breaking news
-
రోడ్డు ప్రమాదం: కావేరి ట్రావెల్స్ బస్సు బోల్తా
కంబాలచెరువు (రాజమహేంద్రవరం): విశాఖపట్నం నుంచి హైదరాబాద్ వెళ్తున్న కావేరీ ట్రావెల్స్ బస్సు(Bus Accident) బుధవారం అర్థరాత్రి 12.30 సమయంలో రాజమహేంద్రవరం సమీపంలో బోల్తా పడింది. ఈ ఘటనలో ఒకరు మృతి చెందగా, 18 మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు. వివరాలు.. విశాఖపట్నం నుంచి హైదరాబాద్‌కు కావేరి ట్రావెల్స్ బస్సు సుమారు 50 మంది ప్రయాణికులతో బయల్దేరింది. ఈ బస్సు రాజమహేంద్రవరం రూరల్ కాతేరు– కొంతమూరు మధ్యలో అగ్రహారం వద్దకు వచ్చేసరికి బోల్తా పడింది(Road Accident). రోడ్డు పనులు జరుగుతుండటంతో డైవర్షన్ ఇచ్చిన విషయాన్ని డ్రైవర్ దగ్గరకు వచ్చేవరకూ గమనించకపోవడం, ఒక్కసారిగా వేగంగా కుడివైపునకు బస్సు తిప్పడంతో బోల్తా పడింది. ఈ ఘటనలో ఓ యువతి (20) అక్కడికక్కడే మృతి చెందింది. 25 మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన వారిని స్థానిక ఆస్పత్రికి తరలించారు. అయితే క్షతగాత్రుల్లో ఐదుగురి పరిస్థితి విషమంగా ఉండటంతో ముగ్గుర్ని కాకినాడ ఆస్పత్రికి, ఇద్దర్ని రాజమండ్రి ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. అయితే క్షతగాత్రుల్లో 13 మందిని ప్రాథమిక చికిత్స అనంతరం డిశ్చార్జ్ చేశారు. -
పెళ్లయిన రోజే ప్రాణాలు తీసుకుంది
సత్యవేడు: పెళ్లయిన రోజే నవ వధువు ఆత్మహత్య చేసుకోవడం తిరుపతి జిల్లా సత్యవేడు మండలం ఆంబాకంలో కలకలం రేపింది. పోలీసుల కథనం.. తమిళనాడుకు చెందిన ధనంజయ, రతి దంపతుల కుమార్తె ఆర్తీ(20) అక్కడే ఓ ప్రయివేటు కళాశాలలో బీకాం ఫైనలియర్ చదువుతోంది. సత్యవేడు మండలం ఆంబాకానికి చెందిన సమీప బంధువు సూర్య వారితో కలిసి ఉంటున్నాడు. ఈ నేపథ్యంలో సోమవారం సూర్యకు, ఆర్తీకి వివాహం జరిపించారు. ఆ తర్వాత తిరుత్తణిలోని సుబ్రమణ్యస్వామి ఆలయానికి వెళ్లి స్వామివారిని దర్శించుకున్నారు. అక్కడి నుంచి సత్యవేడు మండలంలోని ఆంబాకానికి వచ్చారు. రాత్రి దుస్తులు మార్చుకుని వస్తానని చెప్పి గదిలోకి వెళ్లిన ఆర్తీ ఎంతకీ రాకపోవడంతో తలుపులు పగులగొట్టి చూడగా.. ఆమె ఉరి వేసుకుని కనిపించింది. వెంటనే సత్యవేడు వైద్యశాలకు ఆమెను తరలించగా.. అప్పటికే మృతిచెందినట్టు వైద్యులు ధ్రువీకరించారు. మంగళవారం పోస్టుమార్టం అనంతరం బంధువులకు మృతదేహాన్ని అప్పగించినట్టు ఎస్ఐ రామస్వామి తెలిపారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
ఊడిన కారు టైరు.. మంత్రాలయ విద్యార్థుల దుర్మరణం
బెంగళూరు, సాక్షి : కర్ణాటకలో బుధవారం(జనవరి22) తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కారు టైర్ ఊడిపడడంతో.. వాహనం బోల్తా కొట్టింది. ఈ ప్రమాదంలో డ్రైవర్ సహా నలుగురు మృతి చెందారు. మరొకరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. మృతుల్లో ముగ్గురిని కర్నూలు జిల్లా మంత్రాలయ రాఘవేంద్రస్వామి మఠం వేద పాఠశాల విద్యార్థులుగా గుర్తించారు.హంపిలోని శ్రీ నరహరి తీర్థుల బృందావనంలో ఆరాధానోత్సవాల కోసం వెళుతుండగా ఈ ప్రమాదం జరిగింది. నట్లు, బోల్టులు ఊడిపోవడంతో తుఫాన్ వాహనం బోల్తాపడినట్లు ప్రాథమికంగా తేలింది. ప్రమాద సమయంలో వాహనంలో మొత్తం 14 మంది విద్యార్థులున్నారు. పోలీసులు ప్రమాద స్థలాన్ని సందర్శించి కేసు నమోదు చేసుకున్నారు. -
గెరిల్లా సేనాని చలపతి
సాక్షి ప్రతినిధి, భద్రాద్రి కొత్తగూడెం/చిత్తూరు అర్బన్/ మల్కన్‌గిరి: వరుస ఎన్కౌంటర్లతో కుదేలవుతున్న మావోయిస్టులకు ఊహించని షాక్ తగిలింది. ఛత్తీస్‌గఢ్–ఒడిశా సరిహద్దుల్లో జరిగిన ఎన్కౌంటర్లో పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు చలపతి అలియాస్ రామచంద్రారెడ్డి అలియాస్ ప్రతాప్‌రెడ్డి అలియాస్ అప్పారావు మరణించారు. కేంద్ర కమిటీ సభ్యుడు ఇలా ఎన్కౌంటర్లో మృతిచెందడం మావోయిస్టు పార్టీ చరిత్రలోనే ఇది తొలిసారి కావడం గమనార్హం. చలపతిపై రూ.కోటి రివార్డు ఉన్నట్టు పోలీసు అధికారులు చెబుతున్నారు. ఏపీలోని చిత్తూరు జిల్లాలో జన్మించి... ఆంధ్రప్రదేశ్‌లోని చిత్తూరు జిల్లా తవణంపల్లె మండలం మత్యం పైపల్లెకు చెందిన శివలింగారెడ్డి, లక్ష్మమ్మ దంపతుల మూడో కుమారుడు చలపతి. ఆయన తండ్రి సాధారణ రైతు. వారికి మత్యం పైపల్లెలో ఇప్పటికీ సొంతిల్లు ఉంది. ప్రస్తుతం ఆ ఇంట్లో చలపతి అన్న కుమారుడి కుటుంబం నివసిస్తోంది. ప్రాథమిక విద్యను మత్యంలోనే అభ్యసించిన చలపతి.. పదో తరగతి వరకు బంగారుపాళెం, డిగ్రీ ఒకేషనల్ కోర్సును చిత్తూరులో పూర్తిచేశారు. పీపుల్స్‌వార్ పార్టీకి ఆకర్షితుడై 1990–91లో అజ్ఞాతంలోకి వెళ్లారు. పోలీసు రికార్డుల ప్రకారం... శ్రీకాకుళం జిల్లా ఉద్దానం ప్రాంతంలో మావోయిస్టు పార్టీ విస్తరణకు కృషి చేశారు. శ్రీకాకుళం– కోరాపుట్ డివిజన్ ఇన్చార్జిగా పనిచేసిన ఆయన.. గెరిల్లా వార్ఫేర్లో చూపిన ప్రతిభతో అనతి కాలంలోనే డివిజనల్ కమిటీ సభ్యుడిగా ఎదిగారు. 2000 నాటికి ఆంధ్రా– ఒడిశా బోర్డర్ (ఏఓబీ) స్పెషల్ జోనల్ కమిటీ, ఏవోబీ స్టేట్ మిలిటరీ కమిషన్లలో సభ్యుడి హోదా పొందారు. 2010లో తోటి మావోయిస్టు అరుణ అలియాస్ చైతన్యను వివాహం చేసుకున్నారు. 2012లో జరిగిన ఒక దాడిలో చలపతి పొరపాటు కారణంగా ఒక కామ్రేడ్ చనిపోవడంతో పార్టీ ఆయనను కొంతకాలం డీమోట్ చేసింది. చలపతి భార్య అరుణ 2019 మార్చిలో జరిగిన ఓ ఎన్కౌంటర్లో మృతి చెందారు. మహేంద్ర కర్మపై దాడితో మళ్లీ తెరపైకి... సల్వాజుడుం వ్యవస్థాపకుడు మహేంద్ర కర్మపై 2015లో చేసిన దాడితో చలపతి మరోసారి వెలుగులోకి వచ్చారు. తరా>్వత మావోయిస్టు రీజనల్ కమిటీ చీఫ్ కుడుముల వెంకట రమణ అలియాస్ రవి ఎదురుకాల్పుల్లో మృతి చెందడం, గెమ్మెలి నారాయణరావు అలియాస్ జాంబ్రి 2017లో చనిపోవడంతో.. చలపతికి ప్రాధాన్యత దక్కింది. తర్వాతి నుంచి అంచెలంచెలుగా ఎదుగుతూ కేంద్ర కమిటీ సభ్యుడి స్థాయికి చేరుకున్నారు. 2003లో దమాన్జోడి మైన్స్ కంపెనీపై దాడి, మాచ్‌ఖండ్ పోలీసుస్టేషన్‌పై దాడి, చిత్రకొండ సమితిలో సెల్ టవర్ల పేల్చివేత, 2009లో ఏపీ గ్రేహౌండ్స్‌పై చిత్రకొండ జలాశయంలో దాడి, 2018లో జరిగిన అరకు ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే సివేరి సోముల హత్యను ప్లాన్ చేసినది చలపతేనని చెబుతారు. 2011లో చలపతి ఒడిశా రాష్ట్ర కార్యదర్శిగా పనిచేస్తున్న సమయంలో కలెక్టర్ వినీల్‌కృష్ణను మావోయిస్టులు కిడ్నాప్ చేశారు. ఆర్కే సన్నిహితుడిగా.. హిడ్మాకు గురువుగా.. మావోయిస్టు పార్టీ మాస్టర్ మైండ్స్‌లో ఒకరిగా చలపతికి గుర్తింపు ఉంది. మావోయిస్టు అగ్రనేత ఆర్కేకు అత్యంత సన్నిహితంగా చలపతి మెలిగారు. ప్రస్తుతం పీపుల్స్ లిబరేషన్ గెరిల్లా ఆర్మీ బెటాలియన్ వన్ కమాండర్‌గా ఉన్న మడావి హిడ్మాకు చలపతిని గురువుగా పేర్కొంటారు. ఆయన ఎలా ఉంటారనేది చాలా కాలం పాటు పోలీసులకు తెలియలేదు. 2016లో ఓ మావోయిస్టు చనిపోగా.. అతడి ల్యాప్‌టాప్‌లో చలపతి, ఆయన సహచరి అరుణ సెల్ఫీ వీడియో లభించింది. -
అయ్యో..దేవుడా.. ఎలా బతికేది స్వామీ..!
