పురుషులకు సరోగసి హక్కు ఉండద్దా ! | Man challenges exclusion from surrogacy | Sakshi
Sakshi News home page

Surrogacy: పురుషులకు సరోగసి హక్కు ఉండద్దా !

Published Tue, May 6 2025 6:29 AM | Last Updated on Tue, May 6 2025 11:42 AM

Man challenges exclusion from surrogacy

పేరెంట్‌హుడ్‌ని ఆస్వాదించని వారెవరు? అమ్మా.. నాన్నా.. అని పిలిపించుకోవాలని ఉవ్విళ్లూరని వాళ్లెవరు? కానీ మన దేశంలోని సరోగసీ యాక్ట్‌ –2021 అందరికీ ఆ ఆవకాశాన్నివ్వట్లేదు.  విడాకులు తీసుకున్న పురుషులకు, ట్రాన్స్‌పీపుల్‌కి సరోగసీ ద్వారా పేరెంట్‌ అయ్యే చాన్స్‌కి నో అంటోంది! దీన్నే సవాలు చేస్తూ కర్ణాటకకు చెందిన 45 ఏళ్ల డెంటల్‌ సర్జన్‌.. సరోగసీ ద్వారా ఒంటరి పురుషులకూ తండ్రి అయ్యే భాగ్యం కల్పించమంటూ సుప్రీంకోర్ట్‌లో దావా వేశాడు. ఇప్పుడది చర్చగా మారింది.. అడ్వకేట్లు, జెండర్‌ రైట్స్‌ కోసం పనిచేస్తున్న యాక్టివిస్ట్‌లూ దీనిమీద తమ అభిప్రాయాలను చెబుతున్నారు.

సరోగసీ.. గర్భంలో బిడ్డను మోసే ఆరోగ్యపరిస్థితులు లేని వాళ్లకు ఆధునిక వైద్యశాస్త్రం అందించిన వరం! ఇది ఒంటరి పురుషులు, ట్రాన్స్‌ పీపుల్‌కీ పేరెంట్‌ అయ్యే అదృష్టాన్ని కలిగిస్తోంది. అలా బాలీవుడ్‌లో ప్రముఖ దర్శక నిర్మాత కరణ్‌ జోహార్‌ పెళ్లి చేసుకోకుండానే కవల పిల్లలకు తండ్రి అయ్యాడు. అలాగే నటుడు తుషార్‌ కపూర్‌ కూడా ఓ బిడ్డను కన్నాడు. అయితే అది 2021కి ముందు. ఈ చట్టం వచ్చాక పురుషులకు ఆ వెసులుబాటును తీసేసింది. 

ఒంటరి మహిళలు (విడాకులు పొందిన వారు, అలాగే వితంతువులు), స్త్రీ పురుషులు మాత్రమే పెళ్లి చేసుకున్న జంటలకూ మాత్రమే ఈ చట్టం పేరెంట్స్‌ అయ్యే అవకాశాన్ని కల్పిస్తోంది. దీనిమీద సమాజంలోని పురుషులు సహా ఎల్‌జీబీటీక్యూ కమ్యూనిటీలోనూ అసంతృప్తి ఉంది. విడాకులు పొందిన స్త్రీకి సరోగసీ ద్వారా తల్లి అయ్యే హక్కు ఉన్నప్పుడు, విడాకులు పొందిన పురుషుడికి ఎందుకు ఉండకూడదు? ఇది చట్టం చూపిస్తున్న వివక్ష తప్ప ఇంకోటి కాదని కర్ణాటక డెంటల్‌ సర్జన్‌ వాదన. 

పిల్లల్ని కనాలా వద్దా అనే చాయిస్‌ స్త్రీకెప్పుడూ ఇవ్వని ఈ సమాజంలో.. ఒంటరి పురుషులు, ట్రాన్స్‌ పీపుల్‌ని అనుమతించడం లేదు సరికదా... పురుషుడు సంపాదించాలి, స్త్రీ ఇంటిని చూసుకోవాలనే లింగవివక్షను ప్రేరేపించే మూస ధోరణిని ప్రోత్సహిస్తోందని జెండర్‌ యాక్టివిస్ట్‌ల అభి్ప్రాయం. కారా (సెంట్రల్‌ అడాప్షన్‌ రీసోర్స్‌ అథారిటీ) నివేదికలను బట్టి ఒంటరి పురుషులకు దత్తత తీసుకునేందుకు అనుమతించినవీ, అలాగే.. మగవాళ్లు కూడా పిల్లల్ని పెంచగలరని నిరూపించిన ఉదాహరణలున్నాయి. కాబట్టి డెంటల్‌ సర్జన్‌ పిటిషన్‌లో న్యాయం ఉందని అంటున్నారు యాక్టివిస్ట్‌లు. అంతేకాదు అతని ఈ ΄ోరాటం ఎల్‌జీబీటీక్యూ కమ్యూనిటీకి ఒక ఊతమవుతుందని.. లింగ అసమానతలను రూపుమాపే ప్రయత్నానికీ ఒక అడుగు పడుతుందనే ఆశనూ వ్యక్తం చేస్తున్నారు. 
– సరస్వతి రమ

