breaking news
-
సత్యసాయి జిల్లాలో కాల్పుల కలకలం..
సాక్షి, శ్రీ సత్యసాయి జిల్లా: ధర్మవరం నియోజకవర్గంలో కాల్పుల కలకలం రేగింది. బత్తలపల్లి మండలం రామాపురంలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఓ చోరీ కేసులో విచారణకు వచ్చిన తెలంగాణ పోలీసులపై దుండగులు దాడికి యత్నించారు. దీంతో పోలీసులు మూడు రౌండ్లు కాల్పులు జరిపారు. దొంగలు పరారీ కావడంతో పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. -
తిరుపతిలో మిస్సింగ్ కలకలం.. హైదరాబాద్‌కి బాలిక?
సాక్షి, తిరుపతి: నగరంలోని కొర్లగుంటలో నివాసం ఉంటున్న ఓ బాలిక అదృశ్యమైంది. ఈస్ట్ సీఎస్ శ్రీనివాసులు తెలిపిన వివరాల మేరకు.. కొర్లగుంట మారుతీనగర్‌లో నివాసం ఉంటున్న శ్రీనివాసులు కుమార్తె ఆక్సా క్వీన్(14) సాయంత్రం నుంచి ఇంట్లో కనిపించలేదు. కుటుంబీకులు చుట్టుపక్కల గాలించినా ఫలితం లేకపోయింది.దీంతో వెంటనే ఈస్ట్ పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అయితే పాప హైదరాబాద్‌కి వెళ్లినట్లుగా పోలీసులు ప్రాథమిక విచారణలో తేలింది. సెల్ ఫోన్ అధికంగా వినియోగిస్తూ.. వాటర్ డ్రైవర్‌తో మాట్లాడినట్లుగా గుర్తించారు. బాలిక ఆచూకీ లభ్యమైతే 9440348671, 9440796748 నంబరులో సంప్రదించాలని సూచించారు. మరో బాలిక..ఏర్పేడు మండలంలోని గుడిమల్లం ఎస్సీ కాలనీలో బాలిక అదృశ్యంపై శనివారం కేసు నమోదు చేసినట్లు ఏర్పేడు సీఐ జయచంద్ర తెలిపారు. మండలంలోని గుడిమల్లం ఎస్సీ కాలనీకి చెందిన బాలిక(17) ఈ నెల 14న రాత్రి భోజనం చేసి నిద్రించింది. ఆపై 15వ తేదీ ఉదయం నుంచి బాలిక కనిపించలేదు. బంధువుల ఇళ్ల వద్ద వెదికినా ప్రయోజనం లేకపోవడంతో తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు సీఐ తెలిపారు. -
AP: మరో ప్రేమోన్మాది ఘాతుకం.. గాయపడిన విద్యార్థిని మృతి
సాక్షి, వైఎస్సార్ జిల్లా: రాష్ట్రంలో ప్రేమోన్మాదులు చెలరేగిపోతున్నారు. కర్నూలు జిల్లా ఘటన మరవక ముందే మరో విషాదం చోటుచేసుకుంది. బద్వేల్లో యువకుడి చేతిలో గాయపడిన విద్యార్థిని మృతిచెందింది. ప్రేమ పేరుతో ఇంటర్ విద్యార్థినిపై విఘ్నేష్ అనే యువకుడు ప్రెటోల్ పోసి నిప్పంటించాడు. దీంతో తీవ్రంగా గాయపడిన ఆ బాలిక కడప రిమ్స్‌లో చికిత్స పొందుతూ మరణించింది.విద్యార్థినిని బలవంతంగా రోడ్డు పక్కనే చెట్లలోకి తీసుకెళ్లి విగ్నేష్ అనే యువకుడు పెట్రోల్ పోసి నిప్పు పెట్టాడు. బద్వేలు సమీపంలోని సెంచరీ ఫ్లైవుడ్ వద్ద ఈ ఘటన జరిగింది. విద్యార్థిని మృతి పట్ల బద్వేల్ ఎమ్మెల్యే డాక్టర్ సుధ, ఎమ్మెల్సీ గోవిందరెడ్డి సంతాపం తెలిపారు. నిందితుడ్ని కఠినంగా శిక్షించాలని, బాలిక కుటుంబాన్ని ఆదుకోవాలని డిమాండ్ చేశారు.గత వైఎస్ జగన్ ప్రభుత్వంలో మహిళలకు దిశ చట్టం ద్వారా రక్షణ కల్పించామని.. కూటమి ప్రభుత్వం వచ్చాక దిశ చట్టాన్ని రద్దు చేసిందని, ఆ యాప్ కూడా మనుగడలో లేదని వైఎస్సార్సీపీ నేతలు మండిపడుతున్నారు. రాష్ట్రంలో ఆడబిడ్డల రక్షణను గాలికొదిలేసి.. గప్పాలు కొట్టుకుంటూ చంద్రబాబు తిరుగుతున్నారంటూ వైఎస్సార్సీపీ ట్వీట్ చేసింది. మరో ఘటనలో..కర్నూలు జిల్లా ఆస్పరి మండలం నగరూరు గ్రామానికి చెందిన అశ్విని అనే ఇంటర్మీడియెట్ విద్యార్థిని ప్రేమోన్మాది చేతిలో బలైంది. విద్యార్థిని నోట్లో పురుగుల మందు పోసి హత్యచేసిన ఘటన శుక్రవారం నగరూరు గ్రామంలో కలకలం రేపింది. విద్యార్థిని తల్లిదండ్రులు తెలిపిన వివరాల మేరకు.. గ్రామానికి చెందిన నరసమ్మ, చిన్న వీరేష్ దంపతుల ఏకైక కుమార్తె అశ్విని పత్తికొండ మోడల్ స్కూల్లో ఇంటర్మీడియెట్ మొదటి సంవత్సరం చదువుతోంది.దసరా సెలవులకు ఇంటికి వచ్చింది. అదే గ్రామానికి చెందిన ఇంటర్ విద్యార్థి సన్నీ శుక్రవారం అశ్విని ఇంట్లో ఎవరూలేని సమయం చూసి ఆమె ఇంట్లోకి ప్రవేశించాడు. తనను ప్రేమించకపోతే చంపేస్తానని వెంట తెచ్చుకున్న పురుగుల మందు డబ్బా చూపుతూ ఆమెను బెదిరించాడు. అయినప్పటికీ బాలిక అతని మాట లెక్కచేయకపోవడంతో సన్నీ ఆమె నోట్లో బలవంతంగా పురుగు మందు పోసి పరారయ్యాడు.కొద్దిసేపటికి విద్యార్థిని తల్లిదండ్రులు పొలం పనులు ముగించుకుని ఇంటికి వచ్చి చూసేసరికి కుమార్తె చావుబతుకుల్లో కనిపించింది. సన్నీ అనే వ్యక్తి బలవంతంగా పురుగు మందు తాగించాడని తల్లిదండ్రులకు తెలిపింది. వారు వెంటనే ఆమెను ఆదోని ప్రభుత్వాస్పత్రికి తరలించారు. కానీ, అప్పటికే ఆమె మరణించినట్లు వైద్యులు ధ్రువీకరించారు.రాష్ట్రంలో ఆడబిడ్డల రక్షణని గాలికొదిలేసి.. గప్పాలు కొట్టుకుంటూ తిరుగుతున్న @ncbn.#APisNotinSafeHands#IdhiMunchePrabhutvam#100DaysOfCBNSadistRule pic.twitter.com/AYYengnuC3— YSR Congress Party (@YSRCParty) October 19, 2024ఇదీ చదవండి: నేను నిన్ను మోసం చేసాను.. -
దారుణం: యువతిపై అత్యాచారం.. ఆపై పెట్రోల్ పోసి
సాక్షి, వైఎస్సార్ జిల్లా: వైఎస్సార్ జిల్లా గోపవరం అటవీ ప్రాంతంలో దారుణం చోటుచేసుకుంది. అడవిలో ఓ యువతిపై అత్యాచారం జరిగింది. అనంతరం ఆమెపై పెట్రోల్ పోసి నిప్పు పెట్టి హత్యాయత్నం చేశారు. అయితే మంటల్లో కాలుతూ యువతి కేకలు వేయడంతో గమనించిన స్థానికులు.. ఆమెను కాపాడారు. కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతున్న యువతిని కడప రిమ్స్‌కు తరలించారు.యువతికి వైద్యులు చికిత్స అందిస్తున్నారు. కాగా తనకు మాయ మాటలు చెప్పి తన ఇంటి సమీపంలో ఉన్న విగ్నేష్ అనే వ్యక్తి ఈ దారుణానికి పాల్పడినట్లు బాధితురాలు పోలీసులకు వాంగ్మూలం ఇచ్చింది. మూడు నెలల క్రితమే విఘ్నేష్‌కు వివాహం జరిగిందని, అతని భార్య గర్భిణీగా పేర్కొంది. దీంతో పోలీసులు నిందితుడు విఘ్నేష్‌ను అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేసి విచారిస్తున్నారు. -
