-
ఎంపీడీవో అదృశ్యం విషాదాంతం
పెనమలూరు/నరసాపురం/కోనేరుసెంటర్(మచిలీపట్నం)/సాక్షి, అమరావతి: పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం ఎంపీడీవో ఎం.వెంకటరమణారావు అదృశ్యం ఘటన చివరికి విషాదాంతమైంది. ఆయన మృతదేహాన్ని విజయవాడలోని మధురానగర్ వద్ద ఏలూరు కాలువలో మంగళవారం ఎస్డీఆర్ఎఫ్, ఎన్డీఆర్ఎఫ్ బృందాలు గుర్తించాయి. ఈ నెల 15వ తేదీన ఎంపీడీవో అదృశ్యం కాగా... ఆయన సెల్‌ఫోన్ చివరి లొకేషన్ సిగ్నల్ ఆధారంగా మధురానగర్ వంతెన వద్ద నుంచి ఏలూరు కాలువలో దూకి ఆత్మహత్య చేసుకుని ఉంటారని పోలీసులు అంచనా వేశారు.ఈ మేరకు గాలింపు చర్యలు చేపట్టగా, ఆ వంతెనకు 200 మీటర్ల దూరంలో పిచ్చిమొక్కల అడుగుభాగాన కుళ్లిపోయిన దశలో వెంకటరమణారావు మృతదేహం కనిపించింది. మృతదేహాన్ని విజయవాడ ప్రభుత్వాస్పత్రికి తీసుకువెళ్లి పోస్టుమార్టం చేసి కుటుంబ సభ్యులకు అప్పగించారు. ఆయన నివాసం ఉంటున్న కృష్ణా జిల్లా పెనమలూరులోని కానూరులో వెంకటరమణారావు అంత్యక్రియలు నిర్వహించారు.పెనమలూరు ఎమ్మెల్యే బోడె ప్రసాద్, నరసాపురం ఎమ్మెల్యే బొమ్మిడి నాయకర్ పాల్గొన్నారు. కాగా, ఒత్తిళ్ల వల్లే వెంకటరమణారావు ఆత్మహత్య చేసుకున్నారని ఆయన కుటుంబ సభ్యులు శవపంచనామా సందర్భంగా తెలిపారు. మాధవాయిపాలెం ఫెర్రీ సొమ్ము రూ.55లక్షల బకాయి కారణంగా మనస్తాపం చెందాడని పేర్కొన్నారు. బాధ్యులపై చర్యలు తీసుకోవాలని కోరారు. నరసాపురం ఎంపీడీవో కుటుంబానికి న్యాయం చేస్తాం: పవన్ నరసాపురం ఎంపీడీవో ఎం.వెంకటరమణారావు మరణం దురదృష్టకరమని ఉప ముఖ్యమంత్రి పవన్‌కళ్యాణ్ మంగళవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఆయన బలవన్మరణానికి పాల్పడే పరిస్థితి తీసుకువచి్చన వారిపై కఠిన చర్యలకు ఉపక్రమించాలని అధికారులను ఆదేశించినట్లు పేర్కొన్నారు. వెంకట రమణారావు కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలుపుతూ ఆ కుటుంబానికి ప్రభుత్వం తగిన న్యాయం చేస్తుందని తెలిపారు.అన్నోన్ నంబర్ల నుంచి ఫోన్లు.. సంబంధం లేని ఖాతాలకు డబ్బులు బదిలీ!కుటుంబసభ్యుల ఫిర్యాదు ఆధారంగా కేసు దర్యాప్తు చేపట్టిన పోలీసులు... ఎంపీడీవో వెంకటరమణారావు ఆచూకీ తెలియకపోవడంతో ఆయన ఫోన్ కాల్‌డేటాను పరిశీలించారు. అన్ నోన్ నంబర్ల నుంచి వెంకటరమణారావుకు ఫోన్లు వచి్చనట్లు గుర్తించారు. రాజస్థాన్‌కు చెందిన ఇద్దరికి, హైదరాబాద్‌కు చెందిన ఒకరికి, మరికొన్ని గుర్తుతెలియని ఖాతాలకు ఆన్లైన్లో ఎంపీడీవో డబ్బులు బదిలీ చేసినట్లు వెలుగుచూసింది.అయితే, మాధవాయిపాలెం ఫెర్రీ విషయంలో రూ.55 లక్షలు బకాయి ఉండగా, తీవ్ర ఒత్తిడికి గురైన ఆయన ఆత్మహత్య చేసుకున్నారని కృష్ణా జిల్లా ఎస్పీ ఆర్.గంగాధర్‌రావు తెలిపారు. అదేవిధంగా సైబర్ నేరగాళ్లు ఉచ్చులో పడిన వెంకటరమణ కొంత నగదును సైబర్ నేరగాళ్ల అకౌంట్లలో జమ చేశారని చెప్పారు. -
పల్నాడులో మళ్లీ పచ్చ మూకల అరాచకం
పెదకూరపాడు/నగరంపాలెం: పల్నాడు జిల్లా పెదకూరపాడు మండలం క్రోసూరు మార్కెట్ యార్డు చైర్మన్ ఈదా సాంబిరెడ్డి (70)పై మంగళవారం సినీ ఫక్కీలో హత్యాయత్నం జరిగింది. ఈ ఘటనలో ఆయన తీవ్రంగా గాయపడ్డారు. స్థానికులు ఆయనను గుంటూరులోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. కాగా, ఘటన జరిగిన సమయంలో పల్నాడు జిల్లా ఎస్పీ కె. శ్రీనివాసరావు క్రోసూరులోనే ఉండటం గమనార్హం.సాంబిరెడ్డికి వైఎస్సార్సీపీ జిల్లా కార్యదర్శిగా, మార్కెట్ యార్డు చైర్మన్‌గా, ఎంపీపీగా, సర్పంచ్‌గా ప్రజల్లో మంచి పేరు ఉంది. ఎన్నికలు ముగిసిన నాటి నుంచి ఆయన తన స్వగ్రామం పెదకూరపాడు మండలం 75 త్యాళ్ళూరులో ఉంటున్నారు. మాజీ ఎమ్మెల్యే, వైఎస్సార్సీపీ పెదకూరపాడు ఇన్చార్జి నంబూరు శంకరరావు మంగళవారం గుంటూరులోని తన కార్యాలయానికి వచ్చినట్లు తెలియడంతో సాంబిరెడ్డి.. తన ఇద్దరు అనుచరులు కీసర గంగాధరరెడ్డి, కల్లి శ్రీనివాసరెడ్డి, కారు డ్రైవర్ దామోదరరెడ్డితో వెళ్లి ఆయనను కలిశారు.తిరిగి వస్తుండగా అమరావతి మండలం ఉంగుటూరు, పెదకూరపాడు మండలం కంభంపాడు మధ్య సాంబిరెడ్డి ప్రయాణిస్తున్న కారుపై కొందరు దుండగులు మాటు వేసి మూకుమ్మడిగా దాడి చేశారు. ఆంజనేయ స్వామి దేవాలయం రోడ్డులో రెండు కారుల్లో మాటు వేసిన దుండగులు సాంబిరెడ్డి ప్రయాణిస్తున్న కారుకు ఇంకో కారును అడ్డుపెట్టి ఆయన కారు అద్దాలు పగలగొట్టారు. ఈ క్రమంలో శ్రీనివాసరెడ్డి, దామోదర్‌రెడ్డి, గంగాధరరెడ్డికి గాయాలయ్యాయి. సాంబిరెడ్డిని బయటకు లాగి పక్కకు తీసుకెళ్లి చేతులు మెలవేసి.. కాళ్లను లక్ష్యంగా చేసుకుని విచక్షణారహితంగా పది మంది దాడి చేశారు.ఈ దాడిలో ఆయన కాళ్లకు తీవ్ర గాయాలయ్యాయి. అనంతరం మృతి చెందారని భావించి వదిలివెళ్లిపోయారు. ఎన్నికల సమయంలో మా అక్క (టీడీపీ అభ్యర్థి భాష్యం ప్రవీణ్ భార్య లావణ్య) కారునే అడ్డుకుంటారా అంటూ దాడి చేసినట్లు బాధితులు తెలిపారు. కాగా, ఘటనాస్థలిని ఎస్పీ శ్రీనివాసరావు పరిశీలించారు. క్లూస్ టీం, డాగ్ స్క్వాడ్లను రప్పించి వివరాలు సేకరిస్తామన్నారు. నిందితులను పట్టుకోవడానికి ఐదు ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు.దారుణంతెల్లారక ముందే.. దుకాణాలు కూల్చేశారు!విజయవాడ బుడమేరు వంతెన సెంటర్లో ఘటన.. లబోదిబోమంటున్న బాధితులుమధురానగర్ (విజయవాడసెంట్రల్): కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచి్చన నాటినుంచి పేదోడికి కష్టాలు ప్రారంభమయ్యాయి. విజయవాడ నడి»ొడ్డునున్న బుడమేరు సెంటర్లోని చిరువ్యాపారుల దుకాణాలను మంగళవారం తెల్లవారుజామున కూలి్చవేయడంతో వారంతా నడిరోడ్డున పడ్డారు. ఎటువంటి సమాచారం లేకుండా తమ బతుకుపై దెబ్బకొట్టారని వారు లబోదిబోమంటూ రోడ్డెక్కి నిరసనకు దిగారు.వివరాల్లోకి వెళితే.. ఎన్టీఆర్ జిల్లా విజయవాడలోని బుడమేరు వంతెన సెంటర్లో పలువురు చిరువ్యాపారాలు సాగిస్తూ 40 ఏళ్లుగా జీవనం సాగిస్తున్నారు. వైఎస్సార్సీపీ సానుభూతి పరులు కావడంతో పది రోజుల క్రితం దుకాణాలకు విద్యుత్ సరఫరా నిలిపివేశారు. దీనిపై స్థానిక ఎమ్మెల్యే బొండా ఉమను కలిసి గోడు విన్నవించుకోగా.. తాను అధికారులతో మాట్లాడతానని చెప్పి పంపించి వేశారు. దీంతో విద్యుత్ సరఫరాను పునరుద్ధరిస్తారని ఆశగా ఎదురు చూస్తున్నారు.అయితే మంగళవారం తెల్లవారుజాము రెండు గంటల సమయంలో ఎటువంటి ముందస్తు సమాచారం లేకుండా నగరపాలక సంస్థ టౌన్‌ఫ్లానింగ్ అధికారులు, పోలీసుల సహకారంతో దుకాణాలను కూలి్చవేశారు. సమాచారం తెలుసుకున్న దుకాణదారులు లబోదిబోమని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇక్కడ 40 ఏళ్లుగా దుకాణాలను పెట్టుకుని జీవనం సాగిస్తున్నామని ఇప్పుడు అర్ధాంతరంగా దుకాణాలు తొలగిస్తే.. ఎక్కడకు వెళ్లాలని ప్రశి్నస్తున్నారు. కనీసం తమకు సమాచారం ఇవ్వకుండా తాళాలు వేసి ఉన్న దుకాణాలు కూలి్చవేశారని, తమకు పునరావాసం కలి్పంచాలని డిమాండ్ చేస్తున్నారు.దుర్మార్గంశిలాఫలకంలోని చిత్రాలను పగులకొట్టారు⇒ఏలూరు జిల్లా నూజివీడు మండలంలోని బోర్వంచలోని గ్రామ సచివాలయ భవనం శిలాఫలకాన్ని పచ్చ మూకలు సోమవారం రాత్రి ధ్వంసం చేశాయి. సచివాలయం గోడకు ప్రారంభోత్సవ శిలాఫలకాన్ని ఏర్పాటు చేసి దానిపై అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్, ఎమ్మెల్యే మేకా వెంకట ప్రతాప్ అప్పారావు, ఎంపీ కోటగిరి శ్రీధర్ల ఫొటోలను ఏర్పాటు చేశారు.పచ్చమూకలు శిలాఫలకంపై ఉన్న వైఎస్ జగన్, మేకా ప్రతాప్ ఫొటోలను పలుగులతో పగులగొట్టారు. దీనిపై వైఎస్సార్సీపీ నాయకులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. గతంలో ఇదే సచివాలయం కిటికీ అద్దాలను పగులకొట్టారని, దీనిపై పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేస్తే ఇంతవరకు కేసు కూడా నమోదు చేయలేదని మండిపడ్డారు. – నూజివీడుదాష్టీకం అభాగ్యురాలి జీవితం చిదిమేశారు⇒ విశాఖలో యువతిపై అత్యాచారం⇒ కేజీహెచ్‌కు బాధితురాలు తరలింపు⇒ గోప్యంగా ఉంచుతున్న పోలీసులు⇒ కొద్ది రోజుల క్రితమే ఐదేళ్ల చిన్నారిపై లైంగిక దాడి⇒ ఆ ఘటన మరువకముందే మరో దారుణంమధురవాడ (విశాఖపట్నం): విశాఖపట్నంలోని మధురవాడలో కొద్ది రోజుల కిందట ముక్కుపచ్చలారని ఐదేళ్ల చిన్నారిపై అత్యాచార ఘటన మరువక ముందే సోమవారం రాత్రి మరో దారుణం చోటు చేసుకుంది. గంజాయి మూకలు 19 ఏళ్ల యువతిపై అత్యాచారానికి పాల్పడ్డాయి. ఈ ఘటన విశాఖ నార్త్ సబ్ డివిజన్ పీఎంపాలెం పోలీస్‌స్టేషన్ పరిధి కొమ్మాది జంక్షన్ వద్ద చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల మేరకు.. యువతి చోడవరం ప్రాంతం నుంచి వచ్చి కొమ్మాది జంక్షన్ వద్ద ఉన్న ఒక బేకరీలో పనిచేస్తోంది.ఓ ప్రైవేటు హాస్టల్లో ఉంటోంది. సోమవారం రాత్రి ఆమె విధులు నిర్వహిస్తున్న క్రమంలో కాలకృత్యాల కోసం బయటకు వెళ్లి తిరిగి రాలేదు. ఆమెపై బేకరీ–హాస్టల్‌కి మధ్య ఉన్న నిర్మానుష్య ప్రాంతంలో గంజాయి సేవిస్తున్న కొందరు యువకులు దాడి చేసి అత్యాచారానికి పాల్పడ్డట్టు సమాచారం. రాత్రి ఒంటి గంట సమయంలో బాధితురాలు హాస్టల్‌కి వెళ్లింది. కాసేపటికే వాంతి చేసుకుంది. హాస్టల్ వార్డెన్ పరిశీలించగా యువతి చెంపపై గాయం కూడా కనిపించింది.దీంతో అనుమానం వచ్చిన వార్డెన్ పోలీస్ కంట్రోల్ రూమ్‌కి సమాచారం ఇచ్చారు. వెంటనే పీఎం పాలెం పోలీసులు హాస్టల్‌కి చేరుకుని పక్కనే ఉన్న గాయత్రి ఆస్పత్రికి తరలించారు. అక్కడి వైద్యుల సూచనలతో విశాఖ కేజీహెచ్‌కి తీసుకెళ్లారు. అయితే బాధితురాలితో మాట్లాడేందుకు ఎవరినీ అనుమతించకపోవడం పలు అనుమానాలకు తావిస్తోంది.ఈ దారుణ ఘటనపై విశాఖ పోలీస్ కమిషనర్ సీరియస్ అయినట్టు తెలిసింది. ఈ వ్యవహారాన్ని పోలీసులు గోప్యంగా ఉంచుతున్నారు. ఈ విషయమై నార్త్ జోన్ ఏసీపీ సునీల్‌ను వివరణ కోరగా అత్యాచారం లాంటిది ఏమీ లేదన్నారు. యువతికి చిన్న దెబ్బలు తగిలాయని.. విచారణ చేస్తున్నామని తెలిపారు. -
AP: పచ్చమూకల దాడి.. వైఎస్ఆర్సీపీ నేతకు తీవ్ర గాయాలు
సాక్షి,పల్నాడు జిల్లా: ఏపీలో వైఎస్ఆర్సీపీ నేతలపై టీడీపీ దాడులు కొనసాగుతున్నాయి. తాజాగా పల్నాడు జిల్లాలో తెలుగుదేశం నాయకులు మళ్లీ బరితెగించారు. వైఎస్ఆర్సీపీ నేత, క్రోసూరు మార్కెట్ యార్డ్ మాజీ చైర్మన్ ఈదా సాంబిరెడ్డిపై 15 మంది మాస్కులు వేసుకున్న టీడీపీ నాయకులు దారికాచి దాడి చేశారు. మంగళవారం(జులై 23)సాయంత్రం గుంటూరు నుంచి తాళ్లూరు వెళ్తుండగా ఉంగుటూరు వద్ద మాటువేసిన టీడీపీ నాయకులు సాంబిరెడ్డి కారుపై దాడి చేశారు. టీడీపీ నేతల దాడిలో కారు ధ్వంసమైంది. సాంబిరెడ్డి కాళ్లు చేతులపై ఇనుపరాడ్లతో విచక్షణారహితంగా కొట్టారు. ఈ దాడిలో సాంబిరెడ్డి తీవ్రంగా గాయపడ్డారు. చికిత్స కోసం ఆయనను గుంటూరులోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. -
ఇడ్లీ తిన్నాడు.. బిల్లు అడిగితే తన్నాడు!
