breaking news
-
ఖాతాదారుల హక్కుల పరిరక్షణకే.. ‘మార్గదర్శి’పై దర్యాప్తు
సాక్షి, హైదరాబాద్ : మార్గదర్శి చిట్‌ఫండ్స్ ఖాతాదారుల హక్కుల పరిరక్షణ, ఆర్థిక భద్రత కోసమే ఆ సంస్థలో అక్రమాలను వెలుగులోకి తెస్తున్నామని, అది తమ బాధ్యత అని ఏపీ సీఐడీ అదనపు డీజీ సంజయ్ స్పష్టం చేశారు. మార్గదర్శి యాజమాన్యం నిబంధనలకు విరుద్ధంగా నిధులు మళ్లిస్తుండటంతో ఖాతాదారులకు నష్టం కలగకుండా ఇప్పటికే రూ.1,035 కోట్ల విలువైన ఫిక్స్డ్ డిపాజిట్లు, మ్యూచ్‌వల్ ఫండ్స్ పెట్టుబడులను అటాచ్ చేసినట్టు తెలిపారు. మార్గదర్శి కంపెనీ ఏ కారణంగానైనా మూతపడితే ఖాతాదారులకు డబ్బులు ఇవ్వాల్సిన బాధ్యత స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్స్ శాఖ ఐజీపై ఉంటుందని తెలిపారు. మార్గదర్శి సంస్థ ప్రతి చట్టాన్ని, నిబంధనను అతిక్రమించిందని, ఇంకా అతిక్రమిస్తూనే ఉందని చెప్పారు. నిబంధనలకు విరుద్ధంగా ఉన్న 9 బ్రాంచ్‌లలో 23 గ్రూప్ చిట్స్‌ను, వాటికి సంబంధించి రూ. 604 కోట్ల టర్నోవర్ నిలిపివేసినట్టు చెప్పారు. ఇదే తరహాలో ఏపీ, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడులోని ఇతర బ్రాంచ్‌ల్లోనూ అక్రమాలపై ఆధారాలు లభిస్తే.. వాటిలోని చిట్ గ్రూప్‌ల టర్నోవర్ నిలిచిపోతుందని చెప్పారు. చివరకు మార్గదర్శి పడిపోతుందన్నారు. సంజయ్ మంగళవారం ఇక్కడ నిర్వహించిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. మార్గదర్శి చిట్‌ఫండ్స్‌లో మూడేళ్ల లావాదేవీలను పూర్తిగా పరిశీలించి, అక్రమాలపై ఆధారాలు సేకరించామన్నారు. ఏపీతోపా టు తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల్లోని 108 బ్రాంచ్‌లలో కార్యకలాపాలపై ఆరా తీస్తున్న ట్టు తెలిపారు. ఢిల్లీలోని కేంద్ర ఏజెన్సీలకు కూడా ఈ అక్రమాల సమాచారమిచ్చామని, తెలంగాణ, ఇతర రాష్ట్రాల డీజీపీలకు సమాచారం ఇస్తున్నామన్నారు. ఏపీలో పలు ప్రాంతాల్లో నమోదైన ఎఫ్ఐఆర్లు, స్టాంప్స్ అండ్ రిజి్రస్టేషన్స్ శాఖ ఫిర్యాదు మేరకే ఏపీ సీఐడీ కేసు దర్యాప్తు చేస్తోందని తెలిపారు. పూర్తి నిబంధనలు పాటిస్తూనే ఈ కేసులో ఏ–1 రామోజీరావును, ఏ–2 శైలజాకిరణ్‌ను ప్రశ్నించామన్నారు. వడ్డీ ఆశ చూపి ఖాతాదారులను మభ్యపెడుతున్నారు మార్గదర్శి అక్రమాలపై ఖాతాదారుల నుంచి ఫి ర్యాదు లేకుండానే కేసు దర్యాప్తు చేస్తున్నారంటూ ఒక సెక్షన్ మీడియా ఆరోపణలు చేస్తోందని, ఖాతాదారులకు వడ్డీని ఆశజూపి ఆ సంస్థ నిబంధన లకు విరుద్ధంగా నిధులను మళ్లిస్తుండటాన్ని తాము వెలుగులోకి తెస్తున్నామన్నారు. ప్రజలు మోసపో యి ఫిర్యాదు చేసేకంటే ముందే తాము వారి సొమ్ము కాపాడేందుకు చర్యలు తీసుకుంటున్నామని, ఏ బాధితుడి విషయంలో అయినా ఇదే పద్ధతి అని తెలిపారు. చాక్లెట్ ఇచ్చి బాలికను కిడ్నాప్ చేస్తే.. సమాచారం అందిన వెంటనే పోలీసులు దర్యాప్తు ప్రారంభిస్తారు కానీ, బాధితురాలు ఫిర్యాదు ఇచ్చేవరకు కూర్చోరని.. అదే తరహాలో లక్షల మంది ఖాతాదారుల సొమ్మును కాపాడేందుకు మార్గదర్శిపై దర్యాప్తు చేస్తున్నామని చెప్పారు. ప్రభుత్వ అధికారులుగా ప్రజలకు న్యాయం చేస్తుంటే మార్గదర్శిపై కక్షసాధింపు అంటూ ఆ మీడియాలో దుష్ర్పచారం చేస్తున్నారన్నారు. తమ దర్యాప్తు చట్టానికి లోబడి ఉన్నట్టే.. చిట్‌ఫండ్స్ కంపెనీ నిర్వహణలో రామోజీ సైతం చట్టానికి లోబడి ఉండాలన్నారు. నిబంధనలున్నా.. వారికి అనుకూలంగా వాడారు మార్గదర్శి చిట్‌ఫండ్స్ సంస్థ లావాదేవీలు చిట్‌ఫండ్ యాక్ట్ ప్రకారం కాకుండా రామోజీ, శైలజా కిరణ్ వారికి అనుకూలంగా కంపెనీ యాక్ట్ ప్రకారం చూపు తున్నారని దర్యాప్తులో తేలిందన్నారు. ఇదేమని ప్రశ్నిస్తే.. తమకు ఆ నిబంధనలు వర్తించవన్న తరహాలో సమాధానాలిచ్చారన్నారు. ఖాతాదారుల నుంచి సొమ్ము వసూలుకు చిట్‌ఫండ్స్ చట్టాన్నే వాడుకొంటున్నారని చెప్పారు. ఇదే తరహాలో చీరాలలో రూ. 65 లక్షల డిఫాల్ట్ కేసులో ష్యూరిటీగా ఉన్న వ్యక్తి నుంచి రూ.6 కోట్లు విలువైన ఆస్తిని అటాచ్ చేయించా రని తెలిపారు. ఇలాంటి ఎన్నో అంశాలు దర్యాప్తులో వెలుగులోకి వచ్చాయన్నారు. సంస్థలోని అంతర్గత లుకలుకలు బయటపడతాయనే చిట్‌ఫండ్స్ యాక్ట్ ను అమలు చేయడంలేదన్నారు. చిట్ సెటిల్మెంట్లోనూ నిబంధనలు పాటించడంలేదన్నారు. చిట్ ముగిసిన వారి వివరాలతో, కొన్నింటిలో మానేసిన ఖాతాదారుల పేర్లు వాడి మళ్లీ చిట్లు నడుపుతున్నారని తెలిపారు. చిట్ డబ్బు బ్రాంచ్‌లో లేకపోవడంపై ప్రశ్నిస్తే.. మీరెవరు ప్రశ్నించేందుకు అన్న రీతిలో సమాధానాలు ఇస్తున్నారన్నారు. చట్టానికి వారు సహకరించడం లేదని చెప్పారు. చిట్‌ఫండ్స్ చట్టం అమలు కాకుండా ఏకంగా 26 ఏళ్లు అడ్డుకున్నారు మర్గదర్శి చిట్‌ఫండ్స్ సంస్థను చిట్‌ఫండ్ యాక్ట్ 1982 మేరకు నడపడంలేదని అన్నారు. చిట్‌ఫండ్స్ సొమ్ముతో వేరే వ్యాపారం చేయకూడదన్నారు. చిట్‌ఫండ్ యాక్ట్ ప్రకారమే బ్యాలెన్స్ షీట్లు ఫైల్ చేయాల్సి ఉన్నా.. కంపెనీ యాక్ట్స్ ప్రకారం నడుచుకుంటున్నామని ఈ కేసులో ఏ–2 శైలజాకిరణ్ అవివేకంతో కూడిన సమాధానాలు చెప్పారని తెలిపారు. ఒక గ్రూప్ డబ్బు మరో గ్రూప్‌కు వాడొద్దని చట్టం చెబుతున్నా.. మార్గదర్శి బ్రాంచ్లన్నింటిలోని డబ్బు అక్రమంగా హైదరాబాద్‌లోని కేంద్ర కార్యాలయానికి తరలిస్తున్నట్టు అన్ని ఆధారాలు లభించాయని చెప్పారు. చిట్‌ఫండ్ యాక్ట్ రావడానికి ముందే మార్గదర్శి చిట్‌ఫండ్స్ సంస్థ ప్రారంభమైందన్న వింత వాదన తెస్తున్నారన్నారు. వాస్తవానికి కేంద్ర ప్రభుత్వం 1982లో చిట్‌ఫండ్ యాక్ట్ పాస్ చేస్తే.. దానిని రాష్ట్ర ప్రభుత్వాలు చట్టసభల్లో పాస్ చేయాల్సి ఉందన్నారు. కానీ 26 ఏళ్ల తర్వాత 2008లో అమలు చేశారని, ఇన్నేళ్లూ రామోజీరావు పలుకుబడితో అడ్డుకున్నారని వివరించారు. చదవండి: #MSKPrasad: 'ఐపీఎల్ వల్ల బీసీసీఐకే నష్టం.. ఏపీలో అద్భుత సౌకర్యాలు' -
కూతురిని కిడ్నాప్ చేశారంటూ అల్లుడిపై ఫిర్యాదు
పెనుమంట్ర: విడాకుల కేసు కోర్టులో ఉండగా భార్యను కిడ్నాప్‌చేసి, పుట్టింటి నుంచి తీసుకుపోయిన సంఘటన నెగ్గిపూడి గ్రామంలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. నెగ్గిపూడి గ్రామానికి చెందిన చిర్ల శ్రీనివాసరెడ్డి, కనకలక్ష్మి దంపతులు తెలిపిన వివరాల ప్రకారం తమ రెండో కుమార్తె పూజారెడ్డిని అదే గ్రామానికి చెందిన సత్తి శ్రీరామారెడ్డికి ఇచ్చి 2020లో వివాహం చేశారు. మొదట్లో తమ కుమార్తెను అల్లుడు బాగానే చూసుకున్నాడని, బాబు పుట్టిన అనంతరం వేధింపులకు గురిచేస్తూ, కొట్టేవాడని చెప్పారు. 2022లో పెనుమంట్ర పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదుచేయగా గృహహింస చట్టం కింద పోలీసులు కేసు నమోదు చేశారన్నారు. ప్రస్తుతం కేసు కోర్టులో ఉండగా ఈనెల 17న సాయంత్రం 4 గంటలకు అల్లుడు శ్రీరామారెడ్డి ఇంటికి వచ్చి తమను తిట్టడమే కాకుండా ఇంట్లోనే నిర్భంధించి కుమార్తె, మనవడిని బలవంతంగా తీసుకువెళ్లిపోయాడని చెప్పారు. అనంతరం 100కి ఫోన్ చేస్తే పోలీసుల నుంచి స్పందన లేదని, గాయాలతో సోమవారం ఉదయం పోలీస్ స్టేషన్‌కు వెళ్లామన్నారు. ముందుగా ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లమని పోలీసులు చెప్పడంతో తణుకు ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నట్లు తెలిపారు. ఈ విషయమై పెనుమంట్ర ఎస్సై సురేంద్రకుమార్‌ను సాక్షి వివరణ కోరగా తమకు ఇప్పటివరకు ఎలాంటి ఫిర్యాదు రాలేదని, ఆసుపత్రి నుంచి సమాచారం వస్తే కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తామని తెలిపారు. -
దస్తగిరి అరాచకం... డబ్బు చెల్లించి మీ కొడుకును తీసుకెళ్లండి..
