లైంగికదాడి కేసులో 8 మంది అరెస్ట్‌ | 8 people arrested in molestation case | Sakshi
Sakshi News home page

లైంగికదాడి కేసులో 8 మంది అరెస్ట్‌

Jun 19 2023 3:41 AM | Updated on Jun 19 2023 3:41 AM

8 people arrested in molestation case - Sakshi

నెల్లూరు(క్రైమ్‌): శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా నెల్లూరులో సంచలనం రేకెత్తించిన యువతిపై లైంగికదాడి కేసులో 8 మంది నిందితులను పోలీసులు ఆదివారం అరెస్ట్‌ చేశారు. నగర డీఎస్పీ డి.శ్రీని వాసరెడ్డి తన కార్యాలయంలో నిందితుల వివరాలను వెల్లడించారు. శ్రీకాకుళం జిల్లాకు చెందిన ఓ యువతి కోవూరు మండలంలోని ఓ గ్రామంలో నివాసముంటున్న తన అక్క ఇంటికొచ్చింది. 

ఆమె అక్క గర్భిణి కావడంతో నెల్లూరులోని ఆస్పత్రిలో సిజేరియన్‌ చేశారు. అక్కకు తోడుగా ఆమె ఆస్పత్రి లో ఉంటున్నారు. ఈ నెల 10న యువతి మందుల కోసం గాంధీబొమ్మ సెంటర్‌ వద్దకొచ్చింది. నె ల్లూరుకి చెందిన పాతనేరస్తులైన భాను విష్ణువర్ధన్‌ అలియాస్‌ లడ్డసాయి, జగదీష్‌ అలియాస్‌ డి యోసాయి, యుగంధర్‌ అలియాస్‌ యుగి, ఎ.సుజన్‌కృష్ణ అలియాస్‌ చింటూ ఆమెను బలవంతంగా ఆటోలో ఎక్కించుకుని..కత్తితో బెదిరించి కొండాయపాళెంలోని ఖాళీ స్థలంలో లైంగికదాడి చేశారు.

అనంతరం వారి స్నేహితులైన భాను సాయివర్ధన్, షేక్‌ హుస్సేన్‌బాషా అలియాస్‌ కేటీఎం, సాయిసాత్విక్, కె.అజయ్, రేవంత్‌లను పిలిపించి వారితో కూడా  లైంగికదాడి చేయించారు. యువతి కేకలను గమనించిన స్థానికులు ‘దిశ’కు కాల్‌ చేశారు. పోలీసులు ఘటన స్థలానికి చేరుకోగా దుండగులు  పారి పోయారు. ఘటనాస్థలిలో బైక్‌లను పోలీసులు స్వాధీనం చేసుకుని పోలీసులు కేసు నమోదు చేశారు. బైక్‌లు, ఆటో నంబర్ల ఆధారంగా నిందితులను గుర్తించారు. ఆదివారం గొలగమూడి క్రాస్‌ రోడ్డు సమీపంలో నిందితుల్లో 8 మందిని అరెస్ట్‌ చే శారు. డియోసాయి పరారీలో ఉన్నాడు.

Advertisement
 
Advertisement
Advertisement