మార్కాపురం: హోటల్‌కు వెళ్లి సర్వర్‌తో ఇడ్లీ తెప్పించుకుని పుష్టిగా ఆరగించిన ఓ యువకుడు బిల్లు చెల్లించాలని అడిగిన సిబ్బందిపై ఒక్కసారిగా దాడికి దిగాడు. ఈ సంఘటన సోమవారం మార్కాపురం ఆర్టీసీ బస్టాండ్ సమీపంలోని ఒక హోటల్లో చోటుచేసుకుంది. వివరాలు.. ఆర్టీసీ డిపో ఎదురుగా ఉన్న ఓ హోటల్లో కె.మహేష్‌రెడ్డి ఇడ్లీ తిన్నాడు. హోటల్ బాయ్ అంజి బిల్లు కట్టాలని కోరగా మహేష్ దాడికి దిగాడు. అడ్డుకోబోయిన హోటల్ సిబ్బంది పరమేశ్వరరెడ్డి, సుబ్బారెడ్డిపైనా మహేష్ దాడికి పాల్పడ్డాడు. బాధితుల ఫిర్యాదు మేరకు నిందితుడిపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై అబ్దుల్ రెహమాన్ తెలిపారు. -
రషీద్‌ది రాజకీయ హత్యే
సాక్షి, నరసరావుపేట: వినుకొండలో ఇటీవల హత్యకు గురైన రషీద్‌ది ముమ్మాటికీ రాజకీయ హత్యేనని అతని తల్లి బడేబీ, తండ్రి ఫరేషా స్పష్టం చేశారు. ‘మా కుమారుడికి పాత కక్షలు ఏమీ లేవు. నేర చరిత్ర లేదు. ఎవరినీ చంపలేదు, నరకలేదు. కేవలం వైఎస్సార్సీపీలో చురుగ్గా తిరుగుతున్నాడన్న కారణంతోనే టీడీపీ నేతలు నడి రోడ్డుపై దారుణంగా హత్య చేయించారు. ఇందుకు జిలానీని అడ్డుపెట్టుకొన్నారు. బుల్లెట్ బండి తగలబెట్టడానికి, మా కుమారుడికి సంబంధం లేదు. ఈ విషయాలన్నీ వినుకొండలో ఎవరిని అడిగినా చెబుతారు’ అని చెప్పారు. జగన్‌ను ఎందుకు అడ్డుకున్నారు? తన పార్టీ కార్యకర్తను అన్యాయంగా టీడీపీ నేతలు హత్య చేస్తే అసెంబ్లీలో ప్రశ్నించే హక్కు వైఎస్ జగన్మోహన్రెడ్డికి లేదా అని నిలదీశారు. వైఎస్ జగన్‌ను అసెంబ్లీ వద్ద ఎందుకు అడ్డుకున్నారని ప్రశి్నంచారు. ‘రషీద్ గురించి మాట్లాడే హక్కు జగన్‌కు లేదా? ప్లకార్డులను ఎందుకు చింపేశారు? జగన్ చేతిలో ప్లకార్డులు ఉంటే ప్రజలంతా చూస్తారు. మాకు జరిగిన అన్యాయం అందరికీ తెలుస్తుందని కదా’ అని అన్నారు. కొడుకును కోల్పోయి బాధలో ఉన్న తమకు వైఎస్ జగన్ భరోసానిచ్చారని తెలిపారు. ఢిల్లీలో ధర్నా చేసి పోరాడతానన్నారని చెప్పారు. తమకు న్యాయం చేద్దామన్న ఆలోచన ప్రభుత్వానికి ఉంటే ఇంటి వద్దకు వచ్చి భరోసా ఎందుకు ఇవ్వలేదని ప్రశి్నంచారు. ఇప్పటికీ తమ పిల్లల్ని టీడీపీ వారు బెదిరిస్తున్నారని తెలిపారు. ఇంకా నలుగురు ఉన్నారు, మిమ్మల్నీ చంపుతామంటూ ఫోన్లు చేస్తున్నారన్నారు. పిల్లలకు ఫోన్లు చేయిస్తున్న వారెవరో తేల్చాలని కోరారు. ‘ఆమె ఎవరో హోంశాఖ మంత్రి అనిత అంట.. ఎంత అన్యాయంగా మాట్లాడుతోంది! పాత కక్షలు, ముస్లింలు ముస్లింలు కొట్టుకున్నారని ఆమె చెప్పడం సరికాదు. మా కడుపు కోతను అర్థం చేసుకొని మరోసారి పాతకక్షల వల్ల హత్య అని అనవద్దు. మాకు న్యాయం చేయండి’ అని అన్నారు. బొండాలు కొట్టే కత్తితో రషీద్‌ను హత్య చేశారని అంటున్నారని, ఆ కత్తిని ఎందుకు చూపడంలేదని ప్రశి్నంచారు. అది ఎక్కడ తయారు చేశారు, ఎవరు చేయించారో పోలీసులు తేల్చాలని డిమాండ్ చేశారు. -
మదనపల్లె సబ్‌కలెక్టరేట్‌లో అగ్నిప్రమాదం
సాక్షి రాయచోటి/బి.కొత్తకోట/మదనపల్లె/సాక్షి, అమరావతి: అన్నమయ్య జిల్లా మదనపల్లె సబ్ కలెక్టరేట్లో ఆదివారం అర్థరాత్రి అగి్నప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో ఏఓ ఛాంబర్ కుడివైపు సెక్షన్లు పూర్తిగా.. ఎడమవైపు సెక్షన్లు కొంతమేర దగ్థమయ్యాయి. అలాగే, వీటికి ఎదురుగా ఉన్న విభాగాలూ మొత్తం కాలిపోయాయి. ఈ విభాగాల్లోని రికార్డులు, కంప్యూటర్లు దగ్థమయ్యాయి. తీవ్రస్థాయిలో మంటలు చెలరేగినట్లు తెలుస్తోంది. మరోవైపు.. ఈ ప్రమాదంపై రాష్ట్ర ప్రభుత్వం హుటాహుటిన స్పందించింది. దీనిపై సోమవారం సీఎం చంద్రబాబు అత్యవసర విచారణకు ఆదేశించారు. ఘటనపై కలెక్టర్ చామకూరి శ్రీధర్‌ను ఆరా తీశారు. ముఖ్యమంత్రి ఆదేశాలతో డీజీపీ ద్వారకా తిరుమలరావు, సీఐడీ చీఫ్ రవిశంకర్ అయ్యన్నార్ ఉన్నపళంగా హెలికాప్టర్లో మదనపల్లెకు చేరుకున్నారు. ప్రమాదం జరిగిన ప్రదేశాన్ని క్షుణ్ణంగా పరిశీలించారు. దాదాపు మూడు గంటలకు పైగా జరిపిన తనిఖీల్లో ఏపీఎస్పీడీసీఎల్, ఫోరెన్సిక్ ల్యాబ్, పోలీస్, రెవెన్యూ అధికారుల ద్వారా ప్రమాదానికి గల కారణాల గురించి అడిగి తెలుసుకున్నారు. ఏపీఎస్పీడీసీఎల్ సీఎండీ సంతోష్‌రావు విద్యుత్ సరఫరా వైర్లు, మీటరు, ఇతర విద్యుత్ పరికరాలను పరిశీలించారు. విద్యుత్ సరఫరా వైరింగ్ కొన్నిచోట్ల కాలిపోయినట్లు గుర్తించారు. అలాగే, సీఐడీ, ఇంటెలిజెన్స్, శాంతిభద్రతల విభాగం, పోలీసు అధికారులూ విచారణ జరిపారు. ప్రమాదంపై విద్యుత్ శాఖాధికారులు, తహశీల్దార్లు, ఉద్యోగులనూ విచారించారు. అంతేకాక.. ఈ ఘటనపై విచారణకు పది బృందాలను ఏర్పాటుచేశారు. సెల్‌ఫోన్ సిగ్నల్స్‌పై దృష్టిపెట్టారు. చిత్తూరు, అన్నమయ్య జిల్లాల నుంచి డాగ్‌స్కా్వడ్‌లు.. తిరుపతి, చిత్తూరు, అన్నమయ్య జిల్లాల నుంచి ఫోరెన్సిక్ విభాగం నిపుణులను రప్పించారు.అధికారుల హడావుడితో హైటెన్షన్.. అంతకుముందు.. సోమవారం ఉదయమే పోలీసులు కార్యాలయాన్ని తమ ఆధీనంలోకి తీసుకుని కొద్దిమంది అధికార పార్టీ నేతలు, ఎల్లో మీడియా ప్రతినిధులను మినహా ఎవరినీ లోపలికి అనుమతించలేదు. ఇక అగి్నప్రమాదంతో ప్రభుత్వ యంత్రాంగం మొత్తం మదనపల్లె సబ్ కలెక్టరేట్ ఆవరణకు చేరుకోవడం.. ఎక్కడలేని హడావుడి నెలకొనడంతో సబ్‌కలెక్టరేట్ చుట్టుపక్కల హైటెన్షన్ వాతావరణం నెలకొంది. ఈ ఘటనపై చర్చించుకునేందుకు ఎవరూ సాహసించడంలేదు. ఎవరితో ఏం మాటా్లడితే ఏం ముంచుకొస్తుందోనని భయపడుతున్నారు.అవసరమైతే కేసు సీఐడీకి బదిలీ: డీజీపీ అనంతరం.. డీజీపీ ద్వారకా తిరుమలరావు మీడియాతో మాట్లాడుతూ.. అగి్నప్రమాదంపై వీఆర్ఏ డీటీకి తెలపడం, ఆమె ఆర్డీఓకి చెప్పడం.. ఆయన ఫైర్ అధికారులకు సమాచారం ఇవ్వడంతో వారు మంటలను అదుపుచేశారన్నారు. ఇలాంటి ఘటనలపై ప్రభుత్వం సీరియస్‌గా ఉందన్నారు. అవసరాన్ని బట్టి సీఐడీకి కేసు బదిలీచేసే విషయాన్ని పరిశీలిస్తామన్నారు. రెవెన్యూ శాఖలోని 25 అంశాలకు చెందిన రన్నింగ్ ఫైల్స్ దగ్థమైనట్లు ప్రాథమిక విచారణలో గుర్తించామని జిల్లా కలెక్టర్ చామకూరి శ్రీధర్ తెలిపారు. అలాగే, దగ్థమైన రికార్డులకు సంబంధించిన సమాచారాన్ని కంప్యూటర్ల నుంచి తిరిగి పునరుద్ధరిస్తామని వెలగపూడి సచివాలయంలో రెవెన్యూ మంత్రి అనగాని సత్యప్రసాద్ చెప్పారు. -
కలెక్టర్ సీసీ లైంగికంగా వేధిస్తున్నాడు
నరసరావుపేట: కలెక్టర్ బంగ్లాలో పనిచేస్తున్న తనపై క్యాంపు క్లర్క్ (సీసీ)గా వ్యవహరిస్తున్న జానీబాషా లైంగిక, మానసిక వేధింపులకు పాల్పడుతున్నాడని ముద్దా నాగమణి ఆరోపించింది. ఈ మేరకు సోమవారం పల్నాడు జిల్లా కలెక్టరేట్, పోలీసు కార్యాలయాల్లో నిర్వహించిన ప్రజాసమస్యల పరిష్కార వేదికలో కలెక్టర్ పి.అరుణ్‌బాబు, ఎస్పీ కె.శ్రీనివాసరావులకు ఆమె ఫిర్యాదు చేసింది. అనంతరం కలెక్టరేట్ ఆవరణలో ఆమె మీడియాతో మాట్లాడింది. తాను పెద్దచెరువులోని కలెక్టర్ బంగ్లాలో రెండేళ్లుగా వంటమనిషిగా పనిచేస్తున్నానని, సీసీగా జానీబాషా వచ్చిన దగ్గర నుంచి తనతో అనుచితంగా వ్యవహరిస్తున్నాడని తెలిపింది. తాను నాలుగైదు నెలలుగా జీతాలు లేకుండా పనిచేశానని, గత కలెక్టర్ ఎల్.శివశంకర్ తనను అప్కాస్‌లో ఉద్యోగిగా చేర్చారన్నారు. ఏడాది క్రితం కలెక్టర్ బంగ్లాకు సీసీగా వచ్చిన జానీబాషా ఇబ్బందులు పెట్టడం ప్రారంభించాడన్నారు. గత ఆరు నెలల నుంచి తనను లైంగిక వేధింపులకు గురిచేస్తున్నాడని, ఒక నెల నుంచి తనను ఉద్యోగం చేయకుండా ఆపేశారన్నారు. టీ ఇచ్చే సమయంలో తన చేయి పట్టుకొని లాగటం చేసేవాడన్నారు. తానంటే ఇష్టమని చెబుతూ.. రూం బుక్ చేశాను రమ్మంటూ లైంగిక వేధింపులకు పాల్పడేవాడని ఆవేదన వ్యక్తం చేశారు.అయినా అతనికి లొంగనందువల్ల తనను ఉద్యోగం నుంచి తొలగించాడని చెప్పారు. అదే బంగ్లాలో తన సోదరుడు కూడా పనిచేస్తున్నాడని, సీసీ చేస్తున్న పనులను గురించి అతనికి చెప్పానని, దీనిపై సీసీని అడిగితే నా ఇష్టం వచ్చినట్లుగా ఉంటానని, జరిగిన విషయం ఎవరికై నా చెబితే మీ ఉద్యోగాలు తొలగిస్తామని బెదిరించాడన్నారు. వారం రోజుల క్రితం కలెక్టరేట్లో డీఆర్ఓకు తాను ఫిర్యాదు చేయగా ఇప్పటివరకు ఏ చర్య తీసుకోలేదన్నారు. ఇప్పటికై నా తనకు లొంగితే నీకు, నీ తమ్ముడికి ఉద్యోగాలు ఇస్తానని చెప్పి ఒత్తిడి చేస్తున్నాడన్నారు. దీనిపై కలెక్టర్, ఎస్పీలకు విన్నవించేందుకు వచ్చానని ఆమె తెలిపారు. -
విద్యుత్ షాక్‌తో తండ్రీకూతుళ్ల మృతి
