Scheme
-
Sewing Machine Scheme: మహిళలను మోసం చేసి 167 కోట్లు నొక్కేస్తున్నారు
-
తల్లికి వందనంపై సీఎం చంద్రబాబు మెలిక
సాక్షి,శ్రీకాకుళం జిల్లా: తల్లికి వందనంపై సీఎం చంద్రబాబు మరో మెలిక పెట్టారు. తల్లికి వందనాన్ని ఇన్స్టాల్మెంట్ స్కీంగా మార్చే యోచనలో చంద్రబాబు ఉన్నారు. 15 వేలు ఎలా ఇవ్వాలో ఆలోచిస్తున్నాం. ఒకే ఇన్‌స్టాల్‌మెంటా? లేక ఇంకెలా ఇవ్వాల్లో ఆలోచిస్తున్నామంటూ శ్రీకాకుళం జిల్లా పర్యటనలో తల్లికి వందనంపై సీఎం వ్యాఖ్యానించారు. ఇప్పటికే 2024-25 విద్యా సంవత్సరం ‘తల్లికి వందనం’ ఇవ్వలేదు...విద్యా సంవత్సరం ముగిసినా తల్లికి వందనం ఇవ్వకుండా పిల్లలు, తల్లులను చంద్రబాబు మోసం చేశారు. ఈ ఏడాది స్కూల్, ఇంటర్ ఫీజుల కోసం పేద విద్యార్థుల తల్లిదండ్రులు అప్పులపాలవుతున్నారు. ఇన్నాళ్లు మే లో 15 వేలు ఒకేసారి ఇస్తామని చెప్పిన సీఎం చంద్రబాబు.. తాజాగా ఇన్స్టాల్మెంట్ మెలిక పెట్టడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. -
పీఎం మోదీ ఏసీ యోజన: కొత్త AC కొనుగోలుపై డిస్కౌంట్
ప్రతి ఏటా వేసవిలో ఎండ తీవ్రత విపరీతంగా పెరిగిపోతోంది. దీంతో ఏసీ అమ్మకాలు జోరుగా సాగుతున్నాయి. 2021-22లో 84 లక్షలు.. 2023-24 నాటికి 1.1 కోట్ల ఏసీలు అమ్ముడైనట్లు కొన్ని గణాంకాల ద్వారా తెలుస్తోంది. ఏసీల విక్రయాలు పెరుగుతున్న సమయంలో.. విద్యుత్ వినియోగం ఎక్కువవుతోంది. ఈ వినియోగాన్ని కొంత వరకు తగ్గించడానికి.. ప్రభుత్వం 'పీఎం మోదీ ఏసీ యోజన' స్కీమ్ అమలు చేయడానికి సిద్ధమవుతున్నట్లు ప్రముఖ ఆంగ్ల మీడియా కథనాలు వెల్లడించాయి.ప్రధానమంత్రి మోదీ ఏసీ యోజన 2025 అమలు కోసం చర్చలు జరుగుతున్నట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన వెలువడలేదు. అయితే పీఎం మోదీ ఏసీ యోజన పథకాన్ని.. విద్యుత్ మంత్రిత్వ శాఖ, బ్యూరో ఆఫ్ ఎనర్జీ ఎఫిషియెన్సీ (BEE) మిర్వహించనుంది. ఈ స్కీమ్ ప్రధాన ఉద్దేశ్యం ఏమిటంటే.. విద్యుత్ ఆదా చేయడమే. కొత్త ఏసీ.. పాత ఏసీ కంటే కొంత తక్కువ కరెంట్ వినియోగిస్తుంది. కాబట్టి ఎలక్ట్రిక్ బిల్ తగ్గుతుంది.బ్యూరో ఆఫ్ ఎనర్జీ ఎఫిషియెన్సీ (BEE) ప్రకారం, పాత ఏసీని ఫైవ్ స్టార్-రేటెడ్ మోడల్‌తో రీప్లేస్ చేసుకోవడం వల్ల ఒక ఇంటికి సంవత్సరానికి రూ. 