breaking news
-
హత్యాచారం దోషుల్ని కఠినంగా శిక్షించాలి
కడియం: తూర్పుగోదావరి జిల్లా కడియం మండలం కడియపులంక పంచాయతీలోని బుర్రిలంకలో మహిళపై అత్యాచారం చేసి, హత్యచేసిన వారిని కఠినంగా శిక్షించాలని వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ, పార్టీ యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షుడు జక్కంపూడి రాజా ఎస్పీ డి.నరసింహకిశోర్‌ని కోరారు. వారు శనివారం రాజమహేంద్రవరంలో ఎస్పీని కలిసి ఈ మేరకు వినతిపత్రం ఇచ్చారు. అనంతరం వారు పార్టీ నాయకులతో కలిసి బుర్రిలంకలో బాధితురాలు రౌతు కస్తూరి కుటుంబాన్ని పరామర్శించారు. పార్టీ తరఫున రూ.1.1 లక్షల ఆర్థికసాయం అందజేశారు. న్యాయం జరిగేంతవరకు తాము అండగా ఉంటామని బాధిత కుటుంబానికి ధైర్యం చెప్పారు. అనంతరం వారు మాట్లాడుతూ వైఎస్సార్సీపీ తరఫున తాము వస్తున్నామని.. కూటమి ఎమ్మెల్యే హడావుడిగా వచ్చి బాధితుల చేతిలో రూ.పదివేలు పెట్టి వెళ్లడం చూస్తుంటే ఈ ఘటన పట్ల ప్రభుత్వం ఎంత నిర్లక్ష్యంగా ఉందో తెలుస్తోందని చెప్పారు. పత్రికలు తిరగేస్తే ఓ హత్య, ఓ మానభంగం కచ్చితంగా కన్పిస్తున్నాయన్నారు. ఇలాంటి దారుణాలను ప్రశ్నిస్తున్న వైఎస్సార్సీపీ వాళ్ల కాళ్లు విరగ్గొడతామని, 11 సీట్లు వచ్చినా నోరు లేస్తోందా అంటూ బెదిరిస్తున్నారని చెప్పారు. దిశ యాప్ తీసేయడం ద్వారా నేరాలు చేసేవారికి రక్షణ కల్పిస్తామని భరోసా ఇచ్చినట్లయిందన్నారు. ఇంత పాశవికంగా మహిళను హత్య చేస్తే జనసేన, టీడీపీ నాయకులు బైటకు పొక్కకుండా చేయాలని ప్రయత్నించడం శోచనీయమని చెప్పారు. దోషులను కఠినంగా శిక్షించకపోతే తమపార్టీ ఉద్యమిస్తుందని వారు తెలిపారు. బాధిత కుటుంబాన్ని పరామర్శించినవారిలో వైఎస్సార్సీపీ పీఏసీ సభ్యురాలు జక్కంపూడి విజయలక్ష్మి, డీసీసీబీ మాజీ చైర్మన్ ఆకుల వీర్రాజు, రుడా మాజీ చైర్ç³ర్సన్ మేడపాటి షర్మిలారెడ్డి, రాజమహేంద్రవరం పార్లమెంట్ నియోజకవర్గ పార్టీ ఇన్చార్జి డాక్టర్ గూడూరి శ్రీనివాస్, పార్టీ రాష్ట్ర కార్యదర్శులు నక్కా రాజబాబు, గిరజాల బాబు తదితరులున్నారు. -
చిన్నారిని చిదిమేసిన కామాంధుడు
సాక్షి ప్రతినిధి, తిరుపతి: చిత్తూరు జిల్లా పుంగనూరులో చిన్నారి హత్య ఘటన మరువక ముందే తిరుపతి జిల్లా వడమాలపేటలో మరో దారుణం జరిగింది. ముక్కుపచ్చలారని మూడున్నరేళ్ల గిరిజన చిన్నారిపై ఓ కామాంధుడు అతికిరాతకంగా లైంగిక దాడి చేసి, ఆపై హత్య చేశాడు. పోలీసులు, కుటుంబీకుల కథనం ప్రకారం.. తిరుపతి జిల్లా కేవీబీ పురం ఓళ్లూరు గిరిజన కాలనీకి చెందిన దంపతులు ఇద్దరు పిల్లలతో కలిసి దీపావళి పండుగ కోసం పది రోజుల క్రితం వడమాలపేట మండలం ఏఎం పురం ఎస్టీ కాలనీకి వచ్చారు. చిన్నారి మేనమామకు కాలు విరగడంతో ఆ బాలిక తండ్రి, కుటుంబీకులు సమీపంలోని పుత్తూరు రాచపాలెంలో శల్య వైద్యశాలకు తీసుకెళ్లారు. ఆ సమయంలో చిన్నారి తల్లితో ఉంది. చిన్నారికి వరుసకు మేనమామ అయిన ఏఎం పురానికి చెందిన సుశాంత్ ఆ బాలికకు చాక్లెట్ ఇప్పిస్తానని అంగడికి తీసుకెళ్లాడు. దుకాణం నుంచి చిన్నారిని పక్కనే ఉన్న సచివాలయం, పాఠశాల మధ్యలోకి తీసుకెళ్లి కిరాతకంగా లైంగిక దాడికి పాల్పడ్డాడు. విషయం బయటకు పొక్కకుండా చిన్నారిని పక్కనే ఉన్న మురికి కాలువలో తొక్కి అతి కిరాతకంగా చంపేశాడు. మృతదేహం పైకి కనిపించకుండా కాలువలోనే పూడ్చిపెట్టాడు. శరీరానికి బురద అంటుకోవడంతో పక్కనే స్నానం చేసి తిరిగి వచ్చాడు. సాయంత్రం వరకు చిన్నారి రాకపోవడంతో తల్లి చుట్టుపక్కల వెతికింది. ఎంతకీ కనిపించలేదు. ఈలోపు సుశాంత్ అక్కడికి రావడంతో పాప ఎక్కడ అని ప్రశ్నించింది. చాక్లెట్ ఇచ్చాక పాపను ఇంటి వద్దే వదలేశానని, నాకు తెలియదు అంటూ తడబడుతూ సమాధానం ఇచ్చాడు. గట్టిగా నిలదీయడంతో సుశాంత్ తప్పించుకునేందుకు పరుగులు పెట్టాడు. కాలనీ వాసులు సుశాంత్‌ని పట్టుకుని గట్టిగా నిలదీశారు. ఎంతకూ సమాధానం చెప్పకపోవడంతో శుక్రవారం రాత్రి చిన్నారి తల్లి, బంధువులు కలిసి అతన్ని వడమాలపేట పోలీసులకు అప్పగించి ఫిర్యాదు చేశారు. అప్పటికే అతను మద్యం, గంజాయి మత్తులో కూడా ఉన్నట్లు స్థానికులు చెబుతున్నారు. కాగా చిన్నారి అచూకీ కోసం తల్లిదండ్రులు, బంధువులు రాత్రంతా టార్చిలైట్ల వెలుతురులో పరిసర ప్రాంతాలన్నీ గాలించారు. ఎక్కడా ఆచూకీ దొరక్కపోవడంతో తిరిగి పోలీస్ స్టేషన్‌కు వచ్చారు. పోలీసులు తమదైన శైలిలో విచారించడంతో సుశాంత్ దారుణాన్ని ఒప్పుకున్నాడు. అతను చెప్పిన వివరాలతో శనివారం వేకువజామున మురికి కాలువలో నుంచి మృతదేహాన్ని వెలికితీసి పోస్టుమార్టం కోసం పుత్తూరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఈ విషయం తెలుసుకున్న చిన్నారి బంధువులు, ఓళ్లూరు, ఏఎం పురం గిరిజన కాలనీల వారంతా పెద్ద సంఖ్యలో ఆస్పత్రి వద్దకు వచ్చారు. -
తిరుపతి: స్నాప్ చాట్‌లో పరిచయం.. బాలికపై లైంగిక దాడి
సాక్షి, తిరుపతి: నగరంలో దారుణం జరిగింది. ఓ ప్రైవేటు లాడ్జిలో బాలికపై లైంగిక దాడికి పాల్పడ్డారు. తిరుపతిలోని ఓ విద్యాలయంలో 9వ తరగతి చదువుతున్న బాలికపై ఓ యువకుడు లైంగిక దాడి చేశాడు.చెన్నై ఓ హోటల్లో పని చేస్తున్న ఓ యువకుడు ఆన్లైన్ స్నాప్ షాట్ ద్వారా బాలిక పరిచయమైంది.బాలిక ప్రవర్తనను గమనించిన తల్లిదండ్రులు విషయం ఆరా తీయగా విషయం బయటపడింది. యువకుడిని పశ్చిమగోదావరి జిల్లా తాళ్లపూడి మండలం, మలకపల్లి గ్రామానికి చెందిన సతీష్ (22)గా గుర్తించారు. జరిగిన ఘటనపై బాలిక తల్లిదండ్రులు అలిపిరి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. నిందితుడిపై ఫోక్సోకేసు నమోదు చేసిన పోలీసులు రిమాండ్‌కు తరలించారు. -
కర్నూలులో రోడ్డు ప్రమాదం.. ముగ్గురి మృతి
సాక్షి,కర్నూలుజిల్లా: కర్నూలు జిల్లాలోని నందవరం మండలం ధర్మపురం గ్రామం వద్ద ఎన్‌హెచ్-167పై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. శనివారం(నవంబర్ 2) ఉదయం జరిగిన ఈ ప్రమాదంలో ముగ్గురు మృతి చెందారు. అతివేగంతో వెళుతున్న కారు ఆటోను ఢీకొట్టింది.ప్రమాదంలో ఆటోలో ప్రయాణిస్తున్న వీర నాగమ్మ అక్కడికక్కడే మృతి చెందింది. మరో ఇద్దరిని కర్నూల్ ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గ మధ్యలో ప్రాణాలు విడిచారు. ప్రమాదంలో ఇద్దరికి గాయలవగా గాయపడినవారిలో చాన్నిరి రిజియా పరిస్థితి విషమంగా ఉంది. ఇదీ చదవండి: కోదాడ వద్ద ఢీకొన్న బస్సులు.. 30 మందికి గాయాలు -
AP: మూడేళ్ల చిన్నారిపై హత్యాచారం
సాక్షి,తిరుపతి: తిరుపతి జిల్లాలో మూడేళ్ల చిన్నారి హత్యాచారం ఘటన సంచలనం రేపింది. వడమాలపేట మండలం ఏఎంపురంలో శుక్రవారం(నవంబర్ 1) సాయంత్రం ఈ దారుణం చోటు చేసుకుంది. ఈ ఘటనపై జిల్లా ఎస్పీ సుబ్బారాయుడు మాట్లాడుతూ ‘ఏఎం పురంలో ఇంటి దగ్గర ఉన్న చిన్నారిని చాక్లెట్లు కొనిస్తాను అని మాయమాటలు చెప్పి సుశాంత్ అనే అబ్బాయి తీసుకుని వెళ్ళాడు. నిందితుడు సుశాంత్ చాలా నమ్మకంగా ఆడించినట్లు నటించి చిన్నారిని తీసుకు వెళ్లి అత్యాచారం చేసి హత్య చేశాడు. చట్ట పరంగా నిందితుడికి కఠినంగా శిక్ష పడేలా చూస్తాం’అని తెలిపారు. కాగా, శుక్రవారం సాయంత్రం తాము ఇంటి నుంచి పనిమీద బయటికి వెళ్లి వచ్చేసరికి పాప కనిపించలేదని తల్లదండ్రులు మమత,మధులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. సుశాంత్ అనే అతను తాము బయటికి వెళ్లేటపుడు పాపతో ఆడుకుంటున్నాడని పోలీసులకు వారు చెప్పారు. దీంతో పోలీసులు సుశాంత్‌ను అదుపులోకి తీసుకుని ప్రశ్నించగా అసలు విషయం బయటపడింది. పాప మృతదేహాన్ని పోలీసులు గుర్తించారు. పుత్తూరు ఆస్పత్రిలో పాప మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించారు. ఇదీ చదవండి: బాలికపై గ్యాంగ్‌రేప్ -
