HCU issue
-
ఏఐ సాయంతో సృష్టించిన ఫేక్ వీడియోలపై రేవంత్ సర్కార్ సీరియస్
-
రేవంత్.. మై హోమ్ విహంగ కూల్చే దమ్ముందా?: కవిత సవాల్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని నడపలేని స్థితిలో ఉన్నారని సంచలన వ్యాఖ్యలు చేశారు బీఆర్ఎస్ ఎమ్మల్సీ కల్వకుంట్ల కవిత. ముఖ్యమంత్రి రేవంత్ చర్యల వల్ల హైదరాబాద్‌లో రియల్ ఎస్టేట్ పడిపోయింది. అందుకే హెచ్‌సీయూ వద్ద 400 ఎకరాల భూమిని విక్రయించాలని చూస్తున్నారు అని ఘాటు విమర్శలు చేశారు.హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూములపై బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత కీలక వ్యాఖ్యలు చేశారు. తాజాగా కవిత మీడియాతో మాట్లాడుతూ..‘సెంట్రల్ యూనివర్సిటీ భూములు ప్రైవేటు వ్యక్తుల చేతుల్లోకి వెళ్లకుండా 400 ఎకరాల భూమిని బీఆర్ఎస్ ప్రభుత్వం కాపాడింది. ఆ భూముల పరిరక్షణ కోసం కేసీఆర్ నిర్దేశం మేరకు న్యాయవాదులు కోర్టులో గట్టిగా వాదనలు వినిపించారు. ఇది యూనివర్సిటీ భూమి అని ప్రైవేటు వ్యక్తుల చేతుల్లోకి వెళ్లవద్దన్న ఉద్దేశంతో బీఆర్ఎస్ ప్రభుత్వం న్యాయ పోరాటం చేసింది.సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని నడపలేని స్థితిలో ఉన్నారు. రేవంత్ రెడ్డి దుశ్చర్య వల్ల హైదరాబాద్‌లో రియల్ ఎస్టేట్ పడిపోయింది కాబట్టి 400 ఎకరాల భూమిని విక్రయించాలని నిర్ణయించారు. యూనివర్సిటీ నుంచి తీసుకున్న భూమిని యూనివర్సిటీకే ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాం. 397 ఎకరాలను ఇతర చోట యూనివర్సిటీకి ఇచ్చామని ప్రభుత్వం వితండవాదం చేస్తుంది. పరిశ్రమల ఏర్పాటు, భూముల విక్రయం ఆ 397 ఎకరాల్లో చేసుకోవచ్చు కదా?. ప్రభుత్వం పర్యావరణం, ప్రకృతి కోణంలో కూడా ఆలోచించాలి.ఇప్పటికే కాంక్రీట్ జంగిల్ లాగా మారిన గచ్చిబౌలి ప్రాంతంలో ఈ 400 ఎకరాల్లో కూడా పెద్ద ఎత్తున కంపెనీలు ఏర్పాటు అయితే వాతావరణంపై ఎంత ఒత్తిడి పెరుగుతుందో ఆలోచించాలి. బీఆర్ఎస్ హయాంలో మై హోమ్ విహంగ నిర్మాణానికి భూములు కేటాయించాం అనడంలో వాస్తవం లేదు. మై హోమ్ విహంగా ప్రభుత్వ భూముల్లో నిర్మించినట్లయితే సీఎం రేవంత్ రెడ్డి బుల్డోజర్లను పంపించాలి. కానీ, మై హోమ్ రామేశ్వరరావు బీజేపీ మనిషి కాబట్టి సీఎం రేవంత్ రెడ్డి ఆ ధైర్యం చేయలేరు. పేదలు, మూగజీవులు ఉంటేనే బుల్డోజర్లను ప్రయోగిస్తారు..పెద్దవాళ్లనేమో ముట్టుకోరు అంటూ విమర్శలు చేశారు. బీఆర్ఎస్ హయాంలో మై హోమ్ విహంగ నిర్మాణానికి భూములు కేటాయించామనడంలో వాస్తవం లేదుమై హోమ్ విహంగా ప్రభుత్వ భూముల్లో నిర్మించినట్లయితే సీఎం రేవంత్ రెడ్డి బుల్డోజర్లను పంపించాలిమై హోమ్ రామేశ్వరరావు బిజెపి మనిషి కాబట్టి సీఎం రేవంత్ రెడ్డి ఆ ధైర్యం చేయలేరుపేదలు, మూగజీవులు ఉంటేనేమో… pic.twitter.com/5oKO0iJCbg— Kalvakuntla Kavitha Office (@OfficeOfKavitha) April 2, 2025 -
హెచ్‌సీయూ వివాదం.. రేణూ దేశాయ్ విన్నపం.. ప్రభుత్వానికి ఉపాసన సూటి ప్రశ్న