కడప అర్బన్ : మాజీ మంత్రి వైఎస్ వివేకా హత్య కేసులో అప్రూవర్‌గా మారిన షేక్ దస్తగిరి చేస్తున్న అరాచకాలలో మరో సంఘటన పులివెందుల పట్టణంలో చోటుచేసుకుంది. ఈ సంఘటనపై బాధితురాలు షేక్ గులాబి పులివెందుల అర్బన్ పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదు మేరకు వివరాలిలా ఉన్నాయి. ‘నేను నా భర్త గుగూడు వల్లితో కలసి పులివెందుల టౌన్ భాకరాపురం, జయమ్మకాలనీలో ఉంటున్నాం. నా భర్త ట్రాక్టర్ పని చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. నా భర్త మొదటి భార్య 9 ఏళ్ల క్రితం అనారోగ్యంతో చనిపోయింది. నన్ను 8 ఏళ్ల క్రితం గుగూడు వల్లి రెండో వివాహం చేసుకున్నాడు. అయితే మొదటి భార్యకు గూగుడు వల్లి(16), రేష్మా (15) సంతానం కాగా.. నాకు గుగూడు వల్లికి ఇమ్రాన్, చాందినీ అనే ఇద్దరు పిల్లలు ఉన్నారు. అందరం కలసి ఉంటున్నాం. అయితే మా కుటుంబ అవసరాల నిమిత్తం మా ఇంటి సమీపంలో నివాసం ఉంటున్న షేక్ దస్తగిరి దగ్గర ఆరు నెలల క్రితం రూ. 40 వేలు అప్పుగా తీసుకున్నాం. పూచీకత్తుగా ఇంటి పత్రాలను ఇచ్చాము. తరువాత బాకీ డబ్బుకు వడ్డీగా వారానికి రూ. 4 వేలు చొప్పున దస్తగిరికి ఇస్తూ వస్తున్నాం. తర్వాత మధ్యలో కొన్ని వారాలు మేము వడ్డీ కట్టలేకపోయాం. దీంతో అసలుకు వడ్డీతో కలిపి రూ.1,10,000 మాతో ప్రామిసరీ నోటు దస్తగిరి రాయించుకున్నాడు. కాగా డబ్బు ఇవ్వాలని నా భర్తను ఒత్తిడి చేస్తూ వస్తున్నాడు. ఈ నెల 13న డబ్బు చెల్లిస్తామని చెప్పాం.. అయితే సర్దుబాటు కాక చెల్లించలేదు. ఈ క్రమంలో ఈ నెల 17న నేను, నా భర్తతో కలసి బంధువుల ఇంటికి వెళ్లాం. 18వ తేదీ సాయంత్రం దస్తగిరి మాకు ఫోన్ చేసి డబ్బు చెల్లించకుండా ఇంటి నుంచి పారిపోయారు.. మీ కుమారుడు గూగుడు వల్లిని నిర్బంధించాను. డబ్బు చెల్లించి మీ కొడుకును తీసుకెళ్లండి.. లేకపోతే మీ కొడుకును కొడతాం.. అని బెదిరించాడు. నా కొడుకుతో ఫోన్లో మాట్లాడించాడు. ‘నన్ను దస్తగిరి కొడుతున్నాడు..’ అని మా కొడుకు బాధ పడుతున్నాడని.. పైగా దస్తగిరి భార్య షబానా కూడా ఫోన్ చేసి మీ కొడుకుకు ఇప్పటికే ఉదయం.. సాయంత్రం ఒక కోటింగ్ అయిపోందని.. నువ్వు వచ్చి మాట్లాడకపోతే నీ కొడుకు మా చేతిలో చచ్చిపోతాడని బెదిరిస్తున్నారు. నా కుమారుడిని వారు ఏమైనా చేస్తారేమోనని భయంగా ఉంది సార్.. దస్తగిరి, అతని భార్య షబానాపై చర్యలు తీసుకుని, మా కుమారుడిని అప్పగించండి.. సార్.. అంటూ’ గులాబి పోలీసులను వేడుకుంది. ఈ మేరకు పులివెందుల అర్బన్ పోలీసులు దస్తగిరిపై కేసు నమోదు చేశారు. -
హాస్టల్ విద్యార్థినిపై టీడీపీ కార్యకర్త అఘాయిత్యం
మచిలీపట్నం (కోనేరు సెంటర్): కృష్ణా జిల్లా మచిలీపట్నంలో టీడీపీ కార్యకర్త హాస్టల్ విద్యార్థినిపై అఘాయిత్యానికి పాల్పడ్డాడు. ప్రేమ పేరుతో బాలికను పిలిచి.. ఆపై మద్యం తాగించి లైంగిక దాడికి తెగబడ్డాడు. అనంతరం మత్తులో ఉన్న ఆమెను ద్విచక్ర వాహనంపై వసతి గృహం వద్ద వదిలేసి వెళ్లిపోయాడు. మద్యం మత్తులో ఉన్న బాధితురాలి ప్రవర్తనపై అనుమానం వచ్చిన హాస్టల్ సిబ్బంది చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించగా జరిగిన ఘోరం బయటికి పొక్కింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఏలూరు జిల్లా ముదినేపల్లి మండలానికి చెందిన ఓ మైనర్ బాలిక మచిలీపట్నంలోని సోషల్ వెల్ఫేర్ హాస్టల్లో ఉంటూ డిగ్రీ మొదటి సంవత్సరం చదువుతోంది. నాలుగు నెలల క్రితం మచిలీపట్నం మండలం ఎస్ఎన్ గొల్లపాలెం గ్రామానికి చెందిన ఆవుల సతీష్ అనే టీడీపీ కార్యకర్త ఆమెను పరిచయం చేసుకున్నాడు. పెళ్లి చేసుకుంటానని నమ్మించి ప్రేమలో దింపాడు. నాలుగు నెలలుగా యువతిని కళాశాలకు వెళ్లే సమయాల్లో కలుస్తుండటంతో పాటు ఫోన్లో మాట్లాడుతున్నాడు. కాగా.. ఈ నెల 18వ తేదీన సతీష్ ఆ బాలికకు ఫోన్ చేసి ఓసారి కలవాలని చెప్పాడు. అందుకు ఆమె సరేనంది. ఆదివారం భోజనం చేసిన అనంతరం సదరు యువతి హాస్టల్ వార్డెన్‌కు తెలియకుండా బయటికి వెళ్లింది. సతీష్ ఆమెను నగరంలోని విజయ రాఘవ లాడ్జికి తీసుకురమ్మని తన స్నేహితుడైన కళ్యాణ్‌కు బైక్ ఇచ్చి పంపాడు. సతీష్ చెప్పిన విధంగా కళ్యాణ్ రామానాయుడుపేట సెంటర్లో యువతిని బండి ఎక్కించుకుని లాడ్జి వద్ద దింపాడు. యువతి సతీష్ ఉన్న రూంలోకి వెళ్లింది. అప్పటికే మద్యం మత్తులో ఉన్న సతీష్ యువతికి బలవంతంగా మద్యం తాగించాడు. దీంతో యువతి స్పృహ కోల్పోగా.. సతీష్ ఆమెను వివస్త్రను చేసి లైంగిక దాడికి పాల్పడ్డాడు. అనంతరం ఆమెను బైక్‌పై హాస్టల్ వద్ద దింపి వెళ్ళిపోయాడు. మద్యం మత్తులో ఉన్న యువతి ప్రవర్తన వింతగా ఉండటం గమనించిన హాస్టల్ వార్డెన్ ఇతర సిబ్బంది సమీపంలోని సర్వజన ఆస్పత్రికి తీసుకువెళ్ళారు. వైద్య సిబ్బంది ఆమెపై లైంగికదాడి జరిగినట్టు నిర్ధారించటంతో వార్డెన్ యువతిని మందలించింది. మద్యం మత్తు వీడిన అనంతరం విషయం తెలుసుకున్న యువతి సతీష్ తనకు బలవంతంగా తాగించి ఆపై లైంగిక దాడి చేశాడంటూ పోలీసులకు ఫిర్యాదు చేసింది. బాధితురాలి ఫిర్యాదు అందుకున్న సీఐ రవికుమార్ మచిలీపట్నం ఎస్సై వి.వెంకటేశ్వరరావు సతీష్‌ను అదుపులోకి తీసుకున్నారు. అతనిపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. కోర్టుకు హాజరుపరచి రిమాండ్‌కు తరలించారు. కాగా, సతీష్ స్నేహితులైన కళ్యాణ్, మణికంఠ ఆ బాలికను అర్ధనగ్నంగా సెల్ఫోన్లలో వీడియోలు తీసినట్టు తెలుసుకున్న పోలీసులు వారిపైనా చర్యలకు ఉపక్రమించనున్నారు. సమాచారం అందుకున్న సోషల్ వెల్ఫేర్ డీడీ సాహిద్బాబు వసతి గృహానికి చేరుకుని ఘటనపై విచారణ జరిపారు. యువతి హాస్టల్ నుంచి బయటకు వెళ్లిన క్రమంలో అందుకు బాధ్యురాలిని చేస్తూ వార్డెన్ మల్లేశ్వరిని సస్పెండ్ చేసినట్టు డీడీ తెలిపారు. -
Viveka Case : సునీత పిటిషన్ జులై 3కి వాయిదా వేసిన సుప్రీంకోర్టు
సాక్షి, న్యూఢిల్లీ: వైఎస్ వివేకా హత్య కేసులో.. సునీతారెడ్డి పిటిషన్‌పై విచారణను వచ్చే నెల(జులై) 3వ తేదీకి వాయిదా వేసింది సుప్రీంకోర్టు. ఎంపీ అవినాష్‌రెడ్డి ముందస్తు బెయిల్‌ను రద్దు చేయాలంటూ సునీతారెడ్డి వేసిన పిటిషన్‌పై జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ ఎంఎం సుందరేష్ నేతృత్వంలోని బెంచ్ ఇవాళ(జూన్ 19, సోమవారం) విచారణ జరిపింది. సునీత తరపున సీనియర్ న్యాయవాది సిద్ధార్థ లూథ్రా వాదనలు వినిపించారు. ఈ నెలాఖరు (జూన్ 30) కల్లా వివేకా హత్య కేసుపై సిబిఐని దర్యాప్తు పూర్తి చేయమని ఇప్పటికే సుప్రీంకోర్టు గడువు విధించింది. ఈ విషయాన్ని సిద్ధార్థ లూథ్రా న్యాయస్థానానికి గుర్తు చేశారు. ఈ నెలాఖరుతో సిబిఐ దర్యాప్తు గడువు ముగుస్తున్నందున ఎంపీ అవినాష్‌రెడ్డి ముందస్తు బెయిల్‌ను వెంటనే రద్దు చేయాలని కోరారు. అయితే ఈ విజ్ఞప్తిని జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ ఎంఎం సుందరేష్ నేతృత్వంలోని బెంచ్ అంగీకరించలేదు. కేసు విచారణను జులై 3వ తేదీకి వాయిదా వేస్తున్నట్టు ప్రకటించింది. తదుపరి విచారణ కోసం చీఫ్ జస్టిస్ CJI బెంచ్ ముందు లిస్ట్ చేయాలని ఆదేశించింది. అలాగే ఈ కేసులో వాదనలు వినిపించాల్సిందిగా ప్రతివాదులయిన అవినాష్ రెడ్డి, CBIలకు నోటీసులు జారీ చేసింది. Supreme Court is hearing a plea by the daughter of former MP late YS Vivekananda Reddy against a Telangana High Court order granting anticipatory bail to Kadapa MP YS Avinash Reddy in connection with her father's murder.#SupremeCourt #SupremeCourtofIndia pic.twitter.com/Xs5HCAjpXz — Bar & Bench (@barandbench) June 19, 2023 పిటిషన్‌కు కాలం చెల్లే అవకాశం! వివేకా హత్య కేసులో సీబీఐ దర్యాప్తునకు ఈ నెలాఖరు సుప్రీంకోర్టు డెడ్‌లైన్‌గా విధించిన సంగతి తెలిసిందే. అలాగే సునీతా రెడ్డి పిటిషన్ ను జులై 3కు వాయిదా వేసింది. ఈ నేపథ్యంలో.. CBI చార్జిషీట్ దాఖలు చేస్తే గనుక ముందస్తు బెయిల్ రద్దు చేయాలన్న సునీత పిటిషన్ కు కాలం చెల్లిపోయే అవకాశం ఉంది. గత విచారణలో సునీత తీరుపై అసంతృప్తి వివేకా కేసుకు సంబంధించి సీబీఐ విచారణ ఎదుర్కొంటున్న అవినాష్‌రెడ్డికి మే 31వ తేదీన షరతులతో కూడిన ముందస్తు బెయిల్ ఇచ్చింది తెలంగాణ హైకోర్టు. ఈ ఆదేశాల్ని సవాల్ చేస్తూ సునీతారెడ్డి సుప్రీంకోర్టులో ఒక పిటిషన్ వేసింది. గత విచారణ సమయంలో తెలంగాణ హైకోర్టు ఆదేశాలను రద్దు చేయాలంటూ సుప్రీంకోర్టును కోరింది సునీత. అంతే కాదు, హైకోర్టు మినీ ట్రయల్ ను నిర్వహించిందని, తమ వాదనల్లో మెరిట్ పరిశీలించకుండా బెయిల్ ఇచ్చిందని తెలిపింది. దీనిపై సుప్రీంకోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది. అవినాష్ ను అరెస్ట్ చేయించాలన్న తాపత్రయం సునీతలో కనిపిస్తోందని, కేవలం ఇగో క్లాషెస్ కోసం వ్యవహరిస్తున్నట్టు కనిపిస్తోందని మొన్నటి విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. Justice Surya Kant: Returnable on 7th July. Counsel: There is a connected matter. Justice Kant: List before first bench on 3rd July 2023, after getting appropriate orders from CJI. #SupremeCourt #SupremeCourtOfIndia — Live Law (@LiveLawIndia) June 19, 2023 తన వాదనే వినాలి, తాను చెప్పిందే నమ్మాలి అన్నట్టుగా కనిపించిన సునీత తీరు ఆశ్చర్యకరంగా ఉంది. ఏ న్యాయస్థానమయినా.. ఎలాంటి అభియోగాలపైనా అయినా.. వాదనలతో పాటు దానికి సంబంధించిన ఆధారాలను పరిశీలించిన పిమ్మటే నిర్ణయం తీసుకుంటుందన్న విషయాన్ని సునీత విస్మరించినట్టు కనిపించింది. ఇదీ చదవండి: మీ తీరు పంతాలకు పోయినట్టుంది.. సునీతతో సుప్రీంకోర్టు అవినాష్‌రెడ్డి ముందస్తు బెయిల్‌కి కారణం ఇదే.. -
