Sakshi: Telugu Breaking News | Latest Telugu News | తెలుగు వార్తలు | Online Telugu News Today
Sakshi News home page

Top Stories

ప్రధాన వార్తలు

Chandrababu Naidu Government Records In Debt1
అప్పుల్లో చంద్రబాబు సర్కార్‌ రికార్డు

అమరావతి: అప్పుల్లో చేయడంలో చంద్రబాబు ప్రభుత్వం రికార్డులు సృష్టిస్తోంది. మరో రూ.7 వేల కోట్లు ప్రభుత్వం అప్పు చేసింది. ఒకే రోజు రూ.7 వేల కోట్లు అప్పులు చేసిన చంద్రబాబు ప్రభుత్వం.. రిజర్వ్‌ బ్యాంకులో సెక్యూరిటీల వేలం ద్వారా సమీకరించింది. గత నెలలో రూ.5,750 కోట్లు అప్పు చేసిన ప్రభుత్వం.. ఆర్థిక సంవత్సరం రెండో నెలలోనూ భారీగా అప్పు చేసింది.మళ్లీ రూ.7 వేల కోట్లు అప్పు చేసిన చంద్రబాబు సర్కార్‌.. ఇప్పటివరకు లక్షా 59 వేల కోట్లు అప్పు చేసింది. సూపర్‌ సిక్స్‌ పథకాలు అమలు చేయని చంద్రబాబు ప్రభుత్వం.. హామీలు అమలు చేయకుండానే భారీ అప్పులు చేయడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఏపీలో ఎన్నికలకు ముందు సంపద సృష్టిస్తామన్న చంద్రబాబు.. ఇప్పుడు అప్పులు చేయడంలో రికార్డు సృష్టిస్తున్నారు.ఏడాది కాలంలోనే రికార్డు స్థాయిలో అప్పులు చేయడం చూస్తే చంద్రబాబు ‘సంపద సృష్టి’ భలేగా ఉంది అంటూ జనాలు నవ్వుకుంటున్నారు. ఇదిలా ఉండగా.. సీఎం చంద్రబాబు పాలనలో రాష్ట్ర ఆదాయం తిరోగమనంలో ఉందని కాగ్‌ తేల్చేసింది. ఒకవైపు రెవెన్యూ రాబడి తగ్గిపోతుండగా.. మరోవైపు అప్పులు భారీగా పెరిగిపోతున్నాయని స్పష్టంచేసింది. ఈ ఆర్థిక సంవత్సరంలో ఫిబ్రవరి వరకు బడ్జెట్‌ రాబడులు, వ్యయాలకు సంబంధించిన గణాంకాలను కాగ్‌ వెల్లడించిన సంగతి తెలిసిందే.

Indian Billionaire Balvinder Singh Sahni Gets Five Years In Jail In Dubai For Money Laundering2
దుబాయ్‌లో భారతీయ బిలియనీర్‌కు జైలు శిక్ష

దుబాయ్‌లో నివసిస్తూ.. విలాసవంతమైన జీవితం గడుపుతున్న భారతీయ బిలియనీర్ 'బల్వీందర్ సింగ్ సాహ్ని'కి మనీలాండరింగ్ కేసులో 5 సంవత్సరాల జైలు శిక్ష విధిస్తూ అక్కడి కోర్టు ఆదేశించింది. ఈ శిక్షా కాలం పూర్తయిన తరువాత దేశాన్ని వదిలిపోవాలని సాహ్నిని దుబాయ్ కోర్టు ఆదేశించినట్లు స్థానిక మీడియా కథనాల ద్వారా తెలుస్తోంది.షెల్ కంపెనీల నెట్‌వర్క్ ద్వారా 150 మిలియన్ దిర్హామ్‌లను లాండరింగ్ చేయడం, అనుమానాస్పద ఆర్థిక లావాదేవీలకు పాల్పడినందుకు బల్వీందర్ సింగ్ సాహ్ని శిక్ష.. జరిమానా విధించడం జరిగింది. అంతే కాకుండా ఈ వ్యాపారవేత్త నుంచి 5,00,000 AED (రూ. 1.14 కోట్లు) తో పాటు 150 మిలియన్ AED (రూ. 344 కోట్లు) జప్తు చేయాలని కోర్టు ఆదేశించిందని గల్ఫ్ న్యూస్ నివేదించింది.'అబు సబా' గా ప్రసిద్ధి చెందిన బల్వీందర్ సింగ్ సాహ్ని.. రాజ్ సాహ్ని గ్రూప్ (RSG) ఫౌండర్. ఈ కంపెనీ యూఏఈలో మాత్రమే కాకుండా.. అమెరికా, ఇండియాతో సహా అనేక దేశాల్లో విస్తరించి ఉంది. విలాసవంతమైన జీవితం గడిపే సాహ్ని.. ఎమిరేట్స్‌లో అత్యంత ఖరీదైన నంబర్ ప్లేట్‌లలో ఒకటైన 'డీ5' కోసం సుమారు రూ. 75 కోట్ల ఖర్చు చేశారు.ఇదీ చదవండి: పతనంవైపు యూఎస్ డాలర్!.. బఫెట్ కీలక వ్యాఖ్యలుకార్ల ధరల కంటే కూడా.. ఆ కార్ల కోసం కొనుగోలు చేసిన నెంబర్స్ ధరలే ఎక్కువని సాహ్ని.. ఓ సందర్భాల్లో చెప్పారు. ఈయన వద్ద అత్యంత ఖరీదైన కార్లు ఉన్నాయి. మనీలాండరింగ్ కేసులో సాహ్నితో పాటు.. అతని కొడుకుతో కలిపి మరో 32 మంది ఉన్నట్లు తెలుస్తోంది. ఇందులో కొందరు తప్పించుకుని తిరుగుతున్నట్లు సమాచారం.

Abdul Basit: India Likely to Strike Pakistan After Russia Victory Celebrations3
భారత్‌ మాపై దాడి చేసేది అప్పుడే.. పాక్‌ మాజీ దౌత్వవేత్త సంచలన ట్వీట్‌!

