అదేమిటంటే 'ఒక వ్యక్తికి చేపలు ఇవ్వడం కాదని, చేపల వల ఇవ్వాలి" అనే సూక్తిని చంద్రబాబు అనుసరిస్తారని తెలిపారు. ఏమిటి దాని అర్థం? సంక్షేమ పథకాల వల్ల డబ్బు వృథా అవుతుందనా? ప్రజలకు నగదు పంపిణీ వల్ల నష్టమనే కదా? వీటిని సమర్థించే వారు కూడా ఉండవచ్చు. కానీ.. వారికి షాక్ ఇచ్చే తీరులో ఆ మరుసటి రోజే చంద్రబాబు అందరికన్నా తానే ఎక్కువ సంక్షేమ పథకాలు ఇస్తానని ప్రకటించారు. సూపర్‌సిక్స్ సహా హామీలన్నీ అమలు చేస్తానని కూడా ఆయన ప్రకటించేశారు. ఇందుకోసం ఏడాదికి రూ.1.5 లక్షల కోట్లు ఖర్చువుతుందని అంచనా. జగన్ ముఖ్యమంత్రిగా ఉండగా అమలు చేసిన సంక్షేమ పథకాలకు ఏటా రూ.70 వేల కోట్లు అవుతూంటేనే విమర్శించిన చంద్రబాబు ఇప్పుడు అందుకు రెట్టింపు మొత్తాన్ని ఇస్తానంటే నమ్మగలమా?. గత ప్రభుత్వ విధానాల వల్ల రాష్ట్ర ఆర్ధిక పరిస్థితి క్షీణించిందని అంటారు. మరి అలాంటప్పుడు అవే విధానాలను కొనసాగిస్తానని చెప్పడమే కాకుండా, జగన్ కంటే ఎక్కువ ఇస్తానని అనేవారా? కాదా? నాలుగుసార్లు సీఎం అయినా ఈ ఆర్థిక పరిస్థితి ఎప్పుడూ లేదని అంటారు. ఒకసారి పాత రికార్డులు తిరగేస్తే వాస్తవాలు తెలుస్తాయి! 👉1994లో తొలిసారి ఆర్దిక మంత్రి అయిన వెంటనే చంద్రబాబు చేసిన పని ఏమిటంటే.. కాంగ్రెస్ ప్రభుత్వం అంతా నాశనం చేసేసిందంటూ శ్వేతపత్రాలు విడుదల చేయడం. ఆ తరువాత ఎన్టీఆర్‌ను సీఎం సీటు నుంచి లాగి పడేశాక కూడా అదే మాట. 👉1996 లోక్ సభ ఎన్నికల తర్వాత ఎన్టీఆర్ టైమ్‌లో ఉన్న మద్య నిషేధం, రెండు రూపాయలకు కిలో బియ్యం మొదలైన వాటిపై ప్రజాభిప్రాయ సేకరణ అంటూ ఒక తంతు నడిపి మొత్తం మార్చేశారు. లోక్ సభ ఎన్నికలలో మాత్రం మద్య నిషేధాన్ని కఠినతరం చేస్తామని ప్రచారం చేశారు. 👉2004 ఎన్నికల్లో కూడా ఇదే వ్యవహారం. అప్పటి వరకు విద్యుత్ సంస్కరణల పేరుతో ఛార్జీల పెంపు, 56 ప్రభుత్వ రంగ సంస్థల మూసివేత, జన్మభూమి కింద ప్రజల నుంచి ఆయా పనులకు డబ్బులు వసూలు చేయడం వంటివి చేశారు. ఎన్నికలు వచ్చాక కోటి వరాలు అంటూ ప్రజలకు స్కీములు ప్రకటించారు. 👉2009లో సైతం నగదు బదిలీతోసహా అనేక వాగ్దానాలు చేశారు. టీడీపీ వాగ్దానాల డొల్లతనాన్ని అప్పటి సీఎం రాజశేఖరరెడ్డి అసెంబ్లీలో ఎండగట్టిన వీడియోలు ఇప్పటికీ సోషల్ మీడియాలో తిరుగుతున్నాయి. 2004 నుంచి 2024 వరకు ఎన్ని విన్యాసాలు చేసింది తెలిసిన చరిత్రే. తాను ప్రతిపక్షంలో ఉంటే ప్రజలంతా కష్టాలలో ఉన్నట్లు చెబుతారు. రైతుల రుణమాఫీతో సహా అన్ని సంక్షేమ పథకాలు ఇవ్వాలని అంటారు. అధికారంలోకి రాగానే అవన్ని వృధా ఖర్చు అని సూక్తులు చెబుతారు. తాజాగా తొమ్మిది నెలల పాలనలో కన్నా, అంతకుముందు ఏడాది జగన్ పాలన(YS Jagan Term)లో ఆర్థికాభివృద్ది రేటు, జీఎస్టీ, జీఎస్డీపీ వంటివి అధికంగా ఉన్నాయని లెక్కలు చెబుతున్నా, ఆయన మాత్రం తన పంథాలో విధ్వంసం జరిగిందని ఆరోపిస్తారు. అలాగని ఆ విధ్వంసం ఏమిటో వివరిసారా? ఊహూ లేదు!పడికట్టు పదాలతో, కొత్త కొటేషన్లతో జనాన్ని మాయ చేయగలిగితే చాలన్నది ఆయన విధానంగా కనిపిస్తుంది. తాజాగా తల్లికి వందనం(Thalliki Vandanam) పథకాన్ని మే నెలలో అమలు చేస్తామని ప్రకటించారు. చేస్తారో లేదో ఇంకేమి మతలబు పెడతారో తెలియదు. కానీ.. ఏడాది కాలం ఈ పథకాన్ని ఎగవేసిన సంగతి దాచేస్తారు. పైగా మే నెలలో స్కూళ్లు తెరవరు. మరి ఏ ప్రాతిపదికన ఈ పథకానికి ఒక్కో విద్యార్థికి రూ.15 వేలు చొప్పున ఇస్తారో చూడాలి మరి!. అదే కాదు. ఒక్క ఫించన్లు, అన్న క్యాంటిన్లు, అరకొర ఉచిత గ్యాస్ సిలిండర్ల పంపిణీ తప్ప, మిగిలిన ఏ పథకం కూడా అమలు కాలేదు. వాటికి ఇంతవరకు షెడ్యూలే ఇవ్వలేదు. ప్రతి మహిళకు రూ.1500, నిరుద్యోగ భృతి కింద రూ.మూడు వేలు, రైతు భరోసా రూ.20 వేలు, బీసీలకు ఏభై ఏళ్లకే ఫించన్ తదితర హామీలను అధికారంలోకి వచ్చిన తొలి ఏడాది తుంగలో తొక్కేశారు. చంద్రబాబు భావన ప్రకారం.. గవర్నర్ స్పీచ్‌లో చెప్పించినట్లుగా అయితే ఈ స్కీములన్నీ చేపలే అవుతాయి. కాని, చేపలు పట్టే వలలు కావు కదా! వాటి మీద క్లారిటీతో చెప్పే ప్రయత్నం చేయరు. ఒకప్పుడు అసలు భారీ ప్రాజెక్టులంటేనే నమ్మకం లేని వ్యక్తి చంద్రబాబు. అవి వెంటనే పూర్తి కావని, ఎన్నికలకు ఉపయోగపడవన్నది ఆయన అభిప్రాయం. కాని ఎన్నికలకు ముందు భారీ సాగునీటి ప్రాజెక్టులకు మాత్రం జోరుగా శంకుస్థాపనలు చేస్తుంటారు. 1999 ఎన్నికలకు ముందు పలు సాగునీటి ప్రాజెక్టులకు శంకుస్థాపన చేసి వదలివేస్తే, అప్పటి విపక్షనేత రాజశేఖర రెడ్డి ఆ ప్రాంతాలకు వెళ్లి పూలు పెట్టి వచ్చారు. తన హయాంలో పోలవరం, పులిచింతల ప్రాజెక్టులను చేపట్టడానికి కూడా సుముఖత చూపని చంద్రబాబు... వైఎస్ చొరవతో ముందుకు వెళ్లిన తరువాత పోలవరం తన కల అంటూ ప్రచారం చేసుకున్నారు. ఇప్పుడు కొత్తగా రూ. 85 వేల కోట్లతో ‘జల్ జీవన్’ మిషన్ కింద స్కీమును, రూ.80వేల కోట్లతో పోలవరం-బనకచర్ల స్కీమును అమలు చేస్తామని చెబుతున్నారు. వీటిలో ప్రైవేటు భాగస్వామ్యం ఉంటుందంటున్నారు. అవి ఎలా ముందుకు వెళుతాయన్నది ఎవరికి తోచిన విధంగా వారు ఊహించుకోవచ్చు. సామాన్యుడికి మద్యం అందుబాటులోకి తీసుకు వచ్చినట్లు చంద్రబాబు చెప్పడాన్ని పలువురు ఆక్షేపిస్తున్నారు. మద్యపానాన్ని నిరుత్సాహపరచవలసిన సీఎం అలా మాట్లాడితే ఎలా? అని విమర్శిస్తున్నారు. ఇక స్వర్ణాంధ్ర, విజన్ 2047, కొత్తగా పీ-4 వంటి అంశాలతో ప్రజలను ఊహాలోకాలలోకి తీసుకువెళ్లడానికి తన ప్రసగంలో అన్ని ప్రయత్నాలు చేశారు. కానీ సోషల్ మీడియా యుగం వచ్చాక చంద్రబాబు మాయలన్ని తెలిసిసోతున్నాయి. అదే ఆయనకు సమస్యగా ఉంది. దాంతో సోషల్ మీడియా వారిపై కేసులు పెట్టి వేధిస్తున్నారు. చంద్రబాబు చిత్తశుద్దితో హామీలు అమలు చేస్తూ, నిర్మాణాత్మకంగా ప్రగతి వైపు ప్రభుత్వాన్ని నడిపితే సంతోషమే. కానీ ఆయన చేసే మాటల గారడీ రీత్యా ఆ పరిస్థితి కనబడడం లేదు.:::కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత -
పోసాని కేసులో ఆపరేషన్ సక్సెస్.. పేషెంట్ డెడ్: పొన్నవోలు
సాక్షి, అన్నమయ్య జిల్లా: ‘పోసాని కృష్ణమురళి కేసులో ఆపరేషన్ సక్సెస్.. పేషెంట్ డెడ్.. సెక్షన్లు 111, 67 వర్తించవని రైల్వే కోడూరు కోర్టు చెప్పింది.. అయినప్పటికీ పోసానికి రిమాండ్ విధించటం సరికాదు‘‘ అని మాజీ ఏఏజీ, సీనియర్ న్యాయవాది పొన్నవోలు సుధాకర్ రెడ్డి అన్నారు. సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం ఏడు సంవత్సరాల లోపు శిక్ష పడే కేసులకు రిమాండ్ విధించకూడదు. కోర్టు ధిక్కారణ కింది హైకోర్టు లో కేసు వేస్తాం’’ అని పొన్నవోలు పేర్కొన్నారు.‘‘పోసాని కృష్ణమురళి పై రాష్ట్ర వ్యాప్తంగా 16 కేసులు నమోదు చేశారు. ప్రశ్నించే గొంతులను అణచివేయటమే చంద్రబాబు సర్కార్ లక్ష్యం. వైఎస్ జగన్ ఆదేశాలతో న్యాయ పోరాటం కొనసాగిస్తాం. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు, కార్యకర్తలు ధైర్యం గా ఉండాలి’’ అని పొన్నవోలు సుధాకర్ రెడ్డి చెప్పారు.కాగా, పోసాని కృష్ణమురళికి న్యాయస్థానం మార్చి 13 వరకు (14 రోజులు) రిమాండ్ విధించింది. పోసానిని రాజంపేట సబ్‌జైలుకు తరలించారు. పోసాని తరపున పొన్నవోలు సుధాకర్‌రెడ్డి వాదనలు వినిపించారు. బీఎస్ఎన్ 111 యాక్ట్నమోదు చేయడంపై పొన్నవోలు అభ్యంతరం వ్యక్తం చేశారు. ఆర్డనైజ్డ్ క్రైమ్స్ చేసే వారికి మాత్రమే వర్తిస్తుందని పొన్నవోలు వాదించారు.రాత్రి 9 గంటల నుంచి కోర్టులోనే పోసాని కృష్ణమురళి ఉన్నారు. రాత్రి 9.20 గంటలకు కోర్టులో పోలీసులు ప్రవేశపెట్టారు. రాత్రి నుంచి సుదీర్ఘంగా వాదనలు కొనసాగాయి. సుమారు 8 గంటల పాటు ఇరుపక్షాల మధ్య వాదనలు సాగాయి. ఉదయం 5 గంటల వరకు వాదనలు సాగాయి. అంతకు ముందు ఓబువారి పల్లె పీఎస్‌లో 9 గంటల పాటు పోసాని విచారణ సాగింది. ఎస్పీ విద్యాసాగర్ పోసానిని స్వయంగా విచారించారు.ఇదీ చదవండి: కూటమి సర్కార్ వికటాట్టహాసంరెడ్బుక్ రాజ్యాంగమే పరమావధిగా బరితెగింపురెడ్బుక్ రాజ్యాంగమే పరమావధిగా రాష్ట్రంలో చంద్రబాబు కూటమి ప్రభుత్వం బరితెగించింది. సినీ నటుడు పోసాని కృష్ణ మురళిపై కక్ష సాధించడం కోసం నిబంధనలకు తిలోదకాలు వదిలింది. తమను అడిగే వారే లేరని, ఎవరైనా ప్రశ్నిస్తే అంతు చూసేదాకా వదలమన్నట్లు వ్యవహరిస్తోంది. పోలీసులను అడ్డం పెట్టుకుని కక్ష సాధింపుకు పాల్పడుతోంది. ఎప్పుడో పదేళ్ల కిందట నంది అవార్డును తిరస్కరిస్తూ చేసిన వ్యాఖ్యలపై ఇప్పుడెవరో ఫిర్యాదు చేస్తే కేసు నమోదు చేయడమే ఇందుకు నిదర్శనం.ఈ క్రమంలో బుధవారం రాత్రి 8.45 గంటలకు హైదరాబాద్ గచ్చి»ౌలిలోని ఆయన నివాసంలోకి అన్నమయ్య జిల్లా సంబేపల్లె ఎస్ఐ భక్తవత్సలం ఆధ్వర్యంలోని పోలీసు బృందం అక్రమంగా చొచ్చుకెళ్లి, అదుపులోకి తీసుకున్నది మొదలు.. గురువారం మధ్యాహ్నం సుమారు 12 గంటల వరకు ఎక్కడెక్కడో తిప్పుతూ భయభ్రాంతులకు గురి చేసింది. 15 గంటల తర్వాత ఓబులవారిపల్లె పోలీసుస్టేషన్‌కు తీసుకొచ్చింది. అప్పటి వరకు ఆయన్ను ఎక్కడ ఉంచారో, ఎవరి వద్దకు తీసుకెళ్లారో బయటకు పొక్కకుండా సస్పెన్స్ కొనసాగించింది.జనసేన పార్టీ నేత జోగినేని మణి చేసిన ఫిర్యాదుపై ఓబులవారిపల్లె పోలీసుస్టేషన్లో పోసానిపై క్రైం నంబరు 65/2025, అండర్ 196, 353(2), 111 ఆర్/డబ్ల్యూ 3(5) ఆఫ్ ది బీఎన్ఎస్ యాక్టు–2023 కింద కేసు నమోదైతే సంబేపల్లె ఎస్ఐ భక్తవత్సలం ఆధ్వర్యంలో బృందాన్ని పంపడం సందేహాలకు తావిస్తోంది. మహా శివరాత్రి పండుగ రోజు అని కూడా చూడకుండా పైశాచికంగా వ్యవహరించారు.ఎన్నికల అనంతరం రాజకీయాలకు స్వస్తి చెప్పి, ఏ పార్టీతో సంబంధం లేకుండా కొనసాగుతున్నానని చెప్పినప్పటికీ వినకుండా, అదే రోజు రాత్రికి రాత్రే జిల్లాకు తీసుకు వచ్చిన తీరుపై సర్వత్రా ఆగ్రహం వెల్లువెత్తుతోంది. పైగా నోటీసులో 27వ తేదీ వేసి, 26వ తేదీన అదుపులోకి తీసుకోవడం పట్ల న్యాయవాద వర్గాలు విస్తుపోతున్నాయి. -