వైఎస్సార్సీపీ ఎంపీటీసీపై హత్యాయత్నం
తిరుపతి రూరల్: తిరుపతి జిల్లా చంద్రగిరి మండలం ఎ. రంగంపేట వైఎస్సార్సీపీ ఎంపీటీసీ సభ్యుడు బోస్‌చంద్రారెడ్డిపై శనివారం రాత్రి కొందరు దుండగులు హత్యాయత్నానికి ప్రయత్నించారు. ఎంపీటీసీ సభ్యుడిని కత్తితో పొడిచేందుకు యత్నించడంతోపాటు అతని కారును కాల్చివేసేందుకు వేసిన పథకం విఫలమైంది. ఈ ఘటనలో కత్తితో సహా ఓ సినీహీరో వద్ద బౌన్సర్‌గా పనిచేసిన వ్యక్తి పట్టుబడ్డాడు. ఓ ప్రైవేటు యూనివర్సిటీ మాజీ పీఆర్వో సతీష్, ఓ సినీ హీరో అభిమాన సంఘం అధ్యక్షుడు సునీల్‌చక్రవర్తి సూచనల మేరకే ఈ ఘటనకు పాల్పడినట్లు పట్టుబడిన వ్యక్తి మీడియాతో చెప్పడం విశేషం. బాధితుడు బోస్‌చంద్రారెడ్డి తెలిపిన వివరాలు.. సతీష్, సునీల్‌చక్రవర్తి గతంలో బోస్‌చంద్రారెడ్డి, రంగంపేట ఉప సర్పంచ్ మౌనిష్రెడ్డితో గొడవపడ్డారు. ఓ భూమి, షాపు విషయంలోనూ ఎంపీటీసీ, ఉప సర్పంచ్‌తో సతీష్, సునీల్‌చక్రవర్తిలు ఘర్షణకు దిగారు. ఈ నేపథ్యంలో బోస్‌చంద్రారెడ్డిపై కక్ష పెంచుకున్న సతీష్, సునీల్‌చక్రవర్తిలు ఓ సినీహీరో వద్ద బౌన్సర్‌గా పనిచేసిన హేమంత్‌తో ఒప్పందం చేసుకున్నారు. దీంతో శనివారం రాత్రి హేమంత్ మరో ఐదుగురు కలిసి రాడ్లు, కత్తులు, పెట్రోల్ బాటిల్స్‌తో మారుతీనగర్‌లోని బోస్‌చంద్రారెడ్డి ఇంటికి వెళ్లారు. కత్తితో దాడి చేసేందుకు ప్రయత్నించి.. జన సంచారం ఉండటంతో ఆఖరి నిమిషంలో పరారయ్యారు. అనంతరం మళ్లీ రాత్రి 11 గంటలకు ఇలానే దాడి చేసేందుకు విఫలయత్నం చేశారు. ఆదివారం వేకువజామున 3 గంటలకు మళ్లీ కత్తులు, రాడ్లు, పెట్రోల్‌తో దాడికి రావడంతో వారిపై బోస్‌చంద్రారెడ్డి అనుచరులు తిరగబడ్డారు. హేమంత్ కత్తితో సహా పట్టుబడగా.. మిగిలినవారు పారిపోయారు. అతన్ని పట్టుకుని విచారించిన బోస్‌చంద్రారెడ్డి వర్గీయులు, రంగంపేటలోనూ మరో బ్యాచ్ ఉన్నారని చెప్పడంతో కారులో అతన్ని ఎక్కించుకుని రంగంపేటకు వచ్చారు. అప్పటికే వారు కూడా పారిపోయారు. ఈ హత్యాయత్నానికి సతీష్ కీలకసూత్రధారి అని, అతనే బోస్‌చంద్రారెడ్డి, మౌనిష్రెడ్డిలపై దాడి చేయమన్నారని, దీనిలో సునీల్‌చక్రవర్తి పాత్ర కూడా ఉందని హేమంత్ మీడియాకు తెలిపాడు. హత్యచేయడం లక్ష్యం కాదని, కారును కాలి్చవేసి భయపెట్టాలని యత్నించినట్టు చెప్పాడు. నిందితులకు సతీష్ ఫోన్‌పే ద్వారా నగదు పంపించడం, అర్ధరాత్రిళ్లు కూడా సునీల్‌చక్రవర్తి ఫోన్లో మాట్లాడుతుండటంతో బాధితులు నిజనిర్ధారణకు వచ్చారు. హేమంత్‌ను చంద్రగిరి పోలీసులకు అప్పగించారు. ఘటన జరిగిన ప్రదేశం తిరుపతి యూనివర్సిటీ పోలీస్‌స్టేషన్ పరిధిలో ఉండటంతో బోస్‌చంద్రారెడ్డి అక్కడే ఫిర్యాదు చేసినట్టు సమాచారం. కాగా, కొన్ని మీడియాల్లో సినీనటులు మోహన్‌బాబు, విష్ణువర్ధన్బాబుపై అసత్య ప్రచారం చేయడాన్ని బోస్‌చంద్రారెడ్డి, మౌనిష్రెడ్డిలు ఖండించారు. చంద్రగిరిలో విలేకరుల సమావేశం పెట్టి జరిగిన ఘటనలతో వారికి ఎలాంటి సంబంధం లేదని, అసత్యప్రచారాలు మానుకోవాలని స్పష్టం చేశారు. నిందితులను కఠినంగా శిక్షించాలని కోరుతూ బోస్‌చంద్రారెడ్డి, మౌనిష్రెడ్డితోపాటు గ్రామస్తులు ధర్నా చేశారు. -
లైంగికదాడి కేసులో 8 మంది అరెస్ట్
నెల్లూరు(క్రైమ్): శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా నెల్లూరులో సంచలనం రేకెత్తించిన యువతిపై లైంగికదాడి కేసులో 8 మంది నిందితులను పోలీసులు ఆదివారం అరెస్ట్ చేశారు. నగర డీఎస్పీ డి.శ్రీని వాసరెడ్డి తన కార్యాలయంలో నిందితుల వివరాలను వెల్లడించారు. శ్రీకాకుళం జిల్లాకు చెందిన ఓ యువతి కోవూరు మండలంలోని ఓ గ్రామంలో నివాసముంటున్న తన అక్క ఇంటికొచ్చింది. ఆమె అక్క గర్భిణి కావడంతో నెల్లూరులోని ఆస్పత్రిలో సిజేరియన్ చేశారు. అక్కకు తోడుగా ఆమె ఆస్పత్రి లో ఉంటున్నారు. ఈ నెల 10న యువతి మందుల కోసం గాంధీబొమ్మ సెంటర్ వద్దకొచ్చింది. నె ల్లూరుకి చెందిన పాతనేరస్తులైన భాను విష్ణువర్ధన్ అలియాస్ లడ్డసాయి, జగదీష్ అలియాస్ డి యోసాయి, యుగంధర్ అలియాస్ యుగి, ఎ.సుజన్‌కృష్ణ అలియాస్ చింటూ ఆమెను బలవంతంగా ఆటోలో ఎక్కించుకుని..కత్తితో బెదిరించి కొండాయపాళెంలోని ఖాళీ స్థలంలో లైంగికదాడి చేశారు. అనంతరం వారి స్నేహితులైన భాను సాయివర్ధన్, షేక్ హుస్సేన్‌బాషా అలియాస్ కేటీఎం, సాయిసాత్విక్, కె.అజయ్, రేవంత్‌లను పిలిపించి వారితో కూడా లైంగికదాడి చేయించారు. యువతి కేకలను గమనించిన స్థానికులు ‘దిశ’కు కాల్ చేశారు. పోలీసులు ఘటన స్థలానికి చేరుకోగా దుండగులు పారి పోయారు. ఘటనాస్థలిలో బైక్‌లను పోలీసులు స్వాధీనం చేసుకుని పోలీసులు కేసు నమోదు చేశారు. బైక్‌లు, ఆటో నంబర్ల ఆధారంగా నిందితులను గుర్తించారు. ఆదివారం గొలగమూడి క్రాస్ రోడ్డు సమీపంలో నిందితుల్లో 8 మందిని అరెస్ట్ చే శారు. డియోసాయి పరారీలో ఉన్నాడు. -
విశాఖ: బాలుడు అనుమానాస్పద మృతి కేసులో కీలక మలుపు
సాక్షి, విశాఖపట్నం: ఐదేళ్ల బాలుడు తేజ అనుమానాస్పద మృతి కేసు కీలక మలుపు తిరిగింది. పెందుర్తి లెండి వనంలోని స్విమ్మింగ్ పూల్ లో బాలుడు మృతి చెందిన తర్వాత ఓనర్ భాను కుమార్‌కు వాచ్మెన్ సత్యనారాయణ సమాచారం ఇచ్చాడు. లెండి వనం నిర్మాణం సమయంలో స్థానిక టీడీపీ నేత బండారి సత్యనారాయణతో కలసి ఓ స్థలం కబ్జాకు యత్నించిన ఓనర్ భాను కుమార్.. లెండి వనం రిసార్ట్‌కి పక్కనే ఉన్న స్థలంపై కన్ను ఉండటంతో బాలుడు మృత దేహాన్ని ఆ స్థలంలో పడేయాలని ఆదేశించాడు. ఓనర్ చెప్పినట్టు ఆ బాలుడు మృత దేహాన్ని రాత్రి సమయంలో ఎవరు చూడకుండా పనస చెట్టు వద్ద వాచ్మెన్ పడేశాడు. ఆ విధంగా మృతదేహం పడేస్తే స్థలం యజమాని తక్కువ రేటుకి అమ్మకం జరుపుతారనే ఆలోచన పన్నినట్లు పోలీసులు గుర్తించారు. ఇప్పటికే వాచ్మెన్పై కేసు నమోదు చేసిన పోలీసులు.. రిసార్ట్ ఓనర్ భానుకుమార్ హైదరాబాద్‌లో ఉండటంతో విశాఖకి రప్పించే ప్రయత్నం పోలీసులు చేస్తున్నారు. -
తాడిపత్రిలో దారుణం.. నిద్రిస్తున్న వారిపై పెట్రోలు పోసి..
సాక్షి, అనంతపురం జిల్లా: తాడిపత్రిలో దారుణం జరిగింది. నిద్రిస్తున్న వారిపై పెట్రోలు పోసి నిప్పుపెట్టారు.. ఈ ఘటనలో దంపతులతో పాటు మరో యువతి తీవ్రంగా గాయపడింది. మద్యం, వివాహేతర సంబంధమే కారణంగా పోలీసులు భావిస్తున్నారు. పారిశ్రామిక వాడలోని శ్రీనిధి నల్ల బండల పాలిష్ పరిశ్రమలో నల్లపురెడ్డి, సరస్వతి దంపతులు కూలీ పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. శనివారం రాత్రి పరిశ్రమ ఆవరణలో మంచంపై నిద్రిస్తున్నారు. అదే ఫ్యాక్టరీలో పని చేసే మల్లికార్జున కుమార్తె పూజిత కూడా వీరి పక్కనే మంచం వేసుకుని నిద్రిస్తోంది. రాత్రి 11.30 గంటల సమయంలో సరస్వతి మరిది రామేశ్వర్‌రెడ్డి నిద్రిస్తున్న నల్లపురెడ్డి, సరస్వతిపై పెట్రోల్ పోశాడు. మెలకువ వచ్చిన సరస్వతి ఏం చేస్తున్నావురా అని అరిచేలోగానే నిప్పంటించాడు. దీంతో వారు తీవ్రంగా గాయపడ్డారు. పక్కనే నిద్రిస్తున్న పూజితకు కూడా మంటలు అంటుకుని చేతులు కాలాయి. తాగుడుకు బానిసైన రామేశ్వర్‌రెడ్డిని రెండు రోజుల క్రితం తాము పద్ధతి మార్చుకోవాలని దండించామని, అది మనసులో ఉంచుకుని ఇలా చేశాడని నల్లపురెడ్డి, సరస్వతి దంపతులు రూరల్ ఎస్ఐ గౌస్ మహ్మద్‌కు వివరించారు. వారి ఫిర్యాదు మేరకు రూరల్ ఎస్ఐ కేసు నమోదు చేసుకున్నారు. సరస్వతి, నల్లపురెడ్డి పరిస్థితి విషమంగా ఉండడంతో అనంతపురం సర్వజనాస్పత్రికి తరలించారు. పూజితకు తాడిపత్రి ప్రభుత్వాసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. చదవండి: బంజారాహిల్స్: మసాజ్ చేస్తూ గొలుసు కొట్టేశారు.. -
హ్యాట్సాఫ్.. ఏపీ పోలీసులు
సింగరాయకొండ : ఏపీ–తమిళనాడు సరిహద్దులోని ఆ ఊరు నేర సామ్రాజ్యానికి అడ్డా.. అది పోలీసులు కూడా ఛేదించలేకపోయిన ఘరానా దొంగల గడ్డ.. అలాంటి చోటుకు మన ఏపీ పోలీసులు ఎంతో ధైర్యసాహసాలతో ప్రాణాలకు తెగించి వెళ్లారు. వెళ్లడమే కాదు.. పద్మవ్యూహంలాంటి ఆ చోర సామ్రాజ్యం నుంచి కరడుగట్టిన ముగ్గురు దొంగల్ని పట్టుకున్నారు. ఇది పసిగట్టిన అక్కడి దొంగల ముఠా సభ్యులు పోలీసులను వెంబడించారు. ఈ ఛేజింగ్‌లో మన పోలీసుల చాకచక్యంతో పైచేయి సాధించి ముగ్గురు నేరస్తుల్ని పట్టుకొచ్చేశారు. క్రైమ్ థ్రిల్లర్‌ని తలపించిన ఈ ఘటన వివరాలు ఏమిటంటే.. ప్రకాశం జిల్లా ఒంగోలు, సింగరాయకొండలో వరుస చోరీలకు పాల్పడిన ముగ్గురు ఘరానా దొంగలను తమిళనాడులోని మింజూరులో ప్రకాశం జిల్లా పోలీసులు వలపన్ని సినీ ఫక్కీలో అదుపులోకి తీసుకున్నారు. విశ్వసనీయ సమాచారం ప్రకారం.. ఈ నెల 11న ప్రకాశం జిల్లా ఒంగోలు టీచర్స్ కాలనీకి చెందిన పోతిరెడ్డి కృష్ణారెడ్డి ఇంట్లో 60 సవర్ల బంగారం, రూ.6 లక్షల నగదు చోరీకి గురైంది. ఈ నెల 12వ తేదీన సింగరాయకొండ పరిధిలోని మూలగుంటపాడులో ముమ్మడిశెట్టి చంద్రశేఖర్ ఇంట్లోకి చొరబడి భారీ చోరీకి పాల్పడ్డారు. ఎస్పీ మల్లికాగర్గ్ ఆదేశాల మేరకు డీఎస్పీ నారాయణస్వామి పర్యవేక్షణలో సింగరాయకొండ సీఐ రంగనాథ్ నేతృత్వంలో ప్రత్యేక బృందం దర్యాప్తు చేపట్టింది. సీసీ టీవీ ఫుటేజీలు ఆధారంగా ఒంగోలు టీచర్స్ కాలనీ, సింగరాయకొండలో చోరీలకు పాల్పడిన ముఠా ఒకటేనని నిర్థారణకు వచ్చారు. ఇదే ముఠా నెల్లూరు, చిత్తూరు జిల్లాల్లోనూ గతంలో దోపిడీలకు పాల్పడినట్టు గుర్తించారు. నేర సామ్రాజ్యంలోకి వెళ్లి మరీ అరెస్ట్? ఈ ముఠా