ఇస్లామాబాద్‌: 1971లలో నాటి భారత్‌-పాకిస్తాన్‌ యుద్ధ సమయంలో భారత్‌ మాక్‌ డ్రిల్స్‌ నిర్వహించింది. 1971 తర్వాత ఇలాంటి డ్రిల్స్‌ బుధవారం జరగనుంది. ఈ తరుణంలో పాకిస్తాన్‌ మాజీ దౌత్వవేత్త (హైకమిషనర్‌) అబ్దుల్‌ బాసిత్‌ సంచలన ట్వీట్‌ చేశారు. రష్యా విక్టరీ డే తర్వాత భారత్‌.. పాకిస్తాన్‌పై దాడి చేసే అవకాశం ఉందని ట్వీట్‌లో పేర్కొన్నారు. వచ్చే వారం,11,12వ తేదీలలో దాడి చేయొచ్చనే అభిప్రాయం వ్యక్తం చేశారు. India will likely carry out its limited misadventure against Pakistan after Victory Celebrations in Russia. Perhaps on 10-11 May.— Abdul Basit (@abasitpak1) May 6, 2025మరోవైపు, పాక్‌పై దాడి చేసేందుకు భారత్‌ సర్వం సిద్ధమవుతోంది. ఈ మేరకు ముహూర్తం దాదాపుగా ఖరారైంది. సరిహద్దులకు ఆవలివైపు నుంచి ఉగ్ర దాడులను పనిగట్టుకుని ఎగదోస్తున్న దాయాదికి బుద్ధి చెప్పేందుకు రంగం సిద్ధమైంది. ఈ వారాంతంలోపు ఎప్పుడైనా పాక్‌పై భారీ స్థాయి ‘ఆపరేషన్‌’ జరగవచ్చని కేంద్ర ప్రభుత్వ అత్యున్నత వర్గాల సమాచారం. ఈ నేపథ్యంలో మోదీ సర్కార్‌ సోమవారం కీలక నిర్ణయం తీసుకుంది. యుద్ధ సన్నద్ధతను సరిచూసుకునేందుకు బుధవారం పలురకాల మాక్‌ డ్రిల్స్‌ నిర్వహించాల్సిందిగా రాష్ట్రాలను ఆదేశించింది.1971 తర్వాత ఇలాంటి డ్రిల్స్‌ జరగనుండటం ఇదే తొలిసారి కావడం విశేషం! అప్పుడు కూడా పాక్‌తో యుద్ధం నేపథ్యంలోనే ఈ చర్యలు తీసుకున్నారు. డ్రిల్స్‌లో భాగంగా వాయుదాడుల సైరన్లు మోగించి అప్రమత్తం చేస్తారు. ప్రజలను ఉన్నపళంగా ఖాళీ చేయించి సురక్షిత ప్రాంతాలకు తరలించడం వంటి చర్యలు చేపడతారు. ఈ విషయమై ప్రస్తుతం అందుబాటులో ఉన్న ప్రణాళికలను తక్షణం అప్‌డేట్‌ చేసుకోవాలని కేంద్ర హోం శాఖ పేర్కొంది.ఈ మేరకు రాష్ట్రాలకు అడ్వైజరీ జారీ చేసింది. డ్రిల్స్‌లో భాగంగా సమర్థమైన పౌర రక్షణ చర్యలు చేపట్టడంలో ప్రజలకు, ముఖ్యంగా యువతకు శిక్షణ ఇవ్వనున్నారు. పహల్గాం ఉగ్ర దాడుల వంటివి జరిగితే దీటుగా ఎదుర్కోవడం ఎలాగో నేర్పిస్తారు. స్వీయరక్షణ చర్యలతో పాటు విద్యుత్‌ సరఫరా బ్లాకౌట్‌ వంటివి జరిగితే తక్షణం ఎలా స్పందించాలో, కీలక మౌలిక వనరుల రక్షణకు ఎలాంటి చర్యలు తీసుకోవాలో వివరిస్తారు.

Rishabh Hasnt Been Smiling Laughing: Cricket Great Notices Worrying Trend4
ఆ ముఖంలో నవ్వే లేదు.. రహానే, కోహ్లి కావాలేమో?

ఐపీఎల్‌-2025 (IPL 2025)లో భారీ అంచనాల నడుమ బరిలోకి దిగిన టీమిండియా వికెట్‌ కీపర్‌ బ్యాటర్‌ క్రికెటర్‌ రిషభ్‌ పంత్‌ (Rishabh Pant) విఫలమవుతున్నాడు. లక్నో సూపర్‌ జెయింట్స్‌ (LSG) కెప్టెన్‌గా, బ్యాటర్‌గా వరుస మ్యాచ్‌లలో నిరాశపరుస్తున్నాడు. ఇప్పటికి మొత్తంగా పదకొండు మ్యాచ్‌లు పూర్తి చేసుకున్న పంత్‌.. కేవలం 128 పరుగులు రాబట్టగలిగాడు.ఇదే అత్యంత చెత్త ప్రదర్శన2016లో ఐపీఎల్‌ ఆడటం మొదలుపెట్టిన పంత్‌ కెరీర్‌లో ఇప్పటికి ఇదే అత్యంత చెత్త ప్రదర్శన. ఈ నేపథ్యంలో మేటి ఆస్ట్రేలియా వికెట్‌ కీపర్‌ బ్యాటర్‌ ఆడం గిల్‌ క్రిస్ట్‌ పంత్‌ను ఉద్దేశించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.ఆ ముఖంలో నవ్వే లేదు.. ‘‘అతడిని చూసిన ప్రతిసారీ ఆటను ఎంతగానో ఆస్వాదిస్తూ ఆడుతున్నాడు అనిపిస్తుంది. కానీ ఈసారి తను అలా లేడు. ఆ ముఖంలో నవ్వు లేదు.. సహచర ఆటగాళ్లతో సరదాగా ఉన్నట్లు కనిపించడం లేదు.. ప్రశాంతవదనంతో ఉన్నాడా అంటే అదీ లేదు.కొత్త ఫ్రాంఛైజీ తరఫున కెప్టెన్సీ భారమా లేదంటే ప్రైస్‌ ట్యాగ్‌ అతడి నెత్తి గుదిబండగా మారిందా అర్థం కావడం లేదు. ఇది అతడు కానే కాదని వంద శాతం చెప్పగలను. అతడి ఆటలో మునుపటి మెరుపు, చురుకుదనం కనిపించడం లేదు’’ అని క్రిక్‌బజ్‌ షోలో గిల్‌క్రిస్ట్‌ అన్నాడు.రహానే, కోహ్లి కావాలేమో?ఇందుకు అదే షోలో పాల్గొన్న సౌతాఫ్రికా మాజీ క్రికెటర్‌ షాన్‌ పొలాక్‌ బదులిస్తూ.. ‘‘పంత్‌ విషయంలో మీరు ఇచ్చిన చెప్పిన మాటల్ని విశ్లేషించేందుకు ప్రయత్నిస్తున్నా. అతడు సొంతగడ్డపై.. చుట్టూ భారత క్రికెటర్లు ఉంటే మాత్రమే అతడు ఆటను ఆస్వాదిస్తాడా?వారి కంపెనీని మాత్రమే ఎంజాయ్‌ చేస్తాడా? ఎందుకంటే ఇప్పుడు అతడి చుట్టూ ప్రధానంగా నలుగురూ విదేశీ బ్యాటర్లే ఉన్నారు. పంత్‌ సహచరులతో సంతోషంగా లేడని అంటున్నారా?అజింక్య రహానే, విరాట్‌ కోహ్లి తన జట్టులో ఉంటే పంత్‌ మారిపోతాడా? అంటే సమాధానం చెప్పలేము. ఏదేమైనా పంత్‌ మునుపటిలా మాత్రం లేడన్నది వాస్తవం’’ అని చెప్పుకొచ్చాడు. కాగా మెగా వేలం-2025లో రూ. 27 కోట్లకు లక్నో పంత్‌ను కొనుగోలు చేసిన విషయం తెలిసిందే. తద్వారా క్యాష్‌ రిచ్‌ లీగ్‌ చరిత్రలో అత్యధిక ధరకు అమ్ముడుపోయిన ఆటగాడిగా పంత్‌ రికార్డులకెక్కాడు.పది జట్ల స్థానాలు ఇలాఈ సీజన్‌లో ఇప్పటికి 128 పరుగులు చేసిన పంత్‌ అత్యధిక స్కోరు 63. గత మ్యాచ్‌లో పంజాబ్‌ కింగ్స్‌పై 18 పరుగులు చేసి వెనుదిరిగాడు. ఇక లక్నో సూపర్‌ జెయింట్స్‌ విషయానికొస్తే.. పదకొండు మ్యాచ్‌లు పూర్తి చేసుకుని కేవలం ఐదే గెలిచి.. ఆరు ఓడిపోయింది.తద్వారా పది పాయింట్లతో పట్టికలో ఏడో స్థానంలో కొనసాగుతోంది. మరోవైపు.. చెన్నై సూపర్‌ కింగ్స్‌, రాజస్తాన్‌ రాయల్స్‌, సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ ఇప్పటికే ప్లే ఆఫ్స్‌ రేసు నుంచి నిష్క్రమించాయి.ఆర్సీబీ 16 పాయింట్లతో మొదటి స్థానంలో ఉండి.. ప్లే ఆఫ్స్‌ బెర్తును దాదాపు ఖరారు చేసుకోగా.. పంజాబ్‌ కింగ్స్‌ రెండు, ముంబై ఇండియన్స్‌ మూడు, గుజరాత్‌ టైటాన్స్‌ నాలుగు, ఢిల్లీ క్యాపిటల్స్‌ ఐదు స్థానాల్లో కొనసాగుతున్నాయి. ఆరో స్థానంలో ఉన్న కేకేఆర్‌, ఏడో స్థానంలో ఉన్న లక్నో కూడా సాంకేతికంగా ఇంకా రేసులో ఉన్నాయి.చదవండి: SRH Vs DC: ‘హే.. వెళ్లు.. వెళ్లు.. నువ్వు అవుట్‌’!.. కావ్యా మారన్‌ రియాక్షన్‌ వైరల్‌