ప్రేమోన్మాది ఘాతుకం
ఆదోని రూరల్: కర్నూలు జిల్లా ఆస్పరి మండలం నగరూరు గ్రామానికి చెందిన అశ్విని అనే ఇంటర్మీడియెట్ విద్యార్థిని ప్రేమోన్మాది చేతిలో బలైంది. విద్యార్థిని నోట్లో పురుగుల మందు పోసి హత్యచేసిన ఘటన శుక్రవారం నగరూరు గ్రామంలో కలకలం రేపింది. విద్యార్థిని తల్లిదండ్రులు తెలిపిన వివరాల మేరకు.. గ్రామానికి చెందిన నరసమ్మ, చిన్న వీరేష్ దంపతుల ఏకైక కుమార్తె అశ్విని పత్తికొండ మోడల్ స్కూల్లో ఇంటర్మీడియెట్ మొదటి సంవత్సరం చదువుతోంది. దసరా సెలవులకు ఇంటికి వచ్చింది. అదే గ్రామానికి చెందిన ఇంటర్ విద్యార్థి సన్నీ శుక్రవారం అశ్విని ఇంట్లో ఎవరూలేని సమయం చూసి ఆమె ఇంట్లోకి ప్రవేశించాడు. తనను ప్రేమించకపోతే చంపేస్తానని వెంట తెచ్చుకున్న పురుగుల మందు డబ్బా చూపుతూ ఆమెను బెదిరించాడు. అయినప్పటికీ బాలిక అతని మాట లెక్కచేయకపోవడంతో సన్నీ ఆమె నోట్లో బలవంతంగా పురుగు మందు పోసి పరారయ్యాడు. కొద్దిసేపటికి విద్యార్థిని తల్లిదండ్రులు పొలం పనులు ముగించుకుని ఇంటికి వచ్చి చూసేసరికి కుమార్తె చావుబతుకుల్లో కనిపించింది. సన్నీ అనే వ్యక్తి బలవంతంగా పురుగు మందు తాగించాడని తల్లిదండ్రులకు తెలిపింది. వారు వెంటనే ఆమెను ఆదోని ప్రభుత్వాస్పత్రికి తరలించారు. కానీ, అప్పటికే ఆమె మరణించినట్లు వైద్యులు ధ్రువీకరించారు. -
మహిళ దారుణ హత్య
నందికొట్కూరు: మండల పరిధిలోని నాగటూరు గ్రామ సమీపంలోని పొలంలో శుక్రవారం సాయంత్రం మహిళ దారుణ హత్యకు గురైంది. నాగటూరు గ్రామానికి చెందిన గొల్ల నరసింహులు, శిరీష (26) వ్యవసాయ పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. వీరికి కుమార్తె, కుమారుడు ఉన్నారు. కాగా శుక్రవారం మొక్కజొన్న పొలం పనులకు వెళ్లిన శిరీషను సొంత మామ గొల్ల కురుమన్న హత్య చేసినట్లు తెలుస్తోంది. పంట కోత కోసిన చేనులో కంకులు ఏరుతున్న సమయంలో బండరాయితో తలపై మోది హత్య చేసి అక్కడి నుంచి పరారైనట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. సమాచారం అందుకున్న డీఎస్పీ రామాంజనేయులు, సీఐ ప్రవీణ్‌కుమార్‌రెడ్డి, ఎస్ఐలు చంద్రశేఖర్, సురేష్‌బాబు, లక్ష్మీనారాయణ ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. పోస్టుమార్టం నిమిత్తం మహిళ మృతదేహాన్ని నందికొట్కూరు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. మృతిరాలి సోదరుడు అశోక్ ఫిర్యాదు మేరకు మామపై హత్య కేసు, భర్త నరసింహులు, అత్త మహేశ్వరి, ఆడపచులపై వేధింపుల కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తునట్లు టౌన్ సీఐ తెలిపారు. కాగా గొల్ల కురుమన్నపై 2017లో ఓ బాలికపై అత్యాచారయత్నానికి పాల్పడినట్లు కేసు నమోదైంది. ఇలాంటి దారుణాలకు పాల్పడుతున్న కురుమన్నను ఎన్కౌంటర్ చేయాలని గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు. తల్లి హత్యకు గురికావడంతో పిల్లలు అనాథలయ్యారు. -
గుంటూరు: రైలు కింద పడి ప్రేమ జంట ఆత్మహత్య
సాక్షి, గుంటూరు: జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. పెదకాకాని సమీపంలో రైలు కింద పడి ప్రేమికుల ఆత్మహత్యకు పాల్పడ్డారు. శుక్రవారం తెల్లవారుజామున ఈ ఘటన జరిగింది. మృతులను దానబోయిన మహేశ్, నండ్రు శైలజగా గుర్తించారు. పెదకాకానికి చెందిన మహేశ్, నందిగామ మండలం రుద్రవరానికి చెందిన శైలు గత కొంత కాలంగా లవ్‌లో ఉన్నారు.రెండేళ్ల క్రితం మహేశ్.. హైదరాబాద్‌లోని ఓ స్టోర్‌లో పని చేస్తుండగా.. శైలజతో పరిచయం ఏర్పడి ప్రేమగా మారింది. ఇటీవలే ప్రేమ విషయం ఇరు కుటుంబాలకు తెలిసింది.అయితే, పెళ్లికి యువతి కుటుంబసభ్యులు అభ్యంతరం తెలిపినట్లు సమాచారం. దీంతో కొన్ని రోజుల క్రితం శైలు, మహేశ్ ఇంట్లో చెప్పకుండా బయటకు వెళ్లిపోయారు. దీంతో యువతి కుటుంబ సభ్యులు గాలింపు చర్యలు చేపట్టగా, ఈ క్రమంలో శుక్రవారం తెల్లవారుజామున పెదకాకాని సమీపంలో రైల్వే ట్రాక్‌పై పడి ఉన్నారు.ఇదీ చదవండి: టీడీపీ నేత రాసలీలలు.. వీడియో లీక్ -
అమ్మానాన్నను విడిచి ఉండలేక.. జడ రిబ్బనతో చిన్నారి ఆత్మహత్య
శ్రీకాకుళం: జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. తల్లిదండ్రుల్ని విడిచి పెట్టి ఉండలేక ఏడవ తరగతి విద్యార్థిని తనువు చాలించింది. పాతపట్నం నియోజకవర్గంలోని మెలియపుట్టి ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్లో లావణ్య ఏడవ తరగతి చదువుతుంది.అయితే ఇటీవల దసరా సెలవులకు ఇంటికి వెళ్లిన లావణ్యను గురువారం ఆమె తల్లిదండ్రులు స్కూల్లో విడిచి పెట్టి ఇంటికి వెళ్లారు. దీంతో తల్లిదండ్రుల్ని విడిచి పెట్టి దూరంగా ఉండలేక లావణ్య మనోవేధనకు గురైంది. తల్లిదండ్రులు వెళ్లిన గంట తర్వాత జడ రిబ్బన తో ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. తోటి విద్యార్థులు టీచర్‌కు సమాచారం అందించారు. వెంటనే ఉపాధ్యాయులు అత్యవసర చికిత్స కోసం ఆస్పత్రికి తీసుకెళ్లారు. అక్కడ చిన్నారిని పరీక్షించిన వైద్యులు చనిపోయినట్లు నిర్ధారించారు.ఈ విషాదంపై సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు ప్రారంభించారు. -