తమిళనాడులోని మింజూరు ప్రాంతానికి చెందినదని గుర్తించిన పోలీసు బృందాలు నిందితుల్ని అదుపులోకి తీసుకునేందుకు పథకం పన్నారు. మింజూరు ప్రాంతం నేర సామ్రాజ్యానికి అడ్డా కావడం.. గతంలో పోలీసులు వీరిని అరెస్ట్ చేసేందుకు వెళ్లిన క్రమంలో దొంగల ముఠాకు చెందిన వ్యక్తులు పోలీసులపై విరుచుకుపడటం వంటి పరిస్థితులు తలెత్తాయి. గతంలో చిత్తూరు, నెల్లూరు జిల్లాల పోలీసులు ఈ ముఠాను పట్టుకునేందుకు ప్రయత్నించి తమవల్ల కాక ఆ ప్రయత్నాన్ని విరమించుకున్నారు. ఈ పరిస్థితుల్ని దృష్టిలో పెట్టుకున్న సింగరాయకొండ సీఐ ఆధ్వర్యంలోని పోలీస్ టీమ్ దొంగలను అదుపులోకి తీసుకునేందుకు రెండు కార్లలో పక్కా ప్రణాళికతో వెళ్లారు. మింజూరు స్టేషన్ మహిళా ఎస్సై సహకారంతో దొంగల కోసం రోజంతా అక్కడ మాటు వేశారు. చివరకు శనివారం తెల్లవారుజామున అందరూ గాఢ నిద్రలో ఆదమరచి నిద్రిస్తున్న సమయంలో ముగ్గురు దొంగలను గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. పోలీసులపైనే దాడికి యత్నం చోరీ సొత్తును రికవరీ చేసే క్రమంలో ఆంధ్రా నుంచి పోలీసులు వచ్చారని తెలుసుకున్న దొంగల ముఠాకు చెందిన కొందరు వ్యక్తులు పోలీసులపై మూకుమ్మడి దాడికి యత్నించినట్టు సమాచారం. అప్పటికే కొంత సొత్తును రికవరీ చేసిన పోలీసులు వెంటనే అప్రమత్తమై నిందితులు ముగ్గుర్ని అదుపులోకి తీసుకుని వెంటనే తాము వచ్చిన వాహనాల్లోనే తిరిగి బయలుదేరారు. ఈ క్రమంలో దొంగల ముఠాకు చెందిన వ్యక్తులు మరో రెండు కార్లులో పోలీసుల్ని వెంబడించినట్టు తెలిసింది. ఆ తరువాత పోలీసుల వాహనాలు హైవేపైకి రావడంతో ముఠా తరఫు వ్యక్తులు వెనుదిరిగినట్టు సమాచారం. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
అమర్నాథ్ హత్యపై టీడీపీ శవరాజకీయం
సాక్షి, ప్రతినిధి, గుంటూరు :రెండు కుటుంబాల మ ధ్య చెలరేగిన ఘర్షణను రాజకీయం చేసి.. తద్వారా రాష్ట్ర ప్రభుత్వంపై బురద జల్లేందుకు టీడీపీ నేతలు చేసిన శవ రాజకీయాలు బెడిసికొట్టాయి. అడుగ డుగునా అడ్డంకులు సృష్టించి లేనిపోని ఆరోపణలు చేద్దామనుకున్న టీడీపీ నేతల ఆటలు సాగలేదు. బాపట్ల జిల్లా చెరుకుపల్లి మండలం ఉప్పాలవారి పాలెంకు చెందిన యువకుడు ఉప్పాల అమర్నాథ్ ను కొందరు వ్యక్తులు కుటుంబ వివాదాల నేపథ్యంలో పెట్రోల్ పోసి తగులబెట్టి హత్యచేసిన విషయం తెలిసిందే. టీడీపీ నేతలు ఈ ఘటనకు రాజకీయ రంగు పులిమే ప్రయత్నం చేశారు. ఇందులో భాగంగా.. అమర్నాథ్ మృతదేహంతో చెరుకుపల్లి సెంటర్లో ధర్నా చేపట్టారు. విద్యార్థి మృతిని తమకు అనుకూలంగా మార్చుకుని అలజడి సృష్టించేందుకు యత్నించారు. కానీ, నిందితులను గంటల వ్యవధిలో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఎంపీ మోపిదేవి అడ్డగింత.. అమర్నాథ్ మృతదేహాన్ని చూసి అతని కుటుంబసభ్యులను పరామర్శించేందుకు వెళ్లిన రాజ్యసభ సభ్యులు మోపిదేవి వెంకటరమణారావును అడ్డుకున్నారు. టీడీపీ స్వార్థ రాజకీయాలను గమ నించిన ఎంపీ మోపిదేవి ప్రతి ఒక్కరూ సంయ మనంతో వ్యవహరించాలని కోరారు. మృతుడి కుటుంబానికి ఎంపీ వ్యక్తిగతంగా రూ.లక్ష ఆర్థిక సాయం చేస్తున్నా.. వారికి వద్దంటూ టీడీపీ నేతలే అడ్డుకోవటం గమనార్హం. మృతుని కుటుంబానికి అండగా ఉంటామని ఎంపీ చెప్పారు. బాధిత కుటుంబంలో ఒకరికి ప్రభుత్వోద్యోగం ఇప్పిస్తామని చెప్పారు. అది రెండు కుటుంబాల మధ్య ఘర్షణే : ఎస్పీ రెండు కుటుంబాల మధ్య ఘర్షణే ఈ హత్యకు దారి తీసిందని బాపట్ల జిల్లా ఎస్పీ వకుల్‌జిందాల్ స్పష్టంచేశారు. ఈ క్రమంలోనే హత్య జరిగిన గంటల వ్యవధిలోనే ముగ్గురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. హత్య కేసులో ఎటువంటి రాజకీయ కోణంలేదని ఆయన తేల్చిచెప్పారు. నిందితులను అదుపులోకి తీసుకున్నప్పటీకీ టీడీపీ నేతలు వారిని అరెస్టుచేయలేదని వ్యాఖ్యలు చేయటం వివాదా స్పదమయ్యాయి. మరో నిందితుడిని కూడా త్వరలోనే అరెస్టు చేస్తామని పోలీసులు వెల్లడించారు. సీఎం జగన్ రూ.10 లక్షల సాయం ఇక మృతుడు అమర్నాథ్ కుటుంబానికి సీఎం వైఎస్ జగన్ అండగా నిలిచారు. బాధిత కుటుంబానికి అండగా నిలబడేలా రూ.10 లక్షల చెక్కును పంపారు. ప్రభు త్వం అన్ని విధాలుగా బాధిత కుటుంబానికి సాయం అందిస్తుందని స్పష్టంచేశారు. చెక్కును ఆదివారం అందజేస్తారు. -
ప్లాన్ ప్రకారమే అమర్ హత్య: బాపట్ల ఎస్పీ
సాక్షి, బాపట్ల: చెరుకుపల్లి మండల పరిధిలో దారుణ హత్యకు గురైన పదో తరగతి స్టూడెంట్ అమర్నాథ్ ఉదంతంపై బాపట్ల ఎంపీ వకుల్ జిందాల్ స్పందించారు. ఈ హత్య ప్లాన్ ప్రకారమే జరిగిందని.. కేసుకు సంబంధించి పలు వివరాలను తెలియజేశారాయన. అమర్నాథ్ హత్య వెనుక రాజకీయ కారణాలు లేవు. ప్లాన్ ప్రకారం అతనిపై పెట్రోల్ పోసి నిప్పంటించారు. అమర్ సోదరికి ఫోన్స్, మెసేజ్ చేసి వెంకటేశ్వరరెడ్డి వేధిస్తున్నాడు. ఆ విషయం ఇంట్లో చెప్పడంతో.. అమర్ పై వెంకటేశ్వరరెడ్డి కోపం పెంచుకున్నాడు. నిందితుడు వెంకటేశ్వరరెడ్డికి హత్యలో గోపిరెడ్డి, వీరబాబు, సాంబిరెడ్డి సహకరించారు అని తెలిపారు. ఈ కేసులో వెంకటేశ్వరరెడ్డి సహా ముగ్గురిని అరెస్ట్ చేసినట్లు ఎస్పీ వకుల్ జిందాల్ తెలిపారు. సాంబిరెడ్డి పరారీలో ఉన్నాడని.. అతని పట్టుకునే ప్రయత్నంలో ఉన్నట్లు వివరించారాయన. ఇదీ చదవండి: అమర్ కుటుంబానికి న్యాయం చేసి తీరతాం -
అమర్నాథ్ కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకుంటుంది: ఎంపీ మోపిదేవి
సాక్షి, బాపట్ల: సోదరి రక్షణ కోసం ఎదురెళ్లి దుండగుల చేతిలో హతమైన విద్యార్థి అమర్నాథ్ కుటుంబాన్ని ప్రభుత్వం అన్ని విధాలా ఆదుకుంటుందని, దోషులను కఠినంగా శిక్ష పడేలా చూస్తామని హామీ ఇచ్చారు ఎంపీ మోపిదేవి వెంకటరమణ. తన అక్కపై జరుగుతున్న వేధింపులను అడ్డుకునే యత్నంలో పదో తరగతి విద్యార్థి అమర్నాథ్ను నలుగురు కిరాతకంగా తగలబెట్టి కాల్చి చంపిన సంగతి తెలిసిందే. బాపట్ల జిల్లా చెరుకుపల్లి మండల పరిధిలోని ఉప్పలవారిపాలెంలో ఈ ఘోరం జరిగింది. ఈ ఘటన పట్ల ఎంపీ మోపిదేవి స్పందించారు. శనివారం ఉదయం ఉప్పలవారిపాలెంకు వెళ్లిన ఆయన అమర్నాథ్ కుటుంబ సభ్యుల్ని పరామర్శించి ఓదార్చారు. ఈ కేసులో వీలైనంత త్వరగా న్యాయం చేస్తామని, దోషుల్ని కఠినంగా శిక్షించేలా చర్యలు తీసుకుంటామని ఈ సందర్భంగా అమర్నాథ్ కుటుం సభ్యులకు హామీ ఇచ్చారాయన. అమర్నాథ్ కుటుంబాన్ని అన్నివిధాల ప్రభుత్వం ఆదుకుంటుందని ఎంపీ మోపిదేవి ప్రకటించారు. తక్షణ సాయంగా రూ.50 వేలను అందించారాయన. అలాగే కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇస్తామని ప్రకటించారు. ఇదీ చదవండి: అక్కను వేధించవద్దన్నందుకు అమానుషం -
కోనసీమ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురు మృతి
సాక్షి, కోనసీమ జిల్లా: కోనసీమ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఆలమూరు మండలం మడికి జాతీయ రహదారిపై తెల్లవారుజామున జరిగిన ప్రమాదంలో నలుగురు మృతి చెందగా.. మరో 9 మంది తీవ్ర గాయాలయ్యాయి. ఘటనలో గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించారు. వివరాల్లోకి వెళితే.. టాటా మ్యాజిక్ వాహనంలో రంపచోడవరం నుంచి మందపల్లి శనేశ్వరస్వామి దైవ దర్శనం కోసం పదిమంది వెళ్తున్నారు. ఈ క్రమంలో వైజాగ్ ఎయిర్ పోర్టు నుంచి నలుగురితో భీమవరం వెళుతున్న కారుని ఢీకొట్టడంతో మడికి వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో టాటా మ్యాజిక్‌లో ప్రయాణిస్తున్న ముగ్గురు మృతి చెందగా , కారులో ఒకరు మృతి చెందారు. గాయపడిన వారిని రాజమండ్రి ప్రభుత్వాసుపత్రికి తరలించారు. చదవండి: అక్కను వేధించవద్దన్నందుకు అమానుషం -
అక్కను వేధించవద్దన్నందుకు అమానుషం
చెరుకుపల్లి: తన అక్కను వేధించవద్దని చెప్పిన పదో తరగతి విద్యార్థిపై ఓ యువకుడు మరో ముగ్గురు స్నేహితులతో కలిసి పెట్రోల్ పోసి నిప్పంటించారు. తీవ్రంగా గాయపడిన ఆ విద్యార్థి చికిత్స పొందుతూ మృతిచెందాడు. ఈ అమానుష ఘటన బాపట్ల జిల్లా చెరుకుపల్లి మండలం రాజవోలు గ్రామ పరిధిలోని ఉప్పాలవారిపాలెంలో శుక్రవారం జరిగింది. బాపట్ల డీఎస్పీ మురళీకృష్ణ కథనం ప్రకారం... రాజవోలు గ్రామ పరిధిలోని ఉప్పాలపాలేనికి చెందిన ఉప్పాల మాధవి కుమారుడు ఉప్పాల అమర్నా«థ్ (15) ఉదయం ఐదు గంటల సమయంలో రాజవోలుకు సైకిల్‌పై ట్యూషన్‌కు వెళుతున్నాడు. ఆ సమయంలో రాజవోలు గ్రామానికి చెందిన పాము వెంకటేశ్వరరెడ్డి (వెంకీ), అతని స్నేహితులు మరో ముగ్గురు కలిసి అమర్నాథ్ను అడ్డగించి సైకిల్ లాక్కుని రోడ్డు పక్కన మొక్కజొన్న బస్తాలు వేసిన చోటుకు తీసుకువెళ్లి దాడి చేశారు. అనంతరం ముందుగానే తెచ్చుకున్న పెట్రోల్‌ను అమర్నాథ్పై పోసి నిప్పు అంటించి అక్కడ నుంచి పారిపోయారు. మంటలు రావటంతో సమీపంలోని గ్రామస్తులు గమనించి ఘటనాస్థలానికి చేరుకుని మంటలను ఆర్పి అమర్నాథ్ కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. మంటల్లో తీవ్రంగా గాయపడిన అతడిని గుంటూరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా, చికిత్స పొందుతూ మృతిచెందాడు. గతంలోనూ దాడి.. పదో తరగతి ఫెయిల్ అయి ఖాళీగా తిరుగుతున్న పాము వెంకటేశ్వరరెడ్డి (వెంకీ) కొంతకాలంగా అమర్నా«థ్ అక్కను టీజ్ చేస్తున్నాడు. దీంతో వెంకీ, అమర్నాథ్ మధ్య గొడవ జరిగింది. అమర్నా«థ్పై వెంకీ దాడి చేశాడు. ఈ విషయం వెంకీ కుటుంబ సభ్యుల దృష్టికి కూడా అమర్నాథ్ తరఫు పెద్దలు తీసుకెళ్లారు. పాఠశాలలకు సెలవులు రావడంతో వీరు కలవలేదు. తిరిగి పాఠశాలలు పునఃప్రారంభం కావడంతో అమర్నా«థ్, ట్యూషన్, స్కూలుకు వెళుతున్నాడు. ఈ క్రమంలో ఇటీవల మార్గంమధ్యలో అమర్నాథ్ను వెంకీ అడ్డగించి బెదిరించటం పరిపాటిగా మారింది. ఈ క్రమంలో వెంకీ తన స్నేహితులతో కలిసి శుక్రవారం అమర్నాథ్పై దాడి చేసి పెట్రోలు పోసి నిప్పంటించారు. అమర్నాథ్ తండ్రి నాంచారయ్య గతంలోనే మరణించారు. అమర్నాథ్ తల్లి మాధవి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని విచారణ చేస్తున్నట్లు డీఎస్పీ చెప్పారు. -