రాష్ట్ర ప్రభుత్వానిది రౌడీయిజం
ఒంగోలు టౌన్: ప్రజలిచ్చిన అధికారాన్ని అడ్డం పెట్టుకుని రాష్ట్ర ప్రభుత్వం రౌడీయిజానికి పాల్పడుతోందని వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జూపూడి ప్రభాకర్ ధ్వజమెత్తారు. ప్రశ్నించే గొంతులను అణచివేస్తోందని, అందులో భాగమే ప్రముఖ సినీ నటుడు పోసాని కృష్ణమురళి అరెస్టు అని చెప్పారు.జూపూడి గురువారం ఇక్కడ నిర్వహించిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ పోసాని దొంగో, నేరస్తుడో కాదని, ఒక రచయితగా, సినిమా దర్శకుడిగా, నటుడిగా ప్రజలకు అండగా నిలబడి మాట్లాడారని, ఆయన అరెస్టు అక్రమమేనని చెప్పారు.దేశ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షాపై వ్యక్తిగత దూషణలు చేసిన చంద్రబాబు సంగతేమిటని ప్రశ్నించారు. చంద్రబాబు ఎంతటి వారినైనా విమర్శిస్తారుగానీ.. ఆయన మీద విమర్శలు చేస్తే అరెస్టులు చేయిస్తారా అని నిలదీశారు. రాష్ట్ర ప్రభుత్వ నిర్బంధాలు, అణచివేతలకు వ్యతిరేకంగా వైఎస్సార్సీపీ పోరాటాలు చేస్తుందని జూపూడి తెలిపారు. -
చంద్రబాబుది నియంత పాలన
రాజమహేంద్రవరం రూరల్: రాష్ట్రంలో ప్రభుత్వ అరాచకం కట్టలు తెంచుకుంటోందని మాజీ మంత్రి, వైఎస్సార్సీపీ తూర్పు గోదావరి జిల్లా అధ్యక్షుడు చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ అన్నారు. సీఎం చంద్రబాబు కక్షలతో రాజకీయ ప్రత్యర్థులను, కళాకారులను, విశ్లేషకులను అరెస్టు చేస్తూ నియంత పాలన చేస్తున్నారని ధ్వజమెత్తారు.ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసి, రెడ్‌బుక్ రాజ్యాంగాన్ని నడుపుతున్నారని దుయ్యబట్టారు. వేణుగోపాలకృష్ణ గురువారం ఇక్కడ ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. ప్రముఖ నటుడు పోసాని కృష్ణమురళి అరెస్టుతో చంద్రబాబు కక్షపూరిత రాజకీయాలు పతాక స్థాయికి చేరాయన్నారు. రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్లు కొన్ని నెలల క్రితమే పోసాని ప్రకటించారని తెలిపారు. గొంతు ఆపరేషన్ చేయించుకున్నారని, అనారోగ్యంతో ఉన్నారని, అయినా చంద్రబాబు సర్కారు క్రూరంగా అరెస్టు చేసిందని ఆగ్రహం వ్యక్తంచేశారు. -
‘ఫొటో దిగారుగా వెళ్లిపోండి’.. గ్రామస్తులపై బాలకృష్ణ చిందులు
సాక్షి, కృష్ణా జిల్లా: హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ మరోసారి అసహనానికి గురయ్యారు. మా ఊరిని అభివృద్ధి చేయరు అంటూ విజ్ఞప్తి చేసిన గ్రామస్థులపై కస్సుబుస్సుమన్నారు. 'ఫొటో దిగారుగా.. చాలు ఇక వెళ్లిపోండి' అంటూ ఫైరయ్యారు. ఎమ్మెల్యే బాలకృష్ణ ఇవాళ తన స్వగ్రామమైన కృష్ణా జిల్లా నిమ్మకూరులో పర్యటించారు. అయితే, నిమ్మకూరుకు వచ్చిన బాలకృష్ణను కలిసేందుకు ఆయన తల్లి బసవతారకమ్మ స్వగ్రామమైన కొమరవోలు గ్రామస్తులు వచ్చారు. ఈ సందర్భంగా గ్రామస్తులు.. బాలకృష్ణను పలకరించారు. ఫొటోలు సైతం దిగారు.అనంతరం, మా గ్రామాన్ని కూడా అభివృద్ధి చేయాలని కొమరవోలు గ్రామస్తులు బాలకృష్ణను కోరారు. అందుకు ఆయన ‘నేను పట్టించుకోను.. ఫొటోలు దిగారుగా వెళ్లండి’ అంటూ వారిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. కొమరవోలు గ్రామమా? అదెక్కడ ఉంది? అంటూ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. లింగాయత్తులను పట్టించుకోవాల్సిన అవసరం లేదు’ అని వ్యాఖ్యానించారు. దీంతో, తన తల్లి బసవతారకమ్మ స్వగ్రామమైన కొమరవోలును బాలకృష్ణ విస్మరించడం, అసహనం వ్యక్తం చేయడంతో గ్రామస్తులు అక్కడి నుండి వెళ్లిపోయారు. ప్రస్తుతం, బాలకృష్ణ చేసిన వ్యాఖ్యల వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. -
‘పోసాని అరెస్ట్ ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తోంది’
ప్రకాశం జిల్లా: ప్రముఖ సినీ నటుడు పోసాని కృష్ణ మురళిని అక్రమంగా అరెస్ట్ చేయడం అనేది ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేయడమేనని మాజీ మంత్రి, వైఎస్సార్ సీపీ నేత మేరుగ నాగార్జున మండిపడ్డారు. అసలు చంద్రబాబు పాలన అంతా కక్షలు కార్పణ్యాలతో నడుస్తోందన్నారు మేరుగ. ఆరోగ్యం బాగా లేదని పోసాని కృష్ణమురళి చెప్పినా వదల్లేదని, ఇంత నీచమా చంద్రబాబు అని మేరుగ ప్రశ్నించారు. అడ్డగోలుగా రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తున్నారని విమర్శించారు.రాష్ట్రంలో రైతులు విలవిలలాడుతున్నారని, ప్రభుత్వం మిర్చి రైతులను నిలువునా మోసం చేసిందన్నారు. వైఎస్ జగన్ ప్రభుత్వంలో వ్యవసాయం పండగలా సాగిందని, చంద్రబాబు పాలనలో అదే వ్యవసాయం నిర్వీర్యం అయ్యిందన్నారు.ఇది కూటమి ప్రభుత్వం కక్ష సాధింపుఅన్నమయ్య జిల్లా: పోసాని కృష్ణమురళి అక్రమ అరెస్టు అనేది టీడీపీ కూటమి ప్రభుత్వం కక్ష సాధింపు చర్య అని ధ్వజమెత్తారు మదనపల్లి వైఎస్సార్ సీపీ ఇంచార్జి నిసార్ అహ్మద్. పోసాని అనారోగ్యంతో ఉన్నప్పటికీ పోలీసులు రాత్రివేళ అరెస్టు చేయడం అన్యాయమన్నారు.రెడ్ బుక్ రాజ్యాంగాన్ని కూటమి ప్రభుత్వం అమలు చేస్తోందన్నారు. ఇచ్చిన హామీలు అమలు చేయకుండా డైవర్షన్ పాలిటిక్స్ చేస్తుందని మండిపడ్డారు. తమపై ఎన్ని కేసులు పెట్టినా ఎదురించి నిలబడతామన్నారు నిసార్ అహ్మద్ -
ఓటుకు 3000.. పిఠాపురంలో ప్రలోభాల పర్వం!
సాక్షి, పిఠాపురం: ఏపీలో మూడు ఎమ్మెల్సీ స్థానాల్లో పోలింగ్ కొనసాగుతోంది. ఎన్నికల సందర్భంగా కూటమి నేతలు రెచ్చిపోతున్నారు. పోలింగ్ కేంద్రాల వద్దే యథేచ్ఛగా డబ్బులు పంపిణీ చేస్తున్నారు. ఓటుకు 2000-3000 ఇస్తున్నారు. ఇంత జరుగుతున్నా పోలీసులు, ఎన్నికల అధికారులు మాత్రం వారిపై ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదు.కాకినాడ నియోజకవర్గంలో కూటమి నేతలు రెచ్చిపోయి ఓటుకు నోటుకు పాల్పడుతున్నారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రాతినిధ్యం వహిస్తున్న పిఠాపురంలో కూటమి నేతలు పట్టపగలే డబ్బుల పంచుతున్నారు. ఎన్నికల బరిలో నిలిచిన కూటమి అభ్యర్థి పేరాబత్తుల రాజశేఖర్‌కు ఓటు వేస్తే 3000 అంటూ ఓటర్లను ప్రలోభాలకు గురిచేస్తున్నారు. అలాగే, మున్సిపల్ కళ్యాణ మండపం వద్ద ఓటుకు 3000 రూపాయలను ఓట్లరకు పంచుతున్నారు. ఓట్లరకు డబ్బు పంపిణీ చేస్తున్నా అధికారులు చర్యలు తీసుకోవడం లేదు. కృష్ణా జిల్లాలో సైతం ఇలాగే జరుగుతోంది. ఉమ్మడి కృష్ణా, గుంటూరు పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూటమి నేతలు ఓట్లరను ప్రలోభాలు గురిచేస్తున్నారు. పోలింగ్ కేంద్రాల వద్దే టీడీపీ నేతల బరితెగిస్తున్నారు. ఓట్లుకు 2000 అంటూ ఓటర్లకు డబ్బులు పంపిణీ చేస్తున్నారు. పెడనలో పోలింగ్ కేంద్రం వద్దే డబ్బులు ఇచ్చారు. టీడీపీ పార్టీ అధ్యక్షుడు చల్లపాటి ప్రసాద్ నగదును ఓటర్లు అందిస్తున్నారు.విశాఖలో టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూటమి నేతలు నిబంధనలను ఉల్లంఘిస్తున్నారు. ఈసీ ఆంక్షలు లెక్క చేయకుండా పోలింగ్ కేంద్రాలలో నాయకులతో కలిసి హడావిడి చేస్తున్నారు. చంద్రపాలెం స్కూల్లోకి నేరుగా వాహనంతో వెళ్లిన భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాస్. కానీ, అధికారులు మాత్రం ఆయనకు అడ్డుచెప్పకపోవడం గమనార్హం.ఎన్టీఆర్ జిల్లాలో ఇలా..ఎన్నికల కోడ్ ఉల్లంఘించిన గుంటూర్ ఆక్స్ ఫర్డ్ స్కూల్ యాజమాన్యం. జిల్లా కలెక్టర్ ఆదేశాలను పట్టించుకోని యాజమాన్యం. 144 సెక్షన్ అమలులో ఉన్నా పట్టించుకోని వైనం. ఓటు వేయకుండా ఉపాధ్యాయులను నిర్బంధించిన యాజమాన్యం. ఇదేమిటని ప్రశ్నించిన మీడియాకు పొంతలేని సమాధానం చెప్పిన సిబ్బంది. పుట్టినరోజు వేడుకలు కోసమే ఉపాధ్యాయులను పిలిచినట్లు సమాధానం. చివరకు మీడియా అక్కడికి చేరుకోవడంతో ఉపాధ్యాయులను వదిలిపెట్టారు. -
బాబు, పవన్‌తో పోటీ పడుతున్న లోకేష్?
