breaking news
-
వెలిగొండ ప్రాజెక్ట్‌పై కూటమి సర్కార్ కుట్ర: ఎమ్మెల్యే తాటిపర్తి
సాక్షి, తాడేపల్లి: మూడు జిల్లాలకు వరప్రదాయినిగా నిలుస్తున్న వెలిగొండ ప్రాజెక్ట్‌కు నిధులు కేటాయించకుండా కూటమి ప్రభుత్వం కుట్ర చేస్తోందని వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్ మండిపడ్డారు. తాడేపల్లి వైయస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ కేవలం రూ.4 వేల కోట్లు ఖర్చు చేస్తే పూర్తయ్యే వెలిగొండ ప్రాజెక్ట్‌కు కూటమి ప్రభుత్వం ఈ ఏడాది కేవలం రూ.359 కోట్లు మాత్రమే కేటాయించడం దుర్మార్గం కాదా? అని ప్రశ్నించారు. ఏకంగా 53 టీఎంసీల నీటి నిల్వ సామర్థ్యం గల ప్రాజెక్ట్‌పై ప్రభుత్వం ఇంత నిర్లక్ష్యంగా వ్యవహరించడం దుర్మార్గమని ధ్వజమెత్తారు.ప్రెస్మీట్లో ఎమ్యెల్యే తాటిపర్తి చంద్రశేఖర్ ఇంకా ఏమన్నారంటే..:నాడు చిత్తశుద్దితో పనులు:ప్రకాశం జిల్లాలోని ఎర్రగొండపాలెం ప్రాంతంలో నెలకొన్న నీటి ఎద్దడి, కరవు పరిస్థితులను ఐక్యరాజ్యసమతి వంటి అంతర్జాతీయ సంస్థలే గుర్తించాయి. ఈ కరవు పరిస్థితులను మార్చేందుకు నిర్దేశించిన వెలిగొండ ప్రాజెక్ట్‌ను పూర్తి చేయడంలో వైయస్ఆర్సీపీ ప్రభుత్వం చిత్తశుద్దితో వ్యవహరించింది. ఈ ప్రాజక్ట్ పనులు శరవేగంతో చేయడం వల్ల శ్రీశైలం నుంచి నీటిని తీసుకురావడానికి నిర్మించిన రెండు టన్నెల్స్ పనులు పూర్తయ్యాయి. దానిలోని మట్టిని మాత్రం తొలగించాల్సి ఉంటుంది. అలాగే స్టోరేజీ చేసే కొండల మధ్య ఉన్న గ్యాప్‌లను పూడ్చడం జరిగింది. పునరావాసానికి అవసరమైన అన్ని ఏర్పాట్లు చేశారు.గతంలో పునరాసానికి రూ.1.80 లక్షలు ప్రకటిస్తే, జగన్‌గారు వచ్చిన తరువాత రూ.12.5 లక్షలు ప్రకటించారు. ఈ ఏడాది జనవరి వరకు ఎవరికైతే 18 ఏళ్ళు నిండి ఉంటాయో వారికి పరిహారం ఇచ్చి, ముంపు ప్రాంతాల నుంచి తరలించాల్సి ఉంది. ఇదే జరిగితే 53 టీఎంసీల సామర్థ్యం ఉన్న ఈ ప్రాజెక్ట్‌కు పూర్తిస్థాయిలో నీరందుతుంది. శ్రీశైలంలో 45 రోజుల పాటు వచ్చే నీటిని ఇక్కడికి తీసుకువచ్చి, కరవును దాదాపు రూపుమాపవచ్చు.పాదయాత్ర. ప్రభుత్వాన్ని నిలదీస్తాం:వెలిగొండ ప్రాజెక్ట్‌లో గత బడ్జెట్లో అరకొర నిధులను మాత్రమే కేటాయించారు. ఈ నిధుల కేటాయింపుతోనే అసలు వెలిగొండను పూర్తి చేసే ఉద్దేశం కూటమి ప్రభుత్వానికి లేదని అర్థమవుతోంది. కూటమి ప్రభుత్వం చేస్తున్న కుటిల ప్రయత్నాలను తిప్పికొడతాం. వెలిగొండ ప్రాజెక్ట్‌కు నిధులు సాధించేందుకు మేం చేపట్టే పాదయాత్రలో అన్ని వర్గాల ప్రజలు భాగస్వాములు అవుతారు.ప్రకాశం జిల్లాకు చెందిన ప్రజా ప్రతినిధులు కూడా రాజకీయాలను పక్కకుపెట్టి ఈ ప్రాజెక్ట్ సాధనకు ముందుకు రావాలి. తప్పుడు రాజకీయాలు చేస్తున్న నేతలను నిలదీయాలి. వెలిగొండ ప్రాజెక్టు విషయంలో ప్రభుత్వ వైఖరిపై ఇప్పటికే ప్రజా సంఘాలు పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం చేస్తున్నాయి. వెలిగొండ ప్రాజెక్ట్ ప్రాముఖ్యత ఈ ప్రాంత ప్రజలకు తెలుసు కాబట్టి, తనను నిలదీస్తారనే భయంతోనే చంద్రబాబు తన పర్యటనను ప్రాజెక్ట్ వద్ద కాకుండా దూరంగా పెట్టుకుంటున్నారు. తన కుమారుడు నారా లోకేష్ కోసం ఆయన నియోజకవర్గంలో వందల కోట్లు కేటాయించుకుంటున్నారు. ఒక్క మాటలో చెప్పాలంటే.. ‘ఆస్తులు అమరావతికి.. పస్తులు ప్రకాశానికి’ అన్నట్లుగా వీరి వ్యవహారం ఉంది. -
ప్రజలకు వాస్తవాలన్నీ తెలిశాయి: పుత్తా శివశంకర్
సాక్షి, తాడేపల్లి: చంద్రబాబు, లోకేష్, పవన్ కళ్యాణ్, పురంధేశ్వరి నోటికొచ్చినట్టు అబద్దాలు చెప్పారని.. రూ.14 లక్షల కోట్ల అప్పులంటూ.. రాష్ట్రం శ్రీలంక అయిందంటూ విష ప్రచారం చేశారని వైఎస్సార్సీపీ అధికార ప్రతినిధి పుత్తా శివశంకర్ మండిపడ్డారు. శుక్రవారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. ఎల్లోమీడియాలో అడ్డమైన కూతలు కూశారని.. దారుణమైన రాతలు రాశారని ధ్వజమెత్తారు. గవర్నర్ ప్రసంగంలో అప్పుల గురించి తప్పించి మాట్లాడించారు.’’ అని పేర్కొన్నారు.‘‘ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ ఆమోదంతో రాతపూర్వకంగా సమాధానం చెప్పక తప్పలేదు. నవ రత్నాల అమలు, డీబీడీ ద్వారా వేసిన నిధులు అన్నీ కలిపిన అప్పులు అవి. మరి చంద్రబాబు బ్యాచ్, ఎల్లోమీడియా ఎందుకు తప్పుడు కూతలు కూశారు?. చంద్రబాబు అధికారంలోకి వచ్చిన తర్వాత చేసిన అప్పులు భారీగా ఉన్నాయి. ఆ లెక్కలు జనానికి తెలియకుండా ప్రయత్నాలు చేస్తున్నారు. కారు కూతలు కూసిన చంద్రబాబు, లోకేష్, పురంధేశ్వరి, పవన్ కల్యాణ్ ప్రజలకు క్షమాపణ చెప్పాలి’’ అని శివశంకర్ డిమాండ్ చేశారు.‘‘ఓట్ల కోసం తప్పుడు సమాచారం చెప్పామని జనం ఎదుట ఒప్పుకోవాలి. ఇక సూపర్ సిక్స్ హామీలను ఎగ్గొట్టడానికి వీల్లేదు. వైఎస్ జగన్ చాలా చక్కగా రాష్ట్ర ఆర్ధిక పరిస్థితిని కాపాడారని తేలింది. ప్రజలకు వాస్తవాలన్నీ తెలిశాయి’’ అని శివశంకర్ తెలిపారు. -
పవన్ కూటమి నుంచి బయటకు రావాలి: బొత్స
సాక్షి, అమరావతి: ఏపీ శాసనమండలి వేదికగా వాస్తవాలను వివరిస్తుంటే టీడీపీ వాళ్లు జీర్ణించుకోలేకపోతున్నారని అన్నారు ప్రతిపక్ష నాయకులు బొత్స సత్యనారాయణ. ఎన్నికల ముందు చంద్రబాబు సంపద సృష్టిస్తామన్నారు కదా?. మరి ఇప్పుడు ఏమైంది మీ సంపద సృష్టి? అని ప్రశ్నించారు. ఇదే సమయంలో డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌కు అస్సలు అవగాహన లేదు. ప్రతిపక్ష హోదా మా హక్కు. సంఖ్యాపరంగా తమకే సీట్లు ఎక్కువ వచ్చాయని పవన్ అంటున్నారు. మాకు ప్రతిపక్ష హోదా ఇవ్వనప్పుడు.. పవన్ కూటమి నుంచి బయటికి రావాలి.. అని డిమాండ్ చేశారు.అసెంబ్లీలో మీడియా పాయింట్ వద్ద ఎమ్మెల్సీ బొత్స మాట్లాడుతూ.. బడ్జెట్ ప్రసంగంపై నేను మాట్లాడాను. మేము ప్రజల తరఫున మాట్లాడుతున్నాం. ప్రజల కోసం ప్రశ్నించాల్సిన బాధ్యత మాపై ఉంది కాబట్టే నిలదీస్తున్నాం. రాష్ట్రంలో 18 ఏళ్లు నిండిన మహిళలకు రూ.1500 ఇస్తామన్నారు. బడ్జెల్లో ఆ ప్రస్తావనే లేదు. ఉచిత బస్సు పథకానికి సంబంధించి కూడా బడ్జెట్లో ప్రస్తావన లేదు. ఎన్నికల ముందు చంద్రబాబు సంపద సృష్టిస్తామన్నారు కదా?. మరి ఇప్పుడు ఏమైంది మీ సంపద సృష్టి?. ఎన్నికల సమయంలో కూటమి ఇచ్చిన హామీలపైనే మేము ప్రశ్నిస్తున్నాం.సూపర్ సిక్స్ నిధులేవి..రూ.322 కోట్ల బడ్జెట్ లోటు, విధ్వంసం అనే పదంపైన నేను అసెంబ్లీలో మాట్లాడాను. విద్యుత్ చార్జీలు పెంచమని, ట్రూ ఆఫ్ చార్జీలు వేయమని చెప్పారని తప్పులు మాట్లాడితే మాట్లాడానని చెప్పం. రూ.2400 కోట్లు ఉపాధి హామీ పథకం నిధుల బకాయిలు గురించి చెప్పం. వాస్తవాలు తట్టుకోలేక పోతున్నారు. సూపర్ సిక్స్ అమలు చేస్తామని అధికారంలోకి వచ్చారు. ప్రస్తుతం ఇస్తున్న పథకాల కంటే ఎక్కువ ఇవ్వలేమని మా నాయకుడు వైఎస్ జగన్ ముందే చెప్పారు. ప్రస్తుతానికి సూపర్ సిక్స్‌లో ఒక్కటి అమలు చేస్తున్నారు.తల్లికి వందనంకి 9400 పెట్టి.. డిమాండ్‌లో 8200 కోట్లు చూపించారు.. మరి మిగిలింది ఎక్కడ నుండి తెస్తారు. రైతు భరోసాకి 20వేల రూపాయలు కేంద్రం ప్రభుత్వంతో సంబంధం లేకుండా ఇస్తామని చెప్పారు.. అలా చూసినా 6300 కోట్లు కేటాయించారు.. కావాల్సింది 7500 కోట్లు. 4 లక్షల ఉద్యోగాలు ఇచ్చామని చెప్పారు.. అడిగితే ఉద్యోగాలు వస్తున్నాయని చెప్పారు. నిరుద్యోగ భృతి ఊసే బడ్జెట్ లేదు.. ఆడబిడ్డ నిధి లేదు. 50 ఏళ్లకు పెన్షన్ లేదు. బుల్డోజర్ ప్రభుత్వం.. మాట్లాడితే లాక్కొని వెళ్ళిపోతున్నారు. మహిళలకు ఉచిత బస్సు పెడితే ప్రభుత్వానికి 30 శాతం మాత్రమే భారం.. అది కూడా పెట్టలేకపోయారు.అప్పులే సంపద సృష్టి..చిత్తశుద్ధి, కమిట్మెంట్, చేద్దామనే ఉద్దేశ్యం కూడా లేదు. 93వేల కోట్లు 10 నెలల కాలంలో అప్పులు చేశారు.. మార్క్‌ఫెడ్ నుండి 13వేల కోట్లు అప్పులు చేశారు. సత్యదూరమైన మాటలు, కించపరిచే మాటలు, ఏం మాట్లాడకపోయిన మధ్యలో ఇబ్బంది పెడుతూనే ఉన్నారు. 25వేల కోట్లు బకాయిలు, ఐఆర్, పీఆర్సీ ఇస్తామని చెప్పారు.. ఒక్కటీ అమలు చేయలేదు. జీతాలు కూడా ఒకటో తేదీన పడడం లేదు. సంపద సృష్టి చేస్తామని ఎక్కడ చేస్తున్నారు.చెత్తపన్ను రద్దు చేశారు.. కానీ చెత్త ఎత్తడం లేదు. 80 వేల టన్నులు చెత్త పేరుకుపోయింది. రైతుల సమస్యలపై మాట్లాడితే భరించే పరిస్థితి లేదు. కూటమి సభ్యుల మాదిరిగా అనుకూలంగా మాట్లాడాలి.. భజన చేయాలి అనుకొంటున్నారు. సభలో జరిగిన తీరును ఖండిస్తున్నాం. ప్రజలకు వాస్తవాలు తెలియజేయడానికి మేము ఉండాలి. కోటి 15లక్షల లబ్ధిదారులు ఉంటే 85 లక్షల మందికి కేటాయించారు. వాళ్ళు చెప్పిన అప్పులు అన్ని కూడా కూటమి ప్రభుత్వం లో చేసిందే. మా ప్రభుత్వ హయంలో 59వేల కోట్లు అత్యధికంగా చేసింది. పది నెలల కాలంలో లక్ష కోట్లు అప్పులు చేశారు. మేము విధ్వంసం చేస్తే అప్పు ఎలా పుట్టింది?. ప్రజల తరఫున మేము ప్రశ్నిస్తూనే ఉంటాం.. ఎన్నికల సమయంలో కూటమి ఇచ్చిన హామీలపైనే మేము ప్రశ్నిస్తున్నాం’ అని తెలిపారు. -
అఫీషియల్: జగన్ హయాంలో అప్పు రూ.3 లక్షల కోట్లే!
అమరావతి, సాక్షి: వైఎస్ జగన్ హయాంలో అప్పులపై చేస్తున్న అసత్య ప్రచారం, చంద్రబాబు కుట్ర.. అసెంబ్లీ సాక్షిగా బద్ధలైంది. ఏకంగా రూ.14 లక్షల కోట్లంటూ ప్రచారం మొదలుపెట్టి.. ఇప్పుడు జగన్ ప్రభుత్వం దిగిపోయేనాటికి రూ. 5,19,192 కోట్లు మాత్రమేనని ప్రకటించింది. గత రెండు ప్రభుత్వాల అప్పులపై వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలు అడిగిన ప్రశ్నకు.. ఇవాళ ఆర్థిక మంత్రి పయ్యావుల లిఖితపూర్వక సమాధానం ఇవ్వడంతో అడ్డంగా దొరికిపోయారు.2014 జూన్ 2 వ తేదీ నుంచి.. అంటే 2014-15 నుంచి 2023-24.. జూన్ 12వ తేదీ దాకా.. అలాగే 2024 డిసెంబర్ 31వ తేదీ దాకా ప్రభుత్వం, ప్రభుత్వ రంగల సంస్థల రుణాల వివరాలు తెలియజేయాలని వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలు బూచేపల్లి శివప్రసాద్, తాటిపర్తి చంద్రశేఖర్, ఆకేపాటి అమర్నాథ్, మత్స్యరస విశ్వేశ్వరరాజులు ఆర్థిక మంత్రి పయ్యావులను కోరారు.వైఎస్ జగన్ హయాంలో చేసిన అప్పుల లెక్క ఇదిపబ్లిక్ అప్పులు రూ.2,34,225 కోట్లు. కార్పొరేషన్లు ద్వారా చేసిన అప్పులు రూ. 1,05, 355 కోట్లు మాత్రమేనని ఆర్థిక శాఖ తెలిపింది.మొత్తంగా జగన్ ప్రభుత్వం ఐదేళ్ల కాలంలో చేసిన అప్పులు రూ.3,39,580 కోట్లు మాత్రమే.అలాగే గత ప్రభుత్వం(వైఎస్సార్సీపీ) దిగిపోయేనాటికి ఏపీ అప్పులు రూ.5,19,192 కోట్లు అని పేర్కొంది.అప్పులపై బాబు అబద్ధాలుచంద్రబాబు ఏపీ ఎన్నికల ప్రచారంలో.. 14 లక్షల కోట్లప్పులు చేశారంటూ ప్రచారం చేశారు. అధికారంలోకి వచ్చాక.. కిందటి ఏడాది గవర్నర్ ప్రసంగంలో రూ.10 లక్షల కోట్లుగా వినిపించారు. ఆ వెంట శ్వేత పత్రం పేరిట హడావిడి చేసి రిలీజ్ చేసి రూ.12.93 లక్షల కోట్లు అని ప్రచారం చేశారు. చివరికి బడ్జెట్‌కి వచ్చేసరికి ఆ అప్పులు మొత్తం రూ.6,46,531 కోట్లకు చేరింది. అయితే తాజా ప్రకటనతో ఆ దారుణమైన ప్రచారాలు ఎంత అబద్ధామో తేలిపోయింది. -
కూటమి పెద్దలు.. ష్.. గప్‌చుప్..!
