
సాక్షి, అమరావతి : దేశంలోనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అగ్రస్థానంలో నిలపడమే తన విజన్ అని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి ట్విటర్‌లో పేర్కొన్నారు. పారదర్శక పాలనతో, నూతన సాంకేతికతను అందిపుచ్చుకుంటూ, అవినీత రహిత, వికేంద్రీకృత ప్రభుత్వంతో ప్రజల ఇంటి వద్దకే పాలన అందేలా, స్థిరమైన అభివృద్ధితో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని దేశంలోనే అగ్రస్థానంలో నిలపడమే తన విజన్ అని తెలిపారు.
My vision for AP - a transparent, technology-driven, corruption-free, decentralised Govt, at your doorstep; with sustainable development; to be a forerunner state in the country.
— YS Jagan Mohan Reddy (@ysjagan) April 5, 2019