కాకి లెక్కలు చెప్పడంలో తండ్రిని మించిపోవాలని ఆంధ్రప్రదేశ్ షాడో సీఎం, విద్యాశాఖ మంత్రి లోకేష్ తహతహలాడుతున్నట్లు అనిపిస్తోంది. సర్వ మంత్రిత్వ శాఖలపై పెత్తనం చెలాయిస్తున్న ఈయన ఇటీవలే ‘ఎక్స్’ వేదికగా చేసిన ట్వీట్ ఈ అనుమానాలను బలపరుస్తోంది. ఏమిటా ట్వీట్ అంటే.. ‘వైఎస్ జగన్ చేసిన అప్పులపై కట్టాల్సిన వడ్డీనే రూ. 24,944 కోట్లు’ అని!. దీంతో, అవకాశం దొరికిందనుకుందేమో.. ‘ఈనాడు’ మరింత రెచ్చిపోయింది. తప్పుడు కథనాల వండి వార్చేసింది. నిజానిజాలను నిర్ధారించుకుని మరీ వార్తలు రాయాలన్న ప్రాథమిక జర్నలిజమ్ సూత్రాన్ని గాలికి వదిగేసింది. యాభై ఏళ్లపాటు మనుగడలో ఉన్న ఈనాడు ఈ స్థాయికి దిగజారుతుందని ఎవరు ఊహిస్తారు చెప్పండి?.లోకేష్ ట్వీట్‌కు సంబంధించిన కథనానికి ఈనాడు పెట్టిన శీర్షిక చదివితే జగన్ హయాంలో తెచ్చిన అప్పులకే రూ.24,944 కోట్ల వడ్డీ కట్టాలనేమో కదా! అయితే వాస్తవం ఇది కాదు. 1953 నుంచి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేసిన అప్పులకు సంబంధించిన వడ్డీ ఇది. అంత మొత్తాన్నీ వైఎస్ జగన్ ఖాతాలోకి వేసి ప్రజలను తప్పుదారి పట్టించాలన్నది ఈనాడు కుత్సిత వ్యూహం!.లోకేష్ తన ట్వీట్లో 2019 వరకు ఉన్న అప్పులపై వడ్డీని, జగన్ హయాంలో తెచ్చిన అప్పులపై వడ్డీని పోల్చుతూ కొంత మిస్ లీడ్ చేసే యత్నం చేస్తే.. ఈనాడు మీడియా అబద్ధపు హెడ్డింగ్ పెట్టి మొదటి లైన్లో ఇలా రాసింది. ‘వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో జగన్ చేసిన అప్పులపై కడుతున్న వడ్డీ రూ.24,944 కోట్లకు చేరుకుందని మంత్రి లోకేష్ తెలిపారు’ అని! ఆ వెంటనే ‘2019 నాటికి మొత్తం అప్పులపై రాష్ట్ర ప్రభుత్వం చెల్లిస్తున్న వడ్డీ రూ.14,155 కోట్లు. దీని కంటే జగన్ పాలనలో చేసిన అప్పులపై కడుతున్న వడ్డీనే అధికం అని లోకేష్ పేర్కొన్నారు’ అని రాసింది. మొదటి వాక్యంలో మొత్తం వడ్డీ అంతా జగన్ ఖాతాలో వేసేసింది?. అదంతే.. ఈనాడు బుద్దే అలా చెడిపోయిందని అనుకోవాలి.ఇక లోకేష్ విషయానికి వద్దాం. ఆయన ఏమంటున్నారంటే 2019 వరకు అందరు ముఖ్యమంత్రులు కలిసి తెచ్చిన అప్పులపై రూ.14,155 కోట్ల వడ్డీ చెల్లిస్తుండగా, జగన్ హయాంలో రూ.24 వేల కోట్లకు చేరిందీ అని చెప్పారు. అదే టైమ్‌లో ఆయన పోల్చవలసింది చంద్రబాబు ఉమ్మడి ఏపీతోపాటు విభజిత ఏపీలోనూ ముఖ్యమంత్రిగా ఉండగా చేసిన అప్పులెంత? అన్నది విభజిత ఏపీలో 2014-19 మధ్య ఎంత అప్పు తీసుకు వచ్చారన్నది కదా!. అదేమీ చెప్పకుండా లోకేష్ అతి తెలివిని ప్రదర్శించారు.ఈ అంశంపై నెటిజన్లు లోకేష్‌పై వ్యంగ్యాస్త్రాలు సంధించారు. లోకేష్ బాబూ.. అసలు నిజం చెబుదామా? అంటూ వాయిస్ ఆంధ్ర పేరుతో ఒక ట్వీట్ వచ్చింది. అందులో ఇలా ప్రస్తావించారు. 2014-19 చంద్రబాబు హయాంలో అప్పుల భారం ₹97,000 కోట్ల నుంచి ₹3,46,529 కోట్లకు పెరిగింది! (సోర్స్: CAG & RBI).అప్పుల భారం మూడింతలు చేసిన చంద్రబాబు, వడ్డీ పెరిగింది అని జగన్‌పై బురదజల్లడం కామెడీ కాదా?. 2019 నాటికి అప్పులపై కట్టిన వడ్డీ ₹14,154 కోట్లు. అదే 2024 నాటికి ₹24,944 కోట్లు. వడ్డీ పెరగడానికి కారణం 2014-19 మధ్య టీడీపీ చేసిన భారీ అప్పులే కదా?. జగన్ పాలనలో అప్పులు వచ్చాయి కానీ, సంక్షేమానికి, అభివృద్ధికి ఉపయోగపడ్డాయి. కానీ టీడీపీ హయాంలో అప్పు చేసి.. కమీషన్లు, కాంట్రాక్టర్లు, సింగపూర్ ట్రిప్పులకే ఖర్చు పెట్టారు. అని ఆ ట్వీట్ లో వ్యాఖ్యానించారు.జగన్ హయాంలో 'అమ్మ ఒడి, విద్యా కానుక ఇచ్చారు.. మరి మీ సూపర్ సిక్స్ ఏది మరి? అని ఇంకొకరు ప్రశ్నించారు. వాస్తవాలు చెబితే మైండ్ బ్లాంక్ అవుతుందా బాబూ? అంటూ వైఎస్సార్సీపీ ప్రశ్నలు సంధించింది. 'YSRCP హయాంలో ప్రజల జీవితం మెరుగుపడింది. కానీ టీడీపీ హయాంలో మాత్రం అప్పులూ, అవినీతీ తప్ప మిగలలేదు! అని ఆ పోస్టులో వ్యాఖ్యానించింది.ఉమ్మడి ఏపీ విడిపోయేనాటికి విభజిత ఏపీ అప్పు పై ఏడాదికి రూ.7488 కోట్లు చెల్లిస్తుండగా, 2019 నాటికి చంద్రబాబు హయాంలో చేసిన అప్పులు కూడా కలిపి కట్టవలసిన వడ్డీ రూ.15,342 కోట్లు. అంటే అంతకుముందు ముఖ్యమంత్రులందరూ చేసిన అప్పుకన్నా మూడు రెట్లు అధికంగా రుణాన్ని తీసుకురావడమే కాకుండా, డబుల్ మొత్తాన్ని వడ్డీగా చెల్లించవలసి వచ్చిన లెక్కలను వైఎస్సార్సీపీ నేతలు తమ సమాధానాలలో వివరించారు. 2019లో అప్పును మూడున్నర లక్షల కోట్లకు తీసుకువెళ్లి కూడా చివరకు జగన్ పదవిలోకి వచ్చే నాటికి వంద కోట్లు మిగిల్చి వెళ్లిన విషయాన్ని గుర్తు చేశారు.అప్పుడు జగన్ జీతాలు కూడా ఇవ్వలేరని టీడీపీ నేతలు భావించి ప్రకటనలు కూడా చేశారు. దానిని కదా ఆర్థిక విధ్వంసం అనాల్సింది? ఆ తర్వాత రెండేళ్ల పాటు కరోనా ఉన్నా ప్రజలకు సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ది పనులు అమలు చేసిన చరిత్ర జగన్‌ది. అంతేకాదు.. జగన్ దిగిపోయే నాటికి ఏడువేల కోట్లు ఖజానాలో ఉంచి వెళ్లారు. ఈ ఎనిమిది నెలల కాలంలో ఒక్క హామీ అమలు చేయకుండా, అప్పులు మాత్రం రూ.1.30 లక్షల కోట్లు తెచ్చిన ఘనత చంద్రబాబు సర్కార్‌ది అని వైఎస్సార్సీపీ నేతలు వాదించారు. ఇది నిజమే.జగన్ టైమ్‌లో అన్ని పథకాలు అమలై, పోర్టులు, మెడికల్ కాలేజీలు, ఊరూరా భవనాలు నిర్మించినా ఆర్థిక విధ్వంసం అని టీడీపీ కూటమి దుష్ప్రచారం చేస్తుంటుంది. మరి ఈ ఎనిమిది నెలల కాలంలో కాని, అంతకుముందు 2014 టర్మ్‌లో ఐదేళ్లలో కాని నిర్దిష్టంగా ఫలానా అభివృద్ధి చేశామని చెప్పుకోలేని పరిస్థితి టీడీపీది. అప్పుడు రుణమాఫీతో సహా వందల హామీలు అమలు చేయకుండా కాలం గడిపారు. ఇప్పుడు సూపర్ సిక్స్, ఇతర హామీలు అమలు చేయకుండా చంద్రబాబు ప్రభుత్వం గల్లాపెట్టె ఖాళీ అంటూ కథలు చెబుతూ, మరోవైపు ధారాళంగా అప్పులు చేస్తూ ప్రజలను మభ్యపెట్టే యత్నం చేస్తోంది.2024 ఎన్నికలకు ముందు చంద్రబాబు, లోకేష్, పవన్ కళ్యాణ్ లు జగన్ ప్రభుత్వం రూ.14 లక్షల కోట్ల అప్పు చేసిందని ప్రచారం చేశారు. తీరా చూస్తే అది రూ.ఏడు లక్షల కోట్లు కూడా లేదు. అందులో చంద్రబాబు ప్రభుత్వ టైమ్‌లో వచ్చిందే సుమారు రూ.మూడు లక్షల కోట్లు ఉంది. అయినా దాని గురించి చెప్పకుండా మొత్తం జగన్ అకౌంట్లోవేసి ఎల్లో మీడియాలో ప్రచారం చేస్తుంటారు. అదేకాదు. ఇటీవలి కాలంలో కేంద్రం ఇచ్చిన లెక్కల ప్రకారం జగన్ టైమ్‌లో జీఎస్డీపీ, జీఎస్టీలలో ఏపీలో వృద్దిలో ఉంటే, చంద్రబాబు అధికారంలోకి వచ్చిన ఈ ఎనిమిది నెలల్లో మైనస్‌లోకి వెళ్లింది.జగన్ టైమ్ లో మైనింగ్ శాఖలో 2023-24లో ఆదాయం రూ.4800 కోట్లు కాగా, అది చంద్రబాబు కూటమి అధికారంలోకి వచ్చాక ఈ ఆర్థిక సంవత్సరంలో రూ.మూడు వేల కోట్ల వరకే ఉందట. చంద్రబాబు 2014 టర్మ్‌లో మైనింగ్ శాఖ ఆదాయం రూ.8161 కోట్లు ఉంటే, జగన్ ఐదేళ్లలో రూ.17,732 కోట్ల ఆదాయం సాధించింది. అయినా కూటమి నేతలు జగన్ టైమ్ లో ఆర్థిక విధ్వంసం జరిగిందని తప్పుడు ప్రచారం చేస్తారు. దానివల్లే తాము సూపర్ సిక్స్ హామీలు అమలు చేయలేక పోతున్నామని ప్రజలను ఏమార్చే యత్నం చేస్తున్నారు.అబద్దాలు చెప్పడంలో చంద్రబాబు మొనగాడు అని దేశవ్యాప్తంగా ఆయా పార్టీల వారు భావిస్తారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అచ్చంగా అదే బాటలో నడుస్తున్నారు. వారిద్దరితో పోటీ పడి లోకేష్ కూడా తనకు తోచిన అబద్దాలను ప్రచారం చేయడం ద్వారా ప్రజలలో ఉండాలని తలపెట్టినట్లు అనిపిస్తుంది. ఒకవైపు కుంభమేళాలో పుణ్యస్నానాలకు కుటుంబ సమేతంగా వెళ్లి వచ్చిన లోకేష్ ఇలాంటి అసత్యాలను చెబితే పాపం అనిపించదా!.- కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత. -
ప్రజలు, దేవుడు.. అంతా చూసున్నారు: వైఎస్ జగన్
గుంటూరు, సాక్షి: పోసాని కృష్ణమురళి(Posani Krishna Murali) అక్రమ అరెస్ట్‌ను వైఎస్సార్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి ఖండించారు. పోసాని భార్య కుసుమలతను ఫోన్లో పరామర్శించిన ఆయన.. పార్టీ అండగా ఉంటుందని ధైర్యం చెప్పారు. ‘‘ప్రజలు, దేవుడు అంతా చూస్తున్నారు. పోసాని కృష్ణమురళికి వైఎస్సార్సీపీ అండగా ఉంటుంది. మేం అందరం మీకు తోడుగా ఉంటాం. పార్టీ తరఫున న్యాయ సహాయం అందిస్తాం. సీనియర్ న్యాయవాదులకు ఆ బాధ్యతలు అప్పగించాం. పొన్నవోలు సహా అందరినీ రాజంపేటకు పంపించాం. నాయకులందరినీ కోర్టు వద్దకు పంపించాం. ఈ కష్టకాలంలో మీరు ధైర్యంగా ఉండండి. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వ నిరంకుశ పాలన ఎక్కువ రోజులు కొనసాగదు’’ అని వైఎస్ జగన్(YS Jagan) అన్నారు. ఇదిలా ఉంటే.. వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో ఏపీఎఫ్‌టీవీడీసీ ఛైర్మన్‌గా పోసాని పని చేశారు. అయితే ఏపీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల తర్వాత ఆయన తన పదవికి రాజీనామా చేశారు. ఆపై ప్రెస్ మీట్ నిర్వహించి మరీ ఇకపై రాజకీయాలు మాట్లాడబోనని, వాటికి దూరంగా ఉంటానని ప్రకటించారు. అయితే.. అనూహ్యంగా హైదరాబాద్‌లో ప్రత్యక్షమైన అన్నమయ్య జిల్లా రాయచోటి పోలీసులు.. ఆయనపై కేసు నమోదైందని చెబుతూ అప్పటికప్పుడే ఆయన భార్యకు నోటీసులు అందజేసి వెంట తీసుకెళ్లారు. తన ఆరోగ్యం బాగోలేదని, భోజనం చేసి తానే వస్తానని చెప్పినా వినలేదు. ఈ క్రమంలో పోసాని కుటుంబ సభ్యులతోనూ రాయచోటి పోలీసులు దురుసుగా ప్రవర్తించారు. మరోవైపు పోసానిని ఎక్కడికి తీసుకెళ్తున్నారనే విషయం కూడా చెప్పకపోవడంతో కుటుంబ సభ్యులు ఆందోళనకు గురయ్యారు. గతంలో.. సినిమా పరిశ్రమపై విమర్శలు చేశారని జనసేన(Jana Sena) నేత మణి ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోసాని కృష్ణ మురళిపై అన్నమయ్య జిల్లా ఓబులవారిపల్లె పోలీస్ స్టేషన్లో కేసు నమోదైనట్లు తెలుస్తోంది. పోసానిపై 196, 353(2), 111 రెడ్‌విత్ 3(5) సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు. ఇదీ చదవండి: పోసాని అరెస్ట్.. అసలు జరిగింది ఇదే! -
AP: ముగిసిన ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్