May 7 Blackout Drill Amid India-Pak Tensions5
Mock drill: తెలుగు రాష్ట్రాల్లో మాక్‌ డ్రిల్‌ జరిగే ప్రాంతాలు ఇవే.. చూసేయండి!

ఢిల్లీ: భారత్‌-పాకిస్తాన్‌ల మధ్య ఉద్రిక్తతల వేళ కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. బుధవారం దేశంలో ఎంపిక చేసిన ప్రాంతాల్లోని ముఖ్య ప్రదేశాలలో సివిల్‌ మాక్‌ డ్రిల్‌ నిర్వహించేందుకు కేంద్రం సిద్ధమైంది. ఈ మేరకు ఏయే ప్రాంతాల్లో మాక్‌ డ్రిల్‌ నిర్వహించాలో అన్నీ రాష్ట్రాలకు కేంద్రం ఆదేశాలు జారీ చేస్తోంది.ఈ మాక్‌ డ్రిల్‌పై మంగళవారం కేంద్ర హోంశాఖ కార్యదర్శి వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ఈ సమావేశంలో అన్నీ రాష్ట్రాల సెక్రటరీలు,డీజీపీలు,ఫైర్‌ డీజీలు పాల్గొన్నారు. ఈ సమావేశంలో ఏ ప్రాంతాల్లో ఎలా మాక్‌ డ్రిల్‌ నిర్వహించాలో ఉన్నతాధికారులకు కేంద్రం ఆదేశాలు జారీ చేసింది. అదే సమయంలో దాడులకు అవకాశం ఉన్న జిల్లాలు మూడు కేటగిరీలుగా విభజించింది. కేటగిరి 1లో దేశ రాజధాని ఢిల్లీ , తారాపూర్ అణు కేంద్రంకేటగిరి 2 లో విశాఖపట్నం, హైదరాబాద్ప్రధాని నివాసం, త్రివిధ దళాల హెడ్ క్వార్టర్స్ ఉండడంతో ఏ కేటగిరిలో ఢిల్లీ ప్రాంతాలు ఉన్నాయి. దేశంలోని వివిధ రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో గుర్తించబడిన సివిల్ డిఫెన్స్ జిల్లాల జాబితాను కేంద్రం విడుదల చేసింది. 1. అండమాన్ & నికోబార్ ద్వీపాలు Category-II: పోర్ట్ బ్లెయిర్2. ఆంధ్ర ప్రదేశ్Category-II: హైదరాబాద్, విశాఖపట్నం3. అరుణాచల్ ప్రదేశ్ Category-II: • ఆలోగ్ (వెస్ట్ సియాంగ్) • ఇటనగర్ • తవాంగ్ • హయులింగ్ • Category-III: బొమ్డిలా4. అస్సాం Category-II: • బోంగైగావోన్ • డిబ్రూగఢ్ • ధుబ్రి • గోల్పారా • జోర్హాట్ • శిబ్‌సాగర్ • టిన్‌సుకియా • తేజ్‌పూర్ • డిగ్బోయ్ • దిలీజన్ • గువహాటి (డిస్పూర్) • రంగియా • నమ్రుప్ • నజీరా • నార్త్-లక్ష…26.ఒరిస్సా (ఒడిశా)Category-II: • టాల్చర్ Category-III: • బలాసోర్ • కోరాపుట్ • భువనేశ్వర్ • గోపాల్పూర్ • హిరాకుడ • పారా‌దీప్ • రౌర్కెలా • భద్రక్ • ధేంకనాల్ • జగత్సింగ్‌పూర్ • కేండ్రాపాడా27. పుదుచ్చేరి Category-II:పుదుచ్చేరి28. పంజాబ్Category-II: • అమృత్‌సర్ • భటిండా • ఫిరోజ్‌పూర్ • గుర్‌దాస్‌పూర్ • హోషియార్‌పూర్ • జలంధర్ • లుధియానా • పటియాలా • పఠాన్‌కోట్ • అడాంపూర్ • బర్ణాలా • భాఖ్రా-నంగళ్ • హల్వారా • కొఠ్‌కాపూర్ • బటాలా • మోహాలి (ససనగర్) • అబోహర్Category-III: • ఫరీద్‌పూర్ • రోపర్ • సంగ్రూర్29. రాజస్థాన్Category-II: • కోటా • రావత్‌భాటా • అజ్మీర్ • అల్‌వార్ • బార్మేర్ • భరత్పూర్ • బీకానేర్ • బుండీ • గంగానగర్ • హనుమాన్గఢ్ • జైపూర్ • జైసల్మేర్ • జోధ్‌పూర్ • ఉదయ్‌పూర్ • సికార్ • నాల్ • సూరత్‌గఢ్ • అబూ రోడ్ • నసీరాబాద్ (అజ్మీర్) • భివారీ Category-III: • ఫులేరా (జైపూర్) • నాగౌర్ (మెర్టా రోడ్) • జాలోర్ • బేవార్ (అజ్మీర్) • లాల్‌గఢ్ (గంగానగర్) • సవాయ్ మాధోపూర్ • పాలి • భిల్వారా👉రేపటి మాక్ డ్రిల్ సందర్భంగా ఎదురయ్యే పరిణామాలుఎలక్ట్రిసిటీ బ్లాక్ అవుట్మొబైల్ సిగ్నల్స్ నిలిపివేతట్రాఫిక్ దారి మళ్లింపుప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలింపు చర్యలుపబ్లిక్ అనౌన్స్మెంట్స్👉యుద్ధం తరహా ఎమర్జెన్సీలో పోలీసులు, పారా మిలిటరీ వ్యవహరించే విధానంసివిల్ డిఫెన్స్ మాక్ డ్రిల్ సందర్భంగా ప్రజలు వ్యవహరించాల్సిన విధానంఆందోళనకు గురికాకుండా ప్రశాంతంగా ఉండడం. స్థానిక గా ఇచ్చే సూచనలు పాటించాలివదంతులను వ్యాపింప చేయొద్దు సోషల్ మీడియాలో వచ్చే ఫేక్ న్యూస్ నమ్మవద్దుకరెంటు లేక పోయినా, ఇంటర్నెట్ పనిచేయకపోయినా ఆందోళనకు గురికావద్దు అధికారిక సమాచారం కోసం ప్రభుత్వ చానల్స్, రేడియోను మాత్రమే వినాలిప్రజలు, అధికారులు తమ తమ బాధ్యతలు గుర్తెరిగి మెలగాలిమార్క్ డ్రిల్స్ కేవలం ప్రజల సన్నద్ధత కోసమే తప్ప... ఆందోళన కు గురిచేయడం లక్ష్యం కాదు 👉రేపటి మాక్ డ్రిల్ నిర్వహించే విధానం ఇదే...ఎయిర్ రైడ్ సైరన్స్ : ప్రజల అప్రమత్తత కోసం ఎయిర్ రైడ్ సైరన్స్ మోగిస్తారు. వైమానిక దాడుల నుంచి రక్షించుకునేందుకు సురక్షిత ప్రదేశాలకి వెళ్ళాలిక్రాష్ బ్లాక్ ఔట్స్: నగరాలలో సంపూర్ణంగా విద్యుత్ నిలిచిపోతుంది. వైమానిక దాడుల సమయంలో నగరాలను గుర్తించకుండా ఉండేందుకు ఈ ఎత్తుగడ అమలు. 1971 యుద్ధ సమయంలో బ్లాక్కౌట్ ఎత్తుగడను ఉపయోగించిన భారత్ కీలక సంస్థలు, ప్రాజెక్టుల రక్షణ: కమ్యూనికేషన్ టవర్స్, పవర్ ప్లాంట్స్, మిలిటరీ ఏరియాస్ ను గుర్తించకుండా ముందు జాగ్రత్త చర్యలు తరలింపు చర్యలు: హై రిస్క్ జోన్లలో ఉన్న ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలింపు. ఈ డ్రిల్ ద్వారా రెస్పాన్స్ టైం , లాజిస్టిక్స్ ఇష్యూస్ ను గుర్తించడం పౌరులకు శిక్షణ: పాఠశాలలు, కాలేజీలు, కార్యాలయాలు కమ్యూనిటీ సెంటర్లలో శిక్షణ. సురక్షిత ప్రాంతాలను గుర్తించడం, ఫస్ట్ ఎయిడ్ చేయడం ఎలా, ఎమర్జెన్సీ సమయంలో ఆందోళనకు గురికాకుండా ఉండడం అంశాలపై శిక్షణ

Kommineni Srinivasa Rao Analysis On Andhra Pradesh Treasury6
తాకట్టులో ఆంధ్రప్రదేశ్‌ ఖజానా!