6,300 వరకు విద్యుత్ బిల్లు ఆదా అవుతాయి. కుటుంబాలకు ఖర్చులను తగ్గించడంతో పాటు, ఇది పవర్ గ్రిడ్‌పై కూడా ఒత్తిడిని తగ్గిస్తుంది.పీఎం మోదీ ఏసీ యోజన అమలులోకి వచ్చిన తరువాత, ఈ స్కీమ్ కింద.. ఎక్కువ విద్యుత్ వినియోగించే లేదా పాత ఏసీని స్థానంలో 5 స్టార్ రేటెడ్ ఏసీని రీప్లేస్ చేసుకోవచ్చు. ఇలా చేయడం వల్ల విద్యుత్ వినియోగం తగ్గుతుంది, తద్వారా కరెంట్ బిల్ తగ్గుతుంది. అంతే కాకుండా ఈ స్కీమ్ కింద ఏసీ కొనుగోలు చేస్తే.. డిస్కౌంట్ కూడా పొందవచ్చు.ఈ స్కీమ్ కింద కొత్త 5 స్టార్ ఏసీ పొందటం ఎలా?➤ఎక్కువ విద్యుత్ వినియోగించే ఏసీని గుర్తింపు కలిగిన రీసైక్లింగ్ కేంద్రంలో ఇవ్వండి. వారు మీకు ఒక సర్టిఫికెట్ అందిస్తారు. దీనిని ఉపయోగించి.. కొత్త ఏసీ కొనుగోలుపై తగ్గింపు పొందవచ్చు.➤బ్లూ స్టార్, ఎల్జీ, వోల్టాస్ వంటి పెద్ద ఏసీ బ్రాండ్స్ కూడా పాత ఏసీకి బదులుగా కొత్త ఏసీ కొనుగోలు చేసే కస్టమర్లకు డిస్కౌంట్ అందిస్తాయి.➤పాత ఏసీ స్థానంలో కొత్త ఏసీ వినియోగించేవారి.. విద్యుత్ బిల్లులో కూడా కొంత తగ్గింపు ఇవ్వడానికి ప్రభుత్వం యోచిస్తున్నట్లు సమాచారం. దీనికోసం విద్యుత్ పంపిణీ సంస్థలతో చర్చించనుంది.ఇదీ చదవండి: టోల్ కలెక్షన్ విధానంలో సంచలన మార్పు: 15 రోజుల్లో అమలు! -
ఇది తీవ్రమైన ఉల్లంఘనే.. కేంద్రానికి ‘సుప్రీం’ చీవాట్లు
న్యూఢిల్లీ: రోడ్డు ప్రమాద బాధితులకు నగదు రహిత చికిత్స (Cashless Treatment) అందించే విషయంలో కేంద్ర ప్రభుత్వ అలసత్వాన్ని సుప్రీం కోర్టు మందలించింది. ఈ విషయాన్ని తీవ్ర ఉల్లంఘనగా పరిగణించాల్సి ఉంటుందని హెచ్చరిస్తూ బుధవారం సంబంధిత అధికారులకు సమన్లు జారీ చేసింది.ప్రమాదం జరిగిన వెంటనే సమీప ఆసుపత్రిలో ఉచిత వైద్య సాయం కల్పించడమే క్యాష్‌లెస్ ట్రీట్మెంట్ స్కీమ్ ఉద్దేశం. ప్రత్యేకించి గోల్డెన్ అవర్ (ప్రమాదం జరిగిన గంటలోపే)తో సహా రోడ్డు ప్రమాద బాధితులందరికీ దీన్ని వర్తింపజేయాల్సి ఉంటుంది. దీని అమలుకుగానూ కేంద్రానికి సుప్రీం కోర్టు మార్చి 14వ తేదీని గడువుగా ప్రకటించింది. అయితే గడువు దాటినా కేంద్రం ఇంతదాకా దీనిని అమలు చేయలేదు.