రేణిగుంట: ‘నీపై భక్తితో ఇంతదూరమొచాము. నిన్ను దర్శించి పునీతులయ్యాము. నీకు మొక్కులు చెల్లించి రుణం తీర్చుకున్నాము. ఇంతలోనే మాకు అంత నరకం చూపావు.. మా తల్లిదండ్రులను తీసుకెళ్లి దిక్కులేని వాళ్లను చేశావు..! అయ్యో..దేవుడా.. ఎలా బతికేది స్వామీ..! అంటూ ఆ పసిమనసులు తల్లడిల్లడం తీరు చూపరులకు కన్నీళ్లు తెప్పించింది. ఈ విషాద ఘటన రేణిగుంట–కడప మార్గంలోని రేణిగుంట మండలం, మామండూరు పంచాయతీ కుక్కలదొడ్డి సమీపంలో సోమవారం చోటు చేసుకుంది. ట్రావెల్స్ బస్సు, కారు ఢీకొట్టిన ఘటనలో ఇద్దరు మృతిచెందగా.. నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి.దైవభక్తి ఎక్కవతెలంగాణ రాష్ట్రం, సంగారెడ్డి జిల్లా, పటాన్చెరువు, అంబేడ్కర్ కాలనీకి చెందిన సందీప్‌షా(36)కు భార్య అంజలీదేవి(31), పిల్లలు లితికా షా(12), సోనాలీ షా(09), రుద్రప్రతాప్(06) ఉన్నారు. పటాన్‌చెరువులో ట్రేడింగ్ చేస్తూ సందీప్‌షా కుటుంబాన్ని పోషిస్తున్నాడు. ఎంతో అన్యోన్యంగా పిల్లలను చదివిస్తూ వారి భవిష్యత్ కోసం శ్రమిస్తున్నారు. సందీప్షాకు చిన్నతనం నుంచి దైవభక్తి ఎక్కువ. కుటుంబ సమేతంగా ప్రఖ్యాత ఆలయాలకు తరచూ వెళ్లి దర్శించుకునే వాడు. ఈ క్రమంలోనే సంక్రాంతి పండుగ ముగియగానే, ఈనెల 16వ తేదీన తన భార్య, పిల్లలు, అతని స్నేహితుడు నరేష్‌తో కలసి మొత్తం ఆరుగురు కారులో తిరుమలకు బయల్దేరారు. 17వ తేదీన తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఆ తర్వాత ఆదివారం తిరుచానూరు పద్మావతి అమ్మవారు, శ్రీకాళహస్తిలోని శ్రీకాళహస్తీశ్వరుని దర్శించుకున్నారు. సోమవారం కారులో సొంతూరుకు తిరుగుపయనమయ్యారు. రేణిగుంట మండలం, కుక్కలదొడ్డి సమీపంలో ఎదురుగా వస్తున్న ట్రావెల్స్ బస్సును కారు అదుపు తప్పి ఢీకొంది. దీంతో కారు, బస్సు ముళ్లపొదల్లోకి దూసుకెళ్లాయి. కారు ముందుభాగం నుజ్జునుజ్జు అయ్యింది. కారు నడుపుతున్న సందీప్‌షా, అతని పక్కన కూర్చున్న భార్య అంజలీదేవి సీట్ల మధ్యలో ఇరుక్కుపోయి అక్కడికక్కడే మృతి చెందారు. వెనుక కూర్చున్న లితికా షా, సోనాలిషా, రుద్రప్రసాప్, నరేష్‌కు రక్తగాయాలయ్యాయి. పెద్ద పాప లితికా షా తలకు బలమైన రక్తగాయమైంది. వెంటనే వారిని రేణిగుంట సమీపంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో తరలించారు. లితికాషా పరిస్థితి విషమంగా ఉన్నట్టు సమాచారం.టూరిస్ట్ బస్సులోనూ భక్తులతో దైవయాత్రఈ ప్రమాదంలో కారును ఢీకొన్న ట్రావెల్స్ బస్సు జమ్మూ నుంచి 50 మంది భక్తబృందంతో దేశంలోని వివిధ పుణ్యక్షేత్రాలను సందర్శిస్తూ తిరుమలకు వచ్చే క్రమంలో ప్రమాదానికి గురైంది. 28 రోజుల కిందట వీరు జమ్ములో బయల్దేరారు. మరో 25 రోజులు వీరి యాత్ర సాగనుంది. అయితే అనూహ్య ప్రమాదంలో బస్సులోని యాత్రికులంతా తీవ్రంగా కలత చెంది రోడ్డు పక్కన దిగాలుగా కూర్చుండిపోయారు.ఎయిర్ బెలూన్స్ ఓపెన్ అయినా..వారు ప్రయాణిస్తున్న కారుకు ప్రమాద సమయంలో రక్షణ కవచంగా నిలిచే ఎయిర్ బెలూన్స్ ఓపెన్ అయ్యాయి. అయినప్పటికీ కారు ముందుభాగం నుజ్జునుజ్జు కావడంతో ప్రమాద తీవ్రత దృష్ట్యా వారు మృత్యుఒడికి చేరారు.డీఎస్పీ పరిశీలనరేణిగుంట డీఎస్పీ శ్రీనివాసరావు, అర్బన్ ఎస్ఐ అరుణ్‌కుమార్‌రెడ్డి తమ సిబ్బందితో ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. కారులో ఇరుక్కున్న సందీప్‌షా, అంజలీదేవి మృతదేహాలను అతికష్టం మీద బయటకు తీశారు. అనంతరం పోస్ట్‌మార్టం నిమిత్తం తిరుపతి ఎస్వీ వైద్యకళాశాలకు తరలించారు. ఆస్పత్రి వద్దకు చేరుకున్న మృతుల బంధువులు ఆ పిల్లలకు ఇక దిక్కెవరంటూ రోదించడం అక్కడివారిని కలిచివేసింది. -
ప్రియుడితో కొన్నాళ్లు సహజీవనం.. భర్తను నమ్మించి..
