Top Stories
ప్రధాన వార్తలు

Operation Sindoor: ఎవరీ కల్నల్ సోఫియా, వింగ్ కమాండర్ వ్యోమికా సింగ్
ఢిల్లీ: పహల్గాం ఉగ్రదాడి నేపథ్యంలో భారత దళాలు చేపట్టిన ఆపరేషన్ సిందూర్ విజయం వంతంగా ముగింది. పాకిస్తాన్‌తో పాటు పాక్ ఆక్రమిత కశ్మీర్లో మంగళవారం అర్ధ రాత్రి భారత భద్రతా దళాలు ఆర్మీ,నేవీలు సంయుక్తంగా ఆపరేషన్ సిందూర్‌ను చేపట్టాయి.ఆపరేషన్‌లో భాగంగా లక్షిత దాడుల్ని అరగంటలోపు నేలమట్టం చేసింది. 9స్థావరాల్లో ఉన్న 80 మందికి పైగా ఉగ్రవాదుల్ని మట్టిలో కలిపేశాయి. అనంతరం ఆపరేషన్ సిందూర్‌పై మీడియా సమావేశం జరిగింది. ఈ ఆపరేషన్‌కు సారధ్యం వహించిన భారత సశస్త్ర దళాల్లో ఇద్దరు సీనియర్ మహిళా అధికారులు వింగ్ కమాండర్ వ్యోమికా సింగ్, కర్నల్ సోఫియా ఖురేషీ,విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిస్రిలు మీడియా సమావేశంలో పాల్గొన్నారు. ఆపరేషన్ సిందూర్‌కు నాయకత్వం వహించిన సశస్త్ర దళాలకు నాయకత్వం వహించిన వింగ్ కమాండర్ వ్యోమికా సింగ్, కర్నల్ సోఫియా ఖురేషీలు ఉగ్రమూకల్ని ఎలా మట్టుబెట్టామన్నది వెల్లడించారు. దాడి దృశ్యాలకు సంబంధించిన వీడియోల్ని బహిర్ఘతం చేశారు. దీంతో ప్రపంచ మొత్తం ఈ ఇద్దరి మహిళా అధికారులు గురించి చర్చ మొదలైంది. ఎవరీ కల్నల్ సోఫియా ఖురేషీ, వింగ్ కమాండర్ వ్యోమికా సింగ్కల్నల్ సోఫియా ఖురేషీ(Colonel Sophia Qureshi) ఇండియన్ ఆర్మీలోని త్రివిధ దళాలలైన ఆర్మీలోని సిగ్నల్‌కోర్‌కి చెందిన కల్నల్ సోఫియా ఖురేషీ. అనేక సాహసోపేతమైన విజయాలతో సైనిక చరిత్రలో తన స్థానాన్ని సుస్థిర పరుచున్నారు. ఆర్మీ కల్నల్ హోదాలో ఆపరేషన్ సిందూర్‌కు ముందుండి నాయకత్వం వహించారు. ఫోర్స్ 18కు నాయకత్వం 2016 మార్చిలో అప్పటి లెఫ్టినెంట్ కర్నల్ ఖురేషీ భారత్ ఆతిథ్యమిచ్చిన ఫోర్స్ 18 అనే బహుళజాతీయ సైనిక విన్యాసంలో భారత సైన్యం తరఫున ఒక దళానికి నాయకత్వం వహించిన తొలి మహిళా అధికారిగా చరిత్ర సృష్టించారు. ఈ విన్యాసం మార్చి 2 నుండి 8 వరకు పుణేలో జరిగింది. ఇందులో ఆసియన్ దేశాలతో పాటు జపాన్, చైనా, రష్యా, యుఎస్, దక్షిణ కొరియా, న్యూజిలాండ్, ఆస్ట్రేలియా వంటి 18 దేశాలు పాల్గొన్నాయి. ఈ విన్యాసంలో పాల్గొన్న దళాల్లో, లెఫ్టినెంట్ కర్నల్ ఖురేషీ మాత్రమే మహిళా కమాండర్‌గా ఉండడం ఆమె నాయకత్వ నైపుణ్యానికి నిదర్శనం.పీస్ కీపింగ్ ఆపరేషన్స్‌లోనూఆమె నేతృత్వంలోని 40-సభ్యుల భారత దళం శాంతి భద్రతలను కాపాడేందుకు, సంఘర్షణ లేదా సంఘర్షణానంతర ప్రాంతాలకు సైనిక సిబ్బందిని మోహరించి ఉద్రిక్తత పరిస్థితులను తగ్గించే విభాగమే ఈ పీస్ కీపింగ్ ఆపరేషన్స్ (PKOs). ఈ పీకేవో ఆపరేషన్స్‌లో కీలక పాత్ర పోషించారు. హ్యూమానిటేరియన్ మైన్ యాక్షన్ (HMA) వంటి కీలక శిక్షణ కార్యక్రమాల్లో పాల్గొంది. దేశవ్యాప్తంగా అనుభవజ్ఞులైన పీస్ కీపింగ్ శిక్షణాదారులలోంచి ఆమెను ఎంపిక చేశారు.యుఎన్ శాంతి పరిరక్షణలో విశిష్ట అనుభవం2006లో, యుఎన్ శాంతి పరిరక్షణ మిషన్ (కాంగో) లో మిలిటరీ అబ్జర్వర్‌గా పనిచేశారు. 2010 నుంచి ఆమె పీకేవోలో కొనసాగుతూ వచ్చారు. అందులో ఆమె విశేష సేవలు అందిస్తున్నారు. సైనిక సేవ ఆమెకు వారసత్వంగా ఆమె తాత సైన్యంలో సేవలందించగా, ఆమె భర్త కూడా మెకనైజ్డ్ ఇన్ఫెంట్రీకి చెందిన అధికారి. ఈ విధంగా ఆమె కుటుంబం సైనిక సేవలతో ముడిపడిందివింగ్ కమాండర్ వ్యోమికా సింగ్ (Wing Commander Vyomika Singh)వింగ్ కమాండర్ వ్యోమికా సింగ్, భారత వైమానిక దళానికి చెందిన పైలట్. ఆపరేషన్ సిందూర్‌లో పాకిస్తాన్, పాకిస్తాన్ ఆక్రమిత కశ్మీర్లో ఉన్న ఉగ్రవాద శిబిరాలపై వైమానిక దాడులు ఈమె నేతృత్వంలోనే జరిగాయి. వ్యోమికా సింగ్ విషయానికొస్తే.. వ్యోమిక అంటే ఆకాశపు కుమార్తె అని అర్ధం. ఆ పేరులో ఆమె చిన్ననాటి కల ప్రతిబింబిస్తుంది. చిన్నప్పటి నుంచే ఆమెకు పైలట్ కావాలనే సంకల్పం ఉండేది. స్కూల్ రోజుల్లోనే ఆమె ఎన్సీసీలో చేరి, తరువాత ఇంజినీరింగ్ పూర్తి చేశారు. కుటుంబంలో మొదటిసారిగా సైన్యంలో చేరిన వ్యక్తిగా ఆమె పేరు గడించారు. 2019 డిసెంబర్ 18న, ఆమెకు శాశ్వత కమిషన్ లభించి, హెలికాప్టర్ పైలట్‌గా ఐఏఎఫ్‌లో ఆమె ప్రయాణం అధికారికంగా ప్రారంభమైంది.చల్లని గాలుల మధ్య నుండి మసక చీకట్ల వరకూ అన్నీ సాహసాలే వింగ్ కమాండర్ వ్యోమికా సింగ్ ఇప్పటివరకు 2,500కు పైగా ఫ్లయింగ్ గంటలు పూర్తి చేశారు. చేతక్, చీటాహ్ వంటి హెలికాప్టర్లను నడిపుతూ, జమ్మూ కాశ్మీర్ లోని ఎత్తయిన ప్రాంతాలు నుండి, ఈశాన్య భారతదేశంలోని గిరిజన ప్రాంతాల వరకూ సేవలందించారు. 2020లో అరుణాచల్ ప్రదేశ్‌లో, ప్రాణాపాయ పరిస్థితుల్లో సామాన్యులను రక్షించేందుకు ఆమె ఒక కీలకమైన రెస్క్యూ ఆపరేషన్‌ను విజయవంతంగా నిర్వహించారు. 2021లో ఆమె మౌంట్ మనిరంగ్ (21,650 అడుగుల ఎత్తు) పైకి ప్రయాణించిన త్రివిధ దళాల మహిళా ఎక్సపిడిషన్‌లో పాల్గొన్నారు.ఆపరేషన్ సిందూర్ తర్వాత పహల్గాంలో 26 మంది సాధారణ పౌరుల హత్యకు ప్రతీకారంగా భారత్ చేపట్టిన ఆపరేషన్ సిందూర్ అనంతరం నిర్వహించిన మీడియా సమావేశంలో, దేశానికి సమాచారం ఇవ్వడమే కాక, భారత సైన్యం ఇప్పుడు ఎవరిచేత ప్రాతినిధ్యం వహించబడుతోంది అన్న దానిలో స్పష్టమైన మార్పును వింగ్ కమాండర్ సింగ్ చూపించారు.

సింహాచలం బాధితులకు అండగా వైఎస్సార్సీపీ.. రెండు లక్షలు అందజేత
సాక్షి, విశాఖ: సింహాచలం గోడ కూలి మరణించిన వారి కుటుంబాలకు వైఎస్సార్సీపీ అండగా నిలిచింది. వైఎస్సార్సీపీ తరఫున బాధితులకు రెండు లక్షల పరిహారం ప్రకటించింది. ఈ క్రమంలో బాధిత కుటుంబాలకు పార్టీ నేతలు గుడివాడ అమర్నాథ్, మజ్జి చిన్న శ్రీను, కేకే రాజు.. రెండు లక్షలు అందజేశారు.ఈ సందర్భంగా మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ మాట్లాడుతూ..‘చనిపోయిన ప్రతి కుటుంబానికి వైఎస్సార్సీపీ అండగా ఉంటుంది. పార్టీ అధినేత వైఎస్ జగన్ ఆదేశాల మేరకు రెండు లక్షల ఆర్థిక సహాయం బాధిత కుటుంబాలకు అందించాము. సింహాచలం కొండపై ప్రమాదానికి సంబంధించి దేవాదాయ శాఖ మంత్రి రాజీనామా చేయాలి. ఎండోమెంట్ కమిషనర్‌ను సస్పెండ్ చేయాలి. చనిపోయిన వారి కుటుంబ సభ్యులకు ప్రభుత్వ ఉద్యోగాలు ఇవ్వాలి. దేవాలయాలలో ఇలాంటి ఘటనలు జరగడం వల్ల భక్తులు భయాందోళనకు గురవుతున్నారు. ప్రభుత్వం నిర్లక్ష్యం వలనే ప్రమాదం జరిగింది. ఐదుగురు మంత్రులతో కమిటీ వేసి ఏడుగురి ప్రాణాలు తీశారు. దేవాలయాలకు వెళ్లలంటేనే భక్తులు భయపడే పరిస్థితులు తీసుకువచ్చారు. కూటమి పాలన తీరుతో భక్తులు భయపడుతున్నారు అంటూ వ్యాఖ్యలు చేశారు.

ఆపరేషన్ సిందూర్ అప్డేట్స్.. రేపు కేంద్రం అఖిలపక్ష సమావేశం
Indian Army Operation Sindoor Updates.. రేపు కేంద్రం అఖిలపక్ష సమావేశంవివరాలు వెల్లడించిన పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజురేపు ఉదయం 11 గంటలకు పార్లమెంట్ కాంప్లెక్స్‌లోని పార్లమెంట్ లైబ్రరీ భవనంలోని అఖిలపక్ష సమావేశం ఏర్పాటుఆపరేషన్ సిందూర్ వివరాలు అఖిలపక్షానికి వివరించనున్న కేంద్రంభారత్ పాక్ సరిహద్దుల వద్ద ఉద్రిక్తతలు, సరిహద్దు భద్రత, సైనిక సన్నద్ధత విషయాలను అఖిలపక్ష నేతలకు వివరించనున్న కేంద్రం ముగిసిన కేబినెట్ సమావేశం..పాక్ ఉగ్ర స్థావరాలపై ఆపరేషన్ గురించి కేబినెట్ సహచరులకు వివరించిన ప్రధానికేబినెట్లో భద్రతా బలగాలను కీర్తించిన ప్రధాని మోదీరాష్ట్రపతి నిలయానికి ప్రధాని మోదీ.రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు ఆపరేషన్ సిందూర్‌పై వివరించనున్న ప్రధాని. ప్రధాని నివాసం నుంచి వెళ్లిపోయిన అమిత్ షా, రాజ్‌నాథ్ సింగ్ #WATCH | Defence Minister Rajnath Singh and Union Home Minister Amit Shah leave from 7, LKM, the official residence of PM Modi pic.twitter.com/U0rmI5nkEC— ANI (@ANI) May 7, 2025 మోదీ విదేశీ పర్యటనలు రద్దు.. మీడియా సమావేశం..ప్రధాని నరేంద్ర మోదీ తన విదేశీ పర్యటనలను రద్దు చేసుకున్నారు.మూడు దేశాల పర్యటన రద్దు అయ్యింది.నార్వే, క్రొయేషియా, నెదర్లాండ్ పర్యటన రద్దుప్రధాని మోదీ మీడియా సమావేశం..భారత్ ఎన్నో విజయాలు సాధిస్తోంది.అంతరిక్ష ప్రయోగాలపై మోదీ సందేశం.అంతరిక్ష రంగంలో స్టార్టప్‌లను ప్రోత్సహిస్తున్నాం.మంగళ్యాన్, చంద్రయాన్ వంటి ప్రయోగాలు విజయవంతంగా నిర్వహించాం. కేంద్ర కేబినెట్ భేటీ..కొనసాగుతున్న కేంద్ర కేబినెట్ సమావేశంఆపరేషన్ సిందూర్‌పై చర్చిస్తున్న కేబినెట్సరిహద్దుల్లో ఉద్రిక్తత పరిస్థితులపై సమీక్ష‘ఆపరేషన్ సిందూర్’పై ప్రపంచ నేతల స్పందన ఇదే..👉అమెరికా అధ్యక్షుడు ట్రంప్.. దీనికి వీలైనంత త్వరగా ముగింపు పలకాలి. రెండు శక్తిమంతమైన దేశాల మధ్య యుద్ధం ఎవరూ కోరుకోరు. భారత్, పాక్‌లకు ఎంతో చరిత్ర ఉంది. వీటి మధ్య ఎన్నో ఉద్రిక్తతలు ఉన్నాయి. అయితే ప్రపంచానికి శాంతి కావాలి. ఘర్షణలు వద్దు.👉అమెరికా విదేశాంగ కార్యదర్శి మార్కో రూబియో స్పందన.. భారత్- పాకిస్థాన్‌ల మధ్య పరిస్థితిని నిశితంగా పరిశీలిస్తున్నాం. శాంతియుత పరిష్కార దిశగా చర్చలు జరపాలి👉భారత్‌లోని ఇజ్రాయెల్ రాయబారి రూవెన్ అజార్.. ఆత్మ రక్షణ కోసం భారత్ దాడి చేస్తోంది. అమాయకులపై దాడి చేసి దాక్కోవడం కుదరదనే విషయాన్ని ఉగ్రవాదులు తెలుసుకోవాలి. భారత్‌కు మా మద్దతు ఉంటుంది.👉యూఏఈ ఉప ప్రధానమంత్రి షేక్ అబ్దుల్లా బిన్ జాయెద్.. భారత్-పాక్ మధ్య ఘర్షణలను ప్రపంచం భరించలేదు. సంయమనం పాటించాలి. ఉద్రిక్తతలు తగ్గించుకోవాలి. శాంతియుతంగా సమస్యను పరిష్కరించుకోవాలి👉చైనా స్పందన.. భారత్, పాక్ రెండూ దాయాది దేశాలు. ఇవి రెండూ చైనాకు పొరుగు దేశాలే. చైనా అన్నిరకాలుగా ఉగ్రవాదాన్ని వ్యతిరేకిస్తుంది. శాంతి, స్థిరత్వంతో భవిష్యత్తు ప్రయోజనాల కోసం వ్యవహరించాలని ఇరు దేశాలను కోరుతున్నాం. ప్రశాంతంగా ఉంటూ సంయమనం పాటించాలి. పరిస్థితిని మరింత క్లిష్టతరం చేసే చర్యలను దూరంగా ఉండాలని భారత్, పాకిస్థాన్‌లను కోరుతున్నాం👉ఐక్యరాజ్య సమితి సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెరస్.. రెండు దేశాల సైనికులు సంయమనం పాటించాలి. పౌరులను చంపడం భావ్యం కాదు: ఒమర్ అబ్దుల్లాపహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారంగా ఆపరేషన్ సిందూర్ చేపట్టిన భారత బలగాలుపాక్ మిలిటరీ, పౌరులకు ఎలాంటి హాని తలపెట్టకుండా ఉగ్ర శిబిరాలపై దాడిఅయినప్పటికీ పాక్ అన్యాయంగా పౌరులపై దాడి చేసి 10 మందిని పొట్టనపెట్టుకుందని విమర్శ.అమిత్ షా కీలక ఆదేశాలు..సెలవులో ఉన్న పారా మిలిటరీ బలగాలను వెనక్కి రప్పించండిఆపరేషన్ సిందూర్ నేపథ్యంలో పారా మిలిటరీ బలగాలకు ఆదేశాలు జారీ చేసిన కేంద్ర హోంమంత్రి అమిత్ షాసెలవులో ఉన్న వారిని వెనక్కి రప్పించాలని పేర్కొన్న అమిత్ షా ఆపరేషన్ సిందూర్‌పై మీడియా సమావేశం ప్రారంభంమీడియా సమావేశంలో మాట్లాడుతున్న విదేశాంగశాఖ కార్యదర్శి విక్రమ్ మిస్రీ, కల్నల్ సోఫియా ఖురేషీ, వింగ్ కమాండర్ వ్యోమికా సింగ్ఉగ్రవాదాన్ని కూకటివేళ్లతో పెకలిస్తాం: అమిత్ షాభారత్, ప్రజలపై దాడి చేస్తే నరేంద్ర మోదీ ప్రభుత్వం తగిన విధంగా బుద్ధి చెబుతుంది.పహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత బలగాలు ఆపరేషన్ సిందూర్ చేపట్టాయని వెల్లడిఆర్మీ బలగాలను చూసి గర్విస్తున్నానని పోస్టు పెట్టిన అమిత్ షాజమ్ముకశ్మీర్ సీఎంతో మాట్లాడిన అమిత్ షాఆపరేషన్ సిందూర్ తర్వాత స్పందిస్తున్న కేంద్ర పెద్దలు..ప్రస్తుత పరిస్థితిపై చర్చించిన కేంద్ర హోంమంత్రి అమిత్ షా, జమ్మూకశ్మీర్ సీఎం ఒమర్ అబ్దుల్లాకశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా, బీఎస్ఎఫ్ డీజీతోనూ చర్చించిన అమిత్ షాసరిహద్దు భద్రతపై ఒమర్ అబ్దుల్లా సమీక్షపౌరుల ప్రాణాలను కాపాడటానికి ప్రాధాన్యత ఇవ్వాలని సూచించిన సీఎంఅత్యవసర పరిస్థితుల్లో వేగంగా స్పందించాలని అధికారులకు ఆదేశంజేపీ నడ్డా వార్నింగ్..మా జోలికొస్తే ఊరుకుంటామా అంటూ నడ్డా వ్యాఖ్యలు..ఆపరేషన్ సిందూర్‌తో భారత బలగాలు పహల్గాం ఉగ్రదాడికి దీటైన జవాబు ఇచ్చాయి.భారత గడ్డపై దాడి చేసిన వారికి కఠిన శిక్ష విధిస్తామని నరేంద్ర మోదీ చెప్పిన విషయాన్ని గుర్తు చేసిన నడ్డాఉగ్రవాదం అనే పీడను విరగడ చేస్తామని పోస్టు పెట్టిన నడ్డారక్షణ మంత్రితో సీడీఎస్ భేటీరక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌తో భేటీ అయిన సీడీఎస్ అనిల్ చౌహాన్సౌత్ బ్లాక్‌లో పరిస్థితిని వివరిస్తున్న అనిల్ చౌహాన్ త్రివిధ దళాల మీడియా సమావేశం..ఉదయం 10:30 కు ఆపరేషన్ సిందూర్‌పై మీడియా సమావేశంసమావేశంలో పాల్గొననున్న రక్షణ, విదేశాంగ, ఆర్మీ ప్రతినిధులుఉగ్ర శిబిరాలపై భారత్ మెరుపు దాడులను వివరించనున్న ఆర్మీ.ఐదు భారత్ ఫైటర్ జెట్లను కూల్చేశామని చెబుతున్న పాకిస్తాన్Graphic representation of the targets taken by the Indian Armed Forces under #OperationSindoor in Pakistan and PoJK https://t.co/cEasBn51U9 pic.twitter.com/HMONRGQxWW— ANI (@ANI) May 7, 2025 ఆపరేషన్ సిందూర్‌పై స్పందించిన ఖర్గే..పాకిస్తాన్ మరియు పిఓకె నుండి ఉత్పన్నమయ్యే అన్ని రకాలఉగ్రవాదానికి వ్యతిరేకంగా భారతదేశం దృఢమైన జాతీయ విధానాన్ని కలిగి ఉంది.పాకిస్తాన్, పీవోకేలో ఉగ్రవాద శిబిరాలపై భారత దళాల దాడి పట్ల చాలా గర్వపడుతున్నాం.భారత ఆర్మీ దృఢ సంకల్పం మరియు ధైర్యాన్ని మేము అభినందిస్తున్నాము.జాతీయ ఐక్యత, సంఘీభావం ఈ సమయంలో అవసరంభారత జాతీయ కాంగ్రెస్ మన సాయుధ దళాలకు అండగా నిలుస్తుంది.మన నాయకులు గతంలో మార్గాన్ని చూపించారు.జాతీయ ఆసక్తి మాకు అత్యున్నతమైనది. India has an unflinching National Policy against all forms of terrorism emanating from Pakistan and PoK. We are extremely proud of our Indian Armed Forces who have stuck terror camps in Pakistan and PoK. We applaud their resolute resolve and courage. Since the day of the…— Mallikarjun Kharge (@kharge) May 7, 2025ఆపరేషన్ సిందూర్‌పై సీఎం రేవంత్ రెడ్డి స్పందన.భారతీయ పౌరుడిగా మన సాయుధ దళాలతో బలంగా నిలబడి ఉండాలి...పాకిస్తాన్, పీవోకేలో ఉగ్రవాద స్థావరాల పై ఆర్మీ జరిపిన దాడి మానకు గర్వకారణం.జాతీయ ఐక్యత కోసం అందరం కలిసి పనిచేద్దాంఈ సమయంలో మనమందరం ఒకే గొంతులో మాట్లాడదాం.. జై హింద్!#ఆపరేషన్ సిందూర్As an Indian citizen first, standing strongly with our armed forces. The strikes against terror factories in Pakistan & PoK make us proud. Let us make this a moment for national solidarity and unity, and all of us speak in one voice - Jai Hind!#OperationSindoor— Revanth Reddy (@revanth_anumula) May 7, 2025 భారత్‌కు ఇజ్రాయెల్ మద్దతు..ఆపరేషన్ సిందూర్‌పై స్పందించిన భారత్‌లోని ఇజ్రాయెల్ రాయబారిఆత్మ రక్షణ నిమిత్తం దాడి చేసే హక్కు భారత్‌కు ఉందన్న ఇజ్రాయెల్ఆత్మరక్షణ కోసం భారత్ దాడి చేస్తోందని, దానికి తమ మద్దతు ఉంటుందని తెలిపిన రూవెన్ అజర్‌అమాయకులపై దాడి చేసి దాక్కోవడం కుదరదనే విషయాన్ని ఉగ్రవాదులు తెలుసుకోవాలన్న రూవెన్‌భారత్ దాడుల్ని స్వాగతిస్తున్నాం: అసదుద్దీన్ ఒవైసీ ఆపరేషన్ సిందూర్‌పై స్పందించిన అసదుద్దీన్ ఒవైసీ పాకిస్థాన్‌లోని ఉగ్ర స్థావరాలపై భారత్ చేసిన మెరుపు దాడుల్ని స్వాగతిస్తున్నాంపహల్గాం లాంటి మరో దాడి జరగకుండా సరైన గుణపాఠం చెప్పారుపాకిస్తాన్ ఉగ్రభూతాన్ని తరిమికొట్టాల్సిందే.. జైహింద్ मैं हमारी रक्षा सेनाओं द्वारा पाकिस्तान में आतंकवादी ठिकानों पर किए गए लक्षित हमलों का स्वागत करता हूँ। पाकिस्तानी डीप स्टेट को ऐसी सख्त सीख दी जानी चाहिए कि फिर कभी दूसरा पहलगाम न हो। पाकिस्तान के आतंक ढांचे को पूरी तरह नष्ट कर देना चाहिए। जय हिन्द! #OperationSindoor— Asaduddin Owaisi (@asadowaisi) May 7, 2025 ఆపరేషన్ సిందూర్‌పై రాహుల్ గాంధీ స్పందన ఇదే..ట్విట్టర్ వేదికగా రాహుల్ పోస్ట్‘మన సాయుధ దళాలను చూసి గర్విస్తున్నా. జై హింద్’ Proud of our Armed Forces. Jai Hind!— Rahul Gandhi (@RahulGandhi) May 7, 2025 భారత సైన్యానికి మా మద్దతు: కాంగ్రెస్‌పాక్‌లోని ఉగ్ర స్థావరాలే లక్ష్యంగా ఆపరేషన్ సిందూర్ చేపట్టిన భారత సైన్యంసైన్యం చర్యలకు మద్దతు ఇస్తున్నామని తెలిపిన కాంగ్రెస్ సీనియర్ నేత జైరాం రమేశ్ ఆపరేషన్ సిందూర్‌పై కేంద్ర మంత్రి జైశంకర్ పోస్ట్ఉగ్రవాదాన్ని సహించకూడదన్న కేంద్ర మంత్రి జైశంకర్‌ఆపరేషన్ సిందూర్ నేపథ్యంలో ప్రపంచం ఉగ్రవాదాన్ని సహించకూడదని వ్యాఖ్యలుసరిహద్దుల నుంచే దాడులు.. ఆపరేషన్ సిందూర్‌పై 10 గంటలకు మీడియా సమావేశంభారత సరిహద్దుల నుంచే ఉగ్రస్థావరాలపై దాడులుఆపరేషన్ సిందూర్.. భారత ఆర్మీ, ఎయిర్ ఫోర్స్, నేవీ సంయుక్త ఆపరేషన్‌ఖచ్చితంగా ఛేదించేందుకు డ్రోన్లు, ఇతర ఆయుధాలు వాడినట్లు పేర్కొన్న భారత భద్రతా వర్గాలుఇంటెలిజెన్స్ వర్గాల సహకారంతో దాడిభారత భూభాగం నుంచే దాడులు నిర్వహించినట్లు పేర్కొన్న ఆర్మీ వర్గాలు ఆపరేషన్ సిందూర్‌లో 80 టెర్రరిస్టుల మృతిఆపరేషన్ జరిగిన ప్రాంతాలు1. మర్కజ్ సుభాన్ అల్లా, బహవల్పూర్ - జేఎం2. మర్కజ్ తైబా, మురిద్కే - LeT3. సర్జల్, తెహ్రా కలాన్ - జెఎం4. మెహమూనా జోయా, సియాల్కోట్ - HM5. మర్కజ్ అహ్లే హదీస్, బర్నాలా - LeT6. మర్కజ్ అబ్బాస్, కోట్లి - జెఇఎం7. మస్కర్ రహీల్ షాహిద్, కోట్లి - HM8. షావాయి నల్లా క్యాంప్, ముజఫరాబాద్ - LeT9. సయ్యద్నా బిలాల్ క్యాంప్, ముజఫరాబాద్ - జేఎంసరిహద్దుల్లో టెన్షన్..భారత్-పాకిస్తాన్ సరిహద్దుల్లో టెన్షన్ టెన్షన్సరిహద్దుల్లో ఎయిర్ డిఫెన్స్ సిస్టంను ఆక్టివేట్ చేసిన భారత్రాఫెల్ యుద్ధ విమానాలతో మిసైల్స్ ఉపయోగించిన భారత్తమ భూభాగంలో ఆరు చోట్ల దాడులు జరిగాయని, ఎనిమిది మంది చనిపోయారని అంగీకరించిన పాకిస్తాన్దాడులపై అమెరికాకు ఫిర్యాదు చేసిన పాకిస్తాన్తమకు అన్ని విషయాలపై సమాచారం ఉందన్న అమెరికాఉదయం 10 గంటలకు ఆర్మీ మీడియా సమావేశంమెరుపు దాడులకు సంబంధించిన వివరాలను వెల్లడించనున్న ఆర్మీబహవల్పూర్ లోని జైషే మహమ్మద్ హెడ్ క్వార్టర్స్ పై భారత్ మెరుపు దాడిమురిడీకే లోని హఫీజ్ సయ్యద్ ఉగ్రస్తావరాన్ని ధ్వంసం చేసిన భారత్మురిడీకే లోని భారీ ఎత్తున ఉగ్రవాదులకు శిక్షణ ఇస్తున్న జైషే మహమ్మద్ఉగ్రస్థావరాలను ధ్వంసం చేసిన ఆర్మీభారత్ ఆర్మీ దాడి చేసిన ప్రాంతాలు ఇవే.. ఆపరేషన్ సిందూర్ పేరుతో ఉగ్ర శిబిరాలపై దాడులు..పాకిస్తాన్లో నాలుగు, పీవోకేలో ఐదు ప్రాంతాల్లో భారత సైన్యం దాడులు.తొమ్మిది ఉగ్ర స్థావరాలను ధ్వంసం చేసిన ఇండియన్ ఆర్మీ,కోట్లీ, బహ్వాల్పూర్, ముజఫరాబాద్‌లో క్షిపణి దాడులు.బహ్వల్‌పూర్‌లో 30 మంది ఉగ్రవాదులు హతం.పీవోకేతో పాటు పాక్‌లో ఉగ్ర మౌలిక సదుపాయాలు ధ్వంసంత్రివిధ దళాల సమస్వయంతో మెరుపు దాడులు.భారత్ దాడుల్లో పాక్ ఆర్మీ ఐఎస్ఐ కంట్రోల్ రూమ్ ధ్వంసంఅర్ధరాత్రి 1:44 నిమిషాలకు భారత సైన్యం దాడులు.200 ఎకరాల్లో ఉగ్రవాద శిబిరాలపై భారత్ మెరుపు దాడులు. Operation Sindoor UPDATES: Here is the list of nine terror facility locations in Pakistan and Pakistan-occupied Kashmir that have been successfully neutralised-1. Markaz Subhan Allah, Bahawalpur - JeM2. Markaz Taiba, Muridke - LeT3. Sarjal, Tehra Kalan - JeM4. Mehmoona Joya,… pic.twitter.com/Q3Q6vyw0Sa— Press Trust of India (@PTI_News) May 7, 2025 పాక్ అప్రమత్తం.. విమానాశ్రయాలు మూసివేతఅప్రమత్తమైన పాక్ డిఫెన్స్ వ్యవస్థలుభారత్ దాడులతో పాక్ అప్రమత్తమైంది.లాహోర్, సియాల్కోట్ ఎయిర్‌పోర్ట్‌లను 48 గంటల పాటు మూసివేసింది.हम जो कहते हैं, वो डेफिनिटली करते हैं...भारतीय सुरक्षा बलों ने पाकिस्तान के आतंकी ठिकानों पर मिसाइल हमला किया।पाकिस्तान में 9 आतंकी ठिकाने पूरी तरह तबाह!भारतीय सेना कहा"पहलगाम का न्याय हुआ..."#OperationSindoorभारत माता की जय! 🇮🇳 pic.twitter.com/0Gve2IVl6J— Ankit Kumar Avasthi (@kaankit) May 7, 2025 పాక్ ఉగ్రస్థావరాలపై భారత్ మెరుపు దాడులుపహల్గాం ఉగ్రదాడికి కౌంటర్‌గా పాక్ ఉగ్రస్థావరాలపై మెరుపుదాడులు చేపట్టిన భారత్‌తొమ్మిది చోట్ల దాడులు చేసినట్లు ప్రకటించిన భారత ప్రభుత్వంసోషల్ మీడియాలో వైరల్‌గా మారి దాడి ఘటన వీడియోలుभारतीय सेना ने पाकिस्तान के आतंकी ठिकानों पर मिसाइल हमला किया।#OperationSindoor के तहत पाकिस्तान में 8 आतंकी ठिकाने पूरी तरह तबाह!पहलगाम का न्याय हुआ... भारत माता की जय! 🇮🇳 pic.twitter.com/bzd6bu7IWd— Ajit Doval ᴾᵃʳᵒᵈʸ🇮🇳 (@IAjitDoval_IND) May 7, 2025 #WATCH | Indian Army tweets, ""प्रहाराय सन्निहिताः, जयाय प्रशिक्षिताः" Ready to Strike, Trained to Win.(Video Source: Indian Army) pic.twitter.com/5tJbfBX4Nk— ANI (@ANI) May 6, 2025భారత్ దాడులు.. పలు విమానాలు రద్దు శ్రీనగర్‌కు విమాన సర్వీసులు రద్దు చేసినట్లు తెలిపిన స్పైస్ జెట్‌ధర్మశాల, లేహ్, జమ్మూ, అమృత్సర్ విమానాశ్రయాల మూసివేతఉత్తరభారతంలోని పలు ఎయిర్‌పోర్టులు మూసివేతఉత్తర భారతంలోని పలు ఎయిర్‌పోర్టులను మూసివేస్తూకేంద్రం నిర్ణయంజమ్ము, శ్రీనగర్, ధర్మశాల, లేహ్, అమృత్సర్ విమానాశ్రయాలు తదుపరి ఆదేశాలు వచ్చే వరకు విమానాశ్రయాలు మూసివేతకేంద్రం నిర్ణయంతో ఆయా ఎయిర్‌పోర్టుల్లో విమాన సేవలకు అంతరాయం పాక్ ఉగ్ర స్థావరాలు ధ్వంసం..అంతర్జాతీయ సరిహద్దుకు 100 కి.మీ దూరంలో ఉన్న బహవల్పూర్లో ఉన్న జైషే మహ్మద్ ప్రధాన కార్యాలయంతొమ్మిది ఉగ్రస్థావరాలను ధ్వంసం చేసిన భారత సైన్యంఅంతర్జాతీయ సరిహద్దుకు 100 కి.మీ లోపు ఉన్న స్థావరాలపై టార్గెట్ చేసిన భారత్‌మురిడ్కే, సాంబా ఎదురుగా సరిహద్దుకు 30 కి.మీ దూరంలో ఉన్న లష్కరే క్యాంప్‌సరిహద్దు నియంత్రణ రేఖ పూంఛ్- రాజౌరీకి 35 కి.మీ దూరంలో ఉ్న గుల్పూర్‌పాక్ ఆక్రమిత కశ్మీర్‌లోని తంగ్ధర్ సెక్టార్ లోపల 30కి.మీ పరిధిలో ఉన్న సవాయ్ లష్కరే క్యాంప్‌జేఎం లాంచ్‌ప్యాడ్ బిలాల్ క్యాంప్‌రాజౌరీకి ఎదురుగా నియంత్రణ రేఖకు 15 కి.మీ.ల దూరంలో ఉన్న జేఎం లాంచ్‌ప్యాడ్ బిలాల్ క్యాంప్‌రాజౌరీకి ఎదురుగా నియంత్రణ రేఖకు 10.కి.మీ పరిధిలో ఉన్న బర్నాలా క్యాంప్‌సాంబా-కతువా ఎదురుగా అంతర్జాతీయ సరిహద్దుకు 8కి.మీ దూరంలో ఉన్న సర్జల్ క్యాంప్. ఇది జేఎంకు ఒక క్యాంప్.అంతర్జాతీయ సరిహద్దు కు 15 కిమీ దూరంలో సియాల్కోట్ సమీపంలో ఉన్న హెచ్ఎం శిక్షణా శిబిరం మెహమూనా క్యాంప్👉పహల్గాం దాడికి భారత్ ప్రతీకారం తీర్చుకుంది. మంగళవారం అర్ధరాత్రి దాటిన తరువాత ‘ఆపరేషన్ సిందూర్’ పేరిట పీవోకేతో పాటు పాకిస్తాన్‌లోని ఉగ్రవాద శిబిరాలపై భారత్ వైమానిక దాడులు జరిపింది. మొత్తం 9 ఉగ్ర స్థావరాలను ధ్వంసం చేసినట్టు వెల్లడించింది. ఈ దాడిలో దాదాపు 30 మంది ఉగ్రవాదులు మృతి చెందారని భారత సైన్యం చెప్తున్నారు. కానీ కేవలం 8 మంది మాత్రమే మృతి చెందారని పాకిస్తాన్ అంటుంది. మొత్తం 55 మందికి పైగా గాయపడ్డారు.👉పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్‌లోని కోట్లి, ముజఫరాబాద్, పంజాబ్‌లోని బహవల్పూర్తో పాటు లాహోర్ లోని ఒక ప్రదేశంపై భారత్ క్షిపణి దాడులు జరిపింది. ఈ సందర్భంగా ‘ఎయిర్ టు సర్ఫేస్’ మిసైళ్లను ప్రయోగించారు. 👉దాడి అనంతరం ‘న్యాయం జరిగింది.. జైహింద్’ అంటూ భారత్ సైన్యం ‘ఎక్స్’లో పోస్ట్ చేసింది. ఇవి సర్జికల్ స్ట్రైక్స్ కాదు. భారత భూభాగంనుంచే అత్యంత కచ్చితత్వంతో చేసిన దాడులని వెల్లడించింది. 👉పహల్గాందాడిలో ఉగ్రవాదులు పురుషులను మాత్రమే ఎంచుకుని కాల్చి చంపి ఎందరో మహిళల నుదుటి సిందూరం తుడిచేసిన కారణంగానే ఆపరేషన్‌కు ‘సిందూర్’ అని నామకరణం చేశారు. మసూద్ అజర్, హఫీజ్ సయీద్ ప్రధాన స్థావరాలు లక్ష్యంగా ఈ దాడులు జరిగాయని తెలుస్తోంది. భారత దాడి అనంతరం పాకిస్తాన్లో ఎమర్జెన్సీ ప్రకటించారు. విమానాశ్రయాలు మూసివేశారు. 👉కాగా దాడులను ధృవీకరించిన పాకిస్తాన్ ప్రతీకార దాడులు చేస్తామంటూ ప్రకటించింది. అర్ధరాత్రి 1:44కు ఈ దాడులు జరిగినట్టు ఎక్స్‌లో అధికారికంగా పోస్ట్ చేసిన భారత సైన్యం. దాడి అనంతరం భారత్ మాతాకీ జై అంటూ ఎక్స్‌లో పోస్ట్ పెట్టిన రాజ్‌నాద్ సింగ్. అయితే దాడుల పై పూర్తి వివరాలు త్వరలో వెల్లడిస్తామని రక్షణ శాక పేర్కొంది. ఈ దాడులను ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్న ప్రధాని నరేంద్ర మోదీ.భారత్ తడాఖా.. ఆపరేషన్ సిందూర్‌తో పాకిస్తాన్ విలవిల (ఫొటోలు)👉: (ఫోటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి)