ఆడిటర్ సహా.. విశాఖ ఎంపీ భార్య, కొడుకు కిడ్నాప్
దొండపర్తి (విశాఖ దక్షిణ)/విశాఖ విద్య: విశాఖపట్నం ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ భార్య, కుమారుడితో పాటు ప్రముఖ ఆడిటర్ జీవీ కిడ్నాప్ వ్యవహారం గురువారం రాష్ట్రంలో సంచలనం రేకెత్తించింది. సినీ ఫక్కీలో దుండగులు ఎంపీ కుమారుడు శరత్ ఇంట్లోకి చొరబడి.. ముగ్గురి మెడపై కత్తిపెట్టి డబ్బులు డిమాండ్ చేశారు. 48 గంటల పాటు నిర్బంధించారన్న విషయం ఆలస్యంగా వెలుగులోకి రావడం అందరినీ ఉలిక్కిపడేలా చేసింది. కానీ, పోలీసులు నాలుగు గంటల్లోనే కిడ్నాపర్ల ఆచూకీ కనిపెట్టి సినిమా స్టైల్లో వెంబడించి రౌడీషీటర్ కోలా వెంకట హేమంత్‌కుమార్, రాజేష్‌లను అరెస్టుచేయడంతో కిడ్నాప్ కథ సుఖాంతమైంది. వారి చెర నుంచి ఎంపీ ఎంవీవీ భార్య జ్యోతి, కుమారుడు శరత్, ప్రముఖ ఆడిటర్ గన్నమనేని వెంకటేశ్వరరావు (జీవీ) సురక్షితంగా బయటపడ్డారు. ఈ కిడ్నాప్ వ్యవహారంలో మరో ఐదుగురి పాత్ర కూడా ఉన్నట్లు పోలీసులు గుర్తించి వారి కోసం గాలిస్తున్నారు. వివరాలివీ.. కిడ్నాప్ జరిగింది ఇలా.. ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ కుమారుడు శరత్ రుషికొండ ప్రాంతంలో తారకరామ లేఅవుట్లో ఉంటున్నారు. ఈనెల 13వ తేదీ ఉదయం కొందరు దుండగులు ఆ ఇంట్లోకి చొరబడ్డారు. లోపల శరత్ ఒక్కడే ఉండడంతో అతడిని నిర్బంధించి ఇంట్లో ఉన్న బంగారు ఆభరణాలను దోచుకున్నారు. ఇంకా డబ్బు కావాలని దాడిచేశారు. తన వద్ద లేదని చెప్పినా వినలేదు. దీంతో మరుసటి రోజు బుధవారం శరత్‌తో లాసెన్స్ బే కాలనీలో ఉంటున్న తల్లి జ్యోతికి ఫోన్ చేయించారు. తన ఆరోగ్యం బాగోలేదని, ఇంటికి రావాలని బలవంతంగా చెప్పించారు. అది నిజమని నమ్మిన అతడి తల్లి జ్యోతి కంగారుగా బుధవారం కొడుకు ఇంటికి వచ్చారు. ఆమెను కూడా బంధించి ఆమె వద్ద ఉన్న బంగారు నగలను కాజేశారు. భారీగా డబ్బులు కావాలన్న ఉద్దేశంతో ఎంపీతో సన్నిహితంగా ఉండే ప్రముఖ ఆడిటర్ జీవీకి జ్యోతితో ఫోన్‌చేసి రప్పించారు. జీవీని కూడా నిర్బంధించి రూ.2 కోట్లు కావాలని డిమాండ్ చేశారు. డబ్బులు ఇవ్వకపోతే చంపేస్తామని ముగ్గురి మెడపై కత్తిపెట్టి బెదిరించారు. దీంతో జీవీ తనకు తెలిసిన వారికి ఫోన్‌చేసి రూ.1.75 కోట్లు సమకూర్చి వారికి అందించారు. అయినప్పటికీ వారిని విడిచిపెట్టకుండా ఇంకా డబ్బులు కావాలని కిడ్నాపర్లు డిమాండ్ చేశారు. మధ్యలో ఎంపీ తన కుమారుడు శరత్‌కు ఫోన్‌చేసినప్పటికీ కిడ్నాపర్ల సూచనల మేరకు మామూలుగానే మాట్లాడి ఫోన్ పెట్టేశారు. ఆడిటర్ ఫోన్ ట్రాక్‌కు ఎంపీ వినతి ఐటీ రిటర్నుల పనుల నిమిత్తం హైదరాబాద్‌లో ఉన్న ఎంపీ ఎంవీవీ.. ఆడిటర్ జీవీకి బుధవారం మధ్యాహ్నం నుంచి పలుమార్లు ఫోన్ చేసినప్పటికీ లిఫ్ట్ చేయలేదు. అతడి సన్నిహితులకు ఫోన్‌చేయగా.. శ్రీకాకుళం వెళ్లినట్లు చెప్పారు. అక్కడి వారికి ఫోన్‌చేసి ఆరా తీస్తే శ్రీకాకుళం కూడా రాలేదని సమాచారమిచ్చారు. గురువారం ఉదయం కూడా ఫోన్ చేసినప్పటికీ జీవీ స్పందించలేదు. ఒకవైపు రిటర్నుల పనులు, మరోవైపు ఫోన్ లిఫ్ట్ చేయకపోవడంతో జీవీకి ఏమైందన్న ఆందోళనతో ఎంపీ విశాఖ పోలీస్ కమిషనర్ త్రివిక్రమ్ వర్మకు ఫోన్‌చేసి అతని నెంబర్‌ను ట్రాక్ చేయాలని కోరారు. వెంటనే పోలీసులు సెల్‌ఫోన్ సిగ్నల్స్ ఆధారంగా జీవీ రుషికొండలోనే ఉన్నట్లు గుర్తించారు. అతని డ్రైవర్‌తో పాటు మరికొంత మంది ద్వారా సమాచారం సేకరించి సాంకేతికత సాయంతో విచారణ చేపట్టారు. దీంతో కిడ్నాప్ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. సినీ ఫక్కీలో ఛేజ్ చేసి.. మరోవైపు.. రెండ్రోజులుగా ముగ్గురిని ఇంట్లోనే నిర్బంధించిన విషయాన్ని పోలీసులు గుర్తించే అవకాశం ఉందని గ్రహించిన కిడ్నాపర్లు వారిని అక్కడ నుంచి విజయనగరం వైపు తరలించేందుకు ప్రయత్నించారు. శరత్‌కు చెందిన ఆడి కారులో వారిని ఎక్కించుకుని పద్మనాభం నుంచి ఎస్.కోట మీదుగా విజయనగరం వెళ్లేందుకు బయల్దేరారు. పోలీసులు అప్పటికే మొబైల్స్, ఇతర టెక్నాలజీల ఆధారంగా ప్రతి ప్రాంతంలోనూ చెక్‌పోస్టులు ఏర్పాటుచేశారు. అడుగడుగునా విస్తృత తనిఖీలు చేపట్టారు. వారు ఆనందపురం మీదుగా పద్మనాభం వైపు వెళ్తున్నట్లు తెలుసుకుని వారి కారును వెంబడించారు. ఆనందపురం మండలం పందలపాక గ్రామానికి వారి కారు చేరుకోగానే ముందు నుంచి పద్మనాభం సీఐ బృందం, వెనుక నుంచి పీఎంపాలెం సీఐ బృందాల వాహనాలు అడ్డగించాయి. అయినప్పటికీ కిడ్నాపర్లు కారు ఆపకుండా ముందుకు వెళ్లే ప్రయత్నంలో పోలీస్ వాహనాన్ని బలంగా ఢీకొట్టారు. వెంటనే కారులో ఉన్న కిడ్నాపర్లు రౌడీషీటర్ కోలా వెంకట హేమంత్‌కుమార్, రాజేష్‌లు బయటకు దిగి పారిపోయే ప్రయత్నం చేశారు. పోలీసులు వారిని వెంబడించి పట్టుకున్నారు. ఎంపీ కుటుంబ సభ్యుల కోసం ఆరా తీశారు. అయితే, వారిని బాకురుపాలెం ప్రాంతంలోనే విడిచిపెట్టినట్లు చెప్పడంతో మరో పోలీస్ బృందం వారికోసం గాలింపు చేపట్టింది. ఇంతలో వారు ఆర్టీసీ బస్సులో వెళ్తున్నట్లు తెలుసుకుని వారిని సురక్షితంగా కమిషనరేట్‌కు తరలించారు. హేమంత్‌కుమార్‌పై 12 కేసులు.. భీమిలి ప్రాంతానికి చెందిన రౌడీషీటర్ హేమంత్‌కుమార్ ఇప్పటికే రెండు కిడ్నాప్ కేసుల్లో ప్రధాన నిందితుడిగా ఉన్నాడు. రియల్ ఎస్టేట్ వ్యాపారిగా చెప్పుకుంటున్నప్పటికీ అతనిపై బ్లాక్‌మెయిలింగ్, కిడ్నాప్‌లు వంటి నేర చరిత్ర ఉంది. 2022లో రామకృష్ణ అనే వ్యక్తిని.. అలాగే, ఈ ఏడాది ఫిబ్రవరి 17న మధుసూధనరావు అనే రియల్ ఎస్టేట్ వ్యాపారిని కిడ్నాప్‌చేసి డబ్బులు డిమాండ్ చేశాడు. ఈ రెండు కేసుల్లోను పోలీసులు హేమంత్‌కుమార్‌ను అరెస్టుచేసి జైలుకు పంపించారు. బెయిల్‌పై బయటకు వచ్చిన కొద్దిరోజుల్లోనే మరో కిడ్నాప్‌కు పాల్పడి జైలుకు వెళ్లడం పరిపాటిగా మారింది. ఇతడిపై మొత్తం 12 కేసుల వరకు ఉన్నట్లు పోలీసులు చెబుతున్నారు. ఎంపీని పరామర్శించిన మంత్రి అమర్నాథ్ ఎంపీ భార్య, కుమారుడి కిడ్నాప్ ఉదంతాన్ని తెలుసుకున్న మంత్రి గుడివాడ అమర్నాథ్ నగరంలోని ఎంపీ ఇంటికి గురువారం సాయంత్రం వెళ్లి ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించారు. కిడ్నాప్ గురించి అడిగి తెలుసుకున్నారు. ఈ విషయమై సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి తనతో మాట్లాడి, వివరాలు తెలుసుకోమని పంపినట్లు అమర్నాథ్ చెప్పారు. కిడ్నాప్ ఉదంతాన్ని మంత్రికి ఎంపీ వివరించారు. ఆ ఐదుగురు కోసం గాలింపు : సీపీ ఇక కిడ్నాప్ విషయం తెలుసుకున్న వెంటనే 17 బృందాలను ఏర్పాటుచేశామని నగర పోలీస్ కమిషనర్ త్రివిక్రమ్ వర్మ మీడియాకు వెల్లడించారు. టెక్నాలజీ ఆధారంగా కిడ్నాపర్ల కదలికలపై నిఘా పెట్టి ఎక్కడికక్కడ చెక్‌పోస్టులు పెట్టి తనిఖీలు చేశామని చెప్పారు. నాలుగు గంటల్లోనే కిడ్నాపర్లు కోలా వెంకటహేమంత్కుమార్తో పాటు రాజేష్‌ను అదుపులోకి తీసుకున్నామన్నారు. మరో ఐదుగురి పాత్ర కూడా ఇందులో ఉన్నట్లు గుర్తించామని, వారు పరారీలో ఉన్నట్లు ఆయన వెల్లడించారు. వీరికోసం ప్రత్యేక బృందాలతో గాలిస్తున్నట్లు సీపీ వివరించారు. కేసు దర్యాప్తులో ఉందని, సమగ్ర విచారణ అనంతరం పూర్తి వివరాలు వెల్లడిస్తామని త్రివిక్రమ్ వర్మ చెప్పారు. -
మార్గదర్శికి మరో భారీ షాక్
సాక్షి, విజయవాడ: మార్గదర్శి అక్రమాల కేసు దర్యాప్తులో కీలక పరిణామం చోటు చేసుకుంది. మరోసారి మార్గదర్శి చిట్స్‌కి చెందిన ఆస్తుల్ని భారీగా అటాచ్ చేసింది ఏపీ సీఐడీ. ఈసారి ఏకంగా రూ. 242 కోట్ల ఆస్తులు(చరాస్తులు) జప్తు చేసినట్లు తెలుస్తోంది. మార్గదర్శి అక్రమాల కేసులో ఇప్పటికే దర్యాప్తును ముమ్మరంగా కొనసాగిస్తున్న ఏపీ సీఐడీ.. ఆ కంపెనీ అధినేత, ఎండీ అయిన రామోజీరావు, శైలజాకిరణ్‌లను పలుమార్లు విచారించిన సంగతి తెలిసిందే. మార్గదర్శి చిట్‌ఫండ్స్ చందాదా రులు, డిపాజిట్‌దారుల ప్రయోజనాల పరిరక్షణే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం గతంలోనూ ఇలాంటి కీలక నిర్ణయం తీసుకుంది. మార్గదర్శి చిట్‌ఫండ్స్‌కు చెందిన రూ.793.50 కోట్ల విలువైన చరాస్తులను జప్తు చేసేందుకు సీఐడీని అనుమతించింది. వాటిలో మార్గదర్శి చిట్‌ఫండ్స్ నగదు, బ్యాంకు ఖాతాల్లో సొమ్ము, నిబంధనలకు విరుద్ధంగా మ్యూచువల్ ఫండ్స్‌లో పెట్టిన పెట్టుబడులున్నాయి. తాజాగా మరో రూ.242 కోట్లు జప్తు చేస్తున్నట్లు ప్రకటించింది. కేంద్ర చిట్‌ఫండ్స్ చట్టాన్ని ఉల్లంఘిస్తూ మార్గదర్శి చిట్‌ఫండ్స్ దశాబ్దాలుగా ఆర్థిక అక్రమాలను పాల్పడుతున్నట్లు స్టాంపులు–రిజిస్ట్రేషన్ల శాఖ తనిఖీల్లో వెల్లడైంది. చందాదారుల సొమ్మును నిబంధనలకు మార్గదర్శి తమ అనుబంధ సంస్థలు, మ్యూచువల్ ఫండ్స్‌లో పెట్టుబడులుగా మళ్లించినట్లు కీలక ఆధారాలు సేకరించింది. చిట్‌ఫండ్స్ రిజిస్ట్రార్ ఫిర్యాదు మేరకు ఏ–1గా చెరుకూరి రామోజీరావు, ఏ–2గా చెరుకూరి శైలజ కిరణ్‌లతోపాటు బ్రాంచి మేనేజర్లపై (ఫోర్‌మెన్) సీఐడీ కేసు నమోదు చేసి దర్యా ప్తు చేస్తున్న విషయం విదితమే. కేంద్ర చిట్‌ఫండ్ చట్టాన్ని అనుసరిస్తున్నట్లు ఆధారాలు చూపితే కొత్త చిట్టీలకు అనుమతిస్తామని స్టాంపులు–రిజిస్ట్రేషన్ల శాఖ సూచించినా మార్గదర్శి అందుకు నిరాకరించింది. ఇదీ చదవండి: సూర్య నారాయణపై అవినీతి నిరోధక చట్టం కింద కేసు -