‘‘ప్రభుత్వానికి ఇచ్చిన గడువు ముగిసిపోయింది. దీనిని తీవ్రమైన కోర్టు ఆదేశాల ఉల్లంఘనగా పరిగణిస్తున్నాం’’ అని జస్టిస్ అభయ్ ఎస్ ఓకా ధర్మాసనం బుధవారం వ్యాఖ్యానించింది. ఈ అలసత్వానికి సంబంధించి రోడ్డు రవాణా & జాతీయ రహదారుల మంత్రిత్వ శాఖ కార్యదర్శి, సీనియర్ అధికారులకు కోర్టు సమన్లు జారీ చేసింది. ‘‘అధికారులు కోర్టులకు హాజరైతేనే మా ఆదేశాలను తీవ్రంగా పరిగణిస్తారు. ఈ విషయాన్ని మా సుదీర్ఘ అనుభవం ద్వారా మేం తెలుసుకున్నాం. ఏప్రిల్ 28వ తేదీన సమన్లు అందుకున్నవాళ్లు కోర్టుకు హాజరై వివరణ ఇవ్వాలి. సకాలంలో చికిత్స అందకపోవడంతో రోడ్డు ప్రమాదాల్లో దేశవ్యాప్తంగా ఎంతోమంది ప్రాణాలు కోల్పోతున్నారు. ఇక్కడ.. ఒక్క విషయాన్ని మేం స్పష్టంగా చెప్పదల్చుకున్నాం. ఎటువంటి పురోగతి సాధించలేదని మేం గనుక గుర్తిస్తే కోర్టు ధిక్కార నోటీసులు జారీ చేస్తాం అని జస్టిస్ ఓకా సంబంధిత అధికారులను హెచ్చరించారు.రోడ్డుప్రమాదాల సమయంలో ఆ దారిన వెళ్లేవాళ్లు, పోలీసులు,కొన్నిసార్లు ఆస్పత్రులు కూడా ఎవరైనా ముందుకు వస్తారేమో అని ఎదురు చూస్తున్నాయి. ఇది ప్రజల ప్రాణాలను ప్రమాదంలో పడేస్తోంది అని ధర్మాసనం వ్యాఖ్యానించింది.ఇదిలా ఉంటే.. 2023 డిసెంబర్లో నగదు రహిత చికిత్స (Cashless Treatment) అందించే విషయంలో కేంద్రం తొలి అడుగు వేసింది. ప్రమాదాల్లో (Road Accidents) గాయపడిన బాధితులకు ఉచిత, నగదు రహిత వైద్య చికిత్స అందించడం ఎంవీఏ యాక్టు 2019లో భాగం. ఇప్పటికే కొన్ని రాష్ట్రాలు దీన్ని అమలు చేస్తున్నాయి. అయితే.. కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమశాఖ సహకారంతో రోడ్డు రవాణా, హైవే మంత్రిత్వశాఖ దీన్ని దేశవ్యాప్తంగా అమలు చేయాలనుకుంది.రోడ్డు ప్రమాదాలు జరిగిన ప్రాణాంతకంగా ఉన్న సమయంలో.. ప్రత్యేకించి గోల్డెన్ అవర్ టైంలో రోడ్డు ప్రమాద బాధితుడి ప్రాణాలు రక్షించే చికిత్స కోసం నగదు చెల్లింపులు చేయడానికి ఎవరూ లేనప్పుడు ఈ పథకం వర్తిస్తుంది. క్యాష్‌లెస్ ఎమర్జెన్సీ ట్రీట్మెంట్ స్కీమ్ కింద.. రోడ్డు ప్రమాదాలకు గురైన వాళ్ల చికిత్స కోసం ఏడు రోజులకుగానూ లక్షా 5 వేల రూపాయల ఖర్చు భరిస్తుంది. అయితే ఇది ప్రమాదం జరిగిన 24 గంటలలోపు పోలీసులకు తెలియజేస్తేనే!. ఇక..