ముంబై ఇండియన్స్‌కు భారీ షాక్!.. ఆశిష్ నెహ్రానూ వదల్లేదు
ఓటమి బాధలో ఉన్న ముంబై ఇండియన్స్‌కు మరో భారీ షాక్ తగిలింది. కెప్టెన్ హార్దిక్ పాండ్యా (Hardik Pandya)తో పాటు జట్టు మొత్తానికి జరిమానా విధిస్తున్నట్లు ఐపీఎల్ పాలక మండలి ప్రకటన విడుదల చేసింది. ఐపీఎల్-2025 (IPL 2025)లో భాగంగా ముంబై మంగళవారం గుజరాత్ టైటాన్స్ (MI Vs GT)తో తలపడింది.ప్లే ఆఫ్స్ రేసులో సాఫీగా ముందుకు సాగాలంటే తప్పక గెలవాల్సిన ఈ మ్యాచ్‌లో ముంబై బ్యాటర్లు తేలిపోయారు. ఫలితంగా నిర్ణీత 20 ఓవర్లలో 155 పరుగులకు హార్దిక్ సేన పరిమితమైంది.గెలిచిన గుజరాత్ఇక గుజరాత్ లక్ష్య ఛేదనకు దిగగా పదే పదే వర్షం అంతరాయం కలిగించింది. అయితే, ఎట్టకేలకు అర్ధరాత్రి తర్వాత వాన తెరిపినవ్వడంతో డక్‌వర్త్ లూయిస్ పద్ధతి ప్రకారం 19 ఓవర్లలో 147 పరుగులు చేయాల్సి ఉండగా.. గుజరాత్ పని పూర్తి చేసింది. ముంబైపై మూడు వికెట్ల తేడాతో గెలుపొందింది.కాగా ఈ మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ నిర్ణీత 20 ఓవర్లలో బౌలింగ్ కోటా పూర్తి చేయలేకపోయింది. దీంతో స్లో ఓవర్ రేటు మెయింటెన్ చేసిన కారణంగా భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI).. ముంబై కెప్టెన్ హార్దిక్ పాండ్యాకు భారీ జరిమానా విధించింది.రూ. 24 లక్షల ఫైన్ఈ సీజన్లో రెండోసారి ఇదే తప్పిదాన్ని పునరావృతం చేసినందుకు హార్దిక్‌కు రూ. 24 లక్షల ఫైన్ వేసింది. అదే విధంగా.. నిబంధనల ప్రకారం.. ఇంపాక్ల్ ప్లేయర్ సహా తుదిజట్టులోని ఆటగాళ్ల అందరికి రూ. 6 లక్షల జరిమానా లేదా వారి మ్యాచ్ ఫీజులో 25 శాతం కోత విధిస్తున్నట్లు తెలిపింది. ఈ రెండింటిలో ఏది తక్కువగా ఉంటే అది జరిమానాగా వర్తిస్తుందని వెల్లడించింది.మరోవైపు గుజరాత్ టైటాన్స్ హెడ్‌కోచ్ ఆశిష్ నెహ్రాకు కూడా ఎదురుదెబ్బ తగిలింది. అతడికి కూడా జరిమానా విధిస్తున్నట్లు ఐపీఎల్ పాలక మండలి తెలిపింది.ఆశిష్ నెహ్రాను వదల్లేదుఈ మేరకు.. ‘‘ఐపీఎల్ ప్రవర్తనా నియమావళిలోని నిబంధనలు ఉల్లంఘించినందుకు గానూ గుజరాత్ టైటాన్స్ హెడ్‌కోచ్ ఆశిష్ నెహ్రా మ్యాచ్ ఫీజులో 25 శాతం కోత విధిస్తున్నాం. అదే విధంగా అతడి ఖాతాలో ఓ డిమెరిట్ పాయింట్ జత చేస్తున్నాం’’ అని ఐపీఎల్ పాలక మండలి తమ ప్రకటనలో పేర్కొంది.ఐపీఎల్ నియమావళిలోని ఆర్టికల్ 2.20 ప్రకారం ఆశిష్ నెహ్రా లెవల్ 1 తప్పిదానికి పాల్పడ్డాడని.. క్రీడా స్ఫూర్తికి విరుద్ధంగా వ్యవహరించినందుకు ఈ మేర చర్యలు తీసుకున్నట్లు వెల్లడించింది. నెహ్రా కూడా తన తప్పును అంగీకరించాడని పేర్కొంది. అయితే, నెహ్రా ఏం తప్పు చేశాడన్న విషయంపై మాత్రం స్పష్టతనివ్వలేదు. కాగా వర్షం వల్ల పదే పదే మ్యాచ్ టైమింగ్‌ను మార్చడంపై మైదానంలోనే నెహ్రా అంపైర్లతో వాదనకు దిగాడు. అందుకే అతడికి జరిమానా వేసినట్లు తెలుస్తోంది.ఐపీఎల్-2025: ముంబై వర్సెస్ గుజరాత్👉వేదిక: వాంఖడే, ముంబై👉టాస్: గుజరాత్.. తొలుత బౌలింగ్👉ముంబై స్కోరు: 155/8 (20)👉గుజరాత్ స్కోరు: 147/7 (19)👉ఫలితం: డక్‌వర్త్ లూయీస్ పద్ధతి ప్రకారం ముంబైపై మూడు వికెట్ల తేడాతో గుజరాత్ గెలుపుచదవండి: టీ20 క్రికెట్లో అది నేరం లాంటిదే!.. ఏదేమైనా క్రెడిట్ మా బౌలర్లకే: ఓటమిపై హార్దిక్ Rain delays, wickets falling, and nerves running high 📈...@gujarat_titans edge past everything to seal a thrilling win over #MI that had fans on the edge of their seats! 🥳Scorecard ▶ https://t.co/DdKG6Zn78k #TATAIPL | #MIvGT pic.twitter.com/NLYj3ZlI3w— IndianPremierLeague (@IPL) May 6, 2025

Operation Sindoor : ఆపరేషన్ సిందూర్‌పై ఆర్మీ ఉన్నతాధికారుల ప్రెస్‌మీట్.. లైవ్
ఢిల్లీ: పాక్ ఉగ్రస్థావరాలపై ఇండియన్ ఆర్మీ దాడులు చేసింది. ఆపరేషన్ సిందూర్ పేరిట నిర్వహించిన దాడులపై భారత విదేశాంగ, రక్షణ శాఖ బుధవారం ఉదయం సంయుక్తంగా ప్రెస్‌మీట్ ఏర్పాటు చేసింది. ఈ ప్రెస్‌మీట్ ప్రారంభానికి ముందు భారత్‌పై పాక్ ఉగ్రవాదులు జరిపిన దాడుల తాలూకు వీడియోల్ని విడుదల చేసింది. అనంతరం, ప్రెస్ మీట్లో భారత విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిస్రీ,వింగ్ కమాండర్ వ్యోమికా సింగ్ పాల్గొన్నారు. ముందుగా విక్రమ్ మిస్రీ మీడియాతో మాట్లాడారు. ఆపరేషన్ సిందుపై మిస్రీ తర్వాత ఇండియన్ ఆర్మీ లెఫ్టినెంట్ కల్నల్ సోఫియా ఖురేషీ, వింగ్ కమాండర్ వ్యోమికా సింగ్ వివరాల్ని వెల్లడించారు. #WATCH | Delhi | #OperationSindoor| Foreign Secretary Vikram Misri says, " A group calling itself the Resistance Front has claimed responsibility for the attack. This group is a Front for UN proscribed Pakistani terrorist group Lashkar-e-Taiba...Investigations into the Pahalgam… pic.twitter.com/JqpIbHrttN— ANI (@ANI) May 7, 2025 ఆపరేషన్ సిందూర్‌పై ఆర్మీ ఉన్నతాధికారుల ప్రెస్‌మీట్..👉ఇండియన్ ఆర్మీ లెఫ్టినెంట్ కల్నల్ సోఫియా ఖురేషీ ఆపరేషన్ సిందూర్ 1.05 నిమిషాలకు ప్రారంభమై 1.30కి ముగిసింది9 ఉగ్ర స్థావరాల్ని ధ్వంసం చేశాంపాక్లో ఉన్న టెర్రర్ ఇండక్షన్‌లతో పాటు ట్రైనింగ్ సెంటర్లను ధ్వసం చేశాం అప్జన్ కసబ్కూడా ఇక్కడే ట్రైనింగ్ తీసుకున్నాడు.ఖచ్చితమైన ఇంటెలిజెన్స్ సమాచారంతో దాడులు చేశాం 👉విక్రమ్ మిస్రీఏప్రిల్ 22న పహల్గాంలో ఉగ్రదాడి జరిగింది. ఈ దాడిలో 26మంది టూరిస్టుల ప్రాణాలు తీశారులష్కరే తోయిబా అనుబంధ సంస్థ టీఆర్ఎఫ్ఏ ఈ దాడి చేసింది దాడిని సైతం సోషల్ మీడియా వేదికగా వెల్లడించింది. టీఆర్ఎఫ్కు పాకిస్తాన్ అండదండలున్నాయి.జమ్మూకశ్మీర్ అభివృద్ధిని అడ్డుకునేందుకే ఈ దాడులు చాలా కాలం నుంచి పాకిస్తాన్ ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తోందిఉగ్రవాదులను చట్టం ముందు శిక్షించాలిముంబై ఉగ్రదాడి తర్వాత దేశంలో పహల్గాం అతి పెద్ద ఉగ్రదాడిభారత్..పాక్‌కు వ్యతిరేకంగా అనేక నిర్ణయాలు తీసుకుంది.ఉగ్రసంస్థల మౌలిక వసతులను ధ్వంసం చేసేలా ఆపరేషన్ సిందూర్ జరిగిందిగతేడాది 2.3 కోట్ల మంది పర్యాటకులు జమ్మూ కాశ్మీర్ ను సందర్శించారుజమ్మూ కాశ్మీర్ పర్యాటకాన్ని ,ఆర్థిక అభివృద్ధిని దెబ్బతీసేందుకు పహల్గామ్ ఉగ్రదాడి జరిగిందిపాక్లో ఉన్న ఉగ్ర సంస్థల గురించి 2023 లో భారత్ ఐక్యరాజ్యసమితి దృష్టికి తీసుకెళ్ళిందిపాకిస్తాన్పై దౌత్య పరమైన ఆంక్షలు విధించాంఅయినప్పటికీ ఉగ్రవాద కార్యకలాపాలు ఆపలేదుఉగ్రదాడులు చేసిన వారికి పాక్ షెల్టర్ ఇస్తోందిసీమాంతర ఉగ్రవాదాన్ని అంతం చేసేందుకు భారత్ ఆపరేషన్ సిందూర్‌ను ప్రారంభించింది. ఏప్రిల్ 22, 2025న, పాకిస్తాన్,పాకిస్తాన్ శిక్షణ పొందిన లష్కర్-ఎ-తోయిబా ఉగ్రవాదులు జమ్మూ కశ్మీర్‌లోని పహల్గామ్లో భారతీయ పర్యాటకులపై దారుణమైన దాడి చేశారు. ఈ దాడిలో 26 మంది మరణించారు, వీరిలో ఒక నేపాల్ జాతీయుడు కూడా ఉన్నారు. 2008 నవంబర్ 26 ముంబై దాడుల తర్వాత ఇది అత్యధిక పౌర మరణాలతో కూడిన ఉగ్రదాడి. దాడి అత్యంత క్రూరంగా జరిగింది, బాధితులను సమీప నుండి తలపై కాల్చి చంపారు, వారి కుటుంబాల ముందే ఈ హత్యలు జరిగాయి. కుటుంబ సభ్యులను ఉద్దేశపూర్వకంగా భయపెట్టేలా హత్యలు జరిగాయి, సందేశాన్ని తీసుకెళ్లమని హెచ్చరించారు. జమ్మూ కశ్మీర్లో తిరిగి వస్తున్న సాధారణ స్థితిని అడ్డుకోవడం ఈ దాడి లక్ష్యం. గత సంవత్సరం 23 మిలియన్ల మంది పర్యాటకులు సందర్శించిన ఈ ప్రాంతంలో పర్యాటక ఆర్థిక వ్యవస్థను దెబ్బతీయడం దీని ఉద్దేశం. ఈ దాడి యూనియన్ టెరిటరీలో వృద్ధిని అడ్డుకుని, పాకిస్తాన్ నుండి సరిహద్దు ఉగ్రవాదానికి అనుకూల వాతావరణాన్ని సృష్టించాలనే లక్ష్యంతో జరిగింది. ఈ దాడి జమ్మూ కశ్మీర్‌తో పాటు దేశంలోని ఇతర ప్రాంతాల్లో మతపరమైన అసమ్మతిని రెచ్చగొట్టే ఉద్దేశంతో జరిగింది.భారత ప్రభుత్వం,ప్రజలు ఈ కుట్రలను విఫలం చేశారు. ‘ది రెసిస్టెన్స్ ఫ్రంట్ ” (TRF) అనే సంస్థ ఈ దాడికి బాధ్యత వహించింది. టీఆర్ఎఫ్ అనేది ఐక్యరాష్ట్ర సమితి నిషేధిత పాకిస్తాన్ ఉగ్రవాద సంస్థ లష్కర్-ఎ-తోయిబాకు ముసుగు. మే, నవంబర్ 2024లో ఐక్యరాష్ట్ర సమితి 1267 శిక్షణ కమిటీకి భారత్ TRF గురించి సమాచారం అందించింది, ఇది పాకిస్తాన్ ఆధారిత ఉగ్రవాద సంస్థలకు కవర్‌గా పనిచేస్తుందని తెలిపింది. డిసెంబర్ 2023లో లష్కర్, జైష్-ఎ-మహమ్మద్ టీఆర్ఎఫ్ టి చిన్న ఉగ్రవాద సంస్థల ద్వారా పనిచేస్తున్నట్లు భారత్ తెలిపింది. ఏప్రిల్ 25, 2025 ఐక్యరాష్ట్ర సమితి భద్రతా మండలి పత్రికా ప్రకటనలో TRF ప్రస్తావనను తొలగించాలని పాకిస్తాన్ ఒత్తిడి చేసింది పహల్గాం దాడి దర్యాప్తులో ఉగ్రవాదులు పాకిస్తాన్‌తో సంబంధాలు కలిగి ఉన్నట్లు తేలింది. TRF చేసిన బాధ్యత ప్రకటనలు, లష్కర్-ఎ-తోయిబా సోషల్ మీడియా హ్యాండిల్స్ ద్వారా వాటిని రీపోస్ట్ చేయడం దీనికి నిదర్శనం. సాక్షుల గుర్తింపు, చట్ట అమలు సంస్థలకు అందిన సమాచారం ఆధారంగా దాడి చేసినవారిని గుర్తించారు. ఈ దాడి ప్రణాళికకర్తలు, మద్దతుదారుల గురించి భారత ఇంటెలిజెన్స్ ఖచ్చితమైన సమాచారం సేకరించింది. భారత్‌లో సరిహద్దు ఉగ్రవాదాన్ని పెంపొందించడంలో పాకిస్తాన్ చరిత్ర బాగా డాక్యుమెంట్ చేయబడింది. పాకిస్తాన్ అంతర్జాతీయంగా నిషేధిత ఉగ్రవాదులకు స్వర్గధామంగా పేరుగాంచింది, ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్ వంటి అంతర్జాతీయ వేదికలను పాకిస్తాన్ తప్పుదారి పట్టిస్తుంది. సజిద్ మీర్ కేసు దీనికి ఉదాహరణ: ఈ ఉగ్రవాదిని మృతుడిగా ప్రకటించి, అంతర్జాతీయ ఒత్తిడి తర్వాత అతను బతికే ఉన్నాడని, అరెస్టు చేశామని తెలిపారు.పహల్గాం దాడి జమ్మూ కశ్మీర్‌తో పాటు భారతదేశంలో తీవ్ర ఆగ్రహాన్ని రేకెత్తించింది. ఏప్రిల్ 23న పాకిస్తాన్‌తో సంబంధాలకు సంబంధించి భారత ప్రభుత్వం ప్రాథమిక చర్యలను ప్రకటించింది. దాడి జరిగిన రెండు వారాలు గడిచినప్పటికీ, పాకిస్తాన్ తన భూభాగంలో ఉన్న ఉగ్రవాద మౌలిక సదుపాయాలపై ఎలాంటి చర్యలు తీసుకోలేదు, కేవలం ఆరోపణలు, తిరస్కరణలతో సరిపెట్టింది. పాకిస్తాన్ ఆధారిత ఉగ్రవాద గుండ్లు మరిన్ని దాడులకు ప్రణాళికలు వేస్తున్నట్లు భారత ఇంటెలిజెన్స్ గుర్తించింది.ఆపరేషన్ సిందూర్: ఈ ఉదయం భారత్ తన హక్కును వినియోగించుకుని, సరిహద్దు దాడులను నిరోధించడానికి, నివారించడానికి చర్యలు తీసుకుంది. ఈ చర్యలు నియంత్రిత, అనవసర ఉద్రిక్తత లేని, సమతూకమైన, బాధ్యతాయుతమైనవి. ఉగ్రవాద మౌలిక సదుపాయాలను ధ్వంసం చేయడం, భారత్‌కు పంపబడే ఉగ్రవాదులను అడ్డుకోవడంపై దృష్టి సారించారు. ఏప్రిల్ 25, 2025న ఐక్యరాష్ట్ర సమితి భద్రతా మండలి జారీ చేసిన పత్రికా ప్రకటనలో “ఈ దుర్మార్గపు ఉగ్రవాద చర్యకు కారకులు, నిర్వాహకులు, ఆర్థిక సహాయకులు, ప్రోత్సాహకులను జవాబుదారీగా చేసి న్యాయస్థానం ముందు తీసుకురావాలి’ అని నొక్కి చెప్పింది. కల్నల్ సోఫియా ఖురేషీ,వింగ్ కమాండర్ వ్యోమికా సింగ్ నేతృత్వంలో ఆపరేషన్ సిందూర్ విజయవంతంగా ముగిసిందని తెలిపారు. కల్నల్ సోఫియా ఖురేషీవింగ్ కమాండర్ వ్యోమికా సింగ్ #WATCH | #OperationSindoor | Terror site Markaz Subhan Allah, Bahawalpur, Pakistan, the headquarters of Jaish-e-Mohammed, targeted by Indian Armed Forces." pic.twitter.com/iM4s91ktb8— ANI (@ANI) May 7, 2025👉ఆపరేషన్ సిందూర్‌లో ఇండియన్ ఆర్మీ ధ్వంసం చేసిన పాక్ ఉగ్రవాద ట్రైనింగ్ సెంటర్లు ఇవే ఎల్ఈటీ-లష్కరే తోయిబా,జేఈఎం-జైషే మహమ్మద్, హెచ్ఎం-హిజ్బుల్ ముజాహిదీన్ 1. మర్కజ్ సుభాన్ అల్లా, బహవల్పూర్ - జేఎం2. మర్కజ్ తైబా, మురిద్కే - ఎల్ఈటీ3. సర్జల్, తెహ్రా కలాన్ - జెఎం4. మెహమూనా జోయా, సియాల్కోట్ - హెచ్ఎం5. మర్కజ్ అహ్లే హదీస్, బర్నాలా - ఎల్ఈటీ6. మర్కజ్ అబ్బాస్, కోట్లి - జెఇఎం7. మస్కర్ రహీల్ షాహిద్, కోట్లి - హెచ్ఎం8. షావాయి నల్లా క్యాంప్, ముజఫరాబాద్ - ఎల్ఈటీ9. సయ్యద్నా బిలాల్ క్యాంప్, ముజఫరాబాద్ - జేఎం #WATCH | Video shows multiple hits on the Mundrike and other terrorist camps in Pakistan and PoJKCol. Sofiya Qureshi says, "No military installation was targeted, and till now there are no reports of civilian casualties in Pakistan." pic.twitter.com/zoESwND7XD— ANI (@ANI) May 7, 2025