నవమాసాలు కడుపులో మోసి ప్రపంచంలోకి తీసుకువచ్చేది తల్లి అయితే..ఈ ప్రపంచాన్ని పరిచయం చేసేది తండ్రి. గురువు, దైవం, మార్గదర్శకుడై, పిల్లల చేయిపట్టి నడిపిస్తూ..భవిష్యత్తు కోసం నిత్యం తపించే తండ్రికి పిల్లలంటే ఎనలేని ప్రేమ. పిల్లల కాలిలో ముల్లు గుచ్చుకుంటే తన గుండెల్లో గునపం దిగినంత బాధ ననుభవించే తండ్రి..విద్యుత్ షాక్ తగిలి కుప్పకూలిపోయిన కూతురి వెంటే తాను కూడా అనంత లోకాలకు పయనమయ్యాడు. డెంకాడ మండలంలోని డి.తాళ్లవలస గ్రామంలో జరిగిన ఈ విషాద సంఘటన వివరాలిలా ఉన్నాయి.డి.తాళ్లవలస గ్రామానికి చెందిన కట్టా సూర్యారావు(45)కు భార్య శకుంతలతో పాటు కుమార్తె సంధ్యారాణి, కుమారుడు మనోజ్ ఉన్నారు. సూర్యారావు వ్యాపారం చేసి ఆర్థికంగా స్థిరపడ్డాడు. కుమార్తె సాఫ్ట్వేర్ ఇంజినీర్. వర్క్ ఫ్రం హోమ్‌లో భాగంగా ఇంటి నుంచే విధులు నిర్వహిస్తోంది. ఇంటి మేడపై ఆరవేసిన చీరను తీసేందుకు శుక్రవారం రాత్రి కుమార్తె సంధ్యారాణి(22) మేడపైకి వెళ్లింది. ఇంటి ముందుభాగంలో ఉన్న విద్యుత్వైరుపై చీర పడింది. చినుకులు పడుతుండడం వల్ల చీర తడిసిపోవడంతో చీర తీస్తున్న సంధ్య విద్యుత్ షాక్‌కు గురై పడిపోయింది. ఆ సమయంలో బిగ్గరగా అరవడంతో తండ్రి కట్టా సూర్యారావు(45) మేడపైకి వెళ్లి కింద పడి ఉన్న కుమార్తెను లేపేందుకు ప్రయత్నిస్తుండగా ఆయన కూడా విద్యుత్ షాక్‌కు గురయ్యాడు. దీంతో తండ్రీకూతుళ్లు ఏకకాలంలో మరణించారు. మేడమీదకు వెళ్లిన తండ్రి, సోదరి కిందికి రాకపోవడంతో కుమారుడు మనోజ్ వెళ్లి చూసి వారిద్దరూ విద్యుత్ షాక్‌కు గురయ్యారని గమనించి కాపాడే ప్రయత్నంలో వెంటనే విద్యుత్ సరఫరా నిలిపివేశాడు. అనంతరం ఇద్దరినీ గ్రామస్తుల సహాయంతో విజయనగరంలోని ఆస్పత్రికి తరలించగా, అప్పటికే మృతి చెందినట్లు డాక్టర్లు నిర్ధారించారు. ఈ ఘటనపై ఎలాంటి ఫిర్యాదు అందలేదని ఎస్సై కృష్ణమూర్తి చెప్పారు. -
కత్తెరతో భార్యను హతమార్చిన భర్త
నిడదవోలు రూరల్: అనుమానం పెనుభూతం అయ్యింది.. చివరికి కట్టుకున్న భార్యనే హతమార్చేలా ఉసుగొల్పింది.. ఓ భర్త తన భార్యను కత్తెరతో పొడిచి చంపిన సంఘటన నిడదవోలు మండలం శెట్టిపేటలో ఆదివారం కలకలం రేపింది. పోలీసుల కథనం ప్రకారం.. పెరవలి మండలం అన్నవరప్పాడుకు చెందిన నవ్య (31)కు తాపీమేస్త్రిగా పనిచేస్తున్న చిరంజీవి కుమార్‌కు పదకొండేళ్ల కిందట వివాహమైంది. శెట్టిపేటలో వీరు నివాసం ఉంటున్నారు. వీరికి ముగ్గురు కుమార్తెలు. నవ్య తరచూ ఫోన్లో ఎవరితోనే మాట్లాడుతుందనే అనుమానంతో భార్యాభర్తల మధ్య తరచూ గొడవలు జరిగేవి. పెద్దల సమక్షంలో పలుమార్లు వీరికి నచ్చజెప్పి కాపురానికి పంపించేవారు. అదే గ్రామంలో కొద్దిరోజులుగా వేర్వేరుగా నివాసం ఉంటున్నారు. ఆదివారం తెల్లవారుజామున భార్యాభర్తలు మళ్లీ గొడవపడ్డారు. ఆ సమయంలో ఇంట్లో ఉన్న కత్తెరతో ఆమెను బలంగా పొడవడంతో అక్కడికక్కడే మృతి చెందింది. మృతురాలి తండ్రి శ్రీను ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు. ఘటనా స్థలాన్ని నిడదవోలు సీఐ జానకీరామయ్య పరిశీలించి హత్యకు సంబంధించిన వివరాలు నమోదు చేసుకున్నారు. నిందితుడు చిరంజీవి కుమార్ పోలీసుల అదుపులో ఉన్నాడు. అమ్మ చనిపోవడంతో ముగ్గురు కుమార్తులు గుండెలవిసేలా రోదించడం పలువురిని కంటతడి పెట్టించింది. -
ప్రైవేటు బస్సు బోల్తా.. ఇద్దరు మృతి
మార్కాపురం: రహదారిపై గేదెలు అడ్డురావడంతో ఓ ప్రైవేటు ట్రావెల్స్ బస్సు బోల్తాపడి ఇద్దరు ప్రయాణికులు మృతిచెందారు. మరో ఎనిమిది మంది గాయపడ్డారు. ఈ ప్రమాదం ప్రకాశం జిల్లా మార్కాపురం మండలం చింతగుంట్ల, తిప్పాయపాలెం గ్రామాల మధ్య అమరావతి–అనంతపురం హైవేపై శనివారం అర్ధరాత్రి రెండు గంటల సమయంలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... విజయవాడ నుంచి అనంతపురం వెళ్తున్న ప్రైవేటు ట్రావెల్స్ బస్సులో 30మంది ప్రయాణికులు ఉన్నారు. బస్సు చింతగుంట్ల–తిప్పాయపాలెం గ్రామాల మధ్యకు రాగానే ఆకస్మికంగా గేదెలు అడ్డువచ్చాయి. వాటిని తప్పించేందుకు డ్రైవర్ ప్రయత్నించే క్రమంలో బస్సు బోల్తా పడింది. దీంతో బస్సులో ప్రయాణిస్తున్న అనంతపురం జిల్లా ధర్మవరానికి చెందిన గజ్జల శివయ్య(45)కు తీవ్ర గాయాలుకావడంతో ఘటనాస్థలంలోనే మృతిచెందారు. విజయవాడ నుంచి అనంతపురం వెళుతున్న పెద్దారవీడు మండలం కలనూతల గ్రామానికి చెందిన కె.విజయలక్ష్మీబాయి(40)కి తీవ్రగాయాలయ్యాయి. ఆమెకు మార్కాపురం జీజీహెచ్‌లో ప్రథమ చికిత్స అందించిన అనంతరం మెరుగైన వైద్యం కోసం గుంటూరుకు తరలిస్తుండగా, మార్గమధ్యంలో నరసరావుపేట వద్ద మృతిచెందారు. అదేవిధంగా ఈ ప్రమాదంలో హరినాథ్, రాజీబీ, నాగమయ్య నాయక్, ఢమరుకానందరెడ్డి, మునీందర్‌రెడ్డి, అప్సన్, మోహిత్, దస్తగిరి అనే ప్రయాణికులకు గాయాలయ్యాయి. వీరికి మార్కాపురం జీజీహెచ్‌లో చికిత్స అందించారు. గజ్జల శివయ్యకు భార్య సువర్ణ, ఒక కుమారుడు, కుమార్తె, విజయలక్ష్మీబాయికి భర్త కాశీనాయక్, కుమారుడు, కుమార్తె ఉన్నారు. -
పెళ్లి పేరుతో ఘరానా మోసం
గాందీనగర్(విజయవాడ సెంట్రల్): పెళ్లి పేరుతో ఒంటరి, విడాకులు తీసుకున్న మహిళలను మోసం చేస్తున్న కేటుగాడిని విజయవాడ గవర్నర్‌పేట పోలీసులు అరెస్ట్ చేశారు. ఓ మహిళ ఇచ్చిన ఫిర్యాదుతో నిందితుడి మోసాలు వెలుగులోకి వచ్చాయి. పోలీసుల కథనం ప్రకారం.. తెలంగాణలోని రంగారెడ్డి జిల్లాకు చెందిన తుమ్మా మోహన్‌రెడ్డి వ్యసనాలకు బానిసై భార్య, పిల్లలను వదిలేశాడు. ఉన్న డబ్బులన్నీ షేర్ మార్కెట్లో పోగొట్టుకున్నాడు. అనంతరం సులభంగా డబ్బులు సంపాదించేందుకు ‘పెళ్లి కొడుకు’ అవతారం ఎత్తాడు. తెలుగు మ్యాట్రిమోని, షాదీ డాట్ కామ్ తదితర వెబ్సైట్లలో రకర కాల పేర్లతో రిజిస్టర్ చేసుకున్నాడు. ఒంటరి మహిళలను పరిచయం చేసుకునేవాడు. మాయమాటలతో నమ్మించి.. డబ్బు, బంగారం తీసుకొని పారిపోయేవాడు. ఈ క్రమంలో తెలుగు మ్యాట్రిమోని ద్వారా విజయవాడకు చెందిన ఓ మహిళను పరిచయం చేసుకున్నాడు. తన పేరు ‘కార్తీక్‌రెడ్డి.. సాఫ్ట్వేర్ ఉద్యోగిని.. విల్లాలు ఉన్నాయి’ అంటూ మాయమాటలు చెప్పాడు. పెళ్లి చేసుకుందామని ఒప్పించాడు. ఫొటోషూట్ కోసం నగలతో రావాలని సూచించాడు. ఆ ఫొటోలను తన తల్లిదండ్రులకు చూపించి పెళ్లికి ఒప్పిస్తానని ఆమెను నమ్మించాడు. దీంతో ఆమె ఈ ఏడాది ఏప్రిల్ 14న విజయవాడలోని ఓ హోటల్‌కు వెళ్లింది. ఫొటోషూట్ కోసం సిద్ధమై రావాలని ఆమెను వాష్‌రూమ్‌కు పంపించాడు. ఆమె తెచ్చిన 16 తులాల బంగారం, సెల్‌ఫోన్‌తో హోటల్ నుంచి ఉడాయించాడు. దీనిపై బాధితురాలు గవర్నర్‌పేట పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు నిందితుడిని అరెస్టు చేసి విచారించగా.. అతని మోసాలన్నీ బయటపడ్డాయి. మోహన్‌రెడ్డి మోసాలివే.. » 2021 సెపె్టంబర్లో తెలంగాణలోని రాచకొండ కమిషనరేట్ పరిధిలో ఓ మహిళ కారును తీసుకెళ్లిపోయి అమ్మేశాడు. » 2023 నవంబర్‌లో గుంటూరుకు చెందిన మహిళను పెళ్లి చేసుకుంటానని నమ్మించి.. రూ.7 లక్షలు తీసుకుని పారిపోయాడు. » 2023 నవంబర్‌లో తెలంగాణలో ఓ మహిళను పెళ్లి చేసుకుంటానని నమ్మించి 25 తులాల బంగారం అపహరించాడు. » 2023 జనవరిలో తెలంగాణలోని మియాపూర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో భర్తతో విడిపోయి ఒంటరిగా ఉన్న డాక్టర్‌ను పరిచయం చేసుకుని.. ఆమె క్రెడిట్ కార్డు ద్వారా రూ.లక్షలు వాడుకుని పారిపోయాడు. -
చంద్రగిరిలో రెచ్చిపోయిన పచ్చమూక.. వైఎస్సార్సీపీ కార్యకర్తపై దాడి
సాక్షి, తిరుపతి: ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత వైఎస్సార్సీపీ నేతలు, కార్యకర్తలపై పచ్చ మూకల దాడులు పెరిగాయి. వైఎస్సార్సీపీ కార్యకర్తలను టార్గెట్ చేస్తూ టీడీపీ నేతలు దాడులకు తెగబడుతున్నారు. తాజాగా చంద్రగిరి నియోజకవర్గంలో వైఎస్సార్సీపీ నాయకుడు కపిలేశ్వర్ రెడ్డిపై టీడీపీ నేతలు దాడి చేశారు. ఈ క్రమంలో తీవ్ర గాయాలు కావడంతో రుయా ఆసుపత్రికి తరలించారు.కాగా, చంద్రిగిరి నియోజకవర్గంలో వైఎస్సార్సీపీ నాయకులపై టీడీపీ దాడులు కొనసాగుతున్నాయి. తాజాగా పాకాల టౌన్ యూత్ ప్రెసిడెంట్ కపిలేశ్వర్ రెడ్డిపై టీడీపీ నేతలు దాడి చేశారు. ఓట్లవారిపల్లి గ్రామానికి చెందిన జగదీశ్వర్ చౌదరి, మరో 20 మంది టీడీపీ కార్యకర్తలు కపిలేశ్వర్ రెడ్డిపై దాడికి తెగబడ్డారు. ఈ క్రమంలో కపిలేశ్వర్ రెడ్డి తలకు, చేతికి తీవ్ర గాయాలయ్యాయి. దీంతో, వెంటనే ఆయనను తిరుపతిలోని రూయా ఆసుపత్రికి తరలించారు. ఇక, ఘటనా స్థలానికి పోలీసులు చేరుకుని దర్యాప్తు చేస్తున్నట్టు తెలిపారు. -
దళితుడి లాకప్‌డెత్?