ఆస్పత్రులు మోటార్ వెహికిల్స్ యాక్ట్ ఫండ్ నుంచి ట్రీట్మెంట్ సొమ్మును రీయింబర్స్మెంట్ ద్వారా పొందుతాయి. ఇదికాక.. అదనంగా హిట్ అండ్ రన్ కేసుల్లో మరణించిన వాళ్ల కుటుంబాలకు ప్రభుత్వం రూ.2 లక్షల ఎక్స్‌గ్రేషియా కూడా అందిస్తుంది. అయితే.. ఏడాదిన్నరగా ఈ పథకాన్ని ఆచరణలో పెట్టాలనే ప్రయత్నాలు మాత్రం ముందుకు సాగడం లేదు. ఈ ఏడాది జనవరి 8వ తేదీన సరైన విధివిధానాలతో ఓ పథకం రూపొందించాలంటూ కేంద్రానికి సుప్రీం కోర్టు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. ఇదే కాకుండా.. మోటార్ వెహికిల్స్ యాక్ట్(సవరణ చట్టం)లోని సెక్షన్ 162(2) ప్రకారం.. ఇన్సూరెన్స్ కంపెనీలు కూడా బాధితుల చికిత్సకు అయ్యే ఖర్చును భరించాల్సి ఉంటుంది. కానీ, ఇది కూడా అమలు కావడం లేదని సర్వోన్నత న్యాయస్థానం గుర్తించింది. -
ఫ్రీ బస్సేది బాబూ
-
‘ఇదిగో చూడు.. చంద్రబాబే చెప్పారు కదయ్యా..!’ ఫ్రీ బస్సు అమలుపై వినూత్న నిరసన (ఫొటోలు)
-
గోల్డ్ బాండ్లు కొన్నవారికి 193 శాతం లాభం
-
ఫ్లైట్ మిస్ అయితే రూ.7500 పరిహారం!: ఉబర్ కీలక ప్రకటన
క్యాబ్ అగ్రిగేటర్ దిగ్గజం 'ఉబర్' (Uber) ముంబైలోని.. తన కస్టమర్ల కోసం కొత్త పథకాన్ని ప్రవేశపెట్టింది. దీని కింద విమానాశ్రయానికి వెళ్లే మార్గంలో ఆలస్యం కారణంగా విమానం మిస్ అయితే రూ.7,500 వరకు పరిహారం అందించనున్నట్లు వెల్లడించింది. ఈ కవరేజ్ ప్లాన్‌కు 'మిస్డ్ ఫ్లైట్ కనెక్షన్ కవర్' అని పేరు పెట్టారు. దీనితో పాటు, ఒకవేళా ప్రమాదం జరిగిన సందర్భాలలో ఔట్ పేషెంట్ (OPD) ఛార్జీలతో సహా వైద్య ఖర్చులను కూడా కంపెనీ కవర్ చేస్తుంది.2024 ఫిబ్రవరి చివరలో ఉబర్.. రిలయన్స్ జనరల్ ఇన్సూరెన్స్‌తో భాగస్వామ్యం కుదుర్చుకుని ఈ ప్లాన్‌ను ప్రారంభించారు. విమానాశ్రయానికి సకాలంలో చేరుకోవడం చాలా ముఖ్యం. అయితే నగరంలోని ట్రాఫిక్ కారణంగా కొన్ని సార్లు ఆలస్యం అవ్వొచ్చు. అలాంటప్పుడు ఈ పరిహారం వారికి కొంత ఉపశమనం అందిస్తుంది.ఇదీ చదవండి: భారత్‌కు ఆ రెండు టెస్లా కార్లు!.. సర్టిఫికేషన్ కోసం దరఖాస్తువిమానాశ్రయానికి రైడ్ బుక్ చేసుకుని, ఫ్లైట్ మిస్ అయితే మాత్రమే ఈ పరిహారం లభిస్తుంది. ఉబర్ ప్లాన్ కింద పరిహారం పొందాలంటే.. రైడ్ బుక్ చేసుకున్న వ్యక్తి సంతకం చేసిన క్లెయిమ్ ఫారమ్, మిస్ అయిన ఫ్లైట్ టికెట్ కాపీతో పాటు.. మళ్ళీ కొత్తగా బుక్ చేసుకున్న కొత్త విమానం టికెట్ వంటి అవసరమైన వివరాలకు సంబంధించిన డాక్యుమెంట్స్ సమర్పించాల్సి ఉంటుంది. -
అన్నదాత సుఖీభవపై చంద్రబాబు సర్కార్ యూటర్న్
-
Super Six Scheme: ఇచ్చేది లేదు సచ్చేది లేదని.. నోటికొచ్చినట్టు చెప్తున్నారు!