ఏపీలో అధికార కూటమి అపరాధ భావనతో కొట్టుమిట్టాడుతోంది. టీడీపీ, జనసేన, బీజేపీలతో కూడిన పక్షం.. విపక్ష వైఎస్సార్సీపీ ఆత్మస్థైర్యంతో సంధిస్తున్న ప్రశ్నలకు జవాబు సైతం చెప్పలేకపోతోంది. ఆ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి ప్రజల తరపున వేస్తున్న ప్రశ్నలకు కూటమి పెద్దలు గుటకలు మింగుతున్నారు. టీడీపీ అధినేత, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి.. జనసేన అధినేత పవన్ కల్యాణ్‌లు ఎన్నికలకు ముందు చెప్పిన అబద్దాలను ప్రజల ముందు ఉంచడంలో జగన్ సఫలమయ్యారు. జగన్ తాజా మీడియా సమావేశంలో చంద్రబాబు, పవన్‌ల అసత్యాల చిట్టాను బయటపెట్టిన తీరు ఆసక్తికరంగా ఉంది. ప్రతిదానికి ఆధార సహితంగా ఆయన మాట్లాడారు. గతంలో జగన్ సీఎంగా ఉండగా చంద్రబాబు, పవన్‌లు ఆధారాలతో నిమిత్తం లేకుండా నోటికి వచ్చిన అబద్దాలు ఆడారన్న విషయం ఇప్పుడు మరింత స్పష్టమవుతోంది. జగన్ మాటలు వింటే వీరిద్దరు అపరాధ భావనతో కుంగిపోవాలి. అబద్దాలతో ప్రజలను మోసం చేశామన్న సంగతి తెలిసిపోతుందే అని సిగ్గుపడాలి. అయితే అధికారాన్ని ఎంజాయ్ చేస్తున్నారు కనుక వారు అలాంటివాటిని పట్టించు కోకపోవచ్చు!. అయితే..ఏపీ బడ్జెట్ ఎంత డొల్లగా ఉన్నది, టీడీపీ, జనసేనలు తాము చేసిన వాగ్దానాలకు ఎలా తూట్లు పొడిచింది కళ్లకు కట్టినట్లు జగన్ వివరించే యత్నం చేశారు. అప్పుల గురించి బడ్జెట్ పత్రాలలోను, సామాజిక, ఆర్ధిక సర్వేలోను ఇచ్చిన అంకెలను వివరించి కూటమిని నిలదీశారు. కూటమి ప్రతినిధులుగా పనిచేసే ఎల్లో మీడియా ఈనాడు, ఆంధ్రజ్యోతి వంటివి కూడా జగన్ చేసిన వ్యాఖ్యలపై నోరు మెదపలేకపోయాయి. ఎన్నికలకు రెండేళ్ల ముందు నుంచి ఏపీ అప్పుల కుప్ప అయిపోయిందని, శ్రీలంక మాదిరి అవుతోందని టీడీపీ, జనసేనలతో పాటు ఎల్లో మీడియా దుర్మార్గపు ప్రచారం చేశాయి. రెండేళ్లపాటు కరోనా సంక్షోభం ఉక్కిరిబిక్కిరి చేసినా, రూపాయి ఆదాయం లేకపోయినా జగన్ సమర్థంగా పనిచేశారన్న సంగతి ప్రజలకు బాగా అర్ధమైంది. ఇక.. తెలుగుదేశం తన వెబ్సైట్లో జగన్ ప్రభుత్వం రూ.13 లక్షల కోట్ల అప్పు చేసిందని పచ్చి అబద్దాన్ని ప్రచారం చేసింది. చంద్రబాబు, పవన్ ,లోకేష్‌లు పది నుంచి రూ.14 లక్షల కోట్ల వరకు తమకు తోచిన అంకెలు చెప్పి ప్రజలను తప్పుదోవ పట్టించే యత్నం చేశారు. ఈనాడు వంటి ఎల్లో మీడియా అవకాశం ఉన్న ప్రతిసారి నీచమైన రీతిలో పిచ్చి లెక్కలు, నిపుణుల పేరుతో దిక్కుమాలిన వాళ్లందరిని పోగు చేసి విష ప్రచారం చేసింది. తీరా ఇప్పుడు అధికారంలోకి వచ్చాక అసలు వాస్తవాలు ఒప్పుకోక తప్పలేదు. 👉ప్రభుత్వ గణాంకాల ప్రకారమే జగన్ ప్రభుత్వ టర్మ్ పూర్తి అయ్యేనాటికి అప్పు రూ.4.92 లక్షల కోట్లుగా వెల్లడైంది. ఇందులో 2014-19 మధ్య చంద్రబాబు ప్రభుత్వం చేసిన అప్పు సుమారు రెండు లక్షల కోట్లు, విభజన నాటికి ఉన్న అప్పు రూ.95 వేల కోట్లు కూడా ఉంది. అంటే జగన్ టైమ్ లో రెండు లక్షల కోట్ల మేరే బడ్జెట్ అప్పులు చేసినట్లు అర్థమవుతుంది. కాని ఈనాడు 2023 ఫిబ్రవరి 14న ఒక కథనాన్ని ఇస్తూ పార్లమెంటులో అప్పటికి రూ.4.24 లక్షల కోట్ల అప్పే అని చెప్పినా, ఏపీ అప్పు రూ.9.25 లక్షల కోట్లు అని, మిగిలిన అప్పులను జగన్ రహస్యంగా దాచేశారని పిచ్చి వాదన చేసింది. అది నిజమే అయితే కూటమి అధికారంలోకి వచ్చి పది నెలలు అవుతోంది కదా! ఆ రహస్య అప్పులేవో బయటపెట్టి ఉండవచ్చు కదా! అంటే అప్పుడు కావాలని అబద్దాలు ప్రచారం చేసి పాఠకులను ఈనాడు ,ఆంధ్రజ్యోతి వంటి ఎల్లో మీడియా మోసం చేసినట్లే కదా! 👉ఈ విషయంపై జగన్ కాగ్, ఆర్థిక సర్వేలలోని అంకెలను చూపుతూ ప్రశ్నించారు. దానికి అటు టీడీపీ నుంచి కాని, ఇటు ఎల్లో మీడియా నుంచి కాని సౌండ్ లేదు. అంతేకాదు... ఇప్పుడు ఏ సంక్షోభం లేకపోయినా, అప్పుడే చంద్రబాబు సర్కార్ రూ.70 వేల కోట్ల అప్పు చేయగా, మరో రూ.డెబ్బైవేల కోట్ల అప్పు సమీకరిస్తోంంది. ఇక సూపర్ సిక్స్‌కు గుండుసున్నా అంటూ కూటమి ఇచ్చిన ఒక్కో హామీని చదివి వినిపిస్తూ జగన్ అస్త్రాలు సంధించారు. అయినా కూటమి నేతలు, ఎల్లో మీడియా కిక్కురుమనలేదు.ఇవే కాకుండా ఎన్నికల ప్రణాళికలో చంద్రబాబు, పవన్ లు కలిసి చేసిన 143 వాగ్దానాలకు సంబంధించి కూడా ప్రశ్నలు వేశారు. సూపర్ సిక్స్ హామీలకే రూ.79179 కోట్ల రూపాయలు అవసరమైతే కేవలం రూ.17,179 కోట్లు కేటాయించడంలోని ఆంతర్యం ఏమిటని ప్రశ్నించారు. దీనిపై ఆర్ధిక మంత్రి కేశవ్ వివరణ ఇవ్వలేకపోయారు. ఆడబిడ్డ నిధి కింద మహిళలకు ఒక్కొక్కరికి రూ.18 వేలు ఇప్పటికే బాకీ పడ్డారని, వచ్చే ఏడాది కూడా ఇవ్వడం లేదని బడ్జెట్ ద్వారా తేలిపోయిందని, దాంతో అది రూ.36 వేలు అయిందని ఆయన చెప్పారు. అలాగే నిరుద్యోగులకు కూడా అదే ప్రకారం రూ.72 వేలు, తల్లికి వందనం కింద ప్రతి విద్యార్ధికి రూ.15 వేల చొప్పున బాకీ పడ్డారని అంటూ ఆయా స్కీముల పరిస్థితి, ప్రజలు ఏ మేర కూటమి చేతిలో మోసపోయింది ఆయన విశ్లేషించి చెప్పారు. ఫించన్వెయ్యి రూపాయలు పెంచినా నాలుగు లక్షల పెన్షన్లలో కోత పెట్టడాన్ని ఆయన ఆక్షేపించారు. బలహీనవర్గాలకు ఏభై ఏళ్లకే పెన్షన్ హామీ ఏమైందని అడిగారు. మహిళలకు ఉచిత బస్ ప్రయాణం హామీ చిన్నదే అయినా చంద్రబాబు ప్రభుత్వం నెరవేర్చలేదని, ఆయన కడుతున్న అమరావతిని రాయలసీమ నుంచి కూడా ఉచిత బస్‌లలో వచ్చి చూద్దామనుకున్న మహిళలకు నిరాశ మిగిల్చారని జగన్ ఎద్దేవ చేయడం ఆసక్తికరంగా ఉంది. అలాగే అమరావతి గురించి ప్రస్తావిస్తూ అధికారం వచ్చింది కనుక, వారు తాము అనుకున్న విధంగా నిర్మాణం చేసుకోవచ్చని, కాని అందులో కూడా అబద్దాలు చెప్పడం ఏమిటని అన్నారు. అమరావతి రాజధానికి ప్రభుత్వ డబ్బు రూపాయి వ్యయం చేయనవసరం లేదని చెప్పిన చంద్రబాబు బడ్జెట్ లో రూ.ఆరు వేల కోట్లు, అప్పుల కింద రూ.31 వేల కోట్లు ఎలా తీసుకు వస్తున్నారని ప్రశ్నించారు. దీని గురించి కూడా చంద్రబాబు కాని, మున్సిపల్ మంత్రి నారాయణ కాని నోరు విప్పడం లేదు. 👉వైఎస్సార్సీపీ వాళ్లకు పనులు చేయవద్దని చంద్రబాబు చెప్పడంపై జగన్ మండిపడ్డారు. అలా అన్నందుకు చంద్రబాబును తక్షణమే పదవి నుంచి తొలగించాలని గవర్నర్‌కు సూచించారు. ఇక్కడ ఇంకో విషయం చెప్పాలి. చంద్రబాబు, ఆయన తోడల్లుడు దగ్గుబాటి వెంకటేశ్వరరావులు కలిసిపోయారట. తనకు చంద్రబాబుతో వైరం ఉండేది కానీ ఇప్పుడు పరిస్థితి మారిందని దగ్గుబాటి అన్నారు. మరో వైపు చంద్రబాబు అసలు వైఎస్సార్సీపీ వాళ్లకు పనులు చేయవద్దని ఎలా చెబుతున్నారు. చివరికి వైఎస్సార్సీపీ వారికి టీడీపీ వారు ఎవరైనా బంధువులు ఉన్నా, వారు కలుసుకున్నా పార్టీలో ఒప్పుకోవడం లేదట. చంద్రబాబు, దగ్గుబాటి కలవవచ్చు కాని, వేర్వేరు పార్టీలలో ఉన్న బంధువులు కలిస్తే తప్పని టీడీపీ నాయకత్వం ప్రచారం చేస్తుండడంపై విమర్శలు వస్తున్నాయి. టీడీపీ క్యాడర్ ఈ పరిణామాన్ని గుర్తించి, వైఎస్సార్సీపీలో లేదా ఇతర పార్టీలలో ఉన్న తమ బంధువులతో గొడవలు పడవద్దని సలహా ఇవ్వాలి. బాబు ష్యూరిటీ-మోసం గ్యారంటీ అన్న డైలాగును జగన్ వాడుకుని ప్రజలకు అర్థమయ్యే రీతిలో చంద్రబాబు బడ్జెట్లో ఉన్న అంకెల గారడీని విడమరిచి చెప్పగలిగారు. శాసనమండలిలో వైఎస్సార్సీపీ సభ్యులు ఎక్కువగా ఉండడంతో వారు వీటిని ప్రస్తావిస్తుంటే మంత్రి లోకేష్తోసహా ఏ మంత్రి కూడా నేరుగా జవాబు ఇవ్వలేకపోతున్నారు. దాంతో కూటమి సర్కార్ ప్రతిష్ట దెబ్బతింటుండడంతో ఎర్రబుక్ పేరుతో వైఎస్సార్సీపీ వారిపై కేసులు పెడుతున్నారు. అసెంబ్లీలో ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ తమ వద్ద మంత్ర దండం లేదని చెబుతూ, చంద్రబాబు బ్రాండ్ ఉందని అన్నారు. చంద్రబాబు బ్రాండ్ అంటే అబద్దాలు చెప్పడమా అన్న ప్రశ్నకు జవాబు ఇవ్వలేరు. జగన్ అసెంబ్లీకి వెళ్లకపోయినా, అక్కడ మాట్లాడకపోయినా అవే విషయాలను మీడియా సమావేశం పెట్టి వివరించడం ద్వారా చంద్రబాబు, పవన్ ,లోకేష్ లను ఆత్మరక్షణలో పడేశారని చెప్పక తప్పదు.:::కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత. -
ఏపీ అసెంబ్లీ: బెల్టు షాపులపై వాడీవేడి చర్చ.. బొత్స కౌంటర్
AP Assembly Sessions Updates..👉ఏపీ అసెంబ్లీలో బడ్జెట్ సమావేశాలు కొనసాగుతున్నాయి. శాసనమండలిలో పలు అంశాలపై అధికార పార్టీని ప్రశ్నిస్తున్నారు ప్రధాన ప్రతిపక్ష పార్టీ వైఎస్సార్సీపీ నేతలు. ఈరోజు సమావేశాల్లో భాగంగా మద్యం బెల్టు షాపులపై చర్చ జరిగింది. వైఎస్సార్సీపీ నేతల ప్రశ్నలకు సమాధానం ఇస్తూ ఏపీలో మద్యం అమ్మకాలు పెరిగాయని మంత్రి కొల్లు రవీంద్ర అంగీకరించారు.శాసన మండలి..మండలిలో మద్యం బెల్టు షాపులపై వాడి వేడి చర్చమద్యం బెల్టు షాపులపై వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీలు బొత్స సత్యనారాయణ, వరుదు కల్యాణి, తోట త్రిమూర్తులు ఆగ్రహం 👉ఎమ్మెల్సీ బొత్స కామెంట్స్..గత ప్రభుత్వంలో ఎక్కువ కేసులు పెట్టబట్టే మద్యం అమ్మకాలు తగ్గాయిమరి ఈ పది నెలల కాలంలో ఎందుకు కేసులు పెట్టలేదుగతంలో ఉన్న బ్రాండ్లే ఇప్పుడూ అమ్ముతున్నారుఆ బ్రాండ్లను ఎందుకు బ్యాన్ చేయలేదు?సభలో మాట్లాడటానికి మాకు హక్కు లేదని మంత్రి అచ్చెన్న మాట్లాడటం సరికాదుఎన్టీఆర్ మద్యపాన నిషేధం తెచ్చారుమద్యపాన నిషేధానికి తూట్లు పొడిచింది ఎవరు?.సతివాడలోని ఒక బెల్ట్ షాపును 50 లక్షలకు వేలం పాడారురాత్రి 9 నుంచి ఉదయం 10 వరకూ అమ్ముకోవడానికి వేలం పెట్టారు👉ఎమ్మెల్సీ వరుదు కల్యాణి కామెంట్స్..మద్యం బెల్టు షాపులు వల్ల మహిళలపై నేరాలు పెరుగుతున్నాయిమద్యం అమ్మకాలు బెల్టు షాపులు వల్ల విపరీతంగా పెరిగాయిచంద్రబాబు ప్రభుత్వం వచ్చాక మద్యం అమ్మకాలు 18 శాతం, బీర్ల అమ్మకాలు 40 శాతం పెరిగాయిస్కూల్స్, కాలేజీల దగ్గర లోనే బెల్టు షాపులు పెట్టారుబెల్టు షాపులు పెడితే 5 లక్షలు జరిమానా అన్నారు.మరి ఎంత మందికి వేశారు?బెల్టు షాపులు పెడితే మద్యం షాపులు రద్దు చేస్తామన్నారు..ఎన్ని లైసెన్స్ లు రద్దు చేశారు?.👉ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు కామెంట్స్సీఎం చంద్రబాబు బెల్టు షాపులు పెడితే బెల్టు తీస్తాం అన్నారుఎంతమందికి బెల్టు తీశారు చెప్పండిమద్యం బెల్టు షాపులపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదు?ఐదు లక్షల ఫైన్ వేస్తామన్నారుఎన్ని బెల్టు షాపులకు ఐదు లక్షలు ఫైన్ వేశారుఎన్ని బెల్ట్ షాపులు మూయించారు 👉పీడీఎఫ్ ఎమ్మెల్సీ, ఇళ్ల వెంకటేశ్వరరావు మాట్లాడుతూ..మద్యం ద్వారా ఆదాయం పెంచుకోవాలనే ఆలోచనలలో ప్రభుత్వం ఉందిమద్యాన్ని నియంత్రించాలని ఆలోచన చేయడం లేదు -
రాష్ట్ర ప్రయోజనాలపై రాజీలేని పోరు: వైఎస్ జగన్
సాక్షి, అమరావతి: రాష్ట్ర ప్రయోజనాల విషయంలో ఎక్కడా రాజీ పడొద్దని.. పార్లమెంటు ఉభయ సభల్లో రాష్ట్ర సమస్యలపై గట్టిగా గళం వినిపించాలని వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పార్టీ ఎంపీలకు దిశానిర్దేశం చేశారు. ఈ నెల 10వతేదీ నుంచి పార్లమెంట్ మలి విడత బడ్జెట్ సమావేశాలు జరగనున్న నేపథ్యంలో గురువారం తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో వైఎస్ జగన్ అధ్యక్షతన వైఎస్సార్సీపీ పార్లమెంటరీ పార్టీ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా పార్లమెంట్ ఉభయ సభల్లో అనుసరించాల్సిన వ్యూహం, ప్రస్తావించాల్సిన అంశాలపై పార్టీ ఎంపీలకు వైఎస్ జగన్ మార్గనిర్దేశం చేశారు. రాష్ట్రానికి జీవనాడి లాంటి పోలవరంలో గరిష్ట నీటి మట్టం 45.72 మీటర్లలో 194.6 టీఎంసీలను నిల్వ చేసేలా ప్రాజెక్టును పూర్తి చేస్తేనే రాష్ట్ర ప్రజలకు ఫలాలు పూర్తి స్థాయిలో అందించవచ్చని వైఎస్ జగన్ స్పష్టం చేశారు. అలాంటి ప్రాజెక్టులో నీటి నిల్వ ఎత్తును 41.15 మీటర్లకు తగ్గించడమన్నది రాష్ట్ర ప్రయోజనాలకు తీవ్ర విఘాతమన్నారు. కేంద్ర కేబినెట్లో ఇద్దరు టీడీపీ మంత్రులున్నా పోలవరం ప్రాజెక్టులో నీటిని నిల్వ చేసే ఎత్తు తగ్గింపుపై కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకించక పోవడం దారుణమన్నారు. రాష్ట్రానికి ఇంత అన్యాయం జరుగుతున్నా, మన ప్రయోజనాలకు విఘాతం కలుగుతున్నా టీడీపీ ఎంపీలు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారని సమావేశంలో ఎంపీలు వైఎస్ జగన్ దృష్టికి తెచ్చారు. రాష్ట్ర ప్రయోజనాల పరిరక్షణ విషయంలో రాజకీయాలకు అతీతంగా ముందుకు వెళ్లేందుకు తాము వెనకాడటం లేదని.. టీడీపీ ఎంపీలతో కలసి ప్రధాని సహా సంబంధిత కేంద్ర మంత్రులను కలవాలని కూడా ప్రతిపాదించామని.. కానీ టీడీపీ ఎంపీలు ముందుకు రాలేదని వైఎస్సార్ సీపీ పార్లమెంట్ సభ్యులు వెల్లడించారు. పోలవరంలో నీటిని నిల్వ చేసే ఎత్తు విషయంలో రాష్ట్రం తరఫున పార్లమెంట్లో గట్టి పోరాటం చేయాలని.. ఈ విషయంలో ఎక్కడా రాజీ పడొద్దని ఎంపీలను వైఎస్ జగన్ ఆదేశించారు. విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు.. ఆంధ్రప్రదేశ్ ప్రజలు హక్కుగా, ఎన్నో త్యాగాలతో సాధించుకున్న విశాఖ స్టీల్ ప్లాంట్‌ను ఎట్టి పరిస్థితుల్లోనూ కాపాడుకోవాలని, సంస్థ ప్రైవేటీకరణ జరగకుండా కేంద్రంపై ఒత్తిడి తేవాలని, విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ చర్యలకు వ్యతిరేకంగా పోరాడాలని పార్టీ ఎంపీలను వైఎస్ జగన్ ఆదేశించారు. నియోజకవర్గాల పునర్విభజనపై రకరకాలుగా చర్చ జరుగుతోందని.. దీనివల్ల ఉత్తరాదిలో లోక్‌సభ స్థానాలు పెరిగినట్లుగా దక్షిణాదిలో పెరగవని ప్రచారం సాగుతోందని సమావేశంలో ఎంపీలు ప్రస్తావించారు. దీనిపై వైఎస్ జగన్ స్పందిస్తూ.. నియోజకవర్గాల పునర్విభజన విషయంలో కేంద్రం నుంచి స్పష్టత వచ్చేలా పార్లమెంటులో ప్రస్తావించాలని సూచించారు. ‘వన్ నేషన్... వన్ ఎలక్షన్’పై ఈ సమావేశాల్లో చర్చకు వచ్చే అవకాశం ఉందని ఎంపీలు తెలిపారు. ఒకేసారి కేంద్రం, రాష్ట్రంలో జరిగే ఎన్నికలు పెద్దగా ప్రభావం చూపకపోవచ్చన్న అభిప్రాయం వ్యక్తంచేశారు. కేంద్రం, రాష్ట్రంలో ఒకేసారి ఎన్నికలు జరిగితే ఈవీఎంలు కాకుండా బ్యాలెట్ విధానంలో ఎన్నికల కోసం డిమాండ్ చేయాలని ఎంపీలకు వైఎస్ జగన్ దిశానిర్దేశం చేశారు. అభివృద్ధి చెందిన దేశాల్లో ఇప్పుడు బ్యాలెట్ విధానంలోనే ఎన్నికలు నిర్వహిస్తున్నారని, మొదట్లో ఈవీఎంలతో పోలింగ్ నిర్వహించిన దేశాలు కూడా ఆ తర్వాత బ్యాలెట్ విధానానికి మళ్లిన విషయాన్ని వైఎస్ జగన్ గుర్తు చేశారు. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణపై పోరాటం.. నిరుపేదలకు వైద్య సదుపాయాలను చేరువలో అందుబాటులోకి తెచ్చేందుకు వైఎస్సార్ సీపీ హయాంలోప్రభుత్వ ఆధ్వర్యంలో 17 కొత్త మెడికల్ కాలేజీల నిర్మాణాన్ని మొదలు పెట్టగా.. వాటిలో పూర్తయిన మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరించే దిశలో చంద్రబాబు సర్కారు చేస్తున్న యత్నాలపై సమావేశంలో ఎంపీలు ఆందోళన వ్యక్తం చేశారు. ప్రజారోగ్యంపై సీఎం చంద్రబాబు కత్తి కట్టినట్లుగా వ్యవహరిస్తున్నారని ఎంపీలు ప్రస్తావించగా.. ఈ అంశాన్ని పార్లమెంట్లో ప్రస్తావించాలని వైఎస్ జగన్ ఆదేశించారు. మన విద్యార్థులకు వైద్య విద్యను అందుబాటులోకి తేవడంతో పాటు ప్రతి జిల్లాలో పేదలకు అత్యాధునిక వైద్యాన్ని ఉచితంగా చేరువలో అందించే ఉద్దేశంతో కొత్త మెడికల్ కాలేజీల నిర్మాణాన్ని చేపట్టామని వైఎస్ జగన్ గుర్తు చేశారు. ఎన్నో వ్యయ ప్రయాసల కోర్చి అన్ని రకాలుగా నిధులు, భూములు సేకరించి కాలేజీలను నిర్మించామని.. కానీ ఈరోజు వాటిని ప్రైవేటుపరం చేస్తూ సదుద్దేశాలను నీరు గారుస్తున్నారని.. అందుకే ఈ అంశాన్ని పార్లమెంటులో గట్టిగా ప్రస్తావించాలని, రాష్ట్రంలో మిర్చికి మద్దతు ధర అంశాన్ని కూడా చర్చకు తేవాలని ఎంపీలకు సూచించారు. వైఎస్ జగన్ భద్రతపై.. మాజీ సీఎం వైఎస్ జగన్ భద్రత విషయంలో టీడీపీ కూటమి ప్రభుత్వం, చంద్రబాబు అనుసరిస్తున్న వైఖరిని ఎంపీలు తీవ్రంగా తప్పుబట్టారు. మాజీ ముఖ్యమంత్రిగా జడ్ ప్లస్ కేటగిరీలో ఉన్న జగన్‌కు తగిన భద్రత కల్పించడం లేదని ఆక్షేపించారు. వైఎస్ జగన్ గుంటూరు మిర్చి యార్డును సందర్శించిన సమయంలో పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేయకపోవడాన్ని ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లామని తెలిపారు. ఈ విషయాన్ని అంత తేలిగ్గా విడిచి పెట్టబోమన్నారు. ప్రజా నాయకుడైన వైఎస్ జగన్‌ను ప్రజల్లోకి వెళ్లకుండా నిరోధించడం, ఆయనకు భద్రతా సమస్యలు సృష్టించేందుకు ఇలాంటి దిగజారుడు చర్యలకు దిగుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ విషయాన్ని కూడా పార్లమెంట్లో గట్టిగా ప్రస్తావిస్తామని స్పష్టం చేశారు. సమావేశంలో వైఎస్సార్సీపీ పార్లమెంటరీ పార్టీ (వైఎస్సార్సీపీపీ) నేత వైవీ సుబ్బారెడ్డి, వైఎస్సార్సీపీ లోక్‌సభ పక్షనేత పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డి, రాజ్యసభలో వైఎస్సార్సీపీ నాయకుడు పిల్లి సుభాష్‌చంద్రబోస్‌తోపాటు ఎంపీలు గొల్ల బాబూరావు, ఆళ్ల అయోధ్య రామిరెడ్డి, ఎం.గురుమూర్తి, తనూజారాణి, మేడా రఘునాథరెడ్డి, పార్టీ స్టేట్ కో–ఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి పాల్గొన్నారు. -
వైఎస్సార్సీపీలో నూతన నియామకాలు
తాడేపల్లి: వైఎస్సార్సీపీ రాష్ట్ర అనుబంధ విభాగాలకు పలువురి పార్టీ నాయకులను నూతన అధ్యక్షులుగా నియమిస్తూ మాజీ ముఖ్యమంత్రి, పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. ఈ మేరకు తాడేపల్లి పార్టీ కేంద్ర కార్యాలయం నుంచి ఉత్తర్వులు అందాయి.ముదలియార్ విభాగం అధ్యక్షులుగా జ్ఞాన జగదీష్, బొందిలి విభాగం అధ్యక్షుడిగా నరేంద్ర సింగ్, కృష్ణ బలిజ/ పూసల విభాగం అధ్యక్షురాలిగా కోలా భవానీలను నియమించారు. ఆర్టిజెన్ సెల్ అధ్యక్షుడిగా తోలేటి శ్రీకాంత్ ను నియమించారు. -
ఎక్కడా రాజీ పడొద్దు.. గట్టిగా గళం వినిపించండి: వైఎస్ జగన్
తాడేపల్లి: ఈనెల 10వ తేదీ నుంచి పార్లమెంటు మలి విడత బడ్జెట్ సమావేశాల నేపథ్యంలో పార్టీకి చెందిన లోక్‌సభ, రాజ్యసభ సభ్యులతో మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి క్యాంప్ ఆఫీస్‌లో సమావేశమయ్యారు. ఉభయ సభల సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహం, ప్రస్తావించాల్సిన అంశాలపై పార్టీ ఎంపీలకు వైఎస్ జగన్ దిశా నిర్దేశం చేశారు. రాష్ట్ర ప్రయోజనాల విషయంలో ఎక్కడా రాజీ పడొద్దని, రాష్ట్ర సమస్యలపై పార్లమెంటు ఉభయ సభల్లో పార్టీ ఎంపీలు గట్టిగా గళం వినిపించాలని సమావేశంలో వైఎస్ జగన్ ఆదేశించారు.టీడీపీ ఎంపీలు ఉన్నా నిమ్మకు నీరెత్తినట్లు..రాష్ట్ర ప్రయోజనాలు కాపాడడం కోసం పార్లమెంటు ఉభయ సభల్లో లేవనెత్తాల్సిన అంశాలపై ఈ సందర్భంగా సమావేశంలో చర్చ జరిగింది. రాష్ట్రానికి జీవనాడి పోలవరం ప్రాజెక్టు కాగా, ఆ ప్రాజెక్టు నిర్మాణంలో ఎత్తు ఎంతో కీలకమని వైఎస్ జగన్ స్పష్టం చేశారు. అలాంటి ప్రాజెక్టు ఎత్తు తగ్గింపు అన్నది రాష్ట్ర ప్రయోజనాలకు తీవ్ర విఘాతం అని, కేంద్ర క్యాబినెట్లో ఇద్దరు టీడీపీ మంత్రులు ఉన్నా, వారు పోలవరం ప్రాజెక్టు ఎత్తు తగ్గింపుపై కేంద్ర నిర్ణయాన్ని వ్యతిరేకించక పోవడం దారుణమని ఆయన అన్నారు.కాగా, రాష్ట్రానికి అన్యాయం జరుగుతున్నా, రాష్ట్ర ప్రయోజనాల విషయంలోనూ టీడీపీ ఎంపీలు నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తున్నారని సమావేశంలో వైయస్సార్సీపీ ఎంపీలు ప్రస్తావించారు. ఈ విషయంలో రాజకీయాలకు అతీతంగా ముందుకు వెళ్లేందుకు తాము వెనకాడ్డం లేదని, టీడీపీ ఎంపీలతో కలిసి ప్రధాని సహా కేంద్రంలో సంబంధిత మంత్రులను కలవాలని కూడా ప్రతిపాదించామని, కానీ టీడీపీ ఎంపీలు ముందుకు రాలేదని వైఎస్సార్సీపీ ఎంపీలు వెల్లడించారు. పోలవరం ఎత్తు విషయంలో రాష్ట్రం తరఫున పార్లమెంటులో గట్టి పోరాటం చేయాలని, ఈ విషయంలో ఎక్కడా రాజీ పడొద్దని పార్టీ ఎంపీలను వైఎస్ జగన్ ఆదేశించారు. విశాఖ స్టీల్‌ప్లాంట్‌ను ఎలాగైనా కాపాడుకోవాలి..అలాగే ఆంధ్రుల హక్కుగా, ఎన్నో త్యాగాలతో సాధించుకున్న విశాఖ స్టీల్‌ప్లాంట్‌ను ఎలాగైనా కాపాడుకోవాలని, ఆ సంస్థ ప్రైవేటీకరణ జరగకుండా కేంద్రంపై ఒత్తిడి తీసుకురావాలని, విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ చర్యలకు వ్యతిరేకంగా పార్టీ ఎంపీలు పోరాడాలని వైఎస్ జగన్ నిర్దేశించారు. నియోజకవర్గాల పునర్విభజనపై రకరకాలుగా చర్చ జరుగుతోందని, దీని వల్ల ఉత్తరాదిలో పెరిగనట్లుగా దక్షిణాదిన సీట్లు పెరగవన్న ప్రచారం సాగుతోందని సమావేశంలో ఎంపీలు వెల్లడించారు. దీనిపై స్పందించిన వైఎస్జగన్, నియోజకవర్గాల పునర్విభజన విషయంలో కేంద్రం నుంచి స్పష్టత వచ్చేలా పార్లమెంటలో ప్రస్తావించాలని సూచించారుబ్యాలెట్ విధానంలో ఎన్నికల కోసం డిమాండ్ చేయండివన్ నేషన్. వన్ ఎలక్షన్’పై ఈ సమావేశాల్లో చర్చకు వచ్చే అవకాశం ఉందని గుర్తు చేసిన ఎంపీలు.. ఒకేసారి కేంద్రం, రాష్ట్రంలో జరిగే ఎన్నికలు పెద్దగా ప్రభావం చూపకపోవచ్చన్న అభిప్రాయం వ్యక్తం చేశారు. దీనిపై స్పందించిన వైఎస్ జగన్.. కేంద్రం, రాష్ట్రంలో ఒకేసారి ఎన్నికలు జరిగితే, ఈవీఎంలు కాకుండా బ్యాలెట్ విధానంలో ఎన్నికల కోసం డిమాండ్ చేయాలని నిర్దేశించారు. అభివృద్ధి చెందిన దేశాల్లో ఇప్పుడు బ్యాలెట్ విధానంలోనే ఎన్నికలు నిర్వహిస్తున్నారని, మొదట్లో ఈవీఎంలతో పోలింగ్ నిర్వహించిన దేశాలు కూడా, ఆ తర్వాత బ్యాలెట్ విధానానికి మళ్లిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. ప్రజారోగ్య రంగంపై పార్లమెంట్లో ప్రస్తావించండినిరుపేదలకు వైద్య విద్యను మరింత అందుబాటులోకి తెచ్చేందుకు వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో కొత్తగా 17 మెడికల్ కాలేజీల నిర్మాణం మొదలు పెట్టగా, వాటిలో పూర్తైన మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ దిశలో చంద్రబాబు ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలపై సమావేశంలో ఎంపీలు ఆందోళన వ్యక్తం చేశారు. ప్రజారోగ్య రంగంపై సీఎం చంద్రబాబు కత్తికట్టినట్లుగా వ్యవహరిస్తున్నారని ఎంపీలు ప్రస్తావించగా, ఈ అంశాన్ని పార్లమెంటులో ప్రస్తావించాలని వైఎస్ జగన్ ఆదేశించారు.పేద విద్యార్థులకు వైద్య విద్యను దూరం చేస్తున్నారు..పేద విద్యార్థులకు వైద్య విద్యను అందుబాటులోకి తేవడంతో పాటు, ప్రతి జిల్లాలో పేదలకు అత్యాధునిక వైద్యాన్ని ఉచితంగా అందించే ఉద్దేశంతో కొత్త మెడికల్ కాలేజీలు తీసుకొచ్చామని వైఎస్ జగన్ వెల్లడించారు. ఎన్నో వ్యవప్రయాసలకోర్చి, అన్ని రకాలుగా నిధులు, భూములు సేకరించి కాలేజీలను నిర్మించామని, కానీ ఈరోజు వాటిని ప్రైవేటుపరం చేస్తూ మంచి ఉద్దేశాలను నీరు గారుస్తున్నారని, అందుకే ఈ అంశాన్ని పార్లమెంటులో గట్టిగా ప్రస్తావించాలని స్పష్టం చేశారు వైఎస్ జగన్. వైఎస్ జగన్ భద్రతపై ప్రభుత్వ వైఖరిని తప్పుబట్టిన ఎంపీలువైఎస్ జగన్ భద్రత విషయంలో రాష్ట్ర ప్రభుత్వం, సీఎం చంద్రబాబు అనుసరిస్తున్న వైఖరిని తీవ్రంగా తప్పు బట్టిన ఎంపీలు.. మాజీ ముఖ్యమంత్రిగా, జడ్ ప్లస్ కేటగిరీలో ఉన్న నేతకు తగిన భద్రత కల్పించడం లేదని ఆక్షేపించారు. జగన్‌గారి గుంటూరు మిర్చి యార్డు సందర్శన సమయంలో, పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేయకపోవడాన్ని ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లామని తెలిపారు. ఈ విషయాన్ని అంత తేలిగ్గా విడిచి పెట్టబోమన్న వారు, ప్రజా నాయకుడిగా ఉన్న జగన్ ప్రజల్లోకి వెళ్లకుండా నిరోధించడానికి, ఆయనకు భద్రతా సమస్యలు సృష్టించడానికి ఇలాంటి చర్యలకు దిగుతున్నారని దుయ్యబట్టారు. అందుకే ఈ విషయాన్ని కూడా పార్లమెంటులో గట్టిగా లేవనెత్తుతామని వైఎస్సార్సీపీ ఎంపీలు వెల్లడించారు.వైఎస్సార్ కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ (వైఎస్సార్సీపీ) నేత వై.వీ.సుబ్బారెడ్డి, వైఎస్సార్సీపీ లోక్‌సభ పక్షనేత పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డి, రాజ్యసభలో వైఎస్సార్సీపీ నాయకుడు పిల్లి సుభాష్‌చంద్రబోస్‌తో పాటు, ఎంపీలు గొల్ల బాబూరావు, ఆళ్ల అయోధ్య రామిరెడ్డి, ఎం.గురుమూర్తి, తనూజారాణి, రఘునాథరెడ్డి ఇంకా పార్టీ స్టేట్ కో–ఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి ఈ సమావేశంలో పాల్గొన్నారు. -
‘ఇది మోసపూరిత బడ్జెట్.. చంద్రబాబు చేతులెత్తేశారు’
తాడేపల్లి: ముఖ్యమంత్రి చంద్రబాబుది మోసపూరిత బడ్జెట్ అని మాజీ మంత్రి, వైఎస్సార్ సీపీ నేత అంబటి రాంబాబు విమర్శించారు. చంద్రబాబు ఏ విధంగా ప్రజల్ని మోసం చేస్తున్నారనే విషయాన్ని తమ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రెస్ మీట్ ఆధారాలతో బయటపెట్టారన్నారు. ఈరోజు(గురువారం) చంద్రబాబు మోసపూరిత బడ్జెట్ పై వైఎస్సార్ సీపీ ప్రధాన కార్యాలయం నుంచి మాట్లాడిన అంబటి.. ‘ సూపర్ సిక్స్ సహా 143 హామీలు అమలు చేయలేక చంద్రబాబు చేతులెత్తేశారు. జగన్ రూ. 14 లక్షల కోట్లు అప్పు చేసినట్లు చంద్రబాబు విష ప్రచారం చేశారు. చివరకు గవర్నర్ ప్రసంగంలో రాష్ట్ర అప్పు రూ. 6 లక్షల కోట్లే అని తేల్చారు. అంటే ఇచ్చిన హామీల అమలను ఎగ్గట్టడానికి చంద్రబాబు ప్రయత్నిస్తున్నారు. ఆడబిడ్డ నిధి కింద చంద్రబాబు రూ. 36 వేల కోట్లు ఎగ్గొట్టారు. ప్రజాస్వామ్య విరుద్ధంగా చంద్రబాబు వ్యాఖ్యలునిరుద్యోగులకు రూ.52 వేల కోట్లు బకాయి పెట్టారు. తల్లికివందనం కింద రూ.13,050 కోట్లు అవసరమైతే రూ.8 వేల కోట్లి మాత్రమే కేటాయించారు. అంటే ఇది ఎగ్గొట్టే ఉద్దేశం కాదా? , అన్నదాత సుఖీభవ కింద రూ.20 వేల కోట్లు ఇవ్వలేదు. ఎస్సీ ఎస్టీ మహిళలకు రూ. 45 వేల కోట్లు ఎగ్గొట్టారు. దీపం పథకం కింద అరకొర నిధులే కేటాయించారు. పెన్షన్ కూడా ఇప్పటికే 4 లక్షల మందికి కట్ చేశారు . అమరావతి అద్బుతదీపం అన్నారు. వేల కోట్లు అప్పు తెచ్చి కడుతున్నారు. టీడీపీ వారికి తప్ప ఇంకెవరికీ పనులు చేయవద్దంటూ ప్రజాస్వామ్య విరుద్ధంగా మాట్లాడారు. ఆయన మాటలు చూస్తుంటే చంద్రబాబు బుర్ర పని చేయటం లేదనిపిస్తోంది.పవన్ అధికారాన్ని వదిలేసి ప్రతిపక్ష హోదా తీసుకో.. పవన్ కళ్యాణ్ అధికారాన్ని వదిలేసి ప్రతిపక్ష హోదా తీసుకోవాలి. జగన్ ఎవరి దయాదాక్షణ్యంతో రాజకీయాలలోకి రాలేదు. ఢిల్లీ కోటని ఢీకొట్టి మరీ వచ్చారు. లోకేష్ లాగా తన తండ్రిని అడ్డం పెట్టుకుని రాజకీయాల్లోకి రాలేదు. చంద్రబాబు అంత నీచుడు, 420 మరెవరూ లేరని ఎన్టీఆర్, హరికృష్ణ, నారా రామ్మూర్తి ఆత్మలు ఘోషిస్తున్నాయి. లోకేష్ చేస్తున్న దుర్మార్గాలకు ఈసారి ఘోర ఓటమి తప్పదు. నాదెండ్ల మనోహర్ బియ్యం దొంగ, లంచాల కోరు. పీడిఎస్ బియ్యం అమ్ముకుంటున్న దొంగ నాదెండ్ల మనోహర్. తనిఖీల పేరుతో బెదిరించి కోట్లకు కోట్లకు వసూలు చేస్తున్నారు. మాది పోరాటం చేసి, రాటు తేలిన రాజకీయ పార్టీసూపర్ సిక్స్ హామీల అమలుకు రూ.79,876 కోట్లు అవసరమా? కాదా?, మరి మీరు కేటాయించినది ఎంత? అనేదానికి సమాధానం చెప్పాలి. పవన్ కళ్యాణ్ మీద కాపులు చాలా ఆశలు పెట్టుకున్నారు. ఎంతోమంది బీసీలు, కాపులను వదిలేసి తన అన్నకు పదవులు ఇవ్వటం కరెక్టు కాదు. నమ్ముకున్న వారిని నట్టేట ముంచవద్దని పవన్ కళ్యాణ్ ని కోరుతున్నాను. చంద్రబాబు కుట్రల మీద దగ్గుబాటి వెంకటేశ్వరరావు గతంలో పుస్తకం రాశారు. ఇప్పుడు ఇద్దరూ ఒకే వేదిక మీదకు వచ్చారు. మా పార్టీ నేతలపై పెట్టే అక్రమ కేసులు నిలపడవు. సోనియా గాంధీ ఎన్ని కేసులు పెట్టినా జగన్ నిలపడ్డారు. మాది పోరాటం చేసి, రాటు తేలిన రాజకీయ పార్టీ. ఎన్ని కేసులు పెట్టినా ఎదుర్కొంటానికి మేము సిద్దమే. బూతులు తిట్టే అయ్యన్నపాత్రుడు స్పీకర్ అంట’ అని ధ్వజమెత్తారు. -
అధికార పక్షాలకు వార్నింగ్ ఇచ్చిన ఎమ్మెల్సీ ఎన్నికలు!