సాక్షి, నంద్యాల : రాష్ట్రవ్యాప్తంగా సంచలనం రేపిన ముచ్చుమర్రి మైనర్ బాలిక హత్యాచారం కేసు విచారణలో కీలక పరిణామం చోటుచేసుకుంది. పోలీసుల అదుపులో ఉన్న అనుమానితుల్లో ఒక దళిత వ్యక్తి శనివారం లాకప్‌డెత్‌కు గురైనట్లు తెలుస్తోంది. విచక్షణారహితంగా కొట్టడంతో పాటు థర్డ్ డిగ్రీ ఉపయోగించడంవల్లే అతని ప్రాణాలు పోయినట్లు బంధువులు ఆరోపిస్తున్నారు. అంతకుముందు.. మైనర్ బాలిక హత్యాచారం ఘటనతో సంబంధం ఉన్న అనుమానంతో పోలీసులు కొందరిని అదుపులోకి తీసుకుని విచారించారు. వారిచ్చిన సమాచారంతో గురువారం సాయంత్రం మరో ఆరుగురిని నందికొట్కూరు, ముచ్చుమర్రి ప్రాంతంలో అదుపులోకి తీసుకున్నారు. వీరిని మొదట జూపాడు బంగ్లా పోలీస్‌స్టేషన్‌కు తరలించి అక్కడ రెండు గంటల పాటు విచారించినట్లు స్థానికులు చెబుతున్నారు. పోలీసుల దెబ్బలు తాళలేక నిందితులు అరిచిన అరుపులు తమకు వినిపించాయని వారంటున్నారు.అయితే, ఈ విచారణలో నలుగురు వ్యక్తులకు ఈ ఘటనతో సంబంధంలేదని తేలడంతో వారిని వదిలేసి అంబటి హుస్సేన్ అలియాస్ యోహాన్ (36), అంబటి ప్రభుదాస్‌ను తమదైన శైలిలో గట్టిగా విచారించారు. వీరిద్దరినీ మిడుతూరు పోలీస్‌స్టేషన్‌కు తీసుకెళ్లి శుక్రవారం అంతా విపరీతంగా కొట్టినట్లు సమాచారం. ఆ తర్వాత నంద్యాల పట్టణంలోని సీసీఎస్ స్టేషన్‌కు తీసుకెళ్లారు. అయితే, హుస్సేన్ మిడుతూరులో మృతిచెందితే నంద్యాల సీసీఎస్‌కు తరలించి ఆ తర్వాత ఆసుపత్రికి తరలించారా? లేక సీసీఎస్ పోలీస్‌స్టేషన్‌లో మృతిచెందిన తర్వాత ఆసుపత్రికి తీసుకెళ్లారా అన్న దానిపై స్పష్టతలేదు.బంధువులతో రాజీ..ఇక హుస్సేన్ చనిపోయాడన్న సమాచారం తెలుసుకున్న బంధువులు శనివారం ఉదయాన్నే ముచ్చుమర్రి, నందికొట్కూరు నుంచి నంద్యాలకు బయల్దేరారు. మార్గమధ్యంలోనే పోలీసులు వీరిని అడ్డుకుని రహస్య ప్రాంతానికి తరలించారు. అక్కడ లాకప్‌డెత్ విషయంలో రాజీకి ప్రయత్నించినట్లు సమాచారం. వీరితో సంతకం చేయించుకున్న తర్వాత మృతదేహాన్ని పోస్టుమార్టానికి తరలించారు. అప్పటివరకు క్యాజువ్యాలిటీలోనే ఉ.6 నుంచి సా.4 వరకు మృతదేహాన్ని ఉంచారు. ఆయాసంతో చనిపోయాడంట..ఇక బాధితులతో రాజీ ప్రయత్నం సఫలం కావడంతో జిల్లా ఎస్పీ కార్యాలయం శనివారం రాత్రి ఒక ప్రకటన విడుదల చేసింది. హుస్సేన్‌ను అదుపులోకి తీసుకుని నందికొట్కూర్ పోలీస్‌స్టేషన్‌కు తీసుకెళ్తుండగా నిందితుడు పోలీస్ వాహనం నుంచి దూకి పారిపోయే ప్రయత్నం చేశాడని తెలిపారు. అప్రమత్తమైన పోలీసులు హుస్సేన్‌ను పట్టుకోవడంతో తనకు ఆయాసంగా ఉందని, గుండెనొప్పిగా ఉన్నట్లు పోలీసులకు తెలిపాడని.. దీంతో పోలీసులు అతన్ని నంద్యాల ప్రభుత్వాస్పత్రికి తీసుకెళ్లారని పేర్కొన్నారు. (నిజానికి.. దగ్గర్లోని నందికొట్కూరు ఆస్పత్రికి తరలించకుండా 60 కి.మీ దూరంలోని నంద్యాలకు తరలించారు.) డాక్టర్లు పరిశీలించి చనిపోయినట్లు నిర్ధారించారని ఆ ప్రకటనలో తెలిపారు. అలాగే, మిడుతూరు పోలీస్‌స్టేషన్‌లో ఈ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్పీ కార్యాలయం ఆ ప్రకటనలో తెలిపింది.నోట్లో గుడ్డలు కుక్కి మరీ..నిజానికి.. హుస్సేన్, ప్రభుదాస్ ఇద్దరూ అన్నదమ్ములు. మైనర్ బాలిక హత్యాచారం కేసులో అభియోగాలు ఎదుర్కొంటున్న నిందితులలో ఒక బాలుడికి వీరు మేనమామ అవుతారని గ్రామస్తులు చెబుతున్నారు. ఘటన జరిగిన తర్వాత నిందితుల్లో ఒకరైన పదో తరగతి బాలుడు ఇచ్చిన సమాచారం మేరకు మృతదేహాన్ని మాయం చేయడంలో హుస్సేన్ ప్రధాన పాత్ర పోషించాడని పోలీసుల విచారణలో తేలినట్లు విశ్వసనీయ సమాచారం.దీంతో మృతదేహం ఎక్కడ వేశారు.. ఆ సమయంలో ఎవరెవరున్నారు అన్న కోణంలో విచారణ సాగింది. ఈ సందర్భంగా మృతుడిని విచక్షణారహితంగా కొట్టినట్లు బంధువులు ఆరోపిస్తున్నారు. హుస్సేన్ రెండు చేతులు, వేళ్లు, కాళ్లు ఉబ్బిపోయి కనిపిస్తున్నాయి. డొక్క, వీపు భాగంలో గట్టిగా కొట్టిన ఆనవాళ్లు స్పష్టంగా కనిపిస్తున్నాయి. కొట్టే సమయంలో బాధితుడు అరవకుండా నోట్లో గుడ్డ పేలికలు పెట్టినట్లు తెలుస్తోంది. చనిపోయిన తర్వాత మృతుడి నోరు తెరుచుకుని ఉండడం ఇందుకు బలాన్ని చేకూరుస్తోంది.రాజీ కుదిర్చిన టీడీపీ నేత?.. గుట్టుగా అంత్యక్రియలుమరోవైపు.. లాకప్‌డెత్ కేసులో నియోజకవర్గానికి చెందిన టీడీపీ ప్రజా ప్రతినిధి తండ్రి రాజీ కుదిర్చినట్లు సమాచారం. చనిపోయిన వ్యక్తి కుటుంబానికి ఆర్థిక సాయం చేయడంతో పాటు కుటుంబంలో ఇద్దరికి ఉద్యోగాలిస్తామని చెప్పి రాజీచేసినట్లు జోరుగా ప్రచారం జరుగుతోంది.ఆ నేత ఇచ్చిన హామీ మేరకు హుస్సేన్ మృతిపై బంధువులు ఎలాంటి ఫిర్యాదు చేయలేదని సమాచారం. ఇదిలా ఉంటే.. హుస్సేన్ మృతదేహాన్ని పోలీస్ ఎస్కార్ట్ సాయంతో అంబులెన్స్ ద్వారా రాత్రి ఎనిమిది గంటల సమయంలో నంద్యాల నుంచి పాత ముచ్చుమర్రికి తరలించి అక్కడి శ్మశాన వాటికలో ఉంచారు. కుటుంబ సభ్యులను మాత్రమే అక్కడికి అనుమతిచ్చి అంత్యక్రియలు గుట్టుగా పూర్తిచేయించారు. మృతుడికి తల్లి, ముగ్గురు సోదరులు, ఇద్దరు అక్కలు ఉన్నారు. తాళం వేసి పోస్టుమార్టం?మరోవైపు.. మధ్యాహ్నం ఒంటి గంట సమయంలో హుస్సేన్ మృతదేహాన్ని పోస్ట్‌మార్టానికి తరలించారు. సాయంత్రం ఐదు గంటల సమయంలో ప్రొ. డాక్టర్ రాజశేఖర్ దీనిని పూర్తిచేశారు. ఈ గదికి లోపల వైపు తాళం వేసి మరీ ఈ ప్రక్రియను చేపట్టారు. ఇతర సిబ్బంది, మీడియా ప్రతినిధులు ఎవరూ అటువైపు వెళ్లకుండా పోలీసులు అడ్డుకున్నారు. పోస్టుమార్టం ప్రక్రియను వీడియో రికార్డ్ చేశారు. లాకప్‌డెత్ కానప్పుడు తాళంవేసి రహస్యంగా పోస్ట్‌మార్టం చేయించాల్సిన అవసరమేంటని బంధువులు ప్రశ్నిస్తున్నారు. అధికారం అండతో కేసును లాకప్‌డెత్ కాకుండా ఆత్మహత్యగా చిత్రీకరించేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి.మిడుతూరు నుంచి నంద్యాల సీసీఎస్‌కు అక్కడి నుంచి ఆస్పత్రికి..ఇక పోలీసులు కొట్టిన దెబ్బలు తట్టుకోలేక శనివారం తెల్లవారుజామున హుస్సేన్ మృతిచెందినట్లు తెలిసింది. కానీ, ప్రభుదాస్ ఎలా ఉన్నాడు? ఎక్కడ ఉన్నాడనే సమాచారం తెలీకపోవడంతో కుటుంబ సభ్యులు తీవ్ర ఆందోళన చెందారు. అంతకుముందు.. హుస్సేన్‌ను హుటాహుటిన నంద్యాల సర్వజన ఆస్పత్రిలోని క్యాజువల్ వార్డుకు తరలించారు. పోలీసులు రోగుల సహాయకులను అక్కడ నుంచి పంపించేసి వార్డులోకి ఎవరూ వెళ్లకుండా కాపలా ఉన్నారు.హుస్సేన్‌ను మిడుతూరు నుంచి నంద్యాల సీసీఎస్ స్టేషన్‌కు అక్కడి నుంచి ప్రభుత్వాస్పత్రికి ఉదయం 5–6 గంటల సమయంలో తీసుకెళ్లినట్లు తెలుస్తోంది. అప్పటి నుంచి నంద్యాల డీఎస్పీ రవీంద్రనాథ్‌రెడ్డితో పాటు ఆరుగురు సీఐలు, నలుగురు ఎస్ఐలు దాదాపు 30 మంది కానిస్టేబుళ్లు ఆస్పత్రిని తమ ఆధీనంలో ఉంచుకున్నారు. మీడియా సిబ్బంది ఎవరూ ఆసుపత్రిలోకి రాకుండా అడ్డుకున్నారు. అయినా, మృతుడి ఫొటోలు మీడియాకు లభ్యం కావడంతో వాటిని పోలీసులే దగ్గరుండి మరీ తొలగించారు.విచారణలో సస్పెండ్ అయిన పోలీసులు?మైనర్ బాలిక హత్యాచారం ఘటనలో విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరించారనే ఆరోపణలు రావడంతో ఒక సర్కిల్ ఇన్స్పెక్టర్, మరో సబ్ ఇన్స్పెక్టర్ను ఉన్నతాధికారులు సస్పెండ్ చేశారు. కేసులో మొదటి నుంచి వీరు ఉండడంతో సస్పెండ్ అయిన తర్వాత కూడా వీరు పోలీసు విచారణలో పాల్గొన్నట్లు అత్యంత శ్వసనీయంగా తెలిసింది. అనుమానితులను అదుపులోకి తీసుకున్న తర్వాత విచారణ చేసే సమయంలో వీరిద్దరూ సంఘటన స్థలంలోనే ఉన్నట్లు సమాచారం. -
రైలు దొంగ.. సినిమాల్లో సీన్లు చూసి..