-
వజ్రాల పరిశ్రమ పునరుజ్జీవం
న్యూఢిల్లీ: కట్ చేసిన, సానబట్టిన వజ్రాలను సుంకాల్లేకుండా దిగుమతి చేసుకునేందుకు వీలు కల్పిస్తూ ‘డైమండ్ ఇంప్రెస్ట్ ఆథరైజేషన్ స్కీమ్’ను కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టింది. ఎగుమతులను పెంచడం, విలువను జోడించడం ఈ పథకం ఉద్దేశ్యాలుగా ఉన్నాయి. ఏప్రిల్ 1 నుంచి ఈ పథకం అమల్లోకి రానుంది. వజ్రాల పరిశ్రమ ఎగుమతులు క్షీణత, ఉపాధి నష్టాన్ని ఎదుర్కొంటోందని కేంద్ర వాణిజ్య శాఖ పేర్కొంది.తాజా పథకం ఈ ధోరణికి చెక్‌పెట్టి పరిశ్రమకు పునరుజ్జీవాన్ని కల్పిస్తుందన్న ఆశాభావాన్ని వ్యక్తం చేసింది. అంతర్జాతీయంగా భారత వజ్రాల పరిశ్రమ పోటీతత్వాన్ని పెంచుతుందని, ఎంఎస్ఎంఈలకు తగిన అవకాశాలను కల్పిస్తుందని తెలిపింది. మరిన్ని ఉపాధి అవకాశాలకు మార్గం కల్పిస్తుందని పేర్కొంది. రెండు స్టార్ల ఎగుమతి హోదా కలిగి, ఏడాదిలో 15 మిలియన్ డాలర్లు అంతకంటే అధిక విలువ మేర ఎగుమతులు చేస్తున్న సంస్థలు ఈ పథకం కింద ప్రయోజనానికి అర్హులని వెల్లడించింది.ఇదీ చదవండి: భారత్ క్రెడిట్ రేటింగ్‌కు సవాళ్లు25 క్యారట్ (25 సెంట్లు) అంతకంటే తక్కువ ఉన్న సహజ కట్, పాలిష్డ్ వజ్రాలను సుంకాల్లేకుండా దిగుమతి చేసుకునేందుకు పథకం అనుమతిస్తుందని స్పష్టం చేసింది. గ్లోబల్ ట్రేడ్ రీసెర్చ్ ఇనీషియేటివ్ (జీటీఆర్ఐ) అనే స్వతంత్ర సంస్థ గణాంకాల ప్రకారం.. 2021–22లో ముడి వజ్రాల దిగుమతులు 18.5 బిలియన్ డాలర్లుగా ఉంటే, 2023–24 నాటికి 14 బిలియన్ డాలర్లకు క్షీణించాయి. కట్, పాలిష్డ్ వజ్రాల ఎగుమతులు ఇదే కాలంలో 24.4 బిలియన్ డాలర్ల నుంచి 13.1 బిలియన్ డాలర్లకు తగ్గిపోవడం గమనార్హం. -
87 లక్షల మందికి తల్లికి వందనం ఎగవేత
-
సీనియర్ సిటిజన్లకు కేజ్రీవాల్ ‘సంజీవని’
న్యూఢిల్లీ: ఢిల్లీలో అసెంబ్లీ ఎన్నికల వేడి మొదలైంది. వచ్చే ఏడాది ఫిబ్రవరిలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల కోసం అధికార ఆమ్ఆద్మీపార్టీ(ఆప్) దూకుడు ప్రదర్శిస్తోంది. ఇప్పటికే పార్టీ తరపున ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల పూర్తి జాబితాను ప్రకటించిన ఆ పార్టీ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్.. తాజాగా ప్రజలకు కీలక హామీ ఇచ్చారు. తాము మళ్లీ అధికారంలోకి వస్తే 60 ఏళ్లు పైబడిన వారికి పూర్తి ఉచితంగా వైద్యం అందించే పథకాన్ని అమలు చేస్తామని ప్రకటించారు. ఈ స్కీమ్ పేరు ‘సంజీవని’ అని తెలిపారు.