టీడీపీ నేత రాసలీలలు.. వీడియో లీక్
సాక్షి, అమరావతి: ఏపీలో టీడీపీ నేతల అరాచకాలు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. తాజాగా టీడీపీ రాష్ట్ర కార్యదర్శి గాజుల ఖాదర్ బాషా రాసలీలలు బహిర్గతమయ్యాయి. రాష్ట్రంలో పేద మహిళలే టార్గెట్‌గా ఖాదర్ బాషా అఘాయిత్యాలకు పాల్పడుతున్నాడు.టీడీపీ రాష్ట్ర కార్యదర్శి, కుప్పం టీడీపీ పరిశీలకుడిగా ఉన్న గాజుల ఖాదర్ బాషా అసలు స్వరూపం బట్టబయలైంది. పేద మహిళలను టార్గెట్ చేస్తూ ఖాదర్.. వారిపై అఘాయిత్యాలకు పాల్పడుతున్నాడు. ఈ క్రమంలోనే అన్నమయ్య జిల్లాలోని రాయచోటిలో ఖాదర్ బాషా లైంగిక దాడికి పాల్పడిన విషయం బయటకు వచ్చింది. పెన్షన్ ఇప్పిస్తానని చెప్పి ఖాదర్.. ఓ మహిళపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఈ విషయాన్ని బాధితురాలే బహిర్గతం చేసింది. దీంతో, అసలు విషయం బయటకు వచ్చింది.ఏపీలో టీడీపీ నేతలు రెచ్చిపోతున్నారు. పచ్చ నేతలు మహిళలపై లైంగిక దాడులకు పాల్పడుతూనే ఉన్నారు. ఇటీవల సత్యవేడు, ఇప్పుడు రాయచోటిలో వెలుగు చూసిన ఘటనలే ఇందుకు నిదర్శనం. ఈ రెండు ఘటనల్లో బాధితులు ఎంతో ధైర్యం చేసి బయటకు రావడంతో పచ్చ నేతల బాగోతం బయటకు వచ్చింది. -
కుమారులకు విషమిచ్చి... ఆత్మహత్యాయత్నం చేసిన తల్లి
సంతబొమ్మాళి: తల్లి తన ఇద్దరు పిల్లలకు విషమిచ్చి ప్రాణాలు తీసిన అనంతరం ఆత్మహత్యాయత్నం చేసిన ఘటన శ్రీకాకుళం జిల్లా, సంత»ొమ్మాళి మండలం కుముందవానిపేటలో సోమవారం రాత్రి చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. కుముందవానిపేట గ్రామానికి చెందిన డెక్కల రాజుతో అదే గ్రామానికి చెందిన దుర్గకు పన్నెండేళ్ల కిందట పెళ్లయ్యింది. వీరికి రుషి (10), బాలాజీ (8) అనే ఇద్దరు కుమారులు ఉన్నారు. రాజు శ్రీకాకుళంలోని ఓ హోటల్లో పని చేస్తున్నాడు. దసరా సందర్భంగా దుర్గ తమ్ముడు హరి తన ఇంటికి రావాలని ఆహ్వానించాడు. ఉదయమే వస్తానని చెప్పిన ఆమె ఎంతకూ రాకపోయే సరికి దుర్గ ఇంటికి వెళ్లిన హరి ఇద్దరు చిన్నారులు విగత జీవులుగా పడి ఉండడాన్ని, అక్కడే కొనప్రాణంతో ఉన్న దుర్గను గమనించి పోలీసులకు సమాచార మిచ్చారు. టెక్కలి రూరల్ సర్కిల్ సీఐ శ్రీనివాసరావు తన సిబ్బందితో ఘటనా స్థలానికి వచ్చి పరిశీలించారు. శీతల పానీయంలో విషం కలిపి తాగించడం వల్ల చిన్నారులు చనిపోగా, అది తాగిన తల్లి దుర్గ కొన ప్రాణంతో ఉన్నట్లు పోలీసులు తేల్చారు. చిన్నారుల మృతదేహాలను టెక్కలి జిల్లా ఆస్పత్రికి తరలించారు. తల్లి దుర్గను కూడా అదే ఆస్పత్రిలో చేర్చారు. భర్త సరిగా చూడకపోవడం వల్ల జీవితంపై విరక్తి కలిగి ఆత్మహత్యాయత్నం చేశానని దుర్గ పోలీసులకు తెలిపింది. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. -
అత్తా, కోడలిపై గ్యాంగ్ రేప్ ఘటనలో ఐదుగురి అరెస్టు
హిందూపురం: శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురం నియోజకవర్గం నల్లబొమ్మనపల్లి సమీపంలో అత్తాకోడలిపై సామూహిక అత్యాచారానికి పాల్పడిన ఘటనలో ఐదుగురిని అరెస్టు చేసినట్లు జిల్లా ఎస్పీ వి.రత్న మంగళవారం ఇక్కడ విలేకరుల సమావేశంలో తెలిపారు. వారి నుంచి రూ.5,200 నగదు, రెండు మోటార్ బైక్‌లు స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు. పరారీలో ఉన్న మరో నిందితుని కోసం గాలిస్తున్నట్లు చెప్పారు. హిందూపురం త్యాగరాజనగర్‌కు చెందిన ఎరికల కావడి నాగేంద్ర, సాకే ప్రవీణ్‌కుమార్, మరో ముగ్గురిని సోమవారం మధ్యాహ్నం రెండు గంటలకు హిందూపురం–పాలసముద్రం రోడ్డులోని బిట్ కాలేజీ వెనుక వైపున డంపింగ్ యార్డ్ వద్ద అరెస్టు చేసినట్లు తెలిపారు. హిందూపురం త్యాగరాజనగర్ గుడ్డం ఏరియాలో ఉంటున్న చాకలి శ్రీనివాసులు అలియాస్ శ్రీనాథ్ పరారీలో ఉన్నాడని, అతని కోసం గాలిస్తున్నామని చెప్పారు. ఈ కేసుల్లో పట్టుబడ్డ నిందితులు కరడుగట్టిన నేరస్తులేనని, వారిపై ఇప్పటికే పలు కేసులు ఉన్నాయని ఎస్పీ చెప్పారు. ఎరికల కావడి నాగేంద్ర దోపిడీ, అత్యాచార కేసుల్లో నిందితుడని, అతనిపై అనంతపురం, శ్రీ సత్యసాయి, కర్నూలు, చిత్తూరు జిల్లాలలో 37కు పైగా కేసులు నమోదయ్యాయని తెలిపారు. సాకే ప్రవీణ్‌కుమార్‌పై లేపాక్షి పోలీస్ స్టేషన్లో హత్య కేసు నమోదైందన్నారు. పరారీలో ఉన్న చాకలి శ్రీనివాసులు హిందూపురం రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలో దోపిడీ కేసులో ముద్దాయని తెలిపారు. ఇతని స్వగ్రామం లేపాక్షి మండలం కల్లూరు కాగా.. ప్రస్తుతం హిందూపురం త్యాగరాజనగర్ గుడ్డం ఏరియాలో ఉంటున్నాడన్నారు.స్పెషల్ కోర్టు ద్వారా శిక్ష పడేలా చూస్తాం: ఎస్పీనిందితులకు స్పెషల్ కోర్టు ద్వారా కఠిన శిక్ష పడేలా చూస్తామని ఎస్పీ తెలిపారు. ఘటన జరిగిన 48 గంటల్లోపే నిందితులను అరెస్టు చేశామన్నారు. ఎవరైనా మహిళల పట్ల అనుచితంగా ప్రవర్తిస్తే తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరించారు. కేసును ఛేదించడంలో క్రియాశీలకంగా వ్యవహరించిన జిల్లా ఎస్పీ వి.రత్న, ఇతర పోలీస్ అధికారులను సీఎం, హోంమంత్రి, డీజీపీలు ప్రత్యేకంగా అభినందించారు. నిందితులను అరెస్టు చేసిన పోలీసు సిబ్బందికి జిల్లా ఎస్పీ వి.రత్న, డీఎస్పీ మహేష్ నగదు రివార్డులు అందజేశారు. -
వేర్ ఈజ్ పోలీస్ ప్రభుత్వం?