సాక్షి, హైదరాబాద్: కంచె గచ్చిబౌలిలోని 400 ఎకరాల అడవిని మాయం చేసి పరిశ్రమలు స్థాపించి ఉద్యోగాలు కల్పిస్తామంటోంది తెలంగాణ ప్రభుత్వం.. ఆ భూములు మావంటూ వాటిని కాపాడుకోవడానికి పోరుబాట పట్టారు హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ విద్యార్థులు (#HCU Protest). వందలాది జేసీబీలు అర్ధరాత్రి అడవిని ధ్వంసం చేయడానికి వెళ్తే నెమళ్ల ఆర్తనాదాలు, భయంతో పరుగులు తీస్తున్న దుప్పిల వీడియోలు సోషల్ మీడియాలో ప్రతి ఒక్కరి మనసును కదిలిస్తున్నాయి. అడవిని కాపాడుకుందాంఅవి చూసిన సామాన్యులే కాదు సెలబ్రిటీలు సైతం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు కాలుష్యంతో నిండిపోతున్న నగరానికి ఆక్సిజన్ అందిస్తున్న భూముల్ని అమ్మడం అన్యాయమని మండిపడుతున్నారు. అడవి నరికివేత ఆపేయాలని, పర్యావరణాన్ని కాపాడుకుందాం అని నినదిస్తున్నారు. హీరో రామ్‌చరణ్ సతీమణి ఉపాసన (Upasana Konidela) ఇన్స్టాగ్రామ్ వేదికగా ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. మీరు ఇదే గనక చేయాలనుకుంటే అక్కడున్న మూగజీవాలు, పక్షులకు ఎక్కడ పునరావాసం కల్పిస్తారు? నరికివేసిన చెట్లను తిరిగి ఎక్కడ పెంచుతారు? వీటన్నింటికీ సమాధానం చెప్పండి అని కోరింది.దయచేసి వేడుకుంటున్నా..పవన్ కల్యాణ్ మాజీ భార్య, నటి రేణూ దేశాయ్ (Renu Desai) స్పందిస్తూ.. రెండు రోజుల క్రితమే నాకు విషయం తెలిసింది. అన్ని విషయాలు కనుక్కున్నాకే వీడియో చేస్తున్నాను. సీఎం రేవంత్ రెడ్డిగారూ.. ఒక తల్లిగా మిమ్మల్ని అభ్యర్థిస్తున్నా.. నాకు 44 ఏళ్లు. రేపోమాపో ఎలాగైనా పోతాను. కానీ పిల్లలు.. మన రేపటితరానికి ఆక్సిజన్, నీళ్లు అవసరం. వదిలేయండి..అభివృద్ధి అవసరం.. కాదనను. ఐటీ పార్కులు, బహుళ అంతస్తుల భవనాలు.. అన్నీ అవసరమే! కానీ ఈ 400 ఎకరాలను మాత్రం వదిలేయండి. నిర్మానుష్యంగా ఉన్న భూముల్ని వెతకండి. దయచేసి మిమ్మల్ని వేడుకుంటున్నాను. ఏదో ఒకటి చేయండి. మీరు చాలా సీనియర్. ఒక తల్లిగా అడుక్కుంటున్నాను. ఒక్కసారి ఆలోచించండి అని వీడియో రిలీజ్ చేసింది. మూగజీవాల్ని అడవి నుంచి తరిమేయకండి అంటూ యాంకర్ రష్మీ గౌతమ్ సైతం వీడియో షేర్ చేసింది. View this post on Instagram A post shared by renu desai (@renuudesai) View this post on Instagram A post shared by Rashmi Gautam (@rashmigautam)చదవండి: లాల్ సింగ్ చద్దా.. ఆ స్టార్ హీరోకంటే అతడి కొడుకే బెటర్: దర్శకుడు -
రోహిత్ చనిపోవడం బాధాకరం: కేసీఆర్
హైదరాబాద్: ఇటీవల తీవ్రస్థాయి ఆందోళనలకు, నిరసనలకు కారణమైన హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ (హెచ్‌సీయూ) ఘటనపై తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు స్పందించారు. వేముల రోహిత్ ఆత్మహత్య గురించి ప్రస్తావిస్తూ హెచ్‌సీయూలో ఒక విద్యార్థి చనిపోవడం బాధాకరమని ఆయన అన్నారు. హెచ్‌సీయూ, ఓయూ ఘటనలపై వాయిదా తీర్మానం కింద అసెంబ్లీలో చర్చకు కాంగ్రెస్ సభ్యులు పట్టుబట్టడంతో కేసీఆర్ ప్రతిస్పందించారు. హెచ్‌సీయూలో, ఓయూలో జరిగిన ఘటనలు దురదృష్టకరమని, అవి జరిగి ఉండాల్సింది కాదని అన్నారు. ఈ ఘటనలను అందరూ ఖండించాలని పేర్కొన్నారు. కాంగ్రెస్ ఎమ్మెల్యే సంపత్‌కుమార్ కారుపై దాడి జరగడం విచారకరమన్నారు. ఈరోజు (శనివారం) డిమాండ్ల పద్దు, హోం శాఖపై చర్చ జరగనుందని, కాబట్టి హోంశాఖపై చర్చలో భాగంగా హెచ్‌సీయూ, ఓయూ ఘటనలను కూడా చర్చిద్దామని ఆయన కాంగ్రెస్ సభ్యులకు సూచించారు. గంట సమయం ఎక్కువ తీసుకొని అయినా అన్ని అంశాలను సాకల్యంగా చర్చిద్దామని, ఇందుకు సభ్యులు సహకరించాలని సీఎం కేసీఆర్ ప్రతిపక్షాలను కోరారు. హెచ్‌సీయూ అంశంపై చర్చకు పట్టుబడుతూ కాంగ్రెస్ సభ్యులు వెల్‌లోకి వెళ్లి నినాదాలు చేస్తుండటంతో వారిని విరమించాల్సిందిగా విజ్ఞప్తి చేశారు. -
శ్రీవాత్సవ వీసీగా వద్దు... అప్పారావును తొలగించాలి
హైదరాబాద్: హెచ్‌సీయూ పీహెచ్డీ విద్యార్థి వేముల రోహిత్ ఆత్మహత్య నేపథ్యంలో హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ (హెచ్‌సీయూ) వైఎస్ చాన్సలర్(వీసీ) పొదిలె అప్పారావును తొలగించాలనీ, సెలవుపై వెళ్లిన ఇన్చార్జి వీసీ బిపిన్ శ్రీవాత్సవను వీసీగా తిరిగి నియమించొద్దని విద్యార్థి సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. ఈ మేరకు విద్యార్థి జేఏసీ ఆదివారం ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ కు లేఖ రాసింది. యూనివర్సిటీ హైదరాబాద్ అడ్మినిస్ట్రేషన్ విభాగంలో వేముల రోహిత్ కుటుంబానికి చెందిన ఒకరికి ఉద్యోగం ఇవ్వాలని డిమాండ్ చేసింది. అలాగే పెండింగ్ లో ఉన్న రోహిత్ స్కాలర్షిప్ సొమ్మును తక్షణమే విడుదల చేసి అతని కుటుంబానికి అందించాల్సిందిగా తెలిపింది. అంతేకాక, యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్‌లో ఇన్స్టిట్యూట్ రోహిత్ మెమోరియల్ లెక్చర్‌ను ఏర్పాటు చేయాలని తెలిపింది. యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ ఐదుగురు దళిత విద్యార్థులపై కుల వివక్షతో ప్రవర్తించడమే కాకుండా వారిని హెచ్‌సీయూ నుంచి సస్పెండ్ చేయడం, సస్పెన్షన్ కారణంగా మనస్తాపం చెందిన వారిలో ఒకరైన వేముల రోహిత్ ఆత్మహత్యకు కారణమైనందుకుగానూ బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. అదేవిధంగా క్యాంపస్‌లో వివక్ష, కులబేధం వంటి విషయాలకు తావు లేకుండా అందరితో కలిసిపోయేలా వాతావరణం ఉండేలా నిజనిర్ధారణ కమిటీ సిఫార్సులతో అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఉన్నత చదవుల కోసం యూనివర్సిటీలకు వచ్చే అట్టడుగు వర్గాలకు చెందిన విద్యార్థులకు రక్షణ కల్పించేలా 'రోహిత్ యాక్ట్' ను తీసుకవచ్చి.. దాన్ని తప్పుకుండా అమలు చేసేలా ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ కేంద్ర ప్రభుత్వానికి అప్పీల్ చేయాల్సిందిగా డిమాండ్ చేశారు. ప్రక్టోరియల్ బోర్డు తొలగించిన అలోక్ పాండే సహా విద్యార్థులు, ఎస్సీ, ఎస్టీ అధ్యాపక సభ్యులను తిరిగి విధుల్లోకి తీసుకోవాలని తెలిపింది. ఎస్సీ, ఎస్టీ అధ్యాపకులు, అధికారులు సమర్పించిన వారి రాజీనామాలను ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ అంగీకరించవద్దని కోరింది. అలాగే సాధ్యమైనంత తొందరగా వారు తమ బాధ్యతలను స్వీకరించాల్సిందిగా ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్‌ను అప్పీల్ చేయాల్సిందిగా విద్యార్థి జేఏసీ డిమాండ్ చేసింది.