తాడిపత్రిలో టెన్షన్.. ఎస్పీ జగదీష్ తీరుపై చర్చ
సాక్షి, అనంతపురం: అనంతపురం ఎస్పీ జగదీష్ వివాదం చిక్కుకున్నారు. తాడిపత్రి వెళ్లేందుకు మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డికి హైకోర్టు అనుమతి ఇచ్చినప్పటికీ పోలీసులు మాత్రం ఓవరాక్షన్ చేస్తున్నారు. హైకోర్టు ఉత్తర్వులను అందజేసేందుకు ఎస్పీ జగదీష్‌ను కలిసేందుకు పెద్దారెడ్డి ప్రయత్నించినప్పటికీ ఆయన జాప్యం చేస్తున్నారు.వివరాల ప్రకారం.. తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి ఈనెల ఎనిమిదో తేదీన తాడిపత్రికి వెళ్లేందుకు సిద్ధమయ్యారు. తాడిపత్రికి వెళ్తున్నట్టు స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో తాను తాడిపత్రి వెళ్తేందుకు హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులను ఎస్పీ జగదీష్‌కు ఇచ్చేందుకు పెద్దారెడ్డి అపాయింమెంట్ తీసుకున్నారు. కానీ, పెద్దారెడ్డి మాత్రం ఎస్పీ అపాయింట్మెంట్కు అనుమతి ఇవ్వలేదు. గత మూడు రోజులుగా అపాయింట్మెంట్ ఇవ్వకుండా ఎస్పీ జగదీష్ జాప్యం చేస్తున్నారు. ఈ క్రమంలో డీఐజీ, ఎస్పీలకు వాట్సాప్ ద్వారా పెద్దారెడ్డి సమాచారం అందించారు. ఈనెల 8వ తేదీన తాడిపత్రి వెళ్తున్నట్లు స్పష్టం చేశారు. హైకోర్టు ఆదేశాల మేరకు భద్రత కల్పించాలని కోరారు. ఇక, పెద్దారెడ్డి తాడిపత్రికి వెళ్తున్న నేపథ్యంలో అక్కడ ఉద్రిక్తత నెలకునే అవకాశం ఉంది.ఇదిలా ఉండగా.. గత సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఘర్షణల కారణంగా పెద్దారెడ్డితో పాటు జేసీ ప్రభాకర్ రెడ్డిలు తాడిపత్రికి వెళ్లకూడదని నిబంధన విధించారు. అయితే, ఎన్నికల కౌంటింగ్ అనంతరం ప్రభాకర్ రెడ్డి తాడిపత్రి వెళ్లారు. ఈ క్రమంలోనే కేతిరెడ్డి పెద్దారెడ్డి పట్టణానికి వెళ్లేందుకు ప్రయత్నించగా పోలీసులు నిలువరించారు. దీంతో పెద్దారెడ్డి హైకోర్టును ఆశ్రయించగా.. తాడిపత్రికి వెళ్లడానికి ఇటీవల న్యాయస్థానం అనుమతించింది. ఆయనకు తగిన భద్రత కల్పించాలని పోలీసులను ఆదేశించింది.మరోవైపు.. మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి తాడిపత్రికి వెళ్లేందుకు హైకోర్టు అనుమతి ఇవ్వడాన్ని జేసీ ప్రభాకర్‌రెడ్డి వర్గం జీర్ణించుకోలేకపోతోంది. ఎలాగైనా పెద్దారెడ్డిని తాడిపత్రిలో అడుగుపెట్టనీయకూడదన్న ఉద్దేశంతో దాడులకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే జేసీ ప్రభాకర్‌రెడ్డి ఇంటి ఎదురుగా కేతిరెడ్డి పెద్దారెడ్డి ఇంటి సమీపంలో ఉన్న ప్రభుత్వ ఉన్నత పాఠశాల ఆట స్థలంలో జేసీ అనుచరులు టిప్పర్లతో నాపరాళ్ల వ్యర్థాలను కుప్పలుగా వదిలారు. రాళ్లదాడి చేసేందుకే జేసీ ప్రభాకర్‌రెడ్డి తన అనుచరులతో ప్రణాళిక సిద్ధం చేస్తున్నారని పట్టణంతో తీవ్ర చర్చ జరుగుతోంది.

చాలా భయపడ్డా.. పారిపోవాలనిపించింది: షారుక్ ఖాన్
సెలబ్రిటీల ఫ్యాషన్ షో ‘మెట్ గాలా’(Met Gala 2025) వేడుక వైభవంగా ప్రారంభమైంది. న్యూయార్క్‌లోని మెట్రోపాలిటిన్ మ్యూజియం ఆఫ్ ఆర్ట్స్ వేదికగా ఈ ఫ్యాషన్ సెలబ్రేషన్స్ జరుగుతున్నాయి. ఈ ఏడాది ‘మెట్ గాలా’ డ్రెస్‌కోడ్ ‘టైలర్డ్ ఫర్ యు’ కాగా, ‘సూపర్‌ఫైన్: టైలరింగ్ బ్లాక్స్టైల్’ను థీమ్‌గా నిర్ణయించారు నిర్వాహకులు. ఈ థీమ్‌కు తగ్గట్లుగా ఈ వేడుకలో నలుపు రంగు దుస్తుల్లో పాల్గొన్నారు ప్రముఖులు. ఇక ఈ వేడుకలకు హాజరైన తొలి భారతీయ నటుడిగా షారుక్ ఖాన్( Shah Rukh Khan) చరిత్ర సృష్టించారు. సబ్యసాచి డిజైన్ చేసిన దుస్తుల్లో అల్ట్రా స్టైలిష్‌గా కనపడి, ఈ వేడుకలో సెంటరాఫ్ ఎట్రాక్షన్‌గా నిలిచారు షారుక్ ఖాన్. ‘‘ఈ ఏడాది మెట్ గాలాకి ఆహ్వానం అందగానే నా కుమారుడు ఆర్యన్, కుమార్తె సుహానా ఎంతగానో సంతోషించారు. ఈ వేడుకలో నేను పాల్గొంటే అది చరిత్ర అవుతుందని కూడా నాకు తెలియదు. నేను ఇప్పటివరకు రెడ్ కార్పెట్‌పై నడవలేదు. నాకు ఫ్యాషన్‌పై ఆసక్తి కూడా తక్కువ. దీంతో ఈ వేడుకకు రావడానికి నేను చాలా భయపడ్డాను. కాస్త బిడియంగా అనిపించింది. ఓ దశలో పారిపోవాలనిపించింది’’ అని పేర్కొన్నారు షారుక్ ఖాన్. ఇంకా ఈ వేడుకలో నటి–నిర్మాత ప్రియాంకా చోప్రా, ఆమె భర్త–నటుడు నిక్ జోనస్, హీరోయిన్ కియారా అద్వానీ, సింగర్–నటుడు–నిర్మాత దిల్జీత్ సింగ్ తదితర ప్రముఖులు పాల్గొని సందడి చేశారు. ఇక త్వరలో తల్లి కాబోతున్న కియారా అద్వానీ ఈ వేడుకలో ‘బేబీ బంప్’తో మెరిశారు.

ఆపరేషన్ సిందూర్.. స్టాక్ మార్కెట్‌పై ప్రభావం ఎంత?
భారత త్రివిధ దళాల సహాయంతో ఆర్మీ బలగాలు పాకిస్థాన్‌లోని తొమ్మిది ఉగ్ర స్థావరాలపై దాడి చేశాయి. ఇందులో సుమారు 80 మందికిపైగా ఉగ్రవాదులు మృతి చెందినట్లు ప్రాథమిక సమాచారం. గతంలో జమ్మూకశ్మీర్‌లో భారత పర్యాటకులను ఊచకోత కోసిన ఉగ్రదాడులకు ప్రతీకారంగా భారత్ దాయాది దేశంపై పంజా విసిరింది. పాకిస్థాన్‌లోని సాధారణ ప్రజలపై కాకుండా ఉగ్ర స్థావరాలపై దాడులు నిర్వహించినట్లు ప్రకటించింది. దీనిపై సానుభూతి కోసం పాక్ ఇతర దేశాల సాయం కోరకుండా భారత్ చాకచక్యంగా వ్యవహరించింది. తాజా దాడుల నేపథ్యంలో భారత స్టాక్ మార్కెట్లో ఎలాంటి ప్రభావం ఉండబోతుందో తెలుసుకుందాం.మార్కెట్ రియాక్షన్మార్కెట్ ప్రారంభమైన కాసేపటికి నిఫ్టీ 50 24,400 పాయింట్ల దిగువకు, సెన్సెక్స్ 150 పాయింట్లు నష్టపోయింది. గిఫ్ట్ సిటీలోని నిఫ్టీ 50లో ఫ్యూచర్స్ సుమారు 1.19% క్షీణించింది. ఏప్రిల్ 22న పహల్గాం ఉగ్రదాడికి ప్రతిస్పందనగా జరిగిన ఈ ఆపరేషన్ తర్వాత భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు పెరుగుతాయని కొందరు భావిస్తున్నారు. ఇది ఇన్వెస్టర్ల ఆందోళనలకు కారణమవుతుంది.పరస్పర దాడులకు సంబంధించిన పరిస్థితులు త్వరగా సద్దుమనిగితే మార్కెట్ ప్రభావం పరిమితం కావచ్చని విశ్లేషకులు సూచిస్తున్నారు. ఈ ఆపరేషన్ స్టాక్ మార్కెట్‌పై పెద్దగా ప్రభావం చూపే అవకాశం లేదని కొందరు చెబుతున్నారు. పరిస్థితులు త్వరితగతిన నియంత్రణలోకి వస్తాయని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. భారత్ వేగంగా అభివృద్ధి చెందుతున్న దేశం. ఇలాంటి ఆపరేషన్ల ప్రభావానికి తాత్కాలికంగా మార్కెట్లు ఒడిదొడులకులకు లోనైనా భవిష్యత్తులో తప్పకుండా పెరుగుతాయని స్పష్టం చేస్తున్నారు. ఎఫ్ఐఐలు కీలకం24-48 గంటల్లో ఈ పరిస్థితి అదుపులోకి వస్తే మార్కెట్లు ముందుకు సాగవచ్చని కొందరు సూచిస్తున్నారు. అయితే, దీర్ఘకాలిక ఉద్రిక్తతలు కొనసాగితే మాత్రం కొంతకాలం మార్కెట్లో దిద్దుబాటుకు దారితీస్తుందని చెబుతున్నారు. ముఖ్యంగా ఇటీవల కాలంలో కొనుగోలుదారులుగా ఉంటున్న విదేశీ సంస్థాగత పెట్టుబడిదారులు (ఎఫ్ఐఐలు) ప్రతికూలంగా ప్రతిస్పందిస్తే కొంత కాలం అనిశ్చితులు కొనసాగవచ్చు.ఇదీ చదవండి: ఎన్బీఎఫ్సీ గోల్డ్ లోన్లకు కష్టాలుగతంలో ఇలా..ఇండో-పాక్ ఘర్షణల నేపథ్యంలో మార్కెట్లు గతంలోనూ కొంత ఒడిదొడుకులకు లోనయ్యాయి. 2019 బాలాకోట్ వైమానిక దాడుల తరువాత సెన్సెక్స్, నిఫ్టీ మార్కెట్ సెషన్ ప్రారంభంలో పడిపోయినప్పటికీ మరుసటి రోజు తిరిగి పుంజుకున్నాయి. పహల్గాం దాడి తర్వాత మార్కెట్లు స్థిరంగా ఉన్నాయి. అమెరికా ఫెడరల్ రిజర్వ్ రేటు నిర్ణయాలు, చైనా లిక్విడిటీ చర్యలు వంటి అంతర్జాతీయ సంకేతాలు కూడా మార్కెట్‌ను ప్రభావితం చేస్తున్నాయి. ఇటీవల ప్రకటించిన భారత్-బ్రిటన్ వాణిజ్య ఒప్పందం మార్కెట్లో కొంత సానుకూల సెంటిమెంట్‌ను తీసుకొచ్చింది.

ఓఆర్ఎస్ అని పిల్లలకు తాగిస్తున్నారా..?
ఎండలు మండుతున్నాయి, చిన్నారులు అనేక మంది డీ హైడ్రేషన్ బారిన పడుతున్నారు. ఈ సమయంలో తల్లిదండ్రులు యధాలాపంగా ఎంచుకునే ఓఆర్ఎస్ పరిష్కారం ప్రమాదకరం అని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఓరల్ రీహైడ్రేషన్ సొల్యూషన్ (ఓఆర్ఎస్) పేరిట చక్కెర అధికంగా ఉండే పానీయాలను నమ్మడం మానేయాలని సూచిస్తున్నారు. తప్పుదారి పట్టించే మార్కెటింగ్ పద్ధతుల వల్ల పిల్లల మరణాలకు కూడా దారి తీస్తున్నాయని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయంలో ముందున్నారు హైదరాబాద్‌కి చెందిన సీనియర్ శిశువైద్యురాలు ప్రథమ చికిత్స శిక్షకురాలు శివరంజని సంతోష్ ఎలక్ట్రోలైట్ డ్రింక్‌గా విక్రయించినప్పటికీ, ఇది విరేచనాల సమయంలో రీహైడ్రేషన్కు తగినది కాదనీ తయారీదారులు పిల్లల వైద్యులతో కుమ్మక్కై, ఇది నిజమైన పరిష్కారం అనే అభిప్రాయాన్ని కలిగించారనీ ఆమె వెల్లడించారు. వాస్తవానికి, ఇది శీతల పానీయాలు పండ్ల రసాలతో పోల్చదగిన చక్కెర స్థాయిలను కలిగి ఉంటుందనీ దీనివల్ల సోడియం కంటెంట్‌లో స్వల్ప పెరుగుదల మాత్రమే ఉంటుందన్నారామె ‘చాలా మంది పిల్లల విరేచనాలు తీవ్రమవుతున్నాయని నిశితంగా పరిశీలించిన తర్వాత, ఈ బ్రాండెడ్ ఉత్పత్తి ఓఆర్ఎస్ కాదని గ్రహించాం‘ అని ఆమె చెప్పారు.ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్లు్య హెచ్ ఒ )ఓరల్ రీహైడ్రేషన్ సొల్యూషన్ (ఓఆర్ఎస్)కు ఉండాల్సినవిగా సిఫార్సు చేస్తున్న ప్రమాణాల ప్రకారం ఇవి ఉండడం లేదు. దీనికి విరుద్ధంగా పలు ఔషధ సంస్థలు మార్కెట్లో విక్రయించే కొన్ని ప్యాకెట్లలో లీటరుకు దాదాపు 120 గ్రాముల చక్కెర ఉంటుంది, అందులో 110 గ్రాములు అదనంగా కలిపిన చక్కెర. వాటిలో లీటరుకు 1.17 గ్రాముల సోడియం, 0.79 గ్రాముల పొటాషియం, 1.47 గ్రాముల క్లోరైడ్ కూడా ఉన్నాయి. ‘‘ఓఆర్ఎస్ అనేది లక్షలాది మంది ప్రాణాలను కాపాడే ఒక ప్రాణాలను రక్షించే చికిత్స. కానీ ఇప్పుడు మనం ఆ లేబుల్‌ను దుర్వినియోగం చేసి అధిక చక్కెర పానీయాలను విక్రయించే ఉత్పత్తుల పెరుగుదలను చూస్తున్నాము, ఇవి వాస్తవానికి విరేచనాలను మరింత తీవ్రతరం చేస్తాయి,‘ అని శివరంజని స్పష్టం చేశారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ సిఫార్సు చేసిన ఫార్ములా కంటే 6 నుంచి 10 రెట్లు ఎక్కువ చక్కెర స్థాయిలను కలిగి ఉన్నప్పటికీ, అనేక ప్రసిద్ధ బ్రాండ్లు వీటిని రీహైడ్రేషన్ సొల్యూషన్లుగానే భ్రమింపజేస్తూ విక్రయాలు కొనసాగిస్తున్నాయని డాక్టర్ శివరంజని పేర్కొన్నారు. ఫార్మసీలలో అందుబాటులో ఉంటూన్న ఈ ఉత్పత్తులను సాధారణంగా డెంగ్యూ టైఫాయిడ్ వంటి అనారోగ్యాలకు సంబంధించిన డీహైడ్రేషన్ కోసం సిఫార్సు చేయడం జరుగుతోంది.అయితే ఇవి చికిత్సా ఉత్పత్తులను నియంత్రించే సెంట్రల్ డ్రగ్స్ స్టాండర్డ్ కంట్రోల్ ఆర్గనైజేషన్ (సిడిఎస్సిఓ) నుంచి కాకుండా ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఎఫ్ఎస్ఎస్ఎఐ) దగ్గర మాత్రమే అనుమతి పొందడం గమనార్హం. వైద్య నిపుణుల ఒత్తిడి మేరకు,గత 2022లో అటువంటి చక్కెర–భారీ పానీయాల వాడకాన్ని నిషేధించడం జరిగింది. అయితే, నియంత్రణ సంస్థ అదే సంవత్సరం జూలైలో తమ నిర్ణయాన్ని సవరించింది, తయారీదారులు ‘‘ఇది ఓఆర్ఎస్ కాదు’’ అని రాసి ఉత్పత్తులను కొనసాగించడానికి అనుమతించింది, ‘‘ చాలా మంది తల్లిదండ్రులు, కొంతమంది వైద్యులు కూడా ప్యాకేజింగ్ ద్వారా తప్పుదారి పడుతున్నారు. ఈ పానీయాలు నిరుపయోగం మాత్రమే కాదు, అనారోగ్యంతో ఉండే చిన్నారులకు మధుమేహం ఉన్నవారికి ప్రమాదకరమైనవి, ’’అని డాక్టర్ శివరంజని హెచ్చరించారు. అటువంటి ఉత్పత్తుల వాడకాన్ని పూర్తిగా నిషేధించడం, ఆసుపత్రి రిటైల్ ఫార్మసీల నుంచి వాటిని తొలగించడం డీహైడ్రేషన్ చికిత్సకు డబ్లు్యహెచ్‌ఓ ఆమోదించిన ఫార్ములేషన్లను ఏకైక ప్రమాణంగా అమలు చేయడం వంటి కఠినమైన చర్యలు చేపట్టాలని ఆమె కోరుతున్నారు.(చదవండి: కల్తీ పుచ్చకాయను పసిగట్టొచ్చు ఇలా..!)

భారత సైన్యానికి అండగా ఉందాం.. జైహింద్: వైఎస్ జగన్
సాక్షి, తాడేపల్లి: పాకిస్తాన్‌పై భారత్ దాడులు ఆపరేషన్ సిందూర్‌పై వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ హర్షం వ్యక్తం చేశారు. పహల్గాం ఉగ్ర దాడి ఘటనకు మన సైన్యం సరైన నిర్ణయం తీసుకుందని ప్రశంసించారు.ఆపరేషన్ సిందూర్‌పై వైఎస్ జగన్ ట్విట్టర్ వేదికగా స్పందిస్తూ..‘పహల్గాంలో ఉగ్ర దాడి ఘటనకు ప్రతిస్పందనగా భారత రక్షణ దళాలు ఆపరేషన్ సిందూర్ ప్రారంభించాయి. మన సైన్యం సరైన నిర్ణయం తీసుకుంది. ఇలాంటి సమయంలో దేశ సార్వభౌమత్వాన్ని కాపాడుకోవాలి. దేశ ప్రజలను రక్షించడానికి కఠిన చర్యలు తీసుకోవాలి. ఈ పోరాటంలో మేమంతా అండగా నిలుస్తాం. జైహింద్’ అని పోస్టు చేశారు. The Indian Defence Forces have launched #OperationSindoor in a decisive response to the heinous Pahalgam terror attack.During such times,Such inevitable actions reflect the nation’s unwavering strength in safeguarding its sovereignty and protecting its citizens.All of us stand…— YS Jagan Mohan Reddy (@ysjagan) May 7, 2025
TSRTC Bus: సీట్ల కోసం చెప్పులతో కొట్టుకున్న మహిళలు
Masood Azhar: ఆపరేషన్ సిందూర్‌పై జైషే చీఫ్ మసూద్ అజహర్ ఓవరాక్షన్
4 డ్రోన్లు వచ్చాయి.. నేలమట్టం చేశాయి: పాక్ ప్రత్యక్ష సాక్షి
నూడుల్స్ తిని భర్త మృతి.. భార్యపై అనుమానం..!
Operation Sindoor: వెండితెరపై భారత్-పాక్ యుద్ధ గాథలు
సాక్ష్యం కనబడుతోందా?: ఆపరేషన్ సిందూర్‌పై భారత బాక్సర్ రియాక్షన్
ప్రభుత్వ రుణం దిగిరావాలి
కొత్త బట్టలు అలానే ధరించేస్తున్నారా..? నిపుణుల స్ట్రాంగ్ వార్నింగ్
Operation Sindoor: ఎవరీ కల్నల్ సోఫియా, వింగ్ కమాండర్ వ్యోమికా సింగ్
నేడు అల్లూరి వర్ధంతి.. వైఎస్ జగన్ నివాళి
TSRTC Bus: సీట్ల కోసం చెప్పులతో కొట్టుకున్న మహిళలు
Masood Azhar: ఆపరేషన్ సిందూర్‌పై జైషే చీఫ్ మసూద్ అజహర్ ఓవరాక్షన్
4 డ్రోన్లు వచ్చాయి.. నేలమట్టం చేశాయి: పాక్ ప్రత్యక్ష సాక్షి
నూడుల్స్ తిని భర్త మృతి.. భార్యపై అనుమానం..!
Operation Sindoor: వెండితెరపై భారత్-పాక్ యుద్ధ గాథలు
సాక్ష్యం కనబడుతోందా?: ఆపరేషన్ సిందూర్‌పై భారత బాక్సర్ రియాక్షన్
ప్రభుత్వ రుణం దిగిరావాలి
కొత్త బట్టలు అలానే ధరించేస్తున్నారా..? నిపుణుల స్ట్రాంగ్ వార్నింగ్
Operation Sindoor: ఎవరీ కల్నల్ సోఫియా, వింగ్ కమాండర్ వ్యోమికా సింగ్
నేడు అల్లూరి వర్ధంతి.. వైఎస్ జగన్ నివాళి
సినిమా