సాక్షి, అమరావతి/ సాక్షి, పుట్టపర్తి: చంద్రబాబు రెడ్ బుక్ రాజ్యాంగ అరాచకం రాష్ట్రంలో విశృంఖలంగా సాగిపోతోంది. అమాయకులను వేధింపులకు గురిచేస్తూ, నేరగాళ్లకు అండగా నిలుస్తూ చంద్రబాబు ప్రభుత్వం పాలన సాగిస్తోంది. గత 4 నెలల్లో రాష్ట్రవ్యాప్తంగా జరుగుతున్న అరాచకాలే ఇందుకు నిదర్శనం. తాజాగా దసరా రోజున శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురం నియోజకవర్గంలోని నల్ల బొమ్మనపల్లిలో అత్త, కోడలిపై సామూహిక అత్యాచారానికి పాల్పడిన ఆగంతకులకు టీడీపీ సర్కార్ కొమ్ముకాస్తూ.. కేసును పక్కదారి పట్టించేందుకూ ప్రయత్నిస్తోంది. ఇందులో భాగంగానే దారుణం జరిగి మూడు రోజులైనా పోలీసులు ఇంతవరకు ఎఫ్ఐఆర్ నమోదు చేయలేదు. పైపెచ్చు ఈ ముఠాక నాయకుడైన యువకుడిని ఇంతవరకు అరెస్టు చేయలేదు. టీడీపీ నేతలు పెంచి పోషిస్తున్న ఈ నేరగాళ్ల ముఠాకు పొట్ట కూటి కోసం పొరుగు రాష్ట్రం నుంచి వచ్చిన కుటుంబం బలైపోయింది. ఓ పేపర్ మిల్లులో వాచ్‌మెన్‌గా పని చేస్తున్న తండ్రి, కొడుకుపై వారి ఇంటి ఎదుటే దాడి చేశారు. అడ్డుకునేందుకు వచ్చిన వాచ్‌మేన్ భార్య, కోడలిని బలవంతంగా ఇంట్లోకి ఎత్తుకుపోయి సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఆత్తా కోడళ్లను బలవంతంగా ఎత్తుకుపోతున్న దృశ్యాలు సీసీ కెమెరాల్లో రికార్డయ్యాయి. ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. పైగా, ఈ కేసును తప్పుదారి పట్టించేందుకు జరుగుతున్న ప్రయత్నాలు నిందుతలకు ప్రభుత్వ వత్తాసును స్పష్టంచేస్తున్నాయి. ఆరుగురు నిందితులు అత్యాచారానికి పాల్పడ్డారని సీసీ టీవీ రికార్డులు స్పష్టంగా చెబుతున్నాయి. వారిలో అయిదుగురిని మాత్రమే పోలీసులు అదుపులోకి తీసుకున్నట్టు సమాచారం. కానీ ఆ ముఠాకు నాయకుడిగా ఉన్న యువకుడిని మాత్రం పోలీసులు అదుపులోకి తీసుకోలేదు. చంద్రబాబు ప్రభుత్వం తీరు పట్ల రాష్ట్రవ్యాప్తంగా ఆగ్రహం వ్యక్తమవుతోంది. అసలీ రాష్ట్రంలో పోలీసులున్నారా.. ప్రభుత్వముందా అంటూ ప్రజలు, విపక్షాలు, ప్రజా సంఘాలు, మహిళా సంఘాలు ప్రశ్నిస్తున్నాయి.బాధితులను పరామర్శించేందుకు అనుమతినివ్వని పోలీసులు అత్యాచార బాధితులను కలిసేందుకు ప్రతిపక్ష నేతలు, మహిళా సంఘాలు, ప్రజా సంఘాల ప్రతినిధులను ప్రభుత్వం అనుమతించడంలేదు. బాధితులను పరామర్శించేందుకు వైఎస్సార్సీపీ నేతలు ప్రయత్నించినా పోలీసులు సమ్మతించలేదు. బాధితులను కలిసేందుకు ఎవరినీ అనుమతించడంలేదని పోలీసులు చెబుతున్నారు. బాధితులపై ఒత్తిడి తెచ్చి, నిజాలకు పాతరేసి, కేసును పక్కదారి పట్టించాలన్న ప్రభుత్వ పెద్దల పన్నాగంలో భాగంగానే ఇతరులెవ్వరూ బాధితులను కలిసేందుకు అనుమతించడంలేదు. ప్రతిపక్ష నేతలు, మహిళా సంఘాల ప్రతినిధులు బాధితులను కలసి మాట్లాడితే వారు వాస్తవాలు వెల్లడించే అవకాశం ఉన్నందునే ఎవర్నీ అనుమతించడం లేదన్నది సుస్పష్టం.రాష్ట్రమంతా ఇదే దారుణకాండచంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి రాష్ట్రవ్యాపంగా మహిళలు, యువతులపై అత్యాచారాలకు అడ్డూ అదుపు లేకుండాపోతోంది. నంద్యాల జిల్లా ముచ్చిమర్రులో ఓ బాలికను అపహరించి అత్యాచారం చేసి హత్య చేశారు. ఇది జరిగి నాలుగు నెలలైనా ఆ చిన్నారి మృతదేహాన్ని కూడా ఆమె తల్లిదండ్రులకు అప్పగించలేకపోయారు. ఇక పుంగనూరులో ఇటీవల ఓ ముస్లిం బాలికను అపహరించి హత్య చేశారు. తమ బిడ్డను ఎవరో అపహరించుకుపోయారని ఆమె తల్లిదండ్రులు ఫిర్యాదు చేసినా అయిదు రోజులు పోలీసులు కాలయాపన చేశారు తప్ప, ఆ చిన్నారిని రక్షించే ప్రయత్నం చేయలేదు. నిత్యం బాలికలు, మహిళలపై లైంగిక దాడులు, అరాచకాలతో రాష్ట్రం అల్లకల్లోలమవుతున్నా చంద్రబాబు ప్రభుత్వం పట్టించుకోవడమేలేదు.వేర్ ఈజ్ ఎమ్మెల్యే బాలకృష్ణనందమూరి బాలకృష్ణ నటించిన అఖండ సినిమాలో విలన్ ఓ మహిళా అధికారిని ఆమె కుమారుడి ఎదుటే అత్యాచారం చేస్తారు. ఆ సినిమాలో హీరో పాత్రధారి బాలకృష్ణ ఆ విలన్‌ను చంపి శిక్షిస్తాడు. అంతేకాదు.. మహిళల ఔన్యత్యాన్ని కీర్తిస్తూ భారీ డైలాగులు చెబుతారు.. కట్ చేస్తే.. అదే హీరో, టీడీపీ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ వరుసగా మూడోసారి ప్రాతినిధ్యం వహిస్తున్న హిందూపురం నియోజకవర్గంలో ఆగంతకులు అత్త, కోడలిపై వారి ఇంట్లోనే సామూహికంగా అత్యాచారానికి పాల్పడ్డారు. తన నియోజకవర్గంలోనే జరిగిన ఈ ఘోరంపై ఎమ్మెల్యే బాలకృష్ణ స్పందించనే లేదు. కనీసం పోలీసులతో మాట్లాడి నిందితులను వెంటన అరెస్ట్ చేయమని ఆదేశించనూ లేదు. బాధిత కుటుంబాన్ని పరామర్శించనూ లేదు. సినిమా షూటింగ్‌లతో కాలక్షేపం చేస్తున్నారు. అందుకే హిందూపూర్ ప్రజలే కాదు.. యావత్ రాష్ట్రం ‘వేర్ ఈజ్ పోలీస్.. వేర్ ఈజ్ ప్రభుత్వం.. వేర్ ఈజ్ బాలకృష్ణ’ అని ప్రశ్నిస్తోంది. -
రోడ్డు ప్రమాదంలో భర్త మృతి.. తట్టుకోలేక భార్య ఆత్మహత్య