పలమనేరు: పట్టణంలో ఇటీవల సంచలనం సృష్టించిన దళిత నేత శివకుమార్ హత్య కేసు మిస్టరీని పోలీసులు ఛేదించారు. తమ వివాహేతర సంవాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నాడని భార్య, ఆమె ప్రియుడు షామీర్(30) పథకం ప్రకారం శివకుమార్‌ను హత్య చేసినట్టు తేల్చారు. ఈ క్రమంలో నిందితుడు షామీర్‌ను అరెస్ట్ చేశారు. పలమనేరు డీఎస్పీ డేగల ప్రభాకర్ ఆబంధానికి అడ్డుగా ఉన్నాడని భార్య, ఆమె ప్రియుడు షామీర్(30) పథకం ప్రకారం శివకుమార్‌ను హత్య చేసినట్టు తేల్చారు. ఈ క్రమంలో నిందితుడు షామీర్‌ను అరెస్ట్ చేశారు. పలమనేరు డీఎస్పీ డేగల ప్రభాకర్ ఆదివారం విలేకరులకు వివరాలు వెల్లడించారు. పలమనేరు మండలంలోని ముసలిమొడుగుకు చెందిన శివకుమార్ భార్య ఉషారాణి గత 8 నెలల నుంచి పలమనేరులోని షామీర్ బిరియాని హోటల్లో పనిచేస్తోంది. ఈ క్రమంలో ఆమెకు షామీర్ మధ్య వివాహేతర సంబంధం ఏర్పడింది. విషయం తెలుసుకున్న భర్త శివకుమార్ పలుమార్లు భార్యను ప్రశ్నించాడు. ఆమె కొన్నాళ్లు ప్రియుడితో కలిసి బెంగళూరు వెళ్లిపోయింది. దీంతో శివకుమార్ తన భార్య కనిపించలేదని వేలూరులో పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఇకపై తాను భర్తతోనే కాపురం చేస్తానని ఉషారాణి అందరినీ నమ్మించింది. షామీర్ కూడా తాను ఉషారాణి విషయంలో జోక్యం చేసుకోనని చెప్పాడు. స్నేహితులుగా ఉందామని శివకుమార్‌ను నమ్మించి ఈ నెల 13న పలమనేరు సమీపంలోని హెచ్‌పీ పెట్రోల్ బంకు పక్కనున్న వెంచర్లోకి తీసుకెళ్లారు. అక్కడ మద్యం తాగించి చాతీపై బండరాయితో కొట్టి హత్య చేశారు. ఈ కేసును మూడు రోజుల్లో ఛేదించిన సీఐ నరసింహరాజు, ఎస్ఐ స్వర్ణతేజను డీఎస్పీ అభినందించారు. -
ఏనుగుల దాడిలో టీడీపీ యువనేత మృతి
తిరుపతి, సాక్షి: చంద్రగిరి మండలంలో ఘోరం చోటు చేసుకుంది. ఏనుగుల దాడిలో టీడీపీ యువనేత రాకేశ్ చౌదరి(33) మృతి చెందాడు. రాకేష్ చంద్రగిరి ఐటీడీపీ అధ్యక్షుడిగా, కందులవారిపల్లి ఉప సర్పంచ్‌గా ఉన్నాడు. తమ పార్టీ యువనేత హఠాన్మరణంపై తెలుగు దేశం పార్టీ దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. తిరుపతి జిల్లాలోని చంద్రగిరి మండలం చిన్నరామాపురం, కొంగరవారిపల్లిలో శనివారం రాత్రి ఏనుగులు సంచరించాయి. మామిడిమాను గడ్డ గ్రామ పంటపొలాలపై ఏనుగుల గుంపు దాడి చేస్తుందన్న సమాచారంతో రాకేష్‌తో పాటు మరికొందరు అక్కడికి వెళ్లారు. అరుస్తూ వాటిని కొంతదూరం తరిమారు. ఈ క్రమంలో.. అవి తిరగబడడంతో పరుగులు తీశారు. ఓ ఏనుగు వాళ్లపై దాడికి దిగడంతో అంతా చెట్లెక్కి లైట్లు ఆఫ్ చేసుకున్నారు. అయితే.. రాకేష్ వాళ్లలో ముందు ఉండడం, తెల్ల చొక్కా ధరించి ఉండడంతో, పైగా అతని చేతిలో లైట్ ఆన్ చేసి ఉండడంతో ఏనుగు అతనిపై దాడికి దిగింది. తొండంతో ఎత్తి చెట్లకు కొట్టి.. కిందపడేసి తొక్కింది. దీంతో రాకేష్ అక్కడికక్కడే మృతి చెందాడు.రాకేష్‌కు భార్య, ఒక కూతురు ఉన్నారు. ఈయన సీఎం కుటుంబానికి సన్నిహితుడిగా తెలుస్తోంది. రాకేశ్ మృతి వార్త తెలుసుకొని ఎమ్మెల్యే పులివర్తి నాని ఘటనాస్థలికి చేరుకొని స్థానికులతో మాట్లాడారు. -
పల్లగిరిలో వైఎస్సార్సీపీ కార్యకర్త దారుణ హత్య
పల్లగిరి(ఎన్టీఆర్ జిల్లా): ఏపీలో రోజు రోజుకు హత్యా రాజకీయాలు పెరిగిపోతున్నాయి. విద్వేషమే లక్ష్యంగా వైఎస్సార్సీపీ శ్రేణులపై విరుచుకుపడుతున్నారు దుండగులు. నందిగామ నియోజకవర్గం పల్లగిరిలో వైఎస్సార్ీపీ కార్యకర్త దారుణంగా హత్యగావించబడ్డాడు. శనివారం నాగుల్ మీరా అనే వైఎస్సార్సీపీ కార్యకర్తను దారుణంగా హత్య చేశారు దుండగులు.నాగుల్ మీరాను హతమార్చి ఊరి బయట నిర్మానుష్య ప్రదేశంలో పడేశారు. ఈ విషాద ఘటన సమాచారాన్ని తెలుసుకున్న మాజీ ఎమ్మెల్యే మొండితోక జగన్మోహనరావు.. నాగుల్ మీరా మృతదేహాన్ని పరిశీలించారు. హంతకులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారాయన. -
తాడిపత్రిలో దారుణం.. భార్యను నరికి చంపిన భర్త
సాక్షి, అనంతపురం: తాడిపత్రిలో దారుణం చోటు చేసుకుంది. భార్యను భర్త వెంకటేశ్వరరెడ్డి వేట కొడవలితో నరికి చంపాడు. భార్య పుష్పావతి అక్కడికక్కడే మృతి చెందింది. తాడిపత్రి పట్టణంలోని హేమాద్రి లాడ్జిలో ఘటన జరిగింది. దంపతుల సమస్యలను పరిష్కరించేందుకు ఇరు వర్గాల పెద్దలు లాడ్జిలో సమావేశమయ్యారు. ఒంటరిగా మాట్లాడాలని చెప్పిన భర్త.. భార్యను హత్య చేశాడు. ఘటనపై పోలీసులు విచారణ చేపట్టారు.అనుమానాస్పదంగా మహిళ మృతికోనసీమ జిల్లా: రామచంద్రపురం మండలం తోటపేట గ్రామంలో ఈ నెల 12న దామిశెట్టి మహాలక్ష్మి (54) అనుమానాస్పదంగా మృతి చెందింది. సహజ మరణంగా భావించిన బంధువులు సంప్రదాయం ప్రకారం అంత్యక్రియలు నిర్వహించారు. అయితే ఆమె ఒంటిపై బంగారం లేదని, బంగారం కోసమే హత్య చేసి ఉంటారని ద్రాక్షారామ పోలీసులకు బంధువులు ఫిర్యాదు చేశారు. దీంతో పాతిపెట్టిన మహాలక్ష్మి మృతదేహాన్ని బయటకు తీశారు. స్మశానవాటిక వద్దనే వైద్యులు పోస్టుమార్టం నిర్వహించారు. అనుమానాస్పద మృతి కింద కేసుగా నమోదు చేసిన పోలీసులు.. దర్యాప్తు చేస్తున్నారు.ఇదీ చదవండి: జంట హత్యల కేసులో వీడిన మిస్టరీ -
చిత్తూరు వద్ద ఘోర బస్సు ప్రమాదం
చిత్తూరు, సాక్షి: జిల్లా శివారు వద్ద అర్ధరాత్రి ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. ఆగి ఉన్న టిప్పర్‌ను తప్పించబోయి ఓ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు బోల్తా పడింది. ఈ ఘటనలో నలుగురు మృతి చెందగా, 22 మందికి గాయాలయ్యాయి.చిత్తూరు శివారులో గంగాసాగరం(Gangasagaram) వద్ద అర్ధరాత్రి 2 గం. సమయంలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. తచ్చూరు హైవే నిర్మాణ పనుల్లో భాగంగా ఓ టిప్పర్ అక్కడ ఆగి ఉంది. అదే సమయంలో అతివేగంతో దూసుకొచ్చిన ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు(Private Travel Bus).. ఆ టిప్పర్‌ను తప్పించబోయి డివైడర్‌ను ఢీ కొట్టి పడిపోయింది. బస్సు తిరుపతి నుంచి మధురైకి వెళ్తున్నట్లు తెలుస్తోంది.ప్రమాదంపై సమాచారం అందుకున్న జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్(Sumit Kumar) ఘటన స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను చిత్తూరు జిల్లా ఆసుపత్రికి తరలించి మెరుగైన వైద్యం అందించాలని ఆదేశించారు. వీళ్లలో పలువురి పరిస్థితి విషమంగా ఉండడంతో.. సీఎంసీ వేలూరు ఆసుపత్రి కి తరలించారు. అతివేగమే ప్రమాదానికి కారణంగా తెలుస్తోంది.గంగసాగరం సమీపంలోని గాజుల పల్లి ఫ్లై ఓవర్ వద్ద టిప్పర్ లారీ వేగంగా ప్రవేట్ బస్సు ఢీ కొట్టడం తో ప్రమాదం జరిగింది. ప్రమాదానికి గురైన బస్సు తిరుపతి నుంచి మధురైకు వెళ్తోంది. రంగనాధన్ ఇన్ ట్రావెల్స్ బస్సు ఇది. నలుగురు స్పాట్లో చనిపోయారు. విషమంగా ఉన్న ఆరుగురిని చీలాపల్లి సి.ఏం.సి ఆసుపత్రి కు తలించాం. మిగిలిన వారు చిత్తూరు ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. :::శ్రీనివాసరావు, చిత్తూరు రూరల్ సీఐ -
పాకల బీచ్‌లో పెను విషాదం
సింగరాయకొండ: ప్రకాశం జిల్లా సింగరాయకొండ మండలం పాకల బీచ్‌లో గురువారం పెను విషాదం చోటుచేసుకుంది. సంక్రాంతి పండుగ అనంతరం తమ బంధువులు, స్నేహితులతో కలిసి రెండు బృందాలుగా సముద్ర స్నానానికి వచ్చినవారిలో ఆరుగురు గల్లంతయ్యారు. వారిలో ముగ్గురు మృతిచెందారు. ఇద్దరిని వారి స్నేహితులు, స్థానిక మత్స్యకారులు కాపాడారు. మరొకరి ఆచూకీ కోసం గాలిస్తున్నారు. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... పొన్నలూరు మండలం తిమ్మపాలెం గ్రామం శివన్నపాలేనికి చెందిన నోసిన మాధవ (24), అతని భార్య నవ్య (21), పిన్ని నోసిన సువర్ణరాణి, చెల్లెలు నోసిన జెస్సిక (13), మరదలు కందుకూరు మండలం కొళ్లగుంట గ్రామానికి చెందిన కొండాబత్తిన యామిని(14), మరో 10 మంది బంధువులతో కలిసి ఆటోలో పాకల బీచ్‌కు వచ్చారు. మగవారు మూత్ర విసర్జన కోసం పక్కకు వెళ్లగా... మహిళలు ముందుగా సముద్రంలోకి దిగారు. వారు దిగిన ప్రాంతంలో చిన్నపాటి గుంతలు ఉన్నాయి. వాటిని గమనించకుండా వీరు ముందుకు వెళుతుండగా ఒక్కసారిగా అలలు ఉధృతంగా వచ్చి ముంచేశాయి. మాధవ, నవ్య, జెస్సిక, యామిని, సువర్ణరాణి సముద్రంలో కొట్టుకుపోయారు. సముద్రపు అలలపై దూరంగా నవ్య, సువర్ణరాణి తేలియాడుతూ కనిపించడంతో స్థానిక మత్స్యకారుడు సైకం శ్రీను, మాధవ స్నేహితుడు విశాల్ పడవలో వెళ్లి వారిని రక్షించి ఒడ్డుకు చేర్చారు. కొద్దిసేపటి తర్వాత మాధవ, జెస్సిక, యామిని మృతదేహాలు అలలపై కనిపించడంతో పోలీసులు బయటకు తీసుకొచ్చి కందుకూరు ఏరియా ఆస్పత్రికి తరలించారు. కాగా, పండుగ కోసం స్నేహితుడు మాధవతో కలిసి ఇక్కడికి వచ్చానని, ఆనందంగా గడిపామని, తిరిగి వెళ్లే ముందు ఈ దుర్ఘటన జరిగిందని తెలంగాణలోని మెదక్ జిల్లా వాడి గ్రామానికి చెందిన విశాల్ అనే యువకుడు కన్నీటిపర్యంతమయ్యాడు. తన కళ్లముందే ఐదుగురు సముద్రంలో మునిగిపోయారని, మత్స్యకారుల సహకారంతో ఇద్దరిని కాపాడామని, స్నేహితుడు మాధవ మరణించడం జీర్ణించుకోలేకపోతున్నానని ఆవేదన వ్యక్తంచేశాడు.స్నేహితులతో కలిసి వచ్చిన యువకుడు గల్లంతుఅదే సమయంలో సింగరాయకొండ శ్రీరాంనగర్ ప్రాంతానికి చెందిన తమ్మిశెట్టి పవన్ (22) కూడా తన స్నేహితులతో కలిసి సముద్ర స్నానం చేసేందుకు పాకల బీచ్‌కు వచ్చాడు. అలల ఉధృతికి పవన్ సముద్రంలో కొట్టుకుపోయాడు. అతని కోసం మెరైన్ పోలీసులు గాలిస్తున్నారు. పాకాల బీచ్‌ను రాష్ట్ర మంత్రి డోలా శ్రీ బాలవీరాంజనేయస్వామి, ఎస్పీ ఏఆర్ దామోదర్, ఒంగోలు ఆర్డీవో లక్ష్మీప్రసన్న పరిశీలించి మెరైన్ పోలీసులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. పవన్ ఆచూకీ తెలిసే వరకు అదనపు బోట్లతో గాలింపు చర్యలు చేపట్టాలని మెరైన్ పోలీసులకు ఎస్పీ దామోదర్ సూచించారు. -
కోడి పందెం ముసుగులో గొడవ.. వైఎస్సార్సీపీ నాయకుడి హత్య!