జమ్మూ కశ్మీర్లో ఇద్దరు ఏపీ విద్యార్థుల దుర్మరణం
పత్తికొండ (తుగ్గలి)/గిద్దలూరు రూరల్: జమ్మూ కశ్మీర్లో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఏపీకి చెందిన ఇద్దరు బీటెక్ విద్యార్థులు దుర్మరణం చెందారు. కారు అదుపు తప్పి లోయలో పడిన ఘటనలో మొత్తం నలుగురు మృతి చెందగా వారిలో వీరిద్దరూ ఉన్నారు. మృతుల కుటుంబీకులు తెలిపిన వివరాల మేరకు.. కర్నూలు జిల్లా పత్తికొండలో స్థిర నివాసమేర్పరచుకున్న తుగ్గలి మండలం పెండేకల్లుకు చెందిన పాటిల్ ప్రతాపరెడ్డి, అనిత దంపతుల పెద్ద కుమారుడు వెంకట ఆనందరెడ్డి (21), ప్రకాశం జిల్లా గిద్దలూరు పట్టణంలోని శ్రీరాంనగర్‌కు చెందిన చెందిన ఆర్మీ జవాన్ రమణారెడ్డి కుమార్తె కావ్యారెడ్డి (19) ప్రమాదంలో మృత్యువాత పడ్డారు. పంజాబ్‌లోని లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీలో వీరు బీటెక్ చదువుతున్నారు. అయితే కావ్యారెడ్డి చెల్లెలు మనీషా (19) కూడా అదే కాలేజీలో బీటెక్ ఫస్టియర్ చదువుతోంది. దీపావళికి వరుస సెలవులు రావడంతో గత నెల 28వ తేదీన జమ్మూ కశ్మీర్‌కు 30 మంది స్నేహితులతో కలిసి ఆరు కార్లలో విహారయాత్రకు వెళ్లారు. 30వ తేదీ తిరుగు ప్రయాణంలో శ్రీనగర్–జమ్మూ నేషనల్ హైవేలో రామబన్ జిల్లా మగర్కూట్ వద్ద పర్వతాల మధ్య కారు అదుపు తప్పి లోయలోకి దూసుకెళ్లింది. ఘటనలో ఆనందరెడ్డి, కావ్యారెడ్డి, మరో ఇద్దరు విద్యార్థులు మృతి చెందారు.కాగా, కారు లోయలో పడటాన్ని గమనించిన మనీషా వెంటనే డోరు తీసుకుని రోడ్డుపైకి దూకేసింది. దీంతో ఆమె చెయ్యి విరిగి తల పగిలింది. పరిస్థితి కొంత విషమంగా ఉంది. సమాచారం అందుకున్న మృతుల తల్లిదండ్రులు హుటాహుటిన ఘటనాస్థలానికి బయలుదేరి వెళ్లారు. శనివారం ఉదయం మృతదేహాలు స్వస్థలాలకు చేరుకుంటాయని బంధువులు తెలిపారు. -
పండుగ వేళ దారుణం.. ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మృతి
సాక్షి, కాకినాడ జిల్లా: దీపావళి పండుగ వేళ కాకినాడ జిల్లాలో దారుణం జరిగింది. కాజులూరు మండలం సెలపాకలో రెండు కుటుంబాల మధ్య ఘర్షణ జరిగింది. బత్తుల కుటుంబీకులపై పొట్లకాయ ఫ్యామిలీ కత్తులతో దాడి చేశారు. దీంతో ఒకే కుటుంబానికి ముగ్గురు మృతిచెందారు.మృతులు బత్తుల రమేష్, రాజు, చిన్నిగా గుర్తించారు. దాడి తర్వాత నిందితులు పరారయ్యారు. గాయపడ్డ నాలుగో వ్యక్తిని కాకినాడ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఘటనకు రాజకీయ కక్షలే కారణమని పోలీసులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఘటనా స్థలానికి చేరుకుని జిల్లా ఎస్పీ విక్రాంత్ విచారిస్తున్నారు. సెలపాక గ్రామంలో భారీగా పోలీస్ బలగాలను మోహరించారు. -
తూ.గో.లో ఘోరం.. బాణాసంచా తయారీ కేంద్రంపై పిడుగుపాటు
సాక్షి, తూర్పుగోదావరి: జిల్లాలో బుధవారం ఘోరం జరిగింది. వాతావరణం ఒక్కసారిగా మారిపోయి ఉరుములు, మెరుపులతో కూడిన వాన పడింది. ఈ క్రమంలో ఓ బాణాసంచా తయారీ కేంద్రంపై పిడుగు పడి అగ్నిప్రమాదం చోటు చేసుకోగా.. ఇద్దరు మృతి చెందారు. పలువురు తీవ్రంగా గాయపడ్డారు. ఉండ్రాజవరం మండలం సూర్యరావు పాలెం గ్రామంలో బుధవారం ఈ ఘటన చోటు చేసుకుంది. పిడుగు దాటికి బాణాసంచా తయారీ కేంద్రంలో షార్ట్ సర్క్యూట్ అయ్యింది. ఆ వెంటనే భారీగా మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో ఇద్దరు అక్కడికక్కడే మరణించగా.. మిగతా కూలీలు ప్రాణభయంతో సమీపంలోని అరటి తోటల్లోకి పరిగెత్తారు. ఈ ప్రమాదంలో బాణాసంచా తయారీ కేంద్రం పూర్తిగా దగ్ధమైంది. మరణించిన ఇద్దరు మహిళలని, బాణాసంచా తయారీ కేంద్రంలో పని చేసే వారిగా తెలుస్తోంది. గాయపడ్డ వాళ్లను ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. -
సమీరా వచ్చేస్తున్నా!.. నువ్వేం కంగారుపడకు.. బాబు తిన్నాడా..!
శ్రీకాళహస్తి: ‘సమీరా వచ్చేస్తున్నా... మరో 15 నిమిషాల్లో నీ ముందుంటా.. నువ్వేం కంగారుపడకు.. బాబు తిన్నాడా..! నువ్వు భోజనం చేసి పడుకో.. ఐ యామ్ ఆన్ది వే..’ అన్న భర్త తెల్లారేసరికి విగత జీవిగా కనిపించడం ఆమె గుండెల్ని పిండేసింది. ఈ ఘటన స్థానికంగా పెను విషాదాన్ని నింపింది. పోలీసుల కథనం.. బుచ్చినాయుడుకండ్రిగ మండలం, జోగికండ్రిగకు చెందిన కొప్పల ధర్మయ్య కుమారుడు కొప్పల నారాయణ(25) డిగ్రీ వరకు చదివి రౌతుసూరమాల సమీపంలో ఓ ప్రైవేటు పరిశ్రమలో పనిచేస్తున్నాడు. నారాయణకు పెళ్లకూరు మండలం, నెలబల్లి దళితవాడకు చెందిన సమీరాతో ఏడాదిన్నర క్రితం వివాహమైంది. వీరికి ఏడాది వయసున్న కుమారుడు ఉన్నాడు. ఈ క్రమంలో భార్య సమీరా కొడుకుతో కలిసి పుట్టింటికి వెళ్లింది. ఆమెను చూసేందుకు నారాయణ రెండు రోజుల కిందట నెలబల్లి వెళ్లాడు. ఈ క్రమంలో సోమవారం ఉదయం వ్యక్తిగత పనుల నిమిత్తం ద్విచక్ర వాహనంలో శ్రీకాళహస్తికి వెళ్లాడు. తిరిగి వస్తూ తన మేనత్త ఊరైన తాటిపర్తికి చేరుకున్నాడు. రాత్రి పది అవుతున్నా నారాయణ ఇంటికి రాకపోవడంతో సమీరా భర్తకు ఫోన్ చేసింది. తాను తాటిపర్తిలో ఉన్నానని, మరో 15 నిమిషాల్లో నీ ముందుంటానని సమాధానం ఇచ్చాడు. ఈ క్రమంలో నెలబల్లికి మార్గమధ్యంలో నాయుడుపేట–మదనపల్లి జాతీయ రహదారికి అతి సమీపంలో రామానాయుడు ఎస్టీ కాలనీ వద్ద ద్విచక్ర వాహనం అదుపు తప్పి బండరాయిని ఢీకొంది. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డ నారాయణ అక్కడికక్కడే మృతి చెందాడు. బండరాయిని ఢీకొన్న సమయంలో నారాయణ బైక్‌తో పాటు ముళ్లపొదల్లో పడిపోవడంతో ఎవ్వరూ గుర్తించలేకపోయారు. ఇప్పుడే వస్తానన్న భర్త తెల్లారైనా ఇంటికి రాకపోవడంతో సమీరా తాటిపర్తిలోని తమ బంధువులకు సమాచారం అందించింది. దీంతో వారు ఆరా తీయగా ముళ్లపొదల్లో విగతజీవిగా పడి ఉండడాన్ని చూసి బోరుమన్నారు. తొట్టంబేడు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని స్వాధీనం చేసు కుని పోస్టుమార్టం నిమిత్తం శ్రీకాళహస్తి ఏరియా ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ ఈశ్వరయ్య తెలిపారు. -
భార్య గొంతు కోసిన భర్త
జమ్మలమడుగు: భార్యపై అనుమానం పెంచుకున్న భర్త బ్లేడ్‌తో ఆమె గొంతు కోసి పరారయ్యాడు. వైఎస్సార్ జిల్లా జమ్మలమడుగులోని ఎస్సీ కాలనీకి చెందిన మేరీ, విజయ్ భార్యభర్తలు. విజయ్ ఆటోలో కూరగాయల వ్యాపారం చేస్తుంటాడు. కొంత కాలంగా మేరీపై అనుమానం పెంచుకున్నాడు. తన భార్య ఇతరులతో సంబంధం పెట్టుకుందనే అనుమానించేవాడు. భార్యతో పాటు ఆదివారం ప్రార్థన కోసం టౌన్ చర్చికి వచ్చాడు. ప్రార్థన చేస్తున్న సమయంలో ఉన్నట్లుండి భర్త విజయ్ తనతోపాటు తెచ్చుకున్న బ్లేడ్‌తో భార్య మేరీ గొంతు కోశాడు. గొంతు, మెడ దగ్గర తీవ్ర గాయాలై రక్తస్రావం ఎక్కువగా అవుతుండటంతో స్థానికులు రక్త స్రావం జరుగకుండా గుడ్డను గొంతుకు కట్టి ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ప్రాథమిక చికిత్స అనంతరం మెరుగైన చికిత్స కోసం కడప రిమ్స్‌కు తరలించారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. కాగా, మొదటి భార్య చనిపోవడంతో విజయ్ ఎస్సీ కాలనీకి చెందిన మేరీని 15 ఏళ్ల క్రితం రెండవ వివాహం చేసుకున్నాడు. వీరికి ఇద్దరు సంతానం . ఒక బాబు పీఆర్ ఉన్నత పాఠశాలలో చదువుతుండగా.. మరో బాబు గురుకుల పాఠశాలలో చదువుతున్నాడు. -
హత్యకు యత్నం.. స్టేషన్‌కెళ్తే అక్కడా దాడి..
సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం/కాశీబుగ్గ: కూటమి అధికారంలోకి వచ్చినప్పటినుంచి రెచ్చిపోయి ప్రవర్తిస్తున్న తెలుగుదేశం నేతలు మరింత బరితెగించారు. శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గలో వైఎస్సార్సీపీ వర్గీయులపై హత్యాయత్నం చేయడమేగాక ఫిర్యాదు చేసేందుకు వెళ్లినవారిపై పోలీస్ స్టేషన్లోనే దాడిచేసి తీవ్రంగా కొట్టారు. వారిస్తున్న పోలీసుల్ని పక్కకు తోసేశారు. పోలీసు స్టేషన్లో కూడా బాధితులకు రక్షణ లేకపోవడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. తన అనుచరులపై దాడిని ఖండిస్తూ పోలీస్ స్టేషన్‌కు బయలుదేరిన మాజీ మంత్రి అప్పలరాజును పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. పలాస–కాశీబుగ్గ మున్సిపాలిటీ కేటీ రోడ్డులోని నిత్య ప్రైవేటు ఆస్పత్రి ఎదురుగా మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు అనుచరుడు, పాత్రికేయుడు అల్లు రమణ, వైఎస్సార్సీపీ సోషల్ మీడియా సభ్యుడు వేణుగోపాలరెడ్డి, మరో ఇద్దరు శనివారం రాత్రి మాట్లాడుకుంటున్నారు. ఆ సమయంలో పలాస మండలం వీరభద్రాపురం గ్రామానికి చెందిన టీడీపీ నాయకుడు కొర్ల విష్ణుచౌదరి తన కారులో అక్కడికి వచ్చాడు. కారునుంచి దిగి వారిపై దాడిచేశాడు. వారిని కొట్టి, కారులోంచి కత్తి తెచ్చి హత్యాయత్నం చేశాడు. అక్కడి నుంచి తప్పించుకున్న రమణ తన స్నేహితుడు మొదలవలస మన్మథరావును తీసుకుని ఫిర్యాదు చేసేందుకు పోలీస్ స్టేషన్‌కు వెళ్లారు. పోలీసు స్టేషన్లోనే.. విష్ణుచౌదరి తమను హత్యచేయడానికి ప్రయత్నించిన కత్తిని పోలీస్ స్టేషన్లో రిసెప్షన్ వద్ద అప్పగించిన రమణ, మన్మథరావు ఫిర్యాదు రాయసాగారు. అదేసమయంలో విష్ణుచౌదరి, టీడీపీకి చెందిన బడ్డ నాగరాజు, జోగ మల్లి, బడ్డ నాగరాజు బంధువులు ఇద్దరు, మరికొందరు పోలీసు స్టేషన్లోకి వచ్చి రమణ, మన్మథరావుపై దాడిచేశారు. వారి దుస్తులను చించేసి, పిడిగుద్దులతో రెచ్చిపోయి భయానక వాతావరణం సృష్టించారు. అడ్డుకునేందుకు ప్రయత్నించిన పోలీసులను పక్కకు తోసేసి, హెచ్చరించారు. మీరిలా పోలీసు స్టేషన్లో కొడుతుంటే తమ ఉద్యోగాలు పోతాయని పోలీసులు ప్రాధేయపడినా టీడీపీ రౌడీలు వెనక్కి తగ్గలేదు. టీడీపీ నాయకుల దాడిని ఒకరు సెల్ఫోన్లో రికార్డు చేయడంతో బయట ప్రపంచానికి తెలిసింది. ఈ దృశ్యాలు సోషల్ మీడియా ద్వారా వెలుగులోకి రావడంతో పలాస ప్రజలు భయభ్రాంతులవుతున్నారు. పోలీస్ స్టేషన్‌కు బయలుదేరిన మాజీ మంత్రి అప్పలరాజును పోలీసులు అడ్డుకోవడంతో ఆయన రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా వైఎస్సార్సీపీ వర్గీయులు, పోలీసులకు మధ్య తోపులాట జరిగింది. పోలీస్‌స్టేషన్‌లో దాడిపై కేసు నమోదు కాశీబుగ్గ పోలీసుస్టేషన్లో శనివారం రాత్రి జరిగిన దాడికి సంబంధించి నలుగురు వ్యక్తులపై కేసు నమోదు చేసినట్లు సీఐ దాడి మోహనరావు తెలిపారు. టీడీపీ నాయకులు విష్ణు చౌదరి, వంశీతో పాటు వైఎస్సార్సీపీ నాయకులు అల్లు రమణ, మొదలవలస మన్మధ.. కానిస్టేబుల్ నారాయణ విధులకు ఆటంకం కలిగించినట్లు కేసు నమోదు చేసినట్లు వెల్లడించారు. ఎస్పీగారూ.. ఏం జరుగుతోంది? ఎస్పీగారూ.. కాశీబుగ్గ పోలీసు స్టేషన్లో ఏం జరుగుతోంది. పోలీసుల సమక్షంలో చోటుచేసుకున్న ఘటన తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. జరిగిన ఘటనపై ఎఫ్ఐఎర్ నమోదు చేసి, న్యాయం జరిగేలా చర్యలు తీసుకోండి. – విజయసాయిరెడ్డి, ఎంపీ, వైఎస్సార్సీపీ రీజినల్ కోఆర్డినేటర్ రాష్ట్రంలో ఎమర్జెన్సీ పరిస్థితులు రాష్ట్రంలో.. ముఖ్యంగా పలాస నియోజకవర్గంలో ఎమర్జెన్సీ నాటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. గత ఐదేళ్లలో అభివృద్ధి పనులు జరిగిన పలాసలో ఇప్పుడు మళ్లీ అరాచకం రాజ్యమేలుతోంది. టీడీపీ నాయకుడు బాలికపై దాడి చేస్తే పోక్సో కేసు ఎందుకు పెట్టలేదని ప్రశ్నించారు. తమపై హత్యాయత్నం జరిగిందని పోలీస్ స్టేషన్‌కు వెళ్లినవారిపై టీడీపీ వర్గీయులు దాడిచేసినా పోలీసులు ఏమీ చేయలేకపోయారన్నారు. ఇక్కడి గూండాలను స్థానిక ఎమ్మెల్యే కాపాడుతున్నారని మండిపడ్డారు. – సీదిరి అప్పలరాజు, మాజీ మంత్రి -
ప్రాణం తీసిన ఈత సరదా
తాడేపల్లిరూరల్/అజిత్‌సింగ్‌నగర్ (విజయవాడసెంట్రల్): ఈతకొట్టేందుకు కృష్ణా నదిలో దిగిన ఐదుగురు యువకులు ప్రమాదవశాత్తూ ఊబిలో కూరుకుపోగా వారిలో ముగ్గుర్ని మత్స్యకారులు కాపాడారు. ఇద్దరు మరణించారు. గుంటూరు జిల్లా సీతానగరం రైల్వే బ్రిడ్జ్ సమీపంలో ఆదివారం ఈ ఘటన చోటుచేసుకుంది. విజయవాడ రాజరాజేశ్వరిపేటకు చెందిన గుడివాడ వెంకటేశ్వరరావు కుమారుడు దుర్గాప్రసాద్(23), చివుకు రమేష్ కుమారుడు హేమంత్ కుమార్ (17) మరో ముగ్గురితో కలిసి ఆదివారం సాయంత్రం సీతానగరం రైల్వే బ్రిడ్జి వద్ద కృష్ణా నదిలో ఈతకొట్టేందుకు దిగారు. ఈ క్రమంలో రైల్వే బ్రిడ్జి రెండో దిమ్మె వద్ద ఉన్న ఊబిలో కూరుకుపోయారు. హేమంత్, దుర్గాప్రసాద్ పూర్తిగా నీటలో మునిగిపోగా మిగిలిన ముగ్గురూ కేకలు వేయగా మత్స్యకారులు ముగ్గుర్ని కాపాడారు. మరో ఇద్దరు మునిగినిపోయారని చెప్పడంతో మత్స్యకారులు వారిని వెతుకుతుండగా ముగ్గురూ అక్కడినుంచి వెళ్లిపోయారు. సమాచారం అందుకున్న తాడేపల్లి సీఐ కళ్యాణ్‌రాజు సిబ్బందితో అక్కడికి చేరుకుని మత్స్యకారుల సహాయంతో ఇద్దరి మృతదేహాలను వెలికితీశారు. మరణించిన ఇద్దరిలో దుర్గాప్రసాద్ దివ్యాంగుడు, ఎల్రక్టీíÙయన్‌గా పనిచేస్తూ తల్లిదండ్రులకు అండగా నిలుస్తున్నాడు. హేమంత్ ఇంటర్మీడియెట్ చదువుతున్నాడు. సూర్యలంక తీరంలో యువకుడు గల్లంతు బాపట్ల: బాపట్ల జిల్లా సూర్యలంక తీరంలో స్నానం చేస్తుండగా ఒక్కసారిగా వచ్చిన భారీ అలలకు గుంటూరు కొత్తపేటకు చెందిన రేషి కళ్యాణ్ (20) అనే యువకుడు కొట్టుకుపోయి మృతి చెందాడు. గుంటూరు నుంచి వచ్చిన తొమ్మిది మంది సముద్రంలో స్నానానికి దిగగా ఒక్కసారిగా పెద్ద అలలు రావడంతో కల్యాణ్ కొట్టుకుపోయాడు. -
వైద్యుల నిర్లక్ష్యమే.. ప్రాణాలు తీసింది
లబ్బీపేట (విజయవాడతూర్పు): ప్రాణాపాయస్థితిలో చికిత్స కోసం వస్తే సకాలంలో వైద్యం అందకపోవడం వల్లే రోగి మృతి చెందాడంటూ బంధువులు ఆందోళనకు దిగిన ఘటన శనివారం విజయవాడలో చోటుచేసుకుంది. మృతుని మేనమామ కథనం మేరకు.. కృష్ణాజిల్లా, పామర్రు మండలం జుజ్జువరం గ్రామానికి చెందిన గార్లపాటి ఆది పవన్‌కుమార్ (35) తాపీపని చేస్తుంటాడు. ఇటీవల కాలుకు దెబ్బతగలడం, మూడురోజులుగా జ్వరం ఉండటంలో స్థానికంగా చికిత్సపొందుతున్నాడు. ఈక్రమంలో శుక్రవారం మచిలీపట్నం ప్రభుత్వాస్పత్రికి వెళ్లగా అక్కడి వైద్యులు పరీక్షించి హార్ట్‌రేట్ ఎక్కువగా ఉండటంతో విజయవాడ ప్రభుత్వాస్పత్రికి రిఫర్ చేశారు. లెటర్లో వైరల్ ఫీవర్, గ్యాస్ట్రయిటిస్ అని పేర్కొన్నారు. శనివారం తెల్లవారు జామున విజయవాడ ప్రభుత్వాస్పత్రికి తీసుకురాగా, వైద్యులు పరీక్షించి, జనరల్ వార్డులో అడ్మిట్ చేశారు. ఈక్రమంలో ఉదయం 9.30 గంటలకు పవన్‌కుమార్ మృతి చెందాడు. బంధువుల ఆందోళన ప్రాణాపాయ స్థితిలో ఉన్న రోగిని కనీసం ఐసీయూలో ఉంచకుండా, సాధారణ వార్డులో చేర్చడం వల్లే మృతి చెందాడంటూ మృతుడి బంధువులు ఆందోళనకు దిగారు. అదేమని అడిగితే బెడ్లు ఖాళీలేవని నిర్లక్ష్యంగా సమాధానం చెప్పారని వాపోయారు. వైద్యులు, సిబ్బంది ఇంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తారా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. రెండు గంటల ఆందోళన తర్వాత ఆస్పత్రి అధికారులు వారి వద్దకు వచ్చి ఘటనపై విచారణ జరిపి చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. దీంతో ఆందోళన విరమించి మృతదేహాన్ని తీసుకెళ్లారు.అంతర్గత రక్తస్రావంతోనే మృతి రోగి పవన్‌కుమార్ మూడురోజులుగా వైరల్ ఫీవర్‌తో బాధపడుతున్నారు. మచిలీపట్నం నుంచి రిఫర్‌చేసిన లెటర్లో కూడా వైరల్ ఫీవర్, గ్యాస్రై్టటీస్ అని రాశారు. వైరల్ ఫీవర్‌లో ప్లేట్స్‌లెట్స్ తగ్గిన కారణంగా అంతర్గత రక్తస్రావం (ఇంటర్నల్ బ్లీడింగ్)తో ఒక్కసారిగా బీపీ తగ్గి మరణం సంభవించింది. రోగి బంధువుల ఆరోపణలపై కూడా విచారణ చేస్తాం. ఇందుకు ముగ్గురు సీనియర్ ప్రొఫెసర్లతో విచారణకు కమిటీ వేశాం. – డాక్టర్ ఎ వెంకటేశ్వరరావు, ఇన్‌ఛార్జి సూపరింటెండెంట్ -
టీడీపీ నేతల వేధింపులతో ఇద్దరు మహిళల ఆత్మహత్యాయత్నం
శ్రీకాళహస్తి/సాక్షి నెట్వర్క్: అధికారంలోకి వచ్చినప్పటినుంచి మహిళలు, ఉద్యోగినులపై కూటమి పక్షాల నేతల వేధింపులు, అఘాయిత్యాలు కొనసాగుతూనే ఉన్నాయి. వారి వేధింపులు భరించలేక కొందరు ప్రాణాలు తీసుకుంటున్నారు. తాజాగా తమను ఉద్యోగాల నుంచి తొలగించడంతో తిరుపతి, కృష్ణాజిల్లాల్లో ఇద్దరు మహిళలు ఆత్మహత్యాయత్నం చేశారు. తమ ఉద్యోగాలు తీయవద్దని వేడుకున్నా నేతలు కనికరించలేదని ఆవేదన వ్యక్తం చేశారు. అన్యాయంగా తీసేశారు.. నా ఉద్యోగం ఇప్పించమ్మా.. తిరుపతి జిల్లా తొట్టంబేడు మండలం తాటిపర్తి పంచాయతీలో సంఘమిత్ర రేవతిని ఉద్యోగం నుంచి తొలగించారు. ఈ బాధను తట్టుకోలేక రేవతి పురుగుమందు తాగింది. అంతకుముందు శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల సుధీర్‌రెడ్డి సతీమణి రిషితను ఉద్దేశించి మాట్లాడుతూ సెల్ఫీ వీడియో తీసింది. ఆ వీడియోలో.. ‘అమ్మా! రిషితమ్మా.. నేను 16 సంవత్సరాలుగా సంఘమిత్రగా పనిచేస్తున్నాను. దళితురాలైన నన్ను తొలగించారు. ఎలాగైనా నా జాబు నాకు వచ్చేట్లు చేయాలని అభ్యర్థిస్తున్నాను, మీకు చేతులెత్తి నమస్కరిస్తున్నా..’ అంటూ సెల్ఫీ వీడియోను ఆపేసి పురుగుమందు తాగింది. బంధువులు ఆమెను ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న రేవతిని సీఐటీయూ నాయకులు పరామర్శించారు.ఎస్టీ మహిళకు అన్యాయం కృష్ణాజిల్లా పామర్రు మండలం నిమ్మకూరులో టీడీపీ నేతలు ఎస్టీ మహిళను ఉద్యోగం నుంచి తీయించేశారు. గత ప్రభుత్వానికి అనుకూలంగా వ్యవహరించావంటూ వెలుగు పథకంలో బుక్‌కీపర్‌గా పనిచేస్తున్న గాయత్రిని తీవ్ర ఒత్తిళ్లకు గురిచేశారు. వారి సూచనతో వెలుగు అధికారులు శుక్రవారం గాయత్రిని ఉద్యోగం నుంచి తొలగించారు. దీంతో గాయత్రి ప్రాణాలు తీసుకోవాలని నిద్రమాత్రలు మింగింది. కుటుంబసభ్యులు ఆమెను మచిలీపట్నం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. -
Anantapur: ఘోర రోడ్డు ప్రమాదం.. ఆరుగురి దుర్మరణం
సాక్షి, అనంతపురం: అనంతపురం జిల్లాలో శనివారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. నార్పల మండలం నాయనపల్లి క్రాస్ వద్ద లారీని కారు ఢీకొట్టింది. టైరు పగిలి అదుపుతప్పిన కారు లారీ కిందకు దూసుకెళ్లి నుజ్జునుజ్జు అయింది. ఈ ప్రమాదంలో ఆరుగురు మృత్యువాతపడ్డారు. అనంతపురం- కడప జాతీయ రహదారిపై ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. తాడిపత్రిలో నగర కీర్తన వేడుకలో పాల్గొని వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. మృతులంతా అనంతపురం ఇస్కాన్ టెంపుల్‌కు చెందిన భక్తులుగా గుర్తించారు.మృతుల వివరాలు...శ్రీధర్(28)సంతోష్ (26)వెంకన్న (35)ప్రసన్న (34)వెంకీ (24)షణ్ముఖ (30) -
ఆ ఇద్దరిపై చర్యలేవీ!?
