Madhav reddy
-
పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి టార్గెట్ గా మాధవరెడ్డి అరెస్ట్
-
మదనపల్లె ఫైల్స్ దగ్ధం కేసులో సీఐడీకి చుక్కెదురు
చిత్తూరు అర్బన్: అన్నమయ్య జిల్లా మదనపల్లె సబ్ కలెక్టర్ కార్యాలయంలో జరిగిన అగ్ని ప్రమాద ఘటనను పూర్తి రాజకీయ కక్షపూరిత కేసుగా మార్చిన సీఐడీ పోలీసులకు శుక్రవారం చుక్కెదురైంది. ఈ కేసులో నిందితుడిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న పారిశ్రామికవేత్త మాధవరెడ్డిని గురువారం రాత్రి అరెస్టు చేసిన సీఐడీ పోలీసులు..జు్యడీషియల్ రిమాండ్ కోసం శుక్రవారం చిత్తూరు నగరంలోని సీఐడీ న్యాయస్థానంలో ప్రవేశపెట్టగా కోర్టు అంగీకరించలేదు. డిఫెన్స్ న్యాయవాదులు లోకనాథరెడ్డి, సురేష్‌రెడ్డి, ప్రకాష్ రెడ్డి తెలిపిన వివరాల మేరకు.. గత ఏడాది జూలై 21న అన్నమయ్య జిల్లా మదనపల్లె సబ్ కలెక్టర్ కార్యాలయంలో అగ్ని ప్రమాదం జరగడం.. దీన్ని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి ఆపాదిస్తూ కార్యాలయాన్ని కాల్చేశారంటూ కూటమి ప్రభుత్వం కుట్ర పన్ని కక్ష సాధింపు చర్యలకు దిగడం తెలిసిందే. పారిశ్రామికవేత్త మాధవరెడ్డిపై పలు సెక్షన్ల కింద అక్రమ కేసులు నమోదు చేశారు. తనకు ఈ కేసుతో సంబంధం లేదని ఆయన హైకోర్టును ఆశ్రయించగా.. తొందరపాటు చర్యలు వద్దని మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది. అయితే గురువారం రొంపిచెర్ల మండలం పెద్దగొట్టిగల్లులో ఉన్న మాధవరెడ్డిని సీఐడీ పోలీసులు అదుపులోకి తీసుకుని తిరుపతికి తరలించారు. శుక్రవారం సాయంత్రం చిత్తూరు నగరంలోని సీఐడీ కోర్టులో ప్రవేశపెట్టి.. జ్యుడీషియల్ రిమాండ్‌కు ఆదేశించాలని న్యాయమూర్తిని కోరారు. హైకోర్టు తొందరపాటు చర్యలు వద్దని చెప్పినప్పుడు మాధవరెడ్డిపై సీఐడీ పోలీసులు ఏడేళ్ల లోపు శిక్షపడే సెక్షన్లు నమోదు చేశారని, తాజాగా జీవిత ఖైదు పడే సెక్షన్ 338తో పాటు బీఎస్ఎన్–111 సెక్షన్‌ను సైతం ఉద్దేశ పూర్వకంగా పెట్టారని ఆయన తరఫు న్యాయవాదులు వాదించారు. ఇది హైకోర్టు ఉత్తర్వులను ఉల్లంఘించడమేనని చెప్పారు. కొత్తగా నమోదు చేసిన సెక్షన్లు మాధవరెడ్డికి వర్తిస్తాయని సీఐడీ పోలీసులు చెప్పడంతో, అందుకు సంబంధించిన సపోర్టింగ్ డాక్యుమెంట్లు న్యాయస్థానం ఎదుట ఉంచాలని