ఎన్నికల పోలింగ్ అప్డేట్స్.. ముగిసిన ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ఏపీలో మూడు స్థానిలకు జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్రెండు పట్టభద్రుల స్థానాలకు, ఒక టీచర్ ఎమ్మెల్సీ స్థానానికి జరిగిన పోలింగ్వచ్చే నెల 3వ తేదీన కౌంటింగ్ మరో గంటలో ముగియనున్న ఉత్తరాంధ్ర టీచర్స్ ఎమ్మెల్సీ పోలింగ్..ఇప్పటికే 80శాతం పైగా పోలింగ్ నమోదు.. విశాఖ: కొనసాగుతున్న ఉత్తరాంద్ర టీచర్ ఎమ్మెల్సీ పోలింగ్మధ్యాహ్నం 2 గంటల వరకు 79.54 శాతం నమోదుడబ్బులు పంచుతున్న కూటమి నేతలుకాకినాడ..పవన్ కళ్యాణ్ నియోజకవర్గంలో ఓటుకి నోటుఎమ్మెల్సీ ఎన్నికల్లో పట్టపగలే డబ్బులు పంచుతున్న కూటమి నేతలుపిఠాపురంలో బరితెగించిన కూటమి నేతలుకూటమి అభ్యర్ధి పేరాబత్తుల రాజశేఖర్‌కి ఓటు వేస్తే మూడు వేలు అంటూ ఓటర్లను ప్రలోభాలకు గురిచేస్తున్న నేతలుమున్సిపల్ కళ్యాణ మండపం వద్ద ఓటుకు రూ.3 వేలు పంచుతున్న వైనంఓటుకి మూడు వేలు పంచుతున్నా చర్యలు తీసుకోని అధికారులువిశాఖ:టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఉత్సాహంగా పోలింగ్..ఆరు జిల్లాల్లో 12 గంటల వరకు 57.71% పోలింగ్ నమోదు..కృష్ణాజిల్లా..ఎమ్మెల్సీ ఎన్నికల పోల్ పెర్సెంటేజ్.....మధ్యాహ్నం 12.00గంటల వరకు..మొత్తం ఓటర్లు: 63,114పోలైన ఓట్లు :19,306పురుషులు: 11,330స్త్రీలు :7,976ఓటింగ్ శాతం: 30.59%. విశాఖ..ఉత్తరాంద్ర టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఉత్సాహంగా పోలింగ్ హాజరవుతున్న ఉపాధ్యాయులు..విశాఖ జిల్లాలో మొదటి నాలుగు గంటల్లో 44.4 శాతం పోలింగ్ నమోదు..టీడీపీ నేతల బరితెగింపు..కృష్ణాజిల్లా..ఉమ్మడి కృష్ణా, గుంటూరు పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూటమి నేతల ప్రలోభాలుపోలింగ్ కేంద్రాల వద్దే బరితెగిస్తున్న టీడీపీ నేతలుఓటుకు రెండు వేలు ఇస్తున్న టీడీపీ నేతలుపెడనలో పోలింగ్ కేంద్రం వద్దే డబ్బు పంపకాలుఓటు వేసేందుకు వెళ్తున్న గ్రాడ్యుయేట్లకు డబ్బులు ఇస్తున్న అధికార పార్టీ నేతలుపోలింగ్ కేంద్రాల వద్ద టీడీపీ నాయకుల హల్చల్..కృష్ణాజిల్లా..గుడివాడలో పోలింగ్ కేంద్రాల వద్ద టీడీపీ నాయకులు హల్చల్.నిబంధనలకు విరుద్ధంగా పోలింగ్ కేంద్రమైన ఎస్పీఎస్ స్కూల్ ప్రధాన గేటు ముందు తిష్ట వేసిన టీడీపీ శ్రేణులు.ఓటు వేసేందుకు వెళుతున్న పట్టభద్రులకు.. కూటమి అభ్యర్థికి ఓటు వేయాలంటూ ప్రచారం చేస్తున్న ఎమ్మెల్యే రాము, నేతలు.టీడీపీ నేతల తీరుపై అభ్యంతరం వ్యక్తం చేసిన సీపీఎం నాయకులు.గుడివాడ ఆర్డీవోకు ఫిర్యాదు చేసిన సీపీఎం నాయకుడు ఆర్సీపీ రెడ్డి.నిబంధన ప్రకారంగా నిర్దేశించిన దూరంలో ఉండాలంటూ టీడీపీ నేతలకు సూచించిన ఆర్డీఓ బాల సుబ్రమణ్యం.ఆర్డీవో వెళ్లిన తర్వాత తిరిగి గేటు వద్ద ప్రచారం చేస్తున్న టీడీపీ నాయకులు.విశాఖ.. 10 గంటల వరకు 21.66 శాతం పోలింగ్ నమోదు..విశాఖలో ప్రశాంతంగా కొనసాగుతున్న టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నికల ప్రక్రియ..పోలింగ్ స్టేషన్లకు ఓటు వేసేందుకు క్యూ కడుతున్న టీచర్స్...కొనసాగుతున్న 144 సెక్షన్పోలింగ్కు కట్టుదిట్టమైన ఏర్పాట్లు.పోలింగ్ కేంద్రాలను పరిశీలిస్తున్న జిల్లా కలెక్టర్ హరేందిరా ప్రసాద్..ఉత్తరాంధ్ర జిల్లాలలో 123 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు...మొత్తం ఓటర్లు 22,493 మంది...బరిలో 10 మంది అభ్యర్థులు...ఇప్పటివరకు 6% పోలింగ్ నమోదయింది...ఇప్పటి వరకు సమస్యత్మీక ప్రాంతాలు ఏవి గుర్తించలేదుసాయంత్రం నాలుగు గంటల వరకు పోలింగ్ ప్రక్రియ కొనసాగుతుంది...90 శాతం వరకు ఓటింగ్ జరుగుతుందని భావిస్తున్నాం.. రాష్ట్రంలో మూడు ఎమ్మెల్సీ స్థానాలకు పోలింగ్ ప్రారంభమైంది. రెండు గ్రాడ్యుయేట్, ఒక టీచర్ ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు జరుగుతున్నాయి. ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాలు, ఉమ్మడి కృష్ణా–గుంటూరు జిల్లాల గ్రాడ్యుయేట్ స్థానాలు, ఉమ్మడి ఉత్తరాంధ్ర జిల్లాల ఉపాధ్యాయ ఎమ్మెల్సీ నియోజకవర్గాలకు జరుగుతున్న ఈ ఎన్నికల్లో 70 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. 1,062 పోలింగ్ కేంద్రాల్లో సాయంత్రం నాలుగు గంటల వరకు పోలింగ్ జరగనుంది. మార్చి 3న ఉదయం 8 గంటలకు ఓట్ల లెక్కింపు మొదలవుతుంది.👉పోలింగ్ కోసం 6,287 మంది పోలింగ్ సిబ్బందిని, 8,515 మంది పోలింగ్ సిబ్బందిని కేంద్ర ఎన్నికల సంఘం వినియోగిస్తోంది. అన్ని కేంద్రాల్లో పోలింగ్‌ను లైవ్వెబ్ కాస్టింగ్, వీడియోగ్రఫీ చేయనున్నట్లు ఎన్నికల సంఘం పేర్కొంది. ఎన్నికల నిరంతర పర్యవేక్షణకు సచివాలయంలోని ప్రధాన ఎన్నికల కార్యాలయంలో ప్రత్యేక కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు.గోదావరి జిల్లాల గ్రాడ్యుయేట్స్ స్థానానికి 35 మంది పోటీ 👉ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ నియోజకవర్గానికి అత్యధికంగా 35 మంది పోటీ పడుతున్నారు. ఈ నియోజకవర్గంలో మొత్తం గ్రాడ్యుయేట్ ఓటర్లు 3,14,984 మంది ఉన్నారు. వీరిలో పురుషులు 1,83,347 మంది, మహిళలు 1,31,618 మంది, ఇతరులు 19 మంది ఉన్నారు.👉ఉమ్మడి కృష్ణా–గుంటూరు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ నియోజకవర్గానికి 25 మంది పోటీ పడుతున్నారు. ఈ నియోజకవర్గంలో మొత్తం గ్రాడ్యుయేట్ ఓటర్లు 3,47,116 మంది ఉన్నారు. వీరిలో పురుషులు 2,06,456 మంది, మహిళలు 1,40,615 మంది, ఇతరులు 45 మంది ఉన్నారు.👉ఉమ్మడి ఉత్తరాంద్ర జిల్లాల ఉపాధ్యాయ ఎమ్మెల్సీ నియోజకవర్గానికి 10 మంది పోటీ పడుతున్నారు. ఈ నియోజకవర్గంలో మొత్తం ఉపాధ్యాయ ఓటర్లు 22,493 మంది ఉన్నారు. వీరిలో 13,508 మంది పురుషులు, 8,985 మంది మహిళలు ఉన్నారు. -
3 ఎమ్మెల్సీ స్థానాలకు పోలింగ్ నేడే
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో మూడు ఎమ్మెల్సీ స్థానాలకు గురువారం పోలింగ్ జరగనుంది. రెండు గ్రాడ్యుయేట్, ఒక టీచర్ ఎమ్మెల్సీ స్థానాలకు జరిగే ఈ ఎన్నికలకు కేంద్ర ఎన్నికల సంఘం పటిష్ట ఏర్పాట్లు చేసింది. ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాలు, ఉమ్మడి కృష్ణా–గుంటూరు జిల్లాల గ్రాడ్యుయేట్ స్థానాలు, ఉమ్మడి ఉత్తరాంధ్ర జిల్లాల ఉపాధ్యాయ ఎమ్మెల్సీ నియోజకవర్గాలకు జరుగుతున్న ఈ ఎన్నికల్లో 70 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. 1,062 పోలింగ్ కేంద్రాల్లో ఉదయం 8 నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ జరగనుంది. మార్చి 3న ఉదయం 8 గంటలకు ఓట్ల లెక్కింపు మొదలవుతుంది. పోలింగ్ కోసం 6,287 మంది పోలింగ్ సిబ్బందిని, 8,515 మంది పోలింగ్ సిబ్బందిని కేంద్ర ఎన్నికల సంఘం వినియోగిస్తోంది. అన్ని కేంద్రాల్లో పోలింగ్‌ను లైవ్వెబ్ కాస్టింగ్, వీడియోగ్రఫీ చేయనున్నట్లు ఎన్నికల సంఘం పేర్కొంది. ఎన్నికల నిరంతర పర్యవేక్షణకు సచివాలయంలోని ప్రధాన ఎన్నికల కార్యాలయంలో ప్రత్యేక కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు. ఓట్ల లెక్కింపునకు తూర్పు–పశ్చిమ గోదావరి గ్రాడ్యుయేట్ స్థానానికి ఏలూరు సీఆర్ రెడ్డి కళాశాలలో కౌంటింగ్ కేంద్రం ఏర్పాటు చేశారు. కృష్ణా–గుంటూరు గ్రాడ్యుయేట్స్ కౌంటింగ్ గుంటూరు ఏసీ కాలేజీలో జరగనుంది. శ్రీకాకుళం –విజయనగరం – విశాఖ టీచర్ల స్థానానికి ఆంధ్ర విశ్వవిద్యాలయంలో కౌంటింగ్ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. గోదావరి జిల్లాల గ్రాడ్యుయేట్స్ స్థానానికి 35 మంది పోటీ ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ నియోజకవర్గానికి అత్యధికంగా 35 మంది పోటీ పడుతున్నారు. ఈ నియోజకవర్గంలో మొత్తం గ్రాడ్యుయేట్ ఓటర్లు 3,14,984 మంది ఉన్నారు. వీరిలో పురుషులు 1,83,347 మంది, మహిళలు 1,31,618 మంది, ఇతరులు 19 మంది ఉన్నారు. ఉమ్మడి కృష్ణా–గుంటూరు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ నియోజకవర్గానికి 25 మంది పోటీ పడుతున్నారు. ఈ నియోజకవర్గంలో మొత్తం గ్రాడ్యుయేట్ ఓటర్లు 3,47,116 మంది ఉన్నారు. వీరిలో పురుషులు 2,06,456 మంది, మహిళలు 1,40,615 మంది, ఇతరులు 45 మంది ఉన్నారు. ఉమ్మడి ఉత్తరాంద్ర జిల్లాల ఉపాధ్యాయ ఎమ్మెల్సీ నియోజకవరా>్గనికి 10 మంది పోటీ పడుతున్నారు. ఈ నియోజకవర్గంలో మొత్తం ఉపాధ్యాయ ఓటర్లు 22,493 మంది ఉన్నారు. వీరిలో 13,508 మంది పురుషులు, 8,985 మంది మహిళలు ఉన్నారు. -
కూటమి కక్ష.. పోసాని కృష్ణమురళీ అరెస్ట్
సాక్షి, హైదరాబాద్: గచ్చిబౌలిలో పోసాని కృష్ణమురళిని ఏపీ పోలీసులు అరెస్ట్ చేశారు. ఇప్పటికే రాజకీయాల నుంచి తప్పుకున్నట్లు పోసాని ప్రకటించిన సంగతి తెలిసిందే. రాజకీయాలకు దూరంగా ఉన్న పోసానిని కూడా కూటమి సర్కార్ వదలలేదు. పోసానికి ఆరోగ్యం బాగోలేదని ఆయన సతీమణి చెప్పిన కూడా పోలీసులు పట్టించుకోలేదు. ఆరోగ్యం బాగోలేదన్నా కూడా పోలీసులు దురుసుగా వ్యవహరించారు.పోసాని అరెస్టు విషయంలో ఏపీ పోలీసులు గేమ్ పోసాని అరెస్టు విషయంలో ఏపీ పోలీసులు గేమ్ ఆడుతున్నారు. అరెస్టు నోటీసులో రేపటి తేదీ వేశారు. మరో వైపు, కుటుంబ సభ్యులకు ఇచ్చిన అరెస్టు సమాచారంలో అన్నమయ్య జిల్లా సంబేపల్లి పీఎస్‌గా పోలీసులు పేర్కొన్నారు. కాని, పోసాని కుటుంబ సభ్యులకు పోలీసులు ఇచ్చిన ఫోన్ నంబర్లో ఓబులపల్లి పీఎస్ అంటూ పోలీసులు చెప్పారు. న్యాయపరమైన వెసులుబాటు రానీయకుండా రెండు చోట్ల నుంచి కేసులను డ్రైవ్ చేస్తున్నట్టుగా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పోసానిపై 111 కేసు పెట్టడమే దీనికి నిదర్శనమని వైఎస్సార్సీపీ వర్గాలు అంటున్నాయి.కావాలనే అక్రమ కేసులు పెట్టి వేధింపులు: అంబటి రాంబాబుఏ కారణంతో పోసానిని అరెస్ట్ చేశారంటూ వైఎస్సార్సీపీ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబు మండిపడ్డారు. పోసానిని ఎందుకు అరెస్ట్ చేశారో ఏపీ ప్రజలకు చెప్పాలన్నారు. ‘కూటమి ప్రభుత్వం కనీసం చట్టాన్ని కూడా గౌరవించడం లేదు. ఎందుకు అరెస్ట్ చేశారో చెప్పకుండా పోసానిని తీసుకెళ్లారు. కావాలనే అక్రమ కేసులు పెట్టి వేధిస్తున్నారు. ఏపీలో లోకేష్ రెడ్‌బుక్ రాజ్యాంగం నడుస్తోంది’’ అంబటి దుయ్యబట్టారు. -