సాక్షి, ఎన్టీఆర్: ఏపీలో కూటమి పాలనలో వైఎస్సార్సీపీ యువనేత మణితేజ అనుమానస్పద మృతి తీవ్ర కలకలం రేపుతోంది. ప్రశాంతంగా ఉన్న నందిగామ నియోజకవర్గం ముప్పాళ్లలో టీడీపీ చిచ్చు పెడుతోంది. కోడిపందాల బరిలో జరిగిన గొడవలను అడ్డుపెట్టుకుని మణితేజను పచ్చ గూండాలే హత్య చేసినట్టు స్థానికులు చెబుతున్నారు. ఇక, మణితేజ మృతి విషయం తెలుసుకున్న వైఎస్సార్సీపీ నేతలు ఆసుపత్రికి చేరుకున్నారు.మణితేజ మృతి విషయం తెలుసుకుని నందిగామలోని ఆసుపత్రి వద్దకు వైస్సార్సీపీ నాయకులు చేరుకున్నారు. మణితేజ మృతదేహాన్ని ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షులు దేవినేని అవినాష్, మాజీ ఎమ్మెల్యే మొండితోక జగన్ మోహన్ రావు, జగ్గయ్యపేట నియోజకవర్గ ఇంఛార్జి తన్నీరు నాగేశ్వరరావు సహా పలువురు పరిశీలించారు.అనంతరం, దేవినేని అవినాష్ మాట్లాడుతూ.. మణితేజది ముమ్మాటికీ రాజకీయ హత్యే. మణితేజ మృతిపై మాకు అనేక అనుమానాలున్నాయి. మణితేజ కుటుంబం వైఎస్సార్సీపీలో క్రియాశీలకంగా ఉంటోంది. వారంతా పార్టీలో యాక్టివ్‌గా ఉండటం టీడీపీ నేతలు తట్టుకోలేకపోతున్నారు. ప్రశాంతంగా ఉన్న గ్రామాల్లో టీడీపీ చిచ్చు పెడుతోంది. కోడిపందాల బరిలో జరిగిన గొడవలను అడ్డుపెట్టుకుని మణితేజను పొట్టనపెట్టుకున్నారు. మణితేజ హత్యను టీడీపీ, పోలీసులు ప్రమాదంగా చిత్రీకరించేయత్నం చేస్తున్నారు. మణితేజ మృతదేహానికి ఫోరెన్సిక్ నిపుణులతో పోస్టుమార్టం చేయించాలి.ఈ ఘటనకు కారణమైన వారిని గుర్తించి వారిపై మర్డర్ కేసు నమోదు చేయాలి. మణితేజ కుటుంబానికి పార్టీ అన్ని విధాలా అండగా ఉంటుంది. మణితేజ మృతిపై ఉన్న అనుమానాలను నివృత్తి చేయాల్సిన బాధ్యత ప్రభుత్వం, పోలీసులదే. ఈ ప్రభుత్వానికి ఇంకా మిగిలింది మూడు సంక్రాంతులే. మళ్లీ వైఎస్ జగన్ అధికారంలోకి వస్తారు. తప్పుచేసిన వారికి చట్టపరంగా కచ్చితంగా శిక్ష పడేలా చేస్తాం. మణితేజ కుటుంబానికి చంద్రబాబు, పవన్, లోకేష్ సమాధానం చెప్పాలి. రెడ్ బుక్ ఇంకా తెరిచే ఉంది ముగిసిపోలేదని లోకేష్ అంటున్నాడు. మనుషుల ప్రాణాలు తీయడమేనా రెడ్ బుక్ అంటే అని ప్రశ్నించారు.అనంతరం, మాజీ ఎమ్మెల్యే మొండితోక జగన్మోహన్ రావు మాట్లాడుతూ.. మణితేజ మృతిని ప్రమాదంగా చిత్రీకరించారు. తలపై బలంగా కొట్టినట్లు చాలా స్పష్టంగా కనిపిస్తోంది. మణితేజ మృతిపై మాకు అనేక అనుమానాలున్నాయి. వైఎస్ జగన్ పుట్టినరోజు వేడుకలు చేసినందుకు మణితేజను పోలీసులు చాలా ఇబ్బంది పెట్టారు. ఇప్పుడు కోడిపందాల వద్ద గొడవ తర్వాత మణితేజ చనిపోయాడు. మణితేజ మృతిని హత్య కోణంలోనే దర్యాప్తు చేయాలని డిమాండ్ చేశారు.జగ్గయ్యపేట నియోజకవర్గ ఇంఛార్జి తన్నీరు నాగేశ్వరావు మాట్లాడుతూ.. మణితేజది ముమ్మాటికీ హత్యే. మణితేజ మృతిని హత్య కేసుగానే నమోదు చేయాలి. జగ్గయ్యపేట, నందిగామ నియోజకవర్గాల్లో ఇష్టానుసారంగా దాడులు చేస్తున్నారు. జై జగన్ అంటే కేసులు పెడుతున్నారు. వైఎస్సార్సీపీ ఫ్లెక్సీలను చించి తిరిగి మా పార్టీ కార్యకర్తలపైనే కేసు నమోదు చేస్తున్నారు. నందిగామ ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య దుర్మార్గంగా వ్యవహరిస్తున్నారు. పోలీసులను బెదిరిస్తూ వైఎస్సార్సీపీ కార్యకర్తలను వేధిస్తున్నారు’ అంటూ ఘాటు విమర్శలు చేశారు. -
పదేళ్లుగా భార్యను పుట్టింటికి పంపకపోవడంతో..
పెందుర్తి: భర్త వేధింపులు తాళలేక ఓ మహిళ ఆత్మహత్యకు పాల్పడిన ఘటన పెందుర్తి మండలం చింతగట్లలో చోటుచేసుకుంది. భర్త తరచూ భౌతికదాడికి పాల్పడడంతో తీవ్ర మనస్తాపానికి గురై తనువు చాలించింది. తమ కుమార్తె మృతికి కారణమైన ఆమె భర్తను కఠినంగా శిక్షించాలని మృతురాలి తల్లిదండ్రులు, బంధువులు గ్రామంలో ఆందోళనకు దిగారు. పోలీసులు కలుగజేసుకుని పరిస్థితిని చక్కదిద్దారు. వివరాలివీ.. చింతగట్ల గ్రామానికి చెందిన గనిశెట్టి కనకరాజుకు నర్సీపట్నం మర్రివలసకు చెందిన పార్వతితో 14 ఏళ్ల కిందట వివాహం జరిగింది. వీరికి ముగ్గురు పిల్లలు. భార్య పార్వతిని కనకరాజు నిత్యం వేధించేవాడు. ఈ క్రమంలో దాదాపు పదేళ్లుగా ఆమెను పుట్టింటికి కూడా వెళ్లనివ్వలేదు. నిత్యం ఏదో కారణంతో కొట్టేవాడు. ఈ నెల 11న కూడా పార్వతిని తీవ్రంగా కొట్టడంతో ఆమె మనస్తాపానికి గురై కార్ ఏసీ కూలెంట్ వాటర్ తాగింది. దీంతో కుటుంబ సభ్యులు ఆస్పత్రిలో చేరి్పంచగా, చికిత్స పొందుతూ మంగళవారం రాత్రి మృతి చెందింది. బుధవారం ఉదయం పోస్టుమార్టం నిర్వహించిన తరువాత ఆమె మృతదేహాన్ని గ్రామానికి తీసుకువచ్చారు. తమ కుమార్తె మృతికి కారణమైన కనకరాజును తీవ్రంగా శిక్షించాలని డిమాండ్ చేస్తూ మృతురాలి తల్లిదండ్రులు, బంధువులు ఆందోళన చేశారు. వెంటనే స్పందించిన పోలీసులు గ్రామానికి చేరుకుని పార్వతి కుటుంబ సభ్యులకు నచ్చజెప్పి, అంత్యక్రియలు నిర్వహించారు. కనకరాజు పోలీసుల అదుపులో ఉన్నట్లు సమాచారం. సీఐ కె.వి.సతీ‹Ùకుమార్ ఆధ్వర్యంలో కేసు దర్యాప్తు జరుగుతోంది. -
సత్యసాయి జిల్లాలో అమానుషం.. మహిళ జుట్టు కత్తిరించి, వివస్త్రను చేసి..