మేజిస్ట్రేట్ బాబాజాన్ తెలిపారు. సరైన ఆధారాలు లేకుండా రిమాండ్‌కు ఆదేశించలేమని స్పష్టం చేశారు. దీంతో ఏం చేయాలో తెలియని సీఐడీ పోలీసులు, మాధవరెడ్డిని కోర్టు నుంచి తీసుకెళ్లిపోయారు. కాగా, రెడ్‌బుక్ రాజ్యాంగాన్ని అమలు చేసి తీరాల్సిందేనన్న కూటమి నేతల ఆదేశాలతో రాత్రికి రాత్రే కొన్ని పత్రాలు సిద్ధం చేసి.. తిరిగి కోర్టులో ప్రవేశపెట్టే పనిలో సీఐడీ పోలీసులు ఉన్నట్లు తెలిసింది. -
ఖాతాలు ఎవరివి.. కాసులు ఎక్కడివి? రెండో రోజు చీకోటిపై ప్రశ్నల వర్షం
సాక్షి, హైదరాబాద్: క్యాసినోవాలా చీకోటి ప్రవీణ్ వ్యవహారంలో ఈడీ విచారణ రెండో రోజూ కొనసా గింది. మంగళవారం ప్రవీణ్‌తోపాటు ఆయన భాగ స్వామి మాధవరెడ్డి కూడా విచారణకు హాజరయ్యా రు. తొలిరోజు విచారణలో భాగంగా ప్రవీణ్ లావా దేవీల్లో కొన్ని విదేశీ ఖాతాలను ఈడీ అధికారులు గుర్తించినట్టు తెలిసింది. హవాలా మార్గంలో ఆ విదేశీ ఖాతాలకు డబ్బు వెళ్లినట్టు గుర్తించిన అధికా రులు.. ఆ కోణంలో ప్రశ్నించినట్టు సమాచారం. ఆ విదేశీ ఖాతాలు ఎవరివి? ప్రవీణ్ ల్యాప్‌ట్యాప్, మొబైల్లోని ఈ–మెయిల్స్, వాట్సాప్ చాటింగ్‌లలో కీలక సమాచారాన్ని ఈడీ అధికారులు గుర్తించారు. ఇందులో విదేశీ ఖాతాల నంబర్లు, వాటికి పంపించిన సొమ్ము లావాదేవీల వివరాలు ఉన్నట్టు తెలిసింది. దీంతో ఆ 18 ఖాతా లెవరివి, హవాలా ద్వారా అంత పెద్ద మొత్తంలో సొమ్మును ఎందుకు తరలించారన్న వివరాలపై ప్రవీణ్‌ను ప్రశ్నించినట్టు తెలిసింది. ఇక నేపాల్, ఇండోనేషియాల్లో క్యాసినో ఆడేందుకు హవాలా మార్గం ద్వారా డబ్బు తరలించడాన్ని ప్రస్తావిస్తూ.. హవాలా కోసం హైదరాబాద్‌లో ఇచ్చిన డబ్బులు ఎక్కడివని ప్రవీణ్‌ను, మాధవరెడ్డిని ఆరా తీసినట్టు సమాచారం. ఒక్క జూన్‌లోనే రూ.40 కోట్లకుపైగా నేపాల్‌కు చేరినట్టు ఈడీ గుర్తించింది. ఆ డబ్బు ఎవరెవరి నుంచి ఎంత మేర తీసుకున్నారు? ఏ హవాలా ఏజెంట్ ద్వారా నేపాల్‌కు చేరవేశారు? అక్కడ ఎవరి ద్వారా తీసు కున్నారన్న వివరాలపై ప్రశ్నించినట్టు తెలిసింది. అయితే క్యాసినో ఆడిన వా రిలో చాలామంది వీఐపీలు ఉండటంతో వారి పేర్లు చెప్పేందుకు ప్రవీణ్, మాధవరెడ్డి భయపడుతున్నారని ఈడీ వర్గాలు చెబుతున్నాయి. మంత్రులు, ఎమ్మెల్యేలతోపాటు సినీ సెలబ్రిటీలు, ఇతర వీఐపీలు కూడా ఈ జాబితాలో ఉన్నట్టు ఈడీ అనుమానిస్తోంది. ప్రవీణ్ వాట్సాప్ డేటాను బ్యాకప్ చేసి, క్యాసినోల కోసం డబ్బులు ఇచ్చినవారి వివరాలు తేల్చాలని ఈడీ ప్రయత్నిస్తున్నట్టు సమాచారం. మీడియాపై రుసరుస.. రెండో రోజు విచారణ కోసం ఈడీ కార్యాలయానికి వచ్చిన ప్రవీణ్ మీడియాపై రుసురుసలాడారు. ఒక్కో మీడియా సంస్థ ఒక్కో రకంగా తనపై ఇష్టం వచ్చినట్టు ప్రచారం చేస్తున్నారని పేర్కొన్నారు. కాగా, చీకోటి ప్రవీణ్ వ్యవహారంలో మంత్రి కేటీఆర్‌తో పాటు ఎమ్మెల్సీ కవిత, చినజీయర్ స్వామిలను కూడా విచారించాలని ఏఐసీసీ సభ్యుడు బక్కా జడ్సన్ మంగళవారం ఈడీకి ఫిర్యాదు చేశారు. -
చీకోటి హవాలా దందాలో మరో నలుగురు
సాక్షి, హైదరాబాద్/కందుకూరు: క్యాసినోవాలాగా పేరుగాంచిన చీకోటి ప్రవీణ్‌కుమార్‌పై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) నమోదు చేసిన కేసులో కొత్త కోణం వెలుగు చూసింది. బుధ, గురువారాల్లో చీకోటితోపాటు మాధవరెడ్డి నివాసాల్లో ఈడీ సోదాలు నిర్వహించింది. ఈ సోదాల్లో హవాలా లావాదేవీలకు సంబంధించి మరో నలుగురు పేర్లు బయటపడినట్టు ఈడీ వర్గాలు వెల్లడించాయి. అందులోభాగంగా అధికారులు జూబ్లీహిల్స్‌లోని బబ్లూ, బేగంబజార్‌లోని సంపత్, సికింద్రాబాద్‌లోని రాకేష్, వెంకటేశ్ నివాసాల్లోనూ ఏకకాలంలో సోదాలు చేసినట్టు తెలిసింది. చెన్నై, హైదరాబాద్ నుంచి విదేశాలకు తరలించాల్సిన హవాలా డబ్బును ఈ నలుగురే ఆపరేట్ చేసినట్టు ఈడీ అనుమానిస్తోంది. అయితే వీరిలో సంపత్‌కు రాజకీయ ప్రముఖులతో సంబంధాలున్నాయని, ఎన్నికల సమయంలో పలువురికి ఇచ్చిన డబ్బును డైరీలో రాసుకున్నట్టు ఈడీ వర్గాల ద్వారా తెలిసింది. చీకోటి కీలకంగా ఉంటూ హవాలా డబ్బు మొత్తం సంపత్ ఆపరేట్ చేస్తున్నట్టు అధికారులు అనుమానిస్తున్నారు. ఈ నలుగురి ఇళ్లలో సోదాలు చేసిన అధికారులు వీరికీ నోటీసులిచ్చి విచారించాలని భావిస్తున్నారు. సోమవారం ఈడీ ఎదుట చీకోటితోపాటు మాధవరెడ్డి హాజరుకానున్నారు. వీరి విచారణ తర్వాత ఈ నలుగురికి నోటీసులిచ్చి విచారించే అవకాశమున్నట్టు తెలుస్తోంది. అదేవిధంగా జూన్‌లో చీకోటి ప్రవీణ్ జన్మదిన వేడుకలకు రూ.5 కోట్లకు పైగా ఖర్చుపెట్టినట్టు ఈడీ పలు ఆధారాలు సేకరించింది. అందులో పాల్గొన్న మంత్రి, ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధుల పాత్రపైనా ఆరా తీసేందుకు ఈడీ ప్రయత్నిస్తున్నట్టు