
న్యూఢిల్లీ: పార్లమెంట్‌లో జరిగే వర్షాకాల సమావేశంలో తెలంగాణ సమస్యలపై ప్రశ్నలు లేవనెత్తుతామని టీఆర్‌ఎస్ లోక్‌సభాపక్ష నేత ఎంపీ నాగేశ్వర్ రావు తెలిపారు. కాగా, ఆదివారం పార్లమెంట్ సమావేశంలో చర్చించాల్సిన అంశాల గురించి అఖిల పక్షం ఆధ్వర్యంలో చర్చలు జరిపారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దేశ ఆర్థిక వ్యవస్థ, ధరల పెరుగుదలపై చర్చలు జరపాలని పేర్కొన్నారు. అదేవిధంగా, 48 గంటల ముందే బిల్లుల వివరాలను సభకు తెలపాలని కోరినట్టు నాగేశ్వర్‌రావు తెలిపారు. తెలంగాణకు రావాల్సిన ప్రతి అంశంపై పార్లమెంట్‌లో చర్చిస్తామని వివరించారు.