ఈ పథకం కింద లబ్ధి పొందేందుకు ఆదాయంతో సంబంధం లేదని పేద,మధ్యతరగతి, ధనిక వర్గాలకు చెందిన వృద్ధులకు ఈ స్కీమ్ కింద ఉచిత వైద్యం అందిస్తామని కేజ్రీవాల్ తెలిపారు. ప్రభుత్వ లేదా ప్రైవేట్ ఆస్పతత్రుల్లో ఎక్కడ కావాలంటే అక్కడ వైద్యం పొందవచ్చన్నారు. #WATCH | Delhi | AAP National Convenor Arvind Kejriwal says, “Elderly over the age of 60 will receive free treatment under the Sanjeevani Yojna, in private and government hospitals both… There will be no upper limit on the cost of treatment. Registration for this will start in a… pic.twitter.com/WYQGjQI8Ga— ANI (@ANI) December 18, 2024 మహిళలకు నెలవారి నగదు అందించే ముఖ్యమంత్రి మహిళా సమ్మాన్ యోజన స్కీమ్‌ను ఢిల్లీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని కేజ్రీవాల్ ఇప్పటికే ప్రకటించడం గమనార్హం. 2025 ఫిబ్రవరిలో ఢిల్లీ అసెంబ్లీకి ఎన్నికలు జరగనున్నాయి. ఈసారి మహిళలు, వృద్ధుల ఓట్లపై ఫోకస్ చేయడం ద్వారా ఢిల్లీలో అధికారాన్ని నిలబెట్టుకోవచ్చని ఆప్ భావిస్తోంది. -
తెలంగాణ ఉద్యమంలో ఆర్టీసీ కార్మికులది కీలక పాత్ర
-
ఈపీఎఫ్‌వో క్షమాభిక్ష పథకం
న్యూఢిల్లీ: ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ (EPFO) తాజాగా 2024 క్షమాభిక్ష పథకాన్ని ఆమోదించింది. దీని ప్రకారం సంస్థలు ఎటువంటి పెనాల్టీ లేకుండా గత ప్రావిడెంట్ ఫండ్ బకాయిలను డిపాజిట్ చేయడానికి అనుమతిస్తుంది.కార్మిక మంత్రి మన్సుఖ్ మాండవియా నేతృత్వంలో ఉద్యోగుల భవిష్య నిధి సంస్థకు (ఈపీఎఫ్‌వో) చెందిన అత్యున్నత నిర్ణయాధికార సంస్థ సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీ (సీబీటీ) శనివారం ఈపీఎఫ్‌వో ఆమ్నెస్టీ స్కీమ్ 2024ను కేంద్ర ప్రభుత్వానికి సిఫార్సు చేసినట్లు కార్మిక మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. పెనాల్టీలు లేదా చట్టపరమైన పరిణామాలను ఎదుర్కోకుండా యజమానులను స్వచ్ఛందంగా బహిర్గతం చేయడానికి, గతంలో పాటించని లేదా తక్కువ నిబంధనలను సరిదిద్దడానికి ప్రోత్సహించడానికి ఈ పథకాన్ని రూపొందించారు.స్కీమ్ ప్రయోజనాలను పొందేందుకు యజమానుల నుండి ఒక సాధారణ ఆన్లైన్ డిక్లరేషన్ సరిపోతుంది. స్వచ్ఛంద సమ్మతి కోసం పరిమిత అవకాశాన్ని అందించడం ద్వారా మరింత మంది ఉద్యోగులకు సామాజిక భద్రతా ప్రయోజనాలను విస్తరించడం, యజమానులతో నమ్మకాన్ని పునర్నిర్మించడం, శ్రామిక శక్తిని అధికారికంగా ప్రోత్సహించడం ఈ పథకం లక్ష్యం అని ఈపీఎఫ్‌వో పేర్కొంది. -
పోస్టాఫీసులకు మహిళలు పరుగులు..ఎందుకో తెలుసా? (ఫొటోలు)
-
ప్రతీ ఇంటికీ మూడు సిలెండర్లు ఇస్తామని గతంలో చంద్రబాబు హామీ
-
Adimulapu Suresh: ప్రజలకు ఉపయోగపడేలా బడ్జెట్ ఏ మాత్రం ఆశాజనకంగా లేదు
-
ఆంధ్రప్రదేశ్‌లో కొందరికే గ్యాస్ సిలిండర్ పథకం... 55 లక్షల మంది లబ్ధిదారులకు పథకాన్ని ఎగ్గొట్టేందుకు ప్రభుత్వం యత్నం