ఏ మాయ చేసావె రోజులు గుర్తొచ్చాయి!: సమంత
‘‘ఈ మధ్య ప్రేక్షకులను థియేటర్స్‌కు తీసుకురావడం చాలా కష్టమైపోయింది. అయితే స్టార్ హీరో చేసిన సినిమాలు చూసేందుకు ప్రేక్షకులు థియేటర్స్‌కు ఎలాగైతే వస్తున్నారో... అలా ఓ మంచి కంటెంట్ ఉన్న సినిమాను చూసేందుకూ వస్తారని నమ్ముతాను. ‘శుభం’ సినిమా ప్రేక్షకులను థియేటర్స్‌కు రప్పిస్తుందని ఈ సినిమా నిర్మాతగా నమ్ముతున్నాను’’ అని హీరోయిన్ సమంత అన్నారు. హర్షిత్ రెడ్డి, గవిరెడ్డి శ్రీనివాస్, చరణ్ పేరి, శ్రియా కొంతం, శ్రావణి లక్ష్మీ, వంశీధర్ గౌడ్ ప్రధానపాత్రల్లో నటించిన చిత్రం ‘శుభం’. ప్రవీణ్ కండ్రేగుల దర్శకత్వంలో ట్రా లా లా మూవీంగ్ పిక్చర్స్ పతాకంపై సమంత నిర్మించిన ఈ తొలి చిత్రం ఈ నెల 9న రిలీజ్ కానుంది. ఈ సందర్భంగా విలేకరుల సమావేశంలో సమంత చెప్పిన విశేషాలు...⇒ నేను హీరోయిన్‌గానే కొనసాగాలని సినిమాలు చేసుకుంటూ వస్తున్న సమయంలో హఠాత్తుగా నాకు నటనలో లాంగ్ బ్రేక్ వచ్చింది. అనారోగ్యాన్ని అధిగమించడానికి ఇంట్లోనే ఉండాల్సి వచ్చింది. నటించలేకపోతున్నాను....ప్రోడక్షన్ చేద్దామని అనుకున్నాను. అలా ‘శుభం’ సినిమాను మొదలుపెట్టాం. ఎనిమిది నెలల్లోనే షూటింగ్ పూర్తి చేశాం. దాదాపు వంది మంది ‘శుభం’ సినిమా చూసి,పాజిటివ్ ఫీడ్ బ్యాక్ ఇచ్చారు. సినిమా విజయంపై నమ్మకం ఉంది. ⇒ ‘శుభం’ సినిమా ఓ టీవీ సీరియల్ నేపథ్యంలో సాగుతుంది. ఈ సీరియల్ ‘శుభం’ కార్డు కోసం అందరూ ఎదురుచూస్తుంటారు. న్యూ ఏజ్ హారర్ కామెడీ ఫిల్మ్ ఇది. సోషల్ సెటైర్లా ఉంటుంది. ఈ సినిమాకు కాస్త బడ్జెట్ ఎక్కువైంది.ప్రోడ్యూసర్‌గా నాకు భవిష్యత్ ఉందా? లేదా అనేది ‘శుభం’ రిలీజ్ తర్వాత తెలుస్తుంది. నేను తెలివైన నిర్మాతను కాకపోవచ్చు, తెలివైన బిజినెస్ ఉమెన్‌ని కాకపోవచ్చు. అయితే నా మనసు ఏం చెబుతుందో ఆ నిర్ణయాలనే తీసుకుంటా. ఫైనాన్షియల్ వ్యవహారాలను మా బిజినెస్పార్ట్నర్ హిమాంక్ చూసుకుంటుంటారు. ‘శుభం’ సినిమాకు ఎంత ఖర్చు పెట్టాం అనేది తర్వాత చెబుతాను. ప్రస్తుతానికి నా దగ్గర కొంచెం డబ్బులైతే ఉన్నాయి (నవ్వుతూ..)⇒ 2010లో దర్శకులు గౌతమ్ మీనన్‌గారు పిలిస్తే ఏ హీరోయిన్ అయినా ఆయన సినిమాకి ఓకే చెప్పేవారు. కానీ ఆయన రిస్క్ తీసుకుని, నాకు నటిగా తొలి (ఏ మాయ చేసావె) చాన్స్ ఇచ్చారు. పదిహేనేళ్లుగా ఇండస్ట్రీలో కొనసాగుతున్నాను. ఇప్పుడు నిర్మాతగా కొత్త కథలు చె΄్పాల్సిన బాధ్యత నా మీద ఉందనిపించింది. కొత్తవారితో పని చేయాలి. అందుకే నిర్మాతగా నా తొలి సినిమాలో నేను మెయిన్ లీడ్ రోల్ చేయలేదు. ఈ సినిమాలో అతిథిపాత్ర ఉంది. నాకు ఫేవర్స్ అడగటం ఇష్టం లేదు. అందుకే ఈ రోల్‌ను నేనే చేశాను.⇒ ‘శుభం’లో నూతన నటీనటులు నటించారు. కెరీర్ కోసం వాళ్లు చాలా త్యాగాలు చేశారు. వాళ్ల స్టోరీస్ వింటుంటే నిర్మాతగా గర్వంగా అనిపించింది. అలాగే నా తొలి సినిమా ‘ఏ మాయ చేసావె’ రోజులు గుర్తొచ్చాయి. ఇప్పటివరకు నేనుప్రోడ్యూసర్స్ యాక్ట్రస్ అనుకున్నాను. కానీ... నేను ఇంకాప్రోడ్యూసర్స్ ఫ్రెండ్లీ యాక్ట్రస్‌గా ఉండాలని నాకనిపించింది.⇒ ఈక్వల్ స్కిల్... ఈక్వల్ ఎక్స్పీరియన్స్... ఈక్వల్ పే ఉండాలని నా డ్రీమ్. మా ప్రోడక్షన్ హౌస్‌లో సాధ్యమైనంత వరకు ప్రయత్నిస్తాను. కథలు వినేటప్పుడే ఇందులో ఈక్వెల్ పే సాధ్యమౌతుందా? అని ఆలోచించి నిర్ణయించుకుంటాను. నా ప్రోడక్షన్లో నెక్ట్స్ మూవీ ‘మా ఇంటి బంగారం’. జూన్‌లో మళ్లీ షూటింగ్ స్టార్ట్ చేస్తాం. నా నుంచి సినిమా వచ్చి రెండేళ్లవుతోంది. కొన్ని పనులు జరుగుతున్నాయి. ఆ విషయాలు త్వరలో చెబుతాను. ∙అమెరికాలో విదేశీ సినిమాలపై వందశాతం సుంకం విధించారనేది ఇంకా అమలులోకి రాలేదని అనుకుంటున్నాను. అయినా ప్రతివారం మార్పులు చోటు చేసుకుంటూనే ఉంటాయి కదా. ⇒ నా ఫ్యాన్ ఒకరు నా కోసం గుడి కట్టారని విన్నాను. ఆ అభిమాని ప్రేమను అర్థం చేసుకోగలను. ఆ ప్రేమను అగౌరవపరచలేను. కానీ ఈ విధానాన్ని (గుడి కట్టడం, పూజలు చేయడం వంటివి) ప్రోత్సహించను. ∙జీవితం పట్ల మీ దృష్టికోణం చాలా మారిపోయినట్లుగా కనిపిస్తోంది. వృత్తి, వ్యక్తిగత జీవితాల విషయంలో ఎలాంటి కొత్త నిర్ణయాలు తీసుకోబోతున్నారు? అన్న ప్రశ్నకు... ‘‘మళ్లీ నా వ్యక్తిగత జీవితం గురించి నా లైఫ్‌లో బహిరంగంగా మాట్లాడను (నవ్వుతూ). ఆ ఒక్కటి మాత్రం బాగా అర్థమైంది’’ అన్నారు సమంత.

ఒక తార పుట్టింది!
‘‘ఒక స్టార్ (తార) పుట్టింది.... కుమారి’’ అంటూ రానా దగ్గుబాటి స్పిరిట్ మీడియా భాగ్యశ్రీ బోర్సే కొత్త లుక్‌ని విడుదల చేసింది. 1950 మద్రాస్ నేపథ్యంలో రూపొందిన ‘కాంత’ చిత్రంలో భాగ్యశ్రీ పోషించినపాత్ర పేరు కుమారి. మంగళవారం (మే 6) ఆమె పుట్టిన రోజు సందర్భంగా ఈ చిత్రంలోని కొత్త ఫొటోను విడుదల చేసింది యూనిట్. ప్రశాంత్ పోట్లూరి, జోమ్ వర్గీస్‌తో కలిసి రానా దగ్గుబాటి స్పిరిట్ మీడియా – దుల్కర్ సల్మాన్ వేఫేరర్ ఫిల్మ్స్ పతాకంపై దుల్కర్ సల్మాన్, భాగ్యశ్రీ బోర్సే జంటగా రూపొందిన చిత్రం ‘కాంత’.సెల్వమణి సెల్వరాజ్ దర్శకత్వంలో ఈ బహు భాషా చిత్రం రూపొందింది. ఇటీవలే ఈ చిత్రం షూటింగ్ పూర్తయింది. ప్రస్తుతం పోస్ట్‌ప్రోడక్షన్ పనులు జరుగుతున్నాయి. ‘‘అద్భుతమైన కథ, గొప్ప నటీనటులు, ప్రతిభ గల సాంకేతిక నిపుణులతో రూపొందించిన ఈ చిత్రం ప్రేక్షకులకు ఒక అద్భుతమైన అనుభూతినిచ్చేలా ఉంటుంది. త్వరలో ఈ చిత్రం రిలీజ్ డేట్ ప్రకటిస్తాం’’ అని చిత్రబృందం పేర్కొంది.

ఆ డ్రామాలు నాకు నచ్చవు: కేతికా శర్మ
‘‘కెరీర్ పరంగా హ్యాపీగా ఉన్నాను. హిట్, ఫ్లాప్స్ మన చేతిలో ఉండవు. ఓ నటిగా పని చేయడం మాత్రమే నా చేతిలో ఉంటుంది. ఇండస్ట్రీలో కొనసాగడం లక్‌గా భావిస్తున్నా’’ అన్నారు కేతికా శర్మ. శ్రీవిష్ణు హీరోగా రూపొందిన చిత్రం ‘సింగిల్’. ఈ చిత్రంలో కేతికా శర్మ, ఇవానా హీరోయిన్లుగా నటించారు. అల్లు అరవింద్ సమర్పణలో విద్యా కొప్పినీడి, భాను ప్రతాప, రియాజ్ చౌదరి నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 9న విడుదల కానుంది. ఈ సందర్భంగా కేతికా శర్మ మాట్లాడుతూ– ‘‘సింగిల్’ సినిమాలో ఆడీ కంపెనీలో పని చేసే పూర్వ అనే అమ్మాయిపాత్ర చేశాను.పూర్వ స్వతంత్ర భావాలున్న అమ్మాయి. ఈ మూవీలోని లవ్‌స్టోరీ వినోదాత్మకంగా, ఆసక్తికరంగా ఉంటుంది. అల్లు అరవింద్‌గారి సమర్పణలో గీతా ఆర్ట్స్‌లో ఓ మూవీ చేయాలని ఎప్పట్నుంచో అనుకుంటున్నాను. ఇప్పుడు కుదిరినందుకు హ్యాపీగా ఉంది. కామెడీ చేయడం చాలా కష్టం. అందుకే ఈ సినిమా ఇంట్రవెల్ సీక్వెన్స్ చాలా సవాల్‌గా అనిపించింది. ఇక ‘రాబిన్ హుడ్’ సినిమాలో నేను చేసిన ‘అదిదా సర్ప్రైజ్’లాంటి డ్యాన్స్ మూమెంట్స్ ఈ మూవీలో లేవు.సెట్స్‌లో దర్శకులు ఏదీ చెబితే అది చేస్తాను. అలా ‘అదిదా సర్ప్రైజ్’ సాంగ్ చేశాను. ఈ సాంగ్‌లోని కొన్ని డ్యాన్స్ మూమెంట్స్‌పై భిన్నా అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. భవిష్యత్‌లో అలాంటి మూమెంట్స్‌పై జాగ్రత్తలు తీసుకుంటా. ప్రస్తుతం తెలుగు, తమిళ భాషల్లో ఓ సినిమా చేస్తున్నాను’’ అన్నారు. మీరు లైఫ్‌లో సింగిల్‌గా ఉన్నారా? అన్న ప్రశ్నకు... ‘‘ప్రస్తుతం సింగిల్‌గా ఉన్నాను. రిలేషన్షిప్ అంటూ లేనిపోని డ్రామాలు నాకు నచ్చవు. నిజాయితీగా ఉండాలి. రైట్ పర్సన్ దొరికితే... ప్రేమిస్తాను’’ అని చె΄్పారు కేతికా శర్మ.

పవన్ 'హరిహర వీరమల్లు'.. అంతా ఓటీటీ దయ!
పవన్ కల్యాణ్.. 'హరిహర వీరమల్లు' షూటింగ్ ఎట్టకేలకు ముగించారు. అప్పుడెప్పుడో 2020 జనవరిలో మొదలైతే.. దాదాపు ఐదేళ్ల తర్వాత తాజాగా మంగళవారంతో తొలి భాగం చిత్రీకరణ పూర్తయింది. దీంతో ఇప్పుడు రిలీజ్ డేట్ పై రకరకాల కామెంట్స్ వినిపిస్తున్నాయి. ఇంతకీ విడుదల ఎప్పుడు ఉండొచ్చు?(ఇదీ చదవండి: చిరంజీవి పక్కన ఛాన్స్ కొట్టేసిన టాలీవుడ్ 'ఎమ్మెల్యే'!)క్రిష్ దర్శకత్వంలో 'హరిహర వీరమల్లు' షూటింగ్ 2020 జనవరిలో మొదలైంది. తర్వాత కొన్నిరోజులకే లాక్ డౌన్ రావడం, తర్వాత ఎన్నికలు, పవన్ ఎమ్మెల్యేగా గెలవడం.. ఇలా పలు కారణాల వల్ల ఈ సినిమా షూటింగ్ అలా అలా వాయిదా పడుతూ వచ్చింది. ఎట్టకేలకు ఇన్నాళ్లకు మమా అనిపించారు.లెక్క ప్రకారం ఈ మే 9న థియేటర్లలోకి సినిమా వస్తుందని ప్రకటించారు. కానీ ఇప్పుడు రావట్లేదని క్లారిటీ వచ్చేసింది. మరి ఎప్పుడు రిలీజ్ చేస్తారనే దగ్గర మే 30 తేదీ వినిపించింది. కానీ ఈ తేదీకి కూడా రావడం కష్టమేనేమో అనే సందేహం వస్తుంది. ఎందుకంటే ఓటీటీ హక్కుల్ని దక్కించుకున్న అమెజాన్ సంస్థ.. మే 30 తేదీపై పెద్దగా ఆసక్తి చూపించట్లేదు. జూన్ రెండో వారం అని అంటోంది.(ఇదీ చదవండి: మహేశ్ ఇంట్లో మరో హీరో రెడీ.. అన్నీ ఫిక్స్!)ప్రస్తుతానికైతే విడుదల తేదీపై చర్చలు జరుగుతున్నాయి. ఏదనేది ఓటీటీ సంస్థ నిర్ణయంపై ఆధారపడి ఉంటుంది. ప్రస్తుతం చాలా తెలుగు సినిమాలు.. ఇలా ఓటీటీ సంస్థ చెప్పినదానిబట్టి రిలీజ్ చేస్తుండటమే దీనికి కారణం అని చెప్పొచ్చు.మరోవైపు పవన్ సినిమా వచ్చే దానిబట్టి విజయ్ 'కింగ్డమ్' రిలీజ్ ఆధారపడి ఉంటుంది. ఎందుకంటే ఈ చిత్రాన్ని మే 30న విడుదల చేయాలని ఫిక్సయ్యారు. కానీ పవన్ వస్తే మాత్రం తప్పుకోవడం గ్యారంటీ. మరి ఫైనల్ గా ఏం జరుగుతుందో చూడాలి?(ఇదీ చదవండి: మంచం పట్టిన 'బలగం' నటుడు.. ప్రస్తుతం దీనస్థితిలో)
న్యూస్ పాడ్‌కాస్ట్

పాక్‌లోని ఉగ్ర శిబిరాలపై భారత్ దాడి..

దుష్ట పాకిస్తాన్ భరతం పట్టడానికి ముహూర్తం ఖరారు... ఈ వారాంతంలోపే భారీ ఆపరేషన్ జరిగే అవకాశం... బుధవారం రాష్ట్రాల్లో మాక్‌డ్రిల్స్

యాక్సిస్ ఎనర్జీ వెంచర్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్‌తో చంద్రబాబు సర్కారు అడ్డగోలు ఒప్పందం... అత్యధిక ధరకు 400 మెగావాట్ల విద్యుత్ కొనడానికి అంగీకారం

అన్నం పెట్టే రైతన్నలకు సున్నం పెడతారా?... కూటమి ప్రభుత్వంపై వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి మండిపాటు

వణుకుతున్న పాకిస్తాన్. భారత్‌ను నిలువరించాలని అరబ్ దేశాలను వేడుకుంటున్న పాకిస్తాన్. తమకు ఉగ్రచరిత్ర ఉందని అంగీకరించిన బిలావల్ భుట్టో

ప్రతి ఇంటినీ చంద్రబాబు మోసం చేశారు: వైఎస్ జగన్ ఆగ్రహం

దేశవ్యాప్తంగా జనగణనతో పాటే కులగణన: కేంద్రం కీలక నిర్ణయం

ఏపీలో అంతులేని అవినీతి, అంతా అరాచకమే: వైఎస్ జగన్

రాష్ట్రపతి భవన్లో పద్మ అవార్డుల ప్రదానోత్సవం

ఏపీలో కేంద్ర సంస్థలకైతే కోట్లు.. ఉర్సా సంస్థకైతే ఊరకే!
క్రీడలు

టీ20 క్రికెట్లో అది నేరం లాంటిదే!.. ఏదేమైనా క్రెడిట్ మా బౌలర్లకే: హార్దిక్
గుజరాత్ టైటాన్స్ చేతిలో ఓటమిపై ముంబై ఇండియన్స్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా (Hardik Pandya) స్పందించాడు. ఆఖరి వరకు తమ జట్టు పోరాడిన తీరు అద్భుతమని కొనియాడాడు. అయితే, నో బాల్స్ వేయడం ప్రభావం చూపిందన్న హార్దిక్.. టీ20లలో ఇలా చేయడం నేరంతో సమానమని పేర్కొన్నాడు.ఐపీఎల్-2025 (IPL 2025) ప్లే ఆఫ్స్ అవకాశాలను మెరుగుపరచుకునే క్రమంలో ముంబై మంగళవారం గుజరాత్ టైటాన్స్‌తో తలపడింది. సొంత మైదానం వాంఖడేలో టాస్ ఓడిన ముంబై తొలుత బ్యాటింగ్‌కు దిగింది. గుజరాత్ బౌలర్ల ధాటికి నిర్ణీత 20 ఓవర్లలో ఎనిమిది వికెట్ల నష్టానికి 155 పరుగులు మాత్రమే చేయగలిగింది.వాన వల్ల పదే పదే ఆగిన ఆటఇక లక్ష్య ఛేదనలో గుజరాత్ ఆరంభంలోనే ఓపెనర్ సాయి సుదర్శన్(5) వికెట్ కోల్పోయినా.. మరో ఓపెనర్ శుబ్‌మన్ గిల్ (43) ఇన్నింగ్స్ చక్కదిద్దాడు. జోస్ బట్లర్ (30), షెర్ఫానే రూథర్‌ఫర్డ్ (28) అతడికి సహకరించారు.ఈ క్రమంలో 14 ఓవర్లలో రెండు వికెట్ల నష్టానికి 107 పరుగులు చేసి విజయం దిశగా గుజరాత్ పయనిస్తున్న వేళ వర్షం వల్ల చాలా సేపు మ్యాచ్ నిలిచిపోయింది. అయితే, వాన తెరిపినిచ్చిన తర్వాత ముంబై బౌలర్లు ఒక్కసారిగా విజృంభించారు. జస్ప్రీత్ బుమ్రా, ట్రెంట్ బౌల్ట్ ధాటికి పదహారు బంతుల వ్యవధిలో నాలుగు వికెట్లు నష్టపోయింది.ఈ క్రమంలో మిగిలిన రెండు ఓవర్లలో గుజరాత్ విజయానికి 24 పరుగులు అవసరమైన వేళ... భారీ వర్షం వల్ల ఆట మళ్లీ ఆగిపోయింది. ఫలితంగా డక్‌వర్త్ లూయిస్ పద్ధతి ప్రకారం గుజరాత్ లక్ష్యం 19 ఓవర్లలో 147గా మారగా.. ఆరు బంతుల్లో 15 పరుగులు చేయాల్సిన పరిస్థితి.ఆఖరి ఓవర్లో దీపక్ చహర్ నో బాల్ఈ నేపథ్యంలో తమ పేసర్ దీపక్ చహర్‌ను ముంబై బరిలోకి దించింది. అయితే, తొలి బంతికే రాహుల్ తెవాటియా ఫోర్ బాదగా.. మరుసటి బంతికి ఒక రన్ వచ్చింది. ఆ తర్వాత గెరాల్డ్ కోయెట్జి సిక్సర్ బాదాడు. దీంతో మూడు బంతుల్లో విజయ సమీకరణం నాలుగు పరుగులుగా మారింది.ఇలాంటి కీలక సమయంలో చహర్ నోబాల్ వేశాడు. అయితే, ఆ తర్వాత అతడు వేసిన లో ఫుల్ టాస్కు తెవాటియా ఒక్క పరుగే రాబట్టాడు. దీంతో రెండు బంతుల్లో ఒక్క పరుగు అవసరం కాగా.. చహర్ కోయెట్జిని పెవిలియన్‌కు పంపాడు. అయితే, ఆఖరి బంతికి అర్షద్ ఖాన్ పరుగు తీయడంతో గుజరాత్ విజయం ఖరారైంది.అది నేరం లాంటిదే!.. ఏదేమైనా క్రెడిట్ మా బౌలర్లకేఈ నేపథ్యంలో మ్యాచ్ అనంతరం ముంబై సారథి హార్దిక్ పాండ్యా మాట్లాడుతూ.. ‘‘మా వాళ్లు ఆఖరి వరకు పట్టుదలగా పోరాడారు. జట్టుగా మేము సమిష్టిగా ముందుకు సాగాము. అయితే, ఇంకో 25 పరుగులు చేసి ఉంటే పరిస్థితి వేరేలా ఉండేది.ఏదేమైనా మా బౌలర్లకు క్రెడిట్ ఇవ్వాల్సిందే. ఇక క్యాచ్ డ్రాప్‌ల వల్ల మూల్యం చెల్లించాల్సి వచ్చిందని నేను అస్సలు అనుకోను. మా వాళ్లు ఈరోజు వందకు 120 శాతం కష్టపడ్డారు.ఏదేమైనా నో బాల్స్ వేయడం సరికాదు. నేను కూడా అదే పని చేశాను. నిజానికి నా దృష్టిలో టీ20 మ్యాచ్‌లో నో బాల్స్ వేయడం నేరం లాంటిది. ఇవే మన కొంప ముంచుతాయి. అయితే, మా వాళ్ల ప్రదర్శన పట్ల నేనైతే సంతోషంగానే ఉన్నాను’’ అని చెప్పుకొచ్చాడు.కాగా గుజరాత్ ఇన్నింగ్స్ పదకొండో ఓవర్లో హార్దిక్ కూడా నో బాల్ వేశాడు. ఇక 12వ ఓవర్లో ముంబై శుబ్‌మన్ గిల్ ఇచ్చిన క్యాచ్‌ను కూడా జారవిడిచింది. కాగా ముంబైపై మూడు వికెట్ల తేడాతో గెలిచిన గుజరాత్ 16 పాయింట్లతో పట్టికలో అగ్రస్థానానికి దూసుకెళ్లింది.చదవండి: IPL 2025: చరిత్ర సృష్టించిన సూర్య భాయ్ Rain delays, wickets falling, and nerves running high 📈...@gujarat_titans edge past everything to seal a thrilling win over #MI that had fans on the edge of their seats! 🥳Scorecard ▶ https://t.co/DdKG6Zn78k #TATAIPL | #MIvGT pic.twitter.com/NLYj3ZlI3w— IndianPremierLeague (@IPL) May 6, 2025

వెంకటేశ్ ప్రసాద్ నియామకం చెల్లదు: తెలంగాణ హైకోర్టు
సాక్షి, హైదరాబాద్: క్రికెట్ ఆపరేషన్స్ అండ్ గేమ్ డెవలప్మెంట్ కన్సల్టెంట్‌గా భారత మాజీ క్రికెటర్ వెంకటేశ్ ప్రసాద్ నియామకం చెల్లదని తెలంగాణ హైకోర్టు స్పష్టం చేసింది. అలాగే సిబ్బంది సహా కోచ్‌ల నియామకాన్ని కూడా పక్కకు పెడుతూ ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు చర్యలు చేపట్టాలని హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్‌ను ఆదేశించింది.క్రికెట్లో నాణ్యత పెంపునకు ఏర్పాటు చేసిన హైదరాబాద్ క్రికెట్ అకాడమీ ఆఫ్ ఎక్సలెన్స్ (హెచ్‌సీఏఈ)లో భాగంగా కోచ్‌లు, డైరెక్టర్ల నియామకాలను హెచ్‌సీఏ ఉపాధ్యక్షుడు సర్దార్ దల్జీత్‌సింగ్, సంయుక్త కార్యదర్శి బసవరాజు హైకోర్టులో సవాల్ చేశారు. హెచ్‌సీఏ చట్టాలు, నిబంధనలకు విరుద్ధంగా నియామకాలు జరిగాయని, వీటిని నిలిపి వేయాలని కోరారు. అపెక్స్ కౌన్సిల్ ఆమోదం లేకుండానే పలువురితో ఒప్పందం కుదుర్చుకున్నారని, ప్రసాద్‌కు ఏటా రూ.75 లక్షల వేతనం ఇచ్చేలా అగ్రిమెంట్ చేసుకున్నారన్నారు.ఈ పిటిషన్‌పై జస్టిస్ నగేశ్ భీమపాక విచారణ చేపట్టారు. వాదనలు విన్న న్యాయమూర్తి... వెంకటేశ్‌ప్రసాద్, హిమానీ యాదవ్, మమత, అర్జున్, రాజశేఖర్ తదితరులకు హెచ్‌సీఏ నుంచి చెల్లించిన గౌరవ వేతనాన్ని ఈ కేసులో హెచ్‌సీఏ ప్రతివాదులైన వ్యక్తుల నుంచి రికవరీ చేయాలని స్పష్టం చేసింది. శ్రీలంక క్రికెటర్లకు ఆర్.శ్రీధర్ శిక్షణ న్యూఢిల్లీ: టీమిండియా మాజీ ఫీల్డింగ్ కోచ్ ఆర్.శ్రీధర్ శ్రీలంక క్రికెటర్లకు కోచింగ్ ఇవ్వనున్నారు. హైదరాబాద్‌కు చెందిన ఈ సీనియర్ కోచ్ పది రోజుల శిక్షణలో లంక జట్లకు మెళకువలు నేర్పనున్నట్లు తెలిసింది. భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) లెవెల్–3 కోచ్ అయిన శ్రీధర్... లంక పురుషులు, మహిళల జట్లతో ఎమర్జింగ్, ప్రీమియర్ క్లబ్, అండర్–19, మహిళల ‘ఎ’ జట్ల క్రికెటర్లకు స్వల్పకాలిక శిక్షణ ఇస్తారని లంక బోర్డు తెలిపింది.‘లంక క్రికెట్లో ఫీల్డింగ్ ప్రమాణాలు పెంచేందుకు ఈ ప్రత్యేక శిబిరాన్ని నిర్వహిస్తున్నాం. ఫీల్డింగ్ కోచింగ్‌లో అపార అనుభవమున్న శ్రీధర్ భారత్‌కు ఏళ్ల తరబడి సేవలందించారు. 2014 నుంచి 2021 వరకు సుమారు 300 అంతర్జాతీయ మ్యాచ్‌లకు టీమిండియా ఫీల్డింగ్ కోచ్‌గా పనిచేశారు’ అని శ్రీలంక క్రికెట్ బోర్డు ఒక ప్రకటనలో తెలిపింది. బుధవారం మొదలయ్యే ఈ 10 రోజుల కార్యక్రమంలో ఫీల్డింగ్ డ్రిల్స్, ప్రత్యేక నైపుణ్య శిక్షణ, మ్యాచ్ పరిస్థితులకు తగినట్లుగా ఫీల్డింగ్ మోహరింపు విషయాల్ని శ్రీధర్ నేర్పించనున్నారు. చదవండి: ఐసీసీ టోర్నీల్లోనూ పాక్‌తో మ్యాచ్‌లు వద్దు: గంభీర్