వంశీపై అక్రమ కేసు.. వీడియో బయటపెట్టిన వైఎస్సార్సీపీ
సాక్షి, తాడేపల్లి: వల్లభనేని వంశీపై పెట్టిన అక్రమ కేసులో వీడియోను వైఎస్సార్సీపీ బయట పెట్టింది. షాపింగ్ చేస్తున్న సత్యవర్థన్ వీడియోను ఆ పార్టీ విడుదల చేసింది. ‘సత్యమేవ జయతే’ అంటూ ట్వీట్ చేసింది. ‘‘తీవ్ర అధికార దుర్వినియోగానికి పాల్పడుతూ.. తప్పుడు కేసులు, అక్రమ నిర్బంధాలతో చట్టాన్ని.. న్యాయ వ్యవస్థలను అపహాస్యం చేస్తున్న చంద్రబాబు సర్కారు తీరుకు నిలువెత్తు నిదర్శనం ఇది’’ అని వైఎస్సార్సీపీ ఆధారాలతో సహా బట్టబయలు చేసింది.‘‘ఈ వీడియోలో బ్లూషర్ట్ వేసుకున్న వ్యక్తే సత్యవర్థన్. వల్లభనేని వంశీ కిడ్నాప్ చేశారంటూ పోలీసులు చెప్తున్న వ్యక్తి ఇతనే. మరి ఈ వీడియోను చూస్తే సత్యవర్థన్ కిడ్నాప్‌నకు గురైనట్టుగా ఉందా?’’ అని వైఎస్సార్సీపీ ప్రశ్నించింది.‘‘పోలీసులు ఆరోపిస్తున్న ఫిబ్రవరి 12న విశాఖపట్నంలోని ఆనందపురం జంక్షన్లో ఒక బట్టల దుకాణంలో స్వేచ్చగా షాపింగ్ చేసుకుంటున్న సత్యవర్థన్ వీడియో ఇది. కిడ్నాప్ చేసి, నిర్బంధించిన వ్యక్తి బయటకు ఎలా వస్తారు?. ఇలా స్వేచ్ఛగా షాపింగ్ ఎలా చేస్తారు?. దీని అర్థం పోలీసులు తప్పుడు కేసులు పెట్టారని.. వారి కుటుంబ సభ్యులను భయపెట్టి, బెదిరించి తప్పుడు ఫిర్యాదు తీసుకున్నారని ఈ వీడియో సాక్షిగా బయటపడింది’’ అని వైఎస్సార్సీపీ ట్వీట్ చేసింది.💣 Truth Bomb 💣సత్యమేవ జయతేతీవ్ర అధికార దుర్వినియోగానికి పాల్పడుతూ, తప్పుడు కేసులు, అక్రమ నిర్బంధాలతో చట్టాన్ని, న్యాయవ్యవస్థలను అపహాస్యం చేస్తున్న @ncbn సర్కారు తీరుకు నిలువెత్తు నిదర్శనం ఇది.ఈ వీడియోలో బ్లూషర్ట్ వేసుకున్న వ్యక్తే సత్యవర్థన్. వల్లభనేని వంశీ కిడ్నాప్… pic.twitter.com/pAa5VMknV9— YSR Congress Party (@YSRCParty) February 26, 2025ఇదీ చదవండి: లోకేష్.. ఇవిగో ఆధారాలు..! -
‘ప్రధాన ప్రతిపక్ష గుర్తింపుపై చంద్రబాబు సర్కార్ నిరంకుశ వైఖరి’
సాక్షి, తాడేపల్లి: ప్రజాస్వామ్య స్పూర్తికి తూట్లు పొడుతూ అసెంబ్లీలో అసలు ప్రధాన ప్రతిపక్ష గుర్తింపునే ఇవ్వకుండా, ప్రశ్నించే గొంతు వినిపించకుండా కూటమి ప్రభుత్వం కుట్ర చేస్తోందని వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీ లేళ్ళ అప్పిరెడ్డి మండిపడ్డారు. ఆ పార్టీ కేంద్ర కార్యాలయంలో బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ప్రధాన ప్రతిపక్ష గుర్తింపు అంటే ఏదో రాజకీయపరమైన హోదాగా కూటమి పార్టీలు విషప్రచారం చేస్తున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రధాన ప్రతిపక్ష గుర్తింపు అనేది ఒక బాధ్యత, దీనివల్ల అసెంబ్లీలో ఎక్కువ సమయం ప్రజా సమస్యలపై మాట్లాడేందుకు ఉండే అవకాశం వైఎస్సార్సీపీకి దక్కుతుందన్నారు. దీనిని కూడా వక్రీకరించడం దుర్మార్గమన్నారు.ఇంకా ఆయన ఏమన్నారంటే..ఏపీ అసెంబ్లీలో నాలుగు పార్టీలు ఉంటే, దానిలో మూడు పార్టీలు ప్రభుత్వంలో భాగస్వామిగా ఉన్నాయి. మిగిలిన వైఎస్సార్సీపీని ప్రధాన ప్రతిపక్షంగా గుర్తించాల్సి ఉంది. పార్లమెంట్ చట్టం 1977 ప్రకారం సభలో సభ్యుల సంఖ్యతో సంబంధం లేకుండా ప్రధాన ప్రతిపక్షంను గుర్తించాలి. కూటమి ప్రభుత్వం దీనిని ఏ మాత్రం ఖాతరు చేయడం లేదు. ప్రధాన ప్రతిపక్ష గుర్తింపును వైఎస్సార్సీపీ కోరుతుంటే దీనిని రాజకీయం చేయడం దుర్మార్గం. దీనిపై కూటమి పార్టీలు చేస్తున్న ఈ విమర్శలను చూసి ప్రజాస్వామికవాదులే ఆశ్చర్యపోతున్నారు.ప్రజా సమస్యలను ప్రస్తావించకుండా అడ్డుకుంటున్నారుతొమ్మిది నెలల కూటమి పాలనపై ఇప్పటికే ప్రజల నుంచి పెద్ద ఎత్తున వ్యతిరేకత ప్రారంభమైంది. ఎన్నికలకు ముందు ప్రజలకు ఇచ్చిన హామీలను ఎక్కడా నెరవేర్చడం లేదు. మరోవైపు గ్రూప్-2 నిరుద్యోగులు, మిర్చి రైతులు, విద్యుత్ చార్జీల భారాన్ని మోయలేని ప్రజలు బాహాటంగానే ప్రభుత్వం మీద తమ నిరసనను తెలియచేస్తున్నారు. వీటన్నింటినీ ప్రజల పక్షాన ఎక్కడ వైఎస్సార్సీపీ అసెంబ్లీలో ప్రభుత్వాన్ని ఎండగడుతుందోననే భయంతోనే కూటమి ప్రభుత్వం ఉంది. న్యాయంగా వైఎస్సార్సీపీకి దక్కాల్సిన ప్రధాన ప్రతిపక్ష గుర్తింపును దూరం చేస్తూ, ప్రజా సమస్యలపై ఎక్కడ వైఎస్సార్సీపీ తమను ప్రశ్నిస్తుందోనని కంగారుపడుతోంది. ప్రతిపక్షంగా అడిగే ప్రశ్నలకు అసెంబ్లీలో సమాధానం చెప్పుకోలేని నిస్సహాయ స్థితిలో కూటమి ప్రభుత్వం ఉంది. తమ పాలనా వైఫల్యాలను ప్రజాగొంతుకగా వైఎస్సార్సీపీ సభలో వినిపిస్తే తట్టుకోలేమనే ఉద్దేశంతోనే ప్రధాన ప్రతిపక్ష గుర్తింపును నిరాకరిస్తున్నారు.ప్రధాన ప్రతిపక్షంగా శాసనమండలిలో పోరాడుతున్నాంశాసనమండలిలో ఇప్పటికే ప్రధాన ప్రతిపక్షంగా వైఎస్సార్సీపీ అనేక ప్రజా సమస్యలపై మాట్లాడుతోంది. ప్రధాన ప్రతిపక్ష గుర్తింపు ఉండటం వల్ల వైఎస్సార్సీపీ సభ్యులకు ఎక్కువ సమయం లభిస్తోంది. తాజాగా వైస్ చాన్సలర్ల బలవంతపు రాజీనామాలపై ప్రభుత్వాన్ని నిలదీయడంతో సమాధానం చెప్పలేక కూటమి ప్రభుత్వం కంగారు పడింది. గవర్నర్ ప్రసంగంలో మాట్లాడించిన మాటలు, చెప్పించిన అబద్ధాలపై నిలదీయడంతో అధికారపక్షం నీళ్ళు నమిలింది. తమ తప్పులను ఒప్పుకోవాల్సిన పరిస్థితిలో పడింది.ప్రజాస్వామ్యంలో అధికారపక్షానికి ఎంత బాధ్యత ఉంటుందో, ప్రధాన ప్రతిపక్షంకు అంతకంటే ఎక్కువ బాధ్యత ఉంటుంది. వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో తెలుగుదేశానికి ప్రతిపక్షంగా చట్టసభల్లో మాట్లాడేందుకు ఎంతో సమయం లభించింది. సభలో ప్రధాన ప్రతిపక్షం లేకుండా చర్చలు జరిగితే వాటిని అర్థమవంతమైనవని అంటారా? ప్రధాన ప్రతిపక్షంగా ప్రశ్నించే వాటికి ధీటుగా సమాధానం చెప్పగలిగితేనే కూటమి ప్రభుత్వ పాలనా సామర్థ్యం ప్రజలకు తెలుస్తుంది. ఇటువంటి సంప్రదాయాలకు తిలోదకాలు ఇస్తూ, అసలు ప్రధాన ప్రతిపక్ష గుర్తింపే లేకుండా, ప్రశ్నించేవారే లేకుండా ఏకపక్షంగా పాలనను సాగించాలని అనుకోవడం నిరంకుశత్వం అవుతుంది. సంఖ్యాబలం రీత్యా మాకే ప్రధాన ప్రతిపక్ష గుర్తింపు వస్తుందంటే, జనసేన పార్టీ కూటమి ప్రభుత్వం నుంచి బయటకు వచ్చి ప్రధాన ప్రతిపక్ష పాత్ర పోషించాలి. -
బాబూ.. పోలవరం ఎత్తు తగ్గించడం సంపద సృష్టా?: తోపుదుర్తి
సాక్షి, అనంతపురం: ఏపీలో సంపద సృష్టిస్తానని అధికారంలోకి వచ్చిన చంద్రబాబు మాయమాటలకే పరిమితమయ్యారని ఎద్దేవా చేశారు మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి. అలాగే, అసెంబ్లీలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ద్వారా చంద్రబాబు అబద్ధాలు చెప్పిస్తున్నారని ఆరోపించారు. కచ్చితంగా వైఎస్సార్సీపీకి ప్రతిపక్ష హోదా ఇవ్వాలని డిమాండ్ చేశారు.రాప్తాడు మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాశ్ రెడ్డి తాజాగా అనంతపురంలో మీడియాతో మాట్లాడుతూ..‘ప్రజా సమస్యలను అసెంబ్లీలో ప్రస్తావించకూడదన్న దురుద్దేశంతోనే వైఎస్సార్సీపీకి ప్రతిపక్ష హోదా ఇవ్వలేదు. ప్రతిపక్ష హోదా పొందాలంటే 10 శాతం సభ్యుల బలం ఉండాలన్న నిబంధన ఎక్కడా లేదు. పవన్ కళ్యాణ్ ద్వారా చంద్రబాబు అబద్ధాలు చెప్పిస్తున్నారు. వైఎస్సార్సీపీకి ప్రతిపక్ష హోదా ఇవ్వాల్సిందే.చంద్రబాబు.. సంపద సృష్టిస్తా అన్నవ్ కదా ఏమైంది?. సంపద సృష్టి ఎక్కడ జరిగిందో కూటమి చెప్పాలి. సంపద సృష్టి అంటే పోలవరం ప్రాజెక్టు ఎత్తు తగ్గించటమా?. పోలవరం ప్రాజెక్టు ఎత్తు తగ్గింపునకు వైఎస్ జగన్ అంగీకరించలేదు. ఎన్డీయేలో చంద్రబాబు భాగస్వామిగా ఉన్నప్పటికీ పోలవరం ప్రాజెక్టు ఎత్తు తగ్గించటాన్ని టీడీపీ కూటమి ప్రభుత్వం అడ్డుకోలేకపోయింది. వైఎస్సార్ కృషి వల్లే హంద్రీనీవా ద్వారా కృష్ణా జలాలు వస్తున్నాయి. హంద్రీనీవా ప్రాజెక్టును 5 టీఎంసీలకు కుదించిన దుర్మార్గుడు చంద్రబాబు. 45 టీఎంసీల సామర్థ్యంతో హంద్రీనీవా ప్రాజెక్టు నిర్మించిన ఘనత వైఎస్సార్‌దే. హంద్రీనీవా కాలువల వెడల్పు చేసిన తర్వాతే.. లైనింగ్ పనులు చేపట్టాలి. రాయలసీమ ఇరిగేషన్ ప్రాజెక్టులను పక్కనపెట్టి.. నిధులన్నీ అమరావతికే మళ్ళించటం ద్రోహం చేయడమే అవుతుంది అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. -
మొత్తానికి ‘సూపర్ సిక్స్ వేస్ట్’ అని గవర్నర్‌తో చెప్పించారే!
ఏ రాష్ట్రంలోనైనా అధికారంలో ఉన్న పార్టీ అసెంబ్లీ సమావేశాల సందర్భంగా ఇచ్చే గవర్నర్ ప్రసంగంలో ఎన్నికల హామీల అమలు, ప్రగతి తదితర అంశాలకు ప్రాధాన్యత ఇస్తుంది. కానీ.. తెలుగుదేశం పార్టీ మాత్రం దీనికి భిన్నం. ఈసారి అసెంబ్లీ సమావేశాల్లో ఎన్నికల ప్రణాళిక, హామీల ఊసే లేకుండా గవర్నర్ ప్రసంగాన్ని(Governor Speech) ముగించేసింది. ఏమిటి దీనర్థం? వాగ్ధానాలను అమలు చేయలేకపోవడాన్ని కప్పిపుచ్చుకునేందుకు చేసిన ప్రయత్నమే అని స్పష్టంగా తెలుస్తోంది. ఆంధ్రప్రదేశ్ గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్(Syed Abdul Nazeer) ప్రసంగం మొత్తాన్ని తరచి చూసినా సూపర్ సిక్స్ గురించి ప్రస్తావించిన విషయం పెద్దగా కనపడదు. ఎన్నికల ప్రచారంలో ఈ ఆరు హామీలపైనే టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి రాష్ట్రమంతా ఊదరగొట్టిన విషయం తెలిసిందే. ఎలాగోలా అధికారంలోకి వచ్చిన తరువాత మాత్రం చంద్రబాబు, పవన్ కల్యాణ్ , లోకేష్‌లు ఈ హామీల ఎగవేతకు శాయశక్తులా ప్రయత్నిస్తున్నారు. హామీల అమలుకు బదులు ప్రతిపక్షాలపై ప్రతీకారం తీర్చుకోవడంపైనే పాలకపక్షం దృష్టి కేంద్రీకరిస్తున్నట్లు ఇటీవలి పరిణామాలు స్పష్టం చేస్తున్నాయి. వైఎస్సార్సీపీ కార్యకర్తల, నేతల ఆస్తుల విధ్వంసం, రెడ్‌బుక్ రాజ్యాంగం అమలుతో రాష్ట్రం ఇప్పటికే అరాచక పరిస్థితులను ఎదుర్కొంటోంది. ఆసక్తికరమైన అంశం ఏమిటంటే.. గవర్నర్ ప్రసంగంలో గత ప్రభుత్వంపై విమర్శలు!. జగన్ అధికారంలో ఉండగా ప్రశంసించిన మంత్రివర్గాన్నే ఇప్పుడు గవర్నర్ విమర్శించాల్సిన పరిస్థితి. ప్రసంగాన్ని గవర్నర్ స్వయంగా కాకుండా.. పాలకపక్షం తయారు చేసి ఆయన చేత చదివిస్తుంది మరి! భారత రాజ్యాంగంలోని ఒకానొక వైరుద్ధ్యమిది. 