చీరాల రూరల్/నెల్లూరు (క్రైమ్): విలాసాలు, వ్యసనాలకు బానిసయిన ఓ యువకుడు ఇంటర్నెట్లో సినిమాలు చూసి “రైలు దొంగ’గా అవతారమెత్తి.. కటకటాలపాలయిన ఘటన బాపట్ల జిల్లా చీరాల రైల్వేస్టేషన్లో చోటుచేసుకుంది. శుక్రవారం రైల్వే డీఎస్పీ సి.విజయభాస్కర్‌రావు శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా నెల్లూరులోని తన కార్యాలయంలో వివరాలు వెల్లడించారు.బాపట్ల జిల్లా చీరాల మండలం వాడరేవు గ్రామానికి చెందిన పెదాల వెంకటేశ్వర్లు అలియాస్ వెంకీ అలియాస్ వెంకటేష్ వ్యసనాలకు, విలాసవంతమైన జీవనానికి అలవాటుపడ్డాడు. కూలీ ద్వారా సంపాదించిన మొత్తం తన అవసరాలకు సరిపోకపోవడంతో ఈజీ మార్గంలో మనీ సంపాదించాలని నిర్ణయించుకున్నాడు. దీనికోసం సినిమాల్లో రైళ్లలో దొంగతనాలు చేసే సీన్లు చూసి ప్రేరణ పొంది దొంగగా అవతారమెత్తాడు.రైళ్లల్లో తిరుగుతూ ప్రయాణికులు ఆదమరిచి నిద్రిస్తున్న సమయంలో వారి బ్యాగ్‌లు, బంగారు ఆభరణాలు, ల్యాప్‌టాప్, సెల్ఫోన్లను అపహరించేవాడు. ఇటీవల చీరాలలో రైలు దొంగతనాలు అధికం కావడంతో గుంతకల్లు రైల్వే జిల్లా పోలీసు సూపరింటెండెంట్ కె.చౌడేశ్వరి ఆదేశాల మేరకు.. ఒంగోలు జీఆర్పీ సీఐ కె.భుజంగరావు ఆధ్వర్యంలో చీరాల జీఆర్పీ ఎస్ఐ సీహెచ్.కొండయ్య తన సిబ్బందితో కలిసి దర్యాప్తు ప్రారంభించారు.సాంకేతికత ఆధారంగా నిందితుడు వెంకటేశ్వర్లును గుర్తించారు. గురువారం రాత్రి చీరాల రైల్వేస్టేషన్లో నాలుగో నంబర్ ప్లాట్‌ఫారంపై నిందితుడిని రైల్వే పోలీసులు అదుపులోకి తీసుకుని అతడి వద్ద నుంచి రూ.3.81 లక్షల విలువచేసే 62 గ్రాముల బంగారు ఆభరణాలు, ఐదు సెల్ఫోన్లు, నాలుగు ల్యాప్‌టాప్‌లు, ఐప్యాడ్, మూడు వాచ్‌లను స్వాధీనం చేసుకున్నారు. -
15 మంది గంజాయి స్మగ్లర్ల అరెస్ట్
విజయవాడస్పోర్ట్స్: ఆంధ్రా–ఒడిశా సరిహద్దు ప్రాంతంలోని ఏజెన్సీల నుంచి సేకరించిన గంజాయిని విజయవాడ, పరిసర ప్రాంతాల్లో విక్రయిస్తున్న ముఠాలోని ప్రధాన నిందితుడితో పాటు మరో14 మందిని ఎన్టీఆర్ జిల్లా పోలీస్ యంత్రాంగం అరెస్ట్ చేసింది. డీజీపీ ద్వారకా తిరుమలరావు, జిల్లా పోలీస్ కమిషనర్ ఎన్.వి.రాజశేఖరబాబు ఆదేశాలతో ఈ ముఠా కదలికలపై ప్రత్యేక దృష్టి సారించింది. యాంటి నార్కోటిక్ సెల్, టాస్క్‌ఫోర్స్, లా అండ్ ఆర్డర్ బృందాలు సంయుక్తంగా నిర్వహించిన ఈ ఆపరేషన్ వివరాలను విజయవాడ కమాండ్కంట్రోల్ రూంలో విజయవాడ డిప్యూటీ పోలీస్ కమిషనర్ (డీసీపీ) హరికృష్ణ శుక్రవారం వెల్లడించారు.ప్రధాన నిందితుడు పింక్రౌత్..పోలీసుల అదుపులో నున్న 14మంది గంజాయి స్మగ్లర్లు ఇచ్చిన సమాచారంతో గత కొన్నేళ్లుగా గుట్టుచప్పుడు కాకుండా గంజాయి స్మగ్లింగ్ చేస్తున్న ప్రధాన నిందితుడు ఒడిశాకు చెందిన పింకి రౌత్‌ను అరెస్ట్ చేశారు. ఆంధ్రా–ఒడిశా సరిహద్దు ప్రాంతా లైన బరంపురం, పీలేరు ఏజెన్సీ ప్రాంతాల్లోని వ్య క్తుల నుంచి గంజాయిని సేకరించి విజయవాడకు సరఫరా చేయడంలో పింక్రౌత్ ప్రధాన పాత్ర పోషిస్తున్నాడని డీసీపీ హరికృష్ణ తెలిపారు.ఇతనిపై గతంలో మాచవరం పోలీస్‌స్టేషన్‌లో అనేక కేసులు నమోదయ్యాయన్నారు. విజయవాడ సిటీ, చుట్టుపక్కలనున్న పలు ప్రాంతాల్లో గంజాయిని విక్రయిస్తున్న గుంటూరు జిల్లా తాడేపల్లికి చెందిన గోగినేని మాధవరావు, తెలంగాణా, మేడ్చల్, పోతయిపల్లికి చెందిన మురుగన్ మణికంఠ, సంకేలి గణేష్, కృష్ణా జిల్లా, పెనమలూరుకు చెందిన షేక్ మొహమ్మద్ గౌస్ అబ్దుల్ హబీబ్, విజయవాడ అజిత్ సింగ్‌నగర్‌కు చెందిన మర్రి రఘురాం, విజయవాడ మాచవరం డౌన్‌కు చెందిన కొమ్ము రాకేశ్, విజయవాడ భవానీపురానికి చెందిన పాలెటి మమతరాజు, మహమ్మద్ ముజ్జమిల్ సుల్తాన్, షేక్ నజీర్, మత్తే నాని, ఇల్లురి మధుసూదన్‌రెడ్డి, కృష్ణలంకకు చెందిన అడపాల వంశీ, అమన్‌సింగ్‌ను అరెస్ట్ చేసినట్లు చెప్పారు. వీరిందరిపై గతంలో అనేక కేసులు నమోదయినట్లు చెప్పారు. నిందితుల నుంచి 90.5 కేజీల గంజాయితో పాటు ఒక స్కూటీని స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు. కాగా, ప్రజలు 91211 62475కు గంజాయి సమాచారం ఇవ్వాలని ప్రజ లను కోరారు. సమాచారం ఇచ్చిన వ్యక్తుల వివరాలను అత్యంత గోప్యంగా ఉంచుతామని హామీ ఇచ్చారు. టాస్క్‌ఫోర్స్ ఏడీసీపీ శ్రీహరి, సీఐలు నాగేంద్రకుమార్, శ్రీధర్, రమేష్ పాల్గొన్నారు. -
గంజాయి మత్తులో బాలికలపై అఘాయిత్యాలు
తిరుపతి(అలిపిరి)/తిరుమల: రాష్ట్రంలో గంజాయి మత్తులో బాలికలపై అఘాయిత్యాలకు పాల్పడుతున్నారని.. ఈ పరిణామాలు చూసి ప్రజలు భయాందోళనకు గురికావొద్దని రాష్ట్ర హోం మంత్రి వంగలపూడి అనిత చెప్పారు. తిరుపతిలోని శ్రీపద్మావతి అతిథి గృహంలో శుక్రవారం ఆమె మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో శాంతిభద్రతలు అదుపులో ఉన్నాయని, బాలికలపై దాడులు చేస్తున్న వారిని వెంటనే పట్టుకుంటున్నట్టు తెలిపారు. తప్పుచేసిన వారిని కఠినంగా శిక్షిస్తున్నామన్నారు. రాష్ట్రంలో జరుగుతున్న ఘటనలపై పూర్తిస్థాయి విచారణ జరుగుతోందని చెప్పారు. స్వార్థ రాజకీయ ప్రయోజనాల కోసం వైఎస్సార్సీపీ నేతలు పాకులాడుతున్నారని, గత ప్రభుత్వం కారణంగానే చిన్నపిల్లల సంచుల్లోకి గంజాయి చేరుతోందని ఆరోపించారు. గంజాయిని రాష్ట్ర పంటగా పండించింది వైఎస్సార్సీపీ నేతలేనని.. లిక్కర్‌పైన పెట్టిన దృష్టి గంజాయిపై ఎందుకు పెట్టలేదన్నారు. పోలీసుల్ని కాపలాకు ఉపయోగించుకున్న గత ప్రభుత్వంలోనే వందలాది మంది బాలికలు కనిపించకుండా పోయారని ఆరోపణలు చేశారు. ఇదిలా ఉండగా, కాలినడక మార్గంలోనే శ్రీవారి దర్శనం టికెట్లు జారీచేయాలని హోం మంత్రి అనిత కోరారు. అలిపిరి కాలినడక మార్గాన నడుచుకుంటూ ఆమె తిరుమల చేరుకున్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ నడక మార్గంలో ఫెన్సింగ్ ఏర్పాటు చేస్తే బాగుంటుందన్నారు. అదృశ్యమైన ఎంపీడీవో వెంకటరమణ ఆచూకీ కోసం ఎన్డీఆర్ఎఫ్ బృందాలతో గాలింపు చర్యలు చేపడుతున్నామని అనిత చెప్పారు. -
వినుకొండలో ఉద్రిక్తత
సాక్షి ప్రతినిధి, గుంటూరు : వైఎస్సార్సీపీ కార్యకర్త రషీద్ దారుణ హత్యతో పల్నాడు జిల్లా వినుకొండలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. హత్య గురించి తెలియగానే వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు వైఎస్సార్సీపీ బృందం వినుకొండ చేరుకుని రషీద్ కుటుంబ సభ్యులను ఓదార్చింది. వైఎస్ జగన్ గురువారం ఉదయం వినుకొండ రానున్నారు. రోడ్డు మార్గంలోంచి వినుకొండ చేరుకుని రషీద్ కుటుంబ సభ్యులను ఓదారుస్తారు. రషీద్ హత్య ఒక పథకం ప్రకారమే జరిగిందని అతని కుటుంబ సభ్యులు చెబుతున్నారు. సుమారు 15 మంది వరకు రషీద్‌ను చంపడానికి పథకం వేశారు. రషీద్ ఎప్పుడు బయటకు వస్తాడు, ఎటు నుంచి వెళ్తాడన్న విషయాలు తెలుసుకుని ముండ్లమూరు సెంటర్లో నిఘా వేశారు. షాపు నుంచి వచ్చాక జిలానీ దారుణంగా కత్తితో నరికి చంపాడు. ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు, మాజీ ఎమ్మెల్యే మక్కెన మల్లికార్జునరావుతో పాటు ఈ హత్యలో నరసరావుపేటకు చెందిన సిద్ధు, ఇమ్రాన్, జానీ, రఫీ, షఫీ, సాయిబాబాతో పాటు మరికొందరికి సంబంధం ఉందని రషీద్ బంధువులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. రషీద్ కుటుంబ సభ్యులను వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీలు మర్రి రాజశేఖర్, లేళ్ల అప్పిరెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు బొల్లా బ్రహ్మనాయుడు, కాసు మహే‹Ùరెడ్డి, గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి, గుంటూరు మేయర్ కావటి మనోహర్‌నాయుడు తదితరులు పరామర్శించారు. ఈ సందర్భంగా రషీద్ తల్లిదండ్రులు పడేషా, బడీబీలు తమ కుమారుడిని టీడీపీ నాయకులే పొట్టన పెట్టుకున్నారని, చంపొద్దని వేడుకున్నా.. దారుణంగా చంపేశారని నాయకుల వద్ద బోరున విలపించారు. రషీద్ మృతదేహాన్ని చూసేందుకు పెద్ద ఎత్తున తరలివచ్చిన ప్రజలు హత్యకు గురైన రషీద్ మృతదేహాన్ని సందర్శించేందుకు వైఎస్సార్సీపీ నాయకులు ప్రభుత్వ వైద్యశాలకు చేరుకోగానే భారీ సంఖ్యలో ఆస్పత్రి వద్ద పోలీసులు మోహరించారు. సుమారు 200 మందికి పైగా పోలీసులు ఆస్పత్రి చుట్టు పక్కల మోహరించారు. మృతదేహాన్ని చూసేందుకు పెద్ద సంఖ్యలో ప్రజలు తరలిరావడంతో వారిని చెదరగొట్టేందుకు వాటర్ క్యానన్లు ప్రయోగించేందుకు సిద్ధమయ్యారు. రషీద్ బంధువులు వంద మందికి పైగా మహిళలు రోడ్డుపై ఆందోళన చేసేందుకు వస్తుండగా.. పోలీసులు వారిని అడ్డుకున్నారు. ఈ సందర్భంగా పోలీసులు తమను లాఠీలతో కొట్టారంటూ ముస్లిం మహిళలు ఆందోళన చేపట్టారు. పట్టణంలో 144 సెక్షన్ ఉందని, ఎలాంటి బంద్‌లు, నిరసనలకు అనుమతి లేదనే పోలీసుల సూచనల మేరకు వారు ఆందోళన విరమించారు. మరోవైపు టీడీపీ నాయకులు ఈ హత్యను ఖండించకుండా జిలానీ కూడా వైఎస్సార్సీపీ వాడేనంటూ ప్రచారం మొదలెట్టారు. వాస్తవానికి జిలానీ ఏడాది క్రితమే తెలుగుదేశంలో చేరాడు. అతని సోదరుడు వినుకొండ పట్టణ మైనారిటీ విభాగం అధ్యక్షుడిగా పనిచేస్తున్నారు. గతంలో ఎప్పుడో జరిగిన వివాదాన్ని ఇప్పుడు హత్యకు సాకుగా తెలుగుదేశం నాయకులు, పోలీసులు చూపిస్తున్నారు. కాగా, రషీద్ మృతదేహానికి పోస్టుమార్టం అనంతరం పోలీసుల బందోబస్తు నడుమ అంత్యక్రియలు నిర్వహించారు. -
రాష్ట్రంలో అరాచక పాలన