ఐసీసీ టోర్నీల్లోనూ పాక్‌తో మ్యాచ్‌లు వద్దు: గంభీర్
టీమిండియా హెడ్‌కోచ్ గౌతమ్ గంభీర్ (Gautam Gambhir) కీలక వ్యాఖ్యలు చేశాడు. అంతర్జాతీయ క్రికెట్ మండలి (ICC) టోర్నీల్లోనూ భారత్ పాకిస్తాన్‌తో మ్యాచ్‌లు ఆడాల్సిన అవసరం లేదని పేర్కొన్నాడు. కాగా సరిహద్దు వివాదాల నేపథ్యంలో టీమిండియా-పాకిస్తాన్ (IND vs PAK) మధ్య పుష్కర కాలంగా ద్వైపాక్షిక క్రికెట్ సిరీస్‌లు జరగడం లేదన్న విషయం తెలిసిందే.. అయితే ఐసీసీ టోర్నీలలో మాత్రం ఇరు జట్లూ తలపడుతున్నాయి.ఇప్పుడు దీనికి కూడా ఫుల్స్టాప్ పెట్టాల్సిన అవసరం ఉందని గంభీర్ అభిప్రాయపడ్డాడు. భారత్, పాక్ సరిహదుల్లో తీవ్రవాదం ముగిసేవరకు ఇరు జట్ల మధ్య ఆటలకు ప్రాధాన్యత లేదని అతను అన్నాడు. అప్పటిదాకా ఎలాంటి ఆటలు అవసరం లేదుఈ విషయంలో బీసీసీఐ మాత్రమే కాదు, భారత ప్రభుత్వమే తుది నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుందని గంభీర్ వ్యాఖ్యానించాడు. ‘నా అభిప్రాయం ప్రకారం ఇరు దేశాల మధ్య పరిస్థితులు మెరుగుపడే వరకు అసలు ఎలాంటి ఆటలు అవసరం లేదు.గతంలోనూ ఈ అభిప్రాయాన్ని వెల్లడించాను. నా దృష్టిలో క్రికెట్ మ్యాచ్, బాలీవుడ్ సినిమాలు, ఇతర సాంస్కృతిక కార్యక్రమాలేవీ భారత సైనికులు లేదా భారత పౌరుల ప్రాణాలకంటే ముఖ్యం కాదు. మ్యాచ్‌లు జరుగుతుంటాయి.సినిమాలు వస్తూ పోతూ ఉంటాయి. గాయకులు వేదికలపై పాడుతూనే ఉంటారు. కానీ మీ ఆత్మీయులను కోల్పోయిన బాధను ఏదీ తగ్గించలేదు’’ అని గంభీర్ ఉద్వేగభరితంగా మాట్లాడాడాడు. ఆసియా కప్ గురించి చెప్పలేనుఅదే విధంగా.. ‘‘ఈ ఏడాది జరిగే ఆసియా కప్ గురించి నేను ఏమీ చెప్పలేను. అది పూర్తిగా ప్రభుత్వ నిర్ణయం. వారు ఏం చెబితే దానిని పాటిస్తాం’ అని గంభీర్ స్పష్టం చేశాడు. కాగా ఇటీవల జమ్మూకశ్మీర్‌లోని పహల్గామ్లో ఉగ్రవాదులు పాశవిక దాడికి తెగబడిన విషయం విదితమే. బైసరన్ లోయలో పర్యాటకులపై కాల్పులు జరిపి ఇరవై ఆరు మంది అమాయకులను పొట్టనబెట్టుకున్నారు. ఈ నేపథ్యంలో పాకిస్తాన్‌పై భారత్ తీవ్ర స్థాయిలో మండిపడింది. సింధు జలాల ఒప్పందం రద్దు సహా అనేక ఆంక్షలు విధించింది. ఆపరేషన్ సింధూర్తాజాగా ఉగ్రవాద శిబిరాలపై మెరుపు దాడులు చేసింది. ఆపరేషన్ సింధూర్ పేరుతో పాకిస్తాన్లో నాలుగు, పీవోకేలోని ఉగ్రవాద శిబిరాలే లక్ష్యంగా ఐదు ప్రాంతాల్లో భారత సైన్యం దాడులకు దిగింది. దీంతో ఇరు దేశాల మధ్య మరోసారి ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. ఇంటెలిజెన్స్ వర్గాల సహకారంతో భారత ఆర్మీ, ఎయిర్ ఫోర్స్, నేవీ సంయుక్తంగా ఈ ఆపరేషన్ నిర్వహించాయి. లక్ష్యాలను ఖచ్చితంగా ఛేదించేందుకు డ్రోన్లు, ఇతర ఆయుధాలు వాడినట్లు భారత భద్రతా వర్గాలు పేర్కొన్నాయి.చదవండి: Virat Kohli: అందుకే టీమిండియా, ఆర్సీబీ కెప్టెన్‌గా తప్పుకొన్నా

IND vs SA: ఫైనల్ బెర్త్ లక్ష్యంగా...
కొలంబో: ముక్కోణపు వన్డే క్రికెట్ టోర్నీలో ఫైనల్ బెర్త్ లక్ష్యంగా భారత మహిళల జట్టు నేడు దక్షిణాఫ్రికాతో పోరుకు సిద్ధమైంది. వరుస విజయాలతో జోరుమీదున్న భారత్‌కు గత మ్యాచ్‌లో ఆతిథ్య శ్రీలంక చెక్ పెట్టింది. దీంతో వరుసగా 8 విజయాల జైత్రయాత్రకు బ్రేక్ పడింది. ఈ పరాభవం నుంచి వెంటనే బయట పడాలని, ఈ మ్యాచ్ ఎలాగైనా గెలవాలనే కసితో హర్మన్‌ప్రీత్ బృందం బరిలోకి దిగుతోంది. నిజానికి భారత్ ఈ మ్యాచ్‌లో గెలిస్తేనే ఫైనల్‌కు అర్హత సాధిస్తుందనే క్లిష్టమైన సమీకరణమైతే లేదు. అమ్మాయిల బృందం రెండు విజయాలు, నెట్‌రన్‌రేట్ పరంగా పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో ఉంది. అయినాసరే తుదిపోరుకు ముందే మళ్లీ గెలుపుబాట పట్టాలని భారత మహిళల జట్టు భావిస్తోంది. మరోవైపు ఇంతవరకు అసలు బోణీనే కొట్టలేకపోయిన సఫారీ మహిళల జట్టు లంక గడ్డపై పెను సవాళ్లను ఎదుర్కొంటోంది. ఫేవరెట్‌గా... ఈ సిరీస్‌లో గత పరాజయం మినహా భారత జట్టు అన్ని రంగాల్లో ఆధిక్యాన్ని ప్రదర్శిస్తోంది. ముఖ్యంగా ఓపెనింగ్‌లో ప్రతీక రావల్ సూపర్‌ఫామ్ కొనసాగిస్తోంది. ఇప్పటివరకు ఆడిన మూడు మ్యాచ్‌ల్లో రెండు అర్ధసెంచరీలు సహా 163 పరుగులతో సత్తా చాటుకుంది. స్మృతి మంధాన తన బ్యాటింగ్ పవర్‌ను చూపెట్టాల్సి ఉంది. హర్లీన్ డియోల్, కెపె్టన్ హర్మన్‌ప్రీత్, రిచా ఘోష్, దీప్తి శర్మలు రాణిస్తే ప్రత్యర్థి బౌలర్లకు కష్టాలు తప్పవు. బౌలింగ్‌లో స్నేహ్ రాణా ఈ సిరీస్‌లో అద్భుతంగా బౌలింగ్ చేస్తోంది. ఆంధ్రప్రదేశ్ అమ్మాయి శ్రీచరణితో పాటు హైదరాబాద్ బౌలర్ అరుంధతి రెడ్డి, కాశ్వీ గౌతమ్‌లు కూడా నిలకడగా రాణిస్తుండటంతో ఈ మ్యాచ్‌లో భారతే ఫేవరెట్‌గా బరిలోకి దిగుతోంది. ఒత్తిడిలో దక్షిణాఫ్రికా ఈ టోరీ్నలో ఆడిన రెండు మ్యాచ్‌ల్లోనూ ఓడిన సఫారీ అమ్మాయిల జట్టు గెలుపు కోసం పెద్ద కసరత్తే చేయాల్సి ఉంటుంది. ముఖ్యంగా బ్యాటర్ల నిలకడలేమి జట్టుకు ప్రతికూలంగా మారింది. కెపె్టన్ లారా వోల్వర్ట్, తజ్మిన్ బ్రిట్స్ భారత్‌తో గత మ్యాచ్‌లో బాగా ఆడినప్పటికీ లంకతో చేతులెత్తేశారు. గుడాల్, మెసో, సునే లుస్ సమష్టిగా రాణిస్తేనే పటిష్టమైన భారత్‌కు సవాల్ విసురుతుంది. లేదంటే ఈ టోర్నీలో ‘హ్యాట్రిక్’ ఓటమి తప్పదు! ఒకవేళ ఈ మ్యాచ్‌లో గనక దక్షిణాఫ్రికా జట్టు ఓడిపోతే ఆఖరి పోరుతో సంబంధం లేకుండా ఆతిథ్య లంక, భారత జట్లు అమీతుమీకి అర్హత సంపాదిస్తాయి. తుదిజట్లు (అంచనా) భారత్: హర్మన్‌ప్రీత్, ప్రతీక రావల్, స్మృతి మంధాన, హర్లీన్ డియోల్, జెమీమా, రిచా ఘోష్, దీప్తిశర్మ, కాశ్వీ గౌతమ్, అరుంధతీ, స్నేహ్ రాణా, శ్రీ చరణి. దక్షిణాఫ్రికా: లారా వోల్వర్ట్, తజ్మిన్ బ్రిట్స్, లారా గుడాల్, కరబొ మెసో, సునే లూస్, క్లొ ట్రయాన్, డెర్క్సన్, నదిన్ డిక్లెర్క్, మసబత క్లాస్, ఎమ్‌లాబా, అయ»ొంగ కాకా.
బిజినెస్

జీడీపీ వృద్ధి 6.3 శాతమే! కారణం..
భారత జీడీపీ 2025లో 6.3 శాతం వృద్ధిని నమోదు చేస్తుందని మూడీస్ రేటింగ్స్ తాజా అంచనాలు ప్రకటించింది. 6.5 శాతం వృద్ధి సాధిస్తుందంటూ గతంలో వెల్లడించిన అంచనాలను తగ్గించింది. అమెరికా టారిఫ్‌లు, వాణిజ్య ఆంక్షలతో వృద్ధి నిదానించొచ్చని పేర్కొంది. అంతర్జాతీయంగా ఉన్న భౌగోళిక ఉద్రిక్తతలకు తోడు.. భారత్–పాక్ మధ్య ఉద్రిక్తతలు సైతం జీడీపీ వృద్ధి అంచనాలపై ప్రభావం చూపిస్తాయని తెలిపింది.ఈ నేపథ్యంలో ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలి, ఎక్కడ విస్తరణ చేపట్టాలి, ముడి పదార్థాల సమీకరణ తదితరాల వ్యయాలు పెరిగిపోవ్చని పేర్కొంది. 2026 సంవత్సరానికి మాత్రం లోగడ ప్రకటించిన 6.5 శాతం వృద్ధి రేటు అంచనాలనే మూడీస్ కొనసాగించింది. 2024 కేలండర్ సంవత్సరంలో జీడీపీ వృద్ధి రేటు 6.7 శాతంగా ఉండడం గమనార్హం. విధానపరమైన అస్పష్టత, అమెరికా–చైనా మధ్య వాణిజ్య ఉద్రిక్తతలతో 2025, 2026 సంవత్సరాలకు సంబంధించి అంతర్జాతీయ వృద్ది రేటు అంచనాలను తగ్గిస్తున్నట్టు మూడీస్ రేటింగ్స్ తెలిపింది.ప్రపంచ వృద్ధిపైనా ప్రభావం..టారిఫ్‌లకు అమెరికా స్వల్పకాలం పాటు విరామం ఇచి్చనప్పటికీ చైనా–అమెరికా మధ్య ఉద్రిక్తతలు జీ–20 దేశాల వ్యాప్తంగా అంతర్జాతీయ వాణిజ్యం, పెట్టుబడులకు విఘాతం కలిగిస్తాయని మూడీస్ రేటింగ్స్ తెలిపింది. 2025లో అమెరికా, చైనా జీడీపీ అంచనాలను సైతం కుదించింది. అమెరికా జీడీపీ 2025లో 1 శాతం, 2026లో 1.5 శాతం చొప్పున వృద్ధిని నమోదు చేయొచ్చని అంచనా వేసింది. గత అంచనాలు కుదించింది. చైనా 2025లో 3.8 శాతం, 2026లో 3.9 శాతం చొప్పున వృద్ధి చెందొచ్చని పేర్కొంది. ఇదీ చదవండి: ఎన్బీఎఫ్సీ గోల్డ్ లోన్లకు కష్టాలుమొత్తం మీద అమెరికాకు సంబంధించి టారిఫ్‌లు గరిష్ట స్థాయికి చేరాయని.. రానున్న రోజుల్లో ఇవి తగ్గుతాయని అంచనా వేస్తున్నట్టు తెలిపింది. తరచుగా ఆర్థిక మార్కెట్లలో అస్థిరతలు లిక్విడిటీని (ద్రవ్య లభ్యత) కఠినతరం చేస్తాయని, ఇది నిధులపై వ్యయాలు గణనీయంగా పెరిగేందుకు దారితీస్తుందని మూడీస్ తెలిపింది. వృద్ధికి ఇది విఘాతం కలిగించొచ్చని పేర్కొంది.

ఎన్బీఎఫ్సీ గోల్డ్ లోన్లకు కష్టాలు
ఆర్బీఐ ప్రతిపాదించిన నూతన ముసాయిదా నిబంధనలు ఎన్బీఎఫ్సీ (బ్యాంకింగేతర ఆర్థిక సంస్థలు) బంగారం రుణ ఆస్తులు నిదానించేలా చేస్తాయని క్రిసిల్ రేటింగ్స్ అంచనా వేసింది. లోన్ టు వ్యాల్యూ (బంగారం విలువలో ఇచ్చే రుణం), రుణాల పునరుద్ధరణ, టాపప్ బుల్లెట్ రుణాలపై ఈ ముసాయిదా దృష్టి పెట్టిందని.. ఈ నిబంధనలు ఎన్బీఎఫ్సీ రుణ ఆస్తుల వృద్ధిపై ప్రభావం చూపిస్తాయని తెలిపింది. ఈ ఏడాది ఏప్రిల్‌లో ముసాయిదా నిబంధనలు విడుదల చేసిన ఆర్బీఐ, భాగస్వాముల అభిప్రాయాలను ఆహ్వానించింది.బంగారం రుణాల విషయంలో బ్యాంక్‌లు, ఎన్‌బీఎఫ్‌సీల మధ్య వ్యత్యాసాలు తగ్గించి, ఏకరూపత తీసుకురావడం ముసాయిదా నిబంధనల లక్ష్యంగా ఉంది. బంగారం రుణాల విషయంలో అసాధారణ ప్రక్రియలను ఎన్బీఎఫ్సీలు పాటిస్తుండడం, బంగారం విలువపై అధిక నిష్పత్తిలో రుణాలు జారీ చేస్తుండడంపై ఆర్బీఐ గతేడాది సెప్టెంబర్‌లో కాస్తంత హెచ్చరించే ధోరణిని వ్యక్తం చేయడాన్ని నివేదిక ప్రస్తావించింది. 2024–25లో వ్యవస్థ వ్యాప్తంగా బంగారం రుణాలు 50 శాతానికి పైనే పెరిగాయని, బ్యాంక్‌ల బంగారం రుణ ఆస్తుల విలువ రెట్టింపైనట్టు పేర్కొంది. ఆభరణాలపై తక్కువ రుణాలు..ఎల్టీవీపై ఆర్బీఐ కొత్త నిబంధనల కింద ఎన్బీఎఫ్సీలు బంగారం రుణాల మంజూరు విలువను క్రమబద్దీకరించుకోవాల్సి వస్తుందని తెలిపింది. బుల్లెట్ రుణాలకు సంబంధించిన ఎల్టీవీ ప్రస్తుతమున్న 65–68 శాతం నుంచి 55–60 శాతానికి దిగొస్తుందని అంచనా వేసింది. దీంతో అంతే విలువ కలిగిన బంగారం ఆభరణాలపై మంజూరు చేసే రుణం తగ్గుతుందని తెలిపింది. కస్టమర్ల వద్ద నుంచి నిర్ణీత రోజులకు ఒకసారి (నెల) బంగారం రుణంపై వడ్డీని ఎన్బీఎఫ్సీలు వసూలు చేసుకోవాల్సి ఉంటుందని పేర్కొంది. అలాగే, ఈ సంస్థలు ఈఎంఐ ఆధారిత బంగారం రుణాలపై దృష్టి పెట్టొచ్చని తెలిపింది. ఇదీ చదవండి: దేశంలో మారుతున్న ఉద్యోగుల ప్రాధాన్యతలుఎల్టీవీ పరిమితి మించితే అదనపు నిధుల కేటాయింపులు చేయాలన్న నిబంధన ఎన్బీఎఫ్సీలపై పెద్ద ప్రభావం చూపించకపోవచ్చని అభిప్రాయపడింది. ఆర్బీఐ ప్రతిపాదిత నిబంధనలు కొంత కాలానికి ఈ రంగం సామర్థ్యాలను బలోపేతం చేస్తాయని క్రిసిల్ రేటింగ్స్ నివేదిక తెలిపింది.

ఐపీవోకు 5 కంపెనీలు రెడీ
న్యూఢిల్లీ: కొద్ది రోజులుగా పుంజుకున్న ప్రైమరీ మార్కెట్ ప్రభావంతో పలు కంపెనీలు మరోసారి లిస్టింగ్ బాటలో సాగుతున్నాయి. తాజాగా ఐదు కంపెనీల ప్రాస్పెక్టస్‌లకు క్యాపిటల్ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ ఆమోదముద్ర వేసింది. జాబితాలో వెరిటాస్ ఫైనాన్స్, లక్ష్మీ ఇండియా ఫైనాన్స్, అజయ్ పాలీ, జజూ రష్మీ రిఫ్రాక్టరీస్, రెగాల్ రిసోర్సెస్ చేరాయి. ఈ 5 కంపెనీలు 2024 డిసెంబర్, 2025 జనవరిలో సెబీకి ముసాయిదా పత్రాలు దాఖలు చేశాయి. అయితే మరోపక్క ఈ ఏడాది జనవరి 6న లిస్టింగ్‌కు వీలుగా సెబీకి ప్రాథమిక పత్రాలను దాఖలు చేసిన ఎర్తూడ్ సరీ్వసెస్ ఇటీవల ఐపీవో డాక్యుమెంట్లను వెనక్కి తీసుకుంది.రూ. 2,800 కోట్లు: నాన్డిపాజిట్ ఎన్బీఎఫ్సీ వెరిటాస్ ఫైనాన్స్ ఐపీవో ద్వారా రూ. 2,800 కోట్లు సమీకరించే యోచనలో ఉంది. ఇందుకు అనుగుణంగా రూ. 600 కోట్ల విలువైన ఈక్విటీని తాజాగా జారీ చేయనుంది. వీటికి జతగా మరో రూ. 2,200 కోట్ల షేర్లను ప్రస్తుత వాటాదారులు విక్రయానికి ఉంచనున్నారు. రిటైల్ విభాగంపై అధిక దృష్టిపెట్టిన కంపెనీ ఈక్విటీ జారీ నిధులను రుణ విడుదలకు సహకరించే మూలధన పటిష్టతకు వినియోగించనుంది. ఎన్బీఎఫ్సీ..: ఎన్బీఎఫ్సీ.. లక్ష్మీ ఇండియా ఫైనాన్స్ ఐపీవోలో భాగంగా 1.04 కోట్ల ఈక్విటీ షేర్లను తాజాగా జారీ చేయనుంది. అంతేకాకుండా మరో 56.38 లక్షల షేర్లను ప్రమోటర్లు ఆఫర్ చేయనున్నారు. ఈక్విటీ జారీ నిధులను భవిష్యత్ అవసరాలకు సహకరించే మూలధన పటిష్టత, కార్పొరేట్ అవసరాలకు వినియోగించనుంది. రిఫ్రిజిరేషన్ సీలింగ్: రిఫ్రిజిరేషన్ సీలింగ్ సొల్యూషన్లు అందించే అజయ్ పాలీ ఐపీవోలో భాగంగా రూ. 238 కోట్ల విలువైన ఈక్విటీని తాజాగా జారీ చేయనుంది. వీటికి జతగా మరో 93 లక్షల షేర్లను ప్రమోటర్లు విక్రయానికి ఉంచనున్నారు. ఈక్విటీ జారీ నిధులను రుణ చెల్లింపులతోపాటు ప్లాంట్, మెషినరీ తదితర పెట్టుబడి వ్యయాలకు వెచి్చంచనుంది. రూ. 190 కోట్లు సహా..: రెగాల్ రిసోర్సెస్ ఐపీవోలో భాగంగా రూ. 190 కోట్ల విలువైన ఈక్విటీ షేర్లను తాజాగా జారీ చేయనుంది. వీటితోపాటు ప్రమోటర్ 90 లక్షల షేర్ల వరకూ ఆఫర్ చేయనున్నట్లు ప్రాస్పెక్టస్‌లో కంపెనీ పేర్కొంది. రూ. 150 కోట్లు మాత్రమే: ప్రాస్పెక్టస్ ప్రకారం జజూ రష్మీ రిఫ్రాక్టరీస్ ఐపీవోలో భాగంగా రూ. 150 కోట్ల విలువైన ఈక్విటీ షేర్లను కొత్తగా జారీ చేయనుంది. నిధులను జార్ఖండ్‌లోని బొకారో ఫెర్రో అల్లాయ్స్ విస్తరణకు వీలుగా కొత్త తయారీ సౌకర్యాలపై వెచి్చంచనుంది. నిధులలో కొంతమేర వర్కింగ్ క్యాపిటల్ అవసరాలకు సైతం వినియోగించనుంది.మెప్పించని ఏథర్ ఎనర్జీ ఎంట్రీ ముంబై: ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహన తయారీ సంస్థ ఏథర్ ఎనర్జీ షేరు లిస్టింగ్ రోజే నష్టాలు చవిచూసింది. ఇష్యూ ధర(రూ.321)తో పోలిస్తే బీఎస్ఈలో 1.57% స్వల్ప ప్రీమియంతో రూ.326 వద్ద లిస్టయ్యింది. ట్రేడింగ్ ప్రారంభంలో 4% లాభపడి రూ.333 వద్ద గరిష్టాన్ని తాకింది. అయితే మార్కెట్లో నెలకొన్న అనిశ్చితి పరిస్థితుల దృష్ట్యా షేరు అమ్మకాల ఒత్తిడికి లోనై ఆరంభ లాభాలు కోల్పోయింది. ఒకానొక దశలో 6.50% క్షీణించి రూ.300 వద్ద కనిష్టాన్ని తాకింది. చివరికి 6% నష్టంతో రూ. 302.50 వద్ద స్థిరపడింది. కంపెనీ మార్కెట్ వాల్యుయేషన్ రూ.11,267 కోట్లుగా నమోదైంది. ‘‘ఏథర్ ఎనర్జీ షేరు నామమాత్రపు ధరతో లిస్టింగ్ అవ్వడం, ఇంట్రాడేలో 6.50% పతనం పరిణామాలను పరిశీలిస్తే ఇన్వెస్టర్లు అధిక వాల్యుయేషన్ల పట్ల అప్రమత్తంగా ఉన్నట్లు తెలుస్తుంది’’ అని లెమాన్ మార్కెట్స్ డెస్క్ విశ్లేషకుడు గౌరవ్ గార్గ్ తెలిపారు.

లాభాల్లోంచి నష్టాల్లోకి..
ముంబై: భారత్ – పాకిస్తాన్ల మధ్య నెలకొన్న యుద్ధ పరిస్థితుల నేపథ్యంలో ఇన్వెస్టర్లు అప్రమత్తత వహిస్తూ లాభాల స్వీకరణకు పాల్పడ్డారు. ఫలితంగా మంగళవారం సెన్సెక్స్ 156 పాయింట్లు నష్టపోయి 80,641 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 82 పాయింట్లు పతనమై 24,380 వద్ద నిలిచింది. ఉదయం సూచీలు సానుకూలంగా మొదలయ్యాయి. అమెరికా ఫెడరల్ రిజర్వ్ పాలసీ నిర్ణయాలు, యూఎస్–చైనా వాణిజ్య చర్చల నేపథ్యంలో పరిమిత శ్రేణిలో ట్రేడయ్యాయి. ఒక దశలో సెన్సెక్స్ 316 పాయింట్లు క్షీణించి 80,481 వద్ద, నిఫ్టీ 130 పాయింట్లు పతనమై 24,331 వద్ద కనిష్టాన్ని తాకాయి. ఫెడ్ వడ్డీరేట్ల కోత ఉండకపోవచ్చనే అంచనాలతో అంతర్జాతీయ ఈక్విటీ మార్కెట్లు స్వల్ప నష్టాల్లో ట్రేడవుతున్నాయి. ⇒ ఆటో, టెక్ మినహా అన్ని రంగాల షేర్లలో అమ్మకాలు తలెత్తాయి. బీఎస్ఈలో రంగాల వారీగా సూచీల్లో రియల్టీ 3.5%, విద్యుత్, సర్వీసెస్ 2.5%, యుటిలిటీ, ఇండస్ట్రీయల్, క్యాపిటల్ గూడ్స్ 2%, కన్జూమర్ డ్యూరబుల్స్ ఒకటిన్నర శాతం నష్టపోయాయి. మిడ్, స్మాల్ క్యాప్ సూచీలు 2%కి పైగా క్షీణించాయి.
ఫ్యామిలీ

కనుమరుగవుతున్న మామిడి వెరైటీలు ఇవే..!
ప్రపంచంలో మామిడిపండ్లకు చిరునామాగా సగర్వంగా నిలిచిన భారతదేశం, అనేకరకాల ప్రాదేశిక మామిడి పండ్లను కలిగి ఉంది. వీటిలో ప్రతీ మామిడి రకం తనదైన ప్రత్యేకమైన రుచి, సువాసన, సాంస్కృతిక నేపథ్యంతో ప్రసిద్ధి చెందింది. కానీ మార్కెట్ ఆధారిత వ్యవస్థ వల్ల వాణిజ్యపరంగా మొలకెత్తిన హైబ్రిడ్ రకాల ప్రభావంతో, ఈ విలువైన దేశీ మామిడి రకాలు క్రమంగా అదృశ్యం అవుతున్నాయి. ఇప్పటికే అన్ని చోట్లా లభించడం తగ్గిపోయిన ఈ మామిడి రకాలను ఈ వేసవి టూర్ల సందర్భంగా ఎక్కడైనా దొరికితే ఆస్వాదించడం మరచిపోవద్దు. 1. కరుప్పట్టి కాయ – తమిళనాడుతమిళనాడు దక్షిణ ప్రాంతాల్లో పుట్టిన ఈ కరుప్పట్టి కాయ ప్రత్యేకత ఏమిటంటే, ఇది చక్కెర పాకం (పామ్ జాగరీ)ను తలపించే రుచిని కలిగి ఉంటుంది. ఈ మామిడి పచ్చిగా తినడానికి కూడా బాగుంటుంది. అలాగే పచ్చళ్ల తయారీలో విరివిగా ఉపయోగిస్తారు. ఆకుపచ్చ రంగు ఫైబర్‌తో నిండిన గుజ్జుతో ఇది ప్రత్యేకంగా గుర్తింపు పొందింది.2. కన్నిమాంగా – కేరళకేరళలో కన్నిమాంగా అనే చిన్న మామిడికాయలు పచ్చడికి ప్రసిద్ధి. ‘కన్నిమాంగా‘ అంటే ‘కన్య మామిడి‘, అంటే పూర్తి పక్వతకు ముందు కోయబడే కాయలు. ఈ రకాన్ని పచ్చడి రూపంలో వాడితే, కేరళ వంటకాల మసాలా రుచులకు ఇది సరిపోతుంది. అధిక దిగుబడి కలిగిన వాణిజ్య రకాల సాగు పెరిగిన నేపథ్యంలో, ఈ మామిడి మొక్కలు చాలా వరకు కనుమరుగవుతున్నాయి. అయితే స్థానిక రైతులు గిరిజన సంఘాలు దీన్ని రక్షించేందుకు ప్రయత్నాలు చేస్తున్నాయి.3. కల్భావి మావు – కర్ణాటకకర్ణాటక తీరప్రాంతాలలో పుట్టిన కల్భావి మావు మామిడి, గులాబీ వాసన తీపి రుచితో కొత్తగా ఉంటుందనే పేరు సంపాదించింది. ఇది గోల్డెన్ యెల్లో రంగులో మధ్య పరిమాణంలో ఉంటుంది. అదనపు తీపి కలిగి ఉండడంతో నేరుగా తినడానికి మాత్రమే కాకుండా స్వీట్స్ తయారీలో కూడా వాడేవారు. ఇటీవలి వరకూ మార్కెట్లలో విరివిగా లభించిన ఈ రకం, క్రమంగా తగ్గిపోతోంది. 4. బటాషా – పశ్చిమ బెంగాల్బెంగాల్కు చెందిన బటాషా మామిడి, బాగా తీయగా ఉంటుంది. ఇది చిన్న పరిమాణంలో ఉండి, రసం నిండిన గుజ్జుతో ఉంటుంది అయితే దీని మృదువైన తొక్క ఎక్కువ దూరాలకు తరలించలేనంత సున్నితంగా ఉండటంతో, ఈ మామిడి వాణిజ్యం పెద్దగా పుంజుకోలేదు. దాంతో దీని సాగు కూడా తగ్గిపోతోంది. ప్రస్తుతం ఇది కేవలం కొన్ని గ్రామీణ ప్రాంతాల్లో మాత్రమే కనిపిస్తోంది.5. అమ్మ చెట్టు – ఆంధ్రప్రదేశ్ఈ మామిడి రకాన్ని అందించే చెట్టుకు తెలుగులో ‘‘అమ్మ చెట్టు’’ అనే పేరు, మామిడికి కూడా అదే పేరు. పెద్దదైన పరిమాణం, ఫైబర్‌తో నిండిన గుజ్జుతో ఉన్న ఈ మామిడి చెట్లు గ్రామీణ జీవన విధానంలో భాగంగా ఉండేవి. అయితే, ఈ చెట్ల నిర్వహణ కష్టం కావడంతో, ఈ రకం సాగు తగ్గిపోయింది. ఇక ఇది కేవలం కథల్లో, జ్ఞాపకాలలో మాత్రమే మిగిలిపోనుంది. అధిక దిగుబడి, హైబ్రిడ్ రకాలపై దృష్టి పెరగడంతో దేశీ రకాల మామిడి ప్రాధాన్యత తగ్గిపోయింది. అలాగే టెంక లేని పండ్లను ఇష్టపడే ఆధునిక వినియోగదారుల అభిరుచి వల్ల, స్వాభావికంగా పెరిగే దేశీ రకాల విస్త్రుతికి అడ్డంకి ఏర్పడింది. మరోవైపు నగరీకరణ విస్తరణ వల్ల తోటలపై భౌగోళిక ఒత్తిడి పెరిగింది. యువతలో దేశీరకాల గురించి అవగాహన లేకపోవడం కూడా సాగును దెబ్బతీసింది.ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో... కారణాలేవైనా మనదైన మామిడి వెరైటీలను మనం కోల్పోతుండడం దురదృష్టకర పరిణామమేనని చెప్పాలి.(చదవండి: కల్తీ పుచ్చకాయను పసిగట్టొచ్చు ఇలా..!)