తెనాలి రూరల్: రౌడీషీటర్ రాగి నవీన్ చేసిన అమానుష దాడిలో బ్రెయిన్ డెడ్ అయి మరణించిన సహానా కేసు విచారణలో మృతురాలి కుటుంబ సభ్యులు, బంధువులు పలు అనుమానాలు వ్యక్తంచేస్తున్నారు. పోలీసులు అరెస్టు చేసిన నిందితుడితోపాటు అతని స్నేహితులపై చర్యలు తీసుకోకపోవడం వీరి అనుమానాలకు ప్రధాన కారణం. ఈనెల 19న సాయంత్రం 6.20 గంటల ప్రాంతంలో సహానాను నవీన్ తన కారులో తీసుకెళ్లి తెనాలి మండలం కఠెవరం నుంచి ఎరుకలపూడి వెళ్లే మార్గంలో ఆమైపె దాడిచేశాడు.సహానా వాంతులు చేసుకుని అపస్మారక స్థితిలోకి వెళ్లడంతో ఆమెను తెనాలి ఆర్టీసీ బస్టాండ్ వెనుకనున్న ఓ ప్రైవేటు వైద్యశాలకు తీసుకెళ్లాడు. అక్కడ వైద్యులు అందుబాటులో లేరని చెప్పడంతో సహానా తల్లి అరుణకుమారికి ఫోన్‌చేసి విషయం చెప్పి ప్రకాశం రోడ్డులోని మరో వైద్యశాలకు తన ఇద్దరు స్నేహితులతో కలిసి తీసుకెళ్లాడు. అక్కడకు సహానా తల్లి వెళ్లగానే ముగ్గురూ జారుకున్నారు. ఇక పోలీసులకు అరుణకుమారి ఇచ్చిన ఫిర్యాదులో నవీన్, అతని స్నేహితుల ప్రస్తావన ఉంది కానీ, 22వ తేదీ సాయంత్రం మీడియాకు నవీన్ అరెస్టు విషయాన్ని పోలీసులు వెల్లడించిన సందర్భంలో నిందితుడి స్నేహితుల ప్రస్తావనలేదు.దర్యాప్తు ‘సాగు..తోందంట’!సహానా హత్య కేసులో రాజకీయ ఒత్తిళ్ల కారణంగానే పోలీసులు పూర్తిస్థాయిలో విచారణ జరపడంలేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి. కొల్లిపర మండలం వల్లభాపురం గ్రామానికి చెందిన మార్కెట్ యార్డు మాజీ చైర్మన్, టీడీపీ నాయకుడు వంగా సాంబిరెడ్డికి నవీన్ ప్రధాన అనుచరుడిగా ఉన్నాడు. చంద్రబాబు సమక్షంలోనే టీడీపీలో చేరాడు. కేంద్రమంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ అనుచరుడిగా మొన్నటి ఎన్నికల్లో చురుగ్గా పనిచేశాడు. రాజకీయ ఒత్తిళ్ల కారణంగానే కేసు దర్యాప్తు సరిగ్గా జరగడంలేదని సహానా కుటుంబసభ్యులు అనుమానిస్తున్నారు. నవీన్‌తో పాటు ఉన్న ఇద్దరు స్నేహితులను దత్తు, సుమంత్లుగా పోలీసులు గుర్తించినా వారిపై చర్యల్లేవు. కేసు పురోగతిపై టూటౌన్ సీఐ నిసార్ బాషాను వివరణ కోరగా.. ఇంకా పూర్తిస్థాయిలో విచారించాల్సి ఉందని పేర్కొన్నారు. -
ప్రియుడితో కలిసి భర్తను లేపేసిన భార్య!
తొండంగి: కథ అడ్డం తిరిగింది.. ఐదు రోజుల కిందట జరిగిన ఆటో డ్రైవర్ మృతి కేసులో కొత్త కోణం బయట పడింది.. భార్యే ప్రియుడితో కలసి చంపిందని బంధువులు అనుమానిస్తుండగా, వారిద్దరూ పారిపోతుండగా బంధువులు, గ్రామస్తులు పట్టుకుని పోలీసులకు అప్పగించారు. ఈ ఘటన తొండంగి మండలం ఏవీ నగరంలో గురువారం చర్చనీయాంశమైంది. మృతుని సోదరుడు, సోదరి, కుటుంబ సభ్యుల కథనం ప్రకారం.. ఏవీ నగరం గ్రామానికి చెందిన బత్తిన మధుబాబు (38)కు ఇదే గ్రామానికి చెందిన అతని మేనమామ డేగల ప్రకాష్ కుమార్తె శిరీషతో 2014లో వివాహం జరిగింది.వీరికి ఆరేళ్ల జాయ్ అనే పాప ఉంది. ఆటో డ్రైవర్‌గా మధుబాబు జీవనం సాగిస్తూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. అతనికి తమ్ముడు కిషోర్, చెల్లెలు ఝాన్సీరాణి ఉన్నారు. తల్లిదండ్రులు చాలాకాలం కిందట మృతి చెందారు. కాగా కిషోర్ కాకినాడ ఆర్టీసీలో మెకానిక్‌గా చేస్తున్నాడు. శిరీష నర్సుగా కొంత కాలం కిందట కత్తిపూడి రిఫరల్ ఆస్పత్రిలో పనిచేసింది. అక్కడ పనిచేసిన సమయంలో శంఖవరం మండలం శృంగవరం గ్రామానికి చెందిన పీతల ప్రశాంత్‌తో పరిచయం ఏర్పడింది. ఈ నేపథ్యంలో ఈ విషయం తెలిసిన మధుబాబుకు, శిరీషల మధ్య తరచూ మనస్పర్థలు వచ్చాయి. దీంతో భర్తను విడిచి శిరీష హైదరాబాద్‌లో చెల్లెలు ఇంటికి కుమార్తెను తీసుకుని వెళ్లిపోయింది. 20 రోజుల కిందట శిరీష హైదరాబాద్‌లో కుమార్తె జాయ్‌ను ఉంచి మళ్లీ ఏవీ నగరంలోని మధుబాబు ఇంటికి వచ్చింది. ఈ నెల 17న మధుబాబుకు బీపీ తక్కువగా ఉందని కత్తిపూడిలో రిఫరల్ ఆస్పత్రికి తీసుకెళ్లినట్టు శిరీష 18న కాకినాడలో ఉంటున్న మరిది కిషోర్‌కు తెలిపింది. దీంతో ఏవీ నగరంలో తన స్నేహితుడిని ఆస్పత్రికి వెళ్లమని చెప్పి అనంతరం కిషోర్ ఆస్పత్రికి చేరుకున్నాడు. అనంతరం మధుబాబుకు పలు పరీక్షలు చేయాలని వైద్యులు సూచించడంతో శుక్రవారం ఏవీ నగరంలో ఇంటికి వచ్చారు. ఆ రోజంతా ఆరోగ్యంగానే మధుబాబు గ్రామంలో తిరిగాడని కుటుంబ సభ్యులు తెలిపారు. శనివారం ఉదయం చనిపోయాడని శిరీష అతని కుటుంబ సభ్యులకు తెలపడంతో వారంతా కలిసి అంత్యక్రియలు నిర్వహించారు. మధుబాబు ఒంటిపై గాయాలున్నట్టు కిషోర్ చూసి శిరీష ప్రవర్తనపై అనుమానం వచ్చింది. ఈ నేపథ్యంలో ఐదు రోజుల అనంతరం బుధవారం అర్ధరాత్రి శిరీషతో అక్రమ సంబంధం ఉన్న పీతల ప్రశాంత్ గ్రామంలోకి రావడం, వీరిద్దరూ పారిపోతుండగా పట్టుకున్నామని మృతుని సోదరుడు కిషోర్, చెల్లెలు భర్త చిన్న తెలిపారు. పట్టుబడిన వారిని పోలీసులకు అప్పగించారు. అక్రమ సంబంధం కారణంగా ప్రియునితో కలసి తన అన్నను హతమార్చారని కిషోర్, ఇతర కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. ఈ నేపథ్యంలో మధుబాబు మృతి మిస్టరీగా మారింది.అనుమానాస్పద మృతిగా కేసుఏవీ నగరంలో మధుబాబు మృతిపై కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేశారు. ఈ మేరకు నిందితులిద్దరినీ అరెస్టు చేసినట్టు ఎస్సై జగన్మోహన్రావు తెలిపారు. మృతదేహానికి పోస్టుమార్టమ్ నిర్వహిస్తామన్నారు. కేసు పూర్తిస్థాయిలో దర్యాప్తు చేస్తామన్నారు. -
మహిళా కానిస్టేబుల్‌పై ఎస్ఐ లైంగిక వేధింపులు
ఆమదాలవలస/శ్రీకాకుళం క్రైమ్: మహిళలకు రక్షణ దొరికే చోటు అంటూ ఏదీ లేకుండాపోతోంది. ఆఖరికి పోలీస్స్టేషన్లోనూ అక్కడి మహిళా సిబ్బందికే లైంగిక వేధింపులు ఎదురవుతున్నాయి. తన డిపార్ట్మెంట్లోనే పనిచేస్తున్న కిందస్థాయి మహిళా ఉద్యోగిపై ఓ అధికారి లైంగిక వేధింపులకు పాల్పడినట్లు ఆరోపణలు ఎదుర్కోవడం జిల్లాలో కలకలం రేపింది. కొద్దిరోజుల క్రితం జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఓ వైపు ఎస్పీ కేవీ మహేశ్వరరెడ్డి దూకుడుగా వెళ్తూ పోలీసు శాఖపై ఉన్న మచ్చలను తుడిచే ప్రయత్నం చేస్తుంటే.. కొందరు అధికారుల వైఖరి ఆ శాఖ ప్రతిష్టను మసకబారేలా చేస్తున్నాయంటూ పలువురు అభిప్రాయపడుతున్నారు. వివరాల్లోకి వెళితే..జిల్లాకేంద్రానికి సమీపంలో ఉన్న ఆమదాలవలస పోలీస్‌స్టేషన్‌లో ఆ స్టేషన్ ఎస్హెచ్ఓ తన పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తున్నట్లు ఓ మహిళా కానిస్టేబుల్ జిల్లా ఉన్నతాధికారికి ఫోన్ ద్వారా ఫిర్యాదు చేశారు. ఓ సివిల్ కేసు విషయమై బయటకు వెళ్లేటప్పుడు ఇలా ప్రవర్తించడంతో పాటు అంతకుముందు సైతం లైంగికంగా వేధించినట్లు చెప్పింది. ఇది జరిగి నాలుగు రోజులవుతోంది. ఈ విషయం బయటకు పొక్కకుండా గుట్టుగా విచారణ చేయించారు. అయితే గురువారం ఈ విషయం అందరికీ తెలిసిపోయింది.అభియోగాలు ఎన్నో..