వినుకొండ(నూజెండ్ల): రాష్ట్రంలో అరాచకం రాజ్యమేలుతోందని వైఎస్సార్సీపీ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు ప్రోత్సాహం వల్లే టీడీపీ గూండాలు చెలరేగిపోయి..రాష్ట్రమంతటా రక్తపాతం సృష్టిస్తున్నారని మండిపడ్డారు. శాంతిభద్రతలు క్షీణించి.. ప్రజలకు రక్షణ కరువైందన్నారు. అధికారం శాశ్వతం కాదనే విషయాన్ని గుర్తు పెట్టుకోవాలని హెచ్చరించారు. పల్నాడు జిల్లా వినుకొండలో టీడీపీ గూండా చేతిలో ప్రాణాలు కోల్పోయిన వైఎస్సార్సీపీ కార్యకర్త రషీద్‌కు వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీలు మర్రి రాజశేఖర్, లేళ్ల అప్పిరెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు బొల్లా బ్రహ్మనాయుడు, గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి, కాసు మహేష్‌రెడ్డి, గుంటూరు మేయర్ కావటి మనోహర్‌నాయుడు గురువారం నివాళులర్పించారు. రషీద్ కుటుంబసభ్యులను పరామర్శించి ధైర్యం చెప్పారు. నిందితుడు టీడీపీకి చెందిన వాడైనప్పటికీ సోషల్ మీడియాలో తమ పార్టీవాడు కాదంటూ టీడీపీ చేస్తోన్న అసత్య ప్రచారాన్ని వారు ఖండించారు. ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు, ఇతర టీడీపీ నాయకులతో నిందితుడు సన్నిహితంగా దిగిన ఫొటోలను మీడియాకు చూపించారు. అనంతరం స్థానిక వైఎస్సార్సీపీ కార్యాలయంలో వారు మీడియాతో మాట్లాడారు. టీడీపీ నేతల అండతోనే రషీద్ హత్య: మర్రి రాజశేఖర్వినుకొండ నడిబొడ్డున వందలాదిమంది చూస్తూండగా వైఎస్సార్సీపీ కార్యకర్త రషీద్‌ను టీడీపీ గూండా జిలానీ అత్యంత కిరాతకంగా కత్తితో నరికాడంటే రాష్ట్రంలోని పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. ఈ నేరాలన్నింటికీ చంద్రబాబే బాధ్యత వహించాలి. టీడీపీ ఎమ్మెల్యేల చెప్పినట్లుగా జిల్లా ఎస్పీని మార్చిన వెంటనే పల్నాడులో హత్యలు మొదలయ్యాయి. టీడీపీ నాయకుల అండదండలతోనే ఈ హత్య జరిగింది. పోలీసులు పక్షపాతం లేకుండా వ్యవహరించి బాధ్యులందరినీ అరెస్టు చేసి కఠినంగా శిక్షించాలి. హత్యా రాజకీయాలు మానుకోవాలి: గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డికూటమి పార్టీలు గెలిచినప్పటి నుంచి కేవలం నెల రోజుల్లోనే 31 హత్యలు జరిగాయి. పల్నాడు ప్రాంతంలో 1,500కు పైగా కుటుంబాలు గ్రామాలు విడిచి పెట్టి ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని వలస వెళ్లారు. అధికారం శాశ్వతం కాదనే విషయాన్ని టీడీపీ నాయకులు గుర్తుపెట్టుకోవాలి. హత్యారాజకీయాలను వెంటనే మానుకోవాలి. ఇప్పటికైనా హామీల అమలు మొదలుపెట్టి..ఓట్లు వేసి గెలిపించిన ప్రజలకు న్యాయం చేయాలి.3 రేప్‌లు, 30 హత్యలుగా పాలన: కాసు మహేశ్రెడ్డిఏపీలో టీడీపీ ప్రభుత్వ పాలన 3 రేప్‌లు, 30 హత్యలుగా కొనసాగుతోంది. ప్రశాంతంగా ఉన్న వినుకొండలో మొహర్రం రోజున రషీద్ అనే యువకుడిని టీడీపీ గూండా హత్య చేశాడంటే..టీడీపీ పాలన ఎలా ఉందో ప్రజలకూ అర్థమవుతోంది. పట్టణంలో నడిరోడ్డు మీద అందరూ చూస్తుండగా రషీద్‌ను అత్యంత పాశవికంగా నరికి చంపడం దారుణం. కూటమి ప్రభుత్వం తమ మేనిఫెస్టోను చెత్తబుట్టలో పడవేసి..రెడ్‌బుక్ పాలన కొనసాగిస్తోంది. మా పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ ఆదేశాల మేరకు రషీద్ కుటుంబసభ్యులను పరామర్శించి ధైర్యం చెప్పాం. హత్యకు ప్రభుత్వమే బాధ్యత వహించాలి: బొల్లా బ్రహ్మనాయుడు ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు ప్రోద్భలంతోనే జిలానీ అనే టీడీపీ గూండా నడిరోడ్డుపై వినుకొండలో అత్యంత దారుణంగా రషీద్‌ను హత్య చేశాడు. మృతుని కుటుంబానికి అండగా ఉంటాం.15 నుంచి 20 మంది యువకులు ముందుగానే రషీద్‌ను హత్య చేసేందుకు పథకం వేశారు. కేవలం ఒక యువకుడే వెంబడించి రషీద్‌ను రాక్షసత్వంగా చంపేశాడు. పోలీస్ శాఖ ఈ హత్యకు బాధ్యత వహించాలి. మృతుని కుటుంబానికి పార్టీ పరంగా ఆర్థికంగా భరోసా అందిస్తాం. -
అడ్డూ అదుపు లేకుండా దాడులు
టీడీపీ అధికారంలోకి వచ్చాక రాష్ట్రంలో అడ్డూ అదుపు లేకుండా దాడులు కొనసాగుతున్నాయి. టీడీపీ అరాచకాలకు మంత్రి లోకేశ్ నియోజకవర్గం మంగళగిరి కేంద్ర బిందువుగా మారింది.పెదవడ్లపూడికి చెందిన పాలేటి రాజ్‌కుమార్‌ను లోకేశ్ అనుచరులు కిడ్నాప్ చేసి చిత్రహింసలకు గురిచేశారు. మోకాళ్లపై కూర్చుని లోకేశ్ చిత్రపటానికి దండం పెడుతూ క్షమాపణలు చెప్పకపోతేహతమారుస్తామని హెచ్చరించారు.ప్రాణభయంతో రాజ్‌కుమార్ వారు చెప్పినట్టు చేశారు. దీన్ని టీడీపీ నేతలు వీడియో తీసి సోషల్ మీడియాలో వైరల్ చేశారు. లోకేశ్ నియోజకవర్గాన్ని ఆయన సొంత జిల్లా చిత్తూరు టీడీపీ నేతలు ఆదర్శంగా తీసుకున్నారు. చిత్తూరులో రాజు అనే యువకుడిని కిడ్నాప్ చేసి గుర్తుతెలియని ప్రాంతానికితీసుకువెళ్లి కర్రలు, రాడ్లతో తీవ్రంగా దాడి చేశారు. ఆ దాడిని వీడియో తీసి సోషల్ మీడియాలో వైరల్ చేశారు. వారికి తామేమీ తక్కువ కాదన్నట్లు ఆళ్లగడ్డ ఎమ్మెల్యే అఖిలప్రియ అనుచరులు సైతం ఇటీవల ఓ వ్యక్తిని కిడ్నాప్ చేసి దారుణంగా కొట్టారు. విజయవాడలో టీడీపీ గూండాలు ఏకంగా కోర్టు ప్రాంగణంలోకి ప్రవేశించి మరీ మద్దెల పవన్ అనే వ్యక్తిపై బీరు సీసాలతో దాడి చేశారు. పల్నాడు జిల్లా శావల్యాపురం మండలం వేల్చూరులోని ఎస్సీ కాలనీపై 50మందికి పైగా టీడీపీ గుండాలు దాడి చేశారు. ఇలా 40 రోజుల్లో 1,050 వరకు దాడులు, దౌర్జన్యాలు జరిగాయి. ఇళ్లు నేలమట్టం.. కార్యాలయాలు ధ్వంసం 560 ప్రైవేట్ ఆస్తుల ధ్వంసం వైఎస్సార్సీపీకి ఓట్లు వేశారనే అక్కసుతో పేదల ఇళ్లను నేలమట్టం చేస్తున్నారు. తిరుపతి జిల్లా రేణిగుంటలో 40మంది పేదల ఇళ్లను కూల్చివేశారు. రాష్ట్రంలో ఇప్పటివరకు 16 జిల్లాల్లోని వైఎస్సార్సీపీ కార్యాలయాలపై దాడులకు తెగబడ్డారు. అనంతపురం జిల్లాలో చీనీ తోటలను నరికేస్తున్నారు. వైఎస్సార్, చిత్తూరు, తిరుపతి, అనంతరపురం, కర్నూలు, పల్నాడు జిల్లాల్లో టీడీపీ గుండాల దాడులతో స్వైర విహారం చేస్తున్నారు. ప్రధానంగా సర్పంచిలు, స్థానిక సంస్థల ప్రతినిధులను, వారి ఆస్తులను లక్ష్యంగా చేసుకుని దాడులకు తెగబడుతున్నారు. వాహనాలను దహనం చేస్తున్నారు. ఇలా 560 వరకు ప్రైవేట్ ఆస్తులను ధ్వంసం చేశారు. వీటిలో ఒక్క చిత్తూరు జిల్లాలో 100 ఘటనలు జరిగాయి.భయంతో బతకలేక.. వలసబాటఊరు వదిలి వెళ్లినకుటుంబాలు 2,700టీడీపీ రౌడీమూకలు దండెత్తుతుండటంతో సామాన్యులు ప్రాణభయంతో కన్నతల్లి వంటి సొంత ఊరును వదిలి వలసవెళ్లిపోతున్నారు. పొరుగు రాష్ట్రంతోపాటు అటవీ ప్రాంతాల్లో బిక్కుబిక్కుమంటూ బతుకుతున్నారు. ఒక్క పల్నాడు జిల్లాలోనే 1,500 కుటుంబాలు తెలంగాణకు వెళ్లి తలదాచుకోవడం పరిస్థితి తీవ్రతకు నిదర్శనం. చిత్తూరు జిల్లాలో దాదాపు 500 కుటుంబాలు, అనంతపురం జిల్లాలో 350 కుటుంబాలు, శ్రీసత్యసాయి జిల్లాల్లో 100, అన్నమయ్య జిల్లాలో 120 కుటుంబాలు, కర్నూలు జిల్లాలో 135 కుటుంబాలు తమ గ్రామాలను వదిలి వలసవెళ్లాయి. వలస వెళ్లిన కుటుంబాల పంటలను, ఆస్తులను సైతం టీడీపీ మూకలు ధ్వంసం చేస్తూ పైశాచికంగా ప్రవర్తిస్తున్నాయి. ఇప్పటి వరకు అందిన సమాచారం మేరకు దాదాపు 2,700 కుటుంబాలు ప్రాణభయంతో వలస వెళ్లాయి. విగ్రహాలపైనా అక్కసు 468 వైఎస్సార్ విగ్రహాలుధ్వంసం దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహాలపైనా టీడీపీ మూకలు తమ అక్కసు వెళ్లగక్కుతున్నాయి. వైఎస్ రాజశేఖరరెడ్డి పాలనలో తమకు జరిగిన మేలును తలచుకుంటూ అన్ని అనుమతులతో ప్రజలు స్వచ్ఛందంగా ఏర్పాటుచేసుకున్న విగ్రహాలను సైతం అడ్డగోలుగా కూల్చివేస్తున్నారు. పెట్రోల్ పోసి నిప్పు పెడుతున్నారు. వైఎస్సార్ విగ్రహాల చేతులు, కాళ్లు, తల, ముక్కు.. ఇలా ఒక్కో భాగాన్ని ముక్కలుముక్కలుగా చేసి తాలిబన్ల తరహాలో పైశాచిక ఆనందం పొందుతున్నారు. ఇప్పటి వరకు అన్ని జిల్లాల్లో కలిపి 468 విగ్రహాల వరకు వైఎస్సార్ విగ్రహాలను ధ్వంసం చేశారు. జగన్ జాడ ఉండకూడదని..2,260 శిలాఫలకాలు ధ్వంసందేశ చరిత్రలో ఎక్కడా లేనివిధంగా 2019లో వైఎస్ జగన్ ముఖ్యమంత్రి అయిన వెంటనే రాష్ట్రంలో 15,004 గ్రామ, వార్డు సచివాలయాలను ఏర్పాటుచేశారు. వాటిలో 1,35,819 మంది ఉద్యోగులను, 2.66లక్షల మంది వలంటీర్లను నియమించారు. అన్ని ప్రభుత్వ సేవలను ప్రజలకు తమ ఇంటి వద్దకే చేర్చారు. ఆర్బీకేల ద్వారా రైతులకు విత్తు నుంచి పంట విక్రయం వరకు అన్ని సేవలను చేరువచేశారు. విలేజ్ హెల్త్ క్లినిక్‌ల ద్వారా గ్రామీణ ప్రజలకు స్పెషాలిటీ వైద్యసేవలను అందుబాటులోకి తెచ్చారు. నాడు–నేడు ద్వారా పాడుబడిన పాఠశాలలను అద్భుతంగా తీర్చిదిద్దారు. ఇలా పాలనలో సమూల మార్పులు తీసుకువచ్చి ప్రజలకు పారదర్శకంగా సేవలు అందించారు. ఈ క్రమంలో వైఎస్ జగన్ పాలన గురుతులను చేరిపివేసేందుకు టీడీపీ నేతలు, కార్యకర్తలు దుర్మార్గంగా వ్యవహరిస్తున్నారు.సచివాలయాలు, ఆర్బీకేలు, విలేజ్ హెల్త్ క్లినిక్‌లు వంటి భవనాల వద్ద ఉన్న శిలాఫలకాలు, నవరత్నాలు బోర్డులను ఘోరంగా ధ్వంసం చేస్తున్నారు. రోడ్ల అభివృద్ధి శిలాఫలకాలను సైతం కూలి్చస్తున్నారు. ఇలా ఇప్పటి వరకు రాష్ట్రవ్యాప్తంగా 2,260 వరకు శిలాఫలకాలను నేలమట్టం చేశారు.ప్రభుత్వ ఆస్తుల విధ్వంసం 490 ప్రభుత్వఆస్తుల ధ్వంసం ఎన్నడూలేని విధంగా రాష్ట్రంలో ప్రభుత్వ ఆస్తుల విధ్వంసం కొనసాగుతోంది. ప్రతి జిల్లాలో జూన్ 4వ తేదీ తర్వాత నిత్యం గ్రామ, వార్డు సచివాలయాలు, ఆర్బీకేలు, ఇతర ప్రభుత్వ కార్యాలయాలపై పచ్చముఠాలు దాడులు చేసి ఉద్యోగులను భయభ్రాంతులకు గురిచేస్తున్నాయి. తద్వారా ఇక తమకు గ్రామాల్లో ఎదురులేదని చాటుకునే ప్రయత్నం చేస్తున్నాయి. అయినా పోలీసులు పట్టించుకోకపోవడంతో టీడీపీ నేతలు కేవలం 40 రోజుల్లోనే రాష్ట్రవ్యాప్తంగా 490 ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేశారు. తిరుపతి జిల్లాలో అత్యధికంగా 52 ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేశారు. పత్రికా స్వేచ్ఛపైనా దాడి టీడీపీ అరాచకాలతో రాష్ట్రంలో పత్రికా స్వేచ్ఛ కూడా ప్రమాదంలో పడింది. ఎన్నికల హామీని టీడీపీ తుంగలో తొక్కి విశాఖపట్నం స్టీల్‌ప్లాంట్ ప్రైవేటీకరణకు చంద్రబాబు ప్రభుత్వం మద్దతు ఇస్తున్న విషయాన్ని ప్రచురించిన డెక్కన్ క్రానికల్ పత్రిక కార్యాలయంపై టీడీపీ గూండాలు దాడికి తెగబడ్డారు. విశాఖపట్నంలోని డెక్కన్‌క్రానికల్ కార్యాలయం బోర్డులు తగలబెట్టి బీభత్సం సృష్టించారు. ఇక నుంచి ఎవరైనా తమకు వ్యతిరేకంగా వార్తలు రాస్తే ఇలానే ఉంటుందనే తరహాలో హెచ్చరికలు జారీచేశారు. టీడీపీ కూటమి అధికారంలోకి వచి్చన 40 రోజుల్లోనే ఆంధ్రప్రదేశ్‌లో పత్రికా స్వేచ్ఛ ప్రమాదంలో పడిందని జాతీయస్థాయిలో మీడియా సంస్థలు ఆందోళన వ్యక్తంచేస్తున్నాయి.ఠాణా..తందానా! బీఆర్ అంబేడ్కర్ అందించిన భారత రాజ్యాంగాన్ని పాటించాల్సిన పోలీసు శాఖ... లోకేశ్ విరచిత రెడ్‌బుక్ రాజ్యాంగానికి దాసోహమైంది. రెడ్‌బుక్ పేరిట రాష్ట్రంలో హోర్డింగులు పెట్టి మరీ దౌర్జన్యాలకు పాల్పడుతున్నా పోలీసు శాఖ కళ్లుండీ కబోదిగా వ్యవహరిస్తోంది. రెడ్‌బుక్ రాజ్యాంగానికి సెల్యూట్ చేస్తూ టీడీపీ అరాచకాలకు గొడుగుపడుతోంది. రాష్ట్రస్థాయిలో లోకేశ్ రెడ్ బుక్ రాజ్యాంగం పేరిట అరాచకానికి తెరతీస్తే... నియోజకవర్గ స్థాయిలో టీడీపీ ఎమ్మెల్యేలు, ఎంపీలు తలో రెడ్‌బుక్‌ను తెరపైకి తెచ్చి దాడులు, దౌర్జన్యాలకు పాల్పడుతున్నారు. తమ దౌర్జన్యాలకు అడ్డువస్తే పోలీసుల సంగతి తేలుస్తామని టీడీపీ ప్రభుత్వ పెద్దలు బహిరంగంగానే ప్రకటిస్తుండటం విభ్రాంతి కలిగిస్తోంది. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో ఇప్పటికే పూర్తిగా అదుపు తప్పిన శాంతిభద్రతలు మున్ముందు మరింతగా దిగజారుతాయని మేధావులు, ప్రజాస్వామికవాదులు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. -
‘నారా’రూప రాక్షసం.. యథేచ్ఛగా నరమేధం!