శాసనమండలికి ఇటీవల జరిగిన ఎన్నికలు అటు ఆంధ్రప్రదేశ్, ఇటు తెలంగాణల్లోని అధికార పక్షాలకు చిన్నపాటి వార్నింగ్ ఇచ్చాయి! ఆంధ్రప్రదేశ్‌లోని రెండు పట్టభద్రుల నియోజకవర్గాల్లో టీడీపీ గెలుపొందినా కీలకమైన ఉపాధ్యాయ నియోజకవర్గంలో మాత్రం టీడీపీ, జనసేనలు ఉమ్మడిగా బలపరిచిన అభ్యర్థి ఓడిపోవడం ముఖ్యమైన రాజకీయ పరిణామమే అవుతుంది. ఈ ఓటమి కూటమి ప్రభుత్వంపై ఉత్తరాంధ్ర టీచర్ల అసంతృప్తికి ప్రతీక.మరోవైపు ఉత్తర తెలంగాణలో గ్రాడ్యుయేట్లు, టీచర్ల నియోజకవర్గాలలో బీజేపీ గెలుపు కూడా కాంగ్రెస్‌కు ఇబ్బంది పెట్టేదే. పార్టీలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఇరుకున పెట్టడానికి ఆయా వర్గాలు దీనిని అవకాశంగా తీసుకోవచ్చు. టీచర్ల నియోజకవర్గాలకు జరిగిన పోటీలో లేనని కాంగ్రెస్ నేతలు చెప్పుకున్నా, ఒక స్థానంలో బీజేపీ బహిరంగంగా బలపరిచిన వ్యక్తి గెలవడం మాత్రం అధికార పార్టీకి మంచి సంకేతం కాదు. మరో స్థానంలో పీఆర్టీయూ తెలంగాణలో అధికారంలోకి రావాలని యత్నిస్తున్న బీజేపీకి ఇది కొంత ఉత్సాహాన్ని ఇస్తుంది. అయితే బీఆర్ఎస్ పోటీ చేయకపోవడం, ఎవరికి మద్దతు ఇవ్వకపోవడం వల్ల రాజకీయ సమీకరణలు భవిష్యత్తులో కూడా ఇలాగే ఉంటాయని చెప్పలేం.ఆంధ్రప్రదేశ్‌లో ఉత్తరాంధ్రలో టీడీపీ, జనసేనలు ఏపీటీఎఫ్ అభ్యర్ధి రఘువర్మకు బహిరంగంగానే మద్దతు ప్రకటించాయి. అధికారిక ప్రకటనలు కూడా చేశాయి. కాని బీజేపీ మద్దతివ్వకపోవడం గమనించవలసిన అంశమే. స్వతంత్ర అభ్యర్ధిగా పీఆర్టీయూ పక్షాన పోటీచేసిన గాదె శ్రీనివాసులు నాయుడు వర్మను ఓడించడంతో కూటమికి దిమ్మదిరిగినంత పనైంది. ప్రభుత్వ ఉద్యోగులలో ఏర్పడిన అసమ్మతికి ఇది నిదర్శనమన్న భావన ఏర్పడింది. గత జగన్ ప్రభుత్వంలో టీడీపీ, జనసేనలు ప్రభుత్వ టీచర్లను విపరీతంగా రెచ్చగొట్టాయి.ప్రతి నెల మొదటి తేదీకల్లా జీతాలు ఇవ్వడం లేదని, స్కూళ్లలో విద్యార్థులకు అజమాయిషీ బాధ్యతలు అప్పగించి ఇబ్బంది పెడుతున్నారని దుష్ప్రచారం చేశాయి. సీపీఎస్ రద్దు పై పరిశీలన చేస్తామని, డీఏ బకాయిలు ఇస్తామని,.. ఇలా రకరకాల హామీలను గుప్పించారు. విద్యా వ్యవస్థకు జగన్ ప్రభుత్వం ఎంతో గుర్తింపు తెచ్చినా, ఒక ఐఏఎస్ అధికారి కొంత కఠినంగా వ్యవహరించారన్న భావన అప్పట్లో టీచర్లలో ఉండేది. దానివల్ల కూడా అప్పట్లో వైఎస్సార్సీపీకి కొంత నష్టం జరిగింది.శాసనసభ ఎన్నికలలో ఆ మేరకు కూటమి లబ్ది పొందింది. కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత తమకు ఇచ్చిన హామీలు నెరవేరతాయని ఉద్యోగ, ఉపాధ్యాయ వర్గాలు ఆశించాయి. కాని ప్రభుత్వంలో వీరిని పట్టించుకునే వారే లేకుండా పోయారు. పీఆర్సీ ఊసే ఎత్తలేదు. ఇక మధ్యంతర భృతికి ఆస్కారం ఎక్కడ ఉంటుంది? సీపీఎస్ బదులు జగన్ ప్రభుత్వం జీపీఎస్ తీసుకు వస్తే విమర్శలు చేసిన టీడీపీ, జనసేనలు ప్రభుత్వంలోకి వచ్చాక దానినే కొనసాగిస్తున్నాయి. అంతేకాక సూపర్ సిక్స్ పేరుతో ప్రజలను మోసం చేశారన్న భావన ఎటూ ఉంది.రెడ్ బుక్ రాజ్యాంగం అమలు చేస్తూ ఏపీలో కూటమి సాగిస్తున్న విధ్వంసాన్ని, అరాచక పరిస్థితులను టీచర్లు గమనించి కూడా ఈ ఫలితాన్ని ఇచ్చారన్న విశ్లేషణలు వస్తున్నాయి. ఎన్నికలో టీచర్లు తమకు వ్యతిరేకంగా ఓటు వేస్తారని టీడీపీ నేతలు ఊహించలేకపోయారు. అందుకే బహిరంగంగా రఘువర్మకు మద్దతు ప్రకటించడమే కాకుండా మీడియా సమావేశాలు పెట్టి ప్రచారం చేశారు. తీరా ఓటమి చవిచూసిన తర్వాత వెంటనే టీడీపీ గాత్రం మార్చేసింది. గెలిచిన గాదె శ్రీనివాసులు నాయుడు కూడా తమ అభ్యర్ధేనని కొత్త వాదనను తెచ్చింది. మంత్రి అచ్చెన్నాయుడు తాము ఇద్దరు అభ్యర్ధులకు మద్దతు ఇచ్చామని చెప్పగా, శ్రీనివాసులు నాయుడు అలాగా అంటూ వ్యంగ్యంగా వ్యాఖ్యానించి గాలి తీశారు. మరో వైపు కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు కూడా వర్మకు మద్దతుగా చేసిన వీడియోని అంతా చూశారు. దాంతో అచ్చెన్న పరువు పోయినట్లయింది.ఇక ఎల్లో మీడియా కూడా తమ లైన్ మార్చుకున్నాయి. ఎన్నికలకు ముందు పీఆర్టీయూకు చెందిన గాదె, యుటిఎఫ్ అభ్యర్ధి గౌరి పరస్పరం సహకరించుకుని రెండో ప్రాధాన్య ఓటు విషయంలో అవగాహన పెట్టుకున్నారని రాశారు. వీరిద్దరూ కలిసినా తమకు ఎదురు ఉండదని అనుకుని బోల్తా పడ్డారు.అ క్కడికి డబ్బు, తదితర ప్రలోభాలకు తెరదీసినా, ఉత్తరాంధ్రలో టీచర్లు మాత్రం అధికార కూటమికి బుద్ది చెప్పాలని నిర్ణయించుకున్నట్లు ఈ ఫలితం తేల్చింది. రెండు గ్రాడ్యుయేట్ల నియోజకవర్గాలలో కూటమి గెలిచినా, ఉత్తరాంధ్రలో ఓటమి చంద్రబాబును అధికంగా కుంగదీస్తుంది. తన కుమారుడు లోకేష్ విద్యాశాఖ మంత్రిగా ఉండగా టీచర్లు ఈ షాక్ ఇవ్వడం మరీ చికాకు కలిగిస్తుంది.కృష్ణా-గుంటూరు, ఉభయ గోదావరి జిల్లాల్లోని గ్రాడ్యుయేట్ల నియోజకవర్గాలలో టీడీపీ అభ్యర్ధులు ఆలపాటి రాజేంద్రప్రసాద్, పి.రాజశేఖర్ లు గెలవడం కూటమి పాలనకు సర్టిఫికెట్టా అన్న చర్చ రావచ్చు. గ్రాడ్యుయేట్ల నియోజకవర్గంలో కూటమి ప్రభుత్వ తీరుపై అభిప్రాయ వ్యక్తీకరణకన్నా, ఆయా అభ్యర్ధుల ప్రభావం. వారు చేసే కసరత్తు, కుల సమీకరణలు, డబ్బు వ్యయం చేసే వైనం, అధికార దుర్వినియోగం, గొడవలు సృష్టించడం, రిగ్గింగ్ వంటివి ప్రభావం చూపాయన్న భావన ఉంది. పీడీఎఫ్ అభ్యర్ధి కె.ఎస్.లక్ష్మణరావు మాచర్ల ప్రాంతంలో, మరికొన్ని చోట్ల ఎన్నికలలో అక్రమాలు ఎలా జరిగాయో సోదాహరణంగా వివరించారు.వైఎస్సార్ కాంగ్రెస్ అధినేత జగన్ ఈ ఫలితంపై వ్యాఖ్యానిస్తూ శాసనమండలి ఎన్నికలలో సైతం రిగ్గింగ్ చేయించి చంద్రబాబు నాయుడు రికార్డు సృష్టించారని ఎద్దేవ చేశారు. అదే టీచర్ల నియోజకవర్గంలో రిగ్గింగ్ చేయలేకపోయారని ఆయన అభిప్రాయపడ్డారు. డబ్బు ఏ రకంగా పంచారో చెప్పడానికి పిఠాపురంలో బయటకు వచ్చిన వీడియోనే నిదర్శనం. ఆలపాటికి ఉన్నంత ఆర్ధిక వనరు లక్ష్మణరావుకు లేదు. పైగా ఆయన ఆ రకంగా ఖర్చు చేసే వ్యక్తి కూడా కాదు.మాచర్ల, మంగళగిరి వంటి ప్రాంతాలలో కూటమి నేతలు పోలింగ్ స్టేషన్ల వద్ద అలజడి సృష్టించిన విషయం తెలిసిందే. ప్రభుత్వం ఇది తమకు అనుకూల నిర్ణయమని చెప్పుకుంటే చెప్పుకోవచ్చు. కాని వాస్తవం ఏమిటో అందరికి తెలుసు. టీడీపీ అభ్యర్ధులు గెలిచారు కనుక ఇక సూపర్ సిక్స్ ఇవ్వనవసరం లేదని కూటమి ప్రభుత్వం పెద్దలు చెప్పగలుగుతారా? ఎన్నికల ప్రణాళికను అమలు చేసేశామని అంటే జనం ఒప్పుకుంటారా? ప్రస్తుతం ఎమ్మెల్సీగా ఉన్న కె.ఎస్.లక్ష్మణరావుకు మంచిపేరే ఉంది. వామపక్షాల మద్దతు ఉంది.వైఎస్సార్సీపీ నేరుగా మద్దతు ప్రకటించకపోవడం ఒక మైనస్. కానీ ఎల్లో మీడియా ఆంధ్రజ్యోతిలో మాత్రం వైఎస్సార్సీపీ మద్దతు వల్లే లక్ష్మణరావు ఓడిపోయారని దిక్కుమాలిన రాతలు రాశారు. వైఎస్సార్సీపీ ముద్రతో విద్యావంతులు దూరం అయ్యారని పిచ్చి విశ్లేషణ చేసింది. లక్ష్మణరావుకు ఓటు వేసిన వారు విద్యావంతులు కాదని ఈ పత్రిక చెప్పదలచినట్లుగా ఉంది. పూర్తి స్వార్ధంతో ,పత్రికా విలువను గాలికి వదలి, జర్నలిజాన్ని పచ్చి వ్యాపారంగా మార్చి ఎల్లో మీడియా కథనాలు ఇస్తోందని చెప్పడానికి ఇది ఒక ఉదాహరణ.అలా పిచ్చి రాతలు రాసిన ఎల్లో మీడియా ఉపాధ్యాయ నియోజకవర్గంలో కూటమి ఓటమిని మాత్రం కప్పిపుచ్చే యత్నం చేసింది. వారు చెబుతున్న దాని ప్రకారం ప్రభుత్వ ఉద్యోగులు, టీచర్లలో కూటమి పై తీవ్ర వ్యతిరేకత ఏర్పడినట్లు ఒప్పుకుంటారా? టీడీపీ, జనసేనలు మద్దతు ఇచ్చినందునే రఘువర్మ ఓడిపోయారని కూడా విశ్లేషిస్తారా? గాదెని గెలిపించిన టీచర్లు విద్యావంతులు కాదని ఈ ఎల్లో మీడయా రాసినా ఆశ్చర్యం లేదు. మండలి ఎన్నికల ఫలితాలవల్ల ఇప్పటికిప్పుడు ప్రభుత్వంలో వచ్చే మార్పు పెద్దగా ఉండరు. కాని టీచర్లలో ఏర్పడిన వ్యతిరేకత సమజాంలో ఉన్న అశాంతికి అద్దం పడుతుందని చెప్పవచ్చు.ఉత్తర తెలంగాణలో టీచర్ల నియోజకవర్గంలో పోటీలో ఉన్న ఇద్దరు ముఖ్య అభ్యర్థులు బారీగా డబ్బు వ్యయం చేశారని ప్రచారం జరుగుతోంది. కేంద్ర మంత్రి బండి సంజయ్ ఈ ఎన్నికలో నిజాయితీ గెలిచిందని, మోడీ నాయకత్వానికి మద్దతు లభించిందని చెబితే చెప్పవచ్చు.అది మాట వరసకే తప్ప, ఈ ఎన్నికలలో మోడీ ప్రభావంతోనే ఓట్లు వేయడం, వేయకపోవడం ఉండకపోవచ్చు.ఉత్తర తెలంగాణలో బీజేపీకి ఉన్న బలం వారి అభ్యర్ధి మల్క కొమరయ్య, అంజిరెడ్డిల గెలుపునకు ఉపకరించి ఉండవచ్చు. పార్లమెంటు, అసెంబ్లీ ఎన్నికలలో ఈ ప్రాంతంలోనే బీజేపీకి అధిక సీట్లు వచ్చాయి. గ్రాడ్యుయేట్ల నియోజకవర్గానికి ఇంతకుముందు సీనియర్ కాంగ్రెస్ నేత జీవన్ రెడ్డి ప్రాతినిథ్యంవహించారు. ఈసారి ఆయన పోటీ చేయలేదు.ఈ నేపథ్యంలో ఇక్కడ కాంగ్రెస్ అభ్యర్ధి నరేంద్ర రెడ్డి ఓడిపోవడం, బీజేపీ అభ్యర్ధి అంజిరెడ్డి గెలవడం కచ్చితంగా కాంగ్రెస్ కు షాక్ వంటిదే. ఇది ప్రభుత్వంపై ఉన్న అసంతృప్తిని కనబరుస్తుందన్న అభిప్రాయం ఏర్పడుతుంది. దీనిని సరిదిద్దుకోకపోతే రేవంత్ నాయకత్వానికి కష్టాలు వచ్చే అవకాశం ఉంటుంది.- కొమ్మినేని శ్రీనివాస రావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత. -
Chandrababu: వృద్ధనారీ పతివ్రత
చంద్రబాబు అప్పుడూ ఇప్పుడూ ఎప్పుడూ ఒకేలా ఉన్నారు.. అందితే జుత్తు..అందకపోతే కాళ్ళు పట్టుకోవడంలో ఆయన మాస్టర్ డిగ్రీ చేశారు. రాజకీయంగా తనకు అవసరమైనవాళ్లను మాత్రమే దగ్గర ఉంచుకుని ఒక్కోమెట్టు పైకెక్కిన అయన తనకు అవసరం లేనివాళ్లను తొక్కుకుంటూ ముందుకు వెళ్లారు. ఎవరి అండదండలు తన ఎదుగుదలకు నిచ్చెనమెట్లుమాదిరి ఉపయోగపడ్డాయో.. పైకెక్కక ఏవ్ నిచ్చెనను విరిచేసి మూలపెట్టేశారు . డెబ్బై ఐదేళ్ల వయసులో చంద్రబాబులో పరివర్తన వచ్చిందో... ఇంకా వైరం ఎందుకని అనుకున్నారోకానీ చరమాంకంలో అయన తన తోడల్లుడు డాక్టర్ దగ్గుబాటి వెంకటేశ్వర రావును పొగడ్తలతో ముంచెత్తారు. చంద్రబాబు పెద్దల్లుడిగా దగ్గుబాటి ఆనాడు కేబినెట్లో చక్రం తిప్పుతున్న రోజులవి. వాస్తవానికి చదువు.. కుటుంబం.. సామాజిక హోదా విషయంలో వెంకటేశ్వర రావు అన్నిటిట్లోనూ చంద్రబాబు కన్నా పైమెట్టులో ఉంటారు. అయినా రాజకీయంలో మాత్రం అయన వెనుకబడ్డారు.. ముఖ్యంగా ఎన్టీయారును పదవినుంచి తొలగించే సమయంలో తోడల్లుడు దగ్గుబాటిని ఒక మెట్టుగా వాడుకుని తనకు ఒక కంఫర్ట్ పొజిషన్ ఎమ్మెల్యేల సమీకరణ అంతా తాను తన మద్దతుదారులైన మీడియా సంస్థలు సహాయంతో సానుకూలంగా సాగిపోగానే నెమ్మదిగా దగ్గుబాటిని సైడ్ చేయడం మొదలు పెట్టారు.. ఆ తరువాత తాను ఫోన్ చేసినా చంద్రబాబు లిఫ్ట్ చేయలేదని దగ్గుబాటి చెప్పుకున్నారు. ఆ తరువాతి పరిణామాల్లో చంద్రబాబు తెలుగుదేశాన్ని తన గుప్పెట్లో పెట్టుకుని తనకు పోటీ అనుకున్నవాళ్లను. సమర్థత.. పార్టీలో గౌరవం గుర్తింపు ఉన్న దగ్గుబాటివంటి వారిని వారంతట వాళ్ళే పార్టీనుంచి వెళ్లిపోయేలా చేసారు.. ఇదంతా గతం.. కానీ ఇప్పుడు ఇద్దరూ వృద్ధులయ్యారు.ఇప్పుడు దగ్గుబాటి నుంచి ముప్పు లేదుగాదగ్గుబాటి వెంకటేశ్వర రావు మొదటినుంచి మంచి అవగాహన ఉన్న వ్యక్తి.. జాతీయ అంతర్జాతీయ సామాజికాంశాలు గమనించి పుస్తకాలూ రాయడం అయన హాబీ కమ్ వ్యసనం.. ఆ క్రమంలోనే "ప్రపంచ చరిత్ర' పుస్తకాన్ని ఆవిష్కరించిన సందర్భంగా చంద్రబాబుకు తోడల్లుడు దగ్గుబాటిలో ఎన్నో సుగుణాలు కనిపించాయి. బిజీగా ఉండే దగ్గుబాటి వంటి వ్యక్తి రిటైర్ అయ్యాక జీవితం ఎలా గడుపుతున్నారో తెలుసుకున్నాను.. నేనూ రిటైర్మెంట్ కు సిద్ధం అవుతున్నాను అన్నారు.. అంతేకాకుండా వెంకటేశ్వర రావుతో తనకు వైరం ఉందని అందరూ అనుకుంటారు అంటూనే.. ఒకప్పుడు చాలా వైరం ఉండేదని. ఇప్పుడు లేదని.. తామంతా కలిసిపోయామని కవరింగ్ ఇచ్చారు. ఇప్పుడు తామంతా ఒకటే అని చెప్పేందుకు తాపత్రయ పడ్డారు.. అవును ఇప్పుడు మీరంతా ఒక్కటే .. తెలుగుదేశాన్ని క్యాడర్ ను పార్టీ నిధులను కొట్టేసి. తోడల్లుడిని ఆనాడు తొక్కేసి తనకు ఎవరూ పోటీ కారాదని అంతా నీ గుప్పెట్లోకి తెచ్చుకున్నావు.. ఇప్పుడు నీకు ఎదురులేదు కాబట్టి.. ఇప్పుడు దగ్గుబాటి మీకు మళ్ళీ బంధువయ్యాడు.. ఇప్పుడు కూడా అయన మళ్ళీ పార్టీలో యాక్టివ్ అయితే.... నీకు పోటీ వస్తాడనిపిస్తే మళ్ళీ తొక్కేయడానికి ఏమాత్రం సందేహించవు అని సగటు టిడిపి కార్యకర్త లోలోన గొణుక్కుంటున్నాడు..- సిమ్మాదిరప్పన్న -
గురువుకే పంగనామాలు పెట్టే పనిలో వర్మ..!