సాక్షి, శ్రీసత్యసాయి జిల్లా: పెనుకొండ మండలంలోని మునిమడుగు గ్రామంలో అమానుష ఘటన జరిగింది. మహిళ జుట్టు కత్తిరించి, వివస్త్రను చేసి దాడికి పాల్పడి పైశాచికంగా ప్రవర్తించారు. ప్రేమజంటకు సహకరించిందన్న అనుమానంతో కొందరు ఈ దుశ్చర్యకు పాల్పడ్డారు. బాధితురాలి బంధువులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు తెలిపారు. ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు బాధితురాలిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. -
తిరుమలలో విషాదం.. భవనంపై నుంచి పడి బాలుడు మృతి
సాక్షి, తిరుమల: తిరుమలలో విషాదం చోటుచేసుకుంది. ఆర్టీసి బస్ స్టేషన్ వద్ద పద్మనాభ యాత్రిక సదన్ భవనం నుంచి పడి రెండేళ్ల బాలుడు మృతి చెందాడు. వసతి సముదాయం (రెండో అంతస్తు) నుంచి బాలుడు కిందకి పడిపోయాడు. వైఎస్సార్ కడప జిల్లా చినచౌక్కు చెందిన శ్రీనివాసులు, కృష్ణవేణి దంపతుల కుమారుడు సాత్విక్(3)గా గుర్తించారు.తిరుమలలో ఇంటి దొంగలు చేతివాటంతిరుమలలో ఇంటి దొంగలు చేతివాటం ప్రదర్శిస్తున్నారు. రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శన నకిలీ టికెట్లతో దళారీలు.. భక్తులకు స్వామివారి దర్శనం చేయిస్తున్నారు. విజిలెన్స్ వింగ్ అధికారులకు అనుమానం రావడంతో వైకుంఠ క్యూ కాంప్లెక్స్ వద్ద నిలిపివేశారు. రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శన కౌంటర్ సిబ్బంది లక్ష్మీపతితో అగ్నిమాపక పీఎస్జీ మణికంఠ, భానుప్రకాష్ భక్తులను మోసగిస్తున్నారు. అగ్నిమాపక సిబ్బంది మణికంఠ సహాయంతో నకిలీ టికెట్లను తయారు చేస్తున్నారు. హైదరాబాద్, ప్రొద్దుటూరు, బెంగుళూరు భక్తులు సుమారు 11 మంది నుంచి రూ.19 వేలు వసూలు చేసినట్లు సమాచారం. -
‘దారి’తప్పిన పోలీసులు.. మూడ్ బాగోలేదంటూ సాఫ్ట్వేర్ ఇంజనీర్‌పై దాడి
సాక్షి, అనంతపురం: జిల్లాలో పోలీసులు దారి తప్పారు. చట్టాన్ని రక్షించాల్సిన పోలీసులే ఓ సాఫ్ట్వేర్ ఇంజనీర్‌పై దాష్టీకం చూపారు. సమాచారం అడిగితే విచక్షణారహితంగా దాడి చేసిన పోలీసుల వైనం సర్వత్రా విమర్శలకు దారి తీస్తోంది. అనంతపురం నగరానికి చెందిన యువకుడు ఇంతియాజ్ అహ్మద్ బెంగళూర్‌లో సాఫ్ట్ వేర్ ఇంజనీర్‌గా పనిచేస్తున్నారు. అనంతపురం ఆర్టీవో కార్యాలయం వద్ద నివసించే ఇంతియాజ్ ఇంట్లో చోరీ జరిగింది. ఇదే సమయంలో తన తల్లి అనారోగ్యంతో బాధపడుతున్నారు.తల్లికి ఇడ్లీ తెచ్చేందుకు సూర్యా నగర్ రోడ్డులోని ఓ హోటల్‌కు వెళ్లారు. ఇదే సమయంలో కానిస్టేబుల్ నారాయణస్వామి, హోం గార్డు దాదాపీర్ కనిపించడంతో సాఫ్ట్ వేర్ ఇంజినీర్ ఇంతియాజ్ వారితో మాట్లాడారు. తన ఇంట్లో చోరీ జరిగిందని.. తాను ఉన్న ఇళ్లు ఏ పోలీసు స్టేషన్ పరిధిలోకి వస్తుందని కానిస్టేబుల్ నారాయణస్వామిని అడిగారు. తన మూడ్ బాలేదని... తాను ఎలాంటి సమాచారం ఇవ్వలేనని కానిస్టేబుల్ నారాయణస్వామి.. ఇంతియాజ్‌పై ఆగ్రహం వ్యక్తం చేశారు. అంతటితో ఆగక అతనిపై విచక్షణారహితంగా దాడి చేశారు కానిస్టేబుల్. విచారించాల్సిన హోంగార్డు కూడా కానిస్టేబుల్ నారాయణస్వామికి మద్దతు ఇవ్వటంతో ఇద్దరూ కలిసి ఇంతియాజ్ పై దాడి చేసి కొట్టారు. అనంతపురం పోలీసుల దాష్టీకం సీసీ కెమెరాలలో రికార్డు అయింది. ఈ వీడియో సోషల్ మీడియా లో వైరల్ గా మారింది.పోలీసుల చేతిలో గాయపడిన ఇంతియాజ్ అహ్మద్‌కు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు అండగా నిలిచారు. అకారణంగా దాడి చేసిన పోలీసులపై కేసు నమోదు చేసి వెంటనే అరెస్ట్ చేయాలని అనంతపురం మేయర్ మహమ్మద్ వాసీం, ఇతర పార్టీ నేతలు డీఎస్పీ కి ఫిర్యాదు చేశారు.అనంతపురం జిల్లాలో పోలీసుల వైఖరి రోజు రోజుకూ వివాదాస్పదం అవుతోంది. అనంతపురం టవర్ క్లాక్ వద్ద ఇటీవల ఓ వ్యక్తి పై ట్రాఫిక్ కానిస్టేబుళ్లు దాడి చేశారు. అనంతపురం త్రీ టౌన్ పోలీస్ స్టేషన్ లో ఓ లాయర్ అనుమానాస్పదంగా మృతి చెందారు. ఈ ఘటనలు మరువకముందే ఇప్పుడు సాఫ్ట్ వేర్ ఇంజినీర్ ఇంతియాజ్ పై దాడి చేయడం పోలీసుల పనితీరును ప్రశ్నిస్తోంది.ఇదీ చదవండి: తిరుమల: బంగారు బిస్కెట్ చోరీ ఘటన కీలక మలుపు -
తిరుమల: బంగారు బిస్కెట్ చోరీ ఘటన కీలక మలుపు
తిరుమల: తిరుమల (Tirumala) పరకామణిలో బంగారు బిస్కెట్ (Gold biscuit) చోరీ ఘటన కీలక మలుపు తిరిగింది. ఇటీవల 100 గ్రాముల బంగారు బిస్కెట్ దొంగలిస్తూ పట్టుబడిన నిందితుడిని తిరుమల వన్‌టౌన్ పోలీసులు తమదైన శైలిలో విచారణ చేపట్టడంతో విస్తుపోయే నిజాలు వెలుగులోకి వచ్చాయి. తిరుపతికి చెందిన వీరిశెట్టి పెంచలయ్య శ్రీవారి పరకామణిలో అగ్రిగోస్ కంపెనీ ద్వారా కాంట్రాక్ట్ ఉద్యోగిగా రెండేళ్ల నుంచి పనిచేస్తున్నారు.ఇతను తొందరగా డబ్బు సంపాదించాలనే ఉద్దేశంతో ఏడాదిగా పరకామణిలోని గోల్డ్ స్టోరేజ్ గదిలో ఉంచే బంగారు వస్తువులను దొంగలిస్తూ వస్తున్నాడు. ఈ మేరకు అతనిపై నిఘా ఉంచగా.. ఈనెల 11న మధ్యాహ్నం గోల్డ్ స్టోరేజ్ గదిలో ఉన్న 100 గ్రాముల బంగారు బిస్కెట్‌ను దొంగలించి దానిని ట్రాలీకి ఉన్న పైపుల్లో దాచిపెట్టాడు. తనిఖీ సమయంలో టీటీడీ భద్రతా సిబ్బంది గుర్తించడంతో పెంచలయ్య పరారయ్యాడు.ఈ విషయమై టీటీడీ విజిలెన్స్ సిబ్బంది తిరుమల వన్‌టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో నిందితుడిని అదుపులోకి తీసుకుని పోలీసులు విచారించారు. విచారణలో మొత్తం 555 గ్రాముల బంగారు బిస్కెట్లు, బంగారు ఆభరణాలు మొత్తం 655 గ్రాములు, 157 గ్రాముల వెండి వస్తువులను స్వా«దీనం చేసుకున్నారు.ఇదీ చదవండి: అన్నదాత ఇంట కానరాని సంక్రాంతి -
తమ్ముళ్లతో కలిసి, భార్యను కడతేర్చాడు.. విషయం ఏమిటంటే!