మంచి పుచ్చకాయను గుర్తించండి ఇలా!
వేసవిలో లభించే పుచ్చకాయలు అందరికీ ఇష్టం, అంతకంటే చల్లని నేస్తాల వంటివి అనొచ్చు. వాటి సహజమైన తీపి, అధిక నీటి శాతం వాటి రిఫ్రెషింగ్ రుచితో పాటు కలర్‌ఫుల్ రూపం కూడా సమ్మర్లో వాటిని తిరుగులేనివి పండుగా నిలబెట్టాయి. ఈ పుచ్చకాయల వల్ల ఆరోగ్య ప్రయోజనాలూ అనేకం...పుచ్చకాయ కేవలం అలసిపోయినప్పుడు రిఫ్రెష్ చేసే పండు మాత్రమే కాదు, అవసరమైన పోషకాలతో కూడా నిండి ఉంటుంది. దాదాపు 9092% నీటితో కూడిన పుచ్చకాయ, వేసవి వేడి సమయంలో హైడ్రేషన్ కోసం ఒక అద్భుతమైన ఎంపిక. ఒక 100 గ్రాముల పుచ్చకాయ ద్వారా దాదాపు 16 కేలరీలు లభిస్తాయి తక్కువ కేలరీల పండుగా, బరువును నియంత్రించుకునే వారికి పుచ్చకాయ అనుకూలంగా ఉంటుంది. దీనిలో సి, ఎ, బి6 విటమిన్లు అలాగే పొటాషియం మెగ్నీషియం సమృద్ధిగా ఉంటుంది. పొటాషియం మెగ్నీషియం రక్తపోటును నియంత్రించడంలో సహాయపడటం వలన ఈ పండు అధిక రక్తపోటు ఉన్నవారికి మరింత ప్రయోజనకరం. దీని విటమిన్ సి కంటెంట్ శక్తివంతమైన యాంటీఆక్సిడెంట్‌గా కూడా పనిచేసి వివిధ వ్యాధులకు దారితీసే ఫ్రీ రాడికల్స్‌ను తొలగిస్తుంది. పుచ్చకాయ జీర్ణక్రియకు సహాయపడుతుంది, దానిలోని ఇనుము శాతం కారణంగా రక్తహీనత ఉన్నవారికి మంచిది. పండులోని ఎరుపు భాగాన్ని తరచుగా అత్యంత రుచికరంగా పరిగణిస్తారు, అయితే చర్మం దగ్గర ఉన్న లేత ఆకుపచ్చ రంగులో ఉండే భాగం సైతం ఎక్కువ పోషక ప్రయోజనాలను అందిస్తుంది. ఆరోగ్యపరంగా పుచ్చకాయ వల్ల ఎన్నో లాభాలు ఉన్నప్పటికీ, దానిని కొనుగోలు చేసేటప్పుడు అప్రమత్తంగా ఉండటం చాలా ముఖ్యం. వేసవి నెలల్లో, రోడ్డు పక్కన ఎర్రగా, కోసిన పుచ్చకాయ రూపం ఆకర్షణీయంగా ఉంటుంది. అయితే, మార్కెట్లో చాలా కల్తీ పుచ్చకాయలు ఉన్నాయి, మరి తాజా, ఆరోగ్యకరమైన పుచ్చకాయను కొనుగోలు చేస్తున్నారని తెలుసుకోవడం ఎలా? నాణ్యత లేని పండ్ల ద్వారా మోసపోకుండా ఆరోగ్యాన్ని పాడు చేసుకోకుండా ఉండడం ఎలా? ఇప్పుడు చూద్దాం..కల్తీ పుచ్చకాయ అంటే హానికరమైన రసాయనాలు, రంగులు లేదా ఆర్టిషియల్ రిపైనింగ్ ఏజెంట్లను ఉపయోగించి దాని రూపాన్ని లేదా బరువును పెంచడానికి తారుమారు చేసిన పండు. సాధారణ కల్తీ పద్ధతుల్లో దాని గుజ్జును ఎర్రగా కనిపించేలా చేయడానికి ఆర్టిషియల్ కలర్‌ను ఇంజెక్ట్ చేయడం, బరువు పెంచడానికి నీటిని జోడించడం లేదా తాజాదనాన్ని కాపాడటానికి రసాయనాలను ఉపయోగించడం వంటివి చేస్తున్నారు. ఈ పద్ధతులు మన ఆరోగ్యానికి హానికరం, కాబట్టి విశ్వసనీయ విక్రేతల నుంచి మాత్రమే పుచ్చకాయలను కొనుగోలు చేయడం సహజ పక్వత సంకేతాలను తనిఖీ చేయడం ముఖ్యంమంచి పుచ్చకాయను ఎలా గుర్తించాలి? పుచ్చకాయను కొనుగోలు చేసేటప్పుడు, రంగు ముఖ్యం. నిస్తేజమైన చర్మం ఉన్న దాని కంటే శక్తివంతమైన, తగిన రంగు కలిగిన పుచ్చకాయ మంచి ఎంపిక. పక్వానికి ముఖ్య సూచిక దానిని తట్టినప్పుడు వచ్చే శబ్దం బోలుగా ఉండే, తేలికపాటి శబ్దం పండు నీటితో నిండి ఉందని మంచిదని సూచిస్తుంది. అదనంగా, ఏవైనా మచ్చలు లేదా గాయాలు ఉన్నాయా అని పుచ్చకాయను తనిఖీ చేయాలి, ఎందుకంటే ఇవి నష్టం లేదా చెడిపోవడాన్ని సూచిస్తాయి. పుచ్చకాయ అడుగున పసుపు మచ్చల కోసం ఉండాలి. అలా మచ్చలు ఉంటే ఈ పుచ్చకాయను సరైన సమయంలో సహజంగా పండించారని అర్ధం. అయితే, లేత లేదా తెల్లటి మచ్చలు ఉంటే పండు పూర్తిగా పక్వానికి రాకముందే కోసినట్లు అర్ధం View this post on Instagram A post shared by Adithya Nataraj 🇮🇳 (@learnwithadithya) (చదవండి: World Asthma Day: శ్వాసకు ఊపిరి పోద్దాం..! ఆస్తమాను అదుపులో ఉంచుదాం..!)

జపాన్‌లో శాకాహారమా..? సలాడ్లతో సరిపెట్టుకోవాల్సిన పనిలేదు..
అందమైన దేశంలో ఒకటిగా పేరుగాంచింది జపాన్. అక్కడ నగరాలన్నీ ప్రకృతి రమణీయతతో ఆహ్లాదభరితంగా ఉంటాయి. తప్పక పర్యటించాల్సిన దేశమే అయినా..పర్యాటకులకు ఇబ్బంది కలిగించేది ఆహారం. అందులోనూ శాకాహారులే అయితే మరింత సమస్య. అక్కడ ఏది ఆర్డర్ చేసిన అందులో తప్పనిసరిగా ఏదో ఒక నాన్‌వెజ్ ఉంటుంది. తినాలంటేనే భయం భయంగా ఉంటుంది. అందుకే అక్కడ పర్యటించే టూరిస్ట్‌లు స్టోర్స్‌లో దొరికే సలాడ్లు వంటి ఇతర పదార్థాలపై ఆధారపడతారు. ఇక అలా ఇబ్బంది పడాల్సిన పనిలేదు అంటూ జపాన్‌లో కూడా శాకాహారం దొరుకుతుందని చెబుతోంది బాలీవుడ్ నటి బర్ఖాసింగ్. ఇంతకీ జపాన్‌లో ఎక్కడ శాకాహారం లభిస్తుందంటే..జపాన్‌లో ఒసాకా, క్యోటో, టోక్యో అంతట మనకు శాకాహార భోజనం లభిస్తుందట. ఇక్కడ అందించే వంటకాల్లో చేపలు లేదా మాంసాన్ని జోడించకుండా టమోటా ఆధారిత రెసిపీలు ఎక్కువగా దొరుకుతాయట. అక్కడ పూర్తి శాఖాహారం తోకూడిన వేగన్ మెనూ పర్యాటకుల్ని ఆకర్షిస్తుందట. అందువల్ల ఎలాంటి సంకోచంల లేకుండా నచ్చిన వంటకాలన్నీ ఆస్వాదించొచ్చు అని చెబుతున్నారు నటి బర్ఖాసింగ్. చాక్లెట్ గ్యో ఐస్ క్రీం, సోబా నూడుల్స్ వంటి టేస్టీ టేస్టీ వంటకాల రుచి చూడొచ్చట. ఇక కోకో ఇచిబన్యా రెస్టారెంట్ కూరగాయలతో చేసిన కర్రీలకు ఫేమస్ అట. అక్కడ మనకు తెలియని కొంగొత్త కూరగాయల రుచులు మైమరిపిస్తాయని చెబుతోంది బర్ఖాసింగ్. అలాగే అక్కడ ఉండే చిన్న చిన్న స్టాల్స్ మెత్తటి చీజ్‌కేక్, కస్టర్డ్ నిండిన పాన్కేక్లకు పేరుగాంచినవని చెబుతున్నారు. అందుకు సంబంధించిన వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది. కాగా, బాలీవుడ్ నటి, మోడల్ బర్ఖాసింగ్ పలు సినిమాలు, టీవీ షోల్లో నటించింది. అంతేగాదు వైవిధ్యభరితమైన నటనకు ప్రసిద్ధిగాంచిన నటి బర్ఖాసింగ్. View this post on Instagram A post shared by Barkha Singh (@barkhasingh0308) (చదవండి: 16 ఏళ్లకే బ్రెస్ట్ కేన్సర్ సర్జరీ..! జస్ట్ 15 రోజుల్లేనే మిస్ వరల్డ్ వేదికకు..)

గడ్డకట్టిన మంచుపై పరుగు పందెం..! సత్తాచాటిన భాగ్యనగరవాసులు
ఆత్మవిశ్వాసం ఉండాలే గానీ అసాధ్యం అంటూ ఏదీ ఉండదు? అరుదైన సాహసాలు చేయాలనే తపన ఉండాలే గానీ..అద్భుతాలు సృష్టించవచ్చు.. ఘనమైన ప్రతిభను పొందవచ్చు.. అంటున్నారు హైదరాబాద్ నగరానికి చెందిన అడ్వెంచర్ టూరిస్టులు. నగరంలో సాహసికులు పెరుగుతున్న కొద్దీ వైవిధ్య భరిత సాహసాలు కూడా వెలుగు చూస్తున్నాయి. ఇదే క్రమంలో నగరానికి చెందిన నలుగురు భిన్న రంగాలకు చెందిన ఔత్సాహికులు ప్రపంచంలోనే అత్యంత ఎత్తయిన పర్వతంగా గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ గుర్తించిన పాంగోంగ్ ఫ్రోజెన్ లేక్‌లో హాఫ్ మారథాన్‌లో పాల్గొని హైదరాబాద్ నగరం నుంచి ఆ ఘనతను దక్కించుకున్నారు. లద్దాఖ్, ఫిబ్రవరి 24–25, 2025: ప్రపంచంలోనే అత్యంత ఎత్తులో జరిగే మంచు సరస్సు మారథాన్‌గా ప్రసిద్ధి పొందిన పాంగోంగ్ ఫ్రోజెన్ సరస్సు మారథాన్ ఈ ఏడాది కూడా లద్దాఖ్‌లో ఘనంగా జరిగింది. ఇది కేవలం రన్నింగ్ ఈవెంట్ మాత్రమే కాకుండా, హిమాలయాల్లో వేగంగా కరుగుతున్న హిమనీనదాలపై మరియు వాతావరణ మార్పుల ప్రభావంపై చైతన్యాన్ని పెంచే ప్రయత్నం కూడా. రన్ విశేషాలివీ.. హిమాలయాల్లో కరుగుతున్న హిమనీనదాలు, తగ్గుతున్న మంచు సరస్సుల వల్ల భవిష్యత్తు మార్పులపై అవగాహన కల్పించటం కోసం లద్దాఖ్‌లోని పాంగోంగ్ సరస్సులో 4,273 మీటర్ల ఎత్తులో 2023లో మొదటిసారి ఈవెంట్ నిర్వహిస్తున్నారు. ఈ మారథాన్, గిన్నిస్ వరల్డ్ రికార్డులో ‘అత్యంత ఎత్తులో జరిగే మంచు సరస్సు మారథాన్’గా గుర్తింపు పొందింది. తాజా రన్లో అమెరికా, నేపాల్, కొరియా, ఆ్రస్టేలియా, భారత్‌కు చెందిన అంతర్జాతీయ రన్నర్లు పాల్గొన్నారు. పరిస్థితులు ఇలాగే కొనసాగితే భవిష్యత్తులో ఇలాంటి ఈవెంట్లు జరగకపోవచ్చని హెచ్చరిస్తూ, పర్యావరణాన్ని కాపాడాల్సిన అవసరాన్ని చాటుతూ నిర్వహించే ఈ మారథాన్‌ను ‘ది లాస్ట్ రన్’ అని కూడా పిలుస్తారు. నగరానికి చెందిన ప్రవీణ్ గోయెల్, నవీన్ సింకా, బిక్కినా వెంకట రాజేష్ రతన్ నలుగురూ వేర్వేరు రంగాలకు చెందిన వారు. అయితే వీరంతా.. సమవయస్కులు కూడా కాదు. అయితేనేం.. అభిరుచి వారిని కలిపింది. ఆత్మవిశ్వాసం వారిని విజయ శిఖరాన నిలిపింది. ‘ఇంట్లో వాళ్లు వద్దనే చెప్పారు. కానీ.. అప్పటికే సైక్లింగ్, రన్నింగ్ వంటివి అలవాటయ్యాయి. అందుకే దీన్ని ప్రయత్నించడం భయం అనిపించలేదు’ అని చెప్పారు వ్యాపారి ప్రవీణ్గోయెల్. ‘16 డిగ్రీల చలిని పట్టించుకోకుండా కదులుతూ ఉండటానికి చేసిన మానసిక ప్రయత్నం..ఫలించింది. భయాన్ని అధిగమించడానికి సహాయపడింది’ అని భారత నావికాదళంలో అధికారిగా పనిచేసే రతన్ (29) చెప్పారు. ‘గత 15 సంవత్సరాలుగా మారథాన్ రన్నర్, బ్యాడ్మింటన్ ఆటగాడిగా అనుభవం ఉంది. అయినప్పటికీ ఇది పూర్తిగా ప్రత్యేకం అంటున్నారు ఐటీ నిపుణులు నవీన్ సింకా (45). పరుగులో మా ముఖాలు మొద్దుబారిపోయాయి. మా దగ్గర ఉన్న నీరు కూడా పరుగు మధ్యలో గడ్డకట్టుకుపోయింది’ అంటూ గుర్తు చేసుకున్నారు. ‘గ్లోబల్ వార్నింగ్ కారణంగా, పాంగోంగ్ త్వరలో గడ్డకట్టడం ఆగిపోవచ్చు’ అని మరో ఐటీ ప్రొఫెషనల్ (50) రాజేష్ చెప్పారు. ‘తనకు ఇది వ్యక్తిగత రికార్డ్ కన్నా ఎక్కువ అని, ఈ రన్లో ఇమిడి ఉన్న సందేశమే తనకు ముఖ్యమని అంటున్నారాయన. లాస్ట్ రన్ పేరు ఆకర్షణీయంగా అనిపించవచ్చు కానీ.. దాని వెనుక అంతరార్థం మాత్రం ఆందోళనకరం’ అని చెప్పారు.విభిన్న నేపథ్యాల నుంచి..నావికాదళ అధికారి, కార్పొరేట్ వ్యవస్థాపకుడు, సాఫ్ట్వేర్ నిపుణుడు, ఐటీ మారథానర్ – వంటి విభిన్న నేపథ్యాలున్నప్పటికీ, ఈ నలుగురూ అవరోధాలను అధిగమించి అనూహ్యమైన రికార్డు సాధించారు. నగరానికి తిరిగి వచ్చిన వారి ప్రయాణం కొత్త లక్ష్యాల దిశగా సాగనుంది. ఐరన్ మ్యాన్ గోవా అనే ఈవెంట్‌పై రతన్ తన దృష్టి పెట్టారు. కిలిమంజారోను అధిరోహించాలని నవీన్ యోచిస్తుంటే, రాజేష్ 6000+ మీటర్ల హిమాలయ శిఖరంపై సూపర్ రాండన్నూర్ సైక్లింగ్ హోదాను గురిపెట్టారు. పాంగోంగ్ నుంచి కొత్తగా ప్రేరణ పొందిన ప్రవీణ్ మరిన్ని సాహసాలను అన్వేషిస్తున్నారు.(చదవండి: 16 ఏళ్లకే బ్రెస్ట్ కేన్సర్ సర్జరీ..! జస్ట్ 15 రోజుల్లేనే మిస్ వరల్డ్ వేదికకు..)
ఫొటోలు


తిరుమలలో వైభవంగా శ్రీ పద్మావతీ పరిణయోత్సవాలు (ఫొటోలు)


భారత్ తడాఖా.. ఆపరేషన్ సిందూర్‌తో పాకిస్తాన్ విలవిల (ఫొటోలు)


మిస్ వరల్డ్ పోటీల విలేకరుల సమావేశంలో నందినీ గుప్తా, సోనూసూద్ (ఫొటోలు)


ఘనంగా తిరుపతి గంగమ్మ జాతర ప్రారంభం (ఫొటోలు)


మెట్‌గాలా 2025 ఈవెంట్లో మెరిసిన ఇషా అంబానీ (ఫోటోలు)


'శుభం' కోసం తెగ కష్టపడుతున్న సమంత (ఫొటోలు)


భాగ్యశ్రీ బోర్సే బర్త్ డే స్పెషల్.. కిక్ ఇచ్చే ఫోటోలు చూశారా..?


గోదావరి ప్రజల ఆరాధ్య దైవం.. శ్రీ తలుపులమ్మ తల్లి దేవాలయం (ఫొటోలు)


#MetGala2025 : చరిత్ర సృష్టించిన కియారా.. మొదటిసారి బేబీ బంప్‌తో ఇలా! (ఫొటోలు)


కుమారుడి ధోతి వేడుక.. ఫోటోలు షేర్ చేసిన బుల్లితెర నటి మంజుల (ఫొటోలు)
అంతర్జాతీయం

గాజా ఆక్రమణకు పన్నాగం!
టెల్ అవీవ్: హమాస్ మిలిటెంట్ సంస్థను సమూలంగా నాశనం చేసి, గాజా స్ట్రిప్‌ను పూర్తిగా హస్తగతం చేసుకొనే దిశగా ఇజ్రాయెల్ అడుగులు వేస్తోంది. మొత్తం గాజా భూభాగాన్ని నిరవధికంగా ఆక్రమించే ప్రణాళికకు ఇజ్రాయెల్ మంత్రివర్గం సోమవారం ఆమోద ముద్ర వేసింది. ఇందుకోసం ఓటింగ్ నిర్వహించారు. గాజా ఆక్రమణకు కేబినెట్ సంపూర్ణ అంగీకారం తెలిపింది. ఇద్దరు సీనియర్ అధికారులు ఈ విషయం వెల్లడించారు. అక్కడి నుంచి ఎప్పుడు ఖాళీ చేయాలన్న దానిపై ఇజ్రాయెల్ కేబినెట్ ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. అంటే గాజా స్ట్రిప్ రాబోయే కొన్ని దశాబ్దాల పాటు ఇజ్రాయెల్ ఆధీనంలోనే ఉండిపోయే అవకాశాలు లేకపోలేదు. హమాస్‌ను ఓడించి, బందీలను విడిపించడమే లక్ష్యంగా రంగంలోకి దిగాలని వేలాది మంది రిజర్వ్ సైనికులకు ఇజ్రాయెల్ సైన్యం పిలుపునిచ్చింది. పాలస్తీనా భూభాగంలో అతిత్వరలోనే భీకర స్థాయిలో సైనిక ఆపరేషన్ ప్రారంభమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. హమాస్‌ను ఖతం చేయాలన్న పట్టుదలతో ఇజ్రాయెల్ వ్యవహరిస్తోంది. ఇజ్రాయెల్ నిర్ణయంపై అంతర్జాతీయ సమాజం నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తం కావడం ఖాయమని నిపుణులు చెబుతున్నారు. గాజాను ఆక్రమించడం అంత సులభం కాదంటున్నారు.అమల్లోకి ట్రంప్ ప్లాన్! 40కిలోమీటర్లకుపైగా పొడవు, 20 కిలోమీటర్ల వెడల్పు ఉండే గాజాను ప్రపంచంలోనే అతిపెద్ద బహిరంగ జైలుగా పరిగణిస్తుంటారు. గాజాలోని పాలస్తీనా పౌరులను ఇతర దేశాలకు తరలించి, గాజాను అద్భుతమైన పర్యాటక ప్రాంతంగా తీర్చిదిద్దుతామని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ గతంలో ప్రకటించారు. దీనిపై ప్రపంచ దేశాలు ఆగ్రహం వ్యక్తం చేశాయి. ఇజ్రాయెల్ మిత్రదేశాలు సైతం తప్పుపట్టాయి. ట్రంప్ ప్లాన్‌లో భాగంగానే గాజాను పూర్తిగా హస్తగతం చేసుకోవడానికి ఇజ్రాయెల్ ఎత్తుగడలు వేస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే 50 శాతం గాజా భూభాగం ఇజ్రాయెల్ అధీనంలోకి వచ్చింది. మిగిలిన ప్రాంతాన్ని సైతం త్వరలో ఆక్రమించబోతోంది. అయితే, గాజా ప్రజలను ఏం చేస్తారన్నది ఇంకా తెలియరాలేదు. వారందరినీ దక్షిణ గాజాకు తరలించనున్నట్లు సమాచారం. ఇజ్రాయెల్ కేబినెట్ తాజా నిర్ణయం పట్ల బందీల తీవ్రస్థాయిలో కుటుంబ సభ్యులు మండిపడ్డారు. హమాస్ మిలిటెంట్ల జోలికి వెళితే బందీలెవరూ ప్రాణాలతో మిగలరని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గాజాను ఆక్రమించాలన్న ఆలోచన మానుకోవాలని కోరుతున్నారు. హమాస్‌పై ఒత్తిడి పెంచడంలో భాగంగా గాజాకు అంతర్జాతీయ మానవతా సాయాన్ని ఇజ్రాయెల్ అనుమతించడం లేదు.