సాక్షి ప్రతినిధి, కాకినాడ: నిన్న మొన్నటి వరకు ఆ ఇద్దరూ గురుశిష్యులని గొప్పగా చెప్పుకునే వారు. రాజకీయాల్లో విడదీయలేని దశాబ్దాల బంధం వారిది. గురువు చెప్పినట్టు శిష్యుడు నడుచుకోవడమే తప్ప ఎదురు ప్రశ్నించిన రోజే లేదు. అటువంటి గురుశిష్యులు పెద్దల సభలో చోటు కోసం తలోదారి వెతుక్కుంటున్నారు. ఎమ్మెల్యే కోటాలో ఎన్నికై న ఎమ్మెల్సీల పదవీకాలం ముగిసిపోతున్న నేపథ్యంలో ఎన్నికల కమిషన్ ఈ స్థానాల ఎన్నికకు షెడ్యూల్‌ను విడుదల చేసింది. ఫలితంగా కూటమిలో ఎమ్మెల్సీ ఆశావహులు పైరవీలకు తెరతీశారు. ఐదు ఎమ్మెల్సీ స్థానాలలో(MLC Elections) ఉమ్మడి తూర్పుగోదావరికి ఒక్క స్థానం దక్కే అవకాశం కనిపిస్తోంది. ఇందుకోసం ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో తెలుగుదేశం, జనసేన, బీజేపీల నుంచి ఆశావహులు క్యూలో ఉన్నారు. ప్రస్తుత ఎమ్మెల్సీ, టీడీపీ సీనియర్ నాయకుడైన యనమల రామకృష్ణుడు(Yanamala Rama Krishnudu)తన స్థానాన్ని తిరిగి పునరుద్ధరించుకోవాలనే ప్రయత్నాలు షురూ చేశారు. ఖాళీ అవుతోన్న ఐదు ఎమ్మెల్సీ స్థానాల్లో యనమల ఖాళీ చేసే స్థానం కూడా ఒకటి కావడం గమనార్హం. తెలుగుదేశం పార్టీలో పార్టీ సీనియర్ అయిన యనమల రామకృష్ణుడు, పిఠాపురం మాజీ ఎమ్మెల్యే ఎస్వీఎస్ వర్మ(SVSN Varma), పిల్లి అనంతలక్ష్మి, బీజేపీ నుంచి రాజమహేంద్రవరానికి చెందిన సోము వీర్రాజు తదితరులు ఎమ్మెల్సీ స్థానాన్ని ఆశిస్తున్నారు. జనసేన నుంచి ఉప ముఖ్యమంత్రి పవన్‌కల్యాణ్(Pawan Kalyan) సోదరుడైన నాగబాబుకు ఎమ్మెల్సీ ఇస్తారంటున్నారు. ఆయన మంత్రివర్గంలోకి తీసుకుంటామని నెలన్నర క్రితం స్వయంగా ముఖ్యమంత్రి చంద్రబాబే(Chandrababu Naidu) ప్రకటించారు. ఫలితంగా నాగబాబుకు ఎమ్మెల్సీ, మంత్రి కావడం ఖాయమనుకుని సామాజిక మాధ్యమాల్లో జనసేన శ్రేణులు హల్చల్ చేశాయి. కానీ చంద్రబాబు, పవన్ కల్యాణ్ భేటీలో నాగబాబుకు రాష్ట్ర స్థాయి కార్పొరేషన్ చైర్మన్ ఇవ్వాలనే నిర్ణయానికి వచ్చినట్టు తాజాగా తెరమీదకు వచ్చిన సమాచారం. ఇదే విషయం టీడీపీ అనుకూల మీడియాలో విస్తృతంగా జరుగుతోన్న ప్రచారంతో నాగబాబుకు ఇక ఎమ్మెల్సీ లేదనే నిర్ధారణకు పార్టీ వర్గాలు వచ్చేశాయి.ఈ పరిస్థితుల్లో ఉమ్మడి తూర్పున తెలుగుదేశంపార్టీ(TDP) ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ కోసం గట్టి పట్టుబడుతోంది. ఈ స్థానం కోసం నిన్నమొన్నటి వరకు చెట్టపట్టాలేసుకు తిరిగిన గురు, శిష్యులు యనమల, వర్మ ఎవరి ప్రయత్నాల్లో వారున్నారు. చంద్రబాబు తరువాత అంతటి ప్రాధాన్యం కలిగిన నేతగా టీడీపీలో రామకృష్ణుడుకు పేరుంది. జనసేన, కమలనాధులతో కలిసి కూటమిగా టీడీపీ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చి తొమ్మిది నెలలవుతోంది. అయినా వీసమెత్తు గుర్తింపు, హోదా దక్కలేదని టీడీపీ సీనియర్ నేత యనమల అంతర్మథనం చెందుతున్నారు. నాలుగు దశాబ్దాల రాజకీయ జీవితంలో పార్టీలో ఇంతలా ప్రాధాన్యం లేని రోజులు ఎప్పుడూ చూడలేదనే ఆవేదన అనుచరవర్గం బాహాటంగానే వ్యక్తం చేస్తోంది. తునిలో వరుస పరాజయాలతో ప్రజాక్షేత్రానికి దూరమైన యనమలను పార్టీ అధిష్టానం ఎమ్మెల్సీని చేసింది. కూటమి గద్దె నెక్కడంతో సీనియర్‌గా తన సేవలు కేబినెట్లో వినియోగించుకుంటారను కున్నా ఆ ఆశలు కూడా ఆవిరైపోయిన సంగతి విదితమే. వాస్తవానికి ఇవేమీ కాకున్నా రాజ్యసభకు వెళ్లాలనేది యనమల చిరకాల వాంఛ. సీనియర్‌నైన తనను పక్కనబెట్టి ఎవరెవరినో రాజ్యసభకు పంపిన దగ్గర నుంచి యనమల తీవ్ర అంతర్మథనం చెందుతున్నారని పార్టీ వర్గాల మధ్య చర్చ నడుస్తోంది. ఇటువంటి తరుణంలో పదవీకాలం ముగిసిపోతున్న ఎమ్మెల్సీ స్థానాన్ని పునరుద్ధరిస్తారని యనమల అనుచరవర్గం లెక్కలేసుకుంటోంది. కుమార్తె దివ్యకు తుని అసెంబ్లీ, వియ్యంకుడైన పుట్టా సుధాకర్‌యాదవ్‌కు మైదుకూరు అసెంబ్లీ, ఒక అల్లుడు పుట్టా మహేష్‌కుమార్‌కు ఏలూరు ఎంపీ..ఇలా యనమల కుటుంబంలో మూడు కీలక పదవులు అనుభవిస్తున్న పరిస్థితుల్లో రామకృష్ణుడును ఎమ్మెల్సీ కొనసాగించడం కష్టమేనంటున్నారు. నాలుగు దశాబ్దాల పాటు పార్టీలో క్రియాశీలకంగా వ్యవహరించిన యనమల ఎమ్మెల్సీ చాన్స్ కోసం గట్టి ప్రయత్నమే చేస్తున్నారంటున్నారు. కానీ చాన్స్ మాత్రం తక్కువనే ప్రచారం పార్టీలో జరుగుతోంది.టీడీపీలో యనమల శిష్యుడిగా చెప్పుకునే పిఠాపురం మాజీ ఎమ్మెల్యే ఎస్వీఎస్ వర్మ ఈసారి గట్టి ప్రయత్నమే చేస్తున్నారు. యనమల మాట జవదాటరని పార్టీ నేతలు చెప్పుకునే దానికి భిన్నంగా గురువుకే పంగనామాలు పెట్టే పనిలో వర్మ ఉన్నారంటున్నారు. సార్వత్రిక ఎన్నికల్లో పిఠాపురంలో పవన్ కల్యాణ్ కోసం సీటు త్యాగం చేయడమే కాకుండా గెలుపు కోసం అనుచరులంతా పడ్డ కష్టానికి తగిన ఫలం దక్కలేదనేది వర్మ ఆవేదన. పిఠాపురం సీటు త్యాగం చేసినందుకు కూటమి అధికారంలోకి వచ్చాక తొలి ఎమ్మెల్సీ వర్మకేనని చంద్రబాబు సార్వత్రిక ఎన్నికలకు ముందు ప్రకటించారు. కూటమి గద్దె నెక్కాక వచ్చిన తొలి ఎమ్మెల్సీ అవకాశాన్ని రాకుండా పవన్ అండ్ కో మోకాలడ్డిందని వర్మ అనుచరులు బాహాటంగానే ప్రచారం చేశారు. రెండు పర్యాయాలు వచ్చిన అవకాశాన్ని ఎగరేసుకుపోయిన పరిస్థితుల్లో ఈసారి ఎట్టి పరిస్థితుల్లో చేజార్చుకోకూడదనే ప్రయత్నాల్లో వర్మ ఉన్నారు. ఈసారి ఎమ్మెల్సీ దక్కించుకోకపోతే జిల్లాలోనే కాకుండా చివరకు పిఠాపురంలో అనుచరుల వద్ద తలెత్తుకు తిరిగే పరిస్థితి ఉండదనే ఆందోళన చెందుతున్నారని సమాచారం. ఈ నేపథ్యంలోనే చినబాబు ద్వారా వర్మ గట్టి లాబీయింగ్ చేస్తున్నారని అనుచరులు చెబుతున్నారు. పదవుల పందేరంలో చాణక్య నీతిని ప్రదర్శించే టీడీపీలో ఉద్దండుడైన గురువు యనమలకు కాకుండా వర్మకు అవకాశం దక్కుతుందా అని కొందర సందేహం వ్యక్తం చేస్తున్నారు. గురుశిష్యుల్లో చివరకు చాన్స్ ఎవరికి దక్కుతుందో వేచి చూడాల్సిందే! -
తమ్ముడికి శుభాకాంక్షలు.. పవన్‌పై అంబటి రాంబాబు సెటైర్లు
సాక్షి, తాడేపల్లి: జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్‌పై వైఎస్సార్సీపీ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబు సెటైర్లు వేశారు. ‘‘అన్నను దొడ్డిదారిన మంత్రివర్గంలోకి తీసుకురావడంలో ఘన విజయం సాధించిన తమ్ముడికి శుభాకాంక్షలు అంటూ ట్వీట్ చేశారు.కాగా, శాసనసభ్యుల కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో జనసేన అభ్యర్థిగా కొణిదెల నాగబాబు పేరును ఆ పార్టీ అధ్యక్షుడు పవన్‌కళ్యాణ్ ఖరారు చేశారు. ఈ మేరకు బుధవారం జనసేన పార్టీ కేంద్ర కార్యాలయం ఒక ప్రకటన విడుదల చేసింది. ‘నాగబాబు జనసేన రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా పార్టీకి సేవలందిస్తున్నారు. ఎమ్మెల్సీ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేయాలని నాగబాబుకు పార్టీ సమాచారం ఇచ్చింది. పార్టీ పరంగా కూడా నామినేషన్‌కు అవసరమైన పత్రాలు సిద్ధం చేయాలని పవన్‌కళ్యాణ్ ఆదేశించారు.’ అని తెలిపింది. కాగా, ఎమ్మెల్యే కోటాలో ఐదు ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు నిర్వహిస్తున్న విషయం తెలిసిందే.అయితే, నాగబాబుకు మంత్రి పదవి ఇవ్వడంపై టీడీపీలో కొందరు అసంతృప్తితో ఉన్నట్లు సమాచారం. గతంలో కూడా సోషల్ మీడియా వేదికగా నాగబాబును విపరీతంగా ట్రోల్ చేసిన సంగతి తెలిసిందే.. పదేళ్లుగా ప్రత్యక్ష ఎన్నికల్లో గెలవని వ్యక్తిని.. ఇలా ఎమ్మెల్సీ కోటాలో మంత్రిని చేయడం ఏంటంటూ పోస్టులు పెట్టారు. గతంలో నారా లోకేష్‌ను టార్గెట్ చేసుకుని నాగబాబు చేసిన పోస్టులను కూడా కొందరు ప్రస్తావిస్తున్నారు. ఆ పోస్టుల వెనుక.. మంత్రి నారా లోకేష్ ఉన్నాడనే చర్చ కూడా నడిచింది.2024 ఎన్నికల కోసం టీడీపీ-జనసేన-బీజేపీ పొత్తుగా వెళ్లాయి. ఆ టైంలో అనకాపల్లి ఎంపీ పోటీ కోసం నాగబాబు తెర వెనుక ప్రయత్నాలు చేసినప్పటికీ.. పొత్తు అడ్డం వచ్చింది. అసెంబ్లీ సీటు కోసం ప్రయత్నించినా అదీ కుదరలేదు. ఏపీ ఎన్నికల ఫలితాలు వెలువడి ఒక్కరోజు గడవకముందే.. టీటీడీ బోర్డు చైర్మన్ పదవి మెగా బ్రదర్‌కే అంటూ ఓ ప్రచారం నడిచింది. కానీ, చంద్రబాబు దాన్ని కూడా లాగేసుకున్నారు. ఆపై ఖాళీ అయిన మూడు రాజ్యసభ సీట్లలో ఒకటి నాగబాబుకే దక్కవచ్చనే చర్చా నడిచింది. అది జరగలేదు. మొత్తం మీద తమ్ముడి సాయంతో నాగబాబు త్వరలో ఏపీకి మంత్రి కాబోతున్నారమాట.. అన్నను దొడ్డిదారిన మంత్రివర్గంలోకి తీసుకురావడంలో ఘన విజయం సాధించిన తమ్ముడికి శుభాకాంక్షలు!@NagaBabuOffl @PawanKalyan— Ambati Rambabu (@AmbatiRambabu) March 6, 2025 -
శాసనమండలిలో వైఎస్సార్సీపీ వర్సెస్ టీడీపీ
👉బడ్జెట్‌పై చర్చలో ఎమ్మెల్సీ వరుదు కళ్యాణి ప్రసంగాన్ని అడ్డుకున్న మంత్రులు👉రెండున్నర కోట్ల మంది మహిళలు మోసపోయారు👉తల్లికివందనం లబ్ధిదారులను వంచన చేశారు👉అన్నదాతలకు వెన్నుపోటు పొడిచారు👉నిరుద్యోగ భ్రుతిని భ్రాంతికి కలిగించారు👉మహిళల మాన ప్రాణాల్ని పణంగా పెట్టి ఈ బడ్జెట్ ని రూపొందించారు👉ఇది బాహుబలి బడ్జెట్ కాదు.. కట్టప్ప బడ్జెట్👉హామీలను నమ్మి ఓట్లేసిన ప్రజలను కట్టప్పలా వెన్నుపోటు పొడిచారు👉మేడిపండులా ఈ బడ్జెట్ ఉంది👉టీడీపీ నేతలు ఎన్నికల ముందు ఇచ్చిన బాండ్లను ఇప్పుడు ప్రజల్లోకి తీసుకుని వెళ్లగలరా..?👉ఎన్నికల్లో వచ్చేది బాబే...ఇచ్చేది బాబే అన్నారు...👉బాబు వచ్చారు.. ఏమిచ్చారు..👉మద్యం అమ్మకాలను పెంచుతామని బడ్జెట్ లో చెప్పడం దారుణం👉ఎమ్మెల్సీ వరుదు కళ్యాణి ప్రసంగాన్ని అడ్డుకున్న మంత్రులు బాల వీరాంజనేయ స్వామి, అనిత👉మద్యం కోసం మాట్లాడే అర్హత లేదంటూ మంత్రి బాలవీరాంజనేయులు వ్యాఖ్యలు👉ఎన్టీఆర్ తెచ్చిన మద్య నిషేధం ఎత్తేసింది చంద్రబాబు కాదా..? అంటూ కౌంటర్ ఇచ్చిన వరుదు కళ్యాణి👉మద్యం అమ్మకాలను పెంచి ఆదాయం పెంచుతామని చెప్పడం దారుణం👉25 శాతం అమ్మకాలు పెంచి ఆదాయం పెంచుతామనడం దారుణం కాదా..?👉మద్యం ద్వారా 27 వేల కోట్ల ఆదాయం పెంచుతామనడం సమంజస మేనా..?👉ఆడబిడ్డ నిధి, , ఉచిత బస్సు , తల్లికివందనం, 50 ఏళ్లకే పెన్షన్ పథకానికి నిధులు ఎగనామం పెట్టారు👉తొమ్మిది నెలల్లోనే 1.35 లక్షల కోట్ల అప్పు చేసిన ఈ ప్రభుత్వానిదే ఆర్థిక విధ్వంసం👉మండలిలో వైఎస్సార్ కాంగ్రెస్ వాయిదా తీర్మానం👉ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలకు 50 ఏళ్లకే పెన్షన్ మంజూరు హామీపై చర్చించాలని వాయిదా తీర్మానం👉చంద్రబాబు మోసాలను శాసన మండలిలో ఎండగడుతున్న వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీలు 👉మండలి సాక్షిగా ఆడుదాం ఆంధ్రాపై టీడీపీ అబద్ధపు ప్రచారం గుట్టురట్టు👉ఆడుదాం ఆంధ్రాలో ఎలాంటి అక్రమాలు జరగలేదని శాసన మండలిలో కూటమి సర్కార్ ప్రకటన👉తల్లికి వందనంపై పచ్చి దగా.. మండలి సాక్షిగా అడ్డంగా దొరికిపోయిన లోకేష్👉వైఎస్సార్సీపీ సభ్యుల ప్రశ్నతో తల్లికి వందనంపై మంత్రి నారా లోకేష్ తప్పుడు లెక్కలు విడుదల చేసి అడ్డంగా దొరికిపోయారు👉అన్నదాతలను పట్టించుకోని కూటమి సర్కార్..👉పంటలు పండక, పండినవాటికి మద్దతు ధర లేక అన్నదాతలు ఇబ్బంది పడుతుంటే ప్రభుత్వం పట్టించుకోలేదని వైఎస్సార్సీపీ ఆగ్రహం👉నిన్న (బుధవారం) అధికార, ప్రతిపక్ష పార్టీల మధ్య వాడివేడి చర్చ నడిచింది.👉2014–19 మధ్య రైతులను రుణమాఫీ పేరిట వంచించారు👉అన్నదాత సుఖీభవను అర్హులైన అందరికీ అందించాలి👉సర్కారు వైఖరికి నిరసనగా వైఎస్సార్సీపీ వాకౌట్ -
Nara Lokesh: నారా లోకేష్ వింత వ్యాఖ్యలు
కందకు లేని దురద కత్తిపీటకు రావడం.. గజ్జికి లేని దురద జాలిమ్ లోషన్ కు రావడం అంటే ఇదే కావచ్చు. వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి.. డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ మీద చేసిన కామెంట్లకు.. రావాల్సిన వారి నుంచి స్పందన రాలేదు. కానీ మంత్రి నారా లోకేష్ బాబు మాత్రం సత్వరమే స్పందించారు. అంతేకాకుండా ఎవరు ఎవర్ని విమర్శించాలన్నదాని మీద ఓ కొత్త రూల్ తీసుకొచ్చారు. ఎన్నికల్లో ఎవరికీ తక్కువ మెజారిటీ ఉంటె వాళ్ళు ఎక్కువ మెజారిటీ ఉన్నవాళ్లను విమర్శించరాదని కొత్త కాన్సెప్ట్ ను తెరమీదకు తెచ్చారు. బుధవారం జగన్ ప్రెస్మీట్లో మాట్లాడుతూ.. ‘‘రెండు చోట్లా ఓడిపోయి .. దిక్కూదివాణం లేక మూడు పార్టీల పొత్తుతో గెలిచాడు.. అయన కార్పొరేటరుకు ఎక్కువ .. ఎమ్మెల్యేకు తక్కువ’’ అని పవన్‌ను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. అయితే ఈ అంశానికి సంబంధించి పవన్ నుంచి ఎలాంటి సమాధానం.. కౌంటర్ రాలేదు.. కానీ ఆ పార్టీ మంత్రి నాదెండ్ల మనోహర్ మాత్రం పవన్‌ను డిఫెండ్ చేస్తూ ఏదో రిప్లై ఇచ్చారు. ఇక జనసేన కన్నా ఎక్కువగా లోకేష్ లైన్లోకి వచ్చేసారు. చంద్రబాబు ప్రమాణ స్వీకారం సమయంలో లోకేష్ ఏకంగా పవన్ కాళ్లకు నమస్కారం చేసారు. పవన్ లేకుంటే.. బీజేపీ మద్దతు లేకుంటే తమకు ఈ అధికారం దక్కేది కాదని తెలుగుదేశంలో అందరికీ తెలుసు. అందుకే వాళ్ళు ఓ వైపు పవన్‌ను కంట్రోల్ చేస్తూ ఆయనకు స్వేచ్ఛ లేకుండా నియంత్రిస్తూనే మరోవైపు పవన్‌ను డిఫెండ్ చేయడం కూడా తమదే బాధ్యత అన్నట్లుగా లోకేష్ పెద్దరికం తీసుకుంటున్నారు.ఈ సందర్భంగా లోకేష్ మాట్లాడుతూ.. ‘‘ఏయ్ జగన్.. నీ మెజారిటీ ఎంత.. పవన్ మెజారిటీ ఎంత.. నీకన్నా పవన్‌కు ఎక్కువ మెజారిటీ వచ్చింది. అలాంటి నువ్వు ఆయన్ను విమర్శిస్తావా? అన్నారు. రాజకీయ విమర్శలకు మెజారిటీతో ముడిపెట్టి మాట్లాడడం సరికొత్త కాన్సెప్ట్.. లోకేష్ చెప్పినదానిప్రకారం పవన్ మెజారిటీ 70,279. కాగా జగన్ మెజారిటీ 61,687.. ఇక్కడ జగన్ కు పవన్ కన్నా తక్కువ మెజారిటీ కాబట్టి అయన పవన్‌ను విమర్శించకూడదు.. మరి ఈలెక్కన చంద్రబాబు 48,000 మెజారిటీతో గెలిచారు.. ఇది జగన్ కన్నా తక్కువే మెజారిటీ .. ఇప్పుడు లోకేష్ కొత్త కాన్సెప్ట్ ప్రకారం చంద్రబాబు కూడా తనకన్నా ఎక్కువ మెజారిటీ వచ్చిన జగన్‌ను విమర్శించడం.. అవహేళన చేయడం కూడా తగదు కదా!.. ఇంకా లెక్కవేస్తే గతంలో వైఎస్ జగన్ ఎంపీగా గెలిచినా మెజారిటీ ఒక రికార్డ్.. కడప ఎంపీ స్థానానికి 2011 లో జరిగిన ఉప ఎన్నికల్లో జగన్ ఇండిపెండెంట్ గా పోటీ చేసి 5,43,053 ఓట్ల మెజారిటీతో గెలిచారు.. ఇది రాష్ట్ర చరిత్రలోనే రికార్డ్. తెలుగుదేశంలో ఎవరూ ఇంత భారీ ప్రజామద్దతు పొందలేదు. తన అద్దె అన్నయ్యను కాపాడుకోవడం.. మద్దతు ఇవ్వడం ద్వారా అభిమానాన్ని పొందాలన్న దుగ్ధతో లోకేష్ కొత్తకొత్త కాన్సెప్టులు తీసుకొస్తున్నారని ప్రజలు భావిస్తున్నారు.:::సిమ్మాదిరప్పన్న -