మార్కాపురం: మార్కాపురం మండలం కుంట – జమ్మనపల్లి గ్రామాల మధ్య ఈ నెల 9వ తేదీ జరిగిన రోడ్డు ప్రమాదం కేసులో కుట్రకోణాన్ని వెలికితీశారు పోలీసులు. హత్యచేసి రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించేందుకు ప్రయత్నించిన ఈ కేసులో ఇద్దరు నిందితులను అరెస్టు చేసి టిప్పర్‌ను స్వాధీనం చేసుకున్నట్లు మార్కాపురం డీఎస్పీ నాగరాజు తెలిపారు. ఆదివారం సాయంత్రం స్థానిక డీఎస్పీ కార్యాలయంలో సీఐ సుబ్బారావుతో కలిసి ఏర్పాటు చేసిన ప్రెస్మీట్లో ఆ వివరాలను డీఎస్పీ వెల్లడించారు. ఈ కేసును సవాలుగా తీసుకుని తమ ఎస్సై అంకమరావు, సిబ్బంది దర్యాప్తు చేపట్టి 3 రోజుల్లోనే సంఘటనకు కారణమైన ఇద్దరిని అరెస్టు చేశామన్నారు. మరొకరిని త్వరలో అరెస్టు చేస్తామని చెప్పారు. డీఎస్పీ తెలిపిన వివరాల ప్రకారం..కొత్తపల్లి గ్రామానికి చెందిన ఈర్నపాటి సుబ్బలక్ష్మమ్మకు 30 ఏళ్ల క్రితం ఈర్నపాటి వెంకటేశ్వర్లుతో వివాహమైంది. వీరికి ఇద్దరు పిల్లలు. 2005లో తిప్పనబోయిన వెంకట నారాయణతో తన భార్య సుబ్బలక్ష్మమ్మకు అక్రమ సంబంధం ఉందనే అనుమానంతో వెంకట నారాయణను గొడ్డలితో నరికి చంపడంతో 9 సంవత్సరాలు జైలు శిక్ష అనుభవించి 2019లో జైలునుంచి వెంకటేశ్వర్లు విడుదలయ్యాడు. అయితే, తన భార్య సుబ్బలక్ష్మమ్మ పద్ధతి మార్చుకోలేదని, కుటుంబ పరువు తీస్తోందని, ఆస్తి విషయంలో గొడవపడుతోందని, కేసులు పెట్టి ఇబ్బందులకు గురిచేస్తోందన్న కారణంతో సుబ్బలక్ష్మమ్మను చంపాలని భర్త పెద్ద వెంకటేశ్వర్లు, ఆయన ఇద్దరు తమ్ముళ్లైన చిన్న వెంకటేశ్వర్లు, వెంకట రమణ కలిసి నిర్ణయించుకున్నారు. సుబ్బలక్ష్మమ్మ కొన్నేళ్లుగా మార్కాపురం పట్టణంలో నివాసముంటూ దుస్తుల వ్యాపారం చేస్తోంది. అందులో భాగంగా ఈ నెల 9న సుబ్బలక్ష్మమ్మ కొత్తపల్లి గ్రామానికి వెళ్లి దుస్తులమ్ముకుని తన మేనకోడలైన ఏడుమళ్ల రాధ అలియాస్ రాధాంజలి (17)ని తన టూవీలర్‌పై ఎక్కించుకుని మార్కాపురం బయలుదేరింది. కోమటికుంట జంక్షన్‌కు 2 కిలోమీటర్ల దూరంలో ఉండగా, ముందుగా వేసుకున్న పథకం ప్రకారం సుబ్బలక్ష్మమ్మను తమ టిప్పర్‌తో ఢీకొట్టించి చంపాలనే ఆలోచనతో ఈర్నపాటి పెద్ద వెంకటేశ్వర్లు, చిన్న రమణయ్య ప్రోద్భలంతో చిన్న వెంకటేశ్వర్లు టిప్పర్ నడుపుకుంటూ వచ్చాడు. పథకం ప్రకారం స్కూటీని ఢీకొట్టడంతో సంఘటన స్థలంలోనే రాధాంజలి మృతి చెందింది. సుబ్బలక్ష్మమ్మ కూడా లారీ కింద పడి గాయాలతో ఉండటంతో ఆమె చనిపోలేదని భావించి చిన్న వెంకటేశ్వర్లు టిప్పర్ దిగి కర్రతో ఆమైపె హత్యాప్రయత్నం చేయబోయాడు. కానీ, రోడ్డుపై వెళ్తున్న జనాలు గమనించడంతో అక్కడే కర్ర వదిలి పారిపోయాడు. ఈ సంఘటనపై ముందుగా యాక్సిడెంట్ కేసు నమోదు చేశారు. అనంతరం కేసును లోతుగా దర్యాప్తు చేసి కుట్రకోణం బయటకు రావడంతో హత్యకేసుగా మార్చారు. పూర్తిగా దర్యాప్తు చేసి ఆదివారం చిన్న వెంకటేశ్వర్లు, రమణయ్యలను అదుపులోకి తీసుకొని విచారించారు. వారు నేరం ఒప్పుకోవడంతో అరెస్టు చేసినట్లు డీఎస్పీ తెలిపారు. నిందితులిద్దరినీ కోర్టులో హాజరుపరుస్తామన్నారు. మరో నిందితుడైన పెద్ద వెంకటేశ్వర్లును త్వరలో అరెస్టు చేస్తామని చెప్పారు. ఈ కేసు దర్యాప్తు చేపట్టి 3 రోజుల వ్యవధిలో నిందితులను అరెస్టు చేసిన సీఐ సుబ్బారావు, రూరల్ ఎస్సై అంకమరావును ఎస్పీ దామోదర్ అభినందించినట్లు తెలిపారు. -
నాలుగేళ్ల చిన్నారిపై బాలుడి లైంగిక దాడి
యలమంచిలి రూరల్: మొబైల్లో పోర్న్ వీడియో చూసిన ఓ 13 ఏళ్ల బాలుడు నాలుగేళ్ల చిన్నారిపై లైంగికదాడికి పాల్పడ్డాడు. అనకాపల్లి జిల్లా యలమంచిలి మండలం ఏటికొప్పాకలో ఈ ఘటన జరిగింది. బాలిక కుటుంబ సభ్యులు, పోలీసులు తెలిపిన వివరాలు.. గ్రామంలో టీడీపీ వార్డు సభ్యురాలి కుమారుడు స్థానిక జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 8వ తరగతి చదువుతున్నాడు. శనివారం తన ఇంటికి సమీపంలో ఆడుకుంటూ బాలికను సమీపంలో ఉన్న డాబాపైకి తీసుకెళ్లి లైంగిక దాడికి పాల్పడ్డాడు. బాలిక ఏడ్చుకుంటూ ఇంటికి వెళ్లడం, రక్తస్రావం కావడంతో కుటుంబ సభ్యులు చిన్నారిని ప్రశ్నించగా.. జరిగిన విషయం చెప్పింది.బాలుడు చేసిన అఘాయిత్యాన్ని తల్లికి చెప్పి మందలిద్దామని వెళ్లిన బాలిక కుటుంబీకులపైనే బాలుడి తల్లి ఎదురుదాడికి దిగింది. మీ ఇష్టం వచ్చింది చేసుకోండంటూ నిర్లక్ష్యంగా సమాధానమిచ్చింది. దీంతో శనివారం రాత్రే యలమంచిలి రూరల్ పోలీసులకు బాలిక కుటుంబీకులు ఫిర్యాదు చేశారు. అయితే అఘాయిత్యానికి పాల్పడిన బాలుడి తల్లి, బంధువులు టీడీపీకి చెందిన వారు కావడంతో ఆదివారం ఉదయం వరకూ కేసు నమోదు చేయలేదు.అనంతరం వైఎస్సార్సీపీ నేతలు పోలీసులను ప్రశ్నించడంతో ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. బాలికను విశాఖ కేజీహెచ్‌కు తరలించి వైద్య పరీక్షలు నిర్వహించారు. బాలుడిని పోలీసులు అదుపులోకి తీసుకుని ఇలాంటి పని ఎందుకు చేశావంటూ ప్రశ్నించారు. తన తల్లి మొబైల్ ఫోన్లో ఓ పోర్న్ వీడియో చూసి ఈ ఘాతుకానికి పాల్పడినట్టు బాలుడు చెప్పడంతో పోలీసులు విస్తుపోయారు. బాలిక కుటుంబానికి వైఎస్సార్సీపీ పరామర్శవైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు బాలిక కుటుంబాన్ని పార్టీ నేత మాజీ ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ పరామర్శించారు.అఘాయిత్యానికి పాల్పడ్డ బాలుడి తల్లి టీడీపీ నాయకురాలు కావడం, బాధితులనే ఆమె బెదిరిస్తోందని తెలుసుకున్న ధర్మశ్రీ.. బాలిక కుటుంబానికి భరోసా ఇచ్చారు. ఈ ఘటనపై హోం మంత్రి వంగలపూడి అనిత వెంటనే స్పందించాలని డిమాండ్ చేశారు. -
పండక్కి ఊరికి వస్తానంటివే.!