మధ్య యుగాల్లో గజినీలు, ఘోరీలు దండెత్తి సృష్టించిన మారణహోమాన్ని రాష్ట్రంలో చంద్రబాబు రాక్షసపాలన గుర్తుకు తెస్తోంది. ఆధునిక కాలంలో యూదు జాతి మొత్తాన్ని తుదముట్టించాలని జర్మన్ నాజీ నియంత హిట్లర్ చేసిన ఘోరకలిని తలపిస్తూ ఎన్నికల ఫలితాలు వెలువడిన నాటి నుంచి ఆంధ్రప్రదేశ్‌లో పచ్చమూక మరణమృదంగం మోగిస్తోంది. ‘నారా’సుర పాలన విశృంఖలత్వం సృష్టిస్తోంది. అధికారబలం ఉన్నవాడిదే అరాచకం... అన్న అడవినీతిని తలపిస్తూ యథేచ్చగా నరమేధం సాగిస్తోంది. హత్యలతో రాష్ట్రం అట్టుడికిపోతోంది. ప్రజాప్రతినిధుల నుంచి సామాన్యుల ప్రాణాలకు రక్షణ లేకుండాపోయింది. ప్రభుత్వ ఆస్తుల విధ్వంసకాండ కొనసాగుతోంది. ప్రైవేటు ఆస్తుల ధ్వంస రచన అడ్డూ అదుపు లేకుండా సాగుతోంది. పచ్చ ముఠాలు సభ్యులు రాష్ట్రంపై తెగబడి ఆస్తులు ధ్వంసం చేస్తున్నారు. ఇళ్లను ముట్టడిస్తున్నారు. దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహాలను నేలమట్టం చేస్తున్నారు. వైఎస్సార్సీపీ కార్యాలయాలపై దండెత్తుతున్నారు. సచివాలయాలు, ఆర్బీకేలు, తాగునీటి ట్యాంకులు వంటి ప్రభుత్వ ఆస్తులను కూలగొడుతున్నారు. టీడీపీ అధికార మదానికి పోలీసు శాఖ దాసోహమైంది. ప్రభుత్వ ప్రేరేపిత దాడులు కావడంతో చేష్టలుడిగి చూస్తోంది. ఒక్క మాటలో చెప్పాలంటే రాష్ట్రంలో రాజ్యాంగ వ్యవస్థలు కుప్పకూలుతున్నాయి. గోడు వెళ్లబోసుకునేందుకు ఏ వ్యవస్థా అందుబాటులో లేకుండా పోయింది. చంద్రబాబు ప్రభుత్వం రాష్ట్రంలో రాజ్యాంగ ధర్మాన్ని కాలరాస్తోంది. టీడీపీ రెడ్‌బుక్ రాజ్యాంగ అరాచకమే రాజ్యమేలుతోంది. – సాక్షి, అమరావతి నేడువరుసగా మూడుసార్లు ఎంపీగా ఎన్నికైన పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డిని గురువారం ఆయన సొంత నియోజకవర్గంలోనే హత్య చేసేందుకు టీడీపీ గూండాలు బరితెగించారు. పక్కా పన్నాగంతో కత్తులు, రాళ్లు చేతబట్టి మాటు వేశారు. మూకుమ్మడిగా దాడిచేశారు. టీడీపీ రౌడీమూకలను వారించబోయిన మాజీ ఎంపీ రెడ్డప్పను బూతులు తిడుతూ దాడికి తెగబడ్డారు. ఆంధ్రప్రదేశ్‌లో ఓ ఎంపీ ప్రాణాలకే రక్షణలేని పరిస్థితి. నిన్నపల్నాడు జిల్లా వినుకొండలో నడిరోడ్డుపై వైఎస్సార్సీపీ కార్యకర్త రషీద్‌పై టీడీపీ గూండా జిలానీ కత్తితో విచక్షణారహితంగా దాడి చేశాడు. రెండు చేతులు తెగనరికాడు. అనంతరం కత్తితో మెడ నరికి పాశవికంగా హత్య చేశాడు. ఆంధ్రప్రదేశ్‌లో ఓ సామాన్యుడికి ప్రాణాలకు ఏమాత్రం రక్షణ లేదనడానికి తాజా తార్కాణం ఈ దురాగతం. కక్ష కట్టి కత్తివేటు... హత్యలు31 హత్యాయత్నాలు 300టీడీపీ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత 40 రోజుల్లోనే రాష్ట్రవ్యాప్తంగా 31 మంది దారుణ హత్యకు గురయ్యారు. కర్నూలు జిల్లా ఆదోని మండలం నాగనాథహళ్లిలో మాల గుండమ్మ అనే దళిత మహిళను ఆమె పొలంలోనే టీడీపీ నేత రాఘవేంద్రారెడ్డి, ఆయన కుమారుడు శ్రీధర్‌రెడ్డి దారుణంగా ట్రాక్టర్‌తో తొక్కించి చంపేశారు. రాష్ట్ర హోం మంత్రి వంగలపూడి అనిత ప్రాతినిధ్యం వహిస్తున్న అనకాపల్లి జిల్లా రాంబిల్లి మండలం కొప్పుగొండువానిపాలెంలో సురేష్ అనే ఉన్మాది 9వ తరగతి చదువుతున్న బాలికను కత్తితో పొడిచి హత్యచేశాడు. అదేవిధంగా హిందూపురం నియోజకవర్గం గోళపురం గ్రామంలో వైఎస్సార్సీపీ నేత సతీష్... విజయనగరం జిల్లా సీతానగరం మండలం పెద్ద భోగిలే హడ్కో కాలనీలో గుజ్జల హేమంత్... శ్రీకాకుళం రెల్లివీధికి చెందిన నల్లపిల్లి గౌరీశంకర్.. శ్రీకాకుళం జిల్లా సోంపేట మండలం కొర్లాం జాతీయ రహదారి సమీపంలోని ఓ దాబాలో రాంబాబు అనే వ్యక్తి...అనంతపురం జిల్లా కోమటికుంట్ల గ్రామంలో వైఎస్సార్సీపీ కార్యకర్త ఎరికలయ్య.. విశాఖపట్నంలోని అగనంపూడిలో కిరణ్ అనే యువకుడు... బాపట్ల జిల్లా చీరాలలో ఓ వ్యాపారి... ఒంగోలులో ఓ యువకుడు... పల్నాడు జిల్లా వెల్దుర్తి మండలం మిట్టపల్లెలో హనిమిరెడ్డి, దాచేపల్లిలో గుమ్మడి నాగిరెడ్డి... ఇలా 40 రోజుల్లో 31 మంది హత్యకు గురయ్యారు. శ్రీకాకుళం జిల్లాలో అత్యధికంగా ఐదు హత్యలు జరిగాయి. మరో 300 మందిపై హత్యాయత్నాలు జరిగాయి.భరించలేక.. బలవన్మరణాలు ఆత్మహత్యలు 35 వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలపై మాత్రమే కాదు... చిరు వ్యాపారులు, చిన్నాచితక ఉద్యోగులు, సామాన్యులపై సైతం టీడీపీ నేతలు తమ ప్రతాపం చూపుతున్నారు. ‘ఇక మా ప్రభుత్వం వచ్చింది.. మీరు తప్పుకోండి..’ అంటూ బెదిరిస్తున్నారు. తమకు ఎదురు చెబితే తప్పుడు కేసులు పెట్టి కుళ్ల»ొడిపిస్తామని హెచ్చరిస్తున్నారు. దీంతో ఉపాధి కోల్పోతామని... పరువు పోతుందనే భయంతో తీవ్ర ఆవేదనకు గురై ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. టీడీపీ నేతలు ఉద్యోగానికి రాజీనామా చేయాలని బెదిరించడంతో చిలకలూరిపేట నియోజకవర్గంలో ఉపాధి హామీ పథకం ఫీల్డ్ అసిస్టెంట్ జడ ఆనంద్ పురుగులమందు తాగి చనిపోయాడు. పోలీసుల వేధింపులతో పల్నాడు జిల్లా సత్తెనపల్లి నియోజకవర్గం రెంటపాళ్ల ఉప సర్పంచ్ కోరుకుంట్ల నాగమల్లేశ్వరరావు ఆత్మహత్య చేసుకున్నారు. ఇలా 40 రోజుల్లో రాష్ట్రవ్యాప్తంగా 35మంది ఆత్మహత్యలు చేసుకున్నారు. టీడీపీ నేతల వేధింపుల కారణంగా అత్యధికంగా వైఎస్సార్ జిల్లాలో 16 మంది ఆత్మహత్యలు చేసుకున్నారు. ఇక శ్రీకాకుళం జిల్లాలో 11 మంది బలవన్మరణాలకు పాల్పడ్డారు.చిన్నారులనేకనికరం లేకుండా.. లైంగిక దాడులు20టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రంలో లైంగికదాడులుఘోరంగా జరుగుతున్నాయి. చిన్నారులు అనే కనికరం కూడా లేకుండా ఉన్మాదులు చెలరేగిపోతున్నారు. కేవలం 40 రోజుల్లోనే 20 మందిపైలైంగికదాడులు జరిగాయి. వారిలో నలుగురిని దుండగులు చంపేశారు. చీరాలలో జూన్ 21వ తేదీన ఓ చేనేత కుటుంబానికి చెందిన యువతి బహిర్భూమికి వెళ్లగా, ఆమెపై దుండగులు అత్యాచారం చేసి హతమార్చారు. నంద్యాల జిల్లా ముచ్చుమర్రిలో పది రోజుల కిందట ఎనిమిదేళ్ల గిరిజన బాలికను దుండగులు అపహరించి అత్యాచారానికి పాల్పడ్డారు. ఆ బాలిక ఆచూకీ ఇంతవరకు తెలియలేదు. అనంతపురం జిల్లా అరకటివేములలో టీడీపీ కార్యకర్త రవితేజ ఓ బాలికను జూన్ 24న అపహరించి తాడిపత్రి మార్కెట్ యార్డ్ వద్ద ఉన్న వాహనంలోకి తీసుకువెళ్లి తన స్నేహితుడు నాగేంద్రతో కలిసిలైంగికదాడికి పాల్పడ్డారు. ఇలా వయసుతో సంబంధం లేకుండా 20 మందిపై లైంగిక దాడులు జరిగాయి.అదేవిధంగా శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల మండలం నవభారత్ జంక్షన్లో జూన్ 17న ఓ మహిళపై దాడి చేసి ఒళ్లంతా కారం చల్లి ఆటోలోకి బలవంతంగా ఎక్కించి శ్రీకాకుళం పట్టణంలోకి తీసుకువెళ్లి నడివీధిలో వివస్త్రను చేసి ఊరేగించారు. అనకాపల్లి జిల్లా దర్మసాగరంలో టీడీపీ వర్గీయులు కుమారి అనే మహిళ ఇంటికి వెళ్లి ఆమెను వివస్త్రను చేసి కొట్టారు. ఇవన్నీ అధికారిక లెక్కలు. కానీ ఫిర్యాదులు చేసేందుకు పలువురు బాధితులు వెనుకంజ వేస్తున్నారు. బాధితులు అందరూ ఫిర్యాదులు చేస్తే కేసుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. -
తిరుపతిలో దారుణం.. మాస్క్ పెట్టుకుని ఇంట్లోకి చొరబడి..