ఇది విన్నారా? ఆంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వ ఖజానానే తాకట్టు పెట్టేందుకు రంగం సిద్ధం చేస్తున్నారు. అది కూడా రూ.9500 కోట్ల అప్పు కోసం! ఏడాది కూడా నిండని కూటమి పాలనలో ఇప్పటికే రికార్డు స్థాయిలో రూ.1.47 లక్షల కోట్ల అప్పులయ్యాయి. ఇవి చాలవన్నట్టు ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రభుత్వం అదనంగా ఖజానాను తాకట్టు పెట్టి రుణాలు పొందే ప్రయత్నం చేస్తోంది. గనుల మాదిరిగానే ట్రెజరీని కూడా తాకట్టు పెడుతున్నట్టుగా ఒప్పందం ఉండటం.. రుణ వాయిదాలు సకాలంలో చెల్లించలేకపోతే రిజర్వు బ్యాంక్‌లోని రాష్ట్ర ప్రభుత్వ ఖాతా నుంచి నేరుగా వసూలు చేసుకోవచ్చట. ఈ వార్త విన్నప్పుడు తొలుత అది నిజమై ఉండదులే అనుకున్నాం. కాని వైసీపీ సీనియర్ నేత, ఆర్ధిక శాఖ మాజీ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌ రెడ్డి స్వయానా ఈ విషయం చెప్పడంతో అదెలా సాధ్యమని అనిపించింది. ఖజానా తాకట్టు గురించి బుగ్గన విపులంగా వివరించినా.. కూటమి ప్రభుత్వం దానికి వివరణ కూడా ఇవ్వలేదు. వైసీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి పేర్ని నాని కూడా ఈ అంశాన్ని ప్రజల దృష్టికి తీసుకువెళ్లారు. ఇప్పుడు ట్రెజరీ ఖాతాకు సంబంధించిన ప్రభుత్వ ఆదేశాలు కూడా వెలుగులోకి వచ్చాయి. గతంలో ప్రభుత్వానికి అప్పులు అవసరం అయినప్పుడు మరీ బ్యాంకులు కోరితే ప్రభుత్వ కార్యాలయాలను తనఖా పెట్టడం జరిగేది. వైఎస్ జగన్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇలాంటివి జరిగితే విపక్ష తెలుగుదేశం, జనసేన, బీజేపీలు పెద్ద ఎత్తున రచ్చ చేశాయి. తెలుగుదేశం మీడియా ఈనాడు, ఆంధ్రజ్యోతిలు జరగరానిది ఏదో జరిగిపోతోందని ప్రజలను భయపెట్టే యత్నం చేసేవి. వీటి ప్రభావం సహజంగానే ప్రజలపై ఎంతో కొంత ఉంటుంది. ఆ రకంగా చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ఎన్నికల రాజకీయాల కోసం ఎన్ని చేయాలో అన్నీ చేశారు. అబద్దపు ప్రచారం చేశారు. బీజేపీ ఆంధ్రప్రదేశ్‌ అధ్యక్షురాలుగా ఉన్న పురందేశ్వరి తన వంతు దుష్ప్రచారం చేశారు. జగన్ సర్కార్ నిత్యం అప్పు చేస్తోందని, రాష్ట్రాన్ని ఆర్థికంగా విధ్వంసం చేస్తోందని, శ్రీలంక అయిపోతుందని ఇలా ఏది పడితే అది మాట్లాడి జగన్ ప్రభుత్వంపై ప్రజలలో సందేహాలు వచ్చేలా వ్యవహరించారు. తాము అధికారంలోకి వస్తే అప్పులు తేబోమని, ఉన్న అప్పులు తీర్చుతామని, చంద్రబాబుకు సంపద సృష్టించడం తెలుసని ఊదరగొట్టేవారు. దీనితోపాటు తాము అధికారంలోకి వస్తే సూపర్ సిక్స్, మరో వంద ఎన్నికల హామీలు అంటూ ప్రచారం చేసి బాండ్లు కూడా ఇచ్చి వచ్చారు. ఎలాగైతే అధికారం సాధించారు. ఇప్పుడేమో అప్పు చేయడమే సంపద అని అన్నట్లుగా మాట్లాడుతున్నారు. పోనీ దానిపై క్లారిటీతో మాట్లాడుతున్నారా అంటే అదీ లేదు. సూపర్ సిక్స్ హామీలు అమలు చేయాలని తనకూ ఆశగా ఉందని, కాని ఖజానా ఖాళీగా ఉందని, అప్పులు కూడా పుట్టడం లేదని చంద్రబాబు, పవన్‌కళ్యాణ్‌లు అంటున్నారు. కానీ ఏడాది కాక ముందే రూ.లక్షన్నర కోట్లు ఎలా అప్పు చేశారని ఆయనను ఎవరూ అడగరు. ప్రశ్నించే పరిస్థితి లేకుండా రెడ్ బుక్ అంటూ భయపెడుతున్నారు. పవన్‌ కళ్యాణ్‌ ఇలాంటివి పట్టించుకోవడం మానేసి చాలాకాలమైంది. కాని జనానికి వీరు చేస్తున్న మాయ అర్ధం అవుతోంది. అప్పుల మీద చంద్రబాబు గతంలో ఏమి చెప్పింది..ఇప్పుడు ఏమి చేస్తున్నది బెరీజు వేసుకుంటున్నారు. గతంలో జగన్ ప్రభుత్వ టైమ్‌లో రూ.వెయ్యి కోట్లు అప్పు తీసుకున్నా, దానిని మొదటి పేజీలో ప్రచురించి, అప్పులు తప్ప ఏపీలో ఇంకేమీ జరగడం లేదన్నట్లుగా ఎల్లో మీడియా ప్రచారం చేసింది. చంద్రబాబు తన సభలలో జగన్ ప్రభుత్వం అప్పులు చేస్తూ నాశనం చేస్తోందని, ఒకసారి పది లక్షల అప్పు చేశారని, మరరో సారి 13 లక్షల కోట్లుఅని, ఇంకోసారి ఏకంగా 14 లక్షల కోట్లు అని దుర్మార్గంగా పబ్లిసిటీ చేశారు.ఒక్క జగనే అంత భారీగా అప్పు చేశారా అన్న అనుమానం కలిగించారు. అంతే తప్ప, రాష్ట్రం విడిపోయినప్పుడు ఎంత అప్పు ఉంది. 2014 టర్మ్‌లో చంద్రబాబు ప్రభుత్వం ఎంత అప్పు చేసింది? ఆ తర్వాత జగన్ టైమ్ లో ఎంత అప్పు అయింది విడమరిచి చెప్పకుండా, మొత్తం అప్పంతా జగన్ ఖాతాలో వేసేశేవారు. అదే చంద్రబాబు గొప్పదనం. ఎంతటి అబద్దాన్ని అయినా నమ్మించేలా మాట్లాడగల సత్తా కలిగిన నేత అని ఆయన ప్రత్యర్ధులు చెబుతుంటారు. ఈ అప్పులపై ఆయన చేసిన దుష్ప్రచారం దానిని నిర్ధారిస్తుంది. విశేషం ఏమిటంటే జగన్ టైమ్‌లో రెండేళ్ల కరోనా ఉన్నా రూ.3.30 లక్షల కోట్ల అప్పు మాత్రమే చేశారని వెల్లడైంది. ఆ వివరాలు టీడీపీ ప్రభుత్వంలో ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ ప్రవేశపెట్టిన బడ్జెట్టే తెలిపింది. కాని కేశవ్ కార్పొరేషన్ల ద్వారా జగన్ ప్రభుత్వం అప్పు చేయడాన్ని ఆక్షేపించారు. సీన్ కట్ చేస్తే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆయా కార్పొరేషన్ల ద్వారా వేల కోట్లు అప్పులు చేస్తున్నారు. ప్రభుత్వపరంగా నేరుగా చేసిన అప్పులే లక్ష కోట్లు ఉంటే మరో రూ.ఏభై వేల కోట్లు అమరావతి పేరుతో తీసుకుంటున్నారు. అందులో ఇప్పటికే రూ.31 వేల కోట్లకు ఒప్పందం అయ్యారు. కేంద్ర ఆర్థిక సంఘం కేపీలో పర్యటించినప్పుడు అమరావతికి రూ.77 వేల కోట్లు అవసరమన్నారు. అమరావతిలో చేపడుతున్నామని రూ.లక్ష కోట్ల విలువైన పనులు మంత్రి నారాయణ చెప్పారు. ఒక్క రూపాయి వ్యయం ప్రభుత్వపరంగా చెయనవసరం లేదని చెప్పిన చంద్రబాబు చేస్తున్న నిర్వాకం ఇదన్నమాట. ఈ క్రమంలో తాజాగా ఏపీ ఖనిజాభివృద్ది సంస్థ ద్వారా రూ. తొమ్మిది వేల కోట్లు అప్పు తీసుకున్నారు. చంద్రబాబు ప్రభుత్వానికి నిజంగానే పరపతి పోయిందేమో తెలియదు కాని, బాండ్ల రూపంలో ఆ అప్పు ఇచ్చినవారికి నమ్మకం కలిగించడానికి రాష్ట్రంలో ఉన్న సుమారు రూ.1.91 లక్షల కోట్ల విలువైన ఖనిజ నిక్షేపాలన్నిటిని ఖనిజాభివృద్ధి సంస్థకు బదలాయించి, వాటిని చూపించి ఈ అప్పు తీసుకున్నారు. అయినా బాండ్లు కొన్నవారికి ఇంకా అపనమ్మకంగానే ఉన్నట్లు ఉంది. అందుకే ఒకవేళ ఖనిజాభివృద్ది సంస్థ ఖాతాలో రుణ వాయిదాల ఆరునెలల మొత్తం డిపాజిట్ లేకపోతే, ఆ ప్రైవేటు సంస్థలు, లేదా వ్యక్తులు ప్రభుత్వానికి రిజర్వు బ్యాంక్‌లో ఉండే ఖాతా నుంచి నేరుగా తమ రుణ వాయిదాను రాబట్టుకోవచ్చని చెబుతూ జీవోనే ఇచ్చేశారు. ఇది ఒకరకంగా దుస్సాహసమే. ప్రజల పట్ల బాధ్యతలేని పద్దతే అని అనాలి. చంద్రబాబు సర్కార్ విడుదల చేసిన జీవో లోని అంశాలను పేర్ని నాని ఏప్రిల్ 24న చదివి వినిపించారు. నేరుగా ఏపీ అకౌంట్‌ నుంచి డైరెక్ట్ డెబిట్ మ్యాండేట్ మెకానిజం ద్వారా అవకాశం ఇవ్వడం రాజ్యాంగ విరుద్దమని నాని అన్నారు. అది వాస్తవమైనా, ప్రస్తుతం చంద్రబాబు ప్రభుత్వం ఉన్న ఊహాలోకంలో వారిని ప్రశ్నించేవారు లేరు. వైసీపీ వారు ప్రశ్నించినా పట్టించుకున్న నాథుడు లేడు. విశేషం ఏమిటంటే ఇప్పటివరకు చేసిన అమరావతికి కాకుండా చేసిన లక్ష కోట్ల అప్పు ఏమి చేసింది కూడా ప్రభుత్వం వివరించలేదు.జగన్ ప్రభుత్వంపై ఉన్నవి, లేనివి కలిపి శ్వేతపత్రాలు అంటూ పిచ్చి పత్రాలు విడుదల చేసిన సర్కార్, జీఎస్డీపీలో దేశంలోనే నెంబర్ 2 అంటూ కాకి లెక్కలు చెప్పిన సర్కార్ , ధైర్యంగా ఈ లక్ష కోట్లు ఏ రకంగా వ్యయం చేసింది ఎందుకు చెప్పలేకపోతున్నారు? సూపర్ సిక్స్ హామీల అమలుకు ఈ మొత్తంలో ఎంత వ్యయం చేశారో చెబుతారా? బడ్జెట్‌లో చిల్లర ఖర్చుల కోసం దాదాపు రూ.8 వేల కోట్ల రూపాయలు కేటాయించి మరో రికార్డును కూడా ఈ ప్రభుత్వం సృష్టించింది. మరో వైపు గత ప్రభుత్వ టైమ్‌లో వచ్చిన ఆదాయం కంటే ఈ ప్రభుత్వం వచ్చాక సుమారు రూ.13 వేల కోట్లు తగ్గిందని నిపుణులు లెక్కలు చూపుతున్నారు. ఇలాంటి వాటిపై సోషల్ మీడియాలో పలువురు విశ్లేషకులు ప్రశ్నిస్తున్నా జవాబు చెప్పడం లేదు.అందువల్లే చంద్రబాబు, పవన్ కళ్యాణ్ వంటివారు పిట్టల దొర కబుర్లు చెబుతూ, ఆకాశంలో మేడలు కడుతున్నారని వ్యాఖ్యానిస్తున్నారు. సంపద సృష్టించడం సంగతి దేవుడెరుగు. ఏపీని ఈ రకంగా అప్పుల పాలు చేయకుండా ఉంటే చాలు దేవుడా అని జనం అనుకునే పరిస్థితి ఏర్పడింది. - కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్‌ జర్నలిస్ట్‌, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత

Supreme Court Discloses Judicial Appointments and Asset Declarations7
సుప్రీంకోర్టు జడ్జీల ఆస్తుల వివరాలు ఎలా చూడొచ్చంటే?

ఢిల్లీ: సుప్రీంకోర్టు (supreme court) కీలక నిర్ణయం తీసుకుంది. సుప్రీంకోర్టు జడ్జీల ఆస్తుల వివరాల్ని పబ్లిక్‌ డొమైన్‌లో అందుబాటులోకి తెచ్చింది.ఏప్రిల్‌ 1వ తేదీన సుప్రీంకోర్టు న్యాయమూర్తులంతా కలిసి ఫుల్‌ కోర్టు సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశంలో న్యాయమూర్తులందరూ వారి ఆస్తుల వివరాల్ని బహిర్గతం చేసేందుకు అంగీకరించారు. ఈ మేరకు అత్యున్నత న్యాయ స్థానానికి చెందిన 33 మంది జడ్జీలలో 21మంది జడ్జీల ఆస్తుల వివరాలను సుప్రీంకోర్టు అధికారిక వెబ్‌సైట్‌లో పొందుపరిచారు.ఈ ఆస్తుల్లో రియల్‌ ఎస్టేట్‌,మూవబూల్‌ ప్రాపర్టీలు ,గోల్డ్‌,పెట్టుబడుల వివరాలు ఉన్నాయి. జడ్జీలతో పాటు వారి సతీమణులకు చెందిన ఆస్తులతో పాటు, ఉమ్మడి కుటుంబమైతే వారి ఆస్తుల వివరాల్ని సైతం ఉన్నాయి. ఆస్తుల వివరాల్ని జడ్జీలతో పాటు ఐదుగురు సభ్యుల సుప్రీంకోర్టు కొలీజియం సైతం వారి ఆస్తుల వివరాల్ని అందిస్తున్నట్లు సుప్రీంకోర్టు వెల్లడించింది.నవంబర్ 2022 మే 2025 మధ్య జరిగిన నియామకాల గురించి ప్రజల్లో న్యాయవ్యవస్థపై విశ్వాసం, పారదర్శకతను పెంచేందుకు అత్యున్నత న్యాయస్థానం ఈ వివరాల్ని తన వెబ్‌సైట్‌లో అందుబాటులోకి తెచ్చినట్లు వెల్లడించింది. ఆస్తుల వివరాలే కాదు సుప్రీంకోర్టు, హైకోర్టులలో నియామకాలు, హైకోర్టు కొలీజియంకు కేటాయించిన పాత్రలతో సహా, రాష్ట్ర ప్రభుత్వాలు హైకోర్టు జడ్జీల నియామకపు ప్రతిపాదనలు వంటి ఇతర వివరాలు సైతం అందుబాటులోకి వచ్చాయి. ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తి యశ్వంత్‌ వర్మ ఇంట్లో నోట్ల కట్టలుకాగా,ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తిగా (Delhi HC Judge) యశ్వంత్‌వర్మ అధికారిక నివాసంలో భారీఎత్తున కాలిన నోట్ల కట్టలు బయటపడడం సంచలనంగా మారింది. న్యాయమూర్తి అధికారిక నివాసంలో అగ్నిప్రమాదం జరగడంతో.. ఆర్పేందుకు వెళ్లిన సిబ్బందికి అనుకోకుండా అక్కడ భారీగా నోట్ల కట్టలు దర్శనమిచ్చాయి. ఇది వివాదాస్పదం కావడంతో కేంద్రం కీలక నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. సుప్రీంకోర్టు జడ్జీల ఆస్తుల వివరాలు.. ఎలా చూడొచ్చంటే?గూగుల్‌లో సుప్రీంకోర్టు ఆఫ్‌ ఇండియా అని టైప్‌ చేయండి. అనంతరం మీకు సుప్రీంకోర్టు అధికారిక వెబ్‌ సైట్‌ లింక్‌ కనిపిస్తుంది. ఆ లింక్‌ క్లిక్‌ చేస్తే సుప్రీంకోర్టు అధికారిక వెబ్‌సైట్‌ ఇంటర్‌ ఫేస్‌ కనిపిస్తుంది. ఇంటర్‌ ఫేస్‌ టాప్‌ బార్‌లో మీకు హోం,అబౌట్‌ అజ్‌,జడ్జస్‌ ఇలా కేటగిరీలు కనిపిస్తాయి. వాటిల్లో జడ్జస్‌ కేటగిరి మీద ట్యాప్‌ చేస్తే అసెట్స్‌ ఆఫ్‌ జడ్జస్‌ అనే సబ్‌ కేటగిరీలు కనిపిస్తాయి. ఆ ఆప్షన్‌ మీద క్లిక్‌ చేస్తే సుప్రీంకోర్టు జడ్జీల పేర్లు పక్కన వ్యూ అనే ఆప్షన్‌ కనిపిస్తుంది. దాని మీద క్లిక్‌ చేస్తే ఆస్తుల వివరాలు ఓపెన్‌ అవుతాయి.