సూపర్ 6కు గుండు సున్నా: వైఎస్ జగన్
సాక్షి, అమరావతి: ‘టీడీపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ప్రవేశపెట్టిన రెండు బడ్జెట్లను గమనిస్తే అన్ని వర్గాల ప్రజలకు సీఎం చంద్రబాబు అన్ని రకాలుగా చేసిన మోసం ప్రస్ఫుటంగా కనిపిస్తోంది. ఎన్నికల ముందు బాబు ష్యూరిటీ భవిష్యత్తు గ్యారంటీ.. ఎన్నికల తర్వాత బాబు ష్యూరిటీ మోసం గ్యారంటీ.. అన్నది తేటతెల్లమవుతోంది’ అని వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ధ్వజమెత్తారు. ‘ఎన్నికల ముందు చంద్రబాబు చెప్పిన సూపర్ సిక్స్ హామీల అమలుకే ఏడాదికి రూ.79,867 కోట్లు అవసరం. కానీ నవంబర్‌లో ప్రవేశపెట్టిన తొలి బడ్జెట్లో సూపర్ సిక్స్ హామీల అమలుకు రూ.7,282 కోట్లే కేటాయించారు. అందులోనూ కేవలం రూ.865 కోట్లు మాత్రమే వ్యయం చేసి అన్ని వర్గాల ప్రజలను మోసం చేశారు’ అని మండిపడ్డారు. 2025–26 బడ్జెట్లో సూపర్ సిక్స్ హామీల అమలుకు రూ.17,179 కోట్లు మాత్రమే కేటాయించి ఎంతమందికి కోతలు విధిస్తారు? అని నిలదీశారు. తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో వైఎస్ జగన్ బుధవారం మీడియాతో మాట్లాడుతూ కాగ్ నివేదిక, బడ్జెట్ డాక్యుమెంట్లు, యూడీఐఎస్ఈ, పెట్రోలియం శాఖ నివేదికలు, సామాజిక ఆర్థిక సర్వే, గణాంకాలు, ఆధారాలతో చంద్రబాబు చేస్తున్న మోసాలను ఎండగట్టారు. ‘చంద్రబాబు అధికారంలోకి వచ్చాక రాష్ట్ర సొంత ఆదాయం తగ్గింది. మూలధన వ్యయం కూడా దారుణంగా పడిపోయింది. కానీ.. జీఎస్డీపీ (రాష్ట్ర స్థూల ఉత్పత్తి) 12.94 శాతం నమోదు అయ్యిందని చంద్రబాబు చెబుతున్నాడు. రాష్ట్ర సొంత ఆదాయం తగ్గితే జీఎస్డీపీ పెరగడం ఎలా సాధ్యం?’ అని సూటిగా ప్రశ్నించారు. ఈ ఏడాది రూ.3,22,359 కోట్లతో ప్రవేశపెట్టిన బడ్జెట్ అంకెల గారడీ కాదా? అంటూ కడిగిపారేశారు. మీడియాతో మాట్లాడుతూ వైఎస్ జగన్ ఏమన్నారంటే..భృతి లేదు.. ఉద్యోగాలు లేవుయువతకు 20 లక్షల ఉద్యోగాలు ఇస్తామని సూపర్ సిక్స్‌లో హామీ ఇచ్చారు. ఆ ఉద్యోగాలు వచ్చేదాకా నెలకు రూ.3 వేల చొప్పున నిరుద్యోగ భృతి ఇస్తామన్నారు. మరి నిరుద్యోగ భృతి కింద ఒక్కొక్కరికి నెలకు రూ.3 వేల చొప్పున 20 లక్షల మందికి ఏడాదికి రూ.7,200 కోట్లు అవసరం. గతేడాది బడ్జెట్లో నిరుద్యోగ భృతి ప్రస్తావనే లేదు. పోనీ ఈ ఏడాది బడ్జెట్లోనైనా ఉందా అంటే అదీ లేదు. అసెంబ్లీలో ఎమ్మెల్యేలకు పంపిణీ చేసిన గవర్నర్ ప్రసంగం తెలుగు ప్రతుల్లో తొమ్మిది నెలల్లోనే 4 లక్షల ఉద్యోగాలు ఇచ్చేశామని స్పష్టంగా ముద్రించారు. (గవర్నర్ ప్రసంగం ప్రతిని చదివి వినిపించారు) ‘ఇప్పటివరకు రూ.6.5 లక్షల కోట్లు పెట్టుబడులు పెట్టారు. 4 లక్షల మందికి ఉపాధి అవకాశాలు కల్పించబడినది’ అని అందులో స్పష్టంగా ఉంది. ఈ మోసాలు ఇంతటితో ఆగలేదు. అసెంబ్లీలో విడుదల చేసిన సామాజిక ఆర్థిక సర్వేలో ఎంఎస్ఎంఈల రంగంలో 2024–25కి సంబంధించి 27,07,752 ఉద్యోగాలు ఇచ్చేశామని చెప్పారు. నిరుద్యోగ భృతికి బడ్జెట్లో ఎలాంటి కేటాయింపులు జరపకుండా లక్షల ఉద్యోగాలు ఇచ్చేశామని చెప్పడం పచ్చి మోసం. చంద్రబాబు నిరుద్యోగులకు గతేడాది రూ.36 వేలు చొప్పున ఎగ్గొట్టారు. ఈ ఏడాది కూడా మరో రూ.36 వేలు చొప్పున ఎగనామం పెడుతున్నారు. ప్రతీ నిరుద్యోగికి రూ.72వేలు బకాయి పెట్టి మోసం, దగా, వంచన చేశారు. నిరుద్యోగ భృతి లేదు. ఉద్యోగాలూ లేవు. ఉన్న ఉద్యోగాలే ఊడబెరుకుతున్నారు.ఆధార్ కార్డులతో సహా చెబుతాం...వైఎస్సార్సీపీ హయాంలో తొలి నాలుగు నెలల్లోనే ఏకంగా 1.30 లక్షల శాశ్వత ఉద్యోగాలను గ్రామ, వార్డు, సచివాలయాల్లో కల్పించాం. మరో 2.66 లక్షల మంది వలంటీర్లను నియమించాం. ఆప్కాస్ ద్వారా 96 వేల ఉద్యోగాలు కల్పించాం. పే స్లిప్‌లు, ఆధార్ నంబర్లతో సహా ఎవరెవరికి ఉద్యోగాలు ఇచ్చామో చెప్పగలుగుతాం. ఆర్టీసీ విలీనం ద్వారా 58 వేల మంది ఉద్యోగులకు మేలు చేశాం. కాంట్రాక్టు, గవర్నమెంట్ ఉద్యోగాలన్నీ కలిపితే వైఎస్సార్సీపీ హయాంలో ఐదేళ్లలో 6,31,310 మందికి ఉద్యోగాలిచ్చాం. చంద్రబాబు సర్కారు తొలి బడ్జెట్ సందర్భంగా విడుదల చేసిన 2023–24 సామాజిక ఆర్థిక సర్వేలో కూడా లార్జ్ అండ్ మెగా ఇండస్ట్రీస్ (భారీ పరిశ్రమలు)లో 1.02 లక్షల మందికి, ఎంఎస్ఎంఈ రంగంలో 32,79,970 మందికి వైఎస్సార్సీపీ పాలనలో ఉద్యోగాలు ఇచ్చినట్లు స్పష్టంగా ఉంది. గవర్నమెంట్, లార్జ్ అండ్ మెగా, ఎంఎంఎస్ఈ రంగాలలో 40,13,552 మందికి ఉద్యోగాలు ఇచ్చామని మేం ఆధార్ కార్డులతో సహా చెప్పగలుగుతాం. ఉద్యోగాలు కల్పించే విషయంలో ఏ ప్రభుత్వం నిజాయితీ, చిత్తశుద్ధితో పనిచేస్తోందో చెప్పేందుకు ఇదే నిదర్శనం.అదేమైనా బాబు సొమ్మా..?చిత్తూరు జిల్లా గంగాధర నెల్లూరులో.. అందరూ చూస్తుండగా బహిరంగ సభలో.. ‘వైఎస్సార్సీపీ వాళ్లకు ఏ పథకాలూ ఇవ్వొద్దు.. ఏ పనులూ చేయొద్దు..’ అని చంద్రబాబు మాట్లాడారు. అసలు ఇవ్వడానికి... ఇవ్వకపోవడానికి ఇది బాబు గారి సొమ్మా? ప్రభుత్వానికి చంద్రబాబు కేవలం ధర్మకర్త (కస్టోడియన్) మాత్రమే. ప్రభుత్వం నడిచేది ప్రజల కోసం... ప్రజల సొమ్ముతో నడుస్తోంది. ఇదే పెద్దమనిషి.. ప్రమాణ స్వీకారం చేసినప్పుడు చేసిన ప్రమాణం ఏమిటి? పక్షపాతానికి, రాగద్వేషాలకు అతీతంగా పరిపాలన చేస్తానని రాజ్యాంగబద్ధంగా ప్రమాణం చేశాడు. ఇప్పుడిలా బాహాటంగా, బహిరంగ సభలో మాట్లాడుతున్నాడు. చంద్రబాబు మాటలు, నా మాటలను వింటున్న జడ్జీలు, గవర్నర్ ఆలోచించాలి. ఇలాంటి వ్యక్తిని ముఖ్యమంత్రి స్థానంలో కొనసాగించడం ధర్మమేనా? ఇలాంటి వ్యక్తులు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి పరిపాలన చేయడం ఏ రాష్ట్రానికైనా శ్రేయస్కరమా? - వైఎస్ జగన్ పారిశ్రామికవేత్తలకు బెదిరింపులు..చంద్రబాబు ఉద్యోగాలను కల్పించకపోగా పారిశ్రామికవేత్తలను బెదరగొట్టి పంపిస్తున్నారు. కడపలో స్టీల్ ప్లాంట్ ఏర్పాటుకు ముందుకొచ్చిన సజ్జన్ జిందాల్‌ను బెదరగొట్టి పంపేశారు. అరవిందో వాళ్లను బెదిరించి పంపుతున్నారు. పారిశ్రామికవేత్తలు పరిశ్రమలు పెట్టేందుకు భయపడే పరిస్థితి తెచ్చారు. అన్నదాత సుఖీభవ.. ద్రోహం..వైఎస్ జగన్ రైతు భరోసా కింద పీఎం కిసాన్ కలిపి ఇస్తున్నారని, తాను పీఎం కిసాన్ కాకుండా ప్రతి రైతుకు రూ.20 వేలు చొప్పున ఇస్తానని చంద్రబాబు ప్రతి మీటింగ్‌లోనూ నమ్మబలికారు. అన్నదాతా సుఖీభవ కింద 53,58,266 మంది రైతులకు ఏటా రూ.20 వేల చొప్పున రూ.10,717 కోట్లు కేటాయించాలి. తొలి ఏడాది బడ్జెట్లో రూ.1,000 కోట్లు మాత్రమే కేటాయించి అది కూడా ఒక్కరికీ రూపాయి కూడా ఇవ్వలేదు. ఇప్పుడు రెండో బడ్జెట్లో రూ.6,300 కోట్లు కేటాయించారు. ఎలాగూ ఇచ్చేది లేదు.. చచ్చేది లేదు..! మోసం చేయడమే..! అన్నట్లుగా ఉంది చంద్రబాబు తీరు! ఇప్పటికే ప్రతీ రైతుకు రూ.20 వేలు బాకీ పడ్డారు. రెండో ఏడాది మరో రూ.20 వేలు అంటే మొత్తం రూ.40 వేలు ఎగనామం పెట్టాడు, బాకీ పెట్టాడు. అయినా మోసాలు చంద్రబాబుకు కొత్తకాదు. 2014 ఎన్నికల్లో రూ.87,612 కోట్ల వ్యవసాయ రుణాలు మాఫీ చేస్తానని, బ్యాంకుల్లో తనఖా పెట్టిన బంగారాన్ని విడిపించి ఇస్తానని హామీ ఇచ్చి దగా చేశారు. వడ్డీలకు కూడా సరిపోని విధంగా రూ.15 వేల కోట్లు మాత్రమే విదిల్చి, నాడు ఎలా ఓడిపోయాడో చూశాం. మళ్లీ ఈరోజు అదే పద్ధతిలో రైతులను మోసగిస్తున్నారు.వెలగని ‘దీపం’.. రాష్ట్రంలో 1.59 కోట్ల యాక్టివ్ డొమెస్టిక్ గ్యాస్ కనెక్షన్లున్నాయి. వీళ్లందరికి దీపం పథకం కింద 3 సిలెండర్లు ఇవ్వాలంటే ఏడాదికి రూ.4 వేల కోట్లు అవసరం. తొలి ఏడాది బడ్జెట్లో రూ.865 కోట్లే కేటాయించారు. అంటే మూడు సిలెండర్లు ఒక సిలెండర్‌కు తీసుకొచ్చారు. పోనీ అందరికి ఇచ్చాడా అంటే అదీ లేదు. ఇక ఈ బడ్జెట్లో కేటాయించింది కేవలం రూ.2,600 కోట్లు మాత్రమే. ఎలాగూ ఎగరగొట్టేదే కాబట్టి నామ్‌కే వాస్తేగా చేస్తున్నారు.50 ఏళ్లకే పెన్షన్ పేరుతో మోసం..చంద్రబాబు ఇచ్చిన మరో ముఖ్యమైన హామీ.. 50 ఏళ్లు నిండిన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ మహిళలకు పింఛన్! నీకు రూ.48 వేలు.. నీకు రూ.48 వేలు అన్నారు. వారికి పింఛన్ ఇవ్వాలంటే లబ్ధిదారులు మరో 20 లక్షలు అదనంగా పెరుగుతారు. 20 లక్షల మందికి ఒక్కొక్కరికి నెలకు రూ.4వేల చొప్పున లెక్కిస్తే ఏడాదికి రూ.9,600 కోట్లు కేటాయించాలి. తొలి ఏడాది రూ.9,600 కోట్లు ఎగ్గొట్టారు. ఈ ఏడాదీ కూడా అంతే. 50 ఏళ్లు నిండిన ప్రతి మహిళకు గతేడాది రూ.48 వేలు ఎగనామం పెట్టాడు. ఈ ఏడాది మరో రూ.48 వేలు ఎగనామం పెట్టారు. అంటే రూ.96 వేల చొప్పున ఎగ్గొట్టడం ఈ పథకం పేరుతో జరిగిన మోసం!పెన్షన్ల బడ్జెట్లో రూ.5 వేల కోట్లు కోత..మా ప్రభుత్వం అధికారంలో ఉండగా, ఎన్నికల కోడ్ నాటికి 66,34,372 పెన్షన్లు ఉంటే ఈరోజు చంద్రబాబు పాలనలో ఏకంగా 62,10,969కి తగ్గిపోయాయి. ఈ పది నెలల కాలంలో 4,23,403 ఫించన్లు కోత పెట్టారు. కొత్తగా ఒక్క పెన్షన్ కూడా ఇవ్వలేదు. 62,10,969 పెన్షన్లకే రూ.32 వేల కోట్లు ఖర్చు చేయాల్సి ఉండగా, ఈ ఏడాది బడ్జెట్లో రూ.27 వేల కోట్లు మాత్రమే కేటాయించి, రూ.5వేల కోట్లు కోత వేశారు. పెన్షన్ కేటాయింపులు పెరగాల్సింది పోయి తగ్గుతూ ఉన్నాయి.చెప్పేవన్నీ అబద్ధాలు.. చేసేదంతా మోసాలేగవర్నర్ ప్రసంగం.. బడ్జెట్‌పై చర్చ.. ఏది చూసినా పరనింద, ఆత్మస్తుతి కనిపిస్తాయి. రెండో బడ్జెట్ ప్రవేశపెడుతున్నప్పుడు కూడా ఇంకా జగన్ ఇట్టా.. జగన్ అట్టా.. అంటూ విమర్శలే గానీ సూపర్ సిక్స్ సహా మేనిఫెస్టోలో ఇచ్చిన 143 హామీల విషయం ఏమిటన్నది మాత్రం చెప్పరు. మొదటి ఏడాది బడ్జెట్లోనూ అరకొరే. కేటాయింపులకు పరిమితం. ఇచ్చిందెంత? అని చూస్తే బోడి సున్నా కనిపిస్తుంది. రెండో బడ్జెట్లోనూ అంతే. చెప్పేవన్నీ అబద్ధాలు.. చేసేదంతా మోసాలే. -వైఎస్ జగన్ఆడబిడ్డ నిధికి శూన్యం..ప్రతి మహిళకూ రూ.36 వేలు బాకీఆడబిడ్డ నిధి ద్వారా 18 నుంచి 59 ఏళ్ల లోపు వయసున్న ప్రతి మహిళకు నెలకు రూ.1,500 చొప్పున ఏడాదికి రూ.18 వేలు ఇస్తామని ఇంటింటికి ప్రచారం చేశారు. ఈ పథకం లబ్ధిదారులను తేల్చడానికి రాకెట్ సైన్స్ పరిజ్ఞానం అవసరం లేదు. ఓటర్ల జాబితా మన కళ్లెదుటే ఉంది. 2.07 కోట్ల మంది మహిళలు ఓటు వేశారు. వీరంతా 18 ఏళ్లు నిండిన వాళ్లే. 60 ఏళ్లు పైబడిన వారిని మినహాయిస్తే 1.80 కోట్ల మంది మిగులుతారు. వీరికి ఏడాదికి రూ.18 వేలు చొప్పున ఆడబిడ్డ నిధి కింద డబ్బులు ఇవ్వాలంటే రూ.32,400 కోట్ల కేటాయింపులు చేయాలి. గతేడాది బడ్జెట్లో కేటాయింపులు సున్నా. ఈ ఏడాది బడ్జెట్లోనూ కేటాయింపులు సున్నా. అంటే ప్రతీ మహిళకు చంద్రబాబు రూ.36 వేలు ఎగ్గొట్టారు, బాకీ పడ్డారు!మహిళలు అంతా ఎదురు చూస్తున్నారుమహిళలందరికీ ఉచితంగా బస్సు ప్రయాణ సౌకర్యం కల్పిస్తామని సూపర్ సిక్స్‌లో హామీ ఇచ్చారు. రాయలసీమలో మహిళలు అంతా ఎదురు చూస్తున్నారు..! విశాఖపట్నం వెళ్లి చూసి రావచ్చు కదా..! బాగుంటుందని! కర్నూలు, విజయనగరం, శ్రీకాకుళం, ప్రకాశం, అనంతపురం, నెల్లూరు జిల్లాల మహిళలూ ఎదురు చూస్తున్నారు. విజయవాడ, గుంటూరుకు పొద్దున పోయి సాయంత్రం రావచ్చు కదా.. అని ఎదురు చూస్తున్నారు! అమరావతి కడుతున్నాడు కదా..! ఎలా కడుతున్నాడో చూసి రావచ్చు కదా అని! ఉచిత బస్సు పెడితే ఉచితంగా ప్రయాణం చేయవచ్చు కదా..! విహార యాత్రలకు వెళ్లి రావచ్చు అని ఎదురు చూస్తున్నారు! ఇటువంటి చిన్న హామీని కూడా నెరవేర్చకుండా చంద్రబాబు తన నైజాన్ని చాటుకుంటున్నారు. తొలి ఏడాది ఎగరగొట్టేశారు. ఈ ఏడాదీ ఎగనామమే! ఉచిత బస్సు పేరుతో గత ఏడాది రూ.3,500 కోట్ల మేర మహిళలకు ఎగ్గొట్టారు! ఈ ఏడాది మరో రూ.3,500 కోట్లు కేటాయించ లేదు. ఉచిత బస్సు పుణ్యమాని మహిళలకు ఇప్పటికి రూ.7,000 కోట్లు బకాయి పెట్టారు.తల్లికి వందనం.. దగా..స్కూల్‌కు వెళ్లే ప్రతీ విద్యార్థికి ఏడాదికి రూ.15 వేలు చొప్పున ఇస్తామని చెప్పారు. ఇద్దరు పిల్లలు ఉంటే రూ.30 వేలు, ముగ్గురు ఉంటే రూ.45వేలు, నలుగురు ఉంటే రూ.60 వేలు ఇస్తానన్నాడు. ఎంత మంది పిల్లలు స్కూలుకు వెళితే అంత మందికి రూ.15 వేలు చొప్పున ఇస్తానన్నాడు. ఆ పథకానికి తల్లికి వందనం అనే పేరు కూడా పెట్టాడు. ఎన్నికలప్పుడు చెప్పాడు. సూపర్ సిక్స్‌లో, మేనిఫెస్టోలో పెట్టాడు. తొలి బడ్జెట్లో తల్లికి వందనం పథకానికి రూ.5,386 కోట్లు కేటాయింపులు చేసినట్లు చూపించి ఒక్క రూపాయి కూడా ఎవరికీ ఇవ్వలేదు. ఈ ఏడాది బడ్జెట్ ఇన్ బ్రీఫ్‌లో పథకానికి రూ.9,407 కోట్లు కేటాయించినట్లు చూపారు. బడ్జెట్ డాక్యుమెంట్ డిమాండ్ ఫర్ గ్రాంట్స్‌లో రూ.8,278 కోట్లు కేటాయించినట్లు కనిపిస్తోంది. పిల్లల సంఖ్యపై కలెక్టర్లు పంపిన సమాచారాన్ని ‘యూడీఐఎస్ఈ’ వెబ్సైట్లో ఆప్‌లోడ్ చేస్తారు. జిల్లా పరిధిలో స్కూళ్లు, ఎంతమంది చదువుతున్నారో అందులో స్పష్టంగా ఉంటుంది. దాని ప్రకారం.. ఆంధ్రప్రదేశ్‌లో 1 నుంచి 12వ తరగతి వరకు 87,41,885 మంది పిల్లలు చదువుతున్నారు. ఒక్కొక్కరికి రూ.15 వేల చొప్పున ఇచ్చేందుకు తల్లికి వందనం పథకానికి రూ.13,112 కోట్లు కేటాయించాలి. కానీ.. చంద్రబాబు తొలి ఏడాది బడ్జెట్లో రూ.5,386 కోట్లు కేటాయించారు. అది కూడా ఇవ్వకుండా ఎగనామమే. రెండో బడ్జెట్లోనూ రూ.13,112 కోట్లు ఎక్కడా కనపడదు. ఈ ఒక్క పథకం కిందే ప్రతి పిల్లవాడికి చంద్రబాబు రూ.15 వేలు బాకీ పడ్డారు, ఎగనామం పెట్టారు. ఈ ఏడాది కూడా కలిపితే రూ.30 వేలు బాకీ పడినట్లు అవుతుంది. చిన్న పిల్లలను సైతం చంద్రబాబు వదిలి పెట్టడం లేదు.సూపర్ సిక్స్ హామీల అమలుకు మొత్తంగా ఎంత అవుతుందని లెక్కేసి చూస్తే.. ఏడాదికి రూ.79,867 కోట్లు కేటాయించాలి. కానీ గతేడాది బడ్జెట్లో రూ.7,282 కోట్లే కేటాయించారు. అందులోనూ కేవలం రూ.865 కోట్లు ఖర్చు పెట్టారు. ఇక ఈ ఏడాది బడ్జెట్లో రూ.17,179 కోట్లే కేటాయించారు. అది కూడా ఎలాగూ మోసం చేయడం అనే పద్ధతిలో జరుగుతోంది. బాబు ష్యూరిటీ.. మోసం గ్యారంటీ అనేందుకు ఇదే నిదర్శనం. – వైఎస్ జగన్పలావ్ పోయింది.. బిర్యానీ ఓ మోసం!సూపర్‌సిక్స్ కాకుండా చంద్రబాబు ఇచ్చిన మిగిలిన 143 హామీల పరిస్థితి చూస్తే.. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు 50 ఏళ్లకు పెన్షన్ కట్..! వలంటీర్లకు రూ.10 వేలు జీతం దేవుడెరుగు ఉద్యోగాలు కట్..! పది నెలలు గడిచినా పెట్రోల్, డీజీల్ ధరల తగ్గింపు లేదు. చంద్రన్న బీమా గాలికి పోయింది. డ్వాక్రా సంఘాల సున్నా వడ్డీ రుణాలకు బోడి సున్నా..! ఆటో డ్రైవర్లు, ట్యాక్సీ డ్రైవర్లు, హెవీ లైసెన్స్ ఉన్న టిప్పర్ డ్రైవర్లకు ఏటా రూ.15 వేల సాయం హామీని ఎగ్గొట్టారు. జగన్ వాహన మిత్రకు పోటీగా ఈ హామీని ఇచ్చారు. ఇప్పుడు పలావు పోయింది.. బిర్యానీ ఓ మోసంగా తయారైంది! ముస్లింలకు మైనార్టీ కార్పొరేషన్ ద్వారా వడ్డీ లేకుండా రూ.5 లక్షల రుణాలు ఒక్కరికీ ఇవ్వలేదు. ఇంకా ఎన్నో హామీలిచ్చాడు. -