సాక్షి, తిరుపతి: ఏపీలో కూటమి ప్రభుత్వంలో దారుణాలు కొనసాగుతూనే ఉన్నాయి. తాజాగా తిరుపతిలో దారుణ హత్య జరిగింది. ముఖానికి మాస్క్ వేసుకుని ఓ వ్యక్తి మహిళలను హత్యచేసి పారిపోయాడు. ఈ క్రమంలో అడొచ్చిన మహిళ మనువరాలిపై దాడికి పాల్పడ్డాడు.ఈ ఘటన తిరుపతి ఎస్పీ సుబ్బారాయుడు తెలిపిన వివరాల ప్రకారం..‘తిరుపతిలోని రాయల్ నగర్లో హత్య జరిగిన ప్రాంతాన్ని పరిశీలించాము. జయలక్ష్మీ(67) అనే వృద్దురాలిని దుండగుడు హత్య చేశాడు. నిందితుడు ముఖానికి మాస్క్ వేసుకుని ఇంట్లోకి చొరబడ్డాడు. అనంతరం, ఆమెను చంపి పారిపోయే క్రమంలో మృతురాలి మనుమరాలు నియతి(14) గొంతుపై కత్తితో దాడికి పాల్పడ్డాడు. ఆ తర్వాత ఆమె కోడలు సురక్షపై కూడా దాడి చేశాడు.ఇక, ఈ హత్యకు సంబంధించి కొన్ని క్లూస్ దొరికాయి. సీసీ కెమెరాల్లో నిందితుడి ఆచూకీలు లభించాయి. ఈ దాడి నగలను దోచుకోవడానికి దాడి జరగలేదు. త్వరలోనే ఈ కేసు మిస్టరీని చేధిస్తాము. వీలైనంత తొందరగానే నిందితుడిని పట్టుకుంటాము’ అని తెలిపారు. -
అంతా అధికార పార్టీ నేత అనుచరుడి పనే!
సాక్షి ప్రతినిధి కర్నూలు: ముచ్చుమర్రికి చెందిన బాలికపై అత్యాచారం, హత్య ఘటనకు సంబంధించి కొత్త విషయాలు వెలుగులోకొస్తున్నాయి. హత్యాచారానికి పాల్పడ్డ ముగ్గురు బాలురులో ఓ బాలుడి తాత.. ఆ నియోజకవర్గంలో అధికార పారీ్టకి చెందిన ఓ నాయకుడి కుటుంబం వద్ద నాలుగు దశాబ్దాలుగా పనిచేసేవాడని తెలుస్తోంది. 1994 ప్రాంతంలో ఆ నాయకుడికి ఫ్యాక్షన్‌లో అడ్డొచ్చిన కొందరిని ముక్కలు ముక్కలుగా చేసి అక్కడి చేపలకు, నీటి కుక్కలకు ఆహారంగా వేసేవాడని స్థానికులు చర్చించుకుంటున్నారు. అప్పట్లో మిస్సయిన వ్యక్తుల ఆచూకీ నేటికీ తెలియలేదని, అదే తరహాలోనే ఇప్పుడు బాలిక శవాన్ని కూడా ముక్కలు చేశారని స్థానికుల్లో ప్రచారం జరుగుతోంది.అయితే పోలీసు వర్గాలు మాత్రం శవాన్ని సంచిలో పడేసి రాయి కట్టడంతోనే దొరకలేదని చెబుతున్నారు. నిజానికి బాలిక పొట్ట కోయకుండా రాయి కట్టి పడేసినా శవం బయటకొస్తుందని కొందరంటున్నారు. బ్యాక్ వాటర్‌లో పడేయడంతో మొసళ్లు ఆహారంగా తీసుకుని ఉంటాయని కొందరు పోలీసులు భావిస్తున్నారు. అయితే అక్కడ మొసళ్లే లేవని గ్రామస్తులు చెబుతున్నారు. అందుకే మృతదేహం ఇక దొరకదు! ఈనెల 7న పాత ముచ్చుమర్రిలో ఐదో తరగతి చదువుతున్న తొమ్మిదేళ్ల బాలికపై ఆరో తరగతి బాలుడు, పదో తరగతి చదివే ఇద్దరు బాలురు అత్యాచారం చేశారు. ఆపై పాప ఎవరికైనా చెబుతుందేమోనని భయపడి వెంటనే పాప గొంతు నులిమి చంపేశారు. వీరిలో ఒకడు విషయాన్ని తండ్రికి చెప్పాడు. ఆయన మిగిలిన తల్లిదండ్రులతో కలిసి.. ఆ చిట్టితల్లిని గోనె సంచిలో వేసి, దానికి రాయి కట్టి కృష్ణానది బ్యాక్ వాటర్‌లో పడేశారు. పోలీసుల విచారణలో ఆ ముగ్గురి పిల్లల తండ్రులు చెప్పిన విషయం ఇది. అయితే చిన్నారిపై అత్యాచారం చేసింది నిజం.. చంపింది నిజమేగానీ, శవాన్ని మాయం చేసిన విధానంపై చెబుతోంది మాత్రం అబద్ధం. ఈ రెండు ఊర్లే కాదు. ఈ 12 రోజుల్లో ఆ నోటా, ఈ నోటా చర్చ జరిగి ఇప్పుడు కర్నూలు, నంద్యాల రెండు జిల్లాల్లో ఈ విషయం తీవ్ర చర్చనీయాంశమైంది. పాపను చంపి ముచ్చుమర్రి–హంద్రీ నది అప్రోచ్ చానల్లో పడేశారని మొదట చెప్పారు. ఆ తర్వాత ముచ్చుమర్రి ఎత్తిపోతల పథకం పంప్ హౌస్ వద్ద వేశామన్నారు. శవాన్ని తీసుకెళ్లి సంగమేశ్వరంలో వేశామని మరోసారి చెప్పారు. లేదు.. కొణి§ð ల శ్మశాన వాటికలో పూడ్చామన్నారు.. అయితే వీటిలో ఏదీ వాస్తవం కాదని కొత్త విషయం వెలుగు చూస్తోంది. ముగ్గురి బాలురలో ఒక బాలుడి తాత ఆధ్వర్యంలో బిడ్డను ముక్కలుగా నరికినట్లు తెలుస్తోంది. ముక్కలను బ్యాక్ వాటర్‌లో అక్కడక్కడా పడేసి ఉంటారని, నీటి కుక్కలు, చేపలు ఈ ముక్కలను తినేసి ఉంటాయని, అందుకే శవం దొరకడం లేదని.. మరో నెలైనా దొరకదని గ్రామస్తులు చెబుతున్నారు.ఎక్స్‌గ్రేషియా ఏది? సాక్షి, నంద్యాల: ముచ్చుమర్రిలో బాలిక హత్యాచారానికి సంబంధించి ఘటనలో బాలిక కుటుంబానికి రాష్ట్ర ప్రభుత్వం నుంచి రూ.10 లక్షల సాయం అందజేస్తామని హోం మంత్రి అనిత ప్రకటించారు. గురువారంతో మూడు రోజులవుతున్నా ఇంత వరకూ బాధిత కుటుంబానికి సాయం అందలేదు. వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో బాధితులకు పరిహారం ప్రకటిస్తే గంటల వ్యవధిలోనే జిల్లా అధికారులు ఆ సాయాన్ని అందించేవారు. సంబంధిత మంత్రులు లేదా జిల్లా కలెక్టర్ బాధితులను కలిసి భరోసా కల్పించేవారు. కానీ కూటమి ప్రభుత్వం స్పందిస్తున్న తీరుపై ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి.పవన్, చంద్రబాబునోరు మెదపరేం? కర్నూలుకు చెందిన సుగాలి ప్రీతిపై తెలుగుదేశం పార్టీ ప్రభుత్వ హయాంలో కొందరు అత్యాచారం చేసి హత్య చేశారు. ఈ ఘటనపై మొన్నటి ఎన్నికల ప్రచారం వరకూ పవన్ కళ్యాణ్ ఆవేశంతో ఊగిపోయేవారు. ఇప్పుడు టీడీపీతో పాటు తమ భాగస్వామ్యం ఉన్న ప్రభుత్వంలో పదేళ్ల బాలికపై అత్యాచారం చేసి, హత్య చేసి.. 12 రోజులుగా శవాన్ని కనపడకుండా చేస్తే ఆ ఘటనపై నోరెత్తలేదు. ముఖ్యమంత్రీ స్పందించలేదు. హోంమంత్రి ఇక్కడ పర్యటించనే లేదు. దీనికి కారణం బాలిక హత్యతో ముడిపడి ఉన్న కుటుంబానికి చెందిన వారు అధికార పార్టీకి చెందిన నేతల అనుచరులు కావడమేనని చెప్పుకొంటున్నారు. ఈ కేసులో చాలా సెక్షన్ల కింద బాలురు, వారి తండ్రులపై కేసులు నమోదు కావాల్సి ఉంటుందని.. అందువల్లే ఘటనను తేలిగ్గా తీసిపారేస్తున్నారని తెలుస్తోంది. -
నరరూప రాక్షసుల్లా టీడీపీ గూండాలు.. ధ్వజమెత్తిన వైఎస్సార్సీపీ
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో టీడీపీ గూండాలు నరరూపరాక్షసుల్లా తయారయ్యారని వైఎస్సార్సీపీ ధ్వజమెత్తింది. వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలపై విచక్షణా రహితంగా దాడులకు తెగబడుతున్నారంటూ మండిపడింది. పల్నాడు జిల్లా వినుకొండలో బుధవారం రాత్రి నడిరోడ్డుపై అందరూ చూస్తుండగా జరిగిన ఘటనే ఇందుకు నిదర్శనమని పేర్కొంది. వినుకొండ వైఎస్సార్సీపీ యువజన విభాగం నాయకుడు రషీద్‌పై టీడీపీకి చెందిన గూండా జిలానీ పాశవికంగా కత్తితో దాడిచేసి హతమార్చారని ఆరోపించింది. అందరూ చూస్తుండగా, దారుణంగా రెండు చేతులు నరికి మెడపై కూడా పదేపదే కత్తితో వేటువేయడంతో రక్తపుమడుగులో కుప్పకూలిపోయాడని తెలిపింది. కొన ఊపిరితో ఉన్న రషీద్‌ను ఆస్పత్రికి తరలించగా, చికిత్స పొందుతూ మృతిచెందాడని పేర్కొంది. టీడీపీతో పాటు హోంమంత్రి వంగలపూడి అనిత, ఉపముఖ్యమంత్రి పవన్‌కళ్యాణ్, మంత్రి నారా లోకేశ్‌లను ట్యాగ్ చేస్తూ టీడీపీ వాళ్ల రాక్షసానందానికి ఇంకెంత మంది బలి అవ్వాలి? అంటూ ఎక్స్ వేదికగా వైఎస్సార్సీపీ ప్రశ్నించింది. -
నెల్లూరులో ఘోరం.. ముచ్చుమర్రి తరహా ఘటన
సాక్షి, నెల్లూరు: ఉమ్మడి నెల్లూరు జిల్లాలో ముచ్చుమర్రి ఘటన మరువక ముందే మరో దారుణం చోటుచేసుకుంది. ఎనిమిదేళ్ల చిన్నారిపై ఓ వ్యక్తి అత్యాచారానికి పాల్పడ్డాడు. అనంతరం.. అటవీ ప్రాంతంలో చిన్నారిని హత్య చేశాడు. దీంతో, ఈ ఘటన స్థానికంగా కలకలం సృష్టించింది. వివరాల ప్రకారం.. నెల్లూరు జిల్లాలోని దొరవారిసత్రం మండలం నెలబల్లి గ్రామ సమీపంలో బీహార్‌కు చెందిన ఎనిమిదేళ్ల చిన్నారిపై ఓ వ్యక్తి అత్యాచారానికి పాల్పడ్డారు. అనంతరం, చిన్నారిని అటవీ ప్రాంతంలోకి తీసుకెళ్లి అక్కడే హత్య చేశాడు. ఈ ఘటనకు సంబంధించిన సమాచారం అందిన వెంటనే పోలీసులు అక్కడికి చేరుకున్నారు. చిన్నారి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఈ క్రమంలో నాయుడుపేట ప్రభుత్వ ఆసుపత్రికి చేరుకొని ఘటనపై దర్యాప్తు చేపట్టినట్టు తిరుపతి జిల్లా ఎస్పీ సుబ్బారాయుడు తెలిపారు. -
విశాఖలో కత్తి దూసిన ప్రేమోన్మాదం.. చేతులెత్తేసిన పోలీసులు
విశాఖపట్నం, సాక్షి: అనకాపల్లిలో ఓ ప్రేమోన్మాది ప్రేమ పేరుతో బాలికను చిత్రవధ చేసి చంపి తానూ బలవన్మరణానికి పాల్పడిన ఘటన మరువక ముందే.. ఉమ్మడి జిల్లాలో మరొక ఘటన చోటు చేసుకుంది. విశాఖ న్యూపోర్ట్ పరిధిలో ఓ ప్రేమోన్మాది కత్తి దూశాడు. అయితే ఈ ఘటనలోనూ పోలీసుల అలసత్వంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.వుడా కాలనీ సమీపంలో నివసించే శ్యామల అనే అమ్మాయిని సిద్ధూ అనే యువకుడు గత కొంతకాలంగా ప్రేమ పేరుతో వేధిస్తూ వస్తున్నాడు. ఈ ఏడాది ఏప్రిల్ నెలలో కాలేజ్ వద్ద ఆ యువతితో సిద్ధూ అసభ్యకరంగా ప్రవర్తించాడు. దీంతో ఆమె తల్లిదండ్రుల సాయంతో పోలీసులను ఆశ్రయించింది. బాధితురాలు మైనర్ కావడంతో గాజువాక పోలీసులు పోక్సో చట్టం కింద నిందితుడ్ని అరెస్ట్ చేశాడు. అయితే బెయిల్‌పై జైలు నుంచి బయటకు వచ్చిన సిద్ధూ.. శ్యామలపై కక్ష గట్టాడు. మంగళవారం రాత్రి ఆమె ఇంటి వద్దకు వెళ్లాడు. టపాసులు పేల్చి హ్యాపీ బర్త్‌డే అంటూ నానా హంగామా చేశాడు. ఆపై ఇంట్లోకి దూరి ఫర్నీచర్‌ను పగలకొట్టాడు. వెంట తెచ్చుకున్న కత్తితో ఆమెను చంపాలని ప్రయత్నించాడు. అయితే అది గమనించి ఆమె పారిపోయింది. ఈ క్రమంలో ఆమె తల్లి సావిత్రి అడ్డురావడంతో ఆమెకు గాయాలు అయ్యాయి. తల్లీకూతుళ్లు కేకలు వేయడంతో స్థానికులు రావడంతో సిద్ధూ అక్కడి నుంచి పరారయ్యాడు. కేసు నమోదు చేసుకున్న న్యూపోర్ట్ పోలీసులు సిద్ధూ కోసం గాలిస్తున్నారు. పోలీసుల తీరుపై విమర్శలు.. దాడి తరువాత పరారీ అయిన సిద్ధూ ఆచూకీని 24 గంటలు గడిచినా కూడా పోలీసులు కనిపెట్టలేకపోయారు. అయితే.. ఈ ఫోటో లో వ్యక్తి కనిపిస్తే, సమాచారం ఇవ్వండి అంటూ ప్రకటన ఇవ్వడం కొసమెరుపు. అటు అనకాపల్లి ఘటనలోనూ.. ఇటు ఇప్పుడు పోలీసులు నిందితుల విషయంలో ఇలా ఆలస్యంగా స్పందించిన తీరుపై విమర్శలు వినిపిస్తున్నాయి.