విశాఖ కిడ్నాప్ ఎపిసోడ్: రియల్ ఎస్టేట్ గొడవలు కాదు.. సినీఫక్కీలో నిందితుల ఛేజ్
సాక్షి, విశాఖపట్నం: కలకలం రేపిన విశాఖ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ కుటుంబ సభ్యులతోపాటు ప్రముఖ ఆడిటర్.. వైఎస్సార్సీపీ నేత గన్నమనేని వెంకటేశ్వరావు కిడ్నాప్ వ్యవహారంపై విశాఖపట్నం పోలీస్ కమిషనర్ త్రివిక్రమ్ వర్మ స్పందించారు. కిడ్నాపర్లు బుధవారమే ఎంపీ ఇంట్లోకి ప్రవేశించారని.. తొలుత శరత్‌ను, ఆపై ఎంపీ భార్యను, అటుపై జీవీని తమ అదుపులోకి తీసుకున్నారని సీపీ వివరించారు. ఎంపీ కిడ్నాప్‌నకు సైతం యత్నించిన కిడ్నాపర్లు.. అది కుదరదని అర్థమై డబ్బు డిమాండ్ చేసి ఈ క్రమంలోనే పట్టుబడ్డారని వివరించారాయన. ఎంపీ ఎంవీవీ తన తనయుడు శరత్ చంద్రాకు, అలాగే ఆడిటర్ జీవీ(గన్నమనేని వెంకటేశ్వరావు)కి ఎంతసేపు ఫోన్ చేసిన లిఫ్ట్ చేయలేదు. దీంతో ఆయనకు అనుమానం వచ్చింది. ఉదయం 8గంటలకు ఎంపీ ఫోన్ చేసి సమాచారం ఇచ్చారు. వెంటనే పోలీసు బృందాలు అప్రమత్తం అయ్యాయి. ఆడిటర్ జీవీకి ఫోన్ చేస్తే ఆయన లైన్ లోకి వచ్చారు... నాకేమీ కాలేదు, శ్రీకాకుళం నుంచి వస్తున్నాను అని చెప్పారు. కానీ మా వద్ద ఉన్న టెక్నికల్ ఎవిడెన్సులు చూస్తే, ఆడిటర్ జీవీ ఏదో పొంతన లేకుండా మాట్లాడినట్టు అర్థమైంది. సెల్ ఫోన్ సిగ్నల్ రుషికొండ ఏరియాను చూపిస్తోంది. అప్పుడే వాళ్లు కిడ్నాప్‌నకు గురైనట్లు అర్థమైంది. మా దగ్గర ఉన్న ఆధారాలతో అధికారులందరం ఈ కిడ్నాప్ వ్యవహారం మీద ఫోకస్ పెట్టాం. ఋషికొండ ఏరియాలో కిడ్నాపర్ల సిగ్నల్స్ ట్రేస్ అయ్యాయి. పద్మనాభాపురం ఏరియాలో కిడ్నాపర్లు వెళ్తున్న కారును గుర్తించాం. ఛేజింగ్ లో కిడ్నాపర్లు తమ వాహనంతో.. మా పోలీస్ వాహనాన్ని ఢీకొట్టారు కూడా. కారు సీఐ వాహనాన్ని ఢీకొట్టి రోడ్డు పక్కనే ఉన్న తుప్పల్లోకి వెళ్లిపోయింది. దాంతో హేమంత్, రాజేశ్ అనే ఇద్దరు వ్యక్తులు కారు దిగి పరిగెత్తారు. వాళ్లిద్దరినీ పోలీసులు వెంటాడి పట్టుకున్నారు. కిడ్నాపర్లలో ఒకరు గతంలో ఎంపీకి చెందిన కంపెనీలో సబ్ కాంట్రాక్టరుగా పనిచేశారు. ఎంపీ వద్ద బాగా డబ్బు ఉంటుందని భావించి ఈ కిడ్నాప్ కు ప్రయత్నించారు. డబ్బు కోసమే ఈ కిడ్నాప్ చేశారు. కిడ్నాపర్లలో హేమంత్ అనే వ్యక్తిపై హత్య, పలు కిడ్నాప్ లు సహా 12 కేసులు ఉన్నాయి. హేమంత్ స్వస్థలం భీమిలి" అని సీపీ తివిక్రమ వర్మ వివరించారు. ఎంపీ ఎంవీవీ ఇంటికి సీసీ కెమెరాలు లేవు. కిడ్నాపర్ల నిన్ననే ఎంపీ ఇంట్లోకి ప్రవేశించారు. మొదట ఎంపీ తనయుడు శరత్‌ని కిడ్నాప్ చేశారు. ఎంపీ భార్యను ఆపై జీవీని కిడ్నాప్ చేశారు. ఎంపీని కిడ్నాప్ చేయడం వీలుకాదని గుర్తించి.. చెరలో ఉన్నవాళ్ల నుంచి డబ్బు డిమాండ్ చేశారు. ఎంపీ తనయుడు, జీవీ కలిసి తమకు తెలిసిన వాళ్ల నుంచి డబ్బు రప్పించారు. ఇద్దరూ కలిసి రూ. 1.75 కోట్లు కిడ్నాపర్లకు ఇచ్చారు. ఈ ఉదయం మరో పాతిక లక్షలు కావాలని డిమాండ్ చేశారు. ఈ క్రమంలోనే పట్టుబడ్డారని సీపీ వివరించారు.17 బృందాలు ఈ ఆపరేషన్‌లో పాల్గొని కిడ్నాపర్లను పట్టుకున్నాయని వివరించారాయన. నిందితుడు హేమంత్ మీద 12 కేసులు ఉన్నాయి. అతను ఉండేది భీమిలిలో. గతంలో కూడా ఒక హత్య కేసులు, పలు కిడ్నాప్ కేసులు నిందితుడు పై ఉన్నాయి. ఈ కిడ్నాప్ కేసులో మొత్తం ఏడుగురు నిందితుల ప్రమేయం ఉన్నట్లు ప్రాథమికంగా తేలింది. హేమంత్, రాజేష్‌లను పట్టుకున్నాం. మిగతా వాళ్ల కోసం గాలింపు చేపట్టాం అని సీపీ వెల్లడించారు. రౌడీషీటర్ హేమంత్ కేవలం డబ్బు కోసమే.. ఎన్నిసార్లు ఫోన్ చేసినా ఎవరూ లిఫ్ట్ చేయకపోవడంతో తన కుటుంబం, జీవీ కిడ్నాప్‌నకు గురైనట్లు తనకు అనుమానం వచ్చిందని విశాఖ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ తెలిపారు. తన కొడుకుని కిడ్నాప్ చేసింది హేమంత్ అనే రౌడీ షీటర్ అని తెలిసిందని ఎంవీవీ తెలిపారు. గతంలో కూడా రౌడీషీటర్ హేమంత్ కిడ్నాప్ కేసులో ముద్దాయిగా ఉన్నట్లు ఆయన వెల్లడించారు. అసలు ఈ కిడ్నాప్ కేవలం డబ్బు కోసమే జరిగిందని విశాఖ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ వెల్లడించారు. డబ్బు కోసమే తన కొడుకుని, భార్యని కిడ్నాప్ చేశారన్నారు. ఈ సందర్భంగా ఆయన పోలీస్ కమిషనర్, డీజీపీకి ధన్యవాదాలు తెలిపారు. నాకు ఎటువంటి రియల్ ఎస్టేట్ గొడవలు లేవు. కేవలం డబ్బు కోసమే ఈ కిడ్నాప్ చేశారు. మా అబ్బాయిని కిడ్నాప్ చేసే సమయంలో మా కోడలు ఇంట్లో లేదు. పీకపై కత్తి పెట్టి కిడ్నాపర్లు ముగ్గుర్నీ బెదిరించారు. మొదట మా అబ్బాయిని మొన్న కిడ్నాప్ చేశారు. నిన్న మా భార్యను మా అబ్బాయితో ఫోన్ చేయించి రప్పించారు. తరువాత మా అబ్బాయి నా భార్యతో ఫోన్ చేయించి జీవీని రప్పించారు. కేవలం డబ్బు కోసమే కిడ్నాప్ చేశారు. నన్ను కూడా రప్పించాలని ప్రయత్నించారు. నాకు సెక్యూరిటీ ఎక్కువగా ఉండడంతో మా వాళ్ళని డబ్బు డిమాండ్ చేశారు. నిన్న(బుధవారం) ఉదయం నేను హైదరాబాద్ వెళ్ళాను. జీవీతో నాకు తప్పుడు సమాచారం ఇప్పించారు. సెక్యూరిటీ వాళ్లు లేని సమయం చూసి ఇంట్లోకి చొరబడ్డారు అని ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ మీడియాకు తెలిపారు. ఛేజ్ చేసి మరీ.. శరత్ కిడ్నాప్‌కు గురయ్యాడనే విషయం బయటకు తెలియకుండా కిడ్నాపర్లు జాగ్రత్తలు పడ్డారు. తనకు నీరసంగా ఉందంటూ శరత్ చేత ఎంపీ భార్య జ్యోతికి ఫోన్ చేయించారు. దీంతో ఆమె రుషికొండలోని ఇంటికి చేరుకోగా.. ఆమెనూ తమ చెరలోకి తీసుకున్నారు. ఆపై జీవీని సైతం కిడ్నాప్ చేశారు. ఈ ఉదయం రుషికొండ ఇంటి నుంచి శరత్ ఆడి కార్లోనే ముగ్గురినీ దుండుగులు తీసుకెళ్లారు. పద్మనాభం సమీపంలో ఆడి కార్ పంక్చర్ కావడంతో వాళ్ళను వదిలి పారిపోయిన కిడ్నాపర్లు. అప్పటికే ప్రాధమిక సమాచారం తో వారిని అనుసరించిన పోలీసులు.. ఆపై కిడ్నాపర్లను వెంటాడి పట్టుకున్నారు. -
సూర్యనారాయణపై అవినీతి నిరోధక చట్టం కింద కేసు
సాక్షి, అమరావతి : వాణిజ్య పన్నుల శాఖ ఆదాయానికి భారీగా గండికొట్టి ప్రభుత్వానికి పెద్ద మొత్తంలో నష్టం కలిగించారన్న ఆరోపణలపై క్రిమినల్ కేసు ఎదుర్కొంటున్న ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు కేఆర్ సూర్యనారాయణపై అవినీతి నిరోధక చట్టం (పీసీ యాక్ట్) కింద కూడా కేసు నమోదైంది. ఈ విషయాన్ని హైకోర్టు అదనపు పబ్లిక్ ప్రాసిక్యూటర్ శెట్టిపల్లి దుష్యంత్‌రెడ్డి బుధవారం విజయవాడ 12వ అదనపు జిల్లా జడ్జి (ఏడీజే) కోర్టుకు తెలిపారు. సూర్యనారాయణ దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్‌పై బుధవారం ఏడీజే కోర్టు ఇరుపక్షాల వాదనలు విన్నది. అనంతరం తీర్పును వాయిదా వేసింది. పోలీసుల తరపున దుష్యంత్‌రెడ్డి వాదనలు వినిపిస్తూ.. సూర్యనారాయణపై పీసీ యాక్ట్ కింద కేసు నమోదు చేసినందున, అతని ముందస్తు బెయిల్ పిటిషన్‌ను విచారించే పరిధి ఈ కోర్టు (ఏడీజే)కు లేదని, స్పెషల్ కోర్టుకు మాత్రమే ఉందని వివరించారు. వాదనలు విన్న తరువాత ఈ పిటిషన్‌ను విచారించే పరిధి ఈ కోర్టుకుందో లేదో కూడా తేలుస్తానని న్యాయాధికారి చెప్పారు. అవినీతి కేసుల్లో నిందితులపై పీసీ యాక్ట్ కింద కేసు నమోదు చేయకపోవడాన్ని తప్పుపడుతూ ఇటీవల సుప్రీంకోర్టు కీలక తీర్పు ఇచ్చిందని, దాని ఆధారంగా సూర్యనారాయణపై పీసీ యాక్ట్ కింద కేసు నమోదు చేశామని దుష్యంత్‌రెడ్డి వివరించారు. ఇందుకు పూర్తి ఆధారాలు పోలీసులు సేకరించారని తెలిపారు. పన్ను వసూలులో సూర్యనారాయణ వ్యాపారులతో కుమ్మక్కయ్యారని, రూ.7 లక్షలు చెల్లించాలని నోటీసులిచ్చి, రూ.90 వేలు మాత్రమే వసూలు చేసి వారిని వదిలేశారన్నారు. కొందరు వ్యక్తులకు డబ్బు ఇస్తే నోటీసులో పేర్కొన్న మొత్తం చెల్లించాల్సిన అవసరం లేదంటూ ఆయన వ్యాపారులకు చెప్పారని, ఈ విషయాన్ని వ్యాపారులు అంగీకరించారని వివరించారు. ఇప్పటికే అరెస్టయిన నలుగురితో సంబంధం లేదని సూర్యనారాయణ చెబుతున్నారని, వాస్తవానికి వారితో సూర్యనారాయణ ఈ రెండేళ్లలో 900 సార్లు మాట్లాడారని తెలిపారు. ఆ కాల్‌డేటాను ఆయన కోర్టుకు సమర్పించారు. ఖజానా ఆదాయానికి గండికొట్టడాన్ని ప్రభుత్వం తీవ్రంగా పరిగణిస్తోందన్నారు. పిటిషనర్‌ది తీవ్రమైన నేరమని, ముందస్తు బెయిల్ మంజూరు చేయొద్దని, అతని పిటిషన్‌ను కొట్టేయాలని అభ్యర్థించారు. ఉద్యోగుల సంఘం అధ్యక్షుడిగా ఆయనకు చట్ట ప్రకారం ఎలాంటి రక్షణ లేదని, ఆ పదవిని అడ్డంపెట్టుకుని చట్టం నుంచి తప్పించుకోవాలని చూస్తున్నారని తెలిపారు. శాఖాపరమైన విచారణ ఉద్యోగుల వ్యక్తిగత పాత్రకే పరిమితం అవుతుందన్నారు. అంతకు ముందు సూర్యనారాయణ తరఫు న్యాయవాది వాదనలు వినిపిస్తూ, మిగిలిన నిందితులకు, సూర్యనారాయణకు సంబంధం లేదన్నారు. వారు వాణిజ్య పన్నుల శాఖ ఇంటెలిజెన్స్ విభాగంలో పనిచేస్తుండగా, సూర్యనారాయణ మరో విభాగంలో పనిచేస్తున్నారని తెలిపారు. కక్షసాధింపు చర్యల్లో భాగంగానే కేసు నమోదు చేశారని తెలిపారు. పీసీ యాక్ట్ కింద కేసు పెట్టాల్సిందే : సుప్రీం కోర్టు బాలాజీ వర్సెస్ కార్తీక్ దేశారి కేసులో సుప్రీంకోర్టు గత నెలలో కీలక తీర్పు వెలువరించింది. తమిళనాడు మంత్రి సెంథిల్ బాలాజీపై నమోదు చేసిన చార్జిషీట్లలో పీసీ యాక్ట్ కింద కేసు నమోదు చేయకపోవడంపై విస్మయం వ్యక్తం చేసింది. అవినీతి కేసుల్లో పీసీ యాక్ట్ కింద కేసు నమోదు చేయాల్సిందేనని సుప్రీం కోర్టు స్పష్టం చేసింది. -
YS Viveka Case: ఎంపీ అవినాశ్ జైలుపాలే మీ లక్ష్యమా?