మదనపల్లె: ఈరోజు పనిచూసుకుని పండక్కి ఇంటికి వచ్చేస్తానమ్మా.. అమ్మను ఇబ్బంది పెట్టకండి. చక్కగా చదువుకోండి. వచ్చేటప్పుడు మీకు కావాల్సినవి తీసుకువస్తా అని చెప్పిన మా నాన్న ఎందుకు చనిపోయాడు అంటూ పిల్లలు ఏడుస్తున్న తీరు ప్రభుత్వాసుపత్రిలో పలువురిని కలచివేసింది. మదనపల్లె మండలం సీటీఎం స్పిన్నింగ్ మిల్లులో పాత భవనాలను తొలగిస్తుండగా, ప్రమాదవశాత్తు భవనం గోడ హిటాచీ వాహనం మీద పడి డ్రైవర్ వాహనంలోనే ప్రాణాలు కోల్పోయిన ఘటన శనివారం జరిగింది. గోడ ఒక్కసారిగా వాహనం మీద పడటంతో డ్రైవర్ శరీరం వాహనంలో ఇరుక్కుపోయి రక్తసిక్తమైంది. వైఎస్సార్ జిల్లా వల్లూరు మండలం కుమారునిపల్లెకు చెందిన నారాయణరెడ్డి, జయమ్మ దంపతుల కుమారుడు ఎస్.రమేష్‌రెడ్డి(40) హిటాచీ డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. ఉపాధి నిమిత్తం కదిరి పట్టణం అడపాలవీధి పంచాయతీ కార్యాలయం సమీపంలో నివసిస్తున్నాడు. ఇతనికి భార్య ప్రవీణ, కుమార్తెలు సాహితి(13), భవ్యశ్రీ(11), కుమారుడు రోచన్రెడ్డి(4) ఉన్నారు. స్థానికుడైన ఎస్వీ కన్స్ట్రక్షన్స్ యజమాని, కాంట్రాక్టర్ శ్రీకాంత్‌రెడ్డి వద్ద 15 ఏళ్లుగా రమేష్‌రెడ్డి హిటాచీ డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. రెండునెలల క్రితం సీటీఎం స్పిన్నింగ్ మిల్లు భవనాల తొలగింపు, చదును పనుల కోసం రమేష్‌రెడ్డి ఇక్కడకు వచ్చి పని చేస్తున్నాడు. పనులు దాదాపు చివరిదశకు చేరుకున్నాయి. కేవలం ఐదురోజుల పని మాత్రమే మిగిలి ఉంది. ఈ క్రమంలో శనివారం పనిచేసి, పండుగకు ఇంటికి వస్తానని రమేష్‌రెడ్డి కుటుంబ సభ్యులకు శుక్రవారం రాత్రి ఫోన్ చేసి చెప్పాడు. అయితే శనివారం ఉదయం హిటాచీతో స్పిన్నింగ్ మిల్లులోని పాత భవనాన్ని తొలగిస్తుండగా, శిథిల స్థితిలో ఉన్న పెద్దగోడ అటువైపు పడుతుందనే ఆలోచనతో, హిటాచీతో నెట్టుతుండగా, ప్రమాదవశాత్తు వాహనం మీద పడిపోయింది. డ్రైవర్ సీటులో ఉన్న రమేష్‌రెడ్డి అక్కడికక్కడే దుర్మరణం పాలై గోడ శిథిలాల కింద చిక్కుకుపోయి రక్తమోడుతూ వాహనంలోనే ఇరుక్కుపోయాడు. ప్రమాదంలో హిటాచీ వాహనం ధ్వంసమైంది. గమనించిన తోటిపనివారు పోలీసులకు, కాంట్రాక్టర్ శ్రీకాంత్‌రెడ్డి, కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. సంఘటన స్థలానికి చేరుకున్న డీఎస్పీ దర్బార్ కొండయ్య నాయుడు, పోలీస్ సిబ్బంది, స్థానికుల సహాయంతో శిథిలాలను తొలగించి, వాహనంలో ఇరుక్కుపోయిన రమేష్‌రెడ్డి మృతదేహాన్ని బయటకు తీశారు. ఘటనకు సంబంధించిన వివరాలను అక్కడ ఉన్న వారిని అడిగి తెలుసుకున్నారు. పోస్ట్‌మార్టం నిమిత్తం మృతదేహాన్ని మదనపల్లె ప్రభుత్వ జిల్లా ఆస్పత్రికి తరలించారు. రమేష్‌రెడ్డి భార్య ప్రవీణ ఫిర్యాదు మేరకు తాలూకా పోలీసులు కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నట్లు డీఎస్పీ తెలిపారు. కాగా, సమాచారం అందుకున్న కుటుంబ సభ్యులు మదనపల్లె ప్రభుత్వ జిల్లా ఆస్పత్రికి చేరుకుని రమేష్‌రెడ్డి మృతదేహాన్ని చూసి తల్లడిల్లిపోయారు. కుటుంబానికి పెద్దదిక్కుగా ఉన్న యజమాని గుర్తుపట్టలేని స్థితిలో శవమై పడి ఉండటాన్ని చూసిన భార్య, పిల్లలు గుండెలవిసేలా రోదిస్తున్న తీరు పలువురిని కంటతడి పెట్టించింది. పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించారు. -
విజయవాడ- ఏలూరు హైవేపై ఘోర ప్రమాదం
సాక్షి, కృష్ణాజిల్లా: విజయవాడ- ఏలూరు హైవేపై ఘోర ప్రమాదం జరిగింది. రాంగ్ రూట్లో వేగంగా వచ్చి కారు.. మరో కారు ఢీకొట్టింది. ముందు భాగంలో కారు పూర్తిగా నుజ్జు నుజ్జు అయ్యింది. ఐదుగురి ప్రయాణీకుల పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. సంగారెడ్డి జిల్లా ఎద్దుమైలారం తోషిబా విద్యుత్ కంపెనీలో పని చేస్తున్న శివప్రసాద్‌కు చెందిన కారుగా గుర్తించారు. గన్నవరం పిన్నమనేని ఆసుపత్రికి క్షతగాత్రులను తరలించారు.మరో ఘటనలో...మరో ఘటనలో నిర్లక్ష్యానికి నిండు ప్రాణం బలైంది. నిత్యం వాహనాల రాకపోకలతో రద్దీగా ఉండే రహదారిపై ఓ వ్యక్తి నిర్లక్ష్యంగా ట్రాక్టర్ నడిపి మరో వాహన చోదకుడిని బలితీసుకున్నాడు. పట్టపగలు నడిరోడ్డు పై జరిగిన ఈ ఘటనలో వ్యక్తి మృతి దుర్మరణం చెందగా మరో మహిళ తీవ్రంగా గాయపడింది. మాచవరం పోలీస్ స్టేషన్ పరిధిలోని ఎస్ఆర్ఆర్ కళాశాల వద్ద ఏలూరు రోడ్డుపై శుక్రవారం ఈ ప్రమాదం చోటుచేసుకుంది.పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... ఏలూరు జిల్లా ఆగిరిపల్లి మండలం చిన ఆగిరిపల్లి ప్రాంతానికి చెందిన బడుగు సోమయ్య (54) వ్యవసాయం చేస్తుంటాడు. ఈయనకు భార్య నలుగురు పిల్లలు ఉన్నారు. వారిలో పెద్ద కుమార్తె మమతతో కలసి కోర్టు పనుల నిమిత్తమై ద్విచక్రవాహనంపై విజయవాడ వచ్చారు. ఏలూరు రోడ్డు గుణదల నుంచి చుట్టుగుంట వైపు వెళుతుండగా వెనుకగా వేగంగా వచ్చిన ట్రాక్టర్ ఢీ కొట్టింది. దీంతో బైక్‌పై వెళుతున్న సోమయ్య, మమత రోడ్డుపై పడిపోయారు. అంతటితో ఆగకుండా ఆ డ్రైవర్ తన ట్రాక్టర్‌ను ముందుకు నడిపాడు.ఈ ఘటనలో రోడ్డుపై పడి ఉన్న సోమయ్యపై ట్రాక్టర్ ఎక్కడంతో తీవ్రంగా గాయపడి రక్తపు మడుగులో పడి ఉన్నాడు. మమత కొద్ది దూరంలో పడగా ముఖానికి, చేతులకు గాయాలయ్యాయి. ఇది గమనించిన స్థానికులు 108 సహాయంతో బాధితులను వైద్యం నిమిత్తం గుణదలలోని ప్రభుత్వాసుపత్రికి తరలించారు. వైద్య పరీక్షలు చేసిన తరువాత సోమయ్య మృతి చెందినట్లు నిర్ధారించారు. మమతకు ప్రాణాపాయం లేదని ఆమె కోలుకునే అవకాశం ఉందని వైద్యులు తెలిపారు.సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు వివరాలు సేకరించి ప్రమాదానికి కారణమైన ట్రాక్టర్ డ్రైవర్ సాంబశివరావును అదుపులోకి తీసుకున్నారు. ట్రాక్టర్‌ను స్టేషన్‌కు తరలించారు. మృతుడి కుటుంబ సభ్యులు ప్రభుత్వాసుపత్రికి చేరుకుని కన్నీరు మున్నీరుగా విలపించారు. సోమయ్య కుమారుడు బడుగు దీపక్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు మాచవరం పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేశారు. కాగా నిర్లక్ష్యంగా ట్రాక్టర్‌ను నడిపి ఓ వ్యక్తి మృతికి కారణమైన డ్రైవర్ సాంబశివరావుపై కఠిన చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులో పేర్కొన్నారు. -
వైఎస్ అభిషేక్‌రెడ్డి మృతి