లైంగిక వేధింపులు ఎదుర్కొంటున్న ఆమదాలవలస ఎస్ఐపై ఇదివరకు కూడా అనేక అభియోగాలు ఉన్నాయి. న్యాయం చేయాలని స్టేషన్‌ను ఆశ్రయించిన వారిని టార్గెట్ చేస్తూ పలు సెటిల్మెంట్లు చేసినట్లు సమాచారం. ఆమదాలవలసకు బదిలీపై వచ్చిన నుంచి తన ప్రైవేటు వాహనానికి ఒక యువకుడిని డ్రైవర్‌గా మందస ప్రాంతం నుంచి తీసుకువచ్చారు. ఆయన్ని ఇక్కడ మైత్రి కానిస్టేబుల్‌గా విధుల్లో చేరినట్లు స్థానికులకు పరిచయం చేసి స్థానికంగా ఉన్న పలువురు వ్యాపారుల వద్ద కలెక్షన్లు చేసేందుకు ఉపయోగించినట్లు సమాచారం. అయితే ఆ వ్యక్తి అనారోగ్యంతో బాధపడుతూ స్థానికంగా ఒక ఆర్ఎంపీ వైద్యుని దగ్గర వైద్యం పొంది మందులు రియాక్షన్ ఇవ్వడంతో మృతిచెందాడు. ఆ ఆర్ఎంపీ వైద్యుని వద్ద కూడా రూ.లక్షల్లో మొత్తా న్ని వసూలు చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి.కలెక్షన్ కింగ్..ఎస్ఐ ఈ స్టేషన్‌కు వచ్చి కొన్ని నెలలే అయినప్పటికీ.. ఇదే పోలీస్‌స్టేషన్‌లో గత ఎనిమిదేళ్లుగా మైత్రి మల్లేశ్వరరావు వెన్నుదన్నుగా ఉండి కలెక్షన్లు అందిస్తున్నారన్న ఆరోపణలు ప్రజల నుంచి వెలువడుతున్నాయి. ఖైనీ, గుట్కాలు, గంజాయి రవాణా చేసేవారు, పట్టణంలో కృష్ణాపురం, అక్కులపేట, గాజులకొల్లివలస కొండపైన, సుగర్ ఫ్యాక్టరీ వెనుక భాగంలో పేకాటరాయుళ్లు మైత్రి మల్లేశ్వరరావుకు కలెక్షన్లు తీసుకువచ్చి ఇస్తుంటారని, అవి ఎస్ఐకు చేరవేస్తున్నట్లు ఆరోపణలున్నాయి. శ్రీకాకుళం టూటౌన్లో సైతం ఇలాంటి ఆరోపణలే ప్రజల నుంచి రావడం విశేషం.ఎస్ఐ ఏమన్నారంటే..పై విషయాలపై నిందారోపణలు ఎదుర్కొంటున్న ఎస్ఐని ‘సాక్షి’ ఫోన్లో సంప్రదించగా ఐదు రోజుల ముందు కేసు విషయమై బయటకు వెళ్లిన మాట వాస్తవమేనని, తాను ఇదివరకు పనిచేసిన ఏ పోలీస్‌స్టేసన్‌లో ఏ మహిళ పట్లా ఇలా ప్రవర్తించలేదని, ఈమైపె కూడా అసభ్యంగా ప్రవర్తించలేదని అన్నా రు. దీనిపై ఇప్పటికే ఎంకై ్వరీలో తన తప్పేం లేదని తెలిసిందని, ఎవరో కొంతమంది గిట్టని వ్యక్తులు తనపై దుష్ప్రచారం చేస్తున్నారని అన్నారు. తాను ఏ స్టేషన్లో ఎలాంటి కలెక్షన్లకు పాల్పడలేదని అన్నారు.ఎస్పీ ఏమన్నారంటే..ఇదే విషయమై ఎస్పీ కేవీ మహేశ్వరరెడ్డి వద్ద ప్రస్తావించగా తన నోటీస్‌కు మహిళా కానిస్టేబుల్ అంశం వచ్చిందని, విచారణ చేస్తున్నామన్నారు. ఎస్ఐ వివిధ స్టేషన్లలో చేస్తున్న కలెక్షన్ల విషయమై తమకు ఎలాంటి సమాచారం రాలేదని, తమ నోటీస్‌లోకి వస్తే విచారణ జరిపి రుజువైతే చర్యలు తీసుకుంటామన్నారు. -
లింక్ క్లిక్ చేస్తే.. ఖాతా ఖాళీ
నాలుగు రోజుల కిందట పలమనేరుకు చెందిన రాము అనే వ్యక్తి సెల్‌ఫోన్‌లోని వాట్సాప్‌కు ప్రముఖ ప్రభుత్వ రంగ బ్యాంకు పేరిట ఒక ఏపీకే ఫైల్ వచ్చింది. దానిపై క్లిక్ చేయడంతో కొన్ని క్షణాలు సెల్‌ఫోన్ హ్యాంగ్ అయినట్లు అనిపించింది. కొద్దిసేపటి తర్వాత అతను ఒక దుకాణంలో సరుకులు కొనుగోలు చేసి గూగుల్ పే ద్వారా రూ.300 చెల్లించాడు. ఆ వెంటనే అతని బ్యాంకు ఖాతాలో ఉన్న రూ.6వేలను విత్ డ్రా చేసినట్లు మెసేజ్ వచ్చింది. దీంతో కంగుతిన్న రాము బ్యాంక్‌కు వెళ్లి ఆరా తీస్తే విదేశాల నుంచి వాట్సాప్‌కు హ్యాకర్లు పంపిన ఏపీకే ఫైల్‌పై క్లిక్ చేయడంతో ఫోన్ హ్యాక్ చేసి గూగుల్ పే వాడినప్పుడు పాస్‌వర్డ్‌ను సేకరించి డబ్బులు స్వాహా చేశారని తేలింది. ఇదే తరహాలో కొద్దిరోజులుగా పలమనేరు ప్రాంతంలో వందలాది మందికి జాతీయ బ్యాంకుల పేరుతో మోసపూరిత ఏపీకే ఫైల్స్, యాప్ లింక్‌లు వస్తున్నాయి.హ్యాకర్లు ఇటీవల బ్యాంకుల పేరిట ప్రజలను బురిడీ కొట్టిస్తున్నారు. వివిధ రకాల బ్యాంకుల పేరుతో మోసపూరిత ఏపీకే ఫైళ్లు, యాప్‌ల లింక్‌లను వాట్సాప్‌కు పంపిస్తున్నారు. వాటిపై క్లిక్ చేసినవారి సెల్ఫోన్లను హ్యాకింగ్ చేస్తున్నారు. ఆ ఫోన్‌ను తమ ఆ«దీనంలోకి తీసుకుంటున్నారు. మనతో సంబంధం లేకుండా మన మొబైల్‌ను మిర్రర్ ద్వారా ఆపరేట్ చేస్తున్నారు. బ్యాంకు ఖాతాల్లోని డబ్బులను లూటీ చేస్తున్నారు. అంతటితో ఆగకుండా మన వాట్సాప్ గ్రూపుల్లో ఉన్న సభ్యులకు మన ఫోన్ నుంచే ఒకేసారి ఏపీకే, బగ్ యాప్ లింకులను పంపిస్తున్నారు. మనపై ఉన్న నమ్మకంతో స్నేహితులు, బంధువులు, తెలిసినవారిలో ఎవరైనా ఆ యాప్‌ల కింద ఉన్న బగ్ లింక్‌ను టచ్ చేస్తే వాళ్ల ఫోన్లను కూడా హ్యాకింగ్ చేస్తున్నారు. వారి బ్యాంకు ఖాతాల్లోని నగదును లూటీ చేస్తున్నారు. – పలమనేరుఎక్కువగా గ్రూపులకు... మన మొబైల్ నంబర్‌కు సాధారణంగా దేశం కోడ్ +91గా ముందుంటుంది. కానీ హ్యాకర్లు మన నంబర్‌ను హ్యాక్ చేసి దాని ముందు +44 పెట్టి ఇంటర్నెట్, డార్క్‌నెట్ ఆధారంగా వాట్సాప్‌లో మోసపూరిత బగ్స్, లింకులు పంపిస్తున్నారు. ప్రస్తుతం యునైటెడ్ కింగ్డమ్ నుంచి ఈ తరహా మెసేజ్‌లు వస్తున్నట్లు తెలుస్తోంది. మెసేజ్ పంపిన మొబైల్ నంబర్ తెలిసిన వారిదిలాగే కనిపిస్తుంది. కానీ ఇందులో ఇంటర్నేషనల్ కోడ్ మాత్రం మార్పు ఉంటుంది. ఈ విషయం తెలియని వాట్సాప్ గ్రూపుల్లోని సభ్యులు మనవాళ్లే మెసేజ్ పంపారని ధైర్యంగా ఆ లింకును ఓపెన్ చేసి మోసపోతున్నారు. అదేవిధంగా గూగుల్, జూమ్ మీటింగ్‌లలో ఎక్కువ మంది పాల్గొన్నప్పుడు డార్క్‌నెట్ ద్వారా ఆ కాన్ఫరెన్స్‌లో పాల్గొన్న ఒకరి నంబరు హ్యాక్ చేసి, అతని నంబరు ద్వారా మిగిలిన సభ్యులు అందరికీ మోసపూరిత యాప్‌లు, బగ్స్ లింక్‌లను కొన్ని నిమిషాల్లోనే పంపిస్తున్నారు. వారు కాన్ఫరెన్స్‌లో మాట్లాడుతూ వీటిపై క్లిక్ చేస్తే సులభంగా హ్యాకింగ్ చేస్తున్నారు. ఇలా చేస్తే మేలు... మన సెల్‌ఫోన్ ఒక్కసారిగా హ్యాంగ్ అయితే వెంటనే హ్యాక్ అయ్యిందేమోనని అనుమానించాలి. గత కొన్ని రోజులుగా ఏమైనా కొత్త లింక్‌లపై క్లిక్ చేశారా.. అనేది చూసుకోవాలి. ఒకవేళ ఏదైనా మోసపూరిత లింక్, ఫైల్‌పై క్లిక్ చేసినట్లు గుర్తిస్తే వెంటనే ఫోన్‌ను రీసెట్ కొట్టాలి. ఫోన్లోని ఈ–మెయిల్, పాస్వర్డ్లు అన్ని మార్చివేయడం మంచింది. హ్యాకింగ్ అనుమానం వస్తే ఫోన్‌పే, గూగుల్ పే, మొబైల్ బ్యాంకింగ్ వంటివి పూర్తిగా నిలిపివేయాలి. ఫోన్‌పే, గూగుల్ పే, పే టీఎం వంటి పేమెంట్ యాప్‌లు అన్ ఇన్స్టాల్ చేయాలి. కాగా, బ్యాంకుల నుంచి వాట్సాప్‌కు ఎటువంటి మెసేజ్‌లు, లింక్‌లు పంపించరని బ్యాంకర్లు చెబుతున్నారు. ఏదైనా బ్యాంకు పేరుతో మెసేజ్ వస్తే వెంటనే సమీపంలోని బ్రాంచ్‌లో గానీ, పోలీసులకు గానీ ఫిర్యాదు చేయాలని సూచిస్తున్నారు. -
బెజవాడలో వ్యక్తి దారుణ హత్య
అజిత్‌సింగ్‌నగర్(విజయవాడసెంట్రల్): విజయవాడ నగరం నడిరోడ్డున మంగళవారం ఓ వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. మాట్లాడుకుందాం రమ్మని పిలిచిన స్నేహితుడే ఈ దారుణానికి ఒడిగట్టాడు. పోలీసులు తెలిపిన, సేకరించిన వివరాల ప్రకారం.. యనమలకుదురు డొంకరోడ్డులోని శ్రీనివాస అపార్ట్‌మెంట్స్‌లో మహ్మద్ రఫీ(54), అజ్మరీ దంపతులు నివసిస్తున్నారు. వీరికి ఒక కుమారుడు, కుమార్తె సంతానం. రఫీ వారి ఇంటి సమీపంలోనే ఆదిల్ డిజిటల్ సేవా కేంద్రాన్ని నడుపుతూ జీవనం సాగిస్తూ పిల్లలిద్దరినీ ఉన్నత చదువులు చదివిస్తున్నాడు. రఫీతో కలిసి లయోలా కళాశాలలో చదువుకున్న సాగి వెంకట నరసింహరాజు(54) అనే స్నేహితుడు హైదరాబాద్‌లో నివసిస్తూ ఓ ఫార్మసీ కంపెనీని నడుపుతున్నాడు. సోమవారం నగరానికి వచ్చిన నరసింహరాజు తన స్నేహితుడు రఫీకి ఫోన్ చేసి అయోధ్యనగర్‌లోని లోటస్ ల్యాండ్‌మార్క్‌లో ఉన్న తన ఫ్లాట్‌కు రమ్మని పిలిచాడు. దీంతో రఫీ సోమవారం తన స్నేహితుడు ఉన్న ఫ్లాట్‌కు వెళ్లాడు. రఫీకి