సాక్షి, న్యూఢిల్లీ: వైఎస్ వివేకా హత్య కేసులో ఎంపీ అవినాశ్‌రెడ్డిని జైలుపాలు చేయడమే మీ లక్ష్యమా? అని సుప్రీంకోర్టు ధర్మాసనం నర్రెడ్డి సునీతను ప్రశ్నించింది. ఈ వ్యవహారం చూస్తుంటే ఈగో క్లాషెస్లా ఉందని వ్యాఖ్యానించింది. తొందరపడి వ్యక్తిగత వాదనల ద్వారా నష్టపోతారేమో చూసుకోవాలని హితవు పలికింది. పిటిషనర్ సునీత విజ్ఞప్తి మేరకు తదుపరి విచారణను ఈ నెల 19వతేదీకి వాయిదా వేస్తూ అదనపు డాక్యుమెంట్లు అందచేసేందుకు అనుమతించింది. ఎంపీ వైఎస్ అవినాశ్‌రెడ్డి ముందస్తు బెయిల్‌ను రద్దు చేయాలంటూ నర్రెడ్డి సునీత దాఖలు చేసిన పిటిషన్‌ను సుప్రీం కోర్టు న్యాయమూర్తులు జస్టిస్ విక్రమ్‌నాథ్, జస్టిస్ అహ్సానుద్దీన్ అమానుల్లాలతో కూడిన ధర్మాసనం మంగళవారం విచారించింది. అయితే సుప్రీం వెకేషన్ బెంచ్ సీనియర్ న్యాయవాదులను అనుమతించకపోవడంతో పిటిషనర్ సునీత తన వాదనలు తానే వినిపించడం ప్రారంభించారు. సీనియర్ న్యాయవాది సిద్దార్ధ లూత్రా ఆమెకు సహకరించేందుకు ధర్మాసనం అనుమతించింది. తాను పిటిషనర్‌నని, తన తండ్రి హత్యకు గురయ్యారని సునీత చెబుతుండగా.. ఆ విషయాల్లోకి తాము వెళ్లడం లేదని, వెకేషన్లో ఎందుకు వచ్చారని ధర్మాసనం ప్రశ్నించింది. ‘ఈ కేసులో జూన్ 30 కల్లా దర్యాప్తు పూర్తి చేయాలని సీబీఐని సుప్రీంకోర్టు ఆదేశించింది. ఛార్జిషీట్ ముందే ఫైల్ చేయాల్సి ఉంది. ఏ – 8 (అవినాశ్) భారీ కుట్ర చేసిన ప్రధాన వ్యక్తుల్లో ఒకరు. సీబీఐ దర్యాప్తునకు సహకరించడంలేదు. ముందస్తు బెయిలు పొందడం వల్ల కస్టోడియల్ ఇంటరాగేషన్ కుదరడం లేదు. ముందస్తు బెయిలు ఎందుకు ఇచ్చారో కారణాలు తెలియడం లేదు’’ అని సునీత పేర్కొన్నారు. ఈ సమయంలో జస్టిస్ విక్రమ్‌నాథ్ జోక్యం చేసుకుంటూ ‘దీంట్లో అంతగా అత్యవసరమైన పరిస్థితి ఏముంది? వెకేషన్ బెంచ్‌కు రావాల్సిన అవసరం ఉందా?’ అని ప్రశ్నించారు. సీబీఐ చూసుకుంటుంది.. ‘ఒక వ్యక్తిని అరెస్టు చేయాలో లేదో దర్యాప్తు సంస్థ చూసుకుంటుంది. ఎవరిని, ఎప్పుడు అరెస్టు చేయాలో ఎవరిని కస్టోడియల్ ఇంటరాగేషన్ చేయాలో సీబీఐకు తెలుసు. విచారణకు సహకరిస్తున్నారా లేదా అనేది కూడా సీబీఐ చూసుకుంటుంది. మీరెందుకు జోక్యం చేసుకుంటారు? ఈ కేసులో పలు సాంకేతిక అంశాలు ముడిపడి ఉన్నాయి. మీకెందుకు ఈగో క్లాషెస్? అతడిని (ఎంపీ అవినాశ్) జైలు పాలు చేయాలన్న లక్ష్యమా? ఆ విధంగా చూడొద్దు. ఈ తరహా ప్రొసీడింగ్స్ ఎందుకు?’’ అని జస్టిస్ అమానుల్లా వ్యాఖ్యానించారు. ఇప్పుడీ పిటిషన్‌ను కొట్టివేస్తే.. ఎంపీ అవినాశ్‌రెడ్డి ఇతర నిందితులతో కలసి సాక్షులను ప్రభావితం చేస్తున్నారని సునీత ఆరోపించారు. ఈ సమయంలో ధర్మాసనం జోక్యం చేసుకుంటూ అవినాశ్‌రెడ్డి సీబీఐ దర్యాప్తునకు సహకరిస్తున్నప్పుడు కస్టోడియల్ ఇంటరాగేషన్ అవసరం ఏముందని ప్రశ్నించింది. ‘‘మీకో సలహా ఇస్తాం. మీరు వ్యక్తిగతంగా వాదిస్తున్నారు. చట్టంపై అవగాహన లేమితో వాదనలో అంతగా ప్రావీణ్యం లేకపోవచ్చు. మేం ఇప్పుడు ఈ పిటిషన్‌ను కొట్టివేస్తే సీనియర్ న్యాయవాదికి ఇబ్బంది అవుతుంది. అందుకే సెలవుల తర్వాత విచారణ జాబితాలోకి చేరుస్తాం’’ అని సునీతనుద్దేశించి ధర్మాసనం పేర్కొంది. సీబీఐ దర్యాప్తు ఈ నెల 30 కల్లా పూర్తి కావాలని సుప్రీంకోర్టు ఆదేశాలు ఉన్నాయని సీనియర్ న్యాయవాది సిద్ధార్ధ లూత్రా ఈ సమయంలో పేర్కొన్నారు. వాదనలకు సీనియర్ న్యాయవాదులను అనుమతించడం లేదన్న విషయాన్ని గుర్తు చేస్తూ తమకు ఇబ్బంది కలగ చేయవద్దని ఈ సందర్భంగా ధర్మాసనం సూచించింది. తాము ఇప్పుడు వాదనలకు అనుమతిస్తే మరో నలుగురు సీనియర్ న్యాయవాదులు తమను వక్షకు గురి చేశారని ఆరోపించే అవకాశం ఉందని పేర్కొంది. తాము అనుమతించకపోయినప్పటికీ మీరు వాదనలు చేస్తున్నారంటూ లూత్రాను ఉద్దేశించి ధర్మాసనం వ్యాఖ్యానించింది. సుప్రీంకోర్టులో మరో బెంచ్ నిర్దేశించిన డెడ్‌లైన్‌ను తాము మార్చలేమని స్పష్టం చేసింది. గడువు నిర్దేశించాక ఎలా మారుస్తాం? సీబీఐకు నోటీసులిచ్చి విచారణకు హాజరు కావాల్సిందిగా ఆదేశించాలని ధర్మాసనాన్ని సునీత కోరారు. అయితే ఇప్పటికే మరో బెంచ్ జూన్ 30వతేదీ అని గడువు నిర్దేశించిన తరువాత తాము ఎలా మారుస్తామని ధర్మాసనం ప్రశ్నించింది. ఒకవేళ ఇప్పుడు తాము జోక్యం చేసుకుంటే మొత్తం అంతా మారిపోతుందని వ్యాఖ్యానించింది. అయితే సీబీఐకి నోటీసులు ఇవ్వాలని సునీత మరోసారి అభ్యర్థించడంతో ధర్మాసనం స్పందిస్తూ.. ‘‘ఎందుకు సీబీఐ రావాలని కోరుతున్నారు? రావాలో వద్దో సీబీఐ నిర్ణయించుకుంటుంది. ప్రతివాది సహకరించకుంటే, కస్టోడియల్ ఇంటరాగేషన్ అవసరమైతే, హైకోర్టు ఆదేశాలు సరి కాకుంటే సీబీఐ తనకు తానే వస్తుంది. అందుకే చెబుతున్నాం. జూలై 3న కోర్టుకు రండి. మీ న్యాయవాది వాదిస్తారు’ అని ధర్మాసనం సూచించింది. న్యాయవాది వాదించడమే సబబు.. హైకోర్టు ఆదేశాలు నిష్ప్రయోజనమని ఈ అంశానికి సంబంధించి మరో కేసులో సుప్రీంకోర్టు వ్యాఖ్యానించిందని సునీత పేర్కొనడంతో అందుకే తాము సెలవుల తర్వాత రావాలని సలహా ఇస్తున్నామని ధర్మాసనం తెలిపింది. ప్రతివాది అవినాశ్ మీ కజినా? అని ధర్మాసనం పదేపదే సునీతను ప్రశ్నించగా... అవునని తన రెండో కజిన్ అని సునీత సమాధానమిచ్చారు. అయితే పిటిషనర్ తరఫున న్యాయవాది వాదించడమే సబబని, ఇందులో సాంకేతిక అంశాలు ముడిపడి ఉన్నాయని ధర్మాసనం అభిప్రాయపడింది. కాగా సునీత పిటిషన్‌ను బుధవారం విచారణ జాబితాలో చేర్చాలని, అడ్వొకేట్ ఆన్‌రికార్డ్స్ హాజరవుతారని లూత్రా న్యాయస్థానానికి విజ్ఞప్తి చేశారు. అయితే సీబీఐకి నోటీసులు ఇవ్వడంలో తాము జోక్యం చేసుకోబోమని, పిటిషనర్ విజ్ఞప్తి మేరకు ఈ నెల 19న విచారణ జాబితాలో చేర్చాలంటూ రిజిస్ట్రీకి ధర్మాసనం ఆదేశాలిచ్చింది. -
YS Viveka Case: మీ తీరు పంతాలకు పోయినట్టుంది.. సునీతతో సుప్రీంకోర్టు
సాక్షి, న్యూఢిల్లీ: ఎంపీ అవినాష్‌రెడ్డి ముందస్తు బెయిల్‌ను రద్దు చేయాలంటూ సునీతారెడ్డి వేసిన పిటిషన్‌ను సుప్రీంకోర్టు విచారించింది. సునీత రెడ్డి వేసిన పిటిషన్‌పై సీబీఐకి నోటీసులు ఇచ్చేందుకు నిరాకరించింది సుప్రీం కోర్టు. కేసును ఈ నెల 19కి వాయిదా వేసింది సర్వోన్నత న్యాయస్థానం. సుప్రీంకోర్టు జడ్జిలు జస్టిస్ విక్రమ్ నాథ్, జస్టిస్ A.అమానుల్లా నేతృత్వంలోని బెంచ్ ముందుకు ఈ పిటిషన్ విచారణకు రాగా కేసులో తానే వాదనలు వినిపిస్తానంటూ సునీతారెడ్డి ముందుకు వచ్చింది. దీనిపై స్పందించిన జస్టిస్ విక్రమ్ నాథ్ ఎవరైనా లాయర్ ను పెట్టుకోవాలని సూచించింది. సీనియర్ అడ్వొకేట్ సిద్ధార్థ లుథ్రాను సునీతకు సాయం చేయాలని కోరింది. సునీత : సీబీఐ దర్యాప్తునకు అవినాష్ ఏ మాత్రం సహకరించడం లేదు. ఏప్రిల్ 24 తర్వాత 3 సార్లు నోటీసులిచ్చినా విచారణకు రాలేదు జస్టిస్ విక్రమ్ నాథ్ : ఈ కేసులో అంత అత్యవసరమైన పరిస్థితి ఏముంది? వెకేషన్ ముందున్న బెంచ్‌కు రావాల్సిన పరిస్థితి ఉందా? జస్టిస్ A.అమానుల్లా : ఒక వ్యక్తిని అరెస్ట్ చేయాలా? లేదా అన్నది దర్యాప్తు సంస్థ చూసుకుంటుంది. ఎవరిని ఎప్పుడు అరెస్టు చేయాలో, ఎవరిని కస్టోడియల్ ఇంటరాగేషన్ చేయాలో CBIకి తెలుసు. ఈ కేసులో చాలా సాంకేతిక అంశాలు ముడిపడి ఉన్నాయి. సునీత : ఇతర నిందితులతో కలిసి అవినాష్ సాక్షులను ప్రభావితం చేస్తున్నారు. ఇదే కేసులో సుప్రీం ఆదేశాలకు విరుద్ధంగా హైకోర్టు ఆదేశాలిచ్చింది సుప్రీంకోర్టు : అవినాష్ రెడ్డి CBI ముందు హాజరవుతున్నారు కదా, అలాగే దర్యాప్తుకు సహకరిస్తున్నప్పుడు CBIకి కస్టోడియల్ ఇంటరాగేషన్ అవసరం ఏముంది? ఈ కేసులో మీరు తొందరపడి వ్యక్తిగతంగా వాదనలు వినిపించాలనుకుంటే నష్టపోతారు, మీరు (సునీతను ఉద్దేశించి) న్యాయశాస్త్రంలో నిష్ణాతులు కాకపోవచ్చు. మీ పిటిషన్ ను కోర్టు డిస్మిస్ చేస్తే.. తర్వాత వచ్చే లాయర్ కు సమస్య ఎదురవుతుంది. సెలవుల తర్వాత ఈ కేసును పరిశీలిద్దామా? సీనియర్ లాయర్ లుథ్రా: ఈ నెలాఖరులోగా సిబిఐకి ఇచ్చిన దర్యాప్తు గడువు ముగుస్తుంది సుప్రీంకోర్టు : మిస్టర్ లుథ్రా.. మీరు సమస్యలు సృష్టిస్తున్నారు. వాదనలు వద్దంటున్నా.. మీరు తలదూర్చాలనుకుంటున్నారు. ఈ కోర్టులోనే ఒక బెంచ్ విధించిన గడువుపై మేం మళ్లీ ఉత్తర్వులు ఇవ్వాలా? సునీత : ఈ కేసులో విచారణకు హాజరు కావాలని సిబిఐని ఆదేశించండి సుప్రీంకోర్టు : అలాంటి ఉత్తర్వులు మేమేలా ఇస్తాం? ఈ పిటిషన్ లో విచారణకు రావాలా లేదా అన్నది CBI ఇష్టం. జులై 3న రండి సునీత : హైకోర్టు అనేక అంశాలను పరిగణలోకి తీసుకోలేదు. సీబీఐ సేకరించిన సాక్ష్యాలను హైకోర్టు పరిగణలోకి తీసుకోలేదు. సుప్రీం ఆదేశాలకు విరుద్ధంగా హైకోర్టు ఆదేశాలిచ్చింది. హైకోర్టు ఉత్తర్వులను సమీక్షించే తుది అధికారం సుప్రీంకోర్టుకు ఉందని గతంలో మీరు చెప్పారు కదా జస్టిస్ A.అమానుల్లా : మీరు ఆరోపణలు చేస్తున్న నిందితుడు మీ కజినా? సునీత : అవును, అవినాష్ రెడ్డి నాకు సెకండ్ కజిన్ సీనియర్ లాయర్ లుథ్రా: ఈ కేసును రేపు పరిశీలించండి. రేపు అడ్వొకేట్ ఆన్ రికార్డును కోర్టు ముందుంచుతాం. నేను వాదనలు వినిపిస్తాను సుప్రీంకోర్టు : మీరు అడిగినట్టు CBIకి నోటీసులు ఇవ్వలేం. కేసును జూన్ 19వ తేదీకి (వచ్చే సోమవారం) వాయిదా వేస్తున్నాం తెలంగాణ హైకోర్టు వెకేషన్ బెంచ్ జారీ చేసిన బెయిల్‌ను సవాల్ చేస్తూ సునీతా రెడ్డి వేసిన పిటిషన్లో సిబిఐకి నోటీసులు జారీ చేయాలని కోరినా.. సుప్రీంకోర్టు అంగీకరించలేదు. ఈ కేసులో సునీత తీరు పంతాలకు పోయి వ్యవహరిస్తున్నట్టు కనిపిస్తోందని అభిప్రాయపడింది. కేవలం అవినాష్ రెడ్డిని జైల్లో వేయించడమే లక్ష్యంగా సునీత తీరు కనిపిస్తోందని వ్యాఖ్యానించింది. కేసుకు సంబంధించి అదనపు పత్రాలు సమర్పించేందుకు సునీతకు అవకాశమిచ్చింది సుప్రీంకోర్టు. ఈ కేసును జూన్ 19న పరిశీలిస్తానని తెలిపింది. -
తూర్పుగోదావరి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఏడుగురు మృతి
సాక్షి తూర్పుగోదావరి జిల్లా: అనంతపల్లి జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆగి ఉన్న లారీని కారు ఢీకొనడంతో ఏడుగురు మృతి చెందారు. విజయవాడ నుంచి రాజమండ్రికి వెళ్తుండగా ఘటన చోటుచేసుకుంది. మృతులు ఒకే కుటుంబానికి చెందిన వారిగా గుర్తించారు. మృతుల్లో ఇద్దరు మహిళలతో పాటు రెండేళ్ల చిన్నారి ఉంది. చదవండి: పెద్దల ముందే నరికి చంపాడు.. -