ఎచ్చెర్ల: లావేరు మండలంలోని కేశవరాయునిపాలేం గ్రామానికి చెందిన నాయన భవానీ (20) గడ్డి మందు తాగేసిన సంగతి తెలిసిందే. ఈమె భర్త నాయని చంటి శనివారం రోడ్డు ప్రమాదంలో మృతిచెందారు. భర్త మరణంతో కుంగిపోయిన ఆమె ఆదివారం ఉదయం గడ్డి మందు తాగేయడంతో రిమ్స్‌లో చేర్చారు. అక్కడ చికిత్స పొందుతూ ఆదివారం రాత్రి 12 గంటల సమయంలో మృతి చెందారు. లావేరు హెచ్‌సీ పి.రామారావు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
విషాదం.. భార్య సీమంతం రోజునే భర్త మృతి
కదిరి అర్బన్: లారీని ఢీకొన్న ఘటనలో ద్విచక్ర వాహన చోదకుడు మృతి చెందాడు. పోలీసులు తెలిపిన మేరకు... కదిరి మండలంలో పట్నం గ్రామానికి చెందిన భాస్కర్ (24) అనంతపురంలో పాల వ్యాన్‌కు డ్రైవర్‌గా పనిచేస్తూ అక్కడే నివాసముంటున్నాడు. భార్య లక్ష్మి తొమ్మిది నెలల గర్భంతో ఉంది. దీంతో ఆమెకు కుటుంబసభ్యులు సీమంతం చేయాలంటే రెండు రోజలు క్రితం స్వగ్రామానికి పిలుచుకువచ్చాడు. ఆదివారం సీమంతం జరిగింది. వేడుక అనంతరం రాత్రికి తాను ఇంటికి వస్తానని తెలిపి సోమవారం ఉదయం భార్యను అనంతపురానికి పంపాడు. స్థానికంగా పనులు చక్కబెట్టుకున్న తర్వాత రాత్రికి ద్విచక్రవాహనంపై అనంతపురానికి బయలుదేరిన భాస్కర్... పట్నం సమీపంలో జాతీయ రహదారిపై ఆగి ఉన్న లారీని వెనుక నుంచి ఢీకొనడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు. -
టీడీపీ నేతల బెదిరింపులతో మహిళ ఆత్మహత్యాయత్నం
ఒంగోలు టౌన్: ప్రేమపేరుతో వెంటపడి పెళ్లి చేసుకుంటానని నమ్మబలికి ఒక బాలికను గర్భిణిని చేశాడు దర్శి నియోజకవర్గానికి చెందిన టీడీపీ నాయకుడి కుమారుడు. తమకు న్యాయం చేయమంటూ వేడుకున్న బాధిత బాలిక కుటుంబ సభ్యులపై బెదిరింపులకు దిగడంతో భయాందోళనకు గురైన బాలిక తల్లి ఆత్మహత్యాయత్నం చేసింది. ప్రస్తుతం ఒంగోలులోని ఒక ప్రైవేటు వైద్యశాలలో చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతోంది. బాధిత బాలిక తండ్రి కథనం ప్రకారం.. కావలికి చెందిన దంపతులకు ఇద్దరు కుమార్తెలు. పెద్ద కుమార్తె కావలిలోని ఒక ప్రైవేటు కళాశాలలో ఇంటర్మీడియెట్ చదువుతుండగా, చిన్న కుమార్తె దర్శి సమీప గ్రామంలో అమ్మమ్మ దగ్గర ఉంటూ 7వ తరగతి చదువుకుంటోంది. కొద్దిరోజులుగా గ్రామానికి చెందిన టీడీపీ నాయకుడు ఏనిగంటి కోటేశ్వరరావు కుమారుడు వరుణ్ చౌదరి ప్రేమ పేరుతో బాలిక వెంటపడ్డాడు. పెళ్లి చేసుకుంటానని నమ్మించాడు. శారీరకంగా లోబరుచుకొని గర్భిణిని చేశాడు. ఈ విషయం తెలిసిన బాలిక తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. గత ఆగస్టులో దర్శి పోలీసులు పోక్సో కేసు నమోదు చేసి వరుణ్ చౌదరిని అరెస్టు చేశారు.రూ.50 వేలు ఇస్తా తీసుకొని వెళ్లు ...బాలికను గర్భిణిని చేసిన వరుణ్ చౌదరి తండ్రి కొద్ది రోజులుగా రాజీ ప్రయత్నాలు చేయడం మొదలు పెట్టాడని బాలిక తండ్రి చెబుతున్నారు. రాజంపల్లికి చెందిన తెలుగుదేశం నాయకులను మధ్యవర్తులుగా రాయబారానికి పంపించాడన్నారు. వారి ద్వారా డబ్బులు ఇస్తానంటూ ఆశ పెట్టాడని, అయితే ఇందుకు అంగీకరించలేదని, తమకు డబ్బులు ఏమీ వద్దని, తమ కూతురిని పెళ్లి చేసుకోవాలని కోరామన్నాడు. దాంతో అగ్గిమీద గుగ్గిలమైన కోటేశ్వరరావు రూ.50 వేలు ఇస్తా, తీసుకొని పోండి. పెళ్లి అంటే ఎదురు కేసు పెట్టి బాలికను, బాలిక తల్లిని బజారుకీడుస్తానంటూ రెచ్చి పోయాడని ఆరోపించాడు. చెప్పినట్లు విని రాజీకి వస్తే సరేసరి లేకపోతే ఇబ్బందులు పడతావంటూ బెదిరింపులకు దిగాడన్నాడు. ఈ క్రమంలో కొందరు గుర్తు తెలియని వ్యక్తులు కావలిలో తన ఇంటిపై దాడి చేసి కొట్టారాని వాపోయాడు. కేసులో రాజీ పడాలని, లేకుంటే నిన్ను, నీ భార్యను చంపుతామని బెదిరించి వెళ్లారని ఆరోపించాడు. వెంటనే బాలిక తండ్రి కావలి వన్‌టౌన్ సీఐకు ఫోన్ చేసి జరిగిన విషయం చెప్పామన్నాడు. వెంటనే ఎస్సై వచ్చి జరిగిన విషయం అడిగి తెలుసుకుని, చుట్టుపక్కల విచారించి వెళ్లారని తెలిపాడు.బాలిక తల్లి ఆత్మహత్యా యత్నం..ఈ ఘటనలతో బాలిక తల్లి భయాందోళనకు గురైంది. ఈ నెల 2వ తేదీ ఎలుకల మందు తిని ఆత్మహత్యకు ప్రయత్నించింది. వెంటనే ఆమెను కావలి ఆస్పత్రికి తరలించి వైద్యం చేశారు. మెరుగైన చికిత్స కోసం శుక్రవారం ఒంగోలులోని ఒక ప్రైవేటు వైద్యశాలకు తరలించారు. ఆమెను ఎమర్జన్సీ వార్డులో ఉంచి కృతిమ శ్వాస అందిస్తున్నారు. పరిస్థితి విషమంగా ఉందని, లివర్ చెడిపోయిందని, ప్లేట్లెట్స్ కూడా తగ్గిపోతున్నాయని, రక్తపోటు తరచుగా పడిపోతుందని వైద్యులు తెలిపారు. ఒకవైపున నిండా పద్నాలుగేళ్ల వయసు కూడా లేని కుమార్తె నిండు గర్భంతో ఉంది. చిన్న వయసు కావడంతో కాన్పు ప్రమాదం కావచ్చని, సిజేరియన్ చేసినా ప్రాణాలకు ముప్పు రావచ్చని వైద్యులు చెబుతున్నారని, మరోవైపు ఆత్మహత్యా యత్నం చేసిన భార్య చావు బతుకుల మధ్య పోరాడుతోందని బాలిక తండ్రి కన్నీటి పర్యంతమయ్యారు. ప్రభుత్వం తమకు న్యాయం చేయాలని వేడుకుంటున్నారు. దర్శి నియోజకవర్గ టీడీపీ ఇన్చార్జి అండ చూసుకునే కోటేశ్వరరావు రెచ్చి పోతున్నాడని ఆరోపిస్తున్నారు. -
వారే లేని.. నేనెందుకని..