మద్యం తాగే అలవాటు ఉంది. నరసింహరాజు మాత్రం మద్యం ముట్టడు. దీంతో నరసింహరాజు తన స్నేహితుడు రఫీకి మద్యం తెప్పించాడు. రఫీ మద్యం తాగాడు. అనంతరం రఫీకి, నరసింహరాజుకు మధ్య డబ్బుల విషయమై వివాదం నెలకొంది. ఈ క్రమంలో రఫీ సమీపంలో ఉన్న కత్తెరను తీసుకొని నరసింహరాజును పొడిచేందుకు ప్రయత్నించగా అతను తన మెడలో ఉన్న కండువాను తీసి రఫీ మెడకు గట్టిగా బిగించేయడంతో రఫీ ఒక్కసారిగా కుప్పకూలి కింద పడిపోయాడు. నరసింహరాజు విషయాన్ని 100కు ఫోన్ చేసి పోలీసులకు, 108కు ఫోను చేసి జరిగిన విషయాన్ని చెప్పగా వారు హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకుని రఫీని పరీక్షించి అప్పటికే మృతి చెందినట్టు నిర్థారించారు. కత్తితో దాడి చేయబోతే ప్రతిఘటించా... తన స్నేహితుడు రఫీ ఇటీవల బాగా అప్పులపాలయ్యాడని ఈ క్రమంలో తనను రూ.3 లక్షలు అప్పుగా అడగడంతో తాను నిరాకరించానన్నారు. ఆ విషయంలో తమ ఇద్దరి మధ్య మాటామాటా పెరిగిందని, రఫీ పక్కనున్న కత్తెరతో తనపై దాడికి ప్రయతి్నంచగా తాను అతన్ని ఆపేందుకు కండువాతో గట్టిగా గొంతు నులిమానంటూ నిందితుడు నరసింహరాజు పోలీసులకు చెప్పుకొచ్చాడు. తన బాల్య స్నేహితుడిని తానెందుకు చంపుకొంటానంటూ వాపోయాడు. అన్నీ అబద్ధాలే.. కావాలనే నా భర్తను హతమార్చారు... నరసింహరాజు చెప్పేవన్నీ పచ్చి అబద్ధాలేనని రఫీ భార్య అజ్మిరీ ఆరోపించింది. తన భర్త రఫీయే నరసింహరాజుకు డబ్బులు ఇచ్చాడని, వాటిని ఇవ్వమని అనేకసార్లు అడుగుతుంటే మాట దాట వేసుకుంటూ వస్తున్నాడన్నారు. ఈ విషయమే మాట్లాడేందుకు వారిద్దరూ కలిశారని తెలిపింది. పథకం ప్రకారమే తన భర్తకు ఫుల్‌గా మద్యం తాగించి, తన భర్త పైనే కత్తెరతో దాడిచేసి నైలాన్ కండువాతో గొంతు నులిమి హత్య చేశాడని ఆమె ఆరోపించింది. నరసింహరాజుతో పాటు మరో ఇద్దరు ముగ్గురు కలిసి తన భర్తను హతమార్చి ఉంటారని, పోలీసు ఉన్నతాధికారులు దీనిపై సమగ్ర విచారణ జరిపి తమకు న్యాయం చేయాలని ఆమె కోరింది. రఫీ బంధువుల ఆందోళన రఫీ కుటుంబ సభ్యులు, బంధువులు తమకు న్యాయం చేయాలని మంగళవారం సాయంత్రం రఫీ మృతదేహానికి పోస్టుమార్టం అనంతరం సింగ్‌నగర్ పోలీస్‌స్టేషన్‌కు వచ్చేందుకు ప్రయతి్నంచారు. పోలీసులు వారిని ప్రభుత్వ హాస్పిటల్ వద్దే అడ్డుకుని గేటు మూసేసి బయటకు రాకుండా నిలిపివేశారు. -
భార్య చెల్లెలిపై లైంగిక దాడి
యలమంచిలి రూరల్: భార్య చెల్లెలిపై లైంగిక దాడికి పాల్పడ్డ ఓ కామాంధుడిపై యలమంచిలి పట్టణ పోలీసులు పోక్సో కేసు నమోదు చేశారు. పట్టణ ఎస్సై కె. సావిత్రి మంగళవారం రాత్రి మీడియాకు తెలియజేసిన వివరాల ప్రకారం పట్టణంలోని ధర్మవరం వీధి సీపీ పేటకు చెందిన బంగారు వెంకీ (19) భార్య ఇటీవల ఓ బిడ్డకు జన్మనిచ్చింది. ఆమెకు సేవలందించడానికి 16 ఏళ్ల చెల్లెలు ఆమె వద్ద ఉంటోంది. భార్య గర్భంతో ఉన్న సమయంలో ఆమె చెల్లెలిపై కన్నేసిన నిందితుడు ఆమెకు మాయమాటలు చెప్పి పలుమార్లు లైంగిక దాడి చేశాడు. బాలిక ముభావంగా ఉండటం, స్కూల్‌కు వెళ్లకపోవడంతో అనుమానం వచ్చిన ఆమె తల్లిదండ్రులు ఆరా తీయగా బాలిక తనపై జరిగిన అఘాయిత్యాన్ని చెప్పుకుంది. ఈ ఘోరంపై మంగళవారం రాత్రి తన తల్లిదండ్రులతో కలిసి బాలిక పట్టణ పోలీస్ స్టేషన్‌కు వెళ్లి రాత పూర్వకంగా ఫిర్యాదు చేసింది. దీనిపై పోక్సో చట్టం కింద నిందితుడిపై కేసు నమోదు చేసినట్టు పట్టణ ఎస్సై తెలిపారు. -
బైక్ కొనలేదని విద్యార్థి ఆత్మహత్య
పీఎంపాలెం: పుట్టిన రోజు నాడు విషాద సంఘటన చోటుచేసుకుంది. తండ్రి బైక్ కొనలేదని కోపంతో ఓ ఇంటర్ విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. తల్లిదండ్రులకు కడుపుకోత మిగిల్చాడు. ప్రాణస్నేహితులను దుఃఖ సాగరంలో ముంచెత్తాడు. పీఎంపాలెం గాయత్రీనగర్ జేఎన్ఎన్యూఆర్ఎం కాలనీలో సోమవారం జరిగిన సంఘటనకు సంబంధించిన సీఐ బాలకృష్ణ తెలిపిన వివరాలు.. పేరిశెట్టి సూర్యనారాయణ విజయనగరం జిల్లా బొబ్బిలి మండలం కోమటిపల్లి గ్రామం నుంచి సుమారు ఆరేళ్ల క్రితం నగరానికి వలస వచ్చాడు. ప్రస్తుతం ఓ కళాశాలలో హాస్టల్ కుక్‌గా పనిచేస్తూ పీఎంపాలెం గాయత్రీనగర్‌లో భార్య గంగ, పెద్ద కుమారుడు గణేష్ , 9వ తరగతి చదువుతున్న చిన్న కుమారుడు లోకేష్‌తో కలిసి నివసిస్తున్నాడు. పెద్ద కుమారుడు నగరంలోని ఓ కళాశాలలో ఇంటర్ ద్వితీయ సంవత్సరం చదువుతున్నాడు. సోమవారం పుట్టిన రోజు కావడంతో సాయంత్రం కేక్ కట్ చేయడానికి అన్ని ఏర్పాట్లు చేసుకున్నాడు. ఇంతలో ఏమైందో ఏమో ఇంటి తలుపులు వేసుకుని ఫ్యానుకు ఉరివేసుకుని ఆత్మహత్మకు పాల్పడ్డాడు. అనుకోని పరిణామంతో ఆందోళన చెందిన కుటుంబ సభ్యులు, స్థానికులు వేలాడుతున్న గణేష్‌ను కిందకు దించి చూడగా అప్పటికే మృతి చెందాడు. వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. పోస్టుమార్టం నిమిత్తం కేజీహెచ్‌కు తరలించారు. విద్యార్థి తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని సీఐ బాలకృష్ణ తెలిపారు.బైక్ కొనమని తండ్రితో గొడవవిద్యార్థి గణేష్ ఎప్పటి నుంచో బైక్ కొనమని తల్లిదండ్రులను వేడుకుంటున్నాడు. తల్లిదండ్రుల ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రం. బైక్ కొనే స్థోమత ఆ కుటుంబానికి లేదు. ఇదే విషయం తల్లిదండ్రులు గణేష్ నచ్చచెప్పినప్పటికీ వినేవాడు కాదు. ఈ విషయంపైనే తండ్రితో గొడవ పడినట్టు స్థానికులు చెబుతున్నారు. బైక్ కొనే స్థోమత లేకపోవడంతో మనస్థాపానికి గురై ఆత్మహత్యకు పాల్పడి ఉంటాడని స్థానికులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. -
పుట్టిన రోజు వేడుకలకు తీసుకెళ్లి అఘాయిత్యం
పలాస–కాశీబుగ్గ మున్సిపాలిటీ ఉలిక్కిపడింది. పుట్టిన రోజు వేడుకలకు వెళ్లిన ఇద్దరు ఆడపిల్లలపై లైంగికదాడి జరిగిందనే విషయం వెలుగు చూడడంతో జంట పట్టణాల్లో కలకలం రేగింది. ఈ కేసులో నిందితులు కూడా మైనర్లే కావడం గమనార్హం. కాశీబుగ్గకు చెందిన పదహారేళ్ల వయసు నిండిన ముగ్గురు బాలికలను అదే వయసు కలిగిన ముగ్గురు బాలురు పుట్టినరోజు వేడుకలకు పిలిచి వారిలో ఇద్దరిపై లైంగికదాడికి పాల్పడ్డారు. మద్యం మత్తులో ఈ ఘటన జరిగినట్లు సమాచారం. కౌమార దశలోనే మద్యపానం అలవాటు చేసుకోవడం, మైనర్లు అని తెలిసినా వారికి మద్యం విక్రయించడం వంటి లోపాలు ఈ అకృత్యంతో బయటపడ్డాయి. స్థానికులు తెలిపిన వివరాల్లోకి వెళితే..కాశీబుగ్గ: మున్సిపాలిటీకి చెందిన ముగ్గురు బాలురులో ఒకరి పుట్టిన రోజు కావడంతో ఈ నెల 19న వారు ముగ్గురు బాలికలతో బయటకు వెళ్లారు. ఈ ముగ్గురు బాలికల్లో ఇద్దరు అక్కాచెల్లెళ్లు ఉన్నారు. 