జూదం: గాడిద‌ను అరెస్ట్ చేసిన పాక్‌ పోలీసులు

క‌రాచీ: జూదం రేసులో పాల్గొందంటూ పాకిస్తాన్ పోలీసులు ఓ గాడిద‌ను అరెస్ట్ చేశారు. ఈ వింత ఘ‌ట‌న పంజాబ్ ప్రావిన్స్‌లోని యార్ ఖాన్‌ న‌గ‌రంలో చోటు చేసుకుంది. జూదం ఆడుతున్నార‌న్న ప‌క్కా స‌మాచారంతో యార్ ఖాన్‌కు చేరుకున్న పోలీసులు 8 మందిని అరెస్టు చేశారు. ఇక నిందితుల ద‌గ్గ‌ర నుంచి ల‌క్షా 20 వేల రూపాయ‌ల‌ బెట్టింగ్ సొమ్మును స్వాధీనం చేసుకున్నారు. సంఘ‌ట‌నా స్థ‌లంలో ఓ గాడిద కూడా ఉండ‌టంతో దాన్ని అరెస్టు చేసి పోలీస్ స్టేష‌న్‌కు తీసుకెళ్లారు. 

ఎఫ్ఐఆర్‌లో గాడిద పేరు కూడా ఉండ‌టంతోనే దాన్ని అరెస్టు చేశామ‌ని పోలీసులు వివ‌ర‌ణ ఇచ్చారు. ప్ర‌స్తుతం దాన్ని స్టేష‌ను ఆవ‌ర‌ణ‌లో క‌ట్టేసిన‌ట్లు పేర్కొన్నారు. నైలా ఇనాయ‌త్ అనే జ‌ర్న‌లిస్టు ఈ ఘ‌ట‌న తాలూకు వీడియోను సోష‌ల్ మీడియాలో పోస్ట్ చేయ‌గా ప్ర‌స్తుతం వైర‌ల్‌గా మారింది. గాడిదను అరెస్టు చేయ‌డంపై నెటిజ‌న్లు ఛ‌లోక్తులు విసు‌రుతున్నారు‌. 

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

మరిన్ని వీడియోలు



 

Read also in:
Back to Top