పెదవేగి : రెండు రోజుల క్రితం కోడి పుంజులను ఈత కొట్టించేందుకు కాలువలోకి దిగిన భర్త, ఇద్దరు కుమారులు నీట మునిగి మృత్యువాత పడ్డారు. దీంతో ఆ కుంటుంబంలో మిగిలిన ఇల్లాలు జీవితంపై విరక్తి చెంది శనివారం బలవన్మరణానికి పాల్పడింది. ఆ కుటుంబాన్ని మృత్యువు కబళించడంతో పెదవేగి మండలం కవ్వగుంటలో విషాద ఛాయలు అలముకున్నాయి. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. కవ్వగుంటకు చెందిన శెట్టిపల్లి దేవి (38) శుక్రవారం ఉదయం తన ఇంటి వద్ద బాత్రూమ్లో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. గత రెండు రోజుల క్రితం ఆమె భర్త, ఇద్దరు పిల్లలు తమ ఇంటి సమీపంలో ఉన్న పోలవరం కుడి కాలువలో కోడి పుంజులను ఈదించడం కోసం దిగి ప్రమాదవ శాత్తూ మునిగిపోయారు. వారి మృతితో ఒంటరి అయిన దేవి భర్త, పిల్లలు లేని జీవితంపై విరక్తి చెంది బలవన్మరణానికి పాల్పడింది. దీంతో గ్రామంలో ఒక్కసారిగా విషాదఛాయలు అలుముకున్నాయి. -
నా భార్యను గురవయ్య కిడ్నాప్ చేశాడు!
వెంకటగిరి రూరల్: తన భార్యను గ్రామానికి చెందిన ఓ వ్యక్తి కిడ్నాప్ చేశాడని బాధితుడు దట్టం గురవయ్య శుక్రవారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. బాధితుని కథనం.. వెంకటగిరి రూరల్ మండలం, చిన్నన్నపేటకు చెందిన దట్టం గురవయ్య, తిరుమలమ్మ(30) భార్యాభర్తలు. వీరికి ముగ్గురు పిల్లలు ఉన్నారు. వీరు వెంకటగిరి పట్టణంలోని ఓ కాంప్లెక్స్‌లో అద్దె ఇంట్లో ఉంటున్నారు. ఈ క్రమంలో ఈనెల 1వ తేదీన కూలి పనులకని వెళ్లిన తిరుమలమ్మ మళ్లీ ఇంటికి రాలేదు. వారం రోజులుగా వెదికినా ఫలితం లేదన్నారు. అదే గ్రామానికి చెందిన పుట్ట గురవయ్య తన భార్యతో సన్నిహితంగా ఉండేవాడని, అతనే తన భార్యను కిడ్నాప్ చేసి ఉంటాడని అనుమానం వ్యక్తం చేశారు. అంతేగాక గురవయ్య పార్లపల్లి గ్రామానికి చెందిన మరికొందరితో పరిచయం ఏర్పాటు చేసుకుని మహిళలను ట్రాప్ చేస్తున్నట్టు తెలిసిందన్నారు. ఈ మేరకు తనకు న్యాయం చేయాలని బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేసినట్టు ఆయన వెల్లడించారు. -
సత్యసాయి జిల్లాలో దారుణం.. అత్తాకోడళ్లపై సామూహిక లైంగిక దాడి
సాక్షి, శ్రీసత్యసాయి జిల్లా: హిందూపురం నియోజకవర్గంలో దారుణం జరిగింది. తెల్లవారుజామున ఇంట్లోకి ప్రవేశించిన దుండగులు.. తండ్రి, కొడుకులను కత్తులతో బెదిరించి అత్త, కోడలిపై లైంగికదాడికి పాల్పడ్డారు. చిలమత్తూరు మండలం బొమ్మనపల్లిలో ఘటన చోటుచేసుకుంది. పేపర్ మిల్లులో వాచ్మెన్ కుటుంబంపై దాడి చేసి ఇద్దరు మహిళలపై అత్యాచారానికి పాల్పడ్డారు.కర్ణాటక రాష్ట్రంలోని బళ్లారికి చెందిన ఓ కుటుంబం ఉపాధి కోసం సత్యసాయి జిల్లాకు వలస వచ్చారు. శనివారం తెల్లవారుజామున గుర్తు తెలియని నలుగురు వ్యక్తులు రెండు బైక్‌లపై వారి నివాసానికి వచ్చి దారుణానికి పాల్పడ్డారు. బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో సమగ్ర విచారణ చేపట్టారు. ఘటనాస్థలిని ఎస్పీ రత్న పరిశీలించారు.ఇదీ చదవండి: వామ్మో ఇన్ని ట్విస్టులా.. పోలీసులే అవాక్కయ్యారు! -
లోకో పైలట్ హత్య కేసు: నిందితుడు చిక్కాడు
విజయవాడ, సాక్షి: విజయవాడలో లోకో పైలట్ హత్య కేసును పోలీసులు ఛేదించారు. నిందితుడు బిహార్‌కు చెందిన దేవ్ కుమార్‌గా గుర్తించి అరెస్ట్ చేశారు. అయితే అనుమానాస్పదంగా ఉన్న దేవ్కుమార్ను లోకో పైలట్ ప్రశ్నించాడు. దీంతో ఇనుపరాడ్‌తో లోకో పైలట్‌పై నిందితుడు దాడి చేశాడని రైల్వే ఏసీసీ రత్న వెల్లడించారు. మచిలీపట్నం వద్ద నిందితుడిని అరెస్ట్ చేశామని తెలిపారు. విజయవాడ రైల్వే స్టేషన్లో విధుల్లో ఉన్న లోకో పైలట్‌ను ఓ ఆగంతకుడు ఇనుప రాడ్డుతో కొట్టి హత్య చేశాడు. పోలీసుల కథనం ప్రకారం.. షంటింగ్ లోకో పైలట్‌గా పని చేస్తున్న డి.ఎబినేజర్ (52) గురువారం తెల్లవారుజామున విధుల్లో భాగంగా నైజాంగేటు సమీపంలోని ఏటీఎల్‌సీ కార్యాలయం నుంచి ఎఫ్–క్యాబిన్ వద్దకు వెళ్తుండగా గుర్తు తెలియని వ్యక్తి అతని వెనుక నుంచి వచ్చి ఇనుప రాడ్డుతో దాడి చేశాడు.రాడ్‌తో పలుమార్లు కొట్టడంతో తీవ్ర గాయాలైన ఎబినేజర్ అపస్మారక స్ధితిలో రైలు ట్రాక్‌పై పడిపోయాడు. దూరం నుంచి దీనిని గమనించిన మరో లోకో పైలట్ వృధ్వీరాజ్ పరుగున అక్కడికి వచ్చారు. సమీపంలో ఉన్న వారితో కలిసి ఎబినేజర్‌ను రైల్వే హాస్పటల్‌కు తరలించారు. పరిస్ధితి విషమంగా ఉండటంతో మెరుగైన వైద్యం కోసం నగరంలోని ఒక ప్రైవేటు హాస్పటల్‌కు తరలించగా అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందాడు.విజయవాడ జీఆర్పీ పోలీసులు కేసు నమోదు చేశారు. రైల్వే స్టేషన్ పరిసరాలలోని సీసీ టీవీ ఫుటేజ్‌ల ద్వారా దాడికి పాల్పడిన నిందితుడిని గుర్తించారు. ఆ వ్యక్తే నైజాంగేటు సెంటర్లో ఆటోలో నిద్రిస్తున్న వ్యక్తిపై కూడా దాడి చేసినట్లు పోలీసులు గుర్తించారు. అతను గంజాయి మత్తులో ఈ దాడులకు పాల్పడుతుండవచ్చని చెబుతున్నారు.చదవండి: అందరూ చూస్తుండగానే ప్రాణాలు తీశాడు -
అందరూ చూస్తుండగానే ప్రాణాలు తీశాడు..
తడ : వారిద్దరి మధ్య ఏం జరిగిందో ఏమో.. అందరూ చూస్తుండగానే సహోద్యోగిని కత్తెరతో విచక్షణ రహితంగా పొడిచేశాడు. తిరుపతి జిల్లా తడ మండల పరిధిలోని మాంబట్టు ప్రభుత్వ పారిశ్రామిక వాడలోని అపాచీ బూట్ల పరిశ్రమల్లో శుక్రవారం జరిగిన ఈ ఘటన కలకలం రేపింది. మృతురాలి భర్త ఫిర్యాదు మేరకు.. చిట్టమూరు మండలం కుమ్మరిపాళేనికి చెందిన వెంకటాద్రి.. అదే గ్రామానికి చెందిన ఎర్రబోతు వనజ(28)ను ఏడేళ్ల కిందట ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. వీరికి ఇద్దరు కుమారులు. కాగా, బురదగాలి గ్రామానికి చెందిన మీజూరు సురేష్(23) కుమ్మరిపాళేనికి వచ్చి స్థిరపడ్డాడు. అక్కడి నుంచే అపాచీలో పనికి వెళ్తున్నాడు. కొంత కాలంగా వనజను వేధించడం మొదలెట్టాడు. ఈ విషయంపై 2019, 2021లో చిట్టుమూరు పోలీస్ట్‌స్టేషన్‌లో బాధితురాలు ఫిర్యాదు చేసింది. దీనిపై ఇంకా కేసు నడుస్తోంది. తాజాగా శుక్రవారం మధ్యాహ్నం క్యాంటీన్లో భోజనానికి వెళ్లిన వనజను అక్కడ మళ్లీ వేధించాడు. దీంతో ఆమె సురేష్‌ను తీవ్రంగా మందలించింది. ఆవేశానికి గురైన సురేష్ అక్కడే ఉన్న కత్తెర తీసుకుని వనజ మెడ, శరీరంపై పొడిచాడు. తీవ్రంగా గాయపడ్డ వనజ అక్కడే కుప్పకూలిపోగా.. తోటి కార్మికులు సూళ్లూరుపేట ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. వైద్యులు పరీక్షించి అప్పటికే మృతిచెందినట్టు చెప్పారు. నిందితుడిని స్థానికులు పోలీసులకు అప్పగించారు. ఎస్ఐ కొండపనాయుడు కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
తగువులు వద్దన్నందుకు తమ్ముడినే చంపేశాడు..
రుద్రవరం: చిన్న చిన్న విషయాలకు ఇతరులతో గొడవపడొద్దని సూచించిన తమ్ముడిని.. అన్న కత్తితో పొడిచి చంపేశాడు. ఈ ఘటన గురువారం రాత్రి నంద్యాల జిల్లా రుద్రవరం మండలం బి.నాగిరెడ్డిపల్లెలో జరిగింది. శిరివెళ్ల సీఐ వంశీధర్, ఎస్ఐ వరప్రసాద్ తెలిపిన వివరాలు.. బి.నాగిరెడ్డిపల్లెలో గురువారం రాత్రి సురేంద్ర అనే వ్యక్తి మోటార్ సైకిల్‌పై వేగంగా వెళ్తుండగా పెద్ద ఓబులేసు అనే వ్యక్తి దాడి చేసి గాయపరిచాడు. దాడి విషయం తెలుసుకున్న ఓబులేసు కుటుంబ సభ్యులు.. నువ్వు మద్యం మత్తులో రోజూ ఏదో ఒక సమస్య తెస్తున్నావు.. పద్ధతి మార్చుకోవాలి.. అని చెప్పారు. ఇందుకు కోపోద్రిక్తుడైన ఓబులేసు.. కత్తితో తమ్ముడు కర్రెన్న అలియాస్ ఇసాక్(40)ను పొడిచాడు. అడ్డు వచ్చిన తండ్రిపైనా దాడి చేశాడు. క్షతగాత్రులిద్దరినీ నంద్యాల ప్రభుత్వ వైద్యశాలకు తరలించగా.. శుక్రవారం తెల్లవారు జామున ఇసాక్ మృతి చెందాడు. మృతుడి భార్య కుమారి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి నిందితుడిని అరెస్ట్‌చేశారు. -
ఐసీఐసీఐ బ్యాంకులో ఫ్రాడ్.. రెండోరోజు విచారిస్తున్న సీఐడీ
సాక్షి,పల్నాడుజిల్లా: చిలకలూరిపేట ఐసీఐసీఐ బ్యాంకులో జరిగిన అక్రమాలపై సీఐడీ అధికారులు రెండోరోజు శుక్రవారం(అక్టోబర్11)విచారణ చేపట్టారు.ఇవాళ మరికొంత మంది ఖాతాదారుల నుంచి సీఐడీ అధికారులు వివరాలు సేకరిస్తున్నారు. ఖాతాదారులు చెప్పిన అంశాల ఆధారంగా బ్యాంకు శాఖల్లో సీఐడీ రికార్డులను పరిశీలిస్తోంది.ఫిక్స్డ్ డిపాజిట్లు,బంగారు ఆభరణాలపై రుణాలు,ఇతర దేశాల నుంచి వచ్చిన నగదు తదితర అంశాలపై విచారిస్తున్నారు.బ్యాంకు శాఖల్లో అక్రమాలకు ఇప్పటి వరకు 72 మంది బాధితులు ఉన్నట్లు గుర్తించారు. వీరిలో ప్రతిరోజు కొంతమంది ఖాతాదారులను పిలిచి సీఐడీ అధికారులు విచారిస్తున్నారు.కాగా, చిలకలూరిపేట ఐసీఐసీఐ బ్యాంకులో ఫిక్స్డ్ డిపాజిట్లు ఉన్న బాధితులను మోసం చేసినట్లు అక్రమాలు వెలుగు చూడడంతో బ్యాంకు అధికారులు ఫిర్యాదు చేశారు. దీంతో సీఐడీ రంగంలోకి దిగి దర్యాప్తు ప్రారంభించింది.ఇదీ చదవండి: రూ.229 కోట్ల మోసం.. ఇద్దరి అరెస్టు -