19న రాత్రి ఈ ఆరుగురు కలిసి పలాస సినిమా థియేటర్ సమీపంలో బిర్యానీలు, కేక్‌లు, గిఫ్ట్‌లు, మద్యం పట్టుకుని బైక్‌లపై జంట పట్టణాలను దాటి వెళ్లారు. పట్టణానికి దూరంగామనుషుల అలికిడి లేని ప్రాంతానికి చేరుకుని పుట్టిన రోజు వేడుక చేసుకున్నారు. కేక్ కటింగ్ చేసి మద్యం సేవించినట్లు సమాచారం. ఆ సమయంలో అక్కాచెల్లెళ్లపై ఇద్దరు బాలురు లైంగికదాడికి పాల్పడ్డారు. మరో బాలికతోనూ చనువుగా ప్రవర్తించడానికి ప్రయత్నించగా ఆమె ప్రతిఘటించింది. లైంగికదాడిని వీడియో రికార్డు చేసుకున్నారు. అదే రోజు రాత్రి పదకొండు గంటల సమయంలో అందరూ ఇళ్లకు చేరుకున్నా రు. ఆదివారం ఉదయం మూడో బాలిక తన తల్లిదండ్రుల వద్ద ఈ వ్యవహారాన్ని బయటపెట్టింది. మిగతా ఇద్దరు బాలికల తల్లిదండ్రులకు కూడా విషయం తెలియడంతో వారు పరువు పోతుందని మిన్నకుండిపోయారు. అక్కాచెల్లెళ్లలో ఒక అమ్మా యి అనారోగ్యానికి గురి కావడం, సోమవారానికి కూడా స్పృహలోకి రాకపోవడంతో వారు పోలీసులను ఆశ్రయించారు. సీఐ మోహనరావు ఫిర్యాదును తీసుకుని కేసును ఎస్పీ మహేశ్వరరెడ్డి, ఏఎస్పీ/కాశీబుగ్గ డీఎస్పీ శ్రీనివాసరావుల దృష్టికి విషయాన్ని తీసుకెళ్లారు. అయితే నిందితుల్లో ఒకరు మేజర్ ఉన్నట్లు స్థానికులు చెబుతున్నారు. ఈ ఉదంతాన్ని రాజీ చేసేందుకు కూడా ప్రయత్నాలు జరిగినట్లు సమాచారం. బాధితుల ఇళ్ల వద్దకు చైల్డ్‌లైన్ వారు సైతం వెళ్లి వాకబు చేస్తున్నారు.నిందితుల్ని గుర్తించారు : ఎమ్మెల్యేపలాసలో నాటుకుపోయిన గంజాయి సంస్కృతే ఈ అకృత్యాలకు కారణమని, దాన్ని కూకటి వేళ్లతో పెకిలించడానికి సమయం పడుతుందని పలాస ఎమ్మెల్యే గౌతు శిరీష అన్నారు. కాశీబుగ్గ పోలీసు స్టేషన్‌కు ఫిర్యాదు చేయడానికి వచ్చిన ఆమె మాట్లాడారు. బాధితు ల తల్లిని కలిశామని, పుట్టిన రోజు వేడుకల నుంచి ఆదివారం వచ్చిన చిన్నపాప సోమవారానికి కూడా ఇంకా స్పృహలోకి రాలేదని చెప్పారని తెలిపారు. ఈ విషయంలో రాజకీయం చేయకూడదని, ఎలాంటి సెటిల్మెంట్లు చేయకూడదని అన్నారు. నిందితులను గుర్తించారని, కులం, పార్టీ, స్థాయి చూడకుండా శిక్షించాలని కోరారు. -
అంతులేని అఘాయిత్యాలు
నంద్యాల జిల్లాలో ఎనిమిదేళ్ల బాలికపై దారుణం.. కనికరం లేకుండా ఆ చిన్నారి హత్య... ఆ ఘటన మరువక ముందే అనంతపురం జిల్లాలో అత్తాకోడళ్లపై అఘాయిత్యం.. ఆ వెంటనే వైఎస్సార్ జిల్లాలో యువతిపై లైంగిక దాడి చేసి పెట్రోల్ పోసి తగలబెట్టేయడం.. అంతలోనే గుంటూరు జిల్లాలో యువతిపై అత్యాచారం చేసి తలపై కొట్టడంతో బ్రెయిన్ డెడ్ కావడం... ఇలా అక్క చెల్లెమ్మలపై రోజుకో అఘాయిత్యం! ఈ నాలుగు నెలల్లో ఏకంగా 74 మంది మహిళలు, చిన్నారులపై లైంగిక దాడులు.. వీరిలో ఆరుగురు హత్యకు గురవ్వగా మరో ఐదుగురు వేధింపులు భరించలేక ఆత్మహత్య చేసుకున్నారు. రాష్ట్రంలో శాంతి భద్రతలు ఎంతగా దిగజారాయో వీటినిబట్టి తెలుసుకోవచ్చు. కూటమి సర్కారు అధికారంలోకి వచ్చాక హత్యాచారాలు.. హత్యలు.. దాడులు.. వేధింపులు నిత్యకృత్యంగా మారిపోయాయి. గత ఐదేళ్ల పాటు రక్షణ కల్పించిన ‘దిశ’ వ్యవస్థను నీరుగార్చేశారు. ఈ ఘటనలన్నీ నమోదైనవి మాత్రమేనని, రికార్డులకెక్కనవి ఇంకా ఎన్నో రెట్లు ఉంటాయని సాక్షాత్తు హోం మంత్రి అనిత వ్యాఖ్యానించడం కొసమెరుపు.రాష్ట్రంలో రెడ్‌బుక్ రాజ్యాంగ పాలన ‘దుర్యోధన దుశ్శాసన దుర్వినీతి లోకాన్ని’ తలపిస్తోంది. అడ్డూ, అదుపు లేకుండా సాగుతున్న అఘాయిత్యాల పర్వంలో యువతులు, బాలికల వేదన అరణ్య రోదనగా మిగిలిపోతోంది. నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తున్న ధృతరాష్ట్ర పాలకులతో మాతృ హృదయాలు ఆవేదనతో కుమిలిపోతున్నాయి.ఏకంగా టీడీపీ ఎమ్మెల్యేలే తమను లైంగికంగా వేధిస్తున్నారని బాధిత మహిళలు ఫిర్యాదు చేయడం రాష్ట్రంలో నెలకొన్న దారుణ పరిస్థితులకు అద్దంపడుతోంది. ఉద్యోగానికి వెళ్లిన మహిళ... కాలేజీకి వెళ్లిన విద్యార్ధిని... తుదకు వీధిలో ఆడుకుంటున్న బాలికలు ... ఇంట్లో ఉన్న చిన్నారుల భద్రతకు సైతం భరోసా కరువైంది. ఉదయం నిద్రలేచి దినపత్రిక తెరిచినా... టీవీలో న్యూస్ చానల్ పెట్టినా.. అత్యాచారం వార్త కనిపించడం సర్వసాధారణమైంది. సాక్షి, అమరావతి: దసరా పండుగ నాడు తిరుమల బ్రహ్మోత్సవాలు గానీ... విజయవాడ ఇంద్రకీలాద్రిపై కనకదుర్గమ్మ ఆలయంలో శరన్నవరాత్రి ఉత్సవాల ప్రసారాలు గానీ.. వస్తాయని టీవీ పెడితే... అనంతపురం జిల్లాలో అత్తా కోడళ్లను వేటకొడవళ్లతో బెదిరించి మరీ అత్యాచారానికి పాల్పడిన దురాగతం గురించిన వార్తలు చూసి రాష్ట్రమంతా ఉలిక్కిపడింది. ఆ ఘటన మరువక ముందే వైఎస్సార్ జిల్లా బద్వేలు నియోజకవర్గం గోపవరంలో శనివారం ఓ యువతిపై యువకుడు లైంగిక దాడికి పాల్పడి అనంతరం పెట్రోల్ పోసి తగలబెట్టాడు. తీవ్రంగా గాయపడిన యువతి కడప ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆదివారం మృతిచెందింది. ఇక తాజాగా తెనాలిలో టీడీపీ నాయకుడు, రౌడీషీటర్ ఏకంగా ఓ యువతిపై లైంగిక దాడికి పాల్పడి అనంతరం ఆమె తలపై బలంగా కొట్టడంతో బ్రెయిన్ డెడ్ అయినట్లు ఆదివారం వచ్చిన వార్త సంచలనం సృష్టింది.ఇవీ.. 4 నెలలుగా రాష్ట్రంలో యథేచ్చగా సాగుతున్న అత్యాచారాలు, హత్యలకు కొన్ని ఉదాహరణలు. ఒకప్పటి చంబల్ లోయ, బిహార్‌లోని దారుణాలను తలదన్నేలా రాష్ట్రంలో మహిళలు, బాలికలపై బరితెగించి అత్యాచారాలకు పాల్పడుతున్నారు. ఏం చేసినా సరే తమకు అడ్డేముందన్న అధికార మదంతో టీడీపీ రౌడీలు, గూండాలు తెగబడి మహిళలు, బాలికలను అపహరించి అత్యాచారానికి ఒడిగడుతున్నారు. అంతటితో ఆగని కొందరు ఆపై దారుణంగా హత్యలు చేసి దర్జాగా జారుకుంటున్నారు. నాలుగు నెలల్లోనే రాష్ట్రంలో 74మంది మహిళలు, బాలికలు లైంగిక దాడులకు గురయ్యారు. వీరిలో ఆరుగురిని హత్య చేయడం వారి బరి తెగింపునకు నిదర్శనం. వేధింపులు భరించలేక ఐదుగురు ఆత్మహత్యలు చేసుకున్నారు. ఇవి అధికారికంగా కేసులు నమోదు చేసిన ఘటనలే. టీడీపీ గూండాలకు భయపడి ఫిర్యాదు చేయని ఉదంతాలు అంతకు రెట్టింపు సంఖ్యలో ఉంటాయి.పెన్షన్.. ఇంటి పట్టా కోసం కోర్కె తీర్చాలని..సీఎం చంద్రబాబు ప్రాతినిధ్యం వహిస్తున్న కుప్పం టీడీపీ పరిశీలకుడు, ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి గాజుల ఖాదర్ బాషా ఓ మహిళపై అత్యాచారానికి పాల్పడ్డారు. రాయచోటికి చెందిన ఖాదర్‌బాషా తనకు పెన్షన్, ఇంటి పట్టా ఇప్పిస్తానని చెప్పి లైంగిక వేధింపులకు పాల్పడినట్టు బాధిత మహిళ వీడియో ఆధారాలతో సహా వెల్లడించారు. ఆ తర్వాత నుంచి ఆమె కనిపించకుండా పోయింది. పోలీసులకు ఫిర్యాదు చేయకుండా ఆమెను ఏకంగా కిడ్నాప్ చేయడం రాష్ట్రంలో టీడీపీ నేతల అరాచకాలకు తార్కాణం. పట్టించుకోని బాబు, పవన్.. వారి దారిలోనే పోలీసులు..వరుస అత్యాచారాలతో రాష్ట్రం అతలాకుతలమవుతున్నా సీఎం చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మొద్దునిద్ర వీడటం లేదు. వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో అసత్య ప్రచారాలతో హడావుడి చేసిన పవన్‌కళ్యాణ్... ప్రస్తుతం టీడీపీ–జనసేన–బీజేపీ ప్రభుత్వంలో రోజూ జరుగుతున్న అత్యాచారాలపై స్పందించడమే లేదు. మరోవైపు తాము అమలు చేసేది రెడ్‌బుక్ రాజ్యాంగమేనని చంద్రబాబు, లోకేశ్ విస్పష్టంగా ప్రకటించాక... ఇక తమకు పనేం ఉంటుందని పోలీసులు భావిస్తున్నారు. అందుకే టీడీపీ కీచకులు రోడ్లపైకి వచ్చి అత్యాచారాలకు తెగబడుతున్నా సరే పట్టనట్టు వ్యవహరిస్తున్నారు.టీడీపీ సోషల్ మీడియా విశృంఖలత్వంనాలుగు నెలలుగా అధికార టీడీపీ కూటమి సోషల్ మీడియా విభాగాల ఆగడాలు, వేధింపులకు అడ్డే లేకుండాపోతోంది. వేలాది ఫేక్ అకౌంట్ల నుంచి రాష్ట్రంలోని లక్షలాది మంది మహిళలకు అసభ్యకరమైన సందేశాలు పంపిస్తూ వేధింపులకు గురి చేస్తున్నారు. వారి బాధితుల్లో సెలబ్రిటీల నుంచి సాధారణ మహిళల వరకు ఉన్నారు. పోలీసులు కూడా కఠిన చర్యలు తీసుకోకుండా ఉదాసీనంగా వ్యవహరిస్తుండటంతో టీడీపీ కూటమి సోషల్ మీడియా ఆగడాలు మరింతగా పేట్రేగిపోతున్నాయి.