మూడోసారి పోటీ చేయను: ట్రంప్
వాషింగ్టన్: మూడో దఫా అధ్యక్ష బరిలోకి దిగకూడదని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నిర్ణయించుకున్నాన్నారు. మళ్లీ పోటీ చేసే ప్రసక్తే లేదని అధికారికంగా ప్రకటించారు. ఆదివారం ఎన్బీసీ మీట్ ది ప్రెస్ మోడరేటర్ క్రిస్టెన్ వెల్కర్ ఇంటర్వూలో ఆయన మాట్లాడారు. రెండో విడత అనంతరం వైట్‌హౌస్‌ను వీడనున్నట్లు ధ్రువీకరించారు. తాను మొదలు పెట్టిన మేక్ అమెరికా గ్రేట్ అగైన్ (ఎంఏజీఏ) ఉద్యమం మాత్రం కొనసాగుతుందన్నారు. దానికి ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్, విదేశాంగ మంత్రి మార్కో రూబియో వారసులని ప్రకటించారు. తాను పదవి నుంచి దిగిపోయాక వారికి అమెరికా సమాజం భారీగా మద్దతిస్తుందని విశ్వాసం వ్యక్తం చేశారు. ‘‘వాన్స్ అద్భుతమైన, తెలివైన వ్యక్తి. రూబియో గొప్ప వ్యక్తి’’అని ప్రశంసించారు. 2028లో రిపబ్లికన్ల అధ్యక్ష అభ్యరి్థగా వాన్స్‌కు అవకాశం ఉంటుందా అన్న ప్రశ్నకు బదులిస్తూ, ‘‘ఆ విషయంలో ప్రస్తుత ఉపాధ్యక్షునికి కచ్చితంగా సానుకూలత ఉంటుంది. అతను గొప్పవాడైతే కచ్చితంగా అవకాశం దక్కుతుందనే అనుకుంటున్నా’’అని బదులిచ్చారు. రూబియోను సైతం ట్రంప్ ప్రశంసించారు. ట్రంప్ రెండో హయాంలో పాలన వ్యవహారాల్లో రూబియో గణనీయ పాత్ర పోషిస్తున్నారు. రూబియో పనితీరు, ఇతర ఫెడరల్ ఏజెన్సీలతో ఆయన సమన్వయం చేసుకుంటున్న తీరు తదితరాలను ట్రంప్ ప్రస్తావించారు. గతంలో హెన్రీ కిస్సింజర్ కూడా ఏకకాలంలో పలు ఉన్నత పదవులను సమర్థంగా నిర్వహించారని గుర్తు చేశారు. అయితే తన వారసుడిని ఇప్పుడే ఎంపిక చేయడం తొందరపాటేనని అభిప్రాయపడ్డారు. ఐక్యతే రిపబ్లికన్ పార్టీ బలమని చెప్పుకొచ్చారు. ఒక వ్యక్తి రెండు కంటే ఎక్కువసార్లు అధ్యక్షుడు కావడాన్ని అమెరికా రాజ్యాంగం నిషేధిస్తోంది. అయినా మూడోసారీ అధ్యక్షుడు కావాలని ఉందని ట్రంప్ ఇటీవల పలుమార్లు చెప్పారు. 2028లో మళ్లీ పోటీ చేసేందుకు రిపబ్లికన్ సభ్యుల నుంచి తనకిప్పటికే ప్రోత్సాహం లభించిందని కూడా చెప్పుకున్నారు. తాను ఉపాధ్యక్ష పదవికి, వాన్స్ అధ్యక్ష పదవికి పోటీ చేసి, నెగ్గాక వాన్స్ తప్పుకుని తాను తిరిగి పగ్గాలు చేపట్టే అవకాశం కూడా ఉందని ట్రంపే చెప్పారు. దీనిపై పలు విమర్శలూ వచ్చాయి. చర్చోపచర్చలు జరిగాయి. ట్రంప్ సొంత ఆన్లైన్ సంస్థ ఇప్పటికే ‘ట్రంప్ 2028’పేరుతో టోపీలు, టీ షర్టులను మార్కెట్లోకి తీసుకొచ్చింది.

అతిథుల్లా వ్యవహరించలేదో..గ్రీన్‌కార్డ్ కోల్పోతారు
వాషింగ్టన్: అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కఠిన వలస విధానాలు భారతీయులతో సహా అమెరికాలోని వేలాది మంది గ్రీన్‌కార్డు హోల్డర్లలో గుబులు రేపుతున్నాయి. వలసదారులు అమెరికాలో అతిథుల్లా ప్రవర్తించాలని ట్రంప్ సర్కారు తాజాగా హితవు పలికింది. ‘‘లేదంటే గ్రీన్‌కార్డ్ కోల్పోతారు. అంతేకాదు, దేశం నుంచి బహిష్కరణకు గురవుతారు’’అంటూ హెచ్చరించింది. గ్రీన్‌కార్డుదారులు అమెరికా చట్టాలు, విలువలకు కట్టుబడి ఉండాల్సిందేనని స్పష్టం చేసింది. శాశ్వత నివాస హక్కు రద్దుకు దారితీసే కారణాల జాబితాను యూఎస్ సిటిజన్‌షిప్ అండ్ ఇమిగ్రేషన్ సర్వీసెస్ (యూఎస్సీఐఎస్) విడుదల చసింది. విదేశీయులు చట్టాన్ని ఉల్లంఘిస్తే గ్రీన్ కార్డులు, వీసాలు రద్దు చేస్తామని తెలిపింది. ‘‘అమెరికా చట్టాలను, విలువలను గౌరవించాలి. హింసను సమర్థిస్తే, ఉగ్రవాద కార్యకలాపాలకు మద్దతిస్తే, అలా చేయాల్సిందిగా ఇతరులను ప్రోత్సహిస్తే అమెరికాలో ఉండటానికి అర్హులు కాదు. గ్రీన్‌కార్డుదారులను కూడా కఠినంగా తనిఖీ చేయడానికి ఏజెన్సీలకు అధికారముంది. డిపార్ట్మెంట్ ఆఫ్ హోంల్యాండ్ సెక్యూరిటీతో కలిసి దీనిపై నిరంతరం పనిచేస్తున్నాం. అమెరికాను మళ్లీ సురక్షితంగా తీర్చిదిద్దడానికి ఈ అప్రమత్తత చాలా అవసరం’’అని యూఎస్సీఐఎస్ పేర్కొంది. ఈ విధానాలను ప్రకటించిన అనంతరం విదేశాంగ మంత్రి మార్కో రూబియో మాట్లాడారు. అమెరికా ఔదార్యాన్ని దురి్వనియోగం చేసే శకం ముగిసిందన్నారు. ట్రంప్ సర్కారు తాజా హెచ్చరికలు గ్రీన్కార్డ్దారుల్లో ఆందోళనలను మరింత పెంచుతున్నాయి. అమెరికాలోని భారతీయులకు అక్కడ గ్రీన్‌కార్డ్, శాశ్వత నివాసం పొందడం ఇప్పటికే క్లిష్టంగా మారింది. ఉపాధి ఆధారిత గ్రీన్‌కార్డుల కోసం ఏకంగా 50 ఏళ్లు, అంతకు మించి ఎదురు చూడాల్సిన పరిస్థితి! తీరా శాశ్వత నివాసాన్ని పొందినా అమెరికాలో భవిష్యత్తుకు భద్రత లేదని, చిన్న పొరపాటు చేసినా దేశ బహిష్కారానికి దారి తీయొచ్చని కొత్త నిబంధనలు సూచిస్తున్నాయి. పాత నిబంధనల ప్రకారం వీసా రద్దు తదితరాల విషయంలో వలసదారులకు చట్టపరమైన రక్షణ ఉంది. కొత్త విధానంలో దాన్ని తొలగించారు. అప్పీల్ కూడా లేకుండా వీసా రద్దుకు, బహిష్కరణకు వీలు కల్పించారు.

'ట్రంప్‌తో ప్రపంచం నాశనం'
వాషింగ్టన్: వ్యక్తిగత జీవితంతోనే కాదు.. రాజకీయ అభిప్రాయాలతోనూ వివాదాస్పదమైన హాలీవుడ్ నటుడు సీన్ పెన్ (Sean Penn) మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ అధికారాన్ని నిలుపుకోవడానికి ప్రపంచాన్ని నాశనం చేస్తారన్నారు. అంతేకాదు.. హంతకుడైన అసూయపూరిత జీవిత భాగస్వామిగా అభివర్ణించారు. డెమొక్రటిక్ ప్రతినిధి ఎరిక్ స్వాల్వెల్‌తో కలిసి జిమ్ అకోస్టా పాడ్ కాస్ట్ ‘ది జిమ్ అకోస్టా షో’లో పెన్ మాట్లాడారు.తనకు కాకపోతే ఇంకెవ్వరికీ దక్కవద్దన్న ధోరణి ట్రంప్‌లో ఉంటుందన్నారు. తన అధికారంతో విధ్వంసానికి పాల్పడే స్వార్థపూరిత వ్యక్తిగా ట్రంప్‌ను అభివర్ణించారు. మూడోసారి అధ్యక్ష పదవికోసం ట్రంప్ ప్రయత్నిస్తున్నారా అని అడిగిన ప్రశ్నకు పెన్ పైవిధంగా సమాధానమిచ్చారు. ఇక డెమొక్రాట్ అయిన ఎరిక్ స్వాల్వెల్ (Eric Swalwell) మాట్లాడుతూ.. నియంతలెప్పుడూ తమ వారసత్వాన్ని కొనసాగించడానికి ప్రణాళికలు వేయలేదన్నారు. తనను తాను రక్షించుకోవడానికి దేశాన్ని ఏం చేయడానికైనా ట్రంప్ సిద్ధమవుతారని వ్యాఖ్యానించారు. చదవండి: దయలేని ట్రంప్.. ఈసారి సినిమాలపై సుంకం
జాతీయం

మన కుమార్తెల సిందూరమే.. ఆపరేషన్ సిందూర్.. పహల్గాం బాధితుల రియాక్షన్
ఢిల్లీ: జమ్ముకశ్మీర్‌లోని పహల్గాం ఉగ్ర దాడి ఘటనకు భారత్ ప్రతీకారం తీర్చుకుంది. ఆపరేషన్ సిందూర్‌లో భాగంగా పాకిస్తాన్‌లోని ఉగ్రస్థావరాలపై భారత ఆర్మీ మెరుపు దాడులు చేసింది. భారత్ దాడుల్లో దాదాపు 80-90 మంది ఉగ్రవాదులు హతమైనట్టు తెలుస్తోంది. భారత ప్రభుత్వం చేపట్టిన ఆపరేషన్ సిందూర్‌పై పహల్గాం బాధిత కుటుంబ సభ్యులు కూడా స్పందిస్తున్నారు. ఆపరేషన్ ప్లాన్ చేసిన ప్రధాని మోదీకి ధన్యవాదాలు చెబుతున్నారు. మరోవైపు.. దేశ ప్రజలు సైతం.. ఆపరేషన్ సిందూర్ పట్ల హర్షం వ్యక్తం చేస్తూ సంబరాలు చేసుకుంటున్నారు.ఆపరేషన్ సిందూర్‌పై శుభమ్ ద్వివేది తండ్రి సంజయ్ ద్వివేది స్పందిస్తూ..‘భారత ఆర్మీకి సెల్యూట్ చేస్తున్నా. ప్రధాని నరేంద్ర మోదీకి ధన్యవాదాలు. నేను ఉదయం నుంచి నిరంతరం వార్తలు చూస్తూనే ఉన్నా. ఈ సందర్భంగా దేశ ప్రజల బాధను విని పాక్ ఉగ్రస్థావరాలపై ఎటాక్ చేసినందుకు కృతజ్ఞతలు. ఉగ్రవాదులపై దాడి చేస్తున్నట్లు వార్తలను విన్నప్పటినుంచి మా కుటుంబం మొత్తం ఎంతో సంతోషంగా ఉంది’ అంటూ కామెంట్స్ చేశారు.సంతోష్ జగ్దలే భార్య ప్రగతి జగ్దలే స్పందిస్తూ.. ఈ ఆపరేషన్ పేరు వినగానే నా కళ్లల్లో నీళ్లు తిరిగాయి. మన కుమార్తెల సిందూరం తుడిచిపెట్టిన ఉగ్రవాదులకు ఇదే సరైన సమాధానం. ఈ సందర్భంగా ప్రభుత్వానికి నా హృదయపూర్వక ధన్యవాదాలు చెబుతున్నా’ అని అన్నారు.#WATCH | Pune | #OperationSindoor | "I cried a lot on hearing the name of the operation . It is a real tribute and justice to those who were killed by terrorists," says Asavari Jagdale, daughter of Santosh Jagdale, who was killed in Pahlagam terror attack pic.twitter.com/L6Wh7HivHM— ANI (@ANI) May 7, 2025సంతోష్ జగ్దలే కుమార్తె అశ్విరి స్పందిస్తూ..‘పాకిస్తాన్లో తొమ్మిది స్థానాల్లో వారిపై భారత ఆర్మీ ఎదురుదాడికి దిగింది. ఇది నిజంగా భిన్నమైన అనుభూతి. ఈ ఆపరేషన్‌కు పెట్టిన పేరే అందుకు నిదర్శనం. మా కన్నీళ్లు ఆగలేదు. ఉగ్రవాదుల వల్ల సోదరీమణులు తమ సిందూరం కోల్పోయినందున వారికి గుర్తుగా ఈ దాడులకు నామకరణం చేశారుఆనందంతో కూడిన కన్నీళ్లు ఆగవు. మేం ఇంతటి బాధలోనూ ఆనందపడుతున్నాం. ప్రధాని మోదీ తప్పకుండా ప్రతీకారం తీర్చుకుంటారు’ అని అన్నారు.

Operation Sindoor: ‘ఆపరేషన్ సింధూర్’ అంటే ఏమిటి?
delhi: పహల్గాం ఉగ్ర దాడితో రగిలిపోతున్న భారత్.. పాకిస్తాన్‌పై ప్రతీకారం తీర్చుకుంది. ‘ఆపరేషన్ సింధూర్’ (Operation Sindoor) మంగళవారం అర్ధరాత్రి పాక్ ఉగ్ర శిబిరాలపై మెరుపు దాడి చేసింది. తాజా సమాచారం మేరకు ఆపరేషన్ సింధూర్‌లో 80 మంది టెర్రరిస్టులు మృతి చెందినట్లు అంచనా. అయితే ఈ దాడికి ముందే విజయం కోసం సాధన.. దాడికి సిద్ధం..! అంటూ ఇండియన్ ఆర్మీ ఓ హింట్ కూడా ఇచ్చింది. నిమిషాల వ్యవధిలో పాక్‌పై దాడికి దిగింది. ఈ మెరుపు దాడికి ‘ఆపరేషన్ సిందూర్’ అని పేరు పెట్టింది.పాక్‌పై ప్రతీకారం తీర్చుకున్న వేళ ఇండియన్ ఆర్మీ ఆపరేషన్ సిందూర్ అని పేరు ఎందుకు పెట్టిందనే అంశంపై చర్చ కొనసాగుతోంది. సింధూరం అనేది దుర్గా, శక్తి దేవతలతో సంబంధం కలిగి ఉందని నమ్ముతారు. అలాగే సింధూరం ధరించిన వారికి దుర్గాదేవి రక్షణగా నిలుస్తుందని విశ్వసిస్తారు. పురాణాల ప్రకారం.. సింధూరాన్ని మొదటగా శివుడు ఉపయోగించాడు. వివాహ సమయంలో పరమ శివుడు పార్వతి దేవి నుదుటిన సింధూరం పెట్టాడు. అప్పటి నుంచి ఈ సంప్రదాయం ప్రతి హిందూ వివాహంలో భాగంగా మారింది. ఈ ఆచారం భర్తల పట్ల భార్యలకు ఉన్న గౌరవం, విధేయతను తెలియజేస్తుంది. ఈ సింధూరం భార్యలు.. భర్తలను కాపాడే పవిత్ర సంకేతం మాత్రమే కాదు. ఓ యోధుని తలపై ధరించే గర్వ తిలకం కూడా. This video captures the moment an Indian missile hit Bahawalpur, Pakistan, during 'Operation Sindoor' — a series of retaliatory attacks for last month’s Pahalgam bombing that killed 26 people, which India blames on Pakistan. pic.twitter.com/9g0yzHhYVB— Al Jazeera English (@AJEnglish) May 6, 2025సింధూరం భారతీయ సాంస్కృతికలో వివాహ తత్వానికి మాత్రమే కాదు, ధర్మ యుద్ధానికి కూడా చిహ్నం. రాజపుత్‌లు, మరాఠా యోధులు యుద్ధానికి వెళ్లే ముందు ధరించే తిలకం అది. ఇప్పుడు అదే తిలకం రూపంలో భారత్.. పాక్ ఉగ్ర శిబిరాలపై దాడి చేసినట్లు ప్రపంచానికి తెలిపింది. ఇది కేవలం ప్రతీకార దాడి కాదు. ఇది నీతికోసం, ధర్మంకోసం, దేశ ప్రజల రక్షణ కోసం చేసిన ఓ చర్యకు ప్రతీకగా నిలుస్తోంది. దేశాన్ని కుదిపేసిన వినయ్ నర్వాల్ ఘటన ఏప్రిల్ 22న పహల్గాంలోని బైసరన్ లోయలో సేదదీరుతున్న పర్యాటకులను ఉగ్రవాదులు లక్ష్యంగా చేసుకున్నారు. ముఖ్యంగా జంటల్లో పురుషులను వేరు చేసి.. వారిని మతం అడిగి మరీ కాల్చి చంపారు. ఉగ్రవాదులు మొదట ప్రాణం తీసింది నేవీ అధికారి లెఫ్టినెంట్ వినయ్ నర్వాల్‌నే. వినయ్ నర్వాల్ దంపతులకు పెళ్లై అప్పటికి ఆరు రోజుల క్రితమే. టెర్రరిస్టులు వినయ్‌ను హత్య చేయగా.. అతడి మృతదేహం వద్ద గుండెలవిసేలా రోదిస్తున్న హిమాన్షి నర్వాల్ చిత్రం దేశం మొత్తాన్ని కదిపేసింది. ఈ ఉగ్రదాడిలో భర్తలను కోల్పోయిన మహిళల ప్రతీకారానికి చిహ్నంగా దీని చూడొచ్చు. దెబ్బకు దెబ్బ తీసిందిఉగ్రవాదులు మతం ఆధారంగా ప్రాణాలు తీస్తామని సంకేతాలిస్తే.. భారత్ అదే దారిలో నడిచింది. దెబ్బకు దెబ్బ తీసింది. ఆపరేషన్ సిందూర్ పేరుతో అగ్నితో, ఆగ్రహంతో, ధర్మ యుద్ధాన్ని ప్రకటించింది. భారత ప్రజల హృదయాలను తాకేలా, ప్రపంచానికి స్పష్టమైన సంకేతంగా నిలిచింది.

ఆపరేషన్ సిందూర్.. అర్ధరాత్రి ఎప్పుడేం జరిగింది..
శ్రీనగర్: పహల్గాం ఉగ్రదాడి ఘటనతో భారత్, పాక్‌ల మధ్య తీవ్ర ఉద్రిక్త పరిస్థితుల వేళ పాక్‌ను భారత్ దెబ్బకొట్టింది. ఉగ్రదాడికి భారత్ ప్రతీకార చర్యల్లో భాగంగా మంగళవారం అర్ధరాత్రి 1:44 గంటలకు ‘ఆపరేషన్ సిందూర్’ (Operation Sindoor) పేరుతో పాకిస్థాన్ (Pakistan)లోని ఉగ్రస్థావరాలపై భారత సైన్యం (Indian Army) మెరుపు దాడులు చేపట్టింది. భారత ఆర్మీ, ఎయిర్ ఫోర్స్, నేవీ బలగాలు సంయుక్తంగా ఈ దాడిని నిర్వహించాయి. మిస్సైళ్లతో లక్ష్యాలపై విరుచుకుపడ్డాయి. పాక్ ఆక్రమిత కశ్మీర్‌తో పాటు పాకిస్థాన్‌లోని ఉగ్ర మౌలిక సదుపాయాలను ధ్వంసం చేశాయి. పూర్తి కచ్చితత్వంతో దాడులు చేసినట్లు పేర్కొంది.ఆపరేషన్ సిందూర్ ఇలా.. 1:44 AM ఆపరేషన్ సిందూర్ ప్రారంభం1:45 AM మొత్తం 9 ఉగ్ర స్థావరాలపై ఏక కాలంలో దాడులు.1:45 AM ఉగ్ర స్థావరాలపై మిసైల్స్‌తో దాడులు.2:00 AM న్యాయం జరిగిందంటూ ట్విట్టర్ పోస్టులో భారత ఆర్మీ ప్రకటన..2:25 AM భారత్ దాడికి ప్రతీకారం తీర్చుకుంటామన్న పాక్ ప్రధాని షహబాజ్ షరీఫ్.2:30 AM శ్రీనగర్‌కు విమాన సర్వీసులు రద్దు.3:00 AM ధర్మశాల, లేహ్, జమ్ము, అమృతసర్ విమానాశ్రయాలు మూసివేత.4:00 AM ఎల్వోసీ వెంట ఉన్న గ్రామాలపై పాక్ ఆర్మీ కాల్పులుభారత ప్రభుత్వం ప్రకటన అనంతరం ఇండియన్ ఆర్మీ స్పందించింది. ‘న్యాయం జరిగింది’ అని ఎక్స్‌లో పోస్టు చేసింది. మెరుపు దాడులకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. భారత్ దాడులతో పాక్ అప్రమత్తమైంది. లాహోర్, సియాల్కోట్ ఎయిర్‌పోర్ట్‌లను 48 గంటల పాటు మూసివేసింది.

కన్నీటి నిశ్చితార్థం
నిశ్చితార్థం చేసుకుని, త్వరలో పెళ్లిపీటలు ఎక్కాల్సిన యువతి మార్చురీలో శాశ్వత విశ్రాంతి తీసుకుంటోంది. కుమార్తె పెళ్లి గురించి కోటి కలలు కన్న తల్లిదండ్రులదీ అదే దుస్థితి. నిశ్చితార్థం గోరింటాకు ఇంకా ఆరలేదు, అప్పుడే మృత్యువు పంజా విసిరింది. సాగరలో వేడుకను పూర్తి చేసుకుని బాగల్‌కోట జిల్లాలో తమ ఇంటికి వెళ్తుండగా, దారిలోనే ప్రయాణం ముగిసింది. కారు లారీని ఢీకొనడంతో కుటుంబం కడతేరిపోయింది.హుబ్లీ/ శివమొగ్గ(కర్ణాటక): వారంతా ఒకే కుటుంబ సభ్యులు. కూతురికి నిశ్చితార్థం చేసుకుని ఇంటికి తిరుగుముఖం పట్టారు. ఇంతలో విధి చిన్నచూపు చూసింది. లారీ– కారు ఢీకొన్న ఘటనలో కాబోయే పెళ్లికూతురు, ఆమె తల్లిదండ్రులు, సోదరుడు, బంధువుల అమ్మాయి దుర్మరణం చెందారు. మంగళవారం ఉదయం హుబ్లీ తాలూకా ఇంగళహళ్లి క్రాస్‌లో జాతీయ రహదారిలో ఈ ఘోరం జరిగింది. వివరాలు... ఈ ప్రమాదంలో విఠల శెట్టి (55), భార్య శశికళ (40), కుమార్తె శ్వేతా శెట్టి (29), కుమారుడు సందీప్ (26), అన్న కుమార్తె అయిన అంజలి (26) దుర్మరణం చెందారు. వీరి స్వస్థలం శివమొగ్గ జిల్లా సాగర వద్ద మూరుకై అనే గ్రామం. బాగల్‌కోటెలోని కులగేరి క్రాస్‌లో హోటల్ వ్యాపారం చేసుకుంటూ జీవించేవారు. సోమవారం శివమొగ్గ జిల్లా సాగరలో శ్వేతకు కుందాపుర యువకునితో నిశ్చితార్థం ఘనంగా నిర్వహించారు. పెద్దసంఖ్యలో బంధుమిత్రులు పాల్గొన్నారు. త్వరలోనే పెళ్లి పెట్టుకుందామని తీర్మానించుకున్నారు. అలాగే సాగరలోనే కొత్తగా కట్టిన ఇంటిలో గృహ ప్రవేశం చేశారు. 8:30 సమయంలో.. రెండు వేడుకలను ముగించుకుని మంగళవారం తెల్లవారుజాము 4 గంటలప్పుడు సంతోషంగా సాగర నుంచి కారులో బయలు దేరారు. సుమారు 8:30 సమయంలో ఘటనాస్థలిలో కారు, అహ్మదాబాద్ నుంచి కొచ్చిన్‌కు వెళ్తున్న లోడ్ లారీ–వేగంగా ఢీకొన్నాయి. సందీప్ కారును నడుపుతున్నట్లు తెలిసింది. ఈ ధాటికి కారులోని ఐదుగురూ ప్రాణాలు కోల్పోయారు. ఘటనాస్థలి రక్తసిక్తమైంది. ప్రజలు హుబ్లీ గ్రామీణ పోలీసులు చేరుకుని సహాయక చర్యలను చేపట్టారు. లారీలో చిక్కుకున్న కారు కారు లారీ లోపలికి దూసుకుపోవడంతో బయటకు తీయడం కష్టసాధ్యమైంది. కారు మొత్తం తుక్కయింది. కష్టమ్మీద మృతదేహాలను వెలికితీసి పోస్టుమార్టం కోసం హుబ్లీలోని కిమ్స్ ఆస్పత్రికి తరలించారు. పెద్దసంఖ్యలో బంధువులు చేరుకుని శోకసంద్రంలో మునిగిపోయారు. ఘటనాస్థలిని ఎస్పీ బ్యాకోడ పరిశీలించారు. లారీ డ్రైవర్ మాట్లాడుతూ కారు అతివేగంగా వచ్చి తన లారీని ఢీకొట్టిందని చెప్పాడు.
ఎన్ఆర్ఐ

సలహా కమిటీ అడుగులు ముందుకు..
మోర్తాడ్ (బాల్కొండ): తెలంగాణ ప్రవాసీ విధానం (ఎన్ఆర్ఐ పాలసీ) రూపకల్పన, గల్ఫ్ బోర్డు ఏర్పాటు కోసం నిర్దేశించిన గల్ఫ్ సలహా కమిటీ అడుగులు ముందుకు పడ్డాయి. సలహా కమిటీ బాధ్యతలను స్వీకరించిన వారం రోజులలోనే యూఏఈలో ఒక దుర్ఘటన చోటు చేసుకోవడం, ఈ అంశంలో కమిటీ సభ్యులు వేగంగా స్పందించి మృతదేహాలను స్వదేశానికి తెప్పించడంతో బాధిత కుటుంబాలకు ఊరట లభించింది.యూఏఈలోని ఆల్‌కూజ్ ప్రాంతంలోని బేకరీలో పాకిస్తాన్‌కు చెందిన వ్యక్తి చేతిలో నిర్మల్ జిల్లా సోన్‌కు చెందిన ప్రేమ్‌సాగర్, జగిత్యాల జిల్లా ధర్మపురి మండలం దమన్నపేట్‌కు చెందిన స్వర్గం శ్రీనివాస్ హత్యకు గురైన విషయం తెలిసిందే. ఈనెల 11న వీరు హత్యకు గురి కాగా వారం రోజుల వ్యవధిలోనే మృతదేహాలను స్వదేశానికి తెప్పించారు. ఇందులో సలహా కమిటీ కీలకపాత్ర పోషించింది. గల్ఫ్ సలహా కమిటీ చైర్మన్ వినోద్‌కుమార్, వైస్ చైర్మన్ మంద భీంరెడ్డి, ఇతర సభ్యులు ముఖ్యమంత్రి కార్యాలయంలోని అధికారులతో యూఏఈ ఘటనపై చర్చించారు. సీఎంవో నుంచి కేంద్ర ప్రభుత్వానికి, విదేశాంగ శాఖకు సమాచారం అందించడంతో వారం రోజులలోనే మృతదేహాలను స్వదేశానికి తీసుకురాగలిగారు. గతంలో గల్ఫ్‌లో ఎవరైనా మరణిస్తే మృతదేహం ఇంటికి రావడానికి నెల రోజుల వరకు సమయం పట్టేది. బాధిత కుటుంబాలకు భరోసా యూఏఈ ఘటనపై సీఎం రేవంత్‌రెడ్డి (CM Revanth Reddy) స్పందించారు. సలహా కమిటీ విజ్ఞప్తి మేరకు బాధిత కుటుంబాలకు భరోసా ఇవ్వాలని అధికారులను ఆదేశించారు. హత్యకు గురైన వ్యక్తుల కుటుంబ సభ్యులకు ఔట్ సోర్సింగ్ విధానంలో ఏదైనా ప్రభుత్వ శాఖలో ఉద్యోగం ఇవ్వాలని సూచించారు. గల్ఫ్ భరోసా కింద రూ.5 లక్షల చొప్పున ఎక్స్‌గ్రేషియాను వెంటనే విడుదల చేయాలని ఆదేశించారు.అంత్యక్రియలకు ప్రభుత్వ సాయం స్వర్గం శ్రీనివాస్ అంత్యక్రియలకు జగిత్యాల జిల్లా కలెక్టర్ రూ.15 వేల ఆర్థికసాయం మంజూరుచేశారు. సాధారణంగా ప్రభుత్వ ఉద్యోగులు ఎవరైనా మరణిస్తే వారి అంతిమ సంస్కారాలకు మాత్రమే ప్రభుత్వ సాయం అందుతుంది. గల్ఫ్‌లో హత్యకు గురైన ఘటనను మానవతా దృక్పథంతో పరిగణనలోకి తీసుకున్న జగిత్యాల జిల్లా (Jagtial District) కలెక్టర్ సత్యప్రసాద్ తన విచక్షణాధికారాలను ఉపయోగించుకుని స్వర్గం శ్రీనివాస్ అంత్యక్రియలకు ఆర్థిక సాయం అందించారు.చదవండి: స్మిత సబర్వాల్ ధిక్కార స్వరం!శనివారం జరిగిన శ్రీనివాస్ అంతిమ యాత్రలో ధర్మపురి ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్‌కుమార్ పాల్గొని పాడె మోశారు. ఆయన కూడా సొంతంగా రూ.10 వేల సాయం అందించారు. ఇద్దరు మృతుల ఆర్థిక పరిస్థితి బాగా లేకపోవడంతో వారి కుటుంబ సభ్యులకు ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేయనున్నట్లు ఆయా నియోజకవర్గాల ఎమ్మెల్యేలు ప్రకటించారు. సలహా కమిటీ ఏర్పడిన వెంటనే గల్ఫ్ ప్రవాసులకు ప్రయోజనం కల్పించే కార్యక్రమాలకు శ్రీకారం చుట్టడంపై గల్ఫ్ కార్మిక కుటుంబాలు కృతజ్ఞతలు తెలుపుతున్నాయి.