👉గత ఎన్నికల ప్రచారంలో టీడీపీ టాప్ 25 హామీలు అంటూ ప్రత్యేక పత్రాలను విడుదల చేసింది. మెగా డీఎస్సీపై తొలి సంతకం అన్నారు. సంతకమైతే పెట్టారు కానీ.. గడువులోగా అమలు చేయలేదు. గవర్నర్ ప్రసంగంలో దీని గురించి స్పష్టత ఏమీ ఇవ్వలేదు. వృద్ధాప్య ఫించన్ల మొత్తాన్ని వెయ్యి రూపాయలు పెంచిన విషయాన్ని చెప్పారు. కానీ, లక్షల సంఖ్యలో ఫించన్ల కోతకు కారణమేమిటో వివరించలేదు. అలాగే పద్దెనిమిదేళ్లు నిండిన మహిళలందరికీ రూ.1500, పండుగ కానుకలు, ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం, యువతకు నెలకు రూ.మూడు వేల నిరుద్యోగ భృతి, తల్లికి వందనం పథకంలో భాగంగా ఇంట్లోని ప్రతి విద్యార్థికి రూ.15 వేలు చొప్పున చెల్లింపు, ప్రతి రైతుకు ఏడాదికి రూ.20 వేలు, వలంటీర్ల గౌరవ వేతనం రూ.పది వేలకు పెంపు, అందరికీ అందుబాటులో ఉచిత ఇసుక, అన్నా క్యాంటీన్లు, మూడు ఉచిత గ్యాస్ సిలిండర్లు, పూర్ టు రిచ్, బీసీలకు ఏభై ఏళ్లకే ఫించన్ వర్తింపు, పెళ్లికానుక కింద రూ.లక్ష, పోలవరం, సాగునీటి ప్రాజెక్టుల పూర్తి వంటి అంశాలను ప్రస్తావించారు. వీటిల్లో.. గ్యాస్ సిలిండర్లు పథకం అరకొరగా అమలు అవుతోంది. ఇసుక ఉచితం అనేది ఉత్తుత్తి మాటగానే మిగిలిపోయింది. వీటితోపాటు మిగిలిన హామీల పురోగతి, అమలుకు ఉన్న అడ్డంకులను గవర్నర్‌తో చెప్పించి ఉంటే చంద్రబాబు ప్రభుత్వ నిబద్ధత ప్రజలకు తెలిసేది. కానీ సూపర్ సిక్స్ హామీలను ఇవ్వనట్లు గవర్నర్ ప్రసంగం సాగిందనిపిస్తుంది. జగన్ ప్రభుత్వం ఏటా ఎన్నికల ప్రణాళికలోని అంశాల అమలును గవర్నర్ ప్రసంగం ద్వారా ప్రజలకు నివేదించేది. టీడీపీ ప్రభుత్వం(TDP Government) మాత్రం అలవికాని హామీలను ఇవ్వడమే కాకుండా.. ఆచరణ ప్రశ్నార్థకంగా ఉన్న పలు అంశాలను చెప్పుకుని ప్రజలను మభ్య పెట్టే యత్నం చేస్తోంది. ఉదాహరణకు.. ఒక కుటుంబం-ఒక పారిశ్రామికవేత్త అనే విధానాన్ని ప్రభుత్వం తీసుకువచ్చిందట. కుల వృత్తుల ద్వారా ఆత్మగౌరవం, ఆర్థిక స్ధిరత్వం వస్తుందట. గీత కార్మికులకు పదిశాతం మద్యం షాపులను కేటాయించడం ప్రభుత్వ ప్రగతి అట. ఐటీ నుంచి కృత్రిమ మేధ వరకు టెక్నాలజీ వినియోగంలో ఏపీ కొత్త పుంతలు తొక్కుతోందని, విప్లవానికి నాయకత్వం వహిస్తోందని చెబితే జనం చెవిలో పూలు పెడుతున్నట్లు అనిపించదా!. 👉యథా ప్రకారం స్వర్ణాంధ్ర -2047 సాధనకు పది సూత్రాలను రూపొందించి ముందుకు వెళుతున్నారని తెలిపారు. విశేషం ఏమిటంటే ఆ పది సూత్రాలు తమకే అర్థం కాలేదని తెలుగుదేశం మీడియా అంటోంది. ఆరున్నర లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు, నాలుగు లక్షల ఉద్యోగాలు వచ్చేశాయన్నట్లుగా గవర్నర్‌తో చెప్పిస్తే ఏమి ప్రయోజనం?. అది నిజమో ,కాదో ప్రజలకు తెలియదా? తాము ఉద్యోగాలు ఇచ్చేసినట్లు చెప్పలేదని, అవకాశాలు కల్పించామని అన్నామని మంత్రి లోకేష్ శాసనమండలిలో కొత్త భాష్యం చెప్పారు. కానీ వారి పత్రిక ఈనాడులో పెట్టుబడులు, ఉద్యోగాలు వచ్చేసినట్లే రాశారు. వారికి కూడా తెలుగు అర్థం కాలేదా!. కేంద్ర పధకాలను పునరుద్దరించారట. తొమ్మిదివేల కోట్ల అప్పు తీర్చారట. విశేషం ఏమిటంటే గత జగన్ ప్రభుత్వ టైమ్ లోనే కేంద్రం ఆయా స్కీముల కింద నిధులు ఎక్కువ ఇచ్చిందని ఆర్థిక శాఖ అధికారులు చంద్రబాబు(Chandrababu)కు కొద్ది రోజుల క్రితం వివరించారు. అయినా గవర్నర్ మాత్రం ఇలా చెబుతున్నారు. 👉ఇక రోడ్లు, ఇతర పనుల బిల్లులు రూ.పది వేల కోట్లు చెల్లించామని అంటున్నారు. మంచిదే. కాని దీనివల్ల ఆర్థిక కార్యకలాపాలు పుంజుకున్నాయని అనడమే ఒకింత ఆశ్చర్యం!!. ఒక పక్క జనం వద్ద డబ్బులు లేక కొనుగోలు శక్తి ఆశించిన స్థాయిలో లేక, జీఎస్టీ తగ్గిందని నివేదికలు చెబుతున్నాయి. మరోపక్క గవర్నర్ మాత్రం ఇలా చెబుతున్నారు. గూగుల్, మిట్టల్, టాటా పవర్, బీపీసీఎల్, ,గ్రీన్ కో వంటి దిగ్గజ సంస్థలను ఆకర్షిస్తున్నామని తెలిపారు. వీటిలో బీపీసీఎల్, గ్రీన్ కోలు జగన్ ప్రభుత్వ టైమ్‌లోనే ప్రతిపాదనలు పెట్టాయి. గ్రీన్ కో కర్నూలు జిల్లాలో రెన్యుబుల్ ఎనర్జీ రంగంలో ఇప్పటికే భారీగా పెట్టుబడులు పెట్టింది. కూటమి సర్కార్ వీటిని తన ఖాతాలో వేసుకుంటోంది. మిట్టల్ స్టీల్ ప్లాంట్ ఎప్పటికి వస్తుందో తెలియదు. వలంటీర్లు లక్షన్నర మందిని తొలగించారు. ఇతరత్రా కొన్నివేల మంది ఉద్యోగాలు కోల్పోయారు. మరి నాలుగు లక్షల ఉద్యోగావకాశాలు ఎక్కడ వచ్చాయో ప్రభుత్వం వివరంగా చెబితే బాగుండేది. సూపర్ సిక్స్ హామీలు ఇచ్చి ప్రజలందరిని స్కీమ్‌లు, డబ్బులతో ముంచి లేపుతానని చెప్పిన చంద్రబాబు ప్రభుత్వం ఇప్పుడు పాత కొటేషన్ ను అందుకుంది. ఎవరికైనా చేపను ఇస్తే అది అతని ఆకలిని ఒక్క రోజే తీర్చగలదు. అదే కనుక మనిషికి చేపలు పట్టడం నేర్పితే జీవితాంతం తిండి లభిస్తుందనే సూక్తిని చంద్రబాబు అనుసరిస్తున్నారని గవర్నర్ తెలిపారు. అంటే అర్థమైంది కదా? సూపర్ సిక్స్, ఇతర హామీలు వేస్ట్ అని చెప్పడమే ఇది! ఇక మెగా పోర్టులు, అంతర్జాతీయ విమానాశ్రయాలు, మల్టీ మోడల్ రవాణా కేంద్రాలు.. ప్రపంచ మార్కెట్లో అనుబంధంగా కొత్త వాణిజ్య కారిడార్లు.. ఇలా ఏవేవో చెప్పి ప్రజలను మభ్య పెట్టేయత్నం సాగించారు. రోడ్లను బాగు చేసేసినట్లు, కొత్త రోడ్లు వేయబోతున్నట్లు తెలిపారు. విద్యుత్ ఛార్జీలను ఇప్పటికే రూ.15వేల కోట్ల మేర బాదిన ప్రభుత్వం ఇప్పుడు పెంచడం లేదని చెప్పుకుంటోంది. తల్లికి వందనం త్వరలో అమలు చేస్తామని చెప్పారు. కాని ఈ ఏడాది ఎందుకు ఇవ్వలేదో వెల్లడించలేదు. అన్నా క్యాంటిన్లు హామీ అమలు నిజమే కాని, దానితోనే పేదరికం పోయేటట్లయితే, పేదల ఆకలి తీరేటట్లయితే వాటినే రాష్ట్రం అంతటా వీధి, వీధిన పెడితే సరిపోతుంది కదా? మరి ఇది చేపల వల అవుతుందా? లేక చేపలు ఇచ్చినట్లు అవుతుందో వివరిస్తే బాగుంటుంది. మొత్తం మీద గవర్నర్ స్పీచ్‌లో ఏదో జరిగిపోతోందన్న పిక్చర్ ఇవ్వడానికి చేసిన ప్రయత్నంలో తెలియకుండానే సూపర్ సిక్స్ హామీలు మోసపూరితమైనవని, ప్రజలను సోమరిపోతులను చేసేవి అని చెప్పకనే చెప్పినట్లయ్యింది. :::కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత. -
ప్రజలకు అండగా నిలుద్దాం: వైఎస్ జగన్
సాక్షి ప్రతినిధి, కడప: ‘‘ప్రజల మదిలో మనం చెరగని ముద్ర వేశాం... ప్రజా సంక్షేమమే ధ్యేయంగా పాలనందించాం. విపక్ష పార్టీ నాయకులుగా ప్రజాపక్షమే ఏకైక అజెండాగా పని చేద్దాం. ఎప్పటికప్పుడు ఈ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూ ప్రజల హృదయాలను గెలుచుకుందాం..’’ అని వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పార్టీ యంత్రాంగానికి దిశానిర్దేశం చేశారు. అధికారంలో ఉన్నా.. లేకున్నా వైఎస్సార్సీపీ ఎప్పుడూ ప్రజాపక్షమే అనే విషయాన్ని గుర్తెరిగి పార్టీ నేతలంతా సమష్టిగా పని చేయాలని పిలుపునిచ్చారు.మంగళవారం పులివెందులలో ప్రజా దర్బార్ సందర్భంగా తొలుత ఇటీవల పార్టీ పదవులు పొందిన నాయకులతో ఆయన ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఆయా నేతలను కడప ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి పరిచయం చేశారు. అనంతరం వైఎస్ జగన్ మాట్లాడుతూ.. పార్టీ పదవులు పొందిన నాయకులు ఎప్పటికప్పుడు ప్రభుత్వం చేపట్టే ప్రజêవ్యతిరేక చర్యలపై ఉద్యమించాలని.. స్థానిక సమస్యలపై ప్రజల గొంతుకగా పని చేయాలని సూచించారు.వైఎస్సార్ సీపీ ప్రజల మనసుల్లో చిరస్థాయిగా గుర్తుండిపోయేలా పాలన అందించామన్నారు. అబద్ధాల హామీలతో టీడీపీ కూటమి నేతలు ప్రభుత్వ పగ్గాలు చేపట్టారన్నారు. చంద్రబాబు నయవంచకుడని తెలిసి కూడా ప్రజలు నమ్మి ఓటేశారని, అతి తక్కువ సమయంలోనే మోసపోయామని గ్రహిస్తున్నారని చెప్పారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేయడంలో కూటమి ప్రభుత్వానికి ఏమాత్రం చిత్తశుద్ధి లేదని ధ్వజమెత్తారు. పులివెందులలో కోలాహలం..రెండు రోజుల పర్యటనలో భాగంగా వైఎస్ జగన్మోహన్రెడ్డి మంగళవారం ఉదయంతాడేపల్లి నుంచి బయలుదేరి మధ్యాహ్నం 12 గంటలకు పులివెందుల చేరుకున్నారు. భాకరాపురంలోని తన నివాసంలో పార్టీ నేతలతో సమావేశం అనంతరం కార్యాలయంలో ప్రజాదర్బార్ నిర్వహించారు. ప్రజల సమస్యలు అడిగి తెలుసుకుంటూ వారి విజ్ఞప్తులను స్వీకరించారు. అప్పటికప్పుడు పరిష్కారం అయ్యే సమస్యలను పరిష్కరిస్తూనే.. అధికారుల దృష్టికి తీసుకెళ్లాల్సిన వాటిని నోట్ చేసుకోవాలని సిబ్బందికి సూచించారు. ఈ సందర్భంగా పులివెందులలో సందడి వాతావరణం నెలకొంది. అభిమాన నేతను చూసేందుకు కార్యకర్తలు, అభిమానులు పెద్ద ఎత్తున తరలివచ్చారు.నూతన జంటలకు ఆశీర్వాదం...పులివెందులలో ఇటీవల వివాహం జరిగిన నాలుగు నూతన జంటలను వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆశీర్వదించారు. నారాయణ కళాశాల సమీపంలో నివాసం ఉంటున్న వై.మహేశ్వరరెడ్డి కుమార్తె అనిలాదేవి, అల్లుడు విష్ణువర్ధన్‌రెడ్డికి వైఎస్ జగన్ ఆశీస్సులు అందజేశారు. అలాగే చెన్నారెడ్డి కాలనీలో నివసించే రవీంద్రనాథరెడ్డి కుమార్తె సాయిలహరి, అల్లుడు లిఖిత్‌లతోపాటు జి.మహేశ్వరరెడ్డి కుమార్తె సాహిత్య, అల్లుడు రామమనోహర్‌రెడ్డికి.. సుదర్శన్ కుమారుడు అనుదీప్‌కుమార్, కోడలు లాస్యశ్రీలకు వివాహ శుభాకాంక్షలు తెలియజేశారు. నూతన జంటల కుటుంబ సభ్యులతో మమేకమై వారి యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు.ఘనస్వాగతం...తాడేపల్లి నుంచి హెలికాఫ్టర్‌లో పులివెందుల చేరుకున్న మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ఘనస్వాగతం లభించింది. ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి, ఎమ్మెల్యేలు ఆకేపాటి అమర్నాథరెడ్డి, డాక్టర్ సుధా, కడప మేయర్ సురేష్‌బాబు, మాజీ ఎమ్మెల్యేలు ఎస్.