వివక్ష చూపిస్తోంది
డైవర్స్‌ తీసుకున్న మగవారికి, ఒంటరి పురుషులకు, స్వలింగ సంపర్కులకు, ట్రాన్స్ జెండర్స్‌కి సరోగసి పద్ధతిలో పిల్లలని కనడాన్ని సరోగసీ చట్టం నిషేధించింది. ఈ చట్టంలోని సెక్షన్‌ ంలు ఈ నిబంధన విధించాయి. ఈ చట్టం ప్రకారం కేవలం విడాకులు పొందిన లేదా వితంతువులకు, హెటిరో సెక్సువల్‌ దంపతులకు మాత్రమే సరోగసీ ద్వారా పిల్లలని కనే హక్కు ఉంది. ఒంటరి పురుషుడికి ఆడపిల్లను దత్తత తీసుకునే వీలు లేనప్పటికీ, జువెనైల్‌ జస్టిస్‌ చట్టంలోని సెక్షన్‌ 57, హిందూ అడాప్షన్‌ – మెయింటెనెన్స్‌ చట్టంలోని సెక్షన్‌ 7 ప్రకారం ఒంటరి/విడాకులు తీసుకున్న పురుషుడికి కూడా పిల్లలను దత్తత తీసుకునే హక్కు ఉన్నది. సరోగసీ చట్టం ఇందుకు భిన్నంగా ఉండటం రాజ్యాంగం కల్పించిన సమానత్వం, జీవించే స్వేచ్ఛ హక్కుల స్ఫూర్తికి వ్యతిరేకమే! ఇతర దేశాలు చాలామటుకు స్త్రీ పురుషుల మధ్య సరోగసీ పద్ధతిలో పిల్లల్ని కనటం పై సమాన హక్కులే కల్పించాయి. 
–శ్రీకాంత్‌ చింతల హైకోర్టు న్యాయవాది

ఆ అవకాశం, వాతావరణం ఉన్నాయా? 
ప్రతి ఒక్కరికీ పేరెంట్‌హుడ్‌ను ఆస్వాదించే హక్కు ఉంది. ఆ హక్కు కోసం కర్ణాటక డెంటల్‌ సర్జన్‌ న్యాయ ΄ోరాటంలో తప్పులేదు. స΄ోర్ట్‌ కూడా చేస్తాను. అయితే వ్యక్తిగతంగా మాత్రం అందులో నాకు భిన్నమైన అభి్ప్రాయం ఉంది. అడుగడుగునా అసమానతలు, వివక్ష, అభద్రతలున్న ఈ సమాజంలో పుట్టబోయే పిల్లలను భద్రంగా కాపాడుకోగలమా? మనముందున్న సెక్సువల్‌ ఐడెంటిటీలనే గుర్తించి, గౌరవించడానికి సిద్ధంగా లేము. ఈ నేపథ్యంలో పుట్టబోయే పిల్లల భవిష్యత్‌ ఏంటీ? వాళ్లు చక్కగా పెరిగే అవకాశం, వాతావరణం ఉన్నాయా అనే విషయంలోనే నా భయం, ఆందోళన అంతా! 
– బోయపాటి విష్ణు తేజ, చైల్డ్‌ రైట్స్‌ యాక్టివిస్ట్‌

స్టీరియోటైప్స్‌ని బలపరుస్తోంది.. 
పేరెంట్‌హుడ్‌ అనేది ఒక జెండర్‌కి మాత్రమే పరిమితమైనది కాదు. పేరెంట్‌ అవ్వాలని ఆశపడేవాళ్లందరూ ఆ హక్కును వినియోగించుకునే అవకాశం ఉండాలి. కొంతమంది మగవాళ్లు పేరెంట్‌ కావాలనుకున్నా ఇలాంటి చట్టాల వల్ల పేరెంట్‌హుడ్‌ చాయిస్‌ని కోల్పోతున్నారు. స్టీరియోటైప్స్‌ కొన్నిటిని ఈ చట్టం బలపరుస్తోంది. సింగిల్‌గా ఉన్న ఆడవాళ్లకు, హెటరో సెక్సువల్‌ ఫ్యామిలీస్‌కి మాత్రమే వెసులుబాటు కల్పిస్తూ! సింగిల్‌ ఉమెన్‌కి ఎందుకిచ్చిందంటే కేర్‌ గివింగ్‌ అనే లక్షణం సహజంగానే వాళ్లకుంటుంది కాబట్టి అనే. అంటే ఈ రెండు స్టీరియోటైప్స్‌ని ఆ చట్టం బలపరుస్తున్నట్టే కదా! వివక్షే కాకుండా స్టీరియోటైప్స్‌నీ బలపరుస్తున్నట్టున్న ఈ చట్టాన్ని చాలెంజ్‌ చేయడం మంచిదే! పురుషుడు సంపాదిస్తాడు, స్త్రీ ఇల్లు చూసుకుంటుంది లాంటి జెండర్‌ రోల్స్‌ను ఈ చట్టం బలపరుస్తోంది. ఈ చట్టం వల్ల ఎల్‌జిబీటీక్యూ కమ్యూనిటీస్‌కీ నష్టమే! ఏమైనా ఈ చట్టంలో మార్పులు రావాలి. ఎక్స్‌΄్లాయిటేషన్‌ను ఆపేలా చట్టాలుండాలి కానీ.. పేరెంట్‌హుడ్‌ కావాలనుకునే వారిని నిరుత్సాహపరచేలా కాదు.
– దీప్తి సిర్ల, దళిత్‌ అండ్‌ జెండర్‌ యాక్టివిస్ట్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement