
హైదరాబాద్‌లోని అంబర్‌పేటలో జాతీయ రహదారి నిర్మాణ పనులకు రిమోట్ ద్వారా శంకుస్థాపన చేస్తున్న కేంద్ర మంత్రి గడ్కరీ. చిత్రంలో లక్ష్మణ్, పొన్నం, కోమటిరెడ్డి, కిషన్‌రెడ్డి, ఈటల
పదిన్నరేళ్లలో జాతీయ రహదారులను రెట్టింపు చేశాం
ఇండోర్–హైదరాబాద్ కారిడార్ దాదాపు పూర్తయ్యింది
రీజినల్ రింగ్ రోడ్డు త్వరితగతిన పూర్తయ్యేలా చూస్తాం
సాక్షి, హైదరాబాద్/నెట్‌వర్క్: ప్రధాని మోదీ నాయకత్వంలో తెలంగాణ అభివృద్ధికి కట్టుబడి ఉన్నామని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ పేర్కొన్నారు. సోమవారం సాయంత్రం రూ.330 కోట్లతో నిర్మించిన గోల్నాక–అంబర్‌పేట ఫ్లైఓవర్‌ను ఆయన ప్రారంభించారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో గడ్కరీ మాట్లాడుతూ అందరికీ నమస్కారం.. బాగున్నారా అంటూ తెలుగులో తన ప్రసంగాన్ని ప్రారంభించారు. ప్రసంగ వివరాలు ఆయన మాటల్లోనే.. ‘‘కొన్ని అనివార్య కారణాల వల్ల ఉప్పల్ ఎలివేటెడ్ కారిడార్ పూర్తి కాలేదు. అక్కడి సమస్యలను కిషన్‌రెడ్డి నా దృష్టికి తెచ్చారు.
రాష్ట్రంలో పదేళ్లలో 5 వేల కిలోమీటర్ల మేర జాతీయ రహదారులు వేశాం. ఇండోర్– హైదరాబాద్ కారిడార్ దాదాపు పూర్తయ్యింది. రీజినల్ రింగ్ రోడ్డు పనులు త్వరితగతిన పూర్తయ్యేలా చర్యలు తీసుకుంటాం. హైదరాబాద్–విజయవాడ రహదారి ఆరులైన్లుగా విస్తరిస్తాం. నాగ్‌పూర్‌లో డబుల్ డెక్కర్ ఎయిర్‌బస్‌ను అందుబాటులోకి తెచ్చాం. హైదరాబాద్ రింగ్ రోడ్డుపై ఈ ఎయిర్ బస్ నడిపించాలని మంత్రులు కోరుతున్నారు.’’
జాతీయ రహదారులు రెట్టింపు చేశాం : కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి
కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి మాట్లాడుతూ..‘దేశంలో ఎక్కడకు వెళ్లినా జాతీయ రహదారులు, ఫ్లైఓవర్ వంతెనలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. తెలంగాణలో 65 ఏళ్లలో 2,500 కి.మీ జాతీయ రహదారులు నిర్మిస్తే, ఈ పదిన్నరేళ్లలో మోదీ ప్రభుత్వం కొత్తగా మరో 2,600 కి.మీ నిర్మించింది. రూ.1.25 లక్షల కోట్లు జాతీయ రహదారులపై ఖర్చు చేసింది. నితిన్ గడ్కరీని ఫ్లైఓవర్ మంత్రి అంటారు. ఆయన పేరు మారుమూల ప్రాంతాల్లోనూ మారుమోగుతోంది’అని తెలిపారు.
చౌటుప్పల్ – సంగారెడ్డి వరకు పనులను కేంద్రమే చేపట్టాలి : కోమటిరెడ్డి
రాష్ట్ర మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి మాట్లాడుతూ..‘రీజినల్ రింగ్ రోడ్డు నార్త్ సైడ్ 95 శాతం భూ సేకరణ అయ్యింది. చౌటుప్పల్ నుంచి సంగారెడ్డి వరకు పనులను కేంద్రమే చేపట్టాలి. అంబర్‌పేట్ ఫ్లైఓవర్ బ్రిడ్జికి సంబంధించి పరిహారం రాలేదని నాకు ఫిర్యాదు అందింది. వారందరికీ నెల రోజుల్లోపు సమస్యను పరిష్కారిస్తాం’అన్నారు. ఈ కార్యక్రమంలో రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, ఎంపీలు ఈటల రాజేందర్, అరి్వంద్, లక్ష్మణ్, జీహెచ్‌ఎంసీ మేయర్ విజయలక్షి్మ, ఎమ్మెల్యేలు మల్లారెడ్డి, సూర్యనారాయణ, నగేశ్, ఎమ్మెల్సీ అంజిరెడ్డి, శ్రీపాల్‌రెడ్డి, కొమరయ్య తదితరులు పాల్గొన్నారు.
జాతీయ రహదారి జాతికి అంకితం
కుమురంభీం ఆసిఫాబాద్ జిల్లా కాగజ్‌నగర్ ఎక్స్‌రోడ్డు వద్ద సోమవారం ఉదయం ఏర్పాటు చేసిన సభావేదికపై నుంచి జాతీయ రహదారులను జాతికి అంకితం చేయడంతోపాటు రూ.3,900 కోట్ల విలువైన అభివృద్ధి పనులకు కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ శంకుస్థాపనలు, ప్రారం¿ోత్సవాలు చేశారు. ఆసిఫాబాద్ ఎమ్మెల్యే కోవ లక్ష్మి అధ్యక్షతన జరిగిన ఈ సభలో కేంద్ర మంత్రులు కిషన్‌రెడ్డి, బండి సంజయ్, రాష్ట్ర మంత్రులు కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, సీతక్క, ఆదిలాబాద్, పెద్దపల్లి ఎంపీలు గోడం నగేశ్, గడ్డం వంశీకృష్ణ, ఎమ్మెల్సీ విఠల్, ఎమ్మెల్యేలు హరీశ్‌బాబు, పాయల్ శంకర్, వెడ్మ బొజ్జుపటేల్, రామారావు పటేల్ తదితరులు పాల్గొన్నారు.
భెల్ ఫ్లైఓవర్ వంతెన ప్రారంభం
సంగారెడ్డి జిల్లా రామచంద్రాపురం పట్టణంలో రూ.138 కోట్ల వ్యయంతో నిర్మించిన భెల్ ఫ్లైఓవర్ వంతెనను కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ సోమవారం సాయంత్రం ప్రారంభించారు. ఇక్రిశాట్ ప్రాంగణానికి హెలికాప్టర్ ద్వారా చేరుకున్న ఆయనకు రాష్ట్ర మంత్రులు దామోదర రాజనర్సింహ, కొండా సురేఖ, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, ఎంపీ ఎం.రఘునందన్‌రావు, కలెక్టర్ క్రాంతి స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో సీఎస్ రామకృష్ణారావు, చేవెళ్ల ఎంపీ విశ్వేశ్వర్ రెడ్డి, ఎమ్మెల్యేలు గూడెం మహిపాల్ రెడ్డి, అరికెపూడి గాంధీ, ఎమ్మెల్సీ అంజిరెడ్డి, బీజేపీ జిల్లా అధ్యక్షురాలు గోదావరి పాల్గొన్నారు.
గడ్కరీని కలిసిన మంత్రి తుమ్మల
కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సోమవారం రాత్రి బేగంపేట విమానాశ్రయంలో మర్యాద పూర్వకంగా కలిశారు. ధంసలాపురం నుంచి ఖమ్మం కలెక్టరేట్ వరకు ఇరువైపులా సరీ్వస్ రోడ్లు మంజూరు చేయాలని కోరారు. జగ్గయ్యపేట నుంచి వైరా మీదుగా కొత్తగూడెం వరకు జాతీయ రహదారి నిర్మించాలని విజ్ఞప్తి చేశారు. ఖమ్మం నుంచి కురవి అమరావతి నుంచి నాగపూర్ జాతీయ రహదారి వరకు రింగ్‌రోడ్డు ఏర్పాటు చేయాలని కోరారు.