ఐదుగుర్ని బలిగొన్న రోడ్డు ప్రమాదం
వడమాలపేట/తిరుమల:టెంపోలో వెళ్తున్న భక్తులను తిరుపతి జిల్లా ఎస్వీ పురం టోల్‌ప్లాజా సమీపంలో ఎదురుగా వస్తున్న టెంపో ట్రావెలర్ వాహనాన్ని హెరిటేజ్ మిల్క్ ట్యాంకర్ ఢీకొట్టడంతో ఐదుగురు మృతి చెందగా.. 8 మందికి తీవ్ర గాయాలయ్యాయి. వడమాలపేట మండలం పుత్తూరు–తిరుపతి జాతీయ రహదారిపై అంజేరమ్మ కనుమ వద్ద ఆదివారం ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. తిరుపతిలోని ఎస్ఆర్ ఇండియా ప్రైమ్ ప్రాపర్టీస్ రియల్ ఎస్టేట్ నిర్వాహకులు సుబ్రహ్మణ్యం, రాజశేఖర్‌రెడ్డి వడమాలపేట మండలం ఎస్వీ పురంలోని అంజేరమ్మకు మొక్కు చెల్లించుకునేందుకు ఆదివారం మధ్యాహ్నం కారులో బయలుదేరగా.. వారి కార్యాలయంలో పనిచేసే 12 మంది సిబ్బంది టెంపో ట్రావెలర్‌లో బయలుదేరారు. టెంపో టోల్‌ప్లాజా దాటి అంజేరమ్మ ఆలయానికి వెళ్తుండగా.. ఎదురుగా వస్తున్న దానిని హెరిటేజ్ ట్యాంకర్ ఢీకొట్టింది. ప్రమాదంలో టెంపోలో ప్రయాణిస్తున్న 12 మందితోపాటు మిల్క్ ట్యాంకర్ డ్రైవర్‌కు తీవ్ర గాయాలయ్యాయి. 108 సిబ్బంది, టోల్ ప్లాజా అంబులెన్స్‌లో క్షతగాత్రులను పుత్తూరు ప్రభుత్వాస్పత్రికి తరలించగా.. అక్కడ చికిత్స పొందుతూ ఐరాల మండలానికి చెందిన రేవంత్ (44), ఆర్సీ పురానికి చెందిన గిరిజ (45) మృతి చెందారు. అక్కడి నుంచి క్షతగాత్రులను మెరుగైన చికిత్స కోసం తిరుపతి రుయా ఆస్పత్రికి తరలించగా.. అక్కడ చికిత్స పొందుతూ గంగాధర నెల్లూరుకు చెందిన హెరిటేజ్ మిల్క్ ట్యాంకర్ డ్రైవర్ శివకుమార్ (57), పాకాల మండలం శ్రీరంగరాజపురానికి చెందిన రేఖ (24), కుప్పానికి చెందిన అజయ్‌కుమార్ అలియాస్ అంజి (25) మృతి చెందారు. తీవ్రంగా గాయపడిన నెల్లూరుకు చెందిన రాజశేఖర్, తిరుపతి కొత్తపల్లెకి చెందిన లతారెడ్డి, సత్యనారాయణపురానికి చెందిన కాంతిరేఖ, నారాయణరెడ్డి, రెడ్డిగుంటకు చెందిన కుమారస్వామిరెడ్డి, అన్నమయ్య జిల్లా రామాపురానికి చెందిన నరసింహులు, రాజంపేటకు చెందిన సుజాత, సత్యసాయి జిల్లాకు చెందిన ఆంజనేయులు వివిధ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. వీరిలో ముగ్గురు పరిస్థితి విషమంగా ఉన్నట్టు సమాచారం. ప్రమాదం జరిగిన వెంటనే టెంపో డ్రైవర్ పరారయ్యాడు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు వడమాలపేట పోలీసులు తెలిపారు. ఘాట్ రోడ్డులో రెండు టెంపోలకు బ్రేక్ ఫెయిల్ కాగా, తిరుమల మొదటి ఘాట్ రోడ్డులో రెండు టెంపో ట్రావెలర్ వాహనాలకు బ్రేక్ ఫెయిల్ కావడంతో ఐదుగురికి గాయాలయ్యాయి. తిరుమల ట్రాఫిక్ డీఎస్పీ కొండయ్య తెలిపిన వివరాల మేరకు.. తమిళనాడు, చెన్నైకి చెందిన 12 మంది భక్తులు తిరుమల శ్రీవారి దర్శనం చేసుకుని ఆదివారం తిరుపతికి తిరిగి వెళుతుండగా.. మొదటి ఘాట్ రోడ్డుపై నాలుగో మలుపు వద్ద వాహనం బ్రేక్ ఫెయిల్ కావడంతో అదుపుతప్పి బోల్తాపడింది. ప్రమాదంలో ఐదుగురికి గాయాలయ్యాయి. ఘాట్ రోడ్డు భద్రతా సిబ్బంది క్షత్రగాత్రులను అంబులెన్స్‌లో తిరుపతి రుయా ఆస్పత్రికి, అక్కడి నుంచి ఇద్దరిని టీటీ బర్డ్ ఆస్పత్రికి తరలించారు. మరో ప్రమాదంలో తిరుపతికి చెందిన టెంపో ట్రావెలర్ వాహనంలో వివిధ ప్రాంతాలకు చెందిన భక్తులు తిరుమల నుంచి తిరుపతికి దిగుతుండగా 9వ మలుపు వద్ద వాహనం బ్రేక్ ఫెయిలై రక్షణ గోడను ఢీకొని ఆగిపోయింది. ఈ ప్రమాదంలో భక్తులెవరికీ ఎలాంటి ప్రమాదం జరగలేదు. -
Road Accident : ఎక్కడికి వెళ్లినా ముగ్గురిదీ ఒకే మాట.. ఒకే వాహనం...
(కాకినాడ జిల్లా): కాకినాడ జిల్లా తొండంగి మండలం జి.ముసలయ్యపేట వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో పాయకరావుపేట మండలం శ్రీరాంపురం గ్రామానికి చెందిన ముగ్గు రు యువకులు ప్రాణాలు కోల్పోయారు. తొండంగి ఎస్సై రవికుమార్, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం విశాఖ జిల్లా పాయకరావుపేట మండలం శ్రీరాంపురానికి చెందిన పోలవరపు కిరణ్ (23), పసుపులేటి దుర్గా శివప్రసాద్ (20), కాకర వీరబాబు(21) స్నేహితులు. వీరు ముగ్గురూ కలిసి బుధవారం రాత్రి బైకుపై స్వగ్రామం నుంచి బీచ్‌రోడ్డు మీదుగా అన్నవరంలో జరిగే స్నేహితుని వివాహానికి బయలుదేరారు. వేమవరం, యర్రయ్యపేట మీదుగా ముగ్గురూ వస్తుండగా జి.ముసలయ్యపేట వద్ద వీరి బైకు ట్రాక్టర్ ఢీకొట్టింది. దీంతో పోలవరపు కిరణ్, కాకర వీరబాబులు సంఘటన స్ధలంలో తీవ్రగాయాలై అక్కడికక్కడే మృతి చెందారు. దుర్గా శివప్రసాద్‌కు తీవ్రగాయాలై ప్రాణాపా య స్ధితిలో ఉండగా స్ధానికులు తుని ఏరియా ఆస్పత్రికి తీసుకెళ్లారు. అక్కడి నుంచి మెరుగైన వైద్యం కోసం కాకినాడ ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందాడు. మృతదేహాలను తుని ఏరియా ఆస్పత్రికి తరలించినట్లు పోలీసులు తెలిపారు. కన్నవారికి కడుపు కోత ఒకరికి తల్లిదండ్రుల్లేరు. మరొకరికి తండ్రి లేడు. ఇంకొకరికి తండ్రి ఉన్నా.. అతని అండ లేదు. కష్ట సుఖాల్లో ఒకరికొకరు తోడై ఉండేవారు. కష్టపడి పనిచేసుకుంటూ తమ కుటుంబాలకు అండగా ఉన్నారు. వయసులో వారి మధ్య ఏడాది, రెండేళ్ల వ్యత్యాసమే. ఎక్కడికి వెళ్లినా ముగ్గురిదీ ఒకే మాట.. ఒకే వాహనం. అలాంటి మిత్రులను మృత్యువు కూడా ఒకేసారి కాటేసింది. దీంతో ఒకే రోజు మూడు కుటుంబాల్లో విషాదం నెలకొని, గ్రామం మూగబోయింది. దుర్గాశివప్రసాద్కు తల్లిదండ్రుల్లేరు. చిన్నప్పటి నుంచి మేనత్త రమణమ్మ వద్దే ఉంటున్నాడు. రోడ్డు నిర్మాణానికి ఉపయోగించే మిల్లర్ పని చేస్తూ, ఆమెకు భరోసాగా ఉన్నాడు. ఇతని మరణంతో మేనత్త రమణమ్మ కన్నీరుమున్నీరుగా విలపిస్తోంది. కిరణ్‌కుమార్‌కు తల్లి లక్ష్మి, సోదరి హరిణి ఉన్నారు. తండ్రి బతికే ఉన్నా.. ఆ కుటుంబానికి దూరంగా ఉంటున్నాడని గ్రామస్తులు చెప్తున్నారు. తల్లి స్థానికంగా ఉన్న జీడిపిక్కల ఫ్యాక్టరీలో కూలిపని చేస్తుంది. సోదరి దివ్యాంగురాలు కావడంతో ఆశలన్నీ కిరణ్మీదే పెట్టుకున్నారు. కిరణ్ గ్రామంలో కూలి పనులతోపాటు, పెయింటింగ్ పనులకు వెళ్తుంటాడు. త్వరలోనే పెళ్లి చేసేందుకు సంబంధాలు కూడా చూస్తున్నారు. అలాంటి సమయంలోనే తమకు అందరాని దూరాలకు పోయిన కిరణ్‌ను తలచుకుంటూ ఆ తల్లి, కూతుళ్ల శోకం ఊరంతటినీ పట్టి కుదిపేస్తోంది. కాకర వీరబాబు మిల్లర్ పనితోపాటు, వ్యాన్ డ్రైవింగ్ చేస్తుంటాడు. తల్లిదండ్రులకు ఒక్కడే కుమారుడు. తండ్రి దారబాబు ఇంటి వద్దనే ఉంటాడు. తల్లి మేరీ గల్ఫ్‌లో ఉన్నట్లు కుటుంబీకులు తెలిపారు. కొడుకు మరణవార్త తెలుసుకుని ఆ తల్లి అక్కడి నుంచి బయలుదేరినట్టు తెలిసింది. -
Anakapalle: విడాకులు కోరిందని కసితో హత్య చేసిన భర్త
అచ్యుతాపురం (అనకాపల్లి): అతనిది గాజువాక..ఆమెది అగనంపూడి. ఇద్దరివీ వేర్వేరు కులాలు...ఇద్దరూ ఇష్టపడ్డారు...పెద్దలకు ఇష్టం లేకపోయినా పెళ్లి చేసుకున్నారు. అయితే మూడు నెలల్లోనే ప్రేమ కాస్తా ఆవిరైపోయింది. ఆమెకు కట్నం కోసం అత్తింటి వేధింపులు మొదలయ్యాయి. దానికి భర్త వేధింపులు తోడయ్యాయి. దీంతో మూణ్ణెళ్లకే వారి ప్రేమ పెళ్లి మూణ్ణాళ్ల ముచ్చటైంది. విసిగి వేసారిన భార్య విడాకులు కోరడంతో ప్రేమించిన భర్త పగబట్టాడు. భార్య ఉసురు తీశాడు. అచ్యుతాపురంలోని లాడ్జిలో గత నెల 29వ తేదీన మహాలక్ష్మి అనే వివాహిత హత్య కేసులో వెలుగు చూసిన విషయాలివి. ఈ కేసులో మృతురాలు తండ్రి ఎస్.సాంబ ఇచ్చిన ఫిర్యాదు మేరకు 302 సెక్షన్, ఎస్సీ, ఎస్టీ కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేశారు. వివరాలను పరవాడ డీఎస్పీ సత్యనారాయణ గురువారం విలేకరుల సమావేశంలో వెల్లడించారు. గాజువాక బీసీ కాలనీకి చెందిన శ్రీనివాస్, అగనంపూడిలో నివాసముంటున్న స్టీల్‌ప్లాంట్ ఉద్యోగి సాంబ కుమార్తె మహాలక్ష్మి మూడేళ్ల క్రితం ప్రేమించుకున్నారు. పెద్దల అంగీకారం లేనప్పటికీ పెళ్లి చేసుకున్నారు. వారి కాపురం మూడు నెలల వరకూ సజావుగా సాగింది. ఎస్టీ లంబాడీ కులానికి చెందిన మమహాలక్ష్మికి వంటలు రావని, కట్నం తేలేదని శ్రీనివాస్‌తో పాటు అతని కుటుంబ సభ్యులు చిన్నచూపుతో వేధించడం మొదలుపెట్టారు. దీనిని భరించలేక మహాలక్ష్మి పుట్టింటికి వెళ్లిపోయింది. అయినా శ్రీనివాస్ వేధింపులు మానలేదు. రాంబిల్లి మండలంలో రైతు భరోసా కేంద్రంలో పనిచేస్తున్న మహాలక్ష్మిపై ఉన్నతాధికారులకు ఫిర్యాదులు చేశాడు. అతని వేధింపులు తట్టుకోలేని మహాలక్ష్మి దువ్వాడ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేస్తామని చెప్పిన పోలీసులు మృతురాలు తనకు భర్త నుంచి విడాకులు కావాలని కోరడంతో ఫ్యామిలీ కోర్టులో తేల్చుకోమని సూచించారు. దీంతో విడాకుల కోసం ఫ్యామిలీ కోర్టుని ఆశ్రయించిన మహాలక్ష్మిపై శ్రీనివాస్ పగ పెంచుకున్నాడు. పథకం ప్రకారం గత నెల 29న అచ్యుతాపురంలోని లాడ్జిలో రూం తీసుకొని మహాలక్ష్మికి ఫోన్ చేశాడు. మంచిగా మాట్లాడి లాడ్జికి రమ్మని కోరాడు. అతని మాటలు నమ్మిన మహాలక్ష్మి భర్తను కలవడానికి వెళ్లింది. అప్పటికే రెండు కత్తులు, మత్తు ఇంజక్షన్లు, ట్యాబ్లెట్లు సిద్ధం చేసుకున్న శ్రీనివాస్ మహాలక్ష్మిపై సాయంత్రం 4 గంటలకు కత్తులతో విచక్షణా రహితంగా దాడి చేసి పొడిచాడు. ఆమె అరుపులు విని పక్కరూంలో ఉన్న వారు లాడ్జి మేనేజర్‌కు తెలపగా, వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు రంగంలోకి దిగి లాడ్జి తలుపులు తోసి లోపలకు వెళ్లగా రక్తపు మడుగులో మహాలక్ష్మి, బాత్రూంలో శ్రీనివాస్ పడి ఉన్నారు. వెంటనే ఇద్దరినీ అనకాపల్లి ఆస్పత్రికి తరలించారు. మెరుగైన చికిత్స నిమిత్తం విశాఖ కేజీహెచ్‌కు తీసుకెళ్తుండగా మహాలక్ష్మి మృతి చెందింది. శ్రీనివాస్ రెండు రోజుల తర్వాత కోలుకున్నాడు. ఈ నెల 8వ తేదీ ఉదయం శ్రీనివాస్‌ను అదుపులోకి తీసుకొని విచారించగా, జరిగినదంతా వెల్లడించాడని డీఎస్పీ విలేకరులకు తెలిపారు. విడాకులు ఇస్తే తన జీవితం నాశనం అవుతుందని, తన లాగే మహాలక్ష్మి జీవితం నాశనం కావాలనే కక్షతో శ్రీనివాస్ ఆమెను హత్య చేసినట్టు తేలిందని డీఎస్పీ పేర్కొన్నారు. విలేకరుల సమావేశంలో సీఐ మురళి పాల్గొన్నారు.