రఘురామిరెడ్డి, ఎస్బీ అంజాద్ బాషా, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎస్వీ సతీష్‌కుమార్‌రెడ్డి, పులివెందుల మున్సిపల్ ఇన్చార్జి వైఎస్ మనోహరరెడ్డి, బీసీ సెల్ నేత బంగారు నాగయ్య, రెడ్యం వెంకటసుబ్బారెడ్డి, పులివెందుల మున్సిపల్ చైర్మన్ వరప్రసాద్, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ చిన్నప్ప పలువురు స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.మండలశాఖ అధ్యక్షుడి కుటుంబానికి పరామర్శ...సింహాద్రిపురం మండలశాఖ అధ్యక్షుడు దేవిరెడ్డి శ్రీకాంత్‌రెడ్డి తల్లి లక్ష్మీ నరసమ్మ ఇటీవల అనారోగ్యంతో మృతి చెందారు. అప్పట్లో ఫోన్లో పరామర్శించిన వైఎస్ జగన్మోహన్రెడ్డి మంగళవారం సాయంత్రం పులివెందులలో నివాసం ఉంటున్న శ్రీకాంత్‌రెడ్డి ఇంటికి వెళ్లి లక్ష్మీ నరసమ్మ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. అనంతరం స్థానిక నాయకులను కలుసుకున్నారు.మామను చూడాలని పాదయాత్ర!సాక్షి ప్రతినిధి, కడప: అభిమానానికి హద్దుండదు...! ఆత్మీయతకు వయసుతో నిమిత్తం లేదు!! వైఎస్ జగన్ పట్ల చిన్నారుల మక్కువ మరోమారు నిరూపితమైంది. పులివెందులకు 5 కిలోమీటర్ల దూరంలో ఉన్న కొండారెడ్డి కాలనీలో నివసించే బాలుడు మాబు షరీఫ్‌కు వైఎస్ జగన్ అంటే ఎనలేని ఇష్టం. వైఎస్ జగన్ పులివెందుల వస్తున్నట్లు తెలియడంతో ఎలాగైనా ఆయన్ను కలిసి ఫొటో దిగాలనే ఆరాటంతో తెల్లవారుజామున 5.30 గంటలకు చెప్పులు లేకుండా కాలినడకన ఇంటి నుంచి బయలుదేరాడు. హెలిప్యాడ్ వద్దకు చేరుకుని నిరీక్షించాడు. మధ్యాహ్నం 12 గంటల సమయంలో అక్కడకు చేరుకున్న వైఎస్ జగన్ తన వద్దకు వచ్చిన బాలుడిని గమనించి ఆప్యాయంగా పలుకరించారు. కరచాలనం చేయడంతో ఆనంద బాష్పాలు రాల్చిన చిన్నారి కళ్ల నీళ్లు తుడిచి వివరాలు కనుక్కున్నారు. మామయ్య తనను దగ్గరకు తీసుకున్నారని బాలుడు ఎంతో సంబరంగా వైఎస్ జగన్‌తో ఓ ఫొటో దిగాడు. ఆ చిన్నారి అభిమానాన్ని చూసి వైఎస్ జగన్ చలించిపోయారు. అనంతరం ఆ బాలుడికి జాగ్రత్తలు చెప్పి క్షేమంగా ఇంటికి చేర్చే బాధ్యతను పార్టీ కార్యకర్తలకు అప్పగించారు. -
సంక్షేమం, అభివృద్ధి ఆ తరువాతే..!: చంద్రబాబు
సాక్షి, అమరావతి: ‘రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలంటే ముందుగా సంపద సృష్టించాలి.. ఆ తరువాతే ఆ ఆదాయాన్ని సంక్షేమం, అభివృద్ధికి ఖర్చు చేయాలి. ఆలోచన, ఆశ ఉన్నాయి కానీ.. డబ్బుల్లేవ్..’ అని సీఎం చంద్రబాబు శాసనసభా వేదికగా స్పష్టం చేశారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి వెంటిలేటర్‌పై ఉందని, కేంద్రం సహకారంతో రాష్ట్రాన్ని బయటపడేస్తామని చెప్పారు. ‘పోలవరం–బనకచర్ల అనుసంధాన ప్రాజెక్టుకు రూ.80 వేల కోట్లు కావాలి. అందుకే కేంద్ర సహకారంతోపాటు అవసరమైతే ప్రైవేటు భాగస్వామ్యంతో ఈ ప్రాజెక్టును చేపడతాం’ అని తెలిపారు. గవర్నర్ ప్రసంగానికి ధన్యవాద తీర్మానంపై చర్చ సందర్భంగా సీఎం చంద్రబాబు శాసనసభలో మంగళవారం మాట్లాడారు. రాష్ట్ర పునర్నిర్మాణం కోసమే టీడీపీ, జనసేన, బీజేపీ కలిశాయన్నారు. 2047 నాటికి రాష్ట్రంలో తలసరి ఆదాయం 42 వేల అమెరికన్ డాలర్లు సాధించాలన్నది తన లక్ష్యమన్నారు. అందుకే రాష్ట్రం 15 శాతం వృద్ధి రేటు సాధించే లక్ష్యంతో పని చేస్తున్నామన్నారు. ఎన్నో ఆర్థిక సమస్యలు ఉన్నప్పటికీ మేనిఫెస్టోలో పేర్కొన్న హామీలను నెరవేరుస్తామన్నారు. తల్లికి వందనం పథకాన్ని మే నెలలో అమలు చేస్తామని, ఎంతమంది పిల్లలు ఉన్నా అంతమందికీ పథకం వర్తింపజేస్తామని చెప్పారు. వచ్చే విద్యా సంవత్సరంలో డీఎస్సీ ద్వారా 16,354 టీచర్ పోస్టులను భర్తీ చేస్తామన్నారు. కేంద్ర ప్రభుత్వంతో కలసి రైతు భరోసా పథకం కింద ప్రతి రైతుకూ మూడు వాయిదాల్లో రూ.20 వేలు ఇస్తామన్నారు. చేపల వేట నిషేధ సమయంలో మత్స్యకారులకు రూ.20 వేలు ఆర్థిక సాయం కార్యక్రమాన్ని అమలు చేస్తామన్నారు. స్థానిక సంస్థల్లో 34 శాతం రిజర్వేషన్లు అమలు చేసేందుకు సబ్ కమిటీతో అధ్యయనం చేయిస్తున్నామని చంద్రబాబు చెప్పారు. క్వారీ పనుల్లో 10 శాతం వడ్డెరలకు కేటాయిస్తామన్నారు. దేశంలో అన్ని రాష్ట్రాల కంటే మెరుగైన మద్యం విధానాన్ని ఆంధ్రప్రదేశ్‌లో అమలు చేస్తున్నామన్నారు. రాష్ట్రంలో ప్రతి వ్యక్తికి గ్రామీణ ప్రాంతాల్లో 3 సెంట్లు, పట్టణాల్లో 2 సెంట్ల ఇంటి స్థలం ఇస్తామని చెప్పారు. ఐదేళ్లలో అందరికీ ఇళ్లు కట్టిస్తామన్నారు. జూన్ 12 నాటికి 5 లక్షల ఇళ్లు నిర్మించి పేదలకు అందిస్తామన్నారు. ఉగాది రోజు పీ 4 కార్యక్రమానికి శ్రీకారం చుడతామన్నారు. యువతకు 20 లక్షల ఉద్యోగాలు కల్పించేందుకు కట్టుబడి ఉన్నామని చంద్రబాబు పేర్కొన్నారు. ఇప్పటికే కుదుర్చుకున్న రూ. 6.50 లక్షల కోట్ల విలువైన ఎంవోయూలతో 5 లక్షల ఉద్యోగాలు వస్తాయన్నారు. నిరుద్యోగ యువతకు రూ.3 వేల భృతి ఇస్తామన్నారు. ప్రతి ఒక్కరికి రూ.2.5 లక్షల వరకు ఉచిత వైద్య బీమా అందిస్తామన్నారు. ఆ పరిమితి దాటితే ట్రస్టు ద్వారా వైద్య చికిత్స చేయిస్తామన్నారు. 2047 డిసెంబర్ నాటికి పోలవరం ప్రాజెక్టును పూర్తి చేసి జాతికి అంకితమిస్తామని చంద్రబాబు ప్రకటించారు. ఉత్తరాంధ్ర సుజల స్రవంతి , పోలవరం రైట్ మెయిన్ కెనాల్ అనకాపల్లి వరకూ పూర్తి చేసి నీరు అందిస్తామన్నారు. వంశధార ప్రాజెక్టు వరకు పోలవరం ప్రాజెక్టును అనుసంధానిస్తామన్నారు.దేశ రాజధానిని మార్చాలంటున్నారు..!వాతావరణం, రాజకీయ కాలుష్యంతో ఢిల్లీలో ఉండలేమని, రాజధానిని మార్చాలని చాలా మంది డిమాండ్ చేస్తున్నారని చంద్రబాబు వ్యాఖ్యానించారు. యమునా నది పరిస్థితి దయనీయంగా ఉందన్నారు. బీజేపీ ప్రభుత్వం మనం గర్వపడే రాజధానిగా ఢిల్లీని తయారు చేస్తుందని తనకు నమ్మకం ఉందన్నారు. వైఎస్సార్ సీపీకి ప్రతిపక్ష హోదా ఇవ్వడం సమంజసం కాదని చంద్రబాబు పేర్కొన్నారు. ప్రతిపక్ష హోదా ఇస్తామంటేనే శాసన సభకు వస్తామని చెప్పడం సరైంది కాదన్నారు. -
అట్టుడికిన మండలి.. నిలదీసిన వైఎస్సార్సీపీ
రాష్ట్రంలోని విశ్వవిద్యాలయాల వైస్ చాన్స్లర్ల బలవంతపు రాజీనామాల వ్యవహారం.. రూ.6.5 లక్షల కోట్ల పెట్టుబడులు.. 4 లక్షల ఉపాధి అవకాశాల అంశాలు మంగళవారం శాసన మండలిని కుదిపేశాయి. అధికార, విపక్ష సభ్యుల మధ్య తీవ్ర వాదోపవాదాలు చోటుచేసుకున్నాయి. రాష్ట్ర చరిత్రలో ఇదివరకెన్నడూ లేని విధంగా ఒకేసారి 17 మంది వీసీలను బెదిరించి.. బలవంతంగా రాజీనామా చేయించారని, ఈ వ్యవహారంపై జ్యుడీషియల్ విచారణ జరిపించాలని వైఎస్సార్సీపీ సభ్యులు పట్టుపట్టారు. ఆధారాలు లేకుండా మాట్లాడటం సరికాదని, తామెవరినీ బెదిరించలేదని మంత్రి లోకేశ్ దబాయించబోయారు. ‘ఏ వీసీ అయినా ప్రెస్‌మీట్ పెట్టి చెప్పారా.. వాట్సాప్‌లో పంపించారా.. ఫలానా వాళ్లు రాజీనామా చేయమన్నారని చెప్పారా.. ఇలా ఏ ఆధారం లేకుండా ఆరోపణలు చేస్తారా.. ఆరోపణలను వెంటనే వెనక్కు తీసుకోవాలి’ అంటూ గుడ్లురమబోయారు. ‘వీసీలందరికి ఐఏఎస్ అధికారి సౌరబ్ గౌర్ ఫోన్ చేసి రాజీనామా చేయండని ఒత్తిడి చేశారు. కావాలంటే కాల్ లిస్ట్ చెక్ చేసుకోవచ్చు. వీసీలు తమ రాజీనామా పత్రంలో ‘ఉన్నత విద్యా మండలి అధికారుల ఆదేశాల మేరకు రాజీనామా చేస్తున్నాం’ అని పేర్కొన్నారు’ అని విపక్ష సభ్యులు ఆధారాలు చూపగా లోకేశ్ వెంటనే మాట మార్చేశారు. కూటమి ప్రభుత్వ పాలనలో రాష్ట్రంలో రూ.6.5 లక్షల కోట్ల పెట్టుబడులు.. 4 లక్షల మందికి ఉపాధి అవకాశాలు ఎక్కడ కల్పించాలో చూపాలన్న డిమాండ్‌కు సమాధానం చెప్పలేక మంత్రులు నీళ్లు నమిలారు. తర్జుమా చేయడంలో పొరపాటంటూ మంత్రి లోకేశ్ కవర్ చేసుకునేందుకు విఫల యత్నం చేశారు. సర్కారు ద్వంద్వ నీతిని నిరసిస్తూ వైఎస్సార్సీపీ సభ్యులు సభ నుంచి వాకౌట్ చేశారు. వీసీలతో బలవంతపు రాజీనామాలుసాక్షి, అమరావతి: ‘గవర్నర్ ప్రసంగంలో వీసీల నియామకం గురించి ప్రత్యేకంగా ప్రస్తావించారు. వీసీల నియామకం అనేది రెగ్యులర్ ప్రొసెస్. ఏ ప్రభుత్వం అయినా వారి పదవీ కాలం ముగిసిన తర్వాతే సెర్చ్ కమిటీ వేసి నియామకాలు చేపడుతుంది. అయితే రాష్ట్రంలో 19 యూనివర్సిటీలుండగా, 17 వర్సిటీల వీసీలు కూటమి ప్రభుత్వం వచ్చాక ఒకేసారి రాజీనామా చేశారు. ఇలా ఇంత మంది రాజీనామాలు చేయడం చరిత్రలో ఎప్పుడూ ఏ ప్రభుత్వ హయాంలోనూ జరగలేదు. బెదిరించి, బలవంతంగా వారితో రాజీనామా చేయించారు. ఏపీపీఎస్సీ చైర్మన్‌తో కూడా బలవంతగా రాజీనామా చేయించడం నిజం కాదా.. ’ అని శాసన మండలి వేదికగా వైఎస్సార్సీపీ గళం విప్పింది. ఈ వ్యవహారంపై జ్యుడీషియల్ విచారణకు ఆదేశించాలని వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖరరెడ్డి డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా మంత్రి లోకేశ్ జోక్యం చేసుకుంటూ.. ‘మేము బెదిరించాం.. భయపెట్టాం.. బయటకు పంపించాం.. అని వైఎస్సార్సీపీ సభ్యులు ఆరోపిస్తున్నారు. విద్యాశాఖా మంత్రిగా అడుగుతున్నా.. ఆధారాలుంటే హౌస్‌లో పెట్టండి’ అని మంత్రి లోకేశ్ సవాల్ విసిరారు. దీనిపై ఎమ్మెల్సీ చంద్రశేఖరరెడ్డి బదులిస్తూ.. ‘నెల్లూరు విక్రమ సింహపురి యూనివర్సిటీలో గొడవలు చేసి, గందరగోళం సృష్టించి.. వీసీ రాజీనామా చేసి పోయేలా చేశారు. నేను అడుగుతున్నది ఒక్కటే.. ఇంత మంది ఒకేసారి రాజీనామా చేస్తే ఎందుకు విచారణ చేయడం లేదో చెప్పాలి’ అని నిలదీశారు. వెంటనే లోకేశ్ జోక్యం చేసుకుంటూ.. ‘ఏదో రాయి వేస్తాం.. మట్టి వేస్తాం.. కడుక్కోండి.. అంటే కుదరదు. మా ప్రభుత్వంలో ఎవరు బెదిరించారో.. ఏమని బెదిరించారో.. రాజీనామా చేసిన వీసీలు ప్రెస్‌మీట్ పెట్టి చెప్పమనండి.. వీసీ పోస్టుల కోసం 500 మంది అప్లై చేశారు. టాప్ యూనివర్సిటీల నుంచి ప్రొఫెసర్లను తీసుకొచ్చి వీసీలుగా నియమించాం. సామాజిక న్యాయం చేశాం. గత ప్రభుత్వం మాదిరిగా ఒక సామాజిక వర్గానికే ఇవ్వలేదు’ అని వ్యాఖ్యానించారు. దీనిపై వైఎస్సార్సీపీ సభ్యులు స్పందిస్తూ.. ‘దేశ చరిత్రలో ఓ రాష్ట్రంలో ఒకేసారి 17 మంది వీసీలు రాజీనామా చేయడం జరగలేదు. వారు ఎందుకు రాజీనామాలు చేయాల్సి వచ్చిందో జ్యూడిషియల్ విచారణకు ఆదేశించండి’ అని నిలదీశారు. ఏ ఒక్కరినీ వదిలిపెట్టం.. మంత్రి లోకేశ్ మళ్లీ జోక్యం చేసుకుంటూ.. ‘యూనివర్సిటీలకు ఛాన్సలర్ గవర్నర్. మీరు గవర్నర్‌ను కించ పరిచినట్టుగా ఆరోపణలు చేస్తున్నారు. లోకేశ్ ఫోన్ చేశాడా.. లేదా ఇక్కడున్న మా మంత్రులు ఎవరు ఫోన్ చేశారో చెప్పమనండి.. లేదా మా ఆఫీస్ నుంచి ఎవరైనా ఫోన్ చేసి బెదిరించారో చెప్పమంటే చెప్పకుండా ఆరోపణలు చేయడం సరికాదు. మీరు చేస్తున్న ఆరోపణల వల్ల విశ్వవిద్యాలయాలకు చెడ్డపేరు వస్తుంది. తక్షణమే బేషరతుగా మీ వ్యాఖ్యలు ఉపసంహరించుకోవాలి. ఆధారాలుంటే బయట పెట్టండి. తప్పకుండా విచారణ జరిపిస్తాం.. ల్యాప్ ట్యాప్ నా దగ్గరే ఉంది.. ఇప్పుడే ఆర్డర్ ఇస్తా.. మాజీ వీసీలు ఎవరైనా మీకు ఫోన్ చేశారా? వాట్సాప్ మెసేజ్ చేశారా? వివరాలు ఇవ్వండి.. చర్యలు తీసుకుంటాం. వీసీల రాజీనామాల వ్యవహారమే కాదు.. 