AP: తెలంగాణ ఆర్టీసీ బస్సును ఢీకొన్న ట్యాంకర్
సాక్షి,అనంతపురం:బెంగళూరు నుంచి హైదరాబాద్ వెళుతున్న తెలంగాణ ఆర్టీసీ బస్సును గురువారం(అక్టోబర్11) అర్ధరాత్రి అనంతపురంజిల్లా గార్లదిన్నె మండలం తిమ్మంపేట సమీపంలో ట్యాంకరు ఢీకొట్టింది.ఈ ప్రమాదంలో బస్సులో ప్రయాణిస్తున్న తొమ్మిది మంది గాయపడ్డారు. ఈ ప్రమాదంలో ట్యాంకరు డ్రైవరుకు తీవ్ర గాయాలయ్యాయి. గాయపడ్డవారిని హైవే పెట్రోలింగ్ అనంతపురం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. మిగిలిన ప్రయాణికులను ఇతర బస్సుల్లో హైదరాబాద్‌కు తరలించారు. జాతీయ రహదారి44పై ట్రాఫిక్ అంతరాయం కలగకుండా పోలీసులు చర్యలు తీసుకున్నారు.ఇదీ చదవండి: ఈ టీతో నష్టాలే -
చిలకలూరిపేట ఐసీఐసీఐలో సీఐడీ విచారణ
చిలకలూరిపేట: ఐసీఐసీఐ బ్యాంకు చిలకలూరిపేట బ్రాంచ్‌లో జరిగిన కుంభకోణం విషయంలో సీఐడీ అధికారులు విచారణ చేపట్టారు. సీఐడీ ఏఎస్పీ సీహెచ్ ఆదినారాయణ ఆధ్వర్యంలో సీఐడీ అధికారుల బృందం గురువారం పల్నాడు జిల్లా చిలకలూరిపేట ఐసీఐసీఐ బ్యాంకు బ్రాంచ్‌కి చేరుకుని విస్తృతంగా విచారణ చేపట్టారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు బ్యాంకు తలుపులు మూసివేసి ఎవరినీ లోనికి అనుమతించకుండా విచారణ కొనసాగించారు. ఈ సందర్బంగా సీఐడీ ఏఎస్పీ సీహెచ్ ఆదినారాయణ మీడియాతో మాట్లాడుతూ ఈ నెల 8న సీఐడీ ప్రధాన కార్యాలయంలో సంబంధిత విషయమై కేసు నమోదు చేసి విచారణ నిమిత్తం కేసును గుంటూరు సీఐడీ కార్యాలయానికి బదిలీ చేసినట్టు తెలిపారు. తమ విచారణలో ఇప్పటి వరకు 72 మంది ఖాతాదారులకు సంబంధించి రూ. 28 కోట్లు గోల్మాల్ జరిగినట్టు గుర్తించినట్లు తెలిపారు. 2021 నుంచి ఇక్కడ బ్రాంచి మేనేజర్‌గా పనిచేసిన దూడ నరేష్చంద్రశేఖర్, మరో ఇద్దరు కలిసి ఈ కుంభకోణానికి పాల్పడినట్టు తమ ప్రాథమిక విచారణలో తేలిందన్నారు. ఇక్కడ పనిచేసిన అనంతరం నరేష్చంద్రశేఖర్ నరసరావుపేట, విజయవాడ భారతీనగర్ బ్రాంచ్‌లలో మేనేజర్‌గా పనిచేసినట్టు తెలిపారు. విజయవాడలో పనిచేస్తున్న సమయంలో అతని అవకతవకలు వెలుగు చూసి ఈ ఏడాది జూలైలో బ్యాంకు అతనిని విధుల నుంచి సస్పెండ్ చేసిందన్నారు. ఈ నెల చిలకలూరిపేట బ్రాంచిలో జరిగిన అక్రమాలు వెలుగు చూడటంతో సీఐడీ కేసు నమోదు చేసిందన్నారు. ఇంకా ఎవరైనా బ్యాంకు సిబ్బంది ఈ వ్యవహారంలో ఉన్నారా లేరా అనేది విచారణలో తేలాల్సి ఉందని తెలిపారు. వారం, పది రోజుల్లో విచారణ ఓ కొలిక్కి వచ్చే అవకాశం ఉందని, కేసు విషయమై ఇంకా ఎవరినీ అదుపులోకి తీసుకోలేదన్నారు. సీఐడీ సీఐ సంజీవ్‌కుమార్, సిబ్బంది పాల్గొన్నారు. -
విజయవాడ రైల్వేస్టేషన్లో దారుణ హత్య
రైల్వేస్టేషన్ (విజయవాడ పశ్చిమ): విజయవాడ రైల్వే స్టేషన్లో దారుణ హత్య జరిగింది. విధుల్లో ఉన్న లోకో పైలట్‌ను ఓ ఆగంతకుడు ఇనుప రాడ్డుతో కొట్టి హత్య చేశాడు. పోలీసుల కథనం ప్రకారం.. షంటింగ్ లోకో పైలట్‌గా పని చేస్తున్న డి.ఎబినేజర్ (52) గురువారం తెల్లవారుజామున విధుల్లో భాగంగా నైజాంగేటు సమీపంలోని ఏటీఎల్‌సీ కార్యాలయం నుంచి ఎఫ్–క్యాబిన్ వద్దకు వెళ్తుండగా గుర్తు తెలియని వ్యక్తి అతని వెనుక నుంచి వచ్చి ఇనుప రాడ్డుతో దాడి చేశాడు. రాడ్‌తో పలుమార్లు కొట్టడంతో తీవ్ర గాయాలైన ఎబినేజర్ అపస్మారక స్ధితిలో రైలు ట్రాక్‌పై పడిపోయాడు. దూరం నుంచి దీనిని గమనించిన మరో లోకో పైలట్ వృధ్వీరాజ్ పరుగున అక్కడికి వచ్చారు. సమీపంలో ఉన్న వారితో కలిసి ఎబినేజర్‌ను రైల్వే హాస్పటల్‌కు తరలించారు. పరిస్ధితి విషమంగా ఉండటంతో మెరుగైన వైద్యం కోసం నగరంలోని ఒక ప్రైవేటు హాస్పటల్‌కు తరలించగా అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందాడు. విజయవాడ జీఆర్పీ పోలీసులు కేసు నమోదు చేశారు. ఐదు బృందాలతో నిందితుని కోసం గాలింపు చర్యలు చేçపట్టారు. రైల్వే స్టేషన్ పరిసరాలలోని సీసీ టీవీ ఫుటేజ్‌ల ద్వారా దాడికి పాల్పడిన నిందితుడిని గుర్తించారు. ఆ వ్యక్తే నైజాంగేటు సెంటర్లో ఆటోలో నిద్రిస్తున్న వ్యక్తిపై కూడా దాడి చేసినట్లు పోలీసులు గుర్తించారు. అతను గంజాయి మత్తులో ఈ దాడులకు పాల్పడుతుండవచ్చని చెబుతున్నారు.