వైఎస్సార్సీపీలో నూతన నియామకాలు
సాక్షి, తాడేపల్లి: వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు రాష్ట్ర కార్యదర్శులుగా పూల శ్రీనివాసరెడ్డి (సత్యసాయి జిల్లా), కామిరెడ్డి సత్యనారాయణరెడ్డి(తిరుపతి జిల్లా) నియమితులయ్యారు. ఈ మేరకు వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయం బుధవారం ఓ ప్రకటన విడుదల చేసింది. -
రెడ్‌బుక్ రూల్స్‌లో పవన్ వాటా! తిలాపాపం.. తలా పిడికెడు
ఏపీలో ఎవరి మనోభావాలు ఎప్పుడు గాయపడతాయో తెలియడం లేదు. దారిన పోతున్న వాళ్లకు బుర్రలో ఓ ఆలోచన పుడుతుంది.. ఆ వెంటనే పోలీసులకు ఫిర్యాదూ చేస్తారు. సదరు వ్యక్తి టీడీపీ, జనసేనలకు చెందిన వాడైతే.. యాక్షన్ తక్షణం మొదలవుతుంది కూడా. రెడ్‌బుక్ రాజ్యాంగాన్ని అమలు చేసేందుకు ఐపీఎస్ అధికారులుసహా అంతా వాయువేగంతో స్పందిస్తారు. అదే వైఎస్సార్సీపీ వాళ్లు ఫిర్యాదు చేస్తే.. దాన్ని పక్కన పడేయాల్నది రెడ్ బుక్(Red Book) ఆదేశం. ప్రముఖ నటుడు, రాజకీయాలకు దూరంగా ఉంటున్న పోసాని కృష్ణ మురళీ విషయంలో ఇదే జరిగింది. ఎప్పుడో 2017లో పోసాని తనకు ఇచ్చిన నంది అవార్డును తిరస్కరిస్తూ చేసిన కొన్ని వ్యాఖ్యలలో ఒకటి, రెండు కులాల ప్రస్తావన ఉందట. దాన్ని ఆయన 2023లో గుర్తు చేశారట. ఆ విషయం జనసేన నేతగా చెప్పుకుంటున్న మణి అనే వ్యక్తికి సడన్‌గా గుర్తుకొచ్చింది. ఇంకేముంది.. ఫిర్యాదు రెడి.. పోలీసులు హుటాహుటిన హైదరాబాద్ వెళ్లడం.. ఎవరో ఒక బందిపోటును, ఉగ్రవాదిని, తీవ్రమైన నేరాలకు పాల్పడిన వ్యక్తిపట్ల వ్యవహరించినట్లు ఆయన్ను అరెస్టు చేసి 15 గంటలు ప్రయాణించి మరీ తిరుపతి సమీపంలోని రైల్వేకోడూరు వద్ద ఒక పోలీస్ స్టేషన్‌కు తరలించడం... చకచకా జరిగిపోయాయి. అక్కడితో ఆగిపోయిందా.. ఊహూ లేదు. ఒక పెద్ద ఐపీఎస్ అధికారి మిగిలిన కేసులన్నిటిని పక్కన పడేసి మరీ పోసానిని తొమ్మిది గంటలపాటు విచారించారు. ఈ రకమైన ఫిర్యాదు.. వ్యవహారం రెండూ రికార్డు బుక్కులకు ఎక్కేస్తాయి. పక్కాగా! అరవై ఆరేళ్ల పోసానిని హింసించడం ద్వారా పోలీసులు రెడ్ బుక్ సృష్టికర్తలను సంతోషపెట్టి ఉండవచ్చు. కానీ.. ఆత్మ పరిశీలన చేసుకుంటే మాత్రం మనోవేదనకు గురి కాక తప్పదు. పోలీసు అధికారులందరిని తప్పు పట్టడం లేదు.పోసాని మీద పెట్టిన కేసులో సెక్షన్లు చూడండి.. సెక్షన్ 111ను న్యాయాధికారి ఆమోదిస్తే నిందితుడికి బెయిల్ రావడం కూడా కష్టం అవుతుంది. ఈ సెక్షన్ ను పోలీసులు దుర్వినియోగం చేస్తున్నారని పలుమార్లు ఉన్నత న్యాయ స్థానాలు హెచ్చరించాయి కూడా. పోసాని ఒక ప్రముఖ కళాకారుడు. వందకుపైగా సినిమాలకు కథలు, సంభాషణలు రాసి పేరు తెచ్చుకున్న వ్యక్తి. రాజకీయంగా కొంతకాలం ప్రజారాజ్యంలోను, ఆ తర్వాత వైఎస్సార్సీపీ లోనూ ఉన్నారు. కొంత ఆవేశపరుడు కూడా. రాజకీయ ప్రత్యర్థుల ఘాటు విమర్శలకు బదులిచ్చే క్రమంలో తీవ్ర వ్యాఖ్యలు చేసి ఉండవచ్చు. కానీ.. చిత్రంగా ఆయన ఎవరిపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారో వారి మనోభావాలు గాయపడినట్లు ఫిర్యాదులు రాలేదు. వారి అభిమానులో, పార్టీ కార్యకర్తలెవరికో మనోభావాలు గాయపడ్డాయట. దానిపై వారు రాష్ట్ర వ్యాప్తంగా కేసులు పెట్టారు. ఈ నేపథ్యంలో ఈ గొడవలు ఎందుకులే.. అని పోసాని అసలు రాజకీయాల నుంచి తప్పుకున్నట్లు ప్రకటించి, ఇంటికే పరిమితం అయ్యారు. అయినా రెడ్ బుక్ టార్చర్ ఆగదట. ఆ విషయాన్ని ఆ బుక్ సృష్టికర్తలే చెప్పారు. పోసానిపై ఆ కేసులు కాకుండా, మరో కొత్త కేసు పెట్టి అరెస్టు చేశారు. ఆ కేసు వివరాలు చూస్తే ఆశ్చర్యం కలుగుతుంది. 2017లో నంది అవార్డును తిరస్కరించి తన అభిప్రాయాలు చెప్పడం ఏమిటి? దానిపై జనసేన నేత ఎవరికో ఇప్పుడు బాధ కలగడం ఏమిటి? అసలు ఆయనకు ఈ కేసుతో ఏమి సంబందం? అంతేకాదు.. వైఎస్సార్సీపీ సీనియర్ నేత సజ్జల రామకృష్ణారెడ్డి, ఆయన కుమారుడు భార్గవరెడ్డి చెబితే ఆ భాష వాడారని ఎల్లో మీడియాకు లీక్. దీనిని ఎవరైనా నమ్ముతారా? కేవలం వైసీపీ ముఖ్యనేతలను వేధించాలన్న తలంపు కాకపోతే. టీడీపీ, జనసేన, బీజెపి కూటమి కొత్త ట్రెండ్ సృష్టించింది. వచ్చే ఎన్నికలలో కూటమి ఓడిపోయి వైసీపీ అధికారంలోకి వస్తే కేసులు ఎలా పెట్టవచ్చు.. ఒకటికి పది పోలీస్ స్టేషన్ల చుట్టూ ఎలా తిప్పవచ్చు? పిచ్చి కేసులనైనా ఎలా హ్యాండిల్ చేయవచ్చు? ఒక కేసులో బెయిల్ వస్తే, మరో కేసులో ఎలా అరెస్టు చేయవచ్చు? అన్నది నేర్పినట్లుగా ఉంది. రెడ్ బుక్ అంటే ఈ పిచ్చి యవారాలు చేయడమా అన్న భావన కలిగినా మనం చేయగలిగింది లేదు. ఎప్పుడో నంది అవార్డులపై అభిప్రాయాలు వ్యక్తం చేయడం మీద ఒక ఐపీఎస్ అధికారి తొమ్మిది గంటలు విచారణ చేశారంటే ఏమని అనుకోవాలి. కేవలం పోసానిని హింసించడం తప్ప మరొకటి అవుతుందా? పోసాని రిమాండ్ పై తెల్లవారుజాము వరకు గౌరవ న్యాయాదికారి వద్ద వాదనలు జరిగాయి. న్యాయాధికారి ఈ కేసులో సెక్షన్ 111 వర్తించదని చెప్పడం సమంజసంగానే ఉన్నా, ఆ తర్వాత రిమాండ్ కు పంపడం ఎందుకో అర్దం కాదు. ఏడేళ్ల శిక్ష పడే కేసులు అయితేనే రిమాండ్ కు పంపాలన్నది ఉన్నత న్యాయ స్థానం ఇచ్చిన గైడ్ లైన్ అని వైఎస్సార్సీపీ తరపు సీనియర్ న్యాయవాది పొన్నవోలు సుధాకరరెడ్డి చెప్పారు. దానిని గౌరవ కోర్టు పట్టించుకోలేదని ఆయన చెబుతున్నారు. దీనిపై పై ఏమి చేయాలో ఆలోచిస్తున్నామని అన్నారు. లీగల్ పండితుల సంగతేమో కాని, సాధారణ పౌరులకు మాత్రం ఇక్కడే కొన్ని విషయాలు అర్థం కాలేదు.గతంలో.. వైఎస్సార్సీపీ ప్రభుత్వంపైన, ముఖ్యమంత్రి జగన్ పైన, ఆయన కుటుంబంపైన, మంత్రులపైన ఎవరైనా నీచమైన వ్యాఖ్యలు చేసినప్పుడు అరెస్టులు జరిగితే ఆ కేసుల్లో నిందితులలో కొందరిని రిమాండ్ కు పంపకుండా బెయిల్ ఇచ్చి పంపించిన ఘటనలు అనేకం ఉన్నాయి. ఉదాహరణకు ప్రస్తుతం ఎమ్మెల్యేగా ఉన్న బండారు సత్యనారాయణమూర్తి అప్పటి మంత్రి రోజాను ఉద్దేశించి దారుణమైన అవమానకర వ్యాఖ్య చేస్తే పోలీసులు అరెస్టు చేసి కోర్టులో ప్రవేశపెడితే ఆయనకు వెంటనే బెయిల్ లభించింది. మరికొందరి విషయంలోను అలాగే జరిగింది. అంటే ఆనాటి పోలీస్ వ్యవస్థ గట్టి సెక్షన్ల కింద కేసులు పెట్టలేదా? పెట్టినా న్యాయ వ్యవస్థ సీరియస్ గా తీసుకోలేదా? లేక ఆనాటి ప్రతిపక్ష టీడీపీ, ఎల్లో మీడియా చేసిన ప్రచారాల నేపథ్యంలో ఆయా వ్యవస్థలు ఉదాసీనంగా పనిచేశాయా? టీడీపీ లాయర్ల మాదిరి వైఎస్సార్సీపీ లాయర్లు న్యాయ వ్యవస్థను ఒప్పించలేకపోతున్నారా? ఇలా పలు సందేహాలు వస్తాయి. కాని వీటికి సమాధానం ఇప్పట్లో దొరకకపోవచ్చు. ఇదేకాదు. చంద్రబాబు, పవన్ కళ్యాణ్, లోకేష్ లు లేదా మరెవరైనా టీడీపీ నేతలపై అనుచిత వ్యాఖ్యలు చేశారనో, సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారనో ఇబ్బడి ముబ్బడిగా కేసులు పెడుతున్న తీరు కూడా భవిష్యత్తులో ప్రభుత్వాలకు మార్గదర్శకం అయ్యే అవకాశం ఉంది. వారు కూడా తమ నేతలను అవమానించడంతో మనోభావాలు దెబ్బతిన్నాయని రాష్ట్రం అంతటా కేసులు పెట్టవచ్చు. ఒక కేసులో బెయిల్ వస్తే,వెంటనే అదుపులోకి తీసుకుని మరిన్ని స్టేషన్ ల చుట్టూ తిప్పవచ్చు. ఇప్పుడు పోసాని విషయంలో కూడా అలాగే చేస్తున్నారు. ఆయనను రాజంపేట నుంచి నరసరావుపేటలో నమోదైన కేసులో అరెస్టు చేసి అక్కడకు తరలించారు. 16 కేసులు నమోదు చేసినందున ఇంకెన్ని జైళ్లకు తిప్పుతారో చూడాలి. ఆయనకు ఆరోగ్య సమస్య వస్తే దానిని అవహేళన చేసేలా ఒక సీఐ స్థాయి అదికారి మాట్లారంటే, ఈ ప్రభుత్వం ఏ రకంగా పనిచేస్తోందో అర్థం చేసుకోవచ్చు. గతంలో అవినీతి కేసులో చంద్రబాబు అరెస్టు అయితే అప్పటి జగన్ ప్రభుత్వం ఎంత జాగ్రత్తగా చూసుకుంది? ఆయన అనేక అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారని ఏఐజీ ఆస్పత్రి ఇచ్చిన సర్టిఫికెట్ ఆధారంగా బెయిల్ వచ్చింది. కాని చిత్రంగా ఆయన బెయిల్ వచ్చిన వెంటనే గంటల తరబడి ఊరేగింపు చేయగలిగారు. ఇప్పుడు ఆ విషయాలను వైఎస్సార్సీపీ నేతలు ప్రస్తావించి పోసాని విషయంలో ఇంత అమానుషంగా వ్యవహరిస్తారా? అని ప్రశ్నిస్తున్నారు. పోసాని కులాల పేరుతో దూషించారట. ప్రజలలో వర్గ విభేదాలు సృష్టించారట.ఆ కేసు వివరాలు చదివితే ఎవరైనా నమ్ముతారా? ఫలానా కమిటీలో ఫలానా కులం వారే ఉన్నారని చెబితే దూషించడం ఎలా అవుతుందో పోలీసులకే తెలియాలి. దానివల్ల ప్రజలలో వర్గ విభేదాలు వచ్చి ఉంటే అప్పుడే గొడవలు అయి ఉండాలి కదా! ఒకాయన ఢిల్లీలో చెట్టు కింద కూర్చుని కులాలు, మతాల గురించి ప్రస్తావించి దూషణలకు దిగితే.. ఆయనపై కేసు పెడితే భావ స్వేఛ్చ అని, ఇంకేదో అని టీడీపీ, జనసేన వారు, ఎల్లో మీడియా గుండెలు బాదుకున్నారే. పైగా ఆయనకు అధికారంలోకి వచ్చాక మంచి పదవి కూడా ఇచ్చారే. అంతెందుకు చంద్రబాబు, లోకేష్, పవన్ కళ్యాణ్ లు తమ సభలలో దూషణలతో పాటు కొన్నిసార్లు బూతు పదాలు వాడిన వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియాలో కనిపిస్తున్నాయి. అప్పట్లో జగన్ ప్రభుత్వం వాటిని పట్టించుకోకపోవడం తప్పని ఈ అనుభవాలు చెబుతున్నట్లుగా ఉంది. అంతెందుకు.. ప్రధాని మోదీని టెర్రరిస్టు అని, దేశంలోనే ఉండడానికి అర్హుడు కాదని.. ఇంకా అంతకన్నా ఘాటైన వ్యాఖ్యలు 2019 ఎన్నికల సమయంలో చంద్రబాబు చేస్తే బీజేపీ వారి మనోభావాలు ఎందుకు దెబ్బ తినలేదో తెలియదు! అసలు మోదీ మనోభావాలు గాయపడలేదా? ఇక పవన్ కల్యాణ్ తనను తెలుగుదేశం పార్టీవారు ఎన్ని రకాలుగా అవమానించింది స్వయంగా ఆయా సభలలో చెప్పారే. అప్పుడు కూడా జనసేన వారి మనోభావాలకు ఏమీ కాలేదా? మళ్లీ అంతా ఒకటయ్యారే! అలాంటిది నంది అవార్డులపై ఏడేళ్ల క్రితం పోసాని చేసిన వ్యాఖ్యలతో ఏదో జరిగిపోయిందా? కోర్టులలో ఏమవుతుందన్నది వేరే విషయం. కాని ప్రజల కోర్టులో మాత్రం కూటమి ప్రభుత్వం ఇలా అక్రమ కేసులు పెడుతున్నందుకు దోషిగానే ఎప్పటికైనా నిలబడుతుంది. మరో సంగతి చెప్పాలి. పదేళ్లపాటు ఎమ్మెల్యేగా ఉన్న వల్లభనేని వంశీపై ఒక కల్పిత కేసు పెట్టి అరెస్టు చేయడమే కాకుండా, జైలులో మరో మనిషితో సంబంధం ఉండని సెల్లో పెట్టడం దారుణంగా ఉంది. ఇది కూడా కొత్తగా సృష్టించిన చెడు సంప్రదాయంగానే కనిపిస్తుంది. పోసాని, తదితర వైఎస్సార్సీపీ నేతలను ఈ తరహాలో వేధించడం చంద్రబాబు ప్రభుత్వ డైవర్షన్ రాజకీయాలలో భాగమా? లేక లోకేష్ రెడ్ బుక్ లో ఒక ఛాప్టరా? లేక పవన్ కూడా ఆ రెడ్ బుక్‌లో వాటా తీసుకున్నారా? అనేదానిపై రకరకాల విశ్లేషణలు వస్తున్నాయి.శాసనమండలిలో వైసీపీ అడిగిన ప్రశ్నలకు టీడీపీకి సౌండ్ లేకపోవడం, ఫైబర్ నెట్ ఛైర్మన్ జీవీ రెడ్డి రాజీనామా ఉదంతం, పవన్‌ను సంతృప్తిపరచడం ,సూపర్ సిక్స్ హామీల గురించి జనం మాట్లాడుకోకుండా.. ఈ కేసుల గురించి చర్చించుకోవాలనుకోవడం, వైఎస్సార్సీపీని అణగతొక్కడం వంటి లక్ష్యాలతో ప్రభుత్వం ఈ రెడ్ బుక్ ను ప్రయోగిస్తోందన్న భావన వ్యక్తం అవుతోంది. ఈ నేపథ్యంలో వంశీ, పోసాని తదితర బాధిత కుటుంబాలకు వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ నైతిక స్థైర్యం చెప్పడమే కాకుండా, న్యాయపరంగా పూర్తిగా అండగా నిలడడం సబబుగా ఉంది. రాజకీయాలకు దూరంగా ఉంటానని చెప్పిన పోసానిని రెడ్ బుక్ పేరుతో గిల్లీ మరీ తిరిగి రాజకీయ రంగంలోకి తీసుకు వస్తున్నారేమో! ఇప్పటికే వందలు, వేల సంఖ్యలో వైఎస్సార్సీపీ కార్యకర్తలు, నేతలు కూటమి రెడ్ బుక్ వల్ల తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు. కూటమి సర్కార్ ప్రతీకార రాజకీయాలతో వారంతా రాటుతేలి పార్టీకి మరింత గట్టిగా పని చేసేవారుగా తయార అవుతున్నారనిపిస్తోంది. :::కొమ్మినేని శ్రీనివాసరావు,సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత. -
బొత్స Vs అచ్చెన్న: ‘రైతు భరోసా కేంద్రాలకు తాళం వేయలేదా?’