వాసంతి జాడ నేటికీ తెలియదు!నంద్యాల జిల్లా ముచ్చుమర్రిలో వాసంతి అనే ఎనిమిదేళ్ల బాలికను జూలై 7వ తేదీ ఉదయం ఆగంతకులు అపహరించుకుపోయారు. అదేరోజు సాయంత్రం ఆమె తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. 48 గంటలపాటు పోలీసులు పట్టించుకోలేదు. రెండు రోజుల తర్వాత ఆమె తల్లిదండ్రులు ధర్నా చేశాకే పోలీసులు మొద్దు నిద్ర వీడారు. అయినా కేసును సక్రమంగా దర్యాప్తు చేయనే లేదు. పది రోజుల తర్వాత వాసంతిపై అత్యాచారం చేసి హత్య చేశారని చెప్పి పోలీసులు చేతులు దులిపేసుకున్నారు. కనీసం తమ బిడ్డ మృతదేహాన్ని అప్పగించండి.. అంత్యక్రియలు చేసుకుంటామన్న ఆ పేద తల్లిదండ్రుల ఆవేదన కూడా చంద్రబాబు ప్రభుత్వం మనసును కరిగించలేకపోయింది. నాలుగు నెలలు గడిచినా ఆ చిన్నారి మృతదేహాన్ని ప్రభుత్వం కనిపెట్టి ఆమె కుటుంబానికి అప్పగించలేకపోయింది. విద్యా సంస్థలు.. వసతిగృహాల్లోనూ దుర్మార్గాలు⇒ కృష్ణా జిల్లా గుడ్లవల్లేరు ఇంజినీరింగ్ కాలేజీలోని బాత్రూముల్లో రహస్య కెమెరాలతో విద్యార్ధినుల వీడియోలు తీసిన ఘటనతో యావత్ రాష్ట్రం హడలెత్తిపోయింది. వందలాది మంది విద్యార్ధినులు అర్ధరాత్రి ఆందోళనకు దిగడం సంచలనం సృష్టించింది. కానీ అంతటి తీవ్రమైన ఉదంతాన్ని కూడా చంద్రబాబు ప్రభుత్వం మసిపూసి మారేడుకాయ చేసేసింది. నిందితులను గుర్తించి శిక్షించకపోవడం గమనార్హం.⇒ ఏలూరులో ఓ ఆశ్రమం నిర్వహిస్తున్న బాలికల వసతి గృహంలో ఉంటున్న తమను వార్డెన్ భర్త శశికుమార్ లైంగిక వేధింపులకు గురిచేస్తున్నట్లు బాధిత విద్యార్థినులు ఇటీవల పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఫొటోషూట్ల పేరుతో వివిధ ప్రాంతాలకు తీసుకువెళ్లి లైంగికదాడికి పాల్పడుతున్నట్లు బాలికలు ఫిర్యాదులో పేర్కొన్నారు. ⇒ అన్నమయ్య జిల్లా లక్కిరెడ్డిపల్లిలో సంక్షేమ హాస్టల్లో విద్యార్ధినులపై లైంగిక దాడులకు పాల్పడ్డారు. ⇒ అనంతపురంలో మెడికల్ కాలేజ్ విద్యార్ధినులను లైంగికంగా వేధింపులకు గురిచేస్తున్నారన్న వార్త విభ్రాంతి కలిగించింది.టీడీపీ నేతలు, కార్యకర్తల బరితెగింపు ⇒ టీడీపీ ఎంపీ పెమ్మసాని చంద్రశేఖర్ ప్రధాన అనుచరుడు, రౌడీ షీటర్ నవీన్ తెనాలిలో ఓ యువతిపై లైంగిక దాడికి పాల్పడి అనంతరం ఆమె తలపై తీవ్రంగా కొట్టాడు. అపస్మారక స్థితిలో ఉన్న ఆ యువతిని ఆదివారం ఆస్పత్రిలో చేర్పించి పరారయ్యాడు. అప్పటికే ఆమె బ్రెయిన్ డెడ్ అయినట్టు వైద్యులు ప్రకటించారు. టీడీపీ ఎంపీ పెమ్మసాని చంద్రశేఖర్‌తో నవీన్ (ఫైల్) గుంటూరులో సంచలనం సృష్టించిన ముగ్గురి హత్య కేసులతోపాటు మరెన్నో తీవ్రమైన నేరాల్లో నవీన్ నిందితుడిగా ఉన్నాడు. ఇటీవల ఎన్నికల్లో టీడీపీ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేసిన పెమ్మసాని చంద్రశేఖర్ తరఫున క్రియాశీలంగా వ్యవహరించాడు. ఈ కేసును పక్కదారి పట్టించాలని పోలీసులపై టీడీపీ నేతలు ఒత్తిడి చేస్తునట్టు సమాచారం.⇒ అనంతపురం జిల్లా పుట్లూరు మండలం అరకటివేములలో టీడీపీ కార్యకర్త రవితేజ జూలైలో ఓ బాలికను అపహరించి తాడిపత్రి మార్కెట్ యార్డ్ వద్ద ఉన్న వాహనంలోకి తీసుకువెళ్లి తన స్నేహితుడు నాగేంద్రతో కలిసి అత్యాచారం చేశారు. బాధిత కుటుంబం ఫిర్యాదు చేసినా పోలీసులు పట్టించుకోలేదు. ఆ కుటుంబం ఆందోళన చేయడంతో 8 రోజుల తర్వాత కేసు నమోదు చేశారు. కానీ కేసు ఉపసంహరించుకోవాలని బాధితురాలి కుటుంబాన్ని టీడీపీ నేతలు బెదిరిస్తున్నారు. ⇒ శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల తోటపాలెంలో ఓ యువతిని టీడీపీ నేత లైంగికంగా వేధించాడు. పోలీసులకు ఫిర్యాదు చేసినా ఫలితం లేకపోవడంతో ఆమె జూన్ 14న మీడియా ముందుకు వచ్చి తనకు జరిగిన అన్యాయాన్ని వివరించింది. దీంతో పోలీసులు జూన్ 16న కేసు నమోదు చేశారు.⇒ అనంతపురం జిల్లాలో టీడీపీ నేత ఉపాధి హామీ పథకం మహిళా కూలీలను లైంగిక వేధింపులకు గురి చేశాడు. బాధిత మహిళలు ఫిర్యాదు చేసినా సరే టీడీపీ నేతల ఒత్తిడితో పోలీసులు కేసు నమోదు చేయలేదు. ⇒ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ప్రాతినిధ్యం వహిస్తున్న పిఠాపురం నియోజకవర్గంలో ఇటీవల టీడీపీ నాయకుడు జాన్ 16 ఏళ్ల బాలికకు మత్తు మందు ఇచ్చి అత్యాచారానికి పాల్పడ్డాడు. లోకేశ్‌తో జాన్ (ఫైల్) ఎమ్మెల్యేలే కీచకులుగా మారితే.. ఎవరైనా లైంగికంగా వేధింపులకు గురిచేస్తే న్యాయం చేయాలని పోలీసులకు ఫిర్యాదు చేస్తారు.. లేదా తాము ఎన్నుకున్న ప్రజాప్రతినిధికి మొర పెట్టుకుంటారు. కానీ తాము ఓట్లు వేసి గెలిపించిన టీడీపీ ఎమ్మెల్యేలే లైంగిక వేధింపులకు గురి చేస్తుండటంతో మహిళలు బెంబేలెత్తిపోతున్నారు. తిరుపతి జిల్లా సత్యవేడు టీడీపీ ఎమ్మెల్యే ఆదిమూలం తనను లైంగికంగా వేధించారని బాధిత మహిళ ప్రెస్‌మీట్ పెట్టి మరీ వీడియో ఆధారాలను విడుదల చేయడంతో యావత్ రాష్ట్రం విభ్రాంతికి గురైంది. తర్వాతి పరిణామాల్లో ఆ బాధిత మహిళ కేసును ఉపసంహరించుకోవడం గమనార్హం. ఈ వ్యవహారం మరువకముందే ఆదిమూలం మరో మహిళతో అసభ్యకరంగా మాట్లాడుతున్న ఆడియో సోషల్ మీడియాలో వైరల్ కావడం విశేషం. ఇక ఎన్టీఆర్ జిల్లా తిరువూరు టీడీపీ ఎమ్మెల్యే కొలికిపూడి శ్రీనివాస్ ఓ స్థానిక సంస్థల ప్రజాప్రతినిధి భార్యకు అసభ్యకరమైన మెసేజ్‌లు పంపిస్తూ వేధింపులకు గురి చేస్తుండటం సంచలనంగా మారింది. ఆమె ఆత్మహత్యకు ప్రయత్నించింది. దీనిపై ఆ స్థానిక సంస్థల ప్రజాప్రతినిధితోపాటు ఆయన వర్గీయులు ఆందోళన చేయడంతోపాటు టీడీపీ అధిష్టానానికి కూడా ఫిర్యాదు చేశారు. -
తల్లి, కుమారుడిని బలితీసుకున్న ఎర్త్ వైర్!
సామర్లకోట : విద్యుదాఘాతంలో 24 గంటల వ్యవధిలో తల్లీకుమారుడు మృతి చెందడంతో కాకినాడ జిల్లా సామర్లకోట మండలం వీర్రాఘవపురంలో విషాదం నెలకొంది. పోలీసులు, స్థానికుల కథనం ప్రకారం కాకినాడ జిల్లా సామర్లకోట మండలం వీర్రాఘవపురానికి చెందిన చిట్టుమాని పద్మ(43) ఇంటికి సంబంధించి ఎర్త్ వైర్‌ను కొళాయి పక్కన గల చెట్టుకు చుట్టేశారు. వినాయక చవితి ఉత్సవాల సందర్భంగా ఇంటి ఎర్త్‌వైర్ తెగిపోవడంతో అలా చేయాల్సి వచ్చిoది. అయితే శనివారం పద్మ కొళాయి దగ్గర దుస్తులు ఉతికి గోడపై వాటిని ఆరబెడుతూ విద్యుదాఘాతానికి గురై ప్రాణాలు కోల్పోయింది. అయితే బంధువులు, స్థానికులు గుండెపోటుతో మృతి చెందిందని భావించారు. కాగా, ఆదివారం ఉదయం మృతురాలి కుమారుడు చిట్టుమాని విశ్వేస్(23) టిఫిన్ చేశాక ఖాళీ ప్లేట్‌ను కొళాయి పక్కన పెట్టి చేతులు శుభ్రం చేసుకొంటున్న సమయంలో విద్యుత్ షాక్‌కు గురయ్యాడు. స్థానికులు అతనిని స్థానిక సామాజిక ఆరోగ్య కేంద్రానికి తరలిస్తుండగా ప్రాణాలు కోల్పోయాడు. విద్యుదాఘాతం కారణంగా తల్లీకొడుకులు మృతి చెందారని స్థానికులు నిర్ధారణకొచి్చ.. విషయాన్ని విద్యుత్ అధికారులకు తెలియజేశారు. వెంటనే ట్రాన్స్‌కో సిబ్బంది అక్కడకు చేరుకుని వైర్లను తొలగించారు.