2019 నుంచి ఏం జరిగిందో అంతా బయటకు తీద్దాం. అన్నీ బయటకొస్తాయి. ఇప్పటికే ఒకరు జైల్లో ఉన్నారు. ఎవరినీ వదిలి పెట్టం. వెయిట్ అండ్ వాచ్.. టైమ్, డేట్ రాసుకోండి’ అని తీవ్ర స్వరంతో మంత్రి లోకేశ్ హెచ్చరించారు. ఈ దశలో టీడీపీ ఎమ్మెల్సీ రాంగోపాల్‌రెడ్డి మాట్లాడుతూ ‘రాజీనామా చేసిన వీసీలంతా మీ నాయకుడు వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి బావమరుదులు, మేనత్తలే అని అన్నారు. వైఎస్ జగన్ ఓడిపోయారు కాబట్టి వారంతా నైతిక బాధ్యత వహిస్తూ రాజీనామా చేశారన్నారు. ఈ వ్యాఖ్యలపై వైఎస్సార్సీపీ సభ్యులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. సభలో గందరగోళంతో చైర్మన్ కొద్దిసేపు సభను వాయిదా వేశారు.ఇవిగో ఆధారాలు..సభ మళ్లీ ప్రారంభమైన తర్వాత ఎమ్మెల్సీ చంద్రశేఖరరెడ్డి మాట్లాడుతూ.. ‘వీసీలందరికీ ఐఏఎస్ అధికారి సౌరబ్ గౌర్æ ఫోన్ చేసి రాజీనామా చేయాలని ఒత్తిడి చేశారు. ఆ మరుసటి రోజే వారంతా రాజీనామా చేశారు. కావాలంటే కాల్ లిస్ట్ చెక్ చేసుకోవచ్చు. అంతేకాదు.. వీసీలు తమ రాజీనామా పత్రంలో ఉన్నత విద్యా మండలి అధికారుల ఆదేశాల మేరకు రాజీనామా చేస్తున్నామని పేర్కొన్నారు. ఇంతకంటే ఆధారాలు ఇంకేం కావాలి? తక్షణమే విచారణ జరిపించాలి’ అని డిమాండ్ చేశారు. ఇదే విషయమై వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీలు పట్టుబట్టారు. ‘ఏ విచారణ కావాలి.. జ్యుడీషియల్ విచారణా లేక డిపార్టుమెంటల్ విచారణా.. క్లారిటీ ఇవ్వండి‘ అని చైర్మన్ కోరగా, ‘మేము జ్యూడిషియల్ ఎంక్వైరీ కోరుతున్నాం.. వాళ్లు ఎంక్వైరీ వేసినా మాకు అభ్యంతరం లేదు. మంత్రి చెబుతున్నట్టు 2019 నుంచే కాదు.. కావాలంటే 2014 నుంచి ఎంక్వైరీ చేయండి. మాకు అభ్యంతరంలేదు. వాస్తవాలేమిటో ప్రజలకు తెలుస్తాయి’ అని బొత్స సత్యనారాయణ స్పష్టం చేశారు. ఈ దశలో మంత్రి లోకేశ్ మాట మార్చారు. ‘ప్రైమ్ ఆఫ్ ఎవిడెన్స్ ఇస్తే ఎంక్వైరీ వేస్తాం. ఏ ఆధారం లేకుండా కేసు పెట్టమంటే ఎలా?’ అని తప్పించుకొనే ప్రయత్నం చేశారు. ‘ముందు ఒకలా మాట్లాడుతున్నారు.. ఆధారాలు చూపాక మరొకలా మాట్లాడుతున్నారు. మీకు చిత్తశుద్ధి లేదు’ అంటూ తీవ్ర అసహనం వ్యక్తం చేస్తూ వైఎస్సార్సీసీ సభ్యులు సభ నుంచి వాకౌట్ చేశారు.బెదిరిపోయేవాళ్లెవరూ లేరు: బొత్స మండలిలో ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ మాట్లాడుతూ ‘ఒకేసారి 17 మంది వీసీలు రాజీనామాలు ఎందుకు చేయాల్సి వచ్చిందో విచారణ జరపాలని మా సభ్యులు కోరుతున్నారు. నిజంగా చిత్తశుద్ధి ఉంటే.. ఎంక్వైరీ వేయండి.. నిరూపిస్తాం.. నిరూపించకపోతే అప్పుడు మాట్లాడండి. అడిగిన దానికి బదులివ్వకుండా ఏదేదో మాట్లాడుతున్నారు. మళ్లీ మళ్లీ చెబుతున్నాం. చట్ట ప్రకారం ఏం చేయదల్చుకున్నారో చేయండి. ఇక్కడ ఎవరూ బెదిరిపోయేవాళ్లు, అదిరిపోయే వాళ్లు లేరు. ఎవరు తప్పు చేస్తే వాళ్లు అనుభవిస్తారు. దేనికైనా మేము సిద్ధంగా ఉన్నాం. ఎన్ని తప్పుడు కేసులు పెట్టుకుంటారో పెట్టుకోండి’ అని బొత్స సత్యనారాయణ... మంత్రి లోకేశ్‌కు దీటుగా స్పందించారు. -
మంత్రి లోకేష్‌కి వైఎస్సార్సీపీ స్ట్రాంగ్ కౌంటర్
తాడేపల్లి: ప్రతిపక్ష హోదా అంశానికి సంబంధించి మంత్రి నారా లోకేష్ కు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చింది వైఎస్సార్ సీపీ. ఈ మేరకు వైఎస్సార్ సీపీ శానమండలి సభ్యులు లేళ్ల అప్పిరెడ్డి, మొండితోక అరుణ్ కుమార్, వరుదు కళ్యాణిలు పత్రికా ప్రకటన విడుదల చేశారు. శాసనసభలోగానీ, మండలిలోగానీ అధికార పక్షం తర్వాత ఎక్కువ సీట్లు ఉన్న పార్టీనే ప్రతిపక్షం అంటూ చట్టంలో ఉన్న విషయాన్ని ఎమ్మెల్సీలు బయటపెట్టారు.కూటమి ప్రభుత్వంలో టీడీపీ, జనసేన, బీజేపీల తర్వాత ఉన్న ఏకైక పార్టీ వైఎస్సార్ సీపీనేనని, కాబట్టి కచ్చితంగా వైఎస్సార్ సీపీని ప్రతిపక్షంగా గుర్తించాలన్నారు. ప్రజా సమస్యలపై వివరంగా మాట్లాడటానికి అప్పుడే తగినంత సమయం హక్కుగా వస్తుందన్నారు. కానీ ప్రభుత్వ లోపాలనె ఎత్తిచూపుతారనే భయంతోనే వైఎస్సార్ సీపీకి ప్రతిపక్ష హోదా ఇవ్వడం లేదన్నారు. ప్రతిపక్షానికి ఇవ్వాల్సిన పీఏసీని సైతం ఇవ్వకుండా అడ్డుకున్నారని, ఇదంతా ప్రజలు గమనిస్తున్నారని వైఎస్సార్ సీపీ ఎమ్మెల్సీలు స్పష్టం చేశారు. -
పులివెందుల పర్యటనలో వైఎస్ జగన్.. అభిమానం అంటే ఇదే కదా..
సాక్షి,వైఎస్సార్‌జిల్లా : అభిమానానికి హద్దుండదు. ఆత్మీయతకు వయస్సుతో పనిలేదు. ఈ రెండింటికి సరైన చిరునామా వైఎస్సార్సీపీ అధినేత,మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి. చిన్నారుల్లో జననేతకు ఉన్న క్రేజ్ చూస్తూనే ఉన్నాం. అది కుప్పం అయినా, విజయవాడ,గుంటూరు,పులివెందుల అయినా సరే. వైఎస్ జగన్‌పై ఉన్న అభిమానం, ఆప్యాయత మరోమారు నిరూపిమతమైంది. బాలుడి పేరు మెహబూబ్ షరీష్. పులివెందులకు ఐదుకిలోమీటర్ల దూరంలో ఉన్న కొండారెడ్డి కాలనీలో నివాసం ఉంటాడు. అతనికి వైఎస్ జగన్ అంటే పిచ్చి. ఎలాగైనా ఈ రోజు తమ అభిమాన నేత వైఎస్ జగన్‌ను కలవాలని తెల్లవారు జామున ఐదుగంటలకు చెప్పుల్లేకుండా కాలి నడకన బయలుదేరాడు. వైఎస్ జగన్ హెలిఫ్యాడ్ వద్ద దిగుతారని తెలుసుకొని అక్కడే ఎదురు చూశాడు ఈ బాలుడు.మధ్యాహ్నం 12గంటల సమయంలో వైఎస్ జగన్ పులివెందులకు చేరుకున్నారు. అక్కడికి వచ్చిన వైఎస్ జగన్‌ను ఎలాగైనా కలవాల్సిందేనని ప్రయత్నించాడు ఈ బాలుడు. ఎట్టకేలకు వైఎస్ జగన్‌ను చూడగానే బాలుడు ఆనంద భాష్పాలు రాల్చాడు. ఆ పిల్లాడిని గమనించిన వైఎస్ జగన్ దగ్గరకు తీసుకున్నారు. వైఎస్ జగన్ బాలుడి కళ్ల నీళ్లు తుడిచి యోగ క్షేమాలు అడిగి తెలుసుకున్నారు. బాలుడి అభిమానానికి వైఎస్ జగన్మోహన్రెడ్డి చలించిపోయారు. మొత్తానికి వైఎస్ జగన్‌తో బాలుడు ఫొటో దిగాడు. జాగ్రత్తగా ఆ బాలుడిని ఇంటి వద్ద దిగబెట్టాలని పార్టీ నేతలకు వైఎస్ జగన్మోహన్రెడ్డి సూచించారు.అభంశుభం తెలియని బాలుడే వైఎస్ జగన్‌పై చూపిన ప్రేమను నాటి వైఎస్సార్సీపీ పాలనకు సాక్షమని పరిశీలకులు అంటున్నారు. బాలుడికి కోరిక తీర్చి వైఎస్ జగన్ పెద్దమనసు చాటుకున్నారని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. అలాగే, వైఎస్ జగన్ తన పాలనలో అమ్మఒడిని అమలు చేశారని, నాడు,నేడు కార్యక్రమం ద్వారా పాఠశాలల రూపురేఖలు మార్చారని, అందుకే చిన్నారుల గుండెల్లో వైఎస్ జగన్మోహన్రెడ్డి చెరగని ముద్రవేసుకున్నారని వైఎస్సార్సీపీ అంటోంది. -
వైఎస్ జగన్,వైఎస్సార్సీపీ అంటే చంద్రబాబుకు భయం : కురసాల
సాక్షి,కాకినాడ: ‘ఖచ్చితంగా అసెంబ్లీలో ప్రధాన ప్రతిపక్ష పాత్ర వైఎస్సార్సీపీదే. వైఎస్సార్సీపీకి ప్రధాన ప్రతిపక్ష హోదా ఇస్తే తన రంగు భయటపడుతుందని చంద్రబాబు భయపడుతున్నారు. చంద్రబాబుకు వైఎస్సార్సీపీ అన్నా.. వైఎస్ జగన్ అన్నా భయమే.’ వైఎస్సార్సీపీ ఉత్తరాంధ్ర జిల్లాల కోఆర్డినేటర్ కురసాల కన్నబాబు అన్నారు.ధన్యవాదాలు తీర్మానంలో సీఎం చంద్రబాబు మాటలు వింటే..ఎవరి డప్పు వాళ్ళు కొట్టుకోవాలి అని సినిమా డైలాగ్ గుర్తుకువస్తుంది. గౌరవ సభలో చంద్రబాబు పచ్చి అబద్దాలు మాట్లాడుతున్నారని వైఎస్సార్సీపీ ఉత్తరాంధ్ర జిల్లాల కోఆర్డినేటర్ కురసాల కన్నబాబు మండిపడ్డారు. ఏపీ అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలో కురసాల కన్నబాబు మీడియాతో మాట్లాడారు. సభా మర్యాదలు చూస్తే చిత్రంగా ఉంది. సభా మర్యాదలను మంట కలిపే శ్రీకారం చుట్టుంది చంద్రబాబే. ఎన్టీఆర్‌ను పదవి లోంచి దించే సమయంలో ఆయనకు మైక్ ఇవ్వలేదు.మాజీ గవర్నర్ నరసింహన్ చంద్రబాబును చూసి బిత్తరపోయారు. హరిచందన్ గవర్నర్‌గా ఉన్నప్పుడు చంద్రబాబు ఏవిధంగా కించపరిచారో అందరికి తెలుసు. వీళ్లా సభలో వైఎస్సార్సీపీ గవర్నర్‌కు మర్యాద ఇవ్వలేదు అని అంటున్నారు. నిరనసగా వాకౌట్ చేసి వెళ్లి పోవడం చాలా కాలం నుంచి నడుస్తోంది. చాల పార్టీలు చేస్తున్నాయి. ధన్యవాదాలు తీర్మానంలో చంద్రబాబు మాటలు వింటే..ఎవరి డప్పు వాళ్ళు కొట్టుకోవాలి అని సినిమా డైలాగ్ గుర్తుకువస్తుంది. గౌరవ సభలో చంద్రబాబు పచ్చి అబద్దాలు మాట్లాడుతున్నారు. ఈ తొమ్మిది నెలల కాలంలో ప్రజలు ఏమీ అనుకుంటున్నారో తెలుసుకోండి. గ్రూప్-2 అభ్యర్ధులైతే..తాము తప్పు చేశామని చెప్పులతో కొట్టుకుంటున్నారు. గత ప్రభుత్వం రూ.14 లక్షల కోట్లు అప్పు చేసిందని ఆబద్దాలు చెప్పారు. రూ.7 లక్షల కోట్ల అప్పు అని తేలింది. ఒక అబద్దాన్ని జనంలోకి తీసుకు వెళ్లి దానిని నిజమని నమ్మిస్తారు. ఈ తొమ్మిది నెలల కాలంలో లక్ష కోట్లు కూటమీ ప్రభుత్వం అప్పులు చేసింది. ఆ అప్పులు దేని కోసం ఖర్చు చేశారు? ఏ వర్గాన్ని వదలకుండా మోసం చేయడానికి సిగ్గులేదా?. గవర్నర్‌తో అబద్దాలు చెప్పించారు. నాలుగు లక్షల ఉద్యోగాలు ఇచ్చేశామని చెబుతున్నారు.వీసీలను రాత్రికి రాత్రి బెదిరించి రాజీనామాలను చేయించారు. దీనిపై విచారణ జరిపించండి. తొమ్మిది నెలల కాలంలో మీ అసలు రంగు బయట పడింది. ప్రతిపక్ష హోదా మీద పార్లమెంటు చట్టం ఏం చెప్పిందో తెలుసుకోండి.వైఎస్సార్సీపీ అంటే మీకు భయం.. వైఎస్ జగన్ ప్రతిపక్ష నేతగా మీ పాలనను ఎండగడతారని భయం. 151 సీట్లు వచ్చినా..11 సీట్లు వచ్చినా టీడీపీ వైఎస్ జగన్ చూసి భయపడుతోంది. ఆ ఒకే ఒక్కడు 49% ఓటు బ్యాంక్ పొందారు. ఖచ్చితంగా అసెంబ్లీలో ప్రధాన ప్రతిపక్ష పాత్ర వైఎస్సార్సీపీదే అని అన్నారు.