సాక్షి ప్రతినిధి, కడప: వైఎస్సార్సీపీ వైద్య విభాగం రాష్ట్ర కార్యదర్శి డాక్టర్ వైఎస్ అభిషేక్‌రెడ్డి (36) శుక్రవారం మృతి చెందారు. ఇతను వైఎస్ జగన్మోహన్రెడ్డి పెద్దనాన్న వైఎస్ ప్రకాష్ రెడ్డి మనవడు(వైఎస్ మదన్‌మోహన్‌రెడ్డి కుమారుడు). కొద్ది రోజులుగా డెంగీ జ్వరంతో బాధ పడుతూ హైదరాబాద్‌లోని ఏఐజీ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. శుక్రవారం సాయంత్రం పరిస్థితి విషమించి తుదిశ్వాస విడిచినట్లు వైద్యులు ధ్రువీకరించారు.హైదరాబాద్ నుంచి ఆయన పారి్థవదేహం రాత్రి పొద్దుపోయాక పులివెందుల చేరుకుంది. సౌమ్యుడు, వివాద రహితుడు, ఉన్నత విద్యావంతుడిగా అభిషేక్‌రెడ్డికి మంచి గుర్తింపు ఉంది. సన్నీగా ఈ ప్రాంత వాసులకు సుపరిచితుడు. ఆర్థోపెడిక్స్ వైద్యుడిగా రాణిస్తూనే రాజకీయాల్లో కూడా చురుగ్గా వ్యవహరించారు. శనివారం మధ్యాహ్నం వరకు కార్యకర్తలు, నాయకుల సందర్శనార్థం పులివెందులలోని స్వగృహంలో అభిషేక్‌రెడ్డి పారి్థవదేహాన్ని ఉంచనున్నారు. అనంతరం పులివెందులలోని వైఎస్ కుటుంబ సభ్యుల సమాధుల తోటలో అంత్యక్రియలు నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పాల్గొననున్నారు. అభిషేక్‌రెడ్డి మృతితో వైఎస్ కుటుంబంలో విషాద ఛాయలు నెలకొన్నాయి. కాగా, వైఎస్ అభిషేక్‌రెడ్డికి భార్య డాక్టర్ సౌఖ్య, పిల్లలు వైఎస్ అక్షర, వైఎస్ ఆకర్ష ఉన్నారు. -
ఫన్ బకెట్ భార్గవ్‌కు 20 ఏళ్ల జైలు
సాక్షి, విశాఖపట్నం: విశాఖ ఫోక్సో కోర్టు సంచలన తీర్పు చెప్పింది. బాలికను గర్భవతిని చేసిన కేసులో ఫన్ బకెట్ భార్గవ్(Fun Bucket Bhargav)కు 20 ఏళ్ల జైలు శిక్ష విధిస్తూ తీర్పునిచ్చింది. 2021లో పెందుర్తి పోలీస్ స్టేషన్లో బాధితులు ఫిర్యాదు చేశారు. టిక్ టాక్‌తో ఫేమస్ అయిన ఫన్ బకెట్ భార్గవ్.. వెబ్ సిరీస్‌లలో ఆఫర్ ఇప్పిస్తానని చెప్పి బాలికను మోసం చేశాడు. దీంతో విశాఖ పోక్సో కోర్టు.. భార్గవ్‌కి 20 ఏళ్ల జైలు శిక్ష, రూ.4 లక్షల జరిమానా విధించింది.14 ఏళ్ల బాలికను అత్యాచారం చేసిన కేసులో భార్గవ్‌ను టిక్‌టాక్ ఫేం ఫన్ బకెట్ భార్గవ్‌ను 2021లో పోలీసులు అరెస్ట్ చేశారు. టిక్‌టాక్ వీడియోల పేరుతో బాలికను లోబర్చుకొని, పలుమార్లు అత్యాచారం చేసినట్లు విశాఖ పీస్‌లో భార్గవ్‌పై కేసు నమోదయ్యింది.విజయనగరం జిల్లా కొత్తవలస ప్రాంతానికి చెందిన భార్గవ్ టిక్‌టాక్ వీడియోలతో ఫేమస్ అయిన సంగతి తెలిసిందే. అతనికి విశాఖ జిల్లా సింహగిరి కాలనీకి చెందిన 14 ఏళ్ల యువతితో చాటింగ్‌లో పరిచయం ఏర్పడింది. ఆ యువతికి సైతం టిక్‌టాక్ వీడియోలపై ఆసక్తి ఉండటంతో తరుచూ మాట్లాడుకునేవాళ్లు. విశాఖ విజయనగరం సరిహద్దులో ఉన్న సింహగిరి కాలనీ... భార్గవ్ గతంలో నివాసం ఉన్న ప్రాంతానికి దగ్గర కావడంతో వీరి మధ్య సాన్నిహిత్యం పెరిగింది.ఇదీ చదవండి: పుష్ప భామ శ్రీవల్లికి గాయం.. అసలేం జరిగిందంటే?ఈ పరిచయంతో మైనర్ బాలిక భార్గవ్‌ను అన్నయ్య అని పిలిచేది. అయితే ఇద్దరూ తరుచూ చాటింగ్ చేయడం, కలుసుకుంటుండంతో సాన్నిహిత్యం పెరిగింది. టిక్‌టాక్ వీడియోల పేరుతో భార్గవ్ ఆమెను లోబర్చుకున్నాడు. ఇటీవలె బాలిక శారీరక అంశాల్లో మార్పు గమనించిన ఆమె తల్లి డాక్టర్‌ను సంప్రదించగా యువతి అప్పటికే నాలుగు నెలల గర్భిణి అని తేలింది. ఇందుకు కారణం ఫన్ బకెట్ భార్గవ్ అని ఆరోపిస్తూ బాలిక తల్లి ఏప్రిల్ 16, 2021న పెందుర్తి పోలీసులను ఆశ్రయించింది. విశాఖ సిటీ దిశ ఏసిపి ప్రేమ్ కాజల్ ఆధ్వర్యంలో కేసు విచారణ కొనసాగింది. బాలికను భార్గవ్.. చెల్లి పేరుతో లోబర్చుకొని గర్భవతిని చేసినట్లు తేలింది. దీంతో ఇవాళ విశాఖ పోక్సో కోర్టు 20 ఏళ్ల జైలు శిక్ష విధిస్తూ తీర్పు చెప్పింది.ఇదీ చదవండి: అల్లు అరవింద్ బర్త్ డే సెలబ్రేట్ చేసిన పుష్పరాజ్.. పోస్ట్ వైరల్ -
శ్రీచైతన్య కాలేజీలో విద్యార్థిని అనుమానాస్పద మృతి
సాక్షి, కృష్ణా జిల్లా: తాడిగడప శ్రీచైతన్య కళాశాలలో విద్యార్థిని మృతి చెందింది. పిఠాపురం నియోజకవర్గం ఉప్పాడ గ్రామానికి చెందిన రామిశెట్టి గంగా భువనేశ్వరి.. నీట్లో కోచింగ్ తీసుకుంటోంది. కామినేని ఆసుపత్రికి విద్యార్థిని మృతదేహన్ని తరలించారు. కాగా, తమ కుమార్తె మృతిపై విద్యార్థిని తల్లి అనుమానం వ్యక్తం చేస్తున్నారు. మరో వైపు, కుమార్తె మృతి విషయం తెలుసుకున్న తండ్రికి గుండెపోటుకు గురయ్యారు. ఆయన పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం.విద్యార్ధి తల్లి గోవింద లక్ష్మి మీడియాతో మాట్లాడుతూ.. తన కుమార్తెకు ఎటువంటి ఆనారోగ్య సమస్యలు లేవని.. నిన్న రాత్రి కూడా తనతో ఫోన్లో మాట్లాడిందన్నారు. గత రాత్రి తన కుమార్తెకు తలనొప్పి వస్తే అర్ధరాత్రి ఆసుపత్రికి తీసుకెళ్లామని చెప్పారు. ఇప్పుడు చనిపోయింది అంటున్నారు.తలనొప్పి వస్తే ప్రాణం పోతుందా?. ఇప్పుడు నిర్లక్ష్యంగా శవాన్ని తీసుకువెళ్లమంటున్నారు’’ అంటూ ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. చనిపోయిన విషయం ఎందుకు దాచారు?. చనిపోయిందని ఆలస్యంగా ఎందుకు తెలిపారు?’’ అంటూ ఆమె ప్రశ్నించారు.ఇదీ చదవండి: తప్పు స్పెల్లింగ్‌తో నకిలీ కిడ్నాప్ గుట్టు రట్టు -
విద్యార్థినితో మాస్టారు అసభ్య చాటింగ్!
నందిగాం: నందిగాం మండలంలోని హరిదాసుపురం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో వ్యాయామ ఉపాధ్యాయుడు గత నెల 31రాత్రి ఓ విద్యార్థినితో అసభ్యంగా చాటింగ్ చేసిన ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. ఈ వ్య వహారం పోలీస్‌స్టేషన్‌కు చేరుకోవడంతో టీడీ పీ నేతలు రాజీయత్నాలకు దిగడం చర్చనీయాంశమైంది. వివరాల్లోకి వెళితే.. హరిదాసు పురం డ్రిల్ మాస్టారు డిసెంబరు 31 అర్ధరాత్రి పాఠశాలలో 9వ తరగతి చదువుతున్న బాలిక సెల్‌కు నూతన సంవత్సర శుభాకాంక్షల పే రుతో అసభ్య చాటింగ్ చేసినట్లు సమాచారం.అయితే బాలిక కుటుంబసభ్యులు చాటింగ్ చూసి, తర్వాత రోజు పాఠశాలకు వెళ్లి ప్రధానోపాధ్యాయుడు, కొంతమంది గ్రామస్తుల సమ క్షంలో డ్రిల్ మాస్టర్‌ను నిలదీయడమే కాకుండా నందిగాం పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశా రు. వ్యవహారం పోలీస్‌స్టేషన్‌కు చేరుకోవడంతో కొంతమంది తెలుగుదేశం నాయకులు ఉ పాధ్యాయు డు తరఫున వకల్తా పుచ్చుకుని రాజీ ప్రయత్నాలు ప్రారంభించారు. బాలిక తండ్రిపై తీవ్ర ఒత్తిడి తెస్తున్నా.. ససేమిరా అంటున్నట్లు తెలుస్తోంది.