సాక్షి, అమరావతి: ఏపీలో కూటమి ప్రభుత్వానికి రైతుల పట్ల చిత్తశుద్ధి లేదన్నారు మండలి ప్రతిపక్ష నేత ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ. అలాగే, చంద్రబాబు రైతులకు న్యాయం చేస్తారని నమ్మకం లేదని ఘాటు విమర్శలు చేశారు. సభలో ఒకమాట.. బయట ఒకమాట చెబుతున్నారు. రైతులకు మంచి జరగాలన్నదే వైఎస్సార్సీపీ డిమాండ్ అని తెలిపారు.అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా ఈరోజు అన్నదాత సుఖీభవపై మండలిలో చర్చ జరిగింది. ఈ సందర్బంగా శాసనమండలిలో మంత్రి అచ్చెన్నాయుడు వ్యాఖ్యలపై ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ అభ్యంతరం వ్యక్తం చేశారు. అనంతరం, బొత్స మాట్లాడుతూ..‘వ్యవసాయ కుటుంబం నుంచి వచ్చిన మంత్రి అచ్చెన్నాయుడి వ్యాఖ్యలు సరైనవి కాదు. ప్రతీ అంశానికి ఆవు కథ చెప్పడం అలవాటైపోయింది. అన్నదాత సుఖీభవ ఎంతమందికి ఇస్తున్నారో చెప్పమని మేం అడిగాం. రైతుల సమస్యలపై చర్చించమని బీఏసీ మీటింగ్‌లో మేం కోరాం. రైతుల పట్ల మాకు అంకితభావం ఉంది.గత ఐదేళ్లలో రైతులకు మేం చేసిన మేలును నీతి ఆయోగ్ మెచ్చుకుంది. మిగిలిన రాష్ట్రాలు కూడా ఏపీ వ్యవసాయ విధానాలు పాటించాలని సూచించింది. రైతుకు, వ్యవసాయానికి ఉపయోగపడే ప్రతీ అంశాన్ని రైతు భరోసా కేంద్రంలో మేం అందుబాటులో ఉంచాం. కావాలంటే రికార్డులు చూసుకోండి. రైతుభరోసా కేంద్రాలకు ఈ ప్రభుత్వం తాళాలేసింది. గత ఐదేళ్లలో రైతులకు మేం ఏమీ చేయలేదని రివ్యూ చేసి నిరూపించండి.మేం మొత్తం 53 లక్షల మందికి రైతుభరోసా అందించాం. అంత మందికీ మీరు ఇస్తామన్నారు.. ఆ మాటకు కట్టుబడి ఉండండి. బడ్జెట్లో కేటాయింపులు లేకపోయినా రైతులకు సాయం చేయండి.. మేం కోరుకునేది కూడా అదే. రైతులకు మంచి జరగాలన్నదే మా డిమాండ్. రైతుకు ఇన్స్యూరెన్స్ కోసం ట్రస్ట్ ఏర్పాటు చేసి ఇవ్వండి. 2014-19లో రైతులకు రుణమాఫీ చేస్తామని చెప్పి ఎందుకు చేయలేదు?. ఈ ప్రభుత్వానికి రైతుల పట్ల చిత్తశుద్ధి లేదు. రైతులకు న్యాయం చేస్తారని నమ్మకం లేదు. సభలో ఒకమాట.. బయట ఒకమాట చెబుతున్నారు. అధికార పార్టీ సభ్యుల వైఖరిని నిరసిస్తూ ఈ ప్రశ్నకు సభనుంచి వాకౌట్ చేస్తున్నాం’ అని అన్నారు. -
రెండు పక్కలా నేనే కొడతానంటే ఎలా?: వైఎస్ జగన్
గుంటూరు, సాక్షి: వైఎస్సార్సీపీకి ప్రతిపక్ష హోదా ఎట్టి పరిస్థితుల్లో ఇవ్వబోమంటూ స్పీకర్ అయ్యన్నపాత్రుడు చేసిన రూలింగ్‌పై మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి(YS Jagan Mohan Reddy) స్పందించారు. అసెంబ్లీలో రెండే పక్షాలు ఉంటాయని.. అలాంటిది ప్రధాన ప్రతిపక్షాన్ని గుర్తించకపోతే ఎలా? అని ఆయన ప్రశ్నించారు. తాడేపల్లిలో నిర్వహించిన మీడియా సమావేశంలో వైఎస్ జగన్ మాట్లాడుతూ.. అసెంబ్లీలో రెండే పక్షాలు ఉన్నాయి. ఒకటి అధికార పక్షం, ప్రతిపక్షం రెండే ఉంటాయి. ఇంతమంది శాసన సభ్యులు ఉంటేనే ప్రతిపక్ష హోదా ఇస్తాం అని ఎక్కడా రూల్ లేదు. ఢిల్లీలో మూడు స్థానాలు వచ్చిన బీజేపీకి ప్రతిపక్ష హోదా ఇచ్చింది. గతంలో చంద్రబాబు(Chandrababu) అనే ఇదే వ్యక్తికి ప్రతిపక్ష హోదా ఇచ్చాం. టీడీపీ నుంచి ఐదుగురు పక్కన కూర్చున్నా.. ఇంకా పది మందిని మన పార్టీలోకి లాగుదామని మా వాళ్లు చెబితే నేనే వద్దన్నా. అసెంబ్లీలో ఎంతసేపు మాట్లాడతారో మాట్లాడండి.. నేను వింటానని చంద్రబాబుకి చెప్పా. ఇదే ఆయనకు, నాకు ఉన్న తేడా.ప్రతిపక్షంలో ఉన్న వారిని అధికారంలో ఉన్నవారు గుర్తించకపోతే.. ఏం సాధించడం కోసం అసెంబ్లీ నడపడం. ప్రధాన ప్రతిపక్షం మాకు కాకుండా ఇంకెవరికి ఇస్తారు?. ఎవరూ వ్యతిరేకంగా మాట్లాడకూడదు.. ఐదే నిమిషాలు సమయం ఇచ్చి మైక్ కట్ చేస్తామంటే అంటే ఎలా?. లీడర్ ఆఫ్ ద హౌజ్‌కు ఎంతసేపు మైక్ ఇస్తారో.. ప్రతిపక్ష నేతకు కూడా అంతే టైం ఇవ్వాలి. అది ఇవ్వట్లేదు కాబట్టే మీ ద్వారా(మీడియా) ఇలా సుదీర్ఘ సమయం తీసుకుని మోసాలను ప్రజలకు వివరించాల్సిన పరిస్థితి వచ్చింది.మీరే అధికారంలో ఉండి..మీరే ప్రతిపక్షం పాత్ర పోషిస్తారా?. రెండు పక్కలా నేనే కొడతానంటే ఎలా?. ఇదేమైనా డబుల్ యాక్షనా.. ఇదేమన్నా సినిమానా? అని జగన్ అన్నారు. జనసేన ఉండగా.. వైఎస్సార్సీపీకి ఐదేళ్లలో ప్రతిపక్ష హోదా రాదన్న డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్(Pawan Kalyan) వ్యాఖ్యలను మీడియా ప్రతినిధులు ప్రస్తావించగా.. ‘‘ఆయన జీవితకాలంలో ఒక్కసారి ఎమ్మెల్యే అయ్యారు. ఆయన కార్పొరేటర్‌కు ఎక్కువ.. ఎమ్మెల్యేకి తక్కువ’’ అని వైఎస్ జగన్ ఎద్దేవా చేశారు. -
అప్పులపై చంద్రబాబు దుర్మార్గమైన ఆలోచన: వైఎస్ జగన్
గుంటూరు, సాక్షి: లెఫ్ట్&రైట్ అప్పులు చేసే చంద్రబాబు(Chandrababu) ఏపీ అప్పులపై తప్పుడు ప్రచారం చేసి గత వైఎస్సార్సీపీ ప్రభుత్వాన్ని(YSRCP Govt) బద్నాం చేసే ప్రయత్నం చేశారని.. కానీ కాగ్ లెక్కలు ఆ మోసాన్ని బయటపెట్టాయని మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అన్నారు. గురువారం ఆయన తాడేపల్లిలో వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాడారు2014-19కి రూ.4 లక్షల కోట్ల అప్పులు ఉంటే.. 2024 నాటికిరూ.6 లక్షల కోట్ల అప్పు ఉంది. కాగ్ లెక్కలు కూడా ఇదే స్పష్టం చేశాయి. కానీ, రూ. 10 లక్షల కోట్ల అప్పు ఉందని ప్రచారం చేశారు. గవర్నర్ ప్రసంగంలోనూ అబద్ధాలు చెప్పించారు. సాధారణంగా.. బడ్జెట్ గ్లాన్స్(budget Glance)లో పదేళ్ల కిందట అప్పుల లెక్కలు ఉంటాయి. కానీ, లెక్కలు చూపిస్తే ఎక్కడ దొరికిపోతామోనని మొన్నటి బడ్జెట్లో అది చూపించలేదు. అంత దుర్మార్గంగా వ్యవహరించారు చంద్రబాబు.ఎందుకింత అబద్ధాలు.. ఎందుకింత మోసాలు?. చంద్రబాబు విచ్చలవిడిగా అప్పులు చేస్తున్నారు. ఇప్పుడు అమరావతి పేరు మీద అప్పులు చేస్తున్నారు. రాష్ట్రానికి ఆదాయం రావట్లేదు. చంద్రబాబు, ఆయన మనుషుల జేబుళ్లోకి డబ్బులు వెళ్తున్నాయి. ఆర్థికవేత్తల అంచనాకి కూడా అందకుండా చంద్రబాబు ప్రజలపై బాదుడు బాదబోతున్నారు. -
ఎమ్మెల్సీ అభ్యర్థిగా నాగబాబు.. జనసేన ప్రకటన
సాక్షి, విజయవాడ: జనసేన ఎమ్మెల్సీ అభ్యర్థిగా కొణిదెల నాగబాబు పేరును జనసేన ప్రకటించింది. ఏపీలో ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీగా నాగబాబు పేరును జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ ఖరారు చేశారు.ఏపీలో శాసన సభ్యుల కోటాలో నిర్వహించే ఎమ్మెల్సీ ఎన్నికలకు కూటమిలో భాగంగా నాగబాబు పేరును పార్టీ అధ్యక్షుడు పవన్ ఖరారు చేశారు. ఎమ్మెల్సీ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేయాలని నాగబాబుకు సమాచారం ఇచ్చారు. ఈ మేరకు జనసేన ట్విట్టర్ వేదికగా వివరాలను వెల్లడించారు.ఎమ్మెల్సీ అభ్యర్థిగా శ్రీ @NagaBabuOffl గారి పేరు ఖరారు శాసన సభ్యుల కోటాలో నిర్వహించే ఎమ్మెల్సీ ఎన్నికలకు కూటమిలో భాగంగా జనసేన అభ్యర్థిగా శ్రీ కొణిదెల నాగబాబు గారి పేరును పార్టీ అధ్యక్షులు శ్రీ @PawanKalyan గారు ఖరారు చేశారు. పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా శ్రీ నాగబాబు గారు… pic.twitter.com/B4yBXjG96X— JanaSena Party (@JanaSenaParty) March 5, 2025 -
అదేమైనా మీ బాబుగారి సొమ్మా?: వైఎస్ జగన్
గుంటూరు, సాక్షి: వైఎస్సార్సీపీ వాళ్లకు పథకాలు ఇవ్వకూడదని, వాళ్లకు ఇస్తే పాముకు పాలు పోసిట్లేనని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేసిన వ్యాఖ్యలపై మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి మండిపడ్డారు. బుధవారం తాడేపల్లిలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఈ అంశంపై ఆయన మాట్లాడారు.వైఎస్సార్సీపీ(YSRCP) వాళ్లకు సంక్షేమ పథకాలు ఇవ్వకూడదని, ఎలాంటి సాయం చేయకూడదని చంద్రబాబు ప్రకటన చేశారు. ఇవ్వకపోవడానికి అదేమైనా మీ బాబుగారి సొమ్మా?. అది ప్రజల సొమ్ము. ప్రజల సొమ్ముతో ప్రభుత్వం నడుస్తోంది. పక్షపాతానికి, రాగద్వేషాలకు అతీతంగా పాలన చేస్తానని రాజ్యాంగబద్ధంగా ప్రమాణం చేసిన చంద్రబాబు.. ఇలా బహిరంగంగా, నిసిగ్గుగా మాట్లాడతారా?. జడ్జిలుగానీ, గవర్నర్‌గానీ చంద్రబాబు(Chandrababu) లేదంటే నా ఈ వ్యాఖ్యలైనా ఒకసారి చూడాలి. ఇలాంటి వ్యక్తి సీఎంగా అర్హుడేనా?.. ఇలాంటి సీఎం ఏ రాష్ట్రానికైనా శ్రేయస్కరమా?. ఇలాంటి వ్యక్తిని సీఎం స్థానంలో కొనసాగించడం ధర్మమేనా? అని జగన్ ప్రశ్నించారు. -
ఉచిత బస్సు కోసం ఆడబిడ్డలు ఎదురుచూస్తున్నారు: వైఎస్ జగన్
సాక్షి, తాడేపల్లి: హామీల పేరుతో ప్రజలను మోసం చేయడమే చంద్రబాబు నైజమని చెప్పారు వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్. సూపర్ సిక్స్ ఇస్తామని ఒక్క హామీని కూడా నెరవేర్చని వ్యక్తి చంద్రబాబు. చిన్న పథకం మహిళలకు ఉచిత బస్సు కూడా అమలు చేయడం లేదని తెలిపారు.వైఎస్ జగన్ తాడేపల్లిలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. ‘ఉచిత బస్సు కోసం మహిళలంతా ఎదురు చూస్తున్నారు. ఉచిత ప్రయాణాలు ఎప్పుడెప్పుడు చేస్తామా? అని ఆశగా చూస్తున్నారు. రాయలసీమ ఆడబిడ్డలంతా విశాఖ పోదామని అనుకుంటున్నారు. ప్రకాశం, విజయనగరం, శ్రీకాకుళం ఆడబిడ్డలంతా అమరావతి ఎలా కడుతున్నారు? ఎలా ఉందని చూడాలనుకుంటున్నారు. ఎప్పటి నుంచి ఉచిత బస్సు అమలు చేస్తారు. ఇది చిన్న పథకం. అది ఇవ్వడానికి కూడా సాకులు చెబుతున్నారు. ఉచిత బస్సు రూపేణ రూ.7వేల కోట్లు ఎగరగొట్టారు. ఇంతకంటే దారుణం ఉంటుందా? అని ప్రశ్నించారు.అలాగే, రాష్ట్రంలో 18 నుంచి 60 ఏళ్ల మహిళకు సంవత్సరానికి రూ.18 వేలు ఆడబిడ్డ నిధి అన్నారు. దానికి ఎగనామం పెట్టారు. మహిళల సంక్షేమం పేరిట ఈ హామీతో రూ.7 వేల కోట్లు ఎగ్గొట్టారు. స్కూల్‌కి వెళ్లే ప్రతి విద్యార్థికి రూ.15 వేల సాయం అన్నారు. ఎంత మంది ఉంటే అంత మందికి ఇస్తామని అన్నారు. తల్లికి వందనం కోసం మొదటి బడ్జెట్లో రూ. 5,386 కోట్లు కేటాయింపులు చేశారు. ఈసారి నెంబర్ మోసంతో ప్రజలను మభ్య పెడుతున్నారు. ఎలాగూ మోసం చేసేది కదా అని ఇలా చేస్తున్నారు. చివరికి చిన్న పిల్లాడికి కూడా బకాయిలు పెడుతూ.. ఎగనామం పెడుతున్నారు’ అని అన్నారు.