Varun Tej And Lavanya Tripathi Expecting Their First Child, News Announced8
శుభవార్త చెప్పిన 'వరుణ్ తేజ్, లావణ్య'.. కంగ్రాట్స్‌ అంటూ అల్లు స్నేహ

మెగా కుటుంబం నుంచి శుభవార్త వచ్చేసింది. వరుణ్ తేజ్(Varun Tej)-లావణ్య త్రిపాఠి దంపతులు తమ అభిమానుల కోసం సోషల్‌మీడియాలో ఈ వార్తను ప్రకటించారు. తాము తల్లిదండ్రులు కాబోతున్నట్లు అధికారికంగా ప్రకటించారు. జీవితంలో అత్యంత సంతోషకరమైన బాధ్యతను తీసుకోబోతున్నామని ఇన్‌స్టాగ్రామ్‌లో రాసుకొచ్చారు. దీంతో నెటిజన్లతో పాటు మెగా అభిమానులు వారికి శుభాకాంక్షలు చెబుతున్నారు. మెగా ఇంటికి వారసుడు రాబోతున్నాడు అంటూ అభిమానులు కూడా పోస్టులు పెడుతున్నారు. 2023లో ప్రేమించి పెళ్లి చేసుకున్న ఈ జంట మొదటి బిడ్డను ఆహ్వానించనున్నారు. శుభవార్త చెప్పిన వరుణ్‌ దంపతులకు అల్లు అర్జున్‌ సతీమణి స్నేహ శుభాకాంక్షలు చెప్పారు. ఆపై సమంత, రకుల్‌ ప్రీత్‌సింగ్‌, రీతూ వర్మ, డింపుల్ హయాతి, సుశాంత్‌ వంటి సినీ స్టార్స్‌ కంగ్రాట్స్‌ అంటూ కామెంట్‌ బాక్స్‌లో మెసేజ్‌లు చేశారు. పెళ్లి తర్వాత లావణ్య త్రిపాఠి( Lavanya Tripathi) మళ్లీ షూటింగ్స్‌లలో పాల్గొంటూ వచ్చారు. ఈ క్రమంలోనే ఒక వెబ్‌ సిరీస్‌ను ఆమె విడుదల చేశారు. ఆపై సతీ లీలావతితో పాటు కోలీవుడ్‌ మూవీ థనల్‌ను ఆమె పూర్తి చేశారు. అయితే, ఈ రెండు ప్రాజెక్ట్‌లను పూర్తి చేసిన తర్వాత ఆమె మళ్లీ కాస్త బ్రేక్‌ ఇచ్చారు. ఆమె ఇప్పుడు ప్రెగ్నెంట్‌ కావడంతో కొంతకాలం సినిమాలకు దూరంగా ఉండాలని ఆమె నిర్ణయించుకున్నారు. 2017లో వరుణ్‌, లావణ్యల మధ్య ఏర్పడిన స్నేహం ఏడడుగుల బంధంతో ఒక్కటయ్యారు. వీరిద్దరు కలిసి ‘మిస్టర్‌’ అనే సినిమాలో తొలిసారి నటించారు. ఆ సమయంలోనే వరుణ్‌, లావణ్య త్రిపాఠి క్లోజ్‌ అయ్యారు. మొదట్లో స్నేహం.. ఆ తర్వాత అది ప్రేమగా మార్చుకొని డేటింగ్‌ వరకు వెళ్లారు. కానీ ఈ విషయం బయటకు రాకుండా చాలా జాగ్రత్తగా పర్సనల్‌ లైఫ్‌ని ఎంజాయ్‌ చేశారు. సరిగ్గా పెళ్లికి కొద్దిరోజులు ముందు వారి ప్రేమ విషయాన్ని అందరికీ తెలిపారు. అలా వరుణ్‌, లావణ్యల పెళ్లి ఇట‌లీలో జరగగా.. హైదరాబాద్‌లో రిసెప్ష‌న్ ఘనంగా జరిగింది. View this post on Instagram A post shared by Varun Tej Konidela (@varunkonidela7)

Srivalli Sailaja from Malkajgiri was appointed as a judge at the age of 249
Success Story: జస్ట్‌ 24 ఏళ్లకే న్యాయమూర్తిగా..!