టంపాలో నాట్స్ సంబరాల వాలీబాల్, త్రో బాల్ టోర్నమెంట్లు
ప్రతి రెండేళ్లకు ఒక్కసారి అమెరికాలో అంగరంగ వైభవంగా నిర్వహించే నాట్స్ అమెరికా తెలుగు సంబరాల నిర్వహణ కోసం కసరత్తు ముమ్మరంగా జరుగుతోంది. ఈ క్రమంలోనే సంబరాల వాలీబాల్, త్రో బాల్ టోర్నమెంట్లను టంపాలో నాట్స్ నిర్వహించింది. మొత్తం 12 వాలీబాల్ జట్లు, 5 మహిళా త్రోబాల్ జట్లు, 350 మందికిప గా తెలుగు క్రీడాకారులు ఈ టోర్నమెంట్లతో తమ ప్రతిభను చాటేందుకు పోటీ పడ్డారు. క్రీడాకారులను ప్రోత్సాహించేందుకు వారి కుటుంబ సభ్యులు కూడా రావడంతో క్రీడా ప్రాంగణంలో పండుగ వాతావరణం కనిపించింది. మహిళల త్రోబాల్ టోర్నమెంట్లో మొదటి బహుమతిని సన్‌షైనర్స్ జట్టు కైవసం చేసుకుంది. పురుషుల వాలీబాల్ టోర్నమెంట్ ఛాంపియన్లుగా డైనమిక్ రచ్చ జట్టుగా నిలిచింది. టోర్నమెంట్ విజేతలకు బహుమతులు జూలై 4 నుండి 6 వరకు జరిగే నాట్స్ అమెరికా తెలుగు సంబరాల్లో బహుమతులు పంపిణి చేయనున్నారు. నాట్స్ కమ్యూనిటీ సేవల బృందం నుండి రంజిత్ పాలెంపాటి అవిశ్రాంత కృషి ఈ టోర్నమెంట్లు దిగ్విజయంగా జరగడంలో కీలక పాత్ర పోషించింది.నాట్స్ అమెరికా తెలుగు సంబరాల కోసం జరుగుతున్న ఏర్పాట్లను నాట్స్ 8వ అమెరికా తెలుగు సంబరాల కమిటీ కార్యదర్శి శ్రీనివాస్ మల్లాది తెలిపారు. క్రీడాకారులు టోర్నమెంట్లో చూపిన క్రీడాస్ఫూర్తిని మల్లాది ప్రశంసించారు. ( మరిన్ని NRI వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి)నాట్స్ సంబరాల కమిటీ కన్వీనర్ శ్రీనివాస్ గుత్తికొండ, నాట్స్ చైర్మన్ ప్రశాంత్ పిన్నమనేని, మాధవి యార్లగడ్డ, అపర్ణ కొడాలి, కార్తీక్ తుమ్మటి, శ్రీకాంత్ పాత్ర, శ్యామల, విజయ్ చిన్నం తదితరులు ఈ టోర్నమెంట్ల నిర్వహణకు తమ మద్దతును, సహకారాన్ని అందించారు. జూలైలో జరిగే అమెరికా తెలుగు సంబరాలకు మరింత ఉత్సాహాన్ని ఇచ్చేలా ఇదే క్రీడా స్ఫూర్తిని ప్రదర్శించేందుకు వివిధ రకాల క్రీడా పోటీలను నాట్స్ టంపాలో నిర్వహించనుంది. నాట్స్ సంబరాల కమిటి, నాట్స్ క్రీడా కమిటీలు ఈ పోటీల నిర్వహణకు తగిన కార్యాచరణ ప్రణాళికతో ముందుకు సాగనుంది. నాట్స్ అధ్యక్షుడు మదన్ పాములపాటి, ప్రెసిడెంట్ ఎలెక్ట్ శ్రీహరి మందాడి లు విజేతలకు శుభాకాంక్షలు తెలియచేసారు. అందరూ టంపా తెలుగు సంబరాల్లో పాల్గొనాలని పిలుపునిచ్చారు.

NATS శాండియాగో లో నాట్స్ చాప్టర్ ప్రారంభం
శాండియాగో : ఉత్తర అమెరికా తెలుగు సంఘం నాట్స్ తన విభాగాలను ప్రారంభిస్తూ తెలుగు వారికి మరింత చేరువ అవుతోంది. ఈ క్రమంలోనే శాండియాగోలో నాట్స్ విభాగాన్ని ప్రారంభించింది. నాట్స్ శాండియాగో చాప్టర్ సమన్వయకర్తగా ప్రశాంతి ఊడిమూడి, మహిళా సాధికార సలహా మండలి సమన్వయకర్తగా హైమ గొల్లమూడికి బాధ్యతలు అప్పగించారు. శాండియాగో నాట్స్ సాంస్కృతిక కార్యక్రమాల సమన్వయకర్తగా కామ్య శిష్ట్లా, సోషల్ మీడియా సమన్వయ కర్త గా తేజస్వి కలశిపూడి, సేవా కార్యక్రమాల సమన్వయకర్త గా రామచంద్ర రాజు ఊడిమూడి, క్రీడా స్ఫూర్తి సమన్వయ కర్తగా సత్య హరిరామ్, ఆది మోపిదేవి బాధ్యతలు నిర్వర్తించనున్నారు. శ్రీరామనవమి నాడు శాండియాగో లో నాట్స్ విభాగం ప్రారంభం కావడం ఆనందంగా ఉందని శాండియాగో నాట్స్ సమన్వయకర్త ప్రశాంతి ఊడిమూడి అన్నారు. శాండియాగో లో నాట్స్ తెలుగు వారికి శ్రీరామరక్షలా మారేలా తమ వంతు కృషి చేస్తామని చెప్పారు. చాప్టర్ ప్రారంభోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసిన చిన్నారుల సాంస్కృతిక ప్రదర్శనలు అందరిని ఆకట్టుకున్నాయి. తనుష్ భగవత్ ,వీణ-ఋత్వ ఊడిమూడి గానామృతం, వయోలిన్‌తో ధ్రువ గౌరిశెట్టి ,పియానోతో విహాన్ మండపాక అందరిని అలరించారు. ( మరిన్ని NRI వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి)ఈ కార్యక్రమానికి విశిష్ట అతిథులుగా నాట్స్ ప్రెసిడెంట్ మదన్ పాములపాటి,నాట్స్ సెక్రటరీ మధు బోడపాటి, జోనల్ వైస్ ప్రెసిడెంట్ మనోహర్ మద్దినేని పాల్గొన్నారు. ముఖ్య అతిథులుగా లాస్ ఏంజెలెస్ చాప్టర్ నుండి నాట్స్ ప్రోగ్రామ్స్ వైస్ ప్రెసిడెంట్ శ్రీనివాస్ చిలుకూరి,జాతీయ మహిళా సాధికారత సమన్వయ కర్త రాజ్యలక్ష్మి చిలుకూరి,లాస్ ఏంజెలెస్ చాప్టర్ సమన్వయ కర్త మురళి ముద్దన, హెల్ప్ లైన్ సమన్వయ కర్త శంకర్ సింగం శెట్టి పాల్గొన్నారు. నాట్స్ ప్రెసిడెంట్ మదన్ పాములపాటి ఆధ్వర్యంలో నూతన చాప్టర్ సభ్యులను మనోహర్ మద్దినేని సభకు పరిచయం చేశారు. నాట్స్ చైర్మన్ ప్రశాంత్ పిన్నమనేని, ప్రెసిడెంట్ (ఎలెక్ట్) శ్రీహరి మందాడి తమ అభినందనలు సందేశం ద్వారా పంపారు. భవిష్యత్తులో శాండియాగో నాట్స్ విభాగం చేపట్టే ప్రతి కార్యక్రమానికి జాతీయ నాయకత్వం మద్దతు ఉంటుందని నాట్స్ ప్రెసిడెంట్ మదన్ పాములపాటి భరోసా ఇచ్చారు. అమెరికాలో తెలుగు సమాజ అభివృద్ధి దిశగా నాట్స్ జాతీయ వ్యాప్తంగా ఎంతో కృషి చేస్తుందన్నారు. అమెరికాతో పాటు ఉభయ తెలుగు రాష్ట్రాల్లో చేస్తున్న సేవ కార్యక్రమాల గురించి మదన్ పాములపాటి వివరించారు. శాండియాగో చాప్టర్ ఏర్పాటులో నాట్స్ జాతీయ మీడియా కో ఆర్డినేటర్ కిషోర్ నారే కీలక పాత్ర పోషించడం అభినందనీయమని అన్నారు. శాండియాగోలో ఇక నుంచి తెలుగువారికి నాట్స్ అండగా ఉందనే భరోసాను కల్పించే దిశగా శాండియాగో నాట్స్ సభ్యులు కృషి చేయాలని కోరారు.

డల్లాస్‌లో నిరాశ్రయుల ఆశ్రయ గృహంలో పేదలకు ఆహారం
తెలంగాణా పీపుల్స్ అసోసియేషన్ ఆఫ్ డల్లాస్ (Telangana Peoples Association of Dallas) మరో సేవా కార్యక్రమాన్ని చేపట్టింది. అమెరికాలోని డల్లాస్ ప్రాంతంలో 'ఫుడ్ డ్రైవ్'తో అన్నార్తుల ఆకలి తీర్చింది. Austin Street Homeless Shelter లో ఈ సేవా కార్యక్రమాన్ని నిర్వహించింది. ఒక రోజంతా సాగిన ఈ కార్యక్రమంలో TPAD సభ్యులు స్వయంగా పాస్తా, చికెన్, మాష్డ్ పొటాటో తదితర వంటకాలు తయారు చేసి.. అన్నార్తులకు వడ్డించారు. 450 మందికి పైగా నిరాశ్రయుల ఆకలి తీర్చారు. అనురాధ మేకల (ప్రెసిడెంట్), రావు కల్వల (FC చైర్), పాండు పాల్వే (BOT చైర్), రమణ లష్కర్ (కోఆర్డినేటర్), దీపికా రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ఈ ఫుడ్ డ్రైవ్‌లో 450 మందికి పైగా నిరాశ్రయులకు ఆహారం వడ్డించామని, టీప్యాడ్ చెందిన 50 మంది వాలంటీర్లు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారని చెప్పారు. భవిష్యత్తులో కూడా ఇటువంటి సేవా కార్యక్రమాలను కొనసాగిస్తామని వారు తెలియజేశారు. టీప్యాడ్ సీనియర్ నాయకుడు రఘువీర్ బండారు ఈ కార్యక్రమాన్ని పర్యవేక్షించారు. (మరిన్ని NRI వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి)
క్రైమ్

కూతురి హత్యకు ప్రతీకారం
మండ్య(కర్ణాటక): గతేడాది జనవరిలో.. సోషల్ మీడియాలో చురుగ్గా ఉండే ఓ యువతి.. ఆకస్మికంగా హత్యకు గురైంది. అప్పటినుంచి కేసు నడుస్తోంది. ఇంతలో ఆ కేసులో నిందితుని తండ్రి ప్రతీకార హత్యకు గురయ్యాడు. ఈ సంఘటన పౌరుషాల గడ్డ అయిన మండ్య జిల్లా పాండవపుర తాలూకా మాణిక్యనహళ్లిలో మంగళవారం జరిగింది. ఏం జరిగింది? వివరాలు.. నరసింహే గౌడ (55) అనే రైతు కత్తిపోట్లతో చనిపోయాడు. వెంటనే వెంకటేశ్, మంజునాథ్ అనే ఇద్దరిని స్థానిక పోలీసులు అరెస్టు చేశారు. వెంకటేష్ కూతురు దీపికతో నరసింహేగౌడ కొడుకు నితీష్ కుమార్ చనువుగా ఉండేవాడు. దీపిక కు అదివరకే పెళ్లయి కొడుకు ఉన్నాడు. ఇద్దరూ రీల్స్ కూడా చేసేవారు. గతేడాది జనవరిలో మేలుకోటె కొండ అంచున దీపిక హత్యకు గురైంది. నితీష్ ను పోలీసులు అరెస్టు చేశారు. ఆ కేసు నడుస్తోంది. అప్పటినుంచి ఇరుకుటుంబాల మధ్య వైరం కొనసాగుతోంది. నరసింహేగౌడ తన కూతురి పెళ్లి పనుల్లో బిజీగా ఉన్నాడు. ఓ టీ హోటల్ వద్ద అతన్ని కత్తితో పొడిచి చంపారు. తన కూతురి హత్యకు ప్రతీకారంగా వెంకటేష్ ఈ హత్యకు పాల్పడినట్లు అనుమానాలున్నాయి. గ్రామంలో పోలీసు బందోబస్తు ఏర్పాటైంది.

మటన్ పులుసులో కప్ప
అన్నానగర్(తమిళనాడు): పూందమల్లి మున్సిపల్ కార్యాలయం సమీపంలో నావలడి అనే ప్రైవేట్ హోటల్ నడుస్తోంది. ఆదివారం రాత్రి ఈ రెస్టారెంట్‌కి ఓ కుటుంబం భోజనం చేసేందుకు వెళ్లింది. అక్కడ బిర్యానీ, మటన్ గ్రేవీ ఆర్డర్ చేసి తింటున్నారు. సిబ్బంది తీసుకొచ్చిన మటన్ పులుసును వారు తినేందుకు ప్రయత్నించగా అందులో పెద్ద కప్ప చనిపోయిందని తెలుస్తుంది. దీంతో షాక్ తిన్న వారు హోటల్ యాజమాన్యాన్ని ప్రశ్నించగా సరైన సమాధానం చెప్పకపోవడంతో వాగ్వాదం చోటుచేసుకుంది. ఈ సందర్భంగా వారు ఆహారంలో కప్ప మొత్తం పడి ఉన్న వీడియోను తీసి, సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. దీనికి సంబంధించిన వీడియో ఫుటేజీ సోషల్ మీడియాలో వైరల్‌గా మారి సంచలనం సష్టించింది. దీనిపై ఫుడ్ సేఫ్టీ అధికారులకు సమాచారం అందింది. ఆ తర్వాత తిరువళ్లూరు జిల్లా ఆహార భద్రత విభాగం అధికారి వేలవన్ నేతృత్వంలో అధికారులు ఘటన జరిగిన హోటల్‌కు వెళ్లి కిచెన్‌లో సోదాలు నిర్వహించారు. ఆ తర్వాత హోటల్‌కు సీల్ వేసి చర్యలు తీసుకున్నారు.

ఓయో రూమ్‌కు తీసుకువెళ్లి.. రహస్య వీడియోలు
సాక్షి,హైదరాబాద్: ఫేస్బుక్ ద్వారా పరిచయమైన మహిళను వేధిస్తున్న యువకుడికి నగర షీ–టీమ్స్ బృందాలు చెక్ చెప్పాయి. ఇతడితో పాటు మరికొందరు పోకిరీలు, నిరాధార ఫిర్యాదులు చేస్తున్న యువతిని పట్టుకున్నట్లు డీసీపీ డాక్టర్ ఎన్జేపీ లావణ్య మంగళవారం తెలిపారు. నగరానికి చెందిన ఓ యువకుడు (30) ఫేస్బుక్ ద్వారా పరిచయమైన మహిళతో కొన్నాళ్లు స్నేహం చేశాడు. ఆపై ఇరువురూ కలిసి ఓయో రూమ్‌కు వెళ్లగా... సన్నిహితంగా ఉన్న ఫొటోలు, వీడియోలను రహస్య కెమెరాతో రికార్డు చేశాడు. ఆపై వాటిని బయటపెడతానంటూ ఆమెను బెదిరించడం మొదలుపెట్టాడు. అలా కాకుండా ఉండాలంటే తాను చెప్పినట్లు చేయాలంటూ మూడు ఆప్షన్లు ఇచ్చాడు. తాను కోరినప్పుడల్లా రావాలని, తనతో సన్నిహితంగా ఉండటానికి మరికొందరు మహిళలను ఏర్పాటు చేయాలని, రూ.లక్ష ఇవ్వాలని చెప్పిన యువకుడు వీటిలో ఏదో ఒకటి ఎంచుకోవాలని కోరారు. ఎట్టకేలకు «ధైర్యం చేసిన ఆ మహిళ షీ–టీమ్స్‌ను ఆశ్రయిస్తూ తనకు ఉన్న నాలుగో ఆప్షన్ చూపింది. నిందితుడిని పట్టుకున్న బృందాలు అతడిపై కేసు నమోదు చేసి కోర్టులో హాజరుపరిచాయి. న్యాయమూర్తి అతగాడికి మూడు రోజుల సాధారణ జైలుశిక్ష విధించారు. బేగంపేటకు చెందిన ఓ యువతి తన సహోద్యోగులతో కలిసి ఓ వేడుక చేసుకున్నారు. దీన్ని వారికి తెలియకుండా పక్క ఇంట్లో ఉండే ప్లంబర్ (34) రికార్డు చేశాడు. మర్నాడు ఆ వీడియోలు చూపిస్తూ మహిళలను బెదిరించడం మొదలెట్టాడు. తనతో సన్నిహితంగా ఉండాలని లేదంటే ఆ వీడియోలు ఆన్లైన్లో పెడతానని వేధించాడు. బాధితురాలి ఫిర్యాదుతో రంగంలోకి దిగిన షీ–టీమ్స్ నిందితుడిని పట్టుకుని కోర్టులో హాజరుపరిచాయి. న్యాయస్థానం అతడిని నాలుగు రోజుల సాధారణ జైలు శిక్ష విధించింది. సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ సమీపంలో నివసించే యువతి ఇటీవల ప్రజావాణిలో ఓ ఫిర్యాదు చేశారు. ఓ గుర్తుతెలియని వ్యక్తి తనపై లైంగికదాడి చేశారని అందులో పేర్కొన్నారు. ప్రజావాణి నుంచి ఈ ఫిర్యాదు షీ–టీమ్స్‌కు రాగా.. అధికారులు బాధితురాలిని సంప్రదించి గోపాలపురం ఠాణాకు తీసుకువెళ్లారు. కేసు నమోదు చేసిన అధికారులు లోతుగా దర్యాప్తు చేశారు. ఈ నేపథ్యంలోనే ఆమె చేస్తున్న దందా వెలుగులోకి వచి్చంది. పోలీసులనే టార్గెట్‌గా చేసుకుంటున్న ఈ యువతి వివిధ కారణాలు చెప్తూ వారి ఫోన్లు తీసుకుంటుంది. వాటి ద్వారా అశ్లీల చిత్రాలను తన నెంబర్‌కు ఫార్వర్డ్ చేసుకుంటుంది. వీటిని చూపిస్తూ ఆ పోలీసులనే బెదిరించి డబ్బు డిమాండ్ చేస్తుంది. ఈ విషయం వెలుగులోకి రావడంతో ప్రజావాణిలో తప్పుడు ఫిర్యాదు చేసిన ఆరోపణలపై పోలీసులు ఆమెపై కేసు నమోదు చేశారు. ఇంటింటికీ వెళ్లి చెత్త సేకరించే జీహెచ్ఎంసీ వాహనం డ్రైవర్ ఓ మహిళను వేధించారు. చెత్త వెయ్యడానికి వచ్చే ఆమెను చూస్తూ అభ్యంతరకర, అశ్లీల పనులు చేసేవాడు. దీనిపై బాధితురాలు షీ–టీమ్స్‌లో ఫిర్యాదు చేశారు. దీని ఆధారంగా డెకాయ్ ఆపరేషన్ చేసిన అధికారులు సదరు డ్రైవర్‌ను పట్టుకుని కోర్టులో హాజరుపరిచాయి. న్యాయస్థానం అతడికి నాలుగు రోజుల సాధారణ జైలు శిక్ష విధించింది. ∙ బాలికలను ప్రేమ పేరుతో ట్రాప్ చేసి, ఆపై బెదిరింపులకు దిగుతున్న ముగ్గురిని పట్టుకున్న షీ–టీమ్స్ వారిపై పోక్సో యాక్ట్ కింద కేసులు నమోదు చేయించాయి. ఛత్రినాక, జూబ్లీహిల్స్, మాదన్నపేటలకు చెందిన యువకులు బాలికల్ని ప్రేమ పేరుతో ట్రాప్ చేశారు. పెళ్లి చేసుకుంటానని నమ్మించి లోబరుచుకున్నారు. ఆపై డబ్బు కోసమో, తనతో సన్నిహితంగా ఉండాలనో బ్లాక్మెయిల్ చేశారు. దీనిపై ఫిర్యాదులు అందుకున్న షీ–టీమ్స్ నిందితులపై సంబంధిత ఠాణాల్లో పోక్సో కేసులు నమోదు చేయించాయి. మరోపక్క బహిరంగ ప్రదేశాల్లో మహిళలు, యువతుల్ని వేధిస్తున్న 49 మంది పోకిరీలను షీ–టీమ్స్ రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నాయి.

కన్నీటి నిశ్చితార్థం
నిశ్చితార్థం చేసుకుని, త్వరలో పెళ్లిపీటలు ఎక్కాల్సిన యువతి మార్చురీలో శాశ్వత విశ్రాంతి తీసుకుంటోంది. కుమార్తె పెళ్లి గురించి కోటి కలలు కన్న తల్లిదండ్రులదీ అదే దుస్థితి. నిశ్చితార్థం గోరింటాకు ఇంకా ఆరలేదు, అప్పుడే మృత్యువు పంజా విసిరింది. సాగరలో వేడుకను పూర్తి చేసుకుని బాగల్‌కోట జిల్లాలో తమ ఇంటికి వెళ్తుండగా, దారిలోనే ప్రయాణం ముగిసింది. కారు లారీని ఢీకొనడంతో కుటుంబం కడతేరిపోయింది.హుబ్లీ/ శివమొగ్గ(కర్ణాటక): వారంతా ఒకే కుటుంబ సభ్యులు. కూతురికి నిశ్చితార్థం చేసుకుని ఇంటికి తిరుగుముఖం పట్టారు. ఇంతలో విధి చిన్నచూపు చూసింది. లారీ– కారు ఢీకొన్న ఘటనలో కాబోయే పెళ్లికూతురు, ఆమె తల్లిదండ్రులు, సోదరుడు, బంధువుల అమ్మాయి దుర్మరణం చెందారు. మంగళవారం ఉదయం హుబ్లీ తాలూకా ఇంగళహళ్లి క్రాస్‌లో జాతీయ రహదారిలో ఈ ఘోరం జరిగింది. వివరాలు... ఈ ప్రమాదంలో విఠల శెట్టి (55), భార్య శశికళ (40), కుమార్తె శ్వేతా శెట్టి (29), కుమారుడు సందీప్ (26), అన్న కుమార్తె అయిన అంజలి (26) దుర్మరణం చెందారు. వీరి స్వస్థలం శివమొగ్గ జిల్లా సాగర వద్ద మూరుకై అనే గ్రామం. బాగల్‌కోటెలోని కులగేరి క్రాస్‌లో హోటల్ వ్యాపారం చేసుకుంటూ జీవించేవారు. సోమవారం శివమొగ్గ జిల్లా సాగరలో శ్వేతకు కుందాపుర యువకునితో నిశ్చితార్థం ఘనంగా నిర్వహించారు. పెద్దసంఖ్యలో బంధుమిత్రులు పాల్గొన్నారు. త్వరలోనే పెళ్లి పెట్టుకుందామని తీర్మానించుకున్నారు. అలాగే సాగరలోనే కొత్తగా కట్టిన ఇంటిలో గృహ ప్రవేశం చేశారు. 8:30 సమయంలో.. రెండు వేడుకలను ముగించుకుని మంగళవారం తెల్లవారుజాము 4 గంటలప్పుడు సంతోషంగా సాగర నుంచి కారులో బయలు దేరారు. సుమారు 8:30 సమయంలో ఘటనాస్థలిలో కారు, అహ్మదాబాద్ నుంచి కొచ్చిన్‌కు వెళ్తున్న లోడ్ లారీ–వేగంగా ఢీకొన్నాయి. సందీప్ కారును నడుపుతున్నట్లు తెలిసింది. ఈ ధాటికి కారులోని ఐదుగురూ ప్రాణాలు కోల్పోయారు. ఘటనాస్థలి రక్తసిక్తమైంది. ప్రజలు హుబ్లీ గ్రామీణ పోలీసులు చేరుకుని సహాయక చర్యలను చేపట్టారు. లారీలో చిక్కుకున్న కారు కారు లారీ లోపలికి దూసుకుపోవడంతో బయటకు తీయడం కష్టసాధ్యమైంది. కారు మొత్తం తుక్కయింది. కష్టమ్మీద మృతదేహాలను వెలికితీసి పోస్టుమార్టం కోసం హుబ్లీలోని కిమ్స్ ఆస్పత్రికి తరలించారు. పెద్దసంఖ్యలో బంధువులు చేరుకుని శోకసంద్రంలో మునిగిపోయారు. ఘటనాస్థలిని ఎస్పీ బ్యాకోడ పరిశీలించారు. లారీ డ్రైవర్ మాట్లాడుతూ కారు అతివేగంగా వచ్చి తన లారీని ఢీకొట్టిందని చెప్పాడు.
వీడియోలు


ఆపరేషన్ సిందూర్ పై జమ్మూ సీఎం రియాక్షన్


స్పేస్ ఎక్స్‌ప్లోరేషన్‌పై ప్రధాని మోదీ ఏమన్నారంటే?


మాట నిలబెట్టుకున్న వైఎస్ జగన్ సింహాచలం బాధితులకు ఆర్థిక సాయం


పాకిస్తాన్ ను ప్రపంచ పటంలో లేకుండా చెయ్యాలి


భాగ్యశ్రీ బోర్సే తో ప్రేమ పై రామ్ క్లారిటీ!


మహేష్ బాబు తో మరో పెద్ది కారణం అదేనా ..!


ఆపరేషన్ సిందూర్ పై భారతీయుల రియాక్షన్


Operation Sindoor: ఆపరేషన్ సిందూర్‌పై కేతిరెడ్డి రియాక్షన్


ఇది స్కీమ్ కాదు స్కాం కుట్టు మిషన్ల పేరుతో 240 కోట్ల కొట్టేసారు


భారత్ దాడిలో మసూద్ అజహర్ 10 మంది కుటుంబసభ్యుల హతం