తెలిసింది. మంత్రితో చీకోటికి ఉన్న సాన్నిహిత్యంపై ప్రత్యేక దృష్టి సారించినట్టు సమాచారం. విదేశీ ఊసరవెల్లులు, కొండ చిలువలు రంగారెడ్డి జిల్లా కందుకూరు మండలంలో చీకోటి ప్రవీణ్‌కు చెందిన వ్యవసాయ క్షేత్రంలో శుక్రవారం అటవీశాఖ అధికారులు దాడులు చేశారు. అటవీశాఖ రేంజ్ అధికారి రమేశ్‌కుమార్, డీఆర్ఓలు విజయ శ్రీనివాస్‌రావు, హేమ తదితరులు క్షుణ్ణంగా తనిఖీలు నిర్వహించారు. సాయిరెడ్డిగూడ పరిధిలో 12 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న వ్యవసాయ భూమిని 2016–17లో ప్రవీణ్ కొనుగోలు చేశాడు. అందులో ఉన్న పౌల్ట్రీతోపాటు మిగతా ప్రాంతంలో షెడ్లు నిర్మించాడు. విదేశాల నుంచి తెప్పించిన కొండ చిలువలు, ఊసరవెల్లులు, ఆఫ్రికన్ పాములు, మకావ్ చిలుకలు, హంసలు, బాతులు, ఉడుము, బల్లి జాతికి చెందిన రకాలు, జింక రకం మేకలు, టర్కీ కోళ్లు, ఆస్ట్రిచ్ పక్షులు, మేలు జాతి గుర్రాలు, సాలీళ్లు, రకరకాల కుక్కలు, పక్షుల వంటి వాటితోపాటు ఆవులు, గేదెలను పెంచుతున్నాడు. అలాగే, పురాతన కాలం నాటి రథం కూడా ఉంది. ఎఫ్ఆర్ఓ రమేశ్‌కుమార్ మాట్లాడుతూ.. నిబంధనల మేరకు అన్నీ సక్రమంగా ఉన్నట్లుగా ప్రాథమికంగా గుర్తించామన్నారు. ఇంకా పూర్తిస్థాయిలో పరిశీలించి ఉన్నతాధికారులకు నివేదిస్తామని తెలిపారు. -
సొంతగూటికి దొంతి మాధవరెడ్డి
దిగ్విజయ్ సమక్షంలో కాంగ్రెస్‌లో చేరిన నర్సంపేట ఎమ్మెల్యే సాక్షి, న్యూఢిల్లీ: అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ టికెట్ దక్కకపోవడంతో స్వతంత్ర అభ్యర్థిగా పోటీచేసి గెలుపొందిన వరంగల్ జిల్లా నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి తిరిగి సొంతగూటికి చేరారు. పార్టీ బలోపేతానికే మళ్లీ కాంగ్రెస్‌లోకి వస్తున్నట్టు ఆయన పేర్కొన్నారు. మంగళవారం కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జ్ దిగ్విజయ్‌సింగ్‌ను ఆయన ఢిల్లీలో కలిశారు. ఈ సందర్భంగా పార్టీ కండువాకప్పి దొంతిని కాంగ్రెస్‌లోకి దిగ్విజయ్ ఆహ్వానించారు. అనంతరం విలేకరుల సమావేశంలో మాజీ ఎంపీలు బలరాంనాయక్, వివేక్, మాజీ మంత్రి బస్వరాజు సారయ్యతో కలిసి దొంతి మాధవరెడ్డి మాట్లాడారు. ఎమ్మెల్యేలకు తగినన్ని నిధులు ఇచ్చి అభివృద్ధిలో భాగస్వాములను చేయాలని సీఎం కేసీఆర్‌ని కోరారు.