చిన్న వయసు నుంచే సామాజిక సేవ చేయాలనే తపన, న్యాయవాది కావాలన్న తన తండ్రి ఆశయాన్ని గమనించారు.. లా పూర్తి చేసినా న్యాయవాదిగా స్థిరపడాలన్న తండ్రి లక్ష్యం నెరవేరలేదు.. అందుకే తండ్రి కలను పట్టుదలతో తాను సాధించారు.. న్యాయవాది కాదు.. ఏకంగా న్యాయమూర్తిగానే ఎంపికయ్యారు.. మొదటి ప్రయత్నంలోనే.. ఉన్నత స్థానాన్ని అధిరోహించారు.. స్ఫూర్తిమంతమైన ఆమె ప్రయాణం ఆమె మాటల్లోనే.. తెలంగాణ రాష్ట్రం మల్కాజిగిరికి చెందిన శ్రీవల్లి శైలజ 2024లో నిర్వహించిన జ్యుడీషియరీ పరీక్షలో జనరల్‌ కేటగిరిలో జూనియర్‌ సివిల్‌ జడ్జిగా ఎంపికయ్యారు. 24 ఏళ్ల వయసులో చదువు పూర్తయిన అనతి కాలంలోనే న్యాయమూర్తిగా ఎంపిక కావడం పట్ల ఇంటా బయటా ప్రశంసల జల్లు కురుస్తోంది. విద్యావంతుల కుటుంబంలో పుట్టిన తాను చిన్ననాటి నుంచే సామాజిక సేవ చేయాలన్న తండ్రి ఆశయంతో పెరిగారు. న్యాయశాస్త్ర పట్టభద్రుడు అయినా న్యాయమూర్తి కాలేకపోయారు. దీంతో తండ్రి ఆశయాన్నే తన ఆశయంగా చేసుకుని లక్ష్యం చేరుకున్నారు శ్రీవల్లి. ఇంటర్‌ అవగానే ఎంసెట్, లా ప్రవేశపరీక్షలు రెండూ రాశారు. రెంటిలోనూ మంచి ర్యాంకులు సాధించారు. తండ్రి ప్రోత్సాహంతో జ్యుడీషియరీ మెయిన్స్‌ వైపు అడుగులువేశారు. ప్రభుత్వాధికారుల కుటుంబం నుంచి.. అమ్మ నాన్న ఇద్దరూ ఉన్నత విద్యావంతులు, ప్రభుత్వాధికారులు. నాన్న రమేష్‌ నరసింహం హైదరాబాద్‌లో సీజీఎస్‌టీ సూపరింటెండెంట్‌. తల్లి లక్ష్మీసురేఖ దక్షిణమధ్య రైల్వే సికింద్రాబాద్‌ డివిజన్‌లో అసిస్టెంట్‌ ఆఫీసర్‌. ఓయూలో ఎల్‌ఎల్‌బీ, నల్సార్‌ యూనివర్శిటీలో ఎల్‌ఎల్‌ఎం పూర్తిచేశారు. అనంతరం జ్యుడీషియరీ మెయిన్స్‌లో అత్యుత్తమ ప్రతిభ కనబరిచి జూనియర్‌ సివిల్‌ జడ్జి వరకూ ఎదిగారు. శ్రీవల్లి సోదరి సహితం నల్సార్‌ యూనివర్సిటీ ఆఫ్‌ లాలో ఐపీఎం (మూడో సంవత్సరం) చదువుతున్నారు. నాన్న కల నెరవేరింది.. జ్యుడీషియరీ మెయిన్స్‌ తరువాత ఏప్రిల్‌ నెల్లో ఇంటర్వ్యూ జరిగింది. ఫలితాలు కొద్ది రోజుల క్రితమే వచ్చాయి. చిన్న వయసులోనే జూనియర్‌ సివిల్‌ జడ్జి వంటి ఉన్నత ఉద్యోగం లభించడం సంతోషించదగ్గ విషయం. నాన్న కల నెరవేరింది. నా శ్రమకు తగ్గ ఫలితం దక్కింది. సామాజిక న్యాయం కోసం కృషి చేయగలనన్న నమ్మకం కలిగింది. జ్యుడీషియరీలో అత్యున్నత స్థానం వరకూ వెళ్లేందుకు సాధన చేస్తా. – శ్రీవల్లి శైలజ, జూనియర్‌ సివిల్‌ జడ్జి (చదవండి: 'షాడో తోలు బొమ్మలాట'ను సజీవంగా నిలిపింది..! రాష్ట్రపతి ద్రౌపది ముర్ము..)

Simhachalam Temple Tragedy: Devotees Angry With Chandrababu10
సింహాచలం ఘటన: బాబూ.. ఇదేం వక్రబుద్ధి.. భక్తుల ఆగ్రహం

సాక్షి, విశాఖపట్నం: సింహాచలం ప్రమాద బాధితులకు పరిహారంలోనూ సీఎం చంద్రబాబు తన వక్ర బుద్ధిని చాటుకున్నారు. బాధితులకు పరిహారం సింహాచలం దేవస్థానం నుంచి చెల్లించారను. చనిపోయిన ఒక్కొక్కరికి 25 లక్షలు, గాయపడిన వారికి మూడు లక్షల పరిహారం అందించగా, మొత్తంగా కోటి 78 లక్షల రూపాయలు దేవస్థానం నుంచి చెల్లింపు చేశారు. ప్రభుత్వ తీరుపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.దేవాలయ అభివృద్ధికి వినియోగించాల్సిన నిధులను బాధితులకు ఇవ్వడంపై భక్తుల ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పరిహార విషయంలో ప్రభుత్వానికి బాధ్యత లేదా అంటూ భక్తులు మండిపడుతున్నారు. ప్రభుత్వ ఖజానా నుంచి ఇవ్వాల్సిన పరిహారాన్ని సింహాచలం దేవస్థానం నుంచి ఇవ్వడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు, సింహాచలం ఘటనపై తూతూ మంత్రంగా చర్యలు చేపట్టారు. చివరికి సింహాచలం ప్రమాదంపై ఉద్యోగులే బలయ్యారు. కూటమి ప్రజా ప్రతినిధులందరూ సేఫ్‌గా బయటపడ్డారు.ఉత్సవ ఏర్పాట్లను పరిశీలించిన మంత్రులు, కూటమి ప్రజాప్రతినిధులపై చర్యలు తీసుకోని ప్రభుత్వం.. ఈవో సహా మరో ఆరుగురు ఇంజనీరింగ్ సిబ్బందిపై వేటు వేయడానికి నిర్ణియించింది. ఇంజనీరింగ్ సిబ్బందిలో కాంట్రాక్ట్ ఉద్యోగిపైన చర్యలకు సిద్ధమైంది. కాంట్రాక్టర్‌పై క్రిమినల్ చర్యలు కోవడానికి కూటమి సర్కార్‌ సిద్ధమైంది. కూటమి నాయకులను తప్పించి అధికారులను బలి పశువుల చేశారనే విమర్శలు వస్తున్నాయి. ప్రభుత్వ పెద్దలు చెప్పినట్టే కమిటీ నివేదిక ఇచ్చిందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

Advertisement
Advertisement

ఫోటో స్టోరీస్

View all

న్యూస్ పాడ్‌కాస్ట్‌

Advertisement
Advertisement
Advertisement

ఫొటోలు

Advertisement
Advertisement