కొడుకును పెళ్లాడిన సోష‌ల్ మీడియా స్టార్‌

మాస్కో: ప్రేమ ఎప్పుడు, ఎలా పుడుతుందో ఎవ‌రూ ఊహించ‌లేరు. ప్రేమ గుడ్డిది అని అంటుంటారు చాలామంది. ఇక్క‌డ జ‌రిగిన‌ సంఘ‌ట‌న తెలుసుకుంటే మీరూ దాన్ని అంగీక‌రించ‌క తప్ప‌దు. ఓ వ్య‌క్తి త‌న త‌ల్లిని పెళ్లి చేసుకున్నాడు. అయితే ఆమె అత‌నికి జ‌న్మ‌నిచ్చిన త‌ల్లి కాదు,  పెంచిన త‌ల్లి. ర‌ష్యాలోని 35 ఏళ్ల మెరీనా బ‌ల్మ‌షేవ సోష‌ల్ మీడియా స్టార్‌. ఇన్‌స్టాగ్రామ్‌లో 4 ల‌క్ష‌ల మంది ఫాలోవ‌ర్లు ఉన్న ఆమె అలెక్స్‌ ఆరే అనే వ్య‌క్తిని వివాహం చేసుకుంది. వీరు ఐదుగురు పిల్ల‌ల‌ను ద‌త్త‌త తీసుకుని పెంచుకుంటున్నారు. అలా సుమారు ప‌ది సంవ‌త్స‌రాలు గ‌డిచిన త‌ర్వాత‌ వారిద్ద‌రి మ‌ధ్య మ‌న‌స్ప‌ర్థ‌లు మొద‌ల‌వ‌డంతో విడాకులు వ‌ర‌కు వెళ్లారు. విడిపోయిన త‌ర్వాత పిల్లల బాధ్య‌త కోర్టు క‌న్న‌తండ్రికే అప్పగించింది. ఈ క్ర‌మంలో ఆరే ఇర‌వయ్యేళ్ల కొడుకు వ్లాదిమిర్‌ వోయా పెంచిన‌ త‌ల్లితో ప్రేమ‌లో ప‌డ్డాడు. 

ఇద్దరి మ‌న‌సులు ఒక్క‌ట‌య్యాయి. ఇంకేముందీ.. ఈ ఏడాది ప్రారంభంలోనే పెళ్లి చేసేసుకుందామ‌ని ప్లాన్ చేసుకున్నారు. కానీ హ‌ఠాత్తుగా మాయ‌దారి క‌రోనా రావ‌డంతో పెళ్లి వాయిదా ప‌డింది. ఎట్ట‌కేల‌కు గ‌త‌వారం త‌ల్లీకొడుకులిద్ద‌రూ రిజిస్ట్రీ ఆఫీసులో పెళ్లి చేసుకుని ఒక్క‌ట‌య్యారు. ఈ విడ్డూరాన్ని సోష‌ల్ మీడియాలో పంచుకోవ‌డంతో వీరి పెళ్లి  ఫొటోలు, వీడియో నెట్టింట హ‌ల్‌చ‌ల్ చేస్తున్నాయి. ఇక ఏదేమైనా ఆరేతో మాట్లాడేదే లేద‌ని మాజీ భార్య‌ మెరీనా, కొడుకు వ్లాదిమిర్ తేల్చి చెప్తున్నారు. 'ఏడేళ్ల వ‌య‌సు నుంచి పెంచుతున్న కొడుకుతో పెళ్లేంట‌ని కొంద‌రు న‌న్ను ఆడిపోసుకోవ‌చ్చు, మ‌రికొంద‌రు స‌పోర్ట్ చేయ‌వ‌చ్చు. కానీ అది నా ఇష్ట‌మ'‌ని ఆమె వ్యాఖ్యానించింది. ప్ర‌స్తుతం ఆమె గ‌ర్భ‌వ‌తి కావ‌డం గ‌మ‌నార్హం.

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

